సాక్షి, గజ్వేల్: తెలంగాణలో మరో హిట్ అండ్ రన్ కేసు వెలుగు చూసింది. ఈ ప్రమాదంలో ఇద్దరు కానిస్టేబుల్స్ మృతి చెందారు. మృతిచెందిన కానిస్టేబుళ్లను పరందాములు, వెంకటేశ్‌గా గుర్తించారు.
వివరాల ప్రకారం.. సిద్దిపేట-జాలిగామ బైపాస్‌లో ఆదివారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో ఇద్దరు కానిస్టేబుళ్లు మృతిచెందారు. ఈ ప్రమాదంలో మృతిచెందిన కానిస్టేబుళ్లను పరందాములు, వెంకటేశ్‌గా గుర్తించారు. వీరిలో పరందాములు రాయపోలు పీఎస్‌లో, వెంకటేశ్ దౌల్తాబాద్ పీఎస్‌లో విధులు నిర్వహిస్తున్నారు. అయితే, వీరిద్దరూ మారధాన్ కోసం వెళ్తున్నట్టు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment