మెదక్ బీజేపీ లోక్సభ అభ్యర్థిగా జగ్గారెడ్డి | Jagga reddy Join bjp contest for Medak mp seat | Sakshi

మెదక్ బీజేపీ లోక్సభ అభ్యర్థిగా జగ్గారెడ్డి

Aug 27 2014 12:00 PM | Updated on Sep 2 2017 12:32 PM

మెదక్ బీజేపీ లోక్సభ అభ్యర్థిగా జగ్గారెడ్డి

మెదక్ బీజేపీ లోక్సభ అభ్యర్థిగా జగ్గారెడ్డి

మెదక్ బీజేపీ లోక్సభ అభ్యర్థిగా తూర్పు జయప్రకాష్ రెడ్డిని ఆపార్టీ అధికారికంగా ప్రకటించింది.

హైదరాబాద్ : మెదక్ బీజేపీ లోక్సభ అభ్యర్థిగా తూర్పు జయప్రకాష్ రెడ్డిని ఆపార్టీ అధికారికంగా ప్రకటించింది. అంతకు ముందు అంజిరెడ్డి పేరు ఖరారు అయినట్లు వార్తలు వెలువడినా .... స్పష్టమైన ప్రకటన వెలువడలేదు. తాజాగా సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్ రెడ్డి పేరు తెరమీదకు వచ్చింది.

 

ఈనేపథ్యంలో ఆయన బుధవారం తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డితో సమావేశం అయ్యారు.  ఈ సందర్భంగా ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆయన ఈరోజు మధ్యాహ్నం నామినేషన్ దాఖలు చేయనున్నారు. జగ్గారెడ్డి నామినేషన్ కార్యక్రమానికి తెలంగాణ టీడీపీ నేతలు కూడా హాజరు కానున్నారు. గతంలో ఆయన బీజేపీలో పనిచేసిన విషయం తెలిసిందే.

 

ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ తాను మొదటి నుంచి బీజేపీ వ్యక్తినేనని, ఏబీవీపీ నుంచే క్రియాశీలక కార్యకర్తగా పనిచేసినట్లు తెలిపారు. మరోవైపు జగ్గారెడ్డి పేరు అనూహ్యంగా తెరమీదకు రావటంతో మెదక్ జిల్లాలో బీజేపీ నేతల నుంచి అసంతృప్తి వ్యక్తం అవుతోంది. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైన ఆయనను ఎంపీ అభ్యర్థిగా ఎంపిక చేయటంపై నేతలు అసంతృప్తితో ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement