ఆరుబయట పిక్నిక్‌లకు వెళ్లేటప్పుడు, రాత్రివేళల్లో ఆరుబయటే బస చేయాల్సి వచ్చినప్పుడు తాత్కాలికంగా టెంట్లు వేసుకుని గడుపుతుంటారు. అయితే, టెంట్లలో విద్యుత్ సౌకర్యం ఉండక నానా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అలాంటి ఇబ్బందులను తప్పించుకోవాలంటే, భారీ జనరేటర్లను మోసుకుపోవాల్సి వస్తుంది. జనరేటర్లు చేసే ధ్వనికి నిద్ర కరువవుతుంది.
ఈ పోర్టబుల్ పవర్‌స్టేషన్ మీ వద్ద ఉంటే, అలాంటి సమస్యలేవీ ఉండవు. ఎక్కడకు వెళ్లినా, విద్యుత్ సరఫరా మీ వెంటే ఉంటుంది. ఇది పోర్టబుల్ పవర్ స్టేషన్. జనరేటర్ల కంటే చాలా తేలిక. ఆన్ చేసుకున్నాక దీని నుంచి వెలువడే చప్పుడు కూడా నామమాత్రంగానే ఉంటుంది. దీని బరువు 16 కిలోలు మాత్రమే. ఎక్కడికైనా మోసుకుపోవడానికి చాలా అనువుగా ఉంటుంది.
‘లిపవర్ మార్స్–2000’ పేరిట ఇది మార్కెట్‌లో అందుబాటులో ఉంది. ఇది ఎల్‌ఎఫ్‌పీ బ్యాటరీల సాయంతో పనిచేస్తుంది. ఈ బ్యాటరీలను చార్జింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆరుబయట ఎండ నుంచి విద్యుత్తు పొందేందుకు వీలుగా దీనికి సోలార్ ప్యానల్స్ కూడా ఉండటంతో, బ్యాటరీలను రీచార్జ్ చేసుకోవలసిన పరిస్థితులు చాలా అరుదుగానే తలెత్తుతాయి. దీని ధర 1489 డాలర్లు (రూ.1.18 లక్షలు).
Comments
Please login to add a commentAdd a comment