kamareddy
-
ఆదుకునేవారు లేక అనాథగా మాజీ సర్పంచ్
కామారెడ్డి: కొందరు ప్రజాప్రతినిధుల్లా పర్సంటేజీలకు ఆశపడలేదు..ఆస్తులు అంతస్తులు కూడగట్టుకోలేదు ఆ మాజీ మహిళా సర్పంచ్. గ్రామాభివృద్ధి కోసం తన సొంత నిధులను కూడా వెచ్చించింది. ప్రస్తుతం ఆదుకునేవారు లేక అనాథగా మారింది. రామారెడ్డి మండలం కన్నాపూర్ సర్పంచ్‌గా బాల్‌రాజవ్వ 2006 నుంచి 2011 వరకు పనిచేసింది నీటి సమస్య పరిష్కారానికి బోరుబావులను తవ్వచింది. ఇటీవల కాలంలో భర్త చనిపోయాడు. ఉన్న ఇల్లు కాస్త కాలిపోవడంతో గ్రామ కచేరీ ఆ మాజీ సర్పంచ్‌కు నివాస గృహంగా మారింది. ఆ ఊరి ప్రజలే అన్నం పెట్టి సాదుతున్నారు. భర్త చనిపోయిన తర్వాత బాల్‌రాజవ్వ మానసిక పరిస్థితి బాగాలేదని గ్రామస్తులు చెబుతున్నారు. బాల్‌రాజవ్వ ఇద్దరు కూతుళ్లలో ఓ కూతురు చనిపోగా, మరో కూతురు ఉన్నా, పట్టించుకోవడం లేదని గ్రామస్తులు తెలిపారు. ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు, కలెక్టర్ అండగా నిలిచి బాల్రాజవ్వకు సొంత ఇల్లు నిర్మించి ఇవ్వాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వమే వైద్యం అందించాలని కోరుతున్నారు. -
ఇక్కడ చదివిన వారెవరూ ఖాళీగా ఉండరు!
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి: తెలంగాణ రాష్ట్రంలోనే ఏకైక డెయిరీ కళాశాల కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఉంది. నాలుగున్నర దశాబ్దాల చరిత్ర ఉన్న ఈ కళాశాలలో చదివిన విద్యార్థులు దేశ, విదేశాల్లో ఉన్నతోద్యోగాలు, వ్యాపారాల్లో స్థిరపడ్డారు. ఇక్కడ చదువు పూర్తవకముందే ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో అనేక ఉద్యోగావకాశాలు దక్కుతాయి. రాష్ట్రంలో ప్రముఖ డెయిరీ సంస్థ అయిన జెర్సీ డెయిరీ డైరెక్టర్లంతా ఈ కళాశాల విద్యార్థులు కావడం విశేషం. రాష్ట్రంలోని వివిధ డెయిరీ సంస్థల్లో కీలక స్థానాల్లో పనిచేస్తున్న వారంతా ఇక్కడ చదువుకున్నవారే.కామారెడ్డి పట్టణంలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ డిగ్రీ కళాశాలలో 1978లో బీఎస్సీ డెయిరీ కోర్సును ప్రారంభించారు. ఇంటర్ చదివిన వారికి.. నేరుగా సాధారణ డిగ్రీ కోర్సుల్లా డెయిరీ కోర్సులో ప్రవేశం కల్పించేవారు. తరువాతి కాలంలో బీటెక్ డెయిరీ కోర్సుగా మార్పుచెంది.. ఎంసెట్ ద్వారా సీట్ల కేటాయింపు మొదలైంది. డెయిరీ కోర్సు ఎంచుకున్న వారికి.. ఎంసెట్ ర్యాంకుల ఆధారంగా సీట్లు కేటాయించేవారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో కొనసాగిన డెయిరీ కోర్సును 2007 సెప్టెంబర్ 1న శ్రీ వేంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం పరిధిలోకి మార్చారు. తెలంగాణ రాష్ట్రం (Telangana State) ఏర్పాటయ్యాక పీవీ నర్సింహారావు పశువైద్య విశ్వ విద్యాలయం పరిధిలోకి తీసుకువచ్చారు.దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి (YS Rajasekhara Reddy) హయాంలో.. ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ డిగ్రీ కళాశాలకు సంబంధించిన 60 ఎకరాల భూమిని డెయిరీ కళాశాలకు కేటాయించారు. కాలేజీ భవనం, హాస్టళ్ల నిర్మాణాలకు రూ.11 కోట్లు మంజూరు చేసిన అప్పటి సీఎం వైఎస్సార్.. భవనాల నిర్మాణానికి శంకుస్థాపన కూడా చేశారు. కాలేజీ భవనంతో పాటు బాలికలు, బాలుర హాస్టళ్లు, ఆడిటోరియం, ల్యాబ్‌లకు భవనాలు నిర్మించారు. పీజీ కోర్సులకు అవసరమైన మేర సౌకర్యాలు కూడా ఉన్నాయి. అప్పటి నుంచి అదే భవనంలో కళాశాల కొనసాగుతోంది. ప్రాక్టికల్స్‌లో భాగంగా విద్యార్థులు పాల పదార్థాలు తయారు చేసి.. డెయిరీ పార్లర్‌ను కూడా నిర్వహిస్తున్నారు. విద్యార్థులు కోవా, దూద్‌పేడా, రసగుల్లా, గులాబ్‌జామ్ (Gulab Jamun) వంటివి తయారు చేసి విక్రయిస్తారు. వెయ్యి మందికి పైగా చదువు..కళాశాల స్థాపించినప్పటి నుంచి.. ఇప్పటి వరకు 900 పైచిలుకు డెయిరీ కోర్సులు చదివారు. వారిలో చాలామంది దేశంలోని వివిధ రాష్ట్రాలతో పాటు అమెరికా, ఆస్ట్రేలియా వంటి దేశాల్లోనూ డెయిరీ రంగంలో ఉన్నతోద్యోగాల్లో స్థిరపడ్డారు. ఇక్కడ చదివిన వారిలో కొందరు విద్యార్థులు సొంతంగా డెయిరీ ఉత్పత్తుల సంస్థలను స్థాపించారు కూడా. మరెందరో వివిధ డెయిరీ సంస్థల్లో పనిచేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర డెయిరీ డెవలప్మెంట్ కార్పొరేషన్‌లోనూ చాలామంది ఉద్యోగాలు చేస్తున్నారు. టీఎస్పీఎస్సీ ద్వారా విజయ డెయిరీ, ఫుడ్‌సేఫ్టీ ఆఫీసర్, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్, సూపర్వైజర్లు వంటి ఉద్యోగ అవకాశాలు కూడా పొందే వీలుంది. రాష్ట్ర స్థాయిలో ఉపకార వేతనాలు, జాతీయ స్థాయిలో మెరిట్ స్కాలర్షిప్లు అందిస్తారు. పీజీ కోర్సులు వస్తే మరింత ప్రయోజనం కళాశాలలో పీజీ కోర్సులు ఏర్పాటు చేస్తే విద్యార్థులకు మేలు జరుగుతుంది. రాష్ట్రంలో ఎక్కడా డెయిరీ కళాశాలలు లేవు. ఏకైక కామారెడ్డి కళాశాలలో పీజీ కోర్సులు లేకపోవడం విద్యార్థులకు శాపంగా మారింది. కర్ణాటక, తమిళనాడు తదితర రాష్ట్రాలకు వెళ్లి పీజీ కోర్సులు చదవాల్సి వస్తోంది. ఇతర రాష్ట్రాల్లో ఉన్నత విద్యనభ్యసించాలంటే ఖర్చుతో కూడుకున్నది కావడంతో.. చాలా మంది బీటెక్‌తోనే చదువును ఆపేస్తున్నారు. ఇక్కడే పీజీ కోర్సులు ప్రారంభిస్తే ఎంతో ప్రయోజనం కలుగుతుందని విద్యార్థులు అంటున్నారు. ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.మంచి భవిష్యత్తు ఉన్న కోర్సు బీటెక్ డెయిరీ కోర్సు చదివిన వారెవరూ ఖాళీగా ఉండే పరిస్థితి లేదు. అందరికీ అనేక అవకాశాలు దొరుకుతున్నాయి. మా కళాశాలలో చదివినవారు ప్రపంచవ్యాప్తంగా డెయిరీ సంస్థల్లో ఉన్నతోద్యోగాలు చేస్తున్నారు. మన రాష్ట్రంలోని అన్ని డెయిరీల్లోనూ మనవారే కీలక పాత్ర పోషిస్తున్నారు. కొందరు సొంతంగా డెయిరీ సంస్థలు నెలకొల్పారు. ఏటా 40 మందికి ప్రవేశం పొందడానికి అవకాశం ఉంది. ఎంపీసీ చదివిన విద్యార్థులకు ఎంసెట్ ద్వారా డెయిరీ కోర్సులో 35 మందికి సీట్లు దక్కుతాయి. ఐదు సీట్లను రైతు విభాగాల కోటా ద్వారా భర్తీ చేస్తాం. – డాక్టర్ ఉమాపతి, కళాశాల డీన్ -
కానిస్టేబుల్‌ను ఢీకొన్న కారు.. అక్కడికక్కడే మృతి
సాక్షి, కామారెడ్డి: కామారెడ్డి జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. విధుల్లో ఉన్న కానిస్టేబుల్‌ను కారు ఢీకొట్టడంతో అతడు అక్కడికక్కడే మృతిచెందాడు. దీంతో, కానిస్టేబుల్ కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతమవుతున్నారు.వివరాల ప్రకారం.. కానిస్టేబుల్ రవి గాంధారి మండల కేంద్రంలో విధుల్లో ఉన్నాడు. ఈ క్రమంలో గురువారం వేగంగా దూసుకొచ్చిన కారు అక్కడే ఉన్న రవిని ఢీకొట్టింది. ఈ క్రమంలో రవి అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ప్రమాదంలో రవితో పాటు విధులు నిర్వహిస్తున్న సుభాష్ అనే కానిస్టేబుల్‌కు గాయాలయ్యాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. -
బిందెడు నీటికి బావిలోకి.. భగవంతుడా!
గాంధారి (ఎల్లారెడ్డి): వేసవి కాలం ప్రారంభంలోనే ఎండలు మండుతుండటంతో తాగునీటి కష్టాలు తీవ్రమయ్యాయి. పంచాయతీ బోరుబావులు ఎత్తిపోతుండడం, మిషన్ భగీరథ (Mission Bhagiratha) నీరు సక్రమంగా సరఫరా కాకపోవడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. పలుచోట్ల వ్యవసాయ బావుల వద్దకు వెళ్లి నీటిని తెచ్చుకోవలసిన పరిస్థితి నెలకొంది. కామారెడ్డి జిల్లా గాంధారి మండలం సోమ్లానాయక్ తండాలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉండడంతో.. తండావాసులు గ్రామ శివారులోని బావి వద్దకు వెళ్లి నీటిని తెచ్చుకుంటున్నారు. మహిళలే బావిలోకి దిగి, బిందెలలో నీటిని నింపుకొని తీసుకువెళ్తున్నారు. ట్యాంకరుతో నీటిని సరఫరా చేయాలని కోరితే. ట్రాక్టర్లో డీజిల్ నింపేందుకు పంచాయతీలో డబ్బులు లేవని కార్యదర్శి చెబుతున్నారని తండావాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి, తాగునీటిని అందించాలని కోరుతున్నారు.మండుటెండ... చెట్టు నీడే అండ ఆదిలాబాద్ జిల్లాలో ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఉదయం 11 గంటలైతే చాలు జనాలు బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. మనుషులే కాదు మూగజీవాలు సైతం ఎండకు అల్లాడిపోతున్నాయి. జైనథ్ మండలం పెండల్వాడ గ్రామ సమీపంలోని ఓ చింతచెట్టు కింద గొర్రెలు (Sheeps) సేదతీరుతుండటమే జిల్లాలోని ఎండల తీవ్రతకు అద్దం పడుతోంది. మోదీ రక్షిం‘చేను’! కొందరు రైతులు పంటలకు దిష్టి తగలకుండా ఇటీవల హీరోయిన్ల ఫొటోలు పెడుతున్నారు. ఇక కోతుల బెడద నివారణకు ఇంకొందరు పులి బొమ్మలు ఏర్పాటు చేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలం రాంపూర్‌కు చెందిన ఓ రైతు.. జొన్న పంట రక్షణకు ఏకంగా ప్రధాని నరేద్రమోదీ ఫొటో పెట్టుకున్నాడు. ప్రధాని ఫొటో ఏర్పాటు చేసిన తర్వాత.. తన చేను వద్దకు వన్యప్రాణులు, పక్షులు రావడం లేదని సదరు రైతు చెప్పడం విశేషం. కోకల పిచ్.. కేక ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలం రాయిగూడ గ్రామంలలో చిన్నారులు తమ సృజనతో ఆకట్టుకున్నారు. పొడి దుక్కిలో క్రికెట్ ఆడడం ఇబ్బందిగా ఉండడంతో.. తమ ఇళ్లలోని పాత చీరలను తీసుకువచ్చి ఇలా మ్యాట్లా మార్చారు. ఆదివారం సెలవు కావడంతో చీరలను ఇలా పిచ్‌పై పరిచి క్రికెట్ ఆడారు. హెచ్చరికలు బేఖాతరుహెల్మెట్ లేని ప్రయాణం ప్రమాదకరమని పోలీసులు హెచ్చరిస్తున్నా వాహనచోదకులు బేఖాతరు చేస్తున్నారు. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ సిటీ సెంటర్ వద్ద సాక్షాత్తు ట్రాఫిక్ పోలీసు ముందునుంచే హెల్మెట్ (Helmet) లేకుండా వాహనచోదకులు యథేచ్ఛగా రాకపోకలు సాగించారు.చదవండి: వామ్మో.. అప్పుడే భానుడి భగభగలు -
రోడ్డుపైనే కుప్పకూలిన టెన్త్ విద్యార్థిని
కామారెడ్డి: జిల్లా కేంద్రంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. గుండెపోటుతో పదో తరగతి విద్యార్థిని కన్నుమూసింది. స్కూల్‌కు వెళ్తున్న క్రమంలో ఈ విషాదం చోటు చేసుకోవడంతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. రామారెడ్డి మండలం సింగరాయిపల్లికి చెందిన విద్యార్థిని శ్రీనిధి(14). కామారెడ్డిలోని కల్కినగర్‌లో తన పెద్దనాన్న ఇంట్లో ఉంటూ ఓ ప్రైవేట్ పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. గురువారం ఉదయం ఇంటి నుంచి టిఫిన్ బాక్స్‌తో ఆమె బయల్దేరింది. కాలినడకన వస్తూ పాఠశాలకు సమీపంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. పాఠశాల యాజమాన్యం అక్కడికి చేరుకొని విద్యార్థినిని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. సీపీఆర్ చేసి రక్షించే ప్రయత్నం చేశారు. పరిస్థితిలో మార్పు లేకపోవడంతో మరో ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడా సీపీఆర్ చేస్తూ వైద్య చికిత్స అందిస్తుండగానే.. ప్రాణాలు కోల్పోయింది. గుండెపోటుతోనే ఆమె కన్నుమూసిందని వైద్యులు ధృవీకరించారు. -
ప్రయాణం ఫ్రీనే.. బస్సే లేదు
సిరిసిల్ల: అది రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి జిల్లాల సరిహద్దుల్లోని దట్టమైన అటవీ ప్రాంతం.. గంభీరావుపేట మండలం దమ్మన్నపేట శివారులోని పెద్దమ్మ స్టేజీ.. అక్కడి నుంచి ఎటు చూసినా రెండు కిలోమీటర్ల మేర అడవి తప్ప ఒక్క ఊరు ఉండదు. కనీసం తాగేందుకు మంచినీరు కూడా దొరకదు. అలాంటి ప్రాంతంలో రెండు రోజుల క్రితం పాతిక మంది ప్రయాణికులు... అందులోనూ మహిళలు బస్సు(bus) కోసం గంటలకొద్దీ వేచి ఉన్నారు. వీరంతా దమ్మన్నపేట, నాగంపేట, ముచ్చర్ల, సమీపంలోని గిరిజన తండాలకు చెందిన వారు. పెద్దమ్మ స్టేజీ నుంచి కామారెడ్డికి వెళ్లేందుకు మధ్యాహ్నం ఒంటి గంటకు వచ్చారు. మూడున్నర గంటల వరకూ ఒక్క బస్సు కూడా రాకపోవడంతో ఎండలో గొంతులెండి అలమటించారు. ఒక్క బస్సు కూడా రాకపోవటంతో తీవ్ర అసహనానికి గురయ్యారు. కొందరైతే ప్రయాణం మానుకుని వెనుదిరిగారు. ఉచిత ప్రయాణం అనుకుంటే ఉన్న బస్సులు కూడా రావటంలేదని మహిళలు ఆవేదన వ్యక్తంచేశారు. ఇది ఆర్డీనరీ బస్సుల బాట: కరీంనగర్–కామారెడ్డి ప్రధాన రహదారి నిడివి 98 కిలోమీటర్లు. ఆర్డినరీ బస్సులు తప్ప ఒక్క ఎక్స్‌ప్రెస్ కూడా ఈ మార్గంలో లేవు. ఈ మార్గంలో సిరిసిల్ల జిల్లా కేంద్రం, వేములవాడ పుణ్యక్షేత్రంతోపాటు ఎల్లారెడ్డిపేట, మాచారెడ్డి, గంభీరావుపేట మండలాలు, అనేక గ్రామాలున్నాయి. అయినా ఆర్టీసీ అధికారులు అరకొరగా ఆర్డినరీ బస్సులతో నెట్టుకొస్తుండటంపై ప్రయాణికులు మండిపడుతున్నారు. ఆ రూట్ మా పరిధిలో లేదుఆ రూట్ మా పరిధిలో లేదు. కామారెడ్డి–కరీంనగర్ రూట్‌ను కరీంనగర్–1, కామారెడ్డి డిపోలు పర్యవేక్షిస్తాయి. బస్సులు రాకపోవడం, లేకపోవడంపై నాకు సమాచారం లేదు. ఆ రెండు డిపోల అధికారులను సంప్రదిస్తే కారణాలు తెలుస్తాయి. – ప్రకాశ్‌రావు, సిరిసిల్ల డిపో మేనేజర్. Ration Cards: మీసేవ కేంద్రాల్లో కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులు -
కూల్చి'వెతలు' లేని హైవే!
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి: రోడ్డు విస్తరణ అంటేనే జనం గుండెల్లో రైళ్లు పరుగెడుతుంటాయి. ముఖ్యంగా ప్రధాన రోడ్ల వెంట ఇళ్లు ఉన్నవారైతే తమ నివాసాలకు ఎక్కడ ఎ సరు వస్తుందోనని ఆందోళన చెందుతుంటారు. కానీ, ఒక ఊళ్లో మాత్రం జాతీయ రహదారి విస్తరణ చేపట్టినా ఇళ్ల కూల్చివేసే అవసరం ఏర్పడలేదు. 40 ఏళ్ల క్రితం స్థానిక ప్రజాప్రతినిధులు ముందుచూపుతో తీసుకున్న నిర్ణయమే నేడు వారిని కాపాడింది. ఆ గ్రామమే కామారెడ్డి జిల్లా నాగి రెడ్డిపేట మండల కేంద్రమైన గోపాల్పేట. హైదరాబాద్ నుంచి మెదక్, ఎల్లారెడ్డి మీదుగా బాన్సువాడ, రుద్రూర్, బోధన్ వరకు రహదారిని ఎన్‌హెచ్–765 డీగా అభివృద్ధి చేస్తున్నారు. ఈ రహదారి గోపాల్పేట మీదుగా వెళ్తోంది. విస్తరణలో కొన్ని షెడ్లు, కోకాలు మాత్రమే తొలగించారు. దశాబ్దాల క్రితం నిర్మించిన ఇళ్లేవీ పోవడం లేదు. నాటి సర్పంచ్ ముందుచూపుతోనే..నాగిరెడ్డిపేట గ్రామ పంచాయతీలో నాగిరెడ్డిపేట, గోపాల్ పేట, బంజెర గ్రామాలు ఉండేవి. పంచాయతీ నాగిరెడ్డి పే టలో ఉండగా, మండల కార్యాలయాలన్నీ ప్రధాన రహ దారిపై ఉన్న గోపాల్‌పేటలో ఉంటాయి. అందుకే నాగి రెడ్డిపేట మండల కేంద్రంగా గోపాల్ పేటను వ్యవహరి స్తారు. ఈ మధ్యే గోపాల్పేట, బంజెర గ్రామాలు పంచా యతీలుగా ఏర్పడ్డాయి. 1981లో ఇక్కడ సర్పంచ్‌గా గెలు పొందిన వి.కిషన్‌రెడ్డి 1992 వరకూ పదవిలో కొనసాగా రు. ఆ సమయంలోనే ఈ రోడ్డు ఎప్పటికైనా కీలకంగా మా రుతుందని ఆలోచించిన కిషన్‌రెడ్డి.. గ్రామస్తులతో చర్చించి రోడ్డు మధ్య నుంచి ఇరువైపులా 50 ఫీట్లు వదలి తేనే అనుమతులు ఇచ్చే పద్ధతి మొదలుపెట్టారు. దీంతో గ్రామ స్తులు రోడ్డుకు ఇరువైపులా 50 ఫీట్ల అవతలే ఇళ్లు నిర్మించుకున్నారు. అంటే రోడ్డు వెడల్పు వంద ఫీట్లు ఉందన్న మాట. ఇప్పుడు రెండు వరుసల జాతీయ రహదారి, ఇరు వైపులా డ్రైనేజీ, సర్వీసు రోడ్లు నిర్మిస్తున్నారు. అయి నా ఇళ్లు కూల్చే అవసరం ఏర్పడలేదు. అక్కడక్కడా చిన్న చిన్న అరుగులు, మెట్లు కొంత భాగం మాత్రమే పోతున్నాయి. వేగంగా రోడ్డు నిర్మాణ పనులుమెదక్ నుంచి ఎల్లారెడ్డి వరకు 43 కిలోమీటర్ల రోడ్డుకు రూ.399.01 కోట్లు, దీనికి కొనసాగింపుగా ఎల్లారెడ్డి నుంచి బాన్సువాడ మీదుగా రుద్రూర్ వరకు 51 కిలోమీటర్ల రోడ్డుకు రూ.499.88 కోట్ల వ్యయంతో విస్తరణ పనులు మొ దలయ్యాయి. రోడ్డు నిర్మాణ పనులు చురుకుగా సాగుతున్నాయి. -
కామారెడ్డి కేసులో అవన్నీ ఊహాగానాలే!
సాక్షి, కామారెడ్డి: జిల్లాలో కలకలం సృష్టించిన ఎస్ఐ, కానిస్టేబుల్, మరో యువకుడి మృతి కేసులో సస్పెన్స్ వీడలేదు. ఘటన జరిగిన ఏడు రోజులు కావొస్తున్న ట్రై యాంగిల్ సూసైడ్ మిస్టరీ ఇంకా పురోగతి సాధించలేదు. ఎస్ఐ సాయికుమార్, మహిళా కానిస్టేబుల్ శృతి, ఆపరేటర్ నిఖిల్ మృతిపై ఎన్నో అనుమానాలున్నాయి. ముగ్గురు మృతి కేసులో విభిన్న కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతి ఘటనను ప్రత్యక్షంగా చుసినవారు ఐ విట్ నెస్ లేదని ఎస్పీ సింధు శర్మ స్పష్టం చేశారు.ముందుగా ఒకరు చెరువులో దూకడంతో మరో ఇద్దరు కాపాడేందుకు వెళ్లి మృతి చెందారని పోలీసుల అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నిఖిల్ ప్రాణహాని ఫిర్యాదు విషయంలో కూడా విచారణ జరుపుతున్నామని పోలీసులు తెలిపారు. మరో వైపు కామారెడ్డి(Kamareddy) పోలీసులపై కేసు పురోగతిపై ఒత్తిడి పెరుగుతుంది. సైబర్ ఫోరెన్సిక్ రిపోర్టు కీలకంగా మారనుంది. కేసు దర్యాప్తులో అంతా ఊహగానాలే వ్యక్తమవుతున్నాయి.ఈ కేసులో వారి ఫోన్‌కాల్, వాట్సాప్ చాటింగ్ డేటా కీలకంగా మారింది. చనిపోయే రోజు భిక్కనూరు ఎస్ఐ సాయికుమార్, బీబీ పేట కానిస్టేబుల్ శ్రుతి, కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ ఫోన్ లో గంటలకొద్దీ మాట్లాడుకున్నట్లు పోలీసులు గుర్తించారు. వీరు ముగ్గురు ఈ నెల 25న కామారెడ్డి జిల్లా కేంద్రానికి సమీపంలోని అడ్లూర్ ఎల్లారెడ్డి పెద్ద చెరువులో నీటమునిగి చనిపోయిన విషయం తెలిసిందే.ఇదీ చదవండి: ఎస్సై ఐ ఫోన్ వాట్సాప్ చాటింగ్‌లో ఏముందో..బుధవారం వేకువజాము నుంచే వీరు ఫోన్లో మాట్లాడుకున్నట్లు కాల్ డేటా ద్వారా స్పష్టమైంది. సాయికుమార్ రెండు ఫోన్లలో కలిపి మూడు సిమ్‌లు వాడగా, నిఖిల్ రెండు ఫోన్లు వాడాడు. శ్రుతి ఒక ఫోన్ వాడుతుండేది. చనిపోయే వారం రోజుల ముందు నుంచి ఎక్కువ సార్లు ఫోన్లో మాట్లాడుకు న్నట్లు తెలుస్తోంది. బుధవారం ఉదయం నుంచి ఒక్క చోటు కి చేరుకునేదాకా వీరు ఫోన్లో మాట్లాడినట్టు గుర్తించారు. జిల్లా అధికారులతో ఫోన్ కాన్ఫరెన్స్‌లో ఉన్న సమయంలో తప్ప.. మిగతా సమయమంతా శ్రుతి(Shruthi), నిఖిల్‌తో సాయికుమార్ ఫోన్లో మాట్లాడుతూనే ఉన్నట్టు తెలుస్తోంది.శ్రుతి, నిఖిల్ వాట్సాప్(Whatsapp) మెసేజ్‌లను పోలీసులు పరిశీలించారు. వీరి మధ్య ప్రేమ వ్యవహారం ఉన్నట్టు వాట్సాప్ మెసేజ్ లు స్పష్టం చేస్తున్నాయని పోలీసు వర్గాల ద్వారా తెలుస్తోంది. అయితే, వీరి ప్రేమ వ్యవహారంలో సాయికుమార్ ఎందుకు తలదూర్చాడన్నది ఇప్పుడు కీలకంగా మారింది. నిఖిల్, శ్రుతి పెళ్లి చేసుకోవాలనుకున్నారని.. కానీ విభేదాలు తలెత్తి పెళ్లి వాయిదా వేయడం వల్లే గొడవ ముదిరింది అన్న ప్రచారం కూడా జరుగుతోంది. -
కామారెడ్డి పోలీసుల కేసులో విచారణ వేగవంతం
-
ఎస్సై ఐ ఫోన్ వాట్సాప్ చాటింగ్‌లో ఏముందో..
భిక్కనూరు ఎస్సై సాయికుమార్, బీబీపేట పీఎస్ కానిస్టేబుల్ శృతి, కంప్యూటర్ ఆపరేటర్ శివ మృతి మిస్టరీని ఛేదించే పనిలో ఉన్న పోలీసులకు ఆ ముగ్గురి వాట్సాప్ చాటింగ్, వారు ప్రయాణించిన ప్రాంతాల్లోని సీసీ ఫుటేజీ కీలకమైంది. ముగ్గురూ మృతి చెందడంతో అసలేం జరిగి ఉంటుందనేదిపెద్ద ప్రశ్నగా మిగిలింది. ఈ క్రమంలో పోలీసులు ముగ్గురి ఫోన్లలోని వాట్సాప్ చాటింగ్‌పైఆధారపడ్డారు. అలాగే సీసీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు.సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : ఏకకాలంలో జరిగిన ముగ్గురి మరణాల మిస్టరీని తేల్చేందుకు పోలీసు అధికారులు విచారణ ముమ్మరం చేశారు. చాలా కాలంగా క్లోజ్‌గా ఉన్న వాళ్లు కలిసి చనిపోవడానికి కారణాలు ఏమిటనేదానిపై ఆరా తీస్తున్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న సదాశివనగర్ మండలంలోని అడ్లూర్ ఎల్లారెడ్డి చెరువులో బుధవారం సాయంత్రం భిక్కనూరు ఎస్సై సాయికుమార్, బీబీపేట పోలీసు స్టేషన్లో పనిచేస్తున్న కానిస్టేబుల్ శ్రుతి, బీబీపేటకు చెందిన నిఖిల్‌లు చనిపోయిన విషయం తెలిసిందే. ఎస్సై, మహిళా కానిస్టేబుల్ చనిపోయిన ఘటనను సీరియస్‌గా తీసుకున్న పోలీసులు విచారణను వేగవంతం చేశారు. కేసు మిస్టరీని ఛేదించేందుకు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఎస్సై సాయికుమార్ వద్ద రెండు ఫోన్లు, కానిస్టేబుల్ శ్రుతి ఒక ఫోన్, నిఖిల్ రెండు ఫోన్లు వాడినట్లు నిర్ధారణకు వచ్చారు. ముగ్గురి కాల్ డేటాను ఇప్పటికే పరిశీలించారు. గడిచిన వారం రోజుల్లో ముగ్గురు పలుమార్లు కాల్స్ మాట్లాడినట్లు కాల్‌డేటా ద్వారా వెల్లడైనట్లు తెలుస్తోంది. ముగ్గురి మధ్య ఉన్న పరిచయాలు, వాళ్లు సడెన్‌గా ఆ రోజు ఎందుకు కలవాల్సి వచ్చింది ? అక్కడ జరిగిన గొడవ ఏమిటి? అనే అంశాలపై పోలీసులు ఫోకస్ చేస్తున్నారు.భిక్కనూరు నుంచి అడ్లూర్ ఎల్లారెడ్డి దాకా..విచారణలో భాగంగా పోలీసు అధికారులు సీసీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. భిక్కనూరు టోల్ ప్లాజా దగ్గర నుంచి మొదలుకుని అడ్లూర్ ఎల్లారెడ్డి చెరువు వరకు జాతీయ రహదారి వెంట ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించారు. జాతీయ రహదారిపై ఓ దాబా హోటల్ సమీపంలో నిఖిల్ బైకును ఇప్పటికే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ హోటల్ వద్ద కలిసి భోజనం చేశారన్న ప్రచారం జరగడంతో అధికారులు హోటల్ సిబ్బందిని ప్రశ్నించినట్లు సమాచారం. అయితే అక్కడ సీసీ ఫుటేజీని చెక్ చేసే క్రమంలో అవి పనిచేయడం లేదని చెబుతున్నారు. అక్కడి నుంచి ముగ్గురు కలిసి కారులో కామారెడ్డి పట్టణంలోకి రాకుండా బైపాస్ రోడ్డు గుండానే నిజామాబాద్ రూట్లో వెళ్లినట్టు భావిస్తున్నారు. అడ్లూర్ ఎల్లారెడ్డి చెరువు సమీపంలో రోడ్డు పక్కన కారు ఆపుకుని డిస్కషన్ చేసి ఉంటారని, తరువాత ఎవరి కంట పడకుండా ఉండేందుకు చెరువు కట్టపైకి వెళ్లి ఉండొచ్చని భావిస్తున్నారు. ఏది ఏమైనా ముగ్గురి చావుల మిస్టరీ తేల్చడం పోలీసులకు సవాల్‌గానే మారిందని చెప్పాలి.వాట్సాప్ చాటింగ్‌లో ఏముందో..ముగ్గురు కూడా రెగ్యులర్‌గా వాట్సాప్ వాడుతున్నట్లు పోలీసులు తమ ప్రాథమిక విచారణలో నిర్ధారించుకున్నారు. ఎస్సై సాయికుమార్ వాడుతున్న రెండు ఫోన్లలో ఒకటి కారులో ఉండగా, మరో ఫోన్ ఆయన ప్యాంట్ జేబులోనే ఉండిపోయింది. నీటిలో మునిగిపోవడంతో ఫోన్ ఆన్ కావడం లేదని తెలుస్తోంది. కారులో ఉన్న ఐ ఫోన్ స్క్రీన్ లాక్ ఉండడంతో ఓపెన్ చేసే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండాపోయింది. అయితే ఎస్సై ఫోన్ లాక్ గురించి ఆయన భార్యను తెలుసుకునే ప్రయత్నం చేయగా, తనకు తెలియదనే సమాధానం వచ్చినట్లు సమాచారం. నిఖిల్ వాడుతున్న రెండు ఫోన్లలో ఒకటి లాక్ ఓపెన్ కావడం లేదని, మరొకదానిలో పెద్దగా చాటింగ్ లేనట్టు చెబుతున్నారు. శ్రుతి ఫోన్ లాక్ సైతం ఓపెన్ కాలేదని తెలుస్తోంది. వాటిని ఓపెన్ చేయించేందుకు పోలీసు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. వాట్సాప్ చాటింగ్‌లో కచ్చితంగా ఏదో ఒక ఆధారం దొరుకుతుందనే నమ్మకంతో పోలీసులు ఉన్నారు.కామారెడ్డి మిస్టరీ డెత్స్ కేసులో కొత్త కోణాలు.. జరిగింది ఇదేనా? -
గంటల కొద్దీ ఫోన్ కాల్స్!
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి: కామారెడ్డి జిల్లాలో కలకలం సృష్టించిన ఎస్ఐ, కానిస్టేబుల్, మరో యువకుడి మృతి కేసులో వారి ఫోన్‌కాల్, వాట్సాప్ చాటింగ్ డేటా కీలకంగా మారింది. చనిపోయే రోజు భిక్కనూరు ఎస్ఐ సాయికుమార్, బీబీ పేట కానిస్టేబుల్ శ్రుతి, కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ ఫోన్ లో గంటలకొద్దీ మాట్లాడుకున్నట్లు పోలీసులు గుర్తించారు. వీరు ముగ్గురు ఈ నెల 25న కామారెడ్డి జిల్లా కేంద్రానికి సమీపంలోని అడ్లూర్ ఎల్లారెడ్డి పెద్ద చెరువులో నీటమునిగి చనిపోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై దర్యాప్తు ముమ్మ రం చేసిన పోలీసులు.. వారి కాల్ డేటాను సేకరించారు. చనిపోయేదాకా ఫోన్‌కాల్స్ బుధవారం వేకువజాము నుంచే వీరు ఫోన్లో మాట్లాడుకున్నట్లు కాల్ డేటా ద్వారా స్పష్టమైంది. సాయికుమార్ రెండు ఫోన్లలో కలిపి మూడు సిమ్‌లు వాడగా, నిఖిల్ రెండు ఫోన్లు వాడాడు. శ్రుతి ఒక ఫోన్ వాడుతుండేది. చనిపోయే వారం రోజుల ముందు నుంచి ఎక్కువ సార్లు ఫోన్లో మాట్లాడుకు న్నట్లు తెలుస్తోంది. బుధవారం ఉదయం నుంచి ఒక్క చోటు కి చేరుకునేదాకా వీరు ఫోన్లో మాట్లాడినట్టు గుర్తించారు. జిల్లా అధికారులతో ఫోన్ కాన్ఫరెన్స్‌లో ఉన్న సమయంలో తప్ప.. మిగతా సమయమంతా శ్రుతి, నిఖిల్‌తో సాయికుమార్ ఫోన్లో మాట్లాడుతూనే ఉన్నట్టు తెలుస్తోంది. ఒక్కచోటుకు చేరి..: భిక్కనూరు పోలీస్‌స్టేషన్ నుంచి సాయికుమార్ ఒక్కడే తన కారులో బయలుదేరి 44వ నంబర్ జాతీయ రహదారి మీదుగా కామారెడ్డి వైపు వెళ్లాడు. బీబీపేట నుంచి నిఖిల్ తన బైకుపై దోమకొండ, బీటీఎస్ మీదుగా హైవేకు చేరుకున్నట్టు తెలుస్తోంది. శ్రుతి బస్సులోనే బయలుదేరిందని, ఆమె నర్సన్నపల్లి శివారు వద్ద బస్సు దిగిందని అంటున్నారు. ఓ దాబా వద్ద ముగ్గురూ ఆగారని ప్రచారం జరుగుతుండగా.. అక్కడ సీసీ కెమెరాలు పనిచేయకపోవడంతో స్పష్టత రాలేదు.నిఖిల్ తన బైకును అక్కడే వదిలేసి ఎస్సై కారులో వెళ్లినట్టు స్పష్టత వచ్చింది. అదే కారులో శ్రుతి కూడా ఎక్కిందని అంటున్నారు. ముగ్గురూ బైపాస్ ద్వారా అడ్లూర్ ఎల్లారెడ్డి చెరువు వద్దకు చేరుకొని, కొంతసేపు అక్కడ మాట్లాడుకొని ఉంటారని భావిస్తున్నారు. తరువాత ఏమైందో ఏమో ముగ్గురూ చెరువులో పడి చనిపోవడం మిస్టరీగా మారింది. ఎవరైనా ఒకరు దూకితే కాపాడేందుకు మిగతా ఇద్దరు దూకారా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రేమ వ్యవహారమే కారణమా? శ్రుతి, నిఖిల్ వాట్సాప్ మెసేజ్‌లను పోలీసులు పరిశీలించా రు. వీరి మధ్య ప్రేమ వ్యవహారం ఉన్నట్టు వాట్సాప్ మెసేజ్ లు స్పష్టం చేస్తున్నాయని పోలీసు వర్గాల ద్వారా తెలుస్తోంది. అయితే, వీరి ప్రేమ వ్యవహారంలో సాయికుమార్ ఎందుకు తలదూర్చాడన్నది ఇప్పుడు కీలకంగా మారింది. నిఖిల్, శ్రుతి పెళ్లి చేసుకోవాలనుకున్నారని.. కానీ విభేదాలు తలెత్తి పెళ్లి వాయిదా వేయడం వల్లే గొడవ ముదిరింది అన్న ప్రచారం కూడా జరుగుతోంది. -
కామారెడ్డి మిస్టరీ డెత్స్ కేసులో కొత్త కోణాలు.. జరిగింది ఇదేనా?
సాక్షి, కామారెడ్డి జిల్లా: ట్రిపుల్ డెత్ కేసులో సస్పెన్స్ కొనసాగుతోంది. ఎస్ఐ సాయి, మహిళా కానిస్టేబుల్ శ్రుతి మరో యువకుడు నిఖిల్ మృతదేహాలు చెరువులో ఒకే చోట లభ్యం కాగా, ముగ్గురు కుటుంబాల నుంచి ఘటనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మృతుల బంధువులు పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నారు.ఎస్ఐ సాయి ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని మహిళా కానిస్టేబుల్ శ్రుతి, నిఖిల్‌లు ట్రాప్ చేసి పిలిచి ఉంటారంటూ ఎస్ఐ సాయి బంధువుల ఆరోపిస్తున్నారు. మరోవైపు, శ్రుతి ధైర్యవంతురాలని ఆమెను చంపి ఉంటారని కానిస్టేబుల్ బంధువులు ఆరోపిస్తున్నారు. నిఖిల్ బంధువుల నుంచి కూడా ఎస్ఐ, కానిస్టేబుల్ వైపు ఆరోపణలు చేస్తున్నారు. అసలు వారు చెరువు వద్దకు ఎందుకు వచ్చారు? ఆత్మహత్య నేపథ్యంలో కాపాడబోయి చనిపోయారా? లేక ముగ్గురివి ఆత్మహత్యలేనా అనే కోణాల్లో పోలీసులు విచారణ జరుపుతున్నారు.ఎస్ఐ సాయి, కానిస్టేబుల్ శ్రుతి మరో వ్యక్తి నిఖిల్ మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి చేయించిన పోలీసులు.. మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు.. జిల్లా ఎస్పీ సింధు శర్మ ఆధ్వర్యంలో శాఖాపరమైన దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు.. మరోవైపు.. మృతులు ముగ్గురి కాల్ లిస్ట్‌లు, సిగ్నల్స్ ఆధారంగా ఎప్పటినుంచి మాట్లాడుతున్నారు.. ఎక్కడ కలిశారు.. ఎటువైపు నుంచి ఎక్కడెక్కడికి వెళ్లారనే కోణంలో ఎంక్వైరీ చేపట్టారు. పోస్టుమార్టం నివేదిక అనంతరం వివరాలు బయటకు వస్తాయని కామారెడ్డి జిల్లా ఎస్పీ సింధు శర్మ వెల్లడించారు.. కాగా, భిక్కనూరులో పనిచేస్తున్న ఎస్ఐ సాయికుమార్, బీబీపేటలో పనిచేస్తున్న కానిస్టేబుల్ శృతితో పాటు బీబీపేటకు చెందిన యువకుడు నిఖిల్ చెరువులోకి దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కామారెడ్డి జిల్లాలో కలకలం రేపిన సంగతి తెలిసిందే. జిల్లా కేంద్రానికి సమీపంలోని 44వ నంబరు జాతీయ రహదారిపై అడ్లూర్ ఎల్లారెడ్డి చెరువు సమీపంలో ఎస్ఐ కారు లభ్యం కావడం, చెరువు వద్ద చెప్పులు ఉండడంతో ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసు అధికారులు భావించారు. బుధవారం సాయంత్రం నుంచి శవాల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. గజ ఈతగాళ్లు, ఫైర్ సిబ్బంది చెరువులో దిగి మృతదేహాలను బయటకు తీశారు.అర్ధరాత్రి 12.30 గంటలకు కానిస్టేబుల్ శృతి, యువకుడు నిఖిల్ మృతదేహాలు దొరికాయి. గురువారం ఉదయం ఎస్ఐ మృతేదేహాన్ని వెలికితీశారు. ఇక, ఎస్ఐ, మహిళా కానిస్టేబుల్‌తో పాటు యువకుడు కలిసి చెరువు వద్దకు చేరుకున్నారా? వారి మధ్యన ఉన్న గొడవలేంటి? ఎందుకు ఆత్మహత్య చేసుకుని ఉంటారు? అన్నది ఎవరికీ అంతుబట్టడం లేదు. ఎస్ఐ సాయికుమార్ గతంలో బీబీపేట పోలీసు స్టేషన్లో విధులు నిర్వహించారు. అక్కడ కానిస్టేబుల్‌గా శృతి పనిచేసేది. ఇప్పుడు కూడా అక్కడే విధులు నిర్వహిస్తోంది.బీబీపేటకు చెందిన నిఖిల్ సొసైటీలో ఆపరేటర్‌గా పనిచేస్తూనే, కంప్యూటర్లు మరమ్మతులు చేస్తుంటాడని తెలుస్తోంది. పోలీసు స్టేషన్‌లోని కంప్యూటర్లకు ఏదైనా సమస్య వస్తే నిఖిల్ వచ్చి సరి చేసి వెళతాడని చెబుతున్నారు. అయితే ఈ ముగ్గురి మధ్యన ఉన్న గొడవలేంటి అన్నది సస్పెన్స్‌గా మారింది. -
Fake Currency: హైదరాబాద్‌లో నకిలీ నోట్ల తయారీ
కామారెడ్డి టౌన్: హైదరాబాదులో నకిలీ నోట్లను తయారుచేసి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్న ముఠాలోని ఆరుగురిని బాన్సువాడ పోలీసులు అరెస్టు చేశారు. శనివారం కామారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ సింధు శర్మ విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. బాన్సువాడ పోలీసులు శుక్రవారం కొయ్యగుట్ట వద్ద వాహనాలను తనిఖీ చేస్తుండగా ఓ కారులోని కొందరు పోలీసులను చూసి పరారయ్యేందుకు యత్నించారు. దీంతో పోలీసులు వెంబడించి ముగ్గురిని పట్టుకున్నారు. ఇందులో కామారెడ్డి జిల్లా బిచ్కుందకు చెందిన కోలావర్ కిరణ్‌కుమార్, బాన్సువాడకు చెందిన కె.రమేష్ గౌడ్‌తోపాటు హైదరాబాద్ కొంపల్లికి చెందిన కడపత్రి రాజ్‌గోపాల్ ఉన్నారు. వారి వద్దనుంచి రూ. 30 లక్షల విలువ చేసే నకిలీ రూ. 500 నోట్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం విచారించగా తెలంగాణ, కర్ణాటక, రాజస్థాన్, ఉత్తరాఖండ్, మహారాష్ట్రకు చెందిన 8 మంది ముఠాగా ఏర్పడి ఈ దందాకు పాల్పడుతున్నట్లు తేలింది. వీరిలో తెలంగాణకు చెందిన రాజగోపాల్, కర్ణాటకకు చెందిన హుసేన్ పీరా నకిలీ నోట్ల తయారీ, చెలామణిలో పెట్టుబడి పెడతారు. రాజస్థాన్‌కు చెందిన కమలే‹Ù, సుఖ్రాం, ఉత్తరాఖండ్ రాష్ట్రానికి చెందిన రాధాకృష్ణలు కలిసి నకిలీ కరెన్సీని తయారు చేస్తారు. కామారెడ్డి జిల్లాకు చెందిన కిరణ్ కుమార్, రమేశ్ గౌడ్, మహారాష్ట్రకు చెందిన అజయ్ ఈశ్వర్ వీటిని చెలామణి చేస్తున్నారు. పట్టుబడ్డారిలా.. నగరంలోని గౌలిగూడ, సికింద్రాబాద్ సీటీసీలలో నకిలీ నోట్ల తయారీకి అవసరమయ్యే సామగ్రిని కొనుగోలు చేసి బోయిన్‌పల్లిలోని అంటిలియా అపార్ట్మెంట్లో పెంట్‌హౌజ్‌లో ఇప్పటివరకు రూ.60 లక్షల విలువ చేసే రూ.500 నకిలీ నోట్లు ప్రింట్ చేశారు. ఇందులో రూ.3 లక్షలను బిచ్కుందకు చెందిన కిరణ్ కుమార్, బాన్సువాడకు చెందిన రమేశ్ గౌడ్‌కు చెలామణి కోసం అప్పగించారు. వారు వాటిని చుట్టుపక్కల గ్రామాల్లో చెలామణి చేశారు. మరో రూ.30 లక్షలను హైదరాబాద్ నుంచి రాజగోపాల్ బాన్సువాడకు తీసుకువచ్చి కిరణ్‌కుమార్, రమేష్ గౌడ్లకు అప్పగించాడు. అయితే తిరిగి రాజ్‌గోపాల్‌ను బాన్సువాడ బస్టాండులో దింపడానికి కిరణ్ కుమార్, రమే‹Ùగౌడ్లు కారులో బయలు దేరారు. ఈ క్రమంలో బాన్సువాడలోని కొయ్యగుట్ట వద్ద పోలీసులకు పట్టుబడ్డారు. రూ.30 లక్షలు స్వా«దీనం చేసుకున్న పోలీసులు నిందితుల సమాచారం మేరకు హైదరాబాద్‌లో తనిఖీలు చేపట్టి మిగతా రూ.26.90 లక్షల విలువైన రూ.500 నోట్లను స్వా«దీనం చేసుకున్నారు. అలాగే నోట్ల తయారీకి వినియోగించే వస్తువులను స్వా«దీనం చేసుకున్నారు. నిందితులు రాజగోపాల్, హుసేన్ పీరా, కిరణ్ కుమార్, రమేష్ గౌడ్, రాధాకృష్ణ, అజయ్ ఈశ్వర్‌ను అదుపులోకి తీసుకున్నామని ఎస్పీ తెలిపారు. కమలే‹Ù, సుఖ్రాంలు పరారీలో ఉన్నారన్నారు. నిందితుల నుంచి రూ.56 లక్షల 90 వేల విలువ చేసే రూ.500 నకిలీ నోట్లు స్వాధీనం చేసుకున్నామని వివరించారు. -
రియల్ఎస్టేట్ పడిపోతే పోయేదేం లేదు: కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి
సాక్షి,హైదరాబాద్: కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి మంగళవారం(డిసెంబర్10) ఐదు రియల్ ఎస్టేట్ కంపెనీలపై ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. హైడ్రాతో పాటు రెరా,టీజీఐఐసీ,జీహెచ్ఎంసీ,హెచ్ఎండీఏల్లో కాటిపల్లి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అనంతరం ఈ అంశంపై ఆయన మీడియాతో మాట్లాడారు. ‘ఐదు కంపెనీలు చెరువులను కబ్జా చేస్తూ అక్రమ నిర్మాణాలు చేస్తున్నారు. దీనిపై రెండు నెలల క్రితమే నేను ప్రెస్ మీట్ పెట్టాను. సరిగా నేను మాట్లాడిన 10 రోజుల తర్వాత పర్మిషన్ ఇచ్చిన నిర్మాణాల జోలికి వెళ్లబోమని సీఎం, డిప్యూటీ సీఎం ప్రకటించారు. వీటికి పర్మిషన్ ఇచ్చిన వారు ఎవరు? పర్మిషన్ ఇచ్చిన వారిపై చర్యలేందుకు లేవు ? ఈ ఐదు కంపెనీల మీద హైడ్రా రంగనాథ్‌కు ఫిర్యాదు చేశా.దీనిపై అసెంబ్లీలో మాట్లాడతాం.తప్పు చేసిన మంత్రులు అధికారులు ఎవరైనా శిక్షకు అర్హులే. ఈ ప్రభుత్వం ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ తేవాలి.ఈ యాక్ట్‌తో కబ్జాల నివారణ వీలవుతుంది.దీనిపై అసెంబ్లీలో చర్చకు పట్టు పడతాం.ప్రభుత్వం స్పందించకుంటే కోర్టుకి వెళ్తాం. ల్యాండ్ గ్రాభింగ్ పై రిఫార్మ్స్ తీసుకురాకుంటే నాయకులను ప్రజలు తరిమి కొడతారు. రియల్ ఎస్టేట్ పడిపోతే నష్టం ఏమి లేదు’అని వెంకటరమణారెడ్డి వ్యాఖ్యానించారు. -
కామారెడ్డి: హైవేపై చిరుత.. హడలిపోయిన ప్రయాణికులు
కామారెడ్డి : చిరుత పులి మరోసారి కలకలం సృష్టించింది. మంగళవారం రాత్రి కామారెడ్డి జిల్లాలో సదాశివనగర్ అటవీ ప్రాంతంలో నేషనల్ హైవేపై చిరుత సంచరించింది.పులి సంచారంతో ఆందోళనకు గురైన స్థానికులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు.ఘటనా స్థలానికి చేరుకున్న అటవీ శాఖ అధికారులు ప్రత్యక్ష సాక్షి నుంచి వివరాలు సేకరించారు. పాదముద్రలు పరిశీలించారు. అనంతరం, పులి సంచారంతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, ఒంటరిగా తిరుగవద్దని హెచ్చరికలు జారీ చేశారు. -
నిశ్శబ్దాన్ని ఛేదించారు!
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి: వాళ్లంతా కాలం కాటేసిన అభాగ్యులు.. చేయని తప్పులకు సమాజం నుంచి చీత్కారాలు ఎదుర్కొంటున్న బాధితులు.. నిత్యం దేహంలోని శత్రువుతోపాటు సమాజంతోనూ పోరాడుతున్న ధీరులు. కుంగిపోతే సమాజం మరింత తొక్కేస్తుందని గుర్తెరిగి.. ధైర్యంగా తలెత్తుకొని నిలబడే ప్రయత్నం చేస్తూ ఇప్పుడిప్పుడే నిశ్శబ్దాన్ని ఛేదిస్తున్నారు. ఒక్కొక్కరుగా సంఘటితమవుతున్నారు. కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లో ఎయిడ్స్, హెచ్ఐవీ బాధితులు కష్టాలను ఎదిరించి ధైర్యంగా ముందుకు సాగుతున్నారు.రెండు జిల్లాల్లో సొసైటీలు...⇒ కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లో హెచ్ఐవీ, ఎయిడ్స్ బాధితులు నిశ్శబ్దాన్ని ఛేదించారు. మండలాలవారీగా సంఘాలుగా ఏర్పడుతున్నారు. జిల్లా స్థాయిలో సహకార పరపతి సంఘాలను ఏర్పాటు చేసుకుని నెలనెలా కొంత డబ్బు పొదుపు చేసుకుంటూ సొంత కాళ్లపై నిలబడే ప్రయత్నం చేస్తున్నారు. వీరికి ‘వర్డ్’అనే స్వచ్ఛంద సంస్థ అండగా నిలుస్తోంది. కామారెడ్డి జిల్లాలో ‘స్వయం కృషి’పేరుతో, నిజామాబాద్‌లో ‘విజేత’పేరుతో 2021 సంవత్సరంలో మ్యూచ్‌వల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీ (మాక్స్)లు ఏర్పాటు చేసుకున్నారు. సంఘంలో సభ్యత్వ రుసుముగా రూ.50తోపాటు రూ.100 చెల్లించి రూ.10 ముఖ విలువగల 10 షేర్లు కొని సభ్యులుగా చేరుతున్నారు. కామారెడ్డి జిల్లాలోని స్వయంకృషి సంఘంలో 1,393 మంది సభ్యులు చేరగా, 63 మంది చనిపోయారు. ప్రస్తుతం 1,330 మంది సభ్యులున్నారు. నిజామాబాద్ విజేత సంఘంలో 1,169 మంది సభ్యులకుగాను 82 మంది చనిపోయారు. ప్రస్తుతం 1,087 మంది సభ్యులున్నారు. ప్రతినెలా సమావేశం.. ⇒ ఈ సంఘాల్లోని సభ్యులంతా నెలకోసారి మండల స్థాయిలో నిర్వహించు కునే సమావేశంలో కలుస్తారు. ఆ సమయంలో అందరూ తలా రూ.100 చొప్పున సంఘంలో జమ చేస్తారు. ఇలా ఇప్పటివరకు జమ చేసిన సొమ్ము ప్రస్తుతం స్వయంకృషి సొసైటీలో రూ.8.55 లక్షలకు, విజే త సొసైటీలో రూ.8.44 లక్షలకు చేరింది. ఈ సొసైటీలు ఏర్పా టు చేసి హెచ్ఐవీ బాధితులను చైతన్యపరుస్తున్న వర్డ్ స్వచ్ఛ ంద సంస్థ ఒక్కో సొసైటీలో రూ.2.50 లక్షల చొప్పున కార్పస్ ఫండ్‌ను ముందుగానే జమ చేసింది. దీంతో ఆయా సంఘాల్లో ఇప్పుడు రూ.10 లక్షలకు పైగానే డబ్బు జమయ్యింది. ప్రభుత్వ పథకాలు పొందుతూ..ప్రభుత్వం నుంచి వచ్చే పింఛన్‌ను తీసుకోవడంతోపాటు వారికి కావలసిన మందులు, వైద్య సేవలు పొందడానికి హెచ్ఐవీ బాధితులకు వర్డ్ సంస్థ ప్రతినిధులు అవగాహన కల్పిస్తున్నారు. దీంతో చాలామంది మంది వివిధ రకాల ప్రభుత్వ పథకాలు పొందారు. ఈ సంఘాల్లోని 12 మందికి డబుల్ బెడ్రూం ఇళ్లు లభించాయి. పది మందికి దళితబంధు పథకం ద్వారా లబ్ధి చేకూరింది. మిషన్ వాత్సల్య ద్వారా హెచ్ఐవీతో చనిపోయిన వారి పిల్లలు 27 మందికి నెలనెలా ప్రభుత్వ సాయం అందుతోంది. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రూ.40 వేల చొప్పున పూర్తి సబ్సిడీపై మేకలు, గొర్రెలను 39 మందికి అందించారు. తొమ్మిది మంది రుణాలు పొంది కిరాణా దుకాణాలు, హోటళ్లు నిర్వహిస్తున్నారు. బీసీ కార్పొరేషన్ ద్వారా పది మందికి రూ. 50 వేల చొప్పున సాయం అందింది.మానసిక స్థైర్యం కలి్పస్తూ... ప్రతినెలా బాధితులంతా మండలాలవారీగా ఒక చోట చేరతారు. ఆ సమావేశాల్లో సభ్యుల ఆరోగ్య పరిస్థితులు తెలుసుకోవడం, వారికి కావలసిన వైద్య సాయం అందించడం, మానసిక స్థైర్యం నింపటానికి కౌన్సెలింగ్ చేయడం వంటివి కొనసాగిస్తున్నారు. దీంతో చాలా మంది బాధితులు ధైర్యంగా తమతమ పనులు చేసుకుంటున్నారు. హెచ్ఐవీ బాధితులం అనే బాధ నుంచి బయటపడి సాధారణంగా ఉండే ప్రయత్నంలో సక్సెస్ అవుతున్నారు.టైలరింగ్ చేస్తున్నా: నా భర్త చనిపోయాడు. స్వచ్ఛంద సంస్థ టైలరింగ్ నేరి్పంచి మిషన్ కూడా అందించింది. నేను బట్టలు కుడుతూ కొడుకును పెంచి పెద్ద చేశాను. డబుల్ బెడ్రూం ఇళ్లు కూడా వచ్చింది. ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా క్రమంతప్పకుండా మందులు వాడుతూ సంతోషంగా ఉన్నాను. – కామారెడ్డికి చెందిన హెచ్ఐవీ బాధితురాలుమేకల పెంపకంతో ఉపాధి..: మేకల పెంపకానికి నూరు శాతం సబ్సిడీ కింద ప్రభుత్వం ఇచ్చిన సాయాన్ని సద్వినియోగం చేసుకున్నాను. అప్పుడు 4 మేకలు ఉండేవి. ఇప్పు డు మంద తయారైంది. వాటితో జీవనం సాగి స్తున్నాను. మరికొన్ని సంక్షేమ పథకాలు కూడా అందాయి. ఏ ఇబ్బందీ లేదు. నెలనెలా సంఘం మీటింగ్‌కు హాజరవుతున్నా. – కామారెడ్డి జిల్లాకు చెందిన హెచ్ఐవీ బాధితుడు -
దత్తాశ్రమంలో ఉచిత క్యాన్సర్ నిర్ధారణ శిబిరం
సాక్షి, కామారెడ్డి: ఎస్సీఎస్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కామారెడ్డిలోని దత్తాశ్రమంలో ఉచిత క్యాన్సర్ నిర్ధారణ శిబిరాన్ని శనివారం నిర్వహించారు. ఈ శిబిరంలో 100 మందికి పైగా మహిళలు స్క్రీనింగ్ టెస్టులు చేయించుకున్నారు. హైదరాబాద్ ఎంఎన్‌జే క్యాన్సర్ హాస్పిటల్‌కు చెందిన 10 మంది వైద్యుల బృందం ఈ శిబిరంలో పాల్గొన్నారు.ఎస్జీఎస్ ట్రస్ట్ సభ్యులు డాక్టర్ వెంకటకృష్ణ, ఎల్ఐసీ లక్ష్మణరావు, సీతారామరావు, డాక్టర్ రాధా రమణ, శ్రీవారి భారతి చంద్రశేఖర్, డాక్టర్ ఉమారెడ్డి, డాక్టర్ రాజ్యలక్ష్మి, డాక్టర్ మాళవిక డాక్టర్ అరవింద్, డాక్టర్ పవన్, శ్రీనివాస్ తదితరులు క్యాంప్‌ను ప్రారంభించారు. ఈ శిబిరంలో మహిళలకు పాప్ స్మెర్, మామోగ్రామ్ పరీక్షలు నిర్వహించారు. అనంతరం అన్నదానం నిర్వహించారు. -
దోమకొండ కోటను టూరిస్ట్ స్పాట్‌గా మార్చాలి..!
చారిత్రక దోమకొండ కోటకు దేశ విదేశాల్లో గుర్తింపు యునెస్కో అవార్డుతో మరింత పెరిగిన ఖ్యాతి కాకతీయ శిల్ప శైలి ఉట్టిపడేలా కోటలో అద్భుత కట్టడాల నిర్మాణం పూర్తిస్థాయి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని స్థానికుల విజ్ఞప్తి దోమకొండ: చారిత్రక సంపదకు నిలయంగా ఉన్న దోమకొండ కోటకు అంతర్జాతీయ ఖ్యాతిని సాధించింది. అద్భుత కాకతీయ శైలి శిల్ప నైపుణ్యం ఉట్టిపడే నిర్మాణాల కారణంగా ఈ గడీ పురాతన కట్టడాలు, వారసత్వ సంపద పరిరక్షణ విభాగంలో ఇటీవల ఐక్య రాజ్యసమితి విద్యా శాస్త్రీయ సాంస్కృతిక సంస్థ యునెస్కో అవార్డును అందుకుంది. ఆసియా పసిఫిక్ దేశాలకు యునెస్కో ప్రకటించిన అవార్డుల జాబితాలో హైదరాబాదులోని కుతుబ్ షాహీ సమాధుల ప్రాంగణంలో ఉన్న గోల్కొండ మెట్ల బావికి అవార్డ్ ఆఫ్ డిస్టింక్షన్, కామారెడ్డి జిల్లాలోని దోమకొండ గడీకి అవార్డు ఆఫ్ మెరిట్ విభాగంలో గుర్తింపు లభించడంతో ఈ కోట, అందులోని శిల్ప సంపద మరోమారు దేశ విదేశాల్లో చర్చనీయాంశంగా మారాయి అపూర్వ శిల్పకళ.. గడీలోని శిల్పకళా సంపద, దాన్ని జాగ్రత్తగా నిర్వహించడమనే అంశాలలో యునెస్కో గుర్తింపుతో దోమకొండ కోట పేరు స్థానిక, జాతీయ స్థాయిని దాటి అంతర్జాతీయ స్థాయిలో మారుమోగుతోంది. ఈ కోటను 400ఏళ్ల క్రితం 60 ఎకరాల విస్తీర్ణంలో పాకనాటి రెడ్డి రాజులైన కామినేని వంశస్థులు నిరి్మంచారు. సరైన నిర్వహణ లేని కారణంగా గడీ ప్రధాన ద్వారం, ఇతర భవనాలు, కొన్ని ఇళ్లు దెబ్బతినడంతో గడీ వారసులు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి స్వర్గీయ ఉమాపతిరావు కుమారుడు కామినేని అనిల్ కుమార్ ఆధ్వర్యంలో కోట మరమ్మతు పనులు జరిగాయి. గతంలో కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా పనిచేసిన సినీహీరో చిరంజీవి కోట అభివృద్ధి విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపారు. ఇకాకతీయ శిల్పకళా శైలిలో ఈ పురాతన కట్టడాలు ప్రసిద్ధి చెందాయి. కోటకు తూర్పు ద్వారం, పడమర ప్రధాన ద్వారాలను 200 ఫీట్లు ఎత్తులో నిరి్మంచారు. 60 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన గడీకోట చుట్టూ 50 ఫీట్ల వెడల్పు, పది ఫీట్ల లోతుతో నిర్మించిన కందకం ఇప్పటికీ చూపరులను ఆకర్షిస్తుంది. కామినేని అనిల్ ఆధ్వర్యంలో పునరుద్ధరణ పనులు... దోమకొండ సంస్థానా«దీశుల పాలనలో నిరి్మంచిన వెంకటపతి భవన్లో శిల్పకళా నైపుణ్యం, రాజసం ఉట్టిపడతాయి. అలాగే వీరి పాలనలోనే మహాదేవుని ఆలయ పునర్మిర్మాణం జరిగింది. అప్పట్లో మహాదేవుని ఆలయానికి కాకతీయ రాణి రుద్రమదేవి వచ్చినట్లు శిలా ఫలకం వెల్లడిస్తుంది. దోమకొండ కోటను సంస్థాన వారసుడు కామినేని అనిల్ పునరుద్ధరించారు. అనిల్ కుమార్తై ఉపాసన, మెగాస్టార్ చిరంజీవి తనయుడు, సినీహీరో రామ్‌చరణ్ వివాహ వేడుకలు దోమకొండ కోటలోనే జరిగిన విషయం తెలిసిందే. యునెస్కో గుర్తింపుతో.. కామినేని వంశస్థులుదోమకొండ సంస్థానాన్ని 400 ఏళ్లకు పైగా పరిపాలించారు. 1760లో మొదటి పాలకుడుగా రాజన్న చౌదరిగా చరిత్ర పేర్కొంటోంది. ఆనాటి నుంచి జమిందారీ వ్యవస్థ రద్దు వరకు కామినేని వంశస్థులు దోమకొండ కేంద్రంగా పరిపాలన కొనసాగించారని ఆధారాలు ఉన్నాయి. ఉమ్మడి మెదక్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలోని పలు మండలాలు వీరి పాలనలో కొనసాగాయని శిలాశాసనాలు చెబుతున్నాయి. చివరగా స్వతంత్ర భారతదేశంలో తెలంగాణ విలీనమైనప్పుడు ఈ కోట రాజా సోమేశ్వర్ రావు పాలనలో ఉందని చెబుతారు. వీరి కాలంలోనే భిక్కనూరు సిద్దరామేశ్వరం, తాడ్వాయి భీమేశ్వరం, కామారెడ్డి వేణుగోపాలస్వామి, రామారెడ్డి కాలభైరవ స్వామి, లింగంపేట మెట్ల బావి వంటి ప్రసిద్ధ కట్టడాలు నిరి్మంచినట్లు తెలుస్తోంది. వీరి వారసుల పేర్లతో నేటికి కామారెడ్డి, నిజామాబాద్, సిరిసిల్ల, మెదక్, సిద్దిపేట జిల్లాలలో అనేక గ్రామాల పేర్లు ఉండటం విశేషం. రాజధాని నుంచి 100 కి.మీ దూరంలో.. ఈ కోట కామారెడ్డి జిల్లాలోని దోమకొండ జిల్లా కేంద్రానికి 20 కి.మీ దూరంలో...రాష్ట్ర రాజధాని హైద్రాబాద్‌కు కేవలం 100 కిలో మీటర్ల దూరంలో ఉంటుంది. ఈ నేపథ్యంలో కోటను పర్యాటక కేంద్రంగా మారిస్తే స్థానికులకు ఉపాధి లభించే అవకాశముంటుందని గతంలో గ్రామ ప్రజా ప్రతినిధులు కోట వారసులైన కామినేని అనిల్‌కుమార్‌ను కలిసి వివరించారు. దీంతో ఆయన గడీ కోసం ఓ ప్రత్యేక ట్రస్టును ఏర్పాటు చేసి దీని ద్వారా గ్రామంలో పలు అభివృద్ది పనులు, స్వచ్చంద సేవా కార్యక్రమాలను చేపడుతున్నారు. కాగా కోటను పూర్తిస్థాయి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తే గ్రామానికి చెందిన యువతకు స్వయం ఉపాధి లభిస్తుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. దోమకొండ కోటను టూరిస్ట్ స్పాట్‌గా మార్చాలి -
Medicinal Plants: ఔషధ మొక్కకు ఆపద
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి: గ్రామీణ జన జీవనంతో ముడిపడి ఉన్న అనేక రకాల చెట్లు, ఔషధ మొక్కలు కాలక్రమేణా కనుమరుగవుతున్నాయి. ఒకప్పుడు పల్లెల్లో అడుగుపెట్టగానే ఎన్నో రకాల చెట్లు కనిపించేవి. ఇప్పుడా పరిస్థితి లేదు. ప్రధానంగా మారేడు, బ్రహ్మజెముడు, నాగజెముడు, ఉమ్మెంత, ఉత్తరేని, జిల్లెడు, తిప్పతీగె, కలమంద వంటి ఔషధ మొక్కలు ఎక్కడా కనిపించడం లేదు. చెలకల్లో తంగేడు, గునుగు పూల చెట్లు ఎక్కువగా ఉండేవి. చేను చుట్టూరా కంప చెట్లు, వాయిలాకు చెట్లు ఉండేవి. చాలా గ్రామాల్లో ఇప్పుడవి లేవు. ఇళ్ల ముందర వేప చెట్లు, పెరట్లో చింత చెట్లు ఉండేవి. ఊరి నడుమ వివిధ రకాల పెద్ద పెద్ద వృక్షాలు ఉండేవి. ఆలయాల దగ్గర రావి, ఉసిరి, మారేడు (పత్రి) చెట్లు కనిపించేవి. అయితే పల్లెలకు ఆధునికత చొచ్చుకు వచ్చిన తర్వాత పెంకుటిళ్లు, పూరి గుడిసెల స్థానంలో బంగళాలు నిర్మించారు. వాటిని నిర్మించే క్రమంలో చాలా ఇళ్ల ఎదుట ఉన్న వేప చెట్లు, చింత చెట్లు నరికివేశారు. కొత్తగా నాటే విషయం ఎవరూ పట్టించుకోవడం లేదు. దీంతో కొత్త తరానికి ఔషధ మొక్కల ప్రాధాన్యం కూడా తెలియని పరిస్థితి ఏర్పడుతోంది. తంగేడు దొరకని పరిస్థితి...చెలకల వద్ద, అటవీ ప్రాంతంలో విరివిగా లభించే తంగేడు పువ్వు ఇప్పుడు గగనమైంది. చాలా గ్రామాల్లో తంగేటు చెట్లు కనిపించడం లేదు. దీంతో బతుకమ్మ పేర్చడానికి తంగేడు పువ్వు దొరకడం లేదు. అక్కడక్కడ తంగేడు మిగిలి ఉన్నా, చాలా ప్రాంతాల్లో తంగేడు చెట్లు కనుమరుగయ్యాయి. మక్క, పత్తి చేలల్లో గునుగు పూల చెట్లు విపరీతంగా మొలిచేవి. బతుకమ్మ సీజన్లో జనం వెళ్లి కోసుకుని వచ్చేవారు. వ్యవసాయంలో వచ్చిన మార్పుల కారణంగా విత్తనం వేసేటపుడే కలుపు నివారణ మందులు పిచికారీ చేయడం, మొలకలు వచి్చన తర్వాత కూడా కలుపు నివారణ మందులు పిచికారీ చేయడంలో గునుగు దొరకడం లేదు. గునుగు పువ్వును ఔషధ మొక్కగా గుర్తిస్తారు. పసరికలు అయిన వారికి ఆరబెట్టిన గునుగు పువ్వును చూర్ణం చేసి మందు బిల్లలుగా మింగిస్తే తగ్గిపోతుందని చెబుతారు. అంత గొప్ప ఔషధ గుణాలున్న గునుగు పూల చెట్లు రానురాను తగ్గిపోతున్నాయి. కనిపించని నాగజెముడు, బ్రహ్మజెముడుఊళ్లల్లో చాలా చోట్ల బ్రహ్మజెముడు, నాగజెముడు చెట్లు కనిపిస్తాయి. దళసరిగా ఉండే ఆకులపై ముళ్లు ఉండే ఈ చెట్లలో ఎన్నో ఔషధ గుణాలుంటాయని చెబుతారు. బ్రహ్మజెముడు పండ్లలో మంచి పోషకాలుంటాయని, డ్రాగన్ ఫ్రూట్ కన్నా వెయ్యి రెట్లు ఎక్కువ పోషకాలు లభిస్తాయని చెబుతారు. ముఖ్యంగా బీ12, ఏ, సీ విటమిన్లు అందులో ఉంటాయని పేర్కొంటున్నారు. అయితే చాలా చోట్ల బ్రహ్మజెముడు మొక్కలు కానరావడం లేదు. వ్యవసాయ యాంత్రీకరణతో చేల వద్ద పెద్దపెద్ద చెట్లను జేసీబీలతో తొలగించి పొలం మడుగులు చేయడం మూలంగా బ్రహ్మజెముడు, నాగజెముడు వంటి చెట్లు కనుమరుగయ్యాయి. ఉమ్మెత్త లేదు.. ఉత్తరేణి దొరకదు చర్మ సమస్యలు, పైత్యం వేడి, దురద, గడ్డలు, దగ్గు, దమ్ము, ఆయాసం వంటి వాటికి ఉమ్మెత్త ఆకులను కాల్చి దాని నుంచి వెలుబడే పొగను పీల్చడం వల్ల ఆయా సమస్యలు తొలగిపోతాయని చెబుతుంటారు. ఉమ్మెత్త మొక్కలు ఎలా గుంటాయో కూడా నేటి తరానికి తెలియడం లేదు. ఉత్తరేణి ఆకులను పూజల్లో వాడుతారు. ఉత్తరేణి మంచి ఔషధ మొక్క. ఉత్తరేణి వేర్లతో పళ్లు తోముకుంటే ధృడంగా తయారవుతాయని చెబుతారు. ఉత్తరేణి ఆకుల రసంతో నొప్పులు, పంటినొప్పి కూడా తగ్గించొచ్చని పేర్కొంటున్నారు. ఊళ్లల్లో ఇప్పుడు ఉమ్మెత్త మొక్కలు కనిపించడం లేదు. ఆఖరుకు ఉత్తరేణి కూడా దొరకడం అరుదుగా మారింది.జిల్లేడు, తిప్పతీగ కూడా...చాలామంది ఆరోగ్య సమస్యలను అధిగమించేందుకు జిల్లేడు ఆకులను వాడుతారు. ఆకులను దంచి దాని రసాన్ని గాయాలపై రుద్దితే గాయాలు త్వరగా మానుతాయని, ఉబ్బులు తగ్గుతాయని చెబుతుంటారు. జిల్లెడు ఆకు తెంపి దాని నుంచి కారే పాల చుక్కలను నొప్పి ఉన్న చోట పెట్టడంతో నొప్పులు తగ్గుతాయని విశ్వసిస్తారు. మరిన్ని సమస్యలకూ జిల్లెడును వాడుతారు. కీళ్ల సమస్యలు ఉన్న వారు తిప్పతీగను పొడిగా చేసి పాలల్లో కలుపుకొని తాగుతుంటారు. తిప్పతీగ చాలా రకరాల ఆరోగ్య సమస్యలకు మంచి ఔషధిగా చెబుతుంటారు. ఆర్థరైటీస్ సమస్యలకు బాగా పనిచేస్తుందని పేర్కొంటున్నారు. ఇప్పుడు పల్లెల్లో తిప్పతీగలే కాదు జిల్లెడు కూడా కనిపించడం లేదు. -
పండగపూట విషాదం.. ఇద్దరు పిల్లలను బావిలోకి నెట్టి..
సాక్షి, కామారెడ్డి జిల్లా: తాడ్వాయి మండలం నందివాడలో పండగ పూట విషాదం చోటుచేసుకుంది. ఇద్దరు పిల్లలను బావిలో పడేసి తండ్రి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇద్దరు పిల్లలు, తండ్రి మృతదేహాలను పోలీసులు వెలికితీశారు. కుటుంబ కలహాలతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. పోలీసులు, స్థానికులు వివరాలు ప్రకారం శనివారం రాత్రి దుర్గమ్మ నిమజ్జనానికి పిల్లలను తండ్రి శ్రీనివాస్‌రెడ్డి తీసుకెళ్లగా, రాత్రి 10 గంటలు దాటినా ఇంటికి తిరిగి రాకపోవడంతో భార్య ఆయనకు ఫోన్ చేసింది. ఎన్నిసార్లు చేసినా కాల్ లిప్ట్ చేయలేదు. మళ్లీ అర్ధరాత్రి సమయంలో ఫోన్ చేయగా స్విచ్ఛాఫ్ వచ్చింది. దీంతో భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు, స్థానికులు గాలింపు చర్యలు చేపట్టగా, ఆదివారం ఉదయం గ్రామశివారులోని ఓ వ్యవసాయ బావిలో పిల్లలు, తండ్రి మృతదేహాలు కనిపించాయి. తండ్రీకొడుకులు మృతిచెందడంతో గ్రామంలో విషాదం నెలకొంది.ఇదీ చదవండి: వారే లేని.. నేనెందుకని.. -
ఉర్దూ టీచర్.. ఈ తెలుగమ్మాయి!
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి: పుట్టింది హిందూ తెలుగు కుటుంబంలో.. అయితేనేం.. ఉర్దూ మీడియంలో చదువుకుంది. ఉర్దూ ఉపాధ్యాయిని ఉద్యోగం సాధించింది. ఆమె కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం కేంరాజ్ కల్లాలి గ్రామానికి చెందిన పొనగంటి జయశ్రీ. ఒకటి నుంచి నాలుగో తరగతి వరకు బిచ్కుంద మండల కేంద్రంలో ఉర్దూ మీడియం పాఠశాలలో చదువుకున్న జయశ్రీ.. ఐదో తరగతి నుంచి పదో తరగతి వరకు బాన్సువాడలోని ఎస్సీ హాస్టల్లో ఉంటూ అక్కడి జెడ్పీహైస్కూల్లో చదువుకుంది.ఇంటర్ బాన్సువాడలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో చదువుకుని డిగ్రీ బోధన్‌లోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో అభ్యసించింది. డిగ్రీ అయ్యాక బోధన్‌లోని ఆజాన్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్‌లో బీఈడీ పూర్తి చేసింది. గతేడాది టెట్ రాసి ఎంపికైంది. 2024–డీఎస్సీ పరీక్ష రాసి స్కూల్ అసిస్టెంట్ (ఉర్దూ) ఉద్యోగం సాధించి బుధవారం నియామక పత్రం అందుకుంది. తొలి ప్రయత్నంలోనే టెట్, డీఎస్సీలో మంచి ప్రతిభ కనబరచడం విశేషం. మాస్టారైన గొర్రెల కాపరి.. భిక్కనూరు: కష్టాలు ఎదురైతే..ఆగిపోకుండా సాగితే విజయాలు సాధ్యమని నిరూపించాడీ యువకుడు.. చదువు మానేసి గొర్రెలు కాయడానికి వెళ్లాడు.. చదువుపై ఇష్టం, స్నేహితుల ప్రోత్సాహంతో మళ్లీ చదువుకొని ప్రస్తుతం డీఎస్సీలో స్కూల్ అసిస్టెంట్‌గా ఎంపికయ్యాడు. ఆ విజేత భిక్కనూరుకు చెందిన కోరే కుమార్. గ్రామానికి చెందిన కోరే కమల–బీరయ్య దంపతులకు ఒక కొడుకు కుమార్, కుమార్తె ఉన్నారు.పేద కుటుంబం కావడంతో నాలుగో తరగతిలోనే తల్లిదండ్రులు కుమార్ చదువు మాన్పించారు. దీంతో ఆయన గొర్రెలు కాయడానికి వెళ్లేవాడు. ఈ క్రమంలో చదువుపై మక్కువతో 2014లో ఓపెన్‌లో పదో తరగతి పరీక్షలు రాసిన కుమార్ పాసయ్యాడు. భిక్కనూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్లో సీఈసీ, కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో డిగ్రీ పూర్తి చేశాడు. నిజా మాబాద్‌లోని సారంగపూర్ కళాశాలలో బీఈడీ పూర్తి చేశాడు. డీఎస్సీలో ఉత్తమ ర్యాంకు సాధించి సోషల్ విభాగంలో స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగం సాధించాడు.చదవండి: మీరే మా వారధులు: డీఎస్సీ నియామక పత్రాల పంపిణీ సభలో సీఎం రేవంత్ పట్టుపట్టి.. కొలువు కొట్టి రేగోడ్(మెదక్): ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంటూ తన లక్ష్యాన్ని చేరుకున్నాడు ఓ గిరిజన బిడ్డ. మండలంలోని కాకంచ తండాకు చెందిన రవికుమార్ స్కూల్ అసిస్టెంట్‌గా జిల్లా మొదటి ర్యాంకు సాధించి బుధవారం నియామకపత్రం అందుకున్నాడు. ఈసందర్భంగా ఆయన ఆయన మాట్లాడుతూ.. తన పన్నెండేళ్ల కల నెరవేరిందని సంతోషం వ్యక్తం చేశాడు. ఉపాధ్యాయ వృత్తిలోకి రావాలని ఎన్నో కలలు కన్నానని చెప్పాడు. తన ఇంట్లో పలువురు ఉన్నత ఉద్యోగాల్లో ఉండగా.. మరికొందరు ఉన్నత చదువులు చదువుతున్నారని తెలిపారు. నాన్నకు ప్రేమతో.. రేగోడ్(మెదక్): నాన్న ప్రోత్సాహంతో చిన్నప్పటి నుంచి ఉపాధ్యాయుడుగా కావాలన్న కల నెరవేరిందని స్కూల్ అసిస్టెంట్‌గా నియామకపత్రం అందుకున్న జిల్లా మొదటి ర్యాంకు ఉపాధ్యాయుడు రేగోడ్ గ్రామానికి చెందిన మహేశ్ తెలిపారు. 2018లో ఉద్యోగం రాలేదని, పట్టు వదలకుండా చదివి ప్రస్తుతం సాధించానని ఆనందం వ్యక్తం చేశాడు. -
పార్టీ వ్యవహారాలపై ఎమ్మెల్యే రమణారెడ్డి విసుగు చెందారా?
-
కామారెడ్డిలో దారుణం.. విద్యార్థినిని వేధించిన పీఈటీ
-
కామారెడ్డి: ప్రైవేట్ స్కూల్ వద్ద ఉద్రిక్తత.. సీఐపై రాళ్ల దాడి
సాక్షి, కామారెడ్డి: జీవ్దాన్ ప్రైవేట్ స్కూల్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. విద్యార్థిని పట్ల పీఈటీ అసభ్యంగా ప్రవర్తించాడని.. రూమ్‌లో బంధించి విద్యార్థినిని వేధించాడంటూ పాఠశాల వద్ద తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. విద్యార్థి సంఘాల నాయకులు.. స్కూల్ అద్దాలను ధ్వంసం చేశారు.అడ్డుకున్న సీఐ చంద్రశేఖర్‌పై ఆందోళనకారులు రాళ్లతో దాడి చేశారు. సీఐకి తీవ్ర రక్తస్రావం కావడంతో ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో లాఠీఛార్జ్ చేసి ఆందోళనకారులను పోలీసులు చెదరగొట్టారు. పీఈటీ నాగారాజుపై కఠిన చర్యలు తీసుకోవాలని, పాఠశాల గుర్తింపు రద్దు చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.ఇదీ చదవండి: హలో.. సైబర్ సెక్యూరిటీ బ్యూరో.. -
డబ్బు కట్టలేదని కుట్లు విప్పేశారు
కామారెడ్డి టౌన్: గాయాలకు కుట్లు వేసినందుకు డబ్బులు చెల్లించకపోవడంతో ఆస్పత్రి సిబ్బంది రోగిపై దాడి చేసి, కుట్లు విప్పేశారు. కామారెడ్డి పట్టణంలోని అపెక్స్ ఆస్పత్రిలో ఆదివారం ఈ ఘటన చోటు చేసుకుంది. పట్టణానికి చెందిన శ్రీను అనే వ్యక్తి బైక్‌పై వెళుతూ అదుపుతప్పి కిందపడిపోయాడు. గాయాలు కావడంతో పట్టణంలోని అపెక్స్ ఆస్పత్రికి వెళ్లాడు. కన్సల్టేషన్ ఫీజు కింద రూ.300 చెల్లించాడు. ఆస్పత్రి సిబ్బంది అతని గాయాలకు కుట్లు వేసి.. వెయ్యి రూపాయలు బిల్లు వేశారు. అయితే బాధితుడి వద్ద నగదు లేకపోవడంతో క్రెడిట్ కార్డు ద్వారా చెల్లిస్తానని చెప్పాడు. ఆస్పత్రి సిబ్బంది దీనికి అంగీకరించకపోవడంతో వాగ్వాదం జరిగింది. దీంతో ఆగ్రహించిన ఆస్పత్రి సిబ్బంది బాధితుడితో పాటు అతడి స్నేహితులపై దాడికి పాల్పడ్డారు. ఈ చర్యతో ఆస్పత్రి వద్ద ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. చివరికి రోగికి వేసిన కుట్లు విప్పేసి పంపించారు. ఆస్పత్రి సిబ్బంది తీరుపై బాధితుడు ఆందోళనకు దిగాడు. సుమారు అరగంటపాటు అతని ఆందోళన కొనసాగింది. అనంతరం బాధితుడు పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లి వైద్యం చేయించుకున్నాడు. -
ప్రేమ జంట ఆత్మహత్య
-
కలిసి బతకలేమని.. ప్రేమ ప్రయాణం విషాదాంతం
సాక్షి, కామారెడ్డి: కామారెడ్డి జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ప్రేమ జంట ఆత్మహత్య చేసుకోవడం స్థానికులను ఆవేదనకు గురిచేసింది. తమ ప్రేమకు పెద్దలు ఒప్పుకోకపోవడంతోనే ప్రేమ జంట ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది.వివరాల ప్రకారం.. దోమకొండ మండలం అంబర్పేట్ గ్రామానికి చెందిన వీణ(23), కోనాపూర్ గ్రామానికి చెందిన సాయి(24) కొద్ది రోజులుగా ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమ గురించి చెప్పి.. ఇరు కుటుంబాలను ఒప్పించి పెళ్లి చేసుకోవాలని ఇద్దరూ భావించారు. కానీ, వీరి ప్రేమను పెద్దలు ఒప్పుకోలేదు. దీంతో, మనస్థాపానికి గురయ్యారు.ఈ క్రమంలోనే శుక్రవారం సాయంత్రం కోనాపూర్‌లో చెట్టుకు ఉరివేసుకుని సాయికుమార్, అంబర్‌పేట్‌లోని తన ఇంట్లో దూలానికి ఉరేసుకుని వీణా ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో, ఇరు కుటుంబాల్లో విషాదచాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. ఆత్మహత్యల సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. పోస్టుమార్టం కోసం మృతదేహాలను స్థానిక కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్ని దర్యాప్తు చేపట్టినట్టు పోలీసులు తెలిపారు. ఇది కూడా చదవండి: జానీ భార్య అయేషా అరెస్ట్‌కు రంగం సిద్ధం! -
రీల్స్ పిచ్చి: పాము కాటుకు యువకుడు బలి
సాక్షి,కామారెడ్డిజిల్లా: సోషల్‌మీడియాలో పాపులర్ అవ్వాలన్న కోరిక మరో ప్రాణాన్ని బలిగొన్నది. సాహసం చేసి పేరుతెచ్చుకునే మాట అటుంచితే యుక్త వయస్సులోనే ఆయుష్షు పూర్తయిపోయింది. కామారెడ్డి జిల్లా దేశాయిపేటలో శుక్రవారం(సెప్టెంబర్6) విషాద ఘటన జరిగింది. సోషల్‌మీడియాలో వైరల్ అయ్యేందుకు శివరాజు అనే యువకుడు ఏకంగా విష సర్పాన్నే నోటితో కరిచి పట్టుకున్నాడు. ఈ దృశ్యాలను వీడియో తీయాల్సిందిగా స్నేహితులకు చెప్పాడు. ఇంకేముంది షరామామూలుగానే పాము తన సహజ స్వభావంతో యువకున్ని కాటు వేసింది. దీంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిన శివరాజును చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శివరాజు తుద్విశ్వాస విడిచాడు. యువకుడు అకారణంగా చనిపోవడంపై కుటుంబసభ్యులు కనీరుమున్నీరవుతున్నారు. పాముకాటుతో మృతిచెందిన శివరాజు ఇటీవల పాములు పట్టడంలో శిక్షణ పొందుతున్నట్లు తెలిసింది. -
పలు సంస్థలకు 125 ఎకరాల ప్రభుత్వ భూములు
సాక్షి, హైదరాబాద్: వివిధ ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల అవసరాల నిమిత్తం 125 ఎకరాల ప్రభుత్వ భూములను కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ రాష్ట్ర భూమి నిర్వహణ అథారిటీ ఆమోదం మేరకు భూ ముల కేటాయింపు చేసినట్లు రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిత్తల్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. నల్లగొండ, యాదాద్రి జిల్లాల్లో ఇండస్ట్రియల్ పార్కులు, ఖమ్మం జిల్లాలో వైద్య కళాశాల, గురుకుల పాఠశాల, పలుచోట్ల ఎస్ఐబీ విభాగం కార్యాలయాలు, నివాస క్వార్టర్ల నిర్మాణం, కామారెడ్డిలో ట్రాఫిక్ శిక్షణా కేంద్రం ఏర్పాటు కోసం ఈ భూములను సర్కార్ కేటాయించింది. టీజీఐఐసీ, స్వామి నారాయణ గురుకుల పాఠశాల, ఎస్ఐబీకి ఇచి్చన భూములను మార్కెట్ విలువ ధర ప్రకారం కేటాయించగా పలు ప్రభుత్వ సంస్థలకు ఇచ్చిన భూములతోపాటు అంతర్జాతీయ క్రికెట్ క్రీడాకారుడు సిరాజ్‌కు ఉచితంగా కేటాయించింది. ఏ సంస్థకు ఎంత భూమి అంటే.. నల్లగొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడులో తెలంగాణ పారిశ్రామిక మౌలి క సదుపాయాల కల్పనా సంస్థ (టీజీఐఐసీ)కు 61.18 ఎకరాలను కేటాయించింది. ఇందుకోసం ఎకరానికి రూ.6.4 లక్షల చొప్పున మొత్తం రూ. 3.93 కోట్లను ప్రభుత్వానికి టీజీఐఐసీ చెల్లించాల్సి ఉంటుంది. ఈ స్థలంలో పారిశ్రామిక పార్కు ఏర్పాటు కానుంది. అలాగే యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలోని దండు మల్కాపురంలో 6.23 ఎకరాలను కూడా ఈ సంస్థకు పారిశ్రామిక పార్కు కోసం ఇచి్చంది. ఈ స్థలం కోసం ఎకరం రూ. 20 లక్షల చొప్పున మార్కెట్ ధరను రాష్ట్ర ప్రభుత్వానికి టీజీఐఐసీ చెల్లించనుంది.మరోవైపు ఖమ్మం అర్బన్ మండలం బల్లేపల్లితోపాటు రఘునాథపాలెం మండల కేంద్రంలో మొత్తం 35.06 ఎకరాలను ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటు కోసం డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్‌కు కేటాయించింది. అలాగే రఘునాథపాలెం మండల కేంద్రంలో 13.10 ఎకరాల భూమిని స్వామి నారాయణ గురుకుల అంతర్జాతీయ స్కూల్ ఏర్పాటు కోసం కేటాయించినట్లు ప్రభుత్వం తెలిపింది. అక్కడ ఎకరం మార్కెట్ విలువ సుమారు రూ. కోటి ఉన్నప్పటికీ రూ. 11.25 లక్షలకే ఆ సంస్థకు అప్పగించాలన్న ఖమ్మం జిల్లా కలెక్టర్ ప్రతిపాదన మేరకు ఆ భూమిని కేటాయించింది. ఇందుకుగాను ఈ పాఠశాలలోని 10 శాతం సీట్లను జిల్లా కలెక్టర్ విచక్షణ కోసం (ఉచిత విద్య కోసం) రిజర్వు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఉచిత కేటాయింపులు ఇలా.. ⇒ నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలంలోని చించోలి (బి) గ్రామంలో సాంఘిక సంక్షేమ మహిళా డిగ్రీ కళాశాల నిర్మాణం కోసం టీజీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్కు 6 ఎకరాలు. ⇒ కామారెడ్డి జిల్లా క్యాసంపల్లిలో ట్రాఫిక్ శిక్షణా కేంద్రం ఏర్పాటు కోసం హోంశాఖకు 3 ఎకరాలు. ⇒అంతర్జాతీయ క్రికెట్ క్రీడాకారుడు మహ్మద్ సిరాజ్‌కు హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నం.78 (షేక్‌పేట మండలం)లోని ప్రశాసన్‌నగర్‌లో 600 గజాల ఖాళీ స్థలం. -
కూతురి కోసం పంటనే పండించింది
తల్లిగుణం అందరి మేలు కోరుతుంది. కూతురి అనారోగ్య సమయంలో డ్రాగన్ ఫ్రూట్ తినిపించాలని వెతికితే దాని ఖరీదు సామాన్యులకు అందుబాటులో లేదనిపించిందామెకు. తన కూతురు లాంటి వాళ్లు ఎందరో ఈ పండుకు దూరం కావలసిందేనా అని బాధ పడింది. పట్టుదలతో ఏకంగా పంటే పండించింది. డ్రాగన్ ఫ్రూట్ రైతు రేణుక కథ ఇది.‘మీ అమ్మాయికి ప్లేట్లెట్స్ బాగా పడిపోయాయి. ప్లేట్లెట్స్ పెరగడానికి డ్రాగన్ ఫ్రూట్ తినిపించమ్మా’ అని డాక్టర్ చెప్పిన మాట ఆ తల్లిని డ్రాగన్ పంట స్వయంగా సాగు చేసే వరకు తీసుకువెళ్లింది. కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం సంగమేశ్వర్ గ్రామానికి చెందిన రేణుక, పరశురాములు దంపతులకు ఒక కూతురు, ఇద్దరు కుమారులు. ఇంటర్ చదువుతున్న కూతురు విజయకు కరోనా కాలంలో సుస్తీ చేసింది. కామారెడ్డి పట్టణంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. ప్లేట్లెట్స్ తగ్గిపోయాయని గుర్తించిన వైద్యులు ప్లేట్లెట్స్ పెర గడానికి డ్రాగన్ ఫ్రూట్ తినిపించమని చె΄్పారు. దాంతో తల్లి రేణుక కామారెడ్డి పట్టణంలో పండ్ల దుకాణాలన్నింటా డ్రాగన్ ఫ్రూట్ కోసం తిరిగితే ఎక్కడా దొరకలేదు. ఆఖరుకు ఒక సూపర్ మార్కెట్లో దొరికాయి. ఒక్కో పండు రూ.180 చె΄్పారు. అంత ఖరీదా అని ఆశ్చర్యపోయింది రేణుక. అంత రేటు పెట్టాల్సి వచ్చినందుకు చిన్నబుచ్చుకుంది. అయినా సరే కొనుగోలు చేసి తీసుకువెళ్లి కూతురికి తినిపించింది. ఆమె ఆరోగ్యం మెరుగుపడిన తరువాత ఆస్పత్రి నుంచి ఇంటికి తీసుకువెళ్లారు.మనం ఎందుకు పండించకూడదు?రేణుకకు చదువు లేదు. కానీ వ్యవసాయం మీద మంచి పట్టు ఉంది. రేణుక భర్త పరశురాములు కూడా చదువుకోకున్నా ఆధునిక పద్ధతుల్లో వ్యవసాయం చేయాలన్న ఆశ ఉంది. అంతవరకూ సంప్రదాయ సేద్యం చేస్తున్న ఆ ఇద్దరూ కూర్చుని ‘డ్రాగన్ ఫ్రూట్’ గురించి చర్చించుకున్నారు. ‘మనం పండించి తక్కువకు అమ్ముదాం’ అంది రేణుక. ఆ తర్వాత భర్తతో కలిసి డ్రాగన్ ఫ్రూట్ సాగు పద్ధతుల గురించి పిల్లలతో కలిసి యూ ట్యూబ్‌లో చూసింది. ఆ పంట పండించాలన్న నిర్ణయానికి వచ్చిన రేణుక, పరశురాములు జగిత్యాల జిల్లాలోని అంతర్గాంలో డ్రాగన్ ఫ్రూట్ కు సంబంధించిన మొలకలు దొరుకుతాయని తెలుసుకున్నారు. ఓ రోజు అక్కడికి వెళ్లి పంట సాగు గురించి వారితో మాట్లాడారు. ఎకరంలో సాగు చేయడానికి ఎంత ఖర్చు అవుతుందో, ఎన్ని మొక్కలు అవసరమవుతాయో అడిగి తెలుసుకున్నారు. వాళ్లిచ్చిన సూచనల మేరకు ఇంటికి చేరుకున్న తరువాత ఎకరం పొలం దుక్కి దున్నారు. చుట్టూరా ఇనుపజాలీతో కంచె ఏర్పాటు చేశారు. మొక్కల కోసం స్తంభాలు, కర్రలను ఏర్పాటు చేసుకున్నారు. అలాగే డ్రిప్ సౌకర్యం కల్పించుకున్నారు. పొలం తనఖా పెట్టి రూ.3 లక్షలు, అలాగే డ్వాక్రా సంఘం నుంచి రూ. 2 లక్షలు అప్పు తీసుకుని పంట సాగు మొదలుపెట్టారు.43 పండ్లు దక్కాయిపంట సాగు చేసిన తొలి ఏడాది నలబై మూడు పండ్లు మాత్రమే చేతికందాయి. దాంతో మరిన్ని మెళకువలు తెలుసుకుని మరింత కష్టపడి సాగు చే యడంతో రెండో ఏడాదికి వచ్చేసరికి 15 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. దళారులకు అమ్మితే గిట్టుబాటు కాదని భార్య, భర్త ఇద్దరూ గంపల్లో పండ్లను పెట్టుకుని సిద్దిపేట, మెదక్, కామారెడ్డి తదితర పట్టణాలకు తీసుకు వెళ్లి ఒక్కో పండు. వంద నుంచి రూ.150 వరకు అమ్ముకుంటే రూ.2 లక్షల వరకు ఆదాయం వచ్చింది. ఈసారి రూ.4 లక్షలు ఆదాయం సమకూరుతుందన్న నమ్మకంతో ఉన్నారు. పది పదిహేనేళ్లపాటు పంట వస్తుందని, తాము అనుకున్నదానికన్నా ఎక్కువే సంపాదిస్తామన్న ధీమాతో ఉన్నారు.– ఎస్.వేణుగోపాలాచారి, సాక్షి, కామారెడ్డి -
ఎటీఎం మెషిన్ ఎత్తుకెళ్లిన దొంగలు
-
ఆసుపత్రిలో అమానుషం
-
రిజర్వేషన్ల పితామహుడు..
భారత దేశంలో దళితులు, బీసీల వంటి సామాజికంగా వెనుకబడిన వర్గాలవారి ఉన్నతికి ప్రభుత్వ పరంగా ఇప్పుడు కొనసాగిస్తున్న అనేక సదుపాయాలు, హక్కులను 19వ శతాబ్దంలోనే తన కొల్హాపూర్ సంస్థాన ప్రజలకు అందించినవాడు సాహు మహరాజ్. 1894 ఏప్రిల్ 2న సింహాసనం అధిష్టించిన సాహు, వెనుకబడిన కులాల వారందరికీ పాఠశాలలు, వసతి గృహాలు ప్రారంభించి విద్యాబోధనను ఒక ఉద్యమంగా నడిపాడు.1902 జులై 26, భారతదేశ చరిత్రలో ఒక చరిత్రాత్మక దినం. ఆ రోజు ఛత్రపతి సాహు మహారాజ్ ప్రభుత్వం, ప్రభుత్వోద్యోగాలన్నింటిలో వెనుకబడిన వర్గాల వారికి 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ సంచలనాత్మక ఉత్తర్వులను జారీ చేసింది. గ్రామ పరిపాలన రంగంలో వంశపారం పర్యంగా వచ్చే ముఖ్యులైన పటేల్ (పాటిల్), పట్వారీ (కులకర్ణి) వ్యవస్థని 1918లో రద్దు చేశారు.1919 సెప్టెంబర్ 6న అంటరానితనం పాటించడం నేరమని ప్రభుత్వం ప్రకటన ఇచ్చింది. 1920 మే 3వ తేదిన వెట్టిచాకిరీ వ్యవస్థను రద్దు చేస్తూ చట్టం చేశారు. అంబేడ్కర్ అస్పృశ్యుల హక్కుల సాధన కోసం స్థాపించిన ‘మూక్ నాయక్’ పత్రికకు ఆర్థిక సాయం చేశారు. 1920లో అంబేడ్కర్ ఇంగ్లాండ్ వెళ్లి చదువుకునేందుకు ఆర్థిక సహాయం చేశాడు. బాలికల కోసం ప్రత్యేకంగా పాఠశాలలు ప్రారంభించాడు. 1919 జూన్‌లో బాల్య వివాహాల రద్దు చట్టం వచ్చింది.1919 జులై 12న కులాంతర, వర్ణాంతర వివాహాలను చట్టబద్ధం చేస్తూ చట్టం తెచ్చాడు. విడాకులు మంజూరు చేయడంలో స్త్రీల నిర్ణయానికే ప్రాధాన్యతనిస్తూ 1919 ఆగస్టు 2న విడాకుల చట్టం చేశాడు. 1920 జనవరి 17న జోగిని, దేవదాసీ వ్యస్థను రద్దు చేశాడు. ప్రభుత్వం దేవదాసీల పునరావాసానికి చర్యలు తీసుకున్నాడు. 1918లో తన రాజ్యంలో వడ్డీ వ్యాపారాన్ని పూర్తిగా నిషేధిస్తూ సహకార సంఘాలను ఏర్పాటు చేశాడు. మహారాజుగా అనేక సంస్కరణలు తీసుకొచ్చిన రిజర్వేషన్ల పితామహుడు సాహు మహరాజ్ 1922 మే 6న మరణించాడు. – సంపత్ గడ్డం, కామారెడ్డి జిల్లా (నేడు సాహు మహరాజ్ జయంతి) -
పండుటాకులకు ‘చేయూత’ !
సాక్షి, కామారెడ్డి: పింఛన్‌దారుల కష్టాలకు పుల్‌స్టాప్ పెట్టేందుకు ప్రభుత్వం మరిన్ని చర్యలు చేపట్టింది. చేయూత ద్వారా అందుతున్న పింఛన్లు సొంతూళ్లలోనే తీసుకుంటున్నారా? వేరే ఊళ్లకు వెళ్లాల్సి వస్తుందా? అన్నదానిపై క్షేత్ర స్థాయిలో పరిశీలన జరుగుతోంది. కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని దేవునిపల్లి గ్రామానికి చెందిన లబ్దిదారులకు ఎల్లారెడ్డిలో, ఎల్లారెడ్డి మున్సిపల్ పరిధిలోని దేవునిపల్లికి చెందిన లబ్దిదారులకు కామారెడ్డిలో పింఛన్లు ఇస్తున్న విషయంపై ఈ నెల 18న ‘పింఛన్ కోసం 50 కిలోమీటర్లు’శీర్షికన ‘సాక్షి’మెయిన్‌లో ప్రచురితమైన కథనంతో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ స్పందించారు. పింఛన్‌దారుల కష్టాలపై వెంటనే అధికారులను నివేదిక అడిగారు. ఇదే సమయంలో జిల్లాలోని కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ మున్సిపాలిటీలతో పాటు ఆయా మండలాల్లో ఒక చోట పింఛన్ మంజూరై, మరో చోట పింఛన్ తీసుకుంటూ ఇబ్బందులు పడుతున్న పింఛన్‌దారుల వివరాలను సేకరించాలని ఆదేశించారు. దీంతో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి బి.చందర్ ఆయా మున్సిపల్ కమిషనర్లు, ఆయా మండలాల ఎంపీడీవోలకు ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 21న సాయంత్రం 4 గంటలలోపు వివరాలను మెయిల్ చేయడంతో పాటు సాఫ్ట్ కాపీ అందించాలని ఆదేశించారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో క్షేత్ర స్థాయిలో వివరాలు సేకరిస్తున్నారు. దీనిపై శుక్రవారం సాయంత్రానికి స్పష్టత రానుంది. తీరనున్న పండుటాకుల కష్టాలు... పింఛన్ కోసం పండుటాకులు పడుతున్న కష్టాలకు త్వరలోనే పరిష్కారం దొరకనుంది. ‘సాక్షి’కథనంతో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులు సీరియస్‌గా స్పందించారు. ఏడాదిన్నర కాలంగా సమస్య ఉంటే ఎందుకు పరిష్కరించలేదని సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. జాబితా రూ పొందించిన తరువాత చేయూత పింఛన్‌దారులకు వారి వారి గ్రామాల్లోనే పింఛన్ అందే ఏర్పాట్లు చేయనున్నారు. దీంతో వారి కష్టాలు తీరుతాయని భావిస్తున్నారు. -
కామారెడ్డి జిల్లాలో సహకార బ్యాంకు అధికారుల కాఠిన్యం
-
పైకి ధీమా.. లోన టెన్షన్!
సాక్షి, కామారెడ్డి: ఓట్ల లెక్కింపునకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ నేతల్లో టెన్షన్ పెరుగుతోంది. పైకి గెలుపు ధీమాతో ఉన్నట్లు కనిపిస్తున్నప్పటికీ ఫలితం ఎలా ఉంటుందోనని లోలోన టెన్షన్ పడుతున్నా రు. ఎగ్జిట్ పోల్స్ వెలువడిన నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా జోరుగా చర్చలు నడుస్తున్నాయి.జహీరాబాద్ లోక్‌సభ నియోజక వర్గం భిన్న సంస్కృతులకు నిలయం. ఇక్కడ ఒక పర్యాయం కాంగ్రెస్ విజయం సాధించగా, రెండుసార్లు బీఆర్ఎస్ గెలుపొందింది. నాలుగోసారి జరిగిన ఎన్నికలలో ఎవరు గెలుస్తారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో గత అసెంబ్లీ ఎన్నికల్లో నాలుగు చోట్ల కాంగ్రెస్ పార్టీ గెలవగా, రెండుచోట్ల బీఆర్ఎస్, ఒక్క స్థానంలో బీజేపీ విజయం సాధించాయి. రాష్ట్రంలో అధికారంలో ఉండడం, గ్యాంరటీ పథకాల అమలు తమకు కలిసి వస్తాయని కాంగ్రెస్ భావిస్తోంది. ఆ పార్టీ అభ్యర్థి, మాజీ ఎంపీ సురేశ్ షెట్కార్ గెలుపు కోసం జోరుగా ప్రచారం చేశారు. అన్ని ప్రాంతాల్లో పార్టీ శ్రేణులు శ్రమించాయి. దీంతో గెలుపుపై కాంగ్రెస్ పార్టీ నమ్మకంతో ఉంది.జహీరాబాద్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ వరుసగా రెండుసార్లు విజయం సాధించింది. అ సెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ బలమైన క్యా డర్ ఉండడంతో పార్లమెంట్ ఎన్నికలలో గెలుస్తామ ని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. పదేళ్లు అధికారంలో ఉన్న సమయంలో అమలు చేసిన ఆసరా పింఛన్లు, రైతుబంధు వంటి పథకాల ద్వారా లబి్ధపొందినవారు తమ అభ్యర్థి గాలి అనిల్‌కుమార్‌కే ఓటేశారని, దీంతో జహీరాబాద్‌లో హ్యాట్రిక్ ఖాయమన్న ధీమాతో గులాబీ లీడర్లు ఉన్నారు.అయోధ్యలో రామాలయ నిర్మాణం అంశంతోపాటు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చరిష్మాను నమ్ముకున్న బీజేపీ సైతం జహీరాబాద్ స్థానంపై ఆశలు పెట్టుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఒక్క కామారెడ్డిలోనే ఆ పార్టీ విజయం సాధించింది. అయితే ఓటర్లు మూడోసారి మోదీ రావాలని బలంగా కోరుకున్నారని, దీంతో మారుమూల గ్రామాల్లో సైతం తమకు అనుకూల వాతావరణం ఏర్పడిందని బీజేపీ శ్రేణులు పేర్కొంటున్నాయి. ఈసారి జహీరాబాద్‌లో ఎగిరేది కాషాయ జెండానే అని ధీమా వ్యక్తం చేస్తున్నారు. హ్యాట్రిక్ విజయంపై ఆ పార్టీ అభ్యర్థి బీబీ పాటిల్ నమ్మకంతో ఉన్నారు. విభిన్నంగా ఎగ్జిట్ పోల్స్..జహీరాబాద్ ఎంపీ స్థానంలో ఏ పార్టీ గెలుస్తుందన్న దానిపై స్పష్టత కొరవడింది. ఎగ్జిట్ పోల్స్ సంస్థలు ప్రకటించిన ఫలితాలు సైతం విభిన్నంగా ఉన్నాయి. కొన్ని సంస్థలు బీజేపీ గెలుస్తుందని చెప్పగా.. మరికొన్ని కాంగ్రెస్ వైపు మొగ్గు చూపాయి. ఒకటిరెండు సంస్థలు బీఆర్ఎస్కూ విజయావకాశాలు ఉన్నాయని పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీల నేతల్లో ఉత్కంఠ నెలకొంది. నియోజకవర్గ వ్యాప్తంగా ఎగ్జిట్‌పోల్స్‌పై జోరుగా చర్చ జరుగుతోంది. ఎగ్జిట్ పో ల్స్ ఒక్కోటి ఒక్కో తీరుగా ఫలితాలు వెలువరించిన నేపథ్యంలో ఏది నమ్మాలో తెలియని పరిస్థితుల్లో ఆయా పారీ్టల నేతలు తమ క్యాడర్ ఇచ్చి న సమాచారం ప్రకారం తమదే గెలుపంటూ ధీమాతో ఉన్నారు. మంగళవారం ఓట్ల లెక్కింపుతో అభ్యర్థుల భవితవ్యం తేలిపోనుంది.ఇవి చదవండి: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిపై కేసు -
మహిళా ఉద్యోగులపై వేధింపులు.. కామారెడ్డి DMHO సస్పెండ్
సాక్షి, కామారెడ్డి: కామారెడ్డి జిల్లా డీఎంహెచ్‌వో లక్ష్మణ్ సింగ్‌పై సస్పెన్షన్ వేటు పడింది. మహిళా వైద్యాధికారులను లైంగికంగా వేధించినట్లు రుజువుకావడంతో ఆయనను సస్పెండ్ చేస్తున్నట్లు రాష్ట్ర వైద్యారోగ్య కుటుంబ సంక్షేమ కార్యదర్శి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా వైద్యాధికారి తమతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని, లైంగికంగా వేధిస్తున్నాడని కలెక్టర్, ఎస్పీతో పాటు వైద్య శాఖ ఉన్నతాధికారులకు ఇటీవల 20 మంది మహిళా వైద్యాధికారులు ఫిర్యాదు చేశారు.ఈ ఫిర్యాదుపై స్పందించిన వైద్యశాఖ విచారణకు ఆదేశించింది. ఈ క్రమంలో రాష్ట్ర వైద్యాధికారి అమర్ సింగ్ నాయక్ బుధవారం కామారెడ్డి డీఎంహెచ్‌వో కార్యాలయానికి వచ్చి వివరాలను సేకరించారు. తమను డీఎంహెచ్‌వో ఏ విధంగా ఇబ్బంది పెట్టారన్న విషయాన్ని మహిళా ఉద్యోగులు ఆయనకు వివరించారు. దీంతో లక్ష్మణ్‌సింగ్‌పై వివిధ సెక్షన్ల కింద మొత్తం ఏడు కేసులు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. మహిళా మెడికల్ ఆఫీసర్లను లక్ష్మణ్ సింగ్ వేధిస్తున్నాడని తేలడంతో ఆయన్ను సస్పెండ్ చేశారు. -
కేవీఆర్‌కు పెరిగిన క్రేజ్
సాక్షి, కామారెడ్డి: కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి నియోజకవర్గంలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. పార్టీ అభివృద్ధి కోసం ఐదారేళ్లుగా ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నారు. మహిళా సంఘాలకు రావాల్సిన వడ్డీ రాయితీ కోసం కొట్లాడారు. కామారెడ్డి మాస్టర్ ప్లాన్ ప్రతిపాదనల్లోని డొల్లతనాన్ని వెలికితీశారు. రైతు సమస్యలపై గళమెత్తారు. ఇలా ప్రజా సమస్యలపై అలుపెరుగని పోరు చేసి నియోజకవర్గంలో బలమైన నాయకుడిగా ఎదిగారు. బీజేపీ అంటే గిట్టని వారు సైతం వెంకటరమణారెడ్డి వివిధ సమస్యలపై చేపట్టిన నిరసన కార్యక్రమాలకు సపోర్ట్ చేయడం గమనార్హం.కేసీఆర్, రేవంత్‌రెడ్డిలను ఓడించి..అసెంబ్లీ ఎన్నికల్లో అప్పటి సీఎం కేసీఆర్, అప్పటి పీసీసీ అధ్యక్షుడు, ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి కామారెడ్డి నుంచి బరిలో దిగినా వెంకటరమణారెడ్డి ఎక్కడా తగ్గలేదు. ఇద్దరినీ ఓడిస్తానని శపథం చేశారు. ఇద్దరు ఉద్ధండులతో జరిగిన పోరులో వెంకటరమణారెడ్డి మూడో స్థానానికి వెళ్లడం ఖాయ మని అందరూ భావించారు. అయితే అందరి అంచనాలను తలకిందులు చేస్తూ వెంకటరమణారెడ్డి జెయింట్ కిల్లర్‌గా అవతరించారు. ఈ విజయంతో ఆయన దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. వెంకటరమణారెడ్డి వాక్ చాతుర్యం, పోరాట పటిమే ఆయనను గెలిపించాయని బీజేపీ నాయకత్వం గుర్తించింది. దీంతో పార్టీ ఆయనకు క్రియాశీలక బాధ్యతలు అప్పగించింది. అయోధ్యలో బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా ఏర్పాటు చేసిన శ్రీరామ తీర్థ క్షేత్ర ట్రస్ట్‌కు రాష్ట్ర కన్వీనర్‌గా కేవీఆర్‌ను నియమించారు. దానికోసం రాష్ట్ర రాజధానితో పాటు వివిధ ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. ఆ కార్యక్రమం ముగియగానే లోక్‌సభ ఎన్నికలు రావడంతో జహీరాబాద్ నియోజకవర్గ ఎన్నికల ఇన్‌చార్జీగా బీజేపీ ఆయనకు బాధ్యతలు అప్పగించింది. దాదాపు మూడు నెలలపాటు జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో పర్యటించి, పార్టీ నేతలతో సమావేశాలు నిర్వహించి ఎన్నికలకు సన్నద్ధం చేశారు. నేతల మధ్య సమన్వయం కుది ర్చారు. ఎన్నికల సభలు, ప్రచార కార్యక్రమాలలో చురుకుగా పాల్గొని శ్రేణుల్లో హుషారు పెంచారు. చేవెళ్ల, మహబూబ్‌నగర్, ఖమ్మం, భువనగిరి తదితర పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో నిర్వహించిన పలు సభల్లో ప్రసంగించారు. ప్రస్తుతం నల్గొండ–వరంగల్ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. బీజేపీ ఆయనకు ఉమ్మడి వరంగల్ ఇన్చార్జి బాధ్యతలు అప్పగించింది. దీంతో ఆయన ఉమ్మడి వరంగల్ జిల్లాలో పార్టీ ప్రచార బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.జహీరాబాద్ లోక్‌సభ నియోజకవర్గంలో బీజేపీకి పెద్దగా ఓటు బ్యాంకు లేదు. కొన్ని ప్రాంతాల్లో నాయకత్వ సమస్య వేధిస్తోంది. అలాంటి పరిస్థితుల్లో లోక్‌సభ ఎన్నికల ఇన్‌చార్జీగా నియమితులైన వెంకటరమణారెడ్డి.. దాదాపు మూడు నెలల పాటు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. పార్టీ నేతలు, కార్యకర్తలతో పలు సమావేశాలు నిర్వహించారు. జహీరాబాద్, అందోల్, నారాయణఖేడ్, జుక్కల్, ఎల్లారెడ్డి, బాన్సువాడ, కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో క్యాడర్‌తో జరిగిన సమావేశాల్లో పాల్గొని ఎన్నికల్లో గెలవడం కోసం వ్యవహరించాల్సిన వ్యూహాల గురించి వివరించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కలిపి 1,72,766 ఓట్లు మాత్రమే వచ్చాయి. పార్లమెంట్ స్థానంలో పార్టీ గెలవాలంటే మరో నాలుగు లక్షల ఓట్లు సంపాదించాల్సి ఉంటుంది. ఇలాంటి సమయంలో ఇన్చార్జి బాధ్యతలు మోసిన వెంటరమణారెడ్డి పార్టీ అభ్యర్థి తరఫున పార్లమెంటు నియోజక వర్గం అంతటా కలియతిరిగారు. ఈ ఎన్నికలలో బీబీ పాటిల్ గెలిస్తే బీజేపీలో వెంకటరమణారెడ్డి ప్రాధాన్యత మరింత పెరుగుతుందని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి.పాటిల్ గెలిస్తే మరింత ప్రాధాన్యత కామారెడ్డి అసెంబ్లీ స్థానంలో ఇద్దరు ఉద్ధండులను ఓడించి జెయింట్ కిల్లర్‌గా మారిన కాటిపల్లి వెంకటరమణారెడ్డికి బీజేపీలో మంచి ప్రాధాన్యత లభిస్తోంది. ఎమ్మెల్యేగా గెలిచిన తొలినాళ్లలోనే అయోధ్య రామాలయ ప్రారంభ వేడుకల కోసం ఏర్పాటు చేసి అయోధ్య శ్రీరామ తీర్థ క్షేత్ర ట్రస్ట్ రాష్ట్ర కన్వీనర్‌గా నియమించారు. ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో జహీరాబాద్ లోక్‌సభ నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జీగా వ్యవహరించారు. ఆయన సమర్థతను గుర్తించిన బీజేపీ.. ప్రస్తుతం జరుగుతున్న నల్గొండ–వరంగల్ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్చార్జి బాధ్యతలను అప్పగించింది. -
తెలంగాణను అసమర్థులు ఏలుతున్నారు: కేసీఆర్
సాక్షి,కామారెడ్డి: సీఎం రేవంత్ కామారెడ్డి జిల్లాను తీసేయాలని చూస్తున్నాడని, కామారెడ్డి జిల్లా ఉండాలంటే జహీరాబాద్ ఎంపీ సీటు బీఆర్ఎస్ గెలవాలని బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. మంగళవారం(మే7) కామారెడ్డి జేపీఎన్ చౌరస్తాలో నిర్వహించిన రోడ్‌షోలో కేసీఆర్ మాట్లాడారు. ’తెలంగాణకు మోది చేసింది ఏమీ లేదు. బీజేపీ పరిపాలనలో తెలంగాణకు ఎలాంటి న్యాయం జరగలేదు. బీజేపీ పెట్టుబడిదారుల పార్టీ. బీజేపీ మత విద్వేషాలతో ప్రజల మధ్య చిచ్చు పెడుతోంది. కాంగ్రెస్ ఇచ్చిన హమీలు నేరేవేర్చే స్దితిలో లేదు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రాష్ట్రంలొ ఎక్కడా చూసినా కరెంట్ కోతలు. వరి బోనస్ ...బోగస్‌గా మారింది.అసమర్దులు రాష్ట్రాన్ని ఏలుతున్నారు. ఇచ్చిన హమీలు నేరవేర్చడం లేదు. కాంగ్రెస్ పాలనలో ఐదు నెలలకే రాష్ట్రం ఆగమైపోయింది. బీఅర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలన్నింటిని రద్దు చేశారు. కేంద్రంలో రాబోయేది సంకీర్ణ ప్రభుత్వమే’నని కేసీఆర్ స్పష్టం చేశారు. -
KamaReddy: ఊరంతా చుట్టాలే !
సాక్షి, కామారెడ్డి: ఆ ఊర్లలో కుటుంబాలన్నీ ఒకే సామాజిక వర్గానికి చెందినవి. ఇంటి పేరు వేరైనా, దాదాపు అన్ని కుటుంబాలతో బంధుత్వం ఉండే ఉంటుంది. ఎవరికి ఏ ఆపద వచ్చినా ఒకరికొకరు అండగా నిలుస్తారు. ఏవైనా విభేదాలొస్తే అక్కడే పరిష్కరించుకుంటారు. కామారెడ్డి జిల్లాలో ఉన్న ఆ నాలుగు ఊళ్లపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.. కామారెడ్డి మండలంలోని కొటాల్పల్లి, భిక్కనూరు మండలంలోని అయ్యవారిపల్లి, లింగంపేట మండలంలోని నాగారం, గాంధారి మండలంలోని నర్సాపూర్ గ్రామాల్లో ఒకే సామాజిక వర్గానికి చెందిన కుటుంబాలు ఉన్నాయి. ఆ ఊళ్లలో అన్ని రాజకీయ పార్టీలు ఉన్నా... ఎన్నికల వరకే రాజకీయాలు. ఆ తరువాత అందరూ కలిసే ఉంటారు. ఏమైనా విభేదాలొస్తే స్థానికంగానే పరిష్కరించుకుంటారు. ఆ గ్రామాల నుంచి గొడవలతో పోలీసు స్టేషన్ దాకా వెళ్లిన ఘటనలు తక్కువే. నాగారం గ్రామం మున్నూరుకాపుల కొటాల్పల్లి... కామారెడ్డి మండలంలోని కొటాల్పల్లి గ్రామంలో 101 కుటుంబాలు ఉండగా జనాభా 425. ఇక్కడ అన్నీ మున్నూరుకాపు కులానికి చెందిన కుటుంబాలే ఉన్నాయి. 255 ఎకరాల వ్యవసాయ భూము లున్నాయి. అందరూ వ్యవసాయం అందునా ఆకు కూరలు పండించడంలో సిద్ధహస్తులు. మున్నూరు కాపు కులానికి చెందిన జొనకంటి, కల్లూరి, ఆకుల, బచ్చగారి ఇంటిపేర్లతో కుటుంబాలు ఉన్నాయి. దాదాపు అన్ని కుటుంబాలకు వ్యవసాయ భూమి ఉంది. అందరూ వ్యవసాయం చేస్తారు. అయ్యవారిపల్లి గ్రామం ముదిరాజ్‌ల అయ్యవారిపల్లి.... భిక్కనూరు మండలంలోని అయ్యవారిపల్లి 2018 లో పంచాయతీగా ఏర్పడింది. 128 కుటుంబాలుండగా 683 మంది జనాభా ఉన్నారు. గ్రామంలోని అన్ని కుటుంబాలు ముదిరాజ్ కులానికి చెందినవే ఉన్నాయి. వర్షాధారంపై పంటలు సాగు చేస్తారు. బోర్లు ఉన్న రైతులు వాటిపై ఆధారపడి వరి, ఇతర పంటలు సాగుచేస్తారు. భూములు లేని వాళ్లు కొందరు వ్యవసాయ పనులకు కూలీలుగా వెళతారు. కొటాల్పల్లి గ్రామం పొలాల మధ్యన నాగారం... లింగంపేట మండలం నాగారం అనే కుగ్రామంలో 22 కుటుంబాలు, 120 మంది జనాభా ఉన్నారు. అందరూ ముదిరాజ్ సామాజికవర్గం వారే. వ్యవసాయం మీదే ఆధారపడి జీవనం సాగిస్తారు. కోర్పోల్ పంచాయతీకి అనుబంధ గ్రామం ఇది. కుల వృత్తుల వారితో పనులు ఉంటే కోర్పోల్ గ్రామానికి వెళ్లి చేయించుకుంటారు. ఊరు చుట్టూ పచ్చని పంటలు ఉంటాయి. అందరూ వ్యవసాయం చేస్తారు. అన్ని కుటుంబాల వాళ్లతో బంధుత్వం ఉంది. చుట్టూ అడవి.. నడుమ నర్సాపూర్.... గాంధారి మండలంలోని నర్సాపూర్ గ్రామం అడవి మధ్యన ఉంటుంది. ఇక్కడ 72 కుటుంబాలు ఉన్నా యి. 298 మంది జనాభా ఉన్నారు. అందరూ ముది రాజ్ వర్గం వారే. వ్యవసాయంపైనే ఆధారపడి జీవ నం సాగిస్తుంటారు. వర్షాధార పంటలు ఎక్కువగా పండిస్తారు. బోర్లు, బావులు ఉన్న వారు వరి తదితర పంటలు వేస్తున్నారు. ఎవరి పనుల్లో వారుంటారు... అందరం ఒకే కులం వాళ్లం. కలిసిమెలిసే ఉంటాం. ఎవరి పనుల్లో వారు తీరికలేకుండా ఉంటారు. ఏదైనా సమస్య వస్తే కూర్చుని మాట్లాడుకుంటాం. కూరగాయలు.. ముఖ్యంగా ఆకుకూరల సాగులో మా ఊరుకు ఎంతో పేరుంది. – బాలయ్య, కొటాల్పల్లి, కామారెడ్డి మండలం అందరం కలిసిమెలిసి ఉంటాం... మా ఊరిలో ఎవరి పని వాళ్లు చేసుకుని బతుకుతారు. ఎలాంటి గొడవలు ఉండవు. పొలం ఉన్న వాళ్లు వ్యవసాయం చేస్తారు. పొలం లేని వాళ్లు పొరుగూళ్లకు వెళ్లి కూలీ నాలీ చేసుకుని వస్తారు. ఒకే కులానికి చెందిన వాళ్లమే కావడంతో చాలా పనులు మాకుగా మేమే చేసుకుంటాం. – చిన్న రాజయ్య, అయ్యవారిపల్లి, భిక్కనూరు మండలం 3 కుటుంబాలతో ఏర్పడిన గ్రామం మా తాతల కాలంలో 3 కు టుంబాలతో గ్రామం ఏర్పడింది. తరువాత పెరిగి కుటుంబా ల సంఖ్య 22కు చేరుకుంది. అందరం ఒకే కుటుంబం నుంచి వ చ్చిన వాళ్లం. గొడవలు లేకుండా అందరం వ్యవసాయం చేసుకుని బతుకుతుంటాం. – చింతకుంట లక్ష్మీనారాయణ, నాగారం, లింగంపేట మండలం -
డ్రైవర్ గంగవ్వ!
పంచాయతీ ట్రాక్టర్‌ను నడుపుతుంది. లారీ మీద, బైక్ మీద సవారీ చేస్తుంది. పంటల సాగులోనూ అందెవేసిన చేయి కష్టాలను ఎదిరించి సొంత కాళ్ల మీద నిలబడింది. కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం సజ్జన్పల్లి గ్రామంలో గంగవ్వ గురించి అడిగితే ‘ఎవరు?’ అంటారేమో గానీ... డ్రైవర్ గంగవ్వ.. అంటే అందరికీ తెలుసు. ప్రతిరోజూ పంచాయతీ ట్రాక్టర్‌ను తీసుకుని గల్లీల్లో చెత్త సేకరణ తో పొద్దున్నే అందరినీ పలకరిస్తూ వెళుతుంది గంగవ్వ. ట్రాక్టర్ ఒక్కటే కాదు లారీ, ఆటో, కారు ఏదైనా నడపగలదు. బైక్ మీద సవారీ చేయగలదు. సొంత కాళ్ల మీద నిలబడిన గంగవ్వ ఎందరికో ఆదర్శంగా నిలిచింది. చదువుకుంటూనే డ్రైవర్‌గా! సజ్జన్పల్లి గ్రామానికి చెందిన పుట్టి నాగయ్య, సాలవ్వల కూతురు గంగవ్వ. శెట్పల్లి సంగారెడ్డిలో పదో తరగతి వరకు చదువుకుంది. లింగంపేట మండల కేంద్రానికి వెళ్లి ఇంటర్ చదివింది. దూరభారాలు అని చూడకుండా సైకిల్ మీద సవారీ చేస్తూ వేరే ఊళ్లలో చదువుకుంది. పేద కుటుంబం కావడంతో సెలవు దినాల్లో కూలి పనులకు వెళ్లేది. అమ్మానాన్నలకు చేదోడువాదోడుగా ఉండేది. ఈ క్రమంలోనే బైకు నేర్చుకుంది. తరువాత ట్రాక్టర్ నడపడం నేర్చుకుంది. లారీ డ్రైవర్‌గానూ పనిచేసింది. గ్రామ పంచాయితీ పనుల్లో... గంగవ్వకు తల్లిదండ్రులు పెళ్లి చేశారు. వారం రోజులు తిరక్కుండానే వెనుదిరిగి వచ్చేసి, తల్లిగారింట్లోనే ఉండిపోయింది. అప్పటి నుంచి ఇంటి దగ్గరే ఉంటూ వ్యవసాయ పనులకు వెళ్లేది. అలాగే ట్రాక్టర్, కారు, లారీ డ్రైవర్‌గా వెళ్లి వచ్చేది. నాలుగేళ్ల పాటు రైస్‌మిల్‌లో ఆపరేటర్‌గా కూడా పనిచేసింది. ఐదేళ్ల కిందట పంచాయతీలకు ప్రభుత్వం ట్రాక్టర్లు, ట్యాంకర్లు సరఫరా చేయడంతో గ్రామంలో డ్రైవింగ్ లైసెన్సు ఉన్న వాళ్లు దొరకలేదు. అప్పటికే భారీ వాహనాలు నడిపే సామర్థ్యంతో పాటు డ్రై వింగ్ లైసెన్స్ ఉండడంతో పంచాయతీ ట్రాక్టర్ డ్రైవర్‌గా నియమించారు. అప్పటì నుంచి పంచాయతీలో పనిచేస్తోంది. రోజూ చెత్త సేకరణ నుంచి రకరకాల పంచాయితీ పనుల్లో చురుగ్గా పాల్గొంటుంది. నిచ్చెన సాయంతో స్తంభం ఎక్కి విద్యుత్తు దీపాలను సరిచేస్తుంది. పంచాయతీలో ఏ పని ఉన్నా ఇట్టే చేసిపెడుతుంది. మొదట్లో ఆమెకు పంచాయతీ నుంచి రూ.2,500 వేతనం ఇచ్చేవారు. క్రమంగా పెరుగుతూ వచ్చి ఇప్పుడు రూ.8,500 వేతనం ఇస్తున్నారు. ట్రాక్టర్ అవసరం ఎప్పుడు ఏర్పడినా సరే గంగవ్వ పరుగున వెళ్లి ట్రాక్టర్ తీస్తుంది. నాలుగేళ్ల కిందట తండ్రి నాగయ్య చనిపోయాడు. తల్లి సాలమ్మతో కలిసి ఉంటుంది. అన్న కొడుకుని చదివించింది. అతను ఇప్పుడు ఆర్మీలో ఉద్యోగం చేస్తున్నాడు. వ్యవసాయ పనులు గంగవ్వ డ్రైవర్‌గా పనిచేస్తూనే వ్యవసాయ పనులు చేస్తోంది. తనకు సొంత భూమి లేకపోవడంతో వేరేవాళ్ల భూమిని కౌలుకు తీసుకుని సాగు చేస్తోంది. వెళ్లి దున్నడం, నాటు వేయడం, కలుపుతీయడం వంటి పనులన్నీ సొంతంగా చేసుకుంటుంది. లింగంపేట మండల కేంద్రానికి వెళ్లాలన్నా, ఎల్లారెడ్డి పట్టణానికి వెళ్లాలన్నా గంగవ్వ బైకు మీదనే ప్రయాణం చేస్తుంది. ‘ఎవరిపైనా ఆధారపడకుండా బతకడంలో ఉన్న తృప్తి మరెందులోనూ లేద’నే గంగవ్వ మాటలు నేటి తరానికి స్ఫూర్తి కలిగిస్తాయి. నచ్చిన పనిని ఎంచుకున్నా! ఇంటర్మీడియెట్ పూర్తవుతూనే పెళ్లి చేసి అత్తారింటికి పంపించారు. అక్కడ వాతావరణం ఎందుకో నాకు సరిపడదు అనిపించింది. వారం రోజులు కూడా గడవకముందే ఇంటికి వచ్చేశాను. అమ్మనాన్నలకు భారం కాకూడదని నిర్ణయించుకున్నా. నాకు బాగా నచ్చిన పని మీద దృష్టి పెట్టాను. డ్రైవింగ్ సొంతంగానే నేర్చుకున్నాను. రైస్‌మిల్ ఆపరేటర్‌గా పనిచేస్తూనే ట్రాక్టర్, లారీ, కారు.. డ్రైవింగ్ నేర్చుకున్నాను. కొందరు విచిత్రంగా చూసేవారు. కొందరు మగరాయుడు అనేవారు. ఎవరు ఏమనుకున్నా నా కష్టం మీద నేను బతకాలనుకుని నచ్చిన పనిచేసుకుంటూ వెళుతున్నాను. – గంగవ్వ, సజ్జన్పల్లి, లింగంపేట మండలం, కామారెడ్డి జిల్లా – ఎస్.వేణుగోపాలచారి, సాక్షి, కామారెడ్డి -
సీతారాంపల్లి కస్తూర్బా గాంధీ విద్యాలయంలో ప్రిన్సిపల్ నిర్వాకం
-
కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో రోగిని ఎలుకలు కొరికిన ఘటనపై ప్రభుత్వం చర్యలు
-
ఐసీయూలో పేషెంట్లను కొరికిన ఎలుకలు..
-
TS: రోడ్డు విస్తరణ కోసం ఇంటిని కూల్చేసిన ఎమ్మెల్యే
కామారెడ్డి టౌన్: అసెంబ్లీ ఎన్నికల్లో మాజీ, ప్రస్తుత సీఎంలను ఓడించి జెయింట్ కిల్లర్‌గా పేరు తెచ్చుకున్న కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి మళ్లీ సంచలనంగా మారారు. కామారెడ్డి పట్టణాభివృద్ధిలో భాగంగా రోడ్ల విస్తరణ కోసం ఎమ్మెల్యే తన సొంత ఇంటినే త్యాగం చేసి ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. తాతల కాలం నాటి ఆ ఇంట్లోనే నివసించే ఆయన అందులోనే పుట్టి పెరిగారు. అడ్లూర్ రోడ్లో గల తన ఇంటి ముందు ఆర్ అండ్‌బీ, మున్సిపల్ అధికారులతో చర్చించిన అనంతరం జేసీబీలతో కూల్చివేయించారు. సుమారు వెయ్యిగజాల ఆ ఇంటిస్థలాన్ని మున్సిపల్ అధికారులకు అప్పగించారు. పట్టణ అభివృద్ధి, రోడ్ల విస్తరణకు ప్రజలు సహకరించాలని, ఎవరూ ఆందోళన చెందవద్దని, ఇబ్బందులు పెట్టాలనే ఉద్దేశం లేదని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ముందుగా తన ఇంటిని కూల్చేసి అభివృద్ధికి సహకరించానని, ఇలాగే ప్రతిఒక్కరూ ముందుకు రావాలన్నారు. మాస్టర్ ప్లాన్ ప్రకారం త్వరలోనే రోడ్లన్నీ విస్తరించనున్నట్లు తెలిపారు. ఇదీ చదవండి: TS: క్యాబినెట్ విస్తరణకు ముహూర్తం ఫిక్స్..! -
కామారెడ్డి ఎమ్మెల్యే మరో సంచలన నిర్ణయం..
సాక్షి, కామారెడ్డి: అసెంబ్లీ ఎన్నికల సమయంలో సొంత మేనిఫెస్టో ప్రకటించడంతోపాటు, ఇద్దరు ఉద్ధండులను ఓడించి చరిత్ర సృష్టించిన కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి(కేవీఆర్) మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. రోడ్డు విస్తరణ కోసం ముందుగా తన ఇంటిని కూల్చేందుకు ముందుకొచ్చారు. కామారెడ్డి పట్టణంలోని పాత బస్టాండ్ నుంచి అడ్లూర్ రోడ్డు వరకు విస్తరణకు ఎన్నో ఆటంకాలు ఎదురయ్యాయి. ఇదే రోడ్డులో ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ఇల్లుతోపాటు మాజీ మంత్రి, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌అలీ ఇల్లు కూడా ఉంది. ట్రాఫిక్ పెరగడంతోపాటు, పలుచోట్ల ఆక్రమణలతో ఈ రోడ్డు ఇరుకుగా మారింది. ఈ నేపథ్యంలో రోడ్డు విస్తరణ కోసం స్వచ్ఛందంగా తన ఇంటిని కూల్చేందుకు ఎమ్మెల్యే కేవీఆర్ సిద్ధమయ్యారు. శనివారం ఇంటి కూల్చివేత పనులు ప్రారంభించాలని నిర్ణయించారు. తన ఇంటితోనే రోడ్డు వెడల్పు పనులు జరిగేలా ప్రణాళిక రూపొందించిన ఆయన.. పదిరోజుల క్రితమే ఇంటిని ఖాళీ చేసి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి మారారు. వెయ్యి గజాలకుపైగా స్థలాన్ని మున్సిపల్ అధికారులు అప్పగించారు. మరోవైపు రోడ్డుకు ఇరువైపులా ఉన్న ఇళ్ల యజమానులకు నోటీసులు ఇచ్చేందుకు బల్దియా అధికారులు సన్నద్ధమవుతున్నారు. ఎమ్మెల్యే ఇంటిని కూల్చివేశాక రోడ్డు వెడల్పు పనులు ఏ మేరకు ముందుకు సాగుతాయో అన్న విషయమై పట్టణంలో చర్చ నడుస్తోంది. -
ఎట్టకేలకు షబ్బీర్ అలీ సీనియారిటీకి దక్కిన గుర్తింపు..
సాక్షి, కామారెడ్డి: ఎట్టకేలకు మాజీ మంత్రి షబ్బీర్ అలీ సీనియారిటీకి గుర్తింపు దక్కింది. ఆయనను బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ శాఖల సలహాదారుగా నియమిస్తూ సర్కారు నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో సుమారు దశాబ్దకాలం తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అయితే మాజీ మంత్రి, పీఏసీ చైర్మన్ షబ్బీర్ అలీ మొన్నటి ఎన్నికల్లో ఓటమి చెందడంతో కొంత నిరాశచెందారు. ఎమ్మెల్యేగా గెలుపొంది ఉంటే ప్రభుత్వంలో కీలకమైన పదవి దక్కేదని భావించారు. అయితే సీఎం రేవంత్‌రెడ్డికి సన్నిహితుడిగా గుర్తింపు ఉన్న షబ్బీర్‌అలీ.. మైనారిటీ కోటాలో ఎమ్మెల్సీ అవకాశం, తద్వారా మంత్రి పదవి వస్తుందని ఆశించారు. కానీ ఆ అవకాశం దక్కలేదు. దీంతో ఆయన అనుచరులు నిరుత్సాహానికి గురయ్యారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయం మేరకు షబ్బీర్ అలీని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా (బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ శాఖలు) నియమిస్తూ శనివారం రాత్రి ఉత్తర్వులు వెలువడ్డాయి. ఐదేళ్లుగా అధికార పదవి లేకుండా ఉన్న షబ్బీర్ అలీకి ఇప్పుడు ప్రభుత్వ సలహాదారు హోదా లభించడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. కాగా షబ్బీర్ అలీకి అధికారిక పదవి లభించడంతో కామారెడ్డి నియోజకవర్గంలో రాజకీయాలు మారనున్నాయి. స్థానికంగా అధికార పార్టీ ఆధిపత్యం కోసం ప్రయత్నించే అవకాశాలున్నాయి. రాష్ట్రంలో అధికారంలోకి రావడంతో కాంగ్రెస్ నేతలు, శ్రేణులు యాక్టివ్ అయ్యారు. దీనికి తోడు షబ్బీర్‌కు సలహాదారు పదవి రావడంతో వారు మరింత క్రియాశీలకంగా వ్యవహరించే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. ఇవి చదవండి: అర్జున్ రెడ్డి స్టైల్లో కేటీఆర్.. అదిరిన కొత్త లుక్.. -
కామారెడ్డిలో దారుణం: క్షణికావేశంలో కొడుకును పొడిచి, ఆపై తండ్రి కూడా..
గాంధారి(ఎల్లారెడ్డి): కుటుంబ కలహాలతో తండ్రీకొడుకులు కన్నుమూశారు. తండ్రి కత్తితో పొడవడంతో కొడుకు అక్కడికక్కడే మృతి చెందాడు. ఆ వెంటనే తండ్రి పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కామారెడ్డి జిల్లా గాంధారి మండలం గుజ్జుల్ తండాలో జరిగిన ఈ సంఘటనపై పోలీసులు తెలిపిన వివరాలివి. తండాకు చెందిన బాదావత్ వసంత్‌రావు (48) కుమారుడు బాదావత్ సురేశ్ (27) హైదరాబాద్‌లో ప్రైవే టు ఉద్యోగి. రెండ్రోజుల క్రితం తండాకు వ చ్చాడు. బుధవారం రాత్రి డబ్బుల విషయంలో తండ్రీ కొడుకులు గొడవ పడి పరస్పరం దాడి చేసుకున్నారు. ఆగ్రహం చెందిన తండ్రి ఇంట్లోని కత్తితో కొడుకు సురేశ్ ఎడమ వైపు ఛాతీపై పొడవగా తీవ్రంగా గాయపడ్డాడు. కు టుంబ సభ్యులు, తండావాసులు చికిత్స ని మిత్తం గాంధారి ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు సురేశ్ అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. కాగా, ఇంటి వద్ద ఉన్న తండ్రి వసంత్ రావు పురుగు మందు తాగా డు. బంధువులు అతడిని నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందాడు. తండ్రీ కొడుకును హత్య చేశాడని ఆగ్రహించిన బంధువులు వసంత్‌రావు ఇంటిని ట్రాక్టర్లతో ధ్వంసం చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ప్రేమ్‌దీప్ తెలిపారు. ఇవి కూడా చదవండి: కారు వేగం ధాటికి.. ఇద్దరు యువకుల విషాదం! -
దోమకొండలో ముగ్గురు మహిళల హల్చల్
కామారెడ్డి జిల్లా: మండల కేంద్రంలో ముగ్గురు మహిళలు బుధవారం రాత్రి హల్చల్ చేశారు. గ్రామానికి చెందిన పందిరి కాశీనాథ్ ఇంట్లో చొరబడి బంగారు గొలుసు, డబ్బులు దొంగిలించారంటూ కాలనీవాసులు వారిని పట్టుకుని చితకబాదారు. పోలీసులకు సమాచారం అందించడంతో వారు అక్కడికి చేరుకున్న పీఎస్‌కు తరలించారు. మహిళలు మద్యం తాగి, పెప్పర్‌స్రే, కట్టర్, చాకు, సుత్తి కలిగి ఉన్నారని పేర్కొన్నారు. తమది మాచారెడ్డి మండలం లచ్చపేట గ్రామమని తన పేరు బూస కవిత అని సదరు మహిళ తెలిపారు. దోమకొండకు చెందిన కాశీనాథ్ తమకు గతంలో రూ.5లక్షలు అప్పు ఇచ్చాడని, తన భర్త చనిపోగా ఇల్లు అమ్మి డబ్బులు కట్టానని చెప్పారు. ప్రామిసరీ నోట్లను చించివేసిన కాశీనాథ్ రెండేళ్ల తర్వాత తాము ఇచ్చిన చెక్కులపై చెక్»ౌన్స్ కేసు వేశాడన్నారు. దీంతో తాను అతడిపై వేదింపుల కేసు పెట్టానని పేర్కొన్నారు. రాజీకి వచ్చిన కాశీనాథ్ కేసులు విరమించుకుందామని చెప్పగా, తాను ముందు కేసు విరమించుకున్నానని, కానీ అతడు కేసు విరమించుకోలేదని చెప్పారు. కాగా సదరు మహిళలు చెబుతున్న మాటలు వాస్తవం కాదని, తనపై హత్యాయత్నానికి పాల్పడ్డ వారిపై కేసు నమోదు చేయాలని కాశీనాథ్ పోలీసులను కోరాడు. పైఅధికారుల సూచన మేరకు విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని ఎస్సై పేర్కొన్నారు. -
ఆరు హత్యల కేసులో ఐదుగురు అరెస్టు
సాక్షి కామారెడ్డి/కామారెడ్డి క్రైం: ఇంటి కోసం ఒకే కుటుంబంలోని ఆరుగురిని దారుణంగా హత్య చేసిన కేసులోని నిందితులను కామారెడ్డి పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. కామారెడ్డి జిల్లా ఎస్పీ సింధు శర్మ మంగళవారం మీడియాకు వెల్లడించిన వివరాలిలా.. నిజామాబాద్ జిల్లా మాక్లూర్‌కు చెందిన పూనే ప్రసాద్ (36)కు భార్య శాన్విక అలియాస్ రమణి (29), కవల పిల్లలు చైత్రిక (8), చైత్రిక్ (8), తల్లి సుశీల, ఇద్దరు చెల్లెళ్లు స్వప్న (26), శ్రావణి (23) ఉన్నారు. ఓ యువతి ఆత్మహత్య కేసు నేపథ్యంలో ఇటీవల బెయిల్‌పై బయటకు వచ్చాక ప్రసాద్ తన కుటుంబంతో కలిసి కామారెడ్డి జిల్లాలోని పాల్వంచకు మకాం మార్చాడు. ఆ కేసు నిమిత్తం డబ్బులు అవసరమై గతంలో తన స్నేహితుడు ప్రశాంత్ నుంచి రూ.3.50 లక్షల వరకు అప్పుగా తీసుకున్నాడు. ఈమధ్యన ప్రశాంత్ తనకు రావాల్సిన డబ్బులను ప్రసాద్‌ను అడగగా స్వగ్రామం మాక్లూర్‌లోని ఇంటిని తాకట్టు పెట్టి చెల్లిస్తానని చెప్పాడు. ఈ క్రమంలో రూ.25 లక్షలు విలువ చేసే ప్రసాద్ ఇంటిని సొంతం చేసుకోవాలని ప్రశాంత్ పథకం పన్నాడు. ఇంటిని తన పేరు మీద రిజిస్ట్రేషన్చేసిస్తే లోన్ తీసుకుని తనకివ్వాల్సిన డబ్బులు తీసుకుని మిగిలిన మొత్తం ఇస్తానని ప్రసాద్‌ను నమ్మించాడు. ప్రసాద్ ఇంటిని రిజిస్ట్రేషన్చేసినప్పటికీ రోజులు గడుస్తున్నా ప్రశాంత్ డబ్బులు ఇవ్వకపోగా, చివరికి హత్య చేయాలని భావించాడు. రూ.60 వేలకు సుపారీ.. ప్రసాద్‌ను హత్య చేసేందుకు మాక్లూర్ మండలం దుర్గానగర్ తండాకు చెందిన బానోత్ వంశీ, గుగులోత్ విష్ణులకు రూ.60 వేలు ఇచ్చేందుకు ప్రశాంత్ ఒప్పందం చేసుకున్నా డు. గత నెల 29న మాట్లాడుకుందామని నమ్మించి ప్రశాంత్, వంశీ, విష్ణులతో కలిసి ప్రసాద్‌ను కారులో మదనపల్లి అటవీ ప్రాంతంలోకి తీసుకువెళ్లారు. మద్యం తాగించి కర్రలు, రాళ్లతో కొట్టి చంపారు. అక్కడే గోతిని తవ్వి పాతి పెట్టారు. ఈనెల 1న పోలీసుల భయంతో ప్రసాద్ ఓ చోట దాక్కున్నాడని, అతను రమ్మన్నాడని చెప్పి భార్య శాన్విక (గర్భవతి), ప్రసాద్ చెల్లెలు శ్రావణిను వెంట తీసుకుని నిజామాబాద్ వెళ్లాడు. శ్రావణిని ఓ చోట ఉంచి శాన్వికను బాసర బ్రిడ్జి సమీపంలోకి తీసుకెళ్లి ఆమె గొంతుకు తాడు బిగించి నిందితులందరూ కలిసి చంపేశారు. ఆమె మృతదేహాన్ని నదిలో పడేశారు. ఆ వెంటనే శ్రావణి దగ్గరకు వెళ్లి ఆమె ను కారులో ఎక్కించుకుని చేగుంట మండలం వడియారం ప్రాంతంలో హత్య చేసి పెట్రోల్ పోసి తగులబెట్టారు. మళ్లీ పాల్వంచకు వచ్చి ప్రసాద్ తల్లి సుశీల, మరో చెల్లెలు స్వప్న, ఇద్దరు పిల్లలను ఈనెల 4 న అదే కారులో తీసుకువెళ్లి నిజామాబాద్‌లోని ఓ లాడ్జిలో ఉంచారు. ఆ తర్వాత ప్రశాంత్ ఇంటికి వెళ్లి జరిగిందంతా తన తల్లి వడ్డెమ్మతో చెప్పి సహకరించాలని కోరాగా ఆమె ఒప్పుకుంది. తప్పించుకున్న తల్లి ప్రసాద్ పిల్లల్ని చూడాలని అంటున్నాడని సుశీలను, స్వప్నను నమ్మించారు. సుశీల, స్వప్నలను లాడ్జిలోనే ఉంచి ఇద్దరు పిల్లలను ప్రశాంత్, అతని తమ్ముడు తీసుకుని వెళ్లారు. నిర్మల్ వెళ్లే దారిలో ఉండే సోన్ బ్రిడ్జి వద్దకు వెళ్లేలోగా కారులోనే ఇద్దరు పిల్లలను తాడుతో ఉరి బిగించి హత్య చేసి గోనె సంచుల్లో కట్టి వాగులో పడేశారు. ఈ నెల 13న లాడ్డి నుంచి స్వప్నను కారులో తీసుకువెళ్లిన ప్రశాంత్, మై నర్ బాలుడు, వంశీ కలిసి సదాశివనగర్ మండలం భూంపల్లి సమీపంలోని ప్రధాన రహ దారి పక్కన హత్యచేసి పెట్రోల్ పోసి తగలబెట్టారు. నిందితులు ప్రసాద్ తల్లిని కూడా చంపేయాలని ప్లాన్ చేసినా చివరగా ఆమెకు అనుమానం వచ్చి లాడ్జి నుంచి బయటకు వెళ్లిపోయి తప్పించుకున్నట్లు ఎస్పీ తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా నిందితుల గుర్తింపు.. భూంపల్లి వద్ద గుర్తుతెలియని యువతి మృతదేహాన్ని మరుసటి రోజు గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. పక్షం రోజుల వ్యవధిలోనే ఒకే తరహా హత్యలు చేగుంట, సదాశివనగర్, మెండోరా (సోన్ బ్రిడ్జి) పీఎస్‌ల పరిధిలో వెలుగు చూడటంతో వాటి మధ్య ఏదైనా లింక్ ఉన్నదా అనే కోణంలో విచారించారు. వందల సంఖ్యలో సీసీ కెమెరాలు పరిశీలించారు. సెల్‌ఫోన్ టవర్ డంప్, సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా నిందితుడిని మాక్లూర్ కు చెందిన ప్రశాంత్‌గా గుర్తించారు. మంగళవారం నిందితులంతా కలిసి కారులో ప్రసాద్ తల్లిని వెతుకుతూ పాల్వంచకు వెళ్తుండగా పద్మాజీవాడి క్రాస్ రోడ్డు వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా నేరం అంగీకరించినట్లు ఎస్పీ తెలిపారు. -
కామారెడ్డిలో భారీ అగ్ని ప్రమాదం
-
షాపింగ్ మాల్లో భారీ అగ్ని ప్రమాదం.. 8 కోట్ల ఆస్తినష్టం!
సాక్షి, కామారెడ్డి: కామారెడ్డిలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. అయ్యప్ప షాపింగ్ మాల్ గ్రౌండ్ ఫ్లోర్లో మంటలు ఎగిసిపడుతున్నాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సుమారు రూ.8 నుంచి 10 కోట్ల వరకూ ఆస్తి నష్టం సంభవించినట్లు సమాచారం. మొదటి, రెండవ అంతస్తులో ప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. మంటలు ఎగిసిపడుతుండడంతో షాపింగ్ మాల్ ప్రక్కన ఉన్న ప్రైవేట్ అసుపత్రిని అధికారులు ఖాళీ చేయించారు. ఇదీ చదవండి: ల్యాబ్ టెక్నీషియన్ క్రూరత్వం? -
కరప్షన్ ఫ్రీ కామారెడ్డి
‘‘ఎన్నికల్లో డబ్బు..మద్యం పంచకుండా గెలిచి చూపాలని లక్ష్యంగా పెట్టుకున్నాను. కార్యకర్తలు అండగా నిలవడం, జనం నన్ను నమ్మి ఓటేయడంతో నా లక్ష్యం నెరవేరింది. ఇక కామారెడ్డిలో పెరిగిన రాజకీయ అవినీతిని రూపుమాపి కరప్షన్ ఫ్రీ కామారెడ్డి అన్న పేరు తేవడానికి కృషి చేస్తా’’అని ఇద్దరు రాజకీయ ఉద్ధండులను ఓడించిన కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి(కేవీఆర్) అంటున్నారు. సాక్షి, కామారెడ్డి: ‘‘ఎన్నికల్లో డబ్బు..మద్యం పంచకుండా గెలిచి చూపాలని లక్ష్యంగా పెట్టుకున్నాను. కార్యకర్తలు అండగా నిలవడం, జనం నన్ను నమ్మి ఓటేయడంతో నా లక్ష్యం నెరవేరింది. ఇక కామారెడ్డిలో పెరిగిన రాజకీయ అవినీతిని రూపుమాపి కరప్షన్ ఫ్రీ కామారెడ్డి అన్న పేరు తేవడానికి కృషి చేస్తా’’అని ఇద్దరు రాజకీయ ఉద్ధండులను ఓడించిన కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి(కేవీఆర్) అంటున్నారు. ‘‘దేమె రాజిరెడ్డి కొడుకు తండ్రిలా నిజాయితీపరుడు అన్న పేరు రావాలి. నేను చనిపోయినప్పుడు లక్షలాది మంది ప్రజలు ఆఖరి చూపునకు రావాలి. అదే నా కోరిక’’అంటు న్న కేవీఆర్‌ను మంగళవారం ‘సాక్షి’పలకరించింది. జెయింట్ కిల్లర్ అవుతాననుకున్నారా ? కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతున్నపుడు కామారెడ్డిలో సీఎం కేసీఆర్ పోటీ చేసినా, టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి పోటీ చేసినా ఇక్కడ బీజేపీ జెండా ఎగరాలని, అందుకు మనం కష్టపడా లని కార్యకర్తలతో మాటవరుసకు అన్న. దైవ నిర్ణయమో ఏమోగానీ, ఆ రోజు నా నోటి నుంచి వచ్చి నట్టే నామీద కేసీఆర్, రేవంత్‌రెడ్డి పోటీకి వచ్చారు. ఆ ఇద్దరితో తలపడి ఓడించే అవకాశాన్ని ప్రజలు నాకిచ్చారు. అందుకే రాష్ట్రం, దేశం మొత్తం కామా రెడ్డి ఎన్నికల ఫలితం కోసం ఎదురుచూసింది. ఆ ఇద్దరితో పోటీ అని తెలియగానే ఎలా ఫీల్ అయ్యారు ? దేశంలో ఎవరికీ రాని అవకాశం నాకు దక్కింది. సీఎం, కాబోయే సీఎంలిద్దరూ కామారెడ్డిలో నిలబడుతున్నారని తెలియడంతో ఇద్దరినీ ఓడిస్తానని, ఓడించకుంటే రాజకీయాల నుంచి తప్పుకుంటానని ప్రకటించిన. ఇద్దరితో పోటీపడడం అంటే మామూలు విషయం కాదు. వాళ్ల దగ్గర డబ్బు, అధికారం, బలం, బలగం అన్నీ ఉన్నాయి. నా దగ్గర ఆత్మస్థైర్యం ఉంది. నా కోసం దేనికైనా తెగించే కార్యకర్తల బలం ఉంది. అన్నింటికి మించి ప్రజల్లో నామీద నమ్మకం ఉంది. ఆ నమ్మకం, ఆ ధైర్యంతోనే వాళ్లను ఓడిస్తానని శపథం చేసిన. ఒకేసారి ఇద్దరు రాజకీయ ఉద్ధండులను కొట్టే అవకాశం రావడం అదృష్టంగానే భావిస్తున్నా. ప్రజల నుంచి స్పందన ఎలా ఉంది? ఇక్కడి ప్రజలు తమ సొంత ఇంటి వ్యక్తిగా భావించి నన్ను గెలిపించారు. ఎన్ని ప్రలోభాలు పెట్టినా, ఎంత మందిని లొంగదీసుకున్నా, ప్రజలు మాత్రం నావైపు నిలిచారు. ఏ ఊరికి వెళ్లినా మహిళలు ఎంతో ఆదరించారు. వారికి రావాల్సిన వడ్డీ రాయితీ డబ్బుల కోసం చేసిన పోరాటం, భూముల కోసం చేసిన ఉద్యమాలతో నన్ను సొంత అన్నలా, తమ్ముడిలా భావించారు. పోయిన ప్రతిచోటా నువ్వే గెలుస్తావంటూ దీవించి పంపించారు. మీకు రాజకీయ ప్రేరణ ఎవరు? నా చిన్నతనంలో మా నాన్న రాజిరెడ్డి సమితి అధ్యక్షుడిగా పనిచేశారు. చదువుకునేరోజుల్లో, ఆ తర్వాత ఎక్కడకు వెళ్లినా ఆయన గురించి మాట్లాడుతుంటే ఆసక్తిగా వినేవాన్ని. దేమె రాజిరెడ్డి ఉద్యోగం ఇప్పించాడని చెబుతుండేవారు. వారితో మాట్లాడుతున్నపుడు తాను రాజిరెడ్డి కొడుకునని వారికి తెలియదు. ఆ రాజిరెడ్డి కొడుకును నేనే అన్నప్పుడు వారు నాకు ఇచ్చిన మర్యాద ఇప్పటికీ కళ్లముందు కదలాడుతుంది. ఇంటికి వెళ్లిన తర్వాత అన్నీ నాన్నతో చర్చించేవాడిని. నీతి, నిజాయితీగా పనిచేసినపుడు ప్రజలు చిరకాలం గుర్తుంచుకుంటారని ఆయన చెప్పిన మాటలు నా మనసులో నిండిపోయాయి. మా నాన్నలాగా గొప్ప పేరు తెచ్చుకోవాలని ఆ రోజే అనుకున్నాను. హామీలు నెరవేర్చడానికి ఎంత సమయం తీసుకుంటారు? కామారెడ్డి నియోజకవర్గంలో ఇల్లు లేని వారందరికీ ఇల్లు కట్టించి ఇవ్వడమే నా ముందున్న అతి పెద్ద లక్ష్యం. ప్రధాని మోదీ సహకారంతో కేంద్రం నుంచి 40 వేల ఇళ్లు మంజూరు చేయించుకొని, వాటిని నిర్మించి ఇస్తా. సొంత మేనిఫెస్టోలో పేర్కొన్న కార్యక్రమాలన్నీ ఏడాదిన్నరలో పూర్తి చేయాలని అనుకుంటున్న. ముందుగా రైతులు ఎదుర్కొంటున్న కల్లాల సమస్యను పరిష్కరించేందుకు నెల, రెండు నెలల్లో కార్యాచరణ మొదలుపెడతా. ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తా. -
రాజకీయం అంటే డబ్బు కాదని కాంగ్రెస్ కు వార్నింగ్
-
కాంగ్రెస్ ప్రభుత్వానికి కామారెడ్డి ఎమ్మెల్యే హెచ్చరిక
సాక్షి, కామారెడ్డి: ఏడాదికోసారి రేషన్, పింఛన్లను అప్డేట్ చేయాల్సిందేనని కాంగ్రెస్ ప్రభుత్వానికి కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి హెచ్చరించారు. మంగళవారం ఆయన ‘సాక్షి’ మీడియాతో మాట్లాడుతూ, కామారెడ్డిలో అవినీతి రహిత పాలన అందిస్తానని.. ఇచ్చిన హామీలన్నింటిని అమలు చేస్తానని తెలిపారు. కామారెడ్డిని అభివృద్ధి దిశగా తీసుకెళ్తా. విజయం అందించిన ప్రజలకు, కార్యకర్తలకు ధన్యవాదాలు. కేసీఆర్, రేవంత్ ఇక్కడ పోటీ చేయడంతో కామారెడ్డికి గుర్తింపు వచ్చింది. నిజాయితీకి ఓటు వేయాలని కామారెడ్డి ప్రజలు నిర్ణయించుకుని నన్ను గెలిపించారు’’ అని వెంకటరమణారెడ్డి పేర్కొన్నారు. కాగా, కామారెడ్డి నియోజకవర్గంలో ఐదేళ్లుగా అలుపెరగని పోరాటం చేస్తున్న వెంకటరమణారెడ్డిని నాయకుడిగా నిలబెట్టింది. ప్రజల్లో నమ్మకాన్ని పెంచింది. అదే విశ్వాసం ఆయనను ఎమ్మెల్యేగా గెలిపించింది. అది కూడా ఇద్దరు ఉద్ధండులను ఓడించి రాష్ట్ర రాజకీయాల్లో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకునేంతగా.. కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించిన బీజేపీ అభ్యర్థి కాటిపల్లి వెంకటరమణారెడ్డి(కేవీఆర్).. కేసీఆర్, రేవంత్‌రెడ్డిలను ఓడించి జాయింట్ కిల్లర్ అన్న పేరు సాధించారు. ఇదీ చదవండి: కేసీఆర్, రేవంత్‌ను ఓడించిన కమలయోధుడు.. -
రేవంత్ రెడ్డికి స్వీట్ వార్నింగ్..
-
జెయింట్ కిల్లర్!
సాక్షి, హైదరాబాద్/ కామారెడ్డి: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి కాటిపల్లి వెంకటరమణారెడ్డి పెను సంచలనం సృష్టించారు. కామారెడ్డి నుంచి సీఎం కేసీఆర్ (బీఆర్ఎస్), రేవంత్‌రెడ్డి (కాంగ్రెస్)లను ఓడించి చరిత్ర లిఖించారు. ఒకేసారి ప్రస్తుత సీఎం కేసీఆర్‌ను, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సీఎం అవుతారని భావిస్తున్న రేవంత్‌రెడ్డిలను వెంకటరమణారెడ్డి ఓడించడం విశేషం. అయితే ఆయన ప్రత్యర్థులిద్దరూ రెండుచోట్ల నుంచి పోటీచేయడం గమనార్హం. కామారెడ్డితో పాటు పోటీచేసిన గజ్వేల్‌లో కేసీఆర్ గెలుపొందారు. కామారెడ్డితో పాటు పోటీచేసిన కొడంగల్‌లో రేవంత్‌రెడ్డి విజయం సాధించారు. ఎన్నికల పోలింగ్ ముగిశాక కూడా బీజేపీ రాష్ట్ర నాయకత్వంతో ఆయన మాట్లాడిన సందర్భంగా గెలుపుపై ధీమాను వ్యక్తం చేశారు. భారీ అంచనాల మధ్య కేసీఆర్, రేవంత్‌రెడ్డిలతో పోటాపోటీగా జరిగిన ఎన్నికల్లో చివరకు అదే విశ్వాసం ఆయనను గెలిపించింది. ప్రజల్లో ఆయనకున్న మంచిపేరే వెంకటరమణారెడ్డిని విజయ తీరానికి చేర్చింది. ప్రజలతో కలిసి ఉద్యమాలు... వెంకటరమణారెడ్డి 2006లో స్థానిక సంస్థల ఎన్నికల్లో తాడ్వాయి జెడ్పీటీసీ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. 2008లో ఉమ్మడి జిల్లా పరిషత్ చైర్మన్ పదవికి ఎన్నికై 2011 వరకు పనిచేశారు. 2018లో బీజేపీలో చేరిన ఆయన, ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా కామారెడ్డి నుంచి పోటీ చేసి ఓటమి చెందారు. అప్పటినుంచి నియోజక వర్గంలో ప్రజలతో కలిసి అనేక ఉద్యమాలకు నాయకత్వం వహించాడు. ప్రజల్లో మంచి పట్టు సాధించడంతో ఈసారి బీజేపీ విడుదల చేసిన తొలి జాబితాలోనే వెంకటరమణారెడ్డి పేరు ప్రకటించారు. అయితే సీఎం కేసీఆర్ కామారెడ్డి నుంచి పోటీ చేస్తున్నారని తెలిసినా వెనక్కు తగ్గలేదు. సీఎం కేసీఆర్, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కూడా పోటీకి సిద్ధపడ్డా ఇద్దరినీ ఓడించి తీరతానని శపథం చేశాడు. అన్నట్టే ఇద్దరూ ఆయన చేతిలో ఓడిపోయారు. వెంకటరమణారెడ్డికి 66,652 ఓట్లు రాగా, కేసీఆర్ కు 59,911 ఓట్లు, రేవంత్‌రెడ్డికి 54,916 ఓట్లు వచ్చాయి. కేసీఆర్ మీద 6,741 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. అవినీతి రహిత పాలన అందించడమే తన లక్ష్యమని ఈ సందర్భంగా వెంకటరమణారెడ్డి ‘సాక్షి’తో పేర్కొన్నారు. అక్రమాలపై ఎక్కుపెట్టిన ఫిరంగి.... వెంకటరమణారెడ్డి జెడ్పీ చైర్మన్‌గా పనిచేసిన కాలంలో మద్యం, ఇసుక మాఫియాపై యుద్ధం చేసి అప్పట్లో వార్తల్లో నిలిచారు. అధికార పారీ్టకి చెందిన జెడ్పీ చైర్మన్‌గా ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు వారించినా వెనక్కు తగ్గలేదు. ఒకసారి రాజీనామా పత్రాన్ని విసిరికొట్టి, గన్మెన్లు, కారును వదిలివెళ్లిన ఘటన అప్పట్లో సంచలనం రేపింది. అప్పట్లో ఉపాధ్యాయుల, ఉద్యోగుల బదిలీలను పారదర్శకంగా నిర్వహించి అందరి మన్ననలు అందుకున్నారు. 2018లో కామారెడ్డి స్థానంలో బీజేపీ నుంచి పోటీ చేసి ఓటమి చెందిన తరువాత నియోజక వర్గంలో ప్రజాసమస్యలపై అనేక ఉద్యమాలు నిర్వహిస్తూ జనం నోట్లో నాలుకయ్యారు. ఎన్నికల్లో ప్రత్యర్థులు ఎంత ఖర్చు చేస్తున్నా, మద్యం ఎంత పంచుతున్నా వెంకటరమణారెడ్డి మాత్రం వాటికి దూరంగా ఉన్నారు. ఒక సందర్భంలో కార్యకర్తల నుంచి కూడా ఆయన ఇబ్బంది పడ్డారు. ఎన్నికలు దగ్గర పడిన సమయంలో మనం డబ్బులు ఇవ్వకుంటే, మద్యం పంచకుంటే ఇబ్బంది అవుతుందని అనుచరులు ఆయనతో గొడవ పడ్డారు. అయినా ఆయన వెనక్కు తగ్గలేదు. మద్యం పంచడం తనతో కాదని వారికి స్పష్టం చేశారు. దీంతో కార్యకర్తలు కొంత నిరాశ చెందినా, ఊళ్లకు వెళ్లి జనం కాళ్లు మొక్కుతూ ఓట్లు అభ్యర్థించడం విశేషం. -
ఆరుగురు మంత్రులు ఔట్
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సహా రాష్ట్ర మంత్రివర్గంలోని 17 మంది మంత్రులకుగాను 14 మంది అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయగా మిశ్రమ ఫలితాలు వచ్చాయి. ఈ 14 మందిలో ఎనిమిది మంది విజయం సాధించగా, ఆరుగురు ఓటమి పాలయ్యారు. మిగతా ముగ్గురు మంత్రులు మహమూద్ అలీ (హోం), సత్యవతి రాథోడ్ (గిరిజన, మహిళా, శిశు సంక్షేమం), పట్నం మహేందర్‌రెడ్డి (సమాచార, పౌర సంబంధాలు) శాసన మండలి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వారు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసిన మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి (నిర్మల్), కొప్పుల ఈశ్వర్ (ధర్మపురి), సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి (వనపర్తి), ఎర్రబెల్లి దయాకర్‌రావు (పాలకుర్తి), పువ్వాడ అజయ్ (ఖమ్మం), వి.శ్రీనివాస్‌గౌడ్ (మహబూబ్‌నగర్) ఓటమి పాలయ్యారు. మంత్రులు కేటీఆర్ (సిరిసిల్ల), హరీశ్‌రావు (సిద్దిపేట), వేముల ప్రశాంత్‌రెడ్డి (బాల్కొండ), గంగుల కమలాకర్ (కరీంనగర్), చామకూర మల్లారెడ్డి (మేడ్చల్), సబితా ఇంద్రారెడ్డి (మహేశ్వరం), తలసాని శ్రీనివాస్‌యాదవ్ (సనత్‌నగర్), జి.జగదీశ్‌రెడ్డి (సూర్యాపేట) విజయం సాధించారు. కామారెడ్డిలో కేసీఆర్‌కు ఎదురుదెబ్బ: సీఎం కేసీఆర్ ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్‌తోపాటు కామారెడ్డి నుంచి కూడా పోటీచేశారు. వీటిలో కామారెడ్డిలో పరాజయం పాలుకాగా.. గజ్వేల్‌లో మాత్రం వరుసగా మూడోసారి విజయం సాధించారు. కేసీఆర్ గత 40 ఏళ్లలో తొలిసారి ఒక ఎన్నికలో ఓడిపోవడం గమనార్హం. 1983లో తొలిసారిగా సిద్దిపేట అసెంబ్లీ స్థానంలో టీడీపీ తరఫున పోటీచేసి ఓడిపోయారు. తర్వాత వరుసగా 1985, 1989, 1994, 1999లలో ఎమ్మెల్యేగా గెలిచారు. టీఆర్ఎస్ స్థాపించాక 2001 ఉపఎన్నిక, 2004 సాధారణ ఎన్నికల్లో విజయం సాధించారు. 2004లో కరీంనగర్ ఎంపీగానూ పోటీ చేసి గెలవడంతో సిద్దిపేట ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. తర్వాత 2006, 2008లలో జరిగిన లోక్‌సభ ఉప ఎన్నికల్లో కరీంనగర్లో గెలిచారు. 2009లో మహబూబ్‌నగర్, 2014లో మెదక్ ఎంపీగానూ విజయం సాధించారు. 2014, 2018తోపాటు తాజా అసెంబ్లీ ఎన్నికల్లో గజ్వేల్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1983 నాటి తొలి ఓటమి తర్వాత ఇప్పుడు కామారెడ్డిలో కేసీఆర్ పరాజయం పొందడం గమనార్హం. చీఫ్ విప్ సహా విప్ల ఓటమి శాసనసభలో ప్రభుత్వ చీఫ్ విప్, విప్‌లుగా పనిచేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా పరాజయం పాలయ్యారు. కామారెడ్డి నుంచి కేసీఆర్ పోటీ చేయడంతో ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ బరిలో దిగలేదు. పోటీ చేసిన ప్రభుత్వ చీఫ్ దాస్యం వినయ్ భాస్కర్ (వరంగల్ పశ్చి మ), బాల్క సుమన్ (చెన్నూరు), గువ్వల బాలరాజు (అచ్చంపేట), రేగ కాంతారావు (పినపాక), గొంగిడి సునీత (ఆలేరు) ఓటమి చెందారు. -
ఓడిపోయిన అనుభవం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పలువురు రాజకీయ దిగ్గజాలకు ఓటర్లు షాక్ ఇచ్చారు. పలుమార్లు విజేతలైన సీనియర్లకూ పరాభవం తప్పలేదు. తిరుగులేదనుకున్న మంత్రులు సైతం ఓటమి పాలయ్యారు. ఆఖరుకు సీఎం కేసీఆర్ కూడా కామారెడ్డి ప్రజలు చేదు అనుభవాన్ని మిగిల్చారు. మరోవైపు సర్వశక్తులూ ఒడ్డి పోరాడిన నేతలు కూడా పరాజయం పాలయ్యారు. ఇలాంటి కొన్ని ఆసక్తికర ఫలితాలను పరిశీలిస్తే... ♦ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజా జీవితంతో పెనవేసుకున్న నేత. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. వరుసగా రెండుసార్లు సీఎంగా పనిచేశారు. ఎమ్మెల్యేగా, ఎంపీగా అపారమైన అనుభవం ఉంది. ఈసారి ఎన్నికల్లో రెండుచోట్ల పోటీ చేసిన ఆయన గజ్వేల్‌లో గెలిచినా కామారెడ్డిలో మాత్రం ఓడిపోయారు. ♦ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు టీడీపీ హయాంలోనే సీనియర్ నేత. ఉమ్మడి వరంగల్ జిల్లా వర్ధన్నపేట, పాలకుర్తి నుంచి ఆరు పర్యాయాలు గెలిచిన నాయకుడు. ఈసారి మాత్రం పిన్న వయస్కురాలు, కొత్తగా రాజకీయ అరంగ్రేటం చేసిన కాంగ్రెస్ అభ్యర్థి యశస్విని ఆయన్ను ఖంగు తినిపించారు. ♦ ఖమ్మం నియోజకవర్గ అభ్యర్థి పువ్వాడ అజయ్‌కి తండ్రి పువ్వాడ నాగేశ్వరరావు రాజకీయ వారసత్వం ఉంది. 2014లో వైఎస్సార్సీపీ నుంచి గెలిచారు. ఆ తర్వాత బీఆర్ఎస్లో చేరి, 2018లో అదే స్థానం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. కేసీఆర్ మంత్రి వర్గంలో కీలక మంత్రి. కానీ ఈసారి తుమ్మల నాగేశ్వరరావు చేతుల్లో ఓటమి ఎదురైంది. ♦ బండి సంజయ్ పరిచయం అక్కర్లేని బీజేపీ నేత. రాష్ట్ర అధ్యక్షుడిగా ఆ పార్టీకి ఊపు తెచ్చిన వ్యక్తి. కరీనంగర్ ఎంపీగా విజయం సాధించిన నేపథ్యం ఆయనది. కానీ ఈసారి కరీంనగర్ స్థానంలో పరాజయం చవిచూశారు. ఆ పార్టీ మరో ఎంపీ ధర్మపురి అరవింద్దీ ఇదే పరిస్థితి. ♦ తెలంగాణ ఉద్యమ కాలం నుంచి కేసీఆర్‌తో కలిసి పోరాడిన చరిత్ర ఈటల రాజేందర్‌ది. కేసీఆర్ ప్రభుత్వంలో ఆర్థిక, వైద్యశాఖ మంత్రిగా పనిచేశారు. బీఆర్ఎస్తో వివాదం రావడంతో బీజేపీలో చేరారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో విజయం సాధించి రికార్డు సృష్టించారు. ఈసారి మాత్రం ఓటమి తప్పలేదు. ♦ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి నిర్మల్ స్థానానికి 2014 నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. బీఆర్ఎస్ తరఫున 2014లో గెలిచారు. 2018లోనూ విజయం సాధించారు. ఈసారి మాత్రం కాంగ్రెస్ గాలికి పరాజయం తప్పలేదు. మరో సీనియర్ నేత జోగు రామన్నదీ ఇదే అనుభవం. ఆదిలాబాద్ స్థానంలో 2009 నుంచి విజయాలను నమోదు చేశారు. 2023 ఎన్నిక ఆయనకు ఓటమిని అందించింది. ♦ ఉమ్మడి నిజామాబాద్‌లోని బాన్సువాడ, ఆర్మూర్, నిజామాబాద్ స్థానాల నుంచి మూడుసార్లు విజయం సాధించిన బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి కూడా అనుభవం ఈ ఎన్నికల్లో పనిచేయలేదు. -
కాటిపల్లి..కామారెడ్డి డబుల్ జెయింట్ కిల్లర్..!
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచింది. బీఆర్ఎస్ ఓడిపోయింది. మొత్తంగా కేసీఆర్‌పై రేవంత్‌రెడ్డి పైచేయి సాధించారు. అయితే కేసీఆర్, రేవంత్‌రెడ్డిలు ఇద్దిరినీ ఓడించిన కామారెడ్డి బీజేపీ అభ్యర్థి కాటిపల్లి వెంకటరమణారెడ్డి డబుల్ జెయింట్ కిల్లర్‌గా అవతరించారు. కామారెడ్డిలో పోటీచేసిన ఇరు పార్టీల అధినేతలపై సంచలన విజయం సాధించి వెంకటరమణారెడ్డి పాపులర్ అయ్యారు. కామారెడ్డిలో ఎవరికి ఎన్ని ఓట్లు... ఆదివారం ఉదయం తెలంగాణ ఎన్నికల కౌంటింగ్ మొదలైనప్పటి నుంచి కామారెడ్డి ఫలితం రౌండ్ రౌండ్‌కు తీవ్ర ఉత్కంఠ రేపింది. తొలుత ఈ స్థానంలో వెంకటరమణారెడ్డి లీడ్‌లో ఉండగా తర్వాత రేవంత్‌రెడ్డి లీడ్‌లోకి వచ్చారు. చివరి రౌండ్లు లెక్కబెట్టే టైమ్‌కు రేవంత్‌రెడ్డిని వెనక్కి నెట్టేసి మళ్లీ వెంకటరమణారెడ్డి లీడ్‌లోకివచ్చారు. తర్వాత ఒక్కసారిగా కేసీఆర్ ముందుకు దూసుకువచ్చి రేవంత్‌ను మూడో స్థానానికి నెట్టారు. చివరగా కౌంటింగ్ ముగిశాక కేసీఆర్‌పై వెంకటరమణారెడ్డి 6741 వేల ఓట్లతో విజయం సాధించి సంచలనం సృష్టించారు. ఈ ఎన్నికల్లో వెంకటరమణారెడ్డికి 66652 ఓట్లు రాగా, రెండవ స్థానంలో ఉన్న కేసీఆర్‌కు 59911 ఓట్లు, రేవంత్‌రెడ్డికి 54916 ఓట్లు వచ్చాయి. బీఆర్ఎస్ నుంచి బీజేపీకి.. ఒకప్పుడు బీఆర్ఎస్లోనే ఉన్న వెంకటరమణారెడ్డి తర్వాత బీజేపీలో చేరారు.ఈ ఎన్నికల్లో టికెట్ రాకముందు నుంచే ఆయనే బీజేపీ పార్టీ అభ్యర్థి అని కన్ఫామ్ అయిపోయింది. అయితే తర్వాత నియోజకవర్గానికి ఏకంగా ఇటు కేసీఆర్, అటు రేవంత్‌రెడ్డి పోటీకి వచ్చారు. దీంతో వెంకటరమణారెడ్డిని ఎవరూ పెద్దగా లెక్కలోకి తీసుకోలేదు. అయితే ఎక్కడా కుంగిపోకుండా, భయపడకుండా ఆత్మవిశ్వాసంతో వెంకటరమణారెడ్డి తన ప్రచారం చేసుకుంటూ వెళ్లారు. పనిచేసిన లోకల్ కార్డు.. ఎన్నికల ప్రచారంలో వెంకటరమణారెడ్డి వ్యూహాత్మకంగా లోకల్ కార్డును తెరపైకి తీసుకువచ్చారు. ఆయన ప్రచారంలో వాడి వేడి డైలాగులు ప్రయోగించారు. ‘గజ్వేల్ డిపో నుంచి వచ్చిన బస్సులు గజ్వేల్‌కు, కొడంగల్ నుంచి వచ్చిన బస్సులు కొడంగల్‌కు వెళ్లిపోతాయి. కామారెడ్డి డిపో బస్సులు మాత్రం ఇక్కడే ఉంటాయి’ అని తాను స్థానికుడిని అని పరోక్షంగా చెప్పేలా ప్రచారం చేశారు. వెంకటరమణారెడ్డి చెప్పిన ఈ మాటలు అక్కడి ప్రజలను ఆకర్షించింది. కేసీఆర్,రేవంత్‌రెడ్డిలలో ఎవరు గెలిచినా నియోజకవర్గంలో ఉండరని కామారెడ్డి ప్రజల్లోకి గట్టిగా తీసుకెళ్లారు. ఇదే ఆయన ఇద్దరు బడా నేతలపై విజయానికి కారణమైందని పొలిటికల్ అనలిస్టులు అభిపప్రాయపడుతున్నారు. గత ఎన్నికల్లో కామారెడ్డి నుంచి బీఆర్ఎస్ తరపున గంప గోవర్ధన్ విజయం సాధించి ఎమ్మెల్యేగా కొనసాగిన విషయం తెలిసిందే. -
కామారెడ్డిలో బీజేపీ సంచలన విజయం
సాక్షి, కామారెడ్డి: కామారెడ్డిలో బీజేపీ సంచలన విజయం సాధించింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం కేసీఆర్, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి బిగ్ షాక్ తగిలింది. కామారెడ్డిలో బీజేపీ అభ్యర్థి కాటిపల్లి వెంకట రమణ రెడ్డి విజయం సాధించారు. ఈరోజు కౌంటింగ్ ముందు నుంచి గేర్లు మారుస్తూ కామారెడ్డిలో ప్రతీ రౌండ్‌కు ఆధిక్యం మారుతూ వచ్చింది. చివరకు బీజేపీ అభ్యర్థినే గెలుపు వరించింది. అయితే, కామారెడ్డి నుంచి సీఎం కేసీఆర్, కాంగ్రెస్ సీఎం అభ్యర్థి రేవంత్ రెడ్డి బరిలో నిలిచిన విషయం తెలిసిందే. అయితే, కామారెడ్డి ఓటర్లు మాత్రం స్థానిక నేత అయిన వెంకట రమణ రెడ్డిపైనే నమ్మకం ఉంచి ఆయనను గెలిపించారు. ఇక, కౌంటింగ్‌లో చివరి నిమిషం వరకు కామారెడ్డి ఫలితం ఆసక్తికరంగా సాగాయి. ప్రతీ రౌండ్లోనూ ఆధిక్యం మారుతూ విజయం దోబూచులాడింది. ఒక సమయంలో కేసీఆర్, మరో సమయంలో రేవంత్ గెలుపు దిశగా ఫలితాలు వచ్చినా.. చిరవకు విజయం మాత్రం బీజేపీనే వరించింది. అయితే, వెంకట రమణా రెడ్డి గత ఎన్నికల్లో రెండు సార్లు పోటీ చేసి ఓటమి చెందారు. ఈసారి ఎన్నికల్లో మాత్రం విజయం సాధించారు. కామారెడ్డిలో ఇలా.. కామారెడ్డిలో 2009, 2014, 2018, 2012 ఉప ఎన్నికల్లో గంపా గోవర్దన్ గెలుపు. ఈ ఎన్నికల్లో సమీప అభ్యర్థి ప్రస్తుత షబ్బీర్ అలీపై గెలుపు. టీఆర్ఎస్ నుంచి బరిలో కేసీఆర్, రేవంత్ పోటీ. 2018లో టీఆర్ఎస్(బీఆర్ఎస్) పక్షాన గంపా గోవర్దన్, కాంగ్రెస్ తరపున సీనియర్ నేత, మాజీ మంత్రి, శాసనమండలిలో ప్రతిపక్ష నేతగా పనిచేసిన షబ్బీర్ అలీ పోటీ పడగా, గోవర్దన్ నే విజయం వరించింది. గోవర్దన్ 4,557 ఓట్ల తేడాతో విజయం సాదించగలిగారు. గోవర్దన్ కు 68,162 ఓట్లు రాగా, షబ్బీర్ అలీకి 63,610 ఓట్లు వచ్చాయి. ఈ విజయం కామారెడ్డి నియోజకవర్గ ప్రజల ప్రజలందరిది pic.twitter.com/bGLlHGOF6G — Katipally Venkata Ramana Reddy BJP (@kvr4kamareddy) December 3, 2023 -
కామారెడ్డిలో సీఎం కేసీఆర్ ఓటమి
సాక్షి, కామారెడ్డి: కామారెడ్డిలో సీఎం కేసీఆర్ ఓటమి చెందారు. బీజేపీ అభ్యర్థి వెంకటరమణారెడ్డి సంచలన విజయం సాధించారు. రెండో స్థానంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రేవంత్ రెడ్డి, కేసీఆర్ మూడో స్థానానికి పడిపోయారు. రాష్ట్రంలోనే వీవీఐపీ సెగ్మెంట్‌గా అందరి దృష్టిని ఆకర్షించిన కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం ఫలితంపై నరాలు తెగే ఉత్కంఠకు తెరపడింది. కామారెడ్డి కింగ్ ఎవరవుతారన్న దానిపై తెలంగాణ రాష్ట్రంలోనే కాదు.. తెలుగు రాష్ట్రాల్లోనే చర్చ జరిగింది. సీఎం కేసీఆర్ గజ్వేల్‌తో పాటు కామారెడ్డి నుంచి ఎన్నికల బరిలో నిలబడటంతో సీఎంను ఓడిస్తానంటూ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పోటీకి దిగిన సంగతి తెలిసిందే. సీఎం కేసీఆర్, పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిని ఓడించి బీజేపీ అభ్యర్థి తన సత్తా చాటారు. -
కామారెడ్డిలో కేసీఆర్ ఆధిక్య..
-
కామారెడ్డి, కొడంగల్ లో రేవంత్ రెడ్డి ముందంజ..
-
కామారెడ్డి పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో బీజేపీ ముందంజ
-
కామారెడ్డి కౌంటింగ్ సెంటర్..
-
కామారెడ్డిలో రేవంత్ రెడ్డి తమ్ముడు హల్ చల్
-
బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య వాగ్వాదం, తోపులాట
-
పేరు మారినంత మాత్రాన వీరి బుద్ధి మారదు: పీఎం మోదీ ఫైర్
సాక్షి, కామారెడ్డి: తెలంగాణలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ నేడు కామారెడ్డికి చేరుకున్నారు. ఈ సందర్భంగా మోదీకి బీజేపీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. ఇక, కామారెడ్డిలోని డిగ్రీ కాలేజీ మైదానంలో బీజేపీ బహిరంగ సభలో మోదీ పాల్గొన్నారు. బహిరంగ సభలో మోదీ మాట్లాడుతూ.. ‘పేరు మారినంత మాత్రాన వీరి బుద్ధి మారదు. యూపీఏ ఇండియా కూటమిగా మారింది. టీఆర్ఎస్ హఠాత్తుగా బీఆర్ఎస్గా మారింది. ఇండియా కూటమి అంటూ మళ్లీ మోసం చేసేందుకు జతకట్టారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ వారి పిల్లల కోసం చూసుకుంటారు. బీజేపీ మాత్రం ప్రజల పిల్లల కోసం ఆలోచిస్తుంది. కేసీఆర్, రేవంత్ ఇద్దరూ కామారెడ్డి నుంచి పోటీ చేస్తున్నారు. కామారెడ్డి ప్రజలకు మంచి అవకాశం వచ్చింది. అవినీతి, కుటుంబ పాలనను ఓడించే అవకాశం వచ్చింది. ఆ ఇద్దరూ తమ నియోజకవర్గాల్లో ఓడిపోతామని తెలిసే రెండు చోట్ల పోటీ చేస్తున్నారు. ఎన్నికల్లో విజయ కోసం ఈ రెండు పార్టీలు కుట్రలు పన్నుతారు.’ ‘బీఆర్ఎస్ నుంచి తెలంగాణకు విముక్తి లభించాలి. బీఆర్ఎస్ పాలనతో ప్రజలు విసిగిపోయారు. బీజేపీ చెప్పింది చేసి చూపిస్తుంది. వాగ్దానం ఇచ్చామంటే అది అమలై తీరుతుంది. తెలంగాణలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. సకల జనుల సౌభాగ్య తెలంగాణే మా లక్ష్యం. మహిళల రిజర్వేషన్లు, వన్ ర్యాంక్ వన్ పెన్షన్, అయోధ్య రామమందిర నిర్మాణం వంటి హామీలు నెరవేర్చాం. నిజామాబాద్‌లో పనుపు బోర్దు ఏర్పాటు చేస్తున్నాం.. గిరిజన యూనివర్సిటీ హామీని నిలబెట్టుకున్నాం. ఇచ్చిన హమీలను నిలబెట్టుకుంటున్నాం. బీజేపీ సామాజిక న్యాయానికి కట్టుబడి ఉంది. ఎస్సీ వర్గీకరణకు మద్దతు ప్రకటించాం. తెలంగాణలో మాదిగ సమాజానికి తీరని అన్యాయం జరిగింది. ఎస్సీ వర్గీకరణ కోసం కమిటీని వేశాం. బీఆర్ఎస్ దళితుడిని సీఎంని చేస్తామని చెప్పి ఓట్లు వేయించుకుంది. తీరా అధికారంలోకి వచ్చాక మాట తప్పింది. గ్యారంటీలను పూర్తి చేయడమే మోదీ గ్యారంటీ. బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని మాట ఇచ్చాం. సీఎంను చేసి తీరుతాం. కాంగ్రెస్, బీఆర్ఎస్ బీసీల కోసం ఏం చేయలేవు. తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. తెలంగాణ రైతుల కష్టాలు బీఆర్ఎస్కు పట్టడం లేదు. నీటి ప్రాజెక్టులు అవినీతితో నిండిపోయాయి. రైతుల సంక్షేమం కోసమే బీజేపీ ప్రాధాన్యతనిస్తుంది. ప్రాజెక్ట్‌ల నిర్మాణం బీఆర్ఎస్కు ఏటీఎంలా మారింది. తెలంగాణ రైతుల కోసం బాయిల్డ్ రైస్ కొనుగోలు చేయాలని నిర్ణయించాం. తెలంగాణ అభివృద్ధికి ఖర్చు కావాల్సిన డబ్బులు బీఆర్ఎస్ నేతల జేబుల్లోకి వెళ్తున్నాయి. రైతులకు అదనంగా ఆదాయం వచ్చేందుకు కృషి చేస్తున్నాం. పథకాలన్నీ బీఆర్ఎస్కు ఏటీఎంలా మారాయి. ఏళ్ల తరబడి ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతను బీఆర్ఎస్ మోసం చేసింది. పేపర్ లీకేజీలతో నిరుద్యోగ యువత దగా పడ్డారు. తెలంగాణ ఉద్యమంలో కాంగ్రెస్ తీరుతో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. పేదలు ఎవరూ ఆకలితో ఉండకూడదనే ఉచిత రేషన్‌ను మరో ఐదేళ్లు ఇస్తున్నాం. ఇద్దరు ఎంపీలు ఉన్న బీజేపీని ఇప్పుడు 300 స్థానాల్లో గెలిపించి ఆశీర్వదించారు. మేము తెలంగాణ ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉంటాం. కామారెడ్డిలో బీజేపీ అభ్యర్థిని గెలిపించండి. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుంది. బీసీ ముఖ్యమంత్రి కాబోతున్నారు’ అంటూ కామెంట్స్ చేశారు. -
ఎన్నికల గుర్తు కన్నా.. నువ్వే బాగున్నావ్!
కామారెడ్డిటౌన్: ‘ఎన్నికల గుర్తు కన్నా.. ఈ ఫొటోలో ఉన్న నువ్వే చాలా బాగున్నావ్’అంటూ రిటర్నింగ్ అధికారి తనను ఉద్దేశించి అసభ్యంగా మాట్లాడినట్లు కామారెడ్డి నియోజకవర్గ స్వతంత్ర మహిళా అభ్యర్థి మంగిలిపల్లి భార్గవి ఆరోపించారు. శుక్రవారం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మాక్ పోలింగ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తనకు కేటాయించిన బేబీవాకర్ గుర్తు ఈవీఎంలో సరిగా కనబడటంలేదని భార్గవి రిటర్నింగ్ అధికారి, ఆర్డీవో శ్రీనివాస్‌రెడ్డి దృష్టికి తెచ్చారు. ఆ అధికారి వెంటనే ‘ఈ ఎన్నికల గుర్తు కన్నా నువ్వే చాలా బాగున్నావ్’అంటూ అసభ్యంగా మాట్లాడారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. స్వతంత్ర అభ్యర్థులతో కలిసి ఆర్డీవో కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. నిరుద్యోగంతో బాధపడుతున్న తాను సీఎం కేసీఆర్‌పై పోటీ చేస్తున్నానని పేర్కొన్నారు. తనకు జరిగిన అవమానంపై ఆమె కంటతడి పెట్టారు. ఎన్నికల్లో ప్రధాన పార్టీల మహిళాఅభ్యర్థులు ఉంటే ఇలానే ప్రవర్తిస్తారా అని ప్రశ్నించారు. దీనిపై ఎన్నికల కమిషనర్‌కు ఫిర్యాదు చేస్తానన్నారు. ఈ విషయమై శ్రీనివాస్‌రెడ్డిని వివరణ కోరగా తాను అసభ్యపదజాలం వాడలేదని చెప్పారు. -
ఎల్లారెడ్డిలో హరీష్ ఎన్నికల ప్రచారం
-
మూడోసారి గెలిపిస్తే మరింత అభివృద్ధి
సాక్షి, కామారెడ్డి/ నాంపల్లి (హైదరాబాద్): ‘తొమ్మిదిన్నరేళ్ల కిందట ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వమే కదా? అప్పుడు ఎన్ని కష్టాలు పడ్డం. మరిచిపోతమా. కాలిపోయే మోటార్లు, పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు, కరెంటు ఎప్పుడు వస్తదో, ఎప్పుడు పోతదో తెలవదు. దొంగరాత్రి వచ్చిపోయే కరెంటు కోసం ఎంతమంది రైతన్నలు పొలం కాడికి పోయి పాము కాట్లు, తేలు కాట్లు, కరెంటు షాకులతో ప్రాణాలు కోల్పోయిండ్రు. ఆఖరుకు నక్సలైట్లు అనుకుని పోలీసులు కూడా కాల్చి చంపిరి. ఆ దుర్మార్గపు పాలన మళ్ల మనకు అవసరమా? రైతు ప్రభుత్వం కావాల్నా? రాబందు కాంగ్రెస్ కావాల్నా? ఒక్కసారి మనసుతోటి, గుండె లోతుల్లోంచి ఆలోచించుండ్రి. రైతు కష్టం తెలిసిన రైతుబిడ్డ ముఖ్యమంత్రిగా తొమ్మిదిన్నరేళ్లలో చేసిన మంచిని చూసి, మూడోసారి అధికారం అప్పగిస్తే రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుంది..’అని రాష్ట్ర మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. శనివారం కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం పెద్దమల్లారెడ్డి, కాచాపూర్ గ్రామాలతో పాటు బీబీపేట మండల కేంద్రంలో, హైదరాబాద్‌లోని నాంపల్లిలో జరిగిన రోడ్‌షోల్లో ఆయన ప్రసంగించారు. కాంగ్రెస్ గెలిస్తే అంధకారమే ‘రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం హ్యాట్రిక్ సాధించడం తథ్యం. ఈ ఎన్నికల్లో వంద సీట్లతో అధికారంలోకి రాబోతున్నాం. కాంగ్రెస్ వాళ్లకు 11 సార్లు అవకాశం ఇచ్చినం గదా. మళ్లీ పొరపాటున కాంగ్రెస్‌కు అధికారం ఇస్తే అంధకారమే. ఎద్దు, ఎవుసం తెలియని సన్నాసుల చేతుల్లో పడితే రాష్ట్రం ఆగమవుతుంది. రైతుబంధు వద్దని, మూడు గంటల కరెంటు చాలని వాళ్లు అంటున్నారు. రూ.50 లక్షలతో దొరికినోడు నీతి మాటలు చెబితే విందామా? కొత్తగా భట్టి విక్రమార్క పట్వారీ వ్యవస్థను తీసుకువస్తామని అంటున్నారు. దీనిపై అప్రమత్తంగా ఉండాలి. తెలంగాణ తెచ్చిన కేసీఆర్‌కు ఈ ప్రాంతం మీద ప్రేమ ఉంటది గని, రాహుల్ గాం«దీకో, మోదీకో ఉంటదా? గడచిన తొమ్మిదన్నరేళ్ళలో కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు నేడు ఇంటింటికీ అందుతున్నాయి. అభివృద్ధి, సంక్షేమంతో పాటు ఎలాంటి గొడవలు, కర్ఫ్యూలు లేకుండా ప్రశాంతంగా సీఎం ప్రభుత్వాన్ని నడిపారు. డిసెంబర్ 3వ తేదీ తర్వాత కొత్త సంక్షేమ పథకాలు అమలవుతాయి. రైతుబంధు రూ.10 వేల నుంచి రూ.16 వేలకు పెరుగుతుంది. బీడీ కారి్మకులందరికీ రూ.5 వేల పింఛన్ ఇస్తాం. అన్నపూర్ణ పథకం ద్వారా సన్న బియ్యం, రూ.4 వందలకే గ్యాస్ సిలిండర్ అందిస్తాం. అలాగే 18 ఏండ్లు నిండిన మహిళలందరికీ రూ.3 వేలు ఇస్తాం. ’అని కేటీఆర్ హామీ ఇచ్చారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మైనార్టీలపై చిన్నచూపు ‘అధికారంలోకి వచ్చాక జన్‌ధన్ ఖాతాను తెరిస్తే ధనాధన్ రూ.15 లక్షల చొప్పున నగదు వేస్తామని ఇచ్చిన హామీని మోదీ విస్మరించారు. రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తానని మాటిచ్చి మరిచిపోయారు. బీజేపీ అధికారంలో ఉన్న ప్రతి రాష్ట్రంలో ముస్లిం మైనార్టీలపై చిన్నచూపును ప్రదర్శిస్తున్నారు. కానీ తెలంగాణలో కేసీఆర్ అన్ని వర్గాల ప్రజలకు సమతూకాన్ని ప్రదర్శిస్తూ సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారు. రాష్ట్రంలో మైనార్టీలకు తొమ్మిదేళ్ళ కాలంలో రూ.12,780 కోట్ల బడ్జెట్‌ను కేటాయించిన ఘనత కేసీఆర్‌దే. ప్రస్తుతం హైదరాబాద్‌కు మించిన నగరం దేశంలో మరెక్కడా లేదు. రజనీకాంత్, సన్నీ డియోల్ లాంటి బయటి వారికి హైదరాబాద్ గొప్పదనమేమిటో తెలుస్తుంటే, ఇక్కడే ఉండే హైద రాబాద్ గజినీలకు మాత్రం అర్ధం కావడం లేదు..’ అని కేటీఆర్ ధ్వజమెత్తారు. మూడోసారి బీఆర్ఎస్ను గెలిపిస్తే హైదరాబాద్‌ను గ్లోబల్ సిటీగా తీర్చి దిద్దుతామని హామీ ఇచ్చారు. ఆయా సభల్లో ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, ఎంపీ బీబీ పాటిల్, నాంపల్లి బీఆర్ఎస్ అభ్యర్థి ఆనంద్‌కుమార్ గౌడ్, దాసోజు శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు. వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ చూస్తా చిలకలగూడ: ‘నాకు క్రికెట్ అంటే చాలా ఇష్టం. ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నా ఆదివారం జరిగే క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌ను చూసేందుకు ప్రయత్నిస్తా. సెమీ ఫైనల్లో విరాట్ కోహ్లీ సెంచరీ చేశాడు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ కూడా సెంచరీ సీట్లు సాధించడం ఖాయం. సెమీ ఫైనల్లో బౌలర్ షమీ ప్రత్యర్థులను ఓడించినట్లు, సీఎం కేసీఆర్ కూడా ప్రత్యర్థులను ఓడించి హ్యాట్రిక్ సీఎం కావడం ఖాయం..’అని శనివారం రాత్రి హైదరాబాద్ మైలార్‌గడ్డ వద్ద రోడ్‌షోలో కేటీఆర్ దీమావ్యక్తం చేశారు. -
కామారెడ్డి భూములపై కేసీఆర్ కన్ను
సాక్షి, కామారెడ్డి: ‘ఓటుకు రూ.10 వేల చొప్పున రూ.200 కోట్లు ఖర్చుచేసి రెండు లక్షల ఓట్లు కొని, రూ.2 వేల కోట్ల విలువైన భూములను కొల్లగొట్టాలని సీఎం కేసీఆర్ చూస్తున్నాడు. మీ అండతో భూములు మింగే అనకొండల భరతం పడతా. తెలంగాణను దోచుకున్న కేసీఆర్‌ను ఎన్నికల్లో ఓడించాలి..’ అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. శనివారం కామారెడ్డి జిల్లా భిక్కనూరు, రాజంపేట మండల కేంద్రాల్లో నిర్వహించిన రోడ్ షోల్లో ఆయన మాట్లాడారు. ‘గజ్వేల్‌లో భూములను కొల్లగొట్టి అక్కడి రైతులను రోడ్డు పాలు జేసిండ్రు. ఇప్పుడు వాళ్ల కన్ను కామారెడ్డి మీద పడ్డది. పచ్చని పంటలు పండే భూములను కొల్లగొట్టేందుకే వస్తుండ్రు. పాము పాలుపోసి పెంచినోళ్లను కూడా వదలదు. అందుకే మీ భూములను కొల్లగొట్టడానికి వస్తున్న కేసీఆర్‌ను ఓటుతో బండకేసి కొట్టాలి. మన భూములు మన చేతిలో ఉండాలంటే కేసీఆర్‌ను ఓడించాల్సిందే. బీరయ్య అనే రైతు వడ్ల కుప్పమీద చనిపోయినపుడు, వడగండ్ల వానలతో పంటలు దెబ్బతిన్నపుడు గుర్తుకు రాని అమ్మమ్మ ఊరు, అమ్మ పుట్టిన ఊరు.. కేసీఆర్‌కు ఇప్పుడు ఎందుకు గుర్తుకు వస్తోందో ఆలోచించాలి. 40 ఏళ్లు పదవుల్లో ఉన్నపుడు ఏ ఒక్కనాడూ కోనాపూర్ గుర్తుకు రాలేదు. ఇప్పుడు ఓట్లు కావాలనే అమ్మ ఊరు అంటున్నాడు. ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే సిద్దిపేటకో, సిరిసిల్లకో పోవచ్చు. లేదంటే అంత మంచిగ జేసిన అంటున్న గజ్వేల్‌లోనే ఉండొచ్చు. కానీ కామారెడ్డికి రావడంలోనే పెద్ద ప్లాన్ ఉంది. ఇక్కడి భూముల మీద కేసీఆర్, ఆయన కుటుంబం, బంధువులు కన్నేశారు..’ అని రేవంత్ ఆరోపించారు. నిరుద్యోగుల ఉసురుపోసుకుండు... ‘తెలంగాణ వస్తే ఉద్యోగాలొస్తాయని చెప్పిన ముఖ్యమంత్రి లక్షలాది మంది నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్నాడు. ఉద్యోగాల కోసం నిరుద్యోగులు కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరుగుతున్నారు. కేసీఆర్ కుటుంబంలో కేసీఆర్‌కు, కొడుక్కు, అల్లుడికి, బిడ్డకు, తోడల్లుడి కొడుక్కు ఉద్యోగాలు వచ్చాయి గానీ నిరుద్యోగులకు మాత్రం రాలేదు. మూడోసారి గెలిపించండి అంటూ కొడుకును ముఖ్యమంత్రిని జేసేందుకు కేసీఆర్ తాపత్రయపడుతున్నాడు. మందు తాగించి, పైసలు పంచి ఓట్లు దండుకోవాలని జూస్తున్న కేసీఆర్ పట్ల నిరుద్యోగులు అప్రమత్తంగా ఉండాలి. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 2 లక్షల ఖాళీలను భర్తీ చేస్తాం..’ అని చెప్పారు. అయ్య వీధికుక్క.. కొడుకు పిచ్చి కుక్క.. ‘నేను ఇరవై ఏళ్లుగా ప్రతిపక్షంలో ప్రజల పక్షాన పోరాడి, ప్రజల గొంతుకగా పనిచేశా. కేసీఆర్‌ను నిలదీసినందుకే నన్ను జైళ్లకు పంపిండు. అయినా వెరవకుండా కొట్లాడుతూనే ఉన్నా. ఇప్పుడు కేసీఆర్, కేటీఆర్‌లకు ఓటమి భయం పట్టుకుని నన్ను కుక్కతో పోల్చారు. తెలంగాణ రాగానే దళితున్ని ముఖ్యమంత్రిని జేసి, తాను కాపలా కుక్కలాగా ఉంటానన్న కేసీఆర్.. దళితున్ని ముఖ్యమంత్రిని చేయకుండా మోసం జేశాడు. కాపలా కుక్కలా ఉండకుండా వీధికుక్కలా కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, ఆఖరుకు పంజాబ్‌కు వెళ్లి మన పైసలు పంచాడు. కొడుకు కేటీఆర్ పిచ్చికుక్కలా ఎవరిని పడితే వాళ్లను కరుస్తున్నాడు. వీధికుక్కను, పిచ్చి కుక్కను పొలిమెరలు దాటేదాకా తరమాల్సిన బాధ్యత కామారెడ్డి ఓటర్లపై ఉంది..’ అని రేవంత్‌రెడ్డి అన్నారు. ప్రభుత్వం హెలికాప్టర్ రాకుండా కుట్ర చేసినా, తన కోసం వేలాది మంది ప్రజలు ఎదురుచూస్తున్నారని, తాను రోడ్డు మార్గాన వచ్చానని చెప్పారు. మూడు గంటలు ఆలస్యంగా వచ్చి నా, తన కోసం ఎదురుచూసిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. సభలో మాజీ మంత్రి షబ్బీర్ అలీ, పార్టీ నేతలు యూసుఫ్‌అలీ, ఈరవత్రి అనిల్, అరికెల నర్సారెడ్డి, నేరెళ్ల శారద, కైలాస్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
గజ్వేల్, కామారెడ్డిలో బీజేపీదే గెలుపు
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పోటీ చేస్తున్న గజ్వేల్, కామారెడ్డిలో ఆయన ఓడిపోతారని, ఆ రెండు స్థానాల్లోనూ బీజేపీ విజయం సాధిస్తుందని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్‌పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, ఈసారి ఎన్నికల్లో తండ్రీకొడుకులిద్దరూ ఓడిపోవడం ఖాయమని తెలిపారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, గజ్వేల్‌లో ఓటమి భయంతోనే కేసీఆర్ రెండుచోట్ల పోటీ చేస్తున్నారని చెప్పారు. ఈటల బరిలో ఉంటున్నాడని తెలిసినప్పటి నుంచి కేసీఆర్‌కు నిద్ర పట్టడం లేదని, కామారెడ్డిలోనూ వెంకటరమణారెడ్డి చేతిలో ఓడిపోతారన్నారు. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 111 స్థానాల్లో, జనసేన 8 స్థానాల్లో పోటీలో ఉందని తెలిపారు. బీజేపీ తరపున నామినేషన్ వేసిన రెబల్స్ దాదాపు ఉపసంహరించుకున్నారని చెప్పారు. బీజేపీ నుంచి 36 మంది, జనసేన నుంచి ముగ్గురు బీసీ అభ్యర్థులు పోటీలో ఉన్నారని, కాంగ్రెస్ 22 మంది బీసీలకు మాత్రమే టికెట్లు ఇచ్చిందని, బీఆర్ఎస్ 23 మంది బీసీలకు టికెట్ ఇచ్చిందని చెప్పారు. రెండు జనరల్ స్థానాలను కూడా దళితులకే ఇచ్చామన్నారు. బీజేపీ 14 మంది మహిళలకు టికెట్లు ఇవ్వగా, బీఆర్ఎస్ 8 మంది మహిళలకే టికెట్ కేటాయించిందన్నారు. 17న రాష్ట్రానికి అమిత్‌షా... ఈ అసెంబ్లీ ఎన్నికలు తెలంగాణ భవిష్యత్‌కు సంబంధించిన ఎన్నికలని, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు ఓటేస్తే నష్టమే తప్ప ఎలాంటి మార్పూ రాదని, కుటుంబ, అవినీతి పాలనలో ఈ రెండు పార్టీలూ మునిగిపోయాయన్నారు. రాష్ట్రంలో బీజేపీకి అనుకూలమైన వాతావరణం ఏర్పడిందని, కొందరు దొంగ కంపెనీల పేరిట తప్పుడు సర్వేలు చేస్తున్నారని కిషన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈనెల 17న రాత్రి కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణకు వస్తున్నారని, 18న నాలుగు జిల్లాల్లో సభలు ఉంటాయని, వరంగల్, నల్లగొండ, రాజేంద్రనగర్ అసెంబ్లీల వారీగా బీసీ సంఘాలతో సదస్సు నిర్వహిస్తున్నామని వెల్లడించారు. కేసీఆర్ ప్రభుత్వంలో తెలంగాణ ప్రజలకు బానిస బతుకు మాత్రమే మిగిలిందని, అందుకే గజ్వేల్, కామారెడ్డిలో కేసీఆర్‌కు వ్యతిరేకంగా చాలామంది నామినేషన్లు వేశారన్నారు. నెలరోజుల్లో పదవి దిగిపోయే కేసీఆర్ ఇప్పుడు మెడికల్ కాలేజీల గురించి మాట్లాడుతున్నారని, సరైన సమయంలో భూములు చూపకుంటే అందుకు బాధ్యత ఎవరిదని ప్రశ్నించారు. ఎన్నికల తర్వాత టెక్స్టైల్ పార్క్, సైన్స్ సిటీ, కల్చరల్ సెంటర్ ఏర్పాటు చేస్తామన్నారు. పాతబస్తీలో నిరుపేద ముస్లింల భూములు లాక్కుని షాదీఖానాలు ఏర్పాటు చేస్తున్నారని, బీజేపీ వారికి రక్షణగా ఉంటుందన్నారు. సీఎం కేసీఆర్ అఖిలేశ్ యాదవ్, శరద్ పవార్, నితీశ్ కుమార్, కేజ్రీవాల్, కుమారస్వామి తదితర ప్రాంతీయ పార్టీల నేతలను కలిశారని, వారికి ప్రత్యేక విమానాలు పంపించి మరీ దావత్ ఇచ్చారని, వారిలో ఒక్కరైనా ఇప్పుడు మద్దతిచ్చారా అని కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. బీజేపీ అధికారంలోకి రాగానే మతపరమైన రిజర్వేషన్లు రద్దు చేస్తామన్నారు. ఈ ఎన్నికల్లో పవన్ కల్యాణ్ కూడా ప్రచారం చేస్తారని చెప్పారు. -
ఆ ఏడు స్థానాల్లో అదనపు బ్యాలెట్ యూనిట్లు
సాక్షి, హైదరాబాద్, సాక్షి, సిద్దిపేట/గజ్వేల్: సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్న రెండు నియోజకవర్గాలతో పాటు మరో అయిదు సెగ్మెంట్లలో అభ్యర్ధులు లెక్కకి మించి ఉండటంతో అదనపు బ్యాలెట్ యూనిట్లను అమర్చి పోలింగ్ నిర్వహించాల్సిన పరిస్థితి నెలకొంది. కేసీఆర్ గజ్వేల్, కామారెడ్డి శాసనసభ నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తుండగా, బుధవారం నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసిన తర్వాత గజ్వేల్ నుంచి 44 మంది, కామారెడ్డి నుంచి 39 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. దీంతో ఈ రెండు శాసనసభ నియోజకవర్గాల్లో పోలింగ్ రోజు వినియోగించనున్న ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల(ఈవీఎం)కు మూడు చొప్పున బ్యాలెట్ యూనిట్లను అమర్చి పోలింగ్ నిర్వహించనున్నారు. ఈవీఎంలకు మూడు బ్యాలెట్ యూనిట్లు ఒక ఈవీఎంలో కంట్రోల్ యూనిట్, బ్యాలెట్ యూనిట్, వీవీ ప్యాట్ అనే మూడు ప్రధాన విభాగాలుంటాయి. ఒక బ్యాలెట్ యూనిట్‌పై నోటాతో సహా 16 మంది అభ్యర్థుల పేర్లు, ఎన్నికల గుర్తు, ఫోటో ఉంటాయి. నియోజకవర్గంలో 16 మందికి మించి అభ్యర్థులు పోటీ చేస్తే ఒకటికి మించి బ్యాలెట్ యూనిట్లను వాడాల్సి ఉంటుంది. నోటాతో కలిపి అభ్యర్థుల సంఖ్య 17 నుంచి 32లోపు ఉంటే రెండు బ్యాలెట్ యూనిట్లు, 33 నుంచి 48లోపు ఉంటే మూడు బ్యాలెట్ యూనిట్లను వినియోగించక తప్పదు. దీంతో గజ్వేల్, కామారెడ్డిలో వినియోగించనున్న ఈవీఎంలకు మూడు చొప్పున బ్యాలెట్ యూనిట్లను అమర్చి పోలింగ్ నిర్వహించనున్నారు. ‘ఎం3’రకం ఈవీఎంల వినియోగం 2013 నుంచి అందుబాటులోకి వచ్చిన ‘ఎం3’రకం ఈవీఎంలను రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో వినియోగిస్తున్నారు. ఒక కంట్రోల్ యూనిట్‌కు వీవీ ప్యాట్‌తో పాటు గరిష్టంగా 24 బ్యాలెట్ యూనిట్లను అనుసంధానం చేసి ఒక ఈవీఎంను తయారు చేయవచ్చు. దీంతో ఒకే ఈవీఎం ఆధారంగా గరిష్టంగా 384 అభ్యర్థులకు పోలింగ్ నిర్వహించవచ్చు. 384 మందికి లోపు అభ్యర్థులు పోటీ చేస్తే ఒకే కంట్రోల్ యూనిట్‌కు అవసరమైన సంఖ్యలో బ్యాలెట్ యూనిట్లను అమర్చనున్నారు. అయితే, అభ్యర్థుల సంఖ్య 384కు మించితే రెండో కంట్రోల్ యూనిట్‌ను వినియోగించక తప్పదు. 2006 నుంచి 2013 వరకు జరిగిన ఎన్నికల్లో ‘ఎం2’రకం ఈవీఎంలను ఎన్నికల సంఘం వినియోగించింది. ఆ తర్వాత నుంచి జరుగుతున్న ఎన్నికల్లో ‘ఎం3’రకం ఈవీఎంలను వాడుతోంది. ఒక ఈవీఎం గరిష్టంగా 2వేల ఓట్లను నమోదు చేయగల సామరŠాధ్యన్ని కలిగి ఉండనుంది. సాధారణంగా 1500 ఓట్లకు మించి ఒక పోలింగ్ కేంద్రానికి ఓట్లను కేటాయించరు. ఓటర్లు కన్ఫ్యూజ్ అవుతారేమోనని పార్టీల ఆందోళన సోమవారంతో ముగిసిన నామినేషన్ల పరిశీలన అనంతరం గజ్వేల్‌లో 114 మంది బరిలో ఉండగా, బుధవారం 70 మంది అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. కామారెడ్డిలో నామినేషన్ల పరిశీలన అనంతరం 58 మంది అభ్యర్థులు బరిలో నిలవగా, 19 మంది అభ్యర్థులు నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. చివరకు గజ్వేల్ నుంచి మొత్తం 44 మంది, కామారెడ్డి నుంచి మొత్తం 39 మంది పోటీ చేస్తుండగా, రెండు చోట్లలో కూడా మూడు బ్యాలెట్ యూనిట్లతో పోలింగ్ నిర్వహించనుండడంతో ఓటర్లు కొంత గందరగోళానికి గురయ్యే ప్రమాదముందని రాజకీయ పార్టీలు ఆందోళనకు గురి అవుతున్నాయి. మరో 5 చోట్ల సైతం... ఎల్బీనగర్లో 38 మంది, శేరిలింగంపల్లిలో 33 మంది అభ్యర్థులు బరిలో మిగలడంతో అక్కడ సైతం 3 బ్యాలెట్ యూనిట్లను వినియోగించనున్నారు. ఇబ్రహీంపట్నంలో 28 మంది, మహేశ్వరంలో 27 మంది, రాజేంద్రనగర్‌లో 25 మంది అభ్యర్థులు మిగలడంతో ఈ చోట్లలో రెండు బ్యాలెట్ యూనిట్లతో పోలింగ్ జరపనున్నారు. -
150 కోట్ల మంది చూపు కామారెడ్డి వైపే : రేవంత్‌రెడ్డి
సాక్షి, కామారెడ్డి : పది సంవత్సరాలు కష్టాలు పడ్డామని, కేసీఆర్‌కు తిరిగి చెల్లించే సమయం వచ్చిందని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి అన్నారు. ఇవాళ కామారెడ్డిలో జరిగిన కాంగ్రెస్ సభలో రేవంత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కామారెడ్డి ఎన్నికల తీర్పు భారత దేశ చరిత్రలో గొప్ప తీర్పుగా నిలవాలన్నారు. 150 కోట్ల మంది కామారెడ్డి వైపు చూస్తున్నారన్నారు. ‘డబ్బు, మద్యంతో ప్రజలను మభ్యపెట్టి గెలవాలనుకుంటున్నాడు కేసీఆర్. తెలంగాణలో ఉచిత కరెంట్, మైనార్టీలకు రిజర్వేషన్ ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మనతో లేరు కానీ ఆయన హయాంలో 12 వేల కోట్ల రూపాయల కరెంటు బకాయిల రద్దు చేశారు. ప్రశ్న పత్రాల లీకేజీ , ఉచిత కరెంట్, మిషన్ కాకతీయ, మేడిగడ్డ, పాలమూరు ప్రాజెక్టు గురించి కేసీఆర్ మాట్లాడతలేడు. ప్రపంచం మొత్తం కామారెడ్డి వైపు చూస్తోంది. ఎమ్మెల్యేగా ఎక్కడైనా గెలుస్త కానీ కేసీఆర్‌కు బుద్ధి చెప్పడానికి కామారెడ్డికి వచ్చిన. కామారెడ్డి రాష్ట్ర భవిష్యత్తును మార్చబోతోంది. కర్ణాటకలో గెలిచినట్లుగానే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలోనూ జెండా ఎగురవేస్తుంది 24 గంటల ఉచిత విద్యుత్‌పై కామారెడ్డి చౌరస్తాలో చర్చకు సిద్ధం. తెలంగాణలో 24గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నట్లు నిరూపిస్తే అటు కొడంగల్‌లో, ఇటు కామారెడ్డిలో నేను నామినేషన్ ఉపసంహరించుకుంటా. సాయంత్రం 3 గంటల వరకు నామినేషన్ ఉపసంహరణకు టైం ఉంది. లాగ్‌బుక్‌లు తీసుకుని కామారెడ్డికి రా’ అని రేవంత్ సవాల్ విసిరారు. దొరల రాజ్యానికి..ప్రజల రాజ్యానికి పోటీ.. షబ్బీర్ అలీ ‘కామారెడ్డిలోని పచ్చని భూములపై కేసీఆర్ కన్ను పడింది. కామారెడ్డిలో కేసీఆర్‌పై రేవంత్‌రెడ్డి పోటీ చేయలని పార్టీ అధిష్టానం నిర్ణయించింది. రేవంత్ రెడ్డి పోటీ చేయడం కామారెడ్డి ప్రజల అదృష్టం. కామారెడ్డిలో దొరల రాజ్యానికి ప్రజల రాజ్యానికి మధ్య పోటీ జరుగుతోంది. ప్రతి కార్యకర్త నేనే రాహుల్ గాంధీ, నేనే సోనియా గాంధీ, నేనే రేవంత్ రెడ్డి, నేనే షబ్బిర్ అలీ అని భావించుకొని పనిచేయాలి’ అని షబ్బీర్ అలీ కోరారు. ఇదీచదవండి..శుభకార్యాలు.. ప్రచారాలు -
రసవత్తరంగా కామారెడ్డి, గజ్వేల్ పోరు
-
గజ్వేల్, కామారెడ్డిలో కేసీఆర్ గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీఆర్ఎస్
-
అందరి దృష్టి కామారెడ్డిపైనే..
ఎస్. వేణుగోపాలచారి: కామారెడ్డిలో ఏం జరుగుతుంది.. ఈ ఎన్నికల్లో ఇప్పుడు అందరి దృష్టి అదే. తెలంగాణ తెచ్చిన నేతగా, ముచ్చటగా మూడోసారి సీఎం పీఠాన్ని అధిరోహించాలన్న పట్టుదలతో కేసీఆర్‌లో కామారెడ్డిలో బరిలోకి దిగగా, ఆయనపై పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి పోటీకి దిగడమే చర్చకు ప్రధాన కారణం. రాజకీయ పార్టీలు, మీడియా సంస్థలు జనం నాడి పట్టేందుకు సర్వేల మీద సర్వేలు చేస్తున్నాయి. కేసీఆర్, రేవంత్‌రెడ్డితోపాటు బీజేపీ నుంచి స్థానికంగా గట్టి పట్టు సంపాదించిన కాటిపల్లి వెంకటరమణారెడ్డి పోటీ చేస్తున్నారు. ఈయనకు నియోజకవర్గంలో బలమైన కేడర్ ఉంది. మూడ్ ఎలా ఉంటుందో.. సాధారణంగా వీవీఐపీలు పోటీ చేసే నియోజక వర్గాల్లో ప్రజల నాడి త్వరగా బయటపడుతుంది. కానీ ఇక్కడ రెండు పార్టీల కీలక నేతలు పోటీ చేస్తుండడం, వారికితోడు స్థానికుడైన బలమైన నాయకుడు బరిలో ఉండడంతో పోటీ ఎవరి మధ్యన ఉంటుందన్నదానిపై ఇప్పటికైతే క్లారిటీ రావడం లేదు. స్వయంగా సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్నారంటే అభివృద్ధి పరుగులు పెడుతుందన్న భావన కొన్ని సెక్షన్లలో ఉండడం సహజం. అధికార బీఆర్ఎస్పై ఉన్న ఒకింత వ్యతిరేకత ఓట్లను ప్రతిపక్ష పార్టీలు రెండూ పంచుకుంటే అధికార పార్టీకి లాభం జరుగుతుందనే అంచనాలు ఉంటాయి. పేగుబంధం సెంటిమెంట్‌తో కేసీఆర్ రెండు పర్యాయాలుగా గజ్వేల్ నుంచి పోటీ చేసి విజయం సాధించిన సీఎం కేసీఆర్ ఈసారి గజ్వేల్‌తో పాటు మరో నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని అనుకున్నారు. తాను పోటీ చేయడం వల్ల ఈ ప్రాంతంలో ఐదారు నియోజక వర్గాలపై ప్రభావం చూపవచ్చనే ఉద్దేశంతో రెండు స్థానాల్లో పోటీకి సిద్ధమయ్యారు. 44వ నంబరు జాతీయ రహదారి ద్వారా హైదరాబాద్‌కు కేవలం గంటన్నరలో చేరుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో కేసీఆర్ కామారెడ్డిని ఎంచుకున్నట్టు భావిస్తున్నారు. దీనికి తోడు కేసీఆర్ తల్లి పుట్టి పెరిగిన ఊరు కావడంతో ఈ ప్రాంతంతో ఆయనకు పేగుబంధం ఉన్నది. ఇక్కడ పోటీ చేయాలన్న నిర్ణయానికి వచ్ఛిన దరిమిలా కేసీఆర్ అందుకు అనుగుణంగా కార్యాచరణ రూపొందించారు. ఎన్నికల షెడ్యూల్ రాకముందే అభివృద్ధి పనులకు భారీగా నిధులు కేటాయించారు. సర్వేల మీద సర్వేలు... ఇప్పుడు కామారెడ్డి సర్వే రాయుళ్లకు కేరాఫ్ నిలిచిందంటే అతిశయోక్తి కాదు. జనం నాడి పట్టేందుకు ఓ పక్క రాజకీయ పార్టీలు సొంతంగా సర్వేలు చేయించుకుంటుండగా, మరో పక్క నిఘా వర్గాలు, మీడియా సంస్థలు పోటాపోటీగా సర్వేలు చేస్తున్నాయి. కాటిపల్లి ’లోకల్’ బీజేపీ అభ్యర్ధిగా బరిలో నిలిచిన జెడ్పీ మాజీ చైర్మన్ కాటిపల్లి వెంకటరమణారెడ్డి గత నాలుగైదేళ్లుగా నియోజక వర్గంలో నిరంతరం ప్రజా సమస్యలపై అనేక పోరాటాలకు నాయకత్వం వహించారు. డ్వాక్రా మహిళలకు రావలసిన వడ్డీ రాయితీ డబ్బుల కోసం, మాస్టర్ ప్లాన్‌తో నష్టం జరుగుతోందని ఆందోళన చెందిన రైతుల కోసం ఈయన అండగా అండగా నిలిచి ఉద్యమానికి నాయకత్వం వహించారు. డబుల్ బెడ్ రూం ఇళ్లను పేదలకు కేటాయించాలని పెద్ద పోరాటమే చేశారు. ఇలా వరుస ఉద్యమాలతో జనంతో మమేకమైన వెంకటరమణారెడ్డి తనకు స్థానికులు ఓట్లు వేసి పట్టం కడతారని ఆశిస్తున్నారు. ఆ మేరకు రూ.150 కోట్లతో సొంత మేనిఫెస్టోను అమలు చేస్తానని ప్రకటించాడు. సీఎం పోటీ చేస్తున్నా.. వెరవకుండా తన పని తాను చేసుకుంటూ పోతున్నారు. సవాల్ చేసి మరీ బరిలోకి దిగిన రేవంత్... అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్యన జరిగే మాటల యుద్ధంలో పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి సీఎంకు దమ్ముంటే కొడంగల్‌కు వచ్చి నిలబడమని లేదంటే, తానే కామారెడ్డికి వచ్చి పోటీ చేస్తానంటూ పలుమార్లు సవాళ్లు విసిరారు. సీఎం గానీ, ఆయన పార్టీ నేతల నుంచి గానీ ఎలాంటి స్పందన రాలేదు. కానీ సవాల్ విసిరిన రేవంత్‌రెడ్డి కామారెడ్డి నుంచి బరిలోకి దిగారు. -
గజ్వేల్‌లో 145 .. కామారెడ్డిలో 92
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ శుక్రవారంతో ముగిసిపోగా, రాష్ట్రంలోని మొత్తం 119 శాసనసభ నియోజకవర్గాల్లో 4,798 మంది అభ్యర్థులు నామినేషన్ వేశారు. మొత్తం 5,716 సెట్ల నామినేషన్లు దాఖలయ్యాయి. సీఎం కేసీఆర్ సొంత నియోజకవర్గం గజ్వేల్‌తోపాటు కామారెడ్డి నుంచి పోటీ చేస్తుండగా, గజ్వేల్‌లో రాష్ట్రంలోనే అత్యధికంగా 145 మంది అభ్యర్థులు నామినేషన్ వేశారు. కామారెడ్డిలో సైతం 92 మంది నామినేషన్ వేయడం గమనార్హం. మేడ్చల్ నియోజకవర్గంలో 116 మంది, ఎల్బీనగర్ నుంచి 77 మంది, మునుగోడు నుంచి 74 మంది, సూర్యాపేట నుంచి 68 మంది, మిర్యాలగూడ నుంచి 67 మంది, నల్లగొండ నుంచి 64 మంది, సిద్దిపేట నుంచి 62 మంది, కోదాడ నుంచి 61 మంది నామినేషన్ వేశారు. అత్యల్పంగా నారాయణపేట్ స్థానం నుంచి 13 మంది మాత్రమే నామినేషన్లు వేశారు. ఈ నెల 13న నామినేషన్ల పరిశీలన నిర్వహించనుండగా, 15వ తేదీతో నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగియనుంది. పోస్టల్ బ్యాలెట్ కోసం 31,551 దరఖాస్తులు పోస్టల్ బ్యాలెట్ సదుపాయం కోసం భారీ సంఖ్యలో ఓటర్లు దరఖాస్తు చేసుకున్నారు. దివ్యాంగులు, వయోజనులు, ఎన్నికలతో సంబంధం లేని అత్యవసర సేవల్లో ఉండే ఓటర్లు కలిపి మొత్తం 31,551 మంది పోస్టల్ బ్యాలెట్ సదుపాయం కోసం దరఖాస్తు చేసుకున్నారు. అత్యధికంగా సిద్ధిపేట నుంచి 757 మంది, అత్యల్పంగా మక్తల్ నియోజకవర్గం నుంచి 5 మంది దరఖాస్తు చేసుకున్నారు. వయోజన, దివ్యాంగ ఓటర్లకు ఇంటి వద్దే పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటేసేందుకు అవకాశం కల్పిం చనున్నారు. 3.26 కోట్లకు పెరిగిన ఓటర్లు ఈ నెల 5న తుది ఓటర్ల జాబితాను ప్రకటించగా, ఆ తర్వాత వచ్చిన ఓటర్ల నమోదు దరఖాస్తులను పరిష్కరించి శుక్రవారం అనుబంధ ఓటర్ల జాబితాను ప్రకటించారు. దీంతో రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య 3,26,18,205కి పెరిగింది. అందులో 1,62,98,418 మంది పురుషులు, 1,63,01,705 మంది మహిళలు, 2,676 మంది థర్డ్ జెండర్ ఓటర్లు ఉన్నారు. తొలిసారిగా మహిళా ఓటర్ల సంఖ్య పురుష ఓటర్లకు మించిపోయింది. 15,406 మంది సర్విసు ఓటర్లు, 2,944 మంది ఓవర్సీస్ ఓటర్లున్నారు. 2023 జనవరితో పోల్చితే తాజాగా రాష్ట్రంలో 8.75 శాతం మంది ఓటర్లు పెరిగారు. 80 ఏళ్లకు పైబడిన ఓటర్లు 44,371 మంది ఉండగా, వికలాంగ ఓటర్లు 506921 మంది ఉన్నారు. 18–19 ఏళ్ల యువ ఓటర్ల సంఖ్య 9,99,667 కాగా, మొత్తం ఓటర్లలో వీరి శాతం 3.06గా ఉంది. -
అమలు గ్యారంటీ
సాక్షి, కామారెడ్డి: కర్ణాటకలో కాంగ్రెస్ హామీలు నెరవేర్చడం లేదని, తెలంగాణలో ఏం అమలు చేస్తుందంటూ సీఎం కేసీఆర్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మండిపడ్డారు. హామీలు అమలవుతున్నాయో లేదో వచ్చి చూడాలని కేసీఆర్‌ను ఆహా్వనిస్తే ముఖం చాటేశారని.. పైగా అబద్ధాలు ప్రచారం చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. కర్ణాటకలో తాము ఇచ్చిన ‘గ్యారంటీ’ హామీలను అమల్లోకి తెచ్చామని.. తెలంగాణలోనూ అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో ఆరు గ్యారంటీలను అమలు చేసి తీరుతామని ప్రకటించారు. శుక్రవారం కామారెడ్డిలో కాంగ్రెస్ అభ్యర్థిగా పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి నామినేషన్ వేశారు. అనంతరం పట్టణంలోని ఇందిరాగాంధీ స్టేడియంలో బహిరంగ సభ నిర్వహించి పార్టీ తరఫున బీసీ డిక్లరేషన్‌ను ప్రకటించారు. ఈ సందర్భంగా సిద్ధరామయ్య, పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ మిత్రపక్షాలు టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం, సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, నేత చాడ వెంకటరెడ్డి తదితరులు మాట్లాడారు. సభలో సిద్ధరామయ్య ప్రసంగం ఆయన మాటల్లోనే.. ‘‘కర్ణాటకలో మేం ఇచ్చిన ఐదు గ్యారంటీల్లో 4 గ్యారంటీలు 2 నెలలుగా అమలవుతూనే ఉన్నాయి. యువనిధి పథకాన్ని జనవరిలో మొదలు పెడుతున్నాం. మేం ప్రజలకు ఇచ్చిన హామీల మేర కు అన్ని పథకాలను అమలు చేస్తుంటే ఇక్కడి సీఎం అబద్దాలు ప్రచారం చేస్తున్నారు. మేం అమలు చేస్తున్న పథకాలు నిజమో కాదో తెలుసుకునేందుకు రమ్మని పిలిస్తే ముఖం చాటేస్తున్నారు. కేసీఆర్‌కు గుణపాఠం తప్పదు తెలంగాణలో కేసీఆర్ గొప్పలు చెప్పడం తప్ప చేసిందేమీలేదు. బీసీలకు 34శాతంగా ఉన్న రిజర్వేషన్లను 23 శాతానికి తగ్గించిన ఘనత కేసీఆర్‌కే దక్కింది. సీఎం కేసీఆర్‌కు అవినీతి డబ్బులతో ఎన్నికలకు వెళ్లడం అలవాటు. ఈసారి ఆయన ప్రయత్నాలు ఫలించవు. ప్రజలు ఆయనకు గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు. కామారెడ్డిలో ప్రజల స్పందన చూస్తుంటే కేసీఆర్ ఓడిపోవడం ఖాయమని తేలిపోతోంది. ప్రజలు 30వ తేదీ కోసం ఎదురుచూస్తున్నారు. మోదీ ప్రచారం చేసినా బీజేపీ ఓడింది తెలంగాణలో బీజేపీ నాలుగైదు సీట్లు గెలిస్తే ఎక్కు వ. మెజారిటీ స్థానాల్లో డిపాజిట్లు కూడా రావు. కర్ణాటకలో ప్రధాని మోదీ 48 రోడ్‌షోలు, సభల్లో పాల్గొన్నారు. ఆయన సభలు జరిపిన చోటల్లా కాంగ్రెస్ ఎక్కువ మెజారిటీతో గెలిచింది. మోదీకి అక్కడి ఓటర్లు బుద్ధి చెప్పారు. తెలంగాణ ప్రజల చెవుల్లో పూలు పెట్టడానికి ప్రయత్నిస్తున్న మోదీకి ఇక్కడి ప్రజలు కూడా బుద్ధి చెప్తారు. బీజేపీ, బీఆర్ఎస్ వేరు కాదు. బీజేపీకి బీఆర్ఎస్ బీ టీంగా పనిచేస్తోంది. దేశంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు అండగా ఉండేది కాంగ్రెస్ పార్టీ మాత్రమే. తెలంగాణలో బీసీ డిక్లరేషన్ కచి్చతంగా అమలు చేసి తీరుతాం. కాంగ్రెస్‌కు ఓటు వేసి గెలిపించాలి..’’అని సిద్ధరామయ్య పిలుపునిచ్చారు. ద్రోహులను పక్కన పెట్టుకుని నీతులా?: రేవంత్ ఎమ్మెల్యేల కొనుగోళ్ల మీద కేసీఆర్ మాట్లాడటమంటే వంద ఎలుకలను తిన్న పిల్లి తీర్థయాత్రలకు పోయినట్టుందని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. దివంగత సీఎం వైఎస్సార్‌తోపాటు మరెందరో సీఎంలు రోజూ ప్రజల సమస్యలు వినేందుకు దర్బార్ నిర్వహించేవారని, సీఎం కేసీఆర్ పదేళ్లలో ఒక్కనాడూ ప్రజల కష్టాలు విన్నపాపాన పోలేదని మండిపడ్డారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ సభలో రేవంత్‌రెడ్డి ప్రసంగించారు. ఆ వివరాలు రేవంత్ మాటల్లోనే.. ‘‘ఎమ్మెల్యేను యాభై లక్షలకు కొంటూ రేవంత్ దొరి కిండని అంటున్న కేసీఆరే తెలంగాణను కొనుగోళ్లు, అమ్మకాలకు కేంద్రంగా మార్చారు. 40 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు, 12 మంది ఎమ్మెల్సీలు, వందలాది మంది ఎంపీపీలు, జెడ్పీటీసీలను కొనుగోలు చేసిండు. ఎమ్మెల్యేల కొనుగోళ్ల మీద సీబీఐ విచారణకు నేను సిద్ధం.. నువ్వు సిద్ధ మా? సిద్ధమైతే 24 గంటల్లో సీబీఐకి లేఖ రాయాలి. అమ్మ పుట్టిన ప్రాంతమని గుర్తుకు రాలేదా? కామారెడ్డి ప్రాంతానికి చెందిన రైతు లింబయ్య 2017లో తన కష్టాన్ని చెప్పుకోవాలని వచి్చ, సీఎం అవకాశం ఇవ్వలేదన్న ఆవేదనతో సెక్రటేరియట్ ఎదురుగా ఉరివేసుకుని చనిపోయినపుడు.. ఇదే ప్రాంతానికి చెందిన బీరయ్య అనే రైతు వడ్ల కుప్పమీద చనిపోయినపుడు.. సీఎం కేసీఆర్‌కు కామారెడ్డి తన తల్లి పుట్టిన ప్రాంతమని గుర్తుకురాలేదా? ఇప్పుడు గజ్వేల్ ప్రజలు నమ్మే స్థితిలో లేక కామారెడ్డికి వచ్చి పోటీ చేçస్తున్నప్పుడు గుర్తుకువచ్చిందా? కామారెడ్డి ప్రజలు తెలంగాణ భవిష్యత్తును నిర్ణయించబోతున్నారు. మీ తీర్పు కోసం దేశ, విదేశాల్లో ఎదురు చూస్తున్నారు. కేసీఆర్‌ను ఓడించేందుకే నేను కామారెడ్డి వచ్చా. భూములు కొల్లగొట్టేందుకు వస్తున్నారు కామారెడ్డిని బంగారు తునక జేస్తనంటున్న కేసీఆర్ గజ్వేల్‌కు ఏం చేశారు. అక్కడి ప్రజలను ముంచి, రోడ్డున పడేసి ఇప్పుడు కామారెడ్డి మీద కన్నేశారు. ఈ ప్రాంతంలో వేల ఎకరాల భూములను కొల్లగొట్టేందుకు వస్తున్నారు. మాస్టర్ ప్లాన్ పేరుతో కుట్ర చేశారు. రైతులు తిరగబడటంతో మాస్టర్ ప్లాన్ రద్దు చేసినట్టు ఆయన కొడుకు కేటీఆర్ చెప్తున్నారు. వారి మాటలు నమ్మవద్దు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తాం. రూ.2 లక్షల దాకా రైతుల రుణాలు మాఫీ చేస్తాం. ఆరు గ్యారంటీలను, బీసీ డిక్లరేషన్‌ను పక్కాగా అమలు చేస్తాం.’’ అని రేవంత్ ప్రకటించారు. కాగా తెలంగాణలో కాంగ్రెస్ గాలిని జూసి సీఎం కేసీఆర్‌కు భయం పట్టుకుందని సీనియర్ నేత వి.హనుమంతరావు అన్నారు. రేవంత్‌కు ‘కోనాపూర్’నామినేషన్ డబ్బులు కామారెడ్డి నుంచి పోటీచేస్తున్న రేవంత్‌రెడ్డి నామినేషన్ కోసం కేసీఆర్ పూర్వీకుల గ్రామమైన కోనాపూర్ వాసులు డబ్బును అందజేశారు. కేసీఆర్‌కు పదేళ్లుగా కోనాపూర్ గుర్తుకురాలేదని, ఇప్పుడు ఓట్ల కోసం తమ ఊరి పేరు వాడుకుంటున్నారని వారు విమర్శించారు. కాగా సభలో కర్నాటక సీఎం సిద్ధరామయ్య కన్నడ భాషలో ప్రసంగించగా.. కాంగ్రెస్ నేతలు తెలుగులోకి అనువాదం చేశారు. ఇది చాలా నిదానంగా సాగడంతో సభకు హాజరైనవారిలో నిరాశ కనిపించింది. సభలో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్‌రావు ఠాక్రే, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్‌గౌడ్, సీనియర్ నేతలు పొన్నం ప్రభాకర్, షబ్బీర్ అలీ, మధుయాష్కీగౌడ్, సుదర్శన్‌రెడ్డి, మదన్మోహన్, ఆది శ్రీనివాస్, అరికెల నర్సారెడ్డి, వేం నరేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కేసీఆర్‌కు గుణపాఠం తప్పదు: నారాయణ తెలంగాణ ప్రజలను అనేక రకాలుగా మోసగించిన సీఎం కేసీఆర్‌కు ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. కేసీఆర్ తెలంగాణ ద్రోహులు, వ్యతిరేకులను చంకనెత్తుకుని ఊరేగుతున్నారని మండిపడ్డారు. కాగా.. ఉమ్మడి రాష్ట్రంలో సీఎం వైఎస్సార్ ప్రజల సమస్య లు వినేందుకు రోజూ ప్రజా దర్బార్ నిర్వహించేవారని.. ఈ పదేళ్లలో ఒక్కరోజు కూడా ప్రజలు సీఎంను కలిసే అవకాశం దొరకలేదని సీపీఐ నాయకుడు చాడ వెంకటరెడ్డి విమర్శించారు. ప్రశ్నించే గొంతులను నొక్కేశారు: కోదండరాం ఎన్నెన్నో పోరాటాలు, ప్రాణత్యాగాలతో సాధించుకున్న తెలంగాణలో ప్రజాస్వామ్యం లేకుండా పో యిందని, ప్రశ్నించేవారి గొంతులను నొక్కేస్తున్నారని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగాల భర్తీ లేదని, పరీక్షలు కూడా సరిగ్గా నిర్వహించలేకపోయారని ఆరోపించారు. ఈ అన్యాయాలు చూస్తుంటే గుండెలు మండుతున్నాయన్నారు. కామారెడ్డి ప్రజలు ఓటుతో బీఆర్ఎస్కు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఇదీ చదవండి: ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్‌కు భారీ షాక్ -
స్థానిక సంస్థల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్
సాక్షి, కామారెడ్డి: కులగణన, బీసీ కమిషన్ నివేదికల ఆధారంగా అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోపే బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు పెంచుతామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇ చ్చింది. ఈ రిజర్వేషన్లను ప్రస్తుతమున్న 23శాతం నుంచి 42శాతానికి పెంచడం ద్వారా పంచాయతీలు, మున్సిపాలిటీలలో కొత్తగా 23,973 మంది బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం లభిస్తుందని తెలిపింది. శుక్రవారం కామారెడ్డిలో నిర్వహించిన సభలో పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ‘బీసీ డిక్లరేషన్’ను ప్రకటించగా.. ముఖ్య అతిథిగా హాజరైన కర్ణాటక సీఎం సిద్ధరామయ్య అందులోని అంశాలను వివరించారు. డిక్లరేషన్‌లోని అంశాలివీ.. ♦ మహాత్మా జ్యోతిరావు పూలే పేరిట బీసీ సబ్‌ప్లాన్‌కు అసెంబ్లీ తొలిసెషన్‌లోనే చట్టబద్ధత కల్పిస్తాం. బీసీ సంక్షేమానికి ఏటా రూ.20వేల కోట్ల చొప్పున ఐదేళ్లలో రూ.లక్ష కోట్లు కేటాయిస్తాం. ♦ ఎంబీసీ కులాల అభివృద్ధి కోసం ప్రత్యేకంగా ఎంబీసీ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఏర్పాటు. అన్ని బీసీ కులాల సమగ్రాభివృద్ధి కోసం కార్పొరేషన్లు. బీసీ యువత ఉన్నత చదువుల కోసం, చిరు వ్యాపారాలు చేసుకునేందుకు రూ.10 లక్షల వరకు పూచీకత్తు లేని, వడ్డీలేని రుణాలు. ♦ అన్ని జిల్లా కేంద్రాల్లో రూ.50 కోట్లతో ఓ కన్వెన్షన్ హాల్, ప్రెస్ క్లబ్, స్టడీ సర్కిల్, లైబ్రరీ, క్యాంటీన్లతో కూడిన ప్రొఫెసర్ జయశంకర్ బీసీ ఐక్యతా భవనాల నిర్మాణం. బీసీ ఐక్యతా భవన్‌లోనే జిల్లా బీసీ సంక్షేమ కార్యాలయం ఏర్పాటు. ♦ ప్రతి మండలంలో నవోదయ విద్యాలయాలతో సమానంగా బీసీలకు ఒక కొత్త గురుకులం. ప్రతి జిల్లాలో ఒక కొత్త డిగ్రీ కాలేజీ. రూ.3 లక్షల కంటే తక్కువ వార్షికాదాయం ఉన్న బీసీ విద్యార్థులకు ర్యాంకుతో సంబంధం లేకుండా పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్. ♦ వృత్తి బజార్ పేరుతో ప్రతి మండలంలో 50దుకాణాల షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం. అందులో మంగలి, వడ్రంగి, చాకలి, కమ్మరి, స్వర్ణకారుల వంటి చేతివృత్తుల వారికి ఉచితంగా షాపులు పెట్టుకునే స్థలం. ♦ గీత కార్మికులు, చేనేతలకు ఉన్నట్టుగా 50ఏళ్ల వృద్ధాప్య పింఛన్ వయోపరిమితి అన్ని చేతివృత్తుల వారికి వర్తింపు. బీసీ కార్పొరేషన్లు, ఫెడరేషన్ల కింద నమోదైన ప్రతి సొసైటీకి ఎన్నికల నిర్వహణ, రూ.10 లక్షల ఆర్థిక సాయం. కులాల వారీగా ప్రత్యేక పథకాలు, హామీలు ♦ జీవో నం.19/02/2009ను పునరుద్ధరించి.. ముదిరాజ్, ముత్రాసు, తెనుగోళ్లు తదితర కులా లను బీసీ డీ నుంచి బీసీ ఏ గ్రూపులోకి మార్చడం. ♦ గంగపుత్రులకు సంబంధించి మత్స్యకార హక్కులకు.. ఇతర మత్స్యకార సామాజిక వర్గాల మధ్య పెండింగ్‌లో ఉన్న సమస్యలకు పరిష్కారం. ఇందుకోసం తెలంగాణ మత్స్య అభివృద్ధి బోర్డు ఏర్పాటు. ఆక్వాకల్చర్‌కు ప్రోత్సాహం. క్యాప్టివ్ సీడ్, నర్సరీలు, మార్కెటింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వంటి ఏర్పాట్లు. ♦ గొల్లకురుమలకు అధికారంలోకి వ చ్చిన వంద రోజుల్లో రెండో దశ గొర్రెల పంపిణీ. ♦ గౌడ్ కులస్తులకు ఈతచెట్ల పెంపకం కోసం ప్రతి గ్రామంలో ఐదెకరాల భూమి. ఈత మొక్కలు, బిందు సేద్యం, కాంపౌండ్ వాల్ నిర్మాణాలపై 90శాతం సబ్సిడీ. మద్యం దుకాణాల లైసెన్సుల్లో గౌడ్లకు ప్రస్తుతమున్న రిజర్వేషన్ 15శాతం నుంచి 25శాతానికి పెంపు. జనగామ జిల్లాకు సర్వాయి పాపన్నగౌడ్ జనగాం జిల్లాగా పేరు మార్పు. ♦ మున్నూరు కాపు కార్పొరేషన్ ఏర్పాటు. యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు సబ్సిడీ రుణాలు. ♦ పద్మశాలీలకు జగిత్యాల, నారాయణపేట, భువనగిరిలలో మెగా పవర్‌లూం క్లస్టర్ల ఏర్పాటు. పవర్‌లూమ్స్, పరికరాలపై 90 శాతం సబ్సిడీ. ♦ విశ్వకర్మలకు 90శాతం సబ్సిడీతో టూల్కిట్లు. పట్టణ ప్రాంతాల్లో దుకాణాల ఏర్పాటుకు భూమి కేటాయింపు. ♦ రజక యువతకు పట్టణాల్లో లాండ్రోమెట్స్ ఏర్పాటు కోసం రూ.10 లక్షల ఆర్థిక సాయం. రాష్ట్రవ్యాప్తంగా ధోబీఘాట్ల ఆధునీకరణ కోసం ప్రతి జిల్లాకు రూ.10 కోట్లు కేటాయింపు. -
సీబీఐ, ఈడీ విచారణకు కేసీఆర్ సిద్ధమా?.. రేవంత్ సవాల్
సాక్షి, కామారెడ్డి: ఎమ్మెల్యేలు, ఎంపీల కొనుగోలుపై సీబీఐ, ఈడీ విచారణకు కేసీఆర్ సిద్ధమా?.. విచారణకు నేను సిద్ధం.. సవాల్ విసురుతున్నా.. లేకపోతే కామారెడ్డిలో ముక్కు నేలకు రాయాలి’’ అంటూ టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. శుక్రవారం ఆయన కామారెడ్డిలో కాంగ్రెస్ బీసీ డిక్లరేషన్ బహిరంగ సభలో మాట్లాడుతూ, కామారెడ్డి బంగారు తునక అంటున్నారు.. గజ్వేల్ నుంచి ఎందుకు వస్తున్నారు. అమ్మకు అన్నం పెట్టని వారు చిన్నమ్మకు బంగారు గాజులు అంటే నమ్మడానికి కామారెడ్డి ప్రజలు అమాయకులు కాదు’’ అంటూ రేవంత్ ఎద్దేవా చేశారు. ‘‘కుట్రతో కామారెడ్డి భూముల కోసం ఇక్కడికి వస్తున్నారు కేసీఆర్. మాస్టర్ ప్లాన్ రద్దు అంటున్నారు.. మీ ప్రభుత్వమే రద్దు అయ్యింది. మీ కుటుంబం కోసమేనా 1200 మంది ఆత్మహత్య చేసుకున్నది. కేసీఆర్‌ను ఓడించేందుకే, పార్టీ ఆదేశం మేరకే కామారెడ్డికి వచ్చాను. బూచోడు వస్తున్నాడు. మీ భూములు లాక్కుంటారు.. కామారెడ్డిలో సీఎం కేసీఆర్ కనిపించడు.. వినిపించడు.. కామారెడ్డి నియోజక వర్గంలో 3 లక్షల 60 వేల ఎకరాలకు వైఎస్సార్ తీసుకొచ్చిన ప్రాణహిత, చేవెళ్ల ద్వారా గోదావరి జలాలు అందాలంటే కాంగ్రెస్ గెలవాలి’’ అని రేవంత్ పేర్కొన్నారు. చదవండి: కాంగ్రెస్ మైనారిటీ డిక్లరేషన్ బీజేపీ కుట్రే: కేటీఆర్ -
అవినీతి డబ్బుతో కేసీఆర్ గెలవాలనుకుంటున్నారు: సిద్ధరామయ్య
సాక్షి, కామారెడ్డి: తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ధీమా వ్యక్తం చేశారు. కామారెడ్డిలో కాంగ్రెస్ బీసీ డిక్లరేషన్ సభలో పాల్గొన్న ఆయన సీఎం కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు. కేసీఆర్ అవినీతి డబ్బుతో ప్రజలను కొనేందుకు చూస్తున్నారు. కేసీఆర్‌ను రేవంత్‌రెడ్డి ఓడించడం ఖాయం. తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ను సాగనంపాలని ఇప్పటికే నిర్ణయించుకున్నారు’’ అని సిద్ధరామయ్య పేర్కొన్నారు. బీసీ డిక్లరేషన్ ప్రకటించిన కాంగ్రెస్ కామారెడ్డి సభలో సిద్ధరామయ్య బీసీ డిక్లరేషన్ ప్రకటించారు. బీసీ-డీలో ఉన్న ముదిరాజ్ కులస్తులను బీసీ-ఏలో చేరుస్తామని, జనాభా ప్రాతిపదికన బీసీ రిజర్వేషన్లు కల్పిస్తామని తెలిపారు. ఐదేళ్లలో బీసీల అభ్యున్నతి కోసం రూ.5 లక్షల కోట్లు ఖర్చు చేస్తాం. బీసీ సబ్‌ప్లాన్ ఏర్పాటు చేస్తాం. బీసీ కార్పొరేషన్ ద్వారా రూ.10 లక్షల ఆర్థిక సాయం. స్థానిక సంస్థల్లో 23 శాతం, రిజర్వేషన్‌ను 42 శాతం పెంచుతాం. 50 ఏళ్లు దాటిన నేత కార్మికులకు పెన్షన్ అందిస్తాం’’ అని సిద్ధరామయ్య వెల్లడించారు. చదవండి: బీజేపీలో ‘బీఫామ్’ మంటలు.. సంగారెడ్డిలో ఉద్రిక్తత కేసీఆర్‌కు రేవంత్ సవాల్ ఎమ్మెల్యేలు, ఎంపీల కొనుగోలుపై ఈడీ, సీబీఐ విచారణకు సిద్ధమా? అంటూ రేవంత్‌రెడ్డి..కేసీఆర్‌కు సవాల్ విసిరారు. కల్వకుంట్ల కుటుంబ పాలనకు చరమగీతం పాడటానికి కామారెడ్డి ప్రజలు సిద్ధం అయ్యారు. సచివాలయం ముందు లింబయ్య అనే కామారెడ్డి రైతు ట్రాన్స్ ఫార్మర్ కు ఉరేసుకొని చనిపోయారు. కేసీఆర్ కొనాపూర్ బిడ్డ అంటున్నారు.. మరి ఇక్కడి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఎందుకు ఆదుకొలేదు. కామారెడ్డి బంగారు తునక అంటున్నారు.. గజ్వేల్ నుంచి ఎందుకు వస్తున్నారు.అమ్మకు అన్నం పెట్టని వారు చిన్నమ్మకు బంగారు గాజులు అంటే నమ్మడానికి కామారెడ్డి ప్రజలు అమాయకులు కాదు’’ అంటూ రేవంత్ ఎద్దేవా చేశారు. ‘‘కుట్రతో కామారెడ్డి భూముల కోసం ఇక్కడికి వస్తున్నారు కేసీఆర్. మాస్టర్ ప్లాన్ రద్దు అంటున్నారు.. మీ ప్రభుత్వమే రద్దు అయ్యింది. మీ కుటుంబం కోసమేనా 1200 మంది ఆత్మహత్య చేసుకున్నది. కేసీఆర్‌ను ఓడించేందుకే, పార్టీ ఆదేశం మేరకే కామారెడ్డికి వచ్చాను. బూచోడు వస్తున్నాడు. మీ భూములు లాక్కుంటారు.. కామారెడ్డిలో సీఎం కేసీఆర్ కనిపించడు వినిపించడు.. కామారెడ్డి నియోజక వర్గంలో 3 లక్షల 60 వేల ఎకరాలకు వైఎస్సార్ తీసుకొచ్చిన ప్రాణహిత, చేవెళ్ల ద్వారా గోదావరి జలాలు అందాలంటే కాంగ్రెస్ గెలవాలి’’ అని రేవంత్ పేర్కొన్నారు. -
నేడు కామారెడ్డిలో రేవంత్ రెడ్డి నామినేషన్
-
16 నుంచి కాంగ్రెస్ ప్రచార హోరు
సాక్షి, హైదరాబాద్: నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగియగానే రాష్ట్రంలో ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతోంది. ఏఐసీసీ అగ్రనేతలు రాహుల్, ప్రియాంకా గాందీలతోపాటు కీలక నేతలను రంగంలోకి దింపేందుకు ఏర్పాట్లు చేస్తోంది. వారు వారం రోజుల పాటు ఇక్కడే మకాం వేసి, జిల్లాల్లో విస్తృతంగా పర్యటించేలా షెడ్యూల్ రూపొందిస్తోంది. ఈ నెల 15న నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచార గడువు ముగియనున్న నేపథ్యంలో 16వ తేదీ నుంచి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలనూ ప్రచార బరిలోకి దింపాలని భావిస్తోంది. అయితే భారీ సభలు కాకుండా రోడ్‌షోలు, కార్నర్ మీటింగ్‌ల ద్వారా ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించింది. అన్ని ఉమ్మడి జిల్లాల్లో పర్యటించేలా.. ఈ నెల 16 తర్వాత రాహుల్, ప్రియాంకా గాందీలతో రాష్ట్రంలోని అన్ని ఉమ్మడి జిల్లాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించేలా షెడ్యూల్ తయారవుతోంది. పెద్ద సభలను ఏర్పాటుచేసి ప్రజలను అక్కడికి తీసుకురావడం కంటే ప్రజల వద్దకే వెళ్లేలా కార్యక్రమాలు నిర్వహించేందుకు టీపీసీసీ సిద్ధమైంది. అన్ని కొత్త జిల్లాల్లో ఇద్దరు అగ్రనేతలతో రోడ్‌షోలు చేయించాలని, అక్కడే కార్నర్ మీటింగ్‌ల ద్వారా కాంగ్రెస్ ఎన్నికల గ్యారంటీలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించింది. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు సిద్ధరామయ్య, అశోక్‌గెహ్లోత్, సుఖ్విందర్సింగ్ సుక్కు, భూపేశ్ బఘేల్‌లను కూడా ఎన్నికల ప్రచారానికి తీసుకురానుంది. హిమాచల్‌ప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్తాన్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ అమలు చేసిన పథకాల గురించి వారు వివరించనున్నట్టు టీపీసీసీ వర్గాలు చెప్తున్నాయి. ఇక కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదంటూ బీఆర్ఎస్ చేస్తున్న విమర్శలను తిప్పికొట్టేలా సిద్ధరామయ్య, డీకే శివకుమార్ వంటి నేతలను ప్రచార భాగస్వాములను చేయనుంది. ఈ ప్రచారమంతాపూర్తయ్యాక చివరిగా ఏఐసీసీ అగ్రనేత, యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీతో హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోగానీ, ఉత్తర తెలంగాణలోని కీలక ప్రాంతంలోగానీ భారీ బహిరంగ సభ నిర్వహించి, పోలింగ్ మూడ్‌లోకి వెళ్లిపోవాలని కాంగ్రెస్ భావిస్తోంది. నేడు కామారెడ్డిలో బీసీ గర్జన సభ కాంగ్రెస్ పార్టీ శుక్రవారం కామారెడ్డిలో బీసీ గర్జన సభ నిర్వహించనుంది. నామినేషన్ల దాఖలుకు చివరిరోజు కావడంతో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కామారెడ్డిలో కాంగ్రెస్ అభ్యర్థి గా నామినేషన్ వేయనున్నారు. ఆ కార్యక్రమం ముగిశాక బీసీ గర్జన సభ నిర్వహించనున్నారు. దీనిలో బీసీ డిక్లరేషన్‌ను ప్రకటించనున్నారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఈ సభలో పాల్గొంటున్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి ఆయన స్పష్టమైన ప్రకటన చేస్తారని.. బీఆర్ఎస్ ఆరోపణలకు తగిన విధంగా బదులిస్తారని టీపీసీసీ వర్గాలు చెప్తున్నాయి. -
కామారెడ్డి గడ్డతో పుట్టినప్పటి నుంచి నాకు అనుబంధం ఉంది: కేసీఆర్
-
కామారెడ్డి రూపురేఖలు మారుస్తా: కేసీఆర్
సాక్షి, కామారెడ్డి: కామారెడ్డి గడ్డతో పుట్టుక నుంచే తనకు సంబంధం ఉందని, తన కన్నతల్లి పుట్టింది ఇక్కడి ఊరిలోనేనని.. తన బాల్యం కూడా ఇక్కడ గడిచిందని కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. అంతేకాదు.. తెలంగాణ ఉద్యమ సమయంలో 45 రోజులపాటు ఇక్కడ జలసౌధ ఉద్యమం చేశానని ఆయన గుర్తు చేసుకున్నారు. గురువారం కామారెడ్డిలో నామినేషన్ వేసిన అనంతరం.. ఆయన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొని ప్రసంగించారు. కామారెడ్డిని జిల్లా చేస్తామని గత ఎన్నికల్లో హామీ ఇచ్చాం. అది చేసి చూపించాం. మెడికల్ కాలేజ్ కూడా తెచ్చుకున్నాం. నిజామాబాద్, కామారెడ్డి బీఆర్ఎస్ నేతలతో పాటు ఇక్కడి ఎమ్మెల్యే గంపా గోవర్థన్‌రెడ్డి చాలాసార్లు తనను కోరడంతోనే కామారెడ్డి నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్నానని తెలిపారాయన. ‘‘కేసీఆర్ కామారెడ్డి వస్తున్నాడంటే ఒక్కడే రాడు. కేసీఆర్ వెంబడి చాలా వస్తాయి. కేసీఆర్ వెంట కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాలకు కాళేశ్వరం నీళ్లు వస్తాయి. కామారెడ్డి పల్లెల రూపు రేఖలు మార్చే బాధ్యత నాది’’ అని ఆయన అన్నారు. తెలంగాణ వెనుకబాటుకు కాంగ్రెస్సే కారణం. దేశాన్ని, రాష్ట్రాన్ని 50 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ ఏం చేసింది?. మన నెత్తిన సమస్యల్ని పెట్టింది. నెహ్రూనే దళితబంధు పెట్టి ఉంటే.. ఇప్పుడు ఈ స్థితి ఉండేది కాదు కదా. రైతుబంధు దుబారా అని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. రైతు బంధు ఉండాలా? వద్దా? ఒక్కపూట వ్యవసాయం చేయని రాహుల్ గాంధీ.. ధరణిని తీసేస్తాడట. ప్రధాని సొంత రాష్ట్రం గుజరాత్లో కూడా 24 గంటలు కరెంట్ ఇవ్వడం లేదు. కానీ, తెలంగాణలో 24 గంటలు కరెంట్ ఇస్తున్నాం. 24 గంటల కరెంట్ కావాలా? 3 గంటల కరెంట్ కావాలా?(కాంగ్రెస్‌ను ఉద్దేశించి..). ఒక్క నవోదయ స్కూల్ కూడా ఇవ్వని బీజేపీకి.. ఒక్క ఓటు ఎందుకు వేయాలి? అని అన్నారాయన. అధికారంలోకి వచ్చాక బీడీ కార్మికులు అందరికీ పెన్షన్ ఇస్తామని ఈ వేదికగా కేసీఆర్ ప్రకటించారు. తెలంగాణ ప్రజల కోసమే బీఆర్ఎస్ పుట్టింది. తమాషా కోసం ఓటు వేయొద్దు. బాగా ఆలోచించుకుని ఓటు వేయాలి. తెలంగాణ తెచ్చుకున్న లక్ష్యాన్ని మరిచిపోవద్దు’’అని కేసీఆర్ కామారెడ్డి ప్రజలకు పిలుపు ఇచ్చారు. -
నేడు గజ్వేల్, కామారెడ్డిలో సీఎం కేసీఆర్ నామినేషన్స్
-
రేపే నామినేషన్లు వేయనున్న కేసీఆర్
సాక్షి, హైదరాబాద్ : బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు రేపు(నవంబర్ 9, గురువారం) నామినేషన్లు వేయనున్నారు. రేపు ఒక్కరోజులోనే ఆయన పోటీచేయబోయే గజ్వేల్, కామారెడ్డిల్లో నామినేషన్లు దాఖలు చేస్తారు. ఆపై సాయంత్రం కామారెడ్డిలో జరిగే బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొని ప్రసంగిస్తారు. ఇదీ కేసీఆర్ షెడ్యూల్... ఉదయం 10:45కు ఎర్రవెల్లి ఫాంహౌజ్ నుంచి గజ్వేల్‌కు హెలికాప్టర్లో బయలుదేరతారు. 10:55కు గజ్వేల్ టౌన్లో ల్యాండ్ అవుతారు. 11 నుంచి 12 గంటల మధ్య గజ్వేల్‌లో నామినేషన్ వేస్తారు. తర్వాత తిరిగి ఫాంహౌజ్ చేరుకుని లంచ్ చేస్తారు. మధ్యాహ్నం 1:40కి కామారెడ్డికి బయలుదేరతారు. మధ్యాహ్నం 2 నుంచి 3 మధ్య కామారెడ్డిలో నామినేషన్ వేస్తారు. సాయంత్రం 4నుంచి 5 మధ్య కామారెడ్డి బహిరంగ సభలో ప్రసంగిస్తారు. -
సబ్‌ప్లాన్ .. జనగణన
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతం రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ వర్గాలకు అమలవుతున్న సబ్‌ప్లాన్‌ను బీసీలకు కూడా వర్తింపజేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. తాము అధికారంలోకి వస్తే బీసీ సబ్‌ప్లాన్‌ను ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వనుంది. ఈ సబ్‌ప్లాన్ కింద ప్రత్యేకంగా నిధులను కేటాయించి అన్ని ప్రభుత్వ శాఖల ద్వారా ఈ నిధులను ఖర్చు చేయించడం ద్వారా రాష్ట్రంలోని బడుగు, బలహీనవర్గాల సమగ్రాభివృద్ధికి కృషి చేస్తామని వివరించనుంది. ఈ నెల 10వ తేదీన కామారెడ్డిలో జరగనున్న ‘బీసీ గర్జన’సభలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రకటించే బీసీ డిక్లరేషన్‌లో సబ్‌ప్లాన్‌ను పొందుపరచాలని నిర్ణయించింది. దీనితో పాటు బీసీ వర్గాల గణన చేపడతామని కూడా హామీ ఇవ్వనుంది. ఈ రెండు ప్రధాన హామీల ద్వారా రాష్ట్రంలో 50 శాతానికి పైగా ఉన్న బీసీ వర్గాలకు చెందిన ఓటర్లను ఆకట్టుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఇదే వ్యూహంలో భాగంగా బీసీ విద్యార్థులందరికీ ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని అమలు చేస్తామని కూడా ప్రకటించనుంది. ప్రస్తుతం బీసీ విద్యార్థులకు ర్యాంకుల వారీగా ఫీజును ప్రభుత్వం చెల్లిస్తోంది. అలా కాకుండా డిగ్రీ నుంచి పై స్థాయిలో ఉండే ఏ కోర్సులో అడ్మిషన్ పొందిన బీసీ విద్యార్థికైనా పూర్తి ఫీజు చెల్లిస్తామని హామీ ఇవ్వనుంది. ఎంబీసీ కార్పొరేషన్‌కు ప్రత్యేక నిధులు బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే బీసీ బంధు పేరుతో అమలు చేస్తున్న రూ.లక్ష నగదు సాయం పథకానికి కౌంటర్‌గా బీసీ డిక్లరేషన్ సభ వేదికగానే కొత్త పథకాన్ని ప్రకటించాలని కాంగ్రెస్ పార్టీ యోచిస్తోంది. అయితే నగదు మొత్తాన్ని పెంచి ఇవ్వాలా? నగదు కాకుండా బీసీల అభివృద్ధి, ఉపాధి కల్పన లక్ష్యంగా ప్రత్యేకంగా మరో పథకాన్ని రూపొందించాలా? అన్న దానిపై టీపీసీసీ నాయకత్వం ఇప్పటికే కసరత్తు పూర్తి చేసిందని, ఈ రెండింటిలో ఏదో ఒక దాన్ని కామారెడ్డి సభలో సిద్ధరామయ్య ప్రకటిస్తారని చెబుతున్నారు. దీంతో పాటు కుల కార్పొరేషన్ల ఏర్పాటు, వాటికి నిధుల కేటాయింపు, అత్యంత వెనుకబడిన వర్గాల (ఎంబీసీ) కార్పొరేషన్‌కు ప్రత్యేకంగా నిధుల కేటాయింపు లాంటివి కూడా ప్రకటించనుంది. బీసీలతో పాటు మైనారీ్టల కోసం కూడా ప్రత్యేక డిక్లరేషన్ ప్రకటించాలని ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నిర్ణయించగా, ఈనెల 9న ఆ డిక్లరేషన్‌ను ప్రకటించనున్నట్టు గాంధీభవన్ వర్గాలు వెల్లడించాయి. నేటి నుంచి రేవంత్ రాష్ట్ర పర్యటన టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి మంగళవారం నుంచి ఐదు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించనున్నారు. హెలికాప్టర్లో ప్రయాణించడం ద్వారా రోజుకు మూడు నియోజకవర్గాల్లో ప్రచారం చేయనున్నారు. 7వ తేదీన ఆలంపూర్ జోగుళాంబ దేవాలయాన్ని దర్శించుకున్న అనంతరం అక్కడ జరిగే బహిరంగ సభతో ప్రచారం ప్రారంభం కానుంది. అదే రోజు గద్వాల, మక్తల్ నియోజకవర్గాల్లోనూ రేవంత్ పర్యటించనున్నారు. ఈ నెల 8వ తేదీన ఖానాపూర్, ఆదిలాబాద్, జహీరాబాద్ నియోజకవర్గాల్లో, 9వ తేదీన పాలకుర్తిలో, హైదరాబాద్‌లో మైనార్టీ డిక్లరేషన్ ప్రకటించి సికింద్రాబాద్, సనత్‌నగర్ నియోజకవర్గాల్లో ప్రచారం చేయనున్నారు.10వ తేదీన కామారెడ్డిలో జరిగే బీసీ గర్జన సభకు హాజరవుతారు. అదే రోజున కామారెడ్డి నియోజకవర్గ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేస్తారు. హైదరాబాద్‌లో మైనార్టీ ముఖ్యులతో డిన్నర్ కార్యక్రమానికి హాజరవుతారు. ఇక ఈనెల 11వ తేదీన బెల్లంపల్లి, రామగుండం, ధర్మపురి నియోజకవర్గాల్లో పర్యటిస్తారని గాం«దీభవన్ వర్గాలు తెలిపాయి. -
బీఆర్ఎస్ బహుముఖ వ్యూహం 50 మంది ఓటర్లకో లీడర్
సాక్షి, కామారెడ్డి: సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్న కామారెడ్డి నియోజకవర్గంపై బీఆర్ఎస్ ప్రత్యేక దృష్టి సారించింది. ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యవేక్షణలో నియోజకవర్గంలో బహుముఖ వ్యూహంతో ముందుకు సాగుతోంది. గడపగడపకూ వెళ్లి ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు బూత్ కమిటీలను నియమించిన పార్టీ.. కుల సంఘాల మద్దతు కూడగట్టేందుకు ఆయా సామాజిక వర్గాలకు చెందిన మంత్రులను రంగంలోకి దింపింది. ప్రత్యర్థి పార్టీలకు చెందిన నేతలు, కార్యకర్తలను తమవైపు తిప్పుకునేందుకు చేరికలపైనా ఫోకస్ చేసింది. కామారెడ్డి నుంచి సీఎం కేసీఆర్ పోటీ చేస్తారన్న ప్రకటన వెలువడకముందే నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు ప్రభుత్వం భారీ ఎత్తున నిధులు విడుదల చేసింది. దళితబంధు, బీసీ బంధు, మైనారిటీ బంధు వంటి సంక్షేమ పథకాల్లో ఎక్కువ యూనిట్లు కేటాయించారు. మైనారిటీ మహిళలకు కుట్టుమిషన్లు అందించారు. ఆలయాలు, కుల సంఘాల భవనాలకు పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేశారు. కేసీఆర్ అభ్యర్థిత్వం ఖరారయ్యాక మంత్రి కేటీఆర్ కామారెడ్డిపై ఫోకస్ మరింత పెంచారు. బూత్ కమిటీలతో ప్రచారం..: 266 పోలింగ్ బూత్‌లుండగా, ప్రతి బూత్‌కు పది మందితో కమిటీలను ఏర్పాటు చేశారు. ఆ గ్రామానికి చెందిన గ్రామ/మండల/ నియోజకవర్గ/ జిల్లా స్థాయి లీడర్‌ను బూత్ కమిటీకి ఇన్చార్జ్గా నియమించారు. 50 మంది ఓటర్లకు ఒక ఇన్చార్జ్ ఉండేలా బూత్ కమిటీలు ఏర్పాటయ్యాయి. రోజూ బూత్ కమిటీ సభ్యులు తమకు కేటాయించిన యాభై మంది ఓటర్ల ఇళ్లకు వెళ్లడం, మేనిఫెస్టోను వివరించడంతో పాటు ప్రభుత్వం ద్వారా ఆ కుటుంబానికి జరిగిన ప్రయోజనాలను చెప్పి ఓట్లు అభ్యర్థించాలన్నది ఈ కమిటీల ఏర్పాటు ఉద్దేశం. కుల సంఘాలతో ములాఖత్‌లు..: వివిధ కుల సంఘాలతో ఆయా సామాజికవర్గాలకు చెందిన మంత్రులు సమావేశమవుతున్నారు. ఆదివారం మైనారిటీలతో ఏర్పాటు చేసిన సమావేశానికి హోం మంత్రి మహమూద్ అలీ హాజరయ్యారు. బీఆర్ఎస్ మైనారిటీల సంక్షేమం కోసం చేసిన కార్యక్రమాలను వివరించారు. సీఎం కేసీఆర్‌ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. గౌడ కులస్తులతో జరిగిన సమావేశంలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పాల్గొన్నారు. రెడ్డి సంఘం సమావేశానికి మంత్రి ప్రశాంత్‌రెడ్డి, స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి హాజరుకావాల్సి ఉండగా.. ఆ సమావేశం వాయిదా పడింది. పద్మశాలి కులస్తులతో జరిగిన సమావేశంలో ఎమ్మెల్సీ రమణ పాల్గొన్నారు. ఎస్సీ కుల సంఘాలతో జరిగిన సమావేశానికి ఎమ్మెల్యే రసమయి హాజరుకావాల్సి ఉండగా.. ఆయన కార్యక్రమం రద్దయింది. ప్రభుత్వ విప్ గంప గోవర్దన్, ఎమ్మెల్సీ సుభా‹Ùరెడ్డి ఆ సమావేశంలో పాల్గొని ఎస్సీల సంక్షేమానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలను వివరించారు. యూత్‌తో నిర్వహించే సమావేశానికి బాల్క సుమన్, గెల్లు శ్రీనివాస్‌లను రప్పిస్తున్నారు. ఇలా కామారెడ్డిలో విజయం కోసం బీఆర్ఎస్ పకడ్బందీ వ్యూహంతో ముందుకు సాగుతోంది. -
టీడీపీ కథ ముగిసినట్లే..!
నిజామాబాద్: తెలంగాణ ఆవిర్భావానికి ముందు జిల్లాలో ఒక వెలుగు వెలిగిన టీడీపీ మారుతున్న రాజకీయ పరిణామాలతో కనుమరుగైపోతోంది. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో పోటీకి దూరంగా ఉండాలని పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకోవడం, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ పదవికి రాజీనామ చేసి బీఆర్ఎస్లో చేరాలని నిర్ణయం తీసుకోవడం తెలిసిందే. పార్టీ కీలక నేత రాజీనామా చేయడంతో టీడీపీ కనుమరుగయ్యే పరిస్థితి కనిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేయాలని కింది స్థాయి నాయకులు ఆశించారు. బీజేపీ పొత్తుతో.. 2014లో బీజేపీతో పొత్తుతో టీడీపీ అభ్యర్థులు జిల్లాలోని వివిధ స్థానాల్లో పోటీ చేశారు. కానీ ఎక్కడా టీడీపీ, బీజేపీ అభ్యర్థులు విజయం సాధించలేదు. 2009 ఎన్నికల్లో మాత్రం ఆర్మూర్, జుక్కల్, బాన్సువాడ, కామారెడ్డి స్థానాల్లో టీడీపీ పట్టు సాధించింది. 2014లో పార్టీ ప్రభావం పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. 2018లో పోటీకి అభ్యర్థులు ఎవరూ ముందుకు రాకపోవడంతో టీడీపీ బరిలో నిలువలేదు. ఈ ఎన్నికల్లో ఆర్మూర్, నిజామాబాద్ అర్బన్ స్థానాల్లో పోటీకి ఇద్దరు నాయకులు ఆసక్తి చూపినా పోటీకి పార్టీ అధినేత చంద్రబాబు అంగీకరించకపోవడంతో మరోసారి గుర్తు కనిపించే అవకాశం లేకుండా పోయింది. ఎన్నికల్లో పోటీకి పార్టీ దూరం కావడంతో నాయకులు అంతా ఉత్సవ విగ్రహాలుగా ఉండిపోయారనే వాదన వినిపిస్తోంది. ఏది ఏమైనా తెలంగాణ ఏర్పడక ముందు భారీ విజయాలను నమోదు చేసుకున్న టీడీపీ కథ ఇక జిల్లాలో ముగిసినట్లే అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
హిట్ ఎక్కిన కామారెడ్డి... కేసీఆర్ పై పోటీకి రేవంత్ రెడ్డి
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : అంతర్గత ప్రజాస్వా మ్యం ఎక్కువగా ఉన్న కాంగ్రెస్ పార్టీలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించి పార్టీ నాయకత్వం భారీ కసరత్తే చేసింది. నామినేషన్ల ప్రక్రియ మొదలైనప్పటికీ ఇంకా 9 స్థానాలకు గాను మొదటి రెండు విడతల్లో 5 సీట్లకు మాత్రమే అభ్యర్థులు ఖరారు అయ్యారు. మరో 4 సీట్లకు అభ్యర్థుల ప్రకటన చేయలేదు. ఇదిలా ఉండగా కామారెడ్డి నుంచి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బరిలోకి దిగడంతో పరి స్థితులు మారిపోయాయి. ఆ ప్రభావంతో నిజామాబాద్ అర్బన్ సీటు విషయంలోనూ ప్రతిష్టంభన నెలకొంది. ఈ క్రమంలో అనేక మలుపులు, తర్జనభర్జనలు, ఊహాగానాలు, వార్తలు చోటుచేసుకున్నా యి. అయితే కాంగ్రెస్ అధిష్టానం మాత్రం కామారెడ్డి నుంచి పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిని బరిలోకి దించేందుకు నిర్ణయించింది. ఈ విషయమై సుదీర్ఘ కసరత్తు చేస్తూ వచ్చారు. చివరకు ఢిల్లీ పెద్దలు రేవంత్‌ను కొడంగల్‌తో పాటు కామారెడ్డి నుంచి సై తం పోటీ చేయించి కేసీఆర్‌ను ఢీకొట్టేందుకు రంగం సిద్ధం చేశారు. దీంతో కామారెడ్డికి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి షబ్బీర్అలీకి అర్బన్ టిక్కెట్టు ఖ రారు చేశారు. ఇందుకు సంబంధించి అధినాయక త్వం తీసుకున్న నిర్ణయానికి సంబంధించి గాంధీ భవన్లో శనివారం జరిగిన ఉమ్మడి జిల్లా నాయకు ల సమావేశంలో రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్‌రావు ఠాక్రే స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా ఆదివారం నిజామాబాద్ నాయకులతో షబ్బీర్ భేటీ కానున్నారు. షబ్బీర్ నామినేషన్ విషయమై తేదీ ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈనెల 7న షబ్బీర్ నామినేషన్ దాఖలు చేసే అవకాశాలున్నాయంటున్నారు. నామినేషన్ దాఖలు కార్యక్రమానికి పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి వస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా ఈనెల 6న కొడంగల్‌లో రేవంత్‌రెడ్డి నామినేషన్ దాఖలు చేయనున్నారు. అదే విధంగా ఈ నెల 9న కామారెడ్డిలో రేవంత్ నామినేషన్ వేసేందుకు నిర్ణయించినట్లు తెలిసింది. ► నిజామాబాద్ అర్బన్ టిక్కెట్టు విషయమై నెలరోజులుగా అనేక మలుపులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు ఈ సీటుపై తీవ్ర ఉత్కంఠ వాతావరణం కొనసాగింది. బీసీ కోటా కింద మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ తుదివరకు తీవ్రంగా ప్రయత్నించారు. మైనారిటీ కోటాలో పీసీసీ ఉపాధ్యక్షుడు తాహెర్‌బిన్ హందాన్ గట్టి ప్రయత్నాలు చేశారు. చివరకు షబ్బీర్‌కు దీన్ని కేటాయించారు. ఇదిలా ఉండగా మొదట్లో ఈ స్థానం పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ బొమ్మ మహేష్‌కుమార్ గౌడ్‌కు కేటాయించారు. అయితే మారిన పరిణామాల నేపథ్యంలో షబ్బీర్‌కు ఈ టిక్కెట్టు కేటాయించడంతో మహేష్‌కుమార్ గౌడ్‌కు, అధికారంలోకి వచ్చాక మొదటి విడతలోనే ఎమ్మెల్సీ పదవి ఇచ్చి కేబినెట్లోకి తీసుకునేందుకు హామీ ఇచ్చి అధిష్టానం బుజ్జగించింది. ఇక బాన్సువాడ కాంగ్రెస్ టిక్కెట్టును ఇటీవల బీజేపీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఏనుగు రవీందర్‌రెడ్డికి ఇవ్వనున్నట్లు సమాచారం. జుక్కల్ టిక్కెట్టు కోసం మాజీ ఎమ్మెల్యే సౌదా గర్ గంగారాం, పీసీసీ ప్రధాన కార్యదర్శి గడుగు గంగాధర్, ఎన్ఆర్ఐ లక్ష్మికాంతారావు మధ్య పోటీ నెలకొంది. మొత్తానికి కేసీఆర్, రేవంత్‌లు పోటీపడుతున్న నేపథ్యంలో ఉమ్మడి జిల్లాతో పాటు ఉత్తర తెలంగాణలో రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. ఇదిలా ఉండ గా కామారెడ్డిలో బీజేపీ అభ్యర్థి బలంగా ఉండడంతో త్రిముఖ పోటీ తప్పనిసరి అయింది. ఇందులో ఎవరు గెలుస్తారో అనే ఉత్కంఠ నెల కొంది. ఇక నిజామాబాద్ అర్బన్లోనూ బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ త్రిముఖ పోరు కానుంది. -
ఢిల్లీ దొరల పెత్తనాన్ని తిప్పికొడతాం: కేటీఆర్
-
‘కేసీఆర్‌పై పోటీ అంటే పోచమ్మ ముందు గొర్రె పొట్టేలును కట్టేసినట్టే’
సాక్షి, కామారెడ్డి: విధిలేని పరిస్థితుల్లోనే కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్. తెలంగాణ బిడ్డలపై రేవంత్ రెడ్డి తుపాకీ గురి పెట్టాడని విమర్శించారు. డబ్బులు ఎవరిచ్చినా తీసుకోండి, ఓటు మాత్రం కారుకే వేయండని చెప్పారు. విదన్నారు. బీజేపీ ఇచ్చే చాకెట్లు కావాలా? కేసీఆర్ ఇచ్చే ధమ్ బిర్యానీ కావాలా అని ప్రశ్నించారు. రైతులను బిచ్చగాళ్లు అని చెప్పిన కాంగ్రెస్‌ను బొందపెట్టాలని అన్నారు. ఢిల్లీ దొరల పెత్తనాన్ని తిప్పికొడదామని కేటీఆర్ పిలుపునిచ్చారు. రాహుల్ గాంధీ లీడర్ కాదు రీడర్ అని ధ్వజమెత్తారు. కేసీఆర్ కామారెడ్డి రావడానికి ఎమ్మెల్యే గంప గోవర్ధనే కారణమని, ఇక్కడి ప్రాంతం మొదటి స్థానంలో ఉండాలని సీఎంను ఆహ్వానించారని తెలిపారు. కొడంగల్‌కు కేసీఆర్ రాకపోతే కామారెడ్డికి తానే వస్తానని రేవంత్ రెడ్డి అన్నారన్న కేటీఆర్.. కామారెడ్డి వచ్చి కేసీఆర్ మీద తొడ కొట్టడమంటే పోచమ్మ ముందు గొర్రె పొట్టేలును కట్టేసినట్టేనని చురకలంటించారు. షబ్బీర్ అలీ ఇక్కడినుంచి నిజామాబాద్ పారిపోతున్నాడని కేటీఆర్ విమర్శించారు. కేసీఆర్ వస్తే కామారెడ్డిలో వెయ్యిరేట్ల అభివృద్ధి జరుగుతుందన్నారు. ఢిల్లీ దొరలకు, తెలంగాణ ప్రజలకు మధ్య జరుగుతున్న పోరాటంలో విజయం సాధించేది తెలంగాణ ప్రజలేనని వ్యాఖ్యానించారు. చదవండి: సర్వతోముఖాభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ రాజశ్యామల యాగం -
ప్రధాని సొంత రాష్ట్రంలోనే విద్యుత్ సరఫరా సరిగా లేదు: కేసీఆర్
సాక్షి, కామారెడ్డి జిల్లా: నిజాంసాగర్‌ను కాళేశ్వరంతో నింపుతామని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. కర్ణాటక రాష్ట్ర డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తెలంగాణకు వచ్చి చూడండి అంటున్నారని విమర్శించారు. కర్ణాటకలో కేవలం 5 గంటలే విద్యుత్ సరఫరా అవుతోందని దుయ్యబట్టారు. కర్ణాటక ఎప్పటి నుంచో ఉందని, అది పెద్ద రాష్ట్రమని చెప్పిన కేసీఆర్.. నిన్నా మొన్న వచ్చిన తెలంగాణలో 24 గంటల విద్యుత్ సరఫరా ఉందని తెలిపారు. ప్రధాని సొంత రాష్ట్రంలోనే విద్యుత్ సరఫరా సరిగా లేదని విమర్శలు గుప్పించారు. ఈ మేరకు సోమవారం జుక్కల్ బహిరంగ సభలో పాల్గొన్న సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. రైతు బంధు దుబారా, వృథా అంటూ కాంగ్రెస్ ఆరోపిస్తుందని మండిపడ్డారు. రైతుబంధు ఉండాలా? వద్దా? అని ప్రశ్నించారు. రైతు బంధు అనే పదాన్ని పుట్టించిందే బీఆర్ఎస్ ప్రభుత్వమని పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడా రుణమాఫీ లేదని అన్నారు. తెలంగాణలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చామని కేసీఆర్ తెలిపారు. రూ. 37 వేల కోట్ల రూపాయలు రుణమాఫీ రెండు దఫాలుగా చేశామని చెప్పారు. కాంగ్రెస్ ఫిర్యాదుతో కొందరికి రైతుబంధు ఆగిందని.. ఎన్నికలవగానే అందరికీ రైతుబంధు అందుతుందని పేర్కొన్నారు. చదవండి: అసెంబ్లీ ఎన్నికలు.. కాంగ్రెస్‌కు కోదండరామ్ మద్దతు -
కామారెడ్డి మున్సిపల్ మాస్టర్‌ప్లాన్ రద్దు
సాక్షి, హైదరాబాద్: కామారెడ్డి పట్టణానికి ప్రతిపాదించిన మాస్టర్‌ప్లాన్‌ను వెంటనే రద్దు చేస్తున్నట్లు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీ రామారావు ప్రకటించారు. రైతుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని మాస్టర్‌ప్లాన్ రద్దు చేస్తున్నట్లు గతంలోనే మున్సిపల్ శాఖ ప్రకటించిన విషయాన్ని కేటీఆర్ గుర్తుచేశారు. కామారెడ్డి రైతు జేఏసీ నాయకులు శనివారం ప్రగతిభవన్‌లో మంత్రి కేటీఆర్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా డీటీసీపీ అధికారులతో మాట్లాడిన కేటీఆర్ ప్రస్తుతమున్న పాత మాస్టర్‌ప్లాన్ ప్రకారమే నడుచుకోవాలని ఆదేశించారు. మాస్టర్‌ప్లాన్ రద్దు చేయాలని ఇప్పటికే కామారెడ్డి మున్సిపల్ పాలకమండలి తీర్మానించిందని, రైతులకు నష్టం జరగకుండా అండగా ఉంటామని చెప్పారు. మాస్టర్‌ప్లాన్ రద్దు కోసం జరిగిన ఆందోళనలలో రైతులపై నమోదైన కేసులను ఎత్తివేసేలా చర్యలు తీసుకుంటామని హామీనిచ్చారు. కేసుల గురించి కామారెడ్డి జిల్లా ఎస్పీ, రాష్ట్ర డీజీపీతో మాట్లాడారు. మాస్టర్‌ప్లాన్ రద్దు చేస్తున్నట్లు కేటీఆర్ చేసిన ప్రకటనపై కామారెడ్డి రైతు జేఏసీ నేతలు హర్షం వ్యక్తం చేశారు. -
తడారిన ఎడారి గొంతు వినండి!
సాక్షి ప్రతినిధి, కరీంనగర్, మోర్తాడ్ (బాల్కొండ) : రాష్ట్రంలో లక్షలాదిగా ఉన్న గల్ఫ్ కార్మికులు తమ డిమాండ్ల సాధనకోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై పోరాటానికి సిద్ధపడుతుతున్నారు. తమ సమస్యలు తీరాలంటే.. కామారెడ్డి అసెంబ్లీ స్థానం నుంచి గల్ఫ్‌దేశాల్లో మరణించిన కుటుంబాల నుంచి ఒకరిని పోటీ చేయించాలని గల్ఫ్ ప్రవాసీ సంఘాలు నిర్ణయించాయి. ఇటీవల షార్జాలో నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణలో దాదాపుగా 32 నియోజకవర్గాల్లో దుబాయ్, ఒమన్, ఖతర్, సౌదీ అరేబియా తదితర మధ్యప్రాచ్య దేశాల్లో పనిచేసి వచ్చిన ఓటర్లు ఉన్నారని ప్రవాసీ సంఘాలు చెబుతున్నాయి. వీరంతా తమ హక్కుల సాధనకు సంఘటితంగా మారి అసెంబ్లీ ఎన్నికలు వేదికగా తమ డిమాండ్లను తెలియజేసేందుకు సిద్ధమయ్యారు. ఇందుకోసం కామారెడ్డి లేదా నిర్మల్ వంటి అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించారు. కామారెడ్డిలో 100 మంది విడోలతో, నిర్మల్, బాల్కొండ, జగిత్యాల, కోరుట్ల, వేములవాడ, సిరిసిల్ల అసెంబ్లీ స్థానాల్లో ఒక్కో విడోతో నామినేషన్ వేయించేలా కసరత్తులు ప్రారంభించారు. ఇందుకోసం అన్ని గల్ఫ్ కుటుంబాలతో వాట్సాప్ గ్రూపులు ప్రారంభించి వారిని సంసిద్ధం చేస్తున్నారు. హామీల కోసం పట్టు.. గల్ఫ్ దేశాల్లో ఉపాధి వెతుక్కుంటూ వెళ్లిన వారి సంఖ్య దాదాపు 15 లక్షల వరకు ఉంటుందని అంచనా. అదే విధంగా అక్కడ కొంతకాలం పనిచేసి తిరిగి వచ్చిన వారి సంఖ్య కూడా 15 లక్షలకుపైగానే ఉంటుందని ప్రవాసీ సంఘాలు చెబుతున్నాయి. వీరి సంక్షేమానికి, పునరావాసానికి తగిన ప్రోత్సాహం ఇవ్వాలని గల్ఫ్ ప్రవాసీ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. గత పదేళ్ల కాలంలో గల్ఫ్ దేశాల్లో వివిధ కారణాల వల్ల 1,800 మందికిపైగా వలస కారి్మకులు ప్రాణాలు కోల్పోయారు. కార్మికులు మరణిస్తే.. రూ.5 లక్షల పరిహారం ఇస్తానన్న డిమాండ్‌ను ప్రభుత్వాలు నిలబెట్టుకోవాలని ప్రవాసీ సంఘాలు కోరుతున్నాయి. యుద్ధభేరి మోగిస్తాం కామారెడ్డిలో వందమంది మహిళలతో నామినేషన్ వేయిస్తాం కోరుట్ల: సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్న కామారెడ్డిలో గల్ఫ్ బాధిత కుటుంబాల నుంచి వంద మంది మహిళలతో నామినేషన్లు వేయిస్తామని గల్ఫ్ జేఏసీ రాష్ట్ర కమిటీ ప్రతినిధులు గుగ్గిల్ల రవిగౌడ్, సీఎస్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ చెన్నమనేని శ్రీనివాస్‌రావు, మంద భీంరెడ్డి, బూత్కురి కాంత అన్నారు. గల్ఫ్ వలస కార్మికుల సమస్యలను పట్టించుకోవడంలో పార్టీలు నిర్లక్ష్యం చూపుతున్నాయని ఆరోపించారు. జగిత్యాల జిల్లా కోరుట్లలో గల్ఫ్ ఐక్య వేదిక ఆధ్వర్యంలో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ఒక్క పార్టీ కూడా తమ మేనిఫెస్టోలో ప్రవాసీ బోర్డు, గల్ఫ్ కార్మికులకు ఎక్స్‌గ్రేషియా, బాధిత కుటుంబాలను ఆదుకునే అంశాల ప్రస్తావన తేలేదన్నారు. సమావేశంలో గల్ఫ్ జేఏసీ ప్రతినిధులు అశోక్, మోహన్‌రెడ్డి, రవి, మారుతి, బీడీ చెన్న విశ్వనాథం, శ్రీనివాస్ పాల్గొన్నారు. వైఎస్ హయాంలోనే ఆర్థిక సాయం ఉమ్మడి రాష్ట్రానికి సీఎంగా పని చేసిన వైఎస్సార్ తన హయాంలో గల్ఫ్ వలస కార్మికుల కోసం ఎన్నో కార్యక్రమాలను అమలు చేశారు. అప్పట్లో 1000 మంది గల్ఫ్ మృతులకు రూ. లక్ష చొప్పున సాయం అందించారు. గల్ఫ్ దేశాలను వీడి ఇంటిబాట పట్టిన వలస కార్మికులకు ఎస్సీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్ల ద్వారా రాయితీ రుణాలను ఇప్పించారు. వైఎస్ తర్వాత పనిచేసిన సీఎంలు ఎవరూ కూడా గల్ఫ్ వలస కార్మికుల సంక్షేమం గురించి పట్టించుకోలేదు. ఎన్నికల సమయం కావడంతో గల్ఫ్ అంశం మళ్లీ చర్చకు వచ్చింది. వలస కార్మికుల కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవాలని పలువురు కోరుతున్నారు. -
నియోజకవర్గ అభివృద్ధికి రూ.150 కోట్లు
సీఎం కేసీఆర్‌తో కామారెడ్డి నియోజకవర్గంలో తలపడేందుకు రెడీ అయిన బీజేపీ నేత, జెడ్పీ మాజీ చైర్మన్ కాటిపల్లి వెంకటరమణారెడ్డి.. విభిన్నమైన ఆలోచనలు చేస్తున్నారు. రూ. 150 కోట్ల సొంత డబ్బుతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానంటూ ప్రత్యేక మేనిఫెస్టో విడుదల చేశారు. శనివారం ఆయన కామారెడ్డిలో సొంత మేనిఫెస్టోను ప్రకటించారు. – సాక్షి, కామారెడ్డి మేనిఫెస్టో ఇలా.. ♦ కామారెడ్డి నియోజకవర్గ కేంద్రంలో రెండెకరాల విస్తీర్ణంలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని నిర్మించి అందులో ఆధునిక వైద్య సదుపాయాలు కల్పిస్తా. ఇందుకోసం రూ.8 కోట్లు అవుతాయి. ♦ రెండెకరాల్లో మోడల్ స్కూల్ నిర్మించి ఇంటర్ వరకు విద్య అందిస్తాం. పిల్లల కోసం రవాణా సౌకర్యం కూడా కల్పిస్తాం. దీనికి రూ.5.60 కోట్లు వెచ్చిస్తా. ♦ రూ.2 కోట్లతో రైతు సేవా కేంద్రం, రూ.కోటిన్నరతో క్రీడా ప్రాంగణం, రూ.కోటితో ఉపాధి శిక్షణ కేంద్రం ఏర్పాటు చేస్తా. ♦ రాజంపేట, పాల్వంచ, మాచారెడ్డి, దోమకొండ, బీబీపేట, భిక్కనూరు మండల కేంద్రాల్లో రూ.8.25 కోట్ల చొప్పున వెచ్చించి జనరల్ ఆస్పత్రి, మోడల్ స్కూల్, క్రీడా శిక్షణ కేంద్రం, రైతు సేవా కేంద్రం, ఉపాధి శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేస్తా. ప్రజా ఉద్యమాలతో గుర్తింపు.. వెంకటరమణారెడ్డి నాలుగైదేళ్లుగా ప్రజా సమస్యలపై ఉద్యమాలు చేస్తున్నారు. ప్రధానంగా కామారెడ్డి మున్సిపాలిటీలో మాస్టర్ ప్లాన్ వల్ల ప్రజలు, రైతులకు జరిగే నష్టంపై ఆయన చేసిన పోరాటం సంచలనమై రాష్ట్రంలోని పలు మున్సిపాలిటీలకు వ్యాపించింది. ఉమ్మడి జిల్లా పరిషత్ చైర్మన్‌గా పైరవీలకు తావులేకుండా ఉపాధ్యాయుల బదిలీలు నిర్వహించి అందరి మన్ననలు పొందారు. కామారెడ్డి నియోజకవర్గంలో ఆలయాలు, కమ్యూనిటీ హాళ్లు, ఫంక్షన్ హాళ్లకు ఇప్పటివరకు సుమారు రూ.50 కోట్ల వరకు విరాళం అందించారు. రాజకీయాల కోసం కాకుండా సేవ చేయాలన్న లక్ష్యంతో సొంత డబ్బులు ఖర్చు చేస్తున్నానని, తన ఆస్తులు అమ్మి అయినా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటానని వెంకటరమణారెడ్డి పేర్కొంటున్నారు. మహానేత డాక్టర్ వైఎస్సార్ స్ఫూర్తి.. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి, ఎన్టీఆర్‌లు నాకు స్ఫూర్తి. పేదల జీవితాల్లో మార్పు తీసుకురావడానికి అహర్నిశలు పాటుపడిన అరుదైన నాయకుడు వైఎస్సార్. ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకోవడం, వారితో కలిసి ఫొటో దిగడం ద్వారా ఎంతో మందికి ఆయన చేరువయ్యారు. నేను గెలిచినా, ఓడినా ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేరుస్తా. – వెంకటరమణారెడ్డి, బీజేపీ కామారెడ్డి నియోజకవర్గ ఇన్చార్జి -
ఓ ఫామ్ హౌస్ లో అసంతృప్తి కౌన్సిలర్ల సమావేశం
-
బీజేపీలో పోటీపై సస్పెన్స్.. విజయశాంతి కీలక వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఎన్నికల వేళ రాజకీయం రసవత్తరంగా మారింది. రాష్ట్రంలో బీజేపీ అభ్యర్థుల ప్రకటనపై సస్పెన్స్ కొనసాగుతున్న వేళ పార్టీ సీనియర్ నేత విజయశాంతి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆసక్తికరమైన విజయశాంతి మాటలు ఏమంటున్నాయంటే...? ట్విట్టర్ వేదికగా విజయశాంతి చేసిన ఓ ట్వీట్లో బీఆర్ఎస్పై పోటీ విషయంలో బీజేపీ ఎన్నడూ వెనక్కు తగ్గదని కార్యకర్తలు విశ్వసిస్తున్నట్లు తెలిపారు. ఈ పోరాటంలో భాగంగా తాను కామారెడ్డి నియోజకవర్గం నుంచి, పార్టీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గజ్వేల్ నుంచి అసెంబ్లీకి పోటీ చేయాలని కార్యకర్తలు అడగడం తప్పు ఏమీ కాదని వ్యాఖ్యానించారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశం తనకు లేనప్పటికీ పార్టీ నిర్దేశిస్తే చేస్తానని పరోక్షంగా తెలిపారు. ఈ సారి ఎన్నికల్లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గజ్వేల్‌తోపాటు కామారెడ్డి నుంచి కూడా బరిలోకి దిగుతున్న విషయం తెలిసిందే. బీఆర్ఎస్ పై రాజీలేని పోరాటం చేయడంలో బీజేపీ వెనక్కు తగ్గదు.. అని కార్యకర్తల విశ్వాసం. అందుకు, గజ్వేల్ నుండి బండి సంజయ్ గారు, కామారెడ్డి నుండి నేను అసెంబ్లీకి కేసీఆర్ గారిపై పోటీ చెయ్యాలని గత కొన్ని రోజుల మీడియా సమాచారం దృష్ట్యా, కార్యకర్తలు అడగటం తప్పు కాదు. అసెంబ్లీ ఎన్నికల… pic.twitter.com/j1tUfexznX — VIJAYASHANTHI (@vijayashanthi_m) October 17, 2023 రేపే అభ్యర్థుల ప్రకటన! ఇదిలా ఉండగా.. అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ అభ్యర్థుల తొలి జాబితాను గురువారం ఢిల్లీలో ప్రకటించే అవకాశముంది. ఢిల్లీలో బుధవారం జరిగే బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీలో దీనిపై తుది నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం. జాబితా బుధవారం రాత్రే ప్రకటించే అవకాశాన్నీ కొట్టిపారేయలేమని పార్టీ నేతలు చెబుతున్నారు. జాబితాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ ఇలా అన్ని వర్గాలకు తగిన ప్రాధాన్యత దక్కేలా కసరత్తు సాగుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే 60–70 స్థానాల్లో అభ్యర్థుల పేర్లపై పార్టీ రాష్ట్ర ముఖ్యనేతలు ఓ అంచనాకు రాగా ఏకాభిప్రాయం కుదిరని సింగిల్ క్యాండిడేట్ నియోజకవర్గాలు కొన్నింటిని రెండు లేదా మూడో జాబితాలో ప్రకటించే అవకాశాలున్నాయని అంటున్నారు. తొలి జాబితాలో 35–40 మంది అభ్యర్థులు ఉండొచ్చునని చెబుతున్నారు. మొత్తమ్మీద ఇతర పార్టీల కంటే కూడా బీసీలు (దాదాపు 40 సీట్లు), మహిళలకు ఎక్కువ సీట్లు ఇచ్చే అవకాశముందనే చర్చ జరుగుతోంది. మేనిఫెస్టోకు ఓపిక పట్టండి తెలంగాణలో బీజేపీ మేనిఫెస్టోను ఎప్పుడు ప్రకటిస్తారనే దానిపై స్పష్టత కొరవడటంతో స్థానిక కాషాయ నేతలు దిగాలు చెందుతున్నారు. ఆయా అంశాలను కొందరు ముఖ్య నేతలు జాతీయ నాయకత్వం దృష్టికి తీసుకెళ్లగా ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాల్లో తెలంగాణలో చివర్లో ఎన్నికలు జరగనుండటంతో ఎందుకు తొందర పడుతున్నారని ఎదురు ప్రశ్నించినట్లు తెలిసింది. దీంతో మేనిఫెస్టో ప్రకటనకు మరికొంత సమయం పట్టొచ్చని సమాచారం. -
షబ్బీర్ అలీకి కొత్త టెన్షన్.. ప్రమాదంలో పొలిటికల్ కెరీర్!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యాక ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటీకే కొందరు నేతలు పార్టీలు మారుతుండగా.. కొన్ని స్థానాల్లో పోటీ చేసేందుకు మరికొందరు నేతలు వెనకడుగు వేస్తున్నారు. ఇందుకు కారణాలు ఏమైనప్పటికీ.. ఇప్పటి వరకు పోటీ చేసిన స్థానాల్లో కాకుండా కొత్త చోట్ల బరిలోకి దిగాలనే ఆలోచన చేస్తున్నారు. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ ఆసక్తికర నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. వివరాల ప్రకారం.. కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ కామారెడ్డి నుంచి పోటీ చేసేందుకు విముఖత చూపుతున్నారని సమాచారం. కాగా, కామారెడ్డి అసెంబ్లీ స్థానం నుంచి బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ బరిలో నిలుస్తుండటంతో షబ్బీర్ అలీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. ప్రత్యర్థిగా కేసీఆర్ ఉండటంతోనే పోటీకి ఆయన విముఖత చూపిస్తున్నారు. ఈ ఎన్నికల్లో ఫలితాలు భిన్నంగా వస్తే తన పొలిటికల్ కెరీర్ ప్రమాదంలో పడుతుందని ఆయన ఆందోళన చెందుతున్నట్టు సమాచారం. అయితే, ప్రస్తుత ఎన్నికల్లో కామారెడ్డి నుంచి కాకుండా ఎల్లారెడ్డి నుంచి బరిలో దిగాలని షబ్బీర్ అలీ ఆలోచిస్తున్నట్టు పార్టీలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇదిలా ఉండగా.. ఎల్లారెడ్డి నుంచి బరిలో దిగాలని చూస్తున్న మదన్ మోహన్‌రావును కామారెడ్డి నుంచి బరిలో దిగాలని కోరుతున్నట్టు తెలుస్తోంది. కాగా.. షబ్బీర్ అలీ నిర్ణయంపై కాంగ్రెస్ పార్టీలో ఆసక్తికర చర్చ నడుస్తోంది. మరోవైపు.. మొదటి లిస్టులో భాగంగా కాంగ్రెస్ పార్టీ నిన్న(ఆదివారం) 55 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ జాబితాలో షబ్బీర్ అలీ పేరు లేకపోవడం విశేషం. ఇది కూడా చదవండి: నేడు బీజేపీ కీలక భేటీ.. అభ్యర్థుల్లో టెన్షన్! -
బాన్సువాడ దవాఖాన సరికొత్త రికార్డు.. ఒకే నెలలో 504 ప్రసవాలు
కామారెడ్డి: బాన్సువాడ మాతాశిశు సంరక్షణ ఆస్పత్రిలో అగస్టులో 504 ప్రసవాలు జరిగాయని ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రీనివాస్‌ప్రసాద్ తెలిపారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని శనివారం ఆస్పత్రిలో కేక్ కట్ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆస్పత్రి ప్రారంభించి రెండేళ్లవుతోందన్నారు. గత నెలలో రికార్డు స్థాయిలో 504 ప్రసవాలు జరిగాయన్నారు. వైద్యులు, సిబ్బందికి అభినందనలు తెలిపారు. వైద్యులు సుధ, సిబ్బంది ఉన్నారు. -
Telangana: మా ఓటు కేసీఆర్‌కే..
మాచారెడ్డి/కామారెడ్డి: సీఎం కేసీఆర్ కామారెడ్డి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని నిర్ణయం తీసుకోవడంతో ఆయనకు తమ సంపూర్ణ మద్దతు తెలుపుతూ నియోజకవర్గంలోని పలు గ్రామాల ప్రజలు తీర్మానాలు చేస్తున్నారు. శనివారం కామారెడ్డి జిల్లా మాచారెడ్డి ఎంపీపీ లోయపల్లి నర్సింగరావ్ ఆధ్వర్యంలో ఎల్లంపేటతో పాటు మరో ఎనిమిది గిరిజన గ్రామాల ప్రజలు ఆయా గ్రామాల సర్పంచ్‌లతో కలసి సంఘీభావ ర్యాలీ నిర్వహించారు. అలాగే పాల్వంచ మండలం మంతన్ దేవునిపల్లి గ్రామస్తులు సీఎం కె.చంద్రశేఖర్‌రావుకు తప్ప ఎవరికీ ఓటేయమని ఏకగ్రీవంగా తీర్మానాలు చేశారు. ఎంపీపీ నర్సింగరావు, జెడ్పీటీసీ మినుకూరి రాంరెడ్డి, వైస్‌ఎంపీపీ జీడిపల్లి నర్సింహారెడ్డి ఆధ్వర్యంలో ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు సంతకాలు చేశారు. ఎల్లంపేటలో ర్యాలీ అనంతరం తమ తీర్మాన ప్రతులతో కేసీఆర్‌ను కలిసేందుకు హైదరాబాద్ వెళ్లారు. అయితే ముఖ్యమంత్రి అందుబాటులో లేకపోవడంతో ఎమ్మెల్సీ కవితను కలసి తీర్మాన కాపీలను అందజేశారు. ఈ సందర్భంగా కేసీఆర్ ఎన్నికల ఖర్చుకోసం 10 గ్రామాల ప్రజలు రూ.50 వేలు జమచేసి కవితకు అందజేశారు. ఇదిలా ఉండగా తెలంగాణ కోసం అప్పట్లో టీఆర్ఎస్ ఆవిర్భవించిన తొలినాళ్లలోనూ స్థానిక సంస్థల ఎన్నికల్లో మాచారెడ్డి మండలంలోని పలు గ్రామాల్లో ప్రజలు ఎంపీటీసీలను ఏకగ్రీవంగా ఎన్నుకుని చరిత్ర సృష్టించారు. అప్పట్లో 13 ఎంపీటీసీలకు గాను 8 చోట్ల ఏకగ్రీవంగా ఎన్నుకుని ఎంపీపీ పీఠాన్ని కైవసం చేసుకున్నారు. అలాగే జెడ్పీటీసీని కూడా గెలిపించారు. కేసీఆర్‌కే జై కొడుతున్న పంచాయతీలు: కవిత సీఎం కేసీఆర్ కామారెడ్డి నియోజకవర్గం నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడాన్ని నిజామాబాద్ బిడ్డగా స్వాగతిస్తున్నానని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. కామారెడ్డి నుంచి సీఎం కేసీఆర్ పోటీ చేస్తారని ప్రకటించడంతో గ్రామ పంచాయతీలు, గిరిజన తండాలు కేసీఆర్‌కు జై కొడుతున్నాయన్నారు. కామారెడ్డి నియోజకవర్గ బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు శనివారం హైదరాబాద్‌లో ఎమ్మెల్సీ కవితను ఆమె నివాసంలో కలసి ఏకగ్రీవ తీర్మాన ప్రతులను అందజేశారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ కామారెడ్డి నుంచి పోటీచేస్తే నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందుతుందన్న ఉద్దేశంతో ఎమ్మెల్యే గంప గోవర్ధన్, కేసీఆర్‌ను పోటీ చేయాలని అహా్వనించారని చెప్పా రు. మాచారెడ్డి మండలంలోని గ్రామాల ప్రజలు ఏకగ్రీవ తీర్మానాలు చేశారని, షబ్బీర్ అలీ వంటి వారు ఎన్నిమాట్లాడినా, ప్రజలు కేసీఆర్‌ను పార్టీలు, కులమతాలకు అతీతంగానే చూస్తారని ఆమె పేర్కొన్నారు. ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ఆధ్వర్యంలో 28న కామారెడ్డిలో భారీ సమావేశం జరుగుతుందని ఆ సమావేశంలో తాను కూడా పాల్గొంటానని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు అయచితం శ్రీధర్, మఠం భిక్షపతి, మేడే రాజీవ్ సాగర్, మాచారెడ్డి ఎంపీపీ నర్సింగరావు, గాంధారి మార్కెట్ కమిటీ చైర్మన్ సత్యంరావు పాల్గొన్నారు. కాగా, ఎంపీపీ నర్సింగరావుకు శనివారం రాత్రి సీఎం కేసీఆర్ ఫోన్ చేసి అభినందించారు. -
కేసీఆర్ Vs రాములమ్మ.. తెలంగాణలో పొలిటికల్ వార్!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఎన్నికల వేడి మొదలైంది. అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఈ క్రమంలో బీజేపీ నేత విజయశాంతి ఆసక్తికర కామెంట్స్ చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌పై పోటీకి తాను రెడీగా ఉన్నట్టు పరోక్షంగా సంకేతాలిచ్చారు. దీంతో, ఆమె వ్యాఖ్యలు పొలిటికల్‌గా ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. అయితే, వచ్చే ఎన్నికల్లో గెలుపోటముల అంశాన్ని పక్కనపెట్టి బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్‌పై పోటీ చేయాలని విజయశాంతి సూచనప్రాయ నిర్ణయం తీసుకున్నారు. బీజేపీ అభ్యర్థిగా కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలో దిగేందుకు తాను సిద్ధమని సంకేతాలిస్తూ ట్వీట్ చేశారు. ఆ అవకాశం తనకే కల్పించాలని పార్టీ అధిష్టానానికి విజయశాంతి విజ్ఞప్తి చేసినట్లు విశ్వసనీయ సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. ఇక, ట్విట్టర్ వేదికగా విజయశాంతి.. కామారెడ్డి అసెంబ్లీపై నా పోటీ విషయం మా పార్టీ నిర్ణయిస్తుంది. రెండు రోజులుగా పాత్రికేయ మిత్రులు, మీడియాలో వస్తున్న వార్తల ప్రసారాలపై అడుగుతున్న ప్రశ్నలకు నా సమాధానం ఇంతే. బీజేపీ కార్యకర్తలం ఎవరైనా పార్టీ ఆదేశాలను పాటించడం మాత్రమే మా విధానం. ఏది ఏమైనా కామారెడ్డి, గజ్వేల్ రెండు నియోజకవర్గాలలో బీజేపీ గెలుపు, తెలంగాణ భవిష్యత్తుకు తప్పనిసరి అవసరం. ఇది ప్రజలకు తెలియపర్చటం తెలంగాణ ఉద్యమకారుల అందరి బాధ్యత అంటూ చెప్పుకొచ్చారు. కామారెడ్డి అసెంబ్లీ పై నా పోటీ విషయం మా పార్టీ నిర్ణయిస్తది. రెండు రోజులుగా పాత్రికేయ మిత్రులు, మీడియాలో వస్తున్న వార్తల ప్రసారాలపై అడుగుతున్న ప్రశ్నలకు నా సమాధానం ఇంతే.. బీజేపీ కార్యకర్తలం ఎవరైనా పార్టీ ఆదేశాలను పాటించడం మాత్రమే మా విధానం... ఏది ఏమైనా కామారెడ్డి, గజ్వేల్… pic.twitter.com/2TplIvgykR — VIJAYASHANTHI (@vijayashanthi_m) August 23, 2023 ఇదిలా ఉండగా.. బీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ఇటీవలే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన బీఆర్ఎస్ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేశారు. కామారెడ్డి, గజ్వేల్ నుంచి కేసీఆర్ పోటీ చేయనున్నారు. సిట్టింగుల్లో ఏడుగురికి అవకాశం ఇవ్వలేదు. నాంపల్లి, గోషామహల్, జనగాం, నర్సాపూర్ స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించలేదు. మరోవైపు కాంగ్రెస్, బీజేపీ ఇప్పటికే నియోజకవర్గాల వారిగా అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించాయి. ఇది కూడా చదవండి: కార్యాచరణపై రేపు మైనంపల్లి భేటీ -
కామారెడ్డి జిల్లాలో అంతుచిక్కని శిశు మరణాలు
కామారెడ్డి: కామారెడ్డి జిల్లాలో శిశు మరణాలు వెనుక కారణం ఏమిటనేది అంతుచిక్కడం లేదు. కేవలం నెల రోజుల వ్యవధిలోనే ఏడుగురు చిన్నారులు మృతి చెందడంతో వైద్యులు, తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. నెల రోజులుగా కలవరపెడుతున్న ఈ శిశు మరణాల్లో మృతి చెందిన శిశువులంతా నాలుగు నెలలలోపు చిన్నారులే. ఆసుపత్రిలో చేరిన చిన్నారులకు వైద్యులు పరీక్షలు నిర్వహిస్తుండగానే వారి ఊపిరి ఆగిపోతోంది. దీని వెనుక కారణాలు ఏమిటనేది వైద్యులకు అంతుచిక్కడం లేదు. వరుసగా జరుగుతున్న శిశు మరణాల గురించి వైద్యులు రాష్ట్ర అధికారులకు సమాచారమిచ్చారు. ఇది కూడా చదవండి: జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశం -
ఓటమి ఒప్పుకున్నకేసీఆర్!
సాక్షి, హైదరాబాద్: సీఎం కేసీఆర్ స్వయంగా తన ఓటమిని ఒప్పుకున్నారని టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. రెండు నియోజకవర్గాల్లో పోటీ చేయడం ద్వారా ఈ విషయం స్పష్టమైందని అన్నారు. అభ్యర్థుల ప్రకటన సమయంలో ముఖ్యమంత్రి గొంతులో ఓటమి భయం స్పష్టంగా కనిపించిందని, ఆయన పోటీ చేస్తున్న గజ్వేల్, కామారెడ్డి రెండింటిలో ఓడిపోవడం ఖాయమని జోస్యం చెప్పారు. మొత్తం సిట్టింగులకు సీట్లివ్వాలన్న తన సవాల్‌ను స్వీకరించకుండా కొందరిని మార్చారని అన్నారు. సోమవారం గాందీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. మైనారిటీలను అవమానించడమే.. ముఖ్యమంత్రి కేసీఆర్ కామారెడ్డికి పారిపోతున్నారని తాను మొదటి నుంచి చెప్పిన మాటలు నిజమయ్యాయని రేవంత్ అన్నారు. బీఆర్ఎస్ జాబితా చూసిన తర్వాత వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయమని తేలిపోయిందని, మూడింట రెండొంతుల మెజారిటీతో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ‘కేసీఆర్ పారిపోవాలనుకుంటే సిద్దిపేట ఉంది.. సిరిసిల్ల ఉంది..కానీ ఒక మైనారిటీ నేత బరిలో ఉన్న కామారెడ్డికి వెళ్లడం.. మైనారిటీలను అవమానించడమే. తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ ఎనలేని సేవ చేశారు. కాంగ్రెస్ అంతా షబ్బీర్ అలీకి అండగా ఉండి కేసీఆర్ పని పడుతుంది. అసలు కేసీఆర్ సొంత జిల్లా సిద్దిపేటకు వెళ్లకుండా కామారెడ్డికి ఎందుకు వెళ్తున్నారో ప్రజలకు చెప్పాలి..’అని రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. కేసీఆర్ ఓటమి సూర్యాపేట సభలోనే స్పష్టంగా కనిపించిందని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాను మధ్యాహ్నం 12.03 గంటలకు విడుదల చేస్తున్నట్లు ప్రచారం జరగగా, ఆ సమయంలో లిక్కర్ షాపుల డ్రా తీశారని ఎద్దేవా చేశారు. దీనిని బట్టి కేసీఆర్ ప్రాధాన్యత ఏంటో తెలంగాణ సమాజం అర్ధం చేసుకోవాలని అన్నారు. రుణమాపీలో రూ.11 వేల కోట్లు మిగుల్చుకున్నారు రుణమాఫీ పేరుతో కేసీఆర్ అతి తెలివితేటలు ప్రదర్శించారని రేవంత్ విమర్శించారు. రూ 99,999 వరకు మాత్రమే రుణమాఫీ చేసి రూ.11 వేల కోట్లు మిగుల్చుకున్నారని ఆరోపించారు. ఒక్క రూపాయే తేడా అని అందరూ అనుకుంటున్నారు కానీ.. దానివల్ల వేలాది మంది రైతులకు రుణమాఫీ కాలేదని తెలిపారు. కాంగ్రెస్ హయాంలోనే అభివృద్ధి కాంగ్రెస్ హయాంలోనే పూర్తి రుణమాఫీ జరిగిందని రేవంత్ చెప్పారు. రూ.75 ఉన్న పింఛన్‌ను రూ.200కు పెంచింది కాంగ్రెస్సేనన్నారు. ‘50 ఏళ్లలో కాంగ్రెస్ ఏం చేసింది అని కేసీఆర్ అంటున్నారు. నాగార్జునసాగర్ లాంటి ప్రాజెక్టులు మీ తాతలు కట్టారా? 12,500 గ్రామ పంచాయతీలకు కరెంట్ ఇచ్చింది కాంగ్రెస్ కాదా? చింతమడకలో బడి కట్టింది, ముఖ్యమంత్రి ఇంటికి కరెంటు ఇచ్చింది కాంగ్రెస్సే. ఔటర్ రింగ్ రోడ్డు, మెట్రో నిర్మించింది కాంగ్రెస్..’అని స్పష్టం చేశారు. 50 ఏళ్లలో కాంగ్రెస్ ఏం చేసిందో లెక్కలతో సహా చర్చకు సిద్ధమని ప్రకటించారు. కమ్యూనిస్టులను కరివేపాకులా తీసేశారు.. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని, రూ.4 వేల పెన్షన్ ఇస్తుందని రేవంత్ దీమా వ్యక్తం చేశారు. ఈ విషయం ప్రగతి భవన్ గోడలమీద రాసుకోవాలని సవాల్ విసిరారు. ఏ పెద్ద ఒప్పందం జరిగినా, తర్వాత పది రోజులకు పెట్టుబడులు పెట్టేందుకు మంత్రి కేటీఆర్ విదేశాలకు వెళ్తారని విమర్శించారు. సూర్యాపేట సభలో శ్రీకాంత చారి తల్లిని నిలబెట్టి కేసీఆర్ అవమానించారని అన్నారు. కమ్యూనిస్టులను కరివేపాకులా తీసి పారేశారని ధ్వజమెత్తారు. మోసానికి గురైన కమ్యూనిస్టులు కేసీఆర్‌పై తిరుగుబాటు చేయాలని అన్నారు. పార్టీ లో చేరికలు బాన్సువాడ, వర్ధన్నపేట, ముధోల్ నియోజకవర్గాలకు చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు పలువురు సోమవారం గాందీభవన్‌లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. రేవంత్ వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. -
ఓటమి భయంతోనే ‘కామారెడ్డికి’ కేసీఆర్
సాక్షి, న్యూఢిల్లీ: బీఆర్ఎస్ అభ్యర్థుల ప్రకటన.. సీజన్ రాకముందే కోయిల కూసింది అన్నట్లుగా ఉందని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఎద్దేవా చేశారు. ప్రత్యేక అభివృద్ధి పేరుతో గజ్వేల్ నియోజకవర్గంలో లెక్కలేనంత ఖర్చు పెట్టినా.. అక్కడ గెలిచే పరిస్థితిలేదనే కేసీఆర్ మరో చోటుకు వెళ్తున్నారని విమర్శించారు. ఈసారి గజ్వేల్‌లో ఓడిపోతున్నారనే సర్వే ఫలితాల భయంతోనే కేసీఆర్ కామారెడ్డికి పారిపోతున్నారని భట్టి అన్నారు. కేసీఆర్ రెండు చోట్ల పోటీ చేయాలన్న నిర్ణయంతోనే వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోతుందనేది అర్థం అవుతోందని.. బీఆర్ఎస్ నేతలు పార్టీలు మారుతారనే ఆందోళనలోనే కేసీఆర్ అభ్యర్థుల ప్రకటన ముందే చేశారని అన్నారు. సోమవారం బీఆర్ఎస్ అభ్యర్థుల ప్రకటన అనంతరం ఢిల్లీలో భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌పై ధ్వజమెత్తారు. కేసీఆర్‌కే గెలిచే పరిస్థితి లేకపోతే, ఆయన బొమ్మ పెట్టుకుని గెలిచే పరిస్థితి ఉంటుందా అని ప్రశ్నించారు. తెలంగాణలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని.. గెలిచేది కాంగ్రెస్ పార్టీయేనని ధీమా వ్యక్తంచేశారు. ఏ లక్ష్యాలకోసం తెలంగాణ సాధించుకున్నామో.. ఆ లక్ష్యాలన్నీ కాంగ్రెస్‌తోనే సాధ్యమని అన్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఫిబ్రవరి, మార్చి నుంచే ఎన్నికల ప్రచారం మొదలు పెట్టిందని.. రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు వచి్చనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. కాగా, సెల్ఫీ విత్ కాంగ్రెస్ అభివృద్ధి అనే కార్యక్రమంతో మరోసారి ప్రజల్లోకి వెళ్తామని.. కాంగ్రెస్ హయంలో చేసిన అభివృద్ధి పనులను సెల్ఫీ తీసుకొని ప్రజలతో పంచుకుంటామని తెలిపారు. బీఆర్ఎస్ పాలనతో నష్టపోయిన వారందరూ కాంగ్రెస్‌తో కలసిరావాలని భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. -
రెండు చోట్ల పోటీపై కేసీఆర్ స్పందన ఇది
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అసెంబ్లీ ఎన్నికల్లో రెండు చోట్ల నుంచి అసెంబ్లీకి పోటీ చేయనున్నారు. సిట్టింగ్ నియోజకవర్గం గజ్వేల్‌తో పాటు కామారెడ్డి నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు. అయితే ఈ నిర్ణయం వెనుక కారణం గురించి మీడియా ఆయన్ని ప్రశ్నించగా.. తనదైన స్టైల్లో స్పందించారాయన. పార్టీ నిర్ణయించింది కాబట్టే తాను రెండు చోట్ల నుంచి పోటీ చేస్తున్నట్లు తెలిపారాయన. ‘‘కేసీఆర్ చరిత్ర మీకు తెల్వదు. కరీంనగర్, రివర్స్‌ల మహబూబ్ నగర్ నుంచి ఎంపీగా పోటీ చేసి గెలిచా. కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్, నిజామాబాద్ జిల్లా నుంచి మంత్రి నన్ను వ్యక్తిగతంగా కోరారు. వాళ్లే కాదు.. ఇంకొన్ని జిల్లాల వాళ్లు కూడా అడిగారు. చివరగా పార్టీ సంప్రదింపులతో కామారెడ్డి ఫిక్స్ అయ్యాం. అంతేగానీ.. ఇందులో ఏం ప్రత్యేకత లేదు అని తెలిపారాయన. -
కామారెడ్డి జిల్లాలో వ్యాపిస్తున్న కండ్లకలక వైరస్
-
కూరగాయల దుకాణంలో చోరీ...కొట్టేసింది ?
-
విషాదం.. పాము కాటుతో తండ్రీకొడుకు మృతి
రాజంపేట: పాము కాటు కారణంగా ఓ పేదింట విషాదం నెలకొంది. అర్ధరాత్రి పాము కాటుకి తండ్రీకొడుకులు బలయ్యారు. ఈ విషాదకర ఘటన కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. వారి మృతితో భార్య అనాథగా అయిపోయింది. కుటుంబ సభ్యులు, స్థానికులు కన్నీటిపర్యంతమవువున్నారు. వివరాల ప్రకారం.. రాజంపేట మండలం శేర్ శంకర్ గ్రామ పంచాయతీ పరిధిలోని మూడు మామిళ్ల తండాకు చెందిన ముద్రిచ్చ రవి (40) తనకున్న ఎకరం భూమిలో వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. రవి తనభార్యతో కలసి రోజూలాగే శుక్రవారం సాయంత్రం వ్యవసాయ పనులు ముగించుకుని ఇంటికి వచ్చాడు. రాత్రి భార్యాపిల్లలతో కలసి భోజనం చేసిన అనంతరం అందరూ కలసి పడుకున్నారు. అయితే, రాత్రి 11.30 గంటల సమయంలో నిద్రలోంచి లేచిన రవి తన చేతిపై నుంచి పాము వెళ్లినట్లు భార్య మంగినికి తెలిపాడు. దీంతో భార్యాభర్తలు దేవుని పేరు తలచుకుని ముడుపు కట్టారు. తర్వాత ఇంట్లో పామును గుర్తించిన రవి కర్రతో కొట్టి దానిని చంపాడు. ఇదిలా ఉండగా అర్ధరాత్రి 12 గంటల తర్వాత చిన్నకొడుకు వినోద్(11) ఛాతీలో నొప్పివస్తోందని చెప్పి.. అంతలోనే వాంతులు చేసుకున్నాడు. కొద్ది సేపటికే ప్రాణాలు కోల్పో యాడు. అదే సమయంలో తనకు కళ్లు తిరుగుతున్నాయని రవి భార్య మంగినికి తెలిపాడు. దీంతో వారు పాము కాటుకు గురైనట్లు గ్రహించిన మంగిని చుట్టుపక్కల వారి సహాయంతో రవిని శనివారం తెల్లవారు జామున 2 గంటల సమయంలో అంబులెన్సులో కామారెడ్డి ఆస్పత్రికి తరలించింది. చికిత్స పొందుతూ తెల్లవారు జామున 4 గంటలకు రవి సైతం మరణించాడు. ఒకే రోజు తండ్రీ కొడుకుల మరణంతో తండాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇది కూడా చదవండి: రోడ్డు ప్రమాదంలో బీఆర్ఎస్ నేత, తనయుడి మృతి -
పాము కాటుతో తండ్రీకొడుకులు మృతి
రాజంపేట: పాము కాటుకు తండ్రీకొడుకులు బల య్యారు. కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం శేర్ శంకర్ గ్రామ పంచాయతీ పరిధిలోని మూడు మామిళ్ల తండాలో ఈ ఘటన చోటు చేసుకుంది. తండాకు చెందిన ముద్రిచ్చ రవి (40) తనకున్న ఎకరం భూమిలో వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. రవి తనభార్యతో కలసి రోజూలాగే శుక్రవారం సాయంత్రం వ్యవసాయ పనులు ముగించుకుని ఇంటికి వచ్చాడు. రాత్రి భార్యాపిల్లలతో కలసి భోజనం చేసిన అనంతరం అందరూ కలసి పడుకున్నారు. రాత్రి 11.30 గంటల సమయంలో నిద్రలోంచి లేచిన రవి తన చేతిపై నుంచి పాము వెళ్లినట్లు భార్య మంగినికి తె లిపాడు. దీంతో భార్యాభర్త లు దేవుని పేరు తలచుకుని ముడుపు కట్టారు. తర్వాత ఇంట్లో పామును గుర్తించిన రవి కర్రతో కొట్టి దానిని చంపాడు. ఇదిలా ఉండగా అర్ధ రాత్రి 12 గంటల తర్వాత చిన్నకొడుకు వినోద్(11) ఛాతీలో నొప్పివస్తోందని చెప్పి.. అంతలోనే వాంతు లు చేసుకున్నాడు. కొద్ది సేపటికే ప్రాణాలు కోల్పో యాడు. అదే సమయంలో తనకు కళ్లు తిరుగు తున్నాయని రవి భార్య మంగినికి తెలిపాడు. దీంతో వారు పాము కాటుకు గురైనట్లు గ్రహించిన మంగిని చుట్టుపక్కల వారి సహాయంతో రవిని శనివారం తెల్లవారు జామున 2 గంటల సమయంలో అంబులెన్సులో కామారెడ్డి ఆస్పత్రికి తరలించింది. చికిత్స పొందుతూ తెల్లవారు జామున 4 గంటలకు రవి సైతం మరణించాడు. ఒకే రోజు తండ్రీ కొడుకుల మరణంతో తండాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. -
పెళ్లి రిసెప్షన్లో వరుడు, స్నేహితుల హల్చల్..
-
పాఠశాలలో పాము కాట్లు.. రెండు రోజుల్లో ఇద్దరు విద్యార్థినిలను..
సాక్షి, నిజామాబాద్: ఉమ్మడి జిల్లాలో రెండ్రోజుల వ్యవధిలో ఇద్దరు విద్యార్ధినిలు పాముకాటుకు గురయ్యారు. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మినీ గురుకల పాఠశాలలో ఓ విద్యార్థిని పాముకాటుకు గురైంది. బుధవారం పాఠశాల వరండాలో కూర్చుని చదువుకుంటున్న నాలుగో తరగితి విద్యార్థిని నిఖితను పాము కాటేసింది. దీంతో చిన్నారి భయంతో గట్టిగా కేకలు వేసింది. విషయం తెలుసుకున్న స్కూల్ ప్రిన్సిపాల్ చిన్నారికి ప్రాథమిక చికిత్స చేశారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరో నాలుగు పాములు చిన్నారిని కాటేసిన పామును స్కూల్ సిబ్బంది చంపేయగా.. గురుకుల ఆవరణలో మరో నాలుగు పాములు ప్రత్యక్షమయ్యాయి. వీటిలో రెండు అక్కడి నుంచి వెళ్లిపోగా మిగతా రెండింటినీ గ్రామస్తులు చంపేశారు. ఇదిలా ఉండగా రెండ్రోజుల కిందట కూడా నిజామాబాద్ జిల్లాలో ఇలాంటి ఘటనే వెలుగుచూసింది. రెండు రోజుల క్రితం మరో విద్యార్థినిని పోతంగల్ మండలం జల్లాపల్లి ప్రభుత్వ పాఠశాలలో నందిని అనే విద్యార్థినిని పాటు కాటేసింది. కిటికీలో నుంచి పుస్తకం బయట పడటంతో తీసుకోవడానికి వెనకవైపు వెళ్లిన విద్యార్థినిని పాము కాటేసింది. ప్రస్తుతం ఇద్దరు విద్యార్థినిలు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. పాముల ఘటనలతో పాఠశాల, గురుకల పాఠశాల విద్యార్థులు భయంతో వణికిపోతున్నారు. స్కూల్ ఆవరణలో ఏ క్షణంలో ఎటువైపు నుంచి పాముల వచ్చి కాటేస్తాయోనని ఆందోళన చెందుతున్నారు. తల్లిదండ్రుల ఆందోళన విద్యార్థిని పాము కాటుకు గురికావటంపై చిన్నారుల తల్లిందండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. హుటాహుటిని ఆసుపత్రికి చేరుకున్నారు. అయితే చిన్నారికి ఎలాంటి ప్రాణపాయం లేదని డాక్టర్లు చెప్పడంతో వారు ఊపిరి పీల్చుకున్నారు.అయితే పాఠశాలలు, గురుకులాల ఆవరణలు పిచ్చి మొక్కలతో అపరిశుభ్రంగా ఉండటంతోనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని అభిప్రయడుతున్నారు.ప్రభుత్వం వెంటనే స్కావెంజర్లను నియమించాలని డిమాండ్ చేస్తున్నారు. చదవండి: తాటిచెట్టుపై విలవిల్లాడిన గీత కార్మికుడు.. ప్రాణాలకు తెగించి -
ఒక్కసారిగా రెచ్చిపోయిన పిచ్చికుక్కలు.. ఐదుగురికి తీవ్రగాయాలు
సాక్షి, కామారెడ్డి: మద్నూర్ మండల కేంద్రంలో పిచ్చికుక్కల దాడిలో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గ్రామంలోని పిచ్చికుక్కలు ఒక్కసారిగా రెచ్చిపోయి కనిపించిన వారిపై దాడికి పాల్పడ్డాయి. ఈ క్రమంలో ఆదివారం ఏకంగా ఐదుగురిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. దీంతో ఆ ప్రాంత ప్రజలు ఇంట్లోంచి బయటకు వెళ్లాలంటేనే భయపడుతున్నారు. కుక్కల దాడిలో గాయపడిన క్షతగాత్రుల్లో ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ప్రస్తుతం గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పంచాయతీ పరిధిలో కుక్కలు బెడద ఎక్కువైందని వాటిని నివారించాలని ఇదివరకే గ్రామస్థులు పలుమార్లు పంచాయతీ అధికారులకు వినతిపత్రం సమర్పించారు. అయినా అధికారుల నుంచి ఏ స్పందన రాలేదని పలువురు ఆరోపిస్తున్నారు. చదవండి: తెలంగాణకు ఎల్లో అలర్ట్.. ఐదు రోజుల పాటు భారీ వర్షాలు -
రైలుకు అడ్డంగా వెళ్లి హంగామా
కామారెడ్డి క్రైం: రైలుకు అడ్డంగా వెళ్లి ఓ వ్యక్తి హంగామా సృష్టించిన ఘటన కామారెడ్డి రైల్వే స్టేషన్లో శనివారం సాయంత్రం చోటు చేసుకుంది. మాచారెడ్డి మండలం చుక్కాపూర్ గ్రామానికి చెందిన పాపాన్నగారి రఘుపతి అనే వృద్ధుడు గ్రామంలో ఇంటి నిర్మాణం చేపడుతున్నాడు. శనివారం ఉదయం నిర్మాణం విషయంలో సమీప బంధువుల, కుటుంబ సభ్యులతో గొడవ జరిగింది. దీంతో మనస్తాపం చెందిన రఘుపతి కామారెడ్డికి వచ్చాడు. ఆత్మహత్య చేసుకుంటానని అప్పుడే వచ్చి నిలిపిన రైలు ముందుర తచ్చాడుతు కనిపించాడు. రైలు నడిపే లోకో పైలెట్, స్థానికులు ఎంతగా వారించిన వినలేదు. 15 నిమిషాల పాటు రైలుకు అడ్డంగా వెళ్తానని మొండి చేశాడు. దీంతో రైల్వే పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని కౌన్సెలింగ్ ఇచ్చారు. దీంతోs ఏర్పడింది. -
జాబ్ వచ్చిందన్న ఆనందం ఆవిరైంది.. గుండెపోటుతో బీటెక్ విద్యార్థి మృతి!
సాక్షి,కామారెడ్డి: ఇటీవల గుండెపోటు మరణాలు కలకలం రేపుతున్నాయి. వయసుతో సంబంధం లేకుండా టీనేజర్లు, యువకులు సైతం హార్ట్ ఎటాక్‌తో మృతి చెందుతున్నారు. ఆ క్షణం వరకు మనముందే బాగున్నప్పటికీ మరుక్షణం గుండెపోటుతో ప్రాణాలు విడుస్తున్నారు. తాజాగా మరో విద్యార్థి గుండెపోటుతో మృతి చెందాడు. ఈ విషాద ఘటన లింగంపేట మండలం సురాయిపల్లి జగదంబా తండాలో చోటు చేసుకుంది. ఎంతో కష్టపడి బీటెక్ చదువు పూర్తి చేసి.. ఇటీవల బెంగళూరులో ప్రశాంత్‌కు ఉద్యోగం సాధించింది. జీవితంలో ఉన్నత స్థానానికి వెళ్లాలన్న కలలు నిజం కాబోతన్నాయని ఎంతో ఆనంద పడ్డాడు. ఈ వార్త విన్న ప్రశాంత్ తల్లిదండ్రులు నిన్న ఇరుగుపొరుగువారికి స్వీట్లు కూడా పంచారు. జాబ్ వచ్చిందన్న ఆనందంతో రాత్రి పడుకున్న ప్రశాంత్ నిద్రలోనే గుండెపోటుతో మృతి చెందాడు. అకస్మాత్తుగా కొడుకు మృతితో ఆ తల్లదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. -
వడదెబ్బతో విద్యార్థిని మృతి
కామారెడ్డి టౌన్ : వడదెబ్బ సోకి చికిత్స పొందు తూ 15 ఏళ్ల విద్యార్థిని మృతి చెందిన ఘటన కా మారెడ్డి జిల్లా కేంద్ర ప్రభు త్వ ఆస్పత్రిలో చోటుచేసుకుంది. క్యాసంపల్లి తండాకు చెందిన ఇస్లావత్ నాజు–నీలా దంపతుల పెద్ద కూతురు లావణ్యకు వాంతులు, తీవ్ర జ్వరం రావడంతో మంగళవారం ఉదయం 11 గంటలకు జిల్లా కేంద్ర ఆస్పత్రికి తీసుకొచ్చారు. బుధవారం మధ్యాహ్నం లావణ్య ఆరోగ్యం విషమంగా ఉందని వైద్యులు రాజధానికి తీసుకెళ్లాలని చెప్పారు. ఆమెను జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే ఆమె మృతి చెందిందని అక్కడి వైద్యులు తెలిపారు. దీంతో బంధువులు మృతదేహాన్ని జిల్లా కేంద్ర ఆస్పత్రికి తీసుకొచ్చి ధర్నాకు దిగారు. సీ ఐ నరేష్ వారిని సముదాయించారు. ఆర్ఎంవో శ్రీ నివాస్ మాట్లాడుతూ వైద్యుల నిర్లక్ష్యం ఏమీ లేదన్నారు. లావణ్యకు మెదడులో రక్తం గడ్డ కట్టిందన్నారు. -
కన్న తల్లినే కాదని గెంటేశారు !
-
పెద్ద కొడుకంటే గిట్లుండాలే! తూ..! మీ బతుకు చెడ
దోమకొండ (కామారెడ్డి): ఆస్తి పంపకం విషయంలో తల్లిని బయటకు గెంటేసి ఇంటికి తాళం వేసిన ఘటన కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం సంఘమేశ్వర్‌లో మంగళవారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే... గ్రామానికి చెందిన బైకరి లచ్చవ్వకు కుమారులు పెద్ద నర్సయ్య, చిన్న నర్సయ్య ఉన్నారు. ఇద్దరు కొడుకులకు వేర్వేరు ఇళ్లు ఉండగా.. మరో పాత ఇంట్లో లచ్చవ్వ ఉంటోంది. తల్లి ఉంటున్న ఇల్లు విషయంలో అన్నదమ్ముల మధ్య విభేదాలు ఉన్నాయి. దీంతో పెద్ద కుమారుడు పెద్ద నర్సయ్య, అతడి భార్య రేణుక, వారి కుమారులు.. లచ్చవ్వ ఇంటికి వచ్చి దాడి చేశారు. ఆ సమయంలో అక్కడే ఉన్న చిన్న నర్సయ్యనూ కొట్టారు. తల్లి లచ్చవ్వను ఇంటి బయటకు గెంటేసి ఇంటికి తాళం వేశారు. చిన్న నర్సయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు దోమకొండ ఎస్సై సుధాకర్ తెలిపారు. తల్లిని ఇంట్లో నుంచి బయటకు గెంటేసి తాళం వేయడంపై గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తూ..! మీ బతుకు చెడ అంటూ తిట్టిపోశారు. (మలక్‌పేట్‌లో కలకలం.. మొండెం లేని మహిళ తల లభ్యం) -
ఆ ఊళ్లో అందరూ ‘లచ్చుమమ్మను చూసి నేర్చుకోవాలె’ అంటుంటారు
‘ఏ వయసులో అయినా సరే ఎవ్వరిపైనా ఆధారపడకూడదు’ అని టైలరింగ్ చేస్తూ తన రెక్కల కష్టం మీదే బతుకుతోంది 70 ఏళ్ల లచ్చుమమ్మ. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలంధర్మారావు పేట గ్రామంలో ఉండే లచ్చుమమ్మ ఐదు దశాబ్దాలుగా పాత కాలం నాటి రవికల నుంచి నేటి మోడ్రన్ డ్రెస్సుల వరకు తన కుట్టుపనితనంతో మెప్పిస్తోంది. ఆ ఊళ్లో అందరూ ‘లచ్చుమమ్మను చూసి నేర్చుకోవాలె’ అని అంటుంటారు. ఏడు పదుల వయసులో కూడా లచ్చుమమ్మ ఆధునిక డిజైన్లలో బ్లౌజులు, డ్రెస్సులు కుట్టడం చూసి కాలానికి తగినట్టు పని తనాన్ని మెరుగుపరుచుకుంటుంది అని కూడా అంటుంటారు. యాబై ఏళ్లుగా అలుపెరగకుండా బట్టలు కుడుతూ జీవనం సాగిస్తున్న లచ్చుమమ్మ అసలు పేరు గజవాడి లక్ష్మి. ధర్మారావుపేట గ్రామంలో అందరూ లచ్చుమమ్మ అని పిలుస్తారు. లచ్చుమమ్మకు 14వ ఏట ధర్మరావుపేటకు చెందిన బాలవీరయ్యతో వివాహం జరిగింది. వాళ్లకు ఐదుగురు కూతుళ్లు. ఉన్న ఊళ్లో ఉన్నంతలో చదివించారు. వాళ్లను పెంచి పెద్ద చేసి పెళ్లిళ్లు చేసి, అత్తవారిళ్లకు పంపించారు. వాళ్లకు పిల్లలు. లచ్చుమమ్మకు పన్నెండు మంది మనుమలు, మనుమరాళ్లు. వాళ్లు కూడా పెద్దోళ్లయ్యారు. నాటి విషయాల గురించి ప్రస్తావిస్తూ ‘ఐదుగురు ఆడపిల్లల్ని పెంచి, పెళ్లిళ్లు చేయడం అంటే సవాలే..’ అంటూ తమ కష్టాన్ని వివరిస్తుంది. లచ్చుమమ్మ భర్త బాలవీరయ్య చిన్న చిన్న వ్యాపారాలు చేసి కుటుంబాన్ని నెట్టుకొచ్చేవాడు. భర్త కష్టానికి చేదోడుగా ఉంటుందని యాబై ఏళ్ల కిందటే లచ్చుమమ్మ సొంతంగా బట్టలు కుట్టడం మొదలుపెట్టింది. అప్పుడు ఆ ఊళ్లోకి ఇంకా టైలరింగ్ మిషన్లు రాలేదు. దాంతో బట్టలు కత్తిరించి సూదీదారంతోనే కుట్టేది. గ్రామంలో నాటి తరం మహిళలు ధరించే రవికలను బాగా కుడుతుందనే పేరు లచ్చుమమ్మకి. ఆడపిల్లలకు గౌన్లు, లంగా, జాకెట్లు కుట్టడమూ సొంతంగానే నేర్చుకుంది. అందరి ఇళ్లల్లోనూ ఆమె కుట్టిన బట్టలు ఉంటాయి. ఆధునిక డిజైన్లు సైతం లచ్చుమమ్మ చేతికుట్టు బాగుంటుందని చాలా మంది ఆమె దగ్గరే కుట్టించుకునేవారు. నిన్న మొన్నటి వాళ్లే కాదు, ఈ తరం అమ్మాయిలు కూడా లచ్చుమమ్మ దగ్గరకు వచ్చి బ్లౌజులు కుట్టించుకుంటారు. మొదట్లో సాదా రవిక కుట్టడానికి 30 పైసలు, గుండీల రవిక కుట్టడానికి 50 పైసలు తీసుకునేదట. ఇప్పుడు సాధారణ బ్లౌజ్‌కు రూ. 65, లైనింగ్ బ్లౌజ్‌కు రూ.130 తీసుకుంటుంది. ‘అప్పట్లో రోజుకు పది నుంచి ఇరవై దాకా బ్లౌజులు, గౌన్లు కుట్టేదాన్ని. పండుగల సీజన్లో అయితే రాత్రి, పగలు తేడా ఉండేది కాదు. ఇప్పుడు కూడా రోజూ రెండు మూడు బ్లౌజులు కుడతా’ అని చెబుతోంది లచ్చుమమ్మ. పదేళ్ల క్రితం భర్త వీరయ్య చనిపోయాడు. ఇప్పుడు లచ్చుమమ్మ ఒక్కత్తే ఉంటుంది. తన పోషణార్థం కుట్టుపనినే నమ్ముకుంది. ఏళ్లుగా ఆమె దగ్గర రవికలు కుట్టించుకున్న నాటి తరం వాళ్లంతా ఇప్పటికీ లచ్చుమమ్మ దగ్గరికే వస్తుంటారు. వయసు మీద పడి, నెమ్మదిగా కుట్టినా చెప్పిన మాట ప్రకారం కుట్టి ఇస్తుందని నమ్మకం ఎక్కువ. ఏ సమయంలో ఆమె ఇంటికి వెళ్లినా.. కూర్చుని బట్టలు కత్తిరించడమో, లేదంటే మిషన్ మీద కుట్టడమో చేస్తూ కనిపిస్తుందని గ్రామస్తులు చెబుతున్నారు. యాబై ఏళ్లుగా కుడుతున్నా.. పద్నాలుగేళ్ల వయసులో పెళ్లయ్యి ఈ ఇంటికి వచ్చా. ఇద్దరు కూతుళ్లు పుట్టిన తరువాత కుటుంబ అవసరాల కోసం ఏదైనా పని చేయాలనుకున్నా. మా అమ్మ మాకు చిన్నప్పుడు చేతితోనే బట్టలు కుట్టేది. ఇంటి అవసరాలు పెరిగిన ప్పుడు నేను కూడా బట్టలు కుట్టాలని, చేతికుట్టుతో రవికలు కుట్టడం మొదలుపెట్టాను. ఒక్కొక్కరుగా రావడం మొదలై ఊళ్లో ఉన్న ఆడవాళ్లందరూ రవికలు కుట్టించుకునేవారు. ముప్పయి ఏళ్ల పాటు చేతికుట్టుతోనే కుట్టేదాన్ని. కుట్టు మిషన్లు వచ్చిన తరువాత ఓ మిషన్ తీసుకున్నా. కొన్ని రోజుల్లోనే మిషన్ కుట్టు నేర్చుకొని, సొంతంగానే కుట్టడం మొదలుపెట్టిన. పిల్లలు వద్దంటరు కానీ, చేతనైనన్ని రోజులు పనిచేసుకొని బతకాలి, ఎవరి మీదా ఆధారపడవద్దని ఈ పని వదలడం లేదు. – గజవాడ లక్ష్మి – ఎస్.వేణుగోపాల్ చారి, సాక్షి, కామారెడ్డి -
కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఎడతెరిపి లేకుండా గంటపాటు భారీ వర్షం
-
కామారెడ్డిలో ఫారెస్ట్ అధికారులను నిర్బంధించిన తండావాసులు
-
కామారెడ్డి: ఫారెస్ట్ ఆఫీసర్లను బంధించిన తండా వాసులు
సాక్షి, కామారెడ్డి: మాచారెడ్డి మండలం పాత ఎల్లంపేట పరిధిలోని అటవీ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంది. అటవీ అధికారుల్ని తండా వాసులు బంధించారు. అటవీ భూమిని చదును చేస్తుండగా అధికారులు అక్కడికి వెళ్లారు. తండావాసుల్ని అడ్డుకోగా.. వాళ్లు ఉల్టా అధికారుల్ని బంధించారు. పోలీసుల కథనం ప్రకారం.. అక్కాపూర్ -మైసమ్మ చెరువు దుర్గమ్మ గుడి తండా సమీపంలోని అటవీ భూమిని అక్కడి ప్రజలు చదును చేస్తున్నారు. ఆ సమయంలో అటవీ అధికారులు అక్కడికి వచ్చి అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఆగ్రహించిన తండా వాసులు.. అధికారుల్ని బంధించారు. ఈ ఘటనపై స్థానిక మాచారెడ్డి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు మాచారెడ్డి డిప్యూటీ రేంజ్ అధికారి రమేష్. దీంతో.. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇదీ చదవండి: నెహ్రూ ఓఆర్ఆర్ ప్రవేట్ చేతుల్లోకి.. -
సపర్యలు చేయలేక.. చీరతో ఉరేసి.. కన్నతల్లినే చంపిన కొడుకు
సాక్షి, కామారెడ్డి: నవమాసాలు మోసి కనిపెంచిన తల్లి.. వృద్ధాప్యంలో భారమనిపించింది. అనారోగ్యంతో బాధపడుతున్న తల్లికి సేవలు చేయలేక చీరతో ఉరేసి చంపి, ఖననం చేశాడో కొడుకు. మూడు రోజుల కిందట జరిగిన ఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ సీఐ రామన్ తెలిపిన వివరాల ప్రకారం.. సదాశివనగర్‌కు చెందిన ఇట్టవోయిన బాలవ్వ(80) కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతోంది. ఆమెకు సపర్యలు చేయడం భారంగా భావించిన కుమారుడు బాలయ్య.. ఈనెల 13న తల్లికి చీర కొంగుతో ఉరి బిగించి చంపాడు. అనంతరం రాత్రి వేళలో గ్రామ శివారుకు తీసుకెళ్లి ఖననం చేశాడు. ఈనెల 13నుంచి తల్లి బాలవ్వ కనిపించడం లేదని, ఆమె పడుకున్న గదికి గొళ్లెం పెట్టి ఉందని ఊళ్లోవాళ్లకు చెప్పాడు. బాలయ్య ప్రవర్తనపై అనుమానం వచి్చన ఎంపీటీసీ సభ్యుడు బీరయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలయ్యను అదుపులోకి తీసుకుని విచారించగా.. నేరాన్ని అంగీకరించాడని సీఐ రామన్ తెలిపారు. అనారోగ్యంతో నడవలేని స్థితిలో ఉన్న తల్లికి సేవలు చేయలేక చీరతో ఉరి బిగించి చంపానని, అదే రోజు రాత్రి మృతదేహాన్ని గ్రామ శివారుకు తీసుకువెళ్లి ఖననం చేశానని అంగీకరించాడని వెల్లడించారు. చదవండి: భార్య దోసె వేయలేదనే కోపంతో.. -
కామారెడ్డి జిల్లా కేంద్రంలో పోస్టుమెన్ నిర్వాకం..
-
ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ఇంటి ముట్టడికి NSUI యత్నం
-
13 నెలలకే నూరేళ్లు.. చూసుకోకుండా కారును వెనక్కి తీయడంతో..
సాక్షి, కామారెడ్డి క్రైం: చూసుకోకుండా కారును వెనక్కి తీయడంతో 13 నెలల బాలుడు మృతి చెందాడు. కామారెడ్డి మండలం ఇస్రోజీవాడిలో ఆదివారం ఈ ఘటన జరిగింది. సిద్దం స్వామి, శ్వేతలకు 13 నెలల బారు అయాన్షు ఉన్నాడు. స్వామి తనకున్న స్విఫ్ట్ డిజైర్ కారును కిరాయికి నడుపుకొంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇంటి దగ్గరే పార్క్ చేసి ఉంచిన కారును కిరాయి నిమిత్తం స్వామి అన్న సాయిలు బయటకు తీయబోయాడు. అకస్మాత్తుగా ఇంట్లో నుంచి కారు వద్దకు వచ్చిన అయాన్షు కారు వెనుక భాగంలో నిల్చున్నాడు. సాయిలు గమనించకుండా కారును వెనక్కి తీసుకోవడంతో బాలుని తలపై నుంచి టైరు వెళ్లింది. బాలుడు కేకలు వేయడంతో కుటుంబ సభ్యులు వెంటనే గమనించి.. అతడిని కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు. అప్పటికే బాలుడు మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేశారు. (చదవండి: పెంపుడు కుక్కతో తమాషా చేస్తూ..జనంపైకి ఉసిగొల్పిన ఓ సీఐ) -
యాక్సిస్ బ్యాంకు అధికారులకు టోకరా వేసిన కేటుగాడు
-
అమ్మ ప్రేమకు సజీవ సాక్ష్యం: నిలువెత్తు జ్ఞాపకం
బిడ్డల భవిష్యత్తు కోసం కలలు కంటూ వాళ్ల కోసం ఎన్నో త్యాగాలు చేస్తుంది అమ్మ. రెక్కలొచ్చి పిల్లలు ఎగిరెళ్లినా వారి జ్ఞాపకాలు మాత్రం ఆమె మెడ చుట్టూ చిట్టి చేతుల్లా అల్లుకుపోతూనే ఉంటాయి. తెలంగాణలోని కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం చిట్యాల గ్రామానికి చెందిన కంది నాగమణి పాతికేళ్ల క్రితం దేశసేవలో కానరాని దూరాలకు వెళ్లిన కొడుకును మళ్లీ కళ్లారా చూడాలనుకుంది. కొడుకు గొప్పతనాన్ని ఆ ఊరి ప్రజల ముందుకు తేవాలనుకుంది తనలాంటి కొడుకు వీధికొక్కరు పుట్టాలని నడివీధిలో విగ్రహాన్ని నిలబెట్టింది. కంది నాగమణి, శంకరయ్య దంపతులకు ఇద్దరు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు. వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగించేవారు. సాగునీటి వసతులు లేక వర్షాధారంపై ఆధారపడి సేద్యం చేస్తుండే వాళ్లు. నాగమణి ఇల్లు, వ్యవసాయపనులే కాదు బీడీలు చుట్టే పని కూడా చేస్తుండేది. పెద్ద కొడుకు సిద్దరాములు ఏడో తరగతి వరకు చిట్యాలలో చదువుకున్నాడు. ఎనిమిదో తరగతి నుంచి పదో తరగతి వరకు తాడ్వాయి మండల కేంద్రానికి వెళ్లి చదువుకున్నాడు. 1990 లో సీఆర్పీఎఫ్ జవానుగా సెలెక్టయ్యాడు. అప్పట్లో వాళ్ల గ్రామంలో నక్సల్స్ ప్రాబల్యం ఎక్కువగా ఉండేది. పోలీస్ డిపార్టుమెంటులో చేరుతానని ముందుకెళ్లాడు. వద్దని వారించినా వెనకడుగువేయలేదు. ఇంకో అడుగు ముందుకేసి దేశం కోసం సేవ చేస్తానంటూ వెళ్లాడు. అప్పటికే ఆయనకు భార్య, ముగ్గురు కొడుకులు ఉన్నారు. గుండెలో పేలిన బాంబు 1997 డిసెంబర్ 14న అస్సాంలోని కొక్రా జిల్లాలో బోడో తీవ్రవాదులు పేల్చిన మందుపాతరలో పది మంది వరకు జవాన్లు చనిపోయారు. అందులో సిద్దరాములు ఒకరు. ఇంటికి కబురందింది. తల్లి గుండె చెరువయ్యింది. సీఆర్పీఎఫ్ అధికారులు శవాన్ని తీసుకుని తాడ్వాయికి వచ్చారు. ఆ జ్ఞాపకాల్లోనే.. కొడుకు చనిపోయి పాతికేళ్లు దాటింది. అయినా, ఆ తల్లి మాత్రం కొడుకు జ్ఞాపకాల్లోనే కాలం గడుపుతోంది. చిన్నతనంలో చేసిన అల్లరి, పెద్దయ్యాక చూపిన గుండెధైర్యం ఆమెను రోజూ వెంటాడుతూనే ఉన్నాయి. ఆమె ఆలనా పాలనా చిన్న కొడుకు విఠల్ చూసుకుంటున్నాడు. బీపీ, షుగర్ సమస్యలకు మందులు వాడుతోంది. నిత్యం కొడుకు గురించిన జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ వచ్చింది. బీడీ కార్మికురాలిగా రిటైర్ అయ్యాక పీఎఫ్‌లో జమ అయిన డబ్బులపై నెలనెలా పెన్షన్ వస్తోంది. ఆ డబ్బులతో కొడుకు విగ్రహం ఏర్పాటు చేయాలని పూనుకుంది. విగ్రహం తయారీకి, ఏర్పాటుకు ఎంతోమందిని కలిసి, తన కల గురించి చెబుతుండేది. దాదాపు రూ.లక్షా 60 వేలు ఖర్చు చేసి సిద్దరాములు నిలువెత్తు విగ్రహాన్ని తయారు చేయించింది. జై జవాన్.. గ్రామంలో ప్రధాన కూడలి వద్ద ఏర్పాటు చేసిన విగ్రహాన్ని ఈ నెల 27న జిల్లా ఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరింపజేసింది నాగమణి. కొడుకు జ్ఞాపకాలతో విగ్రహం ఏర్పాటు చేసిన తల్లిని అందరూ అభినందించారు. నాగమణి మాత్రం నాడు తన కొడుకుతో పాటు మరో పది మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారని గుర్తుచేసుకుంది. దేశసేవలో జవాన్ల త్యాగం గురించి ఈ సందర్భంగా అందరూ గుర్తుచేసుకున్నారు. పిల్లలు సైతం జై జవాన్ అంటూ దేశసేవలో జవాన్ గొప్పతనాన్ని తెలుసుకుంటున్నారు. కండ్ల ముందే తిరుగుతున్నట్టుంది చిన్నప్పటి నుంచి నా కొడుకులు ఎంతో కష్టపడి చదువుకున్నరు. తాడ్వాయికి నడుచుకుంటూ వెళ్లేవాళ్లు. పెద్దోడు ఉద్యోగంలో చేరిన తరువాత మా కష్టాలు తీరినయి. ఆరేడేండ్లు ఉద్యోగం చేసిండో లేదో చనిపోయిండు. వాడు కనుమరుగై ఇరవై ఐదేండ్లవుతున్నా నా కండ్ల ముందర ఇంకా తిరుగున్నట్టే ఉంటది. యాది జేసుకోని రోజు ఉండది. ఊళ్లో అందరితో ఎంతో ప్రేమగా ఉండేటోడు. రోజూ వాని ఫోటో చూసుకుంటూ ఇన్నేళ్లు గడిపినా. నా కొడుకు లెక్కనే ఉండే విగ్రహం అందరికీ తెలిసేలా పెట్టించాలనుకున్నా. అది ఇన్నాళ్లకి తీరింది. సైనికుడైన నా కొడుకు నాకే కాదు మా ఊరికి కూడా గొప్ప పేరు తెచ్చిపెట్టిండు. – కంది నాగమణి, అమర జవాన్ సిద్దరాములు తల్లి – ఎస్.వేణుగోపాలచారి, సాక్షి, కామారెడ్డి -
ప్రధాని మోదీకి ఆస్కార్ ఇవ్వాలి.. మహానటుడు: కేటీఆర్ వ్యంగ్యస్త్రాలు
సాక్షి, కామారెడ్డి: బీఆర్ఎస్ పథకాలు దేశవ్యాప్తంగా ఆదర్శంగా నిలుస్తున్నాయని మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణలో జరిగిన అభివృద్ధి కర్ణాటక, మహారాష్ట్రలో కనిపిస్తుందా అని ప్రశ్నించారు. విద్యుత్, సాగునీరు ఇక్కడ పుష్కలంగా అందిస్తున్నామని తెలిపారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం జరిగిందే తెలంగాణ పోరాటమని గుర్తు చేశారు. అక్కడ( కర్ణాటక, మహారాష్ట్ర) రైతుబీమా, కల్యాణలక్ష్మి, మిషన్ భగీరథ వంటి పథకాలు అమలవుతున్నాయా..? అనే విషయాన్ని ప్రజలు ఆలోచించాలని సూచించారు. కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం పిట్లంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ బహిరంగ సభలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. గిరిజన తండాలను, గూడెలను గ్రామపంచాయతీలుగా చేశామని కేటీఆర్ గుర్తు చేశారు. తండాల్లో రోడ్లను అభివృద్ధి చేస్తాం. గిరిజనులకు సర్పంచ్‌లుగా అవకాశం కల్పించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. బిచ్కుంద, పిట్లంను మున్సిపాలిటీలుగా మారుస్తామని, మిగతా మున్సిపాలిటీల కంటే ఈ రెండింటిని అద్భుతంగా తీర్చిదిద్దుతాం అని ప్రకటించారు. చిత్తశుద్ధితో పని చేసేవారిలో హన్మంత్ షిండే ఒకరు హైదరాబాద్‌కు వచ్చినప్పుడల్లా.. ఈ నియోజకవర్గ అభివృద్ధి గురించే షిండే మాట్లాడుతారని మంత్రి కేటీఆర్ అన్నారు. జుక్కల్ నియోజకవర్గ ప్రజలు అదృష్టవంతులు. మంచి నాయకుడు దొరికినప్పుడు గట్టిగా 10 కాలాల పాటు కాపాడుకోవాలి. గత ఎన్నికల్లో 36 వేల ఓట్ల మెజార్టీతో గెలిచాను అని చెప్పిండు.. ఈ సారి నాగమడుగు ప్రాజెక్టు తెచ్చినందుకు 72 వేల ఓట్ల మెజార్టీతో గెలిపించే బాధ్యత మీపై ఉన్నది. ప్రజల పట్ల చిత్తశుద్ధితో పని చేసేవారు కొందరే ఉంటారు. అందులో ఒకరు హన్మంత్ షిండే. అలాంటి నాయకుడిని భారీ మెజార్టీతో గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని కేటీఆర్ పేర్కొన్నారు. ‘తెలంగాణకు అన్యాయం జరిగిందంటూ రేవంత్ రెడ్డి గొంతు చించుకుంటున్నాడు. 10 సార్లు అవకాశాలు ఇస్తే 50 ఏళ్ళు దేశాన్ని పాలించి కాంగ్రెసోళ్లు ఏం చేశారు..? పరిపాలించడం చేతగాని వారు ఇపుడు ఒక్క ఛాన్స్ ఇవ్వమని అడుగుతున్నారు. అబద్ధాలు చెప్పడంలో, నటనలో ప్రధాని మోదీకి ఆస్కార్ అవార్డు ఇవ్వాలి. మహానటుడు మోదీ. దేశ సంపద అంతా దోస్తు ఖాతాలో జమ చేస్తూ విపక్షాలను కొనుగోలు చేస్తున్నాడు. 2 కోట్ల ఉద్యోగాలు ఏమయ్యాయి. నల్లధం తెస్తానని ఇపుడు తెల్లముఖం వేశాడు. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి డిపాజిట్ గల్లంతు చేయాలి. తెలంగాణపై కేంద్రం కక్షగట్టింది. తెలంగాణకు పట్టిన శని బీజేపీ. మోడీ ఈడీలకు భయపడం. ప్రజాక్షేత్రంలో తూల్చుకుందాం. కేసీఆర్‌ను పాడుకుని. మూడోసారి సీఎం చేసుకుందాం’ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. చదవండి: ఈడీ థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తోంది.. కవిత సంచలన కామెంట్స్ -
దారుణం.. తండ్రిని చంపి ఇంటికి నిప్పంటించిన కూతుర్లు
సాక్షి, కామారెడ్డి: జిల్లాలోని రాజంపేట మండల కేంద్రంలో దారుణ ఘటన జరిగింది. కొప్పుల ఆంజనేయులు(75) అనే వ్యక్తిని కన్న కూతుర్లే దారుణంగా హత్య చేశారు. అనంతరం ఇంటికి నిప్పుపెట్టి తగలబెట్టారు. దీంతో ఆంజనేయులు సజీవ దహనమయ్యాడు. తమకు ఆస్తి ఇవ్వలేదనే కోపంతోనే ముగ్గురు కూతుర్లు కలిసి ఈ ఘాతుకానికి ఒడిగట్టారు. అతను ఇంట్లో నిద్రిస్తున్న సమయం చూసి హతమార్చారు. వీరికి ఆంజనేయులు మనవడు భాను ప్రకాశ్ సహకరించాడు. కూతుర్లు, మనవడు కలిసే హత్య చేశారని గ్రామస్థులు అనుమానిస్తున్నారు. గత పది రోజుల క్రితం ఆంజనేయులకు చెందిన ఎకరం భూమి అమ్మగా వచ్చిన రూ.10 లక్షలు ఇవ్వకపోవడంతోనే కుమార్తెలు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు ఆరోపిస్తున్నారు. రాజంపేట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. చదవండి: వీపున కత్తిపోటు..ప్రాణం పోసిన కర్నూలు పెద్దాస్పత్రి -
అధిష్టానం అవకాశమిస్తే కామారెడ్డి నుంచి పోటీ చేస్తా: అజారుద్దీన్
సాక్షి, కామారెడ్డి జిల్లా: అధిష్టానం అవకాశమిస్తే వచ్చే ఎన్నికల్లో కామారెడ్డి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తానంటూ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ క్రికెటర్ అజారుద్దీన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జిల్లాలోని లింగంపేట్‌లో అజారుద్దీన్ శుక్రవారం పర్యటించారు. ఆయన సమక్షంలో పలువురు వ్యక్తులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా అజారుద్దీన్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు కృషిచేస్తున్నామని తెలిపారు. అధిష్ఠానం అధిష్ఠానం ఆదేశిస్తే కామారెడ్డి నుంచి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. అయితే ఇప్పటికే కామారెడ్డి నుంచి బరిలో దిగేందుకు మాజీ మంత్రి షబ్బీర్ అలీ సిద్ధమయ్యారు. ఈ క్రమంలో అజార్ వ్యాఖ్యలతో మరోసారి జిల్లా కాంగ్రెస్ పార్టీలో కలకలం రేగింది. కాగా గతంలోనూ కామారెడ్డి నుంచి పోటీ చేసేందుకు సిద్ధమంటూ అజారుద్దీన్ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. -
అప్పట్లోనే అదరగొట్టారు.. ఆ గ్రామంలో ఇళ్లను చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే!
ఆ ఊరికి కొత్తగా వెళ్లినవారు, ఆ ఊరి మీదుగా ఇతర గ్రామాలకు వెళ్లేవారు అక్కడి ఇళ్లను చూసి ఆశ్చర్యపోతారు. కొద్దిసేపు అలాగే చూస్తుండిపోతారు. ప్రస్తుతం ఆధునిక ఇళ్లను నిర్మించుకుంటున్న కాలంలోనూ ఆ ఊళ్లో ఇప్పటికీ మిద్దె భవంతులే ఎక్కువగా ఉండడం గమనార్హం. వీటిని స్థానికంగా మిద్దె భవంతులని, మిద్దె ఇళ్లని, హవేలి బాలంగి అని, బంగళా అని పిలుస్తారు. దశాబ్దాల క్రితం నిర్మించిన ఆ ఇళ్లను యజమానులు అలాగే కాపాడుకుంటున్నారు. చిన్నచిన్న మరమ్మతులు చేయించుకుంటూ, ఆధునిక హంగులు సమకూర్చుకుంటూ ఆ ఇళ్లలోనే మూడు నాలుగు తరాలుగా నివసిస్తున్నారు. సాక్షి, కామారెడ్డి: కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలోని మారుమూల గ్రామమైన పేట్‌సంగంలో అడుగు పెట్టగానే రోడ్డుకు ఇరువైపులా మిద్దె భవంతులు (రెండంతస్తులు) కనిపిస్తాయి. ఈ గ్రామంలోని మొత్తం నివాస భవనాల్లో దాదాపు సగం మిద్దె ఇళ్లే. ఊళ్లో మూడు వందల పైచిలుకు కుటుంబాలు నివసిస్తుండగా.. ఆయా కుటుంబాల్లో చాలావరకు తమ తాతల కాలం నుంచి మిద్దె ఇళ్లల్లోనే ఉంటున్నాయి. కొన్ని కుటుంబాల్లోనైతే మూడు, నాలుగు తరాలవారు జీవిస్తున్నారు. కాగా వందల ఏళ్ల క్రితం నిర్మించిన భవనాలు కూడా ఇక్కడ ఉన్నాయి. గ్రామంలో పురాతన ‘శ్రీ సంగమేశ్వర దేవాలయం’ ఉంది. దీంతో గ్రామంలోనే కాకుండా చుట్టుపక్కల గ్రామాల్లో చాలామంది పేర్లు సంగయ్య, సంగవ్వ అని ఉంటాయి. డూప్లెక్స్ మాదిరి ఇళ్లు.. ఈ పాత కాలం నాటి మిద్దె ఇళ్లకు లోపలి నుంచే (డూప్లెక్స్ మాదిరి) మెట్లు ఉంటాయి. ఇంటి గోడలు నిర్మించిన తర్వాత పెద్దపెద్ద దూలాలు ఏర్పాటు చేసి వాటిపై చెక్కలను కప్పి స్లాబ్‌కన్నా బలంగా తయారు చేశారు. దానిపైన మళ్లీ గోడలు నిర్మించి గదులు నిర్మించుకున్నారు. చాలా ఇళ్లల్లో కర్ర లేదా మట్టితో కట్టిన మెట్లు ఉన్నాయి. పూర్వ కాలంలో రైతులు పంట ఉత్పత్తులను మిద్దె పైన నిల్వ చేసేవారు. నివాసం కూడా ఉండేవారు. పై నుంచి కిందకు చిన్న రంధ్రం ఉండేది. అందులోంచి వడ్లు, మక్కలు, ఇతర పంట ఉత్పత్తులను కిందికి జారవిడిచేవారు. పంట ఉత్పత్తులే కాకుండా, ఇతర వస్తువుల్ని కూడా మిద్దె మీద దాచుకునేవారు. తర్వాతి కాలంలో అంటే ఆరేడు దశాబ్దాల క్రితం నిర్మించిన ఇళ్లకు మాత్రం ముందు భాగం స్లాబ్ వేసి, బయటి నుంచి మెట్లు ఇచ్చారు. పేట్‌సంగంలో నిర్మించిన మిద్దె ఇళ్లు ఎక్కువగా తూర్పు ముఖంతో నిర్మించగా, కొన్ని ఉత్తర(గంగ) ముఖంతో నిర్మించారు. పడమర, దక్షిణ ముఖంతో ఒక్క ఇల్లూ కనిపించదు. చల్లగా వెచ్చగా.. మా నాన్న కట్టిన మిద్దె ఇంట్లోనే పుట్టి, పెరిగినం. మిద్దె ఇల్లు కావడం వల్ల వానాకాలం, చలి కాలంలో వెచ్చగా, ఎండాకాలంలో చల్లగా ఉంటుంది. ఎండలు ఎంత తీవ్రంగా ఉన్నా ఇబ్బంది ఉండదు. ఇళ్లకు మంచి రంగులు వేయించుకుని కొత్తదనం తీసుకువచ్చాం. – అన్నారం సంగాగౌడ్, పేట్సంగం తరతరాలుగా ఉంటున్నాం.. మా తాతలు, తండ్రులు, మేము అందరం మిద్దె ఇళ్లల్లోనే పెరిగాం. మా పిల్లలు కూడా ఈ ఇళ్లల్లోనే ఉంటున్నారు. ఊళ్లో చాలామందికి మిద్దె ఇళ్లు ఉన్నయి. – కూచి హన్మాండ్లు, పేట్సంగం చదవండి: ప్రియుడితో ఉండగా వాట్సాప్‌కి మెసేజ్.. కోపంగా ఇంటికి వెళ్లి -
వానరాల దాడిలో వృద్ధురాలి మృతి
రామారెడ్డి (ఎల్లారెడ్డి) : ఒక్కసారిగా కోతుల గుంపు దాడి చేయడంతో ఒక వృద్ధురాలు మృతి చెందింది. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల కేంద్రంలో శుక్రవారం మధ్యాహ్నం చాతరబోయిన నర్సవ్వ (70) ఇంట్లో అన్నం గిన్నెలను శుభ్రం చేస్తుండగా.. సుమారు 20 వరకు కోతులు దాడి చేశాయి. ఆ సమయంలో ఆమె ఇంట్లో ఎవరూ లేరు. చుట్టుపక్కల మహిళలు భయంతో కోతులను తరిమే ప్రయత్నం చేయక ఇళ్లలోకి వెళ్లి తలుపులు వేసుకున్నారు. నర్సవ్వ ఛాతీ, వీపు, నడుముపై కోతులు తీవ్రంగా కరిచాయి. పెళ్లికని కామారెడ్డికి ఆమె కూతురు సుగుణ 20 నిమిషాల తర్వాత వచ్చి.. తల్లిని కామారెడ్డిలోని ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లింది. అక్కడ చికిత్స పొందుతూ నర్సవ్వ శనివారం మధ్యాహ్నం 3 గంటలకు మృతి చెందింది. మృతురాలికి ముగ్గురు కూతుళ్లుండగా, ఇద్దరి వివాహం జరిగింది. ప్రస్తుతం చిన్న కూతురితో కలిసి ఉంటోంది. నర్సవ్య అంత్యక్రియలను చిన్న కుమార్తె పూర్తి చేసింది. -
నిజామాబాద్ జిల్లా : శ్రీవారికి స్వర్ణకిరీటం సమర్పించిన సీఎం కేసీఆర్ (ఫోటోలు)
-
బాన్సువాడ అభివృద్ధికి రూ.50 కోట్ల నిధులు: సీఎం కేసీఆర్
సాక్షి, కామారెడ్డి: తిమ్మాపూర్ వెంకటేశ్వరస్వామి ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు. ఆలయ అభివృద్ధి కోసం రూ. 7కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. కామారెడ్డి జిల్లా తిమ్మాపూర్‌లో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. బాన్సువాడ అభివృద్ధికి రూ.50 కోట్ల నిధులు ఇస్తున్నామని తెలిపారు. బాన్సువాడ ఇంకా అభివృద్ధి చెందాల్సి ఉందన్నారు. ఈ నిధులు దుర్వినియోగం చెందకుండా పనులు చేయించుకోవాలని సూచించారు. ‘సమైఖ్య రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు ఇబ్బందులు పడ్డారు. సాగునీటి కోస రైతులు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదు. అందుకే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడాం’ అని అనాటి పరిస్థితులను గుర్తు చేసుకున్నారు. అంతకుముందు బీర్కూర్ మండలం తిమ్మాపూర్‌లోని శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వరస్వామి కళ్యాణోత్సవంలో సీఎం కేసీఆర్ దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో వారికి స్వాగతం పలికారు. ఆలయంలో సీఎం కేసీఆర్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ మేరకు సీఎం సతీమణి శోభ.. దాతల సహకారంతో స్వామివారి కోసం తయారు చేయించిన 2 కిలోల బంగారు కిరీటాన్ని సీఎం కేసీఆర్ చేతుల మీదుగా స్వామివారికి సమర్పించారు. అనంతరం సీఎం దంపతులను వేదపండితులు ఆశీర్వదించారు. -
తలకొరివి పెట్టిన భార్య
కామారెడ్డి టౌన్: అనారోగ్యంతో కన్నుమూసిన భర్తకు అతని భార్య తలకొరివి పెట్టింది. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని దేవునిపల్లికి చెందిన నాగల్ల రమేశ్ పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో కాంపౌండర్‌గా పని చేస్తున్నాడు. ఈనెల 20న గుండెపోటు రావడంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. శస్త్రచికిత్స కోసం రూ.8 లక్షలు అవసరమని వైద్యులు చెప్పారు. పేద కుటుంబానికి చెందిన రమేశ్ దుస్థితిపై ‘సాక్షి’ప్రచురించిన కథనానికి పలువురు స్పందించి ఆర్థిక సాయం అందించారు. కానీ అప్పటికే శస్త్రచికిత్స ఆలస్యం కావడంతో రమేశ్ శనివారం మరణించాడు. సంతానం ఇద్దరూ కూతుళ్లే కావడంతో భార్య శ్యామలే ఆదివారం దేవునిపల్లిలో భర్త చితికి నిప్పు పెట్టి అంత్యక్రియలు పూర్తి చేసింది. -
దిల్ రాజు నుంచి నితిన్, శ్రీముఖి, చమ్మక్ చంద్ర వరకు.. అంతా ఇక్కడి వారే!
చలనచిత్ర రంగంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన పలువురు తమదైన ముద్ర వేశారు. నటులుగా, హాస్య నటులుగా, గాయకులుగా, దర్శక నిర్మాతలుగా గుర్తింపు పొందారు. నిర్మాతలుగా డి.ప్రభాకర్, దిల్ రాజు, నటులు, హాస్యనటులుగా నితిన్, అదితి, శ్రీముఖి, వెన్నెల కిషోర్, చమ్మక్‌చంద్ర.. ఇలా ఎందరో తెలుగు సినీ జగత్తులో సత్తా చాటి జిల్లాకు పేరు తెచ్చారు. సినిమాలలో సత్తా చాటుతున్న ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన పలువురు ప్రముఖులపై సండే స్పెషల్.. యాంకర్ నుంచి యాక్టర్ దాకా.. నిజామాబాద్ నగరానికి చెందిన శ్రీముఖి యాంకర్‌గా గుర్తింపు పొందారు. సినిమా, టీవీ ప్రోగ్రాములకు యాంకర్‌గా పనిచేస్తూ ఉన్నత స్థాయికి ఎదిగిన ఆమె.. సినిమాల్లోనూ రాణిస్తున్నారు. ఆమె కు టుంబ సభ్యులు నిజామాబాద్‌లో ఉండడంతో అప్పుడప్పుడు నిజామాబాద్ వచ్చి వెళ్తుంటుంది. దిల్ రాజు.. నిజామాబాద్ నగరానికి సమీపంలోని నర్సింగ్‌పల్లికి చెందిన దిల్ రాజు.. నిర్మాతగా, డిస్టిబ్యూటర్‌గా సినీ ఇండస్ట్రీని శాసిస్తున్నారు. ఆయన ప్రముఖ నటీనటులందరితో ఎన్నో సినిమాలు తీశారు. ఆయన సొంతూరులో ఇందూరు తిరుమల పేరుతో భారీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించారు. నిర్మాతగా ఎందరినో సినిమా రంగంలోకి తీసుకువచ్చారు. నవ్వుల రారాజు వెన్నెల కిషోర్ కామారెడ్డికి చెందిన కిషోర్ సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా అమెరికాలో పనిచేశారు. అప్పట్లో వెన్నెల సినిమాలో నటించే అవకాశం రావడంతో ఆయన సినీరంగం వైపు మళ్లారు. వెన్నెల సినిమాలో నటించడంతో ఆయన పేరు వెన్నెల కిషోర్‌గా మారిపోయింది. హాస్యనటుడిగా కిషోర్ ఎంతో పేరు సంపాదించారు. ప్రస్తుతం దాదాపు అన్ని సినిమాల్లోనూ కిషోర్ పాత్ర ఉంటుండడం విశేషం. ఉత్తమ హాస్యనటుడిగా ఆయన నంది పురస్కారం కూడా అందుకున్నారు. అప్పుడప్పుడూ కామారెడ్డికి వచ్చి తన కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులని కలిసి వెళ్తుంటారు. నటీమణిగా ఎదుగుతున్న అదితి.. కామారెడ్డి పట్టణానికి చెందిన అదితి మ్యాకాల్.. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. ఆమె తండ్రి రాంచంద్రం హైదరాబాద్‌లో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్నారు. ఆమె అర్జున్‌రెడ్డి, జంటిల్మెన్, అమీతుమీ, షాదీ ముబారక్వంటి సినిమాల్లో నటించింది. అలాగే పాష్ పోరీస్, మాయాబజార్ వంటి వెబ్‌సిరీస్‌లలోనూ నటిస్తోంది. నటనతో పాటు కూచిపూడి నృత్యంలోనూ ఆమె రాణిస్తోంది. టాప్ హీరోగా గుర్తింపు పొందిన నితిన్.. నిజామాబాద్‌కు చెందిన సినీ హీరో నితిన్ తొలి సినిమా ‘జయం’తోనే ప్రేక్షకులను మెప్పించారు. తన నటనతో ఇండస్ట్రీలో టాప్ స్టార్లలో ఒకరిగా ఎదిగారు. నితిన్ తండ్రి సుధాకర్‌రెడ్డి ప్రొడ్యూసర్‌గా కొనసాగుతున్నారు. అలాగే ప్రముఖ నిర్మాత దిల్‌రాజుకు నితిన్ దగ్గరి బంధువు. నితిన్ బందువులు చాలా మంది నిజామాబాద్‌లోనే ఉన్నారు. హాస్యం పండించే చమ్మక్ చంద్ర గాంధారి మండలం వెంకటాపూర్‌కు చెందిన గిరిజన బిడ్డ చమ్మక్ చంద్ర.. తన నటనతో హాస్యం పండిస్తూ అందరినీ మెప్పిస్తున్నారు. టీవీ చానళ్లలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొని గుర్తింపు పొందారు. సినిమాల్లోనూ హాస్య నటుడిగా రాణిస్తున్నారు. ఆయన తరచూ సొంతూరుకు వచ్చి వెళ్తుంటారు. వచ్చినప్పుడల్లా అందరినీ కడుపుబ్బా నవ్విస్తుంటారు. సినీ గాయకుడిగా విష్ణుకిషోర్ ఆర్మూర్ మండలం కోమన్‌పల్లికి చెందిన విష్ణుకిషోర్ జానపద గాయకుడిగా తన ప్రస్థానం మొదలుపెట్టి సినీ గాయకుడిగా, సంగీత దర్శకుడిగా ఎదిగారు. సినిమాల్లోనూ నటిస్తున్నారు. తెలంగాణ ఉద్యమ కాలంలో ఉద్యమ గీతాలు పాడిన విష్ణుకిషోర్.. ఉమ్మడి జిల్లాలో అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వీకేఆర్ స్టూడియోను స్థాపించారు. మ్యూజిక్ డైరెక్టర్‌గానూ రాణిస్తున్నారు. భగవాన్ సినిమా నిర్మాత ప్రభాకర్ కామారెడ్డి పట్టణానికి చెందిన నిర్మాత దివంగత డి.ప్రభాకర్ ప్రియా ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రెబల్ స్టార్ కృష్ణంరాజు హీరోగా భగవాన్ సినిమాను నిర్మించారు. అప్పట్లో అది సూపర్‌హిట్ అయ్యింది. ఆ తర్వాత ఆయన నాయకురాలు, ప్లీజ్ నాకు పెళ్లయ్యింది వంటి సినిమాలకు ప్రొడ్యూసర్‌గా పనిచేశారు. అలాగే డి్రస్టిబ్యూటర్గానూ పనిచేశారు. కామారెడ్డిలో ఆయన స్థాపించిన ప్రియా థియేటర్లు రెండు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. కామారెడ్డి మున్సిపల్ కాకముందు ఆయన సర్పంచ్‌గానూ సేవలందించారు. నిర్మాతగా రజిత్‌రావ్ అడుగులు.. ఆర్మూర్‌కు చెందిన వ్యాపారవేత్త బల్గూరి రజిత్‌రావ్ సినీరంగంలో అడుగుపెట్టారు. ఇటీవల ‘అన్‌స్టాపబుల్’ చిత్రాన్ని నిర్మించారు. చిన్ననాటి నుంచి సినిమాల మీద ఉన్న మోజుతో ఆయన సినీ నిర్మాణ రంగంలో అడుగుపెట్టి గుర్తింపు పొందారు. సినీ, రాజకీయ రంగ పెద్దలతో సన్నిహిత సంబంధాలున్న రజిత్‌రావ్.. నిర్మాతగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. గేయ రచయితగా రుద్రంగి రమేశ్ మద్నూర్ మండల కేంద్రానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు రుద్రంగి రమేశ్ అనేక సినిమాలకు పాటలు రాశారు. మాస్ పవర్, పోలీస్ పవర్, పోరాటం, మిస్టర్ ఐటం, సినిమా సినిమా, ప్రేమిస్తే చంపేస్తారా, నైజాం సర్కరోడా, రుద్రనాగు, హృదయం, దిల్లున్నోడు, నువ్వంటే ఇష్టం వంటి సినిమాలకు పాటలు రాశారు. అలాగే భక్తి గీతాలు కూడా ఎన్నో రచించారు. -
దండెత్తిన డ్వాక్రా మహిళలు
కామారెడ్డి టౌన్ : స్త్రీ నిధి, అభయహస్తం, వడ్డీలేని రుణాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ డ్వాక్రా మహిళా సంఘాలకు చెందిన 7 వేల మంది మహిళా సభ్యులు శుక్రవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. గాంధీ గంజ్ నుంచి ర్యాలీ ప్రారంభమై సిరిసిల్ల రోడ్, స్టేషన్‌రోడ్, రైల్వే బ్రిడ్జి మీదుగా నిజాంసాగర్ చౌరస్తాకు చేరుకుని రాస్తారోకో నిర్వహించారు. కార్యక్రమంలో బీజేపీ కామారెడ్డి అసెంబ్లీ ఇన్చార్జి కాటిపల్లి వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా మహిళా సంఘాలకు రావలసిన రూ.6 వేల కోట్ల బకాయిలను ప్రభుత్వం త్వరలోనే చెల్లించాలన్నారు. రెండ్రోజుల్లో బకాయిలు చెల్లించకుంటే ఈనెల 6 నుంచి మూడు రోజుల పాటు నిరాహారదీక్షకు దిగుతామని స్పష్టం చేశారు. అప్పటికీ స్పందించకుంటే 10 నుంచి ఆమరణ నిరాహార దీక్షకు దిగుతామని హెచ్చరించారు. -
కన్నపేగు కన్నీరు!
కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం పెద్దమల్లారెడ్డి గ్రామానికి చెందిన 75 ఏళ్ల వృద్ధురాలు ఆమె. ఆమె కొడుకు, ఇద్దరు కూతుళ్లకు పెళ్లిళ్లు అయ్యాయి. కొడుకు, కోడలు ఆమెను ఊళ్లోనే వదిలేసి కామారెడ్డికి వలస వెళ్లారు. తర్వాత కొడుకు బతుకుదెరువు కోసం గల్ఫ్ వెళ్లాడు. ఆమె వృద్ధాప్యం, అనారోగ్య సమస్యలతో వంట కూడా చేసుకోలేక ఆకలితో అలమటించింది. కోడలికి సమాచారం ఇచ్చినా రాకపోవడంతో గ్రామస్తుల సాయంతో పోలీసులను ఆశ్రయించింది. వారు కోడలిని పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చినా ఫలితం లేదు. వృద్ధురాలు ఇరుగుపొరుగు వారు నాలుగు మెతుకులు పెడితే తిని కాలం వెళ్లదీసేది. ఆవేదనతో ఓ రోజు ఉరివేసుకుంది. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం బండరామేశ్వర్పల్లికి చెందిన ఓ వృద్ధుడు తన కొడుకు పట్టించుకోవడం లేదంటూ ఇటీవల పోలీసులను ఆశ్రయించాడు. ఆయన కష్టపడి ఎనిమిది ఎకరాల భూమి సంపాదించి పెట్టాడు. కుమార్తెలకు పెళ్లిళ్లు అయిపోయాయి. భార్య చనిపోయింది. తాను కష్టపడి సంపాదించిన భూమిని సాగు చేసుకుంటున్న కొడుకు తనకు తిండి కూడా పెట్టక పోవడంతో తల్లడిల్లిపోయాడు. పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారు కొడుకును పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు. అయినా మార్పు రాలేదని ఆ వృద్ధుడు ఆవేదన చెందుతున్నాడు. సాక్షి, కామారెడ్డి: వారు వయసు మీద పడిన వృద్ధులు.. పిల్లాజెల్లా అంతా ఉన్నా పట్టించుకునేవారు లేక బాధపడుతున్నవారు.. నడిచే శక్తి, పలికే ఓపిక లేక ఇబ్బందిపడుతున్నవారు.. పిడికెడు మెతుకులు పెట్టి, కాసింత చోటు ఇస్తే.. బిడ్డల నీడలో కన్నుమూస్తామని ఆరాటపడుతున్నారు. ఇలాంటి వృద్ధ దంపతుల్లో ఇద్దరు ఉన్నంత కాలం ఎలాగోలా బతికేస్తున్నా.. ఎవరైనా ఒకరు దూరమైన తర్వాత ఒంటరి జీవితం నరకప్రాయంగా మారుతోంది. తోడు కోల్పోయి, బిడ్డల ఆదరణ కరువై మానసికంగా కుంగిపోతున్నారు. వయసు పెరిగే కొద్దీ వచ్చే ఆరోగ్య సమస్యలతో సతమతం అవుతూ.. సరైన వైద్యం అందక కన్నుమూస్తున్నారు. మరికొందరు ఈ జీవితం మాకొద్దంటూ ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇటీవలికాలంలో చాలా చోట్ల వృద్ధుల బలవన్మరణాలు వెలుగు చూస్తున్నాయి. ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నమై.. ఒకప్పుడు గ్రామీణ ప్రాంతాలతోపాటు పట్టణాల్లోనూ చాలా వరకు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. కొన్ని కుటుంబాల్లో తండ్రులే కాదు తాతలు కూడా కలిసి జీవించారు. ఆ పెద్దల మాట మేరకు ఎవరి పనివారు చేసుకుంటూ ఉండేవారు. కొన్నేళ్లుగా ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నమైపోయాయి. చాలా కుటుంబాల్లో కన్నవారిని కూడా భారంగా భావించే పరిస్థితి నెలకొంది. ఉద్యోగం, వ్యాపారం పేరుతో పట్టణాలకు వెళ్తున్నవారు కన్నవారిని ఇంటి దగ్గరే వదిలేస్తున్నారు. ఊర్లలోనూ విడిగా ఉంటున్నారు. దీనితో వృద్ధులు ఒంటరిగా మిగిలిపోతున్నారు. ఆశ్రమాల్లో వదిలేస్తున్నారు ఆర్థికంగా కాస్త వెసులుబాటు ఉన్న కుటుంబాల్లో కొందరు కన్నవారిని ఆశ్రమాల్లో వదిలేస్తున్నారు. తాము ఉద్యోగాలు, వ్యాపారాల్లో బిజీగా ఉండి ఆలనా పాలనా చూడటం ఇబ్బందని చెప్పుకొంటూ డబ్బులు కట్టి ఆశ్రమాల్లో చేర్పిస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో ఇలాంటివి ఎక్కువగా ఉంటున్నాయి. ఆశ్రమాల్లో ఉన్న అలాంటి వృద్ధులను కదిలిస్తే చాలు కన్నీటి పర్యంతమవుతున్నారు. అయినా తమ పిల్లలకు చెడ్డ పేరు రావొద్దని బాధను దిగమింగుకుంటున్నారు. కొందరిని బతికిస్తున్న ‘ఆసరా’ ప్రభుత్వం అందిస్తున్న పింఛన్లు ఎంతో మంది వృద్ధుల బతుకులకు ‘ఆసరా’గా నిలుస్తున్నాయి. రాష్ట్ర జనాభాలో 41 లక్షల మంది వృద్ధులు ఉండగా.. 15,94,650 మందికి వృద్ధాప్య పింఛన్ అందుతోంది. మందులు, నిత్యావసరాలకు కొంత వరకు పింఛన్ సొమ్ము ఉపయోగపడుతోంది. ఇదే సమయంలో కన్నవారి పింఛన్ డబ్బుల కోసం పిల్లలు వేధిస్తున్న ఘటనలూ ఉన్నాయి. ఆత్మహత్యల్లో 14% వృద్ధులవే.. తెలంగాణలో జరుగుతున్న ఆత్మహత్యల ఘటనల్లో 14 శాతం వృద్ధులవే ఉంటున్నాయని ఎన్సీఆర్బీ నివేదిక పేర్కొంటోంది. కన్నబిడ్డల ఆదరణ లేకపోవడం, ఒంటరితనం, అనారోగ్య సమస్యలతో వృద్ధులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఏడాదిలో తెలంగాణలో 8 వేల పైచిలుకు ఆత్మహత్యలు జరిగితే.. అందులో 12 వందల మంది వరకు వృద్ధులు ఉంటున్నారు. రాష్ట్ర జనాభాలో వృద్ధులు 11 శాతం తెలంగాణ జనాభాలో వృద్ధులు పదకొండు శాతం ఉన్నారు. 2021 అంచనాల ప్రకారం రాష్ట్ర జనాభా 3.77 కోట్లుకాగా.. ఇందులో వృద్ధుల సంఖ్య 41 లక్షలు దాటింది. ఇందులో 60–64 ఏళ్ల మధ్య వయసు వారు 12.77 లక్షల మంది.. 65–69 ఏళ్లవారు 10.18 లక్షలు, 70–74 ఏళ్లవారు 8.33 లక్షలు, 75–79 ఏళ్లవారు 5.62 లక్షలు, 80ఏళ్లు పైబడినవారు 4.70 లక్షల మంది ఉన్నట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ప్రభుత్వం కేర్ సెంటర్లు ఏర్పాటు చేయాలి చాలా కుటుంబాల్లో పేదరికం ఇబ్బందులు సృష్టిస్తోంది. తాను, భార్యాపిల్లలు బతకడమే కష్టమని, ముసలివాళ్లను ఎలా పోషించాలంటూ కొందరు తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తున్నారు. ఆర్థికంగా ఉన్న కుటుంబాల్లో మరో రకమైన సమస్య ఉంటోంది. తమకు ముసలివాళ్లు అడ్డుగా ఉంటున్నారంటూ ఆశ్రమాలకు పంపడమో, వేరుగా ఉంచడమో చేస్తున్నారు. ఒంటరితనం, సరైన ఆహారం దొరకకపోవడం, పిల్లలు పట్టించుకోకపోవడంతో వృద్ధులు మానసికంగా కుంగిపోతున్నారు. ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. కొన్ని కుటుంబాల్లో చాదస్తం ఎక్కువైందంటూ వృద్ధులను ఇబ్బంది పెడుతుంటారు. నెలలు, ఏళ్ల తరబడి ఒకేచోట ఉండటంతో చాదస్తం వస్తుంది. అందుకే పెద్దలకు నలుగురితో కలిసి ముచ్చటించుకునే అవకాశం కల్పించాలి. మన దగ్గర ప్రభుత్వమే కేర్ సెంటర్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. – డాక్టర్ సి.వీరేందర్, సైకాలజిస్ట్, హైదరాబాద్ -
ప్రకృతితోనే మమేకం.. ఆయుఃప్రమాణం 90 ఏళ్లకు పైనే.. ఈ తండా వెరీ స్పెషల్!
సాక్షి, రామారెడ్డి (ఎల్లారెడ్డి): పరిపూర్ణ ఆరోగ్యం, శారీరక, మానసిక ఆధ్యాత్మిక అనుసంధానమే ప్రకృతి జీవనం. ప్రకృతి జీవనం అంటే చెట్లు, పుట్టలు కొండలు, పక్షులతో సహజీవనంలో ఉండటమే. ప్రకృతిలో భాగమైన మనిషి పాశ్చాత్య నాగరికతకు అలవాటుపడి మానసిక, శారీరక ఆరోగ్యానికి దూరమై కాలుష్య ప్రపంచంలో భారంగా జీవితాన్ని సాగిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఓ తండా ఆధునిక మానవుడికి తిరిగి ప్రకృతిని పరిచయం చేసి.. ప్రకృతి–మనిషి సంబంధాన్ని బలోపేతం చేసి భవిష్యత్తులో మానవ మనుగడకు పొంచి ఉన్న ముప్పును తప్పించాల్సిన అవసరాన్ని గుర్తు చేసింది. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలంలోని రాజమ్మ తండాపై ప్రత్యేక కథనం. తండావాసులకు వరం సహజసిద్ధ వాతావరణంలో జీవించడం వల్ల వారికి రోగ నిరోధిక శక్తి బాగా ఇనుమడిస్తుంది. తెల్ల రక్త కణాల సంఖ్య పెరిగి ఇన్ఫెక్షన్లు, జబ్బులను ఎదుర్కొనే సామర్థ్యం పెరుగుతుంది. తాజా గాలిని పీల్చుకోవడం వల్ల మెదడు కొత్త ఉత్సాహంతో పనిచేస్తుంది. ఇదే రాజమ్మ తండా వాసులకు వరంగా మారింది. పచ్చని ప్రకృతి మధ్య జీవించే వీరి జీవనోపాధి వ్యవసాయం. వీరి ఆయుఃప్రమాణం 90 ఏళ్లకు పైనే ఉంది. ఈ తండాలో గత 30 ఏళ్లలో ఏడుగురు మృతిచెందగా, వారిలో మధ్య వయస్కులు ఇద్దరు మాత్రమే అనా రోగ్యంతో మరణించారు. మిగిలిన ఐదుగురిలో ఇద్దరు వంద ఏళ్లు పూర్తిచేసుకోగా, ముగ్గురు 90 ఏళ్లలో మరణించారు. ఇప్పటికీ 90 ఏళ్లపైబడి ఉన్న వారు వ్యవసాయం చేస్తూ పూర్తి ఆరోగ్యంతో ఉన్నారు. అల్లం–ఎల్లి కారంతో కలిపి.. వీరు వంటలు మొత్తం కట్టెల పొయ్యిపైనే చేస్తారు. వీరి ప్రధాన ఆహారం మక్క రొట్టెలు. అల్లం–ఎల్లి కారంతో వీటిని తింటారు. ఏ ఇంట్లో కూడా రొట్టె లేకుండా ఒక్కపూట కూడా గడవదని తండా వాసులు చెబుతారు. ఇళ్ల పక్కనే ఉన్న తమ పొలాల్లో పండించిన తాజా కూరగాయలను వాడతారు. ఒక్కో కుటుంబానికి సగటున నాలుగెకరాల పొలం ఉంటుంది. ఎల్రక్టానిక్ వస్తువులకు దూరం తండాలోని ఇళ్లలో టీవీ, ఫోన్ తప్ప ఏ ఇతర ఎలక్ట్రిక్ వస్తువు ఉండదు. తండాలో ఏ ఇంట్లో కూడా ఫ్రిజ్, వాషింగ్ మెషీన్, ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్, కూలర్ లాంటివేవీ ఉండవు. మినరల్ వాటర్‌కు దూరం ఆధునిక కాలంలో పల్లె, పట్నం తేడా లేకుండా అన్ని ఇళ్లలో తాగడానికి మినరల్ వాటర్ వాడుతున్నారు. కానీ, రాజమ్మ తండావాసులు మాత్రం బోరు నీళ్లనే తాగుతారు. తండాకు సమీపంలోనే వాటర్ ప్లాంట్ ఉన్నప్పటికీ మినరల్ వాటర్ తాగడానికి ఇష్టపడరు. కరోనా దరిచేరలేదు ప్రపంచాన్నే వణికించిన కరోనా వైరస్ రాజమ్మ తండా దరి చేరలేదు. వివిధ ఉద్యోగాల్లో స్థిరపడిన తండా వాసులు కరోనా వేళ తండాకు వచ్చి సేఫ్ జోన్లోకి వెళ్లారు. కరోనా రెండు దశల్లో కూడా ఏ ఒక్కరూ వైరస్ బారిన పడలేదు. చుట్టూ మంచి వాతావరణం నా వయసు 80 ఏళ్లు. రోజూ వ్యవసాయ పనులు చేస్తా. ఎలాంటి రోగాలు లేవు. మక్క రొట్టెలను పొద్దు, మాపు తింటా. ఇంటి చుట్టూ మంచి వాతావరణం ఉంటుంది. మా చుట్టూ ఉన్న వాతావరణమే మాకు రక్షణ. –శివరాం, రాజమ్మ తండా ఎలాంటి రోగం లేదు అప్పటికప్పుడు కట్టెల పొయ్యి మీద చేసిన మక్క రొట్టెలను తింటా. 76 ఏళ్ల వయసులో ఉన్నా. చలి కాలం దగ్గు, జర్వం తప్ప ఎలాంటి రోగం ఇప్పటివరకైతే రాలేదు. –మాలిబాయి, రాజమ్మతండా బోరు నీళ్లు తాగుతాం.. మాకు మినరల్ వాట ర్ అంటే తెలియదు. బోరు నీళ్లు తాగుతాం. అడవి నుంచి ఎండిపోయిన కట్టెలను తెచ్చుకుని కట్టెల పొయ్యి మీద వంట చేసుకుంటాం. నాకు 80 ఏళ్లు. ఎలాంటి రోగాలు లేవు. ఎప్పుడైనా జ్వరం వస్తే నీళ్లు గరం చేసి తాగుతా. జ్వరం పోతుంది. –గంగవాత్ సోరాత్, రాజమ్మతండా. -
వచ్చే నెల 13లోపు నిర్ణయం చెప్పండి
సాక్షి, హైదరాబాద్: కామారెడ్డి మాస్టర్ ప్లాన్ కొనసాగుతుందా? రద్దయిందా? ఫిబ్రవరి 13వ తేదీలోగా నిర్ణయం తెలపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. రైతులను సంప్రదించకుండానే కామారెడ్డి మాస్టర్ ప్లాన్ రూపొందించారని, ఇది చట్టవిరుద్ధ మని పేర్కొంటూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. మాస్టర్‌ప్లాన్‌ను రద్దు చేసేలా ఆదేశాలివ్వాలని కోరారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ తుకారాంజీ ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. కేఏ పాల్ పార్టీ ఇన్ పర్సన్‌గా హాజరై వాదనలు వినిపించారు. మాస్టర్‌ప్లాన్‌ను రద్దు చేసినట్లు మున్సిపల్ కౌన్సిల్ ప్రకటించింద న్నారు. కౌన్సిల్‌కు ఆ అధికారం లేదని తెలిపారు. వాదనలు విన్న ధర్మాసనం.. ప్రభుత్వ నిర్ణయం చెప్పాలంటూ విచారణను వాయిదా వేసింది. -
బాన్సువాడలో ‘డబుల్’ ధమాకా !
సాక్షి, కామారెడ్డి: బాన్సువాడ నియోజకవర్గంలో స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి చొరవతో నిరుపేదల సొంతింటి కల నెరవేరింది. కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణ పరిధిలోని తాడ్కోల్‌లో నిర్మించిన 504 డబుల్ బెడ్రూం ఇళ్లను శనివారం స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్, ఎస్పీ శ్రీనివాస్‌రెడ్డిలతో కలిసి లబ్ధిదారులకు పంపిణీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణ పథకాన్ని అమలులోకి తీసుకువచ్చిన తరువాత స్పీకర్ పోచారం నిరుపేదలందరికీ ఇళ్లు నిర్మించి ఇవ్వడానికి చర్యలు చేపట్టారు. రాష్ట్రంలో ఏ నియోజక వర్గంలో లేని విధంగా బాన్సువాడకు 11 వేల ఇళ్లను మంజూరు చేయించారు. ఇప్పటివరకు ఏడు వేల పైచిలుకు ఇళ్లు లబ్ధిదారులకు పంపిణీ చేశారు. కాగా పట్టణ పరిధిలోని తాడ్కోల్ శివారులో మొదట ఐదు వందల ఇళ్లు నిర్మించారు. వాటిని ఇప్పటికే లబ్ధిదారులకు పంపిణీ చేశారు. అదే కాంపౌండ్‌లో నిర్మించిన 504 ఇళ్లను శనివారం లబ్ధిదారులకు అందించారు. కేసీఆర్ నగర్‌గా ఈ కాంపౌండ్‌కు నామకరణం చేశారు. అక్కడే రూ.90 లక్షలతో కల్యాణ వేదిక నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కాలనీలో షాపింగ్ కోసం కాంప్లెక్సు నిర్మించారు. కాలనీలోని ప్రతి ఒక్కరికీ గుర్తింపు కార్డులు జారీ చేయనున్నట్లు పోచారం పేర్కొన్నారు. కాగా తమకూ ఇళ్లు కావాలంటూ మరికొందరు అక్కడికి చేరుకుని నినాదాలు చేశారు. -
మెప్పించి.. ఒప్పించేలా!.. మాస్టర్ప్లాన్లపై మళ్లీ అధ్యయనం
సాక్షి, వరంగల్: మాస్టర్ ప్లాన్ల విషయంలో ప్రజలకు ఆమోదయోగ్యమైన ప్రతిపాదనలతో ముందుకు వెళ్లాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. వేగంగా విస్తరిస్తున్న నగరాలు, పట్టణాలకు అనుగుణంగా వాటి అభివృద్ధికి మాస్టర్ప్లాన్లు కీలకంగా మారాయి. రాష్ట్రంలోని సుమారు 91 నగరాలు, పట్టణాలకు బృహత్తర ప్రణాళికల రూపకల్పన తక్షణ కర్తవ్యంగా మారింది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న మాస్టర్ప్లాన్లను కొలిక్కి తేవడంతోపాటు కొత్త మున్సిపాలిటీలలో అమలు చేసే దిశగా చర్యలు చేపడుతోంది. పలు కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు మాస్టర్‌ప్లాన్ – 2041 రూపకల్పన జరుగుతుంటే కొన్నిచోట్ల వీటిపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. భూములు, పంట స్థలాలు కోల్పోతున్నవారు ఆందోళనలకు దిగుతున్నారు. కామారెడ్డి, జగిత్యాలలో పెల్లుబుకిన నిరసనలతో ఆయా మున్సిపాలిటీల పాలకవర్గాలు మాస్టర్ప్లాన్లను వ్యతిరేకిస్తూ ఏకగ్రీవ తీర్మానాలు చేసి పంపడంతో అవి రద్దయ్యాయి. నిర్మల్‌లో కూడా ఉపసంహరించుకున్నట్లు మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి మంగళవారం పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఆమోదయోగ్యమైన ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించినట్లు సమాచారం. ఇప్పటికీ పాతవే.. కొత్తవాటికి కలగని మోక్షం.. రాజధాని హైదరాబాద్ తర్వాత రాష్ట్రంలోని అతిపెద్ద నగరమైన వరంగల్‌లో 1972 నాటి మాస్టర్‌ప్లానే ఇప్పటికీ అమల్లో ఉండగా, నిజామాబాద్‌కు 1974 నాటి ప్రణాళికే ఉంది. పదికిపైగా మున్సిపాలిటీల్లో 1990 కంటే ముందునాటి మాస్టర్ప్లాన్లే అమల్లో ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది మార్చి ఆఖరు నాటికి రాష్ట్రంలోని అన్ని కార్పొరేషన్, మున్సిపాలిటీలకు కొత్త మాస్టర్‌ప్లాన్ రూపొందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలోని 142 నగర పాలక సంస్థలు, పురపాలక సంస్థలకు గాను 97 తెలంగాణ రాష్ట్ర టౌన్ ప్లానింగ్ విభాగం పరిధిలో ఉన్నాయి. వీటిలో 32 పురపాలికలకు బృహత్తర ప్రణాళిక (మాస్టర్‌ప్లాన్)ల రూపకల్పనకు అనుమతి లభించగా.. ఇందులో ఎనిమిదింటికి ముసాయిదాలను రూపొందించి ప్రభుత్వ ఆమోదానికి పంపించగా పెద్దపల్లి మాస్టర్‌ప్లాన్‌ను మాత్రం ఆమోదించారు. అలాగే పట్టణాభివృద్ధి శాఖ పరిధిలో మరో 45 పురపాలికలు ఉండగా.. మాస్టర్ప్లాన్ల రూపకల్పన చేపట్టినా ఆ ప్రక్రియ పూర్తికాలేదు. మొత్తం మీద వీటిల్లో కొత్తగా ఏర్పాటైన 59 మున్సిపాలిటీలకు నాలుగేళ్లు పూర్తయినా అసలు మాస్టర్‌ప్లాన్ రూపకల్పన దిశగా అడుగులే పడలేదు. వరంగల్ ‘కుడా’ మాస్టర్‌ప్లాన్ నమూనా ప్రత్యామ్నాయాల పరిశీలన.. మొత్తం మీద మాస్టర్ప్లాన్లు అవసరమైన 91 నగరాలు, పట్టణాలలో 68 కొత్తవాటికి మాస్టర్‌ప్లాన్ సిద్ధం చేశారు. మహబూబాబాద్, ఆంధోల్–జోగిపేట, కొల్లాపూర్, నాగర్‌కర్నూల్, అచ్చంపేట, సత్తుపల్లి, భూపాలపల్లి, దేవరకొండ మాస్టర్ప్లాన్లు ఆమోదం కోసం సిద్ధంగా ఉండగా, మరో 15 ప్రభుత్వ ఆమోదం కోసం పంపించేందుకు కసరత్తు పూర్తయింది. తాజాగా రద్దయిన కామారెడ్డి, జగిత్యాల, నిర్మల్ పట్టణాలకు ప్రత్యామ్నాయ మాస్టర్ప్లాన్లు రూపొందించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఈ మూడు పట్టణాలతో పాటు, మిగతా వాటికి కొత్తగా రూపొందించే మాస్టర్ప్లాన్లలో నివాస ప్రాంతం, వాణిజ్య ప్రాంతం, పారిశ్రామిక ప్రాంతం, మిశ్రమ వినియోగం వంటి వాటితో పాటు ప్రభుత్వ వినియోగం, గ్రీన్ కవర్లో భాగంగా అడవులు, బఫర్‌జోన్, పర్యావరణ/ప్రత్యేక భూ వినియోగ జోన్, రోడ్లు, రవాణా వ్యవస్థలు.. వాటికి ప్రతిపాదించిన భూమి విస్తీర్ణం, భూ వినియోగ విధానం తదితర అంశాలపై మరోసారి అధ్యయనం నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించినట్లు తెలిసింది. సీఎం పేషీలో వరంగల్ ఫైల్.. 34 నెలలుగా పెండింగ్.. వరంగల్ మాస్టర్‌ప్లాన్–2041 సర్కారు ఆమోదం కోసం ఎదురుచూస్తోంది. 34 నెలలుగా ముఖ్యమంత్రి పేషీ నుంచి కదలడం లేదని అధికారులే చెబుతున్నారు. ఫలితంగా ఇంకా 50 ఏళ్ల కిందటి ప్లాన్‌నే అమలు చేస్తున్నారు. వాస్తవానికి 2041 వరకు సిటీ అవసరాలకు సరిపోయేలా 2013 లోనే అధికారులు మాస్టర్ ప్లాన్ తయారు చేశారు. దాన్ని 2020 మార్చిలో ఆమోదించిన మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్.. సీఎం ఆమోదం కోసం పంపారు. 10.50 లక్షలకు మించిన జనాభా ఉన్న వరంగల్ స్మార్ట్ సిటీ కావాలన్నా.. కేటీఆర్ హామీ ఇచ్చినట్లు ఫ్యూచర్ సిటీగా డెవలప్ చేయాలన్నా కొత్త మాస్టర్ ప్లాన్ అమలు చేయాల్సిన అవసరం ఉంది. సీఎం ఆమోదమే తరువాయి ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారుల పర్యవేక్షణలో అన్ని వర్గాలకు ఆమోదయోగ్యంగా ఉండేలా వరంగల్ మాస్టర్‌ప్లాన్‌కు రూపకల్పన జరిగింది. దానికి అనుగుణంగా నగరాభివృద్ధిని దృష్టిలో పెట్టుకునే అనుమతులు ఇస్తారు. మాస్టర్ ప్లాన్ సీఎం పేషీలో పెండింగ్‌లో వుంది. ఆమోదం పొందితేనే పూర్తి స్థాయిలో అమల్లోకి వస్తుంది. – ఎ.అజిత్‌రెడ్డి, చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్, కుడా, వరంగల్ ఓఆర్ఆర్కు అవతల ఇండస్ట్రియల్ జోన్ ఉండాలి వరంగల్ మాస్టర్‌ప్లాన్‌లో ఔటర్ రింగ్ రోడ్డు అవతల ఇండస్ట్రియల్ జోన్ నిర్ణయించాలి. రహదారుల కనెక్టివిటీకి అనుగుణంగా అభివృద్ధి ఉండాలి. రెండో పెద్ద నగరం చుట్టూరా భవిష్యత్‌లో ఐటీ, వ్యాపార, వాణిజ్య, ఉపాధి అవకాశాలను మెరుగుపర్చాలి. మాస్టర్‌ప్లాన్‌పై అభ్యంతరాలను ప్రభుత్వం పరిశీలించి, సవరించి వెంటనే ఆమోదించాలి. – బొమ్మినేని రవీందర్ రెడ్డి, అధ్యక్షుడు, చాంబర్ ఆఫ్ కామర్స్, వరంగల్ మిశ్రమ వినియోగం కింద తీసుకోవాలి మాస్టర్ప్లాన్లు ఎక్కడ అమలు చేసినా అన్ని వర్గాలకు ఆమోదయోగ్యంగా ఉండాలి. చాలాచోట్ల రాజకీయ జోక్యంతో విలీన గ్రామాల్లోని వ్యవసాయ భూములను ఇండస్ట్రియల్, గ్రీన్ జోన్లోకి తీసుకుంటున్నారు. ప్రతిపాదిత వరంగల్ మాస్టర్ ప్లాన్‌లో రైతులు, ఇతరుల నుంచి 3 వేల ఫిర్యాదులు అందాయి. పంట భూములను మిక్స్డ్ ల్యాండ్ యూజ్ (మిశ్రమ భూ వినియోగం)గా తీసుకుంటే వ్యతిరేకత రాదు. – పుల్లూరి సుధాకర్, అధ్యక్షులు, ఫోరం ఫర్ బెటర్ తెలంగాణ -
అన్నదాతకు అండగా.. ‘సాక్షి’ అక్షర సమరం
సాక్షి, కామారెడ్డి: కామారెడ్డి మాస్టర్‌ప్లాన్ ముసాయిదా రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు సాగించిన ఉద్యమానికి ‘సాక్షి’ అండగా నిలిచింది. భూమిని నమ్ముకుని జీవిస్తున్న అన్నదాతలకు నిత్యం అండగా ఉంటూ ‘కథనోత్సాహం’తో అక్షర పోరు సాగించింది. ‘చిక్కుముడుల మాస్టర్ ప్లాన్’ అంటూ డిసెంబర్ 2న ప్రచురితమైన కథనంతో ముసాయిదాలోని లొసుగులు వెలుగులోకి వచ్చాయి. మాస్టర్ ప్లాన్‌లో ఏముందో అంటూ ముసాయిదాలో పేర్కొన్న చాలా అంశాలను ప్రముఖంగా ప్రచురించడంతో బాధి త రైతులు జాగృతమయ్యారు. సుమారు యాభై రోజులు అలుపెరుగని పోరు సలిపారు. మాస్టర్ ప్లాన్‌కు వ్యతిరేకంగా రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆందోళనలకు ప్రాధాన్యతనిస్తూ, రైతుల ఆవేదనకు ‘సాక్షి’గా నిలిచింది. ఉద్యమంలో పాల్గొన్న అన్నివర్గాలు, పార్టీలకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా అందరి మనన్నలు అందుకుంది. మాస్టర్ ప్లాన్ రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించడంతో బాధితులు ఊపిరి పీల్చుకున్నారు. భూమికోసం సాగించిన సమరంలో తమకు దన్నుగా నిలిచిన ‘సాక్షి’కి రైతన్నలు కృతజ్ఞతలు తెలిపారు. -
జగిత్యాల, కామారెడ్డి మాస్టర్ ప్లాన్ల రద్దు! కౌన్సిళ్ల కీలక నిర్ణయం
సాక్షి, కామారెడ్డి/కామారెడ్డి టౌన్/ జగిత్యాల: తమ పంట భూములను కాపాడుకునేందుకు రైతులు చేసిన పోరాటం ఫలించింది. కామారెడ్డి, జగిత్యాల పట్టణాల్లో కొత్త మాస్టర్ ప్లాన్ ముసాయిదాలను రద్దు చేయాలంటూ వారు చేపట్టిన ఆందోళనకు ప్రభుత్వం తలొగ్గింది. ఈ రెండు చోట్ల మాస్టర్ ప్లాన్ ముసాయిదా ప్రక్రియలను నిలిపివేస్తూ మున్సిపల్ పాలకవర్గాలు శుక్రవారం నిర్ణయం తీసుకున్నాయి. రైతుల భూములు ఎక్కడికీ పోవని, ఆవేదన చెందవద్దని ప్రకటించాయి. రైతుల భూములకు నష్టం కలగకుండా ప్రణాళికలను రూపొందిస్తామని అధికారులు తెలిపారు. రైతుల ఉధృత ఉద్యమంతో.. కామారెడ్డి మున్సిపాలిటీ కొత్త మాస్టర్ ప్లాన్‌కు సంబంధించి డీటీసీపీ, ఢిల్లీకి చెందిన డీడీఎఫ్ సంస్థలు కలిసి ముసాయిదా రూపొందించడం, అందులో పంట భూములను పారిశ్రా మిక, వాణిజ్య జోన్లుగా చూపడాన్ని తప్పుపడుతూ రైతులు ఆందోళనకు దిగడం తెలిసిందే. జెడ్పీ మాజీ చైర్మన్ కె.వెంకటరమణారెడ్డి ఆధ్వర్యంలో రైతులు ఐక్య కార్యాచరణ కమిటీగా ఏర్పడి ఉద్యమానికి దిగారు. దీనికి వివిధ రాజ కీయ పక్షాలు మద్దతుగా నిలి చాయి. అయితే అడ్లూర్ ఎల్లా రెడ్డికి చెందిన రైతు పయ్యవుల రాములు ఆత్మహత్యకు పాల్పడిన ఘటనతో పోరాటం ఉధృతమైంది. చివరికి మాస్టర్‌ప్లాన్ ముసాయిదాను రద్దు చేస్తూ శుక్రవారం జరిగిన మున్సిపల్ కౌన్సిల్ అత్యవసర సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానించారు. మరోవైపు పురపాలక శాఖ ప్రత్యేక కార్యదర్శి అరవింద్‌కుమార్ కామారెడ్డి కలెక్టరేట్లో కలెక్టర్ జితేష్ వి.పాటిల్, అదనపు కలెక్టర్ వెంకటేశ్ దోత్రే, మున్సిపల్ కమిషనర్ దేవేందర్‌లతో సమీక్షించారు. అనంతరం ముసా యిదా ప్రక్రియను నిలిపివేస్తున్నామని అరవింద్‌కుమార్ ప్రక టించారు. విలీన గ్రామాల ప్రజల అభిప్రాయాలను తెలుసు కుని కొత్త మాస్టర్‌ప్లాన్ రూపొందిస్తామని తెలిపారు. రైతుల భూమిని సేకరించే ఉద్దేశంతో మాస్టర్‌ప్లాన్ తయారు చేయ లేదని, రైతుల భూములు ఎక్కడికీ పోవని చెప్పారు. కొత్త రోడ్ల నిర్మాణంలో రైతులకు నష్టం జరగకుండా ప్రణాళిక రూపొందిస్తామన్నారు. ప్రభుత్వ నిర్ణయంపై రైతులు, నేతలు హర్షం వ్యక్తం చేశారు. అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామంలో టపాసులు కాల్చారు. ఉద్యమానికి అండగా నిలిచారంటూ జెడ్పీ మాజీ చైర్మన్ వెంకటరమణారెడ్డిని అభినందించారు. జగిత్యాల మున్సిపాలిటీలోనూ.. జగిత్యాల మున్సిపాలిటీలోనూ ముసాయిదా మాస్టర్ ప్లాన్‌ను రద్దు చేస్తూ పాలకవర్గం శుక్రవారం తీర్మానించింది. జగిత్యాల మున్సిపాలిటీలో పట్టణ శివార్లలోని హుస్నాబాద్, తిప్పన్నపేట, మోతె, తిమ్మాపూర్, ధరూర్, నర్సింగాపూర్ గ్రామాలను విలీనం చేస్తూ గత ఏడాది డిసెంబర్లో మాస్టర్ ప్లాన్ ముసాయిదా రూపొందించారు. పలుగ్రామాల్లోని వ్యవసాయ భూములను రిక్రియేషన్, ఇండస్ట్రియల్, కమర్షియల్ జోన్ల పరిధిలో చేర్చారు. దీనిపై ఆయా గ్రామాల ప్రజ లు, రైతులు ఆందోళనలకు దిగారు. ధర్నాలు, రాస్తారో కోలు, కలెక్టరేట్, ప్రభుత్వ కార్యాలయాల ముట్టడి, వంటావార్పుతో నిరసనలు తెలిపారు. గురువారం జగిత్యాల మున్సిపాలిటీ ముట్టడి, పట్టణ దిగ్బంధం కార్యక్రమం చేపట్టారు. ఈ నేపథ్యంలో మున్సిపల్ పాలకవర్గం శుక్రవారం అత్యవసరంగా సమావేశమై.. మాస్టర్ ప్లాన్ ముసాయిదాను రద్దు చేసింది. -
కామారెడ్డి ‘మాస్టర్‌ప్లాన్’ వెనక్కి!
సాక్షి, కామారెడ్డి/కామారెడ్డి టౌన్: ‘భూమిని మింగే మాస్టర్ ప్లాన్ మాకొద్దు’అంటూ నెలన్నర కాలంగా రైతు ఐక్యకార్యాచరణ కమిటీ చేస్తున్న పోరాటం ఫలించింది. కామారెడ్డి మున్సిపల్ పాలకవర్గం మాస్టర్‌ప్లాన్ రద్దుకు ముందుకు వచ్చింది. ఈ నెల 20న మున్సిపల్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి ముసాయిదా రద్దు కోరుతూ తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపనున్నట్టు మున్సిపల్ చైర్పర్సన్ నిట్టు జాహ్నవి గురువారం విలేకరుల సమావేశంలో ప్రకటించారు. దీంతో గడచిన నెలన్నర రోజులుగా జరుగుతున్న ఆందోళనలకు ఫుల్స్టాప్ పడనుందని రైతులు భావిస్తున్నారు. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి రైతు ఐక్యకార్యాచరణ కమిటీ అనేక రూపాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టింది. ధర్నాలు, రాస్తారోకోలు, ర్యాలీలు, బంద్‌లు నిర్వహించింది. విలీన గ్రామాల కౌన్సిలర్లు తొమ్మిది మంది రాజీనామా చేయాలని గురువారం సాయంత్రం వరకు డెడ్‌లైన్ విధించింది. ఈ క్రమంలో బీజేపీకి చెందిన ఇద్దరు కౌన్సిలర్లు తమ రాజీనామా లేఖలను మున్సిపల్ కమషనర్‌కు అందించారు. దీంతో అధికార పార్టీ కౌన్సిలర్లపై ఒత్తిడి పెరిగింది. ముందు నుయ్యి, వెనక గొయ్యిలా వారి పరిస్థితి తయారైంది. శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ ఇంటిని ముట్టడించాలని పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, నేతలు చర్చించి ఈ నెల 20న మున్సిపల్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి ముసాయిదా రద్దు కోరుతూ తీర్మానించాలని నిర్ణయించారు. ఎట్టకేలకు రైతుల పోరాటాల ఫలితంగా బల్దియా పాలకవర్గం మాస్టర్‌ప్లాన్ ముసాయిదా రద్దుకు సిద్ధమైంది.