అనంతపురం అగ్రికల్చర్: ‘సర్‌చార్జ్’ల పేరుతో గత ప్రభుత్వం కరెంట్ బిల్లుల రూపంలో ప్రజలపై ఆర్థిక భారాన్ని మోపితే, ప్రస్తుత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం భారీగా కరెం టు చార్జీలను పెంచి సా మన్య, మధ్యతరగతి ప్ర జలపై మోయలేని భారా న్ని వేసింది. యూనిట్‌కు 1.45 రూపాయల నుంచి రూ.8.88 వరకూ పెంచింది. పెరిగిన ధరలు ఏప్రిల్ ఒకటి నుంచి అమలులోకి రానున్నాయి. అయితే పెరిగిన ధరలపై ఈ నెల 23 నుంచి మార్చి 4వరకూ ప్రజలతో బహిరంగ విచారణ చేపట్టనున్నారు. ఇది కేవలం తూతూమంత్రంగా సాగే ప్రక్రియ మాత్రమే! పెంచిన బిల్లులో ఎలాంటి సవరణలు ఉండకపోవచ్చు. గత పదేళ్లలో ఇంత భారీగా కరెంటు బిల్లులు ఎన్నడూ పెరగలేదు.
‘అనంత’ వాసులపై ఏటా రూ. 168కోట్ల భారం: జిల్లాలో 9.40వేల గృహావసర కనెక్షన్లు ఉన్నాయి. 1.97లక్షలు వ్యవసాయ, 67వేలు చిన్న, మధ్యతరహా, భారీ పరిశ్రమలు, 3,100 కుటీరపరిశ్రమలు ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా ప్రతీ నెలా 105కోట్ల రూపాయల బిల్లులు వస్తున్నట్లు ఎస్‌పీడీసీఎల్ ఎస్‌ఈ ప్రసాదరెడ్డి తెలిపారు.
ఈ క్రమంలో కొత్త పెరిగిన చార్జీలతో 14శాతం అదనపు ఆదాయం చేకూరనుందని అంచనా. ఈ లెక్కన నెలకు 14కోట్ల రూపాయల చొప్పున ఏడాది 168కోట్ల రూపాయల అదనపు ఆదాయం డిస్కంలకు ఖాతాలో చేరే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం పెట్రోలు, డీజిల్ చార్జీలను తగ్గించడంతో బస్సుచార్జీలతో పాటు నిత్యావసర వస్తువుల ధరలను రాష్ట్ర ప్రభుత్వం తగ్గిస్తుందని ప్రజలు భావిస్తే...కరెంటు చార్జీల రూపంలో మోయలేని భారాన్ని మోపింది.
విద్యుత్ వాత షురూ!
Published Fri, Feb 6 2015 2:33 AM | Last Updated on Fri, Jun 1 2018 8:52 PM
Advertisement