
సాక్షి, హైదరాబాద్: పవర్ కమిషన్ విచారణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడారు.
‘పవర్ కమిషన్ చైర్మన్ మార్చాలని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. వెంటనే జడ్జిని ఎవరిని నియమిస్తారో సుప్రీంకోర్టుకు ప్రభుత్వం తెలియజేయాలి. విచారణ న్యాయబద్ధంగా జరగడం లేదు. కమిషన్ విచారణ పారదర్శకంగా జరగాలి.
రాష్ట్రంలో సమస్యలను పక్కదారి పట్టించేలా కాంగ్రెస్ ప్రభుత్వం తీరు ఉంది. ఇప్పటికైనా కమిషన్ల పేరుతో కాలయాపన మానుకోవాలి. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారులు కూడా అదే విధంగా వ్యవహరిస్తున్నారు’ అని కేటీఆర్ అన్నారు.