ఎయిర్ కండిషనర్ల చల్లదనం కావాలనుకుంటే, వాటిని అమర్చిన గదుల్లోనే కాలక్షేపం చేయక తప్పని పరిస్థితి. విండో ఏసీ అయినా, స్పి›్లట్ ఏసీ అయినా కావలసిన గదిలో అమర్చుకోగలమే తప్ప వాటిని ఎక్కడికంటే అక్కడకు తీసుకుపోయే వీలులేదు. ఇకపై అలాంటి పరిస్థితి ఉండదు. ఎక్కడికంటే అక్కడకు తేలికగా తీసుకపోయే పోర్టబుల్ ఏసీలు కూడా అందుబాటులోకి వస్తున్నాయి.
రాజస్థాన్‌కు చెందిన ‘ఇవాపోలార్’ సంస్థ ఇటీవల ‘ఇవాచిల్’ పేరుతో పోర్టబుల్ ఏసీని అందుబాటులోకి తెచ్చింది. చిన్నసైజు సూట్‌కేసు మాదిరిగానే దీనిని కోరుకున్న చోటుకు తేలికగా తీసుకుపోవచ్చు.
ఆరుబయట కూడా దీనిని నిక్షేపంగా ఉపయోగించుకోవచ్చు. ఎయిర్ కూలర్ మాదిరిగానే దీనికి వాటర్ ట్యాంకు ఉంటుంది. దీనిని నింపుకోవలసి ఉంటుంది. గాలిలో తేమను వ్యాపింపజేసి, ఇది పరిసరాలను నిమిషాల్లోనే చల్లబరుస్తుంది. దీని ధర సైజును బట్టి రూ.15,669 నుంచి రూ.44,669 వరకు ఉంటుంది.
చదవండి: ChatGPT: యూజర్లకు భారీ షాక్.. చాట్ జీపీటీకి కొత్త చిక్కులు!
Comments
Please login to add a commentAdd a comment