
సాక్షి, సిద్దిపేట: గజ్వేల్ నియోజకవర్గంలో ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు భారీ మెజారిటీతో గెలువడం ఖాయమని టీఆర్‌ఎస్ మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. గజ్వేల్ పట్టణంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. భారీగా డబ్బు ఖర్చు చేసి.. గెలుస్తామని ప్రత్యర్థులు ఆశ పడుతున్నారని, కానీ, గజ్వేల్‌లో కేసీఆర్ చేసిన అభివృద్ధిని ప్రజలు ఆదరించారని తెలిపారు. ఎన్నికల్లో టీఆర్‌ఎస్ గెలుపు ఖాయమని, ఇతర పార్టీల మద్దతు లేకుండానే తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు.