jukkal
-
ఉర్దూ టీచర్.. ఈ తెలుగమ్మాయి!
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి: పుట్టింది హిందూ తెలుగు కుటుంబంలో.. అయితేనేం.. ఉర్దూ మీడియంలో చదువుకుంది. ఉర్దూ ఉపాధ్యాయిని ఉద్యోగం సాధించింది. ఆమె కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం కేంరాజ్ కల్లాలి గ్రామానికి చెందిన పొనగంటి జయశ్రీ. ఒకటి నుంచి నాలుగో తరగతి వరకు బిచ్కుంద మండల కేంద్రంలో ఉర్దూ మీడియం పాఠశాలలో చదువుకున్న జయశ్రీ.. ఐదో తరగతి నుంచి పదో తరగతి వరకు బాన్సువాడలోని ఎస్సీ హాస్టల్లో ఉంటూ అక్కడి జెడ్పీహైస్కూల్లో చదువుకుంది.ఇంటర్ బాన్సువాడలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో చదువుకుని డిగ్రీ బోధన్‌లోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో అభ్యసించింది. డిగ్రీ అయ్యాక బోధన్‌లోని ఆజాన్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్‌లో బీఈడీ పూర్తి చేసింది. గతేడాది టెట్ రాసి ఎంపికైంది. 2024–డీఎస్సీ పరీక్ష రాసి స్కూల్ అసిస్టెంట్ (ఉర్దూ) ఉద్యోగం సాధించి బుధవారం నియామక పత్రం అందుకుంది. తొలి ప్రయత్నంలోనే టెట్, డీఎస్సీలో మంచి ప్రతిభ కనబరచడం విశేషం. మాస్టారైన గొర్రెల కాపరి.. భిక్కనూరు: కష్టాలు ఎదురైతే..ఆగిపోకుండా సాగితే విజయాలు సాధ్యమని నిరూపించాడీ యువకుడు.. చదువు మానేసి గొర్రెలు కాయడానికి వెళ్లాడు.. చదువుపై ఇష్టం, స్నేహితుల ప్రోత్సాహంతో మళ్లీ చదువుకొని ప్రస్తుతం డీఎస్సీలో స్కూల్ అసిస్టెంట్‌గా ఎంపికయ్యాడు. ఆ విజేత భిక్కనూరుకు చెందిన కోరే కుమార్. గ్రామానికి చెందిన కోరే కమల–బీరయ్య దంపతులకు ఒక కొడుకు కుమార్, కుమార్తె ఉన్నారు.పేద కుటుంబం కావడంతో నాలుగో తరగతిలోనే తల్లిదండ్రులు కుమార్ చదువు మాన్పించారు. దీంతో ఆయన గొర్రెలు కాయడానికి వెళ్లేవాడు. ఈ క్రమంలో చదువుపై మక్కువతో 2014లో ఓపెన్‌లో పదో తరగతి పరీక్షలు రాసిన కుమార్ పాసయ్యాడు. భిక్కనూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్లో సీఈసీ, కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో డిగ్రీ పూర్తి చేశాడు. నిజా మాబాద్‌లోని సారంగపూర్ కళాశాలలో బీఈడీ పూర్తి చేశాడు. డీఎస్సీలో ఉత్తమ ర్యాంకు సాధించి సోషల్ విభాగంలో స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగం సాధించాడు.చదవండి: మీరే మా వారధులు: డీఎస్సీ నియామక పత్రాల పంపిణీ సభలో సీఎం రేవంత్ పట్టుపట్టి.. కొలువు కొట్టి రేగోడ్(మెదక్): ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంటూ తన లక్ష్యాన్ని చేరుకున్నాడు ఓ గిరిజన బిడ్డ. మండలంలోని కాకంచ తండాకు చెందిన రవికుమార్ స్కూల్ అసిస్టెంట్‌గా జిల్లా మొదటి ర్యాంకు సాధించి బుధవారం నియామకపత్రం అందుకున్నాడు. ఈసందర్భంగా ఆయన ఆయన మాట్లాడుతూ.. తన పన్నెండేళ్ల కల నెరవేరిందని సంతోషం వ్యక్తం చేశాడు. ఉపాధ్యాయ వృత్తిలోకి రావాలని ఎన్నో కలలు కన్నానని చెప్పాడు. తన ఇంట్లో పలువురు ఉన్నత ఉద్యోగాల్లో ఉండగా.. మరికొందరు ఉన్నత చదువులు చదువుతున్నారని తెలిపారు. నాన్నకు ప్రేమతో.. రేగోడ్(మెదక్): నాన్న ప్రోత్సాహంతో చిన్నప్పటి నుంచి ఉపాధ్యాయుడుగా కావాలన్న కల నెరవేరిందని స్కూల్ అసిస్టెంట్‌గా నియామకపత్రం అందుకున్న జిల్లా మొదటి ర్యాంకు ఉపాధ్యాయుడు రేగోడ్ గ్రామానికి చెందిన మహేశ్ తెలిపారు. 2018లో ఉద్యోగం రాలేదని, పట్టు వదలకుండా చదివి ప్రస్తుతం సాధించానని ఆనందం వ్యక్తం చేశాడు. -
రైతుబంధు ఉండాలా ? వద్దా..?
-
ప్రధాని సొంత రాష్ట్రంలోనే విద్యుత్ సరఫరా సరిగా లేదు: కేసీఆర్
సాక్షి, కామారెడ్డి జిల్లా: నిజాంసాగర్‌ను కాళేశ్వరంతో నింపుతామని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. కర్ణాటక రాష్ట్ర డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తెలంగాణకు వచ్చి చూడండి అంటున్నారని విమర్శించారు. కర్ణాటకలో కేవలం 5 గంటలే విద్యుత్ సరఫరా అవుతోందని దుయ్యబట్టారు. కర్ణాటక ఎప్పటి నుంచో ఉందని, అది పెద్ద రాష్ట్రమని చెప్పిన కేసీఆర్.. నిన్నా మొన్న వచ్చిన తెలంగాణలో 24 గంటల విద్యుత్ సరఫరా ఉందని తెలిపారు. ప్రధాని సొంత రాష్ట్రంలోనే విద్యుత్ సరఫరా సరిగా లేదని విమర్శలు గుప్పించారు. ఈ మేరకు సోమవారం జుక్కల్ బహిరంగ సభలో పాల్గొన్న సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. రైతు బంధు దుబారా, వృథా అంటూ కాంగ్రెస్ ఆరోపిస్తుందని మండిపడ్డారు. రైతుబంధు ఉండాలా? వద్దా? అని ప్రశ్నించారు. రైతు బంధు అనే పదాన్ని పుట్టించిందే బీఆర్ఎస్ ప్రభుత్వమని పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడా రుణమాఫీ లేదని అన్నారు. తెలంగాణలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చామని కేసీఆర్ తెలిపారు. రూ. 37 వేల కోట్ల రూపాయలు రుణమాఫీ రెండు దఫాలుగా చేశామని చెప్పారు. కాంగ్రెస్ ఫిర్యాదుతో కొందరికి రైతుబంధు ఆగిందని.. ఎన్నికలవగానే అందరికీ రైతుబంధు అందుతుందని పేర్కొన్నారు. చదవండి: అసెంబ్లీ ఎన్నికలు.. కాంగ్రెస్‌కు కోదండరామ్ మద్దతు -
ప్రధాని మోదీకి ఆస్కార్ ఇవ్వాలి.. మహానటుడు: కేటీఆర్ వ్యంగ్యస్త్రాలు
సాక్షి, కామారెడ్డి: బీఆర్ఎస్ పథకాలు దేశవ్యాప్తంగా ఆదర్శంగా నిలుస్తున్నాయని మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణలో జరిగిన అభివృద్ధి కర్ణాటక, మహారాష్ట్రలో కనిపిస్తుందా అని ప్రశ్నించారు. విద్యుత్, సాగునీరు ఇక్కడ పుష్కలంగా అందిస్తున్నామని తెలిపారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం జరిగిందే తెలంగాణ పోరాటమని గుర్తు చేశారు. అక్కడ( కర్ణాటక, మహారాష్ట్ర) రైతుబీమా, కల్యాణలక్ష్మి, మిషన్ భగీరథ వంటి పథకాలు అమలవుతున్నాయా..? అనే విషయాన్ని ప్రజలు ఆలోచించాలని సూచించారు. కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం పిట్లంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ బహిరంగ సభలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. గిరిజన తండాలను, గూడెలను గ్రామపంచాయతీలుగా చేశామని కేటీఆర్ గుర్తు చేశారు. తండాల్లో రోడ్లను అభివృద్ధి చేస్తాం. గిరిజనులకు సర్పంచ్‌లుగా అవకాశం కల్పించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. బిచ్కుంద, పిట్లంను మున్సిపాలిటీలుగా మారుస్తామని, మిగతా మున్సిపాలిటీల కంటే ఈ రెండింటిని అద్భుతంగా తీర్చిదిద్దుతాం అని ప్రకటించారు. చిత్తశుద్ధితో పని చేసేవారిలో హన్మంత్ షిండే ఒకరు హైదరాబాద్‌కు వచ్చినప్పుడల్లా.. ఈ నియోజకవర్గ అభివృద్ధి గురించే షిండే మాట్లాడుతారని మంత్రి కేటీఆర్ అన్నారు. జుక్కల్ నియోజకవర్గ ప్రజలు అదృష్టవంతులు. మంచి నాయకుడు దొరికినప్పుడు గట్టిగా 10 కాలాల పాటు కాపాడుకోవాలి. గత ఎన్నికల్లో 36 వేల ఓట్ల మెజార్టీతో గెలిచాను అని చెప్పిండు.. ఈ సారి నాగమడుగు ప్రాజెక్టు తెచ్చినందుకు 72 వేల ఓట్ల మెజార్టీతో గెలిపించే బాధ్యత మీపై ఉన్నది. ప్రజల పట్ల చిత్తశుద్ధితో పని చేసేవారు కొందరే ఉంటారు. అందులో ఒకరు హన్మంత్ షిండే. అలాంటి నాయకుడిని భారీ మెజార్టీతో గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని కేటీఆర్ పేర్కొన్నారు. ‘తెలంగాణకు అన్యాయం జరిగిందంటూ రేవంత్ రెడ్డి గొంతు చించుకుంటున్నాడు. 10 సార్లు అవకాశాలు ఇస్తే 50 ఏళ్ళు దేశాన్ని పాలించి కాంగ్రెసోళ్లు ఏం చేశారు..? పరిపాలించడం చేతగాని వారు ఇపుడు ఒక్క ఛాన్స్ ఇవ్వమని అడుగుతున్నారు. అబద్ధాలు చెప్పడంలో, నటనలో ప్రధాని మోదీకి ఆస్కార్ అవార్డు ఇవ్వాలి. మహానటుడు మోదీ. దేశ సంపద అంతా దోస్తు ఖాతాలో జమ చేస్తూ విపక్షాలను కొనుగోలు చేస్తున్నాడు. 2 కోట్ల ఉద్యోగాలు ఏమయ్యాయి. నల్లధం తెస్తానని ఇపుడు తెల్లముఖం వేశాడు. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి డిపాజిట్ గల్లంతు చేయాలి. తెలంగాణపై కేంద్రం కక్షగట్టింది. తెలంగాణకు పట్టిన శని బీజేపీ. మోడీ ఈడీలకు భయపడం. ప్రజాక్షేత్రంలో తూల్చుకుందాం. కేసీఆర్‌ను పాడుకుని. మూడోసారి సీఎం చేసుకుందాం’ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. చదవండి: ఈడీ థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తోంది.. కవిత సంచలన కామెంట్స్ -
జుక్కల్ కాంగ్రెస్‌లో ముఠా కుమ్ములాటలు..అసలు అక్కడ ఏం జరుగుతోంది?
అంతర్గత కలహాలు, కుమ్ములాటలకు కాంగ్రెస్ పార్టీ కేరాఫ్ అడ్రస్. ఢిల్లీ నుంచి గల్లీ వరకు ఇదే పరిస్థితి. ఇప్పుడు నిజామాబాద్ జిల్లా జుక్కల్ నియోజకవర్గంలో కూడా కుమ్ములాటలు మొదలయ్యాయి. రాహుల్ గాంధీ పాదయాత్ర తెలంగాణలో ముగిసింది జుక్కల్‌లోనే. రాహుల్ యాత్ర ఉత్సాహాన్ని ముఠా కుమ్ములాటలు నీరు గారుస్తున్నాయి. అసలు జుక్కల్‌లో ఏం జరుగుతోంది? కారు జోరు.. చేయి బేజారు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన రెండు ఎన్నికల్లోనూ జుక్కల్ నియోజకవర్గంలో గులాబీ జెండానే ఎగిరింది. అక్కడ ప్రతిపక్షాలు ఉన్నాయిగాని..టీఆర్ఎస్ను ఓడించేంత స్థాయిలో ఉన్నాయా అన్నది ప్రశ్నే. ఎలాగైనా జుక్కల్‌ను గెలుచుకోవాలని అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ పార్టీలు సీరియస్‌గా ఫోకస్ పెట్టాయి. అందుకే ఈసారి ఇక్కడ త్రిముఖ పోటీ గట్టిగానే ఉంటుందనే టాక్ వినిపిస్తోంది. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర తెలంగాణాలో జుక్కల్ నియోజకవర్గంలోనే ముగిసి మహారాష్ట్రలో ప్రవేశించింది. ఇక్కడ ఏర్పాటు చేసిన సభకు భారీగా జనం రావడంతో.. కాంగ్రెస్ శ్రేణులు మరింత ఉత్సాహంగా ఉన్నాయి. ఎప్పుడైతే కేడర్‌లో ఉత్సాహం పెరిగిందో నాయకుల్లో గ్రూపులు తయారయ్యాయి. పార్టీ నిస్తేజంగా ఉన్నంతవరకు అంతా బాగానే ఉంది. ఎన్నికలు ఏడాదిలోపే ఉండటం.. రాహుల్ యాత్ర తర్వాత పట్టు పెరిగిందని భావించడంతో గ్రూపులు పెరిగి కేడర్‌ను ఆందోళనకు గురి చేస్తోంది. ఎవరి ఊపు వారిదే గతంలో నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెల్చిన కాంగ్రెస్ నేత సౌదాగర్ గంగారాం ఈసారి ఎలాగైనా.. హన్మంత్ షిండేపై గెలిచి అసెంబ్లీలో మరోసారి అడుగుపెట్టాలని ఉవ్విళ్ళూరుతున్నారు. అదే సమయంలో గడుగు గంగాధర్ అనే మరో నేత కూడా జుక్కల్ టిక్కెట్ కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. తనకంటూ ఓ వర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు. రాహుల్ పాదయాత్ర సమయంలో కూడా యాక్టివ్‌గా కనిపించారు. గంగాధర్ తీరుతో సౌదాగర్ గంగారాం అలిగి పాదయాత్ర నుంచి వెళ్లిపోయారు. విషయం తెలిసి నాయకులంతా ఆయన్ను బ్రతిమిలాడి సభకు తీసుకురావడంతో కాంగ్రెస్ పార్టీలోని స్థానిక విభేదాలు మరోసారి బట్టబయలయ్యాయి. ఈ రెండు గ్రూపుల మధ్యకు ఇప్పుడు సంగారెడ్డి జిల్లాకు చెందిన లక్ష్మీకాంతరావు అనే మరో ఎన్ఆర్ఐ ప్రవేశించారు. తానూ లైన్లో ఉన్నానంటూ మీడియా సమావేశం నిర్వహించి రాహూల్ పాదయాత్రతో తాను కాంగ్రెస్ పార్టీకి ఆకర్షితుడైనట్టు ప్రకటించుకున్నారు. ఇప్పటికే ఆయన పేరు కూడా నియోజకవర్గంలో వినిపిస్తుండటంతో...ఇప్పుడు జుక్కల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ మూడు ముక్కలాట హాట్ టాపిక్‌గా మారింది. గ్రూపులు, ముఠాలు అసెంబ్లీ ఎన్నికల నాటికి రాజకీయాలు ఇంకెన్ని మలుపులు తీసుకుంటాయో తెలీని పరిస్థితుల్లో... జుక్కల్ కాంగ్రెస్‌లో ఇప్పటికే మూడు గ్రూపులు తయారయ్యాయి. నాయకులే ముఠాలు కట్టడంతో ఇక ఎక్కడికక్కడ స్థానిక, గ్రామస్థాయి కేడర్ కూడా గ్రూపులుగా విడిపోయింది. కాంగ్రెస్ పార్టీలో వచ్చిన ఈ చీలిక ఎన్నికల నాటికి ప్రత్యర్థులకు మంచి ఆయుధంగా ఉపయోగపడుతుందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీకి శత్రువులు బయట ఎక్కడో లేరు..లోపలే ఉన్నారంటూ సెటైర్లు పడుతున్నాయి. పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ feedback@sakshi.com -
బాధిత చిన్నారులను చూసి కంటతడి పెట్టిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే సింధే
నిజాంసాగర్/పిట్లం/పెద్దకొడప్గల్/బాన్సువాడ టౌన్/నిజామాబాద్ అర్బన్: అన్నాసాగర్ తండా వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన బాధిత కుటుంబాలను ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్‌సింథే అన్నారు. మంగళవారం ఆయన బాన్సువాడ, నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఆస్పత్రుల్లో చికిత్సపొందుతున్న రోడ్డు ప్రమాద బాధితులను పరామర్శించారు. ప్రమాదంలో తల్లులను కోల్పోయిన చిన్నారులను చూసి ఎమ్మెల్యే తీవ్రంగా చలించి కంటతడి పెట్టారు. చదవండి👉🏾 అయ్యో! ఎంత ఘోరం.. అనారోగ్యంతో బాబు, ఆవేదనతో తల్లి.. ప్రమాదంలో తొమ్మిది మంది మృతి చెందడం బాధాకరం అన్నారు. తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలందరి గురుకుల పాఠశాలలో చేర్పించేందుకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. మృతి చెందిన వారిలో ముగ్గురు రైతు బీమాకు అర్హులని, మిగతావారు టీఆర్ఎస్ సభ్యత్వం కల్గిన్నారని పేర్కొన్నారు. ఎమ్మెల్యే వెంట సొసైటీ చైర్మన్ హన్ముంత్‌రెడ్డి, వైస్ ఎంపీపీ లక్ష్మరెడ్డి, సర్పంచ్ రమేష్, నాయకులు లచ్చిరెడ్డి, విజయ్, రహిమతుల్లా, విజయ్, విజయ్ దేయ్, పాల్గొన్నారు. చదవండి👉🏻 చదివింపులు.. రూ. అరకోటి! -
ప్రాణం తీసిన అగ్గిపుల్ల, చూస్తుండగానే ఘోరం
నిజాంసాగర్(జుక్కల్): బీడీ కాల్చేందుకు వెలిగించిన అగ్గిపుల్ల ప్రాణాలనే తీసింది. వివరాలు ఇలా ఉన్నాయి. కామారెడ్డి జిల్లా జుక్కల్ మండల కేంద్రానికి చెందిన తాటివార్ బాలరాజ్ (35) శనివారం మధ్యాహ్నం తన చెల్లెలు సోని కిరాణా దుకాణానికి వెళ్లాడు. దుకాణంలో ముగ్గురు చిన్నపిల్లలు ఉండటంతో బాలరాజ్ పెట్రోల్ డబ్బాల పక్కన కింద కూర్చున్నాడు. అనంతరం అగ్గిపుల్ల వెలిగించి బీడీ అంటించుకున్నాడు. ఆ తర్వాత అగ్గిపుల్లను పారవేసే క్రమంలో అది పెట్రోల్ డబ్బాలపై పడటంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి బాలరాజ్‌కు అంటుకున్నాయి. మంటల్లో చిక్కుకున్న బాలరాజ్ హాహాకారాలు చేస్తూ కింద పడిపోయాడు. చుట్టుపక్కల వారు, అటు వైపు వచ్చిన వారు మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. అప్పటికే మంటలు పెద్ద ఎత్తున వ్యాపించడంతో అందరూ చూస్తుండగానే బాలరాజ్ సజీవదహనం అయ్యాడు. ప్రమాద సమయంలో కిరాణా దుకాణంలో ఉన్న పిల్లలు భయంతో బయటకు పరుగులు తీయడంతో ప్రాణాలతో బయటపడ్డారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించినట్లు ఎస్.ఐ దత్తాత్రిగౌడ్ తెలిపారు. చదవండి: యువతి కిడ్నాప్; ఆపై అత్యాచారం -
ఈసారైనా పదవొచ్చేనా?
జిల్లాలోని మారుమూల ప్రాంతంలో ఉన్న జుక్కల్ నియోజకవర్గానికి ఇప్పటివరకు అమాత్య యోగం అందని ద్రాక్షగానే ఉండిపోయింది. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా.. ఈ నియోజకవర్గంనుంచి గెలిచినవారిని పరిగణనలోకి తీసుకోవడం లేదు. ప్రస్తుత ఎమ్మెల్యే హన్మంత్ సింధే వరుసగా మూడుసార్లు గెలిచి నియోజకవర్గంలో తొలి హ్యాట్రిక్ సాధించారు. ఆయనకు మంత్రి పదవి ఇచ్చి, వెనకబడిన ప్రాంత అభివృద్ధికి సహకరించాలని ప్రజలు కోరుతున్నారు. పిట్లం: జుక్కల్ నియోజకవర్గం మహారాష్ట్ర, కర్ణాటక సరిహద్దుల్లో ఉంటుంది. ఇక్కడ మూడు రా ష్ట్ర సంస్కృతులు పరిడవిల్లుతున్నాయి. 1957లో జుక్కల్ నియోజకవర్గం ఏర్పాటైంది. తొలి ఎమ్మెల్యేగా స్వతంత్ర అభ్యర్థి మాధవరావు దేశాయి ఎన్నికయ్యారు. 1962లో కాంగ్రెస్ అభ్యర్థి నాగనాథ్రావు విజయం సాధించారు. 1967లో జరిగిన ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి విఠల్‌రెడ్డి ఎమ్మెల్యే అయ్యారు. 1972లోనూ ఈయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. 1978లో జుక్కల్‌ను ఎస్సీ రిజర్వ్డ్గా మార్చారు. సౌదాగర్ గంగారాం కాంగ్రెస్(ఐ) అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. 1983లోనూ గెలిచి వరుసగా రెండోసారి ఎమ్మెల్యే అయ్యారు. 1985లో జరిగిన ఎన్నికల్లో మాత్రం ఆయన ఓటమి పాలయ్యారు. ఈ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి పండరి ఎమ్మెల్యే అయ్యారు. 1989లో జరిగిన ఎన్నికలలో తిరిగి సౌదాగర్ గంగారాం గెలిచారు. 1994 ఎన్నికల్లో ఓటర్లు టీడీపీ అభ్యర్థి పండరిని గెలిపించారు. 1999లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన అరుణతార విజయం సాధించారు. 2004లో కాంగ్రెస్ అభ్యర్థి సౌదాగర్ గంగారాం గెలిచారు. 2009లో టీడీపీ అభ్యర్థి హన్మంత్ సింధే గెలుపొందారు. ఆయన 2014లో టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి రెండోసారి ఎమ్మెల్యే అయ్యారు. 2019లోనూ టీఆర్ఎస్ అభ్యర్థిగానే పోటీ చేసిన సింధే.. వరుసగా మూడోసారి విజయబావుటా ఎగురవేశారు. తొలి హ్యాట్రిక్.. జుక్కల్ నియోజక వర్గం ఏర్పాటైనప్పటినుంచి 14 సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. తొలి హ్యాట్రిక్ మాత్రం హన్మంత్ సింధేదే.. సౌదాగర్ గంగారాం నాలుగుసార్లు విజయం సాధించానా.. ఆయన వరుసగా మూడుసార్లు గెలుపొందలేదు. విఠల్‌రెడ్డి రెండుసార్లు మాత్రమే గెలిచారు. పండరి కూడా రెండు విజయాలే నమోదు చేశారు. హన్మంత్ సింధే మాత్రం 2009 నుంచి వరుసగా మూడుసార్లు గెలుపొందారు. ఆయన మూడు దఫాలూ 30 వేల పైచిలుకు మెజారిటీతో గెలుపొందడం గమనార్హం. 2004లో మొదటిసారి తెలుగుదేశం తరఫున పోటీ చేసిన సింధే.. 1,241 ఓట్ల తేడాతో సౌదాగర్ గంగారాం చేతిలో పరాజయం చవిచూశారు. 2009నుంచి వెనుదిరిగి చూడలేదు. 2009లో తెలుగుదేశం నుంచి రెండోసారి పోటీ చేసిన సింధే.. 34058 ఓట్ల మెజారిటీతో గంగారాంపై గెలుపొందారు. తరువాత తెలంగాణ ఉద్యమం ప్రభావంతో టీఆర్ఎస్లో చేరిన ఆయన.. 2014లో జరిగిన ఎన్నికల్లో గంగారాం సతీమణి సావిత్రిబాయిపై 35,007 వేల మెజారిటీతో విజయం సాధించారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో మరోసారి గంగారాంపై 35,624 ఓట్ల తేడాతో గెలిచారు. అవకాశం దక్కేనా? జుక్కల్ నియోజకవర్గం ఏర్పాటైన తర్వాత ఇప్పటివరకు 14 సార్లు ఎన్నికలు జరిగినా.. ఒక్కసారి కూడా మంత్రి పదవి లభించలేదు. రాష్ట్రంలో వెనకబడిన ప్రాంతం జుక్కల్ నియోజక వర్గం. ఈ నియోజకవర్గంనుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న వారికి మంత్రి పదవి ఇస్తే అభివృద్ధి చెందుతుందని ప్రజలు ఆశిస్తున్నారు. కానీ ఎప్పటికప్పుడు నిరాశే ఎదురవుతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈసారైనా సింధేకు మంత్రివర్గంలో చోటు కల్పించాలని ప్రజలు కోరుతున్నారు. -
బీజేపీలో చేరిన అరుణ తార
-
బీజేపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే
సాక్షి, కామారెడ్డి : టీఆర్ఎస్, కాంగ్రెస్‌లు రెండూ కుటుంబ ప్రయోజనాల కోసమే పని చేస్తున్నాయని, దళిత, బలహీన వర్గాలను మోసం చేశాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ధ్వజమెత్తారు. ప్రధాని నరేంద్ర మోదీ దళితుల పట్ల చూపిస్తున్న ప్రేమతో జుక్కల్ మాజీ ఎమ్మెల్యే అరుణ తారలాంటి వాళ్లు బీజేపీలో చేరుతున్నారని పేర్కొన్నారు. టీఆర్ఎస్ దళిత వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందన్నారు. బలహీన, దళితుల సంక్షేమం కోసం నరేంద్ర మోదీ పంచ సూత్రాల పేరుతో పాటు పడుతున్నారని కొనియాడారు. అంబేద్కర్‌ను పార్లమెంట్లో అడుగుపెట్టనివ్వకుండా కాంగ్రెస్ కుట్ర పన్నిందన్నారు. నెహ్రు కోసం అంబేద్కర్‌ను అవమానించారని ఆరోపించారు. 20 సంవత్సరాలుగా ప్రజా జీవితంలో ఉన్నానని అరుణ తార అన్నారు. తమలాంటి దళితులకు న్యాయం చేస్తామని, అబద్దాలు చెప్పిన పార్టీలకు బుద్ది చెప్పే రోజులు వచ్చాయని చెప్పారు. దళితులని సీఎం చెయ్యకుండా కేసీఆర్ ఎలా ప్రజల దగ్గరకు వెళ్తారని మండిపడ్డారు. కాంగ్రెస్ చెప్పే మాటలకు చేసే పనులకు పొంతన లేదన్నారు. మోదీ చేసిన మంచి పనులను చూసి బీజేపీలో చేరుతున్నాని చెప్పారు. పార్టీ తనపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని తెలిపారు. -
పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి
సాక్షి,బిచ్కుంద(జుక్కల్): టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తు న్న సంక్షేమ పథకాలు, కొత్త మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లి అభ్యర్థుల గెలుపునకు కా ర్యకర్తలు కృషి చేయాలని జ హీరాబాద్ ఎంపీ బీబీ పాటి ల్, జెడ్పీ చైర్మన్ దఫెదార్ రా జు అన్నారు. మంగళవారం బిచ్కుందలో కార్యకర్తలో స మావేశం అనంతరం విలేకరులతో మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రచార కార్యక్రమాల్లో ప్రజల నుంచి సానుకూలంగా స్పందన వస్తుందన్నారు. 60 ఏళ్లలో జరగని అభివృద్ధి నాలుగేళ్లలో జరిగిందన్నారు.రూ.17 వేల కోట్లు రైతు రుణమాఫీ చేయడం జరిగిందని టీఆర్ఎస్ కొత్త మేనిఫెస్టో అన్ని వ ర్గాల ప్రజలకు లబ్దిచేకూరే విధంగా ఉందన్నారు. అనంతరం కాంగ్రెస్ ఓబీసీ రాష్ట్ర కన్వినర్ రాజేశ్వర్ ఎంపీ బీబీ పాటిల్ సమక్షంలో టీఆర్ఎస్ పా ర్టీలో చేరారు. పదిహేడేళ్లుగా నా వెన్నంటే ఉంటు న్న కార్యకర్తలు, అభిమానుల రుణం ఎన్నటికి తీ ర్చుకోలేనిదని మాజీ ఎమ్మెల్యే హన్మంత్ సింధే అ న్నారు. మంగళవారం బిచ్కుందలో కార్యకర్తల స మావేశం నిర్వహించారు. మరోసారి అవకాశం క ల్పిస్తే బిచ్కుందలో వంద పడకల ఆస్పత్రి, జుక్క ల్, నిజాంసాగర్‌లో 30 పడకల ఆస్పత్రి, పిట్లం లో 50 పడకల ఆస్పత్రి కట్టుకోవాల్సి ఉందన్నా రు. కాళేశ్వరం నీళ్లు నిజాంసాగర్ ప్రాజెక్టులోకి వస్తున్నాయి అక్కడి నుంచి లెండి కాలువలకు అ నుసంధానం చేస్తామన్నారు. జెడ్పీ చైర్మన్ దఫే దార్ రాజు, పార్టీ జిల్లా అధ్యక్షుడు ఈగ గంగారెడ్డి, జుక్కల్, బిచ్కుంద జెడ్పీటీసీ సభ్యులు సాయిరాం, మాధవరావు దేశాయి, ఏఎంసీ చైర్మ న్లు నా ల్చర్ రాజు, వెంకట్రాంరెడ్డి, వైస్ చైర్మన్ సాయా గౌడ్, ఎంపీపీ లలిత అశోక్ పటేల్ ఉన్నారు. -
హ్యాట్రిక్ సాధ్యమయ్యేనా..!
సాక్షి,నిజాంసాగర్(జుక్కల్): కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాలకు సరిహద్దు కూడలిగా ఉన్న జుక్కల్ నియోజకవర్గంలో మూడు రాష్ట్రాల సంప్రదాయం కలగలిపి ఉంటుంది. కన్నడ, మరాఠీ, తెలుగు భాష సాంప్రదాయలతో ఈ ప్రాంత ప్రజల ప్రత్యేకత వేరు. ఈ నియోజకవర్గంలో 1952 నుంచి ఇప్పటి వరకు 14 సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. కానీ ఇప్పటికీ ఏ ఒక్కరూ ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ సాధించలేకపోయారు. గతంలో నాలుగుసార్లు కాంగ్రెస్, నాలుగు సార్లు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు విజయం సాధించినా, వరుసగా మూడు సార్లు గెలవలేదు. గత రెండు సార్వత్రిక ఎన్నికల్లో హన్మంత్ సింధే గెలుపొందారు. ప్రస్తుతం ఆయన తిరిగి ఎన్నికయితే హ్యాట్రిక్ సాధించి చరిత్ర సృష్టిస్తారు. ఆయన హ్యాట్రిక్ సాధింస్తారో లేదో తేలాలంటే డిసెంబర్ 11వ తేదీ వరకు వేచి చూడాల్సిందే. 14 సార్లు ఎన్నికలు ఏడు దశాబ్దాల చరిత్ర కలిగిన జుక్కల్ నియోజకవర్గానికి 1952 నుంచి 2014 వరకు 14 సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఇన్నేళ్లయినా అభ్యర్థులు ఎవ్వరూ హ్యాట్రిక్ సాధించలేరు. స్వతంత్ర అభ్యర్థులు నాలుగుసార్లు, కాంగ్రెస్ అభ్యర్థులు ఐదు సార్లు, తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు నాలుగుసార్లు, టీఆర్ఎస్ అభ్యర్థి ఒక్కసారి విజయం సాధించారు. కానీ ఆయా పార్టీల తరపున అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు హ్యాట్రిక్ సాధించలేరు. 1967, 1972 సంవత్సరంలో సామెల్ విఠల్‌రెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా వరుసగా రెండు సార్లు విజయం సాధించారు. అలాగే కాంగ్రెస్ అభ్యర్థిగా సౌదాగర్ గంగారాం 1978, 1983 వరుసగా రెండు సార్లు, 1989, 2004 సంవత్సరాల్లో రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. కానీ హ్యాట్రిక్ కొట్టలేకపోయారు. 1985, 1994 సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ తరపున బేగరి పండరి రెండు సార్లు గెలుపొందారు. 1999 సంవత్సరంలో టీడీపీ తరపున కుమారి అరుణతార విజయం సాధించారు. అలాగే 2009 సంవత్సరంలో టీడీపీ, 2014 సంవత్సరంలో టీఆర్ఎస్ తరపున పోటీ చేసిన హన్మంత్‌సింధే వరుసగా రెండు సార్లు చొప్పున గెలుపొందారు. ఈసారి జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున పోటీ చేస్తున్న సింధేకు హ్యాట్రిక్ చాన్స్ ఉంది. కానీ ఎన్నికల్లో టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య అసెంబ్లీ ఎన్నికల పోరు పోటాపోటీగా ఉంది. నాలుగోసారి బరిలోకి సింధే ప్రజాసేవ కోసం ఇంజినీరింగ్ ఉద్యోగానికి రాజీనామా చేసి హన్మంత్ సింధే రాజకీయాల్లోకి వచ్చారు. నీటిపారుదలశాఖలో ఉద్యోగాన్ని వదిలి రాజకీయాల్లోకి వచ్చిన హన్మంత్‌సింధే 2004 ఎన్నికల్లో టీడీపీ నుంచి జుక్కల్ అసెంబ్లీకి పోటీ చేశారు. అప్పటికే నియోజకవర్గంలో కాంగ్రెస్‌కు కేరాఫ్‌గా నిలిచిన నేత సౌదాగర్ గంగారాం మూడుసార్లు జుక్కల్ ఎమ్మెల్యేగా పనిచేశారు. 2004 సంవత్సరం ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి హన్మంత్ సింధేను కాంగ్రెస్ అభ్యర్థి సౌదాగర్ గంగారాం ఓడించారు. అప్పటి ఓటమితో గుణపాఠం నేర్చుకున్న సింధే జుక్కల్ నియోజకవర్గ ప్రజా సమస్యలపై నిరంతర పోరాటం చేశారు. దాంతో 2009 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ తరపున రెండో సారి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి సౌదాగర్ సావిత్రి బాయిపై విజయం సాధించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా హన్మంత్‌సింధే మూడోసారి ఎన్నికల బరిలో నిలిచి గెలుపొందారు. ప్రస్తుతం గెలుపొంది హ్యాట్రిక్ సాధించాలని నాలుగోసారి ఎన్నికల బరిలో నిలిచారు. -
‘గడీల పాలన కూల్చి.. రామ రాజ్యం స్థాపిద్దాం’
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రాన్ని పాకిస్తాన్లో కలపాలని చూసిన నిజాం నవాబును సీఎం కేసీఆర్ పొగుడుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డా.లక్ష్మణ్ విమర్శించారు. బీజేపీ చేపట్టిన జనచైతన్య యాత్రలో భాగంగా కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని బిచుకుంద్ద మార్కెట్లో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. కేసీఆర్ నిజాంను పొగుడుతుంటే ఆయన కూతురు కవిత అసలు తెలంగాణ భారత భూభాగమే కాదని అంటున్నారని తెలిపారు. భారత దేశంలో ఉంటు జైహింద్ అనని ఒవైసీతో కేటీఆర్ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారని మండిపడ్డారు. దేశ ద్రోహుల పాలన కావాలా.. దేశ భక్తిగల బీజేపీ పాలన కావాలా మీరే నిర్ణయించుకోండని ప్రజలకు సూచించారు. ‘పేదవాడైన ప్రధాని నరేంద్ర మోదీ అవినీతి రహిత పాలన చూసి ఓర్వలేక కేసీఆర్ కుట్ర చేస్తున్నారు. మతం, కులం పేరుతో రాజకీయాలు చేస్తూ ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుతున్నారు. ఈ గడీల రాజ్యాన్ని కూల్చీ గరిబోళ్ల రాజ్యం వచ్చేలా అందరూ సహకరించాలి. అయోధ్యలో రామమందిరం నిర్మిస్తామని చెపితే.. దానిని అడ్డుకునేందుకు కొన్ని పార్టీలు కుట్రలు చేస్తూ ప్రజల మనోభావాలను దెబ్బతీస్తున్నాయి. కేసీఆర్ ఎన్ని కుట్రలు చేసిన వచ్చే ఎన్నికల్లో విజయం సాధించి రామరాజ్యం స్థాపిస్తాం. బీజేపీ అధికారంలోకి రాగానే కౌలు రైతు చట్టాన్ని పునరుద్ధరిస్తాం. కేవలం భూస్వాములకు లబ్ధి చేకుర్చాలనే రైతు బంధు పథకం తెచ్చారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ, బీజేపీ నేతలు పాల్గొన్నారు. -
నేడు ప్రపంచ వారసత్వ దినం
జుక్కల్, న్యూస్‌లైన్: జిల్లాలోని చారిత్రక సంపదకు రక్షణ కరువైంది. దశాబ్దాల చరిత్ర కలిగిన అనేక కట్టడాలు శిథిలమవుతున్నాయి. జుక్కల్ మండలం కౌలాస్ కోటదీ ఇదే స్థితి. జుక్కల్ మండలం కౌలాస్ గ్రామం వద్ద 1544 సంవత్సరంలో కౌలాస ఖిల్లాను నిర్మించినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. బాల్ ఘాట్ పర్వతాలలో కౌలాస అనే మహాముని తపస్సు చేసిన ప్రాంతంగా పేరున్నా ఈ ఖిల్లాకు కౌలాస ఖిల్లాగా నామకరణం చేసినట్లు కథనం ఉంది. ఇది రాష్ట్ర కూటులు, కాకతీయుల కాలంలో నిర్మించినట్లు చెబుతారు. మహ్మద్‌బిన్‌తుగ్లక్ పాలనలో కూడా ఈ కోట ప్రసిద్ధి చెందింది. కాకతీయులపై అల్లాఉద్దీన్ ఖిల్జీ దండయాత్ర చేసిన తర్వాత నాలుగు భాగాలుగా విభజించబడింది. బహమణి సుల్తానుల రాజ్యంలో ఇందూరు, కౌలాస ఖిల్లాలు ఉండేవి. కుతుబ్షాహి రాజ్యంలో కౌలాస్ సర్కార్‌గా పేరు గడించింది. మహారాష్ట్రలోని నాందేడ్ ఖందార్, ముఖేడ్, బాన్సువాడ బిచ్కుంద ప్రాతాలు కౌలాస రాజ్యం ఆధీనంలో కొనసాగాయి. నాలుగవ రాష్ట్రకూట రాజు గోవిందుని కాలంలో కౌలాస ప్రాంతం గొప్ప సాంస్కృతి కేంద్రంగా విరాజిల్లింది. కౌలాస్ ఖిల్లా అనేక యుద్ధాలకు సాక్షిగా నిలిచింది. 1857లో బ్రిటిష్‌వారికి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో కౌలాస రాజ్యాన్ని పరిపాలిస్తున్న రాజా దీప్‌సింగ్ పాల్గొనట్లు చెబుతారు. మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాల సరిహద్దులో ఉన్న ఈకోటను చూడడానికి అనేక మంది పర్యాటకులు వస్తుంటారు. విలువైన శిల్ప సంపద కనుమరుగవుతండడంతో పర్యాటకుల సంఖ్య తగ్గుతూ వస్తోంది. రాతి కట్టడాలు ఖిల్లా లోపలిభాగంలో అత్యంత నైపుణ్యంతో నిర్మించిన రాతికట్టడాలు ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉండడం విశేషం. వెంకటేశ్వర మందిరం, రామ మందిరం, దుర్గా మాత మందిరాలు రాతితో నిర్మించారు. ప్రతి మందిరం వద్ద దిగుడు బావులతోపాటు ఏనుగులు స్నానాలు చేసేందుకు పెద్ద బావులను నిర్మించారు. ప్రస్తుతం ఈబావులు రాతికట్టడాలు కూలిపోయి పూడుకు పోతున్నాయి. దుర్గామాత మందిరంలోని గర్భగుడి కింద బంగారు నిధులు ఉన్నాయనే నమ్మకంతో కొందరు దుండగులు విలువైన విగ్రహాలను తొలగించి తవ్వకాలు జరిపారు. ఎంతో నైపుణ్యంతో నిర్మించిన మందిరాల చుట్టూ ముళ్ల పొదలు మొలచి ధ్వంసం అవుతున్నాయి. కోట లోపలి భాగంలో నిర్మించిన అనేక రాతి కట్టడాలలో ధాన్యాగారం, స్నానపు గదులు, రాణి గారి పట్టెపు మంచం, తదితర కట్టడాలు కూలిపోతున్నాయి. మాయమైన ఫిరంగులు పంచ లోహాలతో తయారు చేసిన అనేక ఫిరంగులు దొంగల పాలయ్యాయి. ఈ ఫిరంగుల తయారీలో బంగారాన్ని సైతం వాడిఉంటారనే నమ్మకంతో ఎత్తుకెళ్లి ఉంటారని స్థానికులు భావిస్తున్నారు. ఎక్కువ బరువుతో కూడిన కొన్ని ఫిరంగులు కోట లోపల ఉన్నాయి. అత్యంత ప్రాచీన చరిత్ర కలిగిన కౌలాస ఖిల్లాను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు పురావస్తు శాఖ అధికారులు కోటను సందర్శించారు. గతంలో జిల్లా క లెక్టరుగా పనిచేసిన అశోక్ కుమార్ కోటను సందర్శించి పర్యటక ప్రదేశంగా మార్చేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. అయినా దీనిని పరిరక్షించేందుకు ఎలాంటి నిధులు విడదల కాలేదు. ఎంతో చరిత్ర కలిగిన ఈ ఖిల్లాను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తే వారసత్వంగా వస్తున్న చారిత్రక ప్రదేశాలు పర్యాటకులు కనువిందు చేస్తాయి. -
వేటు.. వివాదం
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: కాంగ్రెస్ పార్టీలో మళ్లీ ‘బహిష్కరణ’ వివాదం చెలరేగింది. జుక్కల్ బరిలో స్వతంత్ర అభ్యర్థిగా నిలిచిన మాజీ ఎమ్మె ల్యే, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు అరుణతారను పార్టీ అధిష్టానం సస్పెండ్ చేయడం ఆ పార్టీలో దుమారం రేపుతోంది. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు జరిగిన ప్రతి సారీ జిల్లాలో కాంగ్రెస్‌కు తిరుగుబాటు అభ్యర్థుల బెడద తప్పడం లేదు. టికెట్ల కేటాయింపులో అసంతృప్తి వ్యక్తం చేస్తూ మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి స్థాయి నాయకులు పార్టీలు మారగా, జుక్కల్ నుంచి రెబల్ గా ఉన్న అరుణతారను సస్పెండ్ చేయడం వివాదాస్పదమవుతోంది. కాంగ్రెస్ పార్టీలోని రెండు గ్రూపులకు సారథ్యం వహిస్తున్న నేతలు ఒక్కొక్కరు, ఒక్కొక్కరిని వెనకేసుకు రావడం వలననే తరచూ రెబల్స్ బెడద ఎదురవుతోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. జుక్కల్ నుంచి 1999లో రెబల్‌గా పోటీ చేసి ఒకసారి, 2009 ఎన్నికల తర్వాత పార్టీ అగ్రనేతలకు వ్యతిరేకంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసి రెండోసారి బహిష్కరణకు గురైన సౌదాగర్ గంగారాంకు ఈసారి టికెట్ రావడం, పార్టీలో మహిళ విభాగానికి జిల్లా అధ్యక్షురాలుగా ఉంటూ టికెట్ ఆశించి భంగపడిన అరుణతారపై వేటు పడటం చర్చనీయాంశాలుగా మారాయి. గ్రూపుల పోరే కారణం కాంగ్రెస్ పార్టీకి రెబల్స్ బెడద.. ఆ పార్టీలో ఉన్న సీనియర్ నేతల మధ్యన నెలకొన్న గ్రూపు తగాదాలే కారణమన్న మాట వినిపిస్తోంది. పీసీసీ మాజీ చీఫ్ డి. శ్రీనివాస్, మాజీ మంత్రులు పొద్దుటూరి సుదర్శన్‌రెడ్డి, షబ్బీర్ అలీల మధ్యన సాగుతున్న వర్గ పోరు ఇందుకు ఆజ్యం పోస్తోందన్న చర్చ కూడ జరుగుతోంది. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా తాజాగా టికెట్ల గొడ వ మొదలైంది. సీట్ల కేటాయింపులలో నాయకులు పకడ్బందీగా వ్యూహం రూపొందించారన్న ప్రచారం ఉంది. పార్టీలో పనిచేసిన నేతలను పూర్తిగా విస్మరించి, ఎవరికి సంబంధించిన అనుచరులకు వారు టికెట్ ఇప్పించుకోవడంలో కృతకృత్యులు కావడం పార్టీలో అసంతృప్తికి కారణమైందని అంటు న్నారు. ఈ నేపథ్యంలోనే మాజీ మంత్రి షబ్బీర్ అలీ, జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి సురేశ్ కుమార్ షెట్కార్ కనుసన్నలలోనే బాన్సువాడ, ఎల్లారెడ్డి, జుక్కల్ నియోజకవర్గాల అభ్యర్థుల ఖరారు జరిగిందన్న చర్చ ఉంది. దీంతో ఇద్దరు నేతలపై అసంతృప్తి చెందిన నాయకులు, కార్యకర్తలు వారి దిష్టిబొమ్మలను దహనం చేశారు. టికెట్ ఆశించి భంగపడిన మాజీ ఎమ్మెల్మే జనార్దన్ గౌడ్, మాజీ మంత్రి నేరెళ్ల అంజనేయులులు ఇటీవలే టీఆర్ఎస్, బీజేపీలలో చేరారు. కాంగ్రెస్ అభ్యర్థులే లక్ష్యంగా పనిచేస్తున్నారు. కేడర్‌లో చర్చ జుక్కల్ మాజీ ఎమ్మెల్యే సౌదాగర్ గంగారాం వివాదం కాంగ్రెస్‌లో తాజా చర్చనీయాంశం అయ్యింది. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న రాజేశ్వర్‌కు 1999లో పార్టీ టికెట్ దక్కగా, సౌదాగర్ గంగారాం రెబల్‌గా బరిలోకి దిగారు. ఆ ఎన్నికలలో టీడీపీ నుంచి పోటీ చేసిన అరుణతార విజయం సాధించారు. దీంతో పార్టీకి వ్యతిరేకంగా పనిచేశారంటూ గంగారాంను ఆరేళ్లపాటు కాంగ్రెస్ అధిష్టానం సస్పెండ్ చేసింది. తదనంతరం జరిగిన పరిణామాలతో కాంగ్రెస్ టికెట్ పైనే 2004లో పోటీ చేసిన గంగారాం టీడీపీ అభ్యర్థి హన్మంత్ సిం ధేపై గెలుపొందారు. 2009లో ఆయన భార్యను బరిలో దించగా ఓటమిపాలు కావడ ంతో డి.శ్రీనివాస్ సహా పలువురు కాంగ్రెస్ సీనియర్ నాయకులపై గంగారాం వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో మరోసారి ఆరేళ్ల పాటు బహిష్కరణ వేటు వేశారు. అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు అంటిముట్టనట్లుగా ఉన్న గంగారాం ‘సార్వత్రిక’ నోటిఫికేషన్‌తో తెరపైకి రావడమే కాకుండా, టికెట్ కూడా తెచ్చుకున్నారు. దీంతో అరుణతార, రాజేశ్వర్‌కు నిరాశ తప్పలేదు. ఈ విషయంలో కొందరు సీనియర్లకు వ్యతిరేకంగా మాజీ మంత్రి షబ్బీర్, ఎంపీ అభ్యర్థి షెట్కార్ పావులు కదిపారన్న నిరసన కూడా వ్యక్తమైంది. అధిష్టానంతో బుజ్జగింపులతో రాజేశ్వర్ పోటీ యోచనను విరమించుకోగా, అరుణతార మాత్రంలో రెబల్‌గా బరిలో ఉం డాలనే నిశ్చయించుకున్నారు.ఈ క్రమంలో జిల్లాలో రానున్న రోజుల్లో పార్టీ పరిస్థితులో ఎలా ఉంటాయో తెలియక పార్టీ శ్రేణులు ఆందోళన చెందుతున్నారు. -
జుక్కల్ చౌరస్తా వద్ద ఆటో బోల్తా: నలుగురి మృతి
నిజామాబాద్: బిచ్కుందలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు దుర్మరణం చెందారు. జుక్కల్ చౌరస్తా వద్ద ఆటో ఒకటి అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి. మృతుల్లో ఇద్దరు మహిళలు, ఇద్దరు చిన్నారులు ఉన్నారు. మృతులంతా మద్నూర్ మండలం లక్ష్మాపూర్ వాసులుగా గుర్తించారు.