
'సెక్రటేరియట్ ను మెదక్ నుంచే నడిపారు'
హైదరాబాద్: బతుకమ్మ వేడుకలను తెలంగాణ సర్కార్ కేసీఆర్ కుటుంబ పండుగలా కాకుండా రాష్ట్ర వేడుకలా నిర్వహించాలని కాంగ్రెస్ నాయకురాలు, మాజీ మంత్రి డీకే అరుణ సూచించారు. తెలంగాణ రాష్ట్రాన్నిచ్చిన తమ పార్టీ అధినేత్రి సోనియా గాంధీని బతుకమ్మ వేడుకలకు సీఎం కేసీఆర్ ఆహ్వానించాలని అన్నారు.
కేసీఆర్ మూడు నెలల పాలనపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందని తెలిపారు. మెదక్ ఉప ఎన్నికలో గెలుపు కోసం సెక్రటేరియట్‌ను అక్కడి నుంచి నడిపారని ఆమె ఆరోపించారు.