సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అసెంబ్లీ ఎన్నికల్లో రెండు చోట్ల నుంచి అసెంబ్లీకి పోటీ చేయనున్నారు. సిట్టింగ్ నియోజకవర్గం గజ్వేల్‌తో పాటు కామారెడ్డి నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు. అయితే ఈ నిర్ణయం వెనుక కారణం గురించి మీడియా ఆయన్ని ప్రశ్నించగా.. తనదైన స్టైల్‌లో స్పందించారాయన.
పార్టీ నిర్ణయించింది కాబట్టే తాను రెండు చోట్ల నుంచి పోటీ చేస్తున్నట్లు తెలిపారాయన. ‘‘కేసీఆర్ చరిత్ర మీకు తెల్వదు. కరీంనగర్, రివర్స్‌ల మహబూబ్ నగర్ నుంచి ఎంపీగా పోటీ చేసి గెలిచా. కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్, నిజామాబాద్ జిల్లా నుంచి మంత్రి నన్ను వ్యక్తిగతంగా కోరారు. వాళ్లే కాదు.. ఇంకొన్ని జిల్లాల వాళ్లు కూడా అడిగారు. చివరగా పార్టీ సంప్రదింపులతో కామారెడ్డి ఫిక్స్ అయ్యాం. అంతేగానీ.. ఇందులో ఏం ప్రత్యేకత లేదు అని తెలిపారాయన.
Comments
Please login to add a commentAdd a comment