‘కాంగ్రెస్‌ ఔట్‌..‌ ప్రజలు తిడుతున్నారని ఎమ్మెల్యేనే చెప్పారు’ | BJP MP Laxman Satirical Comments On Congress Party | Sakshi
Sakshi News home page

‘కాంగ్రెస్‌ ఔట్‌..‌ ప్రజలు తిడుతున్నారని ఎమ్మెల్యేనే చెప్పారు’

Jan 30 2025 5:28 PM | Updated on Jan 30 2025 6:09 PM

BJP MP Laxman Satirical Comments On Congress Party

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో కాంగ్రెస్‌ సర్కార్‌పై బీజేపీ ఎంపీ లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన గ్యారంటీలు కాంగ్రెస్ పార్టీకి ఉరితాళ్లు కాబోతున్నాయి. ఎన్నికల్లో గట్టెక్కడానికి గడ్డి తిన్నారు.. అమలు చేయమంటే ఆర్ధిక పరిస్థితి బాగా లేదని సాకులు చూపుతున్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయండి లేకపోతే అధికారం నుంచి దిగిపోవాలని ఘాటు విమర్శలు చేశారు.

రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ..‘అసెంబ్లీ స్పీకర్ హామీలను అమలు చేయమని స్వయంగా చెప్పడంతో కాంగ్రెస్ మోసపూరిత వైఖరి బహిర్గతం అయ్యింది. ఆర్ధిక పరిస్థితి తెలియక హామీలు ఇచ్చామని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ చెబుతున్నారు. ఎన్నికల్లో గట్టెక్కడానికి గడ్డి తిన్నారు.. అమలు చేయమంటే ఆర్ధిక పరిస్థితి బాగా లేదని సాకులు చూపుతున్నారు. వంద రోజుల్లో 420 హామీలు అమలు చేస్తామని విస్మరించారు.

ప్రజలు తిరగబడుతున్నారని అధికార పార్టీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అంటున్నారు. హామీలు అమలు చేయండి లేకపోతే అధికారం నుంచి దిగిపోవాలి. రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చాలా మంది రైతులను విస్మరించారు. మహిళలకు తులం బంగారం ఇస్తామన్నారు ఆ ఊసే లేదు. హామీలు ఇచ్చి మొండి చెయ్యి చూపితే బీజేపీ ఊరుకోదు.  హర్యానా, మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ మోసాలను గుర్తించి ప్రజలు తగిన గుణపాఠం చెప్పారు.

తెలంగాణలో ఓల్డ్ పెన్షన్ స్కీమ్ తీసుకువస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చింది. ఏడాది కింద ఎనిమిది వేల మంది పదవి విరమణ పొందితే.. రిటైర్‌మెంట్ బెనిఫిట్స్‌ ఇవ్వలేదు. పదవీ విరమణ పొందిన ఉద్యోగుల పరిస్థితి దుర్భరంగా ఉంది. కేసీఆర్ మూడేళ్లలో ఇస్తామని బాండ్స్ ఇచ్చారు. తాము అధికారంలోకి వస్తే తక్షణమే ఇస్తామని చెప్పి కాంగ్రెస్‌ విస్మరించింది. రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట నిలుపుకోకుండా పదవి విరమణ పొందిన ఉద్యోగులను గోస పుచ్చుకుంటున్నారు.

ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బ్రేకులు వేయాలి. బీజేపీ అభ్యర్ధులకు ఓటు వేసి గెలిపించండి.. మీ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తాం. కామారెడ్డి డిక్లరేషన్‌లో ప్రకటించినట్లు బీసీలకు 42శాతం రిజర్వేషన్లు ఇచ్చి ఎన్నికలకు వెళ్లాలి. స్థానిక సంస్థల ఎన్నికలకు సంసిద్ధంగా ఉన్నాం’ అంటూ వ్యాఖ్యలు చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement