Portables
-
పోర్టబుల్ ఫేషియల్ మసాజర్
నలుగురిలోనూ నేచురల్‌గా కనిపించడానికి తపించే మహిళలు సౌందర్య సాధన కోసం ఇలాంటి మసాజర్లనే ఎంచుకుంటూ ఉంటారు. లేటెస్ట్ వర్షన్లో దొరికే ఈ స్కిన్‌కేర్ డివైస్ చక్కగా ఉపయోగపడుతుంది. త్రీ మోడ్స్‌తో రూపొందిన ఈ ఫేషియల్ మసాజర్.. 4 ఇన్ 1 మసాజ్ ఫంక్షన్‌తో పనిచేస్తుంది. ఆటోమేటిక్ స్విచ్ మోడ్స్.. నార్మల్, కూలింగ్, హీటింగ్ అనే ఆప్షన్స్‌తో పని చేస్తుంది. చిత్రంలోని ఈ ఎలక్ట్రిక్ ఫేషియల్ మసాజర్.. ప్రతి 3 నిమిషాలకు ఇంటెలిజెంట్ మోడ్స్‌ని మారుస్తుంది. మొత్తం తొమ్మిది నిమిషాలు నిర్విరామంగా ట్రీట్మెంట్ అందిస్తుంది.దీన్ని వాడిన తర్వాత.. మెత్తటి క్లాత్‌తో క్లీన్ చేసుకోవచ్చు. జెల్, క్రీమ్, ఎసెన్స్, లోషన్స్ ఏవైనా అప్లై చేసుకుని.. ఆపై ఈ డివైస్‌తో మసాజ్ చేసుకోవాలి. ఈ పోర్టబుల్ – ఫేస్ కేర్ మసాజర్.. సౌందర్య సాధనాల బ్యాగ్‌లో ప్యాక్ చే సుకోవడానికి వీలుగా ఉంటుంది. దీన్ని వినియోగిస్తే చర్మం బిగుతుగా మారుతుంది. యవ్వనంగా సహజమైన మెరుపును సొంతం చేసుకోవచ్చు. మచ్చలు, మొటిమలు వంటి సమస్యలను దూరం చేసుకోవచ్చు. ఇది ఇంట్లో ఉంటే పార్లర్ స్పా అనుభూతిని అందిస్తుంది. దీనికి చార్జింగ్ పెట్టుకుని వినియోగించుకోవచ్చు. దీని ధర 199 డాలర్లు. 16,700 రూపాయలు. -
15 వేల అడుగుల ఎత్తు నుంచి.. పోర్టబుల్ ఆస్పత్రి పారా–డ్రాప్
న్యూఢిల్లీ: భారత ఆర్మీ, వైమానిక దళం కలిసి అరుదైన ఘనతను సాధించాయి. పోర్టబుల్ ఆస్పత్రి ‘ఆరోగ్య మైత్రి హెల్త్ క్యూబ్’ను 15 వేల అడుగుల ఎత్తు నుంచి విజయవంతంగా లక్షిత ప్రాంతంలో నేలపైకి దింపాయి. అత్యంత ఎత్తులో నుంచి విజయవంతంగా పూర్తి చేసిన ఈ పారా–డ్రాప్ ప్రాజెక్టు ప్రపంచంలోనే మొట్టమొదటిదని రక్షణ శాఖ తెలిపింది. ఇందులోని క్రిటికల్ ట్రామాకేర్ క్యూబ్‌లను భీష్మ(భారత్ హెల్త్ ఇనిషియేటివ్ ఫర్ సహయోగ్ హిత అండ్ మైత్రి)ప్రాజెక్టులో భాగంగా దేశీయంగానే రూపొందించినట్లు వెల్లడించింది. మారుమూల, అటవీ కొండ ప్రాంతాల్లో వరదలు వంటి ప్రకృతి విపత్తులు, అత్యవసర సమయాల్లో బాధితులకు అత్యంత వేగంగా, సమర్థమైన వైద్యసేవలను అందించే లక్ష్యంతో ప్రధాని మోదీ ఆదేశాల మేరకు పోర్టబుల్ ఆస్పత్రికి రూపకల్పన జరిగిందని వివరించింది. ఇందులోనున్న వసతులతో 200 మందికి వైద్య సేవలందించొచ్చని తెలిపింది. ఈ క్యూబ్‌ను అధునాతన రవాణా విమానం సీ–130జే సూపర్ హెర్క్యులస్ ద్వారా అనుకున్న చోట అనుకున్న విధంగా నేలపైకి సురక్షితంగా పారాడ్రాప్ చేసినట్లు రక్షణ శాఖ పేర్కొంది. ఆర్మీ ఇందుకోసం అత్యాధునిక ప్రెసిషన్ డ్రాప్ సాంకేతికతను వినియోగించుకుందని తెలిపింది. -
జస్ట్ చెమటతోనే డయాబెటిస్‌ని గుర్తించే సరికొత్త సాంకేతిక పరికరం!
డయబెటిస్ని రోగులకు ఇక నుంచి సూదుల బాధ తప్పుతుందట. రక్త నమునాల కోసం సూదులతో తీయించుకునే సమస్య ఉండదు. జస్ట్ చెమటతోనే ఈజీగా గుర్తించే సాంకేతికతో కూడిన పోర్టబుల్ సిస్టమ్‌ని అభివృద్ధి చేశారు. ఈ పరికరం ఖర్చు కూడా తక్కువే. టైప్1, టైప్2 డయాబెటిస్ పేషెంట్ల ఇరువురికి ఉపయోగపడుతుందని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. వివరాల్లోకెళ్తే..హైదరాబాద్‌లో పిలానీలోని బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (బిట్స్) పరిశోధకులు, తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (టీఎస్సీఓటీ) మద్దతుతో సాంకేతికతో కూడిన పరికరాన్ని అభివృద్ధి చేశారు. దీన్ని త్రీడీ ప్రింటింగ్, CO2 లేజర్ గ్రాఫేన్-ఆధారిత ఎలక్ట్రోడ్లను ఉపయోగించి రూపొందించినట్లు ప్రోఫెసర్ సాకేత్ గోయెల్ వెల్లడించారు. ఈ పరికరం రోగి నుంచి ఇంజెక్షన్లో రక్త నమునాలను సేకరించే సమస్యను పరిష్కారిస్తుందని చెబుతున్నారు. ఈ పరికరం రక్త నమునాల ఆధారంగా కూడా షుగర్ టెస్ట్ చేయగలదని అన్నారు. అయితే తమ లక్ష్యం చెమటలోని లాక్టేట్ సాంద్రత ఆధారంగా శరీరంలోని గ్లూకోజ్ స్థాయిలను కచ్చితంగా గుర్తించగలదా? అనే లక్ష్యంతో ఆవిష్కరించామని చెప్పారు. ఎలా పనిచేస్తుందంటే.. ఎలెక్ట్రోకెమిలుమినిసెన్స్ (ఈసీఎల్) ఆధారంగా పనిచేస్తుంది. ఈ పరికరం చెమటను ఇన్‌పుట్‌గా స్వీకరించిన తర్వాత విద్యుత్ సిగ్నల్‌ను ప్రేరేపిస్తుంది. ఆ తర్వాత కాంతిని అవుట్‌పుట్‌గా ఉత్పత్తి చేసి, రసాయన ప్రతిచర్యను ప్రారంభిస్తుంది. ఈ కాంతి తీవ్రతను ఆధారంగా లాక్టేట్ సాంద్రతను అంచనావేసి, తద్వారా గ్లూకోజ్ స్థాయిలను నిర్థారిస్తారు. ఇది షుగర్ పరీక్షల్లో కచ్చితమైన ఫలితాలను ఇస్తుందని చెప్పారు పరిశోధకులు. దీన్ని స్మార్ట్ ఫోన్లకు కనెక్ట్ చేసేలా పోర్టబుల్ పరికరాన్ని పరిశోధకులు బృందం విజయవంంతంగా అభివృద్ధి చేసింది. ఈ పరికరం ప్రత్యేకమైన యాప్ ద్వారా మానవ మెటాబోలేట్ డేటాను యాక్సెస్‌చేసేలా వినయోగదారులను అనుమతిస్తుంది. దీన్ని బల్క్‌లో ఈ ప్రోడక్ట్‌ని ఉత్పత్తి చేసేలా ఒక కంపెనీతో ఒప్పందం కుదుర్చుకోనున్నట్లు తెలిపారు. అయితే ఈ అత్యాధునిక పరికరం ఖరీదు రూన 300 నుంచి రూ. 400 మధ్యలోనే ఉంటుందని చెప్పారు. ఎలాంటి పెయిన్ ఎదుర్కొవాల్సిన అవసరం లేకుండా మధుమేహ పరీక్షలను చాలా సులభంగా ఈ సాధనంతో చెక్ చేయించుకోగలరని అన్నారు. (చదవండి: ఆరోగ్యంపై అవగాహన కల్పించేలా కడపుబ్బా నవ్వించే డాక్టర్!) -
ఈ పోర్టబుల్ డివైజ్ ఉంటే ఇంట్లోనే ఈజీగా రోల్ మసాజ్!
చర్మం బిగుతుగా.. మృదువుగా మెరవాలంటే తగినన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాల్సిందే. అందులో ఈ ప్రత్యేకమైన రోల్ మసాజ్ ట్రీట్మెంట్ మంచి ఫలితాన్ని అందిస్తోంది. జపనీస్ టెక్నాలజీతో రూపొందిన ఈ బ్యూటీ ఫేస్ రోలర్.. వినియోగం చాలా తేలిక. ముఖ కండరాలను ఉత్తేజపరచడంలో.. చర్మం మీదున్న ముడతలు తగ్గించడంలో.. ఇది ఎంతగానో సహకరిస్తుంది. దీనికి చార్జింగ్ పెట్టుకుని వినియోగించుకోవాలి. సుమారు 90 నిమిషాల పాటు చార్జింగ్ పెట్టుకుంటే.. 150 నిమిషాల పాటు ఈ డివైస్ నిరంతరాయంగా పని చేస్తుంది. ఈ చర్మ సంరక్షణ పరికరాన్ని ఈజీగా ఎక్కడికైనా వెంట తీసుకెళ్లొచ్చు. దీనిలో రెండు రోల్స్.. వి షేప్‌లో ఫిక్స్ చేసి ఉంటాయి. అవి చర్మం మీద సులభంగా రోల్ అవుతాయి. బుగ్గలు, మెడ భాగాల్లోని ఒంపుల్లో మసాజ్ చేసుకోవడానికి వీలుగా ఇది రూపొందింది. వైబ్రేట్ అవుతూ మసాజ్ చేసేందుకు ఇవి అనువుగా ఉంటాయి. ఈ ఎలక్ట్రిక్ స్టిమ్యులేషన్.. ఫేస్‌ని ఎంతగానో మెరిపిస్తుంది. దీని ధర 32 డాలర్లు. అంటే 2,664 రూపాయలు. అయితే ఈ ట్రీట్మెంట్కి ముందు చర్మాన్ని శుభ్రంగా చల్లటి వాటర్‌తో కడుక్కుని.. మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవాలి. మోడ్స్ ఆన్ చేసుకుని.. మసాజర్ వినియోగించుకోవాలి. ఇది ఆన్‌లో ఉంటే.. సుమారు మూడు నిమిషాల తర్వాత ఆటోమేటిక్‌గా ఆఫ్ అవుతుంది. గ్లాస్ స్కిన్ కోసం.. ఒక కప్ ఓట్స్.. ఒక టేబుల్ స్పూన్ తేనెకు ఒక టేబుల్ స్పూన్ రోజ్ వాటర్ యాడ్ చేసి అది పేస్ట్‌లా మారేవరకు బాగా కలిపి ఆ పేస్ట్‌తో ఫేస్ రుద్దుకుని ఓ 15 మినిట్స్ వరకు అలా వదిలేయాలి. తర్వాత చన్నీళ్లతో ఫేస్ వాష్ చేసుకుని మాయిశ్చరైజర్ అప్లయ్ చేసుకోవాలి. -
సూట్కేస్లాంటి పవర్ స్టేషన్
చూడటానికి ఇది ట్రాలీ సూట్‌కేసులా కనిపిస్తుంది గాని, నిజానికిది పోర్టబుల్ పవర్‌స్టేషన్. విద్యుత్ సరఫరా నిలిచిపోయినప్పుడు ఇంట్లో వాడుకోవడానికే కాకుండా, బయటకు తీసుకుపోవడానికి కూడా ఇది అనువుగా ఉంటుంది. అమెరికన్ కంపెనీ ‘గోల్ జీరో’ ఇటీవల సూట్‌కేసు పరిమాణంలోని పోర్టబుల్ పవర్‌స్టేషన్‌ను ‘యతి 6000 ఎక్స్’ పేరుతో మార్కెట్లోకి విడుదల చేసింది. దీనిని మూడు రకాలుగా చార్జ్ చేసుకోవచ్చు. దీనికి సౌరఫలకాలను ఏర్పాటు చేసినందున నేరుగా సూర్యరశ్మి ద్వారా దీనిని చార్జ్ చేసుకోవచ్చు. ఇంట్లో ఉన్నప్పుడు ఇతర పరికరాలకు మాదిరిగానే గోడకు అమర్చిన ప్లగ్బోర్డు ద్వారా చార్జ్ చేసుకోవచ్చు. కారులో ప్రయాణించే సమయంలో కారులోని అడాప్టర్ ద్వారా కూడా చార్జ్ చేసుకోవచ్చు. ఇది 6000 వాట్ల విద్యుత్తును నిల్వ చేసుకోగలదు. దీన్ని ఆన్ చేసుకుంటే, 2000 వాట్ల విద్యుత్తును సరఫరా చేయగలదు. దీని ద్వారా సరఫరా అయ్యే విద్యుత్తుతో ఎలాంటి ఎలక్ట్రిక్ వస్తువులనైనా వాడుకోవచ్చు. ‘యతి–2.0’ యాప్ ద్వారా దీని చార్జింగ్ పరిస్థితిని ఎప్పటికప్పుడు స్మార్ట్‌ఫోన్‌లో చూసుకోవచ్చు. దీని ధర 5999.95 డాలర్లు (రూ.4.92 లక్షలు). -
వెంట వచ్చే రిఫ్రిజిరేటర్.. మొబైల్ ఫోన్లోనే కంట్రోలింగ్
సాధారణ రిఫ్రిజిరేటర్‌ను ఇంట్లో వాడుకోగలం గాని, బయటకు తీసుకుపోలేం. నడివేసవిలో దూర ప్రయాణాలకు వెళ్లేటప్పుడు రిఫ్రిజిరేటర్ ఉంటే బాగుండనపిస్తుంది. పోర్టబుల్ కూల్‌డ్రింక్ చిల్లర్స్ వంటివి ఇప్పుడిప్పుడే అందుబాటులోకి వస్తున్నాయి. ఇదీ చదవండి: నేను ‘మోనార్క్’ని... సెల్ఫ్‌డ్రైవింగ్ ట్రాక్టర్ తాజాగా పోర్టబుల్ మొబైల్ రిఫ్రిజిరేటర్‌ను అమెరికన్ బహుళజాతి సంస్థ ఏంకర్ అందుబాటులోకి తెచ్చింది. ‘ఎవర్ఫ్రాస్ట్ పవర్డ్ కూలర్’ పేరుతో మార్కెట్లోకి విడుదల చేసిన ఈ మొబైల్ రిఫ్రిజిరేటర్ రీచార్జబుల్ బ్యాటరీ సాయంతో పనిచేస్తుంది. ఇది 33 లీటర్లు, 43 లీటర్లు, 53 లీటర్ల పరిమాణాల్లో దొరుకుతుంది. ఇందులో మంచినీళ్లు, కూల్‌డ్రింక్స్, ఐస్‌క్రీమ్స్, పండ్లు, కూరగాయలు వంటివి పెట్టుకోవచ్చు. మొబైల్ ఫోన్లో దీని యాప్‌ను డౌన్లోడ్ చేసుకుని, యాప్ ద్వారా ఇందులోని ఉష్ణోగ్రతను కోరుకున్న రీతిలో నియంత్రించుకునే వెసులుబాటు కూడా ఉంది. దీని ప్రారంభ ధర 1464 డాలర్లు (సుమారు రూ.1.21 లక్షలు) మాత్రమే! -
అదిరిపోయే గాడ్జెట్.. ఎక్కడైనా చల్లదనం మీ వెంటే
ఎయిర్ కండిషనర్ల చల్లదనం కావాలనుకుంటే, వాటిని అమర్చిన గదుల్లోనే కాలక్షేపం చేయక తప్పని పరిస్థితి. విండో ఏసీ అయినా, స్పి›్లట్ ఏసీ అయినా కావలసిన గదిలో అమర్చుకోగలమే తప్ప వాటిని ఎక్కడికంటే అక్కడకు తీసుకుపోయే వీలులేదు. ఇకపై అలాంటి పరిస్థితి ఉండదు. ఎక్కడికంటే అక్కడకు తేలికగా తీసుకపోయే పోర్టబుల్ ఏసీలు కూడా అందుబాటులోకి వస్తున్నాయి. రాజస్థాన్‌కు చెందిన ‘ఇవాపోలార్’ సంస్థ ఇటీవల ‘ఇవాచిల్’ పేరుతో పోర్టబుల్ ఏసీని అందుబాటులోకి తెచ్చింది. చిన్నసైజు సూట్‌కేసు మాదిరిగానే దీనిని కోరుకున్న చోటుకు తేలికగా తీసుకుపోవచ్చు. ఆరుబయట కూడా దీనిని నిక్షేపంగా ఉపయోగించుకోవచ్చు. ఎయిర్ కూలర్ మాదిరిగానే దీనికి వాటర్ ట్యాంకు ఉంటుంది. దీనిని నింపుకోవలసి ఉంటుంది. గాలిలో తేమను వ్యాపింపజేసి, ఇది పరిసరాలను నిమిషాల్లోనే చల్లబరుస్తుంది. దీని ధర సైజును బట్టి రూ.15,669 నుంచి రూ.44,669 వరకు ఉంటుంది. చదవండి: ChatGPT: యూజర్లకు భారీ షాక్.. చాట్ జీపీటీకి కొత్త చిక్కులు! -
చలికాలం వచ్చేసింది.. నిశ్శబ్దంగా వెచ్చదనం ఈ గ్యాడ్జెట్ ప్రత్యేకం
అసలే చలికాలం వచ్చేసింది. కొన్ని ప్రాంతాల్లో చలి మరీ వణికించేస్తుంది. అతిగా చలి వణికించే ప్రాంతాల్లో చలి నుంచి రక్షణ కోసం జనాలు రూమ్హీటర్లను వాడుతుంటారు. వీటి వల్ల విద్యుత్ వినియోగం ఎక్కువగా జరుగుతుంది. పైగా వీటి నుంచి వెలువడే సన్నని రొద సరిగా నిద్రపట్టనివ్వదు. అలాంటి ఇబ్బందులేవీ లేని అధునాతన పోర్టబుల్ రూమ్ హీటర్‌ను రష్యన్ బహుళ జాతి సంస్థ ‘బల్లూ గ్రూప్’ అందుబాటులోకి తెచ్చింది. ఇది చాలా నిశ్శబ్దంగా పనిచేస్తుంది. ‘అపోలో బల్లు కన్వెక్షన్ హీటర్’ పేరుతో మార్కెట్లోకి వచ్చిన ఈ 1500 వాట్ల రూమ్ హీటర్‌ను తేలికగా ఎక్కడికైనా తీసుకుపోయిన కోరుకున్న చోటు అమర్చుకోవచ్చు. సాధారణ రూమ్ హీటర్లతో పోలిస్తే, ఇది వినియోగించుకునే విద్యుత్తు దాదాపు సగానికి సగం తక్కువ. మూడువందల చదరపు అడుగుల గదిని ఇది వెచ్చగా ఉంచగలదు. ఇందులో 24 గంటల టైమర్ కూడా ఉంది. గదిలో ఎంతసేపు వెచ్చదనం కావాలో ఈ టైమర్‌లో సెట్ చేసుకోవచ్చు కూడా. దీని ధర 179.99 డాలర్లు (సుమారు రూ.15 వేలు) మాత్రమే! చదవండి: సేల్స్ బీభత్సం, ఆ కంపెనీకి ఒక సెకను లాభం రూ. 1.48 లక్షలు! -
‘బిట్ బోర్డ్’ ఇది మార్కెట్లోకి వస్తే.. సంగీతకారులకు పండగే!
ఎలక్ట్రానిక్ కీబోర్డులు వచ్చాక సంగీత సృజన కొంత తేలికైంది. ఈ ఫొటోలో కనిపిస్తున్న పరికరం సంగీత సృజనను మరింత సులభతరం చేస్తుంది. కాలిఫోర్నియాలో స్థిరపడిన చైనీస్ డిజైనర్ చెన్ సిన్ ఈ పరికరాన్ని ‘బిట్ బోర్డ్’ పేరుతో ప్రయోగాత్మకంగా రూపొందించారు. ఈ అధునాతన సంగీత పరికరాన్ని రూపొందించినందుకు ఈ ఏడాది ‘రెడ్ డాట్ డిజైన్ కాన్సెప్ట్స్’ పోటీల్లో ‘బెస్ట్ ఆఫ్ ద బెస్ట్’ అవార్డును కూడా సాధించారు. ఇది ఎక్కడికైనా తీసుకువెళ్లడానికి అనువుగా ఉండటమే కాదు, ఇందులో నానా రకాల తంత్ర, తాళవాద్యాల ధ్వనులను శ్రావ్యంగా పలికించుకోవచ్చు. ఇందులోని ఆప్షన్స్‌ను ఉపయోగించుకుని, ఏకకాలంలోనే పలు వాద్యాల ధ్వనులనూ పలికించుకోవచ్చు. ఇందులో వాల్యూమ్ కంట్రోల్, లూపింగ్, బ్లూటూత్ ద్వారా వైర్లెస్ కనెక్టివిటీ వంటి ఆప్షన్స్ కూడా ఉండటం విశేషం. ఈ పరికరం ఇంకా మార్కెట్లోకి రావాల్సి ఉంది. ఇది అందుబాటులోకి వస్తే, సంగీతకారులకు పండగేనని చెప్పవచ్చు. చదవండి: ‘బకరాల్ని చేశాడు.. మస్క్ ట్వీట్‌తో మబ్బులు వీడాయ్’ -
కరెంట్‌ను మోసుకుపోవచ్చు!
ఆరుబయట పిక్నిక్లకు వెళ్లేటప్పుడు, రాత్రివేళల్లో ఆరుబయటే బస చేయాల్సి వచ్చినప్పుడు తాత్కాలికంగా టెంట్లు వేసుకుని గడుపుతుంటారు. అయితే, టెంట్లలో విద్యుత్ సౌకర్యం ఉండక నానా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అలాంటి ఇబ్బందులను తప్పించుకోవాలంటే, భారీ జనరేటర్లను మోసుకుపోవాల్సి వస్తుంది. జనరేటర్లు చేసే ధ్వనికి నిద్ర కరువవుతుంది. ఈ పోర్టబుల్ పవర్‌స్టేషన్ మీ వద్ద ఉంటే, అలాంటి సమస్యలేవీ ఉండవు. ఎక్కడకు వెళ్లినా, విద్యుత్ సరఫరా మీ వెంటే ఉంటుంది. ఇది పోర్టబుల్ పవర్ స్టేషన్. జనరేటర్ల కంటే చాలా తేలిక. ఆన్ చేసుకున్నాక దీని నుంచి వెలువడే చప్పుడు కూడా నామమాత్రంగానే ఉంటుంది. దీని బరువు 16 కిలోలు మాత్రమే. ఎక్కడికైనా మోసుకుపోవడానికి చాలా అనువుగా ఉంటుంది. ‘లిపవర్ మార్స్–2000’ పేరిట ఇది మార్కెట్లో అందుబాటులో ఉంది. ఇది ఎల్ఎఫ్పీ బ్యాటరీల సాయంతో పనిచేస్తుంది. ఈ బ్యాటరీలను చార్జింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆరుబయట ఎండ నుంచి విద్యుత్తు పొందేందుకు వీలుగా దీనికి సోలార్ ప్యానల్స్ కూడా ఉండటంతో, బ్యాటరీలను రీచార్జ్ చేసుకోవలసిన పరిస్థితులు చాలా అరుదుగానే తలెత్తుతాయి. దీని ధర 1489 డాలర్లు (రూ.1.18 లక్షలు). -
టెక్కు టమారం: ఇలాంటి పోర్టబుల్ డ్రైక్లీనర్ ఉంటేనా
ఇలాంటి పోర్టబుల్ డ్రైక్లీనర్ ఉంటే, ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం కష్టమేమీ కాదు. దుస్తులను, గోడలను, గచ్చును, ఫ్యాన్లు, టీవీలు, కంప్యూటర్లు వంటి పరికరాలను ఇది చిటికెలో శుభ్రం చేసేస్తుంది. ఎలాంటి రసాయనాలతో పనిలేకుండానే, ఇది చక్కగా పనిచేస్తుంది. ఇందులో కాసిన్ని నీళ్లు నింపుకుని, ఆన్ చేసుకుంటే చాలు. దీని నుంచి వేగంగా వెలువడే వేడి ఆవిరి దుమ్ము, ధూళి మరకలను క్షణాల్లో తుడిచి పెట్టేస్తుంది. వాటిపై పేరుకున్న సూక్ష్మజీవులను సమూలంగా నాశనం చేస్తుంది. దుస్తులు, వస్తువులు చెమ్మదేరిపోవడం వల్ల వెలువడే దుర్వాసనను తొలగిస్తుంది. దీని నుంచి వెలువడే ఆవిరి ఉష్ణోగ్రత 160 డిగ్రీల సెల్సియస్ వరకు ఉండటంతో, ఇది ఉతికిన దుస్తులను నిమిషాల్లో ఆరబెట్టగలదు కూడా. అమెరికా, యూరోప్, ఆస్ట్రేలియా మార్కెట్లలో అందుబాటులో ఉన్న దీని ధర 109 డాలర్లు (రూ.8,671). -
వావ్! వాట్ ఏ కూల్ గ్యాడ్జెట్.. పది నిమిషాల్లోనే మీ వాతావరణం మారుస్తుంది
వేసవిలో ఆరుబయట వనభోజనాలు, పిక్నిక్ పార్టీలు చేసుకునేందుకు ఎవరైనా సాహసిస్తారా? వేసవి ఎండలను తలచుకుంటేనే ముచ్చెమటలు పోస్తాయి, ఇక ఆరుబయట పిక్నిక్ పార్టీలు కూడానా అని అనుకుంటున్నారా? మరేం ఫర్వాలేదు ఈ ఫొటోలో కనిపిస్తున్న పోర్టబుల్ ఎయిర్ కండిషనర్ వెంట ఉంటే, వేసవిలోనైనా ఆరుబయట వనభోజనాలు, పిక్నిక్ పార్టీలు భేషుగ్గా చేసుకోవచ్చు. ఇళ్లల్లో అమర్చుకునే ఏసీల మాదిరిగా దీనికి ఇన్స్టాలేషన్ బెడద ఉండదు. ఎక్కడికంటే అక్కడకు తేలికగా తీసుకుపోవచ్చు. దీని బరువు పది కిలోలు మాత్రమే. పవర్ అడాప్టర్ ద్వారా దీన్ని కనెక్ట్ చేసుకోవచ్చు. దీని ఉష్ణోగ్రతను 16 నుంచి 30 డిగ్రీల సెల్సియస్ వరకు కోరుకున్న రీతిలో అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఆన్ చేసుకున్న పది నిమిషాల వ్యవధిలోనే పరిసరాల్లోని ఉష్ణోగ్రతను ఇది ఇట్టే చల్లబరచేస్తుంది. చైనాకు చెందిన ‘నైట్‌కోర్’ బహుళజాతి సంస్థ ఈ పోర్టబుల్ ఏసీని అందుబాటులోకి తెచ్చింది. చదవండి: Smartphone Printer: సెల్ఫీ లవర్స్ కోసం.. అదిరిపోయే ఫీచర్ ఈ స్మార్ట్‌ఫోన్ సొంతం! -
Portable Grill: పోర్టబుల్ గ్రిల్.. చికెన్, మటన్ అన్నింటికీ.. ధర 6,131
ఒక ప్రత్యేకమైన సందర్భాన్ని మరింత ప్రత్యేకంగా నిలిపేవి నోరూరించే పసందైన రుచులే. స్నేహితులతో లేదా కుటుంబ సభ్యులతో లాంగ్ డ్రైవ్‌కి వెళ్లినప్పుడు.. అలాంటి రుచులను అందిస్తూ ఆ సందర్భాన్ని అమృత జ్ఞాపకంగా మిగిల్చేదే.. ఈ లగేజ్ స్టయిల్ పోర్టబుల్ గ్రిల్. దీన్ని మన లగేజ్‌తో పాటు వెంట తీసుకెళ్తే చాలు, రుచుల పంట పండినట్లే. ఇందులో ఎలాంటి వంటైనా నిమిషాల్లో రెడీ అవుతుంది. చికెన్, మటన్ వంటి వాటినీ రకరకాలుగా గ్రిల్ చేసుకోవచ్చు. నచ్చిన విధంగా టోస్ట్ చేసుకోవచ్చు. చిత్రంలో కనిపిస్తున్న ఈ మెషిన్ని ఓపెన్ చేసుకోవడం, క్లీన్ చేసుకోవడం చాలా సులభం. ఇది చూడటానికి సూట్‌కేస్‌లా ఉంటుంది. మేకర్ ముందు భాగంలో రెండు రెగ్యులేటర్స్ ఉంటాయి. ఇది గ్యాస్ సాయంతో పనిచేస్తుంది. చిన్న గ్యాస్ సిలెండర్‌ని కూడా సెట్ చేసుకోవచ్చు. గ్రిల్ ప్లేట్స్ మార్చుకోవచ్చు. ఈ మేకర్ లోపల రెండు స్టెయిన్ లెస్ స్టీల్‌తో రూపొందిన గ్యాస్ స్టవ్‌లు అమర్చి ఉంటాయి. దీని మూత ఒకవైపు మేకర్‌కి అటాచ్ అయ్యుంటుంది. దాంతో సూట్‌కేస్‌ను తెరిచినట్లుగా ఓపెన్ చేసుకోవచ్చు. తేలికగా అటూ ఇటూ కదపడానికి ఒకవైపు రెండు చక్రాలు ఉంటాయి. మరోవైపు డివైజ్ మొత్తాన్ని పట్టుకునే హ్యాండిల్ ఉంటుంది. అదే మెషిన్ నిలబడటానికి స్టాండ్‌గా కూడా ఉపయోగపడుతుంది. ఇరువైపులా కూరగాయలు కట్ చేసుకోవడానికి, ఉప్పు, కారం డబ్బాలు పెట్టుకోవడానికి స్పెషల్ ప్లేట్స్ అమర్చి ఉంటాయి. ధర - 80 డాలర్లు (రూ.6,131) చదవండి👉🏾Recipes: తోతాపురి మామిడికాయలు, అరకేజీ బెల్లం.. సింపుల్‌గా ఇలా ఆవకాయ పెట్టేయండి! -
నయా ట్రెండ్...విలేజ్గ్రౌండ్
రోజులు మారాయి. యువత కొత్త ట్రెండ్ సృష్టిస్తున్నారు. వ్యాపారంలో అయితే వినియోగదారుడి ఆకర్షణ లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారు. అధునాతన వసతులు కోరుకుంటున్నారు. అందులో భాగంగా పోర్టబుల్ క్యాబిన్ల డిమాండ్ పెరిగింది. తొలుత పెద్ద నగరాలకు పరిమితమైన ధోరణి ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాలకు తరలివచ్చింది. కొందరు పెదకాకానిలో తయారు చేస్తూ ఆకర్షిస్తున్నారు. పెదకాకాని/యడ్లపాడు: పోర్టబుల్ క్యాబిన్లు చకచకా రెడీ అవుతున్నాయి. చిన్న చిన్న ఇళ్లు, ఫామ్‌హౌస్, సెక్యూరిటీ క్యాపిన్స్, పర్సనల్ ఆఫీసు, రియల్ ఎస్టేట్ ఆఫీసులు, టాయిలెట్స్, స్లోరేజ్ క్యాబిన్స్ స్థలాన్ని బట్టి సైజులు, ఆకారాలు, అందమైన డిజైన్లలో తయారవుతున్నాయి. గుంటూరు జిల్లా పెదకాకాని గ్రామ శివారులోని ఆటోనగర్, వెంగళరావునగర్ సమీపంలో సర్వీసు రోడ్డు పక్కనే గత కొంతకాలంగా రెడీమేడ్ గదులు తయారవుతున్నాయి. విదేశాలలో ఇళ్లను ఒక చోట నుంచి మరొక చోటకు మర్చడం, అవసరాన్ని బట్టి ఎత్తు పెంచుకోవడం, తగ్గించుకోవడాన్ని దృష్టిలో పెట్టుకుని ఉత్తరప్రదేశ్‌కు చెందిన మహమ్మద్ తయ్యబ్ సోదరులు బెంగళూరు కేంద్రంగా పోర్టబుల్ క్యాబిన్లు నిర్మాణం పనులు ప్రారంభించారు. స్థానికంగా తయారీ... ఆ తరువాత దేశవ్యాప్తంగా అక్కడక్కడా ఈ తరహా పరిశ్రమ ఏర్పాటు చేసి తయారు చేస్తున్నారు. పెదకాకాని వై జంక్షన్ సమీపంలో పరిశ్రమ ఏర్పాటు చేసుకుని అవసరాన్ని బట్టి క్యాబిన్లు సరఫరా చేస్తున్నారు. వర్కర్లను కూడా ఉత్తరప్రదేశ్ నుంచి పిలిపించి నిర్మాణానికి వినియోగించుకుంటున్నారు. వారి వద్ద పనులు నేర్చుకుని ఈ ప్రాంతానికి చెందిన వారే పెదకాకానిలో మూడో క్యాబిన్ల తయారీ పరిశ్రమ ఏర్పాటు చేసుకున్నారు. ఈ పోర్టబుల్ క్యాబిన్లలో ఇంటీరియల్ డెకరేషన్ ప్రత్యేక ఆకర్షణగా, అందమైన ఇళ్లను తలపిస్తున్నాయి. లక్షరూపాయల నుంచి ఐదు లక్షల రూపాయల వరకూ ప్రజల అవసరాలకు అనుగుణంగా అందంగా ఆకర్షణీయంగా డిజైన్లు చేసి ఇవ్వడం ద్వారా ఆర్డర్లు పెరుగుతున్నాయని వారు చెబుతున్నారు. ఇతర జిల్లాల నుంచి ఆర్డర్లు వస్తున్నాయని, 25 సంవత్సరాల పాటు మన్నిక ఉంటుందని, వారంటీ బిల్లు ఒక సంవత్సరం పాటు ఫీ సర్వీసు ఉంటుందని, సర్వీసు ఎప్పుడూ అందుబాటులోనే ఉంటుందని నిర్వాహకులు పేర్కొన్నారు. రూపులు మార్చుకుంటున్న కాకా హోటళ్లు... కాకా హోటళ్లు...చాయ్ దుకాణాలు అంటే పురాతన కాలంలో పూరి గుడిసెల్లోనూ..ఆ తర్వాత పెంకుటిళ్లు..పక్కా గదుల్లోనూ దర్శనమిచ్చేవి. ఇప్పుడది పూర్తిగా తనషేప్ను మార్చుకుంటుంది. నయాజమానా నయాట్రెండ్ చందానా.. పెద్దపెద్ద సిటీల్లోని కార్పొరేట్ తరహాతో కనిపిస్తున్నాయి. ఒకప్పుడు కంటైనర్లను వివిధ రకాల వస్తువుల్ని తరలించేందుకు వాడుతుంటారు. సిమెంట్, ఇటుకలు, ఐరన్ అనే మాటేలేకుండా ఎంచక్కా ట్రెండీగా వీటిని తయారు చేస్తున్నారు. కంటైనర్లను కేవలం రవాణాకే కాకుండా ఇల్లు.. వ్యాపార దుకాణాలుగా మార్చి వినియోగిస్తున్నారు. పట్టణాల్లోనే కాకుండా వాటిని మారుమూల పల్లెల్లోనూ ఏర్పాటు చేయడంతో అవి అందర్ని అకర్షిస్తున్నాయి. విదేశాల్లో నడిచే ఈ కొత్త ట్రెండ్ మన దేశంలోనూ వేగంగా విస్తరించడం విశేషం. పల్లె, పట్టణం అనే తేడా లేకుండా ఇప్పుడిప్పుడే వీటికి విశేష ఆదరణ లభిస్తోంది. గతంలో.. సాధారణంగా చాయ్ లేదా ఫాస్ట్‌ఫుడ్ ఇతర వ్యాపార దుకాణాలను ఏర్పాటు చేయాలంటే ఎక్కడైనా కూడళ్లలో నిర్మించిన షాపింగ్ కాంపెక్లŠస్ల్లోని గదుల్ని అద్దెకు తీసుకోవాలి. అడ్వాన్స్‌లు, అవి నిర్మించిన గదులు మనకు అనుకూలంగా లేకుండా మార్పులు చేర్పులకు నిర్మాణాలు, డెకరేషన్లకు అదనంగా డబ్బు ఖర్చు పెట్టాల్సి వచ్చేది. తీరా మనం ఏర్పాటు చేసిన షాపు ‘క్లిక్’ కాకున్నా మనకు ‘లక్’ లేకున్నా..అప్పటి వరకు చేసిందంతా బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది. రీ యూజ్ ఇలా.. కంటైనర్లకు 50 ఏళ్ల తర్వాత వాటి జీవిత పరిమితకాలం అయిపోతుంది.వాటిని షిప్పింగ్‌కు వాడకూడదు. అలాంటి వాటిని వేస్ట్‌గా పోనివ్వకుండా తిరిగి ఉపయోగంలోకి తెస్తున్నారు. వాటిని స్క్రాబ్ కింద కొని వీటికి నిపుణులు అందమైన రూపునిస్తూ అద్భుతంగా మలుస్తున్నారు. షిప్పింగ్ కోసం వినియోగించే మెటల్ కంటైనర్లను పోర్టబుల్ హౌసెస్, ఆఫీస్ క్యాబిన్, హోటల్స్, టీస్పాట్, ఫ్యాన్సీ, కిరణా వంటి బిజినెస్ షాప్స్, మెటల్ క్వారీల వద్ద సేఫ్టీరూమ్స్, ఫాంహౌస్‌ల వద్ద మినిగెస్ట్హౌస్లు, భవన నిర్మాణాల సమయంలో స్టాక్గోడవున్ వంటి వాటికి ఈకంటైనర్లను వినియోగిస్తున్నారు. లోపల ఏమేమీ ఉంటాయంటే... లోపల అంతా బైసన్, ఎంటీఎ బోర్డులు, సీలింగ్, వాల్పేపర్లు, డోర్స్, యూపీవీసీ విండోస్, వినైల్ఫ్లోర్స్, టైల్స్, ఎల్ఈడీ లైట్లు, ఫ్యాన్లు, స్విచ్‌బోర్డులు, కబోర్డ్స్, అడ్జస్ట్ఫ్యాన్, ఏసీ, టీవీ పాయింట్స్, కంప్యూటర్స్, హాలు, కిచెన్, వాష్‌రూం, 1000లీటర్ల పైన ట్యాంక్, లోహం కావడంతో వేడి రాకుండా రాక్వోల్ వినియోగించి ప్రీమియం లుక్ తీసుకువస్తున్నాం. అన్నింటికీ అనుకూలత... తక్కువ ఖర్చుతో అన్ని సదుపాయాలతో కొద్దిపాటి స్థలంలోనే ఏర్పాటు చేసుకునే వీలుంది. ఒకచోట నుంచి మరోచోటకు సులభంగా తరలించుకోవచ్చు. మన అవసరం తీరాక కొన్నధరకు పెద్దగా నష్టం రాకుండా తిరిగి వీటిని విక్రయించుకోవచ్చు. జీఏసిస్టం, ఎంఎస్సిస్టం అనే రెండు రకాలుగా సెమీ, ఫుల్లీ ఫర్నిచర్ సౌకర్యాలతో వీటిని తయారు చేస్తున్నారు. ముందుగానే రెడీమెడ్గా తయారు చేసి ఉన్నందున ఎప్పుడు కావాలంటే అప్పుడే తెచ్చుకోవచ్చు. రోజురోజుకు వీటికి మంచి ఆదరణ పెరగడంతో ఇప్పుడు రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లోనూ, ప్రధాన పట్టణాల్లోనూ వీటి తయారీ కార్ఖానాలు వెలిశాయి. మోబుల్ హౌస్, షాపు ఏదైనా... పక్కాగృహ నిర్మాణాల మాదిరిగానే వీటి ధర అడుగుల చొప్పున ఉంటుంది. ఒక్కొక్క అడుగు సుమారు రూ.900 నుంచి రూ.1200 వరకు వారు అందించే నాణ్యతను బట్టి అందిస్తున్నారు. షిప్పింగ్ కంటైనర్..8గీ40 లేదా 8గీ20 మాత్రమే దొరుకుతాయి. పోర్టక్యాబిన్స్తో పోల్చుకుంటే ఇవి స్టాండెండ్‌గా ఉండడంతో పాటు ధరలోనూ సుమారు రూ.లక్ష వ్యత్యాసం ఉండోచ్చు. ఎందుకంటే ఇది స్టాండెడ్గా ఉంటాయి. ఒక్కొక్క షాపు ధర రూ.లక్ష నుంచి రూ.6.50 లక్షలు పడుతుంది. సింగిల్ బెడ్రూం కలిగిన ఇల్లు రూ.30 లక్షలు పలికే ఈరోజుల్లో కంటైనర్ పోర్ట్‌బుల్ హౌస్ 20గీ8 సైజు ఇల్లు రూ.4.50 లక్షలు, అదే పుల్లీ ఫర్నిచర్‌తో రూ.6.50 లక్షలు, 40గీ8 ఇల్లు రూ.8 లక్షలు, ఫుల్లీ ఫర్నిచర్ హౌస్ రూ.8.50 లక్షలకు రావడంతో అంతా ఇటువైపు దృష్టిని సారిస్తున్నారు. కార్ఖానా నుంచి కావల్సిన చోటుకు తరలించే సమయంలో ఎలాంటి డ్యామేజ్ జరిగే అవకాశం లేదు. నిర్మాణం కంటే ప్రత్నామ్యాయంతోనే మేలు... పెరిగిన నిర్మాణ సామాగ్రి ధరలతో ప్రస్తుతం శాశ్వత భవనం లేదా గదుల నిర్మాణాలు చేయాలంటే తలకుమించిన భారం అవుతుంది. దీనికి తోడు కూలీల ధరలు ఇబ్బడిముబ్బడిగా పెరిగాయి. ఇన్ని ఇబ్బందులు పడేకంటే వ్యాపారాలకు కంటైనర్ దుకాణాల్ని కొనుగోలు చేసుకుంటే సమయం, డబ్బు ఆదా కావడంతో పాటు వద్దనుకున్నప్పుడు తిరిగి అమ్ముకోవచ్చు. వీటిని వీధుల్లో పొలాల్లో ఇళ్లమధ్య ఎక్కడైనా పెట్టుకోవచ్చు. అందుకే ఆధార్సెంటర్కు రెడీమెడ్గా కంటైనర్‌ను తీసుకురావడం జరిగింది. – వెంకటనర్సు, యడ్లపాడు -
విలీనం లేనట్టే!
భీమిలి, అనకాపల్లి విలీన ఫైల్ వెనక్కి? టీడీపీ శ్రేణుల్లోనూ విలీనంపై విముఖత జీవీఎంసీ ఎన్నికలకు సన్నాహాలు సాక్షి, విశాఖపట్నం : జీవీఎంసీలో భీమిలి, అనకాపల్లి విలీన ప్రహసనానికి దాదాపు తెరపడినట్టే. దీంతో జీవీఎంసీతోపాటు, అనకాపల్లి, భీమిలి మున్సిపాలిటీలకు కూడా ఎన్నికలు నిర్వహించేందుకు రంగం సిద్ధమవుతున్నట్టు తెలిసింది. జీవీఎంసీలో ఇప్పటికే ఈ దిశగా ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర పురపాలన, పట్టణాభివృద్ధి శాఖ(ఎంఏయూడీ)లో ఈ మేరకు ఫైల్ నడుస్తున్నట్టు అధికారులు చెప్తున్నారు. గరిష్టంగా మూడు నుంచి ఆరు మాసాల వ్యవధిలో కార్పొరేషన్ ఎన్నికలు ముగుస్తాయని పేర్కొంటున్నారు. ఏడాదిన్నర ప్రహసనం! ఏడాదిన్నర కిందట నుంచి జీవీఎంసీలో అనకాపల్లి, భీమిలి విలీన ప్రహసనం నడిచింది. గత అనకాపల్లి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, భీమిలి ఎమ్మెల్యే అవంతి శ్రీనివాసరావు దీనిపై పట్టుపట్టారు. 2012 ఫిబ్రవరిలో జీవీఎంసీ పాలక మండలి గడువు ముగిశాక ప్రత్యేకాధికారుల పాలనలో దీనికి ఆమోదం తెలిపారు. దీంతో ఏడాది కిందట విలీన ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి. భీమిలి-జీవీఎంసీ మధ్యనున్న ఐదు పంచాయతీలు మాత్రం విలీనాన్ని వ్యతిరేకిస్తూ కోర్టుకెక్కాయి. కోర్టు వీరికి అనుకూలంగా ఉత్తర్వులు జారీ చేయడంతో ఈ పంచాయతీలకు ఎన్నికలు కూడా నిర్వహించేశారు. తాజాగా గంటా శ్రీనివాసరావు భీమిలి ఎమ్మెల్యేగా, అవంతి శ్రీనివాసరావు అనకాపల్లి ఎంపీగా ఎన్నికయ్యారు. భీమిలి వాసులకు గంటా విలీనాన్ని నిలుపుదల చేయిస్తానని ఎన్నికల్లో హామీ ఇచ్చారు. శాటిలైట్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. కానీ అప్పటికే పంచాయతీల విలీనం ఉపసంహరణకు గురవడంతో.. భీమిలి విలీనం కూడా వెనక్కి వెళ్తుందని తేటతెల్లమయిపోయింది. అనకాపల్లి విలీనమూ హుళక్కే! భీమిలి విలీనంపై వెనుకడుగు పడడంతో.. అనకాపల్లి విలీనంపైనా మబ్బులు ముసురుకున్నాయి. ఏ ఒక్కటి విలీనం చేసినా.. విలీన ప్రక్రియకు కనీసం ఆరు మాసాలు పడుతుంది. వార్డుల పునర్విభజన, జన గణన తదితర ప్రక్రియలన్నీ పూర్తి చేయాలి. కేవలం అనకాపల్లి కోసమే ఈ తతంగమంతా చేయడం వృథా ప్రయాసగా అధికారులు భావిస్తున్నారు. ఇదే విషయాన్ని ఎంఏయూడీకి కూడా నివేదించినట్టు తెలిసింది. ఈసారికి జీవీఎంసీతోపాటు, భీమిలి, అనకాపల్లి మున్సిపాలిటీలకు యథావిధిగా ఎన్నికలు నిర్వహించడమే మేలన్న భావనకు యంత్రాంగం వచ్చింది. అలాగైతే ఇప్పటికే వీటికి బీసీ, ఎస్సీ, ఎస్టీ జనగణన కూడా ముగియడంతో.. ఎన్నికల ప్రక్రియ తేలికేనని చెప్తున్నారు. సాధారణ ఎన్నికలు ముగియడంతో.. ఈ దిశగా ఇపుడు ఎంఏయూడీ యంత్రాంగం కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం రాష్ట్ర విభజన వ్యవహారంలో బిజీగా ఉండటంతో జూన్ రెండో వారంలో దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశాలున్నట్టు జీవీఎంసీ అధికారులు చెప్తున్నారు.