power
-
Electricity Charges: పేద ప్రజలకు కేంద్రం దీపావళి కానుక..
-
మూడు చక్రాల వింత వాహనం: ఇలాంటిది మీరెప్పుడూ చూసుండరు (ఫోటోలు)
-
విద్యుత్ రంగానికీ పీఎల్ఐ!
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం విద్యుత్ ప్రసార(పవర్ ట్రాన్స్మిషన్) రంగానికి సైతం ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక(పీఎల్ఐ) పథకాన్ని ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరం(2024–25) చివరికల్లా పీఎల్‌ఐను వర్తింపచేయాలని చూస్తున్నట్లు విద్యుత్ శాఖ అధికారులు పేర్కొన్నారు. ప్రపంచస్థాయిలో ట్రాన్స్మిషన్ పరికరాల కొరత కారణంగా ధరలు పెరిగిపోతుండటంతో తాజా యోచనకు తెరతీస్తున్నట్లు తెలియజేశారు. మరోవైపు ప్రభుత్వం పునరుత్పాదక(రెనెవబుల్) ఇంధనాన్ని ప్రోత్సహిస్తున్న నేపథ్యంలో వేగవంతంగా విద్యుత్ ప్రసార లైన్లను ఏర్పాటు చేయడంలో సవాళ్లు ఎదురవుతున్నాయి. దేశీయంగా విద్యుత్ ప్రసార పరికరాల కోసం అత్యధిక శాతం దిగుమతులపైనే ఆధారపడుతుండటంతో పీఎల్ఐకు ప్రభుత్వం తెరతీస్తున్నట్లు అధికారిక వర్గాలు తెలియజేశాయి. తద్వారా దేశీయంగా ట్రాన్స్మిషన్ పరికరాల తయారీకి ప్రభుత్వం దన్నునివ్వనున్నట్లు వెల్లడించాయి. దీంతో విదేశీ మారక నిల్వలను సైతం ప్రభుత్వం ఆదా చేసుకోనుంది. దిగుమతులే అధికం ప్రధానంగా ట్రాన్స్ఫార్మర్లు, సర్క్యూట్ బ్రేకర్లు, స్విచ్గేర్లు తదితర విద్యుత్ ప్రసార పరికరాల కోసం భారత్ విదేశాలపై అధికంగా ఆధారపడుతోంది. ప్రపంచ బ్యాంకు గణాంకాల ప్రకారం 2023లో భా రత్ 33.8 కోట్ల డాలర్ల (సుమారు రూ.2,840 కో ట్లు) విలువైన పరికరాలను దిగుమతి చేసుకుంది. -
ఇజ్రాయెల్‌కు పవర్ చూపించాలి: ఇరాన్ సుప్రీం లీడర్
టెహ్రాన్: తమ సైనిక స్థావరాలపై ఇజ్రాయెల్ జరిపిన తాజా దాడులపై ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ స్పందించారు. తమ పవర్‌ను ఇజ్రాయెల్‌కు చూపించాలన్నారు. దీని కోసం ఎలా స్పందించాలనే విషయాన్ని అధికారులే నిర్ణయిస్తారని ఖమేనీ చెప్పినట్లు ఇరాన్ అధికారిక వార్తా సంస్థ ఐఆర్ఎన్ఏ వెల్లడించింది. ఇజ్రాయెల్ దాడులను మరీ తక్కువ చేసి చూడవద్దని, అదే సమయంలో అతిగా భావించవద్దని ఖమేనీ చెప్పినట్లు తెలిపింది. కాగా,శనివారం(అక్టోబర్ 26) తెల్లవారుజామున ఇరాన్ రాజధాని టెహ్రాన్‌తో పాటు 20 లక్ష్యాలపై ఇజ్రాయెల్ దళాలు దాడులు చేశాయి.ఇరాన్ గగనతల రక్షణ వ్యవస్థలే లక్ష్యంగా 100 యుద్ధ విమానాలు,డ్రోన్లతో అక్కడి క్షిపణి,డ్రోన్ వ్యవస్థలకు భారీ నష్టం కలిగించామని ఇజ్రాయెల్ సైన్యం (ఐడీఎఫ్) ప్రకటించింది. ఇదీ చదవండి: ఇరాన్‌పై నిప్పుల వర్షం -
ఒక్క రోజు అమ్మాయిలకు అధికారం ఇస్తే..సూపర్ సక్సెస్!
దసరా నవరాత్రుల సందర్భంగాఉత్తర ప్రదేశ్‌లో హఠాత్తుగా పది జిల్లాలకు కొత్త కలెక్టర్లు వచ్చారు.అందరూ హైస్కూల్ గర్ల్ స్టూడెంట్లే. ‘జనతా దర్శన్’ పేరుతో సాగే ప్రజా దర్బార్లలో పాల్గొని సమస్యలు విని పరిష్కారాలకోసం నిర్ణయాలు తీసుకున్నారు. ఇది ఉత్తుత్తికి కాదు.స్త్రీ శక్తి నిరూపణ కోసం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంచాలా సీరియస్‌గా నిర్వహించిన ‘ఆడపిల్లలకు ఒక రోజు అధికారం’ కార్యక్రమంలోజిల్లా యంత్రాంగం చేతులు కట్టుకుని వారి మాట వింది.ఈ అమ్మాయిలు ఈ అనుభవంతో ఐ.ఏ.ఎస్ కావాలనే తలంపునకు వచ్చారు. ప్రతి రాష్ట్రం ఇలాంటి ప్రయత్నం చేయాలి. అమ్మాయిలు చదువుకోవడం, విదేశాలకు వెళ్లి పై చదువులు చదవడం, మగవారికి మాత్రమే సాధ్యమయ్యే ఉద్యోగాలు తామూ చేయడం చూస్తూనే ఉన్నాం. చరిత్రలో మొదటిసారి అమెరికాలో అధ్యక్షపదవికి ఒక మహిళ పోటీ పడటం వరకూ ఈ మహిళా చైతన్యం సాగింది. అయినప్పటికీ మహిళల పట్ల వివక్ష, కుటుంబాలలో మగ పిల్లాడికి దక్క ప్రాధాన్యం, చదివించే విషయంలో అబ్బాయిలకు మంచి కోర్సు అమ్మాయిలకు అప్రధానమైన కోర్సు దేశంలో సాగుతూనే ఉన్నాయి. ఇలాంటి మైండ్‌సెట్‌ని మార్చడానికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ‘శక్తి మిషన్’ అనే కార్యక్రమం నిర్వహిస్తోంది. మహిళల స్వావలంబనే కాదు... అమ్మాయిల ఆత్మవిశ్వాసం పెంచడం ఈ కార్యక్రమం ఉద్దేశం. ఇందులో మరో ముఖ్యమైన కార్యక్రమం ‘అమ్మాయిలకు ఒకరోజు అధికారం’. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మొన్నటి అక్టోబర్ 12న దాదాపు పది జిల్లాలలో ఈ కార్యక్రమం కింద ఇంటర్ లోపు చదువుతున్న అమ్మాయిలకు జిల్లా కలెక్టర్‌గా, ఎస్.పి.గా, సి.డి.ఓ. (చీఫ్ డెవలప్మెంట్ ఆఫీసర్‌గా) పూర్తి అధికారాలు ఇచ్చారు. సర్వోన్నత ఉద్యోగాల్లో ఉంటే పేదవారికి, బలహీనులకు ఎలా న్యాయం చేయవచ్చో ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థినులకు తెలియచేయడమే కాదు... వారు అధికారంలో ఉంటే మిగిలిన సిబ్బంది ఎలా వ్యవహరిస్తారో నిజంగా చేసి చూపించారు. ఆ విధంగా ఇదో స్ఫూర్తినిచ్చే కార్యక్రమం.కూరగాయల రేట్లు ఇవా?లక్ష్మీపూర్ ఖేరి జిల్లాకు ఎనిమిదవ తరగతి చదువుతున్న అగరిమ ధావన్ ఒకరోజు కలెక్టర్ అయ్యింది. ఆమె ఆ రోజు తన దగ్గరకు వచ్చిన ప్రజల సమస్యలు వింది. అందులో భాగంగా కూరగాయల రేట్లు పెరగడం వల్ల ఇబ్బంది పడుతున్నామన్న ఫిర్యాదు వింది. వెంటనే కింది స్థాయి అధికారులను పిలిచి ‘కూరగాయల రేట్లు ఇలా ఉంటే ఎలా? వీటిని క్రమబద్ధీకరించరా?’ అని ప్రశ్నించి వాటి అదుపునకు చర్యలు తీసుకోమంది. వెంటనే అందుకు తగిన చర్యలు మొదలయ్యాయి. జౌన్పూర్ జిల్లాకు ఇంటర్ చదువుతున్న సాజల్ గుప్తా కలెక్టర్ అయ్యింది. ప్రజాదర్బార్ లో 87 ఫిర్యాదులు ఆమె వద్దకు వచ్చాయి. వాటిలో 14 ఫిర్యాదులను అక్కడిక్కడే ఆమె పరిష్కరించింది తన అధికారాలతో. ఇక మహరాజ్ గంజ్‌కు కలెక్టర్ అయిన నిధి యాదవ్ అనే అమ్మాయి ఆ ప్రాంత వాసులకు రావాల్సిన (హైవే నిర్మాణం వల్ల) నష్టపరిహారాన్ని అప్పటికప్పుడు మంజూరయ్యేలా చేసింది. అదే జిల్లాకు ఎస్.పి.గా అధికారాలు స్వీకరించిన గోల్టీ అనే అమ్మాయి తన పరిధిలోని స్టేషన్లలో ఆడవాళ్లు ఇబ్బంది పడుతున్న కేసులను మొదటగా ఇన్వెస్టిగేట్ చేసి పరిష్కరించాలని గట్టి ఆదేశాలు ఇచ్చింది. మిర్జాపూర్, ఘాజీపూర్, షామ్లీ, శ్రావస్థి, బాందా తదితర జిల్లాలలో కూడా ఆ జిల్లాల్లో చురుగ్గా చదువుతున్న అమ్మాయిలను ఎంపిక చేసి కలెక్టర్, ఎస్.పి. బాధ్యతలు అప్పజెప్తే వారు ఒక రోజంతా అద్భుతంగా బాధ్యతలు నిర్వహించడమే కాదు... విజిట్లకు కూడా వెళ్లారు.ఒక రోజు ఆఫీసర్ఎన్.శంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘ఒకే ఒక్కడు’ సినిమాలో అర్జున్ ఒక్క రోజు కోసం సి.ఎం. అయినా అతని నిర్ణయాలన్నీ అమలవుతాయి. ఇక్కడ కూడా ఈ అమ్మాయిలు తీసుకున్న నిర్ణయాలు అమలయ్యాయి. అమలు అయ్యేలా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ కార్యక్రమంలో కొన్ని జిల్లాల్లో తాసిల్దార్లుగా కూడా అమ్మాయిలను నియమించారు ఒకరోజు కోసం. కలెక్టర్‌గా నియమితమైన అమ్మాయి, తాసిల్దార్లుగా నియమితమైన అమ్మాయిలు కలిసి మాట్లాడుకుని ఆ రోజున తమ టేబుళ్ల మీద ఉన్న సమస్యలను చకచకా పరిష్కరించడం అందరినీ ఆకర్షించింది. ఎస్.పి.గా చేసిన అమ్మాయిలు కొందరు ఎఫ్ఐఆర్ల మీద కూడా సంతకాలు చేశారు.కలెక్టర్లమవుతాంఈ కార్యక్రమంలో పాల్గొన్న అమ్మాయిలందరూ ప్రజల సమస్యలు విన్నారు. తాము బాగా చదువుకున్న ఆ సమస్యలను పరిష్కరించే అధికార స్థానంలో వెళ్లవచ్చని గ్రహించారు. ‘మేము బాగా చదువుకుంటాం’ అని ఆత్మవిశ్వాసంతో చెప్పారు. ఈ సందర్భంగా వీరందరూ కాన్వాయ్‌లలో ఆఫీసులకు చేరుకున్నారు. వీరందరూ భవిష్యత్తులో ఇంతకుమించిన బాధ్యతాయుత స్థానాల్లోకి వెళ్లాలని కోరుకుందాం. -
సర్దుబాటు షాక్రూ. 8,113.60 కోట్లు
సాక్షి, అమరావతి: ఇంధన, విద్యుత్ కొనుగోలు ఖర్చు సర్దుబాటు (ఎఫ్‌పీపీసీఏ) చార్జీలు రూ.8,113.60 కోట్లుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి(ఏపీఈఆర్సీ)కి ప్రతిపాదించినట్లు విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కమ్) మంగళవారం వెల్లడించాయి. ఏపీఈఆర్సీ అనుమతితో గృహ విద్యుత్ వినియోగదారుల నుంచి రూ.2,194 కోట్లు, వ్యవసాయ విద్యుత్ సర్వీసుల నుంచి రూ.1901 కోట్లు, పారిశ్రామిక సర్వీసుల నుంచి రూ.2,748 కోట్లు, వాణిజ్య సర్వీసుల నుంచి రూ.669 కోట్లు, సంస్థ(ఇన్స్టిట్యూషన్స్) నుంచి రూ.547 కోట్లు చొప్పున విద్యుత్ బిల్లుల్లో అదనంగా వసూలు చేయనున్నట్లు డిస్కంలు వెల్లడించాయి. ప్రతి నెలా ఒక్కో బిల్లుపై యూనిట్‌కు రూ.1.27 చొప్పున వసూలు చేస్తామని తెలిపాయి. ప్రస్తుతం రాష్ట్ర విద్యుత్ వినియోగదారులపై యూనిట్‌కు రూ.1.65 వసూలు చేస్తున్నామని, వీటిని వచ్చే ఏడాది మార్చి వరకూ కొనసాగిస్తామని స్పష్టం చేశాయి. వీటికి తాజా ఎఫ్‌పీపీసీఏ చార్జీలు అదనమని పేర్కొన్నాయి. ఈ చార్జీల వసూలుకు ఏపీఈఆర్సీ అనుమతి ఇవ్వాల్సి ఉందని, ఇవ్వకుంటే రాష్ట్ర ప్రభుత్వం ఇందులో 75 శాతం భరించాల్సి ఉంటుందని డిస్కంలు స్పష్టం చేశాయి. ‘బాబు’ గుదిబండ పీపీఏ కోసమే రుణాలుగత ప్రభుత్వంలో సెకీ నుంచి 7 వేల మెగావాట్ల విద్యుత్ కొనుగోలు మినహా ఎలాంటి దీర్ఘకాలిక విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు కుదుర్చుకోలేదని డిస్కంలు తెలిపాయి. దీంతో స్పల్పకాలిక విద్యుత్ కొనుగోళ్లకు 2022–23లో రూ.6,522 కోట్లు వెచ్చించినట్లు పేర్కొన్నాయి. అయితే గతంలో చంద్రబాబు హయాంలో జరిగిన పీపీఏలను సమీక్షించేందుకు 2019 జూలైలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఉన్నత స్థాయి చర్చల కమిటీని నియమించిందని, అయితే ఒప్పందం ప్రకారం చెల్లింపులు జరపాలని 2022 మార్చిలో హైకోర్టు సూచించిందని డిస్కంలు గుర్తు చేశాయి. దీనివల్ల సౌర, పవన విద్యుత్ సరఫరా దారులకు యూనిట్ రూ.2.44 చొప్పున బకాయిలు చెల్లించేందుకు రూ.9 వేల కోట్ల రుణం తీసుకోవాల్సి వచ్చిందని డిస్కంలు వెల్లడించాయి. దీన్నిబట్టి చంద్రబాబు పాపాలు విద్యుత్ సంస్థలను, రాష్ట్ర ప్రజలను వెంటాడుతున్నాయనడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలని విద్యుత్తు రంగ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. -
పరిమాణం చిన్నది.. పనిమాత్రం పెద్దది: 'పవర్'ఫుల్ రియాక్టర్
న్యూక్లియర్ రియాక్టర్.. ఈ పేరు చదువుకునే రోజుల్లోనే చాలాసార్లు విని ఉంటారు. ఇది పవర్ ప్లాంట్స్ వంటి వాటిలో ఉపయోగిస్తారని చిన్నప్పుడే చదువుకుని ఉంటారు. అలాంటి న్యూక్లియర్ రియాక్టర్ ఇప్పుడు మన రోజువారీ వినియోగానికి ఉపయోగిస్తే?.. న్యూక్లియర్ రియాక్టర్ ఏమిటి.. రోజువారీ వినియోగానికి ఉపయోగించడమేమిటని చాలామందిలో సందేహం రావచ్చు. ఈ అనుమానం పోవాలంటే ఈ కథనం తప్పకుండా చదివేయాల్సిందే..వెస్టింగ్‌హౌస్ ఎలక్ట్రిక్ కంపెనీ.. ఒక మైక్రో న్యూక్లియర్ రియాక్టర్ అభివృద్ధి చేస్తోంది. స్పేస్ న్యూక్లియర్ టెక్నాలజీ ఆధారంగా కంపెనీ 'ఈవిన్సి' (eVinci) అనే న్యూక్లియర్ రియాక్టర్ రూపొందిస్తోంది. ఇది పరిమాణంలో 10 అడుగులు మాత్రమే ఉంటుంది. ఇది 15 మెగావాట్ల థర్మల్ (MWth) కోర్ డిజైన్‌తో 5 మెగావాట్ల పవర్ ఉత్పత్తి చేస్తుంది. దీని నుంచి వచ్చే శక్తిని అవసరమైన వాటికి ఉపయోగించుకోవచ్చు.వెస్టింగ్‌హౌస్ మైక్రో న్యూక్లియర్ రియాక్టర్లో ఒకసారి ఇంధనాన్ని నింపితే ఎనిమిది సంవత్సరాల పాటు నడుస్తుంది. ఇంధనం పూర్తయిన తరువాత కంపెనీ దీనిని మళ్ళీ తీసుకెళ్లి ఇంధనం నింపి ఇస్తుంది లేదా కొత్త రియాక్టర్‌తో రీప్లేస్ చేస్తుంది. దీనిని ఒకసారి ఒక ప్రదేశంలో ఫిక్స్ చేస్తే మళ్ళీ కదిలించాల్సిన అవసరం కూడా ఉండదు. అంతే కాకుండా దీనిని ప్రత్యేకంగా కూలింగ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఈ రియాక్టర్లో TRISO (ట్రై స్ట్రక్చరల్ ఐఎస్ఓ ట్రాఫిక్ పార్టికల్ ఫ్యూయల్) ఇంధనం వినియోగిస్తారు.ఇదీ చదవండి: రాత్రిపూట వెలుగు ఆర్డర్ చేసుకోవచ్చు.. మీరు ఎక్కడంటే అక్కడ!ఇది పరిమాణంలో చిన్నదిగా ఉంటుంది కాబట్టి ఎక్కడికైనా తీసుకెళ్లడానికి లేదా తీసుకురావడానికి చాలా సానుకూలంగా ఉంటుంది. ఇందులో నుంచి వచ్చే శక్తిని మైనింగ్, డ్రిల్లింగ్ కార్యకలాపాలకు, పారిశ్రామిక సౌకర్యాలకు, డిస్ట్రిక్ట్ హీటింగ్, హైడ్రోజన్ ఉత్పత్తి, పరిశోధన, సైనిక స్థావరాలలో, డేటా సెంటర్లలో ఉపయోగించుకోవచ్చు.కంపెనీ ఈవిన్సి మైక్రో రియాక్టర్ ప్రిలిమినరీ సేఫ్టీ డిజైన్ రిపోర్టును డిపార్ట్మెంట్ ఆఫ్ ఎనర్జీ (DOE) నేషనల్ రియాక్టర్ ఇన్నోవేషన్ సెంటర్ (NRIC)కి అందించింది. అనుకున్నవన్నీ సజావుగా జరిగితే ఈ న్యూక్లియర్ రియాక్టర్ త్వరలోనే అందుబాటులోకి రానుందని, వీటిని ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తామని.. ఈవిన్సి టెక్నాలజీస్ ప్రెసిడెంట్ 'జోన్ బాల్' అన్నారు. -
టొరెంట్ పవర్ భారీ పెట్టుబడులు
గాంధీనగర్: ప్రయివేట్ రంగ కంపెనీ టొరెంట్ పవర్ పునరుత్పాదక(గ్రీన్) ఇంధన ప్రాజెక్టులపై భారీ పెట్టుబడులకు తెరతీయనుంది. గ్రీన్, సస్టెయినబుల్ ఎనర్జీ ప్రాజెక్టులపై మొత్తం రూ. 64,000 కోట్లుపైగా ఇన్వెస్ట్ చేయనుంది. తద్వారా 26,000 మందికి ఉపాధి కల్పించే అవకాశముంది. ఈ బాటలో పెట్టుబడుల కట్టుబాటును ప్రదర్శిస్తూ కేంద్ర పునరుత్పాదక ఇంధన శాఖకు రెండు శపథ పత్రాలను దాఖలు చేసింది.పరిశ్రమల సమాఖ్య(సీఐఐ)తో కలసి పునరుత్పాదక ఇంధన శాఖ నిర్వహించే ఆర్ఈ–ఇన్వెస్ట్ 4వ సదస్సులో భాగంగా టొరెంట్ పవర్ 2030కల్లా 10 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని అందుకునే లక్ష్యాన్ని ప్రకటించింది. తొలి శపథ పత్రంలో భాగంగా సుమారు రూ. 57,000 కోట్లు ఇన్వెస్ట్ చేయనుంది. దీంతో ప్రత్యక్షంగా, పరోక్షంగా 25,000 మందికి ఉద్యోగావకాశాలు లభించే వీలుంది. ఇందుకు ద్వారకలో 5 గిగావాట్ల సోలార్ లేదా విండ్ లేదా రెండింటి కలయికతో హైబ్రిడ్ పవర్ ప్రాజెక్టును ఏర్పాటు చేసేందుకు గుజరాత్ ప్రభుత్వంతో తాజాగా అవగాహనా ఒప్పందాన్ని(ఎంవోయూ) కుదుర్చుకుంది.ఇక రెండవ శపథ పత్ర ప్రకారం ఏడాదికి లక్ష కిలో టన్నుల సామర్థ్యంతో గ్రీన్ అమోనియా ఉత్పత్తికి ప్లాంటును ఏర్పాటు చేయనుంది. ఇందుకు రూ. 7,200 కోట్లు వెచ్చించనుంది. తద్వారా 1,000 మందికి ఉపాధి లభించనుంది. దేశంలోని విద్యుత్ రంగ దిగ్గజాలలో ఒకటైన టొరెంట్ పవర్ భారత్ పునరుత్పాదక ప్రయాణంలో భాగమయ్యేందుకు కట్టుబడి ఉన్నట్లు కంపెనీ చైర్మన్ సమీర్ మెహతా పేర్కొన్నారు. -
గుళికల ప్యాకెట్‌ను తెచ్చిన కోతి.. టీ పొడి అనుకుని..
రాజానగరం: ఓ కోతి చేసిన పనికి వృద్ధ దంపతులు కన్నుమూశారు. రాజానగరం మండలంలోని పల్లకడియం గ్రామానికి చెందిన వెలుచూరి గోవిందు (75), అప్పాయమ్మ (70) దంపతులకు ఒక కుమారుడు, ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. కుమారుడు తన పిల్లల చదువు కోసం కుటుంబంతో సహా రాజమహేంద్రవరంలో ఉంటున్నారు. ముగ్గురు కుమార్తెలకు వివాహాలు చేశారు. గోవిందు, అప్పాయమ్మ మాత్రమే తమ ఇంట్లో ఉంటున్నారు. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం గోవిందు, అప్పాయమ్మల ఇంటి నుంచి ఒక టీ పొడి ప్యాకెట్‌ను కోతి ఎత్తుకుపోయింది. మరుసటి రోజు శుక్రవారం ఉదయం వేరొక ఇంటి నుంచి పంటలకు ఉపయోగించే విష గుళికల మందు ప్యాకెట్‌ను తీసుకువచ్చి వీరి ఇంటి పెరటిలో పడేసింది. కళ్లు సరిగా కనిపించని అప్పాయమ్మ పెరటిలో పడి ఉన్న ప్యాకెట్‌ను తన ఇంటి నుంచి కోతి తీసుకువెళ్లిందేనని భావించి దానితో టీ పెట్టింది. ఆ టీని తన భర్తకు ఇచ్చి, తాను కూడా తాగింది. కొద్దిసేపటికే వారిద్దరూ నోటి నుంచి నరుగులు కక్కుతూ పడిపోయారు. ఇరుగు పొరుగువారు చూసి హుటాహుటిన రాజమహేంద్రవరం ఆస్పత్రికి తీసుకువెళ్లగా, అప్పటికే మరణించారు. ఈ మేరకు రాజానగరం పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలకు శనివారం పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. -
డిస్కంల నష్టాలు రూ.57,448 కోట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి విద్యుత్ సరఫరాకు చేస్తున్న వ్యయంతో పోలిస్తే వినియోగదారుల నుంచి వసూలు చేస్తున్న బిల్లులు, సబ్సిడీల రూపంలో వచ్చే ఆదాయం తక్కువగా ఉండటంతో.. విద్యుత్ పంపిణీ సంస్థల (డిస్కం) నష్టాలు ఏటేటా పేరుకుపోతున్నాయి. గత ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి రాష్ట్రంలోని రెండు డిస్కంల నష్టాలు కలిపి మొత్తం రూ.57,448 కోట్లకు ఎగబాకాయి. అందులో రూ.39,692 కోట్ల నష్టాలు దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీజీఎస్పీడీసీఎల్)వే కాగా, ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీజీఎన్పిడీసీఎల్) నష్టాలు రూ.17,756 కోట్లు ఉన్నాయి. 2023–24లో రెండు డిస్కంలు మరో రూ.6,299.29 కోట్ల నష్టాలను మూటగట్టుకున్నాయి. టీజీఎస్పీడీసీఎల్, టీజీఎన్పిడీసీఎల్ సంస్థలు 2023–24కి సంబంధించిన తమ చివరి త్రైమాసిక నివేదికల్లో ఈ విషయాన్ని వెల్లడించాయి. ఏటేటా పెరుగుతున్న నష్టాలు: గృహాలు, వ్యవసాయం, పరిశ్రమలు, వాణిజ్యం, ఇతర అన్ని కేటగిరీల వినియోగదారులకు నిరంతర విద్యుత్ సరఫరాలో కీలకమైన డిస్కంలు ఏటేటా భారీ నష్టాలు మూటగట్టుకోవడం ఆందోళన కలిగిస్తోంది. 2017–18 ముగిసే నాటికి రూ.28,209.26 కోట్లకు పెరిగిన డిస్కంల నష్టాలు, 2018–19 ముగిసే నాటికి రూ.36,231.47 కోట్లకు చేరాయి. 2020 మార్చి 31 నాటికి రూ.రూ.42,292 కోట్లకు ఎగబాకినట్టు తాజాగా డిస్కంలు బహిర్గతం చేసిన వార్షిక నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. 2022–23 నాటికి 51,149.98 కోట్లు ఉన్న నష్టాలు 2023–24 నాటికి రూ.57,448 కోట్లకు చేరాయి. రూ.45,241 కోట్లకు చేరిన అప్పులు: రెండు డిస్కంల దీర్ఘకాలిక రుణాలు రూ.23,895.27 కోట్లకు, స్వల్ప కాలిక రుణాలు రూ.21,345.73 కోట్లకు పెరిగాయి. దీంతో డిస్కంల మొత్తం రుణాలు రూ.45,241 కోట్లకు చేరాయి. విద్యుదుత్పత్తి కంపెనీలకు బిల్లుల చెల్లింపులతోపాటు ఉద్యోగులకు జీతాల చెల్లింపుల కోసం డిస్కంలు ఎడాపెడా స్వల్పకాలిక రుణాలు తీసుకుంటున్నాయి. దీనికితోడు పంపిణీ వ్యవస్థ సామర్థ్యం పెంపుదల కోసం భారీగా దీర్ఘకాలిక రుణాలు పొందాయి. బకాయిలు రూ.44,744 కోట్లు తెలంగాణ జెన్కో, ఏపీ జెన్కో, సింగరేణి తదితర విద్యుదుత్పత్తి సంస్థల నుంచి కొనుగోలు చేసిన విద్యుత్‌కి సంబంధించిన బకాయిలతోపాటు ఇతర అన్ని బకాయిలు కలిపి రెండు డిస్కంలు చెల్లించాల్సిన బకాయిలు రూ.44,744.3 కోట్లను ఎగబాకాయి. ఇటు అప్పులు, అటు చెల్లించాల్సి ఉన్న బకాయిలు భారీగా పెరిగిపోవడంతో రెండు డిస్కంలు దివాళాబాటలో నడుస్తున్నాయి. ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీలు వెంటిలేటర్‌గా మారి డిస్కంల దీపం ఆరిపోకుండా కాపాడుతున్నాయి. -
నాడు విద్యుత్ పొదుపు భేష్
సాక్షి, అమరావతి: విద్యుత్ పొదుపులో ఆంధ్రప్రదేశ్ తీసుకున్న చర్యలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖకు చెందిన బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ(బీఈఈ) ఇటీవల వెల్లడించింది. రాష్ట్రంలో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం హయాంలో ఉజాలా పథకం ద్వారా అందరికీ ఎల్ఈడీ బల్బులు అందుబాటులోకి తీసుకురావడం, వీధి దీపాల జాతీయ పథకం, వ్యవసాయ బోర్లకు విద్యుత్ ఆదా పంపు సెట్లు అమర్చడం వంటి ప«థకాలు సమర్థవంతంగా అమలయ్యాయి.రాష్ట్రంలోని అన్ని మునిసిపాలిటీలు, పంచాయతీలలో దాదాపు 29 లక్షల ఎల్ఈడీ వీధి దీపాలను ఎప్పటికప్పుడు పునరుద్ధరిస్తూ ఇతర రాష్ట్రాలకు ఏపీ ఆదర్శంగా నిలిచింది. అదే విధంగా బీఈఈ ఆధ్వర్యంలో భవనాల్లో భారీ ఎత్తున విద్యుత్ పొదుపు సాధించేందుకు ఎనర్జీ కన్జర్వేషన్ బిల్డింగ్ కోడ్ (ఈసీబీసీ) అమలు, రవాణా రంగంలో కాలుష్య నియంత్రణకి ఉద్దేశించిన ఎలక్ట్రిక్ వాహనాల(ఈ–మొబిలిటీ) పథకంలో విద్యుత్ వాహనాలకు రాయితీలు కల్పించడంలో దేశంలోనే ప్రత్యేక గుర్తింపు పొందింది. ఇటువంటి చర్యల ద్వారా రాష్ట్రంలో భారీగా విద్యుత్ ఆదాతో పాటు కర్బన ఉద్గారాలు తగ్గినట్లు బీఈఈ తెలిపింది. తద్వారా రాష్ట్ర విద్యుత్ వినియోగదారులకు, విద్యుత్ సంస్థలకు రూ.కోట్లలో ఆర్థిక ప్రయోజనం చేకూరినట్లు వివరించింది.ఉజాలా పథకంలో ఆదా ఇలా..దేశ వ్యాప్తంగా వార్షిక విద్యుత్ ఆదా – 47,882 మిలియన్ కిలోవాట్లు రాష్ట్రంలో వార్షిక విద్యుత్ ఆదా – 2,863 మిలియన్ కిలోవాట్లు ›దేశంలో వార్షిక విద్యుత్ వ్యయంలో మిగులు– రూ. 19,153 కోట్లు, రాష్ట్రంలో వార్షిక విద్యుత్ వ్యయంలో మిగులు – రూ.1,145 కోట్లు. దేశంలో పీక్ డిమాండ్ తగ్గుదల – 9,586 మెగావాట్లు రాష్ట్రంలో పీక్ డిమాండ్ తగ్గుదల – 573 మెగావాట్లుదేశంలో కర్బన ఉద్గారాల నియంత్రణ – 3,87,84,253 టన్నులు రాష్ట్రంలో కర్బన ఉద్గారాల నియంత్రణ – 33,18,461 టన్నులువీధి దీపాల జాతీయ పథకంలో ఆదా ఇలా.. దేశంలో వార్షిక విద్యుత్ ఆదా – 8,989.66 మిలియన్ కిలోవాట్లు రాష్ట్రంలో వార్షిక విద్యుత్ ఆదా – 1,980 మిలియన్ కిలోవాట్లు దేశ వ్యాప్తంగా పీక్ డిమాండ్ తగ్గుదల– 1,498 మెగావాట్లు రాష్ట్రంలో పీక్ డిమాండ్ తగ్గుదల– 330 మెగావాట్లుజాతీయ స్థాయిలో కర్బన ఉద్గారాల నియంత్రణ – 6.19 మిలియన్ టన్నులురాష్ట్రంలో కర్బన ఉద్గారాల నియంత్రణ – 1.36 మిలియన్ టన్నులు విద్యా సంస్థల్లో ఎనర్జీ క్లబ్లురాష్ట్రంలోని విద్యుత్ వినియోగదారులకు ఇంధన సామర్థ్య ఫలాలను అందించేందుకు అన్ని విధాలుగా కృషి చేస్తున్నాం. బీఈఈ ఆర్థిక సహకారంతో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంధన పరిరక్షణ మిషన్ (ఏపీఎస్ఈసీఎం) ద్వారా రాష్ట్రంలోని విద్యా సంస్థల్లో ఇప్పటికే సుమారు 1,000 ఇంధన సామర్థ్య క్లబ్(ఎనర్జీ క్లబ్)లను ఏర్పాటు చేశాం. వీటి ద్వారా విద్యుత్ పొదుపుపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో పాటు ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం’’ – కె విజయానంద్, ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శివిద్యుత్ ఆదాలో తెలుగు రాష్ట్రాల కృషి ప్రశంసనీయంవిద్యుత్ ఆదా, లైఫ్‌మిషన్ అమలులో దక్షిణాది రాష్ట్రాలు, ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాలు చేస్తున్న కృషిని చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ (సీఐసీ) హీరాలాల్ సమారియా కొనియాడారు. రాష్ట్రంలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని అన్ని వర్గాల ప్రజలకు పర్యావరణహిత జీవన విధానాల కోసం మిషన్‌లైఫ్‌లో భాగస్వామ్యం కావాలని సమారియా పిలుపునిచ్చారు. బీఈఈ దక్షిణాది రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల మీడియా సలహాదారు ఎ.చంద్రశేఖర్‌రెడ్డి ఢిల్లీలో సమారియాతో సోమవారం భేటీ అయ్యారు. ఏపీ సాధించిన విజయాలకు సంబంధించిన సమగ్ర నివేదికను సమారియాకు చంద్రశేఖరరెడ్డి అందించారు. – సీఐసీ హీరాలాల్ సమారియా -
సుప్రీం కోర్టు తీర్పు.. విద్యుత్ రేట్లు పెరుగుతాయా?
భారత అత్యున్నత న్యాయస్థానం ఇటీవల మైనింగ్ రాయల్టీ కేసును విచారించి తీర్పును వెలువరించింది. ఖనిజాలు, గనులు కలిగి ఉన్న భూమిపై పన్నులు విధించే అధికారం రాష్ట్రాలకు ఉందని సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. దాంతో మైనింగ్ కంపెనీలపై దాదాపు రూ.2 లక్షల భారం పడవచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. భారతీయ మైనింగ్ రంగం ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా అత్యధిక పన్ను రేట్లను ఎదుర్కొంటుందని భారతీయ ఖనిజ పరిశ్రమల సమాఖ్య (ఫిమి) పేర్కొంది. సుప్రీం కోర్టు తీర్పు వల్ల మైనింగ్, ఉక్కు, విద్యుత్, బొగ్గు రంగాల్లోని సంస్థలు గణనీయంగా ప్రభావితం అవుతాయని ఫిమి విచారం వ్యక్తం చేస్తుంది. బొగ్గుపైనే ఆధారపడి విద్యుత్ తయారు చేసుకునే రాష్ట్రాలు ఇతర దేశాల నుంచి బొగ్గు దిగుమతి చేసుకోవాలని యోచిస్తున్నాయి.సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం ఏప్రిల్ 1, 2005 నుంచి మైనింగ్ కంపెనీలు రాష్ట్రాలకు రాయల్టీలు చెల్లించాల్సి ఉంటుంది. ఖనిజాలు, గనులు ఎక్కువగా ఉన్న జార్ఖండ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని కంపెనీలు దీనివల్ల ఎక్కువగా ప్రభావితం చెందుతాయి. బొగ్గు ఎక్కువ వెలికితీసి ఇతర రాష్ట్రాలకు సరఫరా చేసేది ఆ రాష్ట్రాలే. అయితే బొగ్గునే ఆధారంగా చేసుకుని విద్యుత్ తయారు చేసుకునే రాష్ట్రాలకు కోర్టు తీర్పుతో నష్టం జరిగే అవకాశం ఉందని కొందరు నిపుణులు భావిస్తున్నారు. రాష్ట్రాలకు రాయల్టీలు చెల్లించాలనే ఉద్దేశంతో కంపెనీలు బొగ్గు ధరను పెంచే ప్రమాదం ఉంది. అందుకు అనుగుణంగా రాష్ట్రాల ట్రాన్స్‌కోలు విద్యుత్ యూనిట్ ధరను పెంచుతాయి. అంతిమంగా సామాన్య ప్రజలపై భారం పడుతుంది. దాంతో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలపై స్థానిక ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది.ఇదీ చదవండి: రూ.30 వేలకోట్ల ప్రాజెక్ట్‌లకు కేబినెట్ ఆమోదంఇప్పటికే చాలా రాష్ట్రాలు వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ను అందిస్తున్నాయి. ఇటీవల జరిగిన ఎన్నికల ప్రచారంలో భాగంగా కొన్ని రాష్ట్రాల్లో గృహావరాలకు సైతం ఉచితంగా విద్యుత్‌ను అందిస్తామని పార్టీలు హామీ ఇచ్చాయి. ఆ పార్టీలే అధికారంలోకి రావడంతో విద్యుత్ సరఫరా భారంగా మారుతుంది. దానికితోడు సుప్రీం కోర్టు తీర్పు ప్రభావం చూపబోతుండడంతో విద్యుత్ తయారీకి అవసరమయ్యే బొగ్గును చౌకగా ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవాలని యోచిస్తున్నాయి. దేశీయ బొగ్గును మండిస్తే బూడిద ఎక్కువగా వెలువడి సామర్థ్యం తగ్గుతుందని గతంలో కొన్ని సర్వేలు వెల్లడించాయి. చైనా వంటి దేశాల్లోని బొగ్గుతో తక్కువ బూడిద వస్తుండడంతో దాన్ని దిగుమతి చేసుకునే అవకాశం ఉంది. ఇదిలాఉండగా, సుప్రీం కోర్టు తీర్పు వల్ల అంతిమ ఉత్పత్తులపై ప్రభావం పడుతుంది. దాంతో ద్రవ్యోల్బణం పెరుగుతుంది. పన్నుల విధానాన్ని స్థిరీకరించేందుకు, మైనింగ్ రంగం వృద్ధికి కేంద్ర ప్రభుత్వం శాసనపరమైన చర్యలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. -
పవర్ కమిషన్ కొత్త చైర్మన్ పై కొనసాగుతున్న సస్పెన్స్
-
‘పవర్ కమిషన్ విచారణపై సుప్రీంకోర్టు తీర్పు స్వాగతిస్తున్నాం’
సాక్షి, హైదరాబాద్: పవర్ కమిషన్ విచారణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడారు. ‘పవర్ కమిషన్ చైర్మన్ మార్చాలని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. వెంటనే జడ్జిని ఎవరిని నియమిస్తారో సుప్రీంకోర్టుకు ప్రభుత్వం తెలియజేయాలి. విచారణ న్యాయబద్ధంగా జరగడం లేదు. కమిషన్ విచారణ పారదర్శకంగా జరగాలి. రాష్ట్రంలో సమస్యలను పక్కదారి పట్టించేలా కాంగ్రెస్ ప్రభుత్వం తీరు ఉంది. ఇప్పటికైనా కమిషన్ల పేరుతో కాలయాపన మానుకోవాలి. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారులు కూడా అదే విధంగా వ్యవహరిస్తున్నారు’ అని కేటీఆర్ అన్నారు. చదవండి: TG: పవర్ కమిషన్‌కు సుప్రీంకోర్టు షాక్ -
TG: పవర్ కమిషన్‌కు సుప్రీంకోర్టు షాక్
సాక్షి,న్యూఢిల్లీ: బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన విద్యుత్ కొనుగోళ్లపై విచారణకు కాంగ్రెస్ ప్రభుత్వం వేసిన విద్యుత్ కమిషన్‌కు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. కమిషన్‌ను రద్దు చేయాలని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు మంగళవారం(జులై 16) విచారణ జరిపింది. పిటిషన్‌ను విచారించిన సందర్భంగా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా(సీజేఐ) డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. కమిషన్ చైర్మన్ రిటైర్డ్ జస్టిస్ ఎల్.నర్సింహారెడ్డిని మార్చాలని బెంచ్ ఆదేశించింది. ఈ సందర్భంగా కమిషన్ చైర్మన్ ఎల్.నర్సింహారెడ్డి తీరుపై సీజేఐ అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రెస్‌మీట్ పెట్టి విచారణకు సంబంధించిన విషయాలపై ఓపెన్‌గా ఎలా మాట్లాడతారని సీజేఐ ప్రశ్నించారు.న్యాయమూర్తి విచారణ చేయడమే కాకుండా నిష్పక్షపాతంగా ఉన్నట్లు కనిపించాలని వ్యాఖ్యానించారు. కాగా, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు చైర్మన్‌ను మార్చడానికి తెలంగాణ ప్రభుత్వం ఒప్పుకున్నట్లు తెలిసింది. లంచ్ తర్వాత కొత్త చైర్మన్ ఎవరనేది చెబుతామని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. దీంతో పిటిషన్ విచారణను లంచ్ తర్వాతకు కోర్టు వాయిదా వేసింది. విచారణలో కేసీఆర్ తరపున సీనియర్న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించగా తెలంగాణ ప్రభుత్వం తరపున అభిషేక్ సింఘ్వి వాదనలు వినిపించారు. అడ్వకేట్ జనరల్‌తో సీఎం రేవంత్ మంతనాలు .. కొత్త చైర్మన్ ఎవరనేదానిపై చర్చ పవర్ కమిషన్ చైర్మన్ ఎల్.నర్సింహారెడ్డిని మార్చాలని సుప్రీంకోర్టు ఆదేశించిన సమయంలో సీఎం రేవంత్‌రెడ్డి హైదరాబాద్ సచివాలయంలో కలెక్టర్ల సమావేశంలో ఉన్నారు. ఆదేశాల గురించి తెలియగానే కలెక్టర్ల సమావేశ హాల్ నుంచి వెళ్లి అడ్వకేట్ జనరల్(ఏజీ) సుదర్శన్‌రెడ్డితో మంతనాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కొత్త చైర్మన్‌గా ఎవరిని నియమించాలన్నదానిపై సీఎం ఏజీతో చర్చిస్తున్నట్లు సమాచారం. -
‘నాణ్యమైన విద్యుత్‌కు కట్టుబడి ఉన్నాం’
అమరావతి:’రాష్ట్రంలోని అన్ని వర్గాలకు నాణ్యమైన విద్యుత్తును అందించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. ‘మిషన్ లైఫ్’ కార్యక్రమానికి సంబంధించి బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ (బీఈఈ) సలహాదారు చంద్రశేఖర్‌రెడ్డి రూపొందించిన పోస్టర్‌ను సీఎం విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఇళ్లు, పరిశ్రమలకు నాణ్యమైన విద్యుత్తును అందిస్తామని తెలిపారు. ఇంధన సామర్థ్య నిర్వహణకు సాయం చేసే ఉపకరణాల వినియోగంపై ప్రజల్లో చైతన్యం తీసుకొస్తామని పేర్కొన్నారు -
‘పవర్ కమిషన్’ లీకులు ఇవ్వడమేంటి: జగదీష్‌రెడ్డి
సాక్షి,హైదరాబాద్: విద్యుత్ కొనుగోలు ఒప్పందాలకు సంబంధించి కేసీఆర్‌పై నింద వేద్దామనే ఉద్దేశంతోనే ఆరోపణలు చేస్తున్నారని మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి అన్నారు. ఛత్తీస్‌గఢ్ నుంచి కేసీఆర్ ఒక్కరే విద్యుత్ కొనుగోలు ఒప్పందం రాసుకోలేదని, అప్పటి ఛత్తీస్‌గఢ్ సీఎం రమణ్‌సింగ్ కూడా సంతకం చేశారన్నారు.తెలంగాణ రాష్ట్ర డిమాండ్ మేరకు విద్యుత్ ప్రాజెక్టులను కేసీఆర్ నిర్మించారని చెప్పారు. జస్టిస్ నర్సింహారెడ్డి నేతృత్వంలోని పవర్ కమిషన్‌కు తన వాదనను మెయిల్ రూపంలో పంపించిన అనంతరం శనివారం(జూన్29) ఆయన మీడియాతో మాట్లాడారు. రెండు ప్రభుత్వాల మధ్య లంచాలకు ఎక్కడైనా ఆస్కారం ఉంటుందా అని ప్రశ్నించారు. విచారణ కమిషన్ మీడియా సమావేశం పెట్టి లీకులు ఇవ్వడంపై అభ్యంతరం తెలిపాను. ‘సబ్ క్రిటికల్ టెక్నాలజీతో దేశంలో 2017 నాటికి 17 పవర్ ప్రాజెక్టులు నిర్మాణం అవుతున్నాయి. భద్రాద్రి 800 మెగావాట్లతో సూపర్ క్రిటికల్ టెక్నాలజీ, యాదాద్రి సబ్ క్రిటికల్ టెక్నాలజీతో పవర్ ప్లాంట్ల నిర్మాణం చేపట్టాం.కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మెమోతో సబ్ క్రిటికల్, సూపర్ క్రిటికల్ టెక్నాలజీ అనే తేడా లేకుండా పోయింది. అన్నీ అనుకూలంగా వున్న తర్వాతనే దామరచర్లలో యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణం చేపట్టాం. బొగ్గు కేటాయింపు కేంద్ర ప్రభుత్వం చేతుల్లో ఉంది. ప్రతి పవర్ ప్లాంట్ 10 శాతం విదేశీ బొగ్గును వాడాలని కేంద్ర ప్రభుత్వం రూల్ పెట్టింది. సింగరేణి బొగ్గు ఉండటం వల్ల విదేశీ బొగ్గుకు మేం ఒప్పుకోలేదు’అని చెప్పారు. -
‘విద్యుత్’ విచారణలో దాపరికం లేదు: తెలంగాణ సర్కార్ వాదనలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ హైకోర్టులో మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు వేసిన పిటిషన్‌పై వాదనలు ముగిశాయి. దీంతో హైకోర్టును తీర్పును రిజర్వ్ చేసింది. గత బీఆర్ఎస్ పాలనలో విద్యుత్ కొనుగోళ్లలో అవకతవకలు జరిగాయంటూ తెలంగాణ ప్రభుత్వం వేసిన జ్యూడిషియల్ కమిషన్‌ను రద్దు చేయాలని కేసీఆర్ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. గురువారం సైతం ఈ పిటిషన్‌పై విచారణ జరగ్గా.. ఇవాళ సైతం వాదనలు కొనసాగాయి. విద్యుత్ కొనుగోళ్లలో ఎక్కడా అవకతవకలు జరగలేదని.. సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా కమిషన్ ఏర్పాటైందని కేసీఆర్ తరఫు న్యాయవాది ఆదిత్య సోందీ వాదించారు. ఇవాళ ప్రభుత్వం తరుపున ఏజీ సుదర్శన్‌రెడ్డి వాదనలు వినిపించారు. ‘‘కమిషన్ ఏర్పాటు విషయంలో కోర్టులు కలుగజేసుకోలేవు. 15 మంది సాక్ష్యులను ఇప్పటి వరకు కమిషన్ విచారించింది. అందులో ట్రాన్స్‌కో, జెన్కో అధికారులున్నారు. ప్రభాకర్‌రావును సైతం విచారించింది. కేసీఆర్‌కు కమిషన్ ఏప్రిల్‌లో నోటీసులు జారీ చేసింది. పార్లమెంట్ ఎన్నికల కారణంగా జూలై వరకు రావడం కుదరదని చెప్పారు. జూన్ 30 వరకు కమిషన్ గడువు ముగుస్తున్నందున జూన్ 15న రావాలని కోరాం.వివరాలు ఎవరి ద్వారా అయినా పంపినా ఓకే.. లేదా కేసీఆర్ స్వయంగా వస్తానంటే ఆ మేరకు తగిన ఏర్పాట్లు కూడా చేస్తామని కమిషన్ అత్యంత మర్యాదపూర్వకంగా లేఖలో కోరింది. గతంలోనూ కమిషన్లు మీడియాకు వివరాలు వెల్లడించాయి. ఇది బహిరంగ కమిషన్. విచారణలో దాపరికం ఏమీ లేదు. జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి ఎక్కడా పక్షపాత ధోరణితో మాట్లాడలేదు. విచారణకు రావాల్సిన వారికి 8బీ నోటీసులు జారీ చేసే అధికారం కమిషన్లకు ఉంటుంది. బీఆర్ఎస్ కూడా సభలో పలు విషయాలపై కమిషన్ ఏర్పాటు చేస్తామని గతంలో పేర్కొంది అని వాదించారు. ఈ క్రమంలో కేసీఆర్ పిటిషన్ విచారణ స్వీకరించవద్దని ఏజీ కోరగా.. పిటిషన్‌ను విచారణకు అనుమతించడంపైనే వాదనలు వినిపించాలని, మెరిట్స్‌లోకి వెళ్లవద్దని ఏజీకి ధర్మాసనం సూచించింది. మరోవైపు.. ఏజీ వాదనలపై కేసీఆర్ తరఫు న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు. గతంలో కమిషన్ సభ్యులు పక్షపాత వ్యాఖ్యలు చేయలేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. జ్యుడిషియల్ విచారణగా నోటిఫికేషన్లో పేర్కొన్నప్పుడు.. నివేదిక ఇవ్వాలే తప్ప మీడియాకు వివరాలు వెల్లడించకూడదని, విద్యుత్ రంగానికి తీవ్ర నష్టం వాటిల్లిందని ముందే చెప్పి.. కారకులెవరో తేల్చమన్నారని, ఇది అసలు సరికాదని కేసీఆర్ తరఫు న్యాయవాది ఆదిత్య సోందీ వాదించారు. ఈ క్రమంలో ఇరువైపులా వాదనలు పూర్తి కావడంతో.. తీర్పును రిజర్వ్ చేసింది ధర్మాసనం. ఇవాళ లేదంటే సోమవారం తీర్పు వెల్లడిస్తామని జడ్జి తెలిపారు. -
సమస్య ఉంటే ఈ నంబర్లకు కాల్ చేయండి
సాక్షి, హైదరాబాద్: ఈదురుగాలులతో కూడిన వర్షానికి తరచూ ఫీడర్లు ట్రిప్పవుతున్నాయి. చెట్ల కొమ్మలు విరిగి పడుతుండటంతో వైర్లు తెగుతున్నాయి. విద్యుత్ స్తంభాలు, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు నేలకూలుతున్నాయి. దీనితో గంటల తరబడి సరఫరా నిలిచిపోతోంది. అలాంటి సమయంలో వినియోగదారులు 1912 కాల్ సెంటర్/ మొబైల్‌యాప్‌లో/ స్థానిక లైన్మన్లకు సమాచారం ఇచ్చినా స్పందించడం లేదనే ఫిర్యాదులు ఉన్నాయి. ఈ క్రమంలో విద్యుత్ సరఫరాలో అంతరాయాలకు ఆస్కారం ఇవ్వకూడదనే ఉద్దేశంతో సర్కిళ్ల వారీగా ప్రత్యేక కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశారు.సర్కిల్ పేరు ఫోన్ నంబర్ హైదరాబాద్ సెంట్రల్ 9491629047 హైదరాబాద్ సౌత్ 9491628269 సికింద్రాబాద్ 9491629380 బంజారాహిల్స్ 9491633294 సైబర్‌సిటీ 9493193149 రాజేంద్రనగర్ 7382100322 సరూర్‌నగర్ 7901679095 హబ్సిగూడ 9491039018 మేడ్చల్ 7382618971 వికారాబాద్ 9493193177విద్యుత్ సరఫరా, తలెత్తుతున్న సాంకేతిక సమస్యలు, చేపట్టిన అభివృద్ధి పనులపై గతంలో నెలకోసారి రివ్యూలు నిర్వహించేవారు. ప్రస్తుతం రోజు ఉదయం 8.30 గంటలకే టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్షిస్తున్నాం. బ్రేక్ డౌన్లు, గృహజ్యోతి దరఖాస్తులు, సేవల్లో లోపాలపై ఆన్లైన్లో అందుతున్న ఫిర్యాదులపై చర్చిస్తున్నాం. అంతర్గత సామర్థ్యం పెంపు, నష్టాల నియంత్రణపైనా చర్యలు చేపట్టాం. అత్యవసర పరిస్థితుల్లో సీజీఎంలు, ఎస్ఈలు, డీఈలు, ఏడీ ఈలు, ఏఈలు, జూనియర్ లైన్మెన్లు, ఆరి్టజన్లు అంతా అందుబాటులో ఉండేలా ఆదేశాలిచ్చాం. అర్ధరాత్రి, భారీ వర్షాలను సైతం లెక్క చేయకుండా లైన్ల పునరుద్ధరణ పనులు చేపడుతున్నాం. బ్రేక్‌డౌన్, ఇతర అంతరాయాలను చాలా వరకు తగ్గించాం.సరఫరా మెరుగుపడాలంటే ఏం చేయాలి? ⇒ విద్యుత్ స్తంభాల పాలిట ఉరితాళ్లుగా మారిన టీవీ, ఇంటర్నెట్ కేబుళ్లను తక్షణమే తొలగించాలి. ⇒ లైన్ టు లైన్ తనిఖీలు చేపట్టి అనధికారిక కనెక్షన్లను తొలగించాలి. అంతర్గత భారీ నష్టాల నుంచి సంస్థను గట్టెక్కించాలి. ⇒ ఏబీ స్విచ్‌ల నాణ్యతను పరిశీలించాలి. సరఫరాలో హెచ్చుతగ్గుల నియంత్రణ, షార్ట్ సర్క్యూట్ల నియంత్రణ కోసం ఎర్తింగ్ సిస్టంను పకడ్బందీగా ఏర్పాటు చేయాలి. ⇒ చెట్లు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో భూగర్భ కేబుళ్లు, ఎయిర్ బంచ్డ్ కేబుళ్లు ఏర్పాటు చేస్తే.. ఈదురుగాలులతో సరఫరా నిలిచే సమస్య తలెత్తదు. ⇒ భూగర్భ విద్యుత్ కేబుళ్ల ఏర్పాటు కోసం ప్రత్యేకంగా డక్ట్ సిస్టం ఏర్పాటు చేయాలి. ⇒ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ల చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలి. అక్కడి చెత్తను ఎప్పటికప్పుడు తొలగించడం ద్వారా అగ్ని ప్రమాదాలను నివారించొచ్చు. ⇒ ఏఈలు, ఏడీఈలు కేవలం కొత్త కనెక్షన్ల జారీ, మీటర్ రీడింగ్లపైనే దృష్టి సారిస్తున్నారు. వారు సాంకేతిక అంశాలపైనా దృష్టి సారించేలా చర్యలు చేపట్టాలి. ⇒ కోర్‌సిటీలో ఇప్పటికీ నిజాం కాలం నాటి లైన్లే ఉన్నాయి. చాలాచోట్ల ఒకే స్తంభం నుంచి ఎల్టీ, హెచ్‌టీ లైన్లు వెళ్తున్నా యి. ప్రమాదాలను నివారించేందుకు వీటిని వేరు చేయాలి. ⇒ కొందరు జూనియర్ లైన్మన్లు.. అనధికారికంగా ఎలాంటి అనుభవం, అవగాహన లేని ప్రైవేటు వ్యక్తులను అసిస్టెంట్లుగా నియమించుకుని.. వారితో పనులు చేయిస్తున్నారు. అలాంటి వారిని గుర్తించి, చర్యలు తీసుకోవడం ద్వారా సాంకేతిక సమస్యలు తలెత్తకుండా చూడొచ్చు. -
పవన విద్యుత్తుకు రాష్ట్రమే బెస్ట్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేపట్టిన విద్యుత్ సంస్కరణల ఫలితంగా పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం భారీగా పెరుగుతోంది. ఇందులో పవన విద్యుత్‌ది ప్రథమ స్థానం. రాష్ట్రంలో పవన్ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 9.8 శాతం పెరిగింది. పవన విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం దేశవ్యాప్తంగా 8 శాతం పెరిగితే మన రాష్ట్రంలో అంతకంటే 1.8 శాతం ఎక్కువగా ఉంది. దేశంలోనే 6వ స్థానంలో ఏపీ నిలిచింది. రాష్ట్రంలో ఉన్న 9009.973 మెగావాట్ల పునరుత్పాదక విద్యుత్‌లో పవన విద్యుత్ వాటా 4083.37 మెగావాట్లుగా ఉంది. పవన విద్యుత్‌ను పెంచడం ద్వారా దేశంలో మిలియన్లకు పైగా ఉద్యోగాలను సృష్టించవచ్చని గ్లోబల్ విండ్ ఎనర్జీ కౌన్సిల్ (జీడబ్ల్యూఈసీ) పేర్కొంది.అందుబాటులో టారిఫ్దీర్ఘకాల పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ల (పీపీఏ)తో ఆర్థ్ధికంగా కుదేలవుతున్న డిస్కంలకు ఊరట కలిగిస్తూ ఏపీఈఆర్సీ పవన విద్యుత్ ధరలను నిర్ణయించింది. చాలా తక్కువ ధరకు పవన్ విద్యుత్ లభిస్తుంది. పవన విద్యుత్ ఉత్పత్తి సంస్థలతో విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకున్న డిస్కంలు తొలి పదేళ్లు యూనిట్‌కు రూ. 3.43 చొప్పున చెల్లించాలని ఏపీఈఆర్సీ తెలిపింది. 11వ సంవత్సరం నుంచి 20 ఏళ్ల వరకు యూనిట్‌కు రూ.2.64 చెల్లించాలని తెలిపింది. అనుకూలమని తేల్చిన అధ్యయనాలువాతావరణంలో వస్తున్న మార్పులతో ఏపీలో పవన విద్యుత్‌కు అత్యంత అనుకూల పరిస్థితులు ఏర్పడుతున్నాయని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రోపికల్ మెటీయెరాలజీ (పూణె) పరిశోధకులు వెల్లడించారు. ఉత్తరాది రాష్ట్రాల్లో గాలి వేగం తగ్గి, ఏపీలో పెరిగే అవకాశం ఉందని చెప్పారు. ఏపీలోని సముద్రతీర ప్రాంతాలపై గాలి సామర్ధ్యం పెరుగుతున్నట్లు ‘కపుల్డ్ మోడల్ ఇంటర్–కంపారిజన్ ప్రాజెక్ట్’ ప్రయోగాల్లో తేలింది. ప్రస్తుతం రోజుకి 15 మిలియన్ యూనిట్ల నుంచి 20 మిలియన్ యూనిట్ల మధ్య పవన విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. భవిష్యత్తులో ఇది మరింత పెరుగుతుందని ఇంధన శాఖ అధికారులు చెబుతున్నారు. -
కేసీఆర్ కు నోటీసులు
-
మార్కెట్ అల్లకల్లోలం
లోక్‌సభ తాజా ఫలితాలలో ఎన్డీఏ 300 సీట్లకంటే తక్కువకు పరిమితం కానున్నట్లు స్పష్టమవడంతో ఇన్వెస్టర్లు ఒక్కసారిగా ఆందోళన చెందారు. మార్కెట్ ఆరంభం నుంచే అమ్మకాలకు దిగారు. దీంతో సెన్సెక్స్ 6,234 పాయింట్లు, నిఫ్టీ 1,982 పాయింట్ల చొప్పున కుప్పకూలాయి. చివరికి కొంత కోలుకుని 4,390 పాయింట్ల నష్టంతో 72,079 వద్ద సెన్సెక్స్ నిలిచింది. 1,379 పాయింట్లకు నిఫ్టీ నీళ్లొదులుకుని 21,885 వద్ద ముగిసింది.ఇది రెండు నెలల కనిష్టంకాగా.. ఇంట్రాడేలో సెన్సెక్స్ 70,234కు పడిపోయింది. వెరసి ఎగ్జిట్ పోల్స్ కారణంగా సోమవారం ఇన్వెస్టర్లకు అందిన 3 శాతం లాభాలు ఒక్క రోజు తిరగకుండానే ఆవిరయ్యాయి. అంతేకాకుండా రికార్డ్ గరిష్టాలు 76,469, 23,264 పాయింట్ల స్థాయిల నుంచి సెన్సెక్స్, నిఫ్టీ గత నాలుగేళ్లలోలేని విధంగా భారీగా పతనమయ్యాయి! ఇంతక్రితం కోవిడ్–19 మహమ్మారి కట్టడికి కేంద్రం లాక్డౌన్ ప్రకటించడంతో దేశీ స్టాక్ మార్కెట్లు 2020 మార్చి 23న ఇంతకంటే అధికంగా 13 % కుప్పకూలిన సంగతి తెలిసిందే!! పీఎస్‌యూ షేర్లు ఫట్ మోడీ ప్రభుత్వానికి స్పష్టమైన మెజారిటీ లభించకపోవడంతో ప్రభుత్వ రంగ కౌంటర్లు తీవ్రంగా నష్టపోయాయి. ప్రధానంగా ఆర్ఈసీ 24 శాతం, పీఎఫ్సీ 22%, బీఈఎంఎల్, కంకార్, బీఈఎల్, బీహెచ్ఈఎల్ 19%, హెచ్ఏఎల్ 17%, ఓఎన్జీసీ, మజ్గావ్ డాక్ 16%, రైల్‌టెల్, ఎన్టీపీసీ, కోల్ ఇండియా 14%, ఆర్వీఎన్ఎల్ 13%, ఐఆర్సీటీసీ, పవర్‌గ్రిడ్, బీపీసీఎల్ 12% చొప్పున దిగజారాయి. ఇక పీఎస్‌యూ బ్యాంక్స్‌లో యూనియన్ బ్యాంక్, బీవోబీ, పీఎన్బీ, కెనరా బ్యాంక్, ఎస్బీఐ 18–13% మధ్య కుప్పకూలాయి. దీంతో పీఎస్ఈ ఇండెక్స్ 16%పైగా క్షీణించింది. ఎన్ఎస్ఈలో బ్యాంకెక్స్ 2022 ఫిబ్రవరి తదుపరి అత్యధికంగా 8% పతనమైంది. ఎదురీదిన ఎఫ్ఎంసీజీ.. బీఎస్ఈ, ఎన్ఎస్ఈలలో అన్ని రంగాలూ దెబ్బతిన్నాయి. ప్రధానంగా బ్యాంకింగ్, మెటల్, చమురు, రియలీ్ట, క్యాపిటల్ గూడ్స్, విద్యుత్ 15–6 శాతం మధ్య పతనమయ్యాయి. ఎఫ్ఎంసీజీ మాత్రం 1 శాతం బలపడింది. ప్రభుత్వేతర దిగ్గజాలలో ఎల్అండ్టీ, శ్రీరామ్ ఫైనాన్స్,టాటా స్టీల్, ఇండస్ఇండ్, హిందాల్కో, ఐసీఐసీఐ, జేఎస్‌డబ్ల్యూ, భారతీ, యాక్సిస్ 16–7 శాతం మధ్య క్షీణించాయి. అయితే హెచ్‌యూఎల్, బ్రిటానియా, నెస్లే, హీరో మోటో, టాటా కన్జూమర్ 6–2 % మధ్య జంప్ చేశాయి.అదానీ గ్రూప్ బేర్.. అదానీ గ్రూప్ కౌంటర్లు భారీగా పతనమై ముందురోజు ఆర్జించిన లాభాలను పోగొట్టుకోవడంతోపాటు మరింత నష్టపోయాయి. అదానీ పోర్ట్స్ 21 శాతం, ఎనర్జీ సొల్యూషన్స్ 20 శాతం దిగజారగా.. గ్రీన్ ఎనర్జీ, ఎంటర్ప్రైజెస్, టోటల్ గ్యాస్, ఎన్డీటీవీ 19 శాతం, అదానీ పవర్, అంబుజా సిమెంట్స్ 17 శాతం చొప్పున పతనమయ్యాయి. ఏసీసీ 15 శాతం, అదానీ విల్మర్ 10 శాతం పడ్డాయి. అత్యధిక శాతం షేర్లు కొనేవాళ్లులేక లోయర్ సర్క్యూట్లను తాకాయి. ఫలితంగా గ్రూప్‌లోని 10 లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువకు ఒక్క రోజులో రూ. 3.64 లక్షల కోట్లమేర కోతపడింది. రూ. 15.78 లక్షల కోట్లకు పరిమితమైంది. -
పవర్ ప్లాంట్లపై రష్యా దాడి.. ఉక్రెయిన్‌లో విద్యుత్ సంక్షోభం
ఉక్రెయిన్‌పై రష్యా నిరంతర దాడులను కొనసాగిస్తూనే ఉంది. తాజాగా ఇంధన మౌలిక సదుపాయాలపై దాడికి దిగింది. తూర్పు డొనెట్స్క్ ప్రావిన్స్‌లోని పలు పవర్ ప్లాంట్లను ధ్వంసం చేసింది. దీంతో ఉక్రెయిన్‌లోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. రష్యా తాజాగా ఉక్రెయిన్‌లోని పవర్ ప్లాంట్లను లక్ష్యంగా చేసుకుని డ్రోన్, క్షిపణి దాడులను చేపట్టంది. దీంతో ఉక్రెయిన్‌లోని మూడు ప్రాంతాలు మినహా మిగిలిన అన్ని ప్రాంతాల్లో విద్యుత్తు నిలిచిపోయింది. ఈ దాడుల్లో 19 మందికిపైగా జనం మంది గాయపడ్డారు. ఉక్రెయిన్ ప్రభుత్వ విద్యుత్ గ్రిడ్ ఆపరేటర్ ఉక్రెనెర్గో మాట్లాడుతూ రష్యా చేపడుతున్న దాడులతో విద్యుత్ అంతరాయాలు ఏర్పడ్డాయని, ఇవి పారిశ్రామిక, గృహ వినియోగదారులను తీవ్రంగా ప్రభావితం చేశాయన్నారు. ఇటీవలి కాలంలో ఉక్రెయిన్ పవర్ గ్రిడ్‌పై రష్యా చేస్తున్న దాడులు దేశవ్యాప్తంగా బ్లాక్అవుట్ను విధించేలా చేశాయన్నారు.గత ఏప్రిల్‌లో కీవ్‌లోని భారీ థర్మల్ పవర్ ప్లాంట్‌పై రష్యా దాడి చేసింది. మే 8న మరో పవర్ ప్లాంట్‌పై దాడి జరిగింది. దీంతో పలు ప్రాంతాల్లో విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ సంస్థలు తీవ్రంగా నష్టపోయాయి. మరోవైపు డొనెట్స్క్ ప్రాంతంలోని ఉమాన్స్కే గ్రామాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నట్లు రష్యా ప్రకటించింది. రష్యా ఇప్పుడు ఉత్తర సుమీ, చెర్నిహివ్ ప్రాంతాలలోకి చొచ్చుకుపోవడానికి ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోందని ఉక్రెయిన్ అధికారిక వర్గాలు చెబుతున్నాయి.ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ సింగపూర్‌లో జరిగిన ఆసియా ప్రధాన భద్రతా శిఖరాగ్ర సమావేశంలో మాట్లాడుతూ ఉక్రెయిన్ యుద్ధంపై త్వరలో జరగబోయే శాంతి సమావేశానికి అడ్డుపడేందుకు రష్యాకు చైనా సహకారం అందిస్తున్నదని ఆరోపించారు. -
ఏపీలో ఆల్ టైం హై విద్యుత్ వినియోగం!
-
‘మిట్టీకూల్’: మట్టితో ఫ్రిడ్జ్!..కరెంట్‌తో పనిలేదు..!
రిఫ్రిజిరేటర్... సామాన్య భాషలో ఫిడ్జ్. ఒకప్పుడూ అది అపురూపమైన వస్తువు. ధనికులు మాత్రమే దీన్ని ఉపయోగించేవారు. ఇప్పుడూ మధ్య తరగతి ఇళ్లల్లో కూడా ఇవి దర్శనమిస్తున్నాయి. కానీ పేదవాళ్లకు మాత్రం ఇప్పటికీ అపురూపమైన వస్తువే. పైగా కొనాలంటే రూపాయి, రూపాయి పోగు చేసుకుని అప్పోసొప్పో చేసుకుని కొంటారు. పైగా దీన్ని వేసవిలోనే జాగ్రత్తగా వాడుకుంటారు. ఎందుకంటే..? దీనికి అయ్యే కరెంట్ బిల్లు కూడా ఎక్కువే. ఒకవేళ పాడైతే బాగు చేయించుకోవాలన్న కష్టమే. అలాంటి వాటికి చెక్‌పెట్టేలా ఎకో ప్రెండ్లీగా మట్టితో ఫ్రిడ్జ్‌ని ఆవిష్కరించారు గుజరాత్‌కి చెందిన డ భాయ్ ప్రజాపతి. ఎలా రూపొందించారంటే..‘మిట్టీకూల్’ ఫ్రిడ్జ్..ఇది పూర్తిగా బంకమన్నుతో తయారైన ఫ్రిజ్. అందుకే దీనికి ‘మిట్టీకూల్’ ఫ్రిడ్జ్ అని పేరు పెట్టి, మార్కెట్లోకి తెచ్చాడు ,మన్సుఖ్ . ఈ ఫ్రిడ్జ్ కు విద్యుత్ అవసరం లేదు. ఎటువంటి మరమ్మత్తులూ చేయాల్సిన పని లేదు. అయినా అద్భుతంగా పని చేస్తుంది. సాధారణ గది ఉష్ణోగ్రతలో రెండు రోజుల్లోనే పాడైపోయే కూరగాయలను ఇందులో భద్రపరిస్తే, ఐదారు రోజులు నిక్షేపంగా నవనవలాడుతూ తాజాగా ఉంటాయి. పెరుగు, దోశె పిండి లాంటివి కూడా పుల్లబడకుండా ఉంటాయి. జ్యూసులు, నీళ్లు పెడితే చల్లబడతాయి. ఇందులో 5 కిలోల కూరగాయలు, పండ్లను నిల్వ చేయవచ్చు. విద్యుత్ కోతలు తరచుగా ఉండే ప్రాంతాల్లో, మట్టి రిఫ్రిజిరేటర్‌ను ఉపయోగిస్తున్నారు. మిట్టి కూల్లో పైన ఉన్న అరలో 2 లీటర్ల నీటిని పోయాలి. ఈ ఫ్రిజ్ బాష్పీభవన సూత్రాలపై పనిచేస్తుంది. దీనికి నిర్వహణ ఖర్చు కూడా ఉండదని కనగరాజ్ తెలిపారు.విద్యుత్ అవసరం లేదుసాధారణంగా విద్యుత్ ఆధారితంగా పనిచేసే ఫ్రిడ్జ్‌లో ఉంచిన వస్తువులు తింటే కొంత అనారోగ్యానికి గురవుతారు. కాని మట్టితో తయారు చేసి.. సహజసిద్దంగా ఉండే మట్టితో తయారు చేసి ఈ మిట్టి కూల్ లోని వస్తువులు తింటే ఎలాంటి అనారోగ్యం రాదని చెబుతున్నారు. అందుకే ప్రస్తుతం తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లాలో ఈ మిట్టి కూల్ కు అత్యంత డిమాండ్ ఉంది. ఇందులో ఉంచిన ఆహార పదార్ధాల్లో రుచిలో ఎలాంటి మార్పు రాదంటున్నారు మన్సుక్భాయ్ ప్రజాపతి.ప్రజాపతి నేపథ్యం..ప్రజాపతి గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లోని మోర్బిలోని నిచ్చిమండల్ గ్రామంలో జన్మించాడు. ప్రతికూల ఆర్థిక పరిస్థితుల కారణంగా చదువుకు స్వస్తి చెప్పి.. కుటుంబ పోషణ కోసం కూలీ పనులు చేసేవాడు. అతను చిన్నతనం నుంచి సాంప్రదాయక మట్టి వస్తువుల తయారీపై సమగ్రమైన పరిజ్ఞానం ఉంది. దీంతో 1988లో ప్రజాపతి రూ. 30,000 చెల్లించి మట్టి పలకల తయారీకి సంబంధించిన తన సొంత కర్మాగారాన్ని ప్రారంభించాడు. కానీ మట్టి చిప్పల మన్నిక గురించి అతనికి చాలా ప్రతికూల అభిప్రాయాలు వచ్చాయి. అయినప్పటికీ పలు ప్రయోగాలు చేస్తూనే ఉన్నాడు. అలా 1990లో అతని కంపెనీ రిజిస్టర్ అయ్యింది.ఇక 2001లో మిట్టికూల్ ట్రేడ్ మార్క్ రిజిస్టర్ చేయబడింది. ఆ తర్వాత 2002 నుంచి పూర్తి స్థాయిలో దీనిపై పనిచేయడం మొదలు పెట్టారు. అదే ఏడాది GIANగా ప్రసిద్ధి చెందిన గ్రాస్రూట్స్ ఇన్నోవేషన్ ఆగ్మెంటేషన్ నెట్‌వర్క్‌తో ప్రపంచానికి పరిచయమై.. ఈ మిట్టీకూల్ గురించి అందరికీ తెలియడం జరిగింది. ఇక బ్రిటన్, జర్మనీల్లో జరిగిన ప్రదర్శనల్లో ఈ ఫ్రిడ్జ్‌ను చూసి, అక్కడి శాస్త్రవేత్తలు ప్రశంసలు కురిపించారు. విద్యుత్తుతో పనిచేసే ఫ్రిజ్‌లతో పోలిస్తే, ఈ మట్టి ఫ్రిజ్ ఖరీదు చాలా తక్కువ. దీని ఖరీదు రూ. 8,500/అంతే!.(చదవండి: జపాన్ బుల్లెట్ రైలు తరాతని మార్చిన కింగ్‌ఫిషర్!)