బిచ్కుందలో మాట్లాడుతున్న ఎంపీ బీబీ పాటిల్
సాక్షి,బిచ్కుంద(జుక్కల్): టీఆర్‌ఎస్ ప్రభుత్వం అమలు చేస్తు న్న సంక్షేమ పథకాలు, కొత్త మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లి అభ్యర్థుల గెలుపునకు కా ర్యకర్తలు కృషి చేయాలని జ హీరాబాద్ ఎంపీ బీబీ పాటి ల్, జెడ్పీ చైర్మన్ దఫెదార్ రా జు అన్నారు. మంగళవారం బిచ్కుందలో కార్యకర్తలో స మావేశం అనంతరం విలేకరులతో మాట్లాడుతూ టీఆర్‌ఎస్ ప్రచార కార్యక్రమాల్లో ప్రజల నుంచి సానుకూలంగా స్పందన వస్తుందన్నారు. 60 ఏళ్లలో జరగని అభివృద్ధి నాలుగేళ్లలో జరిగిందన్నారు.రూ.17 వేల కోట్లు రైతు రుణమాఫీ చేయడం జరిగిందని టీఆర్‌ఎస్ కొత్త మేనిఫెస్టో అన్ని వ ర్గాల ప్రజలకు లబ్దిచేకూరే విధంగా ఉందన్నారు.
అనంతరం కాంగ్రెస్ ఓబీసీ రాష్ట్ర కన్వినర్ రాజేశ్వర్ ఎంపీ బీబీ పాటిల్ సమక్షంలో టీఆర్‌ఎస్ పా ర్టీలో చేరారు. పదిహేడేళ్లుగా నా వెన్నంటే ఉంటు న్న కార్యకర్తలు, అభిమానుల రుణం ఎన్నటికి తీ ర్చుకోలేనిదని మాజీ ఎమ్మెల్యే హన్మంత్ సింధే అ న్నారు. మంగళవారం బిచ్కుందలో కార్యకర్తల స మావేశం నిర్వహించారు. మరోసారి అవకాశం క ల్పిస్తే బిచ్కుందలో వంద పడకల ఆస్పత్రి, జుక్క ల్, నిజాంసాగర్‌లో 30 పడకల ఆస్పత్రి, పిట్లం లో 50 పడకల ఆస్పత్రి కట్టుకోవాల్సి ఉందన్నా రు. కాళేశ్వరం నీళ్లు నిజాంసాగర్ ప్రాజెక్టులోకి వస్తున్నాయి అక్కడి నుంచి లెండి కాలువలకు అ నుసంధానం చేస్తామన్నారు. జెడ్పీ చైర్మన్ దఫే దార్ రాజు, పార్టీ జిల్లా అధ్యక్షుడు ఈగ గంగారెడ్డి, జుక్కల్, బిచ్కుంద జెడ్పీటీసీ సభ్యులు సాయిరాం, మాధవరావు దేశాయి, ఏఎంసీ చైర్మ న్లు నా ల్చర్ రాజు, వెంకట్‌రాంరెడ్డి, వైస్ చైర్మన్ సాయా గౌడ్, ఎంపీపీ లలిత అశోక్ పటేల్ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment