సాక్షి, కామారెడ్డి జిల్లా: నిజాంసాగర్‌ను కాళేశ్వరంతో నింపుతామని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. కర్ణాటక రాష్ట్ర డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తెలంగాణకు వచ్చి చూడండి అంటున్నారని విమర్శించారు. కర్ణాటకలో కేవలం 5 గంటలే విద్యుత్ సరఫరా అవుతోందని దుయ్యబట్టారు. కర్ణాటక ఎప్పటి నుంచో ఉందని, అది పెద్ద రాష్ట్రమని చెప్పిన కేసీఆర్.. నిన్నా మొన్న వచ్చిన తెలంగాణలో 24 గంటల విద్యుత్ సరఫరా ఉందని తెలిపారు. ప్రధాని సొంత రాష్ట్రంలోనే విద్యుత్ సరఫరా సరిగా లేదని విమర్శలు గుప్పించారు.
ఈ మేరకు సోమవారం జుక్కల్ బహిరంగ సభలో పాల్గొన్న సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. రైతు బంధు దుబారా, వృథా అంటూ కాంగ్రెస్ ఆరోపిస్తుందని మండిపడ్డారు. రైతుబంధు ఉండాలా? వద్దా? అని ప్రశ్నించారు. రైతు బంధు అనే పదాన్ని పుట్టించిందే బీఆర్‌ఎస్ ప్రభుత్వమని పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడా రుణమాఫీ లేదని అన్నారు.
తెలంగాణలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చామని కేసీఆర్ తెలిపారు. రూ. 37 వేల కోట్ల రూపాయలు రుణమాఫీ రెండు దఫాలుగా చేశామని చెప్పారు. కాంగ్రెస్ ఫిర్యాదుతో కొందరికి రైతుబంధు ఆగిందని.. ఎన్నికలవగానే అందరికీ రైతుబంధు అందుతుందని పేర్కొన్నారు.
చదవండి: అసెంబ్లీ ఎన్నికలు.. కాంగ్రెస్‌కు కోదండరామ్ మద్దతు
Comments
Please login to add a commentAdd a comment