సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఏ తప్పు చేయనప్పుడు, లిక్కర్ స్కాంతో ఆమెకు సంబంధం లేనప్పుడు సీబీఐ సహా ఎలాంటి విచారణకు భయపడాల్సిన అవసరం లేదని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అభిప్రాయపడ్డారు. ఆమెపై వచ్చినవి కేవలం ఆరోపణలే ఐతే.. విచారణలో అదే వెల్లడవుతుందని వ్యాఖ్యానించారు. సీబీఐ దర్యాప్తు పట్ల సీఎం కేసీఆర్, వారి కుటుంబ సభ్యులు, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.
అరుణ ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. సీఎం విశ్వాసపాత్రులుగా నిరూపించుకోవడం కోసం బీఆర్‌ఎస్ నాయకులు బీజేపీపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. సీబీఐ... కవితను విచారిస్తుంటే ఆందోళన ఎందుకని ప్రశ్నించారు. సీబీఐ, ఈడీ, ఐటీ సంస్థలను కేంద్రం ప్రయోగిస్తోందంటూ చేస్తున్న విమర్శల్లో అర్థం లేదన్నారు. రాష్ట్రంలో పోలీసులు, అధికార వ్యవస్థను ఉపయోగించుకుని ఇతరపార్టీల వారిని కేసుల్లో ఇరికించి, బెదిరింపులు, వేధింపులకు పాల్పడడం బీఆర్‌ఎస్ సర్కార్‌కు అలవాటని అరుణ ఆరోపించారు. బెదిరింపులతో బీఆర్‌ఎస్‌లో చేర్చుకున్నాక కేసులు ఎత్తేయడం వంటివి అధికారపార్టీకి పరిపాటేనన్నారు.
Comments
Please login to add a commentAdd a comment