cheap price
-
రూ.38 వేలకే ఎలక్ట్రిక్ స్కూటర్.. భారీ డిస్కౌంట్!
తక్కువ ధరలో ఎలక్ట్రిక్ స్కూటర్ కావాలా.. అయితే ఈ వార్త మీ కోసమే. ఎందుకంటే తక్కువ ధరలోనే ఎలక్ట్రిక్ స్కూటర్ ఒకటి అందుబాటులో ఉంది. అదే ‘గెట్ 1’ ఎలక్ట్రిక్ స్కూటర్. అద్భుతమైన ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎంఆర్పీ రూ.65,999గా ఉండగా దీన్ని ఇప్పుడు రూ. 38 వేలకే కొనుక్కోవచ్చు. ఇదీ చదవండి: గ్యాస్ వినియోగదారులకు ఊరట.. ధరల పరిమితిపై కేంద్రం పరిశీలన! రూ.65,999 ఎంఆర్పీ ఉన్న ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను కంపెనీ ప్రస్తుతం భారీ డిస్కౌంట్‌తో రూ. 43,499లకే అందుబాటులో ఉంచింది. అంతేకాకుండా మరో ఆఫర్ కూడా ఉంది. రూ. 5 వేల వరకు అదనపు డిస్కౌంట్ లభిస్తోంది. అంటే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను రూ. 38 వేలకే సొంతం చేసుకోవచ్చు. అయితే ఈ ఆఫర్ ఢిల్లీలో మాత్రమే అందుబాటులో ఉంది. కళ్లు చెదిరే ఫీచర్స్ గెట్ 1’ ఎలక్ట్రిక్ స్కూటర్లో 48వీ 13 ఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఒక్కసారి చార్జ్ చేస్తే 45 నుంచి 50 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. ఈ స్కూటర్ కిలోమీటరు వెళ్లేందుకు అయ్యే ఖర్చు 10 పైసలు మాత్రమే. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఆన్లైన్లో కూడా కొనుక్కోవచ్చు. ఈబేబికార్ట్లో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అందుబాటులో ఉంది. ఆన్లైన్ కొనుగోలుపై సందేహం అక్కర్లేదు. 7 రోజుల రిటర్న్ పాలసీ ఉంటుంది. అలాగే క్యాష్ ఆన్ డెలివరీ సౌకర్యం కూడా ఉంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ టాప్ స్పీడ్ గంటకు 35 కిలోమీటర్లు. 130 కేజీల వరకు లోడింగ్ కెపాసిటీ ఉంటుంది. డ్రమ్ బ్రేక్స్, 250 వాట్ 48 వోల్ట్ బీఎల్డీసీ హబ్ మోటార్ ఇందులో ఉన్నాయి. ఫ్రంట్, రియర్ బ్రేక్ సెన్సార్లు, బ్యాటరీ ఇండికేటర్ ఆకట్టుకుంటున్నాయి. ట్యూబ్‌లెస్ టైర్లు, రిమోట్ సెంట్రల్ లాకింగ్ సిస్టమ్, సెక్యూరిటీ లాక్ వంటివి కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి. ఇందులో లిథియం అయాన్ బ్యాటరీ ఉంటుంది. ఈ బ్యాటరీని ఫుల్‌గా చార్జింగ్ చేసేందుకు 6 నుంచి 7 గంటలు పడుతుంది. -
అదిరిపోయే గాడ్జెట్.. ఎక్కడైనా చల్లదనం మీ వెంటే
ఎయిర్ కండిషనర్ల చల్లదనం కావాలనుకుంటే, వాటిని అమర్చిన గదుల్లోనే కాలక్షేపం చేయక తప్పని పరిస్థితి. విండో ఏసీ అయినా, స్పి›్లట్ ఏసీ అయినా కావలసిన గదిలో అమర్చుకోగలమే తప్ప వాటిని ఎక్కడికంటే అక్కడకు తీసుకుపోయే వీలులేదు. ఇకపై అలాంటి పరిస్థితి ఉండదు. ఎక్కడికంటే అక్కడకు తేలికగా తీసుకపోయే పోర్టబుల్ ఏసీలు కూడా అందుబాటులోకి వస్తున్నాయి. రాజస్థాన్‌కు చెందిన ‘ఇవాపోలార్’ సంస్థ ఇటీవల ‘ఇవాచిల్’ పేరుతో పోర్టబుల్ ఏసీని అందుబాటులోకి తెచ్చింది. చిన్నసైజు సూట్‌కేసు మాదిరిగానే దీనిని కోరుకున్న చోటుకు తేలికగా తీసుకుపోవచ్చు. ఆరుబయట కూడా దీనిని నిక్షేపంగా ఉపయోగించుకోవచ్చు. ఎయిర్ కూలర్ మాదిరిగానే దీనికి వాటర్ ట్యాంకు ఉంటుంది. దీనిని నింపుకోవలసి ఉంటుంది. గాలిలో తేమను వ్యాపింపజేసి, ఇది పరిసరాలను నిమిషాల్లోనే చల్లబరుస్తుంది. దీని ధర సైజును బట్టి రూ.15,669 నుంచి రూ.44,669 వరకు ఉంటుంది. చదవండి: ChatGPT: యూజర్లకు భారీ షాక్.. చాట్ జీపీటీకి కొత్త చిక్కులు! -
ఆ గ్రామానికి యజమాని కావాలట.. కారుచౌకగా అమ్మేస్తున్నారు!
స్పెయిన్ నైరుతి ప్రాంతంలోని ఒక ఊరు కారుచౌకగా అమ్మకానికి ఉంది. సాల్టో డి క్యాస్ట్రో అనే ఊరి ధర 2.60 లక్షల యూరోలు మాత్రమే! అంటే, రూ.2.24 కోట్లు అన్నమాట. బ్రిటన్‌లోని సగటు ఇంటి ధర కంటే ఈ ఊరి ధర చాలా తక్కువ. పోర్చుగీసు సరిహద్దుల్లో ఉన్న ఈ ఊరి నుంచి మాడ్రిడ్ నగరానికి మూడు గంటల్లో చేరుకోవచ్చు. ఈ ఊళ్లో 44 ఇళ్లు, ఒక హోటల్, ఒక చర్చి, ఒక స్కూలు, మునిసిపల్ స్విమింగ్ పూల్, బ్యారక్స్ బిల్డింగ్ ఉన్నాయి. ఇన్ని వసతులు ఉన్నా, ఈ ఊరు దాదాపు ముప్పయ్యేళ్లుగా ఖాళీగానే ఉంది. నిజానికి ఇక్కడ సాల్టో డి క్యాస్ట్రో ఊరిని ఒక విద్యుదుత్పాదక సంస్థ తన ఉద్యోగులు, కార్మికుల కోసం నిర్మించింది. ఊరికి దగ్గర్లోనే రిజర్వాయర్ ఉంది. ఇక్కడ జలవిద్యుత్తు ప్రాజెక్టు పూర్తికావడంతో, ఆ సంస్థలో పనిచేసే ఉద్యోగులు, కార్మికులు ఇక్కడి నుంచి తరలిపోయారు. అప్పటి నుంచి ఊరు ఖాళీగానే ఉంటోంది. జనాలు లేని ఈ ఊరిని తిరిగి జనావాసంగా మార్చడానికి ఇరవయ్యేళ్ల కిందటే స్పెయిన్ ప్రభుత్వ అధికారులు ప్రయత్నాలు చేసినా, అవేవీ సఫలం కాలేదు. చివరకు ఈ ఊరిని అమ్మేయాలని నిర్ణయించుకున్నారు. ఇదివరకు 6.5 మిలియన్ యూరోల (రూ.560.63 కోట్లు) ధర నిర్ణయించగా, కొనడానికి ఎవరూ రాలేదు. ఆ తర్వాత విడతల వారీగా ధర తగ్గిస్తూ వచ్చినా ఫలితం లేకపోయే సరికి, ఇప్పుడు కారుచౌకగా ఊరిని తెగనమ్మేందుకు సిద్ధపడ్డారు. -
అమ్మకానికి బంకర్.. అణుదాడి జరిగినా తప్పించుకోవచ్చు!
అంతర్యుద్ధ కాలానికి చెందిన బంకర్ ఒకటి కారుచౌకగా అమ్మకానికి వచ్చింది. అణుబాంబుల దాడి నుంచి తప్పించుకునే ఉద్దేశంతో కట్టుదిట్టంగా నిర్మించిన ఈ బంకర్ ఇంగ్లండ్‌లోని లింకన్‌షైర్‌కు చెందిన లెగ్బోర్న్ ప్రాంతంలో ఉంది. అంతర్యుద్ధ కాలానికి చెందిన చాలాబంకర్లు ఇటీవలి కాలంలో సెల్‌ఫోన్ టవర్లుగా రూపాంతరం చెందినా, లింకన్షైర్లోని ఈ బంకర్ మాత్రం యథాతథంగా నిలిచి ఉంది. దీనిని 1959లో నిర్మించారు. లోపల చూస్తే, ఇది ఒక సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్లా ఉంటుంది. ఒకవేళ అణుదాడి జరిగితే, అప్పుడు ముగ్గురు మనుషులు తలదాచుకోవడానికి వీలుగా ఇందులో ఒక ప్రత్యేక సొరంగం కూడా ఉంది. మార్క్ కోలెడ్జ్ అనే వ్యక్తి 2003లో దీనిని 12,500 పౌండ్లకు (రూ.11.65 లక్షలు) ఈ–బే వేలంలో సొంతం చేసుకున్నాడు. ఇప్పుడాయన దీనిని 25,000 పౌండ్లకు (రూ.23.31 లక్షలు) అమ్మకానికి పెట్టాడు. బాడీబ్యాగ్లు, గ్యాస్మాస్క్లు, అణుదాడులు జరిగినా పనిచేయగల ప్రత్యేకమైన రెడ్ టెలిఫోన్ వంటి సౌకర్యాలు ఉన్న ఈ బంకర్‌ను ఎవరు సొంతం చేసుకుంటారో చూడాలి! -
చౌక ధరలో జియో 5జీ స్మార్ట్‌ఫోన్
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో తొలి 5జీ స్మార్ట్‌ఫోన్‌ను ప్రవేశపెట్టేందుకు సిద్ధమైన జియో... అతి తక్కువ ధరకే ఈ ఫోన్లను కస్టమర్లకు అందించాలని భావిస్తోంది. కంపెనీ అధికారుల సమాచారం మేరకు... 5జీ స్మార్ట్‌ఫోన్ ధర రూ.5వేల లోపే ఉంటుందని, క్రమంగా ఈ ధరను రూ.2,500–3,000 స్థాయికి తగ్గించే విధంగా ప్రణాళికలను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. దేశంలో 2జీ కనెక్షన్లను వినియోగిస్తున్న 20 నుంచి 30 కోట్ల వినియోగదారుల లక్ష్యంగా ఈ 5జీ స్మార్ట్ఫోన్ల తయారీని జియో చేపట్టి్టంది. ప్రస్తుతం భారత్‌లో 5జీ స్మార్ట్‌ఫోన్ ప్రారంభ ధర రూ.27000లుగా ఉంది. భారత్‌ను 2జీ ఫ్రీ దేశంగా తీర్చేదిద్దడమే తమ లక్ష్యమని రిలయన్స్ చైర్మన్ ముకేశ్ కంపెనీ ఇటీవల జరిగిన 43వ వార్షికోత్సవంలో ఉద్ఘాటించిన సంగతి తెలిసిందే. చదవండి: (రెడ్మీ తొలి 5జీ స్మార్ట్ ఫోన్ వస్తోంది..) పాలసీ రేట్ల బదిలీకి ఎన్పీఏలు ఆటంకం ఆర్బీఐ అధికారుల చర్చా పత్రం వెల్లడి ముంబై: ఆర్బీఐ ఎప్పటికప్పుడు విధానపరమైన చర్యలను ప్రకటిస్తుండగా.. వీటి బదిలీకి బ్యాంకుల్లో అధిక మొండి బకాయిలు (ఎన్పీఏలు) ఆటంకంగా మారినట్టు ఆర్బీఐ అధికారులు రూపొందించిన డాక్యుమెంట్ వెల్లడించింది. ప్రభుత్వరంగ బ్యాంకుల్లోకి నిధులు జొప్పించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. డిజిటల్ మీడియాలో 26 % ఎఫ్‌డీఐ పరిమితి న్యూఢిల్లీ: డిజిటల్ మీడియా సంస్థల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) పరిమితులపై సందేహాలు తలెత్తిన నేపథ్యంలో కేంద్రం స్పష్టతనిచ్చింది. న్యూస్ అగ్రిగేటర్లు, డిజిటల్ మీడియా సంస్థలకు సమాచారం సరఫరా చేసే న్యూస్ ఏజెన్సీలు, వెబ్సైట్లలో న్యూస్.. కరెంట్ అఫైర్స్ మొదలైనవి అప్లోడ్ చేసే సంస్థలకు ఇది వర్తిస్తుందని వివరించింది. ఈ వివరణ ఇచ్చిన తేదీ నుంచి ఏడాది వ్యవధిలోగా 26 శాతం ఎఫ్‌డీఐ పరిమితులకు అనుగుణంగా ఆయా సంస్థలు సర్దుబాట్లు చేసుకోవాల్సి ఉంటుందని సూచించింది. ఈ నిబంధనలను పాటించాల్సిన బాధ్యత.. పెట్టుబడులను సమీకరించిన సంస్థలపైనే ఉంటుందని పేర్కొంది. ప్రభుత్వ అనుమతులతో ప్రింట్ మీడియా తరహాలోనే డిజిటల్ మీడియాలో కూడా ఎఫ్‌డీఐలపై పరిమితులను విధిస్తూ కేంద్రం గతేడాది ఆగస్టులో నిర్ణయం తీసుకుంది. -
‘చౌక ధర’ల్లోనే ఖరీదెక్కువ
పామాయిల్ మార్కెట్లోనే చౌక రేషన్ షాపుల్లో 750 ఎంఎల్ రూ. 63 బహిరంగ మార్కెట్లో లీటర్ రూ. 67 ఎల్లారెడ్డి : పేరుకు చౌక ధరల దుకాణం.. పామాయిల్ రేటు మాత్రం బహిరంగ మార్కెట్‌లోకంటే అధికం.. దీంతో రేషన్ షాపుల్లో పామారుుల్ తీసుకోవడానికి వినియోగదారులు ఆసక్తి చూపడం లేదు. అరుుతే డీలర్లు బలవంతంగా అంటగడుతున్నారని ఆరోపిస్తున్నారు. పేదలకు చౌకధరలకే నిత్యవసరాలను అందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం రేషన్‌దుకాణాలను ఏర్పాటు చేసింది. రూపారుుకి కిలో బియ్యం సరఫరా చేస్తోంది. దీంతో పాటు పలు వస్తువులను అందిస్తోంది. అరుుతే మిగతా వస్తువుల ధరలు బహిరంగ మార్కెట్లోనే తక్కువగా ఉండడం గమనార్హం. రేషన్ షాప్‌లలో విజయ పామారుుల్‌ను సరఫరా చేస్తున్నారు. ఒక్కో ప్యాకెట్ రూ. 63కు విక్రరుుస్తున్నారు. అరుుతే ఇది 750 మిల్లీలీటర్లే కావడం గమనార్హం. ఇదే కంపెనీకి సంబంధించిన లీటర్ ప్యాకెట్ బహిరంగ మార్కెట్లో రూ. 67కు లభిస్తోంది. డబుల్ ఫిల్టర్ చేయబడే ప్రైవేట్ కంపెనీల లీటర్ పామారుుల్ ప్యాకెట్ కూడా రూ. 68 ఉంది. ప్రభుత్వం రేషన్ షాపుల్లో అందించే పామారుుల్ ధర ఎక్కువగా ఉండడంతో వాటిని తీసుకోవడానికి ప్రజలు ఆసక్తి చూపడం లేదు. రేషన్ డీలర్లు సైతం వీటిని తెప్పించడానికి విముఖత చూపుతున్నారు. అరుుతే పౌరసరఫరాల శాఖ అధికారుల ఖచ్చితమైన ఆదేశాల మేరకు తప్పనిసరిగా పామారుుల్ ప్యాకెట్లు తీసుకోవాల్సి వస్తోందని ఉమ్మడి నిజామాబాద్ జిల్లా రేషన్ డీలర్ల సంఘం గౌరవ అధ్యక్షుడు నాగం సురేందర్ తెలిపారు. ఇదిలా ఉండగా చౌకధరల దుకాణాలలో బలవంతంగా విక్రరుుస్తున్న సబ్బులు, పప్పులు, ఉప్పు, టీ పొడి, అగ్గిపెట్టెలు తదితర వస్తువులతోనూ వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. నాణ్యతలేని ఈ వస్తువులను బలవంతంగా తమ నెత్తిన రుద్దుతున్నారని ఆరోపిస్తున్నారు. ఈ విషయమై పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తహసీల్దార్ బాలలక్ష్మిని వివరణ కోరగా.. ప్రభుత్వ రంగ సంస్థ అరుున విజయ పామారుుల్‌ను మాత్రమే చౌక ధరల దుకాణాలలో విక్రరుుస్తున్నామని, రేషన్ దుకాణాలలో విక్రరుుస్తున్న ఇతర వస్తువుల నాణ్యతలో తేడాలు ఉంటే చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. రేషన్ దుకాణాలలో వినియోగదారులు తమకు ఇష్టమైన వస్తువులనే తీసుకోవచ్చని, ఇందులో బలవంతం ఏమీ లేదని స్పష్టం చేశారు. పప్పులు, నూనెలు అంటగడుతున్నారు.. రేషన్ దుకాణాలలో ఇష్టమైన సామాన్లనే తీసుకోవచ్చని సార్లు చెబుతున్నరు. కానీ కంట్రోల్ దుకాణాలలో బలవంతంగా నూనెలు, పప్పులు అంటగడుతున్నారు. లేకపోతే బియ్యం ఇయ్యం అంటున్నరు. రేషన్ దుకాణాలలో ఇస్తున్న సామాన్లు నాసిరకంవి ఉంటున్నై. మార్కెట్‌లోకంటే ఇక్కడే ఎక్కువ ధర ఉంది. - పోచయ్య, వినియోగదారుడు, ఎల్లారెడ్డి -
దూరం.. భారం
ఇసుక బంగారమే! సాక్షి, కర్నూలు: ఇసుక ధర అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం నిర్వహణ బాధ్యత డ్వాక్రా సంఘాలకు అప్పగించేందుకు నిర్ణయించడం తెలిసిందే. ఫలితంగా ఇసుక చౌక ధరకు లభించే అవకాశం ఏర్పడినా.. దూర ప్రాంత ప్రజలకు రవాణా ఖర్చు తడిసి మోపెడు కానుంది. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఇసుక వ్యాపారంలో అత్యంత చురుగ్గా వ్యవహరిస్తున్న డ్వాక్రా సంఘాలకు ప్రాధాన్యతనిచ్చేందుకు తీర్మానించారు. ఆ మేరకు ఇప్పటికే పలు సంఘాలకు బాధ్యతలు కట్టబెట్టారు. జిల్లాలోని జి.సింగవరం-ఎదురూరు, నిడ్జూరు-బావాపురం, మంత్రాలయం పరిధిలో ఇసుక తవ్వకాలకు మూడు రీచ్‌లను ఎంపిక చేశారు. త్వరలోనే సంఘాల ఆధ్వర్యంలో ఇసుక తవ్వకాలకు రంగం సిద్ధమైంది. పశ్చిమ గోదావరి జిల్లా తరహాలో ఇక్కడా అదే పాలసీని అమలు చేసేందుకు జిల్లా నుంచి ఓ టీం అధ్యయనం చేసి వచ్చింది. పర్యావరణ అనుమతులు కూడా పూర్తి కావడంతో ఇక తవ్వకాలకు అధికార యంత్రాంగం ఆగమేఘాల మీద ఏర్పాట్లు చేస్తోంది. మొత్తం 3.40 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక తవ్వకానికి అనుమతి లభించింది. జి.సింగవరం-ఎదురూరు రీచ్, నిడ్జూరు-బావాపురం రీచ్‌లలో 50వేల క్యూబిక్ మీటర్లు చొప్పున.. మంత్రాలయం రీచ్‌లో 2.40 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక తవ్వుకునే వీలుంది. ఇసుక ధర నిర్ణయంపై కసరత్తు జరుగుతోంది. అయితే అధికార వర్గాల సమాచారం మేరకు క్యూబిక్ మీటరు ఇసుకను రూ.650లకు విక్రయించనున్నట్లు తెలిసింది. ఈ లెక్కన యూనిట్ ఇసుక ధర రూ.2వేలు పలకనుంది. ఒక లారీలో రెండు యూనిట్ల ఇసుక తరలిస్తే రూ.4వేలు చెల్లించాల్సి ఉంటుంది. వినియోగదారులకు ఇదేమీ భారం కాకపోయినా.. రవాణా చార్జీ కాస్త ఇబ్బంది కానుంది. జిల్లా అధికారులు కిలోమీటరుకు రూ.65 చొప్పున ధర నిర్ణయించాలని భావిస్తున్నారు. ఆ మేరకు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న వారు రెండు యూనిట్లకు రూ.2వేలు అధనంగా భరించాల్సి ఉంటుంది. ఇంతవరకు బాగానే ఉన్నా.. నంద్యాల, ఆళ్లగడ్డ ప్రాంతాలకు నిడ్జూరు-బావాపురం రీచ్ 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. అంటే ఆయా ప్రాంతాల ప్రజలు రవాణా చార్జీలే రూ.6500 పైగా భరించాల్సిన పరిస్థితి. ఈ మొత్తానికి ఇసుక ధర కలిపితే రెండు యూనిట్ల ఇసుక రవాణాకు రూ.10,500 వెచ్చించాల్సి రావడం గమనార్హం. ఇదిలాఉంటే మంత్రాలయంలో రీచ్‌ను నిర్ణయించినా ఆ ప్రాంతంలో ప్రజల తాగునీటి అవసరాలకు నిర్మించిన పథకం ఉండటంతో ఇసుక తవ్వకాలు ఎలా సాధ్యమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ విషయంలో స్పష్టత వచ్చే వరకు తవ్వకాలకు అనుమతి అసాధ్యమని తెలుస్తోంది. అదే జరిగితే ఆదోని డివిజన్లోని ప్రజలకూ ఇసుక బంగారం కానుంది. ప్రభుత్వ తాజా విధానం పరిశీలిస్తే.. ఇసుక అవసరమైన వినియోగదారులు మీసేవ కేంద్రంలో దరఖాస్తు చేసుకుంటే, మహిళా సంఘాలు రవాణా చార్జీలు కలుపుకొని ఇసుక సరఫరా చేయనున్నాయి. ఆన్లైన్ బుకింగ్ కావడంతో ఎక్కడి నుంచైనా దరఖాస్తు చేసుకునే వెలసుబాటు ఉంది. ఇసుక రవాణాకు ప్రత్యేకంగా వాహనాలు ఏర్పాటు చేసి వీటికి ప్రభుత్వ స్టిక్కర్లు అతికిస్తామని.. భవిష్యత్‌లో జీపీఎస్‌కు అనుసంధానం చేయనుండటంతో ఇసుక అక్రమ రవాణాకు ఆస్కారం ఉండబోదని అధికారులు పేర్కొంటున్నారు. మొత్తంగా రవాణా చార్జీల విషయంలో ప్రభుత్వం పునరాలోచించకపోతే దూర ప్రాంత వినియోగదారులు ఆర్థికంగా నష్టపోవాల్సిందే. -
25,550కు చేరిన సెన్సెక్స్
ఆర్థిక వ్యవస్థ పురోగమిస్తున్న సంకేతాలతో స్టాక్ మార్కెట్లకు జోష్వచ్చింది. చౌక ధరల గృహాలు, ఇన్ఫ్రా ఫైనాన్సింగ్‌కు ఆర్బీఐ మరింత వెసులుబాటును కల్పించడం దీనికి జత కలిసింది. వెరసి సెన్సెక్స్ గత రెండు వారాల్లోలేని విధంగా 321 పాయింట్లు ఎగసింది. వారం రోజుల గరిష్టం 25,550 వద్ద ముగిసింది. ఇంతక్రితం జూలై 2న మాత్రమే సెన్సెక్స్ ఈ స్థాయిలో 325 పాయింట్లు పుంజుకుంది. ఇక నిఫ్టీ కూడా 98 పాయింట్లు జంప్‌చేసి 7,624 వద్ద నిలిచింది. ద్రవ్యోల్బణం క్షీణించడం, పారిశ్రామికోత్పత్తి పుంజుకోవడానికితోడు తాజాగా ఎగుమతులు పురోగమించడంతో ఇన్వెస్టర్లకు ప్రోత్సాహం లభిస్తున్నదని విశ్లేషకులు పేర్కొన్నారు. దీంతో రెండు రోజుల్లో సెన్సెక్స్ 543 పాయింట్లు జమ చేసుకుందని చెప్పారు. చౌక ధరల గృహాలు, మౌలిక సదుపాయాల ప్రాజెక్ట్‌ల ఫైనాన్సింగ్ నిబంధనలను ఆర్బీఐ సరళీకరించడంతో రియల్టీ ఇండెక్స్ 4.3% జంప్‌చేయగా, మెట ల్, బ్యాంకింగ్ రంగాలు సైతం 2.5% స్థాయిలో పురోగమించాయి. ఐడీఎఫ్సీ దూకుడు ఇన్ఫ్రా ఫైనాన్స్‌కు లభించిన ప్రోత్సాహంతో ఐడీఎఫ్సీ దాదాపు 9% ఎగసింది. ఇన్ఫ్రా షేర్లు ఐఆర్బీ, జేపీ అసోసియేట్స్, పుంజ్‌లాయిడ్, ఐవీఆర్సీఎల్, జీవీకే పవర్, ల్యాంకో ఇన్ఫ్రా, జీఎంఆర్ ఇన్ఫ్రా, ఎల్అండ్టీ 6-2% మధ్య పుంజుకున్నాయి. రియల్టీలో కోల్టేపాటిల్, యూనిటెక్, డీఎల్ఎఫ్, ఒబెరాయ్, అనంత్‌రాజ్, ఇండియాబుల్స్, హెచ్‌డీఐఎల్, గోద్రెజ్ ప్రాపర్టీస్, మహీంద్రా లైఫ్ 8-3% మేరు పెరిగాయి. బ్యాంకింగ్‌లో ఐసీఐసీఐ, యాక్సిస్, బీఓఐ, ఎస్బీఐ, కెనరా, యస్ బ్యాంక్ 5-2% మధ్య లాభపడ్డాయి. మెటల్లో హిందాల్కో, టాటా స్టీల్, సెసాస్టెరిలైట్, జిందాల్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ 4-2% మధ్య పెరిగాయి. ఆటో దిగ్గజాలు మారుతీ, ఎంఅండ్ఎం, టాటా మోటార్స్ సైతం 2% స్థాయిలో బలపడ్డాయి. బీఎస్ఈలో అన్ని రంగాలూ లాభపడగా... సెన్సెక్స్‌లో కేవలం5షేర్లు అదికూడా నామమాత్రంగా నష్టపోయాయి. మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్స్‌లు 1.5%, 2% ఎగశాయి. ట్రేడైన షేర్లలో 1,990 లాభపడితే, 952 నష్టపోయాయి. -
రైతులే బలి
సాక్షి, కర్నూలు: కొత్త మార్కెట్‌యార్డు నిర్మాణం రైతులకు శాపంగా మారుతోంది. ప్రజా ప్రయోజనాలను అధికారులు పూర్తిగా విస్మరిస్తున్నారు. నాయకుల ఆదేశాలే వీరికి వేదవాక్కుగా మారుతున్నాయి. ఎవరికీ ఎలాంటి ఇబ్బంది లేని విధంగా సమస్య పరిష్కారానికి అవకాశం ఉన్నా.. ఆ దిశగా ప్రయత్నించకపోవడం విమర్శలకు తావిస్తోంది. కర్నూలు నగరంలో ఆర్టీసీ బస్టాండ్ ఎదుటనున్న మార్కెట్ యార్డును రద్దీతో పాటు పెరుగుతున్న అవసరాలను దృష్టిలో ఉంచుకొని నగర శివారులోకి మార్పు చేయాలని నిర్ణయించారు. ఇందుకు ప్రభుత్వం అనుమతివ్వడంతో పనులు ఊపందుకున్నాయి. ఈ నెల 5వ తేదీన భూమి పూజకు రంగం సిద్ధమవుతోంది. ఉల్చాల రోడ్డులోని పెద్దపాడు గ్రామం వద్ద 113 ఎకరాల విస్తీర్ణంలో కొత్త యార్డు నిర్మాణానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఈ ప్రాంతంలోని భూముల ధర రూ.కోట్లలో ఉండగా.. ప్రస్తుతం అతి తక్కువ ధరతో సేకరణకు ప్రయత్నాలు కొనసాగుతుండటాన్ని రైతులు జీర్ణించుకోలేకపోతున్నారు. వాస్తవానికి లక్ష్మీపురం గ్రామంలోని సర్వే నంబర్.1లో 100 ఎకరాల సీలింగ్ భూమి మార్కెట్ యార్డు నిర్మాణానికి అనుకూలమని గతంలో అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. కానీ, ప్రజాప్రతినిధుల జోక్యంతో నిర్మాణం పెద్దపాడు ప్రాంతానికి మారింది. ఈ మేరకు అధికారులు కొత్త యార్డు నిర్మాణంలో భాగంగా భూ సేకరణకు ఉపక్రమిస్తున్నారు. కోడుమూరు నియోజకవర్గం మునగాలపాడు పరిధిలోకి వచ్చే సర్వే నంబర్ 197లో ఉన్న 14.69 ఎకరాలతో పాటు పాణ్యం నియోజకవర్గ పరిధిలోని 94, 95, 96, 97, 98, 99, 100, 103 నుంచి 107 సర్వే నంబర్లలో యార్డు నిర్మాణం చేపట్టేందుకు.. దారి కోసం 101, 111, 141, 142, 143, 147 సర్వే నంబర్లను పరిశీలిస్తున్నారు. బహిరంగ మార్కెట్లో ఎకరా భూమి ధర కోటి రూపాయల పైమాటేనని రైతులు చెబుతున్నారు. ఇక్కడికి సమీపంలోని ఓ ఎకరా పొలం ఇటీవల రూ.35 లక్షలకు రిజిస్టర్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ప్రజావసరాల నిమిత్తం భూములు సేకరించే సమయంలో నిబంధనల ప్రకారం నోటిఫికేషన్‌కు మూడేళ్ల క్రితం జరిగిన రిజిస్ట్రేషన్ విలువలను భూసేకరణ అధికారి పరిగణనలోకి తీసుకుంటారు. ఆ ప్రకారం భూముల ధర నిర్ణయించాల్సి ఉంది. అయితే ప్రస్తుత వ్యవహారం అందుకు భిన్నంగా సాగుతున్నట్లు సమాచారం. ఒకవేళ గత మూడేళ్లలో రిజిస్ట్రేషన్ విలువ అధికంగా ఉంటే.. బూస్ట్సేల్గా చూపి భూములను వీలైనంత తక్కువ ధరకే కొనుగోలు చేసేందుకు అధికారులు శతవిధాల ప్రయత్నిస్తున్నారనే చర్చ జరుగుతోంది. విషయం తెలుసుకున్న రైతులు కొందరు కోర్టును ఆశ్రయించేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో అధికారులు సంబంధిత రైతులతో చర్చలకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. నయానో భయానో వారిని ఒప్పించి ముందుగానే అంగీకార పత్రాలు తీసుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. ఏదేమైనా రైతుల కోసం నిర్మిస్తున్న మార్కెట్‌కు అదే రైతులను బలి పెట్టడం ఎంతవరకు సమంజసమని పలువురు ప్రశ్నిస్తున్నారు.