Gajwel
-
గజ్వేల్ లో డబుల్ బెడ్రూం లబ్ధిదారుల ఆందోళన
-
TG: హిట్ అండ్ రన్.. ఇద్దరు కానిస్టేబుల్స్ మృతి
సాక్షి, గజ్వేల్: తెలంగాణలో మరో హిట్ అండ్ రన్ కేసు వెలుగు చూసింది. ఈ ప్రమాదంలో ఇద్దరు కానిస్టేబుల్స్ మృతి చెందారు. మృతిచెందిన కానిస్టేబుళ్లను పరందాములు, వెంకటేశ్‌గా గుర్తించారు.వివరాల ప్రకారం.. సిద్దిపేట-జాలిగామ బైపాస్‌లో ఆదివారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో ఇద్దరు కానిస్టేబుళ్లు మృతిచెందారు. ఈ ప్రమాదంలో మృతిచెందిన కానిస్టేబుళ్లను పరందాములు, వెంకటేశ్‌గా గుర్తించారు. వీరిలో పరందాములు రాయపోలు పీఎస్‌లో, వెంకటేశ్ దౌల్తాబాద్ పీఎస్‌లో విధులు నిర్వహిస్తున్నారు. అయితే, వీరిద్దరూ మారధాన్ కోసం వెళ్తున్నట్టు తెలిసింది. -
స్పీడ్ తక్కువ.. సమయం ఎక్కువ
గజ్వేల్: మనోహరాబాద్ మీదుగా సిద్దిపేటకు వచ్చే రైలు స్పీడ్ తక్కువగా ఉండటం, ప్రయాణానికి సమయం ఎక్కువ తీసుకోవడంతో ఈ రైలు ఎక్కేందుకు ప్రయాణికులు పెద్ద ఆసక్తిగా చూపడం లేదు. సిద్దిపేట నుంచి సికింద్రాబాద్‌కు వెళ్లడానికి రైలులో మూడున్నర నుంచి నాలుగు గంటల వరకు సమయం పడితే...బస్సులో అయితే సుమారు రెండు గంటల సమయమే పడుతోంది. దీంతో మనోహరాబాద్–గజ్వేల్–సిద్దిపేట మార్గంలో ప్రయాణికులు లేక రైలు వెలవెలబోతోంది. 8 బోగీలతో నడుస్తున్న ఈ రైలులో ఒకటి గార్డు, ఇతర అవసరాలుపోగా, ఏడింటిలో మొత్తంగా ఒక్క ట్రిప్పులో 644 మంది ప్రయాణం చేయొచ్చు. రోజుకూ రెండు అప్ అండ్ డౌన్ ట్రిప్పులు నడుస్తున్నా, వందమందికి మించి ప్రయాణించడం లేదు. రైలు వేగం కేవలం 60 కిలోమీటర్లకే పరిమితమై సికింద్రాబాద్ వరకు ప్రయాణ సమయం 4 గంటలు పట్టడమే ఇందుకు ప్రధాన కారణం. మనోహరాబాద్ టు కొత్తపల్లి మెదక్ జిల్లా మనోహరాబాద్ నుంచి కొత్తపల్లి వరకు 151.36 కిలోమీటర్ల పొడవున ఈ న్యూబ్రాడ్‌గేజ్ లైన్ నిర్మాణం జరుగుతుండగా, రూ. 1160.47 కోట్లు వెచి్చస్తున్నారు. 2017లో ఈ పనులు ప్రారంభమయ్యాయి. ఈ లైన్ సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి మనోహరాబాద్ మీదుగా కొత్తపల్లి వరకు, అక్కడి నుంచి పెద్దపల్లి గ్రాండ్ ట్రంక్ లైన్‌తో అనుసంధానం కానుంది. ఫలితంగా ఈ లైన్ హైదరాబాద్, న్యూఢిల్లీ, కోల్కత్తా లాంటి మహానగరాలను కలుపుతూ జాతీయ లైన్‌గా ఆవిర్భవించనున్నది. మనోహరాబాద్– కొత్తపల్లి రైల్వేలై¯Œన్ పూర్తయితే.. ప్రయాణికులకు దూరభారం తగ్గుతుంది. మొత్తానికి ఈలైన్తో ఉత్తర తెలంగాణలోని సిద్దిపేట జిల్లాతో పాటు మెదక్, సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాలకు భారీ ప్రయోజనం చేకూరుతుంది. రోజుకు రెండు అప్ అండ్ డౌన్ ట్రిప్పులు ప్రతి బుధవారం మినహా మిగిలిన ఆరు రోజుల్లో ప్యాసింజర్ రైలు రోజుకూ రెండు అప్ అండ్ డౌన్ టిప్పులు నడుస్తోంది. ఉదయం 6.45 గంటలకు సిద్దిపేటలో బయలుదేరి.. దుద్దెడ, లకుడారం, కొడకండ్ల, గజ్వేల్, అప్పాయిపల్లి, నాచారం, మేడ్చల్, బొల్లారం, కవల్రీ బ్యారేక్స్(అల్వాల్), మల్కాజిగిరి, సికింద్రాబాద్ వరకు ఉదయం 10.15 గంటలకు చేరుకుంటోంది. తిరిగి సికింద్రాబాద్ నుంచి ఉదయం 10.35 గంటలకు బయలుదేరి సిద్దిపేటకు మధ్యాహ్నం 1.45 నిమిషాలకు చేరుతుంది. అన్నీ సజావుగా సాగితే సిద్దిపేట నుంచి సికింద్రాబాద్‌కు వెళ్లాలన్నా అక్కడి నుంచి సిద్దిపేటకు రావాలన్నా 3.30 గంటల ప్రయాణం తప్పదు. కానీ ట్రైన్ లేటయినా, సిగ్నల్స్ సమస్య ఉత్సన్నమైనా ఆలస్యం అవుతోంది. సిద్దిపేట నుంచి సికింద్రాబాద్‌కు బస్సులో వెళితే కేవలం 2 గంటల సమయయే పడుతుంది. ఈ కారణం వల్ల ఈ రైలుపై ఆసక్తి చూపడంలేదు. మనోహరాబాద్ టు సికింద్రాబాద్ వరకు రద్దీ..: ఇదే రైలు మనోహరాబాద్ స్టేషన్ వెళ్లగానే అక్కడి నుంచి సికింద్రాబాద్‌కు 100 కిలోమీటర్ల వేగంతో వెళుతుండగా, ఈ మార్గంలో రద్దీ భారీగానే ఉంటుంది. కేవలం మనోహరాబాద్ నుంచి సిద్దిపేట వరకు మాత్రమే అతి తక్కువ ప్రయాణికులతో వెళుతోంది. ప్రస్తుతం సిద్దిపేట నుంచి సికింద్రాబాద్ వరకు 117 కిలోమీటర్లు ప్రయాణిస్తున్న రైలు మనోహరాబాద్ వరకు 74 కిలోమీటర్లు అతి తక్కువ ప్రయాణికులతో, ఆ తర్వాత మనోహారాబాద్ నుంచి సికింద్రాబాద్వరకు 43 కిలోమీటర్లు రద్దీగా వెళుతోంది. ఇదే మార్గంలో గజ్వేల్ వరకు 2022 జూన్ 27న రైల్వేశాఖ గూడ్స్ రైలు సేవలను దక్షిణ మధ్య రైల్వేశాఖ రేక్ పాయింట్ కోసం ప్రారంభించింది. దీని ద్వారా రైల్వేశాఖకు మంచి ఆదాయం కూడా సమకూరుతోంది. స్పీడ్ పెరిగితేనే మెరుగు.. మనోహరాబాద్–గజ్వేల్–సిద్దిపేట మార్గంలో వేగం తక్కువగా ఉండటం వల్ల సమయం ఎక్కువగా పడుతుంది. ఇక్కడి నుంచి సికింద్రాబాద్ వెళ్లడానికి ప్రయాణికులు కొంత వెనుకంజ వేస్తున్నట్టు తెలుస్తుంది. త్వరలోనే ఈ లైన్ స్పీడ్ పెరిగి, ప్రయాణానికి సమయం తగ్గనుంది. దీని ద్వారా ప్రయాణికుల సంఖ్య కూడా పెరగుతుంది. కొత్తపల్లి వరకు లింకు పూర్తయితే ఇక భారీగా పుంజుకుంటుంది. – దక్షిణ మధ్య రైల్వే ఇంజినీర్ జనార్దన్ -
గజ్వేల్ ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేసిన కేసీఆర్
-
ఎమ్మెల్యేగా రేపు కేసీఆర్ ప్రమాణ స్వీకారం
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ గురువారం గజ్వేల్ ఎమ్మెల్యేగా ప్రమాణం చేయనున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారం చేపట్టిన రెండో రోజే కేసీఆర్ బాత్రూంలో జారి పడంతో ఆయన తుంటి విరిగిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో కేసీఆర్‌కు శస్త్ర చికిత్స జరిగింది. అనంతరం డాక్టర్ల సూచన మేరకు కేసీఆర్ గత కొంతకాలంగా విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇటీవల కర్ర సాయంతో నడవగలుగుతున్నారు. ఈ క్రమంలో అసంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సమక్షంలో రేపు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరినీ ఆహ్వానించారు. ఎమ్మెల్యేగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం నేపథ్యంలో పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీకి తరలిరానుండటంతో అసెంబ్లీ వర్గాలు భద్రతా ఏర్పాట్లపై దృష్టి సారించాయి. -
ఆటా ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంప్
-
టీటీఏ సేవా డేస్.. గజ్వేల్ లో ట్రై సైకిల్ లు పంపిణీ
తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ టీటీఏ సేవా డేస్ కార్యక్రమాలు తెలంగాణలో దిగ్విజయంగా కొనసాగుతున్నాయి. ఈ సేవా డేస్‌లో భాగంగా ఐదవ రోజు సిద్దిపేట జిల్లాలో పర్యటించిన టీటీఏ బృందం.. గజ్వేల్ లో పలు సేవా కార్యక్రమాలు చేపట్టింది. ఇందులో భాగంగా దివ్యాంగులకు ట్రై సైకిల్ లు పంపిణీ చేశారు. సేవా డేస్ కో ఆర్డినేటర్ సురేష్ రెడ్డి వెంకన్నగారి, విజేంద్ర భాష, రోటరి క్లబ్ ఖమ్మంతో వారి సహాయంతో పాటు దాతాల సహకారంతో ట్రై సైకిల్, వీల్ చైర్లు పంపిణీ చేసినట్లు టీటీఏ టీమ్ తెలిపింది. అలాగే అవసరమైన వారికి కృత్రిమ అవయవాలకు ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. టీటీఏ ప్రెసిడెంట్ వంశీరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం విజయవంతం అవటం పట్ల పలువురు ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొని అండగా నిలిచిన ప్రతిఒక్కరికీ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. ఇక ఈ కార్యక్రమానికి సహాకరించిన దాతలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. టీటీఏ చేస్తున్న ఈ సేవాకార్యక్రమాలను పలువురు కొనియడారు. (చదవండి: అట్టహాసంగా టీటీఏ మొదటి రోజు మెడికల్ క్యాంపు) -
గజ్వేల్ ఓటమితో ఇంకా కసి పెరిగింది: ఈటల రాజేందర్
సాక్షి, గజ్వేల్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గజ్వేల్ నియోజకవర్గంలో ఓటమి.. తనలో ఇంకా కసి పెంచిందని మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ అన్నారు. ఆయన గురువారం గజ్వేల్ నియోజకవర్గం బీజేపీ ముఖ్య కార్యకర్తలతో భేటీ అయ్యారు. ఈ భేటీలో ఈటల రాజేందర్ తన ఓటమిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గజ్వేల్‌లో డబ్బు, మద్యం పంపిణీ చేసి మాజీ సీఎం కేసీఆర్ గెలిచారని ఆరోపించారు. గజ్వేల్‌లో తక్కువ సమయంలోనే ఎక్కువ ఓట్లు సాధించానని తెలిపారు. గజ్వేల్‌లో నైతికంగా బీజేపీ గెలిచిందని పేర్కొన్నారు. కేసీఆర్ ప్రజలను నమ్ముకున్న నాయకుడు కాదని మండిపడ్డారు. స్థానిక నేతలను భారీ మొత్తానికి కొని కేసీఆర్.. గజ్వేల్‌లో గెలిచారని ఆరోపించారు. విద్యార్థి దశ నుంచి ఇప్పటివరకు తనకు ఓటమి తెలియదని అన్నారు. గజ్వేల్‌లో ఓటమి తనలో ఇంకా కసి పెంచిందని రాజేందర్ తెలిపారు. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో రెండు చోట్ల టిక్కెట్ దక్కించుకున్న ఈటల రాజేందర్.. ఆ రెండు చోట్ల ఓడిపోవడం గమనార్హం. గజ్వేల్‌లో మాజీ సీఎం కేసీర్ చేతిలో ఓడిపోగా.. తనకు కంచుకోట లాంటి హుజురాబాద్‌లో బీఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్‌రెడ్డి చేతిలో పరాజయం పాలైన విషయం తెలిసిందే. చదవండి: ఉన్న వనరుల్నే వాడుకుంటాం : సీఎం రేవంత్ -
గజ్వేల్ ఫలితాలపై ఉత్కంఠ
-
చివరి ప్రచార సభలో కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు..!
సాక్షి, గజ్వేల్ : ‘నరేంద్రమోదీ దేశం మొత్తం 157 మెడికల్ కాలేజీలు పెట్టాడు. నేను 100సార్లు అడిగితే కూడా తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజీ ఇవ్వలేదు. జిల్లాకో నవోదయ పాఠశాల ఇవ్వాలని చట్టంలో ఉన్నా ఒక్కటి కూడా ఇయ్యలే. ఇలాంటి బీజేపీకి ఒక్క ఓటు కూడా ఎందుకెయ్యాలి. మనమేమన్న పిచ్చిపోషి గాళ్లమా..మనం గొర్రెలం కాదని 30వ తేదీ నిరూపించాలి. మన మీద కుట్రలు చేసే కేంద్ర ప్రభుత్వానికి ఎందుకు ఓటేయాలో ఆలోచించాలి. ఏమియ్యకున్నా ఓటేస్తే మనల్ని గొర్రెలే అనుకుంటారు’ అని బీఆర్ఎస్ చీఫ్, సీఎం కేసీఆర్ గజ్వేల్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గజ్వేల్‌లో జరిగిన చివరి ప్రచార సభలో ఆయన మాట్లాడారు. ‘కాంగ్రెస్ గెలిచేది లేదు సచ్చేది లేదు. ఒకవేళ గెలిస్తే ఇందిరమ్మ రాజ్యం తెస్తామంటున్నరు. ఆకలి చావుల ఇందిరమ్మ రాజ్యం ఎవరికి కావాలి. నెహ్రూ, ఇందిర పాలనలో మంచి పనులు చేస్తే దళితులు ఇంకా ఇలా ఎందుకు ఉన్నారు కాంగ్రెస్ వస్తే ఆకలిచావులే. రైతుబంధు దుబారా అని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతున్నడు. రైతులకు 3 గంటల కరెంట్ చాలని పీసీసీ అధ్యక్షుడంటున్నడు. 3 గంటల కరెంట్ కావాల్నా..24 గంటల కరెంట్ కావాల్నా’ అని కేసీఆర్ కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు. ‘ఫిబ్రవరి నెల వస్తే నాకు 70 ఏళ్లు వస్తాయి. తెలంగాణ తెచ్చిన కీర్తి నాకు చాలు. పదవులు వద్దు. ఇప్పటికే పదేళ్లు ముఖ్యమంత్రిగా చేశాను. తెలంగాణ నెంబర్ వన్ కావాలన్నదే నా లక్ష్యం. ఈసారి బీఆర్ఎస్ గెలిస్తే గజ్వేల్ నియోజకవర్గంలో అందరికీ దళితబంధు ఇస్తాం. గజ్వేల్‌లో రెండుసార్లు గెలిపించారు. ఈసారి మళ్లీ ఆశీర్వదించండి. గజ్వేల్‌కు ఐటీ టవర్లు తెచ్చిపెట్టే బాధ్యత నాది. మల్లన్నసాగర్ ముంపు బాధితులకు కాలుష్య రహిత పరిశ్రమలు తీసుకువచ్చి ఉద్యోగాలు కల్పిస్తా. వారికి త్యాగం వెలకట్టలేనిది. వారికి నా కృతజ్ఞతలు. ట్రిపుల్ ఆర్ పూర్తయితే గజ్వేల్ దశ మారిపోతుంది’అని కేసీఆర్ తెలిపారు. ఇదీచదవండి..తెలంగాణ ఓటర్లకు సోనియాగాంధీ భావోద్వేగ సందేశం -
ఢీ అంటే ఢీ అంటున్న కేసీఆర్, రేవంత్ రెడ్డి
-
కేసీఆర్‌ను కాదని పనిచేసే సత్తా హరీష్‌రావుకు ఉందా?: ఈటల
సాక్షి, సిద్ధిపేట: సీఎం కేసీఆర్‌పై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ నిప్పులు చెరిగారు. కేసీఆర్ అనుమతి లేకుండ చీమ కూడా చిటుక్కుమనదని ధ్వజమెత్తారు. గతంలో తాను ఆర్ధిక మంత్రిగా ఉన్నా సొంత ఇర్ణయాలు తీసుకునే అవకాశం లేదని తెలిపారు. కేసీఆర్‌ను కాదని పనిచేసే సత్తా ప్రస్తుత ఆర్థికశాఖ మంత్రి హరీష్‌రావుకు ఉందా అని ప్రశ్నించారు. ఈ మేరకు గజ్వేల్ నియోజకవర్గం కుకునూర్‌పల్లి మండలం లకుడారంలో ఈటల రాజేందర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ మంత్రులంతా అతని బానిసలని, స్వతంత్రంగా పనిచేయలేరని మండిపడ్డారు. కేసీఆర్‌ను కాదని ఏ మంత్రి కూడా నిర్ణయాలు తీసుకోలేరని అన్నారు. కాగా హుజూరాబాద్ ఎమ్మెల్యే అయిన ఈటల రాజేందర్ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రెండు చోట్ల బరిలో నిలిచిన విషయం తెలిసిందే. హుజూరాబాద్‌తో పాటు గజ్వేల్ గడ్డ మీద సీఎం కేసీఆర్‌పై పోటీకి నిలబడ్డారు. ఇక్కడ మూడోసారి పోటీ చేస్తున్న కేసీఆర్ అభివృద్ధి మంత్రంతో హ్యాట్రిక్ ధీమాతో ఉండగా, ఈటల బీసీ నినాదంతో బరిలోకి దిగారు. మరోవైపు కేసీఆర్ గజ్వేల్‌తో పాటు కామారెడ్డిలో పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. కామారెడ్డిలో కేసీఆర్‌పై రేవంత్ రెడ్డి పోటీ చేస్తున్నారు. చదవండి: ప్రచార వాహనంపై స్పృహతప్పిన ఎమ్మెల్సీ కవిత -
ఆ ఏడు స్థానాల్లో అదనపు బ్యాలెట్ యూనిట్లు
సాక్షి, హైదరాబాద్, సాక్షి, సిద్దిపేట/గజ్వేల్: సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్న రెండు నియోజకవర్గాలతో పాటు మరో అయిదు సెగ్మెంట్లలో అభ్యర్ధులు లెక్కకి మించి ఉండటంతో అదనపు బ్యాలెట్ యూనిట్లను అమర్చి పోలింగ్ నిర్వహించాల్సిన పరిస్థితి నెలకొంది. కేసీఆర్ గజ్వేల్, కామారెడ్డి శాసనసభ నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తుండగా, బుధవారం నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసిన తర్వాత గజ్వేల్ నుంచి 44 మంది, కామారెడ్డి నుంచి 39 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. దీంతో ఈ రెండు శాసనసభ నియోజకవర్గాల్లో పోలింగ్ రోజు వినియోగించనున్న ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల(ఈవీఎం)కు మూడు చొప్పున బ్యాలెట్ యూనిట్లను అమర్చి పోలింగ్ నిర్వహించనున్నారు. ఈవీఎంలకు మూడు బ్యాలెట్ యూనిట్లు ఒక ఈవీఎంలో కంట్రోల్ యూనిట్, బ్యాలెట్ యూనిట్, వీవీ ప్యాట్ అనే మూడు ప్రధాన విభాగాలుంటాయి. ఒక బ్యాలెట్ యూనిట్‌పై నోటాతో సహా 16 మంది అభ్యర్థుల పేర్లు, ఎన్నికల గుర్తు, ఫోటో ఉంటాయి. నియోజకవర్గంలో 16 మందికి మించి అభ్యర్థులు పోటీ చేస్తే ఒకటికి మించి బ్యాలెట్ యూనిట్లను వాడాల్సి ఉంటుంది. నోటాతో కలిపి అభ్యర్థుల సంఖ్య 17 నుంచి 32లోపు ఉంటే రెండు బ్యాలెట్ యూనిట్లు, 33 నుంచి 48లోపు ఉంటే మూడు బ్యాలెట్ యూనిట్లను వినియోగించక తప్పదు. దీంతో గజ్వేల్, కామారెడ్డిలో వినియోగించనున్న ఈవీఎంలకు మూడు చొప్పున బ్యాలెట్ యూనిట్లను అమర్చి పోలింగ్ నిర్వహించనున్నారు. ‘ఎం3’రకం ఈవీఎంల వినియోగం 2013 నుంచి అందుబాటులోకి వచ్చిన ‘ఎం3’రకం ఈవీఎంలను రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో వినియోగిస్తున్నారు. ఒక కంట్రోల్ యూనిట్‌కు వీవీ ప్యాట్‌తో పాటు గరిష్టంగా 24 బ్యాలెట్ యూనిట్లను అనుసంధానం చేసి ఒక ఈవీఎంను తయారు చేయవచ్చు. దీంతో ఒకే ఈవీఎం ఆధారంగా గరిష్టంగా 384 అభ్యర్థులకు పోలింగ్ నిర్వహించవచ్చు. 384 మందికి లోపు అభ్యర్థులు పోటీ చేస్తే ఒకే కంట్రోల్ యూనిట్‌కు అవసరమైన సంఖ్యలో బ్యాలెట్ యూనిట్లను అమర్చనున్నారు. అయితే, అభ్యర్థుల సంఖ్య 384కు మించితే రెండో కంట్రోల్ యూనిట్‌ను వినియోగించక తప్పదు. 2006 నుంచి 2013 వరకు జరిగిన ఎన్నికల్లో ‘ఎం2’రకం ఈవీఎంలను ఎన్నికల సంఘం వినియోగించింది. ఆ తర్వాత నుంచి జరుగుతున్న ఎన్నికల్లో ‘ఎం3’రకం ఈవీఎంలను వాడుతోంది. ఒక ఈవీఎం గరిష్టంగా 2వేల ఓట్లను నమోదు చేయగల సామరŠాధ్యన్ని కలిగి ఉండనుంది. సాధారణంగా 1500 ఓట్లకు మించి ఒక పోలింగ్ కేంద్రానికి ఓట్లను కేటాయించరు. ఓటర్లు కన్ఫ్యూజ్ అవుతారేమోనని పార్టీల ఆందోళన సోమవారంతో ముగిసిన నామినేషన్ల పరిశీలన అనంతరం గజ్వేల్‌లో 114 మంది బరిలో ఉండగా, బుధవారం 70 మంది అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. కామారెడ్డిలో నామినేషన్ల పరిశీలన అనంతరం 58 మంది అభ్యర్థులు బరిలో నిలవగా, 19 మంది అభ్యర్థులు నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. చివరకు గజ్వేల్ నుంచి మొత్తం 44 మంది, కామారెడ్డి నుంచి మొత్తం 39 మంది పోటీ చేస్తుండగా, రెండు చోట్లలో కూడా మూడు బ్యాలెట్ యూనిట్లతో పోలింగ్ నిర్వహించనుండడంతో ఓటర్లు కొంత గందరగోళానికి గురయ్యే ప్రమాదముందని రాజకీయ పార్టీలు ఆందోళనకు గురి అవుతున్నాయి. మరో 5 చోట్ల సైతం... ఎల్బీనగర్లో 38 మంది, శేరిలింగంపల్లిలో 33 మంది అభ్యర్థులు బరిలో మిగలడంతో అక్కడ సైతం 3 బ్యాలెట్ యూనిట్లను వినియోగించనున్నారు. ఇబ్రహీంపట్నంలో 28 మంది, మహేశ్వరంలో 27 మంది, రాజేంద్రనగర్‌లో 25 మంది అభ్యర్థులు మిగలడంతో ఈ చోట్లలో రెండు బ్యాలెట్ యూనిట్లతో పోలింగ్ జరపనున్నారు. -
గజ్వేల్ లో అధిక నామినేషన్లు..టార్గెట్ కేసీఆర్..
-
రసవత్తరంగా కామారెడ్డి, గజ్వేల్ పోరు
-
ఫెంటాస్టిక్ ఫోర్ పవర్ పోరు
అవి తెలంగాణకు నాలుగు దిక్కుల్లో ఉన్న శాసనసభ నియోజకవర్గాలు. కులాలు, మతాలతోపాటు ఆర్థికంగా, సామాజికంగా ఎంతో వైరుధ్యం ఉన్న ప్రాంతాలు. కానీ ఎన్నికలొచ్చినప్పుడు మాత్రం ఒక్కటిగానే ఆలోచిస్తున్నాయి. ఒకరికొకరు కూడబలుక్కున్నట్టుగా తీర్పునిస్తున్నాయి. అంతేకాదు 1952 నుంచి 2018 వరకు జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఒక్కసారి మినహాయిస్తే.. మిగిలిన అన్ని ఎన్నికల్లో ఇక్కడ గెలిచిన పార్టీయే రాష్ట్రంలో అధికారం చేపట్టింది. ఇక్కడ గెలిస్తే రాష్ట్రంలో అధికారం ఖాయమన్న సెంటిమెంట్‌కు అచ్చంపేట, అందోల్, సికింద్రాబాద్, గజ్వేల్ నియోజకవర్గాలు ప్రాతిపదికగా నిలిచాయి. దీంతో ఈసారి కూడా అందరి చూపు ఈ నాలుగు నియోజకవర్గాలపైనే కేంద్రీ కృతమైంది. ఏడు దశాబ్దాల సెంటిమెంట్‌ను బ్రేక్ చేస్తాయా? ఆనవాయితీకే పట్టం కడతాయా? అనేది ఆసక్తికరంగా మారింది. ‘అచ్చం’ అదే ట్రెండ్... నల్లమల అడవిని ఆనుకుని ఉన్న అచ్చంపేట నియోజకవర్గం పూర్తిగా వ్యవసాయం, దాని అనుబంధ ఆదాయాలపైనే ఆధారపడిన ప్రాంతం. అత్యధికంగా ఎస్సీ, ఎస్టీలు ఉన్న ఈ సెగ్మెంట్లో అక్షరాస్యులు తక్కువే. నాగర్‌కర్నూల్ ద్విసభ నియోజకవర్గం నుంచి వేరుపడి 1962లో అచ్చంపేటగా ఏర్పడిన అనంతరం 2018 వరకు 13 సార్లు ఎన్నిక జరిగితే. 2009లో ఒక్కమారు మినహా, మిగిలిన అన్ని సందర్భాల్లోనూ ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచిన అభ్యర్థి పార్టీయే రాష్ట్రంలో అధికారం చేపట్టడం గమనార్హం. పి.మహేంద్రనాథ్ 1972లో కాంగ్రెస్, 1983, 85లలో టీడీపీ అభ్యర్థిగా విజయం సాధించి ఎన్టీఆర్ కేబినెట్లో కీలక పదవులు నిర్వహించారు. 2009లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ఇక్కడ మాత్రం టీడీపీ అభ్యర్థి పి.రాములు తన సమీప ప్రత్యర్థి డాక్టర్ వంశీకృష్ణపై 4,831 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఈ నియోజకవర్గానికి మరో ప్రత్యేకత కూడా ఉంది. ఒక అభ్యర్థి, ఒక పార్టీ నుంచి రెండుమార్లు కంటే ఎక్కువగా గెలవకపోవడం. సికింద్రాబాద్..గెలిస్తే జిందాబాదే ఆంగ్లో ఇండియన్లకు తోడు తమిళ, మలయాళీలు, పక్కా తెలంగాణ మూలాలున్న అడ్డా కూలీలతో నిండిపోయిన సికింద్రాబాద్ తీర్పు సైతం ఎప్పుడూ ప్రత్యేకమే. 1952 –2018 వరకు 15 సార్లు సాధారణ ఎన్నికలు జరిగితే 14 మార్లు.. ఇక్కడ ఏ పార్టీ కూటమి గెలిస్తే.. అదే పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. 1978లో మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్(ఐ) 175 స్థానాల్లో విజయం సాధించి అధికారం చేపట్టినా.. ఇక్కడ మాత్రం జనతా పార్టీ అభ్యర్థిగా పోటీచేసిన ఎల్.నారాయణ, తన సమీప కాంగ్రెస్(ఐ) అభ్యర్థిపై 8,152 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. 2004లో కాంగ్రెస్ మద్దతుతో టీఆర్ఎస్ అభ్యర్థి పద్మారావు విజయం సాధించారు. ఈ నియోజకవర్గంలోనూ 1957, 62, 67 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి కె.సత్యనారాయణ మినహాయిస్తే, మరెవరూ వరుసగా మూడుమార్లు విజయం సాధించలేదు. అందోల్ తీరూ అంతే.. కన్నడ–తెలంగాణ సమ్మిళిత సంస్కృతి కనిపించే ఈ నియోజకవర్గంలో ఆర్థిక, సామాజికంగా వెనుకబడిన వర్గాలే అత్యధికం. 1952లో ద్విసభ నియోజకవర్గంగా ఏర్పడిన అందోల్‌లో 2018 వరకు జరిగిన 15 ఎన్నికల్లో ఒక్కమారు మినహా ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచిన పార్టీయే రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 1983లో రాష్ట్రంలో టీడీపీ అధికారం చేపడితే, ఇక్కడ మాత్రం కాంగ్రెస్ అభ్యర్థి లక్ష్మణ్‌జీ.. ఈశ్వరీబాయిపై విజయం సాధించారు. ఇక అత్యల్ప మెజార్టీలతో గెలిచిన అదృష్టవంతులు కూడా ఈ నియోజకవర్గంలోనే ఉండటం గమనార్హం. ఇక్కడ కూడా వరుసగా 3 సార్లు ఎవరూ గెలవకపోవటం విశేషం. గజ్వేల్.. కమాల్ హైదరాబాద్‌కు సమీపాన్నే ఉన్నా.. పూర్తిగా గ్రామీణ ప్రాంతమైన గజ్వేల్‌లోనూ 1952 నుంచి 2018 వరకు జరిగిన 15 ఎన్నికల్లో గెలిచిన పార్టీనే 13 మార్లు అధికారంలోకి వచ్చింది. 1952లో జరిగిన తొలి ఎన్నికలో కమ్యూనిస్టుల అభ్యర్థి పెండెం వాసుదేవ్, కాంగ్రెస్ అభ్యర్థి మాడపాటి హన్మంతరావుపై 15 వేలకు పైగా ఓట్లతో విజయం సాధిస్తే, 1962లో కాంగ్రెస్ అభ్యర్థి జి.వెంకటస్వామిపై, స్వతంత్ర అభ్యర్థి గజ్వేల్ సైదయ్య 1,035 ఓట్ల స్వల్ప మెజార్టీతో విజయం సాధించారు. మిగిలిన అన్ని ఎన్నికల్లోనూ ఇక్కడ గెలిచిన పార్టీలే రాష్ట్రంలోనూ అధికార పగ్గాలు చేపట్టాయి. ఈ నియోజకవర్గం నుంచి మూడుమార్లు గెలిచిన అభ్యర్థిగా గజ్వేల్ సైదయ్య పేరిటే ఇప్పటికీ రికార్డు ఉంది. అయితే 2014, 18లలో విజయం సాధించిన కేసీఆర్..మూడోసారి కూడా ఇక్కడి నుంచే పోటీకి దిగటంతో గజ్వేల్‌పై ఆసక్తి నెలకొంది. ఒకే తీర్పు..ఒకింత విచిత్రమే.. ఈ నాలుగు నియోజకవర్గాల ఓటర్లు ఇస్తున్న తీర్పు ఎప్పుడూ ఆసక్తికరమే. ఈ నాలుగు ప్రాంతాల్లో విభిన్న సామాజిక వర్గాలు ఉన్నాయి. భౌగోళికంగానూ చాలా భిన్నమైన ప్రాంతాలు. పెద్దగా ఆశలు, ఆకాంక్షలు లేని వారు అత్యధికంగా ఉండే నియోజకవర్గాలు. కానీ ఎప్పుడూ ఇక్కడ గెలిచిన పార్టీలే దాదాపుగా ప్రతిసారీ అధికారం చేపట్టడం ఒకింత విచిత్రమే అని చెప్పాలి. – మల్లేపల్లి లక్ష్మయ్య, సామాజిక విశ్లేషకుడు -శ్రీగిరి విజయ్‌కుమార్‌రెడ్డి -
గజ్వేల్, కామారెడ్డిలో కేసీఆర్ గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీఆర్ఎస్
-
గజ్వేల్ లో బీజేపీ నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన ఈటల
-
కేసీఆర్‌పై పోటీ.. సరికొత్త రికార్డు!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ నామినేషన్ ప్రక్రియ శుక్రవారంతోనే ముగిసింది. రాష్ట్ర వ్యాప్తంగా 4,355 నామినేషన్లు దాఖలు అయ్యాయి. అయితే బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పోటీ చేస్తోన్న గజ్వేల్, కామారెడ్డి నియోజకవర్గాల నుంచే అత్యధిక నామినేషన్లు దాఖలయ్యాయి. గజ్వేల్ 157 నామినేషన్లతో సరికొత్త రికార్డు సృష్టించింది. వివిధ ప్రాంతాలకు చెందిన పలువురు బాధితులు సీఎం కేసీఆర్‌పై పోటీ చేసేందుకు నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ దాఖలు చేసిన వారిలో 100 మంది వట్టెనాగులపల్లి శంకర్ హిల్స్ ప్లాట్ బాధితులు ఉన్నారు. జగిత్యాల చెరుకు రైతులు కూడా పోటీ చేసేందుకు మొగ్గు చూపారు. ముత్యంపేట చెరుకు ఫ్యాక్టరీని తెరిపించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. నిరుద్యోగులు, అమరవీరుల కుటుంబాల తరఫున కూడా పలువురు నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్లు దాఖలు చేసిన వారిలో ఎక్కువమంది ధరణి సహా వివిధ బాధితులు ఉన్నారు. నిరసన తెలిపే ఉద్దేశంలో భాగంగా వీరు నామినేషన్లు దాఖలు చేశారు. గజ్వేల్ తర్వాత మేడ్చల్ నియోజకవర్గం నుంచి 125 నామినేషన్లు దాఖలు అయ్యాయి. ఇక్కడ మంత్రి మల్లారెడ్డి పోటీ చేస్తున్నారు. మల్లారెడ్డిపై భూ కబ్జా ఆరోపణలు ఎక్కువగా ఉండటంతో బాధితులు ఎక్కువ సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేసినట్లు తెలుస్తోంది. మూడోస్థానంలో కామారెడ్డి నియోజకవర్గానికి 102 నామినేషన్లు వచ్చాయి. ముఖ్యమంత్రి కెసీఆర్ పోటీ చేస్తున్న రెండు నియోజకవర్గాల్లో కూడా అత్యధిక నామినేషన్లు రావడం గమనార్హం. ఆ తర్వాత.. మునుగోడు నుంచి 83, సూర్యాపేట నుంచి 81, మిర్యాలగూడ నుంచి 79, సిద్దిపేట నుంచి 76, నల్గొండ నుంచి 71, హుజూరాబాద్ నుంచి 70, కోదాడ నుంచి 66, రాజేంద్రనగర్ నుంచి 64, మల్కాజిగిరి నుంచి 60, ఎల్బీ నగర్ నుంచి 62, శేరిలింగంపల్లి నుంచి 58, సిరిసిల్ల నుంచి 42 నామినేషన్లు దాఖలయ్యాయి. ఈసీ షెడ్యూల్ ప్రకారం.. నవంబర్ 10వ తేదీతో నామినేషన్ల దాఖలు ప్రక్రియ ముగిసింది. నవంబర్ 13వ తేదీన నామినేషన్ల పరిశీలన ఉంటుంది. నామినేషన్ల ఉపసంహరణకు 15వ తేదీ ఆఖరు. ఇప్పటిదాకా వంద మంది అఫిడవిట్లు లేకుండా నామినేషన్లు వేయడంతో ఎన్నికల సంఘం వాళ్లకు నోటీసులు జారీ చేసింది. అలాగే.. బీఫామ్ లేకుండా నామినేషన్లు వేసిన వాళ్లను స్వతంత్ర అభ్యర్థులుగా పరిగణించనుంది ఈసీ. మొత్తం 119 నియోజకవర్గాల్లో ఈ నెల 30న పోలింగ్ ఉంది. డిసెంబర్ 3వ తేదీన ఫలితాలు వెల్లడవుతాయి. తెలంగాణ ఎన్నికల సమగ్ర కథనాల కోసం క్లిక్ చేయండి -
నామినేషన్లు దాఖలు చేసిన కేసీఆర్
-
గజ్వేల్ కు చేరుకున్న సీఎం కేసీఆర్
-
నేడు గజ్వేల్, కామారెడ్డిలో సీఎం కేసీఆర్ నామినేషన్స్
-
సీఎం మీద గెలిస్తే జెయింట్ కిల్లరే!
సీఎం కేసీఆర్.. ఈ సార్‌తో ఎన్నికల్లో పోటీ అంటే.. అస్స లు మామూలు విషయం కాదు.. ఎప్పుడో నలభై ఏళ్ల కిందట ఒకే ఒక్కసారి స్వల్ప ఓట్లతో ఓడిపోయిన ఈయన ఆ తర్వాత.. ఇన్ని దశాబ్దాలుగా ఎంపీగా పోటీ చేసినా.. ఎమ్మెల్యేగా పోటీ చేసినా గెలుపు గుర్రంపై స్వారీ చేస్తూనే ఉన్నారు. రికార్డు మెజారిటీలు సాధిస్తూనే ఉన్నారు. అలాంటి కేసీఆర్‌పై తొలిసారి ఈ దఫా సీరియస్‌గా పోటీకి దిగుతున్నాయి ప్రతిపక్షాలు. ఓ రకంగా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఆ క్రమంలోనే గజ్వేల్‌లో కేసీఆర్‌పై బీజేపీ అభ్యర్థిగా ఈటల రాజేందర్ పోటీ చేస్తుంటే... కామారెడ్డిలో కాంగ్రెస్ అభ్యర్థిగా టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి బరిలో నిలిచారు. ఇద్దరికిద్దరూ కేసీఆర్‌ను ఓడిస్తామనే చెబుతున్నారు. ఒకవేళ ఓడిపోయినా.. పోయేదేం లేదు... సీఎం మీద పోటీ చేశాడు అనే పేరొస్తది. కానీ ఏమో గుర్రం ఎగరావచ్చు తరహాలో గెలిస్తే... జెయింట్ కిల్లర్ అనే ట్యాగ్‌లైన్ ఎప్పటికీ ఉంటుంది. ఇప్పుడు కాంగ్రెస్, బీజేపీల్లో ఇదే అంశం చర్చనీయాంశమైంది. గజ్వేల్, కామారెడ్డిల్లో సీఎంపై గెలిచి.. ఒకవేళ ఆ గెలిచిన వాళ్ల పార్టీనే అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రిగా కూడా ముందు వరుసలో ఉండొచ్చనే దూరాలోచన కూడా పోటీకి కారణమన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఓ సారి చరిత్ర చూస్తే తెలంగాణలో ముఖ్యమంత్రిపై పోటీ చేసి గెలిచి జెయింట్ కిల్లర్‌గా పేరు పొందిన చరిత్ర మహబూబ్‌నగర్‌కు చెందిన చిత్తరంజన్ దాస్‌కు ఉంది. 1989 సాధారణ ఎన్నికల్లో అప్పటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గుడివాడ, హిందూపురంతో పాటు తెలంగాణలోని కల్వకుర్తి నుంచి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి చిత్తరంజన్ దాస్ చేతిలో ఓటమి పాలయ్యారు. ఆ ఎన్నికల్లో తెలుగుదేశం ఓడిపోయి, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కాగా ఎన్టీ రామారావుపై గెలిచిన చిత్త రంజన్‌దాస్ ముఖ్యమంత్రి కాకపోయినా... కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగారు. ఈసారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న ఈటల రాజేందర్, రేవంత్‌రెడ్డిల పరిస్థితి ఏంటో డిసెంబర్ 3న తేలుతుంది. -
రేపే నామినేషన్లు వేయనున్న కేసీఆర్
సాక్షి, హైదరాబాద్ : బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు రేపు(నవంబర్ 9, గురువారం) నామినేషన్లు వేయనున్నారు. రేపు ఒక్కరోజులోనే ఆయన పోటీచేయబోయే గజ్వేల్, కామారెడ్డిల్లో నామినేషన్లు దాఖలు చేస్తారు. ఆపై సాయంత్రం కామారెడ్డిలో జరిగే బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొని ప్రసంగిస్తారు. ఇదీ కేసీఆర్ షెడ్యూల్... ఉదయం 10:45కు ఎర్రవెల్లి ఫాంహౌజ్ నుంచి గజ్వేల్‌కు హెలికాప్టర్లో బయలుదేరతారు. 10:55కు గజ్వేల్ టౌన్లో ల్యాండ్ అవుతారు. 11 నుంచి 12 గంటల మధ్య గజ్వేల్‌లో నామినేషన్ వేస్తారు. తర్వాత తిరిగి ఫాంహౌజ్ చేరుకుని లంచ్ చేస్తారు. మధ్యాహ్నం 1:40కి కామారెడ్డికి బయలుదేరతారు. మధ్యాహ్నం 2 నుంచి 3 మధ్య కామారెడ్డిలో నామినేషన్ వేస్తారు. సాయంత్రం 4నుంచి 5 మధ్య కామారెడ్డి బహిరంగ సభలో ప్రసంగిస్తారు. -
బీఆర్ఎస్ అవినీతికి పాతరేద్దాం
గజ్వేల్: రజాకార్లకు సీఎం కేసీఆర్ వారసుడని, బీఆర్ఎస్ అవినీతి పాలనకు గజ్వేల్ నుంచే పాతరేయాలని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి పిలు పునిచ్చారు. మంగళవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ నామినేషన్ వేశా రు. ఈ సందర్భంగా పట్టణంలోని కోటమైసమ్మ ఆలయం వద్ద నుంచి ఇందిరాపార్కు మీదుగా ఐఓసీ (ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్) వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఇందిరాపార్కు వద్ద నిర్వహించిన రోడ్ షోలో కిషన్‌రెడ్డి ప్రసంగించారు. తెలంగాణ కోసం ఆత్మ బలిదానాలు చేసుకున్న అమరుల ఆత్మకు శాంతి చేకూరాలంటే బీఆర్ఎస్ పాలనకు చరమగీతం పాడాలన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుల నుంచి నేరుగా సీఎం ఫామ్‌హౌస్‌కే నీరు వస్తుండగా ప్రజలకు మాత్రం చుక్క నీరందడం లేదన్నారు. నియోజకవర్గంలోని 30వేల కుటుంబాలకు చెందిన భూములను లాక్కొని, ఆ కుటుంబాలను కేసీఆర్ రోడ్డున పడేశారని ఆరోపించారు. గజ్వేల్‌లో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వకపోగా, ఉన్న ఇండ్లను కూలగొట్టారని మండిపడ్డారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు వదిలిన బాణమే ఈటల ఈ ఎన్నికల్లో గజ్వేల్‌లోనే కాదు కామారెడ్డిలోనూ కేసీఆర్‌కు ఓటమి తప్పదని కిషన్‌రెడ్డి జోస్యం చెప్పారు. తెలంగాణలో ప్రజాస్వామ్య పరిరక్షణకు వదిలిన బాణమే ఈటల రాజేందర్ అని వ్యాఖ్యానించారు. ఈ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే బీసీ నేత ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడతారని స్పష్టం చేశారు. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ మాట్లాడుతూ గజ్వేల్‌కు కేసీఆర్ పరాయి వ్యక్తి అని, తాను కాదని చెప్పారు. తానూ 1992 నుంచి ఇక్కడ పౌల్ట్రీ పరిశ్రమ నడపానని, అప్పటినుంచి తనకు ఈ ప్రాంతంతో అవినాభావ సంబంధం ఉందన్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలు కేసీఆర్ అహంకారానికి, ప్రజల ఆత్మగౌరవానికి మధ్య యుద్ధంగా ఈటల అభివర్ణించారు. గజ్వేల్ రోడ్‌షోలో ప్రసంగిస్తున్న కిషన్‌రెడ్డి. చిత్రంలో ఈటల -
సీఎం కేసీఆర్‌పై ‘ఎలక్షన్ కింగ్’ పద్మరాజన్ పోటీ.. ఎవరీయన?
సాక్షి, సిద్దిపేట: ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఎక్కడో తమిళనాడు నుంచి వచ్చిన ‘ఎలక్షన్ కింగ్’ పద్మరాజన్ పోటీ చేయడం ఏమిటని అనుకుంటున్నారా.. ? అసలు ఎవరీయన అని ఆలోచిస్తున్నారా.. అయితే పద్మరాజన్ గురించి కాస్త తెలుసుకోవాల్సిందే. తమిళనాడు రాష్ట్రం సేలం జిల్లా మెట్టూరుకు చెందిన పద్మరాజన్ వృత్తిరీత్యా హోమియోపతి వైద్యుడు. ప్రముఖులు ఎక్కడ పోటీ చేస్తే అక్కడికి వెళ్లి ఈయన బరిలో ఉంటుంటారు. దివంగత అటల్ బిహారీ వాజ్‌పేయి, పీవీ నరసింహారావు, జయలలిత, కరుణానిధిపై కూడా పోటీ చేశారు. ఇక పీఎం నరేంద్రమోదీ మొదలు పలువురు ముఖ్యమంత్రులు, మంత్రులు, కేంద్ర మంత్రులపై సైతం బరిలోకి దిగారు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఎక్కడ ఎన్నిక జరిగినా ప్రముఖులపై ఆయన పోటీకి దిగేస్తారు. 1988 నుంచి ఇలా పోటీ చేయడం మొదలుపెట్టిన పద్మరాజన్ అలా ఇప్పటి వరకు 236 సార్లు పోటీ చేశారు. కానీ ఇప్పుడు తొలిసారిగా సీఎం కేసీఆర్‌పై పోటీ చేయబోతున్నారు. గజ్వేల్ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పద్మరాజన్ ఈ నెల 3న నామినేషన్ వేసి 237వ సారి పోటీకి సై అంటున్నారు. ఐదుసార్లు రాష్ట్రపతిగా కూడా పోటీ ఐదుసార్లు రాష్ట్రపతి అభ్యర్థిగా, ఐదుసార్లు ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా, 32 సార్లు లోక్‌సభకు, 72 సార్లు అసెంబ్లీకి, 3 సార్లు ఎమ్మెల్సీకి , ఒకసారి మేయర్ పదవికి, మూడు మార్లు చైర్మన్ పోస్టుకి, ఇంకా అనేక ఇతర ఎన్నికల్లో పోటీ చేశారు. అత్యంత విఫలమైన అభ్యర్థిగా గిన్నిస్ రికార్డు ఇప్పటివరకు ఆయన ఏ ఎన్నికలోనూ గెలవలేదు. 35 ఏళ్లుగా పోటీ చేస్తున్న ఆయన్ను గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డులలో ప్రపంచంలోనే అత్యంత విఫలమైన అభ్యర్థిగా పేర్కొనడం గమనార్హం. ఇలా ఎందుకు పోటీ చేస్తున్నారంటే.. ఓటమి చెందుతానని తెలిసినప్పటికీ తప్పకుండా బరిలో ఉంటారు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు డిపాజిట్లు, ఇతర ఖర్చులు మొత్తంగా ఇప్పటి వరకు సుమారు రూ.30 లక్షలు అయినట్టు చెబుతున్నారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఎక్కడి నుంచైనా పోటీ చేయవచ్చని ప్రజలకు తెలియజేయడం కోసమే ఇలా పోటీ చేస్తున్నానని డాక్టర్ పద్మరాజన్ చెప్పుకొచ్చారు. చదవండి: బస్సులకూ... ఎన్నికలకూ సంబంధమేమిటి? -
తల్లి మందలించిందని.. ఇంట్లో నుంచి వెళ్లి.. చివరికి..
సాక్షి, సంగారెడ్డి/గజ్వేల్: తల్లి మందలించిందని ఇంట్లో నుంచి వెళ్లిపోయిన ఓ బాలుడు మరునాడు కాలువలో శవమై తేలిన ఘటన మండల పరిధిలోని దాతర్‌పల్లిలో సోమవారం చోటు చేసుకుంది. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన నాయిని యాదగిరి–వాణి దంపతులకు ఓ కొడుకు, కూతురు ఉన్నారు. వీరి పెద్దకొడుకు చరణ్(11) రిమ్మనగూడలోని పాఠశాలలో 6వ తరగతి చదువుతున్నాడు. ఆదివారం తల్లిని డబ్బులు అడగడంతో చరణ్‌ను మందలించింది. దీంతో అతను ఎవరికీ చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. రాత్రి అయినా ఇంటికి రాలేదు. మరుసటి రోజు గ్రామ సమీపంలోని కాళేశ్వరం ప్రాజెక్టు కాలువలో చరణ్ మృతదేహం గుర్తించిన స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కాలువ వద్దకు వెళ్లిన పిల్లవాడు ప్రమాదవశాత్తు అందులోపడి మృతిచెంది ఉండవచ్చని పోలీసులు భావించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గజ్వేల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇవి చదవండి: ఇద్దరు కుమారులను పక్కింట్లో వదిలి, ఇంటికెళ్లి.. నోట్ బుక్‌లో రాసి.. -
సెంటిమెంట్ ‘ఇలాఖా’గా పేరున్న గజ్వేల్‌లో.. నువ్వా.. నేనా!?
సాక్షి, సంగారెడ్డి: 'సెంటిమెంట్ ‘ఇలాఖా’గా పేరున్న గజ్వేల్‌లో రాజకీయం వేడెక్కింది. ప్రధాన పార్టీలు బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు నువ్వా.. నేనా.. అన్నట్లుగా ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. వాడవాడలా తిరుగుతూ ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి.' – గజ్వేల్ రాష్ట్రంలోని ఇతర నియోజకవర్గాలతో పోలిస్తే గజ్వేల్ ఎన్నో విశేషాలకు నెలవు. ప్రత్యేకించి 1952లో జరిగిన ఎన్నికల్లో మిగితా 15సార్లు జరిగిన ఎన్నికల్లో ఏ పార్టీ ఎమ్మెల్యే గెలిచినా రాష్ట్రంలో ఆ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి రావడం అనవాయితీగా వస్తుంది. ఇదే ‘సెంటిమెంట్’ను నమ్ముకొని సీఎం కేసీఆర్ ఇక్కడి నుంచి ముచ్చటగా మూడోసారి పోటీ చేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రమంతటా తిరిగే అవసరమున్నా దృష్ట్యా ఆయన ప్రచార బాధ్యతలను పార్టీ యంత్రాంగమే చేపడుతోంది. ఇందుకోసం ఎన్నికల ఇన్చార్జులుగా మంత్రి హరీశ్‌రావు, రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి, ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డిలు వ్యవహరిస్తుండగా...సమన్వయ కమిటీ సభ్యులుగా మాజీ కార్పొరేషన్ చైర్మన్ భూంరెడ్డి, ఎలక్షన్‌రెడ్డిలు వ్యవహరిస్తున్నారు. వీరి ఆధ్వర్యంలో నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతుంది. కేసీఆర్ ప్రాతినిథ్యం ఫలితంగా పదేళ్లలో నియోజకవర్గంలో వచ్చిన మార్పును ప్రజలకు వివరిస్తున్నారు. ప్రత్యేకించి ఇక్కడ వేలాది కోట్ల వ్యయంతో నిర్మించిన కొండపోచమ్మసాగర్ రిజర్వాయర్, హార్టికల్చర్ యూనివర్సిటీ, ఫారెస్ట్రీ కళాశాలతో పాటు గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలో నిర్మించిన రింగురోడ్డు, ఎడ్యుకేషన్ హబ్వంటి భారీ అభివృద్ధి ప్రాజెక్ట్‌లే కాకుండా నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో మౌలిక వసతుల కల్పన కోసం తీసుకున్న చర్యలను వివరిస్తున్నారు. అదేవిధంగా కేసీఆర్ ఆధ్వర్యంలో చేపట్టిన సంక్షేమ పథకాల వల్ల మార్పును సైతం ఓటర్లకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు. రోడ్‌షోలు, నృత్యాలతో ఆ పార్టీ నేతలు ఆకట్టుకుంటున్నారు. ప్రత్యేకించి వంటేరు ప్రతాప్‌రెడ్డి ప్రచారానికి వెళ్లిన ప్రతీచోట ‘గులాబీ జెండాలే రామక్క’ పాటపై మహిళలతో కలిసి నృత్యం చేస్తూ ప్రచారాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. బీజేపీ సైతం గట్టిగానే కదన రంగంలోకి దిగింది. ఈ పార్టీ అభ్యర్థి ఈటల రాజేందర్ ప్రచారం వేగం పెంచారు. ప్రత్యేకించి నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న సమస్యలపై దృష్టి పెట్టారు. మల్లన్నసాగర్ నిర్వాసితులకు నష్ట పరిహారం ఇతర ప్యాకేజీల పంపిణీలో నెలకొన్న జాప్యాన్ని ఎత్తిచూపే ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాకుండా నియోజకర్గంలో అభివృద్ధి పేరిట విధ్వంసం జరిగిందని చెబుతూ...పేదలకు చెందిన వేలాది ఎకరాల భూములను లాక్కొని రోడ్డున పడేశారని ప్రచారం చేస్తున్నారు. ఈ కష్టాల నుంచి బయట పడాలంటే బీజేపీ గెలిపించాలని కోరుతున్నారు. కాంగ్రెస్ సైతం సత్తా చాటేందుకు ప్రయత్నిస్తుంది. ఈ పార్టీ తూంకుంట నర్సారెడ్డి తానూ 2009లో ఎమ్మెల్యేగా పనిచేసిన కాలంలో ప్రజలందరికీ 24గంటలు అందుబాటులో ఉన్నానని, కానీ కేసీఆర్ నియోజకవర్గ ప్రజలకు కనీసం దర్శనం ఇచ్చే పరిస్థితి లేదని చెబుతూ ప్రజల్లోకి వెళ్తున్నారు. మరోసారి బీఆర్ఎస్ గెలిస్తే కేసీఆర్ నియోజకవర్గాన్ని ఏమాత్రం పట్టించుకోడని, స్థానికులు సమస్యల పరిష్కారానికి కలవడానికి ప్రయత్నించినా అది జరగదని వివరించే ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాకుండా కాళేశ్వరం ప్రాజెక్ట్‌ల్లో కేసీఆర్ కుటుంబం భారీగా అవినీతికి పాల్పడిందనే విషయాన్ని కూడా కాంగ్రెస్ ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. మొత్తానికి గజ్వేల్‌లో ప్రచార పర్వం ఆసక్తికరంగా మారింది. నామినేషన్లు ముగిసిన తర్వాత ప్రచారం తీరు మరింత వేడెక్కె అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇవి కూడా చదవండి: 'బండి సంజయ్' నామినేషన్ సందర్భంగా.. భారీ ర్యాలీ! -
తొలిసారి పోటీ కాదు.. ఏకంగా హ్యాట్రిక్ కోసమే ప్రయత్నాలు ఎక్కువ
సాక్షి, మెదక్: ఈసారి తెలంగాణ ఎన్నికల్లో తొలిసారి పోటీ చేసేవారికంటే హ్యాట్రిక్ కోసం ప్రయత్నిస్తున్నవారే ఎక్కువ మంది ఉన్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో నలుగురు నేతలు హ్యాట్రిక్ కొట్టడానికి సిద్ధం అవుతున్నారు. మరోనేత కొద్దిలో హ్యాట్రిక్ అవకాశం కోల్పోయారు. కచ్చితంగా గెలుస్తామనే ధీమాతో ఉన్నారా నేతలు. మరి ఆ మూడు నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ఎవరు? ఆ సెగ్మెంట్లలో రాజకీయాలు ఎలా ఉన్నాయి? ప్రచారం ఎలా సాగుతోంది? ఉమ్మడి మెదక్ జిల్లా ఎన్నికల్లో రికార్డ్ సృష్టించినవారిలో గడచిన రెండు దశాబ్దాల కాలంలో సీఎం కేసీఆర్, మంత్రి హరీష్‌రావు ప్రముఖంగా కనిపిస్తారు. సిద్ధిపేట ఈ ఇద్దరు నేతలకు పెట్టని కోటగా తయారైంది. ఈసారి ఎన్నికల్లో గజ్వేల్, పఠాన్‌చెరు, మెదక్, నారాయణఖేడ్ నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు హ్యాట్రిక్ కొట్టడానికి రెడీ అవుతున్నారు. ముఖ్యంగా గజ్వేల్ నుంచి రెండుసార్లు విజయం సాధించిన సీఎం కేసీఆర్ మూడోసారి అక్కడే పోటీ చేస్తున్నారు. కేసీఆర్ విజయం గురించి కంటే..ఆయన సాధించే మెజారిటీ మీదే చర్చలు జరుగుతున్నాయి. నర్సాపూర్ లో మదన్ రెడ్డి గత రెండు ఎన్నికల్లోనూ విజయం సాధించారు..మూడోసారి బరిలోకి దిగి హ్యాట్రిక్ సాధించాలనుకున్నారు కాని..గులాబీ బాస్ మాత్రం నర్సాపూర్ టిక్కెట్‌ను మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డికి కేటాయించారు. దీంతో మదన్‌రెడ్డికి తృటిలో అవకాశం చేజారింది. కాంగ్రెస్ నేతలంతా ఒకవైపే వస్తే.. నారాయణఖేడ్ నియోజకవర్గంలో వాడ వాడలా ప్రచారం ముమ్మరంగా సాగుతూ పండుగ వాతావరణం కనిపిస్తోంది. BRS అభ్యర్థి భూపాల్ రెడ్డి తనదైన శైలిలో ప్రచారం చేస్తూ ముందుకు సాగుతున్నారు. నారాయణఖేడ్ సెగ్మెంట్ కాంగ్రెస్ కు కంచుకోట. 2016లో అప్పటి కాంగ్రెస్ MLA కిష్టారెడ్డి ఆకస్మిక మృతితో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఆ ఉప ఎన్నికలో తెలంగాణ ఉద్యమం ఊపుతో గులాబీ పార్టీ గెలుపొందింది. 2018 ఎన్నికల్లో కూడా TRS అభ్యర్థి భూపాల్ రెడ్డి 58 వేలకు పైగా ఓట్ల మెజార్టీతో సునాయాసంగా గెలుపొందారు. ఇప్పడు హ్యాట్రిక్ కోసం భూపాల్ రెడ్డి పరుగులు పెడుతున్నారు. ఒక వేళ సీటు కోసం పోటీపడుతున్న కాంగ్రెస్ నేతలంతా ఒక తాటిపైకి వచ్చి ప్రచారం నిర్వహిస్తే మాత్రం గులాబీ పార్టీ అభ్యర్థికి పోటీ గట్టిగానే ఉంటుంది. ఏమైనా తేడా కొడితే మాత్రం భూపాల్ రెడ్డి హ్యాట్రిక్ విజయం మీద నీళ్లు చల్లినట్టే అవుతుంది. మెదక్ లో ఈసారి బీఆర్ఎస్ అభ్యర్థి పద్మా దేవేందర్ రెడ్డి గెలుపు అంత సులభం కాదంటున్నారు అక్కడి రాజకీయ విశ్లేషకులు. 2014లో 30 వేలకు పైగా..2018లో 48 వేలకు పైగా ఓట్ల మెజార్టీతో గెలుపొందిన పద్మా దేవేందర్ రెడ్డి మూడోసారి బరిలోకి దిగారు. అభ్యర్థులను ప్రకటించిన తర్వాత సీఎం కేసీఆర్ ఒకసారి మెదక్ నియోజకవర్గంలో పర్యటించారు. సీఎం పర్యటనతో.. పద్మా దేవేందర్ హ్యాట్రిక్! సీఎం పర్యటనతో BRS కార్యకర్తల్లో జోష్ నింపినప్పటికీ మెదక్ లో పద్మా దేవేందర్ హ్యాట్రిక్ కొడతారా అనే సందేహం మాత్రం వెంటాడుతోంది. కాంగ్రెస్ నుండి మైనంపల్లి రోహిత్ పోటీ పడుతుండటంతో బీఆర్ఎస్ అభ్యర్థికి ఈసారి కష్టమే అనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే రోహిత్ గ్రామగ్రామాన తిరుగుతూ ప్రచారంలో దూసుకుపోతున్నారు. బిఆర్ఎస్ కార్యకర్తలు కొందరు పద్మా దేవేందర్ రెడ్డి మీద ఉన్న అసంతృప్తితో కాంగ్రెస్ లో చేరుతున్నారు. మరి ఈసారి విజయం ఎవరిని వరిస్తుందో..? మినీ ఇండీయాగా పిలుచుకునే పఠాన్ చెరులో బీఆర్ఎస్ అభ్యర్థిగా ముందుగానే గూడెం మహిపాల్ రెడ్డిని ఖరారు చేశారు కేసీఆర్. 2014లో 18 వేలకు పైగా మెజారిటీ సాధించిన గూడెం మహిపాల్ రెడ్డి 2018 ఎన్నికల్లో 38 వేలకు పైగా మెజారిటీ సాధించారు. బీఆర్ఎస్ టికెట్ కోసం ప్రయత్నించి భంగపడ్డ నీలం మధు స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగుతానని ప్రకటించారు. ప్రత్యర్థులు ఎవరైనా..ఎంతమంది బరిలో ఉన్నా.. మాస్ లీడర్‌గా పేరున్న మహిపాల్ రెడ్డి గెలుపు కష్టమేమి కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పారిశ్రామిక ప్రాంతమైన పఠాన్‌చెరు నియోజకవర్గంలో మహిపాల్‌రెడ్డి చేసిన అభివృద్ధి పనులే ఆయన్ను గెలిపిస్తాయంటున్నారు గులాబీ పార్టీ కార్యకర్తలు. సీఎం కేసీఆర్ మూడోసారి బరిలో.. ఇక గజ్వేల్ నియోజకవర్గంలో సీఎం కేసీఆర్ మూడోసారి బరిలో దిగారు. గజ్వేల్ లో ఏ పార్టీ అభ్యర్థి గెలిస్తే అదే పార్టీ అధికారంలోకి వస్తుందని అనేకసార్లు రుజువైంది. అధికారంలోకి మేమే వస్తామంటూ అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ నాయకత్వాలు చెప్పుకుంటున్నాయి. కానీ గజ్వేల్ లో గెలుస్తామని మాత్రం ఆ రెండు పార్టీలు ధీమా వ్యక్తం చేయడం లేదు. కాంగ్రెస్ నుండి తూముకుంట నర్సా రెడ్డి ఎంత మేరకు ప్రభావం చూపుతారో తెలీదు కానీ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ మాత్రం ప్రభావం చూపిస్తారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. 2014లో 18 వేల ఓట్ల మెజారిటీతో గెలిచిన కేసీఆర్ 2018లో 58 వేల ఓట్లతో విజయం సాధించారు. ఇప్పటి వరకు ఓటమి ఎరుగని నేత కేసీఆర్ గజ్వేల్ గెలుపు నల్లేరు మీద నడకే కానీ అందరి దృష్టి గులాబీ బాస్ సాధించే మెజారిటీ మీదే ఉంది. -
మన బతుకు ఇంతేనా అని బాధపడేవాళ్లం: సీఎం కేసీఆర్
సాక్షి, సిద్ధిపేట: అసెంబ్లీ ఎన్నికల్లో 95 నుంచి 105 స్థానాల్లో బీఆర్ఎస్ గెలుస్తుందని, ఇందులో తనకు ఎలాంటి సందేహాం లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. ఎన్నికల తరువాత ఒక్కరోజు మొత్తం గజ్వెల్లోనే ఉంటూ. నియోజకవర్గ ప్రజలతో గడుపుతానని తెలిపారు. గజ్వేల్‌కు కావాల్సింది ఇంకా చాలా ఉందని, అవన్నీ చేపిస్తానని భరోసా ఇచ్చారు. అయతే కామారెడ్డిలో పోటీ చేయడానికి ఓ కారణం ఉందన్న కేసీఆర్.. ఆ కారణం ఏంటో మాత్రం వెల్లడించలేదు. గజ్వెల్ నియోజకవర్గం కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం శుక్రవారం నిర్వహించగా.. ముఖ్య అతిధిగా సీఎం కేసీఆర్ హాజరయ్యారు. ఈ సమావేశంలో మంత్రి హరీష్ రావు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. గజ్వేల్ ఊర్లలోకి మిషన్ భగీరథ నీళ్లు వస్తున్నాయని తెలిపారు. మోటర్ లేకున్నా సంపు నీళ్లు వస్తున్నాయని తెలిపారు. ఒకప్పుడు సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అక్కడ భయంకరమైన కరువు ఉండేనని.. అప్పుడు ఆలోచన చేసి మిడ్ మానేరు నుంచి ఎత్తైన గుట్టపైకి నీళ్లు సప్లై చేసి ఇంటింటికి నీళ్లు ఇచ్చాయని గుర్తు చేశారు. అదే నేడు తెలంగాణ వ్యాప్తంగా మిషన్ భగీరథ ద్వారా నీళ్లు ఇస్తున్నామని చెప్పారు. మన బతుకు ఇంతేనా అని బాధేపడ్డాం ఈ మేరకు రాజకీయ జీవిత మొదలు పెట్టినప్పటి నుంచి తన ప్రస్థానంలో ఎదుర్కొన్న ఆటుపోట్లను, తెలంగాణ ఉద్యమంలో అనుభవించిన కష్టాలను కార్యకర్తల సమావేశంలో పంచుకున్నారు. ‘24 ఏళ్ల క్రితం ఒక్కడినే బయల్దేరి వెళ్ళాను. ఆనాడు కొంత మంది మిత్రులము కూర్చొని మన బతుకు ఇంతేనా అని బాధ పడేవాళ్ళం. నిస్పృహ, నిస్సహాయత ఉండేది కానీ ఏం చేయాలో తెల్వని పరిస్థితి. ఎక్కడ చూసిన చిమ్మని చీకటి, ఎవరిని కదిలించిన మన బతుకులుబేం ఉన్నాయి అనే ఆవేదన ఉండేది. నేను 10వ తరగతి చదువుతున్న సమయంలో మన జిల్లా కేంద్రం సంగారెడ్డి. అక్కడకు పోవాలి అంటే 5, 6 గంటల సమయం పట్టేది. మంజీర నది ఎండిపోయి 800 ఫీట్ల లోతుకు బోర్ వేసిన నీళ్లు రాకపోయేవి. అప్పుడు ట్రాన్స్ఫార్మర్ కాలిపోతే ఒక్కో బావికి 2, 3 వేలు ఖర్చు చేసిమంచిగా చేయించే పరిస్థితి ఉండేది. ఎన్టీఆర్ దగ్గరకు 27 మంది ఎమ్మెల్యేల సంతకాలు చేయించుకొని వెళ్ళాను. కానీ అప్పటి విద్యుత్ సంస్థల చైర్మన్ అన్ని ఒప్పుకుంటా కానీ స్లాబ్ మాత్రం చేంజ్ చేయం అని చెప్పారు. కానీ గట్టిగా పట్టిపడితే స్లాబ్ చేంజ్ చేశారు. చదవండి: కేసీఆర్ లూటీ చేసిందంతా తిరిగి ఇస్తాం: రాహుల్ గాంధీ చంద్రబాబు మోసం చేశారు ఆనాడు కరెంటు బిల్లు పెంచమని చెప్పి చంద్రబాబు మోసం చేశారు..ఇక లాభం లేదని చూస్తూ చూస్తూ ఊరుకునేది లేదని తెలంగాణ ఉద్యమానికి శ్రీకారం చుట్టాను. కొంతమందితో కలిసి ఉద్యమాన్ని శ్రీకారం చేస్తూ ముందుకు వచ్చా. నాతో ఎవరు కలిసి రాలేదు. నేను వస్తే కూడా జాకున్నారు. చివరికి తెలంగాణ సాధించుకున్నాం. వలసలు ఆగాలని అనుకున్నాం తెలంగాణ వచ్చిన రోజు చెట్టుకు ఒక్కరూ గుట్టకు ఒక్కరు అయ్యారు. మహబూబ్ నగర్‌తోపాటు మన మెదక్ జిల్లాలో కూడా అదే పరిస్థితి ఉండేది. వ్యవసాయ స్థిరీకరణ జరగాలి జరిగితే వలసలు అగుతాయని ఆలోచించాం. ఇప్పుడు వలసలు వాపసు వచ్చి అద్భుతమైన వ్యవసాయ రంగం పురోగమించింది. వీటన్నింటి నుంచి బయటకు రావాలి అంటే ఎలా అని ఆలోచించాం.ఎంతో మంది ఆర్ధిక, వ్యవసాయ రంగం నిపుణులతో మాట్లాడం.అప్పుడే వ్యవసాయ స్థిరీకరణ జరిగింది. ఒక్కసారే ఓడిపోయాను నేను ఒక్కసారే ఓడిపోయాను. అప్పుడు కూడా నేను ఓడిపోలేదు ఓడించబడ్డాను. ఆ సమయంలో ఈవీఎంలు లేవు. బ్యాలెట్ పేపర్లు ఉండే. కేవలం ఆరు ఓట్లతో ఓడించారు. గజ్వెల్ బిడ్డలు నన్ను కడుపులో పెట్టుకొని గెలిపించారు. అయితే గజ్వేల్‌కు కొంత చేశాం ఇంకా చేయాలి. కరోనాతో కొంత ఆర్ధిక ఇబ్బందులు వచ్చాయి. రాష్ట్రంలో కొంత అభివృద్ధి కార్యక్రమాలు నెమ్మదించాయి. నాకు కూడా కరోనా వచ్చింది. పదవులు వస్తాయి పోతాయి ఉన్నప్పుడు ఎం చేశారు అనేది ముఖ్యం. రైతాంగం పంటలు పండించాలి. భూములు పోయిన భాధ చాలా పెద్దది. నాకు కూడా భాధ ఉంది. నా కూడా భూమి పోయింది. మా అత్తగారి ఊర్లో నా అత్తగారి భూమి, నా ఊర్లో భూమి కూడా పోయింది. మీరు ఇవాళ కొండపోచమ్మ సాగర్, మల్లన్న సాగర్ కింద భూములు కోల్పోయారు. మీకు ఇవాళ యావత్ రైతాంగం ఋణపడి ఉంటుంది. తెలంగాణలో భూగర్భ జలాలు పెరిగాయి ఇండియాలో భూగర్భ జలాలు తగ్గిపోతే తెలంగాణలో మాత్రం భూగర్భ జలాలు పెరిగాయి ఇవన్నీ కూడా కాళేశ్వరం ప్రాజెక్టు, కొండపోచమ్మ, మల్లన్న సాగర్ తోనే సాధ్యం అయింది.మొదటి దశలో ప్రాజెక్టు కట్టుకున్నాం.అయిన కాంగ్రెస్ వాళ్లు ,కోదండరాం లాంటి వాళ్ళు అడ్డుకున్నారు. రెండో దశలో మరింత అభివృద్ధి చేసుకోవాలి. రెండో దశలో ప్రతి గ్రామానికి నీళ్లు ఇచ్చుకుందాం. గజ్వెల్ లో 65 టీఎంసీల నీరు నిల్వ ఉండేలా ప్రాజెక్టు లు నిర్మాణం చేసుకున్నాము. మనం గెలుచుడు కాదు పక్కన ఉన్న 3 నియోజకవర్గాలను గెలిపించాలని కోరుతున్నా. అభివృద్ధి అగవద్దు అంటే మళ్ళీ బీఆర్ఎస్ గెలవాలి.గెలుస్తుంది.’ అని కేసీఆర్ వ్యాఖ్యానించారు. -
బీజేపీలో పోటీపై సస్పెన్స్.. విజయశాంతి కీలక వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఎన్నికల వేళ రాజకీయం రసవత్తరంగా మారింది. రాష్ట్రంలో బీజేపీ అభ్యర్థుల ప్రకటనపై సస్పెన్స్ కొనసాగుతున్న వేళ పార్టీ సీనియర్ నేత విజయశాంతి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆసక్తికరమైన విజయశాంతి మాటలు ఏమంటున్నాయంటే...? ట్విట్టర్ వేదికగా విజయశాంతి చేసిన ఓ ట్వీట్లో బీఆర్ఎస్పై పోటీ విషయంలో బీజేపీ ఎన్నడూ వెనక్కు తగ్గదని కార్యకర్తలు విశ్వసిస్తున్నట్లు తెలిపారు. ఈ పోరాటంలో భాగంగా తాను కామారెడ్డి నియోజకవర్గం నుంచి, పార్టీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గజ్వేల్ నుంచి అసెంబ్లీకి పోటీ చేయాలని కార్యకర్తలు అడగడం తప్పు ఏమీ కాదని వ్యాఖ్యానించారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశం తనకు లేనప్పటికీ పార్టీ నిర్దేశిస్తే చేస్తానని పరోక్షంగా తెలిపారు. ఈ సారి ఎన్నికల్లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గజ్వేల్‌తోపాటు కామారెడ్డి నుంచి కూడా బరిలోకి దిగుతున్న విషయం తెలిసిందే. బీఆర్ఎస్ పై రాజీలేని పోరాటం చేయడంలో బీజేపీ వెనక్కు తగ్గదు.. అని కార్యకర్తల విశ్వాసం. అందుకు, గజ్వేల్ నుండి బండి సంజయ్ గారు, కామారెడ్డి నుండి నేను అసెంబ్లీకి కేసీఆర్ గారిపై పోటీ చెయ్యాలని గత కొన్ని రోజుల మీడియా సమాచారం దృష్ట్యా, కార్యకర్తలు అడగటం తప్పు కాదు. అసెంబ్లీ ఎన్నికల… pic.twitter.com/j1tUfexznX — VIJAYASHANTHI (@vijayashanthi_m) October 17, 2023 రేపే అభ్యర్థుల ప్రకటన! ఇదిలా ఉండగా.. అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ అభ్యర్థుల తొలి జాబితాను గురువారం ఢిల్లీలో ప్రకటించే అవకాశముంది. ఢిల్లీలో బుధవారం జరిగే బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీలో దీనిపై తుది నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం. జాబితా బుధవారం రాత్రే ప్రకటించే అవకాశాన్నీ కొట్టిపారేయలేమని పార్టీ నేతలు చెబుతున్నారు. జాబితాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ ఇలా అన్ని వర్గాలకు తగిన ప్రాధాన్యత దక్కేలా కసరత్తు సాగుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే 60–70 స్థానాల్లో అభ్యర్థుల పేర్లపై పార్టీ రాష్ట్ర ముఖ్యనేతలు ఓ అంచనాకు రాగా ఏకాభిప్రాయం కుదిరని సింగిల్ క్యాండిడేట్ నియోజకవర్గాలు కొన్నింటిని రెండు లేదా మూడో జాబితాలో ప్రకటించే అవకాశాలున్నాయని అంటున్నారు. తొలి జాబితాలో 35–40 మంది అభ్యర్థులు ఉండొచ్చునని చెబుతున్నారు. మొత్తమ్మీద ఇతర పార్టీల కంటే కూడా బీసీలు (దాదాపు 40 సీట్లు), మహిళలకు ఎక్కువ సీట్లు ఇచ్చే అవకాశముందనే చర్చ జరుగుతోంది. మేనిఫెస్టోకు ఓపిక పట్టండి తెలంగాణలో బీజేపీ మేనిఫెస్టోను ఎప్పుడు ప్రకటిస్తారనే దానిపై స్పష్టత కొరవడటంతో స్థానిక కాషాయ నేతలు దిగాలు చెందుతున్నారు. ఆయా అంశాలను కొందరు ముఖ్య నేతలు జాతీయ నాయకత్వం దృష్టికి తీసుకెళ్లగా ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాల్లో తెలంగాణలో చివర్లో ఎన్నికలు జరగనుండటంతో ఎందుకు తొందర పడుతున్నారని ఎదురు ప్రశ్నించినట్లు తెలిసింది. దీంతో మేనిఫెస్టో ప్రకటనకు మరికొంత సమయం పట్టొచ్చని సమాచారం. -
గజ్వేల్ లో కేసీఆర్ పై నేను పోటీచేస్తున్నాను: ఈటల
-
గజ్వేల్ మీ జాగీరా?
సాక్షి, హైదరాబాద్: ‘గజ్వేల్ ఏమైనా మీ (కేసీఆర్) జాగీరా? మీకు నిజాం రాసిచ్చాడా లేక ఒవైసీ రాసిచ్చాడా? ఇంత బరితెగింపు ఎందుకు? ’అంటూ ముఖ్యమంత్రిపై కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కామారెడ్డి జిల్లా బీజేపీ నేత, నిజామాబాద్‌మాజీ జెడ్పీ చైర్మన్ వెంకట రమణారెడ్డి, ఇతర నేతలు గజ్వేల్‌లోఅభివృద్ధి జరిగిందో లేదో చూస్తామంటూ ‘చలో గజ్వేల్’కు పిలుపునిస్తే పోలీసులు ఆయన్ను అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. శనివారం హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో కిషన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, ఎం.రఘునందన్రావుల సమక్షంలో జహీరాబాద్ నియోజకవర్గానికి చెందిన పలువురు మాజీ ఎంపీపీలు, జెడ్పీటీసీలు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, ఇతర ప్రజాప్రతినిధులు, విశ్వకర్మ సంఘం నాయకులు బీజేపీలో చేరారు. ఉమ్మడి మెదక్ జిల్లా మాజీ డీసీసీబీ చైర్మన్ జైపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ చేరికల కార్యక్రమంలో కిషన్‌రెడ్డి మాట్లాడారు. పాలన చివర్లో రుణమాఫీయా? గజ్వేల్‌లో నిజంగా రైతు ఆత్మహత్యలు లేకపోతే.. నియోజకవర్గంలోని దళితులందరికీ ప్రభుత్వం దళితబంధు పథకం అమలు చేయడంతోపాటు అర్హులందరికీ డబుల్ బెడ్రూం ఇళ్లు ఇచ్చి ఉంటే ఆ అభివృద్ధిని చూడాలనుకున్న బీజేపీ నేతలను ఎందుకు చూసి కేసీఆర్, బీఆర్ఎస్ నేతలు ఎందుకు భయపడుతున్నారని కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. తమ నేతలపై కక్షపూరితంగా, దౌర్జన్యంగా వ్యవహరిస్తే బీఆర్ఎస్, కల్వకుంట్ల కుటుంబం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని కిషన్‌రెడ్డి హెచ్చరించారు. కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళితబంధు, డబుల్ బెడ్రూం ఇళ్లు, బీసీలకు ఆర్థిక సాయం పథకాలు విఫలమయ్యాయన్నారు. నాలుగున్నరేళ్లపాటు రైతులను మోసం చేసి చివరి నిమిషంలో వారికి రుణమాఫీ చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. వచ్చే ఎన్నికల్లో రైతులు కేసీఆర్‌కు సరైన బుద్ధి చెబుతారని జోస్యం చెప్పారు. త్వరలోనే వెనుకబడిన వర్గాలు, వివిధ కుల సంఘాల నాయకులు పెద్ద ఎత్తున పార్టీలో చేరబోతున్నారని చెప్పారు. కాగా, ఈ నెల 17 నుంచి ప్రధాని మోదీ జన్మదిన ఉత్సవాలను నిర్వహిస్తామని, తెలంగాణ విమోచన దినోత్సవాలను గ్రామగ్రామాన నిర్వహిస్తామని కిషన్‌రెడ్డి తెలిపారు. భారీగా చేరికలు: ఈటల జహీరాబాద్, పటాన్చెరు, సంగారెడ్డి, నారాయణ్‌ఖేడ్ నుంచి వివిధ పార్టీలకు చెందిన నేతలు త్వరలో తమ పార్టీలో భారీ స్థాయిలో చేరనున్నారని బీజేపీ రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ తెలిపారు. కొందరు కాంగ్రెస్ పార్టీని కృత్రిమంగా పైకి లేపే ప్రయత్నం చేస్తున్నారని, క్షేత్రస్థాయిలో ఎక్కడా ఆ పార్టీ లేదన్నారు. -
బీజేపీలోనే ఉంటా.. పోటీ చేసేది అక్కడి నుంచే: రఘునందన్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు గడువు సమీపిస్తున్న నేపథ్యంలో కొందరు నేతలు పార్టీలు మారుతున్నారు. ఇక, మరికొందరు నేతలు పార్టీ మారుతున్నారంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలో దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు కూడా పార్టీ మారుతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో, రఘునందన్ ఈ వార్తలపై స్పందించారు. పార్టీ మార్పు వార్తపై తాజాగా రఘునందన్ ఘాటు విమర్శలు చేశారు. తాజాగా రఘునందన్ మీడియాతో మాట్లాడుతూ.. పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలను ఖండించారు. తాను పార్టీ మారడం లేదని.. వచ్చే ఎన్నికల్లో దుబ్బాకలో బీజేపీ నుంచే పోటీ చేస్తానని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు చేశారు. కేసీఆర్ గత పదేళ్లలో గజ్వేల్‌లో ఏం అభివృద్ధి చేశారో చూద్దామని పిలుపునిస్తే ముందురోజే తమను అరెస్ట్ చేసి బిచ్కుంద పోలీసు స్టేషన్ తీసుకెళ్లారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అక్కడ ఎలాంటి కేసు నమోదు చేయలేదన్నారు. కామారెడ్డి నుంచి బస్సులు పెట్టుకుని గజ్వేల్ వస్తే భయం ఎందుకని ప్రశ్నించారు. ఇక, ఏదోఒక రోజు సమయం చూసుకుని, డేట్ చెప్పకుండా గజ్వేల్‌కు వస్తానని ఆసక్తికర కామెంట్స్ చేశారు. గజ్వేల్ బస్ స్టాండ్ ఎలావుందో.. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఎలా ఉన్నాయో చూస్తామన్నారు. ఎప్పుడూ బీఆర్ఎస్ మాత్రమే అధికారంలో ఉండదు. ఈ విషయంలో పోలీసులు జాగ్రత్తగా ఉండాలని హాట్ కామెంట్స్ చేశారు. ఇది కూడా చదవండి: రేవంత్ Vs కవిత.. మాటల వార్తో దద్దరిల్లిన ట్విట్టర్ -
రెండు చోట్ల పోటీపై కేసీఆర్ స్పందన ఇది
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అసెంబ్లీ ఎన్నికల్లో రెండు చోట్ల నుంచి అసెంబ్లీకి పోటీ చేయనున్నారు. సిట్టింగ్ నియోజకవర్గం గజ్వేల్‌తో పాటు కామారెడ్డి నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు. అయితే ఈ నిర్ణయం వెనుక కారణం గురించి మీడియా ఆయన్ని ప్రశ్నించగా.. తనదైన స్టైల్లో స్పందించారాయన. పార్టీ నిర్ణయించింది కాబట్టే తాను రెండు చోట్ల నుంచి పోటీ చేస్తున్నట్లు తెలిపారాయన. ‘‘కేసీఆర్ చరిత్ర మీకు తెల్వదు. కరీంనగర్, రివర్స్‌ల మహబూబ్ నగర్ నుంచి ఎంపీగా పోటీ చేసి గెలిచా. కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్, నిజామాబాద్ జిల్లా నుంచి మంత్రి నన్ను వ్యక్తిగతంగా కోరారు. వాళ్లే కాదు.. ఇంకొన్ని జిల్లాల వాళ్లు కూడా అడిగారు. చివరగా పార్టీ సంప్రదింపులతో కామారెడ్డి ఫిక్స్ అయ్యాం. అంతేగానీ.. ఇందులో ఏం ప్రత్యేకత లేదు అని తెలిపారాయన. -
గజ్వేల్: ఆ సెంటిమెంట్‌దే ఎప్పుడూ విజయం!
గజ్వేల్ నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత ఉంది. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్‌ను రాష్ట్రాధినేతగా నిలబెట్టింది ఈ నియోజకవర్గమే. విభిన్న సంస్కృతికి నిలయంగా పేరుగాంచిన నియోజకజవర్గం గజ్వేల్. ఎందరో ఉద్యమకారులకు, కవులు, కళాకారులకు జన్మనిచ్చిన గడ్డ. వివిధ మతస్థులు జాతుల సంగమంతో ఈ నియోజకవర్గాన్ని మినీ ఇండియాగా అభివర్ణిస్తారు. రాజకీయ పార్టీలకు ఆ సెంటిమెంటే: కేసీఆర్ ఇలాకాగా అభివర్ణించే ఈ నియోజకవర్గానికి మరో ప్రత్యేకత కూడా ఉంది. ఇది స్థానికేతరులకు అచొచ్చిన నియోకవర్గం. 1952లో ఎమ్మెల్యేగా గెలిచిన పెండెం సుదేవ్ నుంచి 2014లో గెలిచిన కేసీఆర్ వరకు అంతా స్థానికేతరులే. అలాగే ఈ నియోజకవర్గంలో ఏ పార్టీ అయితే గెలుస్తుందో అదే అధికారంలోకి రావడం మరో విశేషం. గత 13 ఎన్నికలు పరిశిలీస్తే అదే జరిగింది. దాంతో ఈ సెంటిమెంట్‌ను రాజకీయవర్గాలు అన్ని కూడా బలంగా నమ్ముతున్నాయి. ఇక 1952లో ఎమ్మెల్యేగా గెలిచిన పెండెం వాసుదేవ్, 1957లో ద్విసభ్య నియోజకవర్గంగా ఉన్న సమయంలో పనిచేసిన జేబీ ముత్యాలరావు, ఆర్.నరసింహారెడ్డి కూడా స్థానికేతరులే. ఆ తర్వాత 1962లో నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్ కావడంతో ఎస్సీలు ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చారు. ఆ తర్వాత 1983లో అల్లం సాయిలు, 1985లో సంజీవరావు, 1989, 2004లలో డాక్టర్ జె గీతారెడ్డి, 1994లో డాక్టర్ జి విజయరామారావు, 1999లో సంజీవరావులు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. వీరంతా స్థానికేతరులే కావడం విశేషం. 2009లో జనరల్.. సీటు కొట్టేసిన కేసీఆర్! 2009లో జరిగిన ఎన్నికల్లో తూంకుంట నర్సారెడ్డి గెలుపొందారు. ఆ తర్వాత 2014లో టీఆర్ఎస్ నుంచి కేసీఆర్ పోటీ చేసి విజయం సాధించారు. తొలిసారి గజ్వేల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందడమే కాకుండా స్వరాష్ట్రంలో తొలి ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. ఈ నియోజకవర్గానికి కేసీఆర్ కూడా స్థానికేతరులే కావడం విశేషం. వాస్తవానికి 2008లోనే సీఎం కేసీఆర్ గజ్వేల్‌లో పాగా వేశారు. ఇక్కడ ఫాంహౌజ్ ఏర్పాటు చేసుకుని వ్యవసాయం చేస్తూ తన ఇలాకాగా ప్రకటించుకున్నారు. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడి నుంచి పోటీ చేసి విజయం సాధించారు. నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే అభివృద్ధికి నమూనగా తీర్చిదిద్దుతున్నారు. ఎన్నికలను ప్రభావితం చేసే అంశాలు భూ సేకరణ (జలశాలయాల నిర్మాణంకోసం,కంపెనీల ఏర్పాటు కోసం) సామాన్యుల సమస్యలు పరిష్కారం లేకపోవడం రోడ్లు,పెద్ద భవనాలు తప్ప సామాన్యులకు లబ్ది చేకూరలేదనే అపవాదు రాజకీయ పార్టీల వారిగా పోటీ : బీఆరెస్ పార్టీ కేసీఆర్(బీఆరెస్ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి) కాంగ్రెస్ పార్టీ తుంకుంట నర్సారెడ్డి(జిల్లా అధ్యక్షుడు, గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే) మాదాడి జశ్వంత్ రెడ్డి(టీపీసీసీ మెంబర్,సీనియర్ నాయకుడు రంగారెడ్డి తనయుడు) బండారు శ్రీకాంత్ రావు(టీపీసీసీ ప్రధాన కార్యదర్శి) -
గజ్వేల్ నియోజకవర్గంలో ‘దళితబంధు’ కోసం రోడ్డెక్కిన దళితులు
జగదేవ్‌పూర్(గజ్వేల్): సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న మెదక్ జిల్లా గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గంలో దళితులు రోడెక్కారు. దళితబంధును అర్హులందరికీ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆదివారం దళితులు సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. దళితబంధు అందరికీ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తిగుల్, నిర్మల్‌నగర్, బస్వాపూర్, అలిరాజ్‌పేట గ్రామాల దళితులు ఆందోళన చేశారు. జగదేవ్‌పూర్ –భువనగిరి ప్రధాన రహదారిపై గంటసేపు నిర్మల్ నగర్ దళితులు రాస్తారోకో చేపట్టారు. ధర్నా కారణంగా రహదారిపై కిలోమీటర్ల మేర అటుఇటు వాహనాలు నిలిచిపోయాయి. ఎస్ఐ చంద్రమోహన్ దళితులతో మాట్లాడి సముదాయించి ధర్నాను విరవింపజేశారు. అనంతరం గ్రామపంచాయతీ ఎదుట సర్పంచ్‌కు వ్యతిరేకంగా దళితులు నిరసన చేపట్టారు. తిగుల్‌లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ చౌరస్తాలో దళితులు బైఠాయించి సీఎం కేసీఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేసీఆర్ దిష్టిబొమ్మను ఊరేగించి దహనం చేశారు. బస్వాపూర్‌లోనూ దళితులు నిరసన తెలిపారు. అలిరాజ్‌పేటలో దళితులు రోడ్డుపై ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల దళితులు మాట్లాడుతూ దళితబంధును అర్హులందరికీ ఇవ్వాలని, లేదంటే ఎవరికీ ఇవ్వకూడదని అన్నారు. -
సీఎం కేసీఆర్ ఇలాకాలో అవిశ్వాసం లొల్లి.. షాకిచ్చిన కౌన్సిలర్స్
గజ్వేల్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సొంత నియోజకవర్గంలోని గజ్వేల్ –ప్రజ్ఞాపూర్ మున్సి పాలిటీలో అవిశ్వాసం లొల్లి మొదలైంది. ఒంటెత్తు పోకడలను ప్రదర్శిస్తు న్నాడని ఆరోపిస్తూ అధికార పార్టీకి చెందిన 20 మంది కౌన్సిలర్లలో 14 మంది మున్సిపల్ చైర్మన్ ఎన్సీ రాజమౌళిపై తిరుగుబాటు జెండాను ఎగరేశారు. ఈ క్రమంలోనే వారంతా స్వయంగా సంతకాలు చేసిన అవిశ్వాస తీర్మానాన్ని గురువారం సాయంత్రం జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్‌పాటిల్‌కు అందజేశారు. అనంతరం కౌన్సిలర్లు సంయుక్తంగా విడుదల చేసిన ఓ ప్రకటనలో మున్సిపల్ చైర్మన్ రాజమౌళి తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అవినీతి, అక్రమాలకు పాల్పడుతూ పాలనకు మచ్చ తెస్తున్నాడని ఆరోపించారు. -
సిద్ధమవుతున్న ‘మల్లన్నసాగర్ భగీరథ’
గజ్వేల్: ‘మల్లన్నసాగర్ భగీరథ పథకం’సిద్ధమవుతోంది. మార్చి నెలాఖరులోగా ఈ పథకం పనులను పూర్తి చేయడానికి సంబంధిత యంత్రాంగం ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతోంది. సిద్దిపేట, జనగామ, యాదాద్రి, సూర్యాపేట జిల్లాలకు ఇక ఇక్కడి నుంచే మంచినీటి సరఫరా జరగనుంది. ప్రస్తుతం ఈ జిల్లాలకు ఎల్లంపల్లి నుంచి హైదరాబాద్‌కు వెళ్లే పైప్‌లైన్ నుంచి నీటిని సరఫరా చేస్తుండగా, మార్చి తర్వాత దీనిని హైదరాబాద్‌కే పరిమితం చేసి.. ఈ పైప్‌లైన్‌కు సమాంతరంగా నిర్మిస్తున్న మల్లన్న సాగర్ భగీరథ కొత్త లైన్ ద్వారా మంచినీటి సరఫరా చేపట్టనున్నారు. ఈ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించడానికి సీఎం కార్యాలయ కార్యదర్శి స్మితా సబర్వాల్ శనివారం పర్యటించనున్నట్లు తెలుస్తోంది. కొరత లేకుండా మల్లన్న సాగర్ నుంచి నీరు.. హైదరాబాద్‌లో తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు గోదావరి సుజలస్రవంతి పథకాన్ని పదేళ్ల క్రితం రూ.3,375 కోట్ల వ్యయంతో పూర్తి చేశారు. కరీంనగర్ జిల్లా ఎల్లంపల్లి బ్యారేజీ నుంచి 10 టీఎంసీల నీటిని తరలించేందుకు 186 కిలోమీటర్ల మేర పైప్‌లైన్‌ను ఏర్పాటు చేశారు. ప్రతిరోజూ ఈ లైన్ ద్వారా 735 ఎంఎల్డీ (మిలి యన్ లీటర్స్ పర్ డే) నీటి సరఫరా జరుగుతోంది. ఇందులో సిద్దిపేట, జనగామ, యాదాద్రి, సూర్యాపేట జిల్లాలకు భగీరథ పథకం అవసరాల కోసం సుమారుగా 300 ఎంఎల్డీ నీటిని వాడుకుంటున్నారు. మిగతా నీరు హైదరాబాద్ అసరాలకు వెళ్తుంది. దీనివల్ల హైదరాబాద్‌కు వెళ్లే నీటిలో అప్పుడప్పుడు కొరత ఏర్పడుతోంది. అంతేకాకుండా నీరు తక్కువగా వచ్చినప్పుడు ఈ జిల్లాలకు కూడా ఇబ్బంది ఏర్పడుతోంది. దీంతో ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొనే దిశలో గజ్వేల్ నియోజకవర్గంలోని మల్లన్నసాగర్ నీటిని మిషన్ భగీరథ కోసం వాడు కోవాలని నిర్ణయించారు. ఇందుకోసం కొండపాక మండలం మంగోల్ వద్ద 540 ఎంఎల్డీ సామర్థ్యంతో చేపట్టిన డబ్ల్యూటీపీ పనులు పూర్తి కావొస్తున్నాయి. మార్చి నాటికి హైదరాబాద్ లైన్‌పై నీటిని తీసుకునే వాల్వులను మూసి వేయనున్నారు. సిద్దిపేట, జనగామ, యదాద్రి, సూర్యా పేట జిల్లాలకోసం మల్లన్నసాగర్ నుంచే లైన్లను నిర్మిస్తున్నారు. ఇబ్బంది లేకుండా నీటి సరఫరా.. మల్లన్నసాగర్ మిషన్ భగీరథ పథకం ద్వారా మొదటగా జనగామ జిల్లాకు నీటిని సరఫరా చేస్తారు. మల్లన్నసాగర్ నుంచి కొమురవెల్లి కమాన్ వద్ద గల ఓవర్‌హెడ్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ద్వారా జనగామ జిల్లాకు తాగునీరు వెళ్లనుంది. ఇందుకోసం మల్లన్నసాగర్ నుంచి కొమురవెల్లి కమాన్ వరకు 6.9 కిలోమీటర్ల మేర ప్రత్యేక లైన్ నిర్మించారు. ప్రస్తుతం నీటిని తీసుకుంటున్న హైద రాబాద్ లైన్ వల్ల ఎప్పడైనా నీటి కొరత ఏర్పడితే తాగునీటి సరఫరాలో ఇబ్బందులు ఏర్పడేవి. మార్చి తర్వాత అలాంటి ఇబ్బందులు ఉండవని అధికారులు చెబుతున్నారు. ఇదే తరహాలో సిద్దిపేట, యాదాద్రి, సూర్యాపేట జిల్లాల్లోనూ భగీరథ పథకానికి ప్రత్యేక వ్యవస్థను తీసు కురానున్నారు. స్మితా సబర్వాల్ పర్యటన సందర్భంగా మార్చి ఆఖరులోగా పనులు పూర్తి చేయడానికి దిశానిర్దేశం చేయనున్నారు. మార్చి నెలాఖరులో పనులు పూర్తిచేయడమే లక్ష్యం నాలుగు జిల్లాల తాగునీటి సరఫరాకు సంబంధించి భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడటమే ‘మల్లన్నసాగర్ భగీరథ పథకం’ఉద్దేశం. దీనికి సంబంధించి పనులు సాగుతున్నాయి. మార్చి నెలాఖరు వరకు పనులు పూర్తి చేస్తాం. – రాజయ్య, మిషన్ భగీరథ ఈఈ, గజ్వేల్ -
‘డబుల్’ ఇల్లు ఇవ్వడంలేదని...
కొండపాక(గజ్వేల్): డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణాల్లో భూమిని కోల్పోయానని, అయినా ఇల్లు ఇవ్వలేదని ఆరోపిస్తూ తీవ్ర మనస్తాపం చెందిన ఓ వ్యక్తి కత్తితో పొడుచుకొని ఆత్మహత్యకు యత్నించాడు. ఈ ఘటన కుకునూరుపల్లి మండలం మేదీనీపూర్లో చోటుచేసుకుంది. మేదినీపూర్‌కు ప్రభుత్వం ఐదేళ్ల క్రితం 50 డబుల్ బెడ్రూం ఇళ్లు మంజూరు చేసింది. అయితే ప్రభుత్వస్థలం అందుబాటులో లేకపోవడంతో సర్పంచ్ విరుపాక లావణ్య ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించి స్థానికుడైన నంగి కనకయ్య దంపతులకు చెందిన కొంతస్థలాన్ని డబుల్ బెడ్రూం ఇళ్ల కోసం ఎంపిక చేశారు. ఆ సమయంలో ఇళ్ల నిర్మాణం పూర్తయ్యాక కనకయ్యకు ఒక డబుల్ బెడ్రూం ఇంటిని అందిస్తామని తీర్మానించారు. కాగా, 2022 జూన్ 27న మంత్రి హరీశ్‌రావు చేతుల మీదుగా 48 ఇళ్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. తనకు ఇల్లు కేటాయించలేదని ఆగ్రహించిన కనకయ్య మిగిలిన రెండు ఇళ్లలో ఓ ఇంటిని ఆక్రమించుకొని 6 నెలలుగా నివాసం ఉంటున్నాడు. శుక్రవారం రెవెన్యూ అధికారులు కనకయ్య ఉంటున్న ఇంటికి వెళ్లి ఖాళీ చేయాలని సూచించారు. డబుల్ బెడ్రూంల నిర్మాణంలో 14 గుంటల భూమిని కోల్పోయానని, అయినా తనకు ఇల్లు ఇవ్వలేదని, ఇప్పుడు ఉంటున్న ఇంట్లో నుంచి వెళ్లమంటారా అంటూ మనస్తాపం చెంది కత్తితో పొడుచుకొని ఆత్మహత్యకు యత్నించాడు. చుట్టుపక్కలవారు అప్రమత్తమై అడ్డుకున్నారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ పుష్పరాజ్ ఘటనాస్థలానికి చేరుకొని కనకయ్యకు నచ్చజెప్పారు. ఈ విషయమై తహసీల్దార్ ఆశాజ్యోతిని వివరణ కోరగా సమాధానం దాటవేశారు. సమాఖ్య భవనంలో ఉంటున్నాం... డబుల్ బెడ్రూం నిర్మాణాల్లో ఇంటి స్థలంతోపాటు 12 గుంటల భూమిని కోల్పోయాం. లబ్ధిదారుల జాబితాలో పేరు రావడంతో అధికారులు పట్టా సర్టిఫికెట్ అందజేశారు. కానీ, ఇప్పటివరకు ఇంటిని అప్పగించలేదు. దీంతో మహిళా సమాఖ్య భవనంలో ప్రస్తుతం నివాసం ఉంటున్నాం. అధికారులు స్పందించి త్వరగా ఇంటిని కేటాయించాలి. – మరో బాధితురాలు నంగి ఐలవ్వ -
స్కాన్ చెయ్యి.. కానుక వెయ్యి..
వర్గల్(గజ్వేల్): గుడికొచ్చాం.. దేవుడిని దర్శించుకున్నాం.. అయ్యో హుండీలో వేసేందుకు చిల్లర లేదే.. అని జేబులు తడుముకోవాల్సిన అవసరం లేదంటున్నారు సిద్దిపేట జిల్లా.. నాచారం గుట్ట నాచగిరి శ్రీలక్ష్మీనృసింహక్షేత్ర అధికారులు. ప్రతిచోట ఫోన్ పే, గూగుల్ పే, క్యూఆర్ కోడ్ స్కాన్ ద్వారా డిజిటల్ ద్వారా డబ్బులు చెల్లిస్తున్న కాలమిది. ఇందుకు అనుగుణంగా నాచగిరి సందర్శనకు వచ్చే భక్తుల కోసం ‘ఈ–హుండీ’ ఏర్పాటు చేశారు. ఇందుకోసం ఎస్బీఐలో ఖాతా తెరిచి క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేయించారు. క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసేందుకు నాచగిరీశుని గర్భాలయం ముందర హుండీకి అతికించారు. భక్తులు దైవదర్శనం చేసుకుని ఫోన్‌ద్వారా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ‘ఈ–హుండీ’లో కానుక సమర్పించుకుంటున్నారు. జేబులో డబ్బులు లేవనే బాధ లేకుండా మంచి ఏర్పాట్లు చేశారని భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. -
ఇక ఉచితంగా బాలల గుండె శస్త్ర చికిత్సలు
కొండపాక(గజ్వేల్): ఉచితంగా గుండె శస్త్ర చికిత్సలు అందించేందుకు నెలకొల్పిన బాలల శస్త్ర చికిత్స పరిశోధనాస్పత్రి అపర సంజీవనిగా నిలుస్తుందని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేట జిల్లా కొండపాక శివారులోని ఆనంద నిలయం ఆవరణలో సత్యసాయి సేవాసంస్థ ఆధ్వర్యంలో గురువారం ఆస్పత్రిని సత్యసాయి ట్రస్టు నిర్వహణ ప్రతినిధి సద్గురు మధుసూదన్‌సాయితో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా వందమంది పిల్లల్లో ఒకరు గుండె సంబంధిత వ్యాధులతో ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో లక్షలు వెచ్చించి ఆపరేషన్లు చేయించుకోవడం కంటే సత్యసాయి ఆస్పత్రిలో చికిత్స పొందేలా అవగాహన కల్పించేందుకు కృషి చేస్తామని చెప్పారు. రూ.50 కోట్లతో 100 పడకలు, అధునాతన టెక్నాలజీతో కూడిన ఆస్పత్రి ఏర్పాటు కావడం ఈ ప్రాంత ప్రజల అదృష్టమన్నారు. సత్యసాయి ట్రస్టు నిర్వహణ ప్రతినిధి సద్గురు మధుసూదన్‌సాయి మాట్లాడుతూ తెలంగాణలోని గ్రామీణ ప్రాంత పేద పిల్లలకు వైద్యాలయం ద్వారా గుండె శస్త్ర చికిత్సలను ఉచితంగా అందజేస్తామన్నారు. నవంబరు 23 రోజున సత్యసాయి బాబాకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ వైద్యాలయ సేవలు ప్రారంభిస్తామని చెప్పారు. కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు కేవీ.రమణాచారి, ఎమ్మెల్సీ ఫారుక్ హుస్సేన్, సిద్దిపేట జెడ్పీ చైర్ పర్సన్ వేలేటి రోజాశర్మ తదితరులు పాల్గొన్నారు. -
పత్తి ధర అదుర్స్
గజ్వేల్: గజ్వేల్ మార్కెట్ యార్డులో పత్తి ధర దూకుడు ఆగడం లేదు. శుక్రవారం ఇక్కడ జరిగిన ఈ–నామ్ కొనుగోళ్లలో రాష్ట్రంలోనే అత్యధికంగా క్వింటా రూ.9,040 పలకగా.. తాజాగా అదే వేగం కొనసాగుతోంది. శనివారం జరిగిన కొనుగోళ్లలోనూ క్వింటా గరిష్టంగా రూ.9,055 పలికింది. 13 మంది రైతులు 31.32 క్వింటాళ్ల పత్తిని విక్రయించగా ఈ ధర పలికింది. కనిష్టంగా రూ.8,771 పలికిందని మార్కెట్ కమిటీ కార్యదర్శి జాన్‌వెస్లీ తెలిపారు. సీజన్ ఆరంభం నుంచి ఈ–నామ్ ద్వారా ఇప్పటివరకు 77 మంది రైతులు 170.72 క్వింటాళ్ల పత్తిని విక్రయించారని ఆయన పేర్కొన్నారు. -
వర్గల్ క్షేత్రానికి నవరాత్రి శోభ
వర్గల్(గజ్వేల్): వర్గల్ శంభునికొండపై కొలువుదీరిన శ్రీవిద్యా సరస్వతీ క్షేత్రం సోమవారం నుంచి అక్టోబర్ 4వ తేదీ నవమి వరకు జరిగే శరన్నవరాత్రి మహోత్సవాలకు ముస్తాబైంది. వర్గల్ క్షేత్రానికి సికింద్రాబాద్ నుంచి ఉదయం 8 గంటలకు, 10 గంటలకు, మధ్యాహ్నం 12 గంటలకు, సాయంత్రం 4 గంటలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం ఉంది. ఇవే కాకుండా సికింద్రాబాద్ నుంచి గజ్వేల్, సిద్దిపేట, కరీంనగర్ రూట్లో వెళ్లే ఆర్టీసీ బస్సుల్లో వర్గల్ క్రాస్‌రోడ్డు వరకు వచ్చి, అక్కడి నుంచి ఆటోలో క్షేత్రానికి చేరుకోవచ్చు. నేటి నుంచి నవరాత్రోత్సవాలు సోమవారం అంకురార్పణతో ఉత్సవాలు ప్రారంభ వం అవుతాయి. వచ్చే నెల 2వ తేదీన లక్ష పుష్పార్చన, పల్లకీసేవ, పుస్తక రూపిణి సరస్వతీ పూజ, 4న మంగళవారం మహార్నవమి, అమ్మవారికి అష్టో త్తర కలశాభిషేకం, పూర్ణాహుతి, 5న బుధవారం కలశోద్వాసన, విజయదశమి వేళ అమ్మవారి విజ య దర్శనం, శ్రవణ నక్షత్రం సందర్భంగా శ్రీవెంకటేశ్వరస్వామికి విశేష అభిషేకం జరుగుతుంది. తొమ్మిది రోజులు.. ఉత్సవాల సందర్భంగా తొమ్మిది రోజుల పాటు అమ్మవారు వివిధ రూపాల్లో భక్తులకు దర్శనమిస్తారు. మొదటి రోజు బాలాత్రిపుర సుందరీదేవిగా, రెండో రోజు గాయత్రీదేవిగా, మూడో రోజు లలితాదేవిగా, నాలుగోరోజు అన్నపూర్ణాదేవిగా, ఐదో రోజు మహాలక్ష్మీదేవిగా, ఆరో రోజు రాజరాజేశ్వరిదేవిగా, ఏడో రోజు విద్యాసరస్వతిదేవిగా, ఎనిమిదో రోజు దుర్గాదేవిగా, తొమ్మిదో రోజు మహిషాసుర మర్ధినిగా దర్శనం ఇస్తారని నిర్వాహకులు తెలిపారు. ఏర్పాట్లు పూర్తి వర్గల్ క్షేత్రంలో త్రిశక్తి స్వరూపిణి శ్రీవిద్యాసరస్వతిమాత శరన్నవ నవరాత్రోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశాం. ఉత్సవాలకు పీఠాధిపతులు శ్రీవిద్యాశంకర భారతీస్వామి, శ్రీమాధవానందస్వామి, శ్రీమధుసూదనానందస్వామి హాజరవుతున్నారు. భక్తులకు ఇబ్బంది కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. పార్కింగ్ సదుపాయం, అన్నదానం ఉంటుంది. – చంద్రశేఖరశర్మ సిద్ధాంతి, ఆలయ వ్యవస్థాపక చైర్మన్ -
ప్రారంభానికి సిద్ధం చేయాలి
మర్కూక్(గజ్వేల్): మర్కూక్ పోలీస్ స్టేషన్ అవరణలోని నూతనంగా నిర్మించిన పోలీస్ కాంప్లెక్స్ భవనాలను ప్రారంభానికి సిద్దం చేయాలని పోలీస్ కమిషనర్ శ్వేత తాదేశించారు. శుక్రవారం ఆమె భవనాలను సందర్శించారు. కాంప్లెక్స్ భవనాల పనులను త్వరగా పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధం చేయాలని ఏసీపీ, కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. కార్యక్రమంలో ఏసీపీ రమేశ్, డీఈ రాజయ్య, కాంట్రాక్టర్ ప్రసాద్‌రావు, సీఐ రాజశేఖర్‌రెడ్డి, ఎస్ఐ హరీష్ తదితరులు పాల్గొన్నారు. -
ఏడేళ్ల క్రితం వివాహం.. మళ్లీ స్వప్నతో ప్రేమ.. కట్‌చేస్తే..
సాక్షి, ములుగు(గజ్వేల్): తల్లిదండ్రులు తమ ప్రేమను నిరాకరించారని ప్రేమికులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా ములుగు మండలం అడవి మజీద్ గ్రామ శివారు అటవీ ప్రాంతంలో శనివారం వెలుగు చూసింది. ఎస్ఐ రంగాకృష్ణ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ములుగు మండలంలోని మామిడ్యాల ఆర్అండ్ఆర్ కాలనీకి చెందిన గొట్టి మహేశ్(28)కు ఏడేళ్ల క్రితం వివాహమైంది. ప్రస్తుతం ఇతడి భార్య కృష్ణవేణి గర్భవతి. కాగా మహేశ్ ఆరు నెలలుగా మర్కూక్‌కు చెందిన పదిరి స్వప్న(19)ను ప్రేమిస్తున్నాడు. ఇరువురు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. తాను స్వప్నను పెళ్లి చేసుకుంటానని మహేశ్ తల్లిదండ్రులకు చెప్పగా వారు నిరాకరించారు. స్వప్న తల్లిదండ్రులు సైతం పెళ్లికి ఒప్పుకోలేదు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. మహేశ్ శనివారం తెల్లవారుజామున తమ బంధువు నవీన్‌కు తాము ఉరేసుకుంటున్న స్థలం లొకేషన్‌ను వాట్సాప్‌లో పంపించాడు. అడవిమజీద్ శివారులోని అటవీ ప్రాంతంలో వేప చెట్టుకు మహేశ్, స్వప్న ఉరేసుకున్నారు. కాగా మృతులకు ములుగు పోలీస్‌స్టేషన్‌లో కౌన్సెలింగ్ నిర్వహించినట్లు ఎస్ఐ తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేశామన్నారు. గజ్వేల్ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబీకులకు మృతదేహాలను అప్పగించామని తెలిపారు. చదవండి: (ఒక క్లిక్‌తో డబ్బులు అని ఆశపడితే.. మీ చరిత్ర మొత్తం వారి చేతుల్లోకి..) -
RRR: భూసేకరణ వేగవంతం.. 14 మండలాల్లో వేలాది ఎకరాల...
సాక్షి, గజ్వేల్: నోటిఫికేషన్ అధికారికంగా విడుదల కావడంతో ట్రిపుల్ఆర్ భూసేకరణ ప్రక్రియ జోరందుకుంది. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోడ్డు 110 కిలోమీటర్ల పొడవున విస్తరించే అవకాశమున్నందున.. దీని కోసం 14 మండలాల్లో 73కుపైగా గ్రామాల్లో వేలాది ఎకరాల్లో భూసేకరణ జరగనుంది. ఈక్రమంలో సర్వే పనులను ప్రారంభించారు. ►ఉమ్మడి నల్గొండ జిల్లా చౌటుప్పల్, చిట్యాల నుంచి భువనగిరి– గజ్వేల్ మీదుగా సంగారెడ్డి (కంది) వరకు 65వ నంబరు జాతీయ రహదారిని తాకుతూ 164కి.మీ మేర రహదారి విస్తరించనుంది. ►కంది–శంకర్పల్లి–చేవేళ్ల–షాద్‌నగర్–కడ్తాల్–యాచారం నుంచి (186 కిలోమీటర్లు) తిరిగి చౌటుప్పల్‌ను తాకనుందని ప్రాథమిక సమాచారం. ►ఈ లెక్కన మొత్తంగా 350 కిలోమీటర్ల పొడవునా రీజినల్ రింగు రోడ్డుగా మారనుంది. ఇందులో మొదటి విడతగా ఉత్తర భాగంలో చౌటుప్పుల్ నుంచి సంగారెడ్డి వరకు సుమారు 160 కిలోమీటర్ల మేర పనులు చేపట్టనున్న విషయం తెలిసిందే. ►కాగా ట్రిపుల్ఆర్ వెళ్లే గ్రామాల జాబితాతో కేంద్రం ఇప్పటికే గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయగా.. ఉత్తర భాగంలో 20 మండలాలు, వీటి పరిధిలోని 111 గ్రామాలు ఉన్నాయి. ►ఇందులో భాగంగానే యాదాద్రి–భువనగిరి జిల్లాలో యాదాద్రి, భువనగిరి, తుర్కపల్లి, వలిగొండ, చౌటుప్పల్ మండలాల పరిధిలో 33 గ్రామాలు ఉన్నాయి. ►ప్రత్యేకించి ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలోని 14 మండలాల్లో గల 73కి పైగా గ్రామాల్లో భూసేకరణ జరగనుంది. ఉమ్మడి జిల్లా (సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్) పరిధిలో 110 కిలోమీటర్లపైనే విస్తరించనుంది. ►జగదేవ్‌పూర్–గజ్వేల్–తూప్రాన్–నర్సాపూర్–సంగారెడ్డి మీదుగా కంది వరకు ఈ రోడ్డు విస్తరించనుంది. గ్రామాలు, పట్టణాలు, పాత రోడ్లకు ఎలాంటి ఇబ్బంది లేకుండా భూసేకరణ పూర్తి చేసి పనులు చేపట్టనున్నారు. సర్వే పనులు షురూ.. ►భూసేకరణ జరుగనున్న ఉత్తర భాగంలోని చాలా గ్రామాల్లో ఇప్పటికే పలుమార్లు డిజిటల్ సర్వే చేపట్టారు. ప్రస్తుతం సర్వే నంబర్ల వారీగా ప్రత్యక్ష సర్వే చేపడుతున్నారు. ►ఈ క్రమంలోనే జగదేవ్‌పూర్ మండలం పీర్లపల్లి గ్రామంలో సర్వే జరిపిన సందర్భంలో రైతుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ►గ్రామంలోని 191 సర్వే నంబర్లో 250 ఎకరాల భూమిని ఎన్నో ఏళ్ల కిందట 150 మంది ఎస్సీలు, బీసీలకు అసైన్ చేశారు. అప్పటి నుంచి వీరంతా వ్యవసాయం చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్నారు. ►ఐదేళ్ల క్రితం ఇవే భూముల్లో కంపెనీలు ఏర్పాటు చేస్తామని వీరికి ధరణి వచ్చిన తర్వాత కొత్త పట్టాదార్ పాస్ పుస్తకాలు ఇవ్వలేదు. ►ఈ క్రమంలోనే ఈ భూముల్లో 120 ఎకరాల మేర ట్రిపుల్ఆర్ నిర్మాణానికి సేకరిస్తుండగా.. తమకు ఎలాంటి సమాచారమివ్వకుండా, సర్వే చేపట్టారని ఆరోపిస్తూ సర్వేను అడ్డుకున్న సంగతి విదితమే. ►దీనిపై రెవెన్యూ అధికారులు స్పందించి, సదరు రైతులకు న్యాయం చేసేలా నష్ట పరిహారం కో సం ప్రతిపాదనలు తయారు చేయాల్సి ఉంది. ►ఇక్కడే కాకుండా ఇలాంటి సమస్యలు చాలా చోట్ల ఉన్నాయి. దీని కోసం ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగితేనే భూసేకరణకు అడ్డంకులు ఏర్పడవు. ►ఇకపోతే గజ్వేల్ రెవెన్యూ డివిజన్ పరిధిలో ట్రిపుల్ఆర్ కోసం మొత్తంగా 980 ఎకరాల భూసేకరణ చేపట్టడానికి అధికారులు సన్నద్ధమవుతున్నారు. ►తూప్రాన్, నర్సాపూర్, సంగారెడ్డి ప్రాంతాల్లోనూ భూసేకరణ ప్రక్రియ వేగవంతమవుతోంది. మొత్తంగా ఉమ్మడి మెదక్ జిల్లాలో వే లాది ఎకరాల భూసేకరణ జరగనుండగా, రెవె న్యూ యంత్రాంగం పనిలో నిమగ్నమై ఉంది. వారి సమస్యను పరిష్కరిస్తాం మా డివిజన్ పరిధిలో ట్రిపుల్ఆర్ భూసేకరణకు సంబంధించిన ప్రక్రియను వేగవంతం చేశాం. ఇప్పటికే సర్వే పనులు మొదలయ్యాయి. జగదేవ్‌పూర్ మండలం పీర్లపల్లి రైతులు తమకు న్యాయం చేయాలని సర్వేను అడ్డుకున్నారు. వారి సమస్యను పరిష్కరించడానికి చర్యలు చేపట్టాం. – విజయేందర్‌రెడ్డి, గజ్వేల్ ఆర్డీఓ -
సొంత జాగాల్లో ఇళ్లకు దసరా తరువాత ముహూర్తం
గజ్వేల్: సొంత జాగాల్లో ఇళ్లు నిర్మించుకునేవారికి రూ.3లక్షలు పంపిణీ చేసే పథకానికి దసరా తర్వాత శ్రీకారం చుట్టనున్నామని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు ప్రకటించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం బెజుగామ, శేర్పల్లి గ్రామాల్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మంగళవారం పంపిణీ చేశారు. ఆ తర్వాత గజ్వేల్ పట్టణంలోని మహతి ఆడిటోరియంలో కొత్తగా మంజూరైన ఆసరా పింఛన్లను అందించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభల్లో హరీశ్ మాట్లాడుతూ.. కరోనా వల్ల రెండేళ్లుగా రాష్ట్రానికి ఆదాయం తగ్గడం వల్ల సొంత జాగాల్లో ఇళ్ల నిర్మాణ పథకాన్ని ప్రారంభించలేక పోయామన్నారు. దసరా తర్వాత నిధులు ఇవ్వాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. సాగు పెట్టుబడి తగ్గించి, రాబడి పెంచుతామని చెప్పిన కేంద్రం డీజిల్, ఎరువుల ధరలను పెంచి రైతుల నడ్డి విరిచిందని విమర్శించారు. రైతులకు గొప్పగా ఉపయోగపడుతున్న ఉచిత కరెంట్‌ను కూడా వద్దని చెప్పడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఈ కార్యక్రమాల్లో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు యాదవరెడ్డి, ఫారుఖ్ హుస్సేన్, రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. చదవండి: రాష్ట్రంలోకి అడెల్లు, మంగులు దళాలు! కేసీఆర్ పర్యటన రూటుమార్పు? -
కేసీఆర్‌ను ఓడించకపోతే నా జీవితానికి సార్థకత లేదు
సాక్షి, హైదరాబాద్: గజ్వేల్‌లో పోటీ చేస్తా.. సిద్ధమా? అని తాను సవాలు విసిరితే దానిని స్వీకరించకుండా సీఎం కేసీఆర్ బానిసలతో అవమానకరంగా తిట్టిస్తున్నారని, కేసీఆర్‌ను ఓడించకపోతే తన జీవితానికి సార్ధకతే లేదని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. కేసీఆర్‌కు దమ్ముంటే హుజూరాబాద్ గడ్డ నుంచి తనపై పోటీ చేయాలని సవాల్ విసిరారు. ఊసరవెల్లిలా రంగులు మార్చే వ్యక్తులకు తన గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. చెన్నూరు ఎమ్మెల్యే ఇతరులను అవమానించడం తప్ప, తన జాతి గురించి ఏనాడు పట్టించుకోలేదన్నారు. ఈటల మంగళవారం మీడియాతో మాట్లాడుతూ... ప్రజల విశ్వాసం కోల్పోయిన కేసీఆర్ రాజీనామా చేయాలని, ప్రభుత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్‌చేశారు. హైదరాబాద్ చుట్టుపక్కల అసైన్డ్ భూములను గుంజుకుంటూ కేసీఆర్ రియల్ ఎస్టేట్ బ్రోకర్‌లాగా మారారన్నారు. కేసీఆర్ దృష్టిలో బానిసలే లీడర్లని, ఆత్మాభిమానం ఉన్న వాళ్లు కాదని స్పష్టంచేశారు. ఆత్మగౌరవం ఉన్న మనిషిగా టీఆర్ఎస్కు రాజీనామా చేశానన్నారు. తనకు శత్రువులెవరూ లేరని, టీఆర్ఎస్, కాంగ్రెస్‌లోని మిత్రులు టచ్‌లో ఉన్నారని చెప్పారు. తాను ఎమ్మెల్యే అవుతానని టీఆర్ఎస్లో చేరలేదని, తన ఉద్యమ పటిమ చూసి 2004లో ఎమ్మెల్యేగా చాన్సిచ్చారని, ఇప్పటికీ ఓటమి ఎరగలేదన్నారు. పార్టీలో నుంచి అందరు వెళ్లిపోతున్నా కేసీఆర్ మేకపోతు గంభీర్యం ప్రదర్శిస్తున్నారని విమర్శించారు. -
కాళేశ్వరం పర్యవేక్షణకు ‘కమాండ్ కంట్రోల్’
గజ్వేల్ రూరల్: రాష్ట్రంలోని నదులు, రిజర్వాయర్లు, ప్రధాన కాలువలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించి పరిస్థితులను తెలుసుకునేందుకు ఇరిగేషన్ శాఖ డేటా సపోర్టింగ్ సిస్టంను తయారు చేసిందని.. ఇందులో భాగంగా కాళేశ్వరం ప్రాజెక్టు పర్యవేక్షణ కోసం గజ్వేల్, కరీంనగర్‌లలో కమాండ్ కంట్రోల్ కేంద్రాలను ఏర్పాటు చేశామని రాష్ట్ర నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్‌కుమార్ తెలిపారు. శనివారం ఆయన గజ్వేల్ పట్టణంలోని కాళేశ్వరం ఎస్ఈ కార్యాలయంలో కమాండ్ కంట్రోలింగ్ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్ఈలు, ఈఈలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో పలు జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో నదులు, ప్రాజెక్టుల్లోకి భారీగా వరదనీరు చేరుతున్నప్పటికీ పరిస్థితులు అదుపులోనే ఉన్నాయన్నారు. కమాండ్ కంట్రోల్ కేంద్రాల ద్వారా వరదలు వచ్చినపుడే కాకుండా సాధారణ సమయాల్లోనూ నదులు, ప్రాజెక్టుల సామర్థ్యం, నీటి ప్రవాహ వేగం పరిశీలన, నీటి నిల్వలు, కాలువల కింద ఎంత నీటి అవసరమున్నదనే విషయాలను లెక్కగట్టి నీరు విడుదల చేసే అవకాశముంటుందన్నారు. వరదల జరిగిన నష్టం పునరావృతం కాకుండా ప్రభుత్వం పటిష్టచర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఇటీవల వరదల వల్ల లక్ష్మీ పంప్‌హౌస్‌లోకి వచ్చిన నీటిని తొలగించే పనులు జరుగుతున్నాయని చెప్పారు. ఆయా ప్రాజెక్టుల వద్ద అవసరమైన చర్యలు చేపట్టేందుకు అధికారులంతా అప్రమత్తతతో ఉన్నట్లు వివరించారు. -
గజ్వేల్ రైల్వేస్టేషన్ సరుకు రవాణా మినీహబ్‌గా..
సాక్షి, హైదరాబాద్: గజ్వేల్ రైల్వేస్టేషన్‌ను సరుకు రవాణాకు మినీ హబ్‌గా మార్చేందుకు రైల్వేశాఖ ఏర్పాట్లు చేస్తోంది. సిద్దిపేట మొదలు గజ్వేల్ వరకు చుట్టుపక్కల ప్రాంతాల్లో పండే వివిధ పంటలతోపాటు పండ్లు, పాలు, చేపలను ఇతర ప్రాంతాలకు రైల్వే ద్వారా సరఫరా చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం ఈ ప్రాంతాల నుంచి గూడ్స్ రైళ్ల ద్వారా వాటిని తరలించాలంటే తొలుత సనత్‌నగర్ రైల్వే యార్డుకు చేర్చాల్సి వస్తోంది. దీంతో ఎక్కువ మంది వ్యాపారులు లారీల ద్వారానే ఇతర ప్రాంతాలకు సరుకు పంపుతున్నారు. తాజాగా రైల్వే ద్వారా సరుకు రవాణాకు గజ్వేల్‌ను ఎంపిక చేయడంతో దక్షిణమధ్య రైల్వే, భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) మధ్య ఇందుకు సంబంధించి అవగాహన కుదిరింది. ఇటీవల భేటీ అయిన రెండు విభాగాల అధికారులు.. ఇందుకుగల డిమాండ్‌పై చర్చించారు. నిత్యం 500కుపైగా లారీలు: పూర్తిగా వ్యవసాయాధారిత ప్రాంతాలైన సిద్దిపేట, గజ్వేల్‌లలో వరి, మొక్కజొన్న, పత్తి, మిరప, కూరగాయలు, పప్పుధాన్యాలు బాగా పండుతాయి. పాడి కూడా విస్తారంగా ఉంది. ఈ ప్రాంతాల నుంచి ప్రస్తుతం నిత్యం 500కుపైగా లారీల్లో సరుకును కొందరు వ్యాపారులు సనత్‌నగర్‌కు తరలించి అక్కడి యార్డు ద్వారా గూడ్స్ రైళ్లలోకి తరలిస్తున్న ప్పటికీ ఖర్చు ఎక్కువగా అవుతోంది. మరోవైపు రైల్వేశాఖ ఇటీవల కొన్ని నిబంధనలను సడలించి విడివిడిగా లారీల్లో సరుకు తెచ్చినా కూడా వ్యాగన్లను కేటాయిస్తోంది. తాజాగా గజ్వేల్ స్టేషన్ వద్ద సరుకు రవాణాకు వీలుగా రైల్వేశాఖ పెద్ద యార్డును సిద్ధం చేసింది. ఇటీవలే హైదరాబాద్ డీఆర్ఎం శరత్‌చంద్రాయణ్ ఇతర అధికారులతో ఆ ప్రాంతాన్ని పరిశీలించి యార్డు వరకు లారీలు వచ్చేలా రోడ్లు సిద్ధం చేయాలని ఆదేశించారు. ఆ పనులు పూర్తయ్యాయి. వ్యాపారులతో మాట్లాడి సరుకు ఇండెంట్ ఇవ్వాలని ఎఫ్‌సీఐని రైల్వే అధికారులు కోరారు. ఇండెంట్ రాగానే గూడ్సు రైళ్లు ప్రారంభం కానున్నాయి. -
కేసీఆర్ తాతా! మా మొర వినండి.. ‘జడ వేసే టైమ్ లేక జుట్టు కట్ చేయించింది!’
నా పేరు వి.శ్రీనిత. ఫోర్త్ క్లాస్ చదువుతున్నాను. మేము దుండిగల్‌లో ఉంటాం. మా మమ్మీ అర్చన దుండిగల్‌లోని ఉన్నత పాఠశాలలో హిందీ టీచర్‌గా పనిచేసేది. మా డాడీ పేరు కేశవనారాయణ మేడ్చల్ జిల్లా మల్లంపేట ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్నారు. కానీ 317 జీఓ వల్ల మా మమ్మీ మాకు 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న రంగారెడ్డి జిల్లా కుల్‌కుల్ ఉన్నత పాఠశాలకు ట్రాన్స్ఫర్ అయింది. అప్పటి నుంచి మాకు పెద్ద కష్టమొచ్చింది. నేను లేవకముందే మమ్మీ వెళ్తుంది. రాత్రి పడుకున్నాక వస్తుంది. సెలవు రోజుల్లోనే మా మమ్మీని చూస్తున్నా.. జడ వేయడానికి టైమ్ ఉండటం లేదని జుట్టు కట్ చేయించింది. కేసీఆర్ తాతా... మా మమ్మీ, డాడీని ఒకే జిల్లాలో పనిచేసేలా చూడు ప్లీజ్. లాంగ్ జర్నీ వల్ల మా మమ్మీ హెల్త్ దెబ్బతింటుంది. ప్లీజ్ కన్సిడర్.. గజ్వేల్: 317 జీఓ కారణంగా వివిధ ప్రాంతాలకు బదిలీ అయిన ఎంతో మంది ఉద్యోగ, ఉపాధాయులు ఎదుర్కొంటున్న ఇబ్బందులేకాక, వారి పిల్లల కష్టాలకు శ్రీనిత వేడుకోలు నిదర్శనంగా నిలుస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో ఆదివారం జరిగిన స్పౌజ్ ఉపాధ్యాయ, ఉద్యోగుల సభ ఆద్యంతం ఉద్విగ్నం, ఉద్వేగ పరిస్థితుల మధ్య సాగింది. తమ సమస్య ముఖ్యమంత్రి దృష్టికి వెళ్లాలనే ఉద్దేశంతో గజ్వేల్‌ను వేదికగా చేసుకొని కేసీఆర్ ఫొటోను బ్యానర్‌గా పెట్టుకొని మరీ ఈ సభను ఏర్పాటు చేశారు. స్పౌజ్ బదిలీలను ప్రభుత్వం బ్లాక్ చేసిన సిద్దిపేటతోపాటు ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, సంగారెడ్డి, సూర్యాపేట, ఖమ్మం, రంగారెడ్డి, మేడ్చల్, మంచిర్యాల, హనుమకొండ, మహబూబ్‌నగర్ జిల్లాలకు చెందిన బాధిత ఉపాధ్యాయ, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఇక్కడ సభ నిర్వహించారు. సభలో పలువురు మహిళా టీచర్లు, ఉద్యోగులు మాట్లాడుతూ 317 జీఓ వల్ల సుదూర ప్రాంతాలకు బదిలీ అయ్యామని, సీఎం కేసీఆర్.. ఖాళీలున్న జిల్లాల్లో వెంటనే స్పౌజ్ బదిలీలు చేపట్టాలని ఆదేశించినా, సంబంధిత అధికారులు పట్టించుకోవడంలేదని, అందువల్ల తాము కుటుంబాలకు దూరమవుతున్నామని కంటతడి పెట్టుకున్నారు. బాధితుల సంఘం అధ్యక్షుడు వివేక్, ప్రధాన కార్యదర్శి నరేశ్‌లు మాట్లాడుతూ 317 జీఓ వల్ల వేర్వేరు జిల్లాలకు బదిలీ అయిన వారిని తమ సొంత జిల్లాలకు కేటాయించాలని సీఎం ఆదేశించినా అధికారులు పట్టించుకోకపోవడం దారుణమని అన్నారు. 13 జిల్లాల్లో స్పౌజ్ బదిలీలు నిలిచిపోవడం వల్ల దాదాపు 2,300 ఉపాధ్యాయ, ఉద్యోగ కుటుంబాల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని వారు వాపోయారు. భర్త ఒక జిల్లాలో, భార్య మరో జిల్లాలో పనిచేయాల్సి రావడం వల్ల వారి కుటుంబాలు తీవ్రమైన ఆవేదనలో ఉన్నాయని, ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరారు. సభలో స్పౌజ్ బాధితుల సంఘం సభ్యులు ఎ.మల్లికార్జున్, ఖాదర్, త్రివేణి, అర్చన, గడ్డం కృష్ణ, బాలస్వామి, మహేశ్, ప్రవీణ్, చంద్రశేఖర్, దామోదర్, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. -
బంధువుల ఇంటికి వెళ్తుండగా..
జగదేవ్‌పూర్ (గజ్వేల్): బంధువుల ఇంట్లో జరిగే ఓ కార్యానికి ఆటోలో వెళ్తుండగా, ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. సిద్దిపేట జిల్లాలో గురువారం ఈ ఘటన జరిగింది. జగదేవ్‌పూర్ గ్రామానికి చెందిన కొట్టాల కవిత (31), కొట్టాల లలిత (38), కొంతం చంద్రయ్య(47), కొంతం లక్ష్మి, శ్రీపతి కనకమ్మలు జగదేవ్‌పూర్‌కే చెందిన శ్రీగిరిపల్లి కనకయ్య(33)కు చెందిన ఆటోలో మెదక్ జిల్లా తూప్రాన్ మండల పరిధిలోని ఇస్లాంపూర్‌కు బంధువుల ఇంట్లో జరిగే ఓ కార్యానికి బయలుదేరారు. అలిరాజ్‌పేట గ్రామ శివారులోకి రాగానే ఎదురుగా వచ్చిన లారీ వీరి ఆటోను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్ కనకయ్య, కవిత అక్కడికక్కడే మృతి చెందారు. కొంతం చంద్రయ్య, లక్ష్మి, లలిత, కనకమ్మలకు తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలిసిన వెంటనే ఎస్ఐ కృష్ణమూర్తి సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను గజ్వేల్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌కు తీసుకెళ్తుండగా, కొంతం చంద్రయ్య, కొట్టాల లలిత మృతి చెందారు. మృతుల్లో కవిత, లలిత తోటి కోడళ్లు. భార్యాభర్తల్లో చంద్రయ్య మృతి చెందగా, భార్య లక్ష్మి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. మృతులు, గాయపడిన వారంతా కూలి పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
Crime News: ఆమెకు పెళ్ళైంది కానీ..
జగదేవ్‌పూర్(గజ్వేల్): ఆమెకు పెళ్లైంది. కానీ, ఇన్నాళ్లలో భర్తతో ప్రేమగా ఏనాడూ మాట్లాడింది లేదు. దగ్గరకు రానిచ్చింది లేదు. కారణం.. ఆమె మనసులో మరో వ్యక్తి ఉన్నాడు. పెళ్లయ్యాక మరో వ్యక్తిని ఇష్టపడింది ఆమె. ఇద్దరూ గప్‌చుప్‌గా చెట్టాపట్టాల్ వేసుకుని తిరిగారు. విషయం ఇంట్లో తెలిసింది. కోపడ్డారు. కలిసి బతకడం సాధ్యం కాదనుకుంది.. ఆత్మహత్యతో ప్రాణం తీసుకున్నారు. సిద్దిపేట జిల్లా జగదేవ్‌పూర్ మండలం పీర్లపల్లి అటవీ ప్రాంతంలోని మంగళవారం రాత్రి యువతి, యువకుడి మృతదేహాలు లభ్యమాయ్యాయి. సమాచారం తెలుసుకున్న జగదేవ్‌పూర్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. యువకుడి ఆధార్‌కార్డు, ద్విచక్రవాహనం ఆర్సీ లభించడంతో వాటి ఆధారంగా వివరాలను సేకరించారు. ఎస్ఐ కృష్ణమూర్తి వివరాల ప్రకారం రాజన్న సిరిసిల్ల ప్రాంతానికి చెందిన పూజ(26), రాజీవ్‌నగర్‌కు చెందిన నామా వేణుగోపాల్(24) సిరిసిల్లలో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో పనిచేస్తున్నట్లు గుర్తించారు. చాలాకాలంగా ఇద్దరూ ప్రేమలో ఉన్నారు. విషయం ఇంట్లో తెలిసి పెద్దలు మందలించారు. ఈ నెల పదిహేనవ తేదీన డ్యూటీకి అని వెళ్లి.. పూజ తిరిగి రాలేదు. దీంతో తన భార్య కనిపించకుండా పోయిందని సిరిసిల్ల టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు పూజ భర్త. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. మంగళవారం రాత్రి పీర్లపల్లి అటవీ ప్రాంతంలో ఓ చెట్టుకు వేలాడుతున్న శవాలను స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ఆధార్‌కార్డు ఆధారంగా పూర్తి వివరాలను సేకరించారు. ముఖాలు గుర్తు పట్టలేనంతగా మారిపోవడంతో.. ఉరేసుకుని చాలారోజులై ఉంటుందని మృతి చెందినట్లు పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని పంచనామా చేసి మృతదేహాలను గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు ఎస్ఐ తెలిపారు. -
సిద్దిపేట వస్తే వాస్తవాలు చూపిస్తా..
గజ్వేల్: కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఒక్క ఎకరానికి కూడా నీరు పారలేదని తొండి మాటలు మాట్లాడే బీజేపీ నేతలు గజ్వేల్, దుబ్బాక, సిద్దిపేట అసెంబ్లీ నియోజకవర్గాలకు వస్తే వాస్తవాలు చూపిస్తామని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్‌రావు అన్నారు. శుక్రవారం గజ్వేల్ నియోజకవర్గంలోని ములుగు, వర్గల్, మర్కుక్, గజ్వేల్, కొండపాక మండలాల్లో రూ.33.95 కోట్లతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులకు ఎమ్మెల్సీ యాదవరెడ్డి, రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి, జడ్పీ చైర్మన్ రోజాశర్మలతో కలసి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఆయా సభల్లో హరీశ్‌రావు మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలతో తమ ఉనికిని కోల్పోతామన్న భయంతోనే బీజేపీ, కాంగ్రెస్ నేతలు అడ్డగోలుగా విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కరువునేల పరవశించేలా చేశామని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఈ ప్రాంతంలో 99 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండితే, ఆ తర్వాత 2 కోట్ల 59 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తోందని చెప్పారు. కాంగ్రెస్ హయాంలో కరెంటు కోసం ఎదురు చూపులు ఉండేవని, వ్యవసాయ రంగం జవసత్వాలను కోల్పోయిందని ఆరోపించారు. సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారని, దేశంలో ఎక్కడా లేనివిధంగా ఇంటింటికీ స్వచ్ఛ మైన నల్లా నీటిని అందిస్తున్న ఏకైక సీఎం కేసీఆర్ అని కొనియాడారు. వ్యవసాయ రంగంలో తీసు కుంటున్న నిర్ణయాల వల్ల ఉత్పాదకత పెరిగిందన్నారు. పామాయిల్ తోటలసాగును ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని, ఈసారి బడ్జెట్లో వీటికి రూ.వెయ్యి కోట్లను కేటాయించినట్లు చెప్పారు. రైతులు పామాయిల్ తోటల సాగు వైపు మొగ్గు చూపాలని సూచించారు. -
మొదట జనగామకే ‘మల్లన్న’
గజ్వేల్: ‘మల్లన్నసాగర్ భగీరథ పథకం’ సిద్ధమవుతోంది. రూ.1,100 కోట్లతో చేపడుతున్న ఈ పథకం ద్వారా జూన్ కల్లా జనగామ జిల్లాకు మంచినీటిని అందించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. జనగామతో పాటు గ్రేటర్ హైదరాబాద్, సిద్దిపేట, మేడ్చల్, యాదాద్రి, మెదక్ జిల్లాలకూ మల్లన్నసాగర్ రిజర్వాయర్ నీరందించేందుకు అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. ఈ జిల్లాలకు ప్రస్తుతం ఏర్పడుతున్న నీటి కొరతను అధిగమించేందుకు ఎల్లంపల్లి నుంచి హైదరాబాద్ వేసిన లైన్‌కు సమాంతరంగా మరో లైన్‌ను నిర్మించి జూన్‌లోపు అందుబాటులోకి తెచ్చేలా అధికారులు కార్యాచరణ సిద్ధం చేశారు. నీటి కొరతను అధిగమించేందుకు.. జంటనగరాల్లో తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు పదేళ్ల క్రితం రూ.3,375 కోట్ల అంచనాతో గోదావరి సుజల స్రవంతి పథకాన్ని చేపట్టి పూర్తి చేశారు. కరీంనగర్ జిల్లా ఎల్లంపల్లి బ్యారేజీ నుంచి 10 టీఎంసీల నీటి తరలింపు లక్ష్యంగా 186 కిలోమీటర్ల మేర పైప్‌లైన్ ఏర్పాటు చేశారు. ఈ లైన్ ద్వారా నిత్యం 735 ఎంఎల్డీ నీటి సరఫరా జరుగుతుండగా సిద్దిపేట, జనగామ, యాదాద్రి, మేడ్చల్, మెదక్ జిల్లాల్లో అవసరాలకు సుమారుగా 300 ఎంఎల్‌డీలను పంపిణీ చేస్తున్నారు. మిగతా నీరు హైదరాబాద్ నగరానికి తరలిస్తున్నారు. అయితే కొండపాక, ప్రజ్ఞాపూర్ వద్ద సిద్దిపేట, జనగామ జిల్లాల అవసరాల కోసం ఈ లైన్‌పై నీటిని ట్యాపింగ్ చేస్తుండటంతో హైదరాబాద్ నగరానికి నీటి కొరత ఏర్పడుతోంది. లైన్లో ఏదైనా సమస్య వస్తే జిల్లాలోని అన్ని ప్రాంతాల వారూ తాగునీటికి ఇబ్బంది పడేవారు. ఈ పరిస్థితులను అధిగమించేందుకు మల్లన్నసాగర్ భగీరథ పథకం ప్రారంభించారు. అంతా మల్లన్నసాగర్ నుంచే వాడుకునేలా.. 50 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన మల్లన్నసాగర్ రిజర్వాయర్ తెలంగాణలోని పలు జిల్లాల్లో సాగుతో పాటు, తాగునీటికి ఏటా 10 టీఎంసీలు కేటాయించేలా ప్రణాళిక సిద్ధం చేశారు. రిజర్వాయర్‌లోని ఆఖరి టీఎంసీ నీటిని కూడా వాడుకునేలా డిజైన్ చేశారు. కొండపాక మండలం మం గోల్ వద్ద రాష్ట్రంలోనే అతి పెద్దదైన 540 ఎంఎల్డీ సామర్థ్యం గల వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ పను లు చేపట్టారు. జూన్‌లోపు హైదరాబాద్ లైన్‌పై ఉన్న ట్యాపింగ్‌లను మూసేసి మల్లన్నసాగర్ స్టోరేజీ నుంచే నీటిని అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మల్లన్నసాగర్ నుంచి మొదటగా జనగామ జిల్లాకు నీటి సరఫరా జరగనుంది. నీటిని తరలించేందుకు కొమురవెల్లి కమాన్ వద్ద గల ఓవర్ హెడ్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ద్వారా 6.9 కిలోమీటర్ల మేర ప్రత్యేక లైన్ నిర్మించారు. -
సరుకు రవాణా హబ్‌గా గజ్వేల్
సాక్షి, హైదరాబాద్: గజ్వేల్ స్టేషన్‌ను సరుకు రవాణా హబ్‌గా మార్చాలని దక్షిణమధ్య రైల్వే భావిస్తోంది. ఈ మేరకు త్వరలో సరుకు రవాణా రైళ్లను ప్రారంభించాలని సంబంధిత విభాగం ప్రతిపాదించింది. ఈ ప్రాంతం నుంచి వ్యవసాయ ఉత్పత్తులను ఇతర ప్రాంతాలకు తరలించడంతోపాటు, ఎరువులను ఇతర ప్రాంతాల నుంచి గజ్వేల్‌కు చేరవేయాలని అధికారులు భావిస్తున్నారు. గజ్వేల్ స్టేషన్ వద్ద మొత్తం ఐదు లైన్లు ఉండగా, ఒక లైన్‌ను గూడ్సుకు కేటాయించారు. ఇక్కడ 755 మీటర్ల పొడవు, 25 మీటర్ల వెడల్పుతో సరుకుల కోసం ప్రత్యేక ప్లాట్‌ఫామ్ నిర్మించారు. ప్రయాణికుల రైళ్లు ప్రారంభించేందుకు అన్నీ సిద్ధంగా ఉన్నా, కోవిడ్ ఆంక్షలతో ఇంతకాలం ప్రారంభించలేదు. ఆంక్షలు సడలినా ఆ జాప్యం కొనసాగుతూనే ఉంది. సరుకు రవాణా రైలు అంశం జోన్ పరిధిలోనిది అయినందున, వెంటనే ప్రారంభించాలని అధికారులు కోరుతున్నారు. రైల్వే రవాణా ఖర్చు తక్కువ... గజ్వేల్ పరిసర ప్రాంతాల్లో, సిద్దిపేట వరకు విస్తారంగా సాగుభూములున్నాయి. వరి, మొక్కజొన్న, కూరగాయలు, పత్తి, మిరప లాంటివి బాగా పండుతున్నాయి. ఇక్కడి నుంచి సేకరించే ధాన్యా న్ని రోడ్డు మార్గాన వ్యాపారులు ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇప్పుడు వీటి తరలింపునకు రైళ్లను ప్రారంభిస్తే మంచి డిమాండ్ ఉంటుందని రైల్వే యంత్రాంగం నిర్ధారించింది. దీంతోపాటు పాలు కూడా సేకరించవచ్చని నిర్ణయించారు. ఇక ఈ ప్రాంతంలో ఎరువుల వినియోగం ఎక్కువ. నిత్యం ఇతర రాష్ట్రాల నుంచి లారీల ద్వారా ఎరువులు వస్తుంటాయి. రైళ్లను ప్రారంభిస్తే వాటి ద్వారానే ఎరువులను గజ్వేల్‌కు చేరవేసే వీలుంటుంది. లారీలతో పోలిస్తే రైళ్ల ద్వారా రవాణా ఖర్చు తక్కువే అయినందున వ్యాపారులు కూడా ముందుకొస్తారని అధికారులంటున్నారు. త్వరలోనే గజ్వేల్ నుంచి సరుకు రవాణా రైళ్లు ప్రారంభమవుతాయని వారు పేర్కొంటున్నారు. -
సీఎం కేసీఆర్‌తో ప్రకాశ్ రాజ్ భేటీ!
Prakash Raj Meets Telangana CM KCR: సినీ నటుడు ప్రకాశ్‌రాజ్ శనివారం మల్లన్న సాగర్ రిజర్వాయర్‌ను సందర్శించారు. అలాగే గజ్వేల్ పట్టణంలోని ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్‌ను కూడా ఆయన పరిశీలించారు. దేశంలోనే ఎక్కడాలేని విధంగా ఒకేచోట అన్ని నిత్యావసరాలు దొరికేలా విశాలమైనమార్కెట్‌ను నిర్మించడం అభినందనీయమని కొనియాడారు. వ్యవసాయ మార్కెట్‌కు సంబంధించిన అంశాలను చైర్పర్సన్ మాదాసు అన్నపూర్ణ శ్రీనివాస్‌ను అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత మహతి ఆడిటోరియం, ఆర్అండ్ఆర్ కాలనీలను సందర్శించారు. అంతకుముందు మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ వద్దకు వెళ్లి అక్కడ పంప్‌హౌస్, కట్టను పరిశీలించారు. ప్రకాశ్‌రాజ్ శుక్రవారం సాయంత్రం సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని సీఎం వ్యవసాయ క్షేత్రంలో ఆయనను మర్యాద పూర్వకంగా కలిశారు. సాయంత్రం అక్కడే బస చేసి ఉదయం మల్లన్న సాగర్‌ను సందర్శించారు. శనివారం సాయంత్రం మళ్లీ ఫాంహౌస్‌కు వెళ్లినట్లు విశ్వసనీయ సమాచారం. -
‘ద్రాక్ష’కు పూర్వ వైభవమే లక్ష్యం
గజ్వేల్: రాష్ట్రంలో ద్రాక్ష సాగుకు పూర్వవైభవం తీసుకొచ్చేందుకు ఉద్యానవనశాఖ సిద్ధమవుతోంది. ఒకప్పుడు ద్రాక్షకు హబ్‌గా ఉన్న ఉమ్మడి మెదక్, రంగారెడ్డి జిల్లాలతోపాటు సాగుకు అనుకూలంగా ఉన్న మహబూబ్‌నగర్, నల్లగొండ, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో రైతులను ప్రోత్సహించేందుకు ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. ఇందులో సిద్దిపేట జిల్లా ములుగు కొండాలక్ష్మణ్ బాపూజీ ఉద్యానవర్సిటీ కీలకంగా వ్యవహరించనుంది. రాజేంద్రనగర్‌లోని ఉద్యాన కళాశాలలో శనివారం నిర్వహించిన సదస్సులో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. గతంలో 50వేల ఎకరాల్లో సాగు.. రాష్ట్రంలో ద్రాక్ష సాగుకు ఒకప్పుడు ఉమ్మడి మెదక్, రంగారెడ్డి జిల్లాలే ఆధారం. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోనూ కొంత సాగయ్యేది. ఏటా 50వేల ఎకరాలకుపైగా తోటల్లో పండేది. ద్రాక్ష గజ్వేల్ సాగులో సింహభాగాన్ని ఆక్రమించేది. సీడ్లెస్ థామ్సన్, తాజ్గణేష్ రకాలను ప్రధానంగా సాగుచేసేవారు. విదేశాలతోపాటు ఇతర రాష్ట్రాలకు కూడా ఎగుమతి అయ్యేది. ప్రతికూల వాతావరణ పరిస్థితులతో ద్రాక్ష రైతులు కోట్లలో నష్టపోయారు. దీంతో అక్కడ సాగు కనుమరుగైంది. ప్రస్తుతం సిద్దిపేట జిల్లా కొండపాక మండలం కుకునూర్‌పల్లిలో రవీందర్‌రెడ్డి అనే రైతు, విశ్వనాథపల్లిలో ధర్మారెడ్డితోపాటు జిల్లాలోని మరో 10మంది రైతులు కలిసి 88ఎకరాల్లో సాగు చేస్తున్నారు. రాష్ట్ర అవసరాలకు ప్రస్తుతం మహారాష్ట్ర నుంచి ద్రాక్ష దిగుమతి అవుతోంది. సాగు పెంపునకు ఏం చేద్ధాం? రాజేంద్రనగర్‌లోని ఉద్యానవన కళాశాలలో జరిగిన మేధోమథన సదస్సులో వర్సిటీ వైస్ చాన్స్‌లర్ డాక్టర్ నీరజాప్రభాకర్, ఉద్యాన శాఖ కమిషనర్ వెంకట్రామ్రెడ్డి, వైఎస్సార్‌హెచ్‌యూ మాజీ చాన్స్‌లర్ డాక్టర్ శిఖామణి, జాతీయ ద్రాక్ష పరిశోధనా సంస్థ డైరెక్టర్ సోమ్‌కుమార్ పాల్గొన్నారు. ఏటా వెయ్యి ఎకరాల్లో ద్రాక్ష సాగు, అధిక దిగుబడి రకాలు, కొత్త వంగడాలపై రైతులకు అవగాహన తదితర అంశాలపై నిర్ణయాలు తీసుకున్నారు. పుణేలోని జాతీయ ద్రాక్ష పరిశోధనా సంస్థ సహకారంతో లాభసాటి రకాల వృద్ధి, సాగు విస్తీర్ణం పెంపు లక్ష్యంగా ప్రణాళిక చేశారు. ఇది కొద్ది రోజుల్లోనే కార్యరూపం దాల్చనుందని ములుగు వర్సిటీ రిజిస్ట్రార్ భగవాన్ ‘సాక్షి’కి చెప్పారు. -
ఎంత పనిచేస్తివి.. ఏ కష్టం రానీయకుండా చూసుకున్నం కదామ్మా!
గజ్వేల్ రూరల్: పెళ్లయిన 15 ఏళ్లకు పుట్టిన కూతురు. అల్లారుముద్దుగా పెంచుకున్నారు. కానీ ప్రేమ పేరుతో ఓ యువకుడు వేధించాడు. యువతి ఇల్లు, కాలేజీ చుట్టూ తిరుగుతూ ఇబ్బందిపెట్టాడు. విషయం తల్లిదండ్రులకు తెలిసి మందలించినా వేధింపులు ఆపలేదు. దీంతో మనస్తాపం చెందిన విద్యార్థిని ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. గజ్వేల్ పట్టణంలో శుక్రవారం ఈ విషాదం జరిగింది. ఆరు నెలలుగా వేధింపులు.. గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని గుండన్నపల్లికి చెందిన ఎల్ల యాదగిరి, అండాలు దంపతులు వ్యవసాయంతో పాటు మొక్కజొన్న కంకులను అమ్ముతూ జీవనం సాగిస్తున్నారు. వీరికి పెళ్లైన 15 ఏళ్లకు సంగీత (17) పుట్టింది. ప్రస్తుతం సంగీత గజ్వేల్‌లోని ఓ ప్రైవేటు కాలేజీలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. ప్రజ్ఞాపూర్‌కు చెందిన సల్ల శ్రీకాంత్ అలియాస్ అర్జున్ అనే యువకుడు 6 నెలలుగా గుండన్నపల్లిలో సంగీత ఇంటి ముందు, కళాశాలకు వెళ్లే సమయంలో వెంబడిస్తూ ప్రేమించాలని వేధిస్తున్నాడు. విషయం సంగీత కుటుంబీకులకు తెలియడంతో 2 నెలల క్రితం యువకుడిని మందలించారు. కొద్ది రోజులు మిన్నకున్న తర్వాత మళ్లీ వారం రోజులుగా ఆ యువకుడు వెంబడించడం ప్రారంభించాడు. తనను ప్రేమించాలని, లేకుంటే తనతో కలిసి దిగిన ఫొటోలను అందరికీ చూపిస్తానని బెదిరించాడు. ఈ విషయాన్ని సంగీత ఇంటి పక్కన ఉండే బాబాయి కూతురితో చెప్పుకొని బాధపడింది. కాలేజీకి వెళ్లి వచ్చేందుకు కుటుంబీకులను తోడు తీసుకెళ్లేది. శ్రీకాంత్ వేధింపులతో మనస్తాపానికి గురై కళాశాలకు కూడా వెళ్లలేక బాధపడేది. చెల్లెలితో మాట్లాడి.. ఇంటికెళ్లి.. పరీక్షలు సమీపిస్తుండటంతో సంగీత గురువారం కళాశాలకు వెళ్లి వచ్చింది. సాయంత్రం ఇంటి పక్కనే ఉండే చెల్లెలితో కొద్దిసేపు మాట్లాడింది. తల్లిదండ్రు లు మొక్కజొన్న కంకులను విక్రయించేందుకు వెళ్లగా ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కాసేపటి తర్వాత గుర్తించిన కుటుంబీకులు తలుపులు తెరిచి చూడగా సంగీత విగతజీవిగా కనిపించింది. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గజ్వేల్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సంగీత ఆత్మహత్య విషయం తెలుసుకున్న తోటి మిత్రులు, విద్యార్థులు శుక్రవారం ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. సంగీత ఫొటోలతో ప్లకార్డులను పట్టుకొని న్యాయం చేయాలని, ఆమె మృతికి కారణమైన యువకుడిని శిక్షించాలని డిమాండ్ చేశారు. న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. కడుపుకోత మిగిల్చావు బిడ్డా ‘అయ్యో బిడ్డా.. ఎంత పనిచేస్తివి. ఒక్కగానొక్క కూతురు. ఏ కష్టం రానీయకుండా చూసుకున్నం. నువ్వు దూరమై మాకు కడుపుకోత మిగిల్చావు’అంటూ సంగీత తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యేలా ఏడ్చారు. శ్రీకాంత్ అనే యువకుడు కొంతకాలంగా ప్రేమ పేరుతో వేధించడంతో పాటు చంపుతానని బెదిరించడంతో తమ కూతురు మనోవేదనకు గురై ఆత్మహత్య చేసుకుందన్నారు. సంగీత చావుకు కారణమైన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. -
పెండింగ్ పనులు పూర్తి చేయండి
గజ్వేల్: తన సొంత నియోజకవర్గం గజ్వేల్‌పై మరింత ఫోకస్ పెంచాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. ఆదివారం సాయంత్రం సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి, ఎమ్మెల్సీలు యాదవరెడ్డి, వెంకట్రామిరెడ్డిలతో పాటు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శులతో ప్రత్యేక సమీక్ష నిర్వహించినట్లు తెలిసింది. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని గజ్వేల్, ములుగు, వర్గల్, కొండపాక, మర్కూక్, తూప్రాన్, మనోహరాబాద్ మండలాల సమగ్రాభివృద్ధిపై చర్చించారు. నియోజకవర్గంలో ఇప్పటికే చాలా పనులను పూర్తి చేయగలిగామని, పెండింగ్‌లో ఉన్న పనులను కూడా వెంటనే చేపట్టాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పినట్లు తెలుస్తోంది. ప్రధానంగా నియోజకవర్గంలో ఇళ్లు లేనివారికి ఇళ్ల కేటాయింపు, మండల కేంద్రాల్లో కొత్తగా కల్పించాల్సిన మౌలిక సదుపాయాలు, నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో పెండింగ్‌లో ఉన్న ఇతర పనులను వెంటనే పూర్తి చేయడానికి కార్యాచరణ సిద్ధం చేయాలని ఆదేశించినట్లు సమాచారం. అంతేకాకుండా గజ్వేల్ పట్టణంలో అంతర్జాతీయ ప్రమాణాలతో స్పోర్ట్స్ విలేజ్ నిర్మాణానికి చర్యలు చేపట్టాలని కూడా ఆదేశాలిచ్చినట్లు తెలిసింది. అధికారులు బృందంగా ఏర్పడి క్షేత్రస్థాయి పరిశీలన తర్వాత ఏయే పనులు చేపట్టాలనే అంశంపై ప్రతిపాదనలు చేపట్టాలని సూచించినట్లు సమాచారం. -
విషాదం: రూ.25 లక్షల కట్నం, బంగారు ఆభరణాలు.. అయినా చాల్లేదు..
సాక్షి, మెదక్ (గజ్వేల్): జగదేవ్‌పూర్‌లో పండగ పూట ఆ ఇంట విషాదం నెలకొంది. భర్త వేధింపులకు భార్య బలైంది. నాలుగు రోజుల క్రితం పెట్రోల్ పోసి నిప్పు అంటించిన ప్రమాదంలో చికిత్స పొందుతూ పండగ పూట శుక్రవారం మృతి చెందింది. తల్లిదండ్రులు తెలిపిన వివరాల ప్రకారం.. జగదేవ్‌పూర్‌కు చెందిన పనగట్ల బాల్‌రాజు, మణెమ్మ దంపతులకు ఇద్దరు కొడుకులు, కూతురు రమ ఉంది. 13 ఏళ్ల క్రితం రమను నిజామాబాద్‌కు చెందిన సంజయ్‌కు ఇచ్చి వివాహం చేశారు. పెళ్లి సమయంలో రూ.25 లక్షల కట్నంతో పాటు బంగారు అభరణలు పెట్టారు. రెండేళ్ల పాటు సంసారం సాఫీగా సాగింది. అప్పటి నుంచి ఆదనప్పు కట్నం కావాలని వేధింపులకు పాడ్పడడమే కాకుండా తాగుడుకు బనిసగా మారాడు. పలు సార్లు ఇరువురి పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టి సర్తి చెప్పినా తనలో మార్పు రాకపోవడంతో భరించలేక రమ పిల్లలతో కలిసి పదేళ్ల క్రితం తన అమ్మగారింటికి జగదేవ్‌పూర్‌కు వచ్చి ఇక్కడే ఉంటుంది. చదవండి: (కిరాణా షాపుకు వెళ్లొస్తానని ఒకరు.. డ్యూటీకి వెళ్తున్నానని మరొకరు..) కాగా మూడు నెలల క్రితం సంజయ్ అత్తగారింటికి భార్య, అత్తమామలకు తాను మారినట్లు నమ్మించి భార్యను తీసుకెళ్లాడు. తీసుకవెళ్లిన నాటి నుంచి మళ్లీ వేధింపులు పెట్టాడు. నాలుగు రోజుల క్రితం ఒంటిపై పెట్రోల్ పోసి నిప్పు అంటించాడు. చుట్టు ప్రక్కన వారు చూసి మంటలను ఆర్పి కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వగా చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. నాలుగు రోజులుగా చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందినట్లు తెలిపారు. పండుగ పూట కూతురు మృతి చెందడంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. కాగా జగదేవ్‌పూర్‌లోనే అమె అంత్యక్రియలు నిర్వహించారు. -
అన్నతోనే ‘సంబంధం’ అని పంచాయితీ.. భార్యపై చేయిచేసుకోవడంతో..
సాక్షి, కొండపాక(గజ్వేల్., సిద్దిపేట): కుటుంబ కలహాలతో రెండేళ్ల కుమారుడికి నిప్పంటించి తల్లి కూడా ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన శనివారం సిద్దిపేట జిల్లా కొండపాక మండలంలోని సిర్సనగండ్ల గ్రామంలో చోటు చేసుకుంది. సిర్సనగండ్లకు చెందిన గవ్వల అయ్యల్లం, బీరవ్వల రెండో కుమారుడు స్వామికి చేర్యాల మం డలం వేచరేణికి చెందిన పోశయ్య, మల్లవ్వల చిన్న కుమార్తె నవితను ఇచ్చి పదేళ్ల క్రితం వివాహం చేశారు. స్వామి వ్యవసాయ పనులతో పాటు కూలీ పను లు చేసుకుంటూ భార్య నవిత (25), కుమారుడు మణిదీప్ (2)ను పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలో స్వామి అన్న భాస్కర్‌కు నవితకు వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో తరచూ ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి. ఈ విషయంలో వారం రోజుల క్రితం కులపెద్దలు సముదాయించి స్వామికి నచ్చజెప్పారు. ఈ క్రమంలో శనివారం స్వామి వ్యవసాయ బావి వద్ద పత్తి ఏరేందుకు భార్యను రమ్మని చెప్పగా.. ఆమె రానని అనడంతో ఇద్దరికి గొడవ జరిగింది. దీంతో స్వామి భార్య పై చేయి చేసుకొని వ్యవసాయ బావి వద్దకు వెళ్లాడు. ఈ ఘటనతో మనస్తాపానికి గురైన నవిత మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో కుమారుడు మణిదీప్‌పై పెట్రోల్ పోసి నిప్పంటించి తాను కూడా నిప్పంటించుకుంది. చదవండి: ఇంతమంది చనిపోతుంటే ఎన్ఫోర్స్మెంట్ ఏం చేస్తోంది? ఇంట్లో నుంచి వస్తున్న పొగను గమనించిన చుట్టుపక్కల వారు తలుపులు పగుల గొట్టి చూడగా ఇద్దరూ విగత జీవులై కనిపించా రు. తమ కూతురు నవితపై లేనిపోని అభాండాలు వేసి, వేధించి చంపారని మృతురాలి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. కూతురు మృతికి కారణమయ్యారని అత్త బీరవ్వ, బావ భాస్కర్, భర్త స్వామిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. త్రీటౌన్ సీఐ ప్రవీణ్‌కుమార్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. చదవండి: బాత్రూంలో ఉరివేసుకొని బాలింత ఆత్మహత్య -
సీఎం కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో యువకుడి మృతి
సాక్షి, మర్కూక్(గజ్వేల్): సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం ఎర్రవల్లిలోని సీఎం కేసీఆర్ వ్యవసాయక్షేత్రంలో పనికి వెళ్లిన యువకుడు మూర్ఛ వ్యాధితో బావిలో పడి మృతిచెందాడు. వర్ధరాజ్‌పూర్‌కు చెందిన ఆర్.ఆంజనేయిలు(19) కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో కూలి పనులు చేస్తున్నాడు. మంగళవారం ఉదయం కొంతమంది కూలీలతో కలసి ఫామ్‌హౌస్‌కు వచ్చాడు. పెద్దబావి పక్కన ముళ్లపొదలను తొలగిస్తుండగా మూర్ఛ రావడంతో అందులోకి జారిపడ్డాడు. పక్కనే ఉన్న కూలీలు పనిలో నిమగ్న మై అతడిని గమనించలేదు. ఎంతకీ కనిపించకపోవడంతో బావిలో పడిఉండొచ్చని భావించి కుటుంబసభ్యులకు తెలిపారు. సాయంత్రం గజ ఈతగాళ్లతో బావినీటిలో గాలించినా ఫలితం లేకపోయింది. బుధవారం మళ్లీ గజ ఈతగాళ్లు బావిలో గాలింపుచర్యలు చేపట్టగా ఆంజనేయులు మృతదేహం లభించింది. అక్కడే పోస్టుమార్టం నిర్వహించి కుటుంబసభ్యులకు మృతదేహాన్ని అప్పగించారు. తండ్రి కిష్టయ్య ఫిర్యాదుతో దర్యాప్తు చేస్తున్నట్లు మర్కూక్ పోలీసులు తెలిపారు. మృతుడి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతూ విలపించారు. చదవండి: ప్రేమ పేరుతో లొంగదీసుకుని లైంగిక దాడి.. పదేళ్లు శిక్ష.. -
ప్రాణం తీసిన టైర్ ముక్క.. బైక్ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టి..
సాక్షి, ములుగు(గజ్వేల్): టైర్ ముక్కను తాకి బైక్ అదుపుతప్పడంతో భార్య అక్కడికక్కడే మృతి చెందగా, భర్త తీవ్ర గాయాలతో ఆస్పత్రి పాలయ్యాడు. ఈ ఘటన లక్ష్మక్కపల్లి రాజీవ్ రహదారిపై జరిగింది. ఎస్ఐ రంగకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. వర్గల్ మండలం గౌరారం గ్రామానికి చెందిన మంకి సుధాకర్–స్వరూప (34) దంపతులు ములుగు మండలం వంటిమామిడి మార్కెట్లో కూరగాయలు కొనుగోలు చేసి విక్రయిస్తుంటారు. వీరికి యశ్వంత్ (14), సాత్విక (12) ఇద్దరు పిల్లలు ఉన్నారు. సోమవారం తెల్లవారుజామున వంటిమామిడిలో కూరగాయలను కొనేందుకు దంపతులు బైక్‌పై బయలుదేరారు. మార్గమధ్యలో లక్ష్మక్కపల్లి వద్ద రోడ్డుపై టైర్ ముక్క పడి ఉండటం వీరికి కనిపించలేదు. దీంతో దాని మీదుగా వెళ్లిన బైక్ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో స్వరూప అక్కడిక్కడే మృతి చెందగా, సుధాకర్ తీవ్ర గాయాలతో ఆస్పత్రి పాలయ్యాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రంగకృష్ణ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం కుటుంబీకులకు అప్పగించామని పేర్కొన్నారు. చదవండి: సంగారెడ్డి జిల్లాలో కరోనా కలకలం.. గురుకులంలో 48 మందికి పాజిటివ్ మృతదేహాన్ని పరిశీలిస్తున్న ఎస్ఐ రంగ కృష్ణ రెడిమిక్స్ వాహనం ఢీకొని మరొకరు.. గజ్వేల్‌రూరల్: ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వారిని ఎదురుగా వచ్చిన రెడిమిక్స్ వాహనం ఢీకొనడంతో ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలైన సంఘటన సోమవారం గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని సంగాపూర్‌లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మున్సిపాలిటీ పరిధిలోని ఆర్అండ్ఆర్ కాలనీ (పల్లెపహడ్)లో నివాసముంటున్న గుగులోత్ లక్ష్మి (52) తన కొడుకు మహేందర్, కూతురు శాంతి బెజుగామకు ద్విచక్ర వాహనంపై బయలుదేరారు. ఈ క్రమంలో సంగాపూర్‌లో గల మజీద్ వద్దకు రాగానే గజ్వేల్ నుంచి వర్గల్ వైపు వెళ్తున్న రెడిమిక్స్ వాహనం వీరు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో మహేందర్, భుక్య శాంతికి తీవ్ర గాయాలు కాగా.. లక్ష్మి తలపై నుంచి వాహనం వెళ్లడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం తెలుసుకున్న 108 సిబ్బంది క్షతగాత్రులను గజ్వేల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
మూడు నెలల్లో సీఎం కేసీఆర్ ఇలాకాకు గూడ్స్ రైళ్లు
సాక్షి, హైదరాబాద్: కోవిడ్ నిబంధనలతో గజ్వేల్‌కు ప్రయాణికుల రైలు నడపటంలో ఆలస్యం జరుగుతున్నప్పటికీ, మరో మూడు నెలల్లో సరుకు రవాణా రైలు ప్రారంభం కాబోతోంది. ఇంతకాలం అటు సిద్దిపేట మొదలు గజ్వేల్ పరిసర ప్రాంతాల్లో పండుతున్న వ్యవసాయ ఉత్పత్తులను ఇతర ప్రాంతాలకు రవాణా చేసేందుకు రోడ్డు మార్గాన్నే వినియోగిస్తున్నారు. ఇప్పుడు తొలిసారి రైలు మార్గం అనుసంధానం కాబోతోంది. చదవండి: సీఎం జగన్‌ను కలిసిన తెలంగాణ పర్వతారోహకుడు తుకారాం గజ్వేల్ వరకు రైలు మార్గం పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చింది. కానీ కోవిడ్ వల్ల దేశవ్యాప్తంగా ప్యాసింజర్ రైళ్లను నడపటం లేదు. ఈపాటికే ప్రయాణికుల రైలు సర్వీసు గజ్వేల్ వరకు ప్రారంభం కావాల్సి ఉండగా, ఈ కారణంతో మొదలు కాలేదు. అయితే వీలైనంత తొందరలో గూడ్సు రైళ్లను నడపాలని దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించింది. గూడ్సు షెడ్డు నిర్మాణాన్ని మూడు నెలల్లో పూర్తి చేసి గూడ్సు రైళ్లను ప్రారంభించాలని నిర్ణయించారు. సమీపంలోని ప్రాంతాల్లోని రైతులు, వ్యాపారులు వ్యవసాయ ఉత్పత్తులను లారీల ద్వారా గజ్వేల్ వరకు తరలిస్తే అక్కడి నుంచి గూడ్సు రైళ్లలో వాటిని తరలించొచ్చు. గజ్వేల్ రైల్వే స్టేషన్‌ను గురువారం దక్షిణ మధ్య రైల్వే హైదరాబాద్ డివిజన్ డీఆర్ఎం శరత్ చంద్రాయన్ తనిఖీ చేశారు. డిప్యూటీ సీఈ (కన్స్ట్రక్షన్) సదర్మ దేవరాయ, అధికారులులతో కలిసి పనులు జరుగుతున్న తీరును పరిశీలించారు. చదవండి: తెలంగాణ శాసన సభాసమరానికి సర్వం సిద్ధం -
దగాకోరు కేసీఆర్‌ను దెబ్బ కొట్టి తీరుతాం
సాక్షి, గజ్వేల్/ గజ్వేల్ నుంచి సాక్షి ప్రతినిధి: దేశంలోని అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం, దళిత, గిరిజన వర్గాల అభివృద్ధి కోసం ఇప్పటివరకు ఏది చేసినా అది కాంగ్రెస్ పార్టీనేనని, చేయబోయేది కూడా తమ పార్టీయేనని రాజ్యసభలో ప్రతిపక్ష నేత, కేంద్ర మాజీ మంత్రి మల్లికార్జున ఖర్గే అన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి దేశంలో అధికారం అప్పగిస్తే జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు అమలు చేసేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. టీపీసీసీ ఆధ్వర్యంలో శుక్రవారం గజ్వేల్‌లో జరిగిన ’దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరా సభ’కు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సభకు రాహుల్ గాంధీ హాజరు కావాల్సి ఉన్నా అనివార్య కారణాల వల్ల రాలేకపోయారని, తనపై ఈ బాధ్యతను పెట్టి ఈ సభకు పంపారని చెప్పారు. స్వాతంత్య్రం తెచ్చిందే కాంగ్రెస్ పార్టీ ‘ఈ దేశం కోసం కాంగ్రెస్ పార్టీ గత 70 ఏళ్లలో ఏం చేసిందని ప్రధాని మోదీ ప్రశ్నిస్తున్నారు. దేశంలో మోదీ ప్రధాని అయ్యాక, తెలంగాణలో కేసీఆర్ సీఎం అయ్యాక మాత్రమే అభివృద్ధి జరిగి నట్టు చెబుతున్నారు. కానీ అసలు దేశానికి స్వాతంత్య్రం తెచ్చిందే కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ వాదులు ఈ దేశ స్వాతంత్య్రం కోసం పోరాడినప్పుడు మోదీ, కేసీఆర్‌లు పుట్టలేదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. అలాగే తెలంగాణకు స్వాతంత్య్రం ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీయే. అయితే అధికారాన్ని అనుభవిస్తోంది మాత్రం కేసీఆర్, ఆయన కుటుంబం..’ అని ఖర్గే విమర్శించారు. ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించాం ‘దేశంలో అనేక పరిశ్రమలు, విద్యా సంస్థలు ఏర్పాటు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదే. మెదక్ ఎంపీగా ఇందిరా గాంధీని గెలిపిస్తే ఈ ప్రాంతానికి అనేక పరిశ్రమలు వచ్చాయి. దేశంలోని ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించింది కూడా కాంగ్రెస్ పార్టీయే. కాంగ్రెస్ చెబితే చేసి తీరుతుంది. దళితులు వారి కాళ్లపై వారు నిలబడే విధంగా చేయూతనిచ్చినప్పుడే దేశాభివృద్ధి సాధ్యమవుతుంది. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడాలన్నా, ఎస్సీ, ఎస్టీల హక్కులు పరిరక్షింపబడాలన్నా కాంగ్రెస్ పార్టీకే మద్దతివ్వాలి..’ అని కోరారు. శుక్రవారం గజ్వేల్‌లో జరిగిన దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరా సభకు హాజరైన జనం మోదీ అమ్ముతుంటారు... వారు కొంటుంటారు ‘ఈ దేశాన్ని మోదీ అమ్ముతుంటే, అంబానీ, అదానీలు కొంటారనే రీతిలో పాలన సాగుతోంది. కేసీఆర్ దగాకోరు. సోనియాగాంధీని మోసం చేశారు. రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. తెలంగాణ ఇచ్చినందుకు రుణపడి ఉంటామని, తన కుటుంబంతో సహా వచ్చి ఫోటోలు దిగి, మద్దతిస్తానని చెప్పి తెల్లారేసరికి మాట తప్పారు. రాష్ట్రం ఇచ్చిన తర్వాత మాట తప్పిన కేసీఆర్‌ను దెబ్బ కొట్టి తీరుతాం..’ అని ఖర్గే అన్నారు. కేంద్రంలోని మోదీ, రాష్ట్రంలోని కేసీఆర్ ప్రభుత్వాలను గుడ్డి ప్రభుత్వాలుగా మల్లిఖార్జున ఖర్గే అభివర్ణించారు. ఈ రెండు ప్రభుత్వాలకు సరైన దారి చూపెట్టాలంటూ..సభికులు తమ సెల్ ఫోన్లలోని లైట్లను వెలిగించాలని కోరారు. వారంతా అలా చేయడంతో రాత్రి సమయంలో సభా ప్రాంగణం కాంతులీనింది. తనదైన శైలిలో కవితలు, సామెతలు చెప్పిన ఖర్గే, సభికులను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. 2 నుంచి నిరుద్యోగ సమస్యపై కార్యాచరణ: రేవంత్‌రెడ్డి రాష్ట్రంలో తుదిదశ తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలూదాల్సిన అవసరం ఎంతైనా ఉందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలో నెలకొన్న నిరుద్యోగ సమస్యపై కాంగ్రెస్ పార్టీ ధర్మ యుద్ధం చేస్తుందని చెప్పారు. అక్టోబర్ 2 నుంచి డిసెంబర్ 9 వరకు ఈ కార్యాచరణ కొనసాగుతుందని, సికింద్రాబాద్ పరేడ్‌గ్రౌండ్‌లో బహిరంగసభ నిర్వహిస్తామని వెల్లడించారు. గజ్వేల్ సభలో 2 లక్షల మందితో కదం తొక్కామని చెప్పారు. గంజాయి మత్తులో చిన్నారిపై అత్యాచారం జరిపి, హత్యచేస్తే పోలీసులను పిలిచి కనీసం సమీక్ష చేయని సీఎం కేసీఆర్ ఓ మానవ మృగమని వ్యాఖ్యానించారు. సీఎం కేసీఆర్ మద్యానికి బ్రాండ్ అంబాసిడర్ అయితే రాష్ట్రంలో కొనసాగుతున్న డ్రగ్స్‌కు డ్రామారావు బ్రాండ్ అంబాసిడరని మంత్రి కేటీఆర్‌ను ఉద్దేశించి ఆరోపించారు. ఎర్రవల్లి ఫాంహౌస్ ఓ అవినీతి తోట అని ఆరోపించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో సాధారణ వ్యక్తి అయిన కేసీఆర్ కుటుంబానికి వందల ఎకరాల్లో ఫాంహౌస్‌లు, ఆస్తులు, అంతస్తులు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకం కింద సాయాన్ని రూ.ఐదు లక్షలకు పెంచాలని, రూ.లక్ష కోట్ల సబ్‌ప్లాన్ బకాయిలను చెల్లించాలని, రాష్ట్ర మంత్రివర్గంలో ఉన్న కేసీఆర్ కుటుంబసభ్యుల్లో ఒకరిని తొలగించి దళితులకు మంత్రి పదవి ఇవ్వాలని రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. కాంగ్రెస్‌కు కార్యకర్తలే బ్రాండ్ అంబాసిడర్లని చెప్పారు. టీఆర్ఎస్ సర్కారును గద్దె దించే వరకు పోరాడాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో సోనియమ్మ రాజ్యం రావాలని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో సామాజిక న్యాయం, స్వయం పాలన ఉంటుందని చెప్పారు. ఏకకాలంలో దళితబంధును అమలు చేయాలి: భట్టి దళితబంధును హుజూరాబాద్, నాలుగు మండలాలు కాకుండా రాష్ట్రమంతా ఏకకాలంలో అమలు చేయాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. ఇతర వర్గాలకు కూడా ఇలాంటి పథకాలు అమలు చేయాలన్నారు. సీఎం కేసీఆర్ అవినీతి చిట్టా కట్టలు అన్నీ మోదీ దగ్గర ఉన్నాయని ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్ అన్నారు. ఏడున్నర సంవత్సరాల్లో రాష్ట్రాన్ని రాబందుల సమితిగా కేసీఆర్ మార్చారని విమర్శించారు. కేసీఆర్ దీపం ఆరిపోతుంది, కాంగ్రెస్ దీపం వెలుగుతుందని రాజకీయ వ్యవహారాల కమిటీ కన్వీనర్ షబ్బీర్ అలీ అన్నారు. దళిత బంధు మాదిరిగా బీసీ బంధు సైతం అమలు చేయాలని మాజీ ఎంపీ వి.హన్మంతరావు డిమాండ్ చేశారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జె.గీతారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సభలో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్, మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీధర్ బాబు, జగ్గారెడ్డి, సీతక్క, పొదెం వీరయ్యలతో పాటు నేతలు బలరాం నాయక్, మల్లు రవి, సంపత్‌కుమార్, అజారుద్దీన్, మల్రెడ్డి రంగారెడ్డి, కుసుంకుమార్, అద్దంకి దయాకర్ తదితరులు పాల్గొన్నారు. -
ఈ మీటింగ్ రాహుల్‌గాంధీ రావాల్సింది.. రాలేదు: ఖర్గే
సాక్షి, గజ్వేల్: తాము అధికారంలోకి వస్తే జనాభా ప్రాతిపదికన దళిత గిరిజనులకు రిజర్వేషన్ ఇస్తామని మల్లికార్జున్ ఖర్గే తెలిపారు. వాటికోసం ఇప్పుడు కాంగ్రెస్ పోరాడుతుందని తెలిపారు. సోనియాగాంధీ వలనే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని తెలిపారు. కేసీఆర్ ఢోకా చేశారు, ఆయనను ప్రజలు నమ్మద్దు అని సూచించారు. కేసీఆర్ పాలనలో తెలంగాణ, మోడీ పాలనలో దేశం అంధకారంలో ఉందని చెప్పారు. సీఎం కేసీఆర్ సొంత నియోజకవర్గం గజ్వేల్‌లో శుక్రవారం దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరా సభ నిర్వహించారు. ఈ సభలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ విలీనమైన రోజున దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరా సభ నిర్వహించడం సంతోషమని పేర్కొన్నారు. వాస్తవంగా ఈ సభకు రాహుల్ గాంధీ రావాల్సింది, ఇతర కార్యక్రమాలతో రాలేదని తెలిపారు. -
TS: నేడు గజ్వేల్‌లో కాంగ్రెస్ ‘దండోరా’ సభ
-
TS: నేడు గజ్వేల్‌లో కాంగ్రెస్ ‘దండోరా’ సభ
గజ్వేల్: ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో ‘దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా’సభ నిర్వహణకు కాంగ్రెస్ పార్టీ ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ సభకు భారీగా జనాన్ని సమీకరించాలని ఆ పార్టీ భావిస్తోంది. పట్టణంలోని ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్(ఐవోసీ) వెనుక భాగంలోని మైదానంలో శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు కళాకారుల ప్రదర్శనతో సభ ప్రారంభంకానుంది. మూడు గంటలకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ ప్రముఖులు సభా ప్రాంగణానికి చేరుకుంటారు. ఆ తర్వాత 3:45 గంటలకు రాజ్యసభలో కాంగ్రెస్ పక్షనాయకుడు మల్లికార్జునఖర్గే, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యంఠాగూర్‌లు చేరుకుంటారు. ఈ సభలో టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలు, దళిత, గిరిజనులను మోసం చేస్తున్న తీరుపై వివిధ అంశాలతో చార్జిషీట్ విడుదల చేయడానికి కాంగ్రెస్ సిద్ధమవుతోంది. రాష్ట్రం నలుమూలల నుంచి లక్ష మందికిపైగా ఈ సభలో పాల్గొనేలా కాంగ్రెస్ ఏర్పాట్లు చేస్తోంది. సభా వేదిక ముందు భాగంలో 25 వేలకుపైగా కుర్చీలు వేస్తున్నారు. సభవల్ల పట్టణంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నారు. పార్కింగ్‌కు ప్రత్యేకమైన స్థలాలను కేటాయించారు. గురువారం సాయంత్రం సభ ఏర్పాట్లను మాజీ మంత్రులు గీతారెడ్డి, షబ్బీర్ అలీ, దామోదర రాజనర్సింహ, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యే సీతక్క తదితరులు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ‘దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా’సభ ద్వారా కేసీఆర్ పతనం ప్రారంభం కాబోతోందని పేర్కొన్నారు. -
టీఆర్ఎస్ ప్రభుత్వంపై.. 25 అంశాలతో అభియోగ పత్రం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తోన్న గజ్వేల్ వేదికగా ఈనెల 17న నిర్వహించనున్న ‘దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరా సభ’లో 25 అంశాలతో టీఆర్ఎస్ ప్రభుత్వంపై చార్జిషీట్ వేసేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతోంది. గత ఏడేళ్ల టీఆర్ఎస్ ప్రభుత్వ హయాం లో రాష్ట్రంలోని దళితులకు జరిగిన అన్యాయాలు, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలులో వైఫల్యం సంబంధిత అంశాలను ప్రస్తావిస్తూ ఈ చార్జిషీట్‌ను తయారు చేస్తోంది. పార్టీ సీనియర్ నేతలు భట్టి విక్రమార్క, దామోదర రాజనర్సింహ, మధుయాష్కీగౌడ్‌లు దీనిని రూపొందిస్తున్నారు. 16 వేల ఎకరాలిచ్చి, 5 లక్షల ఎకరాలు లాక్కున్నారు దళితులకు ముఖ్యమంత్రి పదవి, మూడెకరాల భూమి పంపిణీ అంశాలను ప్రధానంగా ప్రస్తావించ నున్నారు. దళితులకు ముఖ్యమంత్రి పదవి ఇస్తానని చెప్పి ఇవ్వకుండా తానే ముఖ్యమంత్రి కావడం, తన కుటుంబ సభ్యులకు ఇచ్చిన పదవులు దళిత సామాజిక వర్గానికి ఇవ్వకపోవడం లాంటివి పొందుపరచనున్నారు. గత ఏడేళ్లలో ప్రభుత్వం రాష్ట్రంలోని దళితులందరికీ కలిపి ఇచ్చింది కేవలం 16 వేల ఎకరాలు కాగా, కాంగ్రెస్ పార్టీ దళితులకు ఇచ్చిన 24 లక్షల ఎకరాల భూమిలో నుంచి 5 లక్షల ఎకరాల భూమిని ప్రాజెక్టులు, ఇతర కారణాలు చూపెట్టి లాక్కుందనే విషయాన్ని ఎత్తిచూపనున్నారు. సబ్‌ప్లాన్ చట్టానికి తూట్లు కాంగ్రెస్ పార్టీ హయాంలో దళితులు, గిరిజనులకు ప్రత్యేక సబ్‌ప్లాన్ పెట్టి చట్టబద్ధం చేస్తే, గత ఏడేళ్లుగా ఆ నిధులను ఖర్చు చేయకుండా చట్టానికి తూట్లు పొడిచారంటూ నేరారోపణ చేయనున్నారు. ఎస్సీ సబ్‌ప్లాన్ నిధులు రూ.60 వేల కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉందని, ఈ నిధులను ఖర్చు చేస్తే రాష్ట్రంలోని సగం మందికి దళిత బంధు పథకం అమలవుతుందనే అంశాన్ని గుర్తు చేయనున్నారు. ఎస్సీలకు చెందిన 60 వేల బ్యాక్లాగ్ ఉద్యోగాలను భర్తీ చేయకపోగా, ఉపాధి హామీ పథకంలోని ఫీల్డ్ అసిస్టెంట్లు, సాక్షరతా భారత్ ఉద్యోగులు, విద్యావాలంటీర్ల లాంటి సుమారు 55 వేల పోస్టులను తీసివేయడం ద్వారా దళిత నిరుద్యోగులకు చేసిన అన్యాయంపై చార్జిషీట్ వేస్తున్నామని టీపీసీసీ ముఖ్యనేత ఒకరు వెల్లడించారు. వీటితో పాటు దళితులపై జరిగిన దాడులు, అత్యాచారాల ఘటనలు, వాటి విషయంలో ప్రభుత్వ పెద్దలు స్పందించిన తీరు, గత ఏడేళ్లలో టీఆర్ఎస్ పార్టీలో, ప్రభుత్వంలో దళితులకు ఇచ్చిన ప్రాధాన్యత తదితర అంశాలతో అభియోగ పత్రం రూపొందిస్తున్నామని చెప్పారు. -
కాల్వలకు బదులు పైప్లైన్లు
గజ్వేల్: మల్లన్నసాగర్ మిషన్ భగీరథ పథకం తీరు మారింది. రూ. 674 కోట్లతో రూపొందించాలనుకున్న ఈ పథకం డిజైన్ మార్చి కొత్త అంశాలను జోడించడంతో నిర్మాణ వ్యయం రూ. 1,100 కోట్లకు పెరగనుంది. గతంలో అక్కారం పంపుహౌస్ కాల్వలు, బస్వాపూర్ రిజర్వాయర్, మల్లన్నసాగర్ల నుంచి పైప్లైన్లు నిర్మించాలని అను కోగా తాజా డిజైన్‌లో మల్లన్నసాగర్ రిజర్వాయర్ స్టోరేజీ నుంచే పైప్లైన్లను నిర్మించాలనుకుంటున్నారు. హైదరాబాద్ జంట నగరాల తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 3,375 కోట్లతో గోదావరి సుజల స్రవంతి పథకాన్ని చేపట్టి పూర్తి చేసింది. ఇందుకోసం కరీంనగర్ జిల్లా ఎల్లంపల్లి బ్యారేజీ నుంచి ఏటా 10 టీఎంసీలను 186 కి.మీ. పైప్‌లైన్ ద్వారా తరలిస్తోంది. ప్రస్తుతం ప్రతిరోజూ 735 ఎంఎల్డీ నీటి సరఫరా జరుగుతుండగా ఇందులో సిద్దిపేట, జనగామ, యాదాద్రి, మేడ్చల్, మెదక్ జిల్లాల అవసరాల కోసం సుమారుగా 300 ఎంఎల్డీ నీటిని ట్యాపింగ్ పద్ధతిలో వాడుకుంటున్నారు. అయితే దీనివల్ల హైదరాబాద్‌కు నీటి తరలింపులో అప్పుడప్పుడు కొరత ఏర్పడుతోంది. అంతేకాకుండా నీరు తక్కువగా వచ్చినప్పుడు ఆయా జిల్లాలకు కూడా ఇబ్బంది ఏర్పడుతోంది. ఈ సమస్యకు పరిష్కారంగా మల్లన్నసాగర్ నీటిని మిషన్ భగీరథ కోసం వాడుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. మల్లన్నసాగర్ రిజర్వాయర్‌ను ప్రస్తుతం 50 టీఎంసీల సామర్థ్యంతో నిర్మిస్తుండగా అందులో ఏటా 10 టీఎంసీలను తాగునీటి అవసరాలకు వాడుకోనున్నారు. ఇందుకోసం కొండపాక మండలం మంగోల్ వద్ద రాష్ట్రంలోనే అతిపెద్దదిగా 540 ఎంఎల్డీ సామర్థ్యంతో వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ (డబ్ల్యూటీపీ) పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. పనులు పూర్తికాగానే గతంలో హైదరాబాద్ లైన్‌పై ఉన్న ట్యాపింగ్‌లను మూసివేస్తారు. అంతేకాకుండా ఎల్లంపల్లి లైన్‌కు సమాంతరంగా మరో కొత్త లైన్‌ను నిర్మించాలనుకుంటున్నారు. సిద్దిపేట, యాదాద్రి, మెదక్ జిల్లాలకు మల్లన్నసాగర్ నుంచే లైన్లను నిర్మించే అవకాశం ఉండగా హైదరాబాద్ లైన్‌ను మాత్రం మల్లన్నసాగర్ నుంచి నిర్మిస్తారా లేక మల్లన్నసాగర్ ద్వారా నిండే కొండపోచమ్మసాగర్ నుంచి నిర్మిస్తారా? అనే విషయంలో స్పష్టత రావాల్సి ఉంది. కొండపోచమ్మసాగర్ నుంచి నిర్మిస్తే శామీర్‌పేట సమీపంలోని కేశవాపురంలో రిజర్వాయర్ నిర్మించే అవకాశం ఉందని తెలుస్తోంది. దీని ద్వారా ఘనపూర్ డబ్ల్యూటీపీలో నీటిని శుద్ధి చేసి నగరవాసులకు అందిస్తారు. శాశ్వత పరిష్కారమే లక్ష్యం గ్రేటర్ హైదరాబాద్‌తోపాటు సిద్దిపేట, జనగామ, మేడ్చల్, యాదాద్రి, మెదక్ జిల్లాల్లో మిషన్ భగీరథ పథకం నీటి సరఫరాకు సంబంధించి భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడటమే లక్ష్యంగా పనులు సాగుతున్నాయి. ముందుగా అనుకున్న డిజైన్‌లో కొన్ని మార్పులు చేశాం. మల్లన్నసాగర్‌ను ప్రధాన వనరుగా మార్చుకొని మంగోల్ వద్ద డబ్ల్యూటీపీ నిర్మించి అక్కడి నుంచి అయా జిల్లాలకు నీటిని సరఫరా చేస్తాం. – రాజయ్య, మిషన్ భగీరథ ఈఈ, గజ్వేల్ ఈ వారంలో అధికారికంగా ‘మల్లన్న’ప్రారంభం సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులోని మల్లన్నసాగర్ రిజర్వాయర్‌లోకి గోదావరి నీటి మళ్లింపు ప్రక్రియను ఈ వారంలో అధికారికంగా ప్రారంభించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. 50 టీఎంసీల సామర్థ్యంతో చేపట్టిన రిజర్వాయర్ పనులు ఆగస్టు మూడో వారానికే పూర్తవగా తుక్కాపూర్‌లోని 6 పంపులను ప్రారంభించడం ద్వారా మల్లన్నసాగర్‌లోకి గోదావరి జలాల ఎత్తిపోత సైతం అప్పుడే ఉంటుందని ఇంజనీర్లు భావించారు. అయితే దళితబంధు సహా ఇతర ప్రాధాన్యతా కార్యక్రమాల వల్ల ప్రభుత్వం దాన్ని కేవలం ట్రయల్ రన్‌కే పరిమితం చేసింది. ట్రయల్ రన్లో భాగంగా మోటార్లను పరీక్షిస్తూ సుమారు 4 టీఎంసీలను మల్లన్నసాగర్‌లోకి ఎత్తిపోశారు. స్థానిక ప్రవాహాల నుంచి మరో టీఎంసీ మేర నీరు చేరడంతో ప్రస్తుతం రిజర్వాయర్‌లో 5 టీఎంసీల నీటి నిల్వలున్నాయి. రిజర్యాయర్‌లోకి మరో 5 టీఎంసీల నీటిని ఈ సీజన్లో నింపాలని ఇంజనీర్లు నిర్ణయించడంతో ఈ వారంలో సీఎం కేసీఆర్ మోటార్లను ప్రారంభించనున్నారు. వచ్చే ఏడాది నుంచి మూడు నెలలకు ఒకసారి ఐదేసీ టీఎంసీల చొప్పున నీటిని నింపుకుంటూ నిల్వలను పెంచనున్నారు. మల్లన్నసాగర్‌లోకి గోదా వరి జలాల ఎత్తిపోతలపై ఒకట్రెండు రోజుల్లోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని ఇరిగేషన్ శాఖ వర్గాలు తెలిపాయి. -
17న గజ్వేల్‌లో కాంగ్రెస్ సభ
సాక్షి, హైదరాబాద్: ఈనెల 17వ తేదీన గజ్వేల్‌లో సభ నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా కార్యక్రమంలో భాగంగా గజ్వేల్‌లో భారీ సభ నిర్వహించాలని ఆ పార్టీ ముఖ్య నాయకులు తీర్మానించారు. శనివారం టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డి అధ్యక్షతన గాంధీభవన్‌లో రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్య నేతల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఏఐసీసీ కార్యదర్శి శ్రీనివాస కృష్ణన్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్లు జె.గీతారెడ్డి, మహేశ్‌కుమార్‌గౌడ్, టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీగౌడ్, ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ దామోదర రాజనర్సింహ, ఏఐసీసీ కార్యక్రమాల నిర్వహణ కమిటీ చైర్మన్ ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, ప్రచార కమిటీ చైర్మన్ అజ్మతుల్లా హుస్సేనీలు హాజరయ్యారు. దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా కార్యక్రమంపై చర్చించారు. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా జరిగిన తీరుపై సమీక్ష నిర్వహించారు. కార్యక్రమాన్ని ఆశించిన స్థాయిలోనే నిర్వహించామని అభిప్రాయపడ్డ నేతలు, కార్యక్రమ నిర్వహణ కోసం నియమించిన అసెంబ్లీ నియోజకవర్గాల వారీ సమన్వయకర్తల పనితీరుపై నివేదికలు ఇవ్వాలని పార్లమెంటు ఇన్చార్జులుగా ఉన్న వర్కింగ్ ప్రెసిడెంట్లను ఆదేశించారు. సెప్టెంబర్ 17న కార్యక్రమం ముగింపు సందర్భంగా గజ్వేల్‌లో సభ నిర్వహించాలని, అంతకంటే ముందే వీలును బట్టి కరీంనగర్లో మరోసభ నిర్వహించా లని నిర్ణయించారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక వాయిదాపై కూడా చర్చ జరిగింది. అక్టోబర్, నవంబర్ వరకు ఉప ఎన్నిక జరిగే వీలు లేనందున పార్టీ అభ్యర్థి ఎంపిక, అనుసరించాల్సిన వ్యూహంపై ఆచితూచి ముందుకెళ్లాలని నిర్ణయించారు. కేసీఆర్‌కు హుజూరాబాద్ భయం.. సమావేశం అనంతరం టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్‌గౌడ్ గాంధీభవన్‌లో విలేకరులతో మాట్లాడుతూ, దళితబంధు పథకంపై దళితుల్లో వ్యక్తమవుతున్న అసంతృప్తి కేసీఆర్‌ను ముంచడం ఖాయమని వ్యాఖ్యానించారు. బీజేపీ, టీఆర్ఎస్ ఒక్కటేనని తాము చెప్పే మాటలకు సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటనతో బలం చేకూరిందని అన్నారు. ముఖ్యమంత్రికి హుజూరాబాద్ ఉప ఎన్నిక భయం పట్టుకుందని, కోవిడ్ సాకు చూపి ఉప ఎన్నికను వాయిదా వేయించుకున్నారని విమర్శించారు. బీజేపీ జాతీయ నాయకత్వం ఆడే డ్రామాలో రాష్ట్ర బీజేపీ నేతలు పావులుగా మారారని ఆయన ఎద్దేవా చేశారు. -
గజ్వేల్‌లో ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం!
గజ్వేల్: ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్దిపేట జిల్లా గజ్వేల్ రాబోయే రోజుల్లో అంతర్జాతీయ క్రికెట్ పోటీలకు వేదిక కానుంది. ఇక్కడ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం నిర్మించే అంశాన్ని ప్రభుత్వం సీరియస్‌గా పరిశీలిస్తోంది. హైదరాబాద్‌లో ఇప్పటికే అన్ని హంగులతో స్టేడి యం అందుబాటులో ఉన్నా, ట్రాఫిక్ సమస్యల కారణంగా ఇబ్బందులు తలెత్తుతుండడంతో హైదరాబాద్‌కు సమీపంలో ఉన్న గజ్వేల్‌లో మరో స్టేడి యం నిర్మిస్తే బాగుంటుందనే ఆలోచనకు ప్రభు త్వం వచ్చినట్టు తెలుస్తోంది. త్వరలోనే ఈ ప్రాంతంలో ‘రీజనల్ రింగు’రోడ్డు నిర్మాణానికి రంగం సిద్ధమవుతుండగా, ఈ రోడ్డుకు అనుసంధానమయ్యేలా స్టేడియం నిర్మాణం చేపట్టాలనుకుంటున్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఈ అంశంపై గతనెల 30న క్రీడల మంత్రి శ్రీనివాస్‌గౌడ్ నేతృత్వంలో ఉన్నతస్థాయి సమీక్ష జరిగిన విషయం తెలిసిందే. సీఎం కేసీఆర్ చొరవతో ఇక్కడ దేశంలోనే ప్రతిష్టాత్మకంగా చెప్పుకునే హార్టికల్చర్ యూనివర్సిటీ, ఫారెస్ట్రీ కళాశాలలు ఏర్పడ్డాయి. 15 టీఎంసీల సామర్థ్యంతో కొండపోచమ్మసాగర్ రిజ ర్వాయర్‌తోపాటు వేలాది కోట్ల రూపాయలతో ఎన్నో అభివృద్ధి పనులు జరిగాయి. ఈ క్రమంలోనే అంతర్జాతీయ స్థాయిలో ఈ ప్రాంతం పేరు మారు మోగేలా ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం నిర్మాణం విషయాన్ని పరిశీలిస్తున్నారు. ట్రాఫిక్ చిక్కులు తప్పించడానికే.. గజ్వేల్ పట్టణంలో రీజినల్ రింగు రోడ్డుకు సమీపంలో స్టేడియం నిర్మిస్తే హైదరాబాద్ నుంచి కొద్దిసేపట్లోనే చేరుకునే అవకాశం ఉండటం, ట్రాఫిక్ చిక్కులు లేకపోవడం వల్లే ఈ ప్రాంతంపై ప్రధానంగా ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే క్రీడల మంత్రి శ్రీనివాస్‌గౌడ్ నేతృత్వంలో జరిగిన సమీక్షలో గజ్వేల్‌లో 50–100 ఎకరాల్లో ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం కోసం భూసేకరణ, ఫుట్‌బాల్ అకాడమీ ఏర్పాట్లపై చర్చించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌గౌడ్ క్రికెట్ స్టేడియం కోసం స్థల సేకరణకు సిద్దిపేట జిల్లా కలెక్టర్‌కు లేఖ రాస్తున్నట్టు కూడా ప్రకటించారు. దీనిని బట్టి ఇక్కడ క్రికెట్ స్టేడియం నిర్మా ణం త్వరలోనే ఖరారు కాబోతుందనే విషయం స్పష్టమవుతోంది. సమీక్షలో రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ గజ్వేల్‌లో క్రికెట్ స్టేడియం నిర్మించే విషయాన్ని సీఎం కేసీఆర్ సీరియస్‌గా పరిశీలిస్తున్న మాట వాస్తవమేనని చెప్పారు. -
కేసీఆర్ చేతిలో రాష్ట్రం బందీ: వైఎస్ షర్మిల
గజ్వేల్: తాలిబన్ల చెరలో అఫ్గానిస్తాన్ బాధలు పడుతున్నవిధంగానే సీఎం కేసీఆర్ చేతిలో తెలంగాణ బందీగా మారిందని వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. మంగళవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని ప్రజ్ఞాపూర్‌లో ఆమె నిరుద్యోగ నిరాహార దీక్ష చేపట్టారు. అంతకుముందు గజ్వేల్ మండలం అనంతరావుపల్లికి చెం దిన కొప్పు రాజు కుటుంబీకులను వారి ఇంటికి వెళ్లి పరామర్శించారు. ఉద్యోగం రావడంలేదనే బాధతో 7 నెలల క్రితం రాజు ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ప్రజ్ఞాపూర్ చౌరస్తాలోని వైఎస్సార్ విగ్రహానికి షర్మిల పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం దీక్షాస్థలికి చేరుకుని దీక్షను కొనసాగించారు. కొప్పు రాజు తల్లిదండ్రులు లక్ష్మి–సత్తయ్యలు సాయంత్రం షర్మిలకు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. అనంతరం షర్మిల మాట్లాడుతూ ‘టీఆర్ఎస్ పాలనలో ఏ ఒక్కరూ సంతోషంగా లేరు, అలాంటప్పుడు కేసీఆర్ లాంటి ముఖ్యమంత్రి మనకు అవసరమా..’అని ప్రశ్నించారు. కొత్త జిల్లాల ఆవిర్భావం తర్వాత ఖాళీ పోస్టుల సంఖ్య 3.80 లక్షలకు పెరిగినా, ప్రభుత్వం వాటిని భర్తీ చేయకపోవడంతో మనోస్థైర్యాన్ని కోల్పోతున్న నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నిరుద్యోగుల ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలేనని ఆరోపించారు. నిరుద్యోగుల ఆత్మహత్యలు ఆపలేని ప్రభుత్వం ఉన్నా, లేకున్నా, ఒక్కటేనని చెప్పారు. నిరుద్యోగులు అధైర్యపడవద్దని, వారి తరపున పోరాడటానికి తాను సిద్ధంగా ఉన్నానని భరోసా ఇచ్చారు. హుజూరాబాద్‌లో టీఆర్ఎస్ను ఓడించాలి... హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో నిరుద్యోగులు భారీగా నామినేషన్లు వేయాలని, నిజామాబాద్‌లో కవితను ఓడించినట్లే, హుజూరాబాద్‌లోనూ టీఆర్ఎస్ను ఓడించాలని షర్మిల పిలుపునిచ్చారు. ఉచిత కరెంటు వైఎస్ ఘనతే రాష్ట్రంలో 64 లక్షల మందిని రుణవిముక్తులను చేయడమేగాకుండా ఉచిత కరెంటు ఇచ్చిన ఘనత వైఎస్‌కే దక్కిందని షర్మిల అన్నారు. వైఎస్ వల్ల లక్ష లాది మంది విద్యార్థులు జీవితంలో స్థిరపడి ఆనందంగా గడుపుతున్నారని పేర్కొన్నారు. ‘అందరూ రెండేళ్లు ఓపిక పట్టండి... సంక్షేమ రాజ్యం వస్తుంది’అంటూ భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ఏపూరి సోమన్న ఆటపాటలు విశేషం గా ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో పార్టీ నేతలు సత్యవతి, పిట్ట రాంరెడ్డి, సంజీవరావు, తిరుపతిరెడ్డి, అమృతసాగర్, లెక్చరర్ సాహితి, నంబూరి రామలింగేశ్వర్రావు, విజయభాస్కర్‌రెడ్డి పాల్గొన్నారు. -
గుండెపోటుతో మల్లన్నసాగర్ నిర్వాసితుడు మృతి
గజ్వేల్‌రూరల్: పరిహారం అందలేదన్న మనస్తాపంతో మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్వాసితుడు గుండెపోటు కారణంగా గురువారం మృతిచెందాడు. గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని సంగాపూర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. కొండపాక మండలం ఎర్రవల్లికి చెందిన మల్లన్నసాగర్ ప్రాజెక్టు ముంపు బాధితుడు ఆరె నరసింహులుకు భార్య సత్తమ్మ, నలుగురు కూతుళ్లు ఉన్నారు. గ్రామంలో ఆయనకు 13 గుంటల వ్యవసాయ భూమి, ఇల్లు ఉన్నాయి. కాగా, తమ బంధువులకు పరిహారం అందగా, తమకు ఇంతవరకు ప్యాకేజీకానీ, ఇల్లు కానీ రాలేదని ఆరు నెలలుగా ఆయన మనస్తాపంతో ఉన్నాడు. ఇదే బెంగతో నరసింహులు గుండెపోటుతో మృతి చెందాడని ఆయన భార్య సత్తమ్మ గజ్వేల్ ఆర్డీఓకు రాసిన లేఖలో పేర్కొంది. భూమి, ఇల్లు కోల్పోయిన ఈ కుటుంబం ప్రస్తుతం సంగాపూర్‌లో అద్దెకు ఉంటోంది. -
ఇంటింటా చదువుల ‘క్రాంతి
గజ్వేల్/ములుగు: కరోనా నేపథ్యంలో ఆన్లైన్ క్లాసులు వినలేని విద్యార్థులకు ఓ ఉపాధ్యాయురాలు ఇంటింటికీ వెళ్లి పాఠాలు బోధిస్తున్నారు. జాయ్‌ఫుల్ లెర్నింగ్, యాక్టివిటీ బేస్డ్, లో–కాస్ట్, నో–కాస్ట్ టీఎల్ఎమ్ పద్ధతుల్లో విద్యాబోధన చేస్తున్నారు. ‘పాఠశాలే నాకు లోకం. నిత్యం పిల్లలతో విద్యాబోధనలో గడపటమే నాకు ఇష్టం. అందుకే సెలవున్నా...పాఠశాలకు రావడం మర్చిపోను’అంటున్న ఆ ఉపాధ్యాయురాలు సిద్దిపేట జిల్లా ములుగు మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఎం.క్రాంతికుమారి. 130 మంది విద్యార్థులున్న ఆ పాఠశాలకు తొమ్మిదేళ్ల క్రితం వచ్చిన క్రాంతికుమారి మొదట్నుంచీ తన పనితీరుతో ఇతర ఉపాధ్యాయులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. లాక్డౌన్ మినహా మిగతా అన్ని రోజుల్లో యథాతథంగా విధులు నిర్వహించారు. ప్రస్తుతం తను బోధించే ఐదో తరగతిలోని 35 మంది విద్యార్థుల్లో సగం మందికిపైగా స్మార్ట్ ఫోన్లు లేకపోవడంతో ఆమె వారి ఇంటికి వెళ్లి పాఠాలు చెప్తున్నారు. గతేడాది సెప్టెంబర్‌లో పాఠశాలను సందర్శించిన కలెక్టర్ వెంకట్రామిరెడ్డి పాఠశాలలో మెరుగైన వసతుల కల్పనకు రూ.5 లక్షల చెక్కును క్రాంతికుమారికి అందజేశారు. ఈ నిధులతో పాఠశాల కార్పొరేట్ సొబగులను అద్దుకుంది. -
శ్రీగిరిపల్లి పిల్లలకు చేయూత
గజ్వేల్: ‘సాక్షి’ప్రయత్నం ఫలించింది. తల్లిదండ్రుల మృతితో అనాథలైన పిల్లలకు ప్రభుత్వ ఆసరా లభించింది. ఆర్థిక మంత్రి హరీశ్‌రావు దృష్టికి ఈ పిల్లల దైన్యస్థితిని తీసుకెళ్లడంతో చలించిన ఆయన, వారిని ఆదుకోవాలని అధికారులను ఆదేశించారు. దీంతో అధికారులు సోమవారం ఐదుగురు పిల్లలకు మొత్తం రూ.2.5 లక్షల చెక్కులను అందజేశారు. వివరాలిలా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం శ్రీగిరిపల్లి గ్రామంలో చిన్ననర్సని యాదయ్య, లక్ష్మి దంపతుల మృతితో వారి కుమారుడు సతీశ్‌తో పాటు నలుగురు కూతుళ్లు అనూష, అశ్విని, మేనక, స్పందనలు అనాథలైన విషయాన్ని జూన్ 7న ‘సాక్షి’మెయిన్ సంచిక వెలుగులోకి తెచ్చింది. ఏడాది క్రితం అనారోగ్యంతో తండ్రి చనిపోగా.. తల్లి కరోనా కారణంగా జూన్ 6న మృత్యువాత పడడంతో ఈ పిల్లలంతా అనాథలైన సంగతి తెలిసిందే. ఎలాంటి ఆస్తిపాస్తులు లేని ఈ కుటుంబానికి రెక్కల కష్టమే జీవనాధారం. ఇలాంటి తరుణంలో పిల్లల చదువులు ప్రశ్నార్థకంగా మారాయి. కుటుంబ పరిస్థితుల కారణంగా సతీశ్ కొద్ది రోజుల నుంచి బైక్ మెకానిక్ పని నేర్చుకుంటున్నాడు. అనూష టెన్త్ పూర్తి చేసింది. ఆశ్విని 10వ తరగతి, స్పందన ఏడో తరగతి, మేనక అయిదో తరగతి ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నారు. ఈ విషయాన్ని ‘సాక్షి’మంత్రి హరీశ్‌రావు దృష్టికి తీసుకువెళ్లింది. వెంటనే స్పందించిన ఆయన పిల్లల పరిస్థితిపై విచారణ చేపట్టి నివేదిక అందించాలని గజ్వేల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ప్రత్యేకాధికారి ముత్యంరెడ్డికి ఆదేశాలిచ్చారు. విచారణ అనంతరం ముత్యంరెడ్డి కొన్ని రోజుల క్రితం నివేదికను అందజేశారు. ఈ నివేదిక ఆధారంగా ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డిని మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. ఈ మేరకు పిల్లలకు ఒక్కొక్కరి పేరిట రూ.50 వేల చొప్పున మొత్తంగా రూ. 2.5 లక్షల సాయాన్ని కలెక్టర్ ప్రకటించారు. సోమవారం రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాపరెడ్డి, ‘గడా’ప్రత్యేకాధికారి ముత్యంరెడ్డి బాధిత పిల్లలకు చెక్కులను అందజేశారు. -
KTR: ఎక్కడున్నారో చెప్పుకోండి చూద్దాం..!
సాక్షి, హైదరాబాద్: ‘భరత్ అని నాతో పాటు నాలుగో తరగతి చదువుకున్న మిత్రుడు నిన్న ఈ ఫోటో నాకు పంపించాడు. కరీంనగర్ సెయింట్ జోసెఫ్ స్కూల్లో నాలుగో తరగతి చదివేనాటిది ఇది. కొంత విడ్డూరమే అయినా ఒకటి మాత్రం నిజం. ఈ ఫొటోలో ఉన్న ప్రతీ ఒక్కరి పేరును జ్ఞప్తికి తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నా’ అని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు సామాజిక మాధ్యమ వేదికగా ఆదివారం తన స్కూల్ రోజుల నాటి ఫొటోను షేర్ చేశారు. ఇంతకీ ఇందులో కేటీఆర్ ఎక్కడున్నారు అనేదేగా మీ డౌట్. ఇదే అనుమానాన్ని చాలామంది వ్యక్తం చేశారు. కేటీఆర్ అయితే.. సమాధానం చెప్పలేదు. అయితే, పైన నిల్చున్నవారిలో ఎడమ నుంచి ఉన్న రెండో బాలుడే కేటీఆర్ అని చాలామంది కామెంట్లు పెట్టారు. చదవండి: KTR: క్యాప్ బాగుంది.. ఫొటో దిగుదామా అమ్మా! ఐటీ కారిడార్‌లో 4 కొత్త లింకు రోడ్లను ప్రారంభించిన మంత్రి కేటీఆర్ -
మొక్కలు ఎందుకు ఎండిపోయాయ్.. కొత్తవి నాటండి: కేసీఆర్
సాక్షి, గజ్వేల్: హరితహారంలో భాగంగా నాటిన మొక్కలు ఎండిపోవడంపై సీఎం కేసీఆర్ ఆరా తీశారు. ఇటీవల ప్రభుత్వ విప్, చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ తండ్రి మృతి చెందగా.. బుధవారం సుమన్‌ను పరామర్శించేందుకు వెళ్లిన సీఎం, తిరుగు ప్రయాణంలో తూప్రాన్.. అక్కడి నుంచి గజ్వేల్ మీదుగా ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్‌కు చేరుకున్నారు. మార్గమధ్యలో రోడ్డుకు ఇరువైపులా కొన్నిచోట్ల ట్రీగార్డులు పడిపోవడం, మరికొన్ని చోట్ల మొక్కలు ఎండిపోవడం గమనించారు. ఎందుకిలా జరిగిందని కాన్వాయ్ నుంచే ‘గడా’(గజ్వేల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ) ప్రత్యేకాధికారి ముత్యంరెడ్డికి ఫోన్ చేసి ఆరా తీశారు. గతేడాది నర్సాపూర్ నియోజకవర్గానికి గజ్వేల్ నుంచి ప్రత్యేకంగా పైప్‌లైన్ నిర్మించడంతో మొక్కలు దెబ్బతిన్నాయని ముత్యంరెడ్డి సీఎంకు వివరించారు. అయితే వాటి స్థానంలో కొత్తవి ఎందుకు నాటలేదని ప్రశ్నించిన సీఎం వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోనూ రోడ్డుకు ఇరువైపులా దెబ్బతిన్న మొక్కల స్థానంలో తిరిగి కొత్త మొక్కలు నాటాలన్నారు. దీంతో గురువారం ‘గడా’ప్రత్యేకాధికారి.. తూప్రాన్ నుంచి గజ్వేల్ వరకు దెబ్బతిన్న మొక్కల స్థానంలో కొత్తవి నాటేందుకు చర్యలు ప్రారంభించారు. పనులను ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. చదవండి: ఎమ్మెల్యే బాల్క సుమన్‌ను పరామర్శించిన సీఎం కేసీఆర్