
సాక్షి, కామారెడ్డి : టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లు రెండూ కుటుంబ ప్రయోజనాల కోసమే పని చేస్తున్నాయని, దళిత, బలహీన వర్గాలను మోసం చేశాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ధ్వజమెత్తారు. ప్రధాని నరేంద్ర మోదీ దళితుల పట్ల చూపిస్తున్న ప్రేమతో జుక్కల్ మాజీ ఎమ్మెల్యే అరుణ తారలాంటి వాళ్లు బీజేపీలో చేరుతున్నారని పేర్కొన్నారు. టీఆర్‌ఎస్ దళిత వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందన్నారు. బలహీన, దళితుల సంక్షేమం కోసం నరేంద్ర మోదీ పంచ సూత్రాల పేరుతో పాటు పడుతున్నారని కొనియాడారు. అంబేద్కర్‌ను పార్లమెంట్‌లో అడుగుపెట్టనివ్వకుండా కాంగ్రెస్ కుట్ర పన్నిందన్నారు. నెహ్రు కోసం అంబేద్కర్‌ను అవమానించారని ఆరోపించారు.
20 సంవత్సరాలుగా ప్రజా జీవితంలో ఉన్నానని అరుణ తార అన్నారు. తమలాంటి దళితులకు న్యాయం చేస్తామని, అబద్దాలు చెప్పిన పార్టీలకు బుద్ది చెప్పే రోజులు వచ్చాయని చెప్పారు. దళితులని సీఎం చెయ్యకుండా కేసీఆర్ ఎలా ప్రజల దగ్గరకు వెళ్తారని మండిపడ్డారు. కాంగ్రెస్ చెప్పే మాటలకు చేసే పనులకు పొంతన లేదన్నారు. మోదీ చేసిన మంచి పనులను చూసి బీజేపీలో చేరుతున్నాని చెప్పారు. పార్టీ తనపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment