టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లు రెండూ కుటుంబ ప్రయోజనాల కోసమే పని చేస్తున్నాయని, దళిత, బలహీన వర్గాలను మోసం చేశాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ధ్వజమెత్తారు. ప్రధాని నరేంద్ర మోదీ దళితుల పట్ల చూపిస్తున్న ప్రేమతో జుక్కల్ మాజీ ఎమ్మెల్యే అరుణ తారలాంటి వాళ్లు బీజేపీలో చేరుతున్నారని పేర్కొన్నారు. టీఆర్‌ఎస్ దళిత వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందన్నారు.