
సాక్షి,నిజామాబాద్: ఎమ్మెల్సీ ఎన్నికల్లో బరిలో దించేందుకు కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు లేక అరువు తెచ్చుకున్నారని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ విమర్శించారు. నిజామాబాద్‌లో ఆదివారం(ఫిబ్రవరి16) నిర్వహించిన ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో లక్ష్మణ్ మాట్లాడారు.
‘ఎమ్మెల్సీ ఎన్నికల్లో బరిలో దించేందుకు కాంగ్రెస్‌కు అభ్యర్థులు కరువయ్యారు. టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు కొమురయ్య, అంజిరెడ్డిలను గెలిపించాలి. ఎన్నికల విజయంతో రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పు సంభవించే అవకాశం ఉంది.
కులగణన పేరుతో చిచ్చు పెట్టేందుకు కుట్ర పన్నుతున్నారు. బీసీ హక్కులను,రిజర్వేషన్లను ముస్లింలకు అప్పజెప్పే పనిలో ఉన్నారు. బీఆర్ఎస్ గురించి మాట్లాడే పనిలేదు. వాళ్ల దుకాణం బంద్ అయింది.
ఎంపీ అర్వింద్ కామెంట్స్
- హిందూ రాష్ట్ర స్థాపనే నా లక్ష్యం
- ఎన్నికలు ఏవైనా..ప్రజలు బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారు
- ప్రపంచానికి దిక్సూచిగా మారిన మోదీ కులం గురించి రేవంత్ రెడ్డి మాట్లాడడం సిగ్గుచేటు
- దేశాన్ని కాపాడుకోవాలంటే బీజేపీని గెలిపించాలి
Comments
Please login to add a commentAdd a comment