‘చౌక ధర’ల్లోనే ఖరీదెక్కువ
పామాయిల్ మార్కెట్‌లోనే చౌక
రేషన్ షాపుల్లో 750 ఎంఎల్ రూ. 63
బహిరంగ మార్కెట్‌లో లీటర్ రూ. 67
ఎల్లారెడ్డి : పేరుకు చౌక ధరల దుకాణం.. పామాయిల్ రేటు మాత్రం బహిరంగ మార్కెట్‌లోకంటే అధికం.. దీంతో రేషన్ షాపుల్లో పామారుుల్ తీసుకోవడానికి వినియోగదారులు ఆసక్తి చూపడం లేదు. అరుుతే డీలర్లు బలవంతంగా అంటగడుతున్నారని ఆరోపిస్తున్నారు.
పేదలకు చౌకధరలకే నిత్యవసరాలను అందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం రేషన్‌దుకాణాలను ఏర్పాటు చేసింది. రూపారుుకి కిలో బియ్యం సరఫరా చేస్తోంది. దీంతో పాటు పలు వస్తువులను అందిస్తోంది. అరుుతే మిగతా వస్తువుల ధరలు బహిరంగ మార్కెట్‌లోనే తక్కువగా ఉండడం గమనార్హం. రేషన్ షాప్‌లలో విజయ పామారుుల్‌ను సరఫరా చేస్తున్నారు. ఒక్కో ప్యాకెట్ రూ. 63కు విక్రరుుస్తున్నారు. అరుుతే ఇది 750 మిల్లీలీటర్లే కావడం గమనార్హం. ఇదే కంపెనీకి సంబంధించిన లీటర్ ప్యాకెట్ బహిరంగ మార్కెట్‌లో రూ. 67కు లభిస్తోంది. డబుల్ ఫిల్టర్ చేయబడే ప్రైవేట్ కంపెనీల లీటర్ పామారుుల్ ప్యాకెట్ కూడా రూ. 68 ఉంది. ప్రభుత్వం రేషన్ షాపుల్లో అందించే పామారుుల్ ధర ఎక్కువగా ఉండడంతో వాటిని తీసుకోవడానికి ప్రజలు ఆసక్తి చూపడం లేదు. రేషన్ డీలర్లు సైతం వీటిని తెప్పించడానికి విముఖత చూపుతున్నారు. అరుుతే పౌరసరఫరాల శాఖ అధికారుల ఖచ్చితమైన ఆదేశాల మేరకు తప్పనిసరిగా పామారుుల్ ప్యాకెట్లు తీసుకోవాల్సి వస్తోందని ఉమ్మడి నిజామాబాద్ జిల్లా రేషన్ డీలర్ల సంఘం గౌరవ అధ్యక్షుడు నాగం సురేందర్ తెలిపారు. ఇదిలా ఉండగా చౌకధరల దుకాణాలలో బలవంతంగా విక్రరుుస్తున్న సబ్బులు, పప్పులు, ఉప్పు, టీ పొడి, అగ్గిపెట్టెలు తదితర వస్తువులతోనూ వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు.
నాణ్యతలేని ఈ వస్తువులను బలవంతంగా తమ నెత్తిన రుద్దుతున్నారని ఆరోపిస్తున్నారు. ఈ విషయమై పౌర సరఫరాల శాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్ డిప్యూటీ తహసీల్దార్ బాలలక్ష్మిని వివరణ కోరగా.. ప్రభుత్వ రంగ సంస్థ అరుున విజయ పామారుుల్‌ను మాత్రమే చౌక ధరల దుకాణాలలో విక్రరుుస్తున్నామని, రేషన్ దుకాణాలలో విక్రరుుస్తున్న ఇతర వస్తువుల నాణ్యతలో తేడాలు ఉంటే చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. రేషన్ దుకాణాలలో వినియోగదారులు తమకు ఇష్టమైన వస్తువులనే తీసుకోవచ్చని, ఇందులో బలవంతం ఏమీ లేదని స్పష్టం చేశారు.
పప్పులు, నూనెలు అంటగడుతున్నారు..
రేషన్ దుకాణాలలో ఇష్టమైన సామాన్లనే తీసుకోవచ్చని సార్లు చెబుతున్నరు. కానీ కంట్రోల్ దుకాణాలలో బలవంతంగా నూనెలు, పప్పులు అంటగడుతున్నారు. లేకపోతే బియ్యం ఇయ్యం అంటున్నరు. రేషన్ దుకాణాలలో ఇస్తున్న సామాన్లు నాసిరకంవి ఉంటున్నై. మార్కెట్‌లోకంటే ఇక్కడే ఎక్కువ ధర ఉంది. - పోచయ్య, వినియోగదారుడు, ఎల్లారెడ్డి