current charge
-
కరెంట్‌ను మోసుకుపోవచ్చు!
ఆరుబయట పిక్నిక్లకు వెళ్లేటప్పుడు, రాత్రివేళల్లో ఆరుబయటే బస చేయాల్సి వచ్చినప్పుడు తాత్కాలికంగా టెంట్లు వేసుకుని గడుపుతుంటారు. అయితే, టెంట్లలో విద్యుత్ సౌకర్యం ఉండక నానా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అలాంటి ఇబ్బందులను తప్పించుకోవాలంటే, భారీ జనరేటర్లను మోసుకుపోవాల్సి వస్తుంది. జనరేటర్లు చేసే ధ్వనికి నిద్ర కరువవుతుంది. ఈ పోర్టబుల్ పవర్‌స్టేషన్ మీ వద్ద ఉంటే, అలాంటి సమస్యలేవీ ఉండవు. ఎక్కడకు వెళ్లినా, విద్యుత్ సరఫరా మీ వెంటే ఉంటుంది. ఇది పోర్టబుల్ పవర్ స్టేషన్. జనరేటర్ల కంటే చాలా తేలిక. ఆన్ చేసుకున్నాక దీని నుంచి వెలువడే చప్పుడు కూడా నామమాత్రంగానే ఉంటుంది. దీని బరువు 16 కిలోలు మాత్రమే. ఎక్కడికైనా మోసుకుపోవడానికి చాలా అనువుగా ఉంటుంది. ‘లిపవర్ మార్స్–2000’ పేరిట ఇది మార్కెట్లో అందుబాటులో ఉంది. ఇది ఎల్ఎఫ్పీ బ్యాటరీల సాయంతో పనిచేస్తుంది. ఈ బ్యాటరీలను చార్జింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆరుబయట ఎండ నుంచి విద్యుత్తు పొందేందుకు వీలుగా దీనికి సోలార్ ప్యానల్స్ కూడా ఉండటంతో, బ్యాటరీలను రీచార్జ్ చేసుకోవలసిన పరిస్థితులు చాలా అరుదుగానే తలెత్తుతాయి. దీని ధర 1489 డాలర్లు (రూ.1.18 లక్షలు). -
నరం లేని నాలుక మాటలు
ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ కోతలపై తెలుగుదేశం గగ్గోలు పెడుతోంది. అసలు రాష్ట్రంలో కరెంటే లేదేమోనన్న రీతిలో వీరి మీడియా ప్రచారం ఉంది. చంద్రబాబు హయాంలో సౌర విద్యుత్‌కు యూనిట్‌కు నాలుగున్నర రూపాయలకు పైగా పెట్టి కొనుగోలు చేయడానికి ఒప్పందం చేసుకున్నారు. జగన్ ప్రభుత్వం దాన్ని సమీక్షించి రేట్లు తగ్గించడానికి ప్రయత్నిస్తే ఇదే టీడీపీ, దాని మీడియా... రేట్లు తగ్గిస్తే పెట్టుబడులు రావని వాదించాయి. ఇప్పుడు విద్యుత్ చార్జీలు పెంచితే అమ్మో ఎలా పెంచుతారని ప్రశ్నిస్తున్నాయి. కోతలు, చార్జీలు ఎవరికైనా ఇబ్బందికరమే. అయితే ఇప్పటికీ వంద యూనిట్ల లోపు అయ్యే చార్జీలు దేశంలోకెల్లా ఆంధ్రప్రదేశ్‌లోనే తక్కువున్నాయి. ఈ విషయాన్ని గుర్తిస్తూ మాట్లాడితే వారి విమర్శలకు ఒక హేతుబద్ధత ఉండేది. ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ కోతలపై, విద్యుత్ చార్జీల పెంపుదలపై తెలుగుదేశం, జనసేన, బీజేపీ తీవ్ర విమర్శలకు దిగాయి. టీడీపీ లాంతర్లతో నిరసన చెబుతోంది. వామపక్షాలు ఎటూ ఆందోళనలు చేస్తుంటాయి. ప్రజాస్వా మ్యంలో ప్రతిపక్షాలు నిరసన తెలుపుతాయి. ప్రభుత్వం తన వాద నను వినిపిస్తుంటుంది. విశేషం ఏమంటే తెలంగాణలో ఏకంగా 5,600 కోట్ల మేర విద్యుత్ చార్జీలు పెరిగితే జాతీయ పార్టీగా చెప్పు కొనే తెలుగుదేశం గానీ, తెలంగాణలో కూడా పార్టీ నడుపుతానని అనే పవన్ కల్యాణ్ గానీ ఒక్క విమర్శ చేయలేదు. అదే ఏపీలో 1,400 కోట్ల మేర విద్యుత్ చార్జీలు పెంచిన వెంటనే గగ్గోలు పెడుతున్నారు. విద్యుత్ కోతలు విధించడం అన్నా, చార్జీల పెంచడమన్నా ఎవరికైనా అసౌకర్యమే. కానీ వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా ప్రభుత్వం వ్యవహరించకపోతే మొత్తం వ్యవస్థ కుదేలు అయి పోతుంది. విద్యుత్‌ను సరఫరా చేసే డిస్కంలకు ప్రభుత్వాలు సరిగా బకాయిలు చెల్లించడం లేదన్నది ప్రధాన అభియోగం. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు డిస్కంలకు 22 వేల కోట్ల బకాయిలు పెట్టిందనీ, ఆ బకాయిలను కూడా తమ ప్రభుత్వం కట్టవలసి వస్తోందనీ మాజీ మంత్రి పేర్ని నాని చెప్పారు. కారణం ఏదయినా కరెంటు చార్జీలు పెంచితే ప్రజలలో కూడా అసంతృప్తి కొన్నాళ్లు ఉంటుంది. రాజకీయ పార్టీలు కూడా నిరసన చెప్పవచ్చు. కానీ హేతుబద్ధంగా ఉండాలి. అందులోనూ సుదీర్ఘకాలం ప్రభు త్వాన్ని నడిపిన చంద్రబాబు వంటివారు మరింత జాగ్రత్తగా మాట్లా డాలి. లేకుంటే గతంలో ఆయన దీనికి సంబంధించి ఏమేం అన్నది సోషల్ మీడియాలో వచ్చేస్తుంది. ప్రస్తుతం అదే జరుగుతోంది. చంద్రబాబు అంకెలు పెంచి చెప్పడంలో దిట్టే. ఆయన ఏకంగా జగన్ ప్రభుత్వం నలభై రెండువేల కోట్ల భారం వేసిందని అన్నారు. ఆయన టైమ్‌లో ఎన్నడూ చార్జీలు పెంచలేదని మరో అబద్ధాన్ని టీడీపీ నేతలు ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబు స్వయంగా అసెంబ్లీలో 900 కోట్ల రూపాయల మేర పెంచుతున్నట్లు ప్రకటించిన వీడియో ఇప్పుడు చక్కర్లు కొడుతోంది. అసలు విద్యుత్ సంస్కరణలకు తానే ఆద్యుడనని, 2004 ఎన్నికల ముందు వరకు చంద్రబాబు చెప్పు కునేవారు. రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వడం అంటే కరెంటు తీగలపై బట్టలు ఆరేసుకోవడమేనని చెప్పేవారు. ఈ వ్యవహారంపై కాంగ్రెస్, వామపక్షాలు ఆందోళనకు దిగినప్పుడు హైదరాబాద్‌లో కాల్పుల వరకు వెళ్లి నలుగురు మరణించారు. అలాగే పశ్చిమ గోదావరి జిల్లా కాల్దారి వద్ద కూడా కాల్పులు జరిగాయి. చంద్రబాబు ఓటమికి అప్పట్లో విద్యుత్ సమస్య కూడా ఒక కారణమని అనేవారు. వ్యవసాయ విద్యుత్‌కు మోటార్లు పెట్టాలని కేంద్రం ఆదేశిం చింది. దానికి అనుగుణంగా వైసీపీ ప్రభుత్వం ఒక జిల్లాలో ప్రయో గాత్మకంగా అమలు చేసింది. దానిని చంద్రబాబు తప్పు పట్టి రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తుంటారు. కేంద్రాన్ని ఒక్క మాట అనరు. ఇందు లోనే కాదు, ఏ విషయంలో అయినా అంతే. ‘చెత్తమీద పన్ను వేస్తారా?’ అని చంద్రబాబు ప్రచారం చేస్తున్నారు. తీరా చూస్తే కేంద్రం ఆదేశాల ప్రకారం గతంలో చంద్రబాబు ప్రభుత్వమే చెత్త పన్నును అమలు చేసిందని తాజాగా వచ్చిన ఆధారాలు చెబుతున్నాయి. ఏపీలో ప్రభుత్వ ఆస్పత్రులలో గానీ, ఇతర సేవలలో గానీ, యూజర్ చార్జీ విధానాన్ని ప్రవేశపెట్టడంలో గానీ చంద్ర బాబు ప్రభుత్వం ఎక్కడా వెనుకాడ లేదన్నది జగమెరిగిన సత్యం. కానీ ఇప్పుడు చెత్త ప్రభుత్వం అంటూ వ్యాఖ్యానించడం ద్వారా తనది కూడా చెత్త ప్రభుత్వమే అని ఆయనే ఒప్పు కొన్నట్లయింది. విద్యుత్ చార్జీల పెంపుపై తీవ్రంగా స్పందించిన చంద్రబాబు, పవన్ కల్యాణ్ పెట్రోల్, డీజిల్ ధరలు రోజూ పెరుగు తున్నా నోరు విప్పడం లేదు. బీజేపీ పైనా, కేంద్రం పైనా విమర్శ చేయడానికి జంకుతున్నారు. కరెంటు చార్జీల మీద వాస్తవ ప్రాతి పదికన విమర్శలు చేస్తే తప్పు పట్టనక్కర్లేదు. కానీ వైసీపీపై విమర్శలు చేస్తూ, పెట్రోల్, డీజిల్ ధరల గురించి మాట్లాడకపోతే ప్రజలు ఏమనుకుంటారన్న ఇంగితం అయినా ఉండాలి కదా! ఇక బీజేపీ వారి ధోరణి మరీ విడ్డూరంగా ఉంటుంది. కేంద్రంలో దారుణంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెంచినా, దానికి అంతర్జాతీయ పరిస్థితులు కారణమని చెబుతారు. ఏపీలో విద్యుత్ చార్జీలు పెంచితే మాత్రం రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమట! ప్రభుత్వం ఇచ్చిన సమాచారం ప్రకారం వంద యూనిట్ల లోపు అయ్యే చార్జీలు పరిశీలిస్తే– బీజేపీ పాలిత కర్ణాటకలో 703 రూపాయలు, గుజరాత్లో 601 రూపాయలు, ఉత్తరప్రదేశ్‌లో 457 రూపాయలు ఉంటే, ఏపీలో 306 రూపాయలే అవుతుంది. వామపక్షాల వారు కూడా నిరసనలకు దిగుతున్నారు. వారు కూడా పెట్రోల్, డీజిల్ ధరల మీద కన్నా, విద్యుత్ చార్జీల పెరు గుదలపైనే తమ ఆవేశం ప్రదర్శిస్తున్నట్లుగా ఉంది. వారి ఏలుబడిలో ఉన్న కేరళలో కూడా వంద యూనిట్ల లోపు చార్జీ 476 అవుతోంది. ఇంకో సంగతి చెప్పాలి. గత చంద్రబాబు ప్రభుత్వం సౌర విద్యుత్‌కు సంబంధించి అధిక రేట్లకు అంటే యూనిట్‌కు నాలుగున్నర రూపాయలకు పైగా పెట్టి కొనుగోలు చేయడానికి ఒప్పందం చేసు కుంది. పైగా అది పాతికేళ్ల వరకు ఒప్పందం ఉండేలా ఒప్పుకున్నారు. జగన్ ప్రభుత్వం దీనిపై సమీక్షించి రేట్లు తగ్గించడానికి ప్రయత్నిస్తే ఇదే టీడీపీ, దాని మీడియా గగ్గోలు పెట్టాయి. రేట్లు తగ్గిస్తే, ఒప్పందం అమలు చేయకపోతే పెట్టుబడులు రావని వాదించాయి. కానీ ఇప్పుడు విద్యుత్ చార్జీలు పెంచితే అమ్మో ఎలా పెంచు తారని ప్రశ్నిస్తున్నాయి. నిజానికి బొగ్గు కొరత సమస్య అంతర్జాతీయంగా ఉంది. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం తర్వాత ఇది తీవ్రం అయింది. చైనా సైతం కరెంటు కోతలతో ఉంది. గుజరాత్లో వారంలో ఒక రోజు పవర్ హాలిడే ప్రకటించారు. ప్రముఖ ఆంగ్ల పత్రిక ‘ఫైనాన్షియల్ ఎక్స్‌ప్రెస్’ ఇచ్చిన కథనం ప్రకారం దేశవ్యాప్తంగా విద్యుత్ కొరత ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, బిహార్, జార్ఖండ్, పంజాబ్, హరియాణా, రాజస్థాన్, తెలంగాణ, ఉత్తరప్రదేశ్‌లలో ఈ సమస్య వచ్చింది. పరిశ్రమలు అధికంగా ఉండే గుజరాత్, తమిళనాడు, మహారాష్ట్ర విద్యుత్ సరఫరా చేయడానికి సతమతమవుతున్నాయి. అతి ఎక్కువ ఖరీదుకు విద్యుత్ కొనుగోలు చేసి మేనేజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాయని ఆ కథనం వివరిం చింది. పరిస్థితి ఇలా ఉంటే ఒక్క ఏపీలోనే చీకట్లు అలుముకున్నా యనీ, మిగిలిన రాష్ట్రాలు వెలుగులు చిమ్ముతున్నాయనీ ఒక పత్రిక విద్వేషపూరిత కథనాన్ని ఇచ్చింది. గతంలో అసలు కరెంటు కోత లేనట్లు పిక్చర్ ఇస్తున్నారు. 2017లో కర్నూలు ఆస్పత్రిలో కరెంటు సమస్య వల్ల ఇరవై మంది మరణించిన విషయాన్ని వైసీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. నంద్యాలలో ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్ర బాబును కరెంటు కోతలపై ఒక వ్యక్తి బహిరంగ సభలో ప్రశ్నిస్తే అత నిపై తీవ్ర ఆగ్రహం చూపిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రముఖంగా వచ్చింది. విద్యుత్ సరఫరా ఈ నెలాఖరుకు మెరుగు అవుతుందని ఏపీ అధికారులు చెబుతున్నారు. విద్యుత్ కోతలున్నా, చార్జీలు పెరిగినా ప్రజలు మౌనంగా భరిస్తారని అనుకోరాదు. ప్రభుత్వం ఎన్ని మంచి కార్యక్రమాలు అమలు చేసినా, సంక్షేమ స్కీములు ప్రవేశపెట్టినా, చివరికి కరెంటు, నీరు, రోడ్లు వంటి అత్యవసర విషయాలలో ఇబ్బం దులు వస్తే, ప్రజలు వీటినే ప్రస్తావిస్తుంటారు. అందువల్ల ప్రభుత్వం కూడా ఈ విషయంలో అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలి. కొత్తగా వచ్చిన విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ మేరకు జాగ్రత్తగా పనిచేసి విద్యుత్ కొరత లేకుండా చేస్తారని ఆశిద్దాం! కొమ్మినేని శ్రీనివాసరావు ,వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు -
రొయ్య రైతుకు జగన్ సర్కారు భరోసా
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు కష్టాల్లో ఉన్న ఆక్వా రైతులను ఆదుకొనేందుకు జగన్ సర్కార్ సిద్ధమైంది. గత ప్రభుత్వ హయాంలో ఉన్న యూనిట్ విద్యుత్ చార్జీని రూ.1.50కి తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మంగళవారం జీఓఆర్టీ నంబర్ 70 విడుదల చేసింది. దీనివల్ల రొయ్యల చెరువులు సాగు చేస్తున్న రైతుల విద్యుత్ చార్జీలు మరింత తగ్గనున్నాయి. జిల్లా పరిధిలో వేటపాలెం, కొత్తపట్నం, ఒంగోలు రూరల్, సింగరాయకొండ, టంగుటూరు, చినగంజాం, చీరాల, ఉలవపాడు, గుడ్లూరు, నాగులుప్పలపాడు, జరుగుమల్లి మండలాల్లో 28 వేల ఎకరాల్లో రైతులు రొయ్యల సాగు చేస్తున్నారు. వీటి పరిధిలో 2,530 కేటగిరి–3 విద్యుత్ సర్వీసులున్నాయి. గత టీడీపీ ప్రభుత్వం రొయ్యల చెరువుల విద్యుత్ చార్జీలు యూనిట్‌కు రూ.3.86 చొప్పన నాలుగేళ్లపాటు వసూలు చేసింది. ఎన్నికలకు ముందుకు వైఎస్.జగన్ మోహన్‌రెడ్డి హామీ ఇచ్చిన తర్వాత యూనిట్ చార్జి రూ.2కు తగ్గించింది. దీనివల్ల ఒక పంట కాలానికి రూ.60 వేలు విద్యుత్ చార్జి కట్టాల్సి వస్తోంది. జగన్ సర్కార్ యూనిట్‌కు మరో 50 పైసలు తగ్గించడం వల్ల ఒక్కో ఎకరాకు నాలుగు నెలల పంట కాలానికి విద్యుత్ చార్జి రూ.45 వేలకు తగ్గుతోంది. దీనివల్ల ఒక పంట కాలానికి రూ.15 వేలు తగ్గనున్నాయి. ఈ లెక్కన జిల్లాలో 28 వేల ఎకరాలలో ఉన్న రొయ్యల చెరువుల సాగుకు ఒక పంటకు రూ.42 కోట్ల విద్యుత్ చార్జీలు తగ్గనున్నాయి. ఈ లెక్కన రొయ్య రైతులకు ఒక పంటకు రూ.42 కోట్లు మిగిలినట్లే లెక్క. దీంతో రొయ్య రైతులకు మరింత ప్రయోజనం చేకూరనుంది. జిల్లాలో ఆక్వా సాగు విస్తీర్ణం : 28,000 ఎకరాలు వీటి పరిధిలో కేటగిరి–3 విద్యుత్ సర్వీసులు సంఖ్య: 2,530 చార్జీల తగ్గింపుతో ఒక పంట కాలానికి తగ్గనున్న భారం : రూ.42 కోట్లు మాట నిలబెట్టుకున్న జగన్.. అసలే రొయ్యకు గిట్టుబాటు ధర లేక రైతులు తీవ్రంగా నష్టపోతున్న పరిస్థితిలో వైఎస్ జగన్ సర్కార్ విద్యుత్ చార్జి భారం తగ్గించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమౌతోంది. ఆక్వా రైతులు సంబరాలు చేసుకుంటున్నారు. ఏడాది క్రితం వరకూ రొయ్యల చెరువుల విద్యుత్ చార్జీలు యూనిట్‌కు రూ.3.86 గా ఉంది. విద్యుత్ చార్జీ భారం తగ్గించాలని రైతాంగం నెత్తీ నోరు బాదుకున్నా నాలుగేళ్లపాటు గత ప్రభుత్వం పట్టించుకోలేదు. దీంతో భారం భరించలేక చాలామంది రైతులు రొయ్యల సాగుకు స్వస్తి చెప్పాల్సి వచ్చింది. దీంతో జిల్లాలో రొయ్యల సాగు మరింతగా తగ్గింది. రైతులు పలుమార్లు చార్జీలు తగ్గించాలని కోరారు. అప్పట్లో చంద్రబాబు పట్టించుకోక పోవడంతో అప్పటి ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసి విద్యుత్ చార్జీలు తగ్గించాలని రైతులు కోరారు. వారి సమస్యలను పరిశీలించిన వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే యూనిట్ విద్యుత్ చార్జీలను రూ.1.50కి తగ్గిస్తానని హామీ ఇచ్చారు. ఆ మేరకు చార్జీలు తగ్గిస్తూ జీఓ జారీ చేసి హామీని నెరవేర్చారు. సీఎం జగన్ మాట నిలబెట్టుకోవడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. -
బాబు జమానా.. జనాలకు గుదిబండ
సాక్షి, అమరావతి : ఆర్టీసీ చార్జీల బాదుడు.. కరెంట్ బిల్లుల బాదుడు.. రిజిస్ట్రేషన్ చార్జీల బాదుడు.. ఇంటి పన్ను బాదుడు.. చంద్రబాబు ఐదేళ్ల పాలనలో బడుగు జీవిపై బాదుడే బాదుడు.. కొంత నేరుగా పిండటం.. దొంగ దారిలో బండ వేసేది మరికొంత.. ఆర్టీసీ బస్సు ఎక్కాలంటే.. సామాన్యుడు జడుసుకోవాల్సిందే.. కరెంట్ స్విచ్ వేస్తే చాలు.. వినియోగదారుడికి వేలల్లో బిల్లుల షాక్ .. సెంటు స్థలం కొందామంటే.. రిజిస్ట్రేషన్ చార్జీలతో చుక్కలు.. చివరికి ఇంటి పన్నును కూడా పెంచేసి..జనం నడ్డి విరిచింది చంద్రబాబు సర్కారు.. ఈ బాదుడుకు జడిసిన సగటు జీవి.. ‘బాబు’ ఇక వద్దే వద్దంటున్నాడు. అధికారంలోకొస్తే బస్సు చార్జీలను పెంచబోమని గద్దెనెక్కిన చంద్రబాబు సర్కారు.. గత ఐదేళ్లుగా ప్రయాణికులపై భారం మోపుతూనే ఉంది. రెండుసార్లు ఆర్టీసీ చార్జీలు పెంచి.. ఓసారి సవరణ పేరుతో చార్జీల భారం ప్రయాణికులపై మోపింది. టోల్ చార్జీలు, డీజిల్ రేట్లు పెరిగినప్పుడల్లా ఆ భారం ప్రజలపైనే వేసింది. రోజుకు 68 లక్షల మందిని గమ్యస్ధానాలకు చేరుస్తున్న ఆర్టీసీ.. సర్కారు ఏ మాత్రం ఆదుకోకపోవడంతో ప్రత్యక్షంగా, పరోక్షంగా భారం మోపుతూనే ఉంది. ఈ ఐదేళ్ల వ్యవధిలో చార్జీల పెంపు, ప్యాసింజర్ సెస్, సేఫ్టీ సెస్‌ల పేరిట రూ.979 కోట్ల వరకు చార్జీలు పెంచింది. 2015 అక్టోబరులో ఆర్టీసీ చార్జీలను 10 శాతానికిపైగా ప్రభుత్వం పెంచింది. అప్పట్లో ప్రయాణికులపై ఏడాదికి రూ.330 కోట్ల భారం పడింది. 2016లో యూనియన్ నేతలకు సైతం అర్ధం కాకుండా చార్జీలను పెంచింది. 4 శాతం వరకు చార్జీలను పెంచింది. ఈ భారం రూ.132 కోట్ల వరకు ఉంది. ఆ తర్వాత అదే ఏడాదిలో.. టిక్కెట్‌పై సౌకర్యాల కల్పన కోసమంటూ రూ.2 వసూలు చేసింది. ఈ బాదుడు వల్ల ఏటా రూ.130 కోట్లు అదనంగా ఆర్టీసీకి సమకూరింది. 2017లో సేఫ్టీ సెస్ అంటూ ప్రతి టిక్కెట్‌పై రూపాయి వసూలు చేసింది. రోజుకు సేఫ్టీ సెస్ కింద రూ.20 లక్షలు వసూలు చేసింది. ఈ భారం ఏడాదికి రూ.72 కోట్లు ప్రయాణికుల నుంచే రాబట్టింది. అప్పటికే రెండుసార్లు బస్సు చార్జీలను పెంచిన ప్రభుత్వం.. ప్రజాగ్రహం చవిచూడాల్సి వస్తుందని భయపడి నేరుగా చార్జీలు పెంచకుండా.. దొడ్డిదారిన వడ్డింపు కార్యక్రమం మొదలెట్టింది. ఈ ఐదేళ్లలోనూ పండుగల సందర్భాల్లో.. రద్దీ సీజన్లో సినిమా బ్లాక్ టిక్కెట్ల మాదిరిగా విక్రయాలు చేపట్టి రెట్టింపు చార్జీలు వసూలు చేసింది. పుణ్యక్షేత్రాలకు బాదుడు తప్పలేదు. ఇలా రకరకాలుగా చార్జీల భారం మోపుతూ.. ప్రజా రవాణా వ్యవస్ధలో హాయిగా ప్రయాణి ద్దామనుకున్న సామాన్యుడిపై ఏటేటా చార్జీల పెంపుతో పెనుభారం మోపింది. 8 తెలుగు వెలుగుకూ తప్పని బాదుడు పల్లెలకు వెళ్లే తెలుగువెలుగు బస్సుల్ని చంద్రబాబు సర్కారు వదిలిపెట్టలేదు. అధికారంలోకొచ్చిన ఏడాది తర్వాత పల్లెవెలుగు బస్సుల్లో కిలోమీటరుకు 3 పైసల్ని పెంచింది. ఎక్స్‌ప్రెస్, డీలక్స్ సర్వీసుల్లో కిలోమీటరుకు 8 పైసలు, ఏసీ సర్వీసుల్లో 9 పైసల వంతున చార్జీలు పెంచింది. ఈ భారం ఏటా రూ.330 కోట్ల వరకు సామాన్యుడిపై పడింది. సవరణ పేరుతో చిల్లర సమస్యను సాకుగా చూపి.. ప్రయాణికుల్ని దోచుకున్నారు. ఉదాహరణకు టిక్కెట్ ధర రూ.81 ఉంటే సవరించే చార్జీల ప్రకారం రూ.85 వసూలు చేశారు. అలాగే రూ.87 చార్జీ ఉంటే.. రూ.90 వసూలు చేస్తారన్న మాట. చిల్లర సమస్యను పరిష్కరించడానికి ఈ విధంగా చార్జీలను సవరిస్తున్నట్లు అప్పట్లో ఆర్టీసీ పేర్కొంది. టిక్కెట్లు రద్దు చేసుకున్నా.. తిరిగి డబ్బు చెల్లించే సమయంలోనూ ‘రౌండింగ్ ఆఫ్’ వర్తించేలా ఉత్తర్వులు జారీ చేసింది. టిక్కెట్ రద్దు చేసుకుంటే ఆర్టీసీ రూ.149 ఇవ్వాల్సి ఉంటే.. రూ.145 మాత్రమే చెల్లించారు. 8 పుణ్యక్షేత్రాల సందర్శనకు తప్పని బాదుడు ఏపీఎస్ఆర్టీసీ రద్దీ, పండగ సీజన్లో ప్రయాణికుల్ని దోచుకునేందుకు 50శాతం చార్జీలను అధికంగా మోపి ఓ వైపు నడ్డివిరుస్తుంటే... మరోవైపు డిపోల వారీగా ఇష్టారీతిన టిక్కెట్ల ధరలను వసూలు చేయడం ఫక్తు సినిమా బ్లాక్ టిక్కెట్లను తలపించింది. సామాన్య ప్రజలు పుణ్యక్షేత్రాల సందర్శనలోనూ ఆనందాన్ని ఆవిరి చేస్తూ అధిక చార్జీలను మోపింది. డీజిల్ ధరలు పెరిగినా.. చార్జీలు పెంచడం లేదని పైకి చెబుతూ.. జిల్లా జిల్లాకో టిక్కెట్లు రేట్లు పెంచి ప్రయాణికుల జేబులు గుల్ల చేసింది. ఇక పండగ వేళల్లో వేరే చెప్పనక్కర్లేదు. ప్రత్యేక బస్సులంటూ 50% నుంచి వంద శాతం వరకు చార్జీలను పెంచుతూ.. ఏకంగా ప్రజా రవాణా వ్యవస్ధను ప్రజలకు దూరం చేసింది. 8 సెస్సులు వేసినా.. సౌకర్యాలు లెస్సు సౌకర్యాల పేరుతో టిక్కెట్‌పై రూ.2 వసూలు చేసినా.. సౌకర్యాలు అత్యంత అధ్వానం. బస్టాండ్లలో మూత్ర విసర్జనకు రూ.5 వసూలు చేస్తున్నారు. ప్రయాణికుల నుంచి ప్యాసింజర్ సెస్ పేరుతో వసూలు చేస్తున్నా.. అందుకు తగ్గట్లు ఏ మాత్రం సౌకర్యాలు కల్పించడం లేదు. ఇప్పుడు సేఫ్టీ సెస్ అని టిక్కెట్టుపై రూపాయి వంతున తీసుకుంటున్నారు. కిలోమీటర్లతో సంబంధం లేకుండా.. ప్రతి ఒక్క ప్రయాణికుడిపై ఈ భారం మోపారు. సేఫ్టీ సెస్ కింద రూపాయి వసూలు చేసినా.. రాష్ట్రంలో తిరిగే బస్సుల్లో కనీసం ప్రథమ చికిత్స బాక్సులు కూడా ఏర్పాటు చేయలేదు. ప్రమాదాలు జరిగినప్పుడు బాధితులకు పరిహారం కూడా ఇవ్వడం లేదు. 8 షాక్ కొట్టేలా విద్యుత్తు చార్జీల పెంపు రాష్ట్రంలో సామాన్య ప్రజలు కరెంట్ స్విచ్ వేస్తే.. బిల్లుతో షాక్ కొట్టే పరిస్థితి నెలకొంది. గతంలో నెలకు వందకి మించి రాని కరెంట్ బిల్లు.. టీడీపీ అధికారంలోకి వచ్చాక.. వెయ్యి, రెండువేల దాకా వస్తోందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చీ రావడంతోనే విద్యుత్ చార్జీలను పెంచింది. గత నాలుగున్నరేళ్లలో ప్రజలపై ప్రత్యక్షంగా రూ.1562 కోట్లు.. పరోక్షంగా రూ.3700 కోట్లు.. వెరసి మొత్తంగా రూ.5,262 కోట్ల భారం వేసింది. 8 45 లక్షల మంది వినియోగదారులపై అదనపు భారం 2015–16సంవత్సరంలో ఏకంగా రూ.941 కోట్ల భారం విద్యుత్ వినియోగదారులపై వేసింది. మరో రూ.750 కోట్లు ట్రూ అప్ చార్జీల రూపంలో పిండుకోవాలని చూసింది. జనాగ్రహంతో ట్రూ అప్ మాట వెనక్కు తీసుకుంది. 2016–17లో మరో దఫా విద్యుత్ చార్జీల భారం మోపింది. నేరుగా రూ.242 కోట్ల మేర చార్జీలు పెంచింది. కానీ శ్లాబుల వర్గీకరణతో దాదాపు రూ.1200 కోట్లు దండుకుంది. 2014–15లో ఏడాదికి 600 యూనిట్ల విద్యుత్ వాడకం దాటితే.. నెలవారీ బిల్లు రెట్టింపయ్యే ఎత్తుగడ వేసింది. మొదటి 50 యూనిట్లకు రూ.1.45(యూనిట్‌కు) చొప్పున చెల్లించే విద్యుత్ వినియోగదారుడు.. ఏడాదికి 601 యూనిట్ల వినియోగం ఉంటే చాలు యూనిట్‌కు రూ.2.60 చొప్పున చెల్లించాలి. దీన్ని బట్టి ఏడాదికి ప్రతీ వినియోగదారుడు రూ. 600 వరకూ అదనపు భారం మోయాల్సి వచ్చింది. ఇలా 45 లక్షల మంది విద్యుత్ వినియోగదారులపై అదనపు భారం పడింది. దళిత పేద వర్గాల సబ్సిడీ ఎగిరిపోయింది. సర్కారు దీంతో శాంతించలేదు. ఈ ఏడాది(2017–18)లో కొత్త రకం దొంగ దెబ్బను కనిపెట్టింది. ఇప్పుడు 1 కేవీ లోడ్ దాటితే ఫిక్స్డ్ చార్జీలు వసూలు చేస్తామంటోంది. అంటే.. వెయ్యి వాట్స్కు సరిపడా లోడ్ ఉంటే బిల్లు మోతమోగినట్టే. రకరకాల విద్యుత్ ఉపకరణాలున్న ఈ రోజుల్లో 1 కేవీ లోడ్ దాటని వారు ఎవరుంటారు? ప్రతిఇంట్లో.. నాలుగు బల్బులు, ఫ్యాన్లు, మిక్సీ, కూలర్, ఇస్త్రీ పెట్టె... ఇలాంటివన్నీ సర్వసాధారణం కదా? ఈ విధానం వల్ల మధ్యతరగతి వినియోగదారుడి బిల్లు రూ.150 నుంచి రూ. 600 వరకూ పెరిగే వీలుంది. ఇది దొంగదెబ్బ కాదా? ఒక పక్క విద్యుత్ రంగ సంస్థలను నిర్వీర్యం చేస్తూ.. మరోవైపు ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం.. భారాన్ని మాత్రం ప్రజలపై మోపుతోంది. సంస్కరణల పేరుతో విద్యుత్ నియంత్రణ మండలిని ఏర్పాటు చేసినా.. ఈ స్వతంత్ర సంస్థ స్వేచ్ఛను సర్కారే పూర్తిగా హరించింది. నాలుగేళ్లుగా ప్రతీఏటా ప్రజాభిప్రాయ సేకరణలో అనేక అంశాలు ముందుకొచ్చినా.. ఏపీఈఆర్సీ మాత్రం ప్రభుత్వ పెద్దల కొమ్ముగాస్తోందనే ఆరోపణలున్నాయి. 8 రిజిస్ట్రేషన్ చార్జీలు అదనంగా రూ.1,500 కోట్లు రాష్ట్రంలో భూములు, ఇళ్ల స్ధలాలు, నిర్మాణ రంగంలో రిజిస్ట్రేషన్ చార్జీలను చంద్రబాబు అధికారంలోకి రాగానే పెంచారు. సెంటు స్ధలం కొందామన్నా చుక్కలు కనిపించే పరిస్థితి తెచ్చారు. ప్రతి ఏటా రిజిస్ట్రేషన్ రంగంపై సర్కారుకు రూ.4,600 కోట్ల వరకు ఆదాయం వస్తుంది. చంద్రబాబు హయాంలో 2014 నుంచి ఇప్పటివరకు రెండుసార్లు రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచారు. 2015లో, 2018లో రెండుసార్లు పెంచిన చార్జీలతో.. రాష్ట్ర ప్రజలపై రూ.1,500 కోట్ల వరకు అదనపు భారం పడింది. పోలవరం యాత్రలు, సీఎం సభలకు ఉచితంగా బస్సులు తిప్పి..ప్రయాణీకులపై భారమా? పోలవరం యాత్రలు, సీఎం సభలకు మాత్రం ఉచితంగా బస్సులు తిప్పారు. అధికారులు వచ్చి బలవంతంగా బస్సులు ఎక్కించి మరీ పంపించారు. వీటికయ్యే ఖర్చును పుణ్యక్షేత్రాలకు వెళదామనుకున్న మాపై మోపుతారా? పండగ వచ్చిదంటే ఈ చార్జీల దోపిడీ ఆకాశమే హద్దుగా సాగింది. ఒక్కో టిక్కెట్‌పై 150 శాతం చార్జీలు వసూలు చేసి పండగ ఆనందాన్ని ఆవిరి చేశారు. – సలాది చక్రవర్తి, జనుపాలెం, తూ.గో.జిల్లా వైఎస్ హయాంలో పైసా పెంచలేదు వైఎస్ హయాంలో పైసా చార్జీ పెంచలేదు. ఆర్టీసీని ఆదుకుని కార్మికులకు మెరుగైన వేతనం ఇచ్చినా.. ఆ భారం ప్రయాణికులపై ఏనాడూ మోపలేదు. ప్రజా రవాణా వ్యవస్ధను ఆదుకుని ఆర్టీసీకి జవసత్వాలు కల్పించారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి రాగానే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తానని హామీతో.. కార్మికులకు మేలు జరగడంతోపాటు ప్రయాణికులకు చార్జీల భారం తప్పుతుందని ఆశిస్తున్నా. – రాజారెడ్డి, అధ్యక్షుడు, వైఎస్సార్ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ రూ.210 కోట్ల మేర ఇంటి పన్ను వడ్డింపు ప్రతి ఏటా 5 శాతం మేర ఇంటి పన్నును చంద్రబాబు సర్కారు పెంచింది. టీడీపీ అధికారంలోకొచ్చే నాటికి రూ.300 కోట్ల మేర ఉన్న ఇంటి పన్ను.. ఈ ఆర్ధిక సంవత్సరం జనవరి నాటికి రూ.510 కోట్లకు చేరింది. అంటే.. ఈ ఐదేళ్లలో అదనంగా రూ.210 కోట్ల మేర ఇంటి పన్ను రాష్ట్ర ప్రజల నుంచి వసూలు చేశారన్న మాట!! - లంకిరెడ్డి విద్యాధర్‌రెడ్డి, సాక్షి, అమరావతి -
విద్యుత్ వాత షురూ!
అనంతపురం అగ్రికల్చర్: ‘సర్‌చార్జ్’ల పేరుతో గత ప్రభుత్వం కరెంట్ బిల్లుల రూపంలో ప్రజలపై ఆర్థిక భారాన్ని మోపితే, ప్రస్తుత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం భారీగా కరెం టు చార్జీలను పెంచి సా మన్య, మధ్యతరగతి ప్ర జలపై మోయలేని భారా న్ని వేసింది. యూనిట్‌కు 1.45 రూపాయల నుంచి రూ.8.88 వరకూ పెంచింది. పెరిగిన ధరలు ఏప్రిల్ ఒకటి నుంచి అమలులోకి రానున్నాయి. అయితే పెరిగిన ధరలపై ఈ నెల 23 నుంచి మార్చి 4వరకూ ప్రజలతో బహిరంగ విచారణ చేపట్టనున్నారు. ఇది కేవలం తూతూమంత్రంగా సాగే ప్రక్రియ మాత్రమే! పెంచిన బిల్లులో ఎలాంటి సవరణలు ఉండకపోవచ్చు. గత పదేళ్లలో ఇంత భారీగా కరెంటు బిల్లులు ఎన్నడూ పెరగలేదు. ‘అనంత’ వాసులపై ఏటా రూ. 168కోట్ల భారం: జిల్లాలో 9.40వేల గృహావసర కనెక్షన్లు ఉన్నాయి. 1.97లక్షలు వ్యవసాయ, 67వేలు చిన్న, మధ్యతరహా, భారీ పరిశ్రమలు, 3,100 కుటీరపరిశ్రమలు ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా ప్రతీ నెలా 105కోట్ల రూపాయల బిల్లులు వస్తున్నట్లు ఎస్పీడీసీఎల్ ఎస్ఈ ప్రసాదరెడ్డి తెలిపారు. ఈ క్రమంలో కొత్త పెరిగిన చార్జీలతో 14శాతం అదనపు ఆదాయం చేకూరనుందని అంచనా. ఈ లెక్కన నెలకు 14కోట్ల రూపాయల చొప్పున ఏడాది 168కోట్ల రూపాయల అదనపు ఆదాయం డిస్కంలకు ఖాతాలో చేరే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం పెట్రోలు, డీజిల్ చార్జీలను తగ్గించడంతో బస్సుచార్జీలతో పాటు నిత్యావసర వస్తువుల ధరలను రాష్ట్ర ప్రభుత్వం తగ్గిస్తుందని ప్రజలు భావిస్తే...కరెంటు చార్జీల రూపంలో మోయలేని భారాన్ని మోపింది. -
పైసా పెంచొద్దు
కరెంటు చార్జీల పెంపు ప్రతిపాదనను అన్నివర్గాలు వ్యతిరేకించాయి. రాజకీయ పార్టీల నాయకులు, వివిధ సంఘాల ప్రతినిధులు మండిపడ్డారు. పెద్దలను వదిలి పేదలపై చార్జీల భారం మోపుతున్నారని ధ్వజమెత్తారు. ఎన్పీడీసీఎల్ పరిధిలో విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనలపై కరీంనగర్‌లోని జెడ్పీ హాలులో రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి(ఈఆర్సీ) గురువారం బహిరంగ విచారణ చేపట్టింది. వరంగల్, ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం జిల్లాల ప్రజలు, నాయకులు హాజరయ్యారు. పోలీస్ పహారాలో విచారణతో సాధారణ ప్రజలు రాలేకపోయారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు 20 మంది తమ అభిప్రాయాలు వెల్లడించారు. - కరీంనగర్, సాక్షి నాణ్యమైన విద్యుత్ అందించాలి గృహ వినియోగదారులపై పైసా కూడా చార్జి పెంచొ ద్దు. సంస్థ అసమర్థతతో వస్తున్న నష్టాలను వినియోగదారులపై ఎలా వేస్తారు. విద్యుత్ లైన్ లాస్‌ను తగ్గిం చి చార్జీలు పెంచకుండా నాణ్యమైన విద్యుత్ అందించాలి. - శ్రీనివాస్, లోక్‌సత్తా ఉద్యమ సంస్థ ప్రతినిధి సిబ్బంది లేక ప్రమాదాలు విద్యుత్ సిబ్బంది లేకపోవడంతో ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోతున్నారు. విద్యుత్ పోయిందని, ఫీజ్ కొట్టేసిందని సమాచారం అందించినా అధికారులు స్పందించడం లేదు. షాక్‌తో చనిపోతే, పరిహారం, ఉద్యోగం ఇవ్వడానికైనా ముందుకు వస్తున్న సంస్థ.... సరిపడా సిబ్బందిని నియమించడంలో మాత్రం నిర్లక్ష్యం చేస్తోంది. లైన్మెన్లను వెంటనే నియమించాలి. - కండె సమ్మయ్య, చిట్యాల వైఎస్ హయాంలో పెంచలేదు టారిఫ్ పెంపు ప్రతిపాదనలను ఆమోదించరాదు. విద్యుత్ కొనుగోలు లోపాల వల్ల నష్టం వస్తోంది. ఈ నష్టాలను నివారించాలి. రిలయన్స్ లాంటి సంస్థలకు అధిక మొత్తాలను కట్టబెడుతున్నారు. ఒప్పందాల ప్రకారం విద్యుత్ ఉత్పత్తి చేయకపోయినా చర్యలు తీసుకోలేదు. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఒక్క పైసా విద్యుత్ చార్జీ పెంచలేదు. సంస్థాగత సామర్థ్యాన్ని పెంచుకోవాలి. బొగ్గు కొరత కారణంగా దిగుమతి చేసుకోవడం వల్ల భారం పెరుగుతోంది. మూడు వేలకు బదులు నాలుగున్నర వేల ధరకు టన్ను బొగ్గు కొనుగోలు చేయడం వల్ల నష్టం వస్తోంది. ప్రజల మీద భారం వేసే ప్రతిపాదనలు ఆమోదించవద్దు. - జనక్‌ప్రసాద్, వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి విచారణ నామమాత్రమే... బహిరంగ విచారణ ప్రహసనంగా మారుతోంది. ఇక్కడ చేస్తున్న సూచనలు పరిగణనలోకి తీసుకుంటలేరు. వ్యవసాయానికి 7 గంటల నిరంతర విద్యుత్ ఇవ్వాలి. రాత్రి పూట సరఫరా చేస్తే ఎట్లా? ట్రాన్స్ఫార్మర్లు పాడైపోతే సిబ్బంది మార్చడం లేదు. ఒక్కో రైతు నుంచి రూ.150 - రూ.200 వసూలు చేస్తున్నారు. విద్యుత్ అందక పంటలు ఎండితే పరిహారం చెల్లించాలి. ఇందుకు మండలస్థాయిలో కమిటీ వేయాలి. నేదునూరు ప్లాంట్‌కు గ్యాస్ కేటాయించాలి. 2013-14లో 96 ప్రమాదాలు జరిగితే 38 మంది రైతులకే పరిహారం చెల్లించారు. - ముకుందరెడ్డి, సీపీఎం జిల్లా కార్యదర్శి కార్పొరేట్ అనుకూల పాలసీలు విద్యుత్ సంస్థల పాలసీలన్నీ కార్పొరేటుకు అనుకూలంగా ఉన్నాయి. గ్యాస్ ఆధారిత విద్యుత్ ప్రా జెక్టులు ఉత్పత్తి ప్రారంభించకుండానే క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ పేర స్థిర చార్జీలు పొందుతున్నా యి. ఒక్క యూనిట్ కరెంట్ ఇవ్వకుండానే కోట్లు వసూలు చేసుకుంటున్నాయి. లార్డ్ వెంకటేశ్వర పవర్ ప్రాజెక్టుకు ఇలా కోట్లు చెల్లించి... ఈ భారాన్ని ప్రజలపై వేయడం ఏంటి? చార్జీల పెంపు ప్రతిపాదనలు హేతుబద్ధంగా లేవు. - గాదె దివాకర్, రైతు నాయకుడు కొనుగోలు ధరలపై నియంత్రణ సరఫరా నష్టాలకు వినియోగదారులను బాధ్యు లు చేయడం తగదు. విద్యుత్ కొనుగోలు వ్యవహారాలను ప్రాజెక్టుల వారీగా పరిశీలించాలి. విద్యుత్ కొనుగోలు ధరలపై నియంత్రణ ఉండాలి. పారిశ్రామిక రంగంపై భారం పెంచితే పరిశ్రమలు ఖాయిలా పడే పరిస్థితి ఉంటుంది. - వి.అనిల్‌రెడ్డి, రాష్ట్ర చాంబర్ ఆఫ్ కామర్స్ ఉపాధ్యక్షుడు -
కరెంటు పిడుగు
సాక్షి, గుంటూరు: తెనాలికి చెందిన మోహనరావు 150 యూనిట్లు విద్యుత్ వినియోగిస్తున్నాడు. నెలవారీకరెంటు బిల్లు రూ.382.50 వస్తుంది. వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి సర్కారు పెంచుతున్న కరెంటు చార్జీల ప్రకారం అదే 150 యూనిట్లకు రూ.611.50 బిల్లు చెల్లించాలి. పొరపాటున ఒక్క యూనిట్ అదనంగా వాడుకున్నాడనుకుందాం అంటే 151 యూనిట్లు వాడితే బిల్లు రూ.927 రానుంది. ఒక్క యూనిట్ పెరిగినందున అదనంగా రూ.316 బిల్లు వస్తుందన్న మాట. మోహనరావుకు ఇప్పుడొస్తున్న బిల్లుకు మూడు రెట్లు పెరగనుంది. 50 యూనిట్ల శ్లాబ్ పరిధికి యూనిట్ రేటు పెంచి వినియోగదారుడి ముక్కు పిండి వసూలు చేయనున్నారు. ప్రస్తుతం 0-50, 51-100, 101-150 శ్లాబ్ పరిధిలో రూ.1.45, 2.60, 3.60 వంతున లెక్కకట్టి వసూలు చేస్తున్నారు. పెరిగే చార్జీల ప్రకారం యూనిట్ ఈ శ్లాబ్‌ల పరిధిలోనే రేటు రూ.3.10, 3.75, రూ.5.38 వంతున పెంచనున్నారు. 150 యూనిట్లు దాటి ఒక్క యూనిట్ పెరిగినా, 151-200 శ్లాబ్‌లోని యూనిట్ రేటు రూ.6.32 వంతున ఆ శ్లాబ్ మొత్తం వసూలు చేస్తారు. వినియోగదారుడి కళ్లు బైర్లు కమ్మేలా వచ్చే ఏడాది నుంచి కరెంటు బిల్లు వసూలు చేయనున్నారు. ఈమేరకు విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ)కి డిస్కంలు సమర్పించిన ప్రతిపాదనలనకు అనుమతి వస్తే వినియోగదారుల గుండె గు‘బిల్లు’ మనాల్సిందే. సేవలు హీనం... బాదుడు ఘనం.. వినియోగదారులకు మెరుగైన సేవలందిస్తామని చెబుతున్న డిస్కంలు ఆ దిశగా కనీస ప్రయత్నాలు చేయడం లేదు. నాలుగేళ్ల నుంచి ఏ యేటికాయేడు విద్యుత్ చార్జీల బాదుడు మాత్రం ఘనంగా ఉంది. గృహ వినియోగదారులకు వంద యూనిట్లకు ఉన్న శ్లాబును 50 యూనిట్లకు కుదించి మరీ బిల్లు మోత మోగించనున్నారు. ఈఆర్సీ నిర్వహించే బహిరంగ విచారణలో వినియోగదారులు, రాజకీయపార్టీలు ఆందోళనలు ఉధృతం చేస్తే తప్ప ఈ బాదుడు నుంచి ఉపశమనం కలగదు. బాదుడు అమలైతే.. ఏడాదికి రూ.360 కోట్లు భారంఈ బాదుడు అమలైతే ఎస్పీడీసీఎల్ పరిధిలోని గుంటూరు సర్కిల్లో ఏటా వినియోగదారులపై రూ.360 కోట్ల భారం పడనుంది. ప్రస్తుతం గుంటూరు సర్కిల్ నుంచి విద్యుత్ బిల్లుల డిమాండ్ ఏటా రూ.1,980 కోట్లు వరకు ఉంది. చార్జీల పెంపుతో ఈ డిమాండ్ రూ.2,340 కోట్లు కానుంది.