kotha prabhakar reddy
-
గులాబీ జెండా ఉన్నంత వరకు బీఆర్ఎస్ తోనే ఉంటా: కొత్త ప్రభాకర్ రెడ్డి
-
మేము కేసీఆర్ వెంటే ఉంటాం..పార్టీ మారే ఆలోచన మాకు లేదు..
-
కొత్త ప్రభాకరరెడ్డి, గువ్వల బాలరాజుల మీద దాడిపై సీరియస్
-
అంబులెన్సులో వెళ్లి కొత్త ప్రభాకర్ రెడ్డి నామినేషన్
-
కొత్త ప్రభాకర్ రెడ్డి ఆరోగ్యం కొంత కుదుట పడింది: హరీష్ రావు
-
‘ఇంకా ఆధారాలు కావాలా?’.. ఎంపీ దాడిపై కేటీఆర్ ట్వీట్
హైదరాబాద్: మెదక్ ఎంపీ, సిద్దిపేట జిల్లా దుబ్బాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డిపై హత్యాయత్నం ఘటన రాజకీయంగా కలకలం రేపింది. దీని వెనుక ఏ పార్టీ, ఎవరు ఉన్నారనేది పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు. ఈనేపథ్యంలో కేటీఆర్ ట్విటర్ ద్వారా స్పందించారు. ప్రభాకర్ రెడ్డిపై దాడి చేసింది కాంగ్రెస్ గూండానే అంటూ.. ఆ పార్టీ కండువాతో ఉన్న నిందితుడి ఫొటోలను ఆయన పోస్ట్ చేశారు. ఇంకా ఆధారాలు కావాలా అని రాహుల్‌గాంధీని కేటీఆర్ ప్రశ్నించారు. The Congress Goon who unleashed the murder attack on MP Prabhakar Reddy yesterday Do you need more proofs Rahul Gandhi ? pic.twitter.com/HceItfzvUL — KTR (@KTRBRS) October 31, 2023 ఈ ఘటనపై కేసు నమోదు చేసిన సిద్ధిపేట పోలీసులు.. రాజకీయ కుట్ర కోణంలోనూ దర్యాప్తు చేపట్టారు. మిరుదొడ్డి మండలం చేప్యాలకు చెందిన నిందితుడు దళితబంధు, ఇంటి స్థలం రాకపోవడంతో ఎంపీపై కక్షగట్టాడని, ఎన్నికల కోడ్ ఉండడంతో తర్వాత చూద్దామని ఎంపీ చెప్పడంతో కోపం పెంచుకుని దాడికి తెగబడ్డాడని ప్రచారం జరిగింది. అయితే.. దాడిలో రాజకీయ ఉద్దేశం ఉండొచ్చని బీఆర్ఎస్ అనుమానాలు వ్యక్తం చేస్తోంది. అందుకే రాజు ఎవరెవరితో ఫోన్ కాల్ మాట్లాడింది తెలుసుకునేందుకు కాల్‌డేటాను పోలీసులు పరిశీలిస్తున్నారు. మరోవైపు చేప్యాలలో నిందితుడి తల్లిదండ్రుల్ని పోలీసులు ఇప్పటికే విచారణ చేపట్టారు. గ్రామంలో అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. -
ఎంపీ ప్రభాకర్ మరో 4 రోజులు ఐసీయూలోనే.. దర్యాప్తు వేగవంతం
సాక్షి, హైదరాబాద్: మెదక్ ఎంపీ, దుబ్బాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డిపై హత్యాయత్నం కేసులో సిద్ధిపేట పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. రాజకీయ కుట్ర కోణంలో విచారణ జరుపుతున్నారు. ఇప్పటికే ఎంపీపై దాడి చేసిన నిందితుడు రాజు కుటుంబ సభ్యులను చేప్యాలలో పోలీసులు విచారించారు. నిందితుడు రాజు కాల్‌డేటాను పోలీసులు పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం నిందితుడు రాజుకి హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. అతడు కోలుకున్న తర్వాత కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. నాలుగు రోజులు ఐసీయూలోనే.. కత్తిపోటుతో ప్రభాకర్‌రెడ్డి చిన్నపేగుకు గాయం కావడంతో సోమవారం యశోద ఆసుపత్రిలో వైద్యులు నాలుగు గంటలపాటు శ్రమించి ఆపరేషన్ చేశారు. చిన్న పేగును 10 సె.మీ మేర వైద్యులు తొలగించారు. ప్రస్తుతం ఆయనను ఐసీయూలో చికిత్స అందిస్తుండగా మరో నాలుగు రోజులు ఐసీయూలోనే ఉండనున్నారు. మరోవైపు కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడి నేపథ్యంలో దుబ్బాక నియోజకవర్గంలో బంద్‌కు పిలిపునిచ్చారు బీఆర్ఎస్ కార్యకర్తలు.వర్తక వ్యాపారులు స్వచ్చందంగా బంద్ పాటిస్తున్నారు. అదే విధంగా ఎంపి ఆరోగ్యం త్వరగా కోలుకోవాలని మెదక్ చర్చిలో ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అసలేం జరిగిందంటే.. దుబ్బాకలో బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో ఉన్న ప్రభాకర్‌రెడ్డి.. సోమవారం సిద్దిపేట జిల్లా సూరంపల్లిలో ప్రచారం నిర్వహించారు. తిరిగొస్తూ వాహనం వైపు వెళ్తుండగా ఓ వ్యక్తి కడుపులో కత్తితో పొడిచాడు. దీంతో ప్రభాకర్ రెడ్డిని మొదట గజ్వేల్‌కు, అక్కడి నుంచి హైదరాబాద్ యశోద ఆస్పత్రికి తరలించారు. దగ్గరుండి ఎంపీని ఆస్పత్రికి తీసుకొచ్చారు మంత్రి హరీశ్‌రావు. శస్త్రచికిత్స చేసిన వైద్యులు.. గాయమైన చోట చిన్నపేగు భాగం తొలగించారు. సీఎం కేసీర్, మంత్రులు ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. చదవండి: Miryalaguda: ఒకప్పుడు కాంగ్రెస్ కంచుకోట.. ఇప్పుడు అనాథగా.. -
కత్తిపోటుతో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి చిన్ని పేగుకు గాయం
-
కొత్త ప్రభాకర్‌రెడ్డిని పరామర్శించిన సీఎం కేసీఆర్, హరీశ్‌రావు
-
కొత్త ప్రభాకర్‌రెడ్డిని పరామర్శించిన సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: కత్తిపోట్లకు గురైన మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డిని సీఎం కేసీఆర్ పరామర్శించారు. యశోదా ఆసుపత్రికి వెళ్లిన సీఎం.. ఆయన ఆరోగ్య పరిస్థితిపై తీశారు. వైద్యులను అడిగి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. దాడిలో తీవ్ర గాయాలపాలైన ప్రభాకర్‌రెడ్డికి వైద్యులు సుమారు నాలుగు గంటల పాటు శ్రమించి ఆపరేషన్ నిర్వహించారు. చిన్న ప్రేగుకు నాలుగు చోట్ల గాయాలయ్యాయని, పది సెంటీమీటర్ల మేర చిన్నపేగును తొలగించినట్లు వైద్యులు పేర్కొన్నారు. గ్రీన్ ఛానెల్‌తో హైదరాబాద్‌కు తరలించకపోతే మరింత ఇబ్బంది అయ్యేదన్న వైద్యులు.. రక్తం కడుపులో పేరుకుపోయిందని తెలిపారు. ప్రేగుకు నాలుగుచోట్ల గాయాలు కావడంతో సర్జరీ ఆలస్యం అయ్యిందని చెప్పారు. ప్రస్తుతం ఆయనను ఐసీయూలో చికిత్స కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు. చదవండి: మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డిపై హత్యాయత్నం -
ఎంపీ ప్రభాకర్‌రెడ్డిపై దాడి.. రఘునందన్ రావు ఏమన్నారంటే..
సాక్షి, సిద్ధిపేట: ఎన్నికల ప్రచారంలో భాగంగా దౌల్తాబాద్ మండలం సూరంపల్లిలో మెదక్ ఎంపీ, బీఆర్ఎస్ దుబ్బాక అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డిపై జరిగిన దాడిపై బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు స్పందించారు. కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడి జరగడం దురదృష్టకరమని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే ప్రభాకర్ రెడ్డిపై దాడి ఘటనతో తనకెలాంటి సంబంధం లేదని, దాడికి తానే కారణమని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని రఘునందన్‌రావు స్పష్టం చేశారు. పోలీసుల విచారణలో నిజానిజాలు ఎంత బురద చల్లేందుకు ప్రయత్నించినా.. అదే బురద నుంచి కమలం వికసిస్తుందని తెలిపారు. ఒకవేళ భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఈ దాడికి పాల్పడితే తనే స్వయంగా అలాంటి వాడిని పోలీసులకు అప్పచెబుతానని అన్నారు. దాడికి పాల్పడిన నిందితుడు ఓ ఛానెల్ రిపోర్టర్ అని, దళితబంధు రాలేదనే ఆవేదనతోనే దాడి చేశాడని మీడియాలో వచ్చిందని తెలిపారు. పోలీసుల విచారణలో నిజానిజాలు తెలుస్తాయని చెప్పారు. ప్రభాకర్‌రెడ్డి మిత్రుడు, ఆయన్ను పరామర్శిస్తా ప్రభాకర్ రెడ్డిపై జరిగిన దాడి అనంతరం ఆర్ఎస్ నాయకులు చేపట్టిన నిరసన కార్యక్రమాల్లో బీజేపీ కార్యకర్తలపై జరిగిన దాడిని రఘునందన్ రావు తీవ్రంగా పరిగణించారు. ఈ హింసాత్మక ఘటనలపై పోలీసులు సమగ్రంగా విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులో ఉండగా ఇలాంటి నిరసనలకు ఎవరు అనుమతి ఇచ్చారో సిద్దిపేట కమిషనర్ వెల్లడించాలని అన్నారు. ప్రభాకర్ రెడ్డి తనకు మంచి మిత్రుడు అని ఆసుపత్రికి వెళ్లి అతని పరామర్శిస్తానని పేర్కొన్నారు. సిద్ధిపేట జిల్లా సూరంపల్లి వద్ద ఎన్నికల ప్రచారంలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై హత్యాయత్నం జరిగిన విషయం తెలిసిందే. ఓ పాస్టర్‌ను పరామర్శించి బయటకు వస్తున్న క్రమంలో ప్రభాకర్‌రెడ్డిపై కత్తితో దాడి చేశారు. దుండగుడి దాడిలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డికి కడుపులో గాయాలయ్యాయి. తొలుత గజ్వేల్ ఆసుపత్రికి తరలించగా.. తీవ్రత దృష్ట్యా మెరుగైన వైద్యం కోసం సికింద్రాబాద్ యశోద ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆయనకు ఓపెన్ సర్జరీ చేస్తున్నారు. -
ఇలాంటి హింసా రాజకీయాలు అందరూ ఖండించాలి
-
దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై హత్యాయత్నం
-
దుండగుడి దాడిలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డికి కడుపులో గాయాలు
-
బీఆర్ఎస్ దుబ్బాక అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడి జరిగింది
-
మెదక్ ఎంపీపై దాడి ఘటనపై గవర్నర్ సీరియస్, డీజీపీకి ఆదేశాలు
సాక్షి, హైదరాబాద్: మెదక్ ఎంపీ, దుబ్బాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడి ఘటనపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ స్పందించారు. ఎన్నికల ప్రచారంలో కొత్త ప్రభాకర్ రెడ్డిపై జరిగిన దాడి గురించి తెలుసుకుని దిగ్భ్రాంతికి గురయ్యానని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో హింసకు స్థానం లేదని, ఇలాంటి ఘటనలు ప్రజాస్వామ్య ప్రక్రియకే ప్రమాదకరమని తెలిపారు. డీజీపీ జాగ్రత్తలు తీసుకోవాలి ఎంపీపై హత్యాయత్నంపై తెలంగాణ డీజీపీ అంజనీ కుమార్ స్పందించాలని గవర్నర్ కోరారు. ఎన్నికల సమయంలో అభ్యర్థుల భద్రత విషయంలో కఠినమైన చర్యలు తీసుకోవాలని డీజీపీని ఆదేశించారు. భవిషత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా డీజీపీ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. స్వేచ్ఛాయుతమైన, నిష్పక్షపాతమైన ఎన్నికల కోసం శాంతియుత, సురక్షితమైన వాతావరణాన్ని నిర్వహించడం చాలా అవసరమని తెలిపారు. కొత్త ప్రభాకర్ రెడ్డి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. యశోద ఆసుపత్రికి కొత్త ప్రభాకర్ రెడ్డి సిద్ధిపేట జిల్లా సూరంపల్లి వద్ద ఎన్నికల ప్రచారంలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై హత్యాయత్నం జరిగిన విషయం తెలిసిందే. ఓ పాస్టర్‌ను పరామర్శించి బయటకు వస్తున్న క్రమంలో ప్రభాకర్‌రెడ్డిపై కత్తితో దాడి చేశారు. దుండగుడి దాడిలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డికి కడుపులో గాయాలయ్యాయి. తొలుత గజ్వేల్ ఆసుపత్రికి తరలించగా.. తీవ్రత దృష్ట్యా మెరుగైన వైద్యం కోసం సికింద్రాబాద్ యశోద ఆసుపత్రికి ఎంపీని తీసుకొచ్చారు. హత్యాయత్నం కేసు, నిందితుడి అరెస్ట్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి కత్తితో దాడి చేసి, హత్య ప్రయత్నం చేసిన వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు మిడిదొడ్డి మండలం పెద్ద చెప్పాల గ్రామానికి చెందిన గడ్డం రాజుగా గుర్తించారు. నిందితుని పోలీస్ కస్టడీకి తీసుకున్నారు. ఈ కేసును సిద్ధిపేట సీపీ శ్వేత దర్యాప్తు చేస్తున్నారు. ఎంపీని కంటికి రెప్పలా కాపాడుకుంటాం: హరీష్‌రావు మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై హత్యాయత్నాన్ని మంత్రి హరీష్ రావు తీవ్రంగా ఖండించారు. ప్రభాకర్‌రెడ్డిపై దాడి అత్యంత దారుణమని, ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేదని పేర్కొన్నారు. ఈ ఘటనను ప్రభుత్వం, బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా పరిగణిస్తోందన్నారు. ప్రభాకర్ రెడ్డి కుటుంబ సభ్యులు, బీఆర్ఎస్ శ్రేణులు ఎలాంటి ఆందోళనలకు గురికావద్దని, అధైర్య పడవద్దని సూచించారు. ఎంపీని కంటికి రెప్పలా కాపాడుకుంటామని చెప్పారు. ప్రభాకర్ రెడ్డి హత్యాయత్నంలో రాజకీయ కుట్ర ఏదైనా ఉందా అనేకోణంలో సమగ్ర దర్యాప్తు జరిపిస్తామని హరీష్ రావు పేర్కొన్నారు. నారాయణఖేడ్ సభకు వెళ్తూ విషయం తెలియగానే ఆసుపత్రికి బయల్దేరారు హరీష్‌రావు. ఫోన్లో పరామర్శించి దైర్యం చెప్పారు. ఎంపీ ఆరోగ్యపరిస్థితి తెలుసుకున్నారు. -
మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డిపై హత్యాయత్నం
సాక్షి, సిద్దిపేట: మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డిపై హత్యాయత్నం జరిగింది. కత్తితో ఓ వ్యక్తి ఆయనపై దాడి చేయగా.. కడుపులో గాయం అయ్యింది. దీంతో ఆయన్ని ఆస్పత్రికి తరలించారు. సూరంపల్లి ఎన్నికల ప్రచారంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం మెదక్ లోక్‌సభ ఎంపీగా ఉన్న కొత్త ప్రభాకర్‌రెడ్డి.. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో దుబ్బాక నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నారు. ఈ క్రమంలో దౌల్తాబాద్ మండలం సూరంపల్లిలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ క్రమంలో ఓ దుండగుడు కత్తితో దాడి చేశాడు. కత్తితో దాడి చేసిన నిందితుడ్ని బీఆర్ఎస్ కార్యకర్తలు చితకబాది పోలీసులకు అప్పగించారు. నిందితుడ్ని మిరుదొడ్డి మండలం చెప్పాల గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. దాడికి గల కారణాలు తెలియాల్సి ఉంది. హుటాహుటిన బయల్దేరిన హరీష్‌రావు కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడి సంగతి తెలియగానే మంత్రి హరీష్‌రావు ఫోన్లో పరామర్శించారు. మెదక్ హుటాహుటిన బయల్దేరారు. అవసరం అయితే హైదరాబాద్ కు తీసుకురావాలని బీఆర్ఎస్ నేతలకు హరీష్‌రావు సూచించారు. -
బీజేపీ, కాంగ్రెస్ లపై ఎంపీ ప్రభాకర్ రెడ్డి కామెంట్స్
-
ముగిసిన సోదాలు.. బీఆర్ఎస్ ఎంపీకి నోటీసులిచ్చిన ఐటీ అధికారులు
సాక్షి, మెదక్: తెలంగాణ బీఆర్ఎస్ నేతల ఇళ్లలో ఐటీ దాడులు పొలిటికల్‌గా కలకలం సృష్టించాయి. ఈ క్రమంలో కేంద్రంలో ఉన్న బీజేపీపై బీఆర్ఎస్ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐటీ దాడులకు వ్యతిరేకంగా నిరసనలు తెలిపారు. మరోవైపు.. మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు ముగిశాయి. ఇక, ఐటీ సోదాలు ముగిసిన అనంతరం అధికారులు.. ఎంపీ ప్రభాకర్ రెడ్డికి నోటీసులు ఇచ్చి వెళ్లిపోయారు. అవసరమైనప్పుడు విచారణకు సహకరించాలని అధికారులు తెలిపారు. మరోవైపు, పైళ్ల శేఖర్ రెడ్డి, మర్రి జనార్ధన్ రెడ్డి నివాసాల్లో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. కాగా, కంపెనీల లావాదేవీలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు ఆరా తీస్తున్నారు. కంపెనీల ఆదాయం, ఐటీ రిటర్న్స్ వ్యత్యాసాలపై పత్రాలను పరిశీలిస్తున్నారు. బ్యాంకు ఖాతాలు, లాకర్స్ వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. ఇదిలా ఉండగా.. బీఆర్ఎస్ భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి నివాసం, కార్యాలయాల్లో ఐటీ అధికారులు బుధవారం తనిఖీలు చేపట్టిన విషయం తెలిసిందే. ఆయన నివాసం, భువనగిరి, హైదరాబాద్ కొత్తపేట గ్రీన్ హిల్స్ కాలనీలోని కార్యాలయాలతో పాటు 12 చోట్ల అధికారులు తనిఖీలు చేపట్టారు. ఎమ్మెల్యేతో పాటుగా ఆయన మామ మోహన్‌రెడ్డి ఇంట్లో కూడా సోదాలు నిర్వహించారు అధికారులు. ఈ తనిఖీల్లో భాగంగా భారీగా నగదు, కీలక డాక్యుమెంట్లను ఐటీ అధికారులు సీజ్ చేశారు. కాగా, కొత్త ప్రభాకర్ రెడ్డి, మర్రి జనార్ధన్ రెడ్డి, పైళ్ల శేఖర్ రెడ్డి మధ్య ఆర్థిక లావాదేవీలు జరిగినట్టు అధికారులు గుర్తించారు. మెయిన్ ల్యాండ్స్ డిజిటల్ టెక్నాలజీ సంస్థకు డైరెక్టర్‌గా శేఖర్ రెడ్డి భార్య పైళ్ల వనిత రెడ్డి ఉన్నారు. ఇదే కంపెనీకి ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి భార్య మంజులత కూడా డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. కాగా, పన్నులు చెల్లింపులలో అవకతవకలు జరిగినట్లు ఐటీ అధికారులు గుర్తించారు. ఇది కూడా చదవండి: వచ్చే ఎన్నికల్లో తుపాను రాబోతోంది.. రేవంత్ సంచలన వ్యాఖ్యలు -
అయ్యబాబోయ్ దుబ్బాకనా? ఆ పోస్టింగ్ మనకొద్దు.!
ఆ నియోజకవర్గంలో ప్రభుత్వాధికారుల పరిస్థితి దయనీయంగా తయారైంది. అక్కడ పనిచేయాలంటేనే జంకుతున్నారు అధికారులు. ఒకరు ఎంపీ, మరొకరు ఎమ్మెల్యే.. రాష్ట్రంలో అధికార పార్టీ ఎంపీ, కేంద్రంలో అధికార పార్టీ ఎమ్మెల్యే. ఇద్దరి మధ్యా నలిగిపోతున్నారు అధికారులు. ఇంతకీ ఆ ఇద్దరు ఎవరు? రీడ్ దిస్ స్టోరీ.. పచ్చగడ్డి వేసినా భగ్గే సిద్ధిపేట జిల్లా దుబ్బాకలో కారు, కమలం పార్టీల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమంటోంది. రెండు పార్టీల మధ్య వైరం నానాటికి పెరుగుతోంది. టీఆర్ఎస్ ఎంపీ, బీజేపీ ఎమ్మెల్యే మాటల ఈటెలు విసురుకుంటున్నారు. నియోజకవర్గంలో ప్రభుత్వ కార్యక్రమం ఏది జరిగినా ప్రోటోకాల్ పేరుతో రగడ సృష్టిస్తున్నారు. వీరిద్దరి వ్యవహారంతో ఏం చేయాలో తోచక అధికార యంత్రాంగం తల బాదుకుంటోంది. దుబ్బాక నియోజకవర్గానికే చెందిన టీఆర్ఎస్ ఎంపీ కొత్త ప్రభాకరరెడ్డి వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకుంటున్నారు. అందుకే నియోజకవర్గంలో ఏ కార్యక్రమం జరిగినా హాజరవుతున్నారు. అలాగే అక్కడ ఉప ఎన్నికల్లో బీజేపీకి చెందిన రఘునందనరావు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. దీంతో ఇద్దరి మధ్యా తీవ్రస్థాయిలో వర్గ పోరు సాగుతోంది. ప్రోటోకాల్ వ్యవహారంతో ప్రారంభమై... పరస్పరం దిష్టి బొమ్మల దహనం వరకు నిరంతర ప్రక్రియగా మారింది. చదవండి: బీఆర్ఎస్గా మారిన టీఆర్ఎస్.. కేసీఆర్‌కు లేఖ పంపిన ఈసీ కార్యక్రమం ఏదైనా సీన్ సితారే నియోజకవర్గంలో జరుగుతున్న అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటున్న ఎంపీ, ఎమ్మెల్యేలు.. దుబ్బాక అభివృద్ధి మా పార్టీయే చేసిందంటూ ఇద్దరూ ప్రజలకు చెప్పుకుంటున్నారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని ప్రశంసిస్తూ, మోదీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఎంపీ కొత్త ప్రభాకరరెడ్డి మాట్లాడుతున్నారు. అదేవిధంగా మోదీ ప్రభుత్వాన్ని ప్రశంసిస్తూ..కేసీఆర్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఎమ్మెల్యే రఘునందనరావు ఉపన్యాసాలిస్తున్నారు. దీంతో ఇద్దరి మధ్యా మాటల యుద్ధం నడుస్తోంది. తాజాగా నియోజకవర్గంలోని అక్బర్ పేట, భూంపల్లి నూతన మండలాల కార్యాలయాలను ప్రారంభించడానికి వచ్చిన మంత్రి హరీష్ రావు సమక్షంలో సైతం టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తలు మంత్రి చూస్తుండగానే పరస్పరం తోపులాటకు దిగారు. ఈ ఘర్షణ చూస్తూ..ఎవరికి ఎలా సర్దిచెప్పాలో తోచక అధికారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు సమాచారం. ఇద్దరు ప్రజా ప్రతినిధుల మధ్య తరుచుగా జరుగుతున్న గొడవలు చూసి ప్రజలు కూడా చికాకు పడుతున్నారు. వీరిద్దరి వల్ల తమ నియోజకవర్గం అభివృద్ధిలో వెనుకపడిపోతుందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ feedback@sakshi.com -
ఎంపీ కాదు ఎమ్మెల్యే కావాలట.!
ఎమ్మెల్యే కావాలనుకున్నారు. కాని అంతకంటే పెద్ద పోస్టే దక్కింది. అదీ రెండుసార్లు ఎంపీగా గెలిచారు. కాని ఆయన కోరిక ఎమ్మెల్యే కావడమేనట. అందుకే ఈసారి సొంత గడ్డ మీద నుంచి ఎమ్మెల్యే కావాలనుకుంటున్నారు. మరి గులాబీ బాస్ ఆయన కోరిక నెరవేరుస్తారా? దృష్టంతా దుబ్బాక మీదే.! కొత్త ప్రభాకర్ రెడ్డి మెదక్ నుండి రెండుసార్లు ఎంపీగా విజయం సాధించారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పోతారం గ్రామానికి చెందిన ప్రభాకరరెడ్డి పార్టీ కోసం బలంగా పనిచేశారు. 2014 ఎన్నికల్లో చివరి క్షణంలో ఎమ్మెల్యే సీటు చేజారి మళ్లీ ఎంపీ సీట్ ఆయన్ను వరించింది. 2019తో కూడా కలుపుకుని కొత్త ప్రభాకరరెడ్డి రెండుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. అయితే ఆయనకు ఎమ్మెల్యే కావాలన్న కోరిక బలంగా ఉంది. అందుకే ఇప్పుడైనా తన సొంత నియోజకవర్గమైన దుబ్బాక అసెంబ్లీ సీటు ఇవ్వాలని గులాబీ బాస్‌ను కోరినట్లు తెలుస్తోంది. తన ఆశయం నెరవేర్చుకునే క్రమంలో ఇటీవల... దుబ్బాక నియోజకవర్గంలో ఎక్కువగా తిరుగుతున్నారట... అదేవిధంగా నియోజకవర్గంలో తన అనుచర గణాన్ని కూడా పెంచుకున్నట్లు చెబుతున్నారు. ప్రగతి భవన్ నుంచి కూడా కొత్త ప్రభాకర్ రెడ్డికి సానుకూలంగా సంకేతాలు వచ్చాయట. విషయం అర్థం కావడంతో ఎంపీ అనుచరులు దుబ్బాకలో అప్పుడే ప్రచారం ప్రారంభించేశారట. పార్టీ నుంచి గ్రీన్ సిగ్నల్ 2014కి ముందు దుబ్బాక అసెంబ్లీ సీటు టార్గెట్‌గానే ఆయన పనిచేశారు. కాని సోలిపేట రామలింగారెడ్డి కారణంగా చివరగా ఎమ్మెల్యే టికెట్ చేయి జారింది. 2018లో కూడా ఆయన కోరిక నెరవేరలేదు. ఇలా రెండు సార్లు ఎంపీ ఎన్నికల్లోనే నిలబడి గెలిచారు. దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి అకాల మరణంలో వచ్చిన ఉప ఎన్నికలో ఆయన సతీమణి సుజాతకు టిక్కెట్టు ఇచ్చింది టీఆర్ఎస్ అధిష్టానం. ఆమెపై బిజెపి అభ్యర్థి రఘునందనరావు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. టీఆర్ఎస్ సిటింగ్ సీటు చేజారిపోయింది. ఇక అప్పటినుంచి టిఆర్ఎస్ అధిష్టానం దుబ్బాక నియోజకవర్గంపై సీరియస్‌గా దృష్టి పెట్టింది. ఇక్కడ పార్టీకి గట్టి లీడర్ అవసరమని భావించి.. ఎప్పటినుంచో ఎమ్మెల్యే కావాలనుకుంటున్న ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. అప్పటి నుండి పార్టీ కార్యక్రమం అయినా.. ప్రభుత్వ కార్యక్రమాలు అయినా ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి దుబ్బాక నియోజకవర్గంలో కనిపిస్తున్నారు. టార్గెట్ రఘునందన్ మెదక్ ఎంపీగా కార్యక్రమాలు నిర్వహిస్తూనే... దుబ్బాక అసెంబ్లీ స్థానంలో తనకంటూ ఒక టీమును తయారు చేసుకుని..అందరినీ కలుపు పోతున్నారట కొత్త ప్రభాకరరెడ్డి. అసంతృప్తితో ఉన్న వారిని సైతం ప్రత్యేక సమావేశాల ద్వారా తన వైపు తిప్పుకుంటున్నారట. దుబ్బాకలో బిజెపి ఎమ్మెల్యే రఘునందన్ రావును ఢీకొట్టే బలమైన నాయకుడు కొత్త ప్రభాకర్ రెడ్డి అంటూ ఆయన అనుచరులు నియోజకవర్గంలో గట్టిగానే ప్రచారం చేస్తున్నారట. దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి స్పెషల్ కేర్ తీసుకుంటున్నారట. దీనికి మంత్రి హరీష్ రావు సహకారం కూడా తోడవుతుందని చెప్పుకుంటున్నారు. నియోజకవర్గంలో ప్రభుత్వానికి సంబంధించి ఏ ప్రోగ్రామ్ జరిగినా...అటు ఎమ్మెల్యే రఘునందన్ రావు.. ఇటు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి హాజరవుతూ జనం వద్ద మార్కులు కొట్టేస్తున్నారట. రెండు వర్గాల వారు ఏదో విషయంలో గొడవ పడుతూ ఉన్నారట. కొత్త ప్రభాకర్ రెడ్డి మాత్రం తగ్గేదే లేదంటూ నియోజకవర్గం అంతా తిరుగుతూ ప్రజలకు దగ్గరవుతున్నారట. పోటీ చేస్తా.. గెలిచి గిఫ్ట్ ఇస్తా ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు నాయకత్వం వహించే ఎంపీ సీటు కంటే ఒక అసెంబ్లీ సీటుకే పరిమితం కావాలని కొత్త ప్రభాకరరెడ్డి అనుకుంటున్నారు. ఎమ్మెల్యేగా ఎన్నికైతే కలిగే ప్రయోజనాలు వేరేగా ఉంటాయని ఆయన భావిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో సీటు దక్కించుకుని.. రఘునందన్‌పై గెలిచి పార్టీకి గిఫ్ట్ ఇస్తానంటున్నారు. -
వినూత్నం.. ఎంపీ, ఎమ్మెల్సీ గుర్రమెక్కి మరీ..
సిద్దిపేట జోన్: మహమ్మారి కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో తెలంగాణలోని ప్రజాప్రతినిధులు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో మెదక్ లోక్‌సభ సభ్యుడు కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్ కోవిడ్‌పై వినూత్న రీతిలో అవగాహన కల్పించారు. గుర్రమెక్కి మరీ కరోనా వైరస్‌పై ప్రజలకు అవగాహన కార్యక్రమం చేపట్టారు. మాస్కులు పెట్టుకొని, గుర్రాలపై ఎక్కి ప్లకార్డులు ప్రదర్శించారు. ప్రతి ఒక్కరూ మాస్క్‌లు ధరించాలని, భౌతికదూరం పాటించాలని ఎంపీ, ఎమ్మెల్సీ సూచించారు. చదవండి: తెలంగాణ ఆదర్శం.. వాయువేగాన ఆక్సిజన్ చదవండి: రియల్ బూమ్.. జోరుగా రిజిస్ట్రేషన్లు -
ఫోర్బ్స్ జాబితాలో తెలంగాణ ‘కీర్తి’
సాక్షి, దుబ్బాక: ప్రముఖ అంతర్జాతీయ పత్రిక ఫోర్బ్స్ ప్రచురించే ప్రతిభాశీలుర జాబితాలో తెలంగాణకు చెందిన కీర్తిరెడ్డికి చోటు లభించింది. 30 ఏళ్ల లోపు ఉండి ఉన్నతంగా రాణిస్తున్న 30 మందితో ఫోర్బ్స్ పత్రిక ఈ జాబితాను ప్రచురిస్తుంటుంది. ఈసారి ఆ జాబితాలో సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పోతారం ముద్దుబిడ్డ కొత్త కీర్తిరెడ్డి నిలిచారు. 24 ఏళ్ల వయసులోనే ఈ ఘనత సాధించిన కీర్తిరెడ్డి మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి కూతురు. చిన్ననాటి నుంచే వినూత్న ఆలోచనలతో ముందుకు వెళ్లే కీర్తిరెడ్డి.. కరోనా వ్యాక్సిన్ నిల్వకు సంబంధించిన కంపెనీని నిర్వహిస్తున్నారు. తాజాగా ఫోర్బ్స్ పత్రిక ప్రతినిధులు హైదరాబాద్‌లోని ఆమె కంపెనీని పరిశీలించి ఈ విషయంలో చేస్తున్న కృషికి గుర్తింపుగా 30 ఏళ్లలోపు అత్యంత ప్రతిభాశీలుర జాబితాలో చోటు కల్పించారు. చిన్ననాటి నుంచే చురుగ్గా.. కీర్తిరెడ్డి చిన్ననాటి నుంచే చురుకైన విద్యార్థిగా గుర్తింపు తెచ్చుకున్నారు. పదో తరగతి వరకు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, ఇంటర్ చిరెక్ కళాశాలలో చదివింది. సెయింట్ ఫ్రాన్సిస్ కళాశాల నుంచి బీబీఎం పట్టా పొందారు. అలాగే ఆమె ‘లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్ మేనేజ్మెంట్’లో గ్లోబల్ మాస్టర్ పట్టాను పొందారు. ప్రస్తుతం ఆమె స్టాట్విగ్ అనే బ్లాక్ చైన్ సాంకేతికత ఆధారిత వ్యాక్సిన్ సరఫరా నిర్వహణ ఫ్లాట్ ఫాం కంపెనీకి సహ వ్యవస్థాపకురాలు (సీఓఓ)గా వ్యవహరిస్తున్నారు. వ్యాక్సిన్లు, ఆహారం వృథాను అరికట్టేందుకు అవసరమైన వ్యవస్థను బలోపేతం చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. పలువురి ప్రశంసలు స్వతహాగా ఏదైనా కంపెనీని స్థాపించాలన్న ఆలోచనతో ఆమె హైదరాబాద్‌లో స్టాట్విగ్ అనే వ్యాక్సిన్ సరఫరా, నిర్వహణ ఫ్లాట్ ఫాం కంపెనీని ఏర్పాటు చేశారు. కోవిడ్ వ్యాక్సిన్‌ను ఎలా నిల్వ చేయాలి.. ఎంత ఉష్ణోగ్రతల్లో ఉంచాలి.. నాణ్యతా ప్రమాణాలు, నిర్దేశిత ప్రదేశాలకు వ్యాక్సిన్ సరఫరా కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు మొదలైన అంశాల్లో ఆమె ప్రతిభను ఫోర్బ్స్ పత్రిక గుర్తించింది. కాగా, తన కూతురు ప్రఖ్యాత ఫోర్బ్స్ పత్రిక ప్రకటించిన అత్యంత ప్రతిభాశీలుర జాబితాలో నిలవడం సంతోషంగా ఉందని ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. అలాగే ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు, పలువురు ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, రాజకీయ ప్రముఖులు కీర్తిరెడ్డిని అభినందించారు. -
హరీశ్‌రావును తిట్టడం ఒక్కటే ఆయన పని
సాక్షి, సంగారెడ్డి : కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డిపై టీఆర్ఎస్ ఎంపీ ప్రభాకర్‌రెడ్డి ఫైర్ అయ్యారు. సంగారెడ్డిని అభివృద్ధి చేస్తానని చెప్పి కనీళ్లు పెట్టుకొని ఓట్లు వేయించుకొని గెలిచిన జగ్గారెడ్డి, ఇప్పుడు అడ్రస్ లేకుండా పోయారని విమర్శించారు. ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంగారెడ్డికి వచ్చే పరిస్థితి లేదన్నారు. ఎమ్మెల్యేగా గెలిచాక నియోజకవర్గంలో ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా చేయలేదని విమర్శించారు. మంగళవారం మంత్రి హరీశ్‌రావు, ఎంపీ ప్రభాకర్‌రెడ్డి, టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చింత ప్రభాకర్ సమక్షంలో పలువురు కాంగ్రెస్ కౌన్సిలర్లు టీఆర్ఎస్లో చేరారు. మంత్రి హరీశ్‌రావు వీరందరికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎంపీ ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. జగ్గారెడ్డి ప్రవర్తనతో విసుగు చెందే పలువురు కాంగ్రెస్ నేతలు టీఆర్ఎస్లో చేరుతున్నారని పేర్కొన్నారు. అసలు ఆయన సంగారెడ్డికి వచ్చే పరిస్థితే లేకుండా పోయిందన్నారు. మూడు నెలలకు ఒక్కసారి నియోజకవర్గానికి వచ్చి మంత్రి హరీశ్‌రావును తిట్టడం తప్ప చేసేదేమి లేదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో పసలేదు : మంత్రి హరీశ్ ముఖ్యమంత్రి కేసీఆర్ అభివృద్ధిని చూసి పలు పార్టీల నేతలు టీఆర్ఎస్లో చేరుతున్నారని మంత్రి హరీశ్‌రావు అన్నారు. దేశంలో ఎక్కడా లేని పథకాలను సీఎం కేసీఆర్ తెచ్చారని ప్రశంసించారు. లాక్డౌన్ సమయంలో కూడా ఏ రాష్ట్రంలోని లేని విధంగా ఆదుకున్నామని చెప్పారు. బియ్యం, సరుకులు పంపిణీ చేశామని గుర్తుచేశారు. ఇతర రాష్ట్రాల్లోని కాంగ్రెస్ నేతలు తెలంగాణను మెచ్చుకుంటుంటే, లోకల్ ఎమ్మెల్యేలు తిట్టడం తప్ప చేసిందేమి లేదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో పసలేదన్నారు. సంగారెడ్డి మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు. -
బడ్జెట్‌పై తెలంగాణ ఎంపీల అసహనం
సాక్షి, న్యూఢిల్లీ : ఆర్థిక మాంధ్యం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఊహించిన దాని కంటే భిన్నంగా ఉందని టీఆర్ఎస్ పార్టీ లోక్ సభ పక్ష నేత, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. శనివారం కేంద్ర బడ్జెట్ కేటాయింపుల అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రైతు బంధు పథకంతో తెలంగాణ రైతులకు సహాయం చేస్తోందని తాజా ఆర్థిక సర్వే తెలిపిందని, కానీ బడ్జెట్లో ఆ పథకానికి ఎలాంటి కేటాయింపులు చేయలేదని మండిపడ్డారు. దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే తెలంగాణ ముందుందని, విభజన హామీలకు బడ్జెట్లో కేటాయింపులు లేవని అన్నారు. దేశంలోనే గొప్ప ప్రాజెక్టైన కాళేశ్వరానికి కూడా నిధులు కేటాయించలేదని, ఇండస్ట్రీయల్ కారిడర్ విజ్ఞప్తులను ప్రభుత్వం పట్టించుకోలేదని అన్నారు. తెలంగాణకు ట్రైబల్ మ్యూజియం కేటాయించాలని కోరామన్నారు. ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకెళ్లె విధంగా బడ్జెట్ లేదని అభిప్రాయపడ్డారు. గతంలో 18 శాతం వృద్ధి రేటు ఉన్న తెలంగాణ రాష్ట్రం ప్రస్తుత కేంద్ర విధానాల వల్ల వృద్ధి రేటు 9శాతానికి పడిపోయిందని తెలిపారు. ఎన్ని సమస్యలు వచ్చినా తెలంగాణ దేశంలోనే మెదటి స్థానంలో ఉందని అన్నారు. మెదక్ ఎంపీ, కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. బడ్జెట్లో తాము కోరిన 22 అంశాలకు కేటాయింపులు ఉంటాయని అనుకున్నామన్నారు. బడ్జెట్లో హర్ ఘర్ జల్ అన్నారని, తెలంగాణ రాష్ట్రంలో మిషన్ భగీరథ పథకంలో భాగంగా సీఎం కేసీఆర్ ముందే అమలు చేశారని తెలిపారు. రైతు బంధు పథకాన్ని కాపీ కొట్టి రైతుల కోసం పనిచేస్తున్నామనడం చోద్యంగా ఉందని అన్నారు. జాతీయ రహదారులు, ప్రాజెక్టుల అంశాలు మాటే లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గోదావరి, కృష్ణ నదీ ప్రాజెక్టులు, నీటి నిల్వలపై చేపల పెంపకం చేపట్టామని..ఆ కార్యక్రమం మంచిగా కొనసాగుతోందని అన్నారు. సాగర మిత్ర అనేది కేసీఆర్ ఎప్పుడో ప్రవేశ పెట్టారని పేర్కొన్నారు. పురాతన కట్టడాలు రాష్ట్రంలో ఎక్కువగా ఉన్నాయని, పర్యాటక రంగానికి సంబంధించి నిధులు కేటాయించలేదని అన్నారు. విభజన హామీల ప్రస్తావనే లేదని, పాత సీసాలో కొత్త సారా పోసినట్టు బడ్జెట్ ఉందని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రంపై కేంద్రం సవితి తల్లి ప్రేమ చూపిస్తుందని విమర్శించారు. రాజ్యసభ సభ్యులు, బడుగుల లింగయ్య యాదవ్ మాట్లాడుతూ.. కేంద్ర బడ్జెట్ అంకెల గారడిగా ఉందని, రైతులను కేంద్రం మోసం చేసిందని మండిపడ్డారు. బడ్జెట్లో జీఎస్టీ బకాయిల అంశం లేదని ,తెలంగాణలోని అనేక సంక్షేమ పథకాలను కాపీ కొడుతున్నారని అన్నారు. ప్రపంచ స్థాయి ప్రాజెక్టు కాళేశ్వరానికి జాతీయ హోదా ఇవ్వాలని కోరామని, విభజన హామీల ప్రసక్తే లేదని అన్నారు. రాష్ట్రాలు బాగుంటేనే కేంద్రం బాగుంటుందన్నారు. బడ్జెట్లో తెలంగాణకు కేటాయింపులు లేకపోవడంపై రాష్ట్ర బీజేపీ ఎంపీలు కూడా పోరాడాలని కోరారు. చెవెళ్ల ఎంపీ, రంజిత్ రెడ్డి మాట్లాడుతూ.. దేశానికే తెలంగాణ సంపద సృష్టిస్తోందని కేంద్రం చెప్పిందని, అన్ని రంగాల వారిగా వృద్ధి రేటులో తెలంగాణ ముందుందని అన్నారు. ప్రభుత్వం ఆర్ధిక మందగమనం నుంచి ఏ విధంగా బయట పడాలో ఆలోచన చేయడం లేదని, పక్క దేశాలు అవలంభిస్తున్న విధానాలు అవలంభించాలని తెలిపారు. 5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీని సాధించాలంటే చాలా డబ్బులు కావాలని, కేంద్రం లెక్కల గారడి చేస్తోందని విమర్శించారు. పథకాల అమలులో తెలంగాణ ముందుందని తెలిపారు. అభివృద్ధికి చర్యలు తీసుకోకుండా 5 లక్షల కోట్ల డాలర్ల ఆర్ధిక వ్యవస్థ ఏ విధంగా సాధ్యమని, బడ్జెట్‌ను వ్యతిరేకిస్తున్నామని రంజిత్ రెడ్డి అన్నారు. -
ఓడీఎఫ్ కార్పొరేటీకరణను అడ్డుకుంటాం
సాక్షి, సంగారెడ్డి : దేశ రక్షణ రంగంలో ఎంతో కీలకమైన ఆయుధ కర్మాగారాల (ఓడీఎఫ్)లను కార్పొరేటీకరించడాన్ని అడ్డుకుని ఉద్యోగులకు అండగా నిలుస్తామని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి హామీ ఇచ్చారు. ఓడీఎఫ్‌లను కార్పొరేటీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నించడాన్ని నిరసిస్తూ సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి రూరల్ మండల పరిధిలోని ఎద్దుమైలారం ఆయుధ కర్మాగారం(ఓడీఎఫ్) వద్ద ఉద్యోగులు కుటుంబ సభ్యులతో కలిసి ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ దేశ చరిత్రలో ఇంతవరకు ఎవరూ తీసుకొని తప్పుడు నిర్ణయాలను కేంద్రం తీసుకొని ఓడీఎఫ్‌ను ప్రైవేటీకరించేందుకు పూనుకోవడం దారుణమన్నారు. 1984లో మెదక్ జిల్లా ప్రజలకు ఉపాధి కల్పన కోసం దివంగత ప్రధాని ఇందిరాగాంధీ ఓడీఎఫ్‌ను స్థాపించారన్నారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఓడీఎఫ్‌లను కార్పొరేటీకరించేందుకు ప్రయత్నించడాన్ని చూసి ఇందిరాగాంధీ ఆత్మ క్షోభిస్తుందని తెలిపారు. దేశ రక్షణలో కీలకంగా ఉంటూ సైనికులకు అవసరమైన ఆయుధాలను తయారు చేసే ఓడీఎఫ్‌లను ప్రైవేటీకరించేందుకు ప్రయత్నించడం మంచిది కాదన్నారు. ప్రభుత్వపరంగా ఉన్న సంస్థలను ఒక్కొక్కటిగా నిర్వీర్యం చేసేందుకు బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సలహాలు, సూచనలతో పార్లమెంట్లో ఓడీఎఫ్‌ల కార్పొరేటీరణను అడ్డుకుంటామని తెలిపారు. ఓడీఎఫ్‌లను రక్షించుకుందాం: ఉద్యోగుల జేఏసీ రాత్రింబవళ్లు కష్టపడి సైన్యానికి అవసరమైన పరికరాలను అందించిన ఆయుధ కర్మాగారాలను కార్పొరేటీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకొని ఓడీఎఫ్‌లను రక్షించుకుందామని ఓడీఎఫ్ ఉద్యోగుల జేఏసీ నాయకులు తెలిపారు. ధర్నాలో జేఏసీ నాయకులు ఈశ్వర్ ప్రసాద్, జనార్దన్‌రెడ్డి, సుదర్శన్, నరేందర్ కుమార్‌లు మాట్లాడుతూ గతంలో రూ. 45 వేల కోట్ల లాభంతో ఉన్న ఓడీఎఫ్‌లు ప్రస్తుతం రూ.5 వేల కోట్లకు పడిపోయాయన్నారు. ప్రస్తుతం జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉందన్నారు. దేశ మొత్తంలో ఉన్న 41 ఓడీఎఫ్‌లను రక్షించుకునేందుకు «ధర్నాలు చేపడుతున్నట్లు తెలిపారు. రక్షణ రంగాన్ని పటిష్టం చేయడంలో కీలకంగా ఉన్న ఓడీఎఫ్‌లను కార్పొరేట్ సంస్థలైన అంబానీ, అదాని, టాటా, బిర్లాలకు అప్పజెప్పేందుకు బీజేపీ ప్రభుత్వం కుట్రలు చేస్తోందని ఆరోపించారు. ఈ ఓడీఎఫ్‌ల పరిధిలో 60 వేల ఎకరాలు ఉన్న భూమిని ప్రైవేట్ సంస్థలకు తాకట్టు పెట్టేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో కాంగ్రెస్ హయాంలో ఉన్న అప్పటి రక్షణశాఖ మంత్రి ఏకే ఆంటోనీ ఓడీఎఫ్‌లను ప్రైవేటీకరించబోమని రాత పూర్వకంగా హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ప్రస్తుతం ఉన్న ప్రధాని మోదీ ఆధ్వర్యంలోని ప్రభుత్వం ఆర్డినెస్ ఫ్యాక్టరీలను కార్పొరేటీకరించి ఉద్యోగులను ఇబ్బందులు పెట్టే కార్యక్రమానికి పూనుకుందని ఆరోపించారు. ప్రభుత్వం నిర్ణయాలను అడ్డుకునేందుకు ఉద్యోగులందరూ ఐక్యంగా ఉండి ఉద్యమిద్దామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, ఎంపీపీ అధ్యక్షురాలు సరళ పుల్లారెడ్డితో పాటు సీఐటీయూ జిల్లా నాయకులు సాయిలు, రాజయ్య, వివిధ ఉద్యోగ సంఘాల నాయకులు పాల్గొన్నారు. -
అందుకే భువనగిరిలో ఓడిపోయాం : హరీశ్ రావు
సాక్షి, సంగారెడ్డి : ప్రజా సేవలో ప్రజాప్రతినిధులకు విశ్రామం ఉండదని, నాయకుడు నిత్య శ్రామికుడై పనిచేయాలని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. సోమవారం సంగారెడ్డిలో టీఆర్ఎస్ కార్యకర్తలు ఏర్పాటు చేసిన ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి సన్మాన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీశ్ మాట్లాడుతూ.. ఎన్నికలు ముగియడంతో కార్యకర్తల బాధ్యత తీరి, ప్రజాప్రతినిధుల బాధ్యత ప్రారంభమైందన్నారు. ప్రజా ప్రతినిధులకు ఆదివారం, రెండో శనివారం సెలవులంటూ ఏమి ఉండవని, నిత్య సేవకుడై ప్రతి రోజూ పనిచేయాలన్నారు. ఎదిగే కొద్ది ఒదుగుతూ.. ప్రజలకు సేవ చేద్దామని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో రాష్ట్రంలో ఇక ప్రతిరోజు పండగేనన్నారు. భువనగిరిలో రోడ్ రోలర్ గుర్తు వల్ల టీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిందన్నారు. ప్రజలకు ఇచ్చిన ప్రతిహామీని నెరవేర్చే దిశగా పని చేద్దామని పార్టీ నేతలకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కార్యకర్తలు లేనిదే నాయకులు లేరు : ప్రభాకర్ రెడ్డి పార్టీ కార్యకర్తలు పెట్టిన భిక్ష వల్లే తాను మరోసారి పార్లమెంట్‌కు వెళున్నానని ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. కార్యకర్తలు లేనిదే నాయకులు లేరన్నారు. హరీశ్ రావు నిర్దేశంలో పకడ్బందీగా ప్రచారం చేశామని, ప్రతి కార్యకర్త టీమ్ లీడర్లా పనిచేశారని ప్రశంసించారు. కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తూ రాష్ట్ర అభివృద్దికి కృషి చేస్తానని పేర్కొన్నారు. -
టీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ ఎవరు?
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ లోక్‌సభాపక్ష నాయకుడిగా ఎవరు ఉంటారనేది ఆ పార్టీలో ఆసక్తికరంగా మారింది. కీలకమైన నేతలు ఎన్నికల్లో పరాజయం పాలు కావడంతో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈ బాధ్యతలను ఎవరికి అప్పగిస్తారనే చర్చ మొదలైంది. గత లోక్‌సభలో టీఆర్ఎస్ లోక్‌సభ పక్షనేతగా ఉన్న ఎ.పి.జితేందర్‌రెడ్డికి ఈసారి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఇవ్వలేదు. టీఆర్ఎస్ కీలకనేతగా గుర్తింపు ఉన్న బోయినపల్లి వినోద్‌కుమార్ సీనియర్ ఎంపీగానూ ఉండేవారు. ఆయన ఈ ఎన్నికల్లో ఓడిపోయారు. నిజామాబాద్ ఎంపీగా ప్రాతినిథ్యం వహించిన కల్వకుంట్ల కవిత సైతం పరాజయం పాలయ్యారు. ప్రస్తుతం టీఆర్ఎస్ తరుపున గెలిచిన 9 మంది ఎంపీలలో ఉన్న బి.బి.పాటిల్, ప్రభాకర్‌రెడ్డి, దయాకర్, నామా నాగేశ్వర్‌రావులో ఒకరికి టీఆర్ఎస్ఎల్పీ నేతగా అవకాశం ఇవ్వనున్నట్లు పార్టీ ముఖ్యలు చెబుతున్నారు. వారంలోపే కొత్త ఎంపీలతో సమావేశం నిర్వహించి లోక్‌సభ పక్షనేత ఎన్నిక ప్రక్రియను పూర్తి చేయనున్నారు. -
‘ఆయన గాలిలో కొట్టుకుపోవడం ఖాయం’
దుబ్బాక: తెలంగాణ ఉద్యమంలో అందరికంటే ఎక్కువ కేసులు దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డిపైనే ఉన్నాయని టీఆర్ఎస్ సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావు వ్యాఖ్యానించారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం రాయపోల్‌లో కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి హరీష్ రావు, మెదక్ టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. భారతదేశంలోనే అత్యధిక మెజార్టీతో కొత్త ప్రభాకర్ రెడ్డి గెలవబోతున్నారని జోస్యం చెప్పారు. రోజుకొక నాయకుడు కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్లో చేరుతున్నారని తెలిపారు. తెలంగాణా ప్రజలకు ఒక్క మంత్రి పదవి కూడా ఇవ్వకుండా బీజేపీ ప్రభుత్వం చిన్నచూపు చూసిందని ఆరోపించారు. అభివృద్ధి, సంక్షేమంలో దేశానికి దిక్చూచిగా తెలంగాణా ఉందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్, బీజేపీ వాళ్లకు ఓటు వేసి ఢిల్లీ చుట్టూ తిరుగుడు అవసరం లేదన్నారు. టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేస్తే కేంద్ర నిథులు ముక్కు పిండి రాబట్టవచ్చునని అన్నారు. వచ్చే నెల 3న నర్సాపూర్‌లో కేసీఆర్ సభ ఉందని, అందరూ హాజరై విజయవంతం చేయాలని కోరారు. ప్రతి ఒక్కరూ కారు గుర్తుకు ఓటేసి టీఆర్ఎస్ అభ్యర్థి కొత్తప్రభాకర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. గాలిలో కొట్టుకుపోవడం ఖాయం: పద్మాదేవేందర్ రెడ్డి మెదక్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ గాలిలో కొట్టుకుపోవడం ఖాయమని టీఆర్ఎస్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి హాస్యమాడారు. దుబ్బాకలో చెల్లని రూపాయి అయిన రఘునందన్ రావు మెదక్‌లో చెల్లడం సాధ్యమా అని ప్రశ్నించారు. తెలంగాణాలో టీఆర్ఎస్ పార్టీకి తప్ప వేరే పార్టీకి పుట్టగతులు లేవని, 16 ఎంపీ సీట్లు గెలిచినట్లయితే ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ కీలకమవుతుందని మెదక్ ఎంపీ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. -
దేశంలోనే తెలంగాణ నంబర్ వన్
జిన్నారం(పటాన్చెరు): దేశంలోనే తెలంగాణ నంబర్ వన్ స్థానంలో ఉందని, తెలంగాణ పథకాలు దేశ వ్యాప్తంగా అమలవుతున్నాయని, కొత్త ప్రభాకర్‌రెడ్డి గెలుపు ఖాయమని, ఇక మెజార్టీని భారీగా అందించాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డికి మద్దతుగా గుమ్మడిదల మండలంలోని బొంతపల్లి గ్రామం నుంచి గుమ్మడిదల వరకు రోడ్ షో నిర్వహించారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు, పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి కొత్త ప్రభాకర్‌రెడ్డికి మద్దతుగా ప్రచారం చేశారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి గెలుపు ఖాయమైందని, 5లక్షల మెజార్టీని అందించాలని పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్ దేశంలోనే ఏ రాష్ట్రంలో అమలు కాని పథకాలు మన రాష్ట్రంలో అమలు చేసేలా కృషి చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో 16 ఎంపీ స్థానాలను టీఆర్ఎస్ కైవసం చేసుకుంటే కేంద్రం నుంచి అధికంగా నిధులను పొందొచ్చన్నారు. దుండిగల్ నుంచి గుమ్మడిదల మీదుగా నర్సాపూర్ వరకు రూ.436 కోట్లతో జాతీయ రహదారి నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. ఇందులో కొత్త ప్రభాకర్‌రెడ్డి కృషి చాలా ఉందన్నారు. కాళేశ్వరం నీటిని జిన్నారం, గుమ్మడిదల మండల ప్రాంతాల్లోని రైతులకు అందిచేలా కృషి చేస్తున్నామన్నారు. మల్లన్నసాగర్ కెనాల్ కూడా గుమ్మడిదల మీదుగా వెళ్తున్నట్లు పేర్కొన్నారు. రైతుబంధు దేశానికే ఆదర్శమన్నారు. కాంగ్రెస్, బీజేపీలు గెలిసే ప్రసక్తే లేదని, వారికి ఓటేస్తే బురదలో వేసినట్లేనన్నారు. స్థానికంగా గెలవలేరని కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు ఎంపీ రేసులో ఉండటం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు ప్రభాకర్, నాయకులు చంద్రారెడ్డి, గోవర్ధన్‌రెడ్డి, వెంకటేశంగౌడ్, కుమార్‌గౌడ్, బాల్‌రెడ్డి, సురేందర్‌రెడ్డి, నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
10 సీట్లు ఖరారు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి లోక్‌సభ అభ్యర్థుల ప్రక్రియ తుది దశకు చేరింది. అభ్యర్థుల ప్రకటనను టీఆర్ఎస్ వ్యూహాత్మకంగా జాప్యం చేస్తోంది. ఆయా నియోజకవర్గాల్లోని రాజకీయ, సామాజిక సమీకరణాలను పరిగణనలోకి తీసుకొని కాంగ్రెస్ అభ్యర్థులు ఎవరనే అంచనాతో జాబితా రూపొందిస్తోంది. రాష్ట్రంలో 16 లోక్‌సభ సెగ్మెంట్లను గెలుచుకోవాలనే లక్ష్యంతో అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని ఇప్పటికే పది స్థానాల్లో అభ్యర్థులు ఎవరనే దానిపై స్పష్టత ఇచ్చింది. ‘ఎన్నికల్లో పోటీకి సిద్ధంగా ఉండండి. నామినేషన్ దాఖలకు అవసరమైన అన్నింటినీ సిద్ధం చేసుకోండి. త్వరలోనే అధికారిక ప్రకటన వస్తుంది. ఈ విషయం ఎవరికీ చెప్పొద్దు’అని టీఆర్ఎస్ అధిష్టానం పది స్థానాల్లోని ఆశావహులకు సమాచారం ఇచ్చింది. మరో ఆరు స్థానాల్లో అభ్యర్థుల ఎంపికను పెండింగ్‌లో పెట్టింది. ఈ జాబితాలో నాలుగు టీఆర్ఎస్ సిట్టింగ్ సెగ్మెంట్లు ఉండటంతో ఆ ఎంపీల్లో ఆందోళన పెరుగుతోంది. ఆయా సిట్టింగ్ ఎంపీలు, ఆశావహులు పరస్పరం ఫోన్లు చేసుకుంటూ ‘అన్నా ఆ సెగ్మెంట్‌పై అధిష్టానం స్పష్టత ఇచ్చిందట. మీకు సమాచారం వచ్చిందా? ఫోన్ వస్తే నాకు కచ్చితంగా చెప్పండి’అని చెప్పుకుంటున్నారు. పెండింగ్ సీట్లపై ఒకట్రెండు రోజుల్లోనే స్పష్టత వస్తుందని తెలుస్తోంది. కరీంనగర్ ఎన్నికల ప్రచార సభ తర్వాత లేదా మంగళవారం నిజామాబాద్‌లో జరగనున్న బహిరంగ సభ తర్వాతే అభ్యర్థులపై స్పష్టత వస్తుందని టీఆర్ఎస్ ముఖ్య నేతలు చెబుతున్నారు. కాంగ్రెస్ ఇప్పటికే 8 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించింది. ఆదివారంలోగా మిగిలిన సీట్లకు అభ్యర్థులను ప్రకటిస్తే టీఆర్ఎస్ అభ్యర్థుల ప్రకటన ముందుగానే జరగవచ్చని తెలుస్తోంది. ఆరు లోక్‌సభ సెగ్మెంట్లలో అభ్యర్థుల ఖరారుపై టీఆర్ఎస్ అధిష్టానం ఇంకా నిర్ణయం తీసుకోనట్లు తెలుస్తోంది. మహబూబ్‌నగర్, నల్లగొండ, ఖమ్మం, మహబూబాబాద్, పెద్దపల్లి, సికింద్రాబాద్ స్థానాల్లోని అభ్యర్థులపై స్పష్టత రాలేదు. ఈ సెగ్మెంట్లలోనూ అభ్యర్థులను ఖరారు చేసి అన్ని సీట్లకూ ఒకేసారి జాబితాను విడుదల చేసే అవకాశం ఉందని టీఆర్ఎస్ ముఖ్య నేతలు చెబుతున్నారు. ►నల్లగొండ సిట్టింగ్ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వంలోనే తనకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. దీంతో ఇక్కడ అభ్యర్థి ఎవరనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. టీఆర్ఎస్ అధిష్టానం ఈ స్థానంలో తేరా చిన్నపరెడ్డి, వి. నర్సింహారెడ్డి పేర్లను పరిశీలిస్తోంది. ►మహబూబ్‌నగర్ లోక్‌సభ సెగ్మెంట్లో సిట్టింగ్ ఎంపీ జితేందర్‌రెడ్డి అభ్యర్థిత్వం ఖరారుపై ఉత్కంఠ పెరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులకు వ్యతిరేకంగా పనిచేశారన్న ఫిర్యాదుల నేపథ్యంలో ఆయన అభ్యర్థిత్వాన్ని అధిష్టానం పెండింగ్‌లో పెట్టింది. మాజీమంత్రి సి.లక్ష్మా రెడ్డి, పారిశ్రామికవేత్త మన్నె శ్రీనివాస్‌రెడ్డి పేర్లను అధిష్టానం పరిగణనలోకి తీసుకుంటోంది. ►ఖమ్మం సిట్టింగ్ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అభ్యర్థిత్వం డోలాయమానంలో ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో తమను ఓడించేందుకు పొంగులేటి ప్రయత్నించారని టీఆర్ఎస్ అభ్యర్థులు అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. దీనికితోడు ఈ సెగ్మెంట్లో ఖమ్మంలోని మరో కీలక సామాజికవర్గానికి అవకాశం ఇవ్వాలని టీఆర్ఎస్ భావిస్తోంది. దీంతో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు, వంకాయలపాటి రాజేంద్రప్రసాద్ పేర్లను పరిశీలిస్తోంది. ►మహబూబాబాద్ సెగ్మెంట్ అభ్యర్థిపై టీఆర్ఎస్ అధినేత ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. సిట్టింగ్ ఎంపీ అజ్మీరా సీతారాం నాయక్ చివరి నిమిషంలో టికెట్ ఖరారయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. మాజీ ఎమ్మెల్యేలు మాలోతు కవిత, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి రామచంద్రు నాయక్ పేర్లను కూడా అధిష్టానం పరిగణనలోకి తీసుకుంటోంది. ►పెద్దపల్లి అభ్యర్థి ఖరారుపై ఇంకా స్పష్టత రాలేదు. గత ఎన్నికల్లో ఈ స్థానం ఉంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఓడిపోయిన జి. వివేకానంద టికెట్ ఆశిస్తున్నారు. అయితే వివేకానంద అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులకు వ్యతిరేకంగా పనిచేశారని పార్టీ అధిష్టానానికి ఫిర్యాదులు అందాయి. దీంతో అన్నింటినీ పరిశీలించి నిర్ణయానికి రావా లని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భావిస్తున్నా రు. చివరి నిమిషంలో వివేకానందకు టికెట్ ఖరారయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ►సికింద్రాబాద్ సెగ్మెంట్లో టీఆర్ఎస్ అధినేత సామాజిక సమీకరణాలను పరిగణనలోకి తీసుకొని టికెట్లను ఖరారు చేస్తున్నారు. తలసాని సాయికిరణ్ యాదవ్, బొంతు శ్రీదేవి యాదవ్, దండె విఠల్ పేర్లను పరిశీలిస్తున్నారు. ►టీఆర్ఎస్ అధిష్టానం పది స్థానాలపై స్పష్టతకు వచ్చింది. ఈ స్థానాల్లో అభ్యర్థులుగా ఉండే వారికి అనధికారికంగా సమాచారం ఇచ్చింది. సమాచారం ఇచ్చిన స్థానాలు ఇవీ ఆదిలాబాద్: గోడం నగేశ్ కరీంనగర్: బోయినపల్లి వినోద్ కుమార్ నిజామాబాద్: కల్వకుంట్ల కవిత జహీరాబాద్: భీంరావు బసంత్‌రావు పాటిల్ మెదక్: కొత్త ప్రభాకర్‌రెడ్డి భువనగిరి: బూర నర్సయ్యగౌడ్ వరంగల్: పసునూరి దయాకర్ చేవెళ్ల: జి. రంజిత్‌రెడ్డి మల్కాజిగిరి: కె. నవీన్‌రావు నాగర్ కర్నూల్: పి. రాములు -
గజ్వేల్‌లో కేసీఆర్‌కు భారీ మెజారిటీ ఖాయం!
సాక్షి, సిద్దిపేట: గజ్వేల్ నియోజకవర్గంలో ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు భారీ మెజారిటీతో గెలువడం ఖాయమని టీఆర్ఎస్ మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. గజ్వేల్ పట్టణంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. భారీగా డబ్బు ఖర్చు చేసి.. గెలుస్తామని ప్రత్యర్థులు ఆశ పడుతున్నారని, కానీ, గజ్వేల్‌లో కేసీఆర్ చేసిన అభివృద్ధిని ప్రజలు ఆదరించారని తెలిపారు. ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపు ఖాయమని, ఇతర పార్టీల మద్దతు లేకుండానే తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు. -
వెంటిలేటర్‌పై కాంగ్రెస్.. అందుకే ఒంటేరు డ్రామాలు!
సాక్షి, సిద్దిపేట: టీఆర్ఎస్ పార్టీకి ప్రజల్లో ఉన్న ఆదరణ చూసి ఓర్వలేక కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి ఒంటేరు ప్రతాపరెడ్డి హైడ్రామాలు ఆడుతున్నారని టీఆర్ఎస్ ఎంపి కొత్త ప్రభాకర్ రెడ్డి విమర్శించారు. ఆదివారం ఎన్నికల సంఘం ముందు ఒంటేరు ఆడిన డ్రామాలు చూస్తుంటే.. కాంగ్రెస్ పార్టీ వెంటిలేటర్ మీద ఆధారపడినట్టు స్పష్టమవుతోందన్నారు. కొత్త ప్రభాకర్ రెడ్డి సోమవారం విలేకరులతో మాట్లాడుతూ ఒంటేరు తీరును తీవ్రంగా తప్పుబట్టారు. తెలంగాణలో ఎన్నికల కోసం ఆంధ్రా నుంచి లక్షల రూపాయలు వస్తున్నాయని, ఆదివారం పట్టుబడిన డబ్బులు కూడా అందులోనివేనని అన్నారు. పట్టుబడిన డబ్బులకు టీఆర్ఎస్ చెందినవి అనడం హాస్యాస్పదమన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ని ఓడించడం కోసమే కూటమి కట్టారని విమర్శించారు. టీఆర్ఎస్ పార్టీకి ప్రజాదరణ పెరగటంతో సభ్యత సంస్కారం లేకుండా బూటకపు ధర్నా చేశారని దుయ్యబట్టారు. డిసెంబర్ 12న టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక నర్సారెడ్డి, ప్రతాపరెడ్డి లు ఎక్కడికి పారిపోతారో తేల్చుకోవాలని ధ్వజమెత్తారు. ప్రజలను మభ్యపెట్టె చిల్లర రాజకీయాలు చేయవద్దని అన్నారు. -
వివిధ దశల్లో 9 రైల్వే లైన్ ప్రాజెక్టులు
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో రూ.14,665 కోట్ల అంచనా వ్యయంతో 1,093 కి.మీ. మేర 9 కొత్త రైల్వే లైన్ ప్రాజెక్టుల నిర్మాణం వివిధ దశల్లో జరుగుతోం దని కేంద్ర రైల్వే సహాయ మంత్రి రాజెన్ గొహెయిన్ లోక్‌సభకు తెలిపారు. టీఆర్ఎస్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన బుధవారం లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. మునీరాబాద్–మహబూబ్‌నగర్ లైన్ (246 కి.మీ.)లో 71 కి.మీ. పూర్తయిందని, జక్లేర్–కృష్ణా, చిక్కబెనకల్–యెరమరస్ మధ్య భూసేకరణ పూర్తయిందని పేర్కొన్నారు. మనోహరాబాద్–కొత్తపల్లి లైన్ (148.90 కి.మీ.)లో భూసేకరణ పూర్తయిందని వివరించారు. భద్రాచలం రోడ్డు–సత్తుపల్లి లైన్ (56.25 కి.మీ)లో భూసేకరణ పూర్తయిందని, వంతెనల పనులు, ఇతర పనుల కోసం టెండర్ ప్రక్రియ పూర్తయిందన్నారు. ఇక అక్కన్నపేట–మెదక్ లైన్ (17.2 కి.మీ )లో 338 ఎకరాలకు గాను 333 ఎకరాల భూసేకరణ పూర్తయిందని, మట్టి పను లు, వంతెనల పనులు ప్రారంభమయ్యాయని తెలి పారు. భద్రాచలం–కొవ్వూరు లైన్ తెలంగాణ విన్నపం మేరకు సత్తుపల్లి మీదుగా నిర్మించేందుకు కేంద్రం అంగీకరించిందని, తెలంగాణ గుండా 48.58 కి.మీ. మేర ఈ లైన్ వెళ్తోందని, అయితే తెలంగాణ ప్రభుత్వాన్ని ఇందుకు 50 శాతం వ్యయాన్ని భరించాల్సిందిగా కోరగా ఇంతవరకు సమాధానం రాలేదని వెల్లడించారు. ఇక మణుగూరు–రామగుండం లైన్ ప్రాజెక్టుకు కూడా తెలంగాణ ప్రభుత్వం తన వాటాగా 50 శాతం వ్యయం, ఉచితంగా భూమి సమకూర్చాల్సి ఉందని, తెలంగాణ నుంచి స్పందన కోసం ఎదురుచూస్తున్నామని తెలిపారు. కొండపల్లి–కొత్తగూడెం రైల్వేలైన్ నిర్మాణం కోసం కూడా తెలంగాణ నుంచి వ్యయంలో వాటా కోరగా, ఇంకా స్పందించలేదని వివరించారు. -
ఉట్టికొట్టిన మంత్రి హరీశ్‌రావు
సిద్ధిపేట రూరల్: తెలంగాణ మంత్రి హరీశ్‌రావు కృష్ణాష్టమి వేడుకల్లో పాల్గొన్నారు. శనివారం సాయంత్రం మెదక్ జిల్లా సిద్ధిపేట మండలం ఇబ్రహీంపూర్ గ్రామం పాఠశాలలో నిర్వహించిన కృష్ణాష్టమి వేడుకల్లో హరీశ్‌రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఉట్టి కొట్టారు. కార్యక్రమంలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, సీఎం ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్ పాల్గొన్నారు. -
ఏడుపాయలకు పర్యాటక శోభ
మెదక్: జిల్లాలో ప్రసిద్ధిగాంచిన ఏడుపాయల ఆలయానికి పర్యాటక శోభ కల్పిస్తామని డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి పేర్కొన్నారు. మాస్టర్ ప్లాన్‌తో ఏడుపాయల రూపు రేఖలు మార్చి ఆలయ కీర్తిని ఎల్లలు దాటేలా చేస్తామన్నారు. బుధవారం హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో తెలంగాణ ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, వివిధ శాఖల అధికారులతో ఆమె సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ స్పీకర్ మాట్లాడుతూ భారత దేశంలో వనదుర్గా ఆలయాలు రెండే ఉన్నాయని, అందులో కశ్మీర్‌లోని ఆలయం మూతపడిందన్నారు. ప్రస్తుతం ఏడుపాయల్లోని వనదుర్గమాత ఆలయం మాత్రమే నిత్యపూజలందుకుంటోందన్నారు. జనమే జేయుని సర్పయాగస్థలిగా వినుతికెక్కిన ఏడుపాయలను అన్ని విధాలుగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ మేరకు వివిధ శాఖల అధికారులతో కలిసి మాస్టర్ ప్లాన్ రూపొందించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌కు రాహుల్‌బొజ్జాకు సూచించారు. ఏడుపాయలకు వచ్చే వేలాది భక్తులకు అన్ని వసతులు కల్పించేందుకు ప్రణాళికలు రూపొందించాలని, పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. దేవాలయ విశిష్టతను ఇనుమడింపజేసేందుకు ఆగమ శాస్త్ర పండితులను సంప్రదించి చండీయాగం నిర్వహణకు శాశ్వత యాగశాలను ఏర్పాటు చేయాలన్నారు. ఇందుకు అవసరమైన నిధులను రాష్ట్ర ప్రభుత్వం సమకూరుస్తుందన్నారు. మహాశివరాత్రి లోగా ఏర్పాట్లు పూర్తి కావాలని ఆదేశించారు. సమావేశంలో శిల్పారామం ప్రత్యేకాధికారి కిషన్‌రావు, కలెక్టర్ రాహుల్ బొజ్జా, ఆర్డీఓ నగేష్‌గౌడ్, ఏడుపాయల చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి, ఈఓ, వెంకటకిషన్‌రావు, డీఎఫ్ఓ సోనిబాల పాల్గొన్నారు. -
మెదక్‌లో టీఆర్ఎస్దే హవా
కొత్త ప్రభాకర్‌రెడ్డి ఘనవిజయం ప్రచారంలో విఫలమై భారీ మూల్యం చెల్లించిన కాంగ్రెస్, బీజేపీ రెండు, మూడు స్థానాలకు పరిమితం సంగారెడ్డి: మెదక్ లోక్‌సభ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ మరోసారి సత్తా చాటింది. ప్రతిపక్షాలను చిత్తు చేసి ఎంపీ స్థానాన్ని ఏకపక్షంగా గెలుచుకుంది. ఆ పార్టీ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డి ఘన విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి సునీతా లక్ష్మారెడ్డిపై 3,61,288 ఓట్ల భారీ ఆధిక్యంతో గెలుపొందారు. గెలుపుపై ధీమా వ్యక్తం చేసిన బీజేపీ అభ్యర్థి తూర్పు జగ్గారెడ్డి మూడో స్థానానికి పడిపోయారు. తెలుగుదేశం పార్టీ ఆయనకు అండగా నిలిచినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. మొత్తం 14 మంది అభ్యర్థులు బరిలో నిలబడగా.. 11 మందికి డిపాజిట్లు గల్లంతయ్యాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ రాజీనామాతో మెదక్ స్థానానికి లోక్‌సభ ఎన్నిక అనివార్యమైన విషయం తెలిసిందే. ఈ నెల 13న ఉప ఎన్నిక జరగగా, మంగళవారం ఓట్ల లెక్కింపు జరిగింది. మొత్తం 10,46,092 ఓట్లు పోలవ్వగా టీఆర్ఎస్ అభ్యర్థికి 5,71,810 ఓట్లు వచ్చాయి. 2,10,524 ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థి రెండో స్థానంలో, 1,86,343 ఓట్లతో బీజేపీ అభ్యర్థి మూడో స్థానంలో నిలిచారు. గత సాధారణ ఎన్నికల్లో 77.35 శాతం పోలింగ్ నమోదు కాగా, ఇక్కడ పోటీ చేసిన కేసీఆర్‌కు 3.97 లక్షల ఓట్ల మెజార్టీ వచ్చింది. అయితే ఈసారి 67.79 శాతం మాత్రమే పోలింగ్ నమోదైనప్పటికీ టీఆర్ఎస్కు ఓట్ల శాతం తగ్గకపోవడం గమనార్హం. గత ఎన్నికల్లో గులాబీ దండుకు 55 శాతం ఓట్లు రాగా.. ఈ ఉపఎన్నికలో దాన్ని స్వల్పంగా పెంచుకుని 55.2 శాతం ఓట్లను కొల్లగొట్టింది. కాగా, ఈ ఎన్నికలో ఘన విజయం సాధించిన కొత్త ప్రభాకర్ రెడ్డికి ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. భారీ మెజార్టీ సాధించడంలో కీలక పాత్ర పోషించిన మంత్రి హరీష్‌రావును సైతం అభినందించారు. సిద్దిపేటదే హవా.. కొత్త ప్రభాకర్‌రెడ్డి ఆధిక్యతలో సిద్దిపేట నియోజకవర్గమే కీలకమైంది. ఇక్కడ 76,733 ఓట్ల మెజార్టీతో టీఆర్ఎస్ అభ్యర్థికి తిరుగులేని ఆధిక్యత దక్కింది. మొత్తం 1,35,593 ఓట్లు పోల్ కాగా.. ఇందులో 93,759 ఓట్లు టీఆర్ఎస్ పార్టీకే వచ్చాయి. ఇక నర్సాపూర్ నియోజకవర్గంపై ఆశలు పెట్టుకున్న సునీతారెడ్డి నిరాశ చెందక తప్పలేదు. నర్సాపూర్‌లో సునీతారెడ్డికి 67,267 ఓట్లు మాత్రమే రాగా... టీఆర్ఎస్కు 73,710 ఓట్లు పడ్డాయి. వెనుకబడి పోతారనుకున్న చోటే గులాబీ దండుకు 6,443 ఓట్ల ఆధిక్యత లభించడం విశేషం. ఇక సంగారెడ్డి నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి జగ్గారెడ్డికి షాక్ తగిలింది. ఇక్కడి ఓటర్లు కూడా టీఆర్ఎస్ అభ్యర్థికే అండగా నిలిచారు. ఈ నియోజకవర్గంలో 18,849 ఓట్లతో జగ్గారెడ్డి వెనుకబడ్డారు. చతికిలపడిన ప్రతిపక్షాలు రైతు రుణమాఫీపై టీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పటికీ స్పష్టత రాలేదన్న అంశాన్ని అస్త్రంగా చేసుకుని ప్రజల్లోకి వెళ్లిన ప్రతిపక్షాలు.. అధికారపార్టీపై పెద్దగా ఒత్తిడిని పెంచలేకపోయాయి. కాంగ్రెస్, బీజేపీ నాయకులు ప్రజా సమస్యలను వదిలి వ్యక్తిగత దూషణలు అందుకోవడం కూడా వారికి నష్టం చేకూర్చింది. టీడీపీ నేతలు ఎర్రబెల్లి దయాకర్‌రావు, రేవంత్‌రెడ్డి వంటి వారు ఇంకో అడుగు ముందుకేసి బహిరంగ చర్చలతో సవాళ్లకు దిగారు. మరోవైపు మంత్రి హరీష్‌రావు ఈ వాతావరణాన్ని తనకు అనుకూలంగా మలచుకున్నారు. వ్యూహాత్మకంగా వ్యవహరించి ప్రతిపక్షాలను ఇరకాటంలో పెట్టారు. రుణమాఫీ, రైతుల ఆత్మహత్యల అంశాల జోలికి వెళ్లకుండా సవాళ్లు, ప్రతిసవాళ్లకే వాటిని పరిమితం చేశారు. సిద్దిపేట తరహా అభివృద్ధిని రాష్ర్ట మంతటికీ విస్తరిస్తామని కేసీఆర్ కూడా అభివృద్ధి అంశాన్ని తెరపైకి తెచ్చారు. మరోవైపు సిద్దిపేట అభివృద్ధిని జగ్గారెడ్డి అడ్డుకున్నాడని ఆరోపణ చేస్తూ, కాదని నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని హరీష్ సవాల్ విసరడంతో బీజేపీ నేతలు పూర్తిగా ఆత్మరక్షణలో పడిపోయారు. దాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో వివరణలకే పరిమితమై విలువైన సమయాన్ని వృథా చేసుకున్నారు. మొత్తానికి ప్రధాన సమస్యలపై ప్రజల్లోకి వెళ్లాల్సిన కాంగ్రెస్, బీజేపీలు అస్త్ర సన్యాసం చేసినట్టు వ్యవహరించి ఉప ఎన్నికలో విఫలమయ్యాయి. అందుకే ఓటింగ్ శాతం భారీగా పడిపోయినా టీఆర్ఎస్ మెజార్టీలో పెద్దగా తేడా రాలేదని రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. -
బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ఓటమి ఖాయం
- కొత్త ప్రభాకర్‌రెడ్డి విజయం తథ్యం - ప్రతిపక్షాలవి అర్థం లేని విమర్శలు - నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు గజ్వేల్: మెదక్ పార్లమెంట్ ఉప ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ప్రజలు బుద్ధిచెప్పడం ఖాయమని నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు స్పష్టం చేశారు. శనివారం గజ్వేల్‌లోని పీఎన్ఆర్ గార్డెన్స్‌లో నిర్వహించిన టీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గస్థాయి కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ.. మెదక్ పార్లమెంట్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డి విజయం తథ్యమని పేర్కొన్నారు. గజ్వేల్ శాసనసభా నియోజకవర్గానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్నందున మెదక్ లోక్‌సభ నియోజకవర్గంలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో ఇక్కడే అత్యధిక మెజార్టీని తీసుకురావడానికి కార్యకర్తలు, నాయకులు కలిసికట్టుగా పనిచేయాలని కోరారు. సమైఖ్యవాదాన్ని భుజాన వేసుకుని తెలంగాణ వ్యతిరేకిగా ముద్రపడిన జగ్గారెడ్డి మెదక్ పార్లమెంట్ ఉప ఎన్నికల్లో టికెట్ ఏవిధంగా ఇచ్చారో? ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ప్రజలకు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. జగ్గారెడ్డి వైఖరి మారిందా? బీజేపీ స్టాండ్ మారిందో వివరించాల్సిన అవసరమున్నదన్నారు. మరోవైపు జిల్లా ప్రజలకు కాంగ్రెస్ అభ్యర్థి సునీతాలక్ష్మారెడ్డి ఒరగబెట్టిందేమీలేదని మండిపడ్దారు. నాలుగేళ్లుగా జిల్లాలో వడగళ్ల వానల కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందుల్లో కూరుకుపోగా అప్పట్లో మంత్రిగా పనిచేసిన సునీతారెడ్డి రైతులకు పరిహారం ఇప్పించలేకపోయారని చెప్పారు. నిండు సభలో అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తెలంగాణకు నిధులివ్వను..ఏం చేసుకుంటారో చేసుకోండి.. అంటూ మాట్లాడినా తెలంగాణ ప్రజాప్రతినిధులు ఏం చేయలేకపోయారని విమర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నాలుగేళ్ల ఇన్‌ఫుట్ సబ్సిడీ రూ.480 కోట్లు విడుదల చేశారని పేర్కొన్నారు. జనగామలో చెల్లనిరూపాయిగా మారిన టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య మెదక్‌లో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తానని చెప్పడం విడ్డూరంగా ఉన్నదని చెప్పారు. మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ టీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ ఎంపీగా పోటీచేయడం అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. తనను గెలిపిస్తే ప్రజల కష్టసుఖాల్లో నిరంతరం పాలుపంచుకుంటానని పేర్కొన్నారు. దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమానికి ద్రోహం తలపెట్టిన జగ్గారెడ్డికి ఎన్ని శిక్షలు వేసినా తక్కువేనని చెప్పారు. ఆయనకు టికెట్ ఇవ్వడం ద్వారా ఇక్కడి ప్రజలను బీజేపీ అవమానించిందని మండ్డిపడ్డారు. సమాశంలో జహీరాబాద్ ఎంపీ బీబీపాటిల్, జిల్లా పరిషత్ చైర్మన్ రాజమణి, ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్సీలు సుధాకర్‌రెడ్డి, రాములు నాయక్, టీఆర్ఎస్ జిల్లా ఇన్చార్జి రాజయ్యయాదవ్, పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆర్.సత్యనారాయణ, టీఆర్ఎస్ రాష్ట్ర నేత చాగన్ల నరేంద్రనాథ్, గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి మడుపు భూంరెడ్డి, మాజీ జెడ్పీ చైర్మన్ లక్ష్మీకాంతారావు, గజ్వేల్ నగర పంచాయతీ చైర్మన్ గాడిపల్లి భాస్కర్, మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి, డీసీసీబీ మాజీ చైర్మన్ జి.ఎలక్షన్‌రెడ్డి, గజ్వేల్ మాజీ ఎంపీపీ పొన్నాల రఘుపతిరావు, మాజీ మార్కెట్ కమీటీ చైర్మన్ డాక్టర్ వి.యాదవరెడ్డి, టీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షులు మాదాసు శ్రీనివాస్, ప్రొఫెసర్ సాంబయ్య తదితరులు పాల్గొన్నారు. -
మెదక్ బీజేపీ లోక్‌సభ అభ్యర్థిగా జగ్గారెడ్డి
-
మెదక్ బీజేపీ లోక్‌సభ అభ్యర్థిగా జగ్గారెడ్డి
హైదరాబాద్ : మెదక్ బీజేపీ లోక్‌సభ అభ్యర్థిగా తూర్పు జయప్రకాష్ రెడ్డిని ఆపార్టీ అధికారికంగా ప్రకటించింది. అంతకు ముందు అంజిరెడ్డి పేరు ఖరారు అయినట్లు వార్తలు వెలువడినా .... స్పష్టమైన ప్రకటన వెలువడలేదు. తాజాగా సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్ రెడ్డి పేరు తెరమీదకు వచ్చింది. ఈనేపథ్యంలో ఆయన బుధవారం తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డితో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆయన ఈరోజు మధ్యాహ్నం నామినేషన్ దాఖలు చేయనున్నారు. జగ్గారెడ్డి నామినేషన్ కార్యక్రమానికి తెలంగాణ టీడీపీ నేతలు కూడా హాజరు కానున్నారు. గతంలో ఆయన బీజేపీలో పనిచేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ తాను మొదటి నుంచి బీజేపీ వ్యక్తినేనని, ఏబీవీపీ నుంచే క్రియాశీలక కార్యకర్తగా పనిచేసినట్లు తెలిపారు. మరోవైపు జగ్గారెడ్డి పేరు అనూహ్యంగా తెరమీదకు రావటంతో మెదక్ జిల్లాలో బీజేపీ నేతల నుంచి అసంతృప్తి వ్యక్తం అవుతోంది. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైన ఆయనను ఎంపీ అభ్యర్థిగా ఎంపిక చేయటంపై నేతలు అసంతృప్తితో ఉన్నారు. -
మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్ధిగా అంజిరెడ్డి
హైదరాబాద్ :మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్ధిగా అంజిరెడ్డి. ఆయనకు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మారికాసేపట్లో బీఫారమ్ అందచేయనున్నారు. ఈరోజు మధ్యాహ్నం అంజిరెడ్డి నామినేషన్ వేయనున్నారు. ఇక టీఆర్ఎస్ నుంచి కొత్త ప్రభాకర్ రెడ్డి, కాంగ్రెస్ తరపున మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి బరిలో దిగుతున్నారు. కాగా మెదక్ ఉప ఎన్నికను కాంగ్రెస్ అధిష్టానం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిని ఎలాగైనా గెలిపించి సత్తా చాటాలని భావిస్తోంది. రాష్ట్ర కాంగ్రెస్ నాయకులంతా ఉప ఎన్నిక పూర్తయ్యే వరకు మెదక్‌లోనే మకాం పెట్టేలా వ్యూహం సిద్ధం చేసింది. అసెంబ్లీ నియోజకవర్గానికో మాజీమంత్రి, మండలానికో ఎమ్మెల్యే, గ్రామానికో ప్రజా ప్రతినిధి చొప్పున పార్లమెంట్ పరిధిలో 2 వేల మందికిపైగా నేతలు పాగా వేసేలా ప్రణాళికను రూపొందించింది. -
మెదక్ ఎంపీ అభ్యర్థుల ఖరారు
-
మెదక్ ఎంపీ అభ్యర్థుల ఖరారు
టీఆర్ఎస్ అభ్యర్థిగా కొత్త ప్రభాకర్ రెడ్డి కాంగ్రెస్ నుంచి బరిలోకి సునీతా లక్ష్మారెడ్డి అర్ధరాత్రి వరకూ చర్చల్లో మునిగిన బీజేపీ నామినేషన్ దాఖలుకు నేడే తుది గడువు హైదరాబాద్, ఢిల్లీ: మెదక్ ఉప ఎన్నిక అభ్యర్థి ఎంపికపై మంగళవారం రాత్రి పొద్దుపోయే వరకు దోబూచులాడిన ప్రధాన పార్టీలు చివరకు తమ నిర్ణయాన్ని ప్రకటించాయి. తమ అభ్యర్థిగా కొత్త ప్రభాకర్ రెడ్డి పేరును మధ్యాహ్నమే లీకు చేసిన అధికార టీఆర్ఎస్.. ఇతర పార్టీల నిర్ణయం కోసం రాత్రి వరకూ నాన్చి చివరకు ఆయన్నే ఖరారు చేసింది. అయితే అధికారి కంగా మాత్రం ప్రకటించలేదు. అయితే పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ పలువురు ముఖ్యులతో మంతనాలు జరిపారు. మరోవైపు కాంగ్రెస్ కూడా రాత్రి 10 గంటల సమయంలో మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి పేరును ఖరారు చేసింది. దీనిపై సాయంత్రం నుంచే మీడియాలో ప్రచారం జరిగింది. టీఆర్ఎస్, బీజేపీల అభ్యర్థిత్వాలపై రోజంతా వేచి చూసిన కాంగ్రెస్ పెద్దలు ఆఖరికి సునీతా లక్ష్మారెడ్డివైపే మొగ్గు చూపారు. ఆమె పేరును పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆమోదించినట్లు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి మధుసూదన్ మిస్త్రీ రాత్రి ఢిల్లీలో ధ్రువీకరించారు. టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యకూ సమాచారం అందింది. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి దిగ్విజయ్ సింగ్ కూడా సునీ తకు ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. కాగా, నామినేషన్ల దాఖలుకు బుధవారం చివరి రోజు కావడంతో మధ్యాహ్నం 12 గంటలకు నామినేషన్ పత్రాన్ని సమర్పించాలని ఆమె నిర్ణయిం చారు. బీజేపీ కూడా టీఆర్ఎస్ నిర్ణయం వెలువడే వరకు రోజంతా వేచి చూసింది. నిజానికి ప్రభాకర్ రెడ్డినే తమ పార్టీ అభ్యర్థిగా ప్రకటించాలని కమలనాథులు భావించారు. అయితే ఆయనకు టీఆర్ఎస్ టికెట్ ఖరారు కావడంతో అర్ధరాత్రి వరకు బీజేపీ నేతలు చర్చల్లో మునిగిపోయారు. అయినా ఎవరినీ ప్రకటించలేదు. బుధవారం ఉదయం 9 గంటలకు అభ్యర్థిని ప్రకటిస్తామని పార్టీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి తెలిపారు. మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, ఒంటేరు ప్రతాప్‌రెడ్డి, అంజిరెడ్డి, రఘునందన్రావులలో ఒకరిని ఎంపిక చేయనున్నట్లు సమాచారం. మూడు ప్రధాన పార్టీలూ అభ్యర్థుల ఎంపికపై లీకులతో ప్రత్యర్థి పార్టీలను ట్రాప్‌లో పడే సేందుకు రోజంతా దాగుడుమూతలాడాయి. దేవీప్రసాద్‌కు ఎమ్మెల్సీ పదవి! టీఆర్ఎస్ నుంచి మెదక్ ఎంపీ సీటును ఆశించిన టీఎన్జీఓ అధ్యక్షుడు దేవీప్రసాద్‌కు త్వరలోనే ఎమ్మెల్సీగా అవకాశమిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చినట్టుగా ప్రభుత్వ వర్గాల ద్వారా మీడియాకు మెయిల్లో సమాచారం అందింది. ఉప ఎన్నికల్లో 2 వేల మంది కాంగ్రెస్ సైన్యం! మెదక్ ఉప ఎన్నికను కాంగ్రెస్ అధిష్టానం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిని ఎలాగైనా గెలిపించి సత్తా చాటాలని భావిస్తోంది. రాష్ట్ర కాంగ్రెస్ నాయకులంతా ఉప ఎన్నిక పూర్తయ్యే వరకు మెదక్‌లోనే మకాం పెట్టేలా వ్యూహం సిద్ధం చేసింది. అసెంబ్లీ నియోజకవర్గానికో మాజీమంత్రి, మండలానికో ఎమ్మెల్యే, గ్రామానికో ప్రజా ప్రతినిధి చొప్పున పార్లమెంట్ పరిధిలో 2 వేల మందికిపైగా నేతలు పాగా వేసేలా ప్రణాళికను రూపొందించింది. టీపీసీసీ తరపున మరో ప్రతినిధిని కూడా నియమించి.. పది మంది నేతలతో మండలాల వారీగా ఒక టీం ను కూడా ఏర్పాటు చేయనుంది. వీరంతా ప్రతి గ్రామంలో పర్యటిస్తూ బూత్‌లవారీగా కార్యకర్తలతో సమావేశమై విస్తృత ప్రచారం నిర్వహిస్తారు. ఆయా మండలాల పరిధిలో సుమారు 700 గ్రామ పంచాయతీలున్నాయి. ఒక్కో గ్రామంలో ఒక్కో జిల్లా, రాష్ట్రస్థాయి నాయకుడిని ఇన్చార్జ్గా నియమిస్తారు. ఇక కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ మెదక్ ఉప ఎన్నికల ప్రచారానికి రావాలని నిర్ణయించినట్లు టీపీసీసీ వర్గాల సమాచారం. వీరిలో ఒకరు సంగారెడ్డిలో జరిగే భారీ బహిరంగ సభలో పాల్గొం టారు. మరొకరు సిద్దిపేటలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. ప్రియాంకగాంధీని కూడా ప్రచారానికి రప్పించాలని కాంగ్రెస్ నేతలు హైకమాండ్ పెద్దలను కోరినప్పటికీ ఆమె అంగీకరిస్తారా.. లేదా? అనేది తెలియరాలేదు. టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, సీఎల్పీ నేత కె.జానారెడ్డి, శాసనమండలిలో ప్రతిపక్షనేత డి.శ్రీనివాస్ నామినేషన్ల పర్వం ముగిసిన దగ్గర నుంచి పోలింగ్‌కు ముందురోజు వరకు విస్తృతంగా ప్రచారం చేయాలని నిర్ణయించారు. -
మెదక్ సీటుకు ప్రభాకర్‌రెడ్డి పేరు ఖరారు
-
కొత్త ప్రభాకర్‌రెడ్డి పేరు ఖరారు
హైదరాబాద్: మెదక్ లోక్‌సభ స్థానానికి టీఆర్ఎస్ అభ్యర్థిగా కొత్త ప్రభాకర్‌రెడ్డి పేరు ఖరారు చేశారు. తీవ్ర తర్జనభర్జనల తర్వాత ప్రభాకర్‌రెడ్డి పేరును టీఆర్ఎస్ ప్రకటించింది. బుధవారం ఉదయం 09:09 గంటలకు సంగారెడ్డిలో ప్రభాకర్ రెడ్డి నామినేషన్ వేయనున్నారు. దేవీప్రసాద్, కె.భూపాల్ రెడ్డి, ప్రవీణ్ రెడ్డి పరిశీలనకు వచ్చినా టీఆర్ఎస్ పార్టీ పెద్దలు ప్రభాకర్‌రెడ్డివైపే మొగ్గు చూపారు. ఉద్యమ సమయంలో ప్రభాకర్‌రెడ్డి టీఆర్ఎస్కు వెన్నుదన్నుగా నిలిచారు. దుబ్బాక నియోజకవర్గానికి చెందిన ప్రభాకర్‌రెడ్డి గత ఎన్నికల్లో దుబ్బాక ఎమ్మెల్యే పోటీ చేయాలని భావించినా టికెట్ దక్కలేదు. ఇప్పుడు ఏకంగా ఎంపీ టిక్కెట్ దక్కించుకోవడం విశేషం. సెప్టెంబర్ 13న మెదక్ ఉప ఎన్నిక జరగనుంది.