Medak By-election
-
సిద్దిపేటలో టీఆర్ఎస్ కు తగ్గిన ఓట్లు
మెదక్: మెదక్ లోక్‌సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీకి సిద్ధిపేట నియోజకవర్గంలో ఓట్లు తగ్గాయి. సిద్దిపేట సెగ్మెంట్ లో టీఆర్ఎస్ కు 86,300 ఓట్ల మెజార్టీ లభించింది. గత ఎన్నికలతో పోలిస్తే టీఆర్ఎస్ కు 6 వేలు ఆధిక్యం తగ్గింది. గత ఎన్నికల్లో గులాబీ పార్టీకి 97 వేల ఓట్ల ఆధిక్యం లభించింది. సిద్దిపేట సెగ్మెంట్లో బీజేపీ రెండోస్థానంలో నిలిచింది. కాంగ్రెస్ కు మూడో స్థానం దక్కింది. మంత్రి తన్నీరు హరీష్‌రావు సిద్ధిపేట అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. -
తగ్గిన పోలింగ్ దేనికి సంకేతం?
-
ఓటరు గుట్టు తేలేది నేడే
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: మెదక్ ఉప ఎన్నిక ఫలితం మంగళవారం వెలువడనుంది. ఓట్ల లెక్కింపునకు సంబంధించి రుద్రారంలోని గీతం యూనివర్సిటీలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం 1 గంటలోగా ఫలితం వెల్లడికానుంది. ఉపపోరులో ఏ పార్టీ విజయం సాధిస్తుందోనన్న ఉత్కంఠ నెలకొంది. అధికారం చేపట్టిన మూడు మాసాల్లోనే ఉప ఎన్నిక ఎదుర్కొంటున్న టీఆర్ఎస్.. ఈ ఫలితం సైతం తమకు అనుకూలంగా ఉంటుందని ధీమాగా ఉంది. ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు, ఓటింగ్ సరళిని విశ్లేషించిన టీఆర్ఎస్ పార్టీ.. ఉపపోరులో భారీ మెజార్టీ దక్కటం ఖాయమని భావిస్తోంది. మెదక్ ఉప ఎన్నిక కీలకబాధ్యతలు చేపట్టిన మంత్రి హరీష్‌రావు ఓటింగ్ సరళిపై క్షేత్రస్థాయిలో నివేదికలు తెప్పించుకుని విశ్లేషించినట్లు సమాచారం. మెదక్ లోక్‌సభ పరిధిలో మొత్తం 67.79 శాతం పోలింగ్ జరిగిన నేపథ్యంలో 40 శాతం పోలింగ్ టీఆర్ఎస్కు అనుకూలంగా పడ్డాయని మంత్రి అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. ఫలితంగా తాము అనుకున్న మెజార్టీ సాధించటం ఖాయమని టీఆర్ఎస్ గట్టి నమ్మకంతో ఉంది. మెదక్ లోక్‌సభ పరిధిలోని ఏడు నియోజకవర్గాలకుగాను సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్ నియోజవకర్గాల్లోటీఆర్ఎస్కు భారీ మెజార్టీ రావటం ఖాయమని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. అలాగే సంగారెడ్డి, పటాన్చెరు, మెదక్‌లలో కాంగ్రెస్, బీజేపీలకంటే ఎక్కువ మొత్తంలోనే ఓట్లు సాధిస్తామని అంటున్నారు. నర్సాపూర్‌లో సైతం ఎక్కువ ఓట్లు వస్తాయని భావిస్తున్నారు. అయితే ఫలితాల సరళి ఎలా ఉంటుందో వేచి చూడాలి. ఇదిలా ఉంటే ఉపపోరులో గట్టిపోటీ ఇచ్చామని నమ్మకంతో ఉన్న బీజేపీ సైతం విజయం ఖాయమని భావిస్తోంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు, మోడీ హవా తమకు అనుకూలమని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. ముఖ్యంగా యువత బీజేపీకి అండగా నిలవటంతోపాటు అభివృద్ధి నినాదం ప్రజల్లోకి బలంగా చొచ్చుకుపోయిందని, దీంతో తమకు విజయావకాశాలు ఉన్నాయని బీజేపీ ముఖ్యనేతలు చెబుతున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ సైతం ఉప ఎన్నికలో విజయం తమదేనని చెబుతోంది. సాధారణ ఎన్నికల్లో టీఆర్ఎస్కు అవకాశం ఇచ్చిన ప్రజలు.. ఉపపోరులో తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌కు అండగా నిలబడతారన్న నమ్మకంతో ఉంది. సాంప్రదాయ ఓటు బ్యాంకు, మైనార్టీలు, ఎస్సీ,ఎస్టీ, బీసీ సామాజిక వర్గాలు తమకు ఓటు వేసినట్లు ఆ పార్టీ భావిస్తోంది. నర్సాపూర్, సంగారెడ్డి, మెదక్, పటాన్చెరు, దుబ్బాక నియోజకవర్గాల్లో తమకు అనుకూల ఓటింగ్ జరిగిందని, దీంతో తమ పార్టీ విజయం ఖాయమని కాంగ్రెస్ అభ్యర్థి సునీతారెడ్డి ధీమాగా ఉన్నారు. మధ్యాహ్నం 1గంటలకు ఫలితం మెదక్ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు కోసం అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. పటాన్చెరు నియోజకవర్గంలోని రుద్రారం గ్రామంలో ఉన్న గీతం యూనివర్సిటీలో మెదక్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు జరగనుంది. ఉదయం 8గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతంది. ఓట్ల లెక్కింపు కోసం ప్రతి నియోజకవర్గానికి 14 టేబుళ్లు ఏర్పాటు చేశారు. ప్రతి ఓట్ల లెక్కింపు కౌంటర్ వద్ద కౌంటింగ్ సూపర్వైజర్, కౌంటింగ్ అసిస్టెంట్లు, మైక్రో అబ్జర్వర్లు ఉంటారు. ఓట్ల లెక్కించేందుకు మొత్తం 121 మంది కౌంటింగ్ సూపర్వైజర్లు, 120 మంది కౌంటింగ్ అసిస్టెంట్లు, 144 మంది మైక్రో అబ్జర్వర్లను నియమించారు. ఓట్ల లెక్కింపు ఏర్పాట్లను కలెక్టర్ రాహుల్ బొజ్జా సోమవారం పరిశీలించారు. గట్టి బందోబస్తు... ఓట్ల లెక్కింపు నేపథ్యంలో గీతం యూనివర్సిటీ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎస్పీ శెముషీ బాజ్‌పాయ్ భద్రతా ఏర్పాట్లను సోమవారం పరిశీలించారు. కౌంటింగ్ కేంద్రం వద్ద ఇద్దరు అదనపు ఎస్పీలు భద్రతను పర్యవేక్షించనున్నారు. బందోబస్తులో ఇద్దరు డీఎస్పీలు, 18 మంది సీఐలు, 33 మంది సీఐలు, 80 మంది ఎఎస్ఐలు, హెడ్‌కానిస్టేబుళ్లు, 270 మంది కానిస్టేబుళ్లు పాల్గొననున్నారు. -
‘మెదక్’ ఫలితంపై సర్వత్రా ఉత్కంఠ!
మెదక్: ఉప ఎన్నికలో పోలింగ్ శాతం భారీగా తగ్గడంతో వివిధ పార్టీల నేతలు విజయావకాశాలపై లెక్కలు వేసుకుంటున్నారు. మెదక్ అసెంబ్లీ నియోజకవర్గంలో మొత్తం 2,04,023 మంది ఓటర్లు ఉండగా, వారిలో 98851మంది పురుషులు కాగా, 1.05,166 మంది మహిళలు ఉన్నారు. వీరిలో 67802 మంది పురుషులు, 70573మంది మహిళలు, మొత్తం 1,38,375 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. రామాయంపేట మండలం శివ్వాయిపల్లిలో మొత్తం 464 మంది ఓటర్లలో 445 మంది ఓటు హక్కును వినియోగిం చుకోవడంతో 95.91 శాతం పోలింగ్ నమోదైంది. సాధారణ ఎన్నికలతో పోలిస్తే మొత్తం మీద 10 శాతం ఓటింగ్ తక్కువగా నమోదైంది. ఉప ఎన్నికపై అనాసక్తి సాధారణ ఎన్నికలు జరిగి నాలుగు నెలలే అయినందున మరో ఎన్నికలో పాల్గొనడానికి ఓటర్లు ఎక్కువగా ఆసక్తి చూపలేదని తెలుస్తోంది. జోరుగా నడుస్తున్న వ్యవసాయ పనులు కూడా మరో కారణంగా చెప్పుకోవచ్చు. వలస వెళ్లిన గ్రామీణులను పట్టణాల నుంచి తీసుకురావడానికి ఆయా రాజకీయ పార్టీలు సైతం ఆసక్తి చూపలేదు. ఈ క్రమంలో డబ్బు ఖర్చు చేసేందుకు పార్టీలు ముందుకు రాలేదు. ఇటీవల నిర్వహించిన ఇంటింటి సర్వేకు పట్టణాల్లో నివసించే వారంతా వచ్చినందున మరోసారి ఓటింగ్‌లో పాల్గొనేందుకు ఉత్సాహం చూపనట్లు తెలుస్తోంది. అలాగే త్వరలో బతుకమ్మ, దసరా, బక్రీద్ పండగలకు రావాల్సి ఉన్నందున ఎన్నికల కోసం వలస వెళ్లిన ప్రజలు గ్రామాలకు తరలిరావడానికి ఆసక్తి చూపలేదు. గెలుపోటములపై ప్రభావం తగ్గిన పోలింగ్ శాతం అభ్యర్థుల విజయావకాశాలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. ముఖ్యంగా మొదటి నుంచి గెలుపుపై ధీమాతో ఉన్న టీఆర్ఎస్ మెజార్టీ విషయమై కొంత ఆందోళనలో ఉన్నట్లు తెలుస్తోంది. తగ్గిన పోలింగ్ తమ మెజార్టీని తగ్గిస్తుందని వారు భావిస్తున్నారు. కాగా కాంగ్రెస్, బీజేపీలు పోలింగ్ శాతం తగ్గడంవల్ల తమకు కొంతమేర ప్రయోజనం కలిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నాయి. అయితే కొత్త జిల్లాల ఏర్పాటు ప్రకటన మెదక్ నియోజకవర్గంలో కొంతమేర ప్రభావం చూపింది. పల్లెల్లో జోరు.. పట్టణంలో బేజారు.. సిద్దిపేట టౌన్: ఉప ఎన్నికలో భాగంగా సిద్దిపేట సెగ్మెంట్ పరిధిలో జరిగిన ఎన్నికలో పల్లెల్లో పోలింగ్ జోరుగా సాగింది. కాగా పట్టణ ప్రాంతంలో పోలింగ్ మందకొడిగా జరిగింది. సిద్దిపేట మున్సిపల్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పట్టణంలో 44 శాతం మంది ఓటర్లు ఓటింగ్‌కు దూరంగా ఉండడం ఆందోళన కలిగిస్తోంది. సిద్దిపేట పట్టణ కేంద్రంగా అన్ని రాజకీయ పార్టీలు ప్రచారాన్ని ధూంధాంగా నిర్వహించినప్పటికీ పోలింగ్ సరళి పార్టీలను బేజారెత్తించింది. పోల్ చీటీలు సంపూర్ణంగా ఇళ్లకు చేరకపోవడం, పార్టీల నేతలు, కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి ఓటు వేయాలని అభ్యర్థించకపోవడం కారణాలుగా భావిస్తున్నారు. అదే విధంగా గత ఎన్నికల్లో ఓటు వేస్తే తెలంగాణ వస్తుందనే ప్రచారం పట్టణ ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు రప్పించింది. తాజాగా జరిగిన ఎన్నికల్లో పట్టణ ఓటర్లు ఆ స్ఫూర్తిని చూపలేదు. ఇటీవల నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేలో ప్రదర్శించిన స్ఫూర్తిలో 50 శాతం ఓటింగ్‌లో పాల్గొనడానికి వచ్చిన ప్రజలు ప్రదర్శించకపోవడం విశేషం. -
'సెక్రటేరియట్ ను మెదక్ నుంచే నడిపారు'
హైదరాబాద్: బతుకమ్మ వేడుకలను తెలంగాణ సర్కార్ కేసీఆర్ కుటుంబ పండుగలా కాకుండా రాష్ట్ర వేడుకలా నిర్వహించాలని కాంగ్రెస్ నాయకురాలు, మాజీ మంత్రి డీకే అరుణ సూచించారు. తెలంగాణ రాష్ట్రాన్నిచ్చిన తమ పార్టీ అధినేత్రి సోనియా గాంధీని బతుకమ్మ వేడుకలకు సీఎం కేసీఆర్ ఆహ్వానించాలని అన్నారు. కేసీఆర్ మూడు నెలల పాలనపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందని తెలిపారు. మెదక్ ఉప ఎన్నికలో గెలుపు కోసం సెక్రటేరియట్‌ను అక్కడి నుంచి నడిపారని ఆమె ఆరోపించారు. -
కొత్త ప్రభాకర్‌రెడ్డి విజయం ఖాయం
టీఆర్ఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి నవాజ్‌రెడ్డి మునిపల్లి: మెదక్ ఉపఎన్నికలో తమ పార్టీ అభ్యర్థి సునాయసంగా గెలుస్తారని టీఆర్ఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి అల్లం నవాజ్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. శనివారం ఎన్నిక ప్రశాంతంగా జరగడంతో మండలంలోని తాటిపల్లి గ్రామంలో ముందస్తుగా టీఆర్ఎస్ నాయకులు సంబురాలు నిర్వహించారు. ఈ సందర్భంగా నవాజ్‌రెడ్డి మాట్లాడుతూ టీఆర్ఎస్ అభ్యర్థి మెజార్టీయే తమ లక్ష్యమన్నారు. సిద్దిపేటలో లక్ష ఓట్లకు పైగా, మిగతా నియోజకవర్గాల్లో 50 వేలకు పైగా టీఆర్ఎస్ అభ్యర్థికి మెజార్టీ రానున్నదన్నారు. కాంగ్రెస్, బీజేపీ వైఖరి తెలంగాణ ప్రజలకు తెలిసినందునే టీఆర్ఎస్ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపిస్తారన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ ఎస్సీ సెల్ మండల కన్వీనర్ కొల్లూరి రవి, యూవత మండల ప్రధాన కార్యదర్శి గుంతలి నర్సింలు, రాజిరెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, చాకలి రవి, తెనుగు సంగ్రాంతో పాటు పలవురు పాల్గొన్నారు. -
తగ్గిన ఓటింగ్‌తో పార్టీల్లో కలవరం!
సాక్షి, సంగారెడ్డి: మెదక్ ఉప ఎన్నిక విషయంలో ఓటరు నిరాసక్తత చూపాడు. గత సాధారణ ఎన్నికలతో పోలిస్తే శనివారం జరిగిన ఉప ఎన్నికలో ఓటింగ్ శాతం గణనీయంగా తగ్గింది. ఎన్నికలో 65.74శాతం ఓటింగ్ నమోదైంది. గత ఎన్నికలతో పోలిస్తే 11 శాతం మేర పోలింగ్ తగ్గింది. గత ఎన్నికల్లో 77.35 శాతం పోలింగ్ నమోదైంది. 2009లో జరిగిన ఎన్నికల్లో 76 శాతం పోలింగ్ నమోదైంది. ఉప ఎన్నికలో ఓటింగ్ శాతం గణనీయంగా తగ్గటంతో రాజకీయపార్టీలను కొంత కలవరపాటుకు గురిచేయగా, అధికారుల్లో విస్మయం వ్యక్తమవుతోంది. వందశాతం ఓటింగ్ సాధించేందుకు అధికారులు పెద్ద ఎత్తున ప్రచారం చేసినా ఫలించలేదు. దీంతో ఓటింగ్ తగ్గుదలకు గలకారణాలను వెతికే పనిలో ఎన్నికల అధికారులు నిమగ్నమయ్యారు. మరోవైపు రాజకీయపార్టీలు పెద్ద ఎత్తున ప్రచారం చేసినా ఓటరును పోలింగ్ కేంద్రం వరకు తీసుకురావడంలో విఫలమయ్యారు. దీంతో ఓటింగ్ శాతం తగ్గి, తమపై ఎలాంటి ప్రభావం చూపుతుందోనని అంచనా వేసే పనిలో ప్రధాన రాజకీయపార్టీలైన టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు నిమగ్నమయ్యాయి. విజయంపై ధీమాగా ఉన్న టీఆర్ఎస్కు ఓటింగ్ శాతం తగ్గుముఖం పట్టడం కొంత కలవరపెడుతోంది. ఆ పార్టీకి పట్టు ఉన్న సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక నియోజకవర్గాలోనూ ఓటింగ్ శాతం 70 శాతం లోపే ఉంది. భారీ మెజార్టీయే లక్ష్యంగా టీఆర్ఎస్ ఎన్నికల బరిలో దిగింది. అయితే ఓటింగ్ శాతం తగ్గటంతో మెజార్టీ తగ్గవచ్చని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. గత ఎన్నికలో మెదక్ ఎంపీగా పోటీ చేసిన కె.చంద్రశేఖర్‌రావుకు 3.97 లక్షల మెజార్టీ వచ్చింది. ప్రస్తుతం ఓటింగ్ శాతం తగ్గటంతో ఊహించిన స్థాయిలో మెజార్టీ రాకపోవచ్చని టీఆర్ఎస్ నేతలు అంచనా వేస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కూడా ఓటింగ్ శాతం తగ్గడంతో తమ విజయావకాశాలపై ప్రభావం చూపవచ్చని భావిస్తున్నాయి. తమకు అండగా నిలుస్తారనుకున్న సాంప్రదాయ ఓటర్లు, ఎస్సీ,ఎస్టీలు ఓటింగ్‌లో ఎంత మేర పాల్గొన్నారో అంచనా వేసే పనిలో కాంగ్రెస్ పెద్దలు నిమగ్నమయ్యారు. మరోవైపు బీజేపీ సైతం ఓటింగ్ సరళిని విశ్లేషించే పనిలో ఉంది. ఓటింగ్ శాతం తగ్గుదల ప్రభావం తమపై ఎలా ఉంటుందోనని బీజేపీ అభ్యర్థి జగ్గారెడ్డి నియోజకవర్గస్థాయి ముఖ్యనేతలతో చర్చించినట్లు సమాచారం. ఏడు నియోజకవర్గాల్లోనూ అదే తీరు... మెదక్ పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ ఓటింగ్ శాతం తగ్గింది. గత ఏప్రిల్‌లో జరిగిన సాధారణ ఎన్నికల్లో మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్, పటాన్చెరు, నర్సాపూర్ నియోజవకర్గాల్లో 77.35 శాతం పోలింగ్ నమోదు కాగా శనివారం నాటి ఉప ఎన్నికల్లో 65.74శాతం నమోదైంది. ఓటింగ్ శాతంలో స్వల్ప తేడా ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. నర్సాపూర్‌లో అత్యధికంగా 77 శాతం పోలింగ్ కాగా పటాన్చెరు నియోజకవర్గంలో 52 శాతం పోలింగ్ జరిగింది. ఉప ఎన్నికల్లో ఓటింగ్ శాతం నమోదు ఇలా ఉంది. -
శామీర్‌పేట్ రిసార్ట్‌లో పోలీసుల తనిఖీలు
హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా శామీర్‌పేటలోని ఓ రిసార్ట్‌పై పోలీసులు శుక్రవారం దాడి చేశారు. ఈ సందర్భంగా రూ.24 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. మెదక్ ఉప ఎన్నికల్లో ఈ డబ్బును పంచేందుకు దాచినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. దీనిపై సమాచారం అందటంతో పోలీసులు రిసార్ట్ పై దాడి చేసి నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ నగదు ఓ రాజకీయ నేతకు సంబంధించిందిగా పోలీసులు భావిస్తున్నారు. -
ఆ సంగతి కేసీఆర్‌కు ముందే తెలుసు!
* అధికారంలోకి వచ్చాకే ముంపు మండలాలపై మాట మార్చారు * ఉప ఎన్నిక ప్రచారంలో జవదేకర్ మండిపాటు * మెదక్ ఎన్నికను అభివృద్ధి కోణంలో చూడాలి: రైల్వే మంత్రి సదానంద గజ్వేల్/సంగారెడ్డి క్రైమ్: తెలంగాణలోని ఏడు ముంపు మండలాలను సీమాంధ్రలో కలిపే ప్రతిపాదన సీఎం కేసీఆర్‌కు ముందే తెలుసని, అధికారంలోకి వచ్చాకే ఆయన మాట మార్చారని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ మండిపడ్డారు. ‘ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే చాలు, ఆ ప్రతిపాదనతో పనిలేదని ఆనాడు ఒప్పుకొన్న కేసీఆర్.. నేడు అధికారంలోకి వచ్చాక మాట మార్చి ఆ నెపాన్ని నరేంద్ర మోడీ ప్రభుత్వంపై మోపడం సిగ్గుచేటు’ అని జవదేకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ దుష్ట పాలనకు పాతర వేయాలని, దళితుల సంక్షేమం కోసం పాటుపడుతున్న ప్రధాని మోడీకి అండగా నిలవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. మెదక్ పార్లమెంట్ ఉప ఎన్నికలో బీజేపీ-టీడీపీ అభ్యర్థి జగ్గారెడ్డికి మద్దతుగా గురువారం గజ్వేల్, సంగారెడ్డి నియోజకవర్గ కేంద్రాల్లో జరిగిన సభల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో అరాచక పాలనను తీసుకురావడానికి ముఖ్యమంత్రి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ అభ్యర్థికి ఓటు వేయొద్దని కేసీఆర్ పిలుపునివ్వడం పేదలను అవమానించడమేనన్నారు. ఎన్నికల్లో బీజేపీని గెలిపించడం ద్వారా ఆయనకు గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. బీజేపీ చొరవతోనే తెలంగాణ ఆవిర్భవించిందన్నారు. బీజేపీకి తెలంగాణ, ఆంధ్రా ప్రాంతాలు రెండు కళ్లలాంటివని, వీటి అభివృద్ధిపై ప్రత్యేక దృష్టిసారిస్తామని చెప్పారు. రైల్వే మంత్రి సదానంద గౌడ మాట్లాడుతూ.. మెదక్ ఉప ఎన్నికను అభివృద్ధి కోణంలో చూడాల్సిన అవసరముందన్నారు. తెలంగాణ రాష్ట్రం సాకారమైనందున, ఇక ప్రగతిపైనే అందరి దృష్టి కేంద్రీకృతం కావాలన్నారు. రాష్ట్రాలపై కేంద్రం పెత్తనం చెలాయించాలనే విధానానికి ప్రధాని మోడీ పూర్తిగా వ్యతిరేకమని స్పష్టంచేశారు. ఆపదలో ఉన్న రాష్ట్రాలను ఆదుకోవడంలో ఆయన ముందున్నారని కొనియాడారు. వంద రోజుల్లోనే ప్రజల్లో భరోసా సాక్షి, హైదరాబాద్: వంద రోజుల వ్యవధిలోనే ప్రధానమంత్రి నరేంద్రమోడీ సారథ్యంలోని ఎన్డీయే ప్రభుత్వం ప్రజలు, స్థానిక, విదేశీ పెట్టుబడిదారుల్లో మంచి విశ్వాసాన్ని కలిగించిందని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ పేర్కొన్నారు. మెదక్ ఉప ఎన్నిక ప్రచారం కోసం హైదరాబాద్ వచ్చిన ఆయన గురువారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. కేంద్రంలో పదేళ్లు కొనసాగిన మాటల ప్రభుత్వానికి కాలం చెల్లి, చేతల ప్రభుత్వం వచ్చిందని ప్రజలు నమ్ముతున్నారని దాని కి తగ్గట్టే పాలన సాగుతోందన్నారు. మంత్రి గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలి సారి హైదరాబాద్‌కు వచ్చిన జవదేకర్‌ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, ఎంపీ దత్తాత్రేయ ఘనంగా సన్మానించారు. కేసులు పెట్టినా బెదరను: కిషన్‌రెడ్డి మెదక్ ఉప ఎన్నికలో బీజేపీని గెలిపించడం ద్వారా టీఆర్ఎస్కు గుణపాఠం చెప్పాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి మజ్లిస్ చేతిలో కీలుబొమ్మగా మారిపోయారని ఆరోపించారు. సెప్టెంబర్ 17న హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపాలని, లేనిపక్షంలో ప్రజలు సహించరని అన్నారు. తనపై కేసులు పెడతామంటూ కేసీఆర్ కుటుంబీకులు, హరీష్‌రావు బెదిరిస్తున్నారని, ఎన్ని కేసులు పెట్టినా బెదిరేది లేదని పేర్కొన్నారు. జగ్గారెడ్డిని సమైక్యవాదిగా చిత్రీకరిస్తున్న కేసీఆర్... కొండా సురేఖ, మైనంపల్లి హన్మంతరావు, మహేందర్‌రెడ్డిలాంటి నాయకులను ఎలా చేర్చుకున్నారని ప్రశ్నించారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే మురిగిపోతుంది తప్ప.. ఒరిగేదేమీ లేదని వ్యాఖ్యానించారు. ఎంపీ బండారు దత్తాత్రేయ, ఎమ్మెల్యే నాగం జనార్దన్‌రెడ్డి, టీడీపీ నేతలు ఎల్. రమణ, రేవంత్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు తదితరులు కూడా ఈ సభల్లో పాల్గొన్నారు. -
కేసీఆర్ దాదాగిరి చేయి.. పాతరేయకు!
మెదక్ ఉప ఎన్నిక పోలింగ్ తేది సమీపిస్తున్న కొద్ది ప్రధాన పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతునే ఉంది. తాజాగా మెదక్ ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ .. కేసీఆర్ పై మాటల బాణాల్ని సంధించారు. మంచి కోసం చేయడానికి 'దాదాగిరి' చేసినా ఫర్వాలేదు.. కాని మీడియాను పాతరేస్తాం అనే మాటలు సమంజసం కాదు అని అన్నారు. దాదాగిరి చేయాల్సి వస్తే తప్పును తప్పుగానే చూపించాలని.. అంతేకాని మీడియాపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని ముఖ్యమంత్రి కేసీఆర్, తెలంగాణ ప్రభుత్వానికి జవదేకర్ విజ్క్షప్తి చేశారు. అభివృద్ది కోసం పాటు పడండి. కేంద్రప్రభుత్వం సహకరిస్తుంది. కేంద్ర, రాష్ట్రం కలిసి మెలిసి ఉండాలి. తెలంగాణ అభివృద్ధికి మేము కట్టుబడి ఉన్నాం అని అన్నారు. అంతేకాని మీడియాను పాతరేస్తాం అని అనడం పద్దతి కాదు అని ఆయన ధీటుగా జవాబిచ్చారు. మీడియా కూడా బాధ్యతగా ప్రవర్తించాలన్నారు. పాతరేస్తామని వాడిన భాషనే పాతరేయాలని కేసీఆర్ కు సూచించారు. మెదక్ జిల్లాలో జరుగుతున్న ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి తూర్పు జయప్రకాశ్ రెడ్డికి మద్దతుగా ప్రకాశ్ జవదేకర్ ప్రచారాన్ని నిర్వహించారు. బుర్ర ఉన్నవాళ్లు బీజేపీ అభ్యర్థికి ఓటేయ్యరు అని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను జవదేకర తప్పుపట్టారు. బుర్ర, హృదయం ఉన్న ప్రతి ఒక్కరు బీజేపీకి ఓటు వేస్తారని ఆయన అన్నారు. 25 కోట్లమంది బీజేపీ ప్రభుత్వాన్ని మద్దతు తెలిపారన్నారు. కేసీఆర్ వ్యాఖ్యలు దేశంలోని పేద ప్రజల్ని అవమాన పరిచారని జవదేకర్ అన్నారు. -
పవన్ కళ్యాణ్ ఎందుకు కనిపించలేదు?
మెదక్ : ఇటీవల జరిగిన సాధారణ ఎన్నికల్లో బీజేపీ తరపున తెగ హడావుడి చేసిన పవన్ కళ్యాణ్ మెదక్ ఉప ఎన్నికల ప్రచారంలో మాత్రం కనిపించలేదు. గురువారంతో మెదక్ ఉప ఎన్నికల ప్రచార పోరు ముగియనుంది. మరి కొన్ని గంటల్లో ప్రచారం ముగియనున్నా పవన్ మాత్రం ప్రచారానికి దూరంగా ఉన్నారు. జనసేన ఆవిర్భావం సందర్భంగా జాగ్గారెడ్డిపై పొగడ్తల వర్షం కురిపించిన పవన్ ..... ఈమధ్య కాలంలో అతనికి దూరంగానే ఉన్నాడు. అయితే పవన్‌కు సర్జరీ చేయించుకోవటం వల్లే ఎవరికీ అందుబాటులో లేనట్లు సమాచారం. ఇక సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ తరపున పవన్ ప్రచార బరిలోకి దిగిన విషయం తెలిసిందే. అలాంటిది ప్రియ మిత్రుడు జగ్గారెడ్డి బరిలో ఉన్నా పవన్ ఎందుకు సపోర్టు చేయడం లేదు? పవన్ సూచన మేరకే జగ్గారెడ్డి బీజేపీలో చేరి పోటీకి దిగారనే ప్రచారంలో వాస్తవమెంత? జగ్గారెడ్డిని బీజేపీ తమ అభ్యర్థిగా ప్రకటించగానే మెదక్ ఓటర్లు చాలా మంది పవన్ కళ్యాణ్ ప్రచారం చేస్తారని భావించారు. మెదక్ ఉపఎన్నికను పవన్ సీరియస్‌గా తీసుకోకపోవడానికి కారణమేంటో రాజకీయ విశ్లేషకులు ఊహించలేకపోతున్నారు. టీఆర్ఎస్ బలంగా ఉండటం, మెదక్‌లో గులాబీ దళం వరుసగా మూడుసార్లు విజయం సాధించిన కారణంగా పవన్ ప్రచారానికి దూరంగా ఉన్నారని అంతా భావిస్తున్నారు. ఒకవేళ జగ్గారెడ్డి తరపున ప్రచారం చేసి ఉంటే దాని ప్రభావం కచ్చితంగా ఎన్నికలపై ఉండేదని విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తానికి పవన్ కళ్యాణ్ ప్రచారం లేకుండానే మెదక్ ఉపఎన్నిక ప్రచారం ముగుస్తోంది. -
కేసీఆర్ నియంతలా ప్రవర్తిస్తున్నారు
మెదక్ : ముఖ్యమంత్రి కేసీఆర్‌పై మాజీమంత్రి, మెదక్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి సునీతా లక్ష్మారెడ్డి విరుచుకు పడ్డారు. కేసీఆర్ నియంతలా ప్రవర్తిస్తున్నారని ఆమె గురువారమిక్కడ వ్యాఖ్యానించారు. మహిళలు, ఉద్యోగులు, ఎమ్మెల్యేలు....చివరికి మంత్రులను సైతం లెక్కలేకుండా వ్యాఖ్యలు చేస్తున్నారని సునీతా లక్ష్మారెడ్డి అన్నారు. అందుకు నర్సాపూర్‌లో జరిగిన సభే సాక్ష్యమన్నారు. రెండు లక్షల మంది ప్రజలు వస్తారని భారీ ఏర్పాట్లు చేశారని, అయితే 25వేలమంది కూడా రాలేదని ఎద్దేవా చేశారు. ఓటమి భయంతో టీఆర్ఎస్ నేతలు మతి తప్పి మాట్లాడుతున్నారని ఆమె విమర్శించారు. వందరోజులు పూర్తి చేసుకున్న కేసీఆర్ ప్రజలకు ఒరగబెట్టింది ఏమీ లేదన్నారు. మరోవైపు నేటితో మెదక్ ఉపఎన్నికల ప్రచార పర్వం ముగియనుంది. -
వారిని బంతాట ఆడుకుంటా: జగ్గారెడ్డి
మెదక్: ఉప ఎన్నిక నేపథ్యంలో టీఆర్ఎస్, జగ్గారెడ్డిల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. తెలంగాణ కేసీఆర్, హరీష్‌రావుల జాగీరుకాదని జగ్గారెడ్డి అన్నారు. త్వరలో తాను అధికారం చేపట్టబోతున్నానని జగ్గారెడ్డి తెలిపారు. తాను అధికారంలోకి రాగానే టీఆర్ఎస్ నేతలతో బంతాట ఆడుకుంటానని జగ్గారెడ్డి తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు. బీజేపీ కార్యకర్తలను టీఆర్ఎస్ బెదిరిస్తోందని జగ్గారెడ్డి ఆరోపించారు. నర్సాపూర్ లో జరిగిన బహిరంగ సభలో కేసీఆర్ చేసిన విమర్శలకు జగ్గారెడ్డి కౌంటర్ ఇచ్చారు. -
సునీతా లక్ష్మారెడ్డికి భయపడే కేసీఆర్ సభ
మెదక్ : కాంగ్రెస్ అభ్యర్థి సునీతా లక్ష్మారెడ్డికి భయపడే నర్సాపూర్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగ సభ పెట్టారని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అన్నారు. కేసీఆర్ హిట్లర్ తాతల వ్యవహరిస్తున్నారని ఆయన బుధవారమిక్కడ మండిపడ్డారు. కేసీఆర్ తన వందరోజుల పాలనలో ప్రజా సంక్షేమాన్ని విస్మరించారని ఆరోపించారు.. రుణమాఫీ, విద్యుత్ సమస్యపై స్పష్టత లేదని పొన్నాల అన్నారు. కేసీఆర్ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈనెల 12న రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేస్తామని ఆయన తెలిపారు. -
పోలింగ్ పెరిగితే ప్రోత్సాహం
సంగారెడ్డి అర్బన్: మెదక్ ఉప ఎన్నికల్లో పోలింగ్ శాతం పెంచేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. 95 శాతం పోలింగ్ సాధించే గ్రామాలకు రూ.2 లక్షలను నజరానా ఇస్తామని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి రాహుల్ బొజ్జా ప్రకటించారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గత ఎన్నికల కంటే ఈ సారి పోలింగ్ శాతం పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. అందులో భాగంగా ఏ గ్రామంలో అయితే 95 శాతం పోలింగ్ నమోదవుతుందో ఆ గ్రామానికి కార్పొరేట్ సోషల్ రెస్పాన్బిలిటీ పథకం నుంచి రూ.2 లక్షలు అందజేస్తామని స్పష్టం చేశారు. ఎన్నికలను ప్రశాంతంగా సజావుగా నిర్వహించడానికి ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పటిష్టంగా అమలు చేస్తామన్నారు. ఇప్పటి వరకు రూ. 42.70 లక్షల నగదు, 4,324 లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. ఎన్నికల నిర్వహణ కోసం 4,213 మంది పోలీసు సిబ్బందిని ఉపయోగిస్తున్నామని చెప్పారు. మెదక్ లోక్‌సభ పరిధిలో 1,817 పోలింగ్ కేంద్రాలుండగా, 407 పోలింగ్ కేంద్రాలను అత్యంత సమస్యాత్మకమైనవిగా, 744 కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించామని చెప్పారు. ఉప ఎన్నిక విధుల్లో మొత్తం 9,086 మంది సిబ్బంది ఉంటారనీ, వీరందరికీ శిక్షణ కూడా ఇప్పించామన్నారు. ఎన్నికల శిక్షణ కార్యక్రమానికి హాజరు కాని 215 మందికి షోకాజ్ నోటీసులు జారీ చేశామని తెలిపారు. ఎన్నికల విధులను నిర్లక్ష్యం చేసిన వారి పట్ల కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 16న కౌంటింగ్ 13న నిర్వహించే ఉప ఎన్నికకు లెక్కింపును 16వ తేదీ పటాన్చెరు మండలం రుద్రారంలోని గీతం విశ్వవిద్యాలయంలో నిర్వహిస్తున్నట్లు రాహుల్ బొజ్జా తెలిపారు. 16న ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని , ప్రతి అసెంబ్లీ నియోజక వర్గానికి 14 టేబుళ్ల చొప్పున 98 టేబుళ్లను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి దయానంద్ , ఎన్నికల పరిశీలకులు పాల్గొన్నారు. -
నేడు నర్సాపూర్‌కు కేసీఆర్
నర్సాపూర్: మెదక్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం నర్సాపూర్‌కు రానున్నారు. ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న టీఆర్ఎస్ భారీ మెజార్టీ కోసం ఏకంగా సీఎంతో ప్రచారం చేయిస్తోంది. ఈ క్రమంలోనే నర్సాపూర్-హన్మంతాపూర్ గ్రామాల మధ్య ఉన్న వెంచర్ స్థలంలో బహిరంగసభకు ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభంకానున్న ఈ సభలో కేసీఆర్‌తో పాటు టీఆర్ఎస్ ముఖ్యనేతలంతా పాల్గొననున్నారు. సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలంతా తరలివస్తుండడంతో అధికార యంత్రాగం కూడా బహిరంగసభపై ప్రత్యేక దృ్ట సారించి ఏర్పాట్లను పరిశీలిస్తోంది. ఏర్పాట్ల పరిశీలన సీఎం కేసీఆర్ సభ ఏర్పాట్లను జిల్లా మంత్రి హరీష్‌రావు మంగళవారం పరిశీలించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ, పార్టీ ఇన్చార్జి రాజయ్య యాదవ్, స్థానిక ఎమ్మెల్యే చిలుములమదన్‌రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ రాజమణి, పార్టీ రాష్ర్ట నాయకుడు మురళీధర్ యాదవ్ ఇతర నాయకులతో కలిసి సభ జరగనున్న ప్రాంతానికి వచ్చిన హరీష్‌రావు వేదిక, ఇతర ఏర్పాట్లను పరిశీలించారు. మరోవైపు జిల్లా ఎస్పీ శెముషీ బాజ్‌పాయ్ కూడా మంగళవారమే నర్సాపూర్ చేరుకుని భద్రత ఏర్పాట్లను పర్యవేక్షించారు. పోలీసులు వేదిక వద్ద డాగ్ స్క్వాడ్ తనిఖీలు సైతం చేపట్టారు. భద్రత చర్యల్లో భాగంగా సీఎం కాన్వాయ్ రిహార్సల్స్ చేసి పరిశీలించారు. జనసమీకరణపై గులాబీదళం దృష్టి తొలిసారి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు జిల్లాలో పార్టీ బహిరంగ సభలో పాల్గొంటున్నందున సభకు పెద్ద సంఖ్యలో ప్రజలు, పార్టీ కార్యకర్తలు హాజరయ్యే విధంగా పార్టీ వర్గాలు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిసింది. సుమారు రెండు లక్షల మందిని సీఎం సభకు తరలించాలని ఆ పార్టీ నేతలంతా భావిస్తున్నారు. ఇందుకోసం ఇప్పటికే జనసమీకరణ బాధ్యతలను పార్టీ ముఖ్యనేతలకు అప్పగించారు. పార్కింగ్ ఎక్కడంటే.. సీఎం సభకు వచ్చే వాహనాల కోసం అధికారులు పార్కింగ్‌ను సిద్ధం చేశారు. మెదక్, కౌడిపల్లి వైపు నుంచి వాహనాలను నర్సాపూర్ శివారులోని మూతపడిన షుగర్ ప్యాక్టరీ సమీపంలో పార్కింగ్ స్థలం ఏర్పాటు చేశారు. వె ల్దుర్తి వైపు నుంచి వచ్చే వాహనాలను మార్కెట్ కమిటీ సమీపంలో, సంగారెడ్డి, హత్నూర వైపు నుంచి వాహనాలను పట్టణంలోని పశువుల సంత వద్ద కొన్నింటిని పార్కింగ్ చేసేలా చర్యలు తీసుకున్నారు. ఇక తూప్రాన్ వైపు నుంచి వ చ్చే వాహనాలను అదే మార్గంలో మూత పడిన షుగర్ ప్యాక్టరీ సమీపంలో పార్కు చేయాలని పోలీసులు తెలిపారు. వీఐపీల వాహనాలను సభా వేదిక వెనుక భాగాన ఉన్న ఖాళీ స్థలంలో పార్కు చేసే అవకాశం కల్పించారు. అంతేగాక సమావేశానికి చేరువలో ఉన్న కంజర్ల ఫంక్షన్ హాలు వెనుక భాగాన, లయన్స్‌క్లబ్ వెనుక భాగాన ఉన్న ఖాళీ స్థలాల్లో సైతం రెండు పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేశారు. -
సవాళ్లు.. ప్రతిసవాళ్లతో
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి : ఉప ఎన్నికల ప్రచారం కేవలం మూడు రోజులు మాత్రమే మిగిలి ఉండడంతో నేతలు నోటికి పని పెంచారు.. సవాళ్లు.. ప్రతి సవాళ్లు విసురుకుంటూ ఎన్నికల ప్రచారాన్ని వేడెక్కించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజల్లోకి వెళ్లకుండానే విలేకరుల సమావేశాలు పెట్టి మరీ తుపాకీ రాముడిని తలపిస్తూ తూటాలు పేల్చేస్తున్నారు. ఆపై సైడై పోతున్నారు. మెదక్ ఉప ఎన్నికల ప్రచారం రాజకీయ పార్టీల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకోవడంతోనే సరిపోతోంది. ముఖ్యంగా టీఆర్ఎస్, బీజేపీ - టీడీపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. బీజేపీ - టీడీపీ ముఖ్యనేతలు సీఎం కేసీఆర్ లక్ష్యంగా ఆరోపణలు చేస్తుంటే, టీఆర్ఎస్ మంత్రి హరీష్‌రావు సహా ఇతర మంత్రులు వాటిని తిప్పి కొట్టే ప్రయత్నం చేస్తున్నారు. మంత్రి హరీష్‌రావు, టీడీపీ శాసనసభాపక్ష నేత ఎర్రబెల్లి దయాకర్‌రావులు సవాళ్లు ప్రతి సవాళ్లు విసురుకుంటున్నారు. మంత్రి హరీష్‌రావు సవాల్ స్వీకరించగా, టీడీపీ నేత ఎర్రబెల్లి సైడై పోయారు. ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ శాసనసభాపక్ష నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు బీజేపీ ఎంపీ అభ్యర్థి జగ్గారెడ్డి గెలిస్తే మంత్రి హరీష్‌రావు రాజకీయ సన్యాసం తీసుకుంటారా అని సవాల్ విసిరారు. జగ్గారెడ్డి ఎంపీగా గెలిస్తే మెదక్ నియోజకవర్గం గణనీయంగా అభివృద్ధి చెందడం ఖాయమన్నారు. అయితే ఎర్రబెల్లి సవాల్‌ను సంగారెడ్డి, సిద్దిపేట ప్రచార సభల్లో మంత్రి హరీష్‌రావు ఈ నెల 4న స్వీకరించారు. బీజేపీ అభ్యర్థి జగ్గారెడ్డి ఓడిపోతే ఎర్రబెల్లి దయాకర్‌రావు శాసనసభాపక్ష నేత పదవి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారా అంటూ ప్రతి సవాల్ విసిరారు. మంత్రి హరీష్ సవాల్‌పై టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు తక్షణమే స్పందిచలేక పోయారు. సోమవారం గజ్వేల్‌లో ఆయన ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ, దళితుడిని సీఎం చేస్తానన్న కేసీఆర్ మాట తప్పారని మొదట సీఎం కేసీఆర్ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని ఆ తర్వాతనే తాను మంత్రి హరీష్‌రావు సవాల్‌ను స్వీకరిస్తానంటూ సైడై పోయారు. ఇదిలా ఉంటే సంగారెడ్డి నియోజకవర్గ అభివృద్ధిపై ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ సవాల్ చేశారు. జగ్గారెడ్డి హయాంలో సంగారెడ్డి అభివృద్ధి జరిగినట్లు నిరూపిస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. అయితే బీజేపీ నేతలు దీనిపై స్పందించలేదు. ఎంపీ బాల్క సుమన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డికి నీ బండారం బయటపెడతా, అవినీతిపై బహిరంగ చర్చకు సిద్ధమేనా అంటూ సంగారెడ్డిలో సవాల్ విసిరారు. సుమన్ సవాల్‌పై రేవంత్ నుంచి ఎలాంటి స్పందన కనిపించలేదు. -
దమ్ముంటే బీజేపీ డిపాజిట్ తెచ్చుకోవాలి : కేటీఆర్
దౌల్తాబాద్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, టీడీపీ నాయకుడు ఎర్రబెల్లి దయాకర్‌రావులకు దమ్ముంటే మెదక్ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి జగ్గారెడ్డికి డిపాజిట్ తెచ్చుకోవాలని మంత్రి కె. తారకరామారావు సవాల్ విసిరారు. ఆదివారం మెదక్ జిల్లా దౌల్తాబాద్‌లో జరిగిన రోడ్‌షోలో ఆయన ప్రసంగించారు. పచ్చి సమైక్యవాది అయిన జగ్గారెడ్డికి టికెట్ ఇవ్వడం బీజేపీ దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. 90రోజుల్లోనే 80సమస్యల పరిష్కారానికి నిర్ణయం తీసుకున్న టీఆర్ఎస్ ప్రభుత్వం చరిత్రకెక్కిందని పేర్కొన్నారు. కాంగ్రెస్, బీజేపీలకు చెప్పుకోవడానికి ఏమీలేకపోవడంతో టీఆర్ఎస్పై దుష్ర్పచారం చేయడం మొదలుపెట్టారన్నారు. కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాల తప్పుడు నిర్ణయాల వల్లనే తెలంగాణలో కరెంట్ కష్టాలు వచ్చాయన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి సునీతాలక్ష్మారెడ్డి తెలంగాణ కోసం ఏనాడూ పాటుపడలేదని విమర్శించారు. టీఆర్ఎస్ పార్టీలో భారీగా చేరికలు చేగుంట: ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు పేర్కొన్నారు. ఆదివారం మెదక్ జిల్లా చేగుంటలో ఆదిలాబాద్ జిల్లా డీసీసీబీ చైర్మన్ దామోదర్‌రెడ్డితో పాటు పాలకవర్గ సభ్యులు, పలువురు ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్ పార్టీలో చేరారు. కేటీఆర్ మాట్లాడుతూ ఆదిలాబాద్ జిల్లాలో ఎక్కువగా తండాలున్నాయని, 500 జనాభా ఉన్న తండాలను పంచాయతీలుగా గుర్తిస్తామన్నారు. -
వెన్నుపోటుదారుల సంఘానికి అధ్యక్షుడు బాబు
జగ్గారెడ్డి తిన్నింటివాసాలు లెక్కించే రకం : హరీశ్‌రావు మెదక్/పాపన్నపేట: వెన్నుపోటుదారుల సంఘానికి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అయితే, తరువాత స్థానంలో బీజేపీ ఎంపీ అభ్యర్థి జగ్గారెడ్డేనని నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు పేర్కొన్నారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉపఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన రోజే కాంగ్రెస్, టీడీపీలు ఓటమిని అంగీకరించాయని, అందుకే చంద్రబాబు, పవన్ కల్యాణ్, వెంకయ్యనాయుడులు ప్రచారానికి ఎగ్గొట్టారని ఆరోపించారు. టీఆర్ఎస్ అభ్యర్థి గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానన్న ఎర్రబెల్లి సవాల్‌ను స్వీకరిస్తున్నానన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డిని సంప్రదించకుండా సీమాంధ్రులతో బీ ఫాం తెచ్చుకున్న జగ్గారెడ్డికి జనం సమాధి కట్టడం ఖాయమన్నారు. జగ్గారెడ్డి తిన్నింటివాసాలు లెక్కించే రకమని ఆరోపించారు. అనంతరం పాపన్నపేట మండలం ఎల్లాపూర్, మల్లంపేట గ్రామాల్లో ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రాణహిత చేవెళ్లతో సాగునీరందిస్తామని చెప్పారు. ఎఫ్ఎన్, ఎం.ఎన్ కెనాళ్లకు పూర్తిస్థాయి సిమెంట్ లైనింగ్ వేయిస్తామన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే పుట్ట మధు, టీఆర్ఎస్ పొలిట్ బ్యూరో సభ్యుడు సుదర్శన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వానికి కర్రుకాల్చి వాత పెట్టాలి...
అప్పుడే హామీలు నేరవేరుస్తారు: డీకే అరుణ మెదక్: ప్రజలకు ఇచ్చిన హామీలను మరచిన టీఆర్ఎస్ ప్రభుత్వానికి మెదక్ ఉప ఎన్నికలో కర్రుకాల్చి వాతపెట్టాలని మాజీ మంత్రి, గద్వాల ఎమ్మెల్యే డీకే అరుణ అన్నారు. మెదక్ ఎంపీ ఉప ఎన్నిక సందర్భంగా ఆదివారం మెదక్ మండల పరిధిలోని బాలానగర్, తిమ్మక్కపల్లి, రాజ్‌పల్లి తదితర గ్రామాల్లో ఆమె ప్రచారాన్ని నిర్వహించారు. ప్రభుత్వం రైతు రుణాలను మాఫీచేసేందుకు షరతులను విధిస్తూ అయోమయంలో పడేస్తోందన్నారు. వ్యవసాయం కోసం కరెంట్ లేక పంటలు ఎండిపోయిన రైతులు నిరసన చేస్తే వారిపై లాఠీదెబ్బలను కురిపించిన ఘనత కేసీఆర్‌కే దక్కిందన్నారు. రూ. 3.50 లక్షలతో ఇల్లు, వృద్ధులకు, వితంతువులకు రూ.1000, వికలాంగులకు రూ 1500 ిపింఛన్, కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అంటూ అరచేతిలో స్వర్గం చూపిస్తున్న ఆయన ప్రజలను నట్టేట ముంచటం ఖాయమని ఆరోపించారు. ఆరు దశాబ్దాల పాటు తెలంగాణ కోసం పోరాటాలు చేస్తున్న ఇక్కడి ప్రజల పోరాట పటిమను చూసి సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చారన్నారు. -
కాంగ్రెస్ వ్యూహాత్మక ప్రచారం
సంగారెడ్డి మున్సిపాలిటీ : మెదక్ ఉప ఎన్నికలను మాజీ డిప్యూటీ సీఎం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి సునీతారెడ్డిని ఎలాగైనా గెలిపించాలని తీవ్రంగా శ్రమిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా సంగారెడ్డి నియోజక వర్గ ప్రచార బాధ్యత దామోదర పైనే ఉంచడంతో ఆయన మరింత బాధ్యతగా పనిచేస్తున్నారు. ఇప్పటి వరకు సంగారెడ్డి నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహించిన మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కాంగ్రెస్‌కు రాజీనామా చేయడంతో పాటు బీజేపీ తరఫున ఎంపీగా పోటీ చేస్తుండడంతో దామోదర సంగారెడ్డి నియోజకవర్గంలో ప్రచారం ముమ్మరం చేశారు. అయితే నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి గ్రామ స్థాయిలో కార్యకర్త్తలున్నా, నాయకులు లేకపోవడంతో ప్రచారం ఆశించిన స్థాయిలో జరగడం లేదు. దీంతో రంగంలోకి దిగిన దామోదర రాజనర్సింహ జగ్గారెడ్డి వ్యవహార శైలి నచ్చక కాంగ్రెస్ నుంచి వెళ్లిపోయిన వారిని మళ్లీ దగ్గరకు తీస్తున్నారు. సంగారెడ్డితో పాటు సదాశివపేట మండల, పట్టణ సీనియర్ నాయకులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి వారు తిరిగి కాంగ్రెస్‌లోకి వచ్చేలా చేయడంలో సఫలీకృతులయ్యారు. సదాశివపేటలో పార్టీకి ప్రజలకు సన్నిహిత సంబంధాలున్న మాజీ మున్సిపల్ చైర్మన్ మునిపల్లి సత్యనారాయణతో పాటు రామాగౌడ్లను పార్టీలో చేర్చుకొని పార్టీకి దూరమైన వారిని చే రదీశారు. ఇదే వ్యూహంతో సంగారెడ్డిలో సైతం కాంగ్రెస్‌కు మెజార్టీ ఓట్లు వచ్చేలా ప్రయత్నాలను ప్రారంభించారు. మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ముఖ్య అనుచరుడు, మున్సిపల్ వైస్ చైర్మన్ గోవర్దన్ నాయక్ బీజేపీలో చేరకుండా కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చేలా దామోదర ఒప్పించారు. మైనార్టీ వర్గాల ఓట్లపై ప్రభావం చూపే పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు షేక్ సాబెర్ కూడా కాంగ్రెస్‌ను వీడకుండా బుజ్జగించారు. ఇలా నియోజకవర్గంలో పార్టీ కార్యకర్తలను కాపాడుకోవడంతో పాటు అదే స్థాయిలో ప్రచారం నిర్వహిస్తున్నారు. కార్యకర్తల కోరిక మేరకు ఇంటింటి ప్రచారం, పాదయాత్రలు వంటి వాటిలో పాల్గొంటూ వారిని ఉత్తేజపరుస్తున్నారు. ఇప్పటికి సంగారెడ్డి మండలంతో పాటు మున్సిపల్ పరిధిలోని మెజార్టీ వార్డులలో ప్రచారం పూర్తిచేశారు. ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొడుతూ తనే అభ్యర్థి అనే భావంతో కార్యకర్తలతో కలిసి ప్రచారం నిర్వహిస్తున్నారు. మొత్తంగా నియోజకవర్గంలో కాంగ్రెస్‌కు మెజార్టీ ఓట్లు సాధించాలనే పట్టుదలతో దామోదర అలంపూర్ ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌తో పాటు పార్టీ రాష్ట్ర నాయకులతో కలిసి ప్రచారం నిర్వహిస్తున్నారు. అలాగే ప్రతిరోజు కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేసుకుని వారికి మార్గనిర్దేశం చేస్తున్నారు. ఈ ఉప ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి సునీతారెడ్డిని ఎలాగైనా గెలిపించాలని కేడర్‌కు నూరిపోస్తున్నారు. -
దుమ్ము రేపాలి
సాక్షి, సంగారెడ్డి: ‘ఏం చేద్దాం...ఎలా చేద్దాం..ఏం చేసినా సరే మన పార్టీ కొచ్చే మెజార్టీ చూసి మిగతా పార్టీల వారికి మతిపోవాలె’ గులాబీ ముఖ్య నేతల నిర్ణయం. మెదక్ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న టీఆర్ఎస్ భారీ మెజార్టీ కోసం వ్యూహాలు రచిస్తోంది. మెజార్టీ సాధన కోసం మంత్రి హరీష్‌రావు నేతృత్వంలో శనివారం ఉప ఎన్నికల బాధ్యతలు చేపట్టిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు రహస్యంగా భేటీ అయ్యారు. హైదరాబాద్ శివారులోని ఓ రిసార్ట్స్‌లో జరిగిన ఈ భేటీలో డిప్యూటీ సీఎం రాజయ్య, మంత్రులు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఈటెల రాజేందర్, పద్మారావు, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీ బీబీ పాటిల్, ఎంపీ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డి, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు ఆర్.సత్యనారాయణ ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్‌రెడ్డి, మహిపాల్‌రెడ్డి, మదన్‌రెడ్డి, సోలిపేట రామలింగారెడ్డి తదితరులు పాల్గొన్నట్లు సమాచారం. మెదక్ ఉప ఎన్నికల సరళిపై ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటున్న సీఎం కేసీఆర్, మెజార్టీ సాధనకు సంబంధించి జిల్లా నాయకత్వానికి పలు సూచనలు చేసినట్లు తెలుస్తోంది. సీఎం కేసీఆర్ సూచన మేరకు ఉప ఎన్నికల ప్రచార బాధ్యతలు చేపట్టిన ముఖ్య నేతలంతా ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సమావేశంలో మెదక్ ఉప ఎన్నికలు జరుగుతున్న ఏడు నియోజకవర్గాల్లో పార్టీ చేపడుతున్న ప్రచార కార్యక్రమాల గురించి లోతుగా చర్చించినట్లు తెలుస్తోంది. ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రజల్లోకి మరింతగా వెళ్లి టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి వివరించాలని మంత్రి హరీష్‌రావు ఎమ్మెల్యేలకు సూచించినట్లు సమాచారం. ఎన్నికల తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో ప్రచారం ముమ్మరం చేయటంతోపాటు కాంగ్రెస్, బీజేపీ విమర్శలకు గట్టిగా తిప్పికొట్టాలని చెప్పినట్లు తెలుస్తోంది. ఎన్నికలకు సన్నాహాలకు సంబంధించి డిప్యూటీ సీఎం రాజయ్య, మంత్రి హరీష్‌రావు పలు సూచనలు చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఉప ఎన్నికల్లో భారీ మెజార్టీ సాధించేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించిన మంత్రులు, ఎమ్మెల్యేలు కీలకనిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం. 2 లక్షల మందితో కేసీఆర్ సభ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈనెల 10న నర్సాపూర్‌లో జరగనున్న సీఎం కేసీఆర్ సభను కనీవినీ ఎరుగని రీతిలో విజయవంతం చేయాలని టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు నిర్ణయించినట్లు తెలుస్తోంది. మంత్రి హరీష్‌రావు ఆధ్వర్యంలో హైదరాబాద్ శివారులో జరిగిన భేటీలో టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు సీఎం సభపై చర్చించినట్లు సమాచారం. కనీసంగా 2 లక్షల మందితో సీఎం ఎన్నికల ప్రచార బహిరంగ సభను నిర్వహించాలని, ఇందుకు కోసం జిల్లా నలుమూలల నుంచి భారీ ఎత్తున జనసమీకరణ చేపట్టాలని తీర్మానించినట్లు తెలిసింది. -
బస్తీమే సవాల్!
మెతుకు సీమ ఉప పోరులో సవాళ్లు, ప్రతిసవాళ్లు ఊపందుకున్నాయి. ప్రత్యర్థులకు సవాళ్లు విసురుతూ ప్రచారంలో కాక పుట్టిస్తున్నారు. ఉప ఎన్నిక ప్రచారంలో ప్రధాన పార్టీల నేతలు దూకుడు పెంచడంతో వేడి పెరిగింది. ఒకరును మించి ఒకరు సవాల్ చేసుకుంటున్నారు. గెలుపు, ఓటములపై సవాళ్లు రువ్వుకుంటున్నారు. బస్తీమే సవాల్ అంటూ దూకుడు పెంచుతున్నారు. ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి జగ్గారెడ్డి గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటావా అని మంత్రి తన్నీరు హరీష్‌రావుకు టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు సవాల్ విసిరారు. మెదక్ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న హరీష్‌రావు- ఎర్రబెల్లి సవాల్‌కు దీటుగా స్పందించారు. జగ్గారెడ్డి గెలిస్తే తాను మంత్రి పదవితో పాటు ఎమ్మెల్యే పదవిని కూడా వదిలిపెట్టి రాజకీయ సన్యాసం తీసుకోవడానికి సిద్ధమని ప్రతిసవాల్ చేశారు. ఒకవేళ జగ్గారెడ్డి ఓడిపోతే ఎమ్మెల్యే పదవి వదిలి రాజకీయ సన్యాసం తీసుకోవడానికి ఎర్రబెల్లి సిద్ధమా అని ప్రశ్నించారు. ఏపీ సీఎం చంద్రబాబు, జనసేన పార్టీ నేత పవన్ కళ్యాణ్ కూ హరీష్‌రావు సవాల్ విసిరారు. జగ్గారెడ్డికి టిక్కెట్ ఇప్పించిన వీరిద్దరూ దమ్ము, ధైర్యం ఉంటే ఎన్నికల ప్రచారానికి రావాలంటూ సవాల్ చేశారు. హారీష్ సవాల్ కు చంద్రబాబు, పవన్ ఎలా స్పందిస్తారో చూడాలి. కాగా బీజేపీ అభ్యర్థి జగ్గారెడ్డిని గెలిపించి కేసీఆర్‌కు షాక్ ట్రీట్మెంట్ ఇవ్వాలని బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి పిలుపు ఇవ్వగా, టీఆర్ఎస్ అభ్యర్థిని ఓడిస్తామంటూ ఎమ్మార్పీఎస్ అధినేత మందకృష్ణ మాదిగ శపథం చేశారు. నేతల సవాళ్లు, ప్రతిసవాళ్లు ఎంతవరకు వెళతాయో చూడాలి. -
పోటీపడి మరి బొజ్జున్న తెలంగాణ కాంగ్రెస్ నేతలు
అధికారంతో పాటు 'చేతి' నిండా పనిలేక లేకపోవటంతో కాంగ్రెస్ నేతలు ఆదమరిచి బొజ్జున్నారు. ఓ వైపు మెదక్ ఉప ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఎలాగైనా గెలిచి తీరాలని అధినేత్రి సోనియాగాంధీ ఆదేశిస్తే.... మరోవైపు ఆ పార్టీ నాయకులు బహిరంగంగానే కనుకు తీశారు. రాత్రింబవళ్ళు కష్టపడి విజయం సాధిస్తామని మేడంకి ఇచ్చిన మాటను పక్కన పెట్టిన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలు నిద్రను ఆపుకోలేక గుర్రుపెట్టారు. పాపం మేడమ్‌కు ఇచ్చిన మాట ప్రకారం రాత్రిపూట మాత్రమే ప్రచారం చేస్తున్నారో ఏమో... పగలు మాత్రం కునుకు తీస్తున్నారు. మెదక్ జిల్లా పటాన్‌చెరువులో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో కాంగ్రెస్ నేతలు ఒకరిని మించి మరొకరు పోటీ పడుతూ ఆదమరచి నిద్రపోవటం విశేషం. ఓవైపు సమావేశం జరుగుతున్నా నేతాశ్రీలు మాత్రం నిద్రమత్తులో జోగుతూ కెమెరాకు చిక్కారు. -
జగ్గారెడ్డి గెలిస్తే రాజకీయ సన్యాసం చేస్తా: హరీశ్
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: మెదక్ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి జగ్గారెడ్డి గెలిస్తే తాను మంత్రి పదవితో పాటు ఎమ్మెల్యే పదవిని కూడా వదిలిపెట్టి రాజకీయ సన్యాసం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నానని భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు ప్రకటించారు. ఉప ఎన్నికల్లో జగ్గారెడ్డి గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటావా? అని మంగళవారం టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు చేసిన సవాల్‌కు మంత్రి స్పందించారు. ఒకవేళ జగ్గారెడ్డి ఓడిపోతే ఎమ్మెల్యే పదవి వదిలి రాజకీయ సన్యాసం తీసుకోవడానికి సిద్ధమా అని ఆయన ప్రతి సవాల్ విసిరారు. -
ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్కే మా మద్దతు: సీపీఎం
హైదరాబాద్: మెదక్ ఉప ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇస్తున్నట్లు సీపీఎం బుధవారం హైదరాబాద్‌లో ప్రకటించింది. టీఆర్ఎస్ ప్రత్యర్థి పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను ఓడించాలని సీపీఎం పిలుపునిచ్చింది. మెదక్ ఉప ఎన్నికల్లో తమ పార్టీకి మద్దతు ప్రకటించాలని తెలంగాణ రాష్ట్ర మంత్రి టి.హారీష్ రావు వామపక్ష పార్టీలైన సీపీఎం, సీపీఐలను కలసి మద్దతు కోరారు. అందుకు తమకు కొంత గడువు కావాలిని ఇరు పార్టీల నేతలు హారీష్ రావును కోరారు. దాంతో టీఆర్ఎస్కు మద్దతు ఇస్తున్నట్లు సీపీఎం ప్రకటించింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ మెదక్ లోక్‌సభ, గజ్వేల్ అసెంబ్లీ స్థానం నుంచి విజయం సాధించారు. అనంతరం ఆయన తెలంగాణ సీఎం పీఠం అధిష్టించిన తర్వాత మెదక్ లోక్‌సభ స్థానానికి రాజీనామా చేశారు. దాంతో ఆ స్థానానికి ఈ నెల 13న ఉప ఎన్నిక జరగనున్న సంగతి తెలిసిందే. -
బాబుగారి జగ్గారెడ్డి పార్టీ.....
హైదరాబాద్ : మెదక్ ఉప ఎన్నిక సందర్భంగా బీజేపీ, టీఆర్ఎస్ విమర్శలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. ఇరుపార్టీలు పరస్పర ఆరోపణలు గుప్పించుకుంటున్నాయి. తాజాగా బీజేపీపై మంత్రి కేటీఆర్ విరుచుకుపడ్డారు. భారతీయ జనతా పార్టీ అంటే బాబుగారి జగ్గారెడ్డి అని ఆయన ఎద్దేవా చేశారు. నిన్నటిదాకా కాంగ్రెస్ విధానాలనే కొనితెచ్చుకున్న ఆ పార్టీ .... గతిలేక అభ్యర్థిని కూడా అక్కడ నుంచే తెచ్చుకుందని కేటీఆర్ విమర్శించారు. అందుకు వారు ఆత్మవిమర్శ చేసుకోవాలని సలహా ఇచ్చారు. గతంలో సంగారెడ్డిలో లక్ష మెజార్టీ రాకుంటే రాజకీయ సన్యాసం చేస్తానన్న జగ్గారెడ్డి ...ఈసారి డిపాజిట్ తెచ్చుకుంటే గొప్పే అని కేటీఆర్ సవాల్ విసిరారు. జగ్గారెడ్డికి ఈసారి మెదక్ ప్రజలు గుండు కొట్టించి పంపుతారని ఆయన వ్యాఖ్యానించారు. కాగా మరోవైపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కూడా టీఆర్ఎస్పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. టీఆర్ఎస్ నేతలు బీజేపీపై సంస్కరాహీనంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. సమైక్యవాదులను టీఆర్ఎస్లో చేర్చుకోవటం ఏం నైతికత అని ప్రశ్నించారు. 2004లో జగ్గారెడ్డికి టీర్ఎస్ ఎందుకు టికెట్ ఇచ్చిందని సూటిగా ప్రశ్నించారు. వాపును చూసి టీఆర్ఎస్ బలుపు అనుకుంటుందన్నారు. మూడు నెలల అధికారంతోనే అహంకారాన్ని ప్రదర్శిస్తోందని కిషన్ రెడ్డి విమర్శలు చేశారు. దమ్ముంటే సెప్టెంబర్ 17న గోల్కొండ కోటపై త్రివర్ణ పతాకం ఎగురవేయాలని సవాల్ విసిరారు. కుటుంబ పాలన కేవలం నిజాం రాచరిక పాలనేలో ఉండేదని... టీఆర్ఎస్ లాంటి పార్టీలను దేశంలో బీజేపీ చాలా చూసిందని కిషన్ రెడ్డి అన్నారు. -
'జగ్గారెడ్డికి డిపాజిట్ కూడా రాదు'
లోక్‌సభ ఉప ఎన్నికలలో బీజేపీ తరఫున పోటీచేస్తున్న తూర్పు జయప్రకాష్ రెడ్డి (జగ్గారెడ్డి)కి మెదక్ స్థానంలో డిపాజిట్ కూడా రాదని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ విమర్శించారు. అక్కడ తమ సొంత పార్టీ తరఫున పోటీ చేయించడానికి అభ్యర్థి దొరక్క భారతీయ జనతా పార్టీ కిరాయి అభ్యర్థిని బరిలోకి దింపిందని ఆయన మండిపడ్డారు. టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణలో చేపట్టి అమలుచేస్తున్న సంక్షేమ పథకాలే మెదక్‌లో తమను గెలిపిస్తాయని కర్నె ప్రభాకర్ ధీమా వ్యక్తం చేశారు. మెదక్ స్థానంలో టీఆర్ఎస్ అభ్యర్థి ప్రభాకర్ రెడ్డి భారీ మెజారిటీతో విజయం సాధించడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు. -
డబ్బుంటే టీఆర్ఎస్ టికెట్ కొనుక్కునేవాడ్ని
-
డబ్బుంటే టీఆర్ఎస్ టికెట్ కొనుక్కునేవాడ్ని
హైదరాబాద్ : మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి జగ్గారెడ్డి మరోసారి టీఆర్ఎస్పై ధ్వజమెత్తారు. కేసీఆర్ కుటుంబం అధికారంలో ఉందంటే అది బీజేపీ పెట్టిన భిక్షేనని ఆయన సోమవారమిక్కడ అన్నారు. తన దగ్గర డబ్బుంటే టీఆర్ఎస్ టికెట్నే కొనుక్కునేవాడినని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. హరీష్ రావు రోజూ జగ్గారెడ్డి జపం చేస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. రాజకీయాలు కాదని... అభివృద్ధిపై చర్చించే దమ్ముందా అని జగ్గారెడ్డి సవాల్ విసిరారు. కాగా ప్రజలు జగ్గారెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించలేనివారు..ఎంపీగా గెలిపిస్తారనుకోవడం హాస్యాస్పదమని మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. -
బీజేపీకి బుద్ధి చెప్పాల్సిందే
సిద్దిపేట టౌన్: ‘త్యాగాలతో తెలంగాణను సాధించాం.. దీనిని బంగారు తెలంగాణగా మార్చుకోవాలంటే మెదక్ ఉప ఎన్నికలో బీజేపీ డిపాజిట్‌ను గల్లంతు చేయాల్సిందే. అప్పుడే కేంద్ర ప్రభుత్వం కళ్లు తెరుస్తుంది. తెలంగాణ వ్యతిరేక విధానాలను మానుకుంటుంది. ధైర్యంగా ప్రధానమంత్రిని కలిసి వివక్షతపై మాట్లాడగలుగుతా’మని టీఆర్ఎస్ సెక్రటరీ జనరల్ కె. కేశవరావు స్పష్టం చేశారు. స్థానిక శక్తి గార్డెన్లో ఆదివారం జరిగిన సిద్దిపేట నియోజకవర్గ టీఆర్ఎస్ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ ఇవ్వలేదన్నారు. వెయ్యి మంది చనిపోతే కాంగ్రెస్ మంత్రులు, పాలకులు ఏం చేశారని ప్రశ్నించారు. టీడీపీ, బీజేపీ కుట్రలను ఛేదించాలని పిలుపునిచ్చారు. ప్రజలే తెలంగాణకు దశను, దిశను నిర్దేశిస్తారని, వారే రథసారథులన్నారు. వారి ఆశలే టీఆర్ఎస్ మేనిఫెస్టోగా తయారైందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే.. రాష్ట్రం విడిచిపోతానని చెప్పిన జగ్గారెడ్డి మళ్లెట్ల పోటీకి దిగాడని ప్రశ్నించారు. నీచుడైన జగ్గారెడ్డిని చిత్తుగా ఓడించాలన్నారు. జగ్గారెడ్డిని దెబ్బతీయడానికి ఇదే అదను: మంత్రి ఈటెల సిద్దిపేటకు రూ. 110 కోట్ల నిధులు రాకుండా లేఖ రాసిన వ్యతిరేకి, తెలంగాణ ద్రోహి జగ్గారెడ్డిని దెబ్బతీయడానికి ఇదే సరైన అదను అని ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. సమస్యలను పరిష్కరించాలని మొత్తుకున్నా కలిసిరాని సునీతాలక్ష్మారెడ్డికి ప్రజలు ఓట్లు వెయ్యరాదన్నారు. సమైక్యవాదులకు ఊడిగం చేసిన అభ్యర్థులను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. తెలంగాణ కరెంటు కష్టాలకు సీమాంధ్ర పాలకులే కారణమన్నారు. ఖమ్మం, ఇల్లెందు, ఎన్టీపీసీ, ఆదిలాబాద్, కరీంనగర్, భూపాలపల్లిలో విద్యుత్ ఉత్పాదనకు కృషి జరుగుతుందని, 12 వేల మెగావాట్ల విద్యుత్ లభిస్తుందని అప్పుడే కరెంటు కష్టాలు తీరుతాయన్నారు. ఉద్యమాలు చేయడమే కాదు పరిపాలన నైపుణ్యాలు కూడా తెలుసునని టీఆర్ఎస్ సర్కార్ నిరూపించుకుంటోందన్నారు. కాంగ్రెస్, బీజేపీలకు చుక్కలు చూపిద్దాం: ఏనుగు రవీందర్‌రెడ్డి మెదక్ ఉప ఎన్నిక ద్వారా కాంగ్రెస్, బీజేపీలకు చుక్కలు చూపిద్దామని కరీంనగర్ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఉప ఎన్నిక దెబ్బకు ఢిల్లీ కదలాలన్నారు. వెంకయ్యనాయుడు, చంద్రబాబు కుట్రలను తిప్పికొట్టాలని కోరారు. ఎమ్మెల్సీ సలీం మాట్లాడుతూ బాబు వల్లనే తెలంగాణకు కరెంటు కష్టాలన్నారు. టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ మాట్లాడుతూ ప్రత్యర్థుల దిమ్మ తిరిగే మెజార్టీని అందించాలని కోరారు. ప్రభుత్వ సలహాదారుడు కేవీ రమణాచారి మాట్లాడుతూ సిద్దిపేట తెలంగాణ దశ, దిశను నిర్దేశిస్తోందన్నారు. చంద్రబాబును ఏపీకే పరిమితం చేయాలి: మైనంపల్లి తెలంగాణపై కుట్రలు కొనసాగిస్తున్న చంద్రబాబునాయుడిని మెదక్ ఉప ఎన్నిక ద్వారా చిత్తుగా ఓడించి మళ్లీ ఈ ప్రాంతంలో పోటీ పడకుండా, ఏపీ రాష్ట్రానికే పరిమితమయ్యేలా చేయాలని టీఆర్ఎస్ నేత మైనంపల్లి హన్మంతరావు పిలుపునిచ్చారు. తెలంగాణలోనే టీడీపీ అడ్రస్ గల్లంతు చేయాలన్నారు. టీఆర్ఎస్ నేత నరేంద్రనాథ్ మాట్లాడుతూ ఉప ఎన్నికలో బీజేపీ బక్రా కానుందన్నారు. కేసీఆర్‌ను తిట్టడానికే జగ్గారెడ్డిని ఇద్దరు నాయుళ్లు చేరదీశారన్నారు. రైల్వే లైన్ సాధిస్తా: అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డి సిద్దిపేట గల్లీగల్లీలో తిరిగానని, ఇక్కడే పాఠశాల, కళాశాల విద్యను చదివానని టీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. ఏ కష్టమొచ్చినా ప్రజలకు అందుబాటులో ఉంటానన్నారు. సిద్దిపేట రైల్వే లైన్ సాధనకు కృషి చేస్తానన్నారు. సమావేశంలో మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, టీఆర్ఎస్ నేతలు నయ్యర్‌పటేల్, వేలేటి రాధాకృష్ణశర్మ, నవాబ్, తుపాకుల బాల్‌రంగం తదితరులు ప్రసంగించారు. సమావేశంలో టీఆర్ఎస్ నేతలు సారయ్య, స్వామిచరణ్, మచ్చ వేణుగోపాల్‌రెడ్డి, చిన్న, మాణిక్‌రెడ్డి, చిప్ప ప్రభాకర్, బచ్చు రమేష్, పాల సాయిరాం, కరాటె కృష్ణ, గుండు శ్రీను, శేషుకుమార్, బూర మల్లేశం, మహిళా నాయకురాలు బూర విజయ, నందాదేవి, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, సర్పంచులు, ఎంపీటీసీలు, నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
కేసీఆర్ నిజస్వరూపాన్ని బయటపెడతాడనే...
హైదరాబాద్: టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చి మూడు నెలలు అవుతున్నా ఎన్నికల నాటీ హమీలు ఒక్కటీ నెరవేర్చలేకపోయిందని ఉప్పల్ ఎమ్మెల్యే, బీజేపీ సీనియర్ నేత ఎన్.వి.ఎస్.ఎస్ ప్రభాకర్ ఆరోపించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని ఆయన విమర్శించారు. ఆదివారం ఎన్.వి.ఎస్.ఎస్ ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ... తెలంగాణ సీఎం కేసీఆర్ నిజస్వరూపాన్ని జగ్గారెడ్డి బయటపెడతాడనే భయంతో ఆయనపై టీఆర్ఎస్ ఎదురు దాడి చేస్తోందని ఆయన అన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని వ్యతిరేకించిన సీపీఎం మద్దతు ఎలా అడుగుతారని ఆయన టీఆర్ఎస్ను ప్రశ్నించారు. మెదక్ ప్రజలను కేసీఆర్ ఎన్నో సార్లు అవమానించారని ఈ సందర్భంగా ప్రభాకర్ గుర్తు చేశారు. మెదక్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ మూడో స్థానానికే పరిమితమని ప్రభాకర్ జోస్యం చెప్పారు. మూడు నెలల పాలనపై తాము బహిరంగ చర్చకు సిద్ధమని ఆయన టీఆర్ఎస్కు సవాల్ విసిరారు. -
మెదక్ ఎన్నిక కాంగ్రెస్‌కు ప్రతిష్టాత్మకం: సోనియా
సాక్షి, హైదరాబాద్: మెదక్ ఉప ఎన్నికను కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. రాష్ట్ర కాంగ్రెస్ నేతలంతా కష్టపడి ఐక్యంగా పార్టీ అభ్యర్థి సునీతలక్ష్మారెడ్డిని గెలిపించాలని ఆదేశించారు. గత రెండురోజులుగా సోనియా స్వయంగా టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, సీఎల్పీ నేత జానారెడ్డి, మండలిలో ప్రతిపక్షనేత డి.శ్రీనివాస్, మాజీ మంత్రి గీతారెడ్డి, ఇతర ప్రధాన నాయుకులతోపాటు మెదక్ జిల్లాలోని ముఖ్య నేతలకు ఫోన్‌చేసి పార్టీ పరిస్థితిపై ఆరా తీశారు. -
బీజేపీపై మండిపడ్డ టీఆర్ఎస్
హైదరాబాద్: మెదక్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా జగ్గారెడ్డిని ఎంపిక చేయడం పట్ల తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీ మండిపడింది. శనివారం ఆ పార్టీ ప్రతినిధులు హైదరాబాద్‌లో మాట్లాడుతూ... రౌడీ, గుండా అయిన జగ్గారెడ్డికి బీజేపీ టికెట్ ఇచ్చిందని ఆరోపించారు. తెలంగాణ వద్దన్నా జగ్గారెడ్డికి టికెట్ ఎలా ఇచ్చారంటూ బీజేపీని వారు ప్రశ్నించారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు అయిన కిషన్‌రెడ్డి కేవలం అంబర్‌పేట నాయకుడిగానే మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. గత ఎన్నికల్లో మెదక్‌లో బీజేపీని ఇప్పటికే ప్రజలు తిరస్కరించారని టీఆర్ఎస్ గుర్తు చేశారు. రాష్ట్ర విభజన సమయంలో తాను విభజనక వ్యతిరేకం మంటూ అప్పటి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రకటించారు. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని ఆయన అప్పటి యూపీఏ ప్రభుత్వానికి లేఖలు రాశారు. దాంతో టీఆర్ఎస్ మెదక్ ఉప ఎన్నికలల్లో తెలంగాణ వ్యతిరేకి అయిన జగ్గారెడ్డిని ఎలా బరిలోకి దింపుతారంటూ బీజేపీని ప్రశ్నించింది. మెదక్ ఉప ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య రసవత్తరమైన పోరు జరుగుంది. దాంతో ఆయా పార్టీల నాయకులు ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు సంధించుకుంటున్నారు. -
కాంగ్రెస్ సీనియర్ నేతలకు సోనియా ఫోన్
మెదక్ లోక్‌సభ ఉప ఎన్నికలపై తెలంగాణ కాంగ్రెస్ కీలక నేతలకు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఫోన్ చేశారు. కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ ఎన్నికల్లో పోటీచేస్తున్న మాజీమంత్రి సునీతా లక్ష్మారెడ్డితో పాటు తెలంగాణ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య, జానారెడ్డి, డి.శ్రీనివాస్, దామోదర రాజనరసింహ, గీతారెడ్డి తదితర సీనియర్ నాయకులకు ఆమె ఫోన్లు చేశారు. మెదక్ ఉప ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవాలని, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీయే ఇచ్చిందన్న వాస్తవాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని ఈ సందర్భంగా ఆమె సీనియర్ నాయకులందరికీ చెప్పారు. కాంగ్రెస్ నాయకులంతా ఐక్యంగా పార్టీ విజయం కోసం కృషి చేయాలన్నారు. ఈ విషయమై పార్టీ అభ్యర్థిని సునీత, టీ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్యలకు ప్రత్యేక సూచనలు కూడా చేసినట్లు సమాచారం. -
రాజుకున్న రాజకీయ సెగ!
మెదక్ ఉప ఎన్నిక నేపథ్యంలో మళ్లీ ఎన్నికల వేడి రాజుకుంది. మెదక్ ఎంపీ సీటుకు ఉప ఎన్నిక జరగనున్న నేపథ్యంలో ప్రధాన పార్టీల నాయకులు తమ నోటికి పనిచెబుతున్నారు. పరస్పర విమర్శనాస్త్రాలు, ఆరోపణలతో రాజకీయ వాతావరణంలో సెగ రాజేశారు. నువ్వొకటంటే నేను రెండంట తీరుగా తిట్టుకుంటున్నారు. మెదక్ బరిలో నిలిచిన టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ నేతలు తమ ప్రత్యర్థులపై మాటల దాడులు ఆరంభించారు. బీజేపీ, టీడీపీ నాయకులను మంత్రి నాయిని నరసింహారెడ్డి ఏకిపారేశారు. జగ్గారెడ్డి సన్యాసి, రేవంత్ రెడ్డి ఒక బచ్చా అంటూ తనదైన శైలిలో ధ్వజమెత్తారు. పార్టీలో సభ్యత్వం లేని జగ్గారెడ్డికి టికెట్ ఎలా ఇచ్చారని ఎంపీ కవిత ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ ను తెలంగాణ ప్రజలు ఇప్పటికే బండకేసి కొట్టారని అన్నారు. అద్వానీ వంటి వారిని వెళ్లగొట్టి జగ్గారెడ్డి లాంటి వాళ్లను బీజేపీలో చేర్చకుంటున్నారని హరీష్‌రావు ఎద్దేవాచేశారు. అభ్యర్థి దొరక్కే జగ్గారెడ్డిని నిలబెట్టారని ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ ఎత్తిపొడిచారు. బీజేపీ దిగజారుడుతనానికి ఇది నిదర్శమంటూ కాంగ్రెస్ ఎంపీ వి. హనుమంతరావు- టీఆర్ఎస్ నేతలతో శృతి కలిపారు. కేసీఆర్, కేటీఆర్ వందల కోట్ల రూపాయల వసూళ్లకు పాల్పడుతున్నారంటూ టీడీపీ నేత రేవంత్ రెడ్డి తీవ్రారోపణలు చేశారు. కేసీఆర్ కు కరెక్ట్ మొగుణ్ని తానేనంటూ టీఆర్ఎస్ నేతలకు కౌంటర్ ఇచ్చారు జగ్గారెడ్డి. గత జనరల్ ఎన్నికల్లో పార్టీన మారిన కొండా సురేఖ, మైనంపల్లి హన్మంతరావుకు టీఆర్ఎస్ టికెట్లు ఎలా ఇచ్చారని లాజిక్ లాగారు. జగ్గారెడ్డి పార్టీ మారినంత మాత్రాన కాంగ్రెస్‌కు వచ్చిన నష్టమేమీ లేదని సునీతా లక్ష్మారెడ్డి వ్యాఖ్యానించారు. నేతలు మాటలు ఇంకా ఎంత దూరం పోతాయే చూడాలి. -
'ప్రభుత్వం ఒళ్లు దగ్గరపెట్టుకుని పనిచేయాలి'
మెదక్: తెలంగాణలో రైతులను ఆదుకోవడంలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి ఆరోపించారు. శుక్రవారం మెదక్ వచ్చిన ఆయన మాట్లాడుతూ... నిరంతర విద్యుత్ కోతలతో అటు రైతులను, ఇటు ప్రజలను టీఆర్ఎస్ ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుందని విమర్శించారు. ప్రభుత్వం ఒళ్లు దగ్గర పెట్టుకుని పని చేయాలని ఆయన టీఆర్ఎస్ ప్రభుత్వానికి హితవు పలికారు. మెదక్ ఉప ఎన్నికల్లో బీజేపీకి ఎట్టిపరిస్థితుల్లో మద్దతు ఇచ్చేది లేదని కుండ బద్దలు కొట్టి చెప్పారు. ఏ పార్టీకి మద్దతు ఇవ్వాలో పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. దళితులకు మూడెకరాల భూమి ఇస్తామని చెప్పిన టీఆర్ఎస్ పార్టీ మండలానికో నియోజకవర్గానికి ఒకరికి ఇచ్చి చేతులు దులుపుకుందని ఆరోపించారు. అలాకాకుండా హరిజనులు, గిరిజనులకు మూడెకరాల భూమిని ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేదంటూ వామపక్ష పార్టీలన్నీ ఏకమై పోరాటం చేస్తామని చాడ వెంకట్‌రెడ్డి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అయితే టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు, మంత్రి హరీష్ రావు వామపక్ష పార్టీల నేతలైన చాడ, తమ్మినేనిలను కలసి తమ పార్టీకి మద్దతు ఇవ్వాలని ఈ రోజు ఉదయమే కలసి కోరిన సంగతి తెలిసిందే. -
ఉప ఎన్నికకు మద్దతు కూడగడుతున్న టీఆర్ఎస్
హైదరాబాద్: మెదక్ ఉప ఎన్నికల్లో తమదే గెలుపు అని చెబుతున్న టీఆర్ఎస్.. ఆ దిశగా వివిధ పార్టీల మద్దతు కూడగట్టేందుకు సమాయత్తమైంది. అందులోభాగంగా శుక్రవారం హైదరాబాద్‌లో వామపక్షాలు సీపీఐ, సీపీఎం కార్యదర్శలు చాడా వెంకట్ రెడ్డి, తమ్మినేని వీరభద్రంతో టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత, భారీ నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీష్ రావు భేటీ అయ్యారు. లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీకి మద్దతు ఇవ్వాలని హరీష్ రావు వారికి విజ్ఞప్తి చేశారు. ఈ అంశంపై పార్టీ నాయకత్వంతో మాట్లాడి తమ నిర్ణయాన్ని ప్రకటిస్తామని చాడా వెంకటరెడ్డి, తమ్మినేని వీరభద్రం వెల్లడించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో గజ్వేల్ శాసనసభ, మెదక్ పార్లమెంట్ స్థానాల నుంచి టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ పోటీ చేసి విజయం సాధించారు. అయితే తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ బాధ్యతలు స్వీకరించడంతో మెదక్ పార్లమెంట్ స్థానానికి ఆయన రాజీనామా చేశారు. దాంతో ఆ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. ఆ ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీంతో టీఆర్ఎస్ తమ పార్టీ అభ్యర్థిగా కొత్త ప్రభాకర్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డిలను బరిలోకి దింపాయి. అలాగే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి రాత్రికిరాత్రే బీజేపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డిని తమ పార్టీ అభ్యర్థిగా రంగంలోకి దింపింది. అయితే బీజేపీకి టీడీపీ మద్దతు ఇస్తున్న సంగతి తెలిసిందే. -
జగ్గారెడ్డికి ఏ లెక్కన టికెట్ ఇచ్చారు?: కవిత
పవన్‌కల్యాణ్‌ను ప్రజలు ఇప్పటికే బండకేసి కొట్టారని వ్యాఖ్య సాక్షి, హైదరాబాద్: మెదక్ ఉప ఎన్నికల్లో బీజేపీ తరఫున జగ్గారెడ్డికి ఏ లెక్కన టికెట్ ఇచ్చారో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి సమాధానం చెప్పాలని టీఆర్ఎస్ ఎంపీ కవిత డిమాండ్ చేశారు. ‘మా పార్టీ తరఫున పోటీ చేస్తున్న ప్రభాకర్‌రెడ్డి 2009 నుంచి పార్టీలో ఉన్నారు. మరి జగ్గారెడ్డి ఎప్పటినుంచి బీజేపీలో ఉన్నారు. మొన్నటి వరకు కాంగ్రెస్‌లో ఉన్న జగ్గారెడ్డికి మీరు టికెట్ అమ్ముకున్నారని అనుకోవచ్చా?’ అని ప్రశ్నించారు. టీడీపీ, బీజేపీ అభ్యర్థికి మద్దతుగా పవన్ కల్యాణ్ ప్రచారం చేస్తారని అంటున్నారని ప్రశ్నించగా, పవన్‌ని ఇప్పటికే ప్రజలు బండకేసి కొట్టారన్నారు. -
'సునీతా లక్ష్మారెడ్డి బలమైన నేత'
హైదరాబాద్: మెదక్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులతో పోలిస్తే తమ పార్టీ అభ్యర్థి సునీతా లక్ష్మారెడ్డి బలమైన నేత అని కాంగ్రెస్ ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ అన్నారు. మెదక్ ఉప ఎన్నికలపై చర్చించేందుకు తెలంగాణ కాంగ్రెస్ నేతలు గురువారం గాంధీభవన్ లో సమావేశమయ్యారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కీలక నేతలకు ప్రచార బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించామని షబ్బీర్ అలీ చెప్పారు. ఎన్నిక ముగిసే వరకు నేతలు మండలాల్లోనే మకాం వేస్తారని తెలిపారు. టీఆర్ఎస్ తరపున కొత్త ప్రభాకర్ రెడ్డి, బీజేపీ నుంచి జగ్గారెడ్డి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. -
వృద్ధ పార్టీ ఉనికి ఆశలు!
స్వాతంత్ర్యం పూర్వం నుంచి ఉన్న వృద్ధ పార్టీ నూతన ఆంధ్రప్రదేశ్ లో ఉనికి కోసం పాకులాడుతోంది. తెలుగువారి ఆదరణ కరువడడం, అటు కేంద్రంలోనూ పవర్ పోవడంతో కాంగ్రెస్ పార్టీ కుదేలయింది. హస్తం పార్టీ విభజన వ్యూహాన్ని తెలుగువారు తిప్పికొట్టడంతో దిక్కులేని పరిస్థితిలో పడిపోయింది. ఆంధ్రప్రదేశ్ లో అయితే అడ్రస్ లేకుండా పోయింది. విభజనతో తెలంగాణలో పాగా వేద్దామనుకున్నా పాచిక పారలేదు. దీంతో రెంటికి చెడ్డ రేవడిలా తయారైంది కాంగీయుల పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ లో ప్రాతనిథ్యం కరువడంతో కాంగ్రెస్ ఇప్పుడు నందిగామ ఉప పోరుపై ఆశలు పెట్టుకుంది. ఈ ఒక్క సీటులోనైనా గెలిచి ఏపీలో తాము ఉనికిలో ఉన్నామనిపించుకోవాలని తలపోస్తోంది. ఇందుకోసం నందిగామ అసెంబ్లీ ఉప ఎన్నికల బరిలోకి దిగింది. బోడపాటి బాబూరావును అభ్యర్థిగా నిలిపింది. దీంతో ఇక్కడ ఎన్నిక అనివార్యం కానుంది. టీడీపీ నుంచి దివంగత ఎమ్మెల్యే తంగిరాల ప్రభాకరరావు కుమార్తె సౌమ్య బరిలో ఉన్నారు. గత ఎన్నికల్లో చాలా చోట్ల డిపాజిట్లు కూడా దక్కించుకోలేకపోయిన కాంగ్రెస్ నందిగామలో పాగా వేయాలని బలంగా కోరుకుంటోంది. ఇక తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన క్రేడిట్ తమదే కాబట్టి గంపగుత్తుగా ఓట్లు తమకే పడతాయని ఆశపడి భంగపడిన హస్తం పార్టీ ఇప్పుడు ఇప్పుడు మెదక్ ఉప ఎన్నికలోనూ పోటీకి దిగింది. మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డిని అభ్యర్థిగా నిలిపింది. టీఆర్ఎస్ ప్రభుత్వంపై వ్యతిరేకతే తమను గెలిపిస్తుందని తెలంగాణ కాంగీయులు కలలు కంటున్నారు. మరోపక్క గెలిచిన తమ నాయకులు 'కారు' ఎక్కకుండా కాపాడుకునేందుకు కాంగ్రెస్ తంటాలు పడుతోంది. ఇక మొన్న జరిగిన అసెంబ్లీ, సాధారణ ఎన్నికల్లో ఓటమికి బాధ్యత మీదంటే మీదంటూ ఇప్పటికీ కుమ్ములాడుకుంటున్న కాంగ్రెస్ నాయకులు మెదక్ లోనైనా చేయిచేయి కలుపుతారో, లేదో చూడాలి. -
'పవన్ కళ్యాణ్‌కి ఇప్పటికే దిమ్మ తిరిగింది'
హైదరాబాద్: మెదక్ పార్లమెంట్ నియోజకవర్గానికి జరుగుతున్న ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి ఎదురే లేదని ఆ పార్టీ నిజామాబాద్ ఎంపీ కె. కవిత అన్నారు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ భారీ మెజార్టీతో గెలుస్తుందని జోస్యం చెప్పారు. గురువారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్ లో కవిత విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీలో ఉన్న మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి... ఎన్ని రూపాయిలు ఇచ్చి బీజేపీ టిక్కెట్ కొనుకున్నాడో వెల్లడించాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డికి సవాల్ విసిరారు. అదికాక జగ్గారెడ్డి తరఫున కిషన్ రెడ్డి మాట్లాడటం విచిత్రంగా ఉందని ఎద్దేవా చేశారు. మాపై విమర్శలు చేస్తే సహించేది లేదని బీజేపీ, టీడీపీలను కవిత హెచ్చరించారు. టీడీపీ, బీజేపీల గెలువడం అనైతికమైనదని ఆమె అభివర్ణించారు. ఇప్పటికే ఆ రెండు పార్టీలను ప్రజలు తిరస్కరించారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ విధానాలు కాదు.... తెలంగాణ ప్రభుత్వ విధానాలే మెదక్ ఉప ఎన్నికల్లో తమ పార్టీని గెలిపిస్తాయని చెప్పారు. హైదరాబాద్ నగరంలో గవర్నర్ గిరికి వ్యతిరేకంగా పోరాడిన ఘనత తమదేనని కవిత వెల్లడించారు. పవర్‌స్టార్ పవన్ కల్యాణ్‌కు దిమ్మదిరిగే ఫలితాలు ఇప్పటికే తెలంగాణ ప్రజలు ఇచ్చారని కవిత గుర్తు చేశారు. మెదక్ ఉప ఎన్నికల్లో బీజేపీ, టీడీపీలకు పవన్ కల్యాణ్ ప్రచారం చేస్తారని విలేకరి అడిగిన ఓ ప్రశ్నకు కవిత సమాధానం చెబుతూ... తెలంగాణలో ఆయన ప్రచారం చేసిన వచ్చిన సీట్లు ఎన్నో ఆయా పార్టీలకే తెలియాలి. గత ఎన్నికల్లో వచ్చిన ఫలితాలతో ఆయనకు ఇప్పటికే దిమ్మదిరిగిందని కవిత తెలిపారు. మరో ప్రశ్నకు సమాధానంగా టీడీపీని పట్టంచుకోవాల్సిన అవసరం లేదని ఆమె అన్నారు. -
జగ్గారెడ్డి, ప్రభాకర్ రెడ్డి నామినేషన్లు దాఖలు
హైదరాబాద్: మెదక్ లోక్‌సభ స్థానానికి ప్రధాన పార్టీల అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్లు వేయడానికి చివరి రోజైన బుధవారం ఎన్నికల వాతావరణం ఊపందుకుంది. టీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి సునీతా లక్ష్మారెడ్డి నామినేషన్లు వేశారు. బీజేపీ అభ్యర్థిగా మాజీ విప్ జగ్గారెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. జగ్గారెడ్డి ఇదే రోజు కాంగ్రెస్ పార్టీని వీడి టీడీపీ మద్దతుతో బీజేపీ టికెట్ దక్కించుకున్నారు. -
మెదక్ బీజేపీ లోక్‌సభ అభ్యర్థిగా జగ్గారెడ్డి
-
మెదక్ బీజేపీ లోక్‌సభ అభ్యర్థిగా జగ్గారెడ్డి
హైదరాబాద్ : మెదక్ బీజేపీ లోక్‌సభ అభ్యర్థిగా తూర్పు జయప్రకాష్ రెడ్డిని ఆపార్టీ అధికారికంగా ప్రకటించింది. అంతకు ముందు అంజిరెడ్డి పేరు ఖరారు అయినట్లు వార్తలు వెలువడినా .... స్పష్టమైన ప్రకటన వెలువడలేదు. తాజాగా సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్ రెడ్డి పేరు తెరమీదకు వచ్చింది. ఈనేపథ్యంలో ఆయన బుధవారం తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డితో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆయన ఈరోజు మధ్యాహ్నం నామినేషన్ దాఖలు చేయనున్నారు. జగ్గారెడ్డి నామినేషన్ కార్యక్రమానికి తెలంగాణ టీడీపీ నేతలు కూడా హాజరు కానున్నారు. గతంలో ఆయన బీజేపీలో పనిచేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ తాను మొదటి నుంచి బీజేపీ వ్యక్తినేనని, ఏబీవీపీ నుంచే క్రియాశీలక కార్యకర్తగా పనిచేసినట్లు తెలిపారు. మరోవైపు జగ్గారెడ్డి పేరు అనూహ్యంగా తెరమీదకు రావటంతో మెదక్ జిల్లాలో బీజేపీ నేతల నుంచి అసంతృప్తి వ్యక్తం అవుతోంది. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైన ఆయనను ఎంపీ అభ్యర్థిగా ఎంపిక చేయటంపై నేతలు అసంతృప్తితో ఉన్నారు. -
మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్ధిగా అంజిరెడ్డి
హైదరాబాద్ :మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్ధిగా అంజిరెడ్డి. ఆయనకు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మారికాసేపట్లో బీఫారమ్ అందచేయనున్నారు. ఈరోజు మధ్యాహ్నం అంజిరెడ్డి నామినేషన్ వేయనున్నారు. ఇక టీఆర్ఎస్ నుంచి కొత్త ప్రభాకర్ రెడ్డి, కాంగ్రెస్ తరపున మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి బరిలో దిగుతున్నారు. కాగా మెదక్ ఉప ఎన్నికను కాంగ్రెస్ అధిష్టానం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిని ఎలాగైనా గెలిపించి సత్తా చాటాలని భావిస్తోంది. రాష్ట్ర కాంగ్రెస్ నాయకులంతా ఉప ఎన్నిక పూర్తయ్యే వరకు మెదక్‌లోనే మకాం పెట్టేలా వ్యూహం సిద్ధం చేసింది. అసెంబ్లీ నియోజకవర్గానికో మాజీమంత్రి, మండలానికో ఎమ్మెల్యే, గ్రామానికో ప్రజా ప్రతినిధి చొప్పున పార్లమెంట్ పరిధిలో 2 వేల మందికిపైగా నేతలు పాగా వేసేలా ప్రణాళికను రూపొందించింది. -
'బలమైన అభ్యర్ధిని బరిలోకి దింపుతున్నాం'
హైదరాబాద్: మెదక్ లోక్‌సభకు జరుగుతున్న ఉప ఎన్నిలలో అభ్యర్థిగా బరిలోకి దిగాలని పలువురు కాంగ్రెస్ నేతలు ఆశించినప్పటికీ... బలమైన అభ్యర్థిగా సునీత లక్ష్మారెడ్డిని రంగంలోకి దింపుతున్నామని టీ.పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య తెలిపారు. బుధవారం గాంధీ భవన్లో సునీత లక్ష్మారెడ్డికి పార్టీ భీ ఫారం అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... ఉప ఎన్నికల్లో సునీత తప్పకుండా విజయం సాధిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా తాత్సారం చేస్తుందని ఆయన ఆరోపించారు. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం ద్వారా టీఆర్ఎస్కు ప్రజలే గుణపాఠం చెబుతారని చెప్పారు. -
మెదక్ సీటుకు ప్రభాకర్‌రెడ్డి పేరు ఖరారు
-
కొత్త ప్రభాకర్‌రెడ్డి పేరు ఖరారు
హైదరాబాద్: మెదక్ లోక్‌సభ స్థానానికి టీఆర్ఎస్ అభ్యర్థిగా కొత్త ప్రభాకర్‌రెడ్డి పేరు ఖరారు చేశారు. తీవ్ర తర్జనభర్జనల తర్వాత ప్రభాకర్‌రెడ్డి పేరును టీఆర్ఎస్ ప్రకటించింది. బుధవారం ఉదయం 09:09 గంటలకు సంగారెడ్డిలో ప్రభాకర్ రెడ్డి నామినేషన్ వేయనున్నారు. దేవీప్రసాద్, కె.భూపాల్ రెడ్డి, ప్రవీణ్ రెడ్డి పరిశీలనకు వచ్చినా టీఆర్ఎస్ పార్టీ పెద్దలు ప్రభాకర్‌రెడ్డివైపే మొగ్గు చూపారు. ఉద్యమ సమయంలో ప్రభాకర్‌రెడ్డి టీఆర్ఎస్కు వెన్నుదన్నుగా నిలిచారు. దుబ్బాక నియోజకవర్గానికి చెందిన ప్రభాకర్‌రెడ్డి గత ఎన్నికల్లో దుబ్బాక ఎమ్మెల్యే పోటీ చేయాలని భావించినా టికెట్ దక్కలేదు. ఇప్పుడు ఏకంగా ఎంపీ టిక్కెట్ దక్కించుకోవడం విశేషం. సెప్టెంబర్ 13న మెదక్ ఉప ఎన్నిక జరగనుంది. -
మెదక్ ఉపఎన్నికకు టిడిపి-బిజెపి ఉమ్మడి అభ్యర్థి
-
'రెండు మూడు రోజుల్లోనే అభ్యర్ధి ఎంపిక'
హైదరాబాద్: మెదక్ ఎంపీ స్థానానికి రెండు మూడు రోజుల్లోనే అభ్యర్ధి ఎంపిక పూర్తవుతుందని మాజీ మంత్రులు గీతారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి తెలిపారు. అభ్యర్థిని ఎంపిక చేసేందుకు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అధ్యక్షతన ఓ హోటల్లో బుధవారం మెదక్ జిల్లా కాంగ్రెస్ నేతలు సమావేశమ్యయారు. పోటీకి చాలా మంది ఆసక్తిగా ఉన్నారని, వారి పేర్లను హైకమాండ్‌కు నివేదిస్తామని గీతారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి తెలిపారు. టీఆర్ఎస్ హామీలు అమలు కాకపోవడం కాంగ్రెస్‌కు అనుకూలంగా మారనుందని తెలిపారు. అభ్యర్ధి ఎవరైనా జిల్లా కాంగ్రెస్ నేతలంతా పార్టీ గెలుపు కోసం ఐక్యంగా కృషి చేస్తామని చెప్పారు. -
మెదక్ లోకసభ టికెట్ రేసులో నేనున్నా: సర్వే
హైదరాబాద్: మెదక్ పార్లమెంట్ ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు కాంగ్రెస్ నేతల్లో రేసు మొదలైంది. మెదక్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసేందుకు కాంగ్రెస్ నేతలు తహతహలాడుతున్నారు. ఇప్పటికే ఈ రేసులో మాజీ కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి, మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ పోటికి సిద్దంగా ఉన్నామంటూ అధిష్టానానికి సంకేతాలిచ్చారు. అయితే తాజాగా మల్కాజిగిరి లోకసభ స్థానంలో ఓటమి పాలైన మాజీ కేంద్రమంత్రి సర్వే సత్యనారాయణ కూడా మెదక్ లో పోటీ చేసేందుకు ఉత్సాహంగా ఉన్నారు. మెదక్ లోక్‌సభ కాంగ్రెస్ టికెట్ రేసులో నేనున్నా అంటూ సర్వే సత్యనారాయణ బుధవారం ప్రకటించారు. హైకమాండ్ టికెట్ ఇస్తే పోటీ చేస్తానని మాజీ మంత్రి సర్వే అన్నారు. -
ఆ టికెట్ ఎవరిదో?
మెదక్ ఉప ఎన్నికల బరిలో నిలిచేందుకు ఆశావాహులు సన్నాహాలు మొదలుపెట్టారు. ప్రధాన పార్టీల తరపున పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నవారు తమ తమ స్థాయిలో పైరవీలు మొదలుపెట్టారు. ఈ క్రమంలో అన్ని పార్టీల్లో పలువురు పేర్లు తెరపైకి వస్తున్నాయి. వీరిలో ఉద్యోగ సంఘాలు, ఉద్యమ నాయకులు, కోటీశ్వరులు ఉండడం గమనార్హం. కాంగ్రెస్ తరపున పోటీ చేసేందుకు మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ సముఖత వ్యక్తం చేశారు. తన అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల పర్యవేక్షకుడు దిగ్విజయ్ సింగ్ ను ఆయన కోరినట్టు తెలిసింది. అయితే టీఆర్ఎస్ను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాంను నిలిపితే ఎలా ఉంటుందనే దానిపై కాంగ్రెస్ పార్టీ యోచనలు చేస్తోంది. ఒకవేళ పోటీకి కోదండరాం నిరాకరిస్తే కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డిని హస్తం పార్టీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక టీఆర్ఎస్ పార్టీ తరపున పోటీ చేసేందుకు తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ సెంట్రల్ అసోసియేషన్ (టీఎన్జీఓస్) అధ్యక్షుడు జి. దేవీప్రసాదరావు ముందుకు వచ్చారు. సోనీ ట్రావెల్స్ అధినేత కే. ప్రభాకర్ రెడ్డి, మహిధర కన్స్ట్రక్షన్స్ ప్రమోటర్ ప్రశాంత్ రెడ్డి పేర్లు కూడా వినబడుతున్నాయి. మల్కాజ్‌గిరిలో పోటీ చేసి ఓడిపోయిన మైనంపల్లి హనుమంతరావు కూడా మెదక్ ఎంపీ సీటు ఆశిస్తున్నట్టు సమాచారం. కేసీఆర్ సింగపూర్ నుంచి వచ్చిన తర్వాత అభ్యర్థి ఎవరనేది తేలనుంది. ఇక ఎన్డీఏ అభ్యర్థిగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి పేరు వినబడుతోంది. ఎం రఘనందన్ కూడా ఆశావహుల లిస్టులో ఉన్నారు. సెప్టెంబర్ 13న జరగనున్న మెదక్ ఉప ఎన్నికలో ఎవరెవరు బరిలో ఉంటారనేది మరికొద్ది రోజుల్లో స్పష్టత వస్తుంది. -
'కిషన్‌రెడ్డివి ఉప ఎన్నిక రాజకీయాలు'
హైదరాబాద్: బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షడు, ఎమ్మెల్యే జి.కిషన్‌రెడ్డి టీఆర్ఎస్ పార్టీపై చేస్తున్న విమర్శలను ఆ పార్టీ ఎమ్మెల్యేలు బాలరాజు, దివాకర్‌రావులు తిప్పుకోట్టారు. శుక్రవారం హైదరాబాద్‌లో విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... టీఆర్ఎస్ పార్టీపై కిషన్‌రెడ్డి అనుసరిస్తున్న వైఖరీపై మండిపడ్డారు. మెదక్ ఉప ఎన్నిక దృష్టిలో పెట్టుకుని ఆయన ఇలాంటి రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వమే ఉన్నా తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతుందని... అయినా ఆయన ఏ రోజు స్పందించలేదని కిషన్ రెడ్డిపై వారు విరుచుకుపడ్డారు. తెలంగాణలో బేజేపీ ఉనికి కోల్పోతోందని తెలిపారు. కేవలం రాజకీయ లబ్ది కోసమే అనవసరంగా కిషన్‌రెడ్డి రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణ ప్రజలు బీజేపీని తిరస్కరిస్తున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బాలరాజు, దివాకర్‌రావులు అన్నారు. -
టీఆర్ఎస్లో నరకం చూపారు: విజయశాంతి
మెదక్: ఓటమి భయంతోనే కేసీఆర్ మహబూబ్‌నగర్ నుంచి మెదక్ పార్లమెంట్ స్థానానికి వచ్చారని మెదక్ అసెంబ్లీ అభ్యర్థి, ఎంపీ విజయశాంతి విమర్శించారు. బుధవారం మెదక్ అసెంబ్లీ స్థానానికి నామినేషన్ వేసిన అనంతరం పట్టణంలోని జీకేఆర్ గార్డెన్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ టీఆర్ఎస్ నాయకులపై మండిపడ్డారు. టీఆర్ఎస్ దోపిడి దొంగల పార్టీ, మోసం చేయడం వారినైజం, కేసీఆర్ మాటల మరాఠి, ఆయనకు అధికారం అప్పగిస్తే కుటుంబ పాలనే కొనసాగిస్తారని తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు. టీఆర్ఎస్లో జరుగుతున్న విషయాలు బయట పెడితే ఇక్కడి ప్రజలు వారిని తరిమి కొడతారని తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. చాలా మంది మంత్రి పదవుల కోసం రాజకీయాల్లోకి వచ్చి నానా గడ్డి తింటున్నారని, తాను మాత్రం తెలంగాణ వచ్చే వరకు మంత్రి పదవి ఆశించలేదని పేర్కొన్నారు. తన జీవితం ప్రజలకోసమే అంకితం చేస్తున్నానని ప్రకటించారు. ఈ నియోజకవర్గ ప్రజలే నా కుటుంబీకులని చెప్పారు. రాములమ్మ అంటే టీఆర్ఎస్కు భయమని పేర్కొన్నారు. ఐదేళ్లు టీఆర్ఎస్లో నరకం చూపారని, అయినా ప్రజల కోసం అన్ని అవమానాలు భరించానన్నారు. కేసీఆర్ అధికారంలోకి వస్తే తెలంగాణకు పరిశ్రమలు రావన్నారు. బీజేపీ మోడి పేరుతో ప్రజలను మోసం చేస్తుందన్నారు. తెలంగాణలో సైకిల్ పంక్చరైందని ఎద్దేవా చేశారు. తాను మెదక్ పట్టణంలో ఇల్లు కట్టుకొని ప్రజల మధ్యనే ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ప్రకటించారు. మెదక్ జిల్లా కేంద్రం ఏర్పాటు చేసేందుకు అలుపెరగని పోరాటం చేస్తానని చెప్పారు. -
విజయశాంతి, వీహెచ్ లకు అసెంబ్లీ టిక్కెట్లు
న్యూఢిల్లీ: తెలంగాణలో శాసనసభ స్థానాలకు ఖరారైన అభ్యర్థుల్లో ఇద్దరు ఎంపీలున్నారు. విజయశాంతి, వి. హన్మంతరావులకు అసెంబ్లీ టిక్కెట్లు ఇచ్చారు. విజయశాంతికి మెదక్, హన్మంతరావుకు అంబర్‌పేట స్థానాలు కేటాయించారు. ముగ్గురు ఎమ్మెల్సీలు డి. శ్రీనివాస్, షబ్బీర్ అలీ, నంది ఎల్లయ్య శాసనసభ సమరంలో నిలిచారు. యూత్ కాంగ్రెస్ కోటాలో ముగ్గురికి టికెట్లు దక్కాయి. ఆదిలాబాద్ నుంచి భార్గవ్‌దేశ్ పాండే, కల్వకుర్తి నుంచి వంశీచంద్‌రెడ్డి, భువనగిరి నుంచి పి.వెంకటేశ్వర్లు పేర్లు ఖరారు చేశారు. 111 మంది అభ్యర్థులతో తెలంగాణలో కాంగ్రెస్ ఖరారు చేసిన జాబితాలో బీసీలకు 33, మైనార్టీలకు 4, ఎస్సీలకు19, ఎస్టీలకు 9 సీట్లు కేటాయించారు. -
మెదక్ అసెంబ్లీ నుంచి రాములమ్మ?
మెదక్, న్యూస్‌లైన్: కాంగ్రెస్ పార్టీ తరఫున మెదక్ అసెంబ్లీ నియోజకవర్గ టికెట్ ఆశిస్తున్న వారి జాబితాలో రాములమ్మ పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తుండడంతో ఆ పార్టీలో టిక్కెట్ కలకలం చెలరేగుతోంది. పార్టీ టిక్కెట్‌పై ఆశతో ఉన్న జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధి శశిధర్‌రెడ్డి వర్గీయులు స్థానిక వాదనకు తెరలేపుతున్నారు. టిక్కెట్ దక్కని పరిస్థితుల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసే అవకాశం ఉం దన్న సంకేతాలను పంపుతున్నారు. త్వరలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బుధవారం నోటిఫికేషన్ జారీ కానుంది. ఇదే సందర్భంలో ఈనెల 5 లోగా కాంగ్రెస్ జాబి తాను విడుదల చేస్తామని అధిష్టానం ప్రకటిం చింది. దీంతో మెదక్ సీటు ఎవరికి దక్కుతుం దన్నది స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. నెలరోజులుగా సాగుతున్న లాబీయింగ్ కాంగ్రెస్ తరఫున మెదక్ అసెంబ్లీ సీటుకోసం మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డి, పీసీసీ కార్యదర్శి సుప్రభాతరావు, డీసీసీ కార్యదర్శి పొతేదార్ మల్లన్న, రామాయంపేట మండల పార్టీ అధ్యక్షుడు పల్లె రాంచంద్రాగౌడ్లు పోటీపడుతున్నారు. వీరంతా నెలరోజులుగా ఎవరికి వారు లాబీయింగ్ చేస్తున్నారు. కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి, జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కార్, మాజీ మంత్రులు పొన్నాల లక్ష్మయ్య, జానారెడ్డి, డీసీసీ అధ్యక్షులు భూపాల్‌రెడ్డిల ద్వారా శశిధర్‌రెడ్డి ముమ్మర ప్రయత్నాలు చేసినట్లు సమాచారం. ఇక మెదక్ సీటు ఆశిస్తున్న పీసీసీ కార్యదర్శి సుప్రభాతరావు కూడా మాజీ డిప్యూటీ సీఎం దామోదర్ రాజనర్సింహ, మాజీ మంత్రులు గీతారెడ్డి, సునీతారెడ్డి, వి. హన్మంతరావుల ద్వారా టికెట్ దక్కించుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. డీసీసీ కార్యదర్శి పోతేదార్ మల్లన్న, రామాయంపేట మ ండల కాంగ్రెస్ అధ్యక్షుడు పల్లె రాంచంద్రాగౌడ్లు బీసీ కార్డుతో ప్రయత్నాలు చేశారు. ఇదే సమయంలో ఎంపీ విజయశాంతి కాంగ్రెస్పార్టీలోకి చేరారు. అయితే మెదక్ ఎంపీ స్థానానికి టీఆర్ఎస్ నుంచి కేసీఆర్ పోటీచేస్తారన్న ప్రచారం జరుగుతున్న సందర్భంలో విజయశాంతి మెదక్ ఎమ్మెల్యే స్థానాన్ని ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు మెదక్ ఎంపీ సీటా? లేదా ఎమ్మెల్యే సీటా? తేల్చుకోవాలంటూ అధిష్టానం కోరగా, ఆమె అసెం బ్లీకి వెళ్లేందుకే మొగ్గు చూపినట్లు సమాచారం. దీంతో ఎ మ్మెల్యే టికెట్ ఆశించిన సుప్రభాతరావు కూ డా విజయశాంతి అభ్యర్థిత్వానికి అనుకూలం గా వ్యవహరించినట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో మెదక్ మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డి వర్గీయులు మంగళవారం స్థానిక వాదనను తెరపైకి తెచ్చారు. ఇంత వరకు మెదక్ నియోజకవర్గం నుంచి స్థానికేతరులెవరూ గెలవలేదని, ఒకవేళ వారికి టికెట్ ఇస్తే మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. అవసరమైతే శశిధర్‌రెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతారనే సంకేతాలను పంపుతున్నారు. ఈ నేపథ్యంలోనే శశి ధర్‌రెడ్డి మంగళవారం ఢిల్లీవెళ్లి టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే మెదక్‌లోని ఎంపీ విజయశాంతి వర్గీయులు మాత్రం సీటు తమకే వస్తుందనే ధీమాతో ఎన్నికల ఏర్పాట్లకు నిమగ్నమవుతున్నారు. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ మెదక్ సీటు ఎవరికిస్తుందన్న టాపిక్ ఇప్పుడు మెదక్‌లో చర్చనీయాంశమైంది.