సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జైలుకి వెళ్లాల్సి వస్తే అది ఆమె చేసిన అవినీతి కార్యక్రమాల వల్లనే అని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. వాస్తవాలు ఇలా ఉంటే, తానేదో ప్రజల కోసం పోరాడి జైలుకి వెళ్లేందుకు సిద్ధం అన్నట్లుగా ఆమె మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. అసలు ఎలాంటి తప్పు చేయనప్పుడు ఈడీ, సీబీఐ వంటి దర్యాప్తు సంస్థలు ఎన్ని వచ్చినా భయపడాల్సిన అవసరం ఏముందని టీఅర్‌ఎస్ నాయకులను ప్రశ్నించారు.
కేంద్రం అవినీతి పరులను వదిలిపెట్టదని గురువారం ఆమె ఒక ప్రకటనలో హెచ్చరించారు. కల్వకుంట్ల కుటుంబం చేసిన తప్పులు బయటపడతాయనే బీజేపీపై ఎదురు దాడి ప్రారంభించిందని మండిపడ్డారు. తప్పులను కప్పిపుచ్చుకోవడానికి, ప్రజల నుంచి సానుభూతి పొందటానికి కల్వకుంట్ల కుటుంబం బీజేపీపై బురదచల్లే ప్రయత్నం చేస్తోందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment