dk aruna
-
DK Aruna: కులగణన సర్వేలో రాజకీయ ప్రస్తావన ఎందుకు?
-
రేవంత్‌ను ప్రజలు బహిష్కరిస్తారు: డీకే అరుణ
సాక్షి,హైదరాబాద్:బీసీలపై కాంగ్రెస్‌కు చిత్తశుద్ది లేదని ఎంపీ డీకే అరుణ అన్నారు. మంగళవారం(ఫిబ్రవరి 18) ఈ విషయమై డీకే అరుణ సాక్షి టీవీతో మాట్లాడారు.‘బీసీలపై ప్రేముంటే సీఎం పదవికి రేవంత్‌రెడ్డిని రాజీనామా చేయించి తెలంగాణకు బీసీని ముఖ్యమంత్రి చేయాలి.కులగణన సర్వేలో రాజకీయ ప్రస్తావన ఎందుకు ?కులగణనలో కుటుంబ వివరాలు మాత్రం ఇవ్వడానికి నేనే సిద్ధమే. ఇతర వివరాలు కావాలంటే నా ఎన్నికల అఫిడవిట్ చూసుకోండి. నన్ను సామాజిక బహిష్కరణ చేయడానికి రేవంత్ ఎవరు ?రేవంత్‌రెడ్డినే తెలంగాణ నుంచి బహిష్కరించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. రేషన్ కార్డులపై ఖచ్చితంగా ప్రధాని మోదీ ఫొటో పెట్టాల్సిందే’అని డీకే అరుణ స్పష్టంచేశారు. -
మోదీపై వ్యాఖ్యల ఎఫెక్ట్.. రేవంత్ మతి తప్పిందా?: డీకే అరుణ ఫైర్
సాక్షి, మహబూబ్‌నగర్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీజేపీ ఎంపీ డీకే అరుణ స్ట్రాంగ్ కౌంటరిచ్చారు. ముఖ్యమంత్రిగా ఉండి ప్రధాని మోదీ కులం గురించి మాట్లాడడానికి సిగ్గు అనిపించడం లేదా? అని ప్రశ్నించారు. రేవంత్ ఇంకా ప్రతిపక్షంలోనే ఉన్నానని అనుకుంటున్నారు. ఇదే సమయంలో రేవంత్‌ను లక్కీ లాటరీ సీఎం అని అంటూ సెటైరికల్ కామెంట్స్ చేశారు.ప్రధాని మోదీపై సీఎం రేవంత్ వ్యాఖ్యల విషయంలో ఎంపీ డీకే అరుణ స్పందించారు. ఈ క్రమంలో తాజాగా డీకే అరుణ మాట్లాడుతూ.. మిస్టర్ రేవంత్ రెడ్డినోరు జారితే ఊరుకోను. ప్రధాని మోదీ సామాజికవర్గం గురించి మాట్లాడే స్థాయి నీకు ఎక్కడిది. రేవంత్ రెడ్డికి మతి తప్పింది.. అందుకే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. ప్రజల్లో విశ్వాసాన్ని కోల్పోయి ఫస్ట్రేషన్లో ఇలా మాట్లాడుతున్నారు. ప్రజల దృష్టిలో మరల్చడానికి ఇలాంటి చిల్లర కామెంట్స్ చేస్తున్నాడు. ముఖ్యమంత్రిగా ఉండి ప్రధాని మోదీ కులం గురించి మాట్లాడడానికి సిగ్గు అనిపించడం లేదా?.నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే.. తెలంగాణలో రెండోసారి కులగణన ఎందుకు?. ముందు దీనికి సమాధానం చెప్పండి. మీకు చిత్తశుద్ధి లేదు కాబట్టే రెండోసారి కులగణన చేయాల్సి వస్తోంది. మిమ్మల్ని నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరు, బీసీలు లేరు, మీకు ఓట్లేసిన కార్యకర్తలు కూడా నమ్మడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎప్పుడు దింపేద్దామని ప్రజలే చూస్తున్నారు. ఇప్పటికైనా నీ స్థాయి ఏంటో తెలుసుకో రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రి స్థాయి మర్చిపోయి మాట్లాడుతున్నావ్. ఇంకా ప్రతిపక్షంలోనే ఉన్నారని అనుకుంటున్నారా?. అందుకే ఆయన భాష, ప్రవర్తన అలానే ఉంది.. ఇంకా మార్చుకోలేదు. నీలాగా అధికారం ఉందనే గర్వంతో రెచ్చిపోయినవాళ్లు ఇప్పుడు ఎక్కడున్నారో గుర్తుంచుకోవాలి. మాట తీరు మార్చుకో.. ముఖ్యమంత్రి కుర్చీకి గౌరవం ఇవ్వండి.ఢిల్లీ ప్రజలు కాంగ్రెస్‌కు గాడిద గుడ్డు ఇచ్చినా వీళ్ళకు ఇంకా అహంకారం తగ్గలేదు. మీకు దమ్ముంటే తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయండి. మీరు ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. ప్రధాని మోదీ దేశ ప్రతిష్టను నలుమూలల చాటుతుంటే ఆయనకు వస్తున్న ఆదరణ చూసి మీరు ఓర్వలేకపోతున్నారు. ఇప్పటికైనా మోదీని చూసి నేర్చుకోండి. పేదరికం నుంచి ప్రధాని వరకు ఆయన ఎలా పైకి వచ్చారో తెలుసుకోండి. రేవంత్.. నువ్వు ఈ స్థాయికి ఎలా వచ్చావో అందరికీ తెలుసు. నువ్వు లక్కీ లాటరీ సీఎం. కాంగ్రెస్ పార్టీకి దిక్కులేక నిన్ను సీఎం సీట్లో కూర్చోపెట్టింది. ఇవ్వన్నీ తెలుసుకోకుండా ప్రధాని మోదీ గురించి మాట్లాడితే ఊరుకునేది లేదు ఖబడ్దార్ అంటూ హెచ్చరించారు. -
‘బీసీ కులగణనలో ప్రభుత్వానికి చిత్త శుద్ధిలేదు’
మహబూబ్‌నగర్ దేశంలో కాంగ్రేస్ పార్టీ ప్రజల విశ్వాసం కోల్పోయిందని,ప్రతిపక్ష నేతగా రాహూల్ గాంధీ విఫలమయ్యారని మహబూబ్ నగర్ ఎంపీ,బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ మండిపడ్డారు.మహబూబ్‌నగర్ జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు డీకే అరుణ.ప్రదాని మోదీ అభివృద్ధి నమూనాను నమ్మి ఢిల్లీలో ప్రజలు బీజేపీని గెలిపించారని పొగిడిన డీకే అరుణ.. మాజీ సీఎం కేజ్రీవాల్ అవినీతిని ప్రజలు ఎండగెట్టారని విమర్శించారు.స్దానిక సంస్దల ఎన్నికల్లో లబ్దికోసం రాష్ట్ర ప్రభుత్వం రోజుకోమాట చెబుతుందని,రుణమాఫీ, రైతు భరోసా అమలులో ప్రభుత్వం విఫలమయ్యిందని,కాంగ్రెస్ ఆరు గ్యాంరెంటీలు అటకెక్కాయని ఆమె విమర్శించారు.ఇందిరమ్మ ఇళ్ల పేరు మార్చకుంటే కేంద్ర నిధులు ఇవ్వదని,ప్రధాని ఆవాజ్ యోజన పథకంలో ఆయన ఫోటో లేకుంటే కేంద్రం నిధులు ఎందుకిస్తుందని ఆమె ప్రశ్నించారు. ఏ పథకాలు అమలు చేయలేక స్ధానిక సంస్దల ఎన్నికలపై ప్రభుత్వం హాడావిడి చేస్తోందని ఈఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఓడిస్తేనే ఇచ్చిన హామీలు అమలవుతాయన్నారు స్ధానిక సంస్ధల ఎన్నికల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని,బీజేపీని బలపరచాలని పిలుపు నిచ్చారు. బీసీ కులగణనకు బీజేపీగాని,కేంద్రం గాని వ్యతిరేకం కాదని.చేసిన సర్వేలో చిత్తశుద్ది లోపించిందని లక్షలాది మంది వివరాలు కులగణనలో నమోదు కాలేదని డీకే అరుణ అన్నారు. -
ఢిల్లీ ఎన్నికల్లో ఆప్ అగ్రనేతల ఘోర పరాజయం
-
ఇదేం రాజకీయం.. తెలంగాణలో బీజేపీ బలమెంత?: జగ్గారెడ్డి
సాక్షి, హైదరాబాద్: బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తోందన్నారు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. భారత్ మాతాకీ జై అనే బీజేపీ నాయకులు.. భారతమాత కూతురు ప్రియాంకా గాంధీని తిడితే ఊరుకుంటారా? అని ప్రశ్నించారు. ఇదే సమయంలో తెలంగాణలో బీజేపీ బలమెంతా? అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.తాజాగా జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడుతూ..‘బీజేపీ నాయకులు ప్రియాంక గాంధీపై అనుచిత వాఖ్యలు చేయకపోతే బీజేపీ ఆఫీసుకి పోవాల్సిన అవసరం మాకేంటి?. మా ఇంటి ఆడబిడ్డలను తిడితే మనం ఊరుకుంటామా. ప్రియాంక గాంధీని తిడితే ఎందుకు ఊరుకోవాలి. మా యూత్ కాంగ్రెస్ నేతలు బీజేపీ ఆఫీసుకు పోవడాన్ని పీసీసీ చీఫ్ తప్పు పట్టారు. కాంగ్రెస్ నేతలు మా లైన్ దాటితే మేం పెద్ద మనసుతో సర్ది చెప్పుకున్నాం.కేంద్ర మంత్రి బండి సంజయ్ రెచ్చగొట్టేలా గాంధీ భవన్ వెళ్లి దాడి చేసి తగల పెట్టండి అని మాట్లాడుతున్నారు. బీజేపీ సంస్కారం ఏంటో, కాంగ్రెస్ సంస్కారం ఏంటో బయటపడింది. సెంట్రల్ మినిస్టర్స్ వాళ్ళ కార్యకర్తలకు సర్ది చెపుతారా? రెచ్చ గొడుతారా?. బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తోంది. భారత్ మాతాకీ జై అనే బీజేపీ నాయకులు భారతమాత కూతురు ప్రియాంకా గాంధీని తిడితే ఊరుకుంటారా?. మా వాళ్లని కొట్టడానికి బీజేపీ నాయకులు అంత పెద్ద తోపులా?. మా యూత్ కాంగ్రెస్ వాళ్లని ఎందుకు రెచ్చగొడుతున్నారు?. తెలంగాణలో బీజేపీ బలం ఎంత?. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులపై దాడి చేసేంత బలం బీజేపీకి ఉందా?. మేం మా కార్యకర్తలకు ఏం చెప్తున్నాం? మీరు మీ కార్యకర్తలకు ఏం చెప్తున్నారు?. ప్రియాంక గాంధీ చేసిన అనుచిత వ్యాఖ్యలకు బీజేపీ నాయకులు క్షమాపణ చెప్పాలి.డీకే అరుణ, రాజాసింగ్‌కు కౌంటర్..డీకే అరుణ తప్పుడు మార్గంలో వెళ్తున్నారు. ప్రియాంక గాంధీని అవమానించిన బీదూరిని డీకే అరుణ సమర్థిస్తారా? అని ప్రశ్నించారు. అలాగే, రాజాసింగ్‌కి బీజేపీ ఆఫీసులోకి ఎంట్రీనే లేదు. రాజాసింగ్ డైలాగులు కొట్టడం మానుకోవాలి. ఆయన కంటే పెద్ద డైలాగులు మేము కూడా కొట్టగలం. రాజాసింగ్ ఏమైనా మాట్లాడుకోవచ్చు.. కానీ, కాంగ్రెస్ పార్టీ, నేతలపై మాట్లాడుతా అంటే నడవదు’ అంటూ కామెంట్స్ చేశారు. -
‘ఇందిరమ్మ కమిటీలో అన్ని పార్టీలను భాగస్వామ్యం చేయాలి’
కొడంగల్(వికారాబాద్ జిల్లా): ప్రధాన మంత్రి అవస్ యోజన కింద ఇల్లు లేని పేదల కోసమ్ ఇళ్లను మంజూరు చేయడం జరిగిందని,. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల కోసం కేంద్ర ప్రభుత్వ నిధులను వాడుకుంటుందని విమర్శించారు బీజేపీ ఎంపీ డీకే అరుణ(DK Aruna). అమృత్ 2 పథకం ద్వారా నిధులు కేటాయింపుపై కొడంగల్ లో మాట్లాడిన ఆమె.. తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని తప్పుబట్టారు.నిరుపేదలు ఇళ్లు లేకుండా ఉండకూడదనేది కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని, కానీ ఇక్కడ కేంద్ర ప్రభుత్వానికి పేరు రాకుండా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. దీనిని తాను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నానని డీకే అరుణ స్పష్టం చేశారు. గతంలో కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఇలానే చేశారని ఆమె మండిపడ్డారు.పార్టీలకు అతీతంగా ఇళ్ల కేటాయింపు జరగాలి..గ్రామాల్లో ఇందిరమ్మ కమిటీలు వేశారని, అందులో కేవలం కాంగ్రెస్ పార్టీ వారినే పరిమితం చేయొద్దన్నారు. ఈ కమిటీల్లో అన్ని పార్టీలను భాగస్వామ్యం చేయాలని ఆమె డిమాండ్ చేశారు. గ్రామాల్లో ఎవరైతే నీడలేని పేద ప్రజలు ఉంటారో అలాంటి వారికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. రాష్ట్రంలో ఇల్లు లేని పేద ప్రజలు ఉండకూడదని, పార్టీలకు అతీతంగా ఇళ్ల కేటాయింపు జరగాలన్నారు డీకే అరుణ.జనాభా ఆధారంగానే అమృత్ 2 పథకం నిధులుఅమృత్ 2 పథకం(amrut 2 scheme) కింద దేశంలోని అన్ని మున్సిపాలిటీలకు నిధులు మంజూరు చేయడం జరిగిందన్నారు డీకే అరుణ. ఈ పథకం ద్వారా మున్సిపాలిటీలో ఉన్న తాగునీటి సమస్య పరిష్కారం కోసం ఈ నిధులు వాడుకోవచ్చన్నారు. కొడంగల్ మున్సిపాలిటీకి కూడా రూ. 4.50 కోట్లు మంజూర చేయడం జరిగిందని, మున్సిపాలిటీలో ఉన్న జనాభా ఆధారంగా చేసుకొనే నిధులను విడుదల చేయడం జరిగిందని ఆమె స్పష్టం చేశారు. ప్రతి గ్రామం, పంచాయతీ, మున్సిపల్ పట్టణాలు అభివృద్ధి చెందాలన్నదే ప్రధాని నరేంద్ర మోదీ ఉద్దేశమని, అందులో భాగంగా ఎన్ఆర్ఈజీఎస్(NREGS) పథకం ద్వారా సీసీ రోడ్డు, రైతు వేదికలు, వైకుంఠధామాలు ఇవ్వడం జరిగిందన్నారు. -
కిమ్స్ లో శ్రీతేజ్ ను పరామర్శించిన డీకే అరుణ
-
అల్లు అర్జున్ ఇంటిపై దాడిని ఖండిస్తున్నా: ఎంపీ డీకే అరుణ
-
ఫార్ములా ఈ-కేసు..డీకే అరుణ కీలక వ్యాఖ్యలు
సాక్షి,హైదరాబాద్:ఫార్ములా ఈ కార్ రేసుల కేసుపై బీజేపీ ఎంపీ డీకే అరుణ స్పందించారు. ఈ విషయమై డీకే అరుణ సోమవారం(డిసెంబర్23) సాక్షి టీవీతో ప్రత్యేకంగా మాట్లాడారు. ‘ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) కేసుకు బీజేపీకి సంబంధం ఏంటి ?ఈ కార్ రేసుల కేసులో ఈడీ తన పని తాను చేస్తోంది. హీరో అల్లు అర్జున్ విషయాన్ని రాజకీయంగా కావాలని రచ్చ చేస్తున్నారు. అల్లు అర్జున్ ఇంటిపై దాడిని ఖండిస్తున్నా. ఈ విషయంలో ఎంఐఎం,కాంగ్రెస్ ఒక్కటై అసెంబ్లీలో అక్బరుద్దీన్ ఒవైసీతో సీఎం రేవంత్‌రెడ్డి కావాలని ప్రశ్న అడిగించారు’అని డీకే అరుణ చెప్పారు. ఇదీ చదవండి: కేటీఆర్‌కు త్వరలో నోటీసులు..? -
రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏడాది పాలన అన్ని రంగాల్లో పూర్తిగా ఫెయిల్: అరుణ
-
బీజేపీ నేతల లగచర్ల పర్యటనలో ఉద్రిక్తత
-
డీకే అరుణ లగచర్ల పర్యటనలో ఉద్రిక్తత
సాక్షి,వికారాబాద్‌జిల్లా:మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ సోమవారం(నవంబర్ 18) చేపట్టిన లగచర్ల పర్యటనలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. డీకే అరుణ పర్యటనను మొయినాబాద్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల తీరుపై డీకే అరుణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా డీకేఅరుణ మాట్లాడుతూ‘తెలంగాణలో ప్రజాస్వామ్యం ఉందా చచ్చిపోయిందా..? ఒక ఎంపీ గా ఉన్న నన్ను నా నియోజకవర్గంలో తిరగనివ్వరా..? కొడంగల్ రేవంత్ రెడ్డి జాగిరా..?ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ మా రైతులను కొడుతున్నారు. నా నియోజకవర్గంలోకి వెళ్లనీయకుండా నన్ను అడ్డుకుంటారా’అని డీకేఅరుణ ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా పోలీస్ జులుం నశించాలంటూ బీజేపీ నేతలు నినాదాలు చేశారు. -
లగచర్ల ఘటనలో అరెస్టైన వారితో ములాఖత్ అయిన ఈటల, డీకే అరుణ
-
రేవంత్ సోదరుడి అరాచకాలు ఎక్కువయ్యాయి: ఎంపీ ఈటల
సాక్షి, సంగారెడ్డి: వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచర్ల గ్రామ బాధితులకు కాంగ్రెస్ ప్రభుత్వం బేషరతుగా క్షమాపణలు చెప్పి, వారిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్. రైతులపై దుర్మార్గంగా ప్రవర్తించి, థర్డ్ డిగ్రి ప్రయోగించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఈ మేరకు లగచర్లలో అధికారులపై దాడి చేసిన ఘటనలో అరెస్ట్ చేసిన బాధిత రైతులను సెంట్రల్ జైలులో సోమవారం ఎంపీలు ఈటల రాజేందర్, డీకే అరుణ, కొండా విశ్వేశ్వర్‌రెడ్డిలు కలిసి పరామర్శించారు.ఈ ఘటనకు స్కెచ్ వేసింది కాంగ్రెస్ వాళ్లే..ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ.. ప్రభుత్వం అవసరాల కోసం భూములు తీసుకోవడం వేరు కానీ, బడా కంపెనీలకు అప్పజెప్పడం వెనుక మతలబు ఏంటని ప్రశ్నించారు. కొండ నాలుకకి మందు వేస్తే ఉన్న నాలుక ఉడినట్టు కొడంగల్ నియోజకవర్గ రైతుల పరిస్థితి ఉందన్నారు. కాంగ్రెస్ వాళ్లే ఈ ఘటనకు స్కెచ్ వేసుకుని రైతులపై దాడులు చేయించారని ఆరోపించారు. 144 సెక్షన్ పెట్టి ప్రజాప్రతినిధులను అక్కడికి వెళ్లకుండా ఆపుతున్నారని.. దీనిపై పార్లమెంట్లో ప్రివిలేజ్ మోషన్ వేస్తామని చెప్పారు.రైతులకు సంకెళ్లు వేయడం కరెక్ట్ కాదు..‘సీఎం రేవంత్ సోదరుడు అరాచకాలు నియోజకవర్గంలో ఎక్కువ అయ్యాయి. నియంతలకు సందర్భం వచ్చినప్పుడు తెలంగాణ సమాజం బుద్ధి చెబుతుంది. రైతులకు సంకెళ్లు, తర్డ్ డిగ్రీ చేయడం కరెక్ట్ కాదు. ప్రజల కన్నీళ్లు చూసినవాడు ఎప్పుడు బాగుపడడు. నీకు అక్కడ ఏముందని పెత్తనం చేలాయిస్తున్నావ్. గతంలో ఖమ్మం రైతులకు సంకెళ్లు వేసిన వారికి పట్టిన గతే మీకు పడుతుంది. అధికారులు చట్టాన్ని పక్కన పెట్టి ఇలా చేయడం కరెక్ట్ కాదు. రియల్ ఎస్టేట్ బ్రోకర్ల కోసం భూములు ఇస్తే ఉరుకోం’ అని ఈటల హెచ్చరించారు.కలెక్టర్ ఒక్కరే ఎందుకు వెళ్లారు: ఎంపీ డీకే అరుణలగచర్ల గ్రామంలో ఫార్మా కంపెనీకి భూమి ఇవ్వబోమని రైతులు 8 నెలలుగా ఆందోళన చేస్తున్నారని అన్నారు బీజేపీ ఎంపీ డీకే అరుణ. బలవంతంగా భూములు లాక్కుంటామని అధికారులు చెప్పడంతో రైతులు ఆగ్రహానికి గురయ్యారని, ప్రజాభిప్రాయ సేకరణను బహిష్కరించారని తెలిపారు. వాస్తవంగా ప్రజాభిప్రాయ సేకరణకి రాకపోతే కలెక్టర్ ఒక్కరే ఎందుకు వెళ్లారని ఆమె ప్రశ్నించారు.పోలీసుల వైఫల్యంతోనే ఈ ఘటన జరిగిందన్నారు. సీఎం రేవంత్ సోదరుడు అక్కడ ఉన్న రైతులను బయపెట్టారని, భూములు ఎలాగైనా గుంజుకుంటామని చెప్పారని ఆరోపించారు.ఘటన తర్వాత రాత్రి గ్రామాల్లోకి వచ్చి పోలీసులు ఇష్టం వచ్చినట్టు దాడి చేశారని.. గొడవ జరిగిన ఘటనలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళని వదిలేసి మిగతా వాళ్ళని అరెస్ట్ చేశారని తెలిపారు.సీఎం సోదరుడు వెళ్లొచ్చు గానీ మేము వెళ్లొద్దా?భూములు ఇవ్వమని చెబితే సీఎం రేవంత్ స్వయంగా వెళ్లి వాళ్ళని కలిసి మాట్లాడితే బాగుండు. కానీ ఇవన్నీ చేయకుండా భయపెట్టి దాడులు చేపించి ఇలా చేయడం కరెక్టు కాదు. సీఎం సోదరుడు అక్కడికి వెళ్ళవచ్చు కానీ నన్ను అక్కడికి వెళ్లకుండా అడ్డుకున్నారు. రైతులతో దౌర్జన్యంగా బెదిరించి సంతకాలు పెట్టించుకుంటున్నారు. మీరు సీఎం అయితే మా నియోజకవర్గం బాగుంటుంది అనుకుంటే మీరు జనాలపై కక్ష కట్టారు. జనాల కంటే ఫార్మా కంపెనీ ముఖ్యమా?సీఎంకు ఫార్మా కంపెనీలపై అంత ప్రేమ ఎందుకు..? ఓటేసి గెలిపించిన జనాల కంటే మీకు ఫార్మా కంపెనీ ముఖ్యమా సీఎం రేవంత్? కొడంగల్ వాసులు కాదు.. సీఎం వలస వచ్చారు. మీకు నచ్చిన వారికి కంపెనీలు అప్పజెప్పడానికే ఫార్మా కంపెనీలు పెడుతున్నారు. వెంటనే లగచర్ల బాధితులను విడుదల చేయాలి. పంథాలు వద్దు నియోజకవర్గ ప్రజల ఆకాంక్ష ముఖ్యం.పేదల ఉసురు పోసుకున్న కేసీఆర్ ఇంటికి పోయిండు. మీరు 11 నెలలకే పేదల ఉసురు పోసుకుంటున్నారు. మూసి ప్రజల ఉసురు కూడా పోసుకోవడం కరెక్ట్ కాదు. గర్భిణీ స్త్రీ అని చూడకుండా ఇలా చేయడం దారుణం. సీఎం రేవంత్ అహంకారం వీడాలి.. ఒప్పించి భూములు తీసుకోండి’ అని డీకే అరుణ పేర్కొన్నారు. -
కలెక్టర్‌పై దాడిని కేటీఆర్, డీకే అరుణ సమర్థిస్తారా?: మంత్రి పొన్నం
సాక్షి,హైదరాబాద్: ప్రతిపక్షాలకు ప్రతి అంశంపై నిరసన తెలిపే హక్కు ఉంటుందని, ఎవరైనా చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. బుధవారం(నవంబర్ 13) సెక్రటేరియట్ మీడియా పాయింట్ వద్ద పొన్నం మీడియాతో మాట్లాడారు.‘ఎవరైనా చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు.బీజేపీ,బీఆర్ఎస్ నాయకులు అయినా చట్టం లోబడే పనిచేయాలి.ప్రతిపక్ష నేతలు ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్నారు.అధికారుల పై దాడి జరిగితే ఖందించాల్సింది పోయి..సమర్ధించినట్లు డీకే అరుణ,కేటీఆర్ వ్యాఖ్యలున్నాయి.శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా చర్యలు ఉంటే సహించేది లేదు.ప్రజా స్వామ్యన్ని అందరూ గౌరవించాలని విజ్ఞప్తి చేస్తున్నా’అని పొన్నం కోరారు.ఇదీ చదవండి: కలెక్టర్‌పై దాడి.. పట్నంకు 14 రోజుల రిమాండ్ -
ఎంపీ డీకే అరుణ కొడంగల్ లగచర్ల పర్యటనలో ఉద్రిక్తత
-
సీఎం రేవంత్‌రెడ్డిపై డీకే అరుణ ఫైర్
సాక్షి,హైదరాబాద్:సీఎం రేవంత్‌రెడ్డిపై బీజేపీ సీనియర్‌నేత, మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ ఫైర్ అయ్యారు. ప్రధాని మోదీ వ్యాఖ్యలపై తాజాగా రేవంత్‌రెడ్డి చేసిన ట్వీట్‌పై డీకే అరుణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆదివారం(నవంబర్ 3)డీకే అరుణ ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు.‘సోనియా గాంధీ పుట్టిన రోజునాడే అన్నీ గ్యారెంటీలు అమలు చేస్తామన్నారు. ఏడాది కావస్తున్నా ఇంతవరకు ఏ ఒక్క హామీ పూర్తిగా అమలు చేయలేదు. ఒక్క ఇల్లు నిర్మాణం మొదల పెట్టలేదు. కేంద్రం నిధులు లేకుండా వీళ్ళు ఇళ్లు కడతారా? రైతు రుణమాఫీ సగం మందికి కాలేదు. సిగ్గులేకుండా రేవంత్ అబద్ధాలు చెప్తున్నారు. పక్క రాష్ట్రంలో అక్కడి డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఫ్రీబస్ స్కీమ్ ఎత్తేస్తాం అంటున్నారు.గ్రామాలకు బస్సులు బంద్ చేసి తెలంగాణలో ఫ్రీ బస్ అంటున్నారు. మోదీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల వైఫల్యాలు ఎత్తి చూపారు. ఆయన వ్యాఖ్యలపై మాట్లాడడానికి రేవంత్‌రెడ్డికి సిగ్గుండాలి. 500 రూపాయలకే సిలిండర్‌లో కేంద్ర ప్రభుత్వ సబ్సిడీ ఉంది. ఉజ్వల గ్యాస్ కనెక్షన్లన్నీ కేంద్రానీవే. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజలను భ్రమలో ఉంచుతున్నారు. కానీ ప్రజలు మేల్కొన్నారు. అన్ని అర్దం చేసుకుంటున్నారు.రైతు భరోసా లేదు. కౌలు రైతులకు,కూలీలకు సాయం దిక్కు లేదు. అమ్మాయిలకు స్కూటీలు ఎటు పాయే.50 వేల ఉద్యోగాల భర్తీ మాట పెద్ద బోగస్.10 లక్షల రూపాయల వైద్యం ఈ పది నెలల్లో ఎంతమందికి చేయించారో బయట పెట్టండి. చెప్పిన మాట నిలబెట్టుకోకుండ దబాయించాలని చూస్తున్నారు. కొత్తగా ఒక ఫించను దరఖాస్తు కూడా తీసుకోలేదు.కొత్త వితంతు ఫించన్లు రాక మహిళలు ఇబ్బందులు పడుతున్నారు’అని డీకే అరుణ మండిపడ్డారు. ఇదీ చదవండి: పీఎం నరేంద్రమోదీ వర్సెస్ సీఎం రేవంత్‌రెడ్డి -
ఆవేశంలో ఉన్నా ఆలోచించి మాట్లాడాలి.. సురేఖకు డీకే అరుణ చురకలు
సాక్షి, హైదరాబాద్: రాజకీయాల్లో ఉన్నప్పుడు నోరు జాగ్రత్తగా పెట్టుకుని మాట్లాడాలని కొండా సురేఖకు హితవు పలికారు బీజేపీ ఎంపీ డీకే అరుణ. ఆవేశం వచ్చినా రాజకీయ నాయకులు ఆలోచించి మాట్లాడాలన్నారు. ఒక మహిళను పట్టుకొని, సినిమా కుటుంబాన్ని కించపరిచే విధంగా మాట్లాడం కరెక్ట్ కాదంటూ ఘాటు విమర్శలు చేశారు.మాజీ మంత్రి, ఎంపీ డీకే అరుణ శుక్రవారం చార్మినార్ భాగ్యలక్ష్మీ ఆలయం వద్ద ప్రత్యేక పూజలు చేశారు. ఈ క్రమంలో కొండా సురేఖ వ్యాఖ్యలపై స్పందించారు. ఈ క్రమంలో డీకే అరుణ మాట్లాడుతూ.. కొండా సురేఖతో నాకు మంచి అనుబంధం ఉంది. గతంలో ఇద్దరం కలిసి మంత్రులుగా పనిచేశాం. కానీ, ఒక సినీ కుటుంబంపై ఆమె చేసిన ఆరోపణలు అభ్యంతరకరం. సినిమా పరిశ్రమలో ఆ కుటుంబానికి ప్రత్యేక పేరు ఉంది. ఎవరి వ్యక్తిగత విషయాలతో రాజకీయాలు ముడిపెట్టడం సరికాదు.రాజకీయాల్లో ఉన్నప్పుడు నోరు జాగ్రత్తగా పెట్టుకొని మాట్లాడాలి. ఒకసారి మాట్లాడి మళ్లీ వెనక్కు తీసుకోలేము. రాజకీయ నాయకులు ఆవేశం వచ్చినా ఆలోచించి మాట్లాడాలి. ఒకరి మీద కోపం ఇంకొకరి మీద తీయడం సరికాదు. ఒక మహిళను పట్టుకొని, సినిమా కుటుంబాన్ని కించపరిచే విధంగా మాట్లాడం కరెక్ట్ కాదు. భాగ్యలక్ష్మి అమ్మవారి ఆగ్రహానికి రేవంత్ ప్రభుత్వం గురికావద్దు. అమ్మవారి ఆలయం దగ్గర మహిళలు బతుకమ్మ ఆడటానికి కోర్ట్ పర్మిషన్ తీసుకోవాల్సి వచ్చింది. తెలంగాణలో మళ్లీ నియంతృత్వ పాలనా సాగుతుంది’ అంటూ కామెంట్స్ చేశారు. ఇది కూడా చదవండి: ఎన్నికల హామీలు విఫలమై హైడ్రా.. చివరకు సినీ తారలు: జగదీష్ రెడ్డి -
‘హైడ్రా’తో డైవర్షన్ పాలిటిక్స్: డీకే అరుణ
సాక్షి,హైదరాబాద్:డబ్బు సంచులను కాంగ్రెస్ అధిష్టానానికి సమకూర్చడానికి,ఆరు గ్యారెంటీలపై నుంచి ప్రజల దృష్టిమరల్చడానికే రాష్ట్ర ప్రభుత్వం హైడ్రాను తెరపైకి తెచ్చిందని బీజేపీ ఎంపీ డీకే అరుణ విమర్శించారు. ఈ విషయమై డీకే అరుణ శుక్రవారం(సెప్టెంబర్27)మీడియాతో మాట్లాడారు.‘సామాన్యులను ఉన్నఫలంగా నిరాశ్రయులను చేయడం ఎంత వరకు న్యాయం.హైడ్రా పేరుతో ప్రభుత్వం ప్రజలను బెంబేలెత్తిస్తోంది.హైదరాబాద్ అభివృద్ధి ప్రశ్నార్థకంగా మారింది.హైదరాబాద్ రావాలంటే పెట్టుబడిదారులు భయపడాల్సిన పరిస్థితి.కేసీఆర్‌కు మించిన అవినీతిని రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తోంది.కాంగ్రెస్ ప్రభుత్వ దోపిడీ ప్రజలు గమనిస్తున్నారు.అడ్డగోలుగా టెండర్లు కట్టబెట్టి ప్రాజెక్టులు కేటాయిస్తున్నారు.ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నేతలు మాట్లాడిన మాటలు మర్చిపోయారా ? నిబంధనలు అందరికీ ఒకేలా ఉండాలి.కొందరికి ఒకలా మరికొందరికి ఇంకోలా నిబంధనలు పెడుతున్నారు.కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రజలకు హామీలు ఇచ్చి మభ్యపెట్టి మోసం చేశారు.వక్ఫ్ యాక్ట్ 2024 సవరణ బిల్లుపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) రేపు హైదరాబాద్‌కు రానుంది.వివిధ రాష్ట్రాల్లో కమిటీ ఇప్పటికే పర్యటించింది. ఈక్రమంలోనే రేపు హైదరాబాద్‌లో కమిటీ పర్యటిస్తుంది.తాజ్ కృష్ణ హోటల్లో రేపు కమిటీని కలిసి వినతిపత్రాలు ఇవ్వవచ్చు.వక్ప్ సవరణ బిల్లుపై దుష్ప్రచారాలను ఎవరు నమ్మొద్దు.వక్ప్ బోర్డులు కొందరి చేతుల్లోనే ఉన్నాయి.పేద ముస్లీంలకు న్యాయం జరగాలనే లక్ష్యంతోనే ఎన్డీఏ ప్రభుత్వం సవరణ బిల్లును ప్రవేశపెట్టింది’అని డీకే అరుణ పేర్కొన్నారు. ఇదీచదవండి: నిజాంకన్నా దుర్గార్ముడు సీఎం రేవంత్‌రెడ్డి: ఎంపీ ఈటల -
కాంగ్రెస్‌లోకి కేశవరావును పంపింది కేసీఆరే: డీకే అరుణ
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్‌లోకి కేశవరావును పంపింది కేసీఆరే అంటూ బీజేపీ ఎంపీ డీకే అరుణ సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆమె ‘సాక్షి’ మీడియాతో మాట్లాడుతూ, కేసీఆర్ కూతురు కోసం కేకేను కాంగ్రెస్‌లోకి పంపి రాజీనామా చేయించారు. కవిత కేసు వాదించిన అభిషేక్ సింఘ్వీ కోసమే కేకేతో రాజీనామా చేయించారు. కేశవరావు రాజ్యసభ సీటును అభిషేక్ సింఘ్వీకి ఇవ్వడం వెనక చాలా మతలబు ఉంది’’ అంటూ డీకే అరుణ చెపుకొచ్చారు.కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటే. హైడ్రా వెనక హైడ్రామా నడుస్తోంది. పేదల దగ్గరకు రావొద్దు. పేదల ఇండ్ల కూల్చివేతకు బీజేపీ వ్యతిరేకం. చెరువుల పరిరక్షణ చేయాలి.. కానీ పేదల ఇండ్లను కూల్చవద్దు.. ఇదే బీజేపీ లైన్ ఇదే. ఆరు గ్యారంటీలను మరిపించడానికే హైడ్రా కూల్చివేతలు. అదిగో పెద్దోళ్ల ఇళ్ల కూల్చడం.. అది చూసి పేదలు సంతోష పడాలని అన్నట్లుగా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వ తీరు’’ ఉందని అరుణ వ్యాఖ్యానించారు. -
కవిత బెయిల్ పై బీజేపీ ఎంపీ డీకే అరుణ కీలక వ్యాఖ్యలు
-
రుణమాఫీ పేరుతో దారుణమైన మోసం
-
DK Aruna: రైతులను మోసం చేసిన సీఎం రేవంత్..!
-
నాకు చెప్పలేదు.. నన్ను అవమానించారు డీకే అరుణ సంచలన కామెంట్స్
-
తెలంగాణ BJP కొత్త సారథి ఎవరు.. అధ్యక్ష పదవి రేసులో ఉన్నదెవరు?
సాక్షి, తెలంగాణ : తెలంగాణ బీజేపీకి కొత్త అధ్యక్షుడిని ఎప్పుడు నియమిస్తారు? కేంద్ర మంత్రివర్గం ఏర్పాటు పూర్తయింది. ప్రస్తుతం రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఉన్న కిషన్‌రెడ్డి మరోసారి కేంద్ర క్యాబినెట్లో చోటు దక్కించుకున్నారు. ఎన్నికలన్నీ పూర్తయినందున ఇక పార్టీకి కొత్త అధ్యక్షుడిని నియమించాల్సి ఉంది. జాతీయ అధ్యక్షుడిని కూడా మోదీ క్యాబినెట్లోకి తీసుకున్నారు. అందువల్ల ముందుగా ఆలిండియా పార్టీ అధ్యక్షుడిని నియమించి..ఆ తర్వాత రాష్ట్ర అధ్యక్షుడిని నియమిస్తారని అంటున్నారు. ఇంతకీ తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవికి పోటీపడుతున్నదెవరో చూద్దాం.ఎన్నికలన్నీ పూర్తయ్యాయి. మంత్రి పదవుల పంపకమూ అయిపోయింది. ఇక పార్టీ పదవుల్లో నియామకాలే మిగిలాయి. కిషన్‌రెడ్డి ఇప్పటివరకు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవితో పాటుగా..కేంద్ర మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహించారు. మోదీ మూడో మంత్రివర్గంలో కూడా కిషన్‌రెడ్డికి బెర్త్ ఇచ్చారు. ఇక ఆయన పూర్తిగా మంత్రి బాధ్యతలు నిర్వహించాల్సి ఉన్నందున.. ఇప్పుడు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా కొత్తనేతను నియమించాల్సి ఉంది. మరి తెలంగాణ కమల దళపతిగా ఎవరిని నియమిస్తారనేదానిపై బీజేపీ వర్గాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. ఈ పదవి కోసం చాలా మంది నేతలు పోటీ పడుతున్నారు.మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్‌కు తెలంగాణ బీజేపీ పగ్గాలు దక్కడం ఖాయమని ప్రచారం జరుగుతోంది. ముఖ్యమంత్రి అభ్యర్థిగా గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటల రాజేందర్‌ను పార్టీ ఫోకస్ చేసింది. గజ్వేల్, హుజూరాబాద్ అసెంబ్లీ నియోజక వర్గాల్లో ఈటల పరాజయం పాలైనా... మల్కాజ్గిరి ఎంపీగా ఈటలకు పార్టీ మరో అవకాశం ఇచ్చింది. అక్కడ భారీ మెజారిటీతో ఎంపీగా ఎన్నికయ్యారు. ఇప్పుడు రాష్ట్ర పార్టీ పగ్గాలు ఈటలకు అప్పగించి స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలని బీజేపీ అధిష్ఠానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర పార్టీ నేతలను సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తే ఈటలకే పార్టీ పగ్గాలు అప్పగించవచ్చు. ఇప్పటికే ఆ దిశగా పార్టీ అధిష్ఠానం సంకేతాలు ఇచ్చినట్లు ఈటల వర్గీయులు చెబుతున్నారు.అయితే తెరవెనక మరికొంత మంది నేతలు కూడా తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. మెదక్ ఎంపీగా గెలిచిన రఘునందన్ రావు రాష్ట్ర పార్టీ పగ్గాలు దక్కించుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఇందిరా గాంధీ గతంలో ప్రాతినిథ్యం వహించిన పార్లమెంట్ నియోజకవర్గంలో గెలవడం, మాజీ సిఎం కెసిఅర్ సొంత ఇలాకాలో విజయం సాధించడం రఘునందన్‌కు కలిసి వచ్చే అంశాలుగా చెబుతున్నారు. మంచి వాగ్ధాటి కల్గిన నేతగా..ప్రత్యర్థి పార్టీల నేతల విమర్శలను సమర్థవంతంగా తిప్పకొట్టగల నేతగా రఘునందన్ ముందు వరుసలో ఉంటారు. ఇటువంటి అంశాలు కమలనాథులు పరిగణనలోకి తీసుకుంటే రఘునందన్ పేరును పరిశీలించే అవకాశం ఉంది. కేంద్ర మంత్రి వర్గంలో స్థానం ఆశించిన పాలమూరు ఎంపీ డీకే అరుణకు రాష్ట్ర పార్టీ బాధ్యతలు అప్పగిస్తే ఎలా ఉంటుందనే దానిపై అధిష్ఠానం పెద్దలు సమాలోచనలు చేస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఉత్తర తెలంగాణ నుంచి బండి సంజయ్ కు, రాజధాని నగరం నుంచి కిషన్ రెడ్డికి కేంద్ర మంత్రి వర్గంలో ఛాన్స్ ఇచ్చారు. దక్షిణ తెలంగాణా నుంచి డికె అరుణకి పార్టీ బాధ్యతలు అప్పగిస్తే... సిఎం రేవంత్ కు ధీటుగా రాష్ట్రంలో బీజేపీని ముందుకు తీసుకువెళ్లవచ్చని పలువురు రాష్ట్ర నేతలు అధిష్ఠానం ముందు పెట్టినట్లు సమాచారం. కేంద్ర మంత్రివర్గంలో మహిళల సంఖ్య తక్కువగా ఉన్న నేపథ్యంలో కేంద్ర మంత్రి వర్గంలో డికె అరుణకు ఛాన్స్ ఇస్తారని కూడా మరో ప్రచారం జరుగుతోంది.నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కూడా మంత్రి వర్గంలో స్థానం దక్కుతుందని ఆశించి భంగపడ్డారు. ఇప్పుడు రాష్ట్ర పార్టీ పగ్గాలు అందుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు. కామారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న వెంకటరమణ రెడ్డి సైతం అధ్యక్ష పదవి రేసులో ఉన్నారు. అయితే ఇప్పటికే బీజేఎల్పీ బాధ్యతలు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఏలేటి మహేశ్వర్ రెడ్డికి ఇచ్చిన నేపథ్యంలో రాష్ట్ర పార్టీ పగ్గాలు బిసి నేతకు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన బండి సంజయ్ కు మంత్రి వర్గంలో ఛాన్స్ దక్కిన నేపథ్యంలో అదే సామాజిక వర్గానికి చెందిన అరవింద్ కు కొత్త బాధ్యతలు ఇస్తారా ? లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.పార్టీలో చాలాకాలంగా పనిచేస్తున్న మాజీ ఎమ్మెల్సీ రామచందర్ రావు, పేరాల చంద్ర శేఖర్ బీజేపీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతల కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. జాతీయ పార్టీ అధ్యక్ష బాధ్యతలు కొత్త వారికి కేటాయించిన తర్వాతే తెలంగాణ పగ్గాలు ఎవరికిస్తారో తేలుతుంది. ఇదిలాఉంటే.. ఆషాడ మాసం ముగిసే వరకు కిషన్ రెడ్డి అటు కేంద్ర మంత్రిగా.. ఇటు రాష్ట్ర అధ్యక్ష బాధ్యతల్ని కూడా నిర్వహించే అవకాశం ఉంది. ఆషాడం ముగిసాకే కొత్త నేతకు రాష్ట్ర బాధ్యతలు అప్పగిస్తారని తెలుస్తోంది. -
కేంద్ర కేబినెట్లో తెలుగు రాష్ట్రాలకే పెద్దపీట!
ఢిల్లీ: కేంద్రంలో కొలువుదీరబోయే ఎన్డీయే ప్రభుత్వ మంత్రివర్గంలో తెలుగు రాష్ట్రాలకు పెద్దపీట దక్కనున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో బీజేపీ తన స్థానాల్ని డబుల్ చేసుకోగా.. ఏపీలోనూ కూటమి ద్వారా మంచి ఫలితాన్నే రాబట్టుకోగలిగింది. దీంతో తెలంగాణ నుంచి ఇద్దరు లేదా ముగ్గురికి, అలాగే ఏపీ నుంచి ఐదారుగురికి కేబినెట్లో చోటు దక్కవచ్చనే సంకేతాలు అందుతున్నాయి.తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా కొనసాగే అవకాశం కనిపిస్తోంది. అయితే బీసీ కోటాలో కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌కు మంత్రి పదవి దక్కవచ్చనే ప్రచారం ఊపందుకుంది. ఇక.. మహిళా కోటాలో మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణకు కేంద్ర సహాయ మంత్రి పదవి దక్కే అవకాశాలున్నాయి. ఇక.. కేంద్ర కేబినెట్లో బెర్త్ ఆశిస్తున్న ఈటల రాజేందర్‌కు.. తెలంగాణ బీజేపీ పగ్గాలు అప్పగించవచ్చనే చర్చ ఆ పార్టీలో నడుస్తోంది.ఏపీ బీజేపీ నుంచి రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరికి, సీఎం రమేష్‌కు మంత్రివర్గంలో చాన్స్ దక్కనున్నట్లు తెలుస్తోంది. జనసేన నుంచి బాలశౌరికి సహయ మంత్రి పదవి దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా కూటమిలో కీలకంగా మారిన టీడీపీ నుంచి రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్‌కు, రాయలసీమ నుంచి పార్థసారధికి మంత్రివర్గంలో ఛాన్స్ దక్కనున్నట్లు తెలుస్తోంది.మంత్రివర్గ కూర్పుపై కొనసాగుతున్న కసరత్తు..ఎన్డీయే భాగస్వామి పక్షాల అధినేతలతో విడివిడిగా శుక్రవారం జేపీ నడ్డా, అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్ సమావేశమయ్యారు. మంత్రివర్గంలో కోరుకుంటున్న పదవులు, స్థానాలపై నేతలు చర్చించారు. ఇవాళ కూడా మంతివర్గ కూర్పుపై కసరత్తు కొనసాగుతోంది. టీడీపీ, జేడీ(యూ)కు అధిక ప్రాధాన్యం కలిగిన శాఖలు దక్కే అవకాశం కనిపిస్తోంది. టీడీపీ నుంచి రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్‌కు కేబినెట్లో ఛాన్స్ లభించనుంది. మరో ఇద్దరికి సహాయ మంత్రి పదవులు లభించే అవకాశం ఉన్నట్లు సమాచారం. మంత్రివర్గం రేసులో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు ఉన్నారు.రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడే మంత్రిత్వ శాఖలు తీసుకుంటామని టీడీపీ నేత రామ్మోహన్ నాయుడు అన్నారు. పట్టణాభివృద్ధి, జలవనరుల శాఖ, పరిశ్రమల శాఖలను టీడీపీ ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక.. జనసేన నుంచి బాలశౌరికి సహాయ మంత్రి అవకాశం లభించనున్నట్లు సమాచారం. ఏపీ బీజేపీ కోటాలో పురందేశ్వరికి మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశం ఉంది. మంత్రి పదవి కోసం ముమ్మరంగా సీఎం రమేష్ లాబీయింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కేంద్ర మంత్రివర్గంలో ఎన్డీయే పక్ష పార్టీలు భాగస్వామ్యం కానున్నాయి. కీలకమైన హోమ్, ఆర్థిక, రక్షణ విదేశాంగ శాఖలు బీజేపీకే కేటాయించనున్నట్లు సమాచారం. మూడు మంత్రి పదవులు, రెండు సహాయ మంత్రి పదవులను టీడీపీ కోరుతున్నట్లు తెలుస్తోంది.టీడీపీకి లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ పదవి దక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు.. జేడీ(యూ) మూడు మంత్రి పదవులు కోరుతున్నట్లు తెలుస్తోంది. శివసేన, ఎన్సీపీ, ఆర్ఎల్డీకి ఒక్కొక్క మంత్రి పదవి కేటాయించనున్నట్లు సమాచారం. దీంతో పాటు బీహార్ ప్రత్యేక హోదా ప్రకటించాలని సీఎం నితీశ్ కుమార్ కోరుతున్నారు. -
కేంద్ర మంత్రివర్గంలో డీకే అరుణకు చోటు?
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వం వహిస్తున్న ఎన్డీఏ కూటమి విజయం సాధించగా.. కేబినెట్ కూర్పులో తెలంగాణ నుంచి ఎవరెవరికి బెర్తులు దక్కనున్నాయనే అంశం రాష్ట్రవ్యాప్తంగా హాట్‌టాపిక్‌గా మారింది. ప్రధానంగా మహబూబ్‌నగర్ నుంచి ఎంపీగా గెలుపొందిన సీనియర్ నాయకురాలు, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణకు కేంద్ర మంత్రి వర్గంలో చోటుపై ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. సుదీర్ఘ రాజకీయ కుటుంబ నేపథ్యంతో పాటు సుమారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఐదేళ్ల పాటు రాష్ట్ర మంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న ఆమెకు కేంద్ర మంత్రి పదవి ఖాయమనే అభిప్రాయం ఆ పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ను, సీఎం రేవంత్‌రెడ్డిని దీటుగా ఎదుర్కొనే సామర్థ్యం ఉన్న నాయకురాలిగా గుర్తింపు పొందడం వంటి అంశాలు కలిసివస్తాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.సుదీర్ఘ రాజకీయ అనుభవం..డీకే అరుణ పుట్టినిల్లు, మెట్టినిల్లు రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబాలే. తండ్రి చిట్టెం నర్సిరెడ్డి, మామ డీకే సత్యారెడ్డి ఎమ్మెల్యేలుగా ప్రజలకు సేవలందించారు. భర్త డీకే భరత్‌సింహారెడ్డి కూడా ఎమ్మెల్యేగా పనిచేశారు. అదేవిధంగా భరత్‌సింహారెడ్డి అన్న డీకే సమరసింహారెడ్డి మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఎన్నికవడంతో పాటు మంత్రిగా పనిచేశారు.1996లో రాజకీయాల్లోకి వచ్చిన డీకే అరుణ మహబూబ్‌నగర్ ఎంపీగా, ఆ తర్వాత గద్వాల ఎమ్మెల్యేగా పోటీ చేసి పరాజయం పాలయ్యారు. అనంతరం కొల్లాపూర్ నియోజకవర్గంలోని పాన్‌గల్ నుంచి జెడ్పీటీసీగా పోటీ చేసి తొలి విజయాన్ని అందుకున్నారు. 2004లో సమాజ్‌వాది పార్టీ నుంచి గద్వాల ఎమ్మెల్యేగా పోటీ చేసి టీడీపీ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే గట్టు భీముడిపై భారీ విజయం సాధించారు. 2009, 2014లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి వరుస విజయాలతో హ్యాట్రిక్ సాధించారు. 2009లో వైఎస్ కేబినెట్లో, ఆ తర్వాత రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వంలో రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి చేతిలో ఓటమి చెందారు. మారిన రాజకీయ పరిణామాల క్రమంలో 2019లో బీజేపీలో చేరిన డీకే అరుణ అదే సంవత్సరంలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి చెందారు. తాజాగా ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపొందారు.మహిళా కోటాలో దక్కే అవకాశంగత లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ నాలుగు స్థానాల్లో (సికింద్రాబాద్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్) గెలుపొందిన విషయం తెలిసిందే. ఈ మేరకు కేంద్ర మంత్రివర్గంలో కిషన్‌రెడ్డికి బెర్త్ లభించింది. తాజాగా ఈ లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ అనూహ్యంగా పుంజుకుని ఎనిమిది స్థానాల్లో (మహబూబ్‌నగర్, సికింద్రాబాద్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, చేవెళ్ల, మల్కాజిగిరి, మెదక్) విజయం సాధించింది. ఈ మేరకు ఇద్దరికి లేదా ముగ్గురికి మంత్రి పదవులు దక్కవచ్చనే అభిప్రాయం పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఒకరికి కీలక మంత్రిత్వ శాఖతో పాటు మరో ఇద్దరికి సహాయ మంత్రులుగా అవకాశం కలి్పంచనున్నట్లు అంచనా వేస్తున్నారు. ఈ మేరకు మహిళా కోటాలో సీనియర్ నాయకురాలైన డీకే అరుణకు మోదీ కేబినెట్లో మంత్రిగా బెర్త్ దక్కే చాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.పాలమూరు నుంచే భవిష్యత్‌కు బాట..! బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలుగా ఉన్న డీకే అరుణ మహబూబ్‌నగర్ లోక్‌సభ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ అభ్యర్థి చల్లా వంశీచంద్‌రెడ్డిని సమర్థంగా ఢీకొని ఉత్కంఠ పోరులో విజయం సాధించారు. ఈ పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో అందరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌కు చెందిన వారే కాగా.. వారందరూ చల్లా గెలుపు కోసం క్రియాశీలకంగా పనిచేశారు. మరోవైపు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సీఎం రేవంత్‌రెడ్డి పాలమూరులోని పలు ప్రాంతాల్లో 11 పర్యాయాలు పర్యటించారు. అయినా డీకే అరుణ విజయాన్ని అడ్డుకోలేకపోయారు. పలు మండలాల్లో బీజేపీ కేడర్ బలహీనంగా ఉన్నా.. అన్నింటినీ అధిగమించి డీకే అరుణ విజయకేతనం ఎగురవేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ అగ్రనాయకత్వం ముందుకుసాగుతోంది. ఈ మేరకు కేంద్ర కేబినెట్ పదవులు కేటాయించే అవకాశం ఉంది. బీజేపీ తెలంగాణలో పాలమూరు నుంచే అసెంబ్లీతో పాటు పార్లమెంట్ ఎన్నికల శంఖారావం పూరించిన విషయం తెలిసిందే. ఈ లెక్కన పాలమూరు నుంచే భవిష్యత్‌కు బాట సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంతో పాటు సీఎం రేవంత్, కాంగ్రెస్‌ను దీటుగా ఎదుర్కొనే నాయకురాలిగా గుర్తింపు ఉన్న డీకే అరుణకు ఈ సారి కేంద్ర కేబినెట్లో బెర్త్ ఖాయమనే చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోంది. -
మహబూబ్‌నగర్: హోరా హోరీ లెక్కింపులో డీకే అరుణ విజయం
మహబూబ్‌నగర్: హోరా హోరీగా సాగిన ఓట్ల లెక్కింపులో మహబూబ్ నగర్ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి డీకే అరుణ విజయం సాధించారు. అధికారికంగా ఫలితాలు వెలువడవలసి ఉంది. ఇక్కడ గెలుపునకు సీఎం రేవంత్‌రెడ్డి ప్రతిష్టాత్మంగా తీసుకుని చల్లా వంశీచంద్‌రెడ్డిని కాంగ్రెస్ తరఫున బరిలో దించారు. అయితే లెక్కింపు సమయంలో డీకే. అరుణ, వంశీచంద్ మధ్య విజయం దోబూచులాడింది. ఈవీఎం లెక్కింపుల్లో ఆమె కేవలం 1800 ఓట్ల ముందంజలో ఉన్నారు. అనంతరం పోస్టల్ బ్యాలెట్ ఓట్లు 8000 లెక్కింపునకు ఉండేసరికి బీజేపీ శ్రేణుల్లో కొంత టెన్షన్ నెలకొంది. ఎట్టకేలకు హోరాహోరీగా సాగిన లెక్కింపులో 3636 ఓట్ల మెజార్టీతో డీకే అరుణను విజయం వరించింది. -
డీకే అరుణతో నాకు పోటీ ఏంటి? పొంతనేంటి?: సీఎం రేవంత్
సాక్షి, నాగర్ కర్నూల్: లోక్‌సభ ఎన్నికల ముందు బీఆర్ఎస్, బీజేపీ నేతలపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. కొడంగల్‌ను దొంగ దెబ్బ తీయాలని బీజేపీ, బీఆరెస్ నాయకులు కుట్ర చేస్తున్నారని.. ఈ కుట్రలను తిప్పి కొట్టాల్సిన బాధ్యత నియోజకవర్గ ప్రజలపై ఉందన్నారు. నారాయణ పేట జిల్లా మద్దూరు మండల కేంద్రంలో కొడంగల్ నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా బీజేపీ నేత, మహబూబ్‌నగర్ ఎంపీ అభ్యర్ధి డీకే అరుణపై సీఎం రేవంత్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆనాడు మంత్రిగా ఉండి నారాయణపేట ఎత్తిపోతల రాకుండా అడ్డుకున్న డీకే అరుణ.. నేడు మళ్లీ ఓట్లు అడగడానికి వస్తున్నారని మండిపడ్డారు. తనను అవమానించానని డీకే అరుణ మాట్లాడుతున్నారని.. శత్రువు చేతిలో చుర కత్తిగా మారి పాలమూరు కడుపులో ఎందుకు పొడుస్తున్నవని మాత్రమే తాను ప్రశ్నించినట్లు పేర్కొన్నారు. నరేంద్రమోదీ చేతిలో కత్తిగా మారి పాలమూరు కడుపులో పొడవద్దని అన్నారు. ‘కొడంగల్ నియోజకవర్గంలో మీరు నాటిన మొక్క ఇవాళ మీ ఆశీర్వాదంతో తెలంగాణ ముఖ్యమంత్రి స్థాయికి చేరుకుంది. కొడంగల్ నియోజకవర్గానికి పీసీసీ అధ్యక్ష పదవి, ముఖ్యమంత్రి పదవి ఏక కాలంలో ఇచ్చిన ఘనత సోనియమ్మది. చేయి చాచి అడిగే పరిస్థితి నుంచి ఇవాళ ఎవరికి ఏం కావాలో ఇచ్చే స్థాయికి కొడంగల్‌కు కాంగ్రెస్ అవకాశం ఇచ్చింది. మీరే కథానాయకులై నన్ను 33 వేల మెజారిటీతో గెలిపించారు. పాలమూరు బిడ్డలు నూటికి నూరు శాతం నాకు అండగా నిలబడ్డారు. అలాంటి నాకు నీ మీద అసూయ ఎందుకుంటుంది.? ఎందుకు కోపం ఉంటుంది.? నాకు నీకు పోటీ ఏంటి..? పొంతనేంటి..? ఉమ్మడి పాలమూరు జిల్లాలో నాకు శత్రువులు లేరు. ప్రత్యర్ధులు లేరు. పాలమూరు అభివృద్ధి కోసమే నా తపనంతా. 70ఏళ్ల తరువాత పాలమూరుకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. నాకు అండగా నిలబడండి. పాలమూరును రాబోయే వందేళ్లకు సరిపడా అభివృద్ధి చేసి చూపిస్తా. పార్టీలకు అతీతంగా ముందుకు రండి.పాలమూరు అభివృద్ధి చేసి చూపిస్తా. వందరోజుల్లోనే మమ్మల్ని కేసీఆర్ దిగిపొమ్మంటున్నారు. పదేళ్లు ప్రజలను మోసం చేసిన నిన్ను చెంపలు వాయించాలి. తాగుబోతు కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారు. రూ. 3,900 కోట్ల లోటు బడ్జెట్‌తో నేను సీఎంగా బాధ్యత తీసుకున్నా. నేను వచ్చాక నాలుగు నెలలల్లో 26వేల కోట్లు వడ్డీలు కట్టా. అసెంబ్లీకి రా నేను లెక్కలు చూపిస్తా. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించాం. రూ.10లక్షల వరకు ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్యం అందిస్తున్నాం. రూ.500లకే గ్యాస్ సిలిండర్ అందించాం. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తూ... 45 లక్షల ఇళ్లల్లో వెలుగు నింపుతున్నాం. సేవాలాల్ సాక్షిగా పంద్రాగస్టులోగా రూ.2లక్షలు రుణమాఫీ చేస్తాం. రుణమాఫీ చేయకపోతే రాజీనామా చేస్తావా అని హరీష్ మాట్లాడుతున్నాడు. ఈ వేదికగా నేను హరీష్ రావుకు సవాల్ విసురుతున్నా. పంద్రాగస్టులోగా రుణమాఫీ చేస్తే నీ పార్టీని రద్దు చేసుకుంటావా? ఈ సవాల్‌కు హరీష్ సిద్ధమా.? నేను మాట ఇస్తే ఎలా ఉంటుందో పోయి మీ మామను అడుగున. బీజేపీ నేతలకు పిచ్చి ముదిరి మతాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నారు. వారి మాయలో పడొద్దు. కొడంగల్ నుంచి వంశీచంద్ రెడ్డికి 50వేల మెజారిటీ ఇవ్వండి’ అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. -
నీ చరిత్ర మర్చిపోకు రేవంత్: డీకే అరుణ
-
డీపీఆర్ మార్చితే.. నిధులు నేనే తెస్తా
పాలమూరు: పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టుకు జూరాల నుంచి నీళ్లు తీసుకొచ్చేలా సీఎం రేవంత్ రెడ్డి డీపీఆర్ మార్చితే.. కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చే బాధ్యత తాను తీసుకుంటానని మహ బూబ్‌నగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ ప్రకటించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో తెలంగాణ ఎన్నికల ఇన్చార్జ్ చంద్రశేఖర్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. సీఎం రేవంత్‌రెడ్డి పాలమూరు జిల్లాకు ఏం చేశాడో చెప్పాలని నిలదీశారు. రేవంత్‌రెడ్డి ఒక ముఖ్యమంత్రిగా కాకుండా ఎంపీటీసీగానే మాట్లాడుతున్నారని విమర్శించారు. కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమ ణారెడ్డి మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్‌పై ఉన్న వ్యతిరేకతతో కాంగ్రెస్ వైపు ఓటర్లు ఆసక్తి చూపారే తప్ప అది రేవంత్‌రెడ్డి గొప్పతనం ఏమా త్రం కాదన్నారు. ఆనాడు కేసీఆర్ కాంగ్రెస్ వాళ్లను కొనుగోలు చేస్తున్నాడని ఆరోపించిన రేవంత్ ఇప్పుడు ఇతర పార్టీల వారిని ఎందుకు చేర్చుకుంటున్నారో చెప్పాలన్నారు. సీఎం రేవంత్ ఇంకా జెడ్పీటీసీ స్థాయిలోనే ఉన్నారని ఎద్దేవా చేశారు. ఇద్దరు సీఎం అభ్యర్థులపై తాను విజయం సాధించానంటే బీజేపీ కార్యకర్తల వల్లేనని చెప్పారు. -
నేడు బీజేపీ టిఫిన్ బాక్స్ బైఠక్‌లు
సాక్షి, హైదరాబాద్: శనివారం బీజేపీ 44వ సంస్థాపక దినోత్సవం సందర్భంగా.. రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ కేంద్రాల్లో ‘టిఫిన్ బాక్స్ బైఠక్’ల నిర్వహణకు పార్టీ సిద్ధమౌతోంది. కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, పార్టీ సికింద్రాబాద్ అభ్యర్థి జి.కిషన్‌రెడ్డి మొదలు అన్ని స్థాయిల నేతలు, కార్య కర్తలు తమ తమ ఓటున్న సొంత పోలింగ్ బూత్ కేంద్రాల్లో జరిగే సమావేశాల్లో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయాలు, పోలింగ్ బూత్‌ల వద్ద పార్టీ పతాకాలను ఆవిష్కరించనున్నా రు. కాగా రాష్ట్రంలోని 17 ఎంపీ సీట్ల పరిధిలోని పోలింగ్ బూత్ కేంద్రాలకు ఎవరి అల్పాహారం (టిఫిన్) వారు తెచ్చుకుని, అక్కడే తింటూ ఉదయ ం నుంచి మ«ధ్యాహ్నం వరకు భేటీలు నిర్వహించను న్నారు. పార్లమెంట్ ఎన్నికలకు పార్టీపరంగా సన్నద్ధ తపై, పార్టీ చేపడుతున్న కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించనున్నారు. పార్టీ కేడర్ మధ్య మెరుగైన సమన్వయ సాధన, కార్యాచరణ రూప కల్పనకు ఈ భేటీలు దోహదపడతాయని నేతలు చెబుతున్నారు. మూడు లక్ష్యాల సాధనకు సంకల్పం ఒక్కో పోలింగ్ బూత్‌లోని మూడు, నాలుగు పోలింగ్ స్టేషన్లలో ఆయా సామాజికవర్గాల ఓట్లు, వివిధ కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు, వారికి సంబంధించి సమాచారం, ఇతర అంశాలపై చర్చించనున్నట్టు సమాచారం. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, యువత, మహిళలు, రైతులు ఇలా వివిధ వర్గాల ఓటర్లను ఏవిధంగా చేరుకోవాలి, దళిత బస్తీలు, గిరిజన తండాల్లో ఎలాంటి ప్రచారాన్ని నిర్వహించాలన్న దానిపై అభిప్రాయ సేకరణ జరపను న్నారు. ఫిర్ ఏక్‌బార్ నరేంద్ర మోదీ సర్కార్ కోసం 370 సీట్ల సాధన, ప్రతి పోలింగ్ బూత్‌లో అదనంగా 370 ఓట్ల సాధన, క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి ప్రతి బూత్‌లో 50 ఓట్ల సాధనకు ఈ సందర్భంగా సంకల్పం తీసుకోనున్నారు. కాచిగూడలో కిషన్‌రెడ్డి.. మహబూబ్‌నగర్‌లో డీకే అరుణ శనివారం ఉదయం అంబర్‌పేట నియోజ కవర్గం కాచిగూడలోని 214 పోలింగ్ స్టేషన్లో కిషన్‌రెడ్డి టిఫిన్ బాక్స్ బైఠక్‌లో పాల్గొంటారు. పార్లమెంట్ ఎన్నికల ఇన్చార్జి అభయ్‌పాటిల్ సికింద్రాబాద్ అసెంబ్లీలోని మెట్టుగూడ 33–35 పోలింగ్ స్టేషన్లలో, పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు, మహబూబ్ నగర్ అభ్యర్థి డీకే అరుణ నారాయణపేట అసెంబ్లీ కోయిల్‌కొండలోని 23–27 పోలింగ్ స్టేషన్లలో పాల్గొంటారు. ప్రధాన కార్యదర్శి కరీంనగర్ అభ్యర్థి బండి సంజయ్ కరీంనగర్‌లోని సాధనా స్కూల్ 174వ పోలింగ్ స్టేషన్లో, పార్లమెంటరీ బోర్డు సభ్యుడు కె.లక్ష్మణ్ ముషీరాబాద్ నియోజక వర్గం చిక్కడపల్లిలోని 9వ పోలింగ్స్టేషన్లో, జాతీయ కార్యవర్గ సభ్యుడు, మల్కాజిగిరి అభ్యర్థి ఈటల రాజేందర్ మల్కాజిగిరిలోని వినాయక్‌నగర్ 155–157 పోలింగ్స్టేషన్లలో, బీజేఎల్పీ నేత మహేశ్వర్‌రెడ్డి నిర్మల్ అసెంబ్లీలోని గాజులపేట 192 పోలింగ్ స్టేషన్లో, ఎమ్మెల్సీ ఏవీఎన్‌రెడ్డి మహేశ్వరం అసెంబ్లీలోని నాదర్గుల్, బడంగ్‌పేట పోలింగ్ స్టేషన్లలో పాల్గొంటారు. -
డీకే అరుణ సోయి లేకుండా మాట్లాడుతున్నారు
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: తనపై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ వ్యక్తిగతంగా, సోయిలేకుండా మాట్లాడటం తగదని సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వనితుడు, కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి చల్లా వంశీచంద్‌రెడ్డి అన్నారు. శనివారం డీసీసీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, కేవలం కుటుంబ సభ్యుల వ్యాపారాలు, స్వలాభం కోసమే ఆమె రాజకీయాలు నడుపుతున్నారని ఆరోపించారు. 2014లో కల్వకుర్తి ఎమ్మెల్యేగా తనను ఓడించేందుకు ఎన్నో కుట్రలు పన్నారని, అయినా అక్కడి ప్రజల ఆదరాభిమానాలతో గెలుపొందానని పేర్కొన్నారు. 2006 నుంచే ఏఐసీసీ సభ్యుడిగా ఉన్నానని, ఆమెకు 2014 వరకు కాంగ్రెస్‌లో సభ్యత్వమే లేదన్నారు. ఎన్నో పార్టీలు మారిన డీకే అరుణ బీసీ ద్రోహి అని విమర్శించారు. తాను నాన్–లోకల్ కాదని ఉమ్మడి పాలమూరు బిడ్డనని వంశీచంద్‌రెడ్డి చెప్పారు. అప్పట్లో పాన్‌గల్ జెడ్పీటీసీ సభ్యురాలిగా కాంగ్రెస్ నుంచి డీకే అరుణ గెలుపొందినప్పుడు ఆమెకు ఈ విషయం గుర్తుకు రాలేదా? అని ప్రశ్నించారు. కేవలం కాంట్రాక్టులు, లిక్కర్ దందాలు, ధనార్జన కోసమే రాజకీయాల్లో ఉన్న ఆమె బండారం బయటపెడతామన్నారు. ఈ ఎన్నికల్లో మహబూబ్‌నగర్ నుంచి ఓడిపోతాననే అక్కసుతో ఎలాంటి సోయి లేకుండా మాట్లాడుతున్నారని చెప్పారు. కనీసం తన పుట్టిన ఊరు ధన్వాడ మండలానికి గానీ, నారాయణపేట–కొడంగల్ ఎత్తిపోతలకుగానీ అరుణ ఏమీ చేయలేకపోయారని, రాజకీయ విలువలు లేని ఆమె తీరుపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ ఎన్నికల్లో తనను గెలిపిస్తే ఈ ప్రాంత సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానన్నారు. -
సీఎం రేవంత్ మాట మార్చడం సిగ్గుచేటు
కొత్తకోట (వనపర్తి): ప్రధాన మంత్రి నరేంద్రమోదీ మా పె ద్దన్న అని మాట్లాడిన ముఖ్య మంత్రి రేవంత్‌రెడ్డి మరుసటి రోజే మాట మార్చడం సిగ్గుచే టని బీజేపీ జాతీయ ఉపాధ్య క్షురాలు, పార్టీ మహబూబ్‌నగర్ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ పేర్కొన్నారు. వనపర్తి జిల్లా కొత్తకోటలో పలువురు నాయకులు గురువారం బీజేపీలో చేరిక ల అనంతరం విలేకరులతో ఆమె మాట్లాడారు. సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీలను పూర్తిగా అమ లు కాకపోవడంతో ప్రజల్లో నమ్మకం కోల్పోయా రన్నారు. ఆరు గ్యారంటీల పేరుతో అసెంబ్లీ ఎన్నిక ల్లో మోసం చేసి గెలిచారని దుయ్యబట్టారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు, రాహుల్‌గాంధీని ప్రధాని చేసేందుకు ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. తెలంగాణలో 12 ఎంపీ సీట్లు గెలుస్తామని, తనను ఆదరించి గెలిపిస్తే అభివృద్ధి చేసి చూపిస్తానని తెలిపారు. -
తెలంగాణలో పొలిటికల్ ట్విస్ట్.. జితేందర్ రెడ్డి ఇంటికి రేవంత్
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల వేళ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీజేపీ సీనియర్ నేత జితేందర్ ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా జితేందర్ రెడ్డితో భేటీ అయ్యారు. అయితే, రానున్న లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో జితేందర్ రెడ్డి మహబూబ్‌నగర్ ఎంపీ స్థానం నుంచి ఆశించారు. మొదటి నుంచి ఇక్కడ పోటీ చేయాలని జితేందర్ రెడ్డి ప్లాన్ చేసుకున్నారు. కానీ, బీజేపీ హైకమాండ్ మాత్రం జితేందర్ రెడ్డిని కాదని డీకే అరుణకు అవకాశం కల్పించింది. దీంతో, టికెట్ ఆశించిన జితేందర్ రెడ్డి భంగపాటుకు గురయ్యారు. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ ఆయన ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌తో పాటు మంత్రి పొంగులేటి శ్రీనివాస్, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి ఉన్నారు. ఈ సందర్భంగా జితేందర్ రెడ్డి మాట్లాడుతూ.. రేవంత్ మా ఇంటికి రావడం కొత్తేమీ కాదు. తన అన్న ఇంటికి వచ్చాడు అంతే. మాది ఒక్కటే జిల్లా. నాకు సీటు రాలేదని ఓదర్చాడానికే వచ్చాడు. నేను ప్రస్తుతం బీజేపీలోనే ఉన్నాను. బీజేపీలో సంతోషంగానే ఉన్నాను. నా సీటు గురించి అధిష్టానం చూసుకుటుంది. కాంగ్రెస్‌లో టికెట్లు ఫుల్ ఫిల్ అయ్యాయి. మహబూబ్‌నగర్‌లో వంశీ, చేవెళ్లలో పట్నం మహేందర్ రెడ్డి కాంగ్రెస్‌కు ఉన్నారు. పార్టీలోకి సీఎం రేవంత్ నన్ను ఆహ్వానించలేదు. నేను కూడా ఏమీ మాట్లాడలేదు. కేవలం పరామర్శ కోసమే రేవంత్ మా ఇంటికి వచ్చాడు అని వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉండగా.. బీజేపీ కేంద్ర పెద్దలపై జితేందర్ రెడ్డి ఎప్పటికప్పుడు సెటైర్లు వేస్తూనే ఉన్నారు. జితేందర్ రెడ్డి గతంలో బీజేపీ హైకమాండ్‌ను టార్గెట్ చేసి పలు సెటైరికల్ వీడియోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ఇటీవల కూడా ఒక వీడియోను షేర్ చేయడంతో బీజేపీ నేతలు ఖంగుతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో బీజేపీ హైకమాండ్ జితేందర్ రెడ్డి సీటు నిరాకరించినట్టు తెలుస్తోంది. మాజీ ఎంపీ బీజేపీ నేత జితేందర్ రెడ్డి నివాసానికి వెళ్లి కలిసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. CM Revanth Reddy met former MP BJP leader Jithender Reddy at his residence.#RevanthReddy • @revanth_anumula • @apjithender • @mpponguleti • @Drpmahendereddy pic.twitter.com/biQVwz2R3w — Congress for Telangana (@Congress4TS) March 14, 2024 -
నా గెలుపు ఎవరు ఆపలేరు
-
వీడిన సస్పెన్స్..! లోక్‌సభ అభ్యర్థిగా డీకే అరుణ..
మహబూబ్‌నగర్: మహబూబ్‌నగర్ పార్లమెంట్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి ఎవరనే దానిపై సస్పెన్స్ వీడింది. మాజీ మంత్రి, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ పేరు ఖరారైంది. ఈ లోక్‌సభకు సంబంధించి డీకే అరుణతో పాటు పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఏపీ జితేందర్‌రెడ్డి, రాష్ట్ర కోశాధికారి శాంతికుమార్ మధ్య టికెట్ పోరు కొనసాగడంతో అధిష్టానం పెండింగ్‌లో పెట్టిన విషయం తెలిసిందే. ఎట్టకేలకు బుధవారం రెండో జాబితాను ప్రకటించగా.. మహబూబ్‌నగర్ నుంచి డీకే అరుణకు చోటు దక్కింది. నాగర్‌కర్నూల్ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా ఎంపీ రాములు కుమారుడు, కల్వకుర్తి జెడ్పీటీసీ సభ్యుడు భరత్ ప్రసాద్ పేరును తొలి జాబితాలోనే ప్రకటించారు. ఉమ్మడి జిల్లాలో రెండు లోక్‌సభ స్థానాలకు బీజేపీ అభ్యర్థులు ఖరారుకావడంతో ప్రచారం జోరందుకోనున్నట్లు తెలుస్తోంది. ఇవి చదవండి: 'బీజేపీ టికెట్' నగేశ్‌కే.. -
బీజేపీ రెండో జాబితా.. తెలంగాణ నుంచి ఆరుగురికి చోటు
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి బీజేపీ అభ్యర్ధుల రెండో జాబితా విడుదల చేసింది. మొత్తం 72 స్థానాలకు అభ్యర్ధులతో కూడిన జాబితాను పార్టీ అధిష్టానం గురువారం విడుదల చేసింది. ఇటీవల హర్యానా సీఎం పదవికి అనూహ్య రాజీనామా చేసిన మనోహర్ లాల్ ఖట్టర్‌తోపాటు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పేరును కూడా ప్రకటించింది. తెలంగాణ నుంచి రెండో జాబితాలో ఆరుగురు పేర్లను ఖరారు చేసింది. మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా రఘునందన్ రావుకు అవకాశం ఇచ్చింది. ఆదిలాబాద్ నుంచి మాజీ ఎంపీ గోడం నగేష్ పోటీ చేయనున్నారు. మహబూబ్‌నగర్ నుంచి డీకే అరుణ, మహబూబాబాద్ నుంచి సీతారాం నాయక్ బరిలోకి దిగుతుండగా.. పెద్దపల్లి నుంచి గోమాస శ్రీనివాస్, నల్గొండ నుంచి సైదిరెడ్డి పోటీ చేయనున్నారు. సైదిరెడ్డి, గోడెం నగేశ్, సీతారాం నాయక్ ఇటీవలే బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరారు. ఇక తెలంగాణ నుంచి తొలి జాబితాలో తొమ్మిది, రెండో జాబితాలో ఆరు స్థానాలకు అభ్యర్ధులను వెల్లడించింది బీజేపీ. ఇప్పటి వరకు 15 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా, వరంగల్, ఖమ్మం స్థానాలను పెండింగ్‌లో ఉంచింది. ఈ జాబితాలో తెలంగాణ (6)తో పాటు దాద్రానగర్ హవేలీ (1) ఢిల్లీ (2), గుజరాత్ (7), హరియాణా(6), హిమాచల్‌ప్రదేశ్(2), కర్ణాటక (20), మధ్యప్రదేశ్ (5), మహారాష్ట్ర(20),, త్రిపుర (1), ఉత్తరాఖండ్ (2) రాష్ట్రాల్లో చొప్పున అభ్యర్థులను ఖరారు చేసింది. తెలంగాణ నుంచి ఆరుగురు అభ్యర్థులు.. మహబూబ్‌నగర్: డీకే అరుణ మెదక్: రఘునందన్ రావు ఆదిలాబాద్: నగేష్ మహబూబాబాద్ : సీతారాం నాయక్ నల్గొండ : శానం సైదిరెడ్డి పెద్దపల్లి: గోమాస శ్రీనివాస్ రెండో జాబితాలో ప్రముఖులు బీజేపీ రెండో జాబితాలో పలువురు కేంద్ర మంత్రుల పేర్లను కూడా ప్రకటించింది. రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ, వాణిజ్య & పరిశ్రమల మంత్రిత్వ శాఖ పీయూష్ గోయల్, కేంద్ర సమాచారం బ్రాడ్‌కాస్టింగ్ శాఖ మంత్రి అనురాగ్ ఠాగూర్, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషిలకు అవకాశం ఇచ్చింది. వీరితోపాటు కర్ణాటక మాజీ సీఎం, షిగ్గావ్ ఎమ్మెల్యే బసవరాజ్ బొమ్మెకు ఈసారి ఎంపీగా చాన్స్ ఇచ్చింది. హవేరి నుంచి ఆయన లోక్‌సభ బరిలో దిగుతున్నారు. ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్ నుంచి మాజీ సీఎం త్రివేంద్రసింగ్రావత్ బరిలో నిలిపింది. నితిన్ గడ్కరీ- నాగ్‌పూర్(మహారాష్ట్ర) పీయూష్ గోయల్- ముంబై నార్త్(మహారాష్ట్ర) ప్రహ్లాద్ జోషి, ధార్వాడ్(కర్ణాటక) అనురాగ్ ఠాగూర్- హమిర్పూర్( హిమాచల్ ప్రదేశ్) మనోహర్‌లాల్ ఖట్టర్- కర్నాల్( హర్యానా) లోక్‌సభ ఎన్నికలు.. బీజేపీ అభ్యర్థుల రెండో జాబితా ఇదే.. -
సాక్షి స్ట్రెయిట్ టాక్ విత్ డీకే అరుణ
-
గిరిజనులతో కలిసి స్టెపులేసిన డీకే అరుణ
-
కేసీఆర్‌ను కాపాడాలని చూస్తోంది
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ సర్కార్ వ్యవహారశైలి చూస్తుంటే మాజీ సీఎం కేసీఆర్‌ను కాపాడాలని చూస్తున్నట్టు అనుమానం కలుగుతోందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. దేశంలోనే అతిపెద్ద కుంభ కోణం కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌పై కాంగ్రెస్ ప్రభుత్వం జ్యుడీషి యల్ ఎంక్వైరీతో కాలయాపన చేయాలని చూస్తోందని పేర్కొన్నారు. బీఆర్ఎస్ సర్కార్ కాళేశ్వరం రీడిజైన్ పేరుతో ఉద్దేశపూర్వకంగా ప్రాజెక్ట్ వ్యయా న్ని సుమారు రూ.63 వేల కోట్ల నుంచి రూ.1.50 లక్షల కోట్లకు అంచనాలుపెంచి.. వేలకోట్ల అవినీ తికి పాల్పడిందన్నారు. ఆదివారం అరుణ మీడి యాతో మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. హైకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించడం కంటే సీబీఐ దర్యాప్తు జరి పిస్తే నిజానిజాలు బయటపడతాయన్నారు. కాళేశ్వరం అవినీతి ఆరోపణలపై సీబీఐ విచారణ కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి సీఎం రేవంత్‌రెడ్డి ఎందుకు లేఖ రాయలేదో చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. -
అన్ని వర్గాలు, ప్రాంతాల అభివృద్ధి, సంక్షేమం బీజేపీతోనే సాధ్యం
-
పోటీలో లేని గద్వాల జేజమ్మ
సాక్షి, నాగర్‌కర్నూల్: దశాబ్దాల పాటు రాజకీయ అనుభవం ఉన్న ఉమ్మడి పాలమూరులోని సీనియర్ రాజకీయ నేతలు ఈసారి అసెంబ్లీ ఎన్నికల బరి నుంచి తప్పుకున్నారు. సుమారు 35 నుంచి 40 ఏళ్ల పాటు ఎన్నికల పోరులో తలపడుతూ వచ్చిన పలువురు రాజకీయ ఉద్దండులు అనూహ్యంగా ఎన్నికల్లో పోటీ నుంచి నిష్క్రమించడం గమనార్హం. మారిన పరిస్థితులకు అనుగుణంగా వీరంతా ఎన్నికల్లో పోటీలో ఉన్న ఇతర అభ్యర్థులకు మద్దతుగా ఉంటూ ప్రచారం సాగిస్తున్నారు. గద్వాల ఫైర్‌బ్రాండ్ డీకే అరుణ గద్వాల ఫైర్‌బ్రాండ్‌గా పేరొందిన డీకే అరుణ ఈసారి ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకున్నారు. కాంగ్రెస్ అభ్యర్థిగా 1999లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడిపోగా.. సమజ్వాదీ పార్టీ అభ్యర్థిగా 2004 ఎన్నికల్లో బరిలో నిలిచి గెలుపొందారు. అనంతరం 2009, 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గెలిచారు. మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా, కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా సేవలందించారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలు కాగా, అనంతరం బీజేపీలో చేరారు. ఆపార్టీలో జాతీయ ఉపాధ్యక్షురాలుగా కొ నసాగుతున్నారు. అయితే అ నూహ్యంగా ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి ఆమె దూ రంగా ఉన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకే ఇ ప్పుడు బరి నుంచి తప్పుకున్నట్లు ప్రచారం సాగుతోంది. చివరి నిమిషంలో జిల్లెల చిన్నారెడ్డి ఏఐసీసీ కార్యదర్శిగా కొనసాగుతున్న జిల్లెల చిన్నారెడ్డి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా సేవలందించారు. వనపర్తి నియోజకవర్గం నుంచి 1989, 1999, 2004, 2014 ఎన్నికల్లో విజయం సాధించారు. ఈసారి ఎన్నికల్లో సైతం ఆయనకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ప్రకటించినా చివరి నిమిషంలో అభ్యర్థిత్వంలో మార్పు చేసింది. ఆయన స్థానంలో మరో నేత మేఘారెడ్డికి టికెట్ ఖరారు చేసింది. దీంతో ఆయన తప్పనిసరి పరిస్థితుల్లో ఎన్నికల బరి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో మూడు, నాలుగు దశాబ్దాలుగా రాజకీయాల్లో వెలుగొందిన నేతలు ప్రస్తుత ఎన్నికల్లో అనూహ్యంగా బరి నుంచి తప్పుకోవడం చర్చనీయాంశంగా మారింది. కందనూలు పోరుకు నాగం వీడ్కోలు.. నాగర్‌కర్నూల్ నియోజకవర్గంలో 1983 నుంచి సుమారు 40 ఏళ్లుగా ఎన్నికల బరిలో నిలుస్తూ వచ్చిన మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి ఈసారి పోటీ నుంచి తప్పుకున్నారు. 1983లో వైద్యరంగం నుంచి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన నాగం కందనూలుతో పాటు రాష్ట్ర రాజకీయాల్లో బలమైన ముద్ర వేశారు. టీడీపీ అభ్యర్థిగా 1985, 1994, 1999, 2004, 2009 ఎన్నికల్లో విజయం సాధించారు. 2012 ఉపఎన్నికలోనూ ఇండిపెండెంట్‌గా పోటీ చేసి గెలుపొందారు. ఈ క్రమంలో ఆరుసార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడిగా సేవలందించారు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశించిన ఆయనకు భంగపాటు తప్పలేదు. ఈ అనూహ్య పరిణామానికి కలత చెందిన నాగం కాంగ్రెస్‌ను వీడి, బీఆర్ఎస్లో చేరి ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డికి మద్దతుగా ప్రచారం చేస్తున్నారు. కొల్లాపూర్‌లో మరో కాంగ్రెస్ నేత చింతలపల్లి జగదీశ్వరరావు ఈసారి ఎన్నికల బరి నుంచి వైదొలిగారు. 2009లో టీడీపీ నుంచి బరిలో ఉన్న ఆయన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి జూపల్లి కృష్ణారావుపై 1508 ఓట్ల స్వల్ప మెజార్టీతో ఓటమి పాలయ్యారు. అనంతరం 2012 ఉప ఎన్నికల్లోనూ టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ ఆశించగా, జూపల్లి కృష్ణారావుకు టికెట్ కేటాయించడంతో జగదీశ్వరరావు పోటీ నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది. -
ఈసారి ఎందుకు పోటీ చేయడం లేదంటే ?
-
తెలంగాణలో బీజేపీకి షాకిస్తున్న సీనియర్ నేతలు
-
గద్వాల నుంచి పోటీకి డీకే అరుణ దూరం.. కారణమిదే..?
ఢిల్లీ: తెలంగాణ బీజేపీలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. నవంబర్ 30న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ రాష్ట్ర స్థాయి పెద్దలు డాక్టర్ లక్ష్మణ్ , కిషన్ రెడ్డిలు పోటీ చేయట్లేదని ఇప్పటికే ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా తాము ప్రచారం చేస్తామని వెల్లడించారు. అయితే.. ఇదే వరుసలో గద్వాల ఎమ్మెల్యే డీకే అరుణ కూడా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోనని స్పష్టం చేశారు. అధిష్టానానికి డీకే అరుణ తన నిర్ణయాన్ని తేల్చి చెప్పారు. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించారు. బీజేపీ గూటికి రాథోడ్ బాపురావు బీఆర్ఎస్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు బీజేపీ గూటికి చేరారు. కిషన్ రెడ్డి సమక్షంలో బీజేపీ కండువా కప్పుకున్నారు. బోథ్ సిట్టింగ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావును కాదని నేరడిగొండ జెడ్పీటీసీ అనిల్ జాదవ్‌కు సీఎం కేసీఆర్ పార్టీ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. దీంతో అసంతృప్తికి గురైన బాపురావు.. బీజేపీ నుంచి బరిలో దిగనున్నారు. ఇదీ చదవండి: బీజేపీకి గడ్డం వివేక్ రాజీనామా.. కాంగ్రెస్‌లో చేరిక -
కాంగ్రెస్ లో చేరే ప్రసక్తే లేదు: డీకే అరుణ
-
‘పార్టీ మారే ప్రసక్తే లేదు.. మైండ్ గేమ్ ఆడుతున్నారు’
హైదరాబాద్: తాను పార్టీ మారబోతున్నట్లు వస్తున్న వార్తలను బీజేపీ జాతీయ ఉపాధ్యక్షులు డీకే అరుణ తీవ్రంగా ఖండించారు. పార్టీ మారుతున్నట్లు మీడియాలో వచ్చిన వార్తలపై డీకే అరుణ స్పందించారు. ఈ విషయంపై పత్రిక ప్రకటన విడుదల చేసిన డీకే అరుణ.. తాను కాంగ్రెస్ పార్టీలో చేరే ప్రసక్తి లేదని, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉద్దేశపూర్వకంగా ఇలాంటి మైండ్ గేమ్ ఆడుతున్నారని ఆరోపించారు. బీజేపీ జాతీయ నాయకత్వం తనను గుర్తించి జాతీయ ఉపాధ్యక్ష పదవి ఇచ్చిందని, మోదీ నాయకత్వంలో పని చేయడం తన అదృష్టం అని డీకే అరుణ అన్నారు. మీడియా వారు కనీసం తన స్పందన తీసుకోకుండా కథనాలు రాయడం సరికాదని డీకే అరుణ మండిపడ్డారు. తన రాజకీయ భవిష్యత్ నిర్ణయించే హక్కు మీడియాకు ఎవరు ఇచ్చారని, కాంగ్రెస్‌లో తన చేరిక పై దుష్ప్రచారం చేస్తున్న మీడియా సంస్థలను ఆమె ప్రశ్నించారు. తనపై దుష్ప్రచారం చేసిన మీడియా సంస్థలపై పరువు నష్టం దావా వేస్తానని డీకే అరుణ హెచ్చరించారు. ఇది కూడా చదవండి: అందులో కూడా కేసీఆరే కనిపిస్తడు కదా? -
రాజగోపాల్ బాటలో డీకే అరుణ కూడా?
సాక్షి, హైదరాబాద్: బీజేపీ కొత్త నేతల్లో కొందరు రాజగోపాల్‌రెడ్డి రాజీనామాతో పునరాలోచనలో పడ్డారనే ప్రచారం జరుగుతోంది. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా ఉన్న డీకే అరుణ కూడా ఆ బాటలో ఉన్నట్టు కనిపిస్తోందని నేతలు అంటున్నారు. బీజేపీ తరఫున గద్వాల నుంచి పోటీ చేస్తానన్న ఆమె ఇటీవల మాట మార్చారని ఆ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అక్కడ ప్రతికూల పరిస్థితులు ఉన్నాయన్న అంతర్గత సమాచారంతో పోటీపై వెనక్కి తగ్గారని.. గద్వాల నుంచి బీసీ అభ్యర్థి ని నిలబెడితే పూర్తి మద్దతు ఇచ్చి గెలిపిస్తానంటున్నారని పేర్కొంటున్నాయి. అసెంబ్లీకి పోటీ చేయాలని బీజేపీ జాతీయ నాయకత్వం పట్టుబడితే.. తన తల్లిగారి ప్రాంతమైన నారాయణపేట నుంచి పోటీ చేస్తానని సంకేతాలు ఇచ్చారని.. దీనిని ఆ నియోజకవర్గ నాయకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని తెలిసింది. ఈ క్రమంలోనే డీకే అరుణ పార్టీ మారే ఆలోచన చేస్తున్నారంటూ.. రాజగోపాల్‌రెడ్డి మాదిరిగా చివరి నిమిషంలో బీజేపీని వీడి, కాంగ్రెస్‌లో చేరే అవకాశాలను తోసిపుచ్చలేమంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. ఆమె కాంగ్రెస్‌లో మక్తల్ లేదా నారాయణపేట సీటు అడుగుతున్నట్టు కాంగ్రెస్ వర్గాల సమాచారం. ఇదే జరిగితే మహబూబ్‌నగర్ జిల్లాలో జితేందర్‌రెడ్డి మినహా గట్టి నాయకుడు ఎవరూ లేకుండాపోతారని బీజేపీ వర్గాలు అంటున్నాయి. -
60 సీట్లపై బీజేపీ కసరత్తు కొలిక్కి!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర బీజేపీలో అభ్యర్థుల ఖరారు కసరత్తు కొలిక్కి వస్తోంది. శుక్రవారం జరిగిన ముఖ్యనేతల సమావేశంలో 60 స్థానాల్లో అభ్యర్థులపై (19 ఎస్సీ, 12 ఎస్టీ సీట్లు మినహాయించి) ఒక అభిప్రాయానికి వచ్చినట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఈ సీట్లకు సంబంధించి మరోసారి చర్చించి, పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీని జాబితాల ను పంపాలని నిర్ణయించినట్టు వివరిస్తున్నాయి. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో రాష్ట్ర పార్టీ ఎన్నికల ఇన్చార్జి ప్రకాశ్ జవదేకర్, బీజే పీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, పార్లమెంటరీ బోర్డు సభ్యుడు కె.లక్ష్మణ్, రాష్ట్ర పార్టీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్, ఇతర నేతలు పాల్గొన్నారు. ఆయా స్థానాల్లో ప్రాధాన్యతలు, ప్రతిపాదిత అభ్యర్థుల పేర్లను కీలక నేతలు అందజేయడంతో.. భేటీలో అన్నింటినీ సరిచూసి, కామన్‌గా ఉన్న పేర్లను ముసాయిదా జాబితా కోసం పరిగణనలోకి తీసుకున్నట్టు సమాచారం. సంఘ్‌పరివార్ క్షేత్రంలోని వారితోనూ పార్టీ నేతలు సమావేశమై, ఆయా సీట్లకు పేర్లపై స్పష్టత తీసుకున్నట్టు తెలిసింది. కసరత్తు పూర్తయ్యాక 40–45 మందితో తొలిజాబితాను ఢిల్లీలో ప్రకటించే అవకాశాలు ఉన్నట్టు పార్టీనేతలు చెప్తున్నారు. పలు స్థానాలపై స్పష్టత శుక్రవారం జరిగిన భేటీలో హైదరాబాద్ నగరంలోని రెండు ముఖ్యమైన స్థానాల్లో పోటీచేసే అభ్యర్థులపై స్పష్టత వచ్చినట్టు తెలుస్తోంది. అంబర్‌పేట నుంచి పోటీకి కిషన్‌రెడ్డి సుముఖత వ్యక్తం చేయగా.. ముషీరాబాద్ నుంచి బరిలో ఉండేందుకు కె.లక్ష్మణ్ విముఖంగా ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలో ముషీరాబాద్ నుంచి పోటీ చేసేందుకు పలువురు ముందుకొచ్చినట్టు తెలిసింది. ఈ నియోజకవర్గంలో ఐదుగురు బీజేపీ కార్పొరేటర్లు ఉండగా.. ఒకరు బీఆర్ఎస్లోకి వెళ్లారు. మిగతా నలుగురు కూడా తమకు ఎమ్మెల్యే టికెట్ కావాలని కోరుతున్నారు. దీంతో ఈసారి కార్పొరేటర్లకు టికెట్ అవకాశం కల్పించరాదని నిర్ణయించినట్టు తెలిసింది. అందరూ కలసికట్టుగా పనిచేస్తే పార్టీ విజయానికి మార్గం సుగమం అవుతుందని ఈ సందర్భంగా నేతలు స్పష్టం చేసినట్టు సమాచారం. హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ కుమార్తె బండారు విజయలక్ష్మి ముషీరాబాద్ అసెంబ్లీ టికెట్ ఆశిస్తున్నారు. ఆమెకు టికెట్ ఖరారయ్యే అవకాశాలు ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. -
బీజేపీలో చేరిన చీకోటి ప్రవీణ్
కాచిగూడ (హైదరాబాద్): ధర్మరక్ష సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు, క్యాసినో కింగ్ చీకోటి ప్రవీణ్ బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ సమక్షంలో శనివారం ఆ పార్టీలో చేరారు. బర్కత్‌పురలోని బీజేపీ నగర కార్యాలయంలో జరిగిన సమావేశంలో ప్రవీణ్‌తోపాటు ఆయన అనుచరులకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వనించారు. మాజీ ఎమ్మెల్సీ ఎన్.రాంచందర్‌రావు, పార్టీ హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ ఎన్.గౌతంరావుతో కలిసి డీకే అరుణ మాట్లాడుతూ సీఎం పదవి కోసం మంత్రి కేటీఆర్.. సీఎం కేసీఆర్ ఆరోగ్యంపై పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. సీఎం కేసీఆర్ ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్తో బాధపడుతుంటే ఆస్పత్రిలో చేర్పించకుండా ఫామ్‌హౌస్‌లో ఉంచడం అనుమానాలకు దారితీస్తోందన్నారు. సీఎం ఆరోగ్యంపట్ల జాగ్రత్తలు తీసుకోకుండా మంత్రులు కేటీఆర్, హరీశ్రావులిద్దరే తెలంగాణలో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారని, ఎవరికి వారే సీఎం పదవి కోసం పాకులాడుతున్నారని ధ్వజమెత్తారు. ఉద్యోగాల కోసం దొంగ నోటిపికేషన్లు వేసి నిరుద్యోగులను మోసగించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కానిస్టేబుల్ పరీక్షల ఫలితాలు ప్రకటించారని, అందులో కూడా అభ్యర్థులకు తీవ్ర నష్టం జరిగినట్లు తమ దృష్టికి వచ్చిందని అన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఒకసారి బీజేపీకి అవకాశం ఇవ్వాలని కోరారు. ప్రవీణ్ మాట్లాడుతూ ప్రపంచంలోనే బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించిందని, ధర్మరక్షణ కోసం బీజేపీలో చేరినట్లు తెలిపారు. అధిష్టానం నిర్ణయం మేరకు పార్టీ కోసం పనిచేస్తానని, పార్టీ ఆదేశిస్తే ఎక్కడి నుంచి అయినా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు. -
అమిత్ షా జోక్యంతో లైన్ క్లియర్.. బీజేపీలో చేరిన చీకోటి ప్రవీణ్
సాక్షి, హైదరాబాద్: క్యాసినో కింగ్‌గా అందరి దృష్టిలో నిలిచిన చీకోటి ప్రవీణ్ కుమార్ బీజేపీలో చేరారు. బర్కత్‌పూరలోని బీజేపీ కార్యాలయంలో చీకోటివెళ్లి పార్టీలో చేరారు. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ చీకోటి ప్రవీణ్‌కు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ రామచంద్ర రావు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. కాగా చికోటి ప్రవీణ్ వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు సన్నద్ధమవుతున్నారు. హైదరాబాద్‌లోని ఏఓ ఒక క నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే గతంలోనే చీకోటి బీజేపీలో చేరాలనుకున్నారు. ఇందుకు బీజేపీ ఆఫీస్‌కు తన అనుచరులతో వెళ్తే పార్టీలో చేర్చుకునేందుకు నేతలు నిరాకరించారు. కండువా కప్పేందుకు పార్టీ ఆఫీస్‌లో ఎవరు లేకపోవడంతో నిరాశతో వెనుదిరిగారు. చదవండి: హంగు కాదు.. బీజేపీ డకౌట్ అవుతుంది: హరీష్ రావు కిషన్ రెడ్డికి ఇష్టం లేక.. తాజాగా చికోటి ప్రవీణ్‌కు బీజేపీ అగ్ర నాయకత్వం నుంచి గ్రీన్‌సిగ్నల్ రావడంతో కాషాయ కండువా కప్పుకున్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా జోక్యంతో చీకోటికి లైన్ క్లియర్ అయ్యింది. ప్రవీణ్‌ను పార్టీలో చేర్చుకోవాలని బీజేపీ రాష్ట్రనాయకత్వానికి అమిత్ షా ఆర్డర్ వేశారు. అయితే చీకోటిని బీజేపీలో చేర్చుకోవడం కిషన్ రెడ్డికి ఇష్టం లేకపోవడంతో డీకే అరుణ సమక్షంలో చేరారు. కేసీఆర్ ఆరోగ్యం నిర్లక్ష్యం చేయోద్దు ఈ సందర్భంగా డీకే అరుణ మీడియా ముందు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఆరోగ్యంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఆరోగ్యంపై అనుమానాలున్నాయన్నారు. ముఖ్యమంత్రి కావాలన్న ఆత్రుతతో కేసీఆర్ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దని కోరుతున్నట్లు తెలిపారు. కేసీఆర్‌ను జాగ్రత్తగా చూసుకోవాలని కోరారు. ఒక్కసారి బీజేపీకి అధికారం ఇచ్చి చూడండి ‘బావ బావమరుదులు ఆదరాబాదరాగా పనులు పూర్తికాకుండానే తెళ్లసున్నాలు వేసి ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. ఎన్నికల కోసం జిమ్మిక్కులు చేస్తున్నారు. గృహలక్ష్మి పథకం ఇన్నాళ్లు గుర్తురాలేదా?. తెలంగాణ ప్రజలను మోసం చేయవద్దు. తండ్రి ఆరోగ్యంపై ఆందోళన లేకుండా... సీఎం కావాలనే ఆరాటంలోనే కేటీఆర్ ఉన్నారు. దొంగ నోటిఫికేషన్లు వేసి.. పేపర్లు లీక్ చేసి నిరుద్యోగులను మోసం చేశారు. ఒక్కసారి బీజేపీకి అధికారం ఇచ్చి చూడండి. బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం లోపాయికారీ ఒప్పందం చేసుకున్నారు. కేసీఆర్ ఆరోగ్యం ఎలా ఉంటే తనకేంటి అన్నట్లు కేటీఆర్ వ్యవహరిస్తున్నారు. పెద్దాయనను ఫాంహౌజ్‌లో పడుకోబెట్టి నువ్వా నేనా అన్నట్టుగా కేటీఆర్, హరీష్ పరిగెత్తుతున్నారు. వారి ఉరుకులాట సీఎం పదవి కోసమే. ఎన్నికల గిమ్మిక్కులను ప్రజలు నమ్మొద్దు’ అని అన్నారు. -
బీఆర్ఎస్కు డీకే అరుణ స్ట్రాంగ్ కౌంటర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున కొద్దీ పొలిటికల్ వాతావరణం రసవత్తరంగా మారుతోంది. ప్రధాని మోదీ నిజామాబాద్ బీజేపీ సభలో చేసిన వ్యాఖ్యలు తెలంగాణలో పొలిటికల్ హీట్‌ను పెంచాయి. ఈ నేపథ్యంలో నేతలు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. తాజాగా బీజేపీ నేత డీకే అరుణ.. బీఆర్ఎస్ సర్కార్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా, డీకే అరుణ బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రధాని మోదీ వాస్తవాలు మాట్లాడారు. బీఆర్ఎస్ నేతలే సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారు. ప్రధానిని అవమానించేలా మాట్లాడుతున్నారు. రాజకీయ నేతలంటేనే అసహ్యించుకునే పరిస్థితి తెచ్చారు. ప్రధాని మోదీపై ఇస్టానుసారం మాట్లాడితే ఊరుకునేది లేదు. ప్రధాని మోదీపై కేసీఆర్ కుటుంబం అహంకారపూరిత మాటలు దుర్మార్గం. తెలంగాణ ఎవరి జాగీరు కాదు.. తెలంగాణ ప్రజలను ఓటు అడిగే హక్కు కేసీఆర్‌కు లేదు. కేటీఆర్‌ను ముఖ్యమంత్రి చేయడానికే.. టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చారు. తెలంగాణకు ఈ 9 ఏళ్లలో కేంద్రం రూ.9 లక్షల కోట్ల నిధులిచ్చింది. తెలంగాణ మోడల్ అంటే.. అవినీతి మోడల్. గెలిచినోళ్లను కాపాడుకోలేని కాంగ్రెస్.. ప్రజలకేమి గ్యారంటీ ఇస్తోంది?. లోపాయికారి ఒప్పందంలో భాగంగానే ఓటుకు నోటు కేసులో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని సీఎం కేసీఆర్ కాపాడుతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ది ఫెవికాల్ బంధం అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇది కూడా చదవండి: బీఆర్ఎస్ మేనిఫెస్టో.. శుభవార్తకు రెడీగా ఉండాలన్న హరీష్ రావు -
ప్రధానిని అవమానించేలా మాట్లాడుతున్నారు: డీకే అరుణ
-
కేసీఆర్ సర్కార్ పాలనకు చరమగీతం పాడాలి
నిజామాబాద్ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: వచ్చే ఎన్నికల్లో బీజేపీని ఆశీర్వదించాలని, సీఎం కేసీఆర్ సర్కార్ పాలనకు చరమగీతం పాడాలని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం నిజామాబాద్‌లో జరిగిన బీజేపీ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో అవినీతి, కుటుంబ పార్టీలైన బీఆర్ఎస్, కాంగ్రెస్‌లకు బుద్ధి చెప్పే అవకాశం ప్రజలకు లభిస్తోందని చెప్పారు. ప్రధాని మోదీ నాయకత్వంలో తెలంగాణలో బీజేపీ జెండా ఎగురవేసేలా ప్రజ లు ముందుకు రావాలని కోరారు. కల్వకుంట్ల కుటుంబానికి ముందుంది ముసళ్ల పండుగ అని ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. అసలైన కథ ఇప్పుడే మొదలైందన్నారు. కేసీఆర్‌ను మించిన అబద్ధాలకోరు రాష్ట్రంలో మరొకరు లేరని బీజేపీ చేరికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ విమర్శించారు. పసుపు బోర్డు ఇస్తే అభ్యర్థి ని పెట్టబోనని చెప్పిన బీఆర్ఎస్ ఏం ముఖం పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేస్తుందో చెప్పాలన్నారు. పసుపు రైతుల దశాబ్దాల కల ప్రధాని మోదీ నెరవేర్చారని బీజేపీ జాతీయ ఉ పాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. కేసీఆర్ కుటుంబ రాజకీయాలను సమాధి చేయాలని బీజేపీ మధ్యప్రదేశ్ ఇన్చార్జి మురళీధర్‌రావు పిలుపునిచ్చారు. పసుపు బోర్డు వచ్చినందుకు రైతులందరూ సంతోషంగా ఉన్నారని చెప్పారు. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సభలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్, ఎంపీ సోయం బాపూరావు, ఎమ్మెల్సీ ఏవీఎన్‌రెడ్డి, పార్టీ నేతలు ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, యెండల లక్ష్మీనారాయణ, ఎం.రవీంద్రనాయక్, జి.విజయ రామారావు, రమేశ్ రాథోడ్, గరికపాటి మోహన్‌రావు, బూర నర్సయ్యగౌడ్, డి.ప్రదీప్‌రావు తదితరులు పాల్గొన్నారు. అరుణతార వందన సమర్పణ చేశారు. సభ ముగిశాక వేదికపైనే బండి సంజయ్, ఈటల రాజేందర్, గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డిని ప్రధాని భుజం తట్టి అభినందించారు. కొన్నేళ్లుగా చెప్పులు కూడా ధరించకుండా పోరాడుతున్న పసుపు బోర్డు ఉద్యమ నాయకుడు మనోహర్‌రెడ్డి గురించి సంజయ్‌ని అడిగి తెలుసుకున్నారు. బీజేపీలో జోష్ మోదీ బహిరంగసభ విజయవంతం కావడంతో కాషాయదళంలో ఉత్సాహం వెల్లివిరుస్తోంది. అంచనాలకు మించి భారీగా ప్రజలు, పార్టీ కార్యకర్తలు హాజరుకావడం, ప్రధాని ప్రసంగానికి జనాల్లో బాగా స్పందన కనిపించడంపై పార్టీ నేతలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్, అవినీతి అంశాలను మోదీ ప్రస్తావించినప్పుడల్లా కేకలు, ఈలలు, చప్పట్లతో సభికు లు మద్దతు ప్రకటించారు. తెలుగులో నా కుటుంబ సభ్యులారా.. అని అనగానే హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. ప్రసంగం మధ్యలో మోదీ మోదీ అంటూ నినాదాలు చేశారు. -
ప్రతిపక్షాల చిల్లర రాజకీయం
-
ప్రభుత్వ అసమర్థత వల్లే గ్రూప్–1 వాయిదా
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో గ్రూప్–1 పరీక్షలు మళ్లీ వాయిదా పడటంపై బీజేపీ ఆందోళన, ఆగ్ర హం వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వ అసమర్థత కారణంగానే గ్రూప్–1 ప్రిలిమ్స్ పరీక్ష మరోసారి రద్దయిందని కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ అధ్య క్షుడు కిషన్‌రెడ్డి, పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, పార్టీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ వేర్వేరు ప్రకటనల్లో ధ్వజమె త్తారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వ అసమర్థ ప్రజాపా లన, సరైన నిర్ణయాలు తీసుకోవడంలో వైఫల్యం కారణంగానే.. వరుసగా రెండోసారి రాష్ట్రంలో గ్రూప్–1 ప్రిలిమినరీ పరీక్షలు వాయిదా పడ్డాయని కిషన్‌రెడ్డి విమర్శించారు. ఈ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న 4 లక్షల మంది యువతలో నైరాశ్యం నింపేలా కేసీఆర్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని ధ్వజ మెత్తారు. ఈ మేరకు ఆయన శనివారం ఢిల్లీ నుంచి ప్రకటన విడుదల చేశారు. ఇటీవలే జరిగిన పేపర్ లీక్ ఘటన, తదనంతర పరిణామాల నేపథ్యంలోనైనా రాష్ట్ర ప్రభుత్వం కాస్త జాగ్రత్తగా వ్యవహ రిస్తుందనుకుంటే.. మళ్లీ అదే అస మర్థత, అదే నిర్లక్ష్యాన్ని ప్రదర్శించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రూప్–1 పరీక్షల నిర్వహణ విషయంలో సర్కారు నిర్లక్ష్యాన్ని కొందరు హైకోర్టు దృష్టికి తీసు కెళ్లడంతో.. పరీక్షలను రద్దుచేయ డం మినహా న్యాయస్థానం ముందు వేరే అవకాశమే లేకుండా పోయిందని పేర్కొ న్నారు. రాష్ట్రంలో యువత భవిష్యత్తుకు భద్రత, భరోసా కల్పించలేని కేసీఆర్ ప్రభుత్వానికి అధి కారంలో ఉండే నైతిక అర్హత లేదని విమర్శించారు. టీఎస్పీఎస్సీ చైర్మన్ రాజీనామా చేయాలి: అరుణ డిమాండ్ టీఎస్పీఎస్సీని వెంటనే ప్రక్షాళన చేయాలని, చైర్మ న్ ఈ ఘటనకు భాద్యత వహించి తక్షణమే రాజీ నామా చేయాలని డీకే అరుణ డిమాండ్ చేశారు. గ్రూప్ –1 పరీక్షలు రాసిన అభ్యర్థులకు ప్రభుత్వం వెంటనే నష్ట పరిహారం అందజేయాలన్నారు. కేసీ ఆర్ సర్కార్‌కు మద్యం నోటిఫి కేషన్‌పై ఉన్న శ్రద్ధ, ఉద్యోగ నోటిఫికేషన్ పై లేదని విమర్శించారు. ప్రభుత్వానికి సిగ్గుండాలి: ఈటల ధ్వజం కోర్టు తీర్పు ప్రభుత్వానికి చెంప పెట్టి లాంటిదని, ఈ ప్రభుత్వానికి సిగ్గుండాలని ఈటల రాజేందర్ ధ్వజమెత్తారు. ఎన్నికల్లో పైసలు, మద్యం పంచుడు ఇవన్నీ కాదని, ఇప్పటికైనా సీఎం కేసీఆర్ మేల్కొని పాలనపై దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు. -
‘TSPSCని తక్షణమే ప్రక్షాళన చేయాలి’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ హైకోర్టు గ్రూప్-1 ప్రిలిమ్స్ రద్దు చేసిన దరిమిలా.. TSPSC బోర్డుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హైకోర్టు తీర్పుపై డివిజన్ బెంచ్‌కు వెళ్తామని బోర్డు ప్రకటించినప్పటికీ.. అభ్యర్థులు శాంతించడం లేదు. పరీక్షలో బయోమెట్రిక్ విధానం అమలు చేయకపోవడం అనే కారణంతోనే రెండోసారి పరీక్షను రద్దు చేస్తూ.. తిరిగి నిర్వహించాలని ఆదేశించింది హైకోర్టు. దీంతో అభ్యర్థులు టీఎస్పీఎస్సీ బోర్డుపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. గ్రూప్-1 రద్దు పై ఉస్మానియా యూనివర్సిటీ ఒక్కసారిగా వేడెక్కింది. పరీక్ష రద్దుపై నిరసన వ్యక్తం చేస్తూ విద్యార్థులు రోడ్డెక్కారు. ఉద్యోగాభ్యర్థుల జీవితాలతో ఆడుకుంటున్న టీఎస్పీఎస్సీ బోర్డును రద్దు చేయాలంటూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. కొత్త టీఎస్పీఎస్సీ బోర్డు ఏర్పాటు చేసి దాని ద్వారా పరీక్షలు నిర్వహించాలంటూ డిమాండ్ చేస్తున్నారు వాళ్లు. ఈ క్రమంలో.. ముందస్తుగా ఓయూ దారులను మూసేశారు అధికారులు. డీకే అరుణ ఫైర్ TSPSC గ్రూప్-1 పరీక్ష రాసిన అభ్యర్థులకు ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం చెల్లించాలని డీకే అరుణ డిమాండ్ చేస్తున్నారు. ‘‘ప్రభుత్వానికి నిరోద్యోగ యువత పట్ల చిత్తశుద్ధి లేదు. మద్యం నోటిఫికేషన్‌పై ఉన్న శ్రద్ధ.. ఉద్యోగ నోటిఫికేషన్‌పై లేదు. బయోమెట్రిక్ విధానం పెడితే ఖర్చు అవుతుందని కక్కుర్తి పడడం వల్ల లక్షలాది మంది నిరుద్యోగులు రోడ్డున పడ్డారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం మద్యం నోటిఫికేషన్ తప్ప.. ఏ నోటిఫికేషన్ సక్రమంగా జరగలేదు. ఉద్యోగాలు ఇవ్వకుండా ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్.. పరీక్షలు నిర్వహించే విధానం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. TSPSCని వెంటనే ప్రక్షాళన చేయాలి. చైర్మన్ ఈ ఘటనకు బాధ్యత వహించి వెంటనే రాజీనామా చేయాలి అని డీకే అరుణ డిమాండ్ చేస్తున్నారు. సీఎం కేసీఆర్ స్పందించాలి: NSUI వెంకట్ గ్రూప్ 1 రద్దు పై హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నట్లు ఎన్ఎస్యూఐ నేత బాల్మూరి వెంకట్ తెలిపారు. ‘‘ టీఎస్పీఎస్సీ తీరుపై హైకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. గ్రూప్ 1 లో, బయోమెట్రిక్ విధానం లేకపోవడం,అవకతవకలు జరిగాయని హైకోర్టు భావించి రద్దు చేసింది. ఇప్పటికైనా టీఎస్పీఎస్సీ ప్రక్షాళన జరగాలి. విద్యార్థులు మనోధైర్యం కోల్పోరాదు. సీఎం కేసీఆర్ తక్షణమే స్పందించి.. టీఎస్పీఎస్సీ ప్రక్షాళన చేసి మళ్ళీ గ్రూప్ 1 పరీక్షలు యధావిధిగా నిర్వహించాలి. అలా చేయకపోతే మంత్రులను అధికారులు ఎక్కడెక్కడ అడ్డుకొని తీరుతాం. వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వంలో క్వాలిఫై అయిన అభ్యర్థులకు తగిన న్యాయం చేస్తాం . గ్రూప్ 1 రద్దుతో ఆందోళన చేస్తున్న విద్యార్థులది న్యాయపోరాటం అని పేర్కొన్నారు వెంకట్. మొత్తం 503 గ్రూప్ 1 పోస్టుల భర్తీ కోసం టీఎస్పీఎస్సీ ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. లీకేజీ ఆరోపణలతో నేపథ్యంలో కిందటి ఏడాది జరిగిన గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష తొలిసారి రద్దయింది. ఈ ఏడాది జూన్ 11న రెండోసారి పరీక్ష జరగ్గా.. రాష్ట్ర వ్యాప్తంగా 2.32 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. అయితే బయోమెట్రిక్ వివరాలు తీసుకోకపోవడం.. హాల్ టికెట్ నెంబర్ లేకుండా ఓఎంఆర్ షీటు ఇవ్వడంపై పలువురు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో పరీక్షను రద్దు చేస్తూ తాజాగా న్యాయస్థానం నిర్ణయం తీసుకుంది. -
‘ఆరు గ్యారంటీ’లతో మోసగించేందుకు కాంగ్రెస్ సిద్ధమైంది
సాక్షి, హైదరాబాద్: తెలంగాణకు 6 గ్యరంటీలు అంటూ రాష్ట్ర ప్రజలను మరోసారి మోసగించేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమైందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ సభలో రాహుల్ గాంధీ సహా ఇతర నాయకులు అలవికాని హామీలతో మోసం చేసి అధికారం దక్కించుకోవాలనే కుట్ర చేస్తున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఈ ఆరు గ్యారంటీ పథకాలను ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. పార్టీనేతలు మాఘం రంగారెడ్డి, మాజీ మేయర్ బండా కార్తీక రెడ్డి, సీహెచ్ విఠల్, రాకేశ్‌రెడ్డి, జె.సంగప్పలతో కలిసి అరుణ మంగళవారం మీడియాతోమాట్లాడారు. ఒక సాధారణ వ్యక్తి దేశ ప్రధాని కావడం, మోదీ నాయకత్వంలో భారత ఖ్యాతి విశ్వవ్యాప్తమవుతుండటాన్ని కాంగ్రెస్ జీర్ణించుకోలేకపోతోందన్నారు. గాంధీ పేరు పెట్టుకుని రాజకీయాలు చేసిన కాంగ్రెస్ ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రాభవం కోల్పోవడంతో మతఘర్షణలతో లబ్ధి పొందాలని చూస్తోందని విమర్శించారు. కవిత లేఖతో బిల్లు పెడుతున్నారనడం హాస్యాస్పదం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత లేఖతో మహిళా రిజర్వేషన్ బిల్లు పెడుతున్నారనడం హాస్యాస్పదమని అరుణ వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ ప్రకటించిన అభ్యర్థుల్లో మహిళలకు కనీసం 15% రిజర్వేషన్ ఎందుకు అమలు చేయలేదని నిలదీశారు. పేదలకు ఇళ్లు కట్టించేది కేంద్ర ప్రభుత్వ నిధులతోనా లేక రాష్ట్ర ప్రభుత్వ నిధులతోనో కాంగ్రెస్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మోదీ చిత్రపటానికి క్షీరాభిషేకం నూతన పార్లమెంటు భవనంలో తొలిబిల్లుగా మహిళా రిజర్వేషన్ల బిల్లును పెట్టినందుకు బీజేపీ మహిళా నేతలు హర్షం వ్యక్తం చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ప్రధాని మోదీ చిత్రపటానికి డీకే అరుణ ఆధ్వర్యంలో నేతలు క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రధానకార్యదర్శి బంగారు శ్రుతి, మహిళానేతలు ఆకుల విజయ, బండా కార్తీకారెడ్డి, సునీతారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
అనర్హతపై స్టే.. గద్వాల్ ఎమ్మెల్యేకు ఊరట
ఢిల్లీ: గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డికి సుప్రీం కోర్టులో ఊరట లభించింది. ఆయన ఎన్నిక చెల్లదంటూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సోమవారం సుప్రీం కోర్టు స్టే విధించింది. ఈ కేసులో ప్రతివాదులకు నోటీసులు జారీ చేస్తూ.. రెండు వారాల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. అఫిడవిట్లో తప్పుడు సమాచారం అందించారని కృష్ణమోహన్‌రెడ్డిని అనర్హుడిగా ప్రకటించింది తెలంగాణ హైకోర్టు. అంతేకాదు.. డీకే అరుణను ఎమ్మెల్యేగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే హైకోర్టు తీర్పుపై కృష్ణమోహన్‌రెడ్డి సుప్రీంను ఆశ్రయించారు. ఈ క్రమంలో ఇవాళ సుప్రీం కోర్టులో బండ్ల పిటిషన్‌పై విచారణ జరిగింది. వాదనలు విన్న జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ దీపాంకర్ దత్త నేతృత్వంలోని ధర్మాసనం.. తెలంగాణ హైకోర్టు తీర్పుపై స్టే విధిస్తూ తదుపరి విచారణ నాలుగు వారాలకు వాయిదా వేసింది. ఏం జరిగిందంటే.. అఫిడవిట్లో తప్పుడు వివరాలు సమర్పించారంటూ బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి ఎన్నికపై హైకోర్టులో డీకే అరుణ పిటిషన్ దాఖలు చేశారు. అయితే.. బ్యాంకు ఖాతాల వివరాలు చెప్పకపోవడం తన తప్పని అంగీకరించిన ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి.. ఆ ఖాతాలు తన భార్యవని, సేవింగ్స్ ఖాతాలని తన తరపు న్యాయవాది ద్వారా వాదనలు వినిపించారు. ఇక.. వ్యవసాయ భూమిని 2018 ఎన్నికలకు ముందే అమ్మానని, దానివల్ల ఎన్నికలపై ఎలాంటి ప్రభావం పడలేదని కోర్టుకు విన్నవించారు. అయితే.. వివరాలు వెల్లడించకపోవడం కచ్చితంగా చట్ట ఉల్లంఘన అని డీకే అరుణ తరఫున న్యాయవాది వాదించారు. ఇదిలా ఉంటే.. ఇప్పటికే డీకే అరుణను ఎమ్మెల్యేగా గుర్తిస్తూ ఈసీ నోటిఫికేషన్ జారీ చేసింది. మరోవైపు ఈ కేసులో కేవియట్ పిటిషన్ కూడా దాఖలు చేశారు డీకే అరుణ. -
ఎమ్మెల్యేగా ప్రమాణం చేసే అవకాశం కల్పించండి
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం తనకు కల్పించాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ విజ్ఞప్తి చేశారు. హైకోర్టు తీర్పు, ఈసీ ఇచ్చిన ఆదేశాల మేరకు తనతో ఎమ్మెల్యేగా ప్రమాణం చేయించేలా చూడాలన్నారు. శుక్రవారం ఈ మేరకు రాజ్‌భవన్‌లో గవర్నర్‌కు ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఎన్.రామచంద్రరావుతో కలిసి అరుణ వినతిపత్రం సమర్పించారు. ఈసీ ఆదేశాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రచురించిన రాజపత్రాన్ని గవర్నర్‌కు అందజేశారు. గద్వాల అసెంబ్లీ స్థానానికి సంబంధించిన పరిణామాల గురించి అడిగి తెలుసుకున్న గవర్నర్, అరుణతో ప్రమాణస్వీకారం చేయించేలా అసెంబ్లీ కార్యదర్శి, స్పీకర్‌తో మాట్లాడతానని చెప్పినట్టు బీజేపీ వర్గాల సమాచారం. అనంతరం అరుణ మీడియాతో మాట్లాడుతూ తన ప్రమాణానికి ఏర్పాట్లు చేయాలని రెండుసార్లు అసెంబ్లీ సెక్రటరీ, స్పీకర్‌ను కలిసేందుకు ప్రయత్నించగా వారు అందుబాటులో లేరన్నారు. దీనిపై వారి నుంచి ఎలాంటి సమాధా నం రాకపోవడంతో గవర్నర్‌ను కలిసినట్లు తెలిపారు. ఈ అంశంలో ఉద్దేశపూర్వకంగానే స్పీకర్ వ్యవహరిస్తున్నట్టు కనిపిస్తోందన్నారు. -
నేడు కిషన్‌రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర పదాధికారుల సమావేశం
సాక్షి, హైదరాబాద్: కేంద్రమంత్రి, బీజేపీ అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి అధ్యక్షతన శుక్రవారం పార్టీ కార్యాలయంలో పదాధికారుల సమావేశం జరగనుంది. ప్రస్తుతం రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న పరిణా మాలు, సెప్టెంబర్ 17న హైదరాబాద్ స్టేట్ విమోచన దినోత్సవం సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాష్ట్ర పర్యటన, ఈ సందర్భంగా చేపట్టాల్సిన కార్యక్రమాలు, రాబోయే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో చేపట్టాల్సిన కార్యాచరణ, రాష్ట్ర పార్టీ సన్నద్ధమవుతున్న తీరు తదితర అంశాలు సమావేశంలో చర్చకు వచ్చే అవకాశాలున్నాయి. ఈ సమావేశంలో రాష్ట్ర ఎన్నికల ఇన్చార్జి, ఎంపీ ప్రకాశ్ జవదేకర్, జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఎన్నికల సహ ఇన్చార్జి సునీల్ బన్సల్, పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, పార్టీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు డాక్టర్ కె.లక్ష్మణ్, ఇతర నేతలు పాల్గొంటారని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, పార్టీ బలోపేతం, అసెంబ్లీ ఎన్నికల ప్రణాళికపై చర్చించి అనుసరించాల్సిన వ్యూహాలపై ముఖ్యనేతలు దిశానిర్దేశం చేస్తారని తెలిపారు. -
అసెంబ్లీకి డీకే అరుణ.. ఎమ్మెల్యేగా గుర్తించాలంటూ విజ్ఞప్తి
సాక్షి, హైదరాబాద్: బీజేపీ నేత డీకే అరుణ మంగళవారం అసెంబ్లీకి వెళ్లారు. స్పీకర్ అందుబాటులో లేకపోవడంతో అసెంబ్లీ కార్యదర్శితో భేటీ అయ్యారు. తనను గద్వాల ఎమ్మేల్యేగా గుర్తించాలంటూ అసెంబ్లీ కార్యదర్శికి ఆమె విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు హైకోర్టు తీర్పు కాపీ, కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులను అసెంబ్లీ కార్యదర్శికి అందజేశారు. కాగా గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డిని అనర్హుడిగా ప్రకటిస్తూ, ఎమ్మెల్యేగా డీకే అరుణను డిక్లేర్ చేస్తూ హైకోర్టు ఇటీవల తీర్పు వెల్లడించిన విషయం తెలిసిందే. డీకే అరుణను ఎమ్మెల్యేగా గుర్తిస్తూ గెజిట్ ఇవ్వాలని కేంద్ర ఎన్నికల సంఘం సైతం ఆదేశించింది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్‌రాజ్, సీఎస్ అసెంబ్లీ కార్యదర్శలకు ఉత్తర్వులు పంపింది. ఇక 2018లో జరిగిన రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో గద్వాల నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా డీకే అరుణ, తెరాస నుంచి కృష్ణమోహన్‌రెడ్డి పోటీ చేయగా.. కృష్ణమోహన్‌రెడ్డి గెలుపొందారు. అయితే నామినేషన్ సందర్భంగా కృష్ణమోహన్‌రెడ్డి తప్పుడు వివరాలతో అఫిడవిట్ దాఖలు చేసినట్లు డీకే అరుణ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ క్రమంలో గద్వాల ఎమ్మెల్యే బీ కృష్ణమోహన్‌రెడ్డి ఎన్నిక చెల్లదంటూ హైకోర్టు తీర్పు వెలువరించింది. దీంతో కేంద్ర ఎన్నికల సంఘం డీకే అరుణ ఎన్నికను ధ్రువీకరిస్తూ నోటిఫికేషన్ జారీచేసింది. దానికి హైకోర్టు తీర్పు కాపీని సైతం జత చేశారు. 2018 డిసెంబరు 12 నుంచి ఆమెను ఎమ్మెల్యేగా పరిగణించాలని న్యాయస్థానం ఆ తీర్పులో పేర్కొన్న అంశాన్నీ కేంద్ర ఎన్నికల సంఘం ఉటంకించింది. చదవండి: విషాదం.. నాలాలో పడిపోయి నాలుగేళ్ల బాలుడు మృతి -
గద్వాల ఎమ్మెల్యేగా డీకే అరుణ.. అయితే కాంగ్రెస్ కోటాలోనే.!
ఢిల్లీ: గద్వాల ఎమ్మెల్యే విషయంలో ఇప్పుడు డీకే అరుణతో పాటు కాంగ్రెస్ కు కూడా అనుకోకుండా ఆనందం దక్కింది. ఇటీవల గద్వాల ఎన్నిక విషయంలో తెలంగాణ హైకోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఉత్తర్వులపై కేంద్ర ఎన్నికల కమిషన్ స్పందించింది. డీకే అరుణను ఎమ్మెల్యేగా పేర్కొంటూ నోటిఫికేషన్ జారీ చేసింది. హైకోర్టు ఆదేశాలను అమలు చేయాలని అసెంబ్లీ సెక్రటరీకి లేఖ రాసింది. డీకే అరుణను ఎమ్మెల్యేగా ప్రకటిస్తూ జారీ చేసిన నోటిఫికేషన్‌ను గెజిట్‌లో ముద్రించాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు చేసింది. కేసు బ్యాక్ గ్రౌండ్ ఏంటీ.? గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డిని ఎమ్మెల్యేగా అనర్హుడిగా ప్రకటిస్తూ అప్పట్లో ఓ కేసు నమోదయింది. తెలంగాణ హైకోర్టు గతనెలలో వరుసబెట్టి అనర్హత పిటిషన్లపై విచారణ జరిపిన సంగతి తెలిసిందే. ప్రజాప్రతినిధుల అనర్హత కేసులపై త్వరతగతిన తీర్పులు ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశాల ఇచ్చిన నేపథ్యంలోనే తెలంగాణ హైకోర్టు వాటిపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇక గద్వాల కేసులో కూడా తెలంగాణ హైకోర్టు గత నెల 24వతేదీన తీర్పు వెలువరించింది. తప్పుడు అఫిడవిట్ సమర్పించారని కృష్ణమోహన్‌రెడ్డిపై వేటు వేసింది. ఆయన ఎన్నిక చెల్లదంటూ సంచలన తీర్పు ఇచ్చింది. రెండో స్థానంలో నిలిచిన డీకే అరుణను ఎమ్మెల్యేగా ప్రకటించాలని సూచించింది. డీ కే అరుణ ఏం చేసింది.? తీర్పు వచ్చిన వెంటనే ఎన్నికల సంఘం తెలంగాణ CEOని కలిసి హైకోర్టు తీర్పు ప్రతి అందించారు డీకే అరుణ. ఆ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఇప్పుడు స్పందించింది. తెలంగాణ CEO ఇచ్చిన విజ్ఞప్తితో కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ గెజిట్ జారీ చేసింది. డీకే అరుణను 2018 నుంచి ఇప్పటివరకు ఎమ్మెల్యేగా ప్రకటించాలని సూచించింది. Called upon Shri Vikas Raj, Chief Electoral Officer of Telengana, and gave him a copy of the judgement of the Hon'ble High Court's judgement in my favour. Former MLC Shri @N_RamchanderRao garu accompanied. I hope that the Hon'ble High Court's judgement will be respected and… pic.twitter.com/IB9Fug7Hwu — D K Aruna (@aruna_dk) September 1, 2023 కాంగ్రెస్ కు ఎందుకు అనందం? కలిసొచ్చే కాలం వస్తే నడిచొచ్చే కొడుకు పుడతాడన్న చందంగా .. గద్వాల ఇప్పుడు కాంగ్రెస్ ఖాతాలో పడ్డట్టయింది. ఎందుకంటే 2018లో గద్వాలలో డీకే అరుణ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసింది. ఓడిపోయినా.. గెలిచినా.. ఆ ఎన్నికకు సంబంధించినంత వరకు డీకే అరుణ కాంగ్రెస్ కు సంబంధించిన వ్యక్తే. 2018 తర్వాత డీకే అరుణ పార్టీ మారి బీజేపీలో చేరింది. అయితే ఇప్పుడు తీర్పు రావడంతో సాంకేతికంగా ఆమె ఎమ్మెల్యే అయినట్టే.. అలాగే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగానే పరిగణించాల్సిందే. 2018 ఎన్నికలో ఏం జరిగింది? 2018 ఎన్నికల్లో TRS (ఇప్పుడు BRS) తరపున కృష్ణమోహన్‌రెడ్డి, కాంగ్రెస్ తరపున డీకే అరుణ నిలబడ్డారు. పార్టీ అభ్యర్థి పేరు ఓట్లు TRS కృష్ణమోహన్‌రెడ్డి 100415 Cong DK అరుణ 72155 BJP వెంకటాద్రి 1936 ఇదీ చదవండి: CWC: కాంగ్రెస్ కీలక నిర్ణయం.. రఘువీరా సహా వీరికి చోటు -
ఆ పోలీసుల పేర్లను రాసి పెట్టండి..అధికారంలోకి రాగానే సంగతి చూద్దాం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ అధికార పార్టీ కనుసన్నల్లో నడుస్తోందని, బీజేపీ నేతలను అన్యాయంగా, అక్రమంగా అరెస్ట్ చేసి భయభ్రాంతులకు గురి చేస్తోందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఆరోపించారు. గులాబీ కండువాలు కప్పుకున్న కార్యకర్తల మాదిరిగా కొందరు పోలీసులు వ్యవహరిస్తున్నారని ఆమె ధ్వజమెత్తారు. రాష్ట్రవ్యాప్తంగా తమపై కక్ష సాధింపునకు పాల్పడుతున్న పోలీసు అధికారుల పేర్లను బీజేపీ కార్యకర్తలు రాసిపెట్టుకోవాలని కోరారు. ‘వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది బీజేపీ ప్రభుత్వమే.. అతి చేసిన పోలీసుల రుణం ఏ మాత్రం ఉంచుకోకుండా వారి సంగతి చూద్దాం..వారి లెక్కలు సరిచేద్దాం’ అని ఆమె వ్యాఖ్యానించారు. శుక్రవారం పార్టీ కార్యాలయంలో అరుణ మీడియాతో మాట్లాడారు. ‘సీఎం కేసీఆర్‌కు ఎందుకింత భయం? అరెస్టులతో భయపెట్టాలని చూస్తున్నారా? మీ బెదిరింపులకు బీజేపీ భయపడదు. గత ఎన్నికల్లోనూ పోలీసులతోనే గెలిచామని, రాబోయే ఎన్నికల్లో కూడా గెలుస్తామనే అహంకారంతో ఉన్న మిమ్మల్ని భరించే ప్రసక్తే లేదు.. ఖబడ్దార్ కేసీఆర్.. నిన్ను ఇంటికి పంపేందుకు రాష్ట్ర ప్రజలు రోజులు లెక్క పెడుతున్నారు’’ అని ఆమె వ్యాఖ్యానించారు. వెంకటరమణారెడ్డిని ఎందుకు అరెస్టు చేశారు? కామారెడ్డిలో జెడ్పీ మాజీ చైర్మన్ వెంకటరమణారెడ్డిని అరెస్ట్ చేసి రోజంతా ఎక్కడెక్కడో తిప్పారని, అసలు ఆయనను ఎందుకు అరెస్ట్ చేశారో చెప్పాలని పోలీసులను డీకే అరుణ డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గజ్వేల్ అభివృద్ధి మాదిరే కామారెడ్డి కూడా అభివృద్ధి చెందుతుందని చెప్పడంతో గజ్వేల్ అభివృద్ధిని చూసివద్దామని అనుకున్న వెంకటరమణారెడ్డిని అక్కడకు వెళ్లకుండా అక్రమంగా అడ్డుకున్నారని విమర్శించారు. ‘సీఎం కేసీఆర్ గజ్వేల్ ను నిజంగా అబివృద్ధి చేస్తే అయనను ఎందుకు అరెస్ట్ చేశారు? అక్కడ అభివృద్ధి జరగలేదనే విషయం బయట పడుతుందని భయపడ్డారా?’ అని ప్రశ్నించారు. గజ్వేల్ ఏమీ కేసీఆర్ ఫామ్‌హౌజ్ కాదు కదా... అని ఆమె నిలదీశారు. వెంటనే వెంకటరమణా రెడ్డిని విడుదల చేసి గజ్వేల్ అభివృద్ధిని చూసేందుకు అనుమతించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో వ్యవసాయ భూములన్నీ వెంచర్లుగా మార్చిన చరిత్ర కేసీఆర్‌దేనని ఆరోపించారు. -
అసెంబ్లీలో డీకే అరుణకు చేదు అనుభవం
సాక్షి, హైదరాబాద్: గద్వాల నియోజకవర్గంపై తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్యేగా కృష్ణమోహన్‌రెడ్డిని అనర్హుడిగా ప్రకటించిన కోర్టు.. డీకే అరుణను గద్వాల ఎమ్మెల్యేగా ప్రకటించింది. ఈ క్రమంలో కోర్టు తీర్పు కాపీ అందించి.. తనను ఎమ్యెల్యేగా గుర్తించాలని కోరేందుకు శుక్రవారం అసెంబ్లీకి వెళ్లిన ఆమెకు చేదు అనుభవం ఎదురైంది. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, మరో బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావుతో కలిసి శుక్రవారం అసెంబ్లీకి వెళ్లారు. గద్వాలపై హైకోర్టు ఇచ్చిన తీర్పు కాపీని అసెంబ్లీ కార్యదర్శి కి అందించడానికి వెళ్లారామె. అయితే ఆ సమయంలో కార్యదర్శితో పాటు అసెంబ్లీ స్పీకర్ కూడా అందుబాటులో లేరు. దీంతో ఆమె తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. ‘‘ 24న ఈ తీర్పు వచ్చింది, ఆర్డర్ కాపీ తో స్పీకర్ ను కలవడానికి వస్తే.. స్పీకర్, కార్యదర్శి ఇద్దరూ లేరు. నిన్న సాయంత్రం ఫోన్ చేశాను. మెసేజ్ కూడా పెట్టాను. రోజూ అసెంబ్లీకి వచ్చే కార్యదర్శి ఇవాళ మాత్రం ఎందుకనో రాలేదు.కార్యదర్శి పై ప్రభుత్వ ఒత్తిడి ఏమైనా ఉండొచ్చు అనే అనుమానం ఉంది స్పీకర్ దగ్గర సమావేశం ఉందని కార్యదర్శి వెళ్లారట. ముందు సమాచారం ఇచ్చిన వీరిద్దరూ లేకపోవడం బాధాకరం. అందుకే కోర్టు ఆర్డర్ కాపీని స్పీకర్ పేషీలో ఇచ్చాం. అసెంబ్లీ స్పీకర్‌కు ఉన్న అధికారాలను ఉపయోగించి తీర్పును అమలు చేయాలి. ఈ తీర్పు నాలుగేళ్ల కింద వస్తె నా గద్వాల ను అభివృద్ది చేసుకోవడానికి అవకాశం ఉండేది. కానీ చాలా ఆలస్యంగా ఈ తీర్పు వచ్చింది ఎన్నికల సంఘాన్ని కలుస్తాం ‘‘గద్వాల నియోజకవర్గ ఎమ్మెల్యే గా డీకే అరుణ తీర్పు వచ్చింది. దీనిపై సోమవారం భారత ఎన్నికల ప్రధాన అధికారి ని కలుస్తాం. డీ కే అరుణ విషయంలో వచ్చిన తీర్పును కచ్చితంగా అమలు చేయాలి. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన అవసరం ఉంది’’అని ఎమ్మెల్యే రఘునందన్‌రావు వెల్లడించారు. -
గద్వాల ఎమ్మెల్యే DK అరుణ.! హైకోర్టు ఆదేశం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మరో శాసనసభ్యుడి ఎన్నిక చెల్లదంటూ హైకోర్టు తీర్పునిచ్చింది. జోగుళాంబ గద్వాల జిల్లాలోని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డిని అనర్హుడిగా ప్రకటిస్తూ గురువారం తీర్పు ఇచ్చింది. ఎన్నికల్లో ఆయన తర్వాత రెండో స్థానంలో నిలిచిన డీకే అరుణను 2018 డిసెంబర్ 12 నుంచీ ఎమ్మెల్యేగా పరిగణించాలని ఆదేశించింది. తప్పుడు ఎన్నికల అఫిడవిట్ సమర్పించిన కృష్ణమోహన్‌రెడ్డికి రూ.2,50,000 జరిమానా విధించింది. మరో రూ.50,000ను పిటిషనర్‌కు పరిహారంగా చెల్లించాలని సూచించింది. డీకే అరుణ పిటిషన్‌తో.. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గద్వాల నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా కృష్ణమోహన్‌రెడ్డి, కాంగ్రెస్ అభ్యరి్థగా డీకే అరుణ పోటీ చేశారు. ఇందులో కృష్ణమోహన్‌రెడ్డికి 1,00,057 ఓట్లు, అరుణకు 71,612 ఓట్లు వచ్చాయి. బీఆర్ఎస్ అభ్యర్థి గెలిచినట్టు ఎన్నికల అధికారి ప్రకటించారు. అయితే ఎన్నికల సమయంలో కృష్ణమోహన్‌రెడ్డి సమర్పించిన అఫిడవిట్ తప్పుల తడకగా ఉందని.. ఆయన ఎన్నికను రద్దు చేసి, తనను ఎమ్మెల్యేగా ప్రకటించాలని కోరుతూ డీకే అరుణ తరఫున న్యాయవాది యోగితా ప్రకాశ్ హైకోర్టులో ఎన్నికల పిటిషన్ వేశారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయమూర్తి జస్టిస్ వినోద్‌కుమార్ గురువారం తీర్పు వెలువరించారు. భూములు, ఖాతాల వివరాలు చెప్పలేదని.. అంతకుముందు పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది జంధ్యాల రవిశంకర్ వాదనలు వినిపిస్తూ.. కృష్ణమోహన్‌రెడ్డి, ఆయన భార్య పేరుతో ఉన్న వాహనాలకు ట్రాఫిక్ చలానాలు ఉన్నా చెల్లించలేదని, ఈ వివరాలను అఫిడవిట్లో పేర్కొన లేదని కోర్టుకు వివరించారు. గద్వాల ఎస్బీఐ, ఏడీబీ బ్యాంకుల్లో కృష్ణమోహన్‌రెడ్డి, ఆయన భార్య జ్యోతికి ఉన్న ఖాతాల వివరాలను చెప్పలేదన్నారు. సిబిల్ వివరాల ప్రకారం ఎమ్మెల్యే బ్యాంకులకు రూ.1,09,67,737 రుణాలు బకాయిలు ఉన్నా వెల్లడించలేదని, అలాగే జాతీయ బ్యాంకుల్లో మరో రూ.1.22 కోట్ల రుణాలున్నా పేర్కొనలేదని వివరించారు. అదే విధంగా పుద్దూరులో వారికి ఉన్న 24 ఎకరాల భూమిని అఫిడవిట్లో చూపలేదన్నారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు.. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసినా స్పందన రాలేదు. పత్రికా ప్రకటన ఇచ్చినా స్పందించలేదు. దీంతో న్యాయమూర్తి తీర్పును జూన్ 22న తీర్పును రిజర్వు చేసి గురువారం వెల్లడించారు. అయితే ఈ కేసులో కృష్ణమోహన్‌రెడ్డి తరఫున వాదనలు వినిపించేందుకు ఆగస్టు 18న న్యాయవాది మనోహర్ వచ్చారని, ఈ మేరకు అప్లికేషన్ దాఖలు చేశారని రిజిస్ట్రీ హైకోర్టుకు వివరించింది. దీనిపై స్పందించిన న్యాయమూర్తి.. జూన్ 22నే తీర్పు రిజర్వు చేశామని, ఈ నేపథ్యంలో మధ్యంతర అప్లికేషన్‌ను అనుమతించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టును ఆశ్రయిస్తా..బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి తన ఎన్నిక చెల్లదంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తానని, తనకు అనుకూలంగా తీర్పు వస్తుందని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు. హైకోర్టు తీర్పు అనంతరం బీఆర్ఎస్ శాసనసభాపక్ష కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. హైకోర్టు తనకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే తీర్పు వెలువరించిందన్నారు. తన రాజకీయ ప్రత్యర్థులు నాలుగు అభియోగాలతో కోర్టుకు వెళ్లారని చెప్పారు. ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పే అంతిమమని, కొందరికి ప్రజాస్వామ్యంపై విశ్వాసం లేక దొడ్డిదారి రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. తాను గత ఎన్నికల్లో 37వేల మెజారీ్టతో గెలిచానని, ఈసారి 50వేల మెజారీ్టతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటికైనా న్యాయం జరిగింది: డీకే అరుణ తప్పుడు అఫిడవిట్లు సమర్పిస్తూ ఎన్నికల ప్రక్రియను అపహస్యం చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ, అభ్యర్థులకు ఈ రోజు న్యాయస్థానం ఇచ్చిన తీర్పు చెంపపెట్టు వంటిదని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ పేర్కొన్నారు. ఈ తీర్పు మూడేళ్ల ముందే రావాల్సిందని.. ఇప్పటికైనా తనకు న్యాయం జరిగిందని భావిస్తున్నామని చెప్పారు. హైకోర్టు తీర్పును గద్వాల ప్రజలకు అంకితం చేస్తున్నామన్నారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ ఘన విజయం సాధిస్తుందనే దానికి ఇది సంకేతమని పేర్కొన్నారు. -
TS Election 2023: సొంత మేనల్లుడే ప్రత్యర్థిగా.. మారి..
మహబూబ్‌నగర్: సొంత మేనల్లుడే ప్రత్యర్థిగా మారి సవాళ్లు, ప్రతి సవాళ్లు విసురుకునే స్థాయిలో వారి మధ్య రాజకీయ వైరం ఏర్పడింది. ప్రస్తుతం బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి ఎమ్మెల్యే ఎన్నికపై హైకోర్టు తీర్పు సంచలనం రేపగా.. డీకే వర్సెస్ బండ్ల మధ్య నెలకొన్న రాజకీయ వైరం ఉమ్మడి పాలమూరు జిల్లాలో హాట్‌టాపిక్‌గా మారింది. మాజీ ఎమ్మెల్యే డీకే భరత్‌సింహారెడ్డికి సొంత అక్క కొడుకే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి. డీకే భరత్‌సింహారెడ్డి 1994లో ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత మేనల్లుడైన బండ్ల కృష్ణమోహన్‌రెడ్డిని చేరదీశారు. ఈ క్రమంలో ఆయన అటు రాజకీయంగా, ఇటుఅధికార వ్యవహారాల్లో అన్నీ తానై చక్రం తిప్పారు. ఒకానొక దశలో గద్వాలలో షాడో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తు న్నాడనే గుసగుసలు సైతం విన్పించాయి. అయితే 1999లో గద్వాల పట్టణంలో కరాటే శ్రీను హత్య రాష్ట్రంలో సంచలనం సృష్టించగా.. రాజకీయ దుమారం చెలరేగింది. 1999లో శాసనసభ ఎన్నికల్లో గట్టు భీముడి చేతిలో డీకే భరత్‌సింహారెడ్డి భార్య డీకే అరుణ ఓటమిపాలు కాగా.. రాజకీయ పరిణామాలు చకచకా మారిపోయాయి. తన ఓటమికి బండ్ల కృష్ణమోహన్రెడ్డే కారణమని భావించి.. డీకే కుటుంబం ఆయనను రాజకీయాల నుంచి దూరం పెట్టడంతో విభేదాలు చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. -
ఆలస్యమైనా న్యాయం జరిగింది: డీకే అరుణ
సాక్షి, మహబూబ్ నగర్: గద్వాల నియోజకవర్గ ఎమ్మెల్యేగా బండ్ల కృష్ణమోహన్‌రెడ్డిపై అనర్హత వేటు వేసిన తెలంగాణ హైకోర్టు.. డీకే అరుణను ఎమ్మెల్యేగా ప్రకటించింది. ఈ తీర్పుపై డీకే అరుణ స్పందించారు. తీర్పు ఆలస్యమైనా న్యాయం జరిగినందుకు సంతోషంగా ఉందని అన్నారామె. ‘‘తీర్పు ఆలస్యమైన న్యాయం జరిగినందుకు సంతోషంగా ఉంది. ప్రజాస్వామ్యాన్ని విశ్వసించే ప్రతి ఒక్కరు ఈ తీర్పును స్వాగతిస్తారు.. గౌరవిస్తారు. ప్రభుత్వం కూడా బేషజాలకి పోకుండా కోర్టు తీర్పును గౌరవించాలి. కోర్టు ఆర్జర్ కాపీ రాగానే ఎలక్షన్ కమీషనర్, అసెంబ్లీ కార్యదర్శి, స్పీకర్ ను కలుస్తాను’’ అని తెలిపారామె. ఇక.. అనర్హత వేటుపడిన ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సాక్షి టీవీతో మాట్లాడుతూ.. ‘‘ఈవీఎం వివిపాట్లను మానిప్లేట్ చేయటం, స్థిర చరస్తుల వివరాలు సరిగా ప్రకటించకపోవడం, వాహనంపై ఉన్న చలాన్ ను కట్టకపోవడం పై కోర్టు నాపై అనార్హత వేటు వేసింది. ఈ వ్యవహారంలో నాకు ఎలాంటి నోటీసులు ముందుగా అందలేదు. కోర్టు తీర్పు కూడా ఏకపక్షంగా వచ్చింది. ఈ అనర్హత వేటుపై పైకోర్టుకు వెళ్తాను’’ అని తెలిపారాయన. గద్వాలకు పొలిటికల్ టూరిస్టులు ఎక్కువని.. గద్వాల కచ్చితంగా తన అడ్డేనన్న కృష్ణమోహన్‌రెడ్డి.. వచ్చే ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలుపొందుతానని ధీమా వ్యక్తం చేశారు. సంబంధిత వార్త: గద్వాల ఎమ్మెల్యేపై అనర్హత.. తీర్పు కాపీలో ఏముందంటే.. -
గద్వాల ఎమ్మెల్యేగా డీకే అరుణను ప్రకటించిన హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డికి షాక్ తలిగింది. గురువారం ఎమ్మెల్యేగా ఆయన్ని అనర్హుడిగా ప్రకటించింది తెలంగాణ హైకోర్టు. తప్పుడు అఫిడవిట్ సమర్పించారని ఆయనపై వేటు వేసింది. ఆయన ఎన్నిక చెల్లదంటూ సంచలన తీర్పు ఇచ్చింది. అదే సమయంలో.. ఎన్నికల్లో తర్వాతి మెజార్టీతో ఉన్న డీకే అరుణను(ప్రస్తుతం బీజేపీ) ఎమ్మెల్యేగా ప్రకటించింది. కృష్ణమోహన్‌రెడ్డికి 3 లక్షల జరిమానా. అందులోంచి రూ.50 వేలు డీకే అరుణకు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. ధర్మవరపు కొట్టం అరుణ.. 2004 నుంచి 2018 మధ్య మహబూబ్‌నగర్ జిల్లా గద్వాల ఎమ్మెల్యేగా పని చేశారు. 1999లో కాంగ్రెస్ తరపున గద్వాల నుంచి పోటీ చేసి ఓడారామె. 2004లో సమాజ్‌వాదీ పార్టీ నుంచి నెగ్గిన ఆమె.. ఆపై కాంగ్రెస్‌లో చేరారు. ఉమ్మడి ఏపీలో వైఎస్సార్ సీఎంగా ఉన్నప్పుడు, ఆ తర్వాత రోశయ్య హయాంలోనూ మంత్రిగా పని చేశారు. 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె తన బంధువు బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. 2009, 2014లో ఆమె కృష్ణమోహన్‌రెడ్డిని ఓడిచడం గమనార్హం. 2019లో బీజేపీలో చేరిన ఆమె.. సార్వత్రిక ఎన్నికల్లో మహబూబ్ నగర్ స్థానం నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. 2020 సెప్టెంబర్‌లో బీజేపీ అధిష్టానం ఆమెను భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షురాలిగా ప్రకటించింది. తాజాగా ఈ మధ్యే కొత్తగూడెం బీఆర్ఎస్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్రావుపై అనర్హత వేటు పడగా, ఆయన స్థానంలో జలగం వెంకట్రావును ఎమ్మెల్యేగా తెలంగాణ హైకోర్టు ప్రకటించింది. అందుకే వరుసగా.. తెలంగాణ హైకోర్టు ఈ మధ్య వరుసబెట్టి అనర్హత పిటిషన్లపై విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. ప్రజాప్రతినిధుల అనర్హత కేసులన్నింటినీ ఈ నెలాఖారులోగా తేల్చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలోనే ఈ పరిణామాలు చోటు చేసుకుంటున్నారు. మంత్రుల కొప్పుల ఈశ్వర్, శ్రీనివాస్‌గౌడ్, గంగుల కేసులతో పాటు పాతిక ఎమ్మెల్యేలు ఇలా అనర్హత వేటు కేసులు ఎదుర్కొంటున్నారు. ఇందులో 90 శాతం పైగా అధికార పార్టీ ఎమ్మెల్యేలే ఉన్నారు. ఆ జాబితాను పరిశీలిస్తే.. అనర్హత కేసుల్లో.. తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్, కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్, దేవరకొండ ఎమ్మెల్యే ఆర్ రవీంద్రకుమార్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత, వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌లతో పాటు జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, పరిగి ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి, కరీంనగర్ గంగుల కమలాకర్, ధర్మపురి కొప్పుల ఈశ్వర్, హుస్నాబాద్ సతీశ్, మహబూబ్ నగర్ శ్రీనివాస్‌రెడ్డి, నాగర్ కర్నూల్ మర్రి జనార్దన్, కొడంగల్ పట్నం నరేందర్‌రెడ్డి, ఆసిఫాబాద్ ఆత్రం సక్కు, సికింద్రాబాద్ పద్మారావు, ఖైరతాబాద్ దానం నాగేందర్, ఇబ్రహీంపట్నం మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, దేవరకద్ర ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, వరంగల్ ఈస్ట్ నరేందర్, జూబ్లీహిల్స్ మాగంటి గోపీనాథ్, మల్కాజిగిరి మైనంపల్లి హన్మంత్, వికారాబాద్ మెతుకు ఆనంద్, నాంపల్లి జాఫర్ హుస్సేన్, పటాన్ చెరువు మహిపాల్‌రెడ్డి, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పిటిషన్లు కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్నట్లుగా సమాచారం. -
మీ నాన్నను ఎందుకు అడగలేదు?
సాక్షి, హైదరాబాద్: చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కావాలని ఢిల్లీలో దొంగ దీక్ష చేసిన కవిత రాష్ట్రంలో మహిళలకు 33 %సీట్లు ఇవ్వలేదని తండ్రిని ఎందుకు అడగట్లేదని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ నిలదీశారు. లిక్కర్ కేసును దారి మళ్లించేందుకే కవిత దీక్ష చేశారని, మహిళా బిల్లును చించేసిన పార్టీలతో కలిసి వెళ్లారని మండిపడ్డారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం మీడియాతో అరుణ మాట్లాడారు. ఆదివాసీ మహిళను రాష్ట్రపతిగా పెడితే బీఆర్ఎస్ ఆమెకు వ్యతిరేకంగా ఓటు వేసిందని చెప్పారు. ఆర్థిక, రక్షణ, విదేశీ వ్యవహారాల శాఖలను మహిళలకిచ్చిన ఘనత మోదీదేనన్నారు. మహిళల మీద నగరం నడబొడ్డున అకృత్యాలు జరిగినా సీఎం కార్యాలయంలో పనిచేసే ఏ అధికారి మాట్లాడటం లేదని, కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్న అధికారులందరికీ రాజకీయ పిచ్చి పట్టుకుందని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ ప్రకటించిన అభ్యర్థుల మీద అనేక ఆరోపణలు ఉన్నాయని, అయినా కేసీఆర్ వారినే ఎమ్మెల్యే అభ్యర్థులుగా ప్రకటించారని తెలిపారు. అభద్రతా భావంతోనే కామారెడ్డి నుంచి పోటీ చేస్తున్న కేసీఆర్ గంప గోవర్ధన్ కోరిక మేరకే అని సమరి్థంచుకోవడం శోచనీయమన్నారు. -
విస్తృత భేటీలు.. ముమ్మర ప్రచారం
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ గెలుపు ఎత్తుగడల్లో భాగంగా బీజేపీ ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాలపై దృష్టి పెట్టింది. రాష్ట్రంలో రిజర్వ్ స్థానాల్లో ఏ పార్టీ అత్యధిక స్థానాలు సాధిస్తుందో ఆ పార్టీయే అధికారంలోకి వస్తుందనే ఉద్దేశంతో ఆ మేరకు కార్యాచరణ సిద్ధం చేసింది. ఈనెల 28 నుంచి సెప్టెంబర్ 15వ తేదీ వరకు వివిధ కార్యక్రమాల నిర్వహణకు కార్యాచరణ రూపొందించింది.రిజర్వ్డ్ నియోజకవర్గాలకు ఇన్చార్జీలను నియమించడంతోపాటు, ప్రతి నియోజకవర్గంలో ఆరేడు వేల మం ది కార్యకర్తలతో కలిసి సమావేశాలు నిర్వహించనుంది. ఆయా భేటీల్లో బీఆర్ఎస్ ప్రభుత్వ విధానా లను ఎండగట్టాలని, సీఎం కేసీఆర్ దళితులకు, గిరిజనులకు చేస్తున్న అన్యాయంపై విస్తృతంగా ప్రచారం చేయాలని నిర్ణయించింది. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీలకు చెందిన 31 అసెంబ్లీ స్థానాలకు రూపొందించిన ప్రత్యేక కార్యాచరణలో భాగంగా ఇప్పటికే జాతీయ నాయకులు ఆయా నియోజకవ ర్గాల్లోని నేతలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. బీజేపీ రాష్ట్ర ఎన్నికల ఇన్చార్జి ప్రకాష్ జవదేకర్, నేతలు అరవింద్ మీనన్, తరుణ్‌ఛుగ్, సునీల్ బన్సల్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, ఈటల రాజేందర్, డీకే అరుణ, ఏపీ జితేందర్‌రెడ్డి తదితర సీనియర్ నాయకులు పాల్గొన్నారు. ఇక ఒక్కో పోలింగ్ కేంద్రం నుంచి 20 నుంచి 30 మంది కార్యకర్తలతో బూత్ స్థాయి సమావేశాలు కూడా నిర్వహించనున్నారు. బీఆర్ఎస్ పార్టీ దళితులకు ఇచ్చిన హామీలను ఏవిధంగా తుంగలో తొక్కిందన్న అంశాలను వివరించడంతోపాటు, కేంద్రంలోని బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలు, అదే విధంగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దళితులు / గిరిజనులకు అమలు అవుతున్న పథకాల గురించి వివరించేలా కార్యక్రమాలు చేపట్టనున్నారు. కేంద్ర ప్రభుత్వం దళితుల అభ్యున్నతి కోసం ప్రవేశపెట్టిన పలు పథకాలను రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా నీరుగార్చిందనే విషయాన్ని కూడా వివరిస్తామని బీజేపీ ముఖ్య నాయకుడు ఒకరు వివరించారు. కాంగ్రెస్ పార్టీ 75 ఏళ్లలో దళితులు, గిరిజనులను ఓట్లు వేయించుకోవడానికి వాడుకోవడం తప్ప.. వారికి ఎలాంటి సౌకర్యాలు కల్పించని విషయాన్ని కూడా వివరి స్తామని తెలిపారు. డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంటేనే అభివృద్ధి సాధ్యమన్న అంశాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్తామని వివరించారు. పార్టీ నేతలతో జవదేకర్ భేటీ తెలంగాణలో పార్టీని మరింత పటిష్టం చేయ డంతో పాటు, ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ విజయం సాధించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రకాష్ జవదేకర్ శుక్రవారం మాజీ సీఎం కిరణ్‌కుమార్ రెడ్డితో పాటు ఏపీ, తెలంగాణకు చెందిన పలువురు నేతలతో సమా వేశమయ్యారు. పార్టీ పటిష్టత, లోపాలకు సంబంధించి అంశాలపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ కూడా ఇచ్చినట్లు సమాచారం. ఇతర పార్టీల నుంచి బీజేపీలోకి చేరికలు, ఇతర అంశాలు చర్చకు వచ్చినట్లు తెలిసింది. -
నారాయణపేట: డీకే అరుణ ప్రభావం పడనుందా?
నారాయణపేట నియోజకవర్గంలో ఈ సారి త్రిముఖపోటీ అనివార్యం కానుంది. 2014 ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ అభ్యర్దిగా పోటీచేసిన రాజేందర్‌రెడ్డి గెలిచారు. తర్వాత ఆయన టీఆర్ఎస్లో చేరారు. 2018లో టీఆర్ఎస్ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. మరోసారి బీఆర్ఎస్ తరపున ఆయనే ఇక్కడి నుంచి పోటీచేసే అవకాశాలే ఉన్నాయి. అధికార పార్టీపై అసంతృప్తి.. అదే బీజేపీకి బలం కానుంది! అయితే అభివృద్ది విషయంలో తన వంతు కృషి చేశారు. నారాయణపేటను నూతన జిల్లాగా ఏర్పాటు చేయించారు. జిల్లా ఆస్పత్రి కూడ వచ్చింది. జిల్లా కేంద్రంలో రోడ్ల విస్తరణ పూర్తి చేయించారు. అయితే నారాయణపేటకు సాగునీటిని అందించాలనే ఉద్దేశ్యంతో ఇచ్చిన జీఓ 69ని అమలు చేయించటంలో ఆయన విఫలమయ్యారనే ఆరోపణలు ఉన్నాయి. జాయమ్మ చెరువు రిజర్వాయర్ చేస్తామన్న హమీ కూడ నెరవేరలేదు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా ఈ ప్రాంతానికి సాగునీటిని అందిస్తామన్న హమీకూడ నెరవేరకపోవటంతో ఇక్కడి జనం అసంతృప్తితో ఉన్నారు. అయితే నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉండరనే ఆరోపణ ఉంది. పార్టీ కార్యకర్తలతో నేతలతో ముక్కుసూటిగా మాట్లాడుతుండటంతో క్యాడర్లో నైరాశ్యం ఉంది. ముఖ్యంగా బీజేపీ ఇక్కడ బలంగా ఉండటం కొంత మైనస్‌గా మారే అవకాశం ఉంది. తన వర్గీయులకే పెద్దపీఠ వేస్తారనే ఆరోపణలు ఉన్నాయి. కాంగ్రెస్‌పార్టీ ఇక్కడ గడచిన రెండు ఎన్నికల్లో ఓటమి పాలై మూడో స్దానానికే పరిమితమయ్యింది. బీఆర్ఎస్ పార్టీ నుంచి శివకుమార్‌రెడ్డి 2014లో పోటీ చేసి రెండవస్దానంలో నిలిచారు. 2018లో బీఆర్ఎస్ పార్టీ టికెట్ నిరాకరిస్తే బీఎల్ఎఫ్ పార్టీ నుంచి పోటీ చేసి మళ్లీ రెండవస్దానంలో నిలిచారు. తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈసారి ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసేందుకు సిద్దమవుతున్నారు. ఆయనపై ఇటీవల ఓ మహిళ వ్యక్తిగతమైన ఆరోపణలు చేయటం,కేసు నమోదు కావటం కొంత ఇబ్బందిగా మారింది. ఆయనను పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి సైతం తప్పించారు. మాస్ ఫాలోయింగ్ ఉండటం ఈయనకు కలిసి వచ్చే అంశంగా చెప్పవచ్చు. ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత సైతం ప్లస్ అవుతుందని అంటున్నారు. అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి ఈసారి పోటీ చేయాలని వ్యాపారవేత్త సుజేంద్ర శెట్టి ఆసక్తి కనబరుస్తున్నారు. డీకే అరుణ ప్రభావం బీజేపీకి కలిసోచ్చేనా? ఇక్కడ బీజేపీకి మొదటి నుంచి కొంత క్యాడర్ ఉంది. 2014లో రతంగ్ పాండు రెడ్డి పొత్తుల్లో భాగంగా టీడీపీకి సీటు కేటాయించటంతో ఇండిపెండెంట్‌గా బరిలో నిలిచి 23 వేల ఓట్లు సాధించారు. 2018లో బీజేపీ నుంచి పోటీ చేసిన ఆయన 20 వేల ఓట్లు సాధించారు. అయితే వ్యక్తిగతంగా సౌమ్యుడిగా పేరున్న రతంగ్ పాండు రెడ్డిపై సానుభూతి కూడ ఉంది. ఇటీవల బండి సంజయ్ మార్క్ నిర్వహించిన ప్రజా సంగ్రామయాత్ర, బహిరంగ సభ విజయవంతం కావటంతో ఈసారి బీజేపీ గెలుస్తుందనే ధీమా ఆపార్టీ నేతల్లో కనిపిస్తుంది. బీసీలకు కేటాయించాలని ఆలోచిస్తే పార్టీ సీనియర్ నాయకుడు నాగూరావు నామాజీ, సత్యయాదవ్ పేర్లు పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇక్కడ డీకే అరుణ ప్రభావం కూడ ఉండే అవకాశం ఉండటం కలిసి వచ్చే అంశంగా చెప్పవచ్చు. నియోజకవర్గం భౌగోళిక పరిస్థితులు: కర్ణాటక సరిహద్దులో ఉన్న నియోజకవర్గం నారాయణపేట 2019 లో నూతన జిల్లాగా ఏర్పడింది, నారాయణపేట నియోజకవర్గంలోని ధన్వాడ, మరికల్ మండలాల్లోని కొన్ని గ్రామాలు మక్తల్ నియోజకవర్గానికి వెళ్లాయి.నారాయణ చేనేత మరియు పట్టు చీరలకు ప్రసిద్ది,ఇక్కడి బంగారపు ఆభరణకు ప్రత్యేక గుర్తింపు ఉంది. సాగునీరు లేకపోవటంతో వ్యవసాయభూముల బీళ్లుగా మారాయి.ఉపాధి లేక జనాలు ఇక్కడి నుంచి పెద్దమొత్తంలో దేశంలోని వివిధ ప్రాంతాలకు వలస పోతున్నారు. ఉమ్మడి జిల్లాలో మొట్టమొదటి మున్సిపాలిటీ నారాయణపేటలో ఏర్పాటయ్యింది. -
మక్తల్: ప్రతీసారి భిన్న ప్రజాతీర్పు.. ఈసారి మాత్రం ఉత్కంఠే!
తెలంగాణ-కర్ణాటక సరిహద్దులో ఉన్న మక్తల్ నియోజకవర్గంలో ప్రతిసారి ఓటర్ల తీర్పు భిన్నంగా ఉంటుంది. ఆ సెగ్మెంట్లో అన్ని పార్టీలో గ్రూపు రాజకీయాలు తీవ్రంగా ఉన్నాయి. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీల నుంచి అనేక మంది పోటీ పడుతున్నారు. దీంతో ఆ నియోజకవర్గంలో వచ్చే ఎన్నికల్లో గెలుపు నువ్వా..నేనా అన్నట్టు సాగే అవకాశం ఉంది. 2014లో కాంగ్రెస్ పార్టీ నుంచి చిట్టెం రాంమోహన్‌రెడ్డి గెలిచారు. తర్వాత బీఆర్ఎస్లో చేరారు. 2018లో ఆయన బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. మరోసారి ఆయన వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసే అవకాశం ఉంది. అయితే పాత టీఆర్ఎస్ నేతలకు ఎమ్మెల్యే ప్రాధాన్యత ఇవ్వటం లేదనే ఆరోపణ ఉంది. నియోజకవర్గం కేంద్రంలోని మున్సిపాలిటీని సైతం బీజేపీ కైవసం చేసుకుంది. ఇక్కడ చిట్టెం సోదరి డీకే అరుణ ప్రభావం ఉండటంతో ఎమ్మెల్యేకు కొంత ఇబ్బందిగా మారే అవకాశం ఉంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఈ సెగ్మెంట్లో అధికార టీఆర్ఎస్ కంటే బీజేపీకి అధికంగా ఓట్లు వచ్చాయి. చిట్టెం ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటారనే పేరుంది. డబుల్ బెడ్రూం ఇళ్లు ఒక్కటి కూడ నిర్మాణం చేయలేదు. సంగంబండ లెఫ్ట్ కెనాల్ పనులు పూర్తి చేయలేదని ఆరోపణలు ఉన్నాయి. నేరేడుగాం,ఉజ్జెల్లి,సంగంబండ పునరావాస గ్రామాల పరిస్దితి గురించి ఎమ్మెల్యే పట్టించుకోవటం లేదని విమర్శలు ఉన్నాయి. ఇసుక అక్రమ రవాణ ఎమ్మెల్యే అండదండలతోనే చేస్తున్నారనే ప్రచారం జోరుగా సాగుతుంది.150 పడకల ఆస్పత్రి, హామీ ఇంకా నేరవేరలేదు ఇటీవల మంజూరీ వచ్చినా పనులు ప్రారంభించలేదనే మైనస్ ఉంది.రాజకీయాల్లో తన భార్య జోక్యం కొంత ఇబ్బందిగా మారవచ్చనే గుసగుసలు వినిపిస్తున్నాయి.ఇక ఈసారి అక్కడి నుంచి పోటీ చేసేందుకు పారిశ్రామికవేత్త వర్కటం జగన్నాథం ఆసక్తి కనబరుస్తున్నారు. వర్కటం జగన్నాథం కరోనా సమయంలో అనేక సేవకార్యక్రమాలు నిర్వహించి ప్రజల మన్ననలు పొందారు. గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్య,పాఠశాలల్లో అమ్మాయిలకు మరుగుదొడ్లు,పదవ తరగతి విద్యార్దులకు స్టడీమెటీరియల్ ఇప్పించారు.మాజీ ఎమ్మెల్యే సీతాదయాకర్‌రెడ్డి సైతం బీఆర్ఎస్ సీటు కోసం తీవ్రంగా ప్రయత్నాలు మొదలు పెట్టారు. తనకే సీటువస్తుందనే ధీమాలు ఉన్నారు.అయితే సిట్టింగ్‌లకే సీట్లు ఇస్తామంటూ సీఎం కేసీఆర్ చేసిన ప్రకటన ఎమ్మెల్యే చిట్టెంకు ఊరటనిస్తుంది.ఇక్కడ సీటు విషయంలో పోటీ నెలకొనటం ఎమ్మెల్యేకు తలనొప్పిగా మారిందట. బీజేపీకి ఇక్కడ మొదట నుంచి మంచి క్యాడర్ ఉంది.మున్సిపల్ చైర్మన్ పీఠం కూడ ఆ పార్టీకే దక్కింది. ప్రభుత్వ వ్యతిరేకతతోపాటు ఎమ్మెల్యే వ్యవహారశైలి తమకు కలిసి వస్తుందని ఆ పార్టీ నాయకులు భావిస్తున్నారు. డీకే అరుణ ప్రభావం కూడ ఇక్కడ ఉండే అవకాశం ఉండటంతో మరింత ప్లస్ కానుంది.అయితే ఇక్కడ కూడ మొదటి నుంచి పార్టీలో ఉండి రెండు సార్లు పోటీ చేసిన కొండయ్యకు,కొత్తగా పార్టీలో చేరిన జలంధర్‌రెడ్డికి మద్య పొసగటం లేదు.ప్రజాసంగ్రామయాత్రలో కూడ పోటాపోటీగా తమ బలప్రదర్శన చేశారు. జలంధర్‌రెడ్డి గత 2018 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్దిగా పోటీ చేసి రెండవ స్దానంలో నిలిచిచారు. ప్రజాసంగ్రామయాత్ర ముగిసిన తర్వాత జలంధర్‌రెడ్డి నియోజవర్గానికి చుట్టపుచూపుగా మారారు. సీటు విషయంలో కొండయ్య,జలంధర్‌రెడ్డి మద్య ఏకాభిప్రాయం కుదిరితే పార్టీకి కలిసివచ్చే అవకాశం ఉంటుంది లేకుంటే అధికార బీఆర్ఎస్కే ప్లస్ అవుతుంది. ఈ సెగ్మెంట్లో కాంగ్రెస్ పార్టీ పరిస్ధితి కొంత ఇబ్బందిగానే ఉంది. ఎమ్మెల్యే రాంమోహన్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్లో చేరాక పార్టీకి సరైన నాయకత్వమే కరువయ్యింది. ఈ నియోజకవర్గంలో రాహుల్ గాంధీ జోడో యాత్ర విజయవంతం కావటం ఇక్కడి నేతలు, కార్యకర్తల్లో ఉత్సాహాం నింపింది. మాజీ జడ్పీటీసీ సభ్యుడు శ్రీహరి, మాజీ ఆప్కాబ్ చైర్మన్ దివంగత వీరారెడ్డి తనయుడు ప్రశాంత్‌రెడ్డి, నాగరాజు గౌడ్, ఎన్నారై పోలీస్ చంద్రశేఖర్రెడ్డిలు సీటు కోసం ఆశిస్తున్నారు. వీరారెడ్డి గతంలో ఆత్మకూరు నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. తర్వాత అది దేవరకద్ర నియోజకవర్గంగా పునర్విభజనలో మారింది. కానీ ఆత్మకూరు, నర్వ, అమరచింత మండలాలు ప్రస్తుతం మక్తల్ నియోజకవర్గంలో ఉండటంతో పాటు, రాహుల్ జోడో యాత్రలో కీలకంగా పనిచేయటం తనకు కలిసి వస్తుందనే అభిప్రాయంతో ప్రశాంత్‌రెడ్డి ఉన్నారు. బీసీ గౌడ్ సామాజికవర్గానికి చెందిన నాగరాజు గౌడ్ గతంలో ఎన్ఎస్యూఐలో పనిచేశాడు. రేవంత్‌రెడ్డికి సన్నిహితంగా ఉంటున్న ఇతను రాహుల్ల్గాం గాంధీ జోడోయాత్రలో హుషారుగా పనిచేసి పార్టీ నేతల దృష్టిని ఆకర్శించారు. మరోవైపు బీఆర్ఎస్ నుంచి సీటు రాకుంటే మాజీ ఎమ్మెల్యే సీతా దయాకర్‌రెడ్డి కూడ కాంగ్రేస్ లో చేరుతారనే ప్రచారం జోరుగాసాగుతుంది.కాంగ్రేస్ అభ్యర్ది అవుతారని ఆయన వర్గీయులు అంటున్నారు.2018లో మక్తల్‌లో టీడీపీ నుంచిపోటీ చేసిన సీతమ్మ భర్త దయాకర్‌రెడ్డి మూడోస్దానంలో నిలువగా 2009 ఎన్నికల్లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు.ప్రతిపక్షపార్టీలు ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై భరోసాపెట్టుకుని గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు నేతలు. నియోజకవర్గంలో భౌగోళిక పరిస్థితులు: ఆత్మకూర్ అమరచింత మండలాలు వనపర్తి జిల్లాలో, మదనాపూర్ మండలంలోని కొన్ని గ్రామాలు దేవరకద్ర నియోజకవర్గములో, ధన్వాడ మరికల్ మండలాల్లోని కొన్ని గ్రామాలు నారాయణపేట నియోజకవర్గములో అనుసంధానమై ఉన్నాయి.ఈ నియోజకవర్గం కర్ణాటక సరిహద్దులో ఉంది. నదులు: కృష్ణా, భీమా నదులు వర్షాకాలంలో పుష్కలంగా ప్రవహిస్తాయి రాజీవ్ భీమా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఉంది,చిట్టెం నర్సిరెడ్డి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ఉంది. ఆలయాలు: కృష్ణానది తీరాన దత్తపీఠ ఆలయం చాలా ప్రసిద్ధిగాంచింది. తెలంగాణ కర్ణాటక సరిహద్దులో ముడుమాల నిలువు రాళ్లు చారిత్రక ప్రాధాన్యత కలిగి ఉన్నాయి.కృష్ణాలో మొట్టమొదట రైల్వేస్టేషన్ ఉంది. -
పాలమూరుపై బీజేపీ.. కాంగ్రెస్ స్ట్రాంగ్ ఫోకస్
మహబూబ్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో వచ్చే ఎన్నికల్లో పోటీ రసవత్తరంగా సాగనుంది. త్రిముఖపోటీ జరుగనుంది. అధికార బీఆర్ఎస్ దీటుగా ఇటు బీజేపీ, అటు కాంగ్రెస్‌లు సత్తాచాటేందుకు సమాయత్త మవుతున్నాయి. చేసిన అభివృద్ది.. తెలంగాణ తెచ్చిన పార్టీగా బీఆర్ఎస్కు జనాలు మరోసారి పట్టం కాడతారని ఆ పార్టీ భావిస్తుంది. పాత సీటును నిలుపుకునేందుకు కాంగ్రెస్ చూస్తుంటే.. బీజేపీ పాలమూరు సీటుపై ఫోకస్ పెట్టింది. సామాజిక వర్గాల వారిగా చూస్తే ముస్లీం మైనార్టీల ఓట్లు అధికంగా ఉన్నాయి. ముదిరాజ్, యాదవ సామాజిక వర్గం ఓట్లు ఫలితం కూడా ప్రభావితం చేసే స్దాయిలో ఉన్నాయి. ఇతర ప్రాంతాల నుంచి వచ్చి నివాసం ఉంటున్నవారు, ఉద్యోగుల ఓట్లు కూడ ఎక్కువగ ఉన్నాయి. దీంతో ఫలితంపై అన్ని అంశాలు ప్రభావితం చూపే అవకాశం ఉంది. తెలంగాణ ఆవిర్భావం తర్వాత 2014, 2018లో మహబూబ్‌నగర్ సెగ్మెంట్లో జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం సాధించింది. గెజిటెడ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడిగా ఉన్న శ్రీనివాస్‌గౌడ్ పోటీ చేసి విజయం సాధించారు. రెండవసారి గెలిచిన తర్వాత ఆయన మంత్రి అయ్యారు. మూడోసారి ఆయన ఇక్కడి నుంచి పోటీ చేయనున్నారు. మంత్రిగా నియోజకవర్గ అభివృద్దికి కృషి చేస్తున్న ఆయన మరోసారి గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. మంత్రి ఆరోపణలు.. బీఆర్ఎస్కు అదే మైనస్! బైపాస్ రహదారి పర్యాటకం మయూరి పార్క్, పెద్ద చెరువు ట్యాంక్‌బండ్, శిల్పారామం, నెక్లెస్ రోడ్డు, పట్టణంలో కూడళ్ల అభివృద్ది, సుందరీకరణ ఆయనకు కలిసివచ్చే అంశాలుగా ఉన్నాయి. డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణంలో అన్ని నియోజవర్గాల కంటే ముందు వరుసలో ఉన్నా నిర్మాణం జరిగిన ఇళ్లను లబ్దిదారులకు పంపిణీ చేయటంలో జాప్యం జరగటం.. అందులో అవినీతి ఆరోపణలు రావటం కొంత ఇబ్బందిగా మారింది. పరిస్ధితి తనకు తెలిసిన వెంటనే మంత్రి శ్రీనివాస్ గౌడ్ దిద్దుబాటు చర్యలు దిగారు. అక్రమార్కులపై కేసులు కూడ నమోదయ్యాయి. ఎన్నికల అఫ్రిడవిటిల్లో తప్పుడు వివరాలు నమోదు చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. తరచుగా జరిగే కొన్ని ఘటనలు ఆయనకు ఇబ్బందిగా మారాయి. ఓ కార్యక్రమ ర్యాలీలో బహిరంగంగా గాలిలో కాల్పులు జరపటంతో విమర్శలు ఎదుర్కొన్నారు. హత్య కుట్ర కేసు వ్యవహారం కూడ ఆయనకు కొంత మైనస్‌గా మారింది. అనారోగ్యం బారిన పడిన వారి బాగుకోసం నిత్యం అందుబాటులో ఉండి వారికి ముఖ్యమంత్రి సహయనిధి నుంచి భారీగా నిధులు ఇప్పించి మెప్పుపొందారు. జిల్లా జనరల్ ఆస్పత్రి అభివృద్ది కోసం విశేష కృషి చేశారు. ముఖ్యంగా కరోనా సందర్భంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కరోనా బాధితులు ఇక్కడ మెరుగైన వైద్యసేవలు అందేలా వసతులు కల్పించారు. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు బలవంతంగా ఇతర పార్టీల వారిని తన పార్టీలో చేర్చుకుంటున్నారని, లేకుంటే కక్షసాధింపులకు దిగుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అనుచరులు భూ ఆక్రమణలకు దిగుతున్నారనే అపవాదు కూడ ఉంది. తన అనుచరులకు పెద్దపీట వేసి ఉద్యమకాలంలో పనిచేసిన వారిని విస్మరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఇతర పార్టీల్లో ఆయనను తట్టుకుని నిలిచే నేతలు ఇటు కాంగ్రెస్, బీజేపీలో స్దానికంగా లేకపోవటం కలిసి వచ్చే అంశం. రంగంలోకి బీకే అరుణ.. బీఆర్ఎస్కు గట్టి పోటీ తప్పదు అయితే బీజేపీ నుంచి డీకే అరుణ పోటీలో ఉంటే కొంత ఇబ్బందిగా మారుతుందనే అభిప్రాయం ఆయన వర్గీయుల్లో వ్యక్తం అవుతుంది. మహబూబ్‌నగర్ నియోజకవర్గం నుంచి అత్యధికంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలే ఎమ్మెల్యేలుగా గెలిచారు. చాలా మంది మంత్రి పదవులు సైతం పొందారు. కానీ ఇప్పుడు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ పరిస్ధితి అధ్వాన్నంగా మారింది. పోటీకి బలమైన అభ్యర్ది లేడనే అభిప్రాయం ఉంది. ఉన్నదాంట్లో ఎవరంతకు వాళ్లు తమకు సీటుకావాలనే అశతో ఉన్నారు. పార్టీ బలోపేతంపై పెద్దగా శ్రద్ద కనబరిచిన దాఖలాలు లేవు. చాలా మంది పార్టీని వీడటం కూడ తలనొప్పిగా మారింది. మైనార్టీ ఓట్లు అధికంగా ఉన్న ఈ సెగ్మెంట్లో ఆ సామాజికవర్గాల ఓట్లను తమవైపు మలుపుకునే దిశగా ఎలాంటి కార్యాచరణ చేయటం లేదు. కాంగ్రెస్ పార్టీని గెలిపించినా గెలిచినా అభ్యర్ది ఆ పార్టీలో ఉంటాడో లేదో తెలియని అయోమయం నెలకొంది. దీంతో ప్రజలు కాంగ్రెస్‌కు ఓట్లు వేసేందుకు విశ్వసించటం లేదనే అభిప్రాయం ఉంది. ప్రభుత్వ వ్యతిరేకత కలిసి వస్తుందని అంటున్నారు. డబుల్ బెడ్రూం ఇళ్ల పంపిణీలో అక్రమాలు జరిగాయని పేద ప్రజలు గుర్రుగా ఉన్నారని చెప్పుకొస్తున్నారు. ఒబేదుల్లా కోత్వాల్, సంజీవ్ ముదిరాజ్‌లు సీటు ఆశిస్తున్నారు. అయితే కాంగ్రెస్ అధిష్టానం మాత్రం మంత్రి శ్రీనివాస్ గౌడ్ ధీటుగా నిలిచే అభ్యర్దిని బరిలోకి దింపేందుకు కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. బీజేపీ మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి కూడ కాంగ్రెస్ పార్టీలో చేరుతారని ఆయన ఇక్కడి నుంచి పోటీ చేస్తారనే ప్రచారం జోరుగా సాగుతుంది. ఇంకోవైపు టీటీడీ బోర్డు సభ్యుడు, పారిశ్రామికవేత్త మన్నె జీవన్‌రెడ్డి పేరు కూడ ప్రముఖంగా వినిపిస్తోంది. జోడో యాత్ర, కార్ణాటక గెలుపు కాంగ్రెస్ కలిసి వస్తుందా? రాహుల్ గాంధీ జోడో యాత్ర విజయవంతం కావటం.. కర్ణాటకలో పార్టీ గెలుపు కలిసి వచ్చే అంశంగా మారింది. గతంలో పార్టీని వీడిన నేతలు తిరిగి కాంగ్రెస్ గూటికి చేరుతుండటంతో ఆ పార్టీలొ కొత్తజోష్ నెలకొంది. 2012 ఉపఎన్నికల్లో ఇక్కడ బీజేపీ నుంచి పోటీ చేసిన యెన్నం శ్రీనివాస్‌రెడ్డి విజయం సాధించారు. పొత్తులో భాగంగా బీజేపీ నుంచి 1999లో ఏపీ జితేందర్‌రెడ్డి మహబూబ్‌నగర్ నుంచి ఎంపీగా గెలుపొందారు. ప్రస్తుతం బీజేపీ పాలమూరుపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. ఇక్కడి నుంచి ఈ సారి కషాయం జెండా ఎగురవేయాలని యోచిస్తున్నారు. డీకే అరుణను ఇక్కడి నుంచి బరీలో దింపాలనే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో డీకే అరుణకు.. అసెంబ్లీ ఎన్నికల్లో శ్రీనివాస్ గౌడ్‌కు వచ్చిన ఓట్లకంటే అధికంగా రావటంతో పార్టీకి బూస్ట్ ఇచ్చినట్టయ్యింది. జితేందర్‌రెడ్డి కూడ బీజేపీలో ఉండటం, బండి సంజయ్ కుమార్‌కు ప్రజాసంగ్రామయాత్ర ఈ జిల్లాలో విజయవంతం కావటం పార్టీ శ్రేణుల్లో నూతనోత్సహం నింపింది. ఈసారి మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి, మాజీమంత్రి చంద్రశేఖర్, ఎన్పీ వెంకటేష్‌తో పాటు మరో రెండు మూడు పేర్లు పోటీ చేసే అభ్యర్దుల జాబితాలో కనిపిస్తున్నాయి. అయితే పార్టీలో అంతర్గత విభేదాలు కూడ నష్టం కలిగించే అవకాశం ఉంది. పాత, కొత్త నేతలకు పొసగటం లేదు. పాతవాళ్లు గ్రూపుగా ఏర్పడి కొత్తవారిని ఎదగనీయటం లేదనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత.. మోదీ ప్రభావంతో ఈసారి తప్పకుండా బీజేపీ గెలుస్తుందని ధీమా వ్యక్తంచేస్తున్నారు. మొత్తంగా మహబూబ్‌నగర్ సెగ్మెంట్లో ఎవరికి వారు తమ అస్త్రాలు సిద్దం చేసుకుంటున్నారు. నియోజకవర్గంలో భౌగోళిక పరిస్థితులు: వ్యవసాయంమే ప్రధానంగా జీవనం సాగించే జనం ఉన్నారు. పెద్దగా పరిశ్రమలు లేవు. నూతనంగా ఐటీ కారిడార్ ఏర్పాటైనా ఇంకా అందులోకి కంపెనీలు రాలేదు. అడవులు: అప్పన్నపల్లి పరిసరాల్లో అడవులు ఉన్నాయి ఆలయాలు--పేదల తిరుపతిగా పిలిచే మన్యంకొండ శ్రీ లక్ష్మీవేంకటేశ్వరస్వామి ఆలయం పర్యాటకం: మయూరీ నర్సరీ,కోయిల్‌సాగర్ ప్రాజెక్టు -
రసవత్తరంగా మారనున్న గద్వాల ఎన్నికలు.. గెలుపు ఎవరిది?
నియోజకవర్గం: గద్వాల మండలాల సంఖ్య: 5 (గద్వాల, మల్దకల్, ధరూర్, గట్టు, కేటీదొడ్డి ) మొత్తం పంచాయితీలు: 130 పెద్ద మండలం: గద్వాల మొత్తం ఓటర్లు: 91875 పురుషులు: 45321; మహిళలు: 46544 ప్రతిసారి ఎన్నికలు గద్వాలలో హోరాహోరీగా సాగుతాయి. గడచిన మూడు సాధారణ ఎన్నికల్లో ప్రధానంగా అత్తా అల్లుళ్ల మధ్య పోటీ నువ్వా-నేనా అన్నట్టు సాగింది. కానీ వచ్చే ఎన్నికల్లో కూడ వీరిద్దరు మరోసారి తలబడనున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ కూడ సామాజిక వర్గ సమీకరణాలను పరిగణలోకి తీసుకుని బలమైన బీసీ అభ్యర్దిని బరిలో దింపటానికి సిద్దమవుతుంది. దీంతో ఈసారి ఈ నియోజకవర్గంలో ఎన్నికలు రసవత్తరంగా మారనున్నాయి. త్రిముఖపోటీ అనివార్యం కానుంది. కాంగ్రెస్ కంచుకోట.. ఈసారి కూడా బీఆర్ఎస్ వచ్చేనా? సంస్ధానాల పాలన.. జాతీయస్దాయి గుర్తింపు గల చేనేత కార్మికులు.. కృష్ణా తుంగభద్రా నదుల మధ్య గల నడిగడ్డ ప్రాంతంగా పిలువబడే గద్వాల రాజకీయ చైతన్యం గల నియోజకవర్గం. ఉమ్మడి పాలమూరు జిల్లాలో రసవత్తరంగా పోటీ సాగే నియోజకవర్గాల్లో గద్వాల కూడ ఒకటి. మొదటి నుంచి ఇది కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. ఇప్పటి వరకు 14 సార్లు ఎన్నికలు జరిగితే ఏడు సార్లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్దులే విజయం సాధించారు. డీకే కుటుంబ సభ్యులే అక్కడ 8 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. డీకే సమరసింహారెడ్డి, డీకే అరుణ మంత్రులుగా కూడా పనిచేశారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత 2014లో జరిగిన ఎన్నికల్లో డీకే అరుణ కాంగ్రెస్ పార్టీ నుంచి విజయం సాధించారు. 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గెలిచారు. వీరిద్దరు వరుసకు అత్తా-అల్లుళ్లు. గడచిన మూడు ఎన్నికల్లో వీరిద్దరు తలబడితే రెండుసార్లు డీకే అరుణ విజయం సాధించగా కృష్ణమోహన్ రెడ్డి ఒకసారి గెలిచారు. తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలతో డీకే అరుణ బీజేపీలో చేరారు. 2019లో మహబూబ్‌నగర్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి అధికార టీఆర్ఎస్కు గట్టిపోటీ ఇచ్చారు. ప్రస్తుతం ఆపార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆమె బీజేపీ నుంచి పోటీ చేయనున్నారు. ప్రజలకు అందుబాటులో ఉండే నాయకురాలిగా అరుణకు గుర్తింపు ఉంది. కాంగ్రెస్ వీడిన తర్వాత గద్వాలలో బీజేపీని బలోపేతం చేసేందుకు చర్యలు చేపట్టారు. జిల్లా సాధనకు ఆమె అప్పట్లో గట్టిపోరాటం చేశారు. ప్రజాసమస్యలపై, ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై ఆమె వెంటనే స్పందిస్తుంది. ప్రధానంగా సీఎం కేసీఆర్‌పై సైతం విధానపరమైన విమర్శలు చేస్తూ పార్టీ అధిష్టానంలో తనదైన ముద్రవేసుకుంది. ప్రస్తుతం ఆమె నియోజకవర్గంలో విసృతంగా పర్యటిస్తూ కార్యకర్తలను కార్యోన్ముఖులను చేసింది. నియోజకవర్గంలో ముస్లిం, క్రిస్టియన్ల ఓట్లు దాదాపు 30 వేల వరకు ఉన్నాయి. ఈ ఓట్లు ఒకవేళ పార్టీపరంగా బీజేపీకి వ్యతిరేకంగా పడితే కొంత ఇబ్బందిగా మారే అవకాశం లేకపోలేదు. అయితే కేసీఆర్ పాలనతో ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని ఆపార్టీని ఓడించేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారని వచ్చే ఎన్నికల్లో గెలుపు బీజేపీదేనన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు డీకే అరుణ వర్గీయులు. సిట్టింగ్‌లకే బీఆర్ఎస్ సీటు సిట్టింగ్‌లకే ఈసారి సీట్లు ఇస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించటంతో మరోసారి కృష్ణమోహన్‌రెడ్డి బీఆర్ఎస్ నుంచి పోటీ చేయటం ఖాయమైంది. కానీ పార్టీలో కుమ్ములాటలు, అంతర్గత విభేదాలు, గ్రూపు తగదాలు ఎమ్మెల్యేకు తలనొప్పిగా మారాయి. ఆయన అనుచరులే వ్యతిరేకంగా చాపకింది నీరులా పావులు కదుపుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇక్కడ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ సరితకు ఎమ్మెల్యేకు మధ్య విభేదాలు తారాస్దాయికి చేరటంతో ఇటీవలే ఆమె బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వచ్చే ఎన్నికల్లో ఆమె ఇక్కడి నుంచి పోటీ చేయనున్నట్టు తెలుస్తోంది. రెండు రోజుల క్రితం గాంధీ భవన్లో గద్వాల నియోజకవర్గానికి చెందిన వివిధ పార్టీల నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భంగా పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి కూడా ఈసారి గద్వాల నుంచి బలహీన వర్గాల అభ్యర్దిని గెలిపించాలని పిలుపునిచ్చారు. దీంతో ఆమెకు సీటు ఖాయమైందని స్పష్టమవుతుంది. అక్కడి నుంచి పోటీ చేయాలని భావిస్తున్న నేతలు పెద్దగా ప్రభావితం చేసే వాళ్లు కాకపోవటంతో ఈమెకు మార్గం సుగమమయ్యింది. ఈ నియోజవర్గంలో వాల్మీకి బోయలు, కురువల ఓట్లు అధికంగా ఉండటంతో కురువ సామాజిక వర్గానికి చెందిన సరిత పోటీ చేస్తే కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. కర్ణాటక రాష్ట్రానికి సరిహద్దుగా ఉండే గద్వాల నియోజకవర్గంపై ఇటీవల జరిగిన కర్ణాటక ఎన్నికల ఫలితాల ప్రభావం కూడా ఉంటుందని ఈపార్టీ నేతలు లెక్కలు వేసుకుంటున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి పార్టీలో నెలకొన్న అంతర్గత విభేదాలు తలనొప్పిగా మారాయి. ఎమ్మెల్యే అన్నితానై వ్యవహరిస్తున్నారని సొంత పార్టీ వారే అరోపిస్తున్నారు. తన అనుచరులకే ఎమ్మెల్యే పెద్దపీట వేస్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యే కుటుంబ సభ్యులైన బండ్ల చంద్రశేఖర్‌రెడ్డి, బండ్ల రాజశేఖర్‌రెడ్డితో కూడా పొసగటం లేదట. అందుకే బక్కచంద్రన్నగా పిలిచే చంద్రశేఖర్‌రెడ్డి కూడా జడ్పీచైర్ పర్సన్ సరితతో పాటుగా కాంగ్రెస్‌లో చేరారు. ఇది ఎమ్మెల్యేకు తీవ్రంగా నష్టం కలిగిస్తుందని భావిస్తున్నారు. ఇక ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత కూడ ఎమ్మెల్యేకు ఇబ్బందిగా మారే ప్రమాదం లేకపోలేదు. అయితే ప్రభుత్వ అభివృద్ది, సంక్షేమ పథకాలే తమపార్టీని గెలిపిస్తాయని బీఆర్ఎస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తుండంగా ప్రతిపక్ష బీజేపీ,కాంగ్రేస్ పార్టీ నేతలు సైతం ఈసారి తామే విజయం సాధిస్తామనే ధీమాలో ఉన్నారు.మొత్తంగా నడిగడ్డ రాజకీయాలు ఎన్నికలకు నాలుగు నెలల ముందే రంజుగా సాగుతున్నాయి. త్రిముఖ పోటీలో విజయం ఎవరిని వరిస్తుందో చూడాలి. నియోజకవర్గంలో భౌగోళిక పరిస్థితులు: ఈ నియోజకవర్గం ఇటు కృష్ణా, అటు తుంగభద్రా నదుల మధ్య ఉండటంతో ఈ ప్రాంతాన్ని నడిగడ్డగా పిలుస్తారు. గద్వాల కేంద్రంగా సంస్దానాల పాలన సాగింది నదులు: కృష్ణానది ,జూరాల ప్రాజెక్టు, నెట్టెంపాడు ప్రాజెక్టు ఆలయాలు: మల్దకల్ స్వయంభు లక్ష్మి వెంకటేశ్వర స్వామి ఆలయం, జమ్మిచేడు జమ్మలమ్మ ఆలయం, పర్యాటకం: జూరాల పర్యాటక కేంద్రంగా డ్యాంలో నీటి నిల్వను, గేట్ల ద్వారా పారే నీటి ప్రవాహాన్ని చూసేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి అధిక సంఖ్యలో ప్రజలు వస్తారు. అదేవిధంగా గద్వాల కోటను చూసేందుకు, గద్వాల పట్టు చీరలను కొనేందుకు పర్యాటకులు ఆసక్తి చూపుతారు. తిరుమల వెంకన్నకు ప్రతిఏటా జరిగే బ్రహ్మోత్సవాలకు ఇక్కడి నుంచి స్వామివారికి జోడుపంచెలు తీసుకెళ్తారు. ఇది వందల ఏళ్లుగా వస్తున్న సాంప్రదాయం -
బండి సంజయ్‌ని కలిసిన చీకోటి ప్రవీణ్
సాక్షి, ఢిల్లీ: చికోటి ప్రవీణ్.. తెలంగాణలో సంచలనం సృష్టించిన పేరు. విదేశాల్లో అక్రమ క్యాసినో నడిపించిన వ్యవహారంలో ఫెమా నిబంధనల ఉల్లంఘన, హవాలా చెల్లింపులపై ఈడీ విచారణ ఎదుర్కొంటున్న ప్రవీణ్.. అటుపై నిబంధనలకు విరుద్ధంగా కొన్ని జంతువుల్ని పెంచుకున్నాడనే అభియోగాలు సైతం ఉన్నాయి. ఈ క్రమంలో గతకొంతకాలంగా రాజకీయాల్లోకి వస్తాడంటూ జరుగుతున్న ప్రచారానికి తాజా పరిణామాలు మరింత ఊతం ఇచ్చాయి. చికోటి ప్రవీణ్ రాజకీయాల్లోకి వస్తాడనే ప్రచారానికి బలం చేకూర్చేలా ఇవాళ కొన్ని పరిణామాలు జరిగాయి. బీజేపీలో చేరొచ్చనే సంకేతాలు ఇస్తూ.. గురువారం ఢిల్లీలో కొందరు తెలంగాణ బీజేపీ నేతలను కలిశాడు ప్రవీణ్. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణలను కలిశాడు. వాళ్లకు శాలువా కప్పి సత్కరించాడు. వీళ్లతో పాటు తాజాగా బీజేపీలో చేరిన జయసుధను సైతం ప్రవీణ్ కలిశాడు. బీజేపీలో చేరడానికి లైన్ క్లియర్ చేసుకునే క్రమంలోనే వీళ్లందరినీ కలుస్తున్నట్లు సంకేతాలు అందుతున్నాయి. అయితే ఇక్కడి నేతలను ఢిల్లీ వెళ్లి మరీ కలవడం గమనార్హం. ఇక.. వివాదాలతో వార్తల్లోకి ఎక్కుతున్న వ్యక్తి, పైగా ఈడీలాంటి దర్యాప్తు సంస్థ విచారణ ఎదుర్కొంటున్న ప్రవీణ్‌ను బీజేపీ అక్కున చేర్చుకుంటుందా? తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే. -
తెలంగాణలో కాషాయ జెండా ఎగరాల్సిందే
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో అధికారమే లక్ష్యంగా నాయకులందరూ కలిసికట్టుగా పనిచేయాలని రాష్ట్ర బీజేపీ నాయకులకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. గెలుపే లక్ష్యంగా క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతంపై దృష్టి సారించాలన్నారు. రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో సహాయక చర్యల విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని, అదే సమయంలో క్షేత్రస్థాయిలో ప్రజలకు చేరువయ్యేలా కార్యకర్తలు, నాయకులు సహాయక చర్యల్లో పాల్గొనేలా చూడాలని ఆదేశించారు. శనివారం తనను కలిసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్, ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్‌లు తరుణ్ ఛుగ్, సునీల్ బన్సల్‌తో అమిత్ షా రాష్ట్రంలోని తాజా పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఇటీవల కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లతో భేటీ సందర్భంగా రాష్ట్ర రాజకీయాలపై ఆరా తీసిన అమిత్ షా... రాష్ట్ర నాయకులకు పార్టీ వ్యవహారాలు, అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో క్షేత్రస్థాయిలో అనుసరించాల్సిన వ్యూహాలు, బీఆర్ఎస్ ప్రభు త్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టడం, ప్రధాని సహా కేంద్రమంత్రుల పర్యటనలు సహా పలు అంశాలపై దిశా నిర్దేశం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టేందుకు మరింత దూకుడుగా వ్యవహరించాలని సూచించారు. రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైన పరిస్థితుల గురించి కిషన్‌రెడ్డి సహా రాష్ట్ర నాయకులు అమిత్ షాకు వివరించారు. -
బండి సంజయ్‌కు కీలక పదవి..
సాక్షి, ఢిల్లీ: తెలంగాణ మాజీ బీజేపీ చీఫ్ బండి సంజయ్‌కు హైకమాండ్ కీలక పదవిని అప్పగించింది. బీజేపీ జాతీయ నాయకత్వంలో చోటు కల్పించింది.ఈ క్రమంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బండి సంజయ్‌ను నియమించింది. ఈ మేరకు పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా బీజేపీ జాతీయ కమిటీని ప్రకటించారు. - ఇదే సమయంలో తెలంగాణ నుంచి డీకే అరుణ జాతీయ ఉపాధ్యక్షురాలిగా కొనసాగుతుండగా.. ఏపీ నుంచి సత్యకుమార్ బీజేపీ జాతీయ కార్యదర్శిగా కొనసాగనున్నారు. - అయితే, ఏదైనా ఒక రాష్ట్రానికి బండి సంజయ్‌ను ఇన్చార్జ్గా నియమించే అవకాశం ఉన్నట్టు సమాచారం. भाजपा राष्ट्रीय अध्यक्ष श्री @JPNadda ने निम्नलिखित केंद्रीय पदाधिकारियों के नामों की घोषणा की है- pic.twitter.com/0aaArxHF30 — BJP (@BJP4India) July 29, 2023 - మరోవైపు.. తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి, డీకే అరుణ ఇప్పటికే ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఈరోజు మధ్యాహ్నం 2గంటలకు ఈటల రాజేందర్ ఢిల్లీకి బయలుదేరనున్నారు. - అయితే, తెలంగాణలో ఇటీవలే అధ్యక్ష పదవి నుంచి బీజేపీ హైకమాండ్ బండి సంజయ్‌ను తప్పించిన విషయం తెలిసిందే. అనంతరం, కేంద్రమంత్రిగా ఉన్న కిషన్‌రెడ్డికి తెలంగా బీజేపీ అధ్యక్షుడిగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో బండి సంజయ్‌కు ఎలాంటి పదవి ఇస్తారనేది ఆసక్తికరంగా మారిన తరుణంలో తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక, బీజేపీ కార్యకర్తల్లో ఉన్న అసంతృప్తిని తగ్గేందుకే సంజయ్‌కు కీలక పదవి ఇచ్చినట్టు పొలిటికల్ విశ్లేషకులు చెబుతున్నారు. ఇది కూడా చదవండి: ఆ ముగ్గురు జడ్పీ ఛైర్మన్లు కారు దిగితే కష్టమే.. రేవంత్ టీమ్ ప్లాన్ వర్కౌవుట్ అవుతుందా?