సాక్షి, కామారెడ్డి: విధిలేని పరిస్థితుల్లోనే కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందన్నారు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్. తెలంగాణ బిడ్డలపై రేవంత్ రెడ్డి తుపాకీ గురి పెట్టాడని విమర్శించారు. డబ్బులు ఎవరిచ్చినా తీసుకోండి, ఓటు మాత్రం కారుకే వేయండని చెప్పారు. విదన్నారు. బీజేపీ ఇచ్చే చాకెట్లు కావాలా? కేసీఆర్ ఇచ్చే ధమ్ బిర్యానీ కావాలా అని ప్రశ్నించారు. రైతులను బిచ్చగాళ్లు అని చెప్పిన కాంగ్రెస్‌ను బొందపెట్టాలని అన్నారు.
ఢిల్లీ దొరల పెత్తనాన్ని తిప్పికొడదామని కేటీఆర్ పిలుపునిచ్చారు. రాహుల్ గాంధీ లీడర్ కాదు రీడర్ అని ధ్వజమెత్తారు. కేసీఆర్ కామారెడ్డి రావడానికి ఎమ్మెల్యే గంప గోవర్ధనే కారణమని, ఇక్కడి ప్రాంతం మొదటి స్థానంలో ఉండాలని సీఎంను ఆహ్వానించారని తెలిపారు. కొడంగల్‌కు కేసీఆర్ రాకపోతే కామారెడ్డికి తానే వస్తానని రేవంత్ రెడ్డి అన్నారన్న కేటీఆర్.. కామారెడ్డి వచ్చి కేసీఆర్ మీద తొడ కొట్టడమంటే పోచమ్మ ముందు గొర్రె పొట్టేలును కట్టేసినట్టేనని చురకలంటించారు.
షబ్బీర్ అలీ ఇక్కడినుంచి నిజామాబాద్ పారిపోతున్నాడని కేటీఆర్ విమర్శించారు. కేసీఆర్ వస్తే కామారెడ్డిలో వెయ్యిరేట్ల అభివృద్ధి జరుగుతుందన్నారు. ఢిల్లీ దొరలకు, తెలంగాణ ప్రజలకు మధ్య జరుగుతున్న పోరాటంలో విజయం సాధించేది తెలంగాణ ప్రజలేనని వ్యాఖ్యానించారు.
చదవండి: సర్వతోముఖాభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ రాజశ్యామల యాగం
Comments
Please login to add a commentAdd a comment