Ration shop
-
టీడీపీ ఆఫీస్ లో రేషన్ షాప్..!
-
టీడీపీ ఆఫీస్‌లో రేషన్ షాప్!.. పచ్చనేతల బరితెగింపు
సాక్షి, అనంతపురం: అనంతపురం జిల్లాలో టీడీపీ నేతల బరితెగింపు తారాస్థాయికి చేరుకున్నాయి. ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అనుచరులు టీడీపీ కార్యాలయంలో రేషన్ షాప్ ఏర్పాటు చేశారు. పార్టీలకు అతీతంగా ప్రజలకు సంక్షేమ పథకాల్ని అందించాలి. కానీ టీడీపీ నేతలు మాత్రం అందుకు విరుద్ధంగా పార్టీ కార్యాలయాన్ని రేషన్ కేంద్రంగా మార్చడంపై విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి. టీడీపీ కార్యాలయం నుంచి బియ్యం, నిత్యావసర వస్తువులు పంపిణీ చేస్తున్న వైనంపై జనం ముక్కున వేలేసుకుంటున్నారు. విధిలేని పరిస్థితుల్లో పేదలు టీడీపీ కార్యాలయానికి వెళ్లి రేషన్ తెచ్చుకుంటున్నారు. అయితే, టీడీపీ కార్యాలయంలో రేషన్ షాప్ నిర్వహిస్తున్నా సివిల్ సప్లైస్ అధికారులు పట్టించుకోవడం లేదు. ప్రస్తుతం, టీడీపీ ఆఫీస్‌లో రేషన్ షాపు నిర్వహణ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. -
పచ్చ పచ్చాని దారిలో సాగిపోదామా..
కనువిందు చేసే పచ్చని చెట్లు... బడలికను పోగొట్టే చల్లగాలి... ఎవరైనా సరే ఆ మార్గంలో ఒకసారి ప్రయాణిస్తే ఫిదా అవ్వాల్సిందే. మళ్లీ మళ్లీ ఆ దారిలో వెళ్లాలనే కోరిక తట్టాల్సిందే. రహదారికి పచ్చటి తోరణం కట్టినట్లుండి.. వాటి కిందకు వెళ్లగానే ఏదో గుహలోకి ప్రవేశించినట్లుగా కలిగే అనుభూతి ప్రయాణికులను కొద్దిసేపు అక్కడ ఆగేలా చేస్తోంది. అనంతపురం జిల్లా గార్లదిన్నె నుంచి మిడ్‌పెన్నార్ డ్యాంకు వెళ్లే మార్గంలో రోడ్డుకిరువైపులా చెట్లు ప్రయాణికులను ఎంతగానో ఆకర్షిస్తున్నాయి. – సాక్షి ఫొటోగ్రాఫర్, అనంతపురంగుంటూరు జిల్లా ప్రత్తిపాడు పరిసర ప్రాంతాలు అంటే గుర్తుకువచ్చేది పత్తి, మిర్చి సాగు. దశాబ్దాలుగా ఇవే పంటలు ఈ ప్రాంతంలో సాగుచేస్తుంటారు. కానీ ఇటీవల ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి సారిస్తున్నారు. అందులో భాగంగానే బంతి పూల తోటలు కూడా సాగుచేశారు. గుంటూరు పర్చూరు పాత మద్రాసు రోడ్డు వెంబడి పుల్లడిగుంట సమీపంలో పండించిన బంతి పూలు పసుపు, ఆరెంజ్ రంగుల్లో చూపరులను ఆకర్షిస్తున్నాయి.నిత్యం అలలతో ఎగసి పడే సంద్రం.. వెనక్కు తగ్గింది. ఇప్పటి వరకు అలల మాటున ఉన్న శిలలు అందమైన ఆకృతులతో సరికొత్తగా పరిచయం చేసుకున్నాయి. వాతావరణ మార్పులతో సముద్రం వెనక్కు వెళ్లడంతో విశాఖ బీచ్‌లోని వైఎంసీఏ ప్రాంతంలో నల్లని రాళ్లు కనువిందు చేశాయి. దీంతో సందర్శకులు సెల్ఫీలు, ఫొటోలు తీసుకుంటూ సందడి చేశారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, విశాఖపట్నం కాకినాడ జిల్లా తుని పట్టణంలోని ఓ రైతుకు చెందిన నాటుకోడి అతి చిన్న గుడ్డు పెట్టడం పలువురిని ఆశ్చర్యానికి గురి చేసింది. రైతు గండి రమణ నాటు కోళ్లు పెంచుతున్నారు. ఇందులో ఒక పెట్ట ముందు రోజు సాధారణ పరిమాణం కలిగిన గుడ్డు పెట్టగా.. మంగళవారం చిన్న గుడ్డు పెట్టింది. జన్యుపరమైన లోపం వల్ల ఇలా జరుగుతుందని పశు వైద్యుడు శ్రీధర్ చెప్పారు.విశాఖ కేంద్ర కారాగారం ఆవరణలో సీజనల్ పంటలు పండిస్తున్నారు. ప్రస్తుతం శీతాకాలం కూరగాయల పంటలు ప్రారంభమయ్యాయి. కొన్ని కాపు దశకు వచ్చాయి. జైలులో ఉండే ఓపెన్ ఎయిర్ ఖైదీలచే రసాయనిక ఎరువుల్లేకుండా అధికారులు ఇక్కడ పంటలు పండిస్తుంటారు. జైలు లోపల మామిడి, కొబ్బరితోపాటు, బయట ఆవరణ సుమారు 20 ఎకరాల్లో సీజనల్ పంటలు పండించి వాటిని ఖైదీలకు వినియోగిస్తుంటారు. మిగిలిన వాటిని జైలు గేటు ముందు బీఆర్టీఎస్ పక్కన సుధార్ కేంద్రంలో విక్రయిస్తుంటారు. ప్రస్తుతం వంగ, బీర, క్యాబేజీ, టమాటా, ఆనప (సొర) సాగు చేస్తున్నారు. ఈ పంటలతో జైలు ఆవరణ అన్ని కాలాల్లోను పచ్చదనంతో కళకళలాడుతోంది.తాగునీటి కోసం మహిళలు రోడ్డెక్కిన ఘటన సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలోని రామకుప్పం మండలంలో మంగళవారం చోటుచేసుకుంది. మండలంలోని వీర్నమల ఎస్సీ కాలనీలో మూడు నెలలుగా తాగునీటి సమస్యతో సతమతమవుతున్నామని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ రోడ్డెక్కారు. ఎస్సీ కాలనీలో ఉన్న బోరులో నీరు ఇంకిపోవడంతో తాగునీటి సమస్య తీవ్రరూపం దాల్చిందని, డబ్బులిచ్చి నీళ్లు కొనుక్కోవాల్సిన ఖర్మ పట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులకు ఎన్నిసార్లు చెప్పిన పట్టించుకోకపోవడంతో వారంతా ఖాళీ బిందెలతో ఆంధ్ర–తమిళనాడు సరిహద్దు రోడ్డుపై ఆందోళనకు దిగారు. ఈ కారణంగా వాహన రాకపోకలకు అంతరాయం కలిగింది.చౌక దుకాణాల వద్ద రేషన్ కోసం లబ్ధిదారులు గంటల తరబడి క్యూలో నిల్చోవాల్సిన పరిస్థితి మళ్లీ ఎదురైంది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ పాలనలో ఇంటి వద్దకే రేషన్ పథకాన్ని అమలు చేసింది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జిల్లాల్లో ఈ వ్యవహారాన్ని తూతూ మంత్రంగా నిర్వహిస్తున్నారు. చిత్తూరులోని 27వ వార్డు చామంతిపురం రేషన్‌షాపు వద్ద మంగళవారం ప్రజలు రేషన్ కోసం గంటల కొద్దీ పడిగాపులు కాశారు. గంటల కొద్దీ నిలబడలేక తాము తెచ్చుకున్న సంచులను వరుస క్రమంలో పెట్టారు. సమీపంలోని 28వ వార్డులో, మరికొన్ని మండలాల్లో సైతం ఇదే పరిస్థితులు ఉన్నట్లు సమాచారం. దీంతో ప్రజలు గత ప్రభుత్వ పాలనే బాగుందని వ్యాఖ్యానిస్తున్నారు. చదవండి: ఆంధ్రప్రదేశ్ తీర రేఖ పొడవు 1,027.58 కిలో మీటర్లు -
ఐఏఎస్సా.. అయితే..?
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ‘మేం అధికారంలో ఉన్నాం. మా షాపులు తనిఖీ చేస్తారా.. ఎంత ధైర్యం.. మా జోలికొస్తే ఊరుకోం..’ ఇవి ఏ ఉద్యోగినో, చిన్న అధికారినో ఉద్దేశించి అన్న మాటలు కాదు. సాక్షాత్తు ఐఏఎస్ అధికారి అయిన సబ్ కలెక్టర్‌ను ఉద్దేశించి అన్న మాటలు. ‘ఐఏఎస్ అధికారి అయితే మాత్రం మా షాపుల్ని తనిఖీ చేస్తారా? తమాషాలు చేస్తున్నారా?..’ అంటూ తెలుగుదేశం నాయకులు ప్రకాశం జిల్లా మార్కాపురం సబ్ కలెక్టర్ రాహుల్ మీనాను అడ్డుకున్నారు. దీంతో ఆయన మౌనంగా వెనుదిరిగారు. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో గురువారం రాత్రి జరిగిన ఈ సంఘటన తీవ్ర చర్చనీయాంశమైంది. తెలుగుదేశం నేతల బరితెగింపుపై అధికార యంత్రాంగంలోను, ప్రజల్లోను తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. ఆవు చేలో మేస్తుంటే.. దూడ గట్టున మేస్తుందా.. అన్నట్లు రాష్ట్రంలో లోకేశ్ రెడ్‌బుక్ రాజ్యాంగం నడుస్తుంటే.. నియోజకవర్గస్థాయిలో తెలుగుదేశం నేతలు అదేరీతిలో రెచి్చపోయి వ్యవహరిస్తున్నారు. మార్కాపురం సబ్ కలెక్టర్ రాహుల్ మీనా గురువారం రాత్రి 10 గంటల సమయంలో యర్రగొండపాలెం నియోజకవర్గ కేంద్రంలో రేషన్ దుకాణాల తనిఖీకి వచ్చారు. సిబ్బందితో కలిసి పలు షాపుల్ని తనిఖీ చేశారు. తొలుత వైఎస్సార్సీపీ సానుభూతిపరులకు చెందిన రేషన్ దుకాణాలను పరిశీలించారు. అనంతరం టీడీపీ సానుభూతిపరులకు చెందిన దుకాణాల తనిఖీకి వెళ్లారు. దీంతో టీడీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సబ్ కలెక్టర్ మీనాను ఉద్దేశించి తీవ్రపదజాలంతో వ్యాఖ్యలు చేశారు. ‘మేం అధికారంలోకి వచ్చి నెలకాకముందే మా రేషన్ దుకాణాల్లోనే తనిఖీ చేస్తారా..’ అంటూ నిలదీశారు. ‘ఏం? ఐఏఎస్ అధికారి అయితే మాత్రం తమాషా చేస్తున్నారా..’ అంటూ మరికొందరు దూషణలకు దిగారు. పక్కనే ఉన్న పోలీసు అధికారులను కూడా దూషించారు. టీడీపీ నేతల తీరుతో తీవ్ర మనస్తాపానికి గురైన సబ్ కలెక్టర్ తనిఖీలు నిలిపేసి వెళ్లిపోయారు. అడ్డుకున్నది అధికార పార్టీ నేతలు కావడంతో తమ విధులకు ఆటంకం కలిగించారంటూ ఒక్క అధికారి కూడా కనీసం ఫిర్యాదు చేయలేదు. బ్లాక్ మార్కెట్‌కు బియ్యం టీడీపీ సానుభూతిపరుల దుకాణాల నుంచి రేషన్ బియ్యం పెద్ద ఎత్తున బ్లాక్ మార్కెట్‌కు తరలిపోయిందని, అందుకే ఆ పార్టీ నేతలు తనిఖీలను అడ్డుకున్నారని తెలిసింది. టీడీపీకి చెందినవారి షాపులకు ఒక్కోదానికి సుమారు 30 క్వింటాళ్ల బియ్యం తక్కువ దిగుమతి అయినట్లు తెలిసింది. పేదలకు అందాల్సిన ఈ బియ్యాన్ని స్టాక్‌పాయింట్ నుంచే నల్లబజారుకు తరలించి సొమ్ముచేసుకున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. సబ్ కలెక్టర్ తనిఖీలో ఈ బండారం బయటపడుతుందనే భయంతోనే టీడీపీ నేతలు షాపుల తనిఖీనే అడ్డుకున్నారని తెలిసింది. అందుకే సబ్ కలెక్టరును కూడా లెక్కచేయకుండా ఎదిరించినట్లు భావిస్తున్నారు. తనిఖీకి వచ్చిన సబ్ కలెక్టర్, పోలీసు అధికారులపై టీడీపీ నేతలు విరుచుకుపడిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తున్నా జిల్లా యంత్రాంగం కనీసం స్పందించలేదు. ఇప్పటికైనా కలెక్టర్ స్పందించి దీనిపై సమగ్ర విచారణ జరిపి అధికారుల విధులకు ఆటంకం కలిగించి, దౌర్జన్యానికి పాల్పడిన టీడీపీ నేతలపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. -
రేషన్ షాపుల్లో సన్నబియ్యం ఇచ్చేలా ప్రణాళికలు: మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిa
హుజూర్నగర్ (సూర్యాపేట): రాష్ట్రంలో రేషన్ షాపుల్లో పూర్తిస్థాయిలో సన్న బియ్యం ఇచ్చేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి వెల్లడించారు. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్, కోదాడ నియోజకవర్గాల్లో కొనసా గుతున్న అభివృద్ధి పనులపై ఆర్ అండ్ బీ, పంచాయతీరాజ్, విద్యుత్ శాఖల అధికారులతో ఆది వారం హుజూర్‌నగర్‌లోని మంత్రి క్యాంప్ కార్యాల యంలో ఎమ్మెల్యే పద్మావతితో కలిసి సమీక్ష నిర్వ హించారు.అనంతరం ఆయన విలేకరులతో మా ట్లాడుతూ... ఉమ్మడి ఏపీలో ఏర్పాటైన లిఫ్టుల్లో పని చేయని వాటిని పూర్తి సామర్థ్యంతో నడిచే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నామ న్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో కోట్ల రూపా యలతో లిఫ్టులు మంజూరు చేశారు కానీ వాటిని సరిగ్గా నిర్వహించలేదని ఆరోపించారు. అటువంటి వాటిని సరిగ్గా నిర్వహించేందుకు, మరమ్మతులు చేపట్టేందుకు ప్రతి మూడు నాలుగు లిఫ్టులకు కలిపి ఫిట్టర్ ఆపరే టర్‌తో పాటు ఎలక్ట్రీషియన్‌ను కూడా నియమించే ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో నీటి సౌకర్యం ఉండి లిఫ్టులు లేని ప్రాంతాల్లో లిఫ్టులు మంజూరు చేయిస్తామని, అలాగే నూతన ఆయకట్టు సామర్థ్యాన్ని పెంచే ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. -
Ration Rice: వేలి ముద్ర వెయ్యి.. పైసలు తీసుకో.. కిలో రూ.8 నుంచి 10
రేషన్ డీలర్ నుంచి మిల్లర్ వరకు అక్రమ దందా ప్రతి నెలా వందల కోట్లలో వ్యాపారం వరకు ఇచ్చి కొనుగోలు డీలర్ల వద్ద, గ్రామాల్లో మహిళల నుంచి రూ.10 వరకు ఇచ్చి కొంటున్న దళారులు దళారుల వద్ద కొని పొరుగు రాష్ట్రాల్లో రూ.20 వరకు విక్రయిస్తున్న పెద్ద వ్యాపారులు రేషన్ బియ్యాన్ని కొని రీసైక్లింగ్ చేసి.. కస్టమ్ మిల్లింగ్ రైస్ కింద ప్రభుత్వానికి అప్పగిస్తున్న కొందరు మిల్లర్లు మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని ఓ గ్రామం రేషన్ దుకాణానికి ఓ మహిళ వచ్చి డీలర్‌కు ఆహార భద్రతా కార్డు ఇచ్చింది. డీలర్: అమ్మా బియ్యం ఇయ్యాల్నా.. పైసలా.. మహిళ: ఒక్కలకు ఎన్ని కిలోల బియ్యం ఇత్తండ్రు డీలర్:10 కిలోలు మహిళ: మా కార్డుల ఐదుగురం ఉన్నం గద. పైసలే ఇయ్యి డీలర్: యేలి ముద్ర ఎయ్యమ్మా... కిలకు ఎనిమిది (రూ.8) లెక్కన నాలుగు వందలిస్త మహిళ: సరేనయ్య.. పైసలియ్యి వచ్చిన మహిళ వేలిముద్ర వేయగానే... సదరు డీలర్ 50 కిలోల బియ్యం తూకం వేసి, ఆ బియ్యాన్ని పక్కకు పెట్టి ఆమెకు రూ.400 ఇచ్చాడు. సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) ద్వారా పేదలకు అందాల్సిన బియ్యం 80 శాతం వరకు పక్కదారి పడుతోంది. రూపాయికి కిలో చొప్పున కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న ఈ బియ్యాన్ని రూ.8 నుంచి రూ.15 వరకు వెచ్చించి కొనుగోలు చేస్తున్న ముఠాలు ప్రతి నెలా వందల కోట్ల రూపాయల దందా సాగిస్తున్నాయి. హైదరాబాద్ మహానగరం మొదలుకొని పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా ఈ దందా యథేచ్ఛగా కొనసాగుతోంది. రేషన్ దుకాణం నుంచి మొదలయ్యే ఈ దందా మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్‌లలో ముగుస్తోంది. అక్రమ దందాలో చిన్న చిన్న దళారులు మొదలుకొని పెద్ద వ్యాపారులు, రైస్ మిల్లర్లు కూడా ఉండటం గమనార్హం. పీడీఎస్ బియ్యం జాతీయ రహదారులు, రైలు మార్గాల ద్వారా గమ్య స్థానాలకు నిరాటంకంగా చేరుతున్నా.. పట్టించుకునేవారే లేరు. బియ్యంతో పాటే పోలీస్, రైల్వే పోలీస్, పౌర సరఫరాల సంస్థ అధికారులను ‘కొనుగోలు’చేస్తున్న వ్యాపారులు ప్రభుత్వం కోట్లు వెచ్చించి పేదలకు పంచుతున్న బియ్యాన్ని సొమ్ము చేసుకుంటున్నారు. తెలంగాణలోని రూపాయి బియ్యం (కరోనా నాటి నుంచి దాదాపుగా ఉచితంగానే సరఫరా) ఇతర రాష్ట్రాల్లో రూ.20కు పైగా పలుకుతుండడం గమనార్హం. కరోనా నాటి నుంచి ఉచితంగానే.. ► సాధారణంగా ఆహార భద్రత కార్డులు ఉన్న కుటుంబాల్లోని ఒక్కొక్కరికి 6 కిలోలు.. కిలో రూపాయి చొప్పున ఇస్తారు. అయితే కరోనా మొదలైన 2020 నుంచి ఒకటి రెండు నెలలు మినహా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉచితంగానే బియ్యాన్ని సరఫరా చేస్తున్నాయి. ఈ క్రమంలో గత జనవరి నుంచి మే, జూన్ నెలలు మినహా ఒక్కొక్కరికి ప్రతినెల 10 కిలోల చొప్పున ఇస్తున్నారు. ఆగస్టు నెలలో ఏకంగా 15 కిలోల చొప్పున పౌరసరఫరాల సంస్థ బియ్యం పంపిణీ చేసింది. రేషన్ బియ్యంపై చులకన భావం! ► ఆహార భద్రతాకార్డు ఉన్న కుటుంబంలోని సభ్యులు బయోమెట్రిక్ విధానం ద్వారా వేలిముద్ర వేసి తమ కోటా బియ్యాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. అయితే గ్రామాల్లో పెరిగిన వరిసాగు, రైతు కుటుంబాలు సొంతంగా పండించిన బియ్యం తినే అలవాటు, రేషన్ బియ్యంపై ఉన్న చులకన భావం లాంటి కారణాల వల్ల చాలామంది ఈ బియ్యాన్ని ఆహారంగా వినియోగించడం లేదు. పట్టణాల్లోనూ చాలామంది రేషన్ బియ్యాన్ని ఇడ్లీ, దోశల పిండి, అటుకుల తయారీకి వాడుతున్నారు మినహా రోజువారీ భోజనానికి వినియోగించడం లేదు. అయితే రెండు నెలలకు పైబడి పీడీఎస్ బియ్యం తీసుకోకపోతే రేషన్‌కార్డు రద్దు అవుతుందన్న భయంతో అందరూ తప్పనిసరిగా బియ్యాన్ని తీసుకుంటున్నారు. అలా తీసుకుంటున్న బియ్యాన్ని కొందరు రేషన్ డీలర్లు తమ దుకాణాల్లోనే తిరిగి కొంటున్నారు. హైదరాబాద్ నగరంతో పాటు కరీంనగర్, వరంగల్, ఖమ్మం నగరాల్లో కిలో బియ్యానికి రూ. 6 నుంచి రూ. 8 వరకు చెల్లిస్తుండగా... గ్రామాలు, ఇతర పట్టణాల్లో కిలోకు రూ. 8 నుంచి రూ.10 వరకు చెల్లిస్తున్నారు. రేషన్ దుకాణాల్లోకి వచ్చే బియ్యంలో 60 శాతం అక్కడే డబ్బులకు రీసేల్ అవుతుండగా, 20 నుంచి 30 శాతం వరకు మాత్రమే పేదలు తీసుకుంటున్నారు. వీరిలో కొందరు దళారులకు విక్రయిస్తున్నారు. మిగతా 10 శాతం వరకు క్లోజింగ్ బ్యాలెన్స్ కింద డీలర్ల వద్ద నిల్వ ఉంటుంది. కాగా కొంటున్న బియ్యాన్ని డీలర్లు రూ.2 లాభం చూసుకొని ట్రాలీల్లో వచ్చే దళారులకు అమ్మేస్తున్నారు. ఇలా డీలర్ల నుంచి, గ్రామాల్లో మహిళల నుంచి కొనుగోలు చేసిన బియ్యాన్ని సదరు ట్రాలీ దళారులు లారీల్లో వ్యాపారం చేసే వారికి రూపాయి, ఆపైన లాభం చూసుకొని విక్రయిస్తున్నారు. వాటిని కొనుగోలు చేసే పెద్ద వ్యాపారులు పక్క రాష్ట్రాలకు పంపిస్తున్నారు. రెండు మూడు చేతులు మారిన తర్వాత రాష్ట్రాలు దాటే బియ్యం ధర రూ.20 వరకు పలుకుతోంది. తద్వారా కిలో బియ్యానికి కనిష్టంగా రూ.5 చొప్పున లాభం వేసుకొన్నా.. ఇలా టన్నుల్లో విక్రయించే బియ్యానికి కోట్లల్లో లాభం సమకూరుతుందని స్పష్టమవుతోంది. ఈ లాభంతోనే పోలీస్, రెవెన్యూ, విజిలెన్స్, పౌరసరఫరాల శాఖ అధికారులను వ్యాపారులు కొనేస్తున్నారని మంచిర్యాలకు చెందిన ఓ దళారి చెప్పాడు. కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు రవాణా ► ఉత్తర తెలంగాణ జిల్లాల్లోని ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, వరంగల్ జిల్లాలకు చెందిన పీడీఎస్ బియ్యం అధికంగా మహారాష్ట్రకు వెళుతోంది. రామగిరి ప్యాసింజర్ రైలు ద్వారా వరంగల్ నుంచి పెద్దపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల మీదుగా వీరూర్‌కు వెళ్తుంది. లారీల్లో కూడా కరీంనగర్, మంచిర్యాల, ఆసిఫాబాద్, పెద్దపల్లి జిల్లాల నుంచి ఆసిఫాబాద్ గుండా వీరూర్కే చేరుతుంది. కాగజ్‌నగర్ నుంచి, దహేగాం, బెజ్జూరుల నుంచి చింతలమానెపల్లి మీదుగా గడ్చిరోలి జిల్లా అహేరీకి వెళ్లే లారీలు కూడా ఉన్నాయి. భూపాలపల్లి, చెన్నూరు, కాటారం, ములుగు ప్రాంతాల నుంచి సిరోంచకు, ఖమ్మం, కొత్తగూడెం నుంచి ఛత్తీస్‌గఢ్, హైదరాబాద్, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, మెదక్ జిల్లాల నుంచి కర్ణాటకకు పీడీఎస్ బియ్యంతో కూడిన లారీలు వెళ్తున్నాయి. మిల్లర్లకూ వరం ► పీడీఎస్ బియ్యాన్ని రాష్ట్రంలోని కొందరు మిల్లర్లు రీసైక్లింగ్ చేసి సీఎంఆర్ కింద ప్రభుత్వానికి అప్పగిస్తున్నారనే ఆరోపణలున్నాయి. గ్రామాలు, పట్టణాల నుంచి లారీలు బియ్యం మిల్లులకు వెళుతూపలుచోట్ల పట్టు పడడం ఈ ఆరోపణలకు బలం చేకూరుస్తోంది. అలాగే ఆయా మిల్లులకు ప్రభుత్వం కేటాయించిన ధాన్యం నిల్వలు అక్కడ లేకపోవడాన్ని బట్టి కూడా.. మిల్లర్లు అసలు బియ్యాన్ని (మిల్లింగ్ చేసిన రైతుల ధాన్యం) అమ్ముకుంటూ, వాటి స్థానంలో పీడీఎస్ బియ్యాన్ని ఇస్తున్నట్టుగా స్పష్టమవుతోందని అంటున్నారు. -
రేషన్ షాపుల్లో కాదు.. గుండెల్లో పెట్టుకుంటాం!
‘న్యాయమైన, సురక్షితమైన, ఆరోగ్యకరమైన ప్రపంచం అన్నది ప్రతి ఒక్కరి హక్కు.. నిజం చెప్పాలంటే ప్రపంచం ఏమంత బాగాలేదు’.. – ఐక్యరాజ్యసమితి సర్వ ప్రతినిధి సమావేశంలో వారం క్రితం నటి ప్రియాంక చోప్రా మాట ఇది.. .... బ్రిటన్ ను దాటి ఐదో అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఇండియా.. కాలరెత్తుకున్న ఇండియన్ – ఓ మెట్టు ఎక్కిన ఆర్థిక భారతం. మానవాభివృద్థి సూచీలో 132వ స్థానంలో మనం.. – విద్య, ఆరోగ్యం, జీవన ప్రమాణాల్లో మరో మెట్టుజారిన పేద భారతం.. .... ఈ రెండూ దాదాపు వారం తేడాతో వచ్చిన వార్తలే. కానీ పరస్పర విరుద్ధం. ఇది చూస్తే పాత జోక్ ఒకటి జ్ఞాపకం వస్తుంది. ఓ రిచ్ స్టూడెంట్ పేదవాడిపై రాసిన వ్యాసం.. ‘వాళ్లింట్లో తల్లి, తండ్రి, పిల్లలు అంతా పేదవాళ్లే. వారి ఇంట్లో పనిమనిషి పేదవాడే, తోటమాలీ పేదవాడే.. చివరికి కారు డ్రైవరూ బాగా పేదవాడే..’ అని.. .... ఎకానమీ గణాంకాలు ఎప్పుడూ ‘ద్రవ్యోల్బణం’లా ఉంటాయి.. అర్థమైనట్టే ఉన్నా అయోమయంగా తోస్తాయి. పెరిగాయో, తగ్గాయో తెలియదు.. ఎక్కడ, ఎందుకు పెరుగుతాయో, తగ్గుతాయో సామాన్యులెవరికీ అర్థంకాదు. ... ‘ఏమంత బాగాలేదు’.. అన్న విషయం మాత్రం అనుభవంలోకి వస్తుంది.. ఏదీ సెక్యూరిటీ? విద్య, వైద్యంతో కూడిన మానవాభివృద్థి సూచీకి ప్రాధాన్యం ఎంత ఉంటుందో ఓ నెటిజెన్ షేర్ చేసిన ఈ మెసేజ్ చూస్తే తెలుస్తుంది. ‘‘.. నేను పెద్దవాళ్లు చెప్పినట్టుగా డిగ్రీ చేశా.. మంచి ఉద్యోగం సంపాదించా.. సమాజ నియమాలకు అనుగుణంగా పెళ్లి చేసుకున్నా.. ఆర్థిక నిపుణుల సూచన మేరకు నడుచుకుని పొదుపు చేసుకున్నా. రిటైర్మెంట్ ప్లాన్ చేసుకున్నా.. క్రెడిట్ కార్డుల జోలికి వెళ్లనే లేదు. సర్కార్ చెప్పినట్టుగా ట్యాక్స్‌లు కట్టా.. లైఫ్ అంతా మంచి సిటిజెన్‌గా ఉన్నా.. నా భార్యకు కేన్సర్ వచ్చింది. ఇన్సూరెన్స్ పోను 20 లక్షలు ఖర్చయింది. పొదుపు చేసిందంతా పోయింది. పాతికేళ్ల కష్టం రోగం పాలైంది. ఇంటి ఈఎంఐలు ఆగిపోయాయి. పిల్లల చదువులు గందరగోళంలో పడ్డాయి. ... ఇప్పుడు చెప్పండి మీరు చెప్పే నీతులపై, ఈ ప్రభుత్వాలపై నాకు ఎందుకు గౌరవం ఉండాలి? నాకు ఏం రక్షణ ఉందని నమ్మాలి. నా పిల్లల భవిష్యత్తుకు సొసైటీ, గవర్నమెంట్ ఉపయోగపడుతుందని విశ్వసించాలా? పిల్లల్ని నాలా ఒబీడియెంట్ సిటిజెన్లా పెంచమంటారా?’’ – జీవితంపైనా.. ప్రభుత్వంపైనా సంపూర్ణంగా ఆశలు పోయిన సందర్భం ఇది ఇదీ ప్రయారిటీ.. 132వ స్థానంలో ఉన్న మనం ఇలా ఉంటే.. కొద్ది సంవత్సరాలుగా ‘మానవాభివృద్థి సూచీ’లో అందరి కన్నా ముందు ఉంటున్న నార్వే ఎలా ఉందో చూద్దాం.. చమురు, సహజ వాయువు నిక్షేపాలు నార్వేకు ప్రధాన ఆదాయ వనరు. అయితే ఇలా వచ్చిన డబ్బును ఆ దేశం ప్రజాపనులు, ఆరోగ్యం, మౌలిక సదుపాయాలపై ఖర్చు చేస్తుంటుంది. నార్వే అద్భుతమైన ఆరోగ్య రంగాన్ని రూపొందించుకుంది. ఎంతలా అంటే.. ఆ దేశంలో ప్రతి ఒక్కరికీ ప్రభుత్వమే ఆరోగ్య బీమా కల్పిస్తుంది. అన్నిరకాల వైద్యం ఉచితంగా అందిస్తుంది. ప్రపంచంలో అత్యంత పరిశుభ్రమైన గాలి, నీరు లభించే ప్రాంతాల్లో ఒకటిగా నార్వే పేరు పొందింది. ప్రపంచంలో అతి ఎక్కువగా ఎలక్ట్రిక్ వాహనాలు అమ్ముడుపోయేది ఆ దేశంలోనే.. కాలుష్య రహిత వాతావరణం, మంచి వైద్య సదుపాయాలు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, మంచి ఆదాయం అన్నీ ఉన్న నార్వే ప్రజల ఆయుష్షు కూడా ఎక్కువే. అక్కడివారి సగటు జీవితకాలం 82.3 ఏళ్లు. అక్కడి ప్రభుత్వ యూనివర్సిటీల్లో చదువు పూర్తిగా ఉచితం. విదేశీ విద్యార్థులకు కూడా ఫీజులు తీసుకోరు. నార్వే ప్రభుత్వం ఆ దేశ జీడీపీలో 6.6శాతం విద్యా రంగంపైనే ఖర్చుపెడుతుంది . విద్య, వైద్యం కోసం తమ సంపాదన అంతా ఖర్చుపెట్టాల్సిన పరిస్థితి లేకపోవడంతో ఆ దేశంలో ధనిక, పేద అంతరం మరీ ఎక్కువగా ఉండదు. ప్రతి కుటుంబం మెల్లగా ధనిక స్థాయికి ఎదిగే వాతావరణం ఉంటుంది. ఖర్చు విషయంలో వెసులుబాటు కారణంగా.. ఇప్పటితరం తమ తాతలు, తండ్రుల కంటే ఎక్కువగా విహార యాత్రలు చేయడం, ఎంజాయ్ చేయడం పెరిగింది. నార్వేలో ఉద్యోగిత రేటు 74.4 శాతం. మిగతావారు స్వయం ఉపాధి రంగాల్లో ఉంటారు. అంటే నిరుద్యోగం అతి తక్కువ. అక్కడ టెలి కమ్యూనికేషన్స్, టెక్నాలజీ రంగాల్లో చాలా ఉద్యోగాలు ఖాళీగా ఉంటుంటాయి. డెన్మార్క్, ఫిన్లాండ్, స్విట్జర్లాండ్ వంటి దేశాలు కూడా నార్వే తరహాలో ఉద్యోగ, ఉపాధి కల్పనలో మెరుగ్గా ఉన్నాయి. శాంతి భద్రతల విషయంలో నార్వే ప్రజలు ఎంతో సంతృప్తితో ఉన్నామని చెప్తుంటారు. రాత్రిపూట ఒంటరిగా నడుచుకుంటూ వెళ్లడానికి ఏమాత్రం భయం అనిపించదని 88 శాతం మంది చెప్పడం గమనార్హం. ఆ దేశంలో సంభవించే మొత్తం మరణాల్లో హత్యలు అరశాతం (0.5%) లోపే కావడం గమనార్హం. ఆ దేశంలోని జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు సుమారు నాలుగు వేల మంది మాత్రమే. అక్కడి మహిళా ఉద్యోగులు గర్భం దాల్చితే.. పూర్తి జీతంతో కూడిన 8 నెలల (35 వారాలు) సెలవు (మెటర్నిటీ లీవ్) ఇస్తారు. లేదా 80 శాతం జీతంతో పది నెలలు (45 వారాలు) సెలవు తీసుకోవచ్చు. అవసరమైతే తండ్రులు కూడా పెటర్నిటీ లీవ్ తీసుకునే అవకాశం ఉంటుంది. పిల్లలు పుట్టిన మూడేళ్లలోపు 12 వారాల పాటు వేతనంతో కూడిన సెలవు ఇస్తారు. ఇదేం చారిటీ ..! ఈ మధ్య ఓ రేషన్ షాప్ ముందు స్టాండప్ కామెడీ సీన్ ఒకటి జరిగింది. సాక్షాత్తూ దేశ ఆర్థిక మంత్రి పేదవారికి ఇచ్చే కిలో బియ్యంలో కేంద్రం, రాష్ట్రవాటాల లెక్కలేశారు. పేదవారికి పెడుతున్న తిండిలో తమ వాటా 28 రూపాయలనీ, రాష్ట్రం వాటా 4 రూపాయలనీ, ప్రజల వాటా ఒక్క రూపాయనీ తేల్చారు. తమ వాటా ఇంత ఉండగా ప్రధాని మోదీ ఫొటో ఏదని నిలదీశారు... (క్లిక్ చేయండి: సదా.. మీ ‘చెప్పు’ చేతుల్లోనే..) ‘‘.. ఓ దేశం పేదరికాన్ని దాటడమనేది ‘చారిటీ’ కాదు. సహజ న్యాయంగా జరగాలి’’ అన్న నెల్సన్ మండేలా మాట ఆ సమయంలో గుర్తుకొచ్చి ఉంటే బాగుండేది. సహజన్యాయం జరిగితే... నేతలు తమ ఫొటోలను రేషన్ షాపుల్లో వెతుక్కోనక్కర్లేదు. అందరి ఇళ్లలో, గుండెల్లో అవి కనిపిస్తాయి. మానవాభివృద్థి సూచీ దానికదే పరుగులు పెడుతుంది. (క్లిక్ చేయండి: 75 ఏళ్లుగా ఉరుకుతున్నా... ఉన్నకాడే!) -
సగం కేంద్రం, మిగతా సగం రాష్ట్రం సాయం చేస్తున్నాయని అలా ఫొటో పెట్టాను మేడం!
సగం కేంద్రం, మిగతా సగం రాష్ట్రం సాయం చేస్తున్నాయని అలా ఫొటో పెట్టాను మేడం! -
రేషన్ షాపుల్లో జీఎస్టీ బొమ్మ పెట్టాలి: జీవన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: రేషన్ షాపుల్లో పెట్టా ల్సింది నేతల బొమ్మ లు కాదని, జీఎస్టీ బొమ్మ అని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య బొమ్మల పంచాయితీ మాత్రమే కానీ అభివృద్ధి కనిపించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశం, రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో పడేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పోటీ పడుతున్నాయని శనివారం ఒక ప్రకటనలో ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వ అప్పు రూ.5 లక్షల కోట్లకు చేరుకుందని వెల్లడించారు. 8 ఏళ్లలో జీఎస్టీ ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రజలపై రూ.3 లక్షల కోట్ల భారం పడిందని, జీఎస్టీ వల్ల ప్రజలకు పన్నుల భారం తప్ప ప్రయోజనం లేదని జీవన్‌రెడ్డి మండిపడ్డారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దొంగ నువ్వంటే నువ్వని కొట్లాడుతున్నాయని విమర్శించారు. రైతుబంధు సాకుతో ప్రజలకు అందాల్సిన ప్రయోజనాలన్నీ ఆపేశారని, 2014కు ముందు ఉన్న వాటిని నిలిపివేసి పేర్లు మార్చి గొప్ప లు చెప్పుకుంటున్నారని ధ్వజమెత్తారు. -
ఆమె ప్రవర్తన భయపెట్టింది.. మంత్రి కేటీఆర్ ట్వీట్
సాక్షి, హైదరాబాద్: జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్‌కు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మంత్రి కేటీఆర్ బాసటగా నిలిచారు. శుక్రవారం కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, కామారెడ్డి కలెక్టర్‌కు మధ్య జరిగిన సంభాషణలో కేటీఆర్ కలెక్టర్‌కు మద్దతుగా నిలిచారు. కామారెడ్డి జిల్లా కలెక్టర్‌తో కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ ప్రవర్తన తనను భయపెట్టిందన్నారు. కష్టపడి పనిచేసే ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులను ఈ రాజకీయ నాయకులు నిరుత్సాహపరుస్తున్నారని ఆరోపించారు. కలెక్టర్ జితేష్ వి పాటిల్, గౌరవప్రదమైన ప్రవర్తనకు అభినందనలు తెలిపారు. ఈ మేరకు మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. I am appalled by the unruly conduct of FM @nsitharaman today with District Magistrate/Collector of Kamareddy These political histrionics on the street will only demoralise hardworking AIS officers My compliments to @Collector_KMR Jitesh V Patil, IAS on his dignified conduct 👏 — KTR (@KTRTRS) September 2, 2022 కాగా శుక్రవారం బీర్కూర్ మండల కేంద్రంలోని ఓ రేషన్ దుకాణం వద్ద లబ్ధిదా రులతో కేంద్ర మంత్రి మాట్లాడారు. ఎన్ని కిలోల బియ్యం ఇస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. రేషన్ బియ్యం పథకంలో కేంద్రం వాటా ఎంత? రాష్ట్రం వాటా ఎంత? లబ్ధిదారుల వాటా ఎంత? అంటూ.. కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రశ్నించారు. కేంద్రమంత్రి వరుసగా వేసిన ప్రశ్నలతో కలెక్టర్ కాస్త తడబడ్డారు. దీంతో మంత్రి అసహనం వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలు అమలు చేస్తున్న పథకాలపై జిల్లా పాలనాధికారికి స్పష్టత లేకపోతే ఎలా? అని ప్రశ్నించారు. చదవండి: స్టేట్.. సెంటర్.. సెప్టెంబర్ 17.. తెలంగాణలో హైవోల్టేజీ పాలిటిక్స్ -
ఎవరి వాటా ఎంతో చెప్పండి?
సాక్షి, కామారెడ్డి జిల్లా: రేషన్ బియ్యం పథకంలో కేంద్రం వాటా ఎంత? రాష్ట్రం వాటా ఎంత? లబ్ధిదారుల వాటా ఎంత? అంటూ.. కామా రెడ్డి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రశ్నించా రు. కేంద్రమంత్రి వరుసగా వేసిన ప్రశ్నలతో కలెక్టర్ కాస్త తడబడ్డారు. దీంతో మంత్రి అసహనం వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలు అమలు చేస్తున్న పథకాలపై జిల్లా పాలనాధికారికి స్పష్టత లేకపోతే ఎలా? అని ప్రశ్నించారు. శుక్రవారం బీర్కూర్ మండల కేంద్రంలోని ఓ రేషన్ దుకాణం వద్ద లబ్ధిదా రులతో కేంద్ర మంత్రి మాట్లాడారు. ఎన్ని కిలోల బియ్యం ఇస్తున్నారని అడిగి తెలుసుకు న్నారు. ఈ సందర్భంగానే పేదలకు చౌకధ రల దుకాణాల ద్వారా పంపిణీ చేస్తున్న బియ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటా ఎంత? అని కలెక్టర్‌ను అడిగారు. ఆయన సరైన సమాధానం చెప్పకపోవడంతో అరగంట సమయం తీసుకుని చెప్పాలని నిర్మలా సీతారామన్ సూచించారు. తర్వాత కేంద్రం బియ్యం పంపిణీకి రూ.28 ఖర్చు చేస్తోందని, ప్రజలు ఒక రూపాయి ఇస్తున్నారని, మిగతా నాలుగైదు రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తోందని వివరించారు. ప్రధాని ఫొటోలు పెట్టాలి కోవిడ్ నేపథ్యంలో నిరుపేదలకు ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం బియ్యం ఉచితంగా పంపిణీ చేస్తోందని సీతారామన్ అన్నారు. మోదీ ప్రభుత్వం పేదలకు ఉచితంగా రేషన్ ఇస్తున్న విషయాన్ని లబ్ధిదారులకు ఎందుకు చెప్పలేక పోతున్నారన్నారు. రేషన్ దుకాణాల దగ్గర ప్రధాని నరేంద్రమోదీ ఫొటో ఎందుకు లేదని ప్రశ్నించారు. వెంటనే ప్రధాని ఫ్లెక్సీని ఏర్పాటు చేయాలని లేకపోతే తానే ఏర్పాటు చేయిస్తానని స్పష్టం చేశారు. తెలంగాణ వ్యాప్తంగా అన్ని రేషన్ దుకాణాల్లో ప్రధాని మోదీ ఫోటోలు పెట్టాలన్నారు. అంతకు ముందు బీర్కూర్ గ్రామానికి చెందిన విద్యా ర్థులతో ఆమె కొద్దిసేపు ముచ్చటించారు. -
Video Viral: జెండా కొంటేనే రేషన్.. తీవ్ర విమర్శలు
న్యూఢిల్లీ: దేశ ప్రజల గుండెల్లో నిలిచిపోయిన జాతీయజెండాను రేషన్‌కార్డు పేద లబ్ధిదారులతో బలవంతంగా కొనుగోలుచేయిస్తున్న వీడియోపై విమర్శలు వెల్లువెత్తాయి. ‘రూ.20 పెట్టి జెండా కొనాల్సిందే. ప్రభుత్వ ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలొచ్చాయి. ఆహారధాన్యాలు కావాలంటే జెండా కొనండి. లేదంటే వెళ్లండి’ అంటూ హరియాణాలోని కర్నాల్‌లో ఒక రేషన్ షాప్ డీలర్ కరాఖండీగా చెబుతున్నట్లు ఆ వీడియోలో ఉంది. ఈ ఘటనపై కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘జాతీయతను బీజేపీ అమ్మకానికి పెట్టింది. పేదల ఆత్మాభిమాన్ని గాయపరిచింది’ అని బీజేపీ సర్కార్‌ను విమర్శిస్తూ రాహుల్ ఫేస్బుక్లో పోస్ట్‌పెట్టారు. Forced To Buy Flag To Get Ration, Allege Haryana Villagers https://t.co/QMuJIrA4I9 pic.twitter.com/M50XBXhQnX — NDTV (@ndtv) August 10, 2022 వరుణ్ గాంధీ ఆగ్రహం ‘75వ స్వాతంత్య్రదినోత్సవాల వేళ ఇలాంటి ఘటన జరగడం సిగ్గుచేటు. చౌక సరకుల కోసం రేషన్ షాపుల వద్ద పడిగాపులు పడే పేద ప్రజల కష్టార్జితాన్ని ఇలా చిల్లరగా వసూలుచేయడం దారుణం. త్రివర్ణ పతాకానికి వెల కట్టడం శోచనీయం’ అని వరుణ్ గాంధీ హిందీలో ట్వీట్ చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రంలో జాతీయ పండుగ పేదలకు భారంగా మారిందన్నారు. ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమంలో భాగంగా దేశ ప్రజలంతా తమ తమ ఇళ్ల వద్ద త్రివర్ణ పతాకాన్ని ఎగరవేయాలని ప్రధాని మోదీ పిలుపునివ్వడం తెల్సిందే. దీని అవకాశంగా తీసుకుని రేషన్ షాపుల వద్ద జెండాల వ్యాపారం చేయిస్తున్నారని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తంచేశారు. చదవండి: (ఇప్పటికిప్పుడు లోక్‌సభకు ఎన్నికలొస్తే.. బిహార్‌లో వారిదే హవా) -
డిప్యూటీ తహసీల్దార్‌పై టీడీపీ నేతల హత్యాయత్నం
పెనమలూరు: కృష్ణా జిల్లా పెనమలూరులో రేషన్ షాపును తనిఖీ చేయడానికి వెళ్లిన డిప్యూటీ తహసీల్దారుపై మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత బోడే ప్రసాద్, ఆయన అనుచరులు హత్యాయత్నానికి ఒడిగట్టారు. అక్కడే ఉన్న వీఆర్వోపైనా దాడి చేశారు. పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. పెనమలూరులో డీలర్ లుక్కా అరుణ్‌బాబు నిర్వహిస్తున్న రేషన్ దుకాణం (నం.27)లో స్టాకు తనిఖీకి డిప్యూటీ తహసీల్దార్ (పీడీఎస్) గుమ్మడి విజయ్‌కుమార్, వీఆర్వో మంగరాజు మంగళవారం రాత్రి 7 గంటల సమయంలో వెళ్లారు. తనిఖీల్లో 330 కిలోల బియ్యం, 152 ప్యాకెట్ల పంచదార తక్కువగా ఉన్నట్టు గుర్తించారు. దీంతో ఈ అధికారులు డీలర్ స్టేట్మెంట్ తీసుకుని రిపోర్టు రాస్తున్న సమయంలో బోడే ప్రసాద్ రాత్రి 10 గంటలకు రేషన్‌షాపు వద్దకు వచ్చి.. తన వెంట వచ్చిన అనుచరులతో అధికారులపై దాడి చేయించారు. వారు డిప్యూటీ తహసీల్దార్ గొంతు నులిమి చంపే యత్నం చేశారు. రిపోర్టును బలవంతంగా తీసుకెళ్లారు. ఈ ఘటనలో డిప్యూటీ తహసీల్దార్ కంటికి తీవ్ర గాయమైంది. ఆయనకు కంటికి వైద్యం కోసం ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రికి తరలించారు. ఈ దాడిలో వీఆర్వో మంగరాజుకు స్వల్ప గాయాలయ్యాయి. పరారీలో బోడే ప్రసాద్.. దాడి తర్వాత బోడే ప్రసాద్ పరారీలో ఉన్నట్టు పెనమలూరు సీఐ ఎం.సత్యనారాయణ తెలిపారు. దాడిలో పాల్గొన్న వారిపై ఐపీసీ 353, 332, 323, 506, 392, 307 రెడ్‌విత్ 34 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామన్నారు. ఎ1గా బోడే ప్రసాద్, ఎ2గా వంగూరు పవన్, ఎ3గా కంఠమనేని పార్థు, ఎ4గా దొంతగాని పుల్లేశ్వరరావు, ఎ5గా కొల్లిపర ప్రమోద్‌కుమార్, ఎ6గా కిలారు ప్రవీణ్‌కుమార్, ఎ7గా బోడె మనోజ్, ఎ8గా కాపరౌతు వాసు, ఎ9గా కిలారు కిరణ్‌కుమార్, ఎ10గా చిగురుపాటి శ్రీనివాసరావులతో పాటు మరికొందరు ఉన్నారని చెప్పారు. వీరిలో ఎ1, ఎ3 మినహా మిగతా వారిని బుధవారం అరెస్టు చేశామని, ప్రధాన నిందితుడు బోడే ప్రసాద్ కోసం గాలిస్తున్నామని సీఐ తెలిపారు. రేషన్ షాపు సీజ్ చేశాం ప్రతి నెలా అన్ని రేషన్ షాపుల్లో స్టాకు తనిఖీలు చేస్తాం. ఇందులో భాగంగానే పెనమలూరులో రేషన్‌షాపును తనిఖీ చేసి రిపోర్టు రాస్తుండగా దాడి చేశారు. ఈ ఘటనతో రేషన్‌షాపు సీజ్ చేశాం. తనిఖీకి వచ్చిన అధికారులపై దాడి చేయటం దారుణం. పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశారు. డీలర్‌ను సస్పెండ్ చేయాలని ఉన్నతాధికారులకు నివేదిక పంపాం. – జి.భద్రు, తహసీల్దార్, పెనమలూరు -
రేషన్‌లో మినీ సిలిండర్లు
సాక్షి, నారాయణపేట: కనీస నిర్వహణ ఖర్చులు రాక ఇబ్బందులు పడుతున్న రేషన్ దుకాణాలను లాభసాటి కేంద్రాలుగా తీర్చిదిద్దడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, పౌరసరఫరాల శాఖ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. వీటిలో మినీ గ్యాస్ సిలిండర్లు పంపిణీ, ఇంటర్నెట్ కేఫ్, సిటిజన్ చార్జ్ సేవలు అందుబాటులోకి తీసుకురానున్నారు. తద్వారా డీలర్లకు కొంత కమీషన్ ఇచ్చి ఆర్థికంగా పరిపుష్టం చేయడంతోపాటు.. పేదలకు కొంత వరకు ఉపశమనం కలిగించనున్నారు. జిల్లాలో 247 దుకాణాలు.. జిల్లాలోని 11 మండలాల్లో 247 రేషన్ దుకాణాలు ఉన్నాయి. గతంలో బియ్యంతోపాటు పంచదార, కిరోసిన్, గోధుమలు, ఇతర సరుకులు సరఫరా చేసిన చౌకధర దుకాణాలు ప్రస్తుతం బియ్యం మాత్రమే అందిస్తున్నాయి. 50 కిలోల బియ్యంలో మూడు నుంచి నాలుగు కిలోల తరుగు రావడంతో వచ్చిన కమీషన్ తరుగుకు సరిపోతుందని, నెల మొత్తం కష్టపడితే ఖాళీ సంచులు మాత్రమే మిగులుతున్నాయని, దీనికి తోడు కొందరు గ్రామాల్లో తిరిగి లబ్ధిదారుల నుంచి రేషన్ బియ్యం సేకరించి రీసైక్లింగ్‌కు పాల్పడితే తాము నిందపడాల్సి వస్తుందని కొద్ది రోజులుగా డీలర్లు వాపోతున్నారు. ఈ నేపథ్యంలో వీటిని బలోపేతం చేయడానికి చర్యలు చేపడుతున్నారు. కమీషన్ రూ.41.. రేషన్ దుకాణం ద్వారా కార్డుదారులతోపాటు ఆధార్‌కార్డు కలిగిన వారికి 5 కిలోల మినీ సిలిండర్లు సరఫరా చేయడానికి పౌరసరఫరాల శాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతినెలా రేషన్ మాదిరిగానే మినీ సిలిండర్లను సైతం తీసుకునే అవకాశం కల్పిస్తున్నారు. మొదటిసారి సిలిండర్ తీసుకున్న సమయంలో ఒక్క సిలిండర్‌కు రూ.940 చెల్లించాలని, తర్వాత నెల నుంచి రూ.620కే అందిస్తామని తెలిపారు. దీనిలో గ్యాస్ డీలర్‌కు ఒక సిలిండర్‌కు రూ.41 కమీషన్ ఇవ్వనున్నారు. నెలలో ఎన్ని సిలిండర్లు కావాలన్నా ఇస్తారు. రేషన్ డీలర్ 20 సిలిండర్ల వరకు నిల్వ చేసుకోవచ్చు. అందుబాటులోకి పౌర సేవలు.. రేషన్ దుకాణాల్లో ఇంటర్నెట్ కేఫ్‌లు, పౌరసేవా పత్రం ద్వారా 14 రకాల సేవలను అందుబాటులోకి తేనున్నారు. తద్వారా కొంత కమీషన్ రూపంలో డీలర్లకు ఇవ్వనున్నారు. ఇదిలా ఉండగా రేషన్ దుకాణాలకు పీఎం వాణి కేంద్రాలుగా నామకరణం చేయనున్నట్లు సమాచారం. -
Mahabubabad: ప్రభుత్వం రేషన్ దుకాణంలో ప్లాస్టిక్ బియ్యం?
బయ్యారం (మహబూబాబాద్): ప్రభుత్వ చౌకదుకాణం నుంచి సరఫరా అయిన బియ్యంలో ప్లాస్టిక్బియ్యం ఉండడం పలువురిని ఆందోళనకు గురిచేస్తోంది. వివరాలు.. బయ్యారంలోని పీహెచ్సీ ఏరియాలో నివాసం ఉండే నాసరబోయిన పద్మ తన అత్త రామక్క పేరున వచ్చే బియ్యం పది కేజీలు మార్చి నెలలో తీసుకొని ఇంటికి వచ్చింది. ఆ బియ్యాన్ని మంగళవారం వండేందుకు నానబెట్టిన సమయంలో ప్లాస్టిక్‌తో కూడిన బియ్యం నీళ్లలో పైకి తేలాయి. దీంతో ఆ బియ్యాన్ని పూర్తిగా గమనించగా ప్లాస్టిక్ బియ్యంగా కనపడటంతో పద్మ ఈ విషయాన్ని విలేకరులకు తెలిపింది. ప్రభుత్వం సరఫరా చేసిన బియ్యంలో ప్లాస్టిక్ బియ్యం ఎలా వచ్చాయి అనే ప్రశ్న పలువురిలో వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికైనా చౌకదుకాణాల ద్వారా సరఫరా అవుతున్న బియ్యం నాణ్యతపై అధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. (చదవండి: ఫోన్లో అతిగా మాట్లాడుతున్నావని మందలించినందుకు... ) -
రేషన్ షాపుల్లో మినీ ఎల్పీజీ సిలిండర్లు.. కేంద్రమంత్రి ప్రకటన
ఢిల్లీ: రేషన్ దుకాణాల ద్వారా మినీ-ఎల్పీజీ సిలిండర్ల విక్రయానికి వెసులుబాటు కల్పించామని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించే లక్ష్యంతో రేషన్ షాపుల్లో ఆహార ధాన్యాలతో పాటు ఇతర వస్తువులు కూడా అందుబాటులో ఉంచామని అందులో భాగంగా మినీ ఎల్పీజీ సిలిండర్లు విక్రయిస్తున్నట్టు తెలిపారు. రేషన్ షాపుల్లో మినీ ఎల్పీజీ సిలిండర్ల విక్రయానికి సంబంధించి ఇప్పటికే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలతో చర్చించామని మంత్రి తెలిపారు. అయితే రేషన్ షాపుల నిర్వహణ పూర్తిగా రాష్ట్రాల చేతుల్లో ఉందన్నారు. ఆసక్తి ఉన్న రాష్ట్రాలు రేషన్ షాపుల్లో మినీ-ఎల్పీజీ అందిస్తున్నాయని ఆయన వెల్లడించారు. రేషన్ షాపుల్లో ఎల్పీజీ సిలిండర్లకు సంబంధించి వైఎస్సార్సీపీ ఎంపీలు కోటగిరి శ్రీధర్, ఎన్. రెడ్డెప్పలు అడిన ప్రశ్నలకు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ సమాధానం ఇచ్చారు. చదవండి:రెండేళ్లలో కోటి ఉచిత ఎల్పీజీ కనెక్షన్లు -
డీలర్లకు ఓటీపీ.. లబ్ధిదారులకు టోపీ
సాక్షి, హైదరాబాద్: ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా నిరుపేదలకు సరఫరా చేస్తున్న రాయితీ బియ్యం పక్కదారి పడుతోంది. పేదల అవగాహనాలేమిని డీలర్లు సొమ్ము చేసుకుంటున్నారు. లబ్ధిదారుల నుంచి ఓటీపీని తీసుకొని అరకొర బియ్యం పంపిణీ చేసి, మిగతా బియ్యాన్ని అక్రమంగా అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారు. ఓటీపీ నంబర్‌ను సేకరించి డీలర్లు చేస్తున్న దోపిడీపై రాష్ట్రవ్యాప్తంగా ‘సాక్షి’జరిపిన పరిశీలనలో అనేక అంశాలు వెలుగులోకి వచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా 17 వేల రేషన్‌షాపులున్నాయి. ఇందులో 2.85 కోట్లమంది లబ్ధిదారులు ఉన్నారు. కరోనా కష్టకాలంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒక్కొక్కరికి 10 కిలోల చొప్పున బియ్యం అందిస్తున్నాయి. ప్రతినెలా 1.78 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం రాష్ట్రానికి సçరఫరా అవుతోంది. రేషన్ డీలర్లు ప్రతినెలా ఒకటో తేదీ నుంచి 15 లేదా 20వ తేదీ వరకు సరకులనున లబ్ధిదారులకు పంపిణీ చేస్తారు. సరుకుల పంపిణీ వేళ రేషన్‌లబ్ధిదారుడు నుంచి ఓటీపీ లేదా ఐరిస్ తీసుకొని సరుకులు ఇస్తారు. బియ్యం కాజేసేది ఇలా...! ఒక రేషన్ లబ్ధిదారుడి ఇంట్లో నలుగురు సభ్యులు ఉంటే ఆ కుటుంబానికి 40 కిలోల బియ్యం పంపిణీ చేస్తారు. నిర్దేశిత సమయాల్లో రేషన్çషాపు వద్ద భారీగా లబ్ధిదారులు ఉంటే, అక్కడ వేచి చూసే ఓపికలేని లబ్ధిదారులు ఆ షాపు డీలర్‌కు ఫోన్ చేసి తమ రేషన్‌కార్డు నంబర్ చెబుతారు. మిషిన్‌లో సదరు నంబర్‌ను సంబంధిత డీలర్ ఎంటర్ చేయగానే లబ్ధిదారుల ఫోన్‌కు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ వచ్చిందంటే ఆ లబ్ధిదారు సరుకులు తీసుకున్నట్లు లెక్క. ఆ తర్వాత డీలర్లు సూచించిన తేదీకి బియ్యం కోసం వెళ్తే కోటా అయిపోయిందని చెబుతున్నారు. లేదంటే, ‘ఇప్పుడు కొన్ని తీసుకెళ్లు.. మిగతావి తర్వాత కొన్ని ఇస్తాను’అని తిప్పి పంపుతున్నారు. ఇలా 15 తేదీ నుంచి 20 వరకు జాప్యం చేసి, తీరా ఆ నెల కోటా అయిపోయిందని చెప్పేస్తున్నారు. ఇలా కనీసం 5 లేక 10 కిలోలను లబ్ధిదారుల నుంచి డీలర్లు కాజేస్తున్నారు. కార్డుపోతుందనే భయంతోనే.. కొందరు లబ్ధిదారులు ప్రతినెలా రేషన్ తీసుకోరు. మరికొందరేమో రేషన్ బియ్యం ఎందుకులే అని తీసుకోవడంలేదు. రేషన్‌కార్డు ఉంటే చాలు అని ఇలాంటి వాళ్లు భావిస్తుంటారు. ప్రతినెలా ఆయా రేషన్ డీలర్లకు ఓటీపీ చెప్పి వదిలేస్తున్నారు. రేషన్‌డీలర్లు ఇలా కాజేసిన బియ్యాన్ని బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్నారు. టిఫిన్ సెంటర్లకు, బియ్యం వ్యాపారులకు కిలోకు రూ.20 నుంచి రూ.30 వరకు విక్రయించి జేబులు నింపుకుంటున్నారు. సన్నబియ్యం రావడమే కారణం ప్రభుత్వం గత కొన్ని నెలల నుంచి రేషన్‌డీలర్లకు సన్న, దొడ్డు రకం బియ్యం సరఫరా చేస్తోంది. అయితే రేషన్ డీలర్లు ఒక్కో సంచిని పరిశీలించి సన్నబియ్యం బస్తాలను పక్కకు పెట్టేస్తున్నారు. సంబంధిత షాపునకు మొత్తంగా సన్నబియ్యం వస్తే అందులోంచి దాదాపు 20 శాతం మందికి కొంత కోటా ఆపి మిగతా బియ్యం మాత్రమే ఇస్తున్నారు. అలా ఆపిన బియ్యాన్ని డీలర్లు ఇతరులకు అమ్ముకుంటున్నారు. చదవండి: జూబ్లీహిల్స్: ఫుడ్కోర్ట్ టాయిలెట్లో సెల్‌ఫోన్ పెట్టి.. వీడియోలు రికార్డింగ్ -
ప‘రేషన్’.. ఒకచోట సన్న, మరోచోట దొడ్డు బియ్యం
సాక్షి, మంచిర్యాల(ఆదిలాబాద్): పేదల ఆకలి తీర్చే రేషన్ బియ్యం పంపిణీలో జాప్యం జరుగుతోంది. అధికారుల తీరుతో గందరగోళం ఏర్పడుతోంది. ఈ నెలలో ఒక్కో వినియోగదారుడికి 15కిలోల చొప్పున బియ్యం ఉచితంగా అందించల్సి ఉండగా.. ఇప్పటివరకు పూర్తి స్థాయిలో రేషన్ దుకాణాలకు సరఫరా చేయలేదు. జిల్లాకు తొమ్మిది వేల మెట్రిక్ టన్నుల బియ్యం అవసరం కాగా.. ఎనిమిది వేల మెట్రిక్ టన్నులు మాత్రమే సరఫరా చేశారు. మరో రెండ్రోజుల్లో మిగతా వెయ్యి టన్నులు సరఫరా చేస్తామని అధికారులు చెబుతున్నారు. ఈ నెల 15వరకు బియ్యం పంపిణీ చేయాల్సి ఉండగా.. సరఫరాలో ఆలస్యం కావడంతో గడువును 22వరకు పొడిగించారు. జిల్లా వ్యా ప్తంగా 70శాతం మాత్రమే బియ్యం పంపిణీ కావడంతో గడువు పెంచే అవకాశం ఉంది. సన్న బియ్యం, దొడ్డు బియ్యం పంపిణీ చేస్తుండడంతో ఎక్కడ సన్న బియ్యం పంపిణీ చేస్తున్నారో ఆయా దుకాణాల వద్ద వినియోగదారులు బారులు తీరుతున్నారు. ప్రజలకు అందని సమాచారం రేషన్ బియ్యం పంపిణీలో గందరగోళానికి తెరదించాల్సిన జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి ప్రజలకు ఎటువంటి సమాచారం ఇవ్వడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. మూడు రోజుల నుంచి అధికారికంగా ఉన్న ఫోన్‌ను స్విచ్ఛాఫ్ చేసి ఉండడంతో రేషన్ సమస్యలపై ఎవరికి సమాచారం ఇవ్వాలో అర్థం కావడం లేదని డీలర్లు, లబ్ధిదారులు చెబుతున్నారు. జిల్లాలోని రేషన్ దుకాణాలకు బియ్యం జిల్లా పౌరసరఫరాల మేనేజర్ ఆధ్వర్యంలో సరఫరా చేస్తుండగా, వాటి పంపిణీ విధానాన్ని పౌరసరఫరాల శాఖ అధికారి పర్యవేక్షణలో చేపడుతుంటారు. గత నెల వరకు కార్డుదారుల్లోని ఒక్కొక్కరికి 5 కిలోల బియ్యం ఇవ్వగా, ఈ నెలలో ఒక్కో 15 కిలోల చొప్పున ఇస్తున్నారు. దీంతో ఒక్కో రేషన్ దుకాణానికి మూడింతల బియ్యం అందించాల్సిన అవసరం ఏర్పడింది. జిల్లావ్యాప్తంగా ఏ రేషన్ దుకాణాలకు విడతల వారీగా బియ్యం సరఫరా చేస్తున్నారు.. వచ్చిన బియ్యంలో ఏ బియ్యం సన్నవి, ఏవి దొడ్డువి అనే వివరాలు లేకపోవడం, సంచులను విప్పగానే సన్నబియ్యం వస్తే డీలర్లు తమకు అనుకూలంగా ఉండేవారు, తెలిసిన వారికి ఫోను ద్వారా సమాచారం ఇచ్చి పంపిణీ చేస్తున్నారు. విషయం బయటకు తెలిసిన మరికొందరు వినియోగదారులు ఆయా దుకాణాల వద్ద బారులు తీరుతున్నారు. సన్నబియ్యం పూర్తయ్యి, దొడ్డురకం బియ్యం పంపిణీ చేసే సమయంలో రేషన్ దుకాణం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. దీంతో జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులకు వినియోగదారులు ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నిస్తుండగా జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి ఫోన్ స్విచ్ఛాఫ్ వస్తోందని చెబుతున్నారు. సన్న బియ్యం విషయమై వినియోగదారులు, డీలర్లకు మధ్య నిత్యం వాగ్వాదం జరుగుతోంది. దొడ్డు బియ్యాన్ని ప్రజలు నిరాకరించడంతో జిల్లాలో అనుకున్న రీతిలో రేషన్ బియ్యం పంపిణీ జరగడం లేదు. బియ్యం పంపిణీ గడువు పెంపుపై వినియోగదారులకు సమాచారం లేకపోవడంతో పనులు మానుకుని రేషన్ దుకాణాల వద్ద ఉదయం నుంచే పడిగాపులు కాస్తున్నారు. సన్నబియ్యం వస్తే తీసుకెళ్తుండగా, దొడ్డు బియ్యం వస్తే వాటిని తీసుకోకుండానే వెళ్లిపోతున్నారు. దీంతో దొడ్డు బియ్యం నిల్వలు పలు రేషన్ దుకాణాల్లో మిగిలిపోతున్నాయి. -
గంటలో 45 కార్డుల సరుకులు కొట్టేశాడు!
కుషాయిగూడ: ఓ రేషన్ షాపునకు చెందిన సుమారు 45 రేషన్ కార్డుల సరుకులను మరో రేషన్ డీలర్ ఒకే రోజు గంట వ్యవధిలో కొట్టేసి హైటెక్ మోసానికి పాల్పడ్డాడు. ఇలాంటి మోసాలు జరుగుతున్నాయని, అందరూ జాగ్రత్తగా ఉండాలంటూ ఓ బాధితుడు వాయిస్ క్లిప్పింగ్‌ను వాట్సాప్‌లో షేర్ చేయడంతో ఈ విషయం వైరల్ అయింది. చిన్న చర్లపల్లికి చెందిన 3302105 నంబర్ రేషన్ షాపు డీలర్ శంకర్ తెలిపిన వివరాల ప్రకారం.....ఇతని షాపునకు చెందిన 45 రేషన్ కా ర్డుల నుంచి ఈ నెల 20న ఒకే రోజు గంట వ్యవధిలో మరో డీలర్ స రుకులన్నీ కొట్టేశాడు. శంకర్ ఈ విషయాన్ని పసిగట్టలేదు. పోర్టల్ సిస్టమ్‌లో ఎవ్వరు ఎక్కడైనా సరుకులు తీసుకోవచ్చనే భావనలో ఉన్నా డు. అయితే ఈ నెల 22 ఎస్ఓటీ పోలీసులమంటూ వచ్చిన కొందరు నీ రేషన్ షాపునకు చెందిన 45 కార్డుల నుంచి ఇబ్రహీంపట్నానికి చెందిన ఓ రేషన్ డీలర్ సరుకులు కాజేశాడని, అసలు ఏం జరుగుతుందంటూ నిలదీశారు. దీంతో కంగుతిన్న శంకర్ తనకు ఎలాంటి సంబంధం లేదని, సరుకులు కొట్టేసిన విషయం కూడా మీ ద్వారానే తెలిసిందని చెప్పాడు. ఈ విషయంపై డీఎస్ఓ స్పందిస్తూ.. జరిగిన ఘట న తమ దృష్టికి వచ్చిందని, విచారణ జరుపుతున్నామని తెలిపారు. -
రేషన్ దుకాణాల్లో నాణ్యతలేని కంది పప్పు
-
కందిపప్పు.. ఇక్కడ నచ్చకుంటే అమరావతికి వెళ్లు!
సాక్షి, హైదరాబాద్ : మహమ్మారి కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రభుత్వాలు లాక్డౌన్ ప్రకటించాయి. అయితే ఈ లాక్డౌన్లో ఏ ఒక్కరు ఇబ్బంది పడకూడదని తెలంగాణ ప్రభుత్వం రేషన్ సరుకులను రెట్టింపు చేసింది. బియ్యంతో పాటు ఒక్కో కార్డుపై కిలో కందిపప్పు ఉచితంగా ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఇది కొంత మంది రేషన్ దారులకు వరంగా మారింది. నాసిరకమైన కందిపప్పును ప్రజలకు అంటగట్టి నాణ్యమైన కందిపప్పును బయట మార్కెట్లో ఎక్కువ ధరకు అమ్ముకుంటున్నారు. ముఖ్యంగా రామంతపూర్, ఉప్పల్ తదితర ప్రాంతాల్లోని రేషన్ దుకాణాల్లో రెండు రకాల కందిపప్పును ప్రజలకు అంటగడుతున్నారు. నాసిరకమైన కందిపప్పు అయితే ఈ క్రమంలో ఓ వీడియో తీవ్ర చర్చనీయాంశమైంది. ఓ రేషన్ షాపులో నాసిరకమైన కందిపప్పును సరఫరా చేస్తుండటంపై ఓ వ్యక్తి ప్రశ్నించగా ఆ రేషన్ దుకాణదారుడు ఆసక్తికరమైన సమాధానం ఇచ్చాడు. ‘ఇక్కడ నచ్చకుంటె అమరావతికి వెళ్లిపో’ అంటూ జవాబిచ్చాడు. దీంతో ఆ వ్యక్తి షాక్‌కు గురయ్యాడు. అయితే ప్రజలకు అందించే రేషన్ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎక్కడా రాజీ పడని విషయం తెలిసిందే. నాణ్యమైన సరుకులను ఇంటింటికి అందిస్తూ అక్కడి ప్రజల మన్ననలను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పొందుతున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకునే ఆ రేషన్ దుకాణదారుడు నచ్చకుంటే అమరావతి వెళ్లమని అన్నారని అక్కడి వారందరూ అనుకుంటున్నారు. ఇక నాసిరకం కందిపప్పుపై రేషన్ దుకాణదారుడిని మీడియా ప్రశ్నించగా ఇదంతా సివిల్ సప్లయి గోడౌన్లలో జరుగుతుందని తమకేమి సంబంధంలేదని అతడు పేర్కొన్నాడు. నాణ్యతగల కంది పప్పు -
ఫ్రీగా కందిపప్పు
ఇందూరు(నిజామాబాద్ అర్బన్): రేషన్ షాపుల్లో ఉచితంగా కిలో కందిపప్పు పంపిణీ చేయనున్నారు. తెల్ల రేషన్ కార్డుదారులకు వచ్చే నెల బియ్యం కోటాతో పాటు పప్పును కూడా అందించనున్నారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పేదలకు ఒక్కొక్కరికి 12 కిలోల చొప్పున ఉచితంగా బియ్యం అందజేసిన విషయం విదితమే. తాజాగా వచ్చే నెలలో కిలో చొప్పున కంది పప్పు పంపిణీ చేయనున్నారు. మే నెల మొదటి వారంలో బియ్యంతో పాటు కార్డుకు కిలో చొప్పున పప్పును అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే మన జిల్లాకు కందిపప్పు స్టాక్ చేరుకుంది. ఎంఎల్ఎస్ పాయింట్లలో బస్తాలను నిలువ ఉంచారు. నాలుగైదు రోజుల్లో బియ్యం పంపిణీ ప్రారంభం కానున్న సందర్భంగా లారీల్లో బియ్యం బస్తాలతో పాటు కందిపప్పు బస్తాలను కూడా రేషన్ దుకాణాలను రవాణా చేసే ప్రక్రియ ప్రారంభమైంది. జిల్లాలో మొత్తం తెల్ల రేషన్ కార్డులు 3,90,687 ఉన్నాయి. కార్డుకు కిలో చొప్పున జిల్లాకు 390 మెట్రిక్ టన్నుల కోటా అవసరం అవుతోంది. అయితే లూజ్‌గానే డీలర్లు పప్పును తూకం వేసి ఇవ్వనున్నారు. మొన్నటిలాగే బియ్యం పంపిణీ... మే నెలలో కూడా రేషన్ కార్డు లబ్ధిదారులకు ఒక్కొక్కరికి 12 కిలోల చొప్పున బియ్యం ప్రభుత్వం పంపిణీ చేయనుంది. ఇందుకు 16 వేల మెట్రిక్ టన్నుల కోటా అవసరం కానుంది. మొన్నటిలాగే ఇప్పుడు కూడా మే నెల మొదటి వారం నుంచి లబ్ధిదారులకు టోకెన్ పద్ధతిలో బియ్యం ఇవ్వనున్నారు. బియ్యం, కందిపప్పు బస్తాలను రేషన్ దుకాణాలకు తరలించడానికి లారీల కొరత రాకుండా చర్యలు తీసుకుంటున్నామని సివిల్ సప్లయ్ అధికారులు వెల్లడించారు. -
రేషన్ ‘కోటా’ నో స్టాక్!
సాక్షి, సిటీబ్యూరో: ప్రభుత్వ చౌక ధరల దుకాణాలకు నెలసరి ‘రేషన్ కోటా’ కేటాయింపు ఏ మూలకూ సరిపోవడంతో లేదు. ప్రజా పంపిణీ వ్యవస్థలోసంస్కరణల్లో భాగంగా అమలు చేస్తున్న పోర్టబిలిటీ విధానం తీవ్ర ప్రభావం చూపుతోంది. గడువుచివరిలో స్టాక్ లేదంటూ డీలర్లుచేతులేత్తుస్తుండటంతో ఆహార భద్రత లబ్ధిదారులకు పీడీఎస్ బియ్యంఅందని ద్రాక్షగా తయారైంది.ప్రజాపంపిణీ వ్యవస్థలో జిల్లా, రాష్ట్ర, జాతీయ పోర్టబిలిటీ విధానం అమలవుతోంది. ఆహార భద్రతకార్డు లబ్ధిదారులను రాష్ట్రంలో ఎక్కడైనా సరుకులు తీసుకునే వెసులుబాటు కలిగింది. తాజాగా ఏపీ తెల్లరేషన్ కార్డు లబ్దిదారులు సైతం తెలంగాణ పరిధిలో ఎక్కడైనా సరుకులు డ్రా చేసుకునే జాతీయ పోర్టబిలిటీ విధానం అమలు కూడా ప్రారంభమైంది. హైదరాబాద్ మహా నగరం పరిధిలో సుమారు 30 లక్షలకు పైగా కుటుంబాలు ఉండగా అందులో సగానికిపైగా కుటుంబాలు దారిద్య్రరేఖకు దిగవనున్నాయి. తెలంగాణ నలు మూలలతో పాటు ఏపీకి చెందిన కుటుంబాలు సైతం ఉపాధి, విద్య, ఇతర అవసరాల కోసం హైదరాబాద్ నగరంలో తాత్కాలిక నివాస సముదాయాలు ఏర్పాటు చేసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో తెలంగాణ రాష్ట్రంలోని ఆహార భద్రత లబ్ధి కుటుంబాలతోపాటు తెల్లరేషన్ కార్డు కలిగిన లబ్ధిదారులు సైతం పోర్టబిలిటీ విధానం కారణంగా నగరంలోనే సరుకులు డ్రా చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో లావాదేవీలు పెరిగి కోటా తక్కువగా ఉండటంతో గడువు లోపలే నిల్వలు ఖాళీ అవుతున్నాయి. పెరగని రేషన్ కోటా.. ప్రజా పంపిణీ వ్యవస్థలో పోర్టబిలిటీ విధానం అమలవుతున్న చౌకధరల దుకాణాల కోటా మాత్రం పెరగటం లేదు. జిల్లా, రాష్ట్ర పోర్టబిలిటీ విధానంతో పాటు గత మూడు మాసాలుగా నేషనల్ పోర్టబిలిటీ విధానం కూడా అమలవుతోంది. ఇప్పటికే రాష్ట్రం నలుమూలల నుంచి నగరంలో మకాం వేసి పేద కుటుంబాలు తమ కోటా పీడీఎస్ బియ్యం ఇక్కడే డ్రా చేస్తున్నారు. తాజాగా నేషనల్ పోర్టబిలిటీ కింద ఏపీకి చెందిన తెల్లరేషన్ కార్డు లబ్ధిదారులు సైతం తమ కోటా ఇక్కడే డ్రా చేయడం ప్రారంభించారు. దీంతో మొత్తమ్మీద సుమారు 30 శాతం వరకు సరుకులు అధికంగా డ్రా జరుగుతోంది. పౌరసరఫరాల విభాగం మాత్రం సరుకుల కోటా పెంచడం లేదు. అవసరమైన కోటాలో సైతం కొంత వరకు కోత విధించి కేటాయిస్తూ వస్తోంది. వాస్తవంగా ప్రతి చౌకధరల దుకాణం పరిధిలోని సుమారు 20 నుంచి 30 శాతం వరకు లబ్ధి కుటుంబాలు వివిధ కారణాలతో సరుకులు డ్రా చేయరు. దీంతో డీలర్లు తమకు కేటాయించిన కోటాలో రెండు దశల్లో కేవలం 70 నుంచి 80 శాతం వరకు మాత్రమే స్టాక్ పాయింట్ల నుంచి సరుకుల డ్రా చేస్తుంటారు. దీంతో పోర్టబిలిటీ లావాదేవీల ప్రభావంతో నిల్వలు గడువు లోపలే పూర్తిగా నిండుకుంటున్నట్లు తెలుస్తోంది. 15 వరకు గడువు.. ప్రభుత్వ చౌకధరల దుకాణాల ద్వారా లబ్ధిదారులు సరుకులు డ్రా చేసుకునే గడువు ప్రతి నెలా 15వ తేదీ వరకు ఉంటుంది. నగరంలోని కొందరు లబ్ధిదారులకు పని ఒత్తిడి, ఇతర కారణాలతో మొదటి పది రోజుల వరకు సరకులు డ్రా చేసుకునేందుకు వీలుపడదు. చివరి రోజల్లో డ్రా చేసుకునే ప్రయత్నిస్తే.. స్టాక్ లేదని డీలర్లు పేర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చివరి రోజుల్లో బియ్యం నిల్వలు ఖాళీ కావడంతో తిరిగి తెప్పించేందుకు డీలర్లు ఆసక్తి కనబర్చడం లేదు. పౌరసరఫరాల శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా..పట్టిపట్టనట్లు వ్యవహరిస్తూన్నానే ఆరోపణలు వినవస్తున్నాయి. ఈ సారైనా సంబంధిత అధికారులు దృష్టి సారించి పీడీఎస్ నిల్వలు పూర్తి కాకముందే డీలర్లు స్టాక్ దిగుమతి చేసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని పేదలు విజ్ఞప్తి చేస్తున్నారు. -
పతులు ఉద్యోగులు.. సతులు డీలర్లు
సాక్షి, చాపాడు: భర్త ప్రభుత్వ ఉద్యోగం చేస్తుండగా అతని భార్య చౌక దుకాణం నిర్వహించడం ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధం. అయినా ఈ నిబంధనలను ఏమాత్రం ఖాతరు చేయకుండా గత కొన్నేళ్లుగా ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగుల భార్యలు చౌక దుకాణం డీలర్లుగా కొనసాగుతున్న సంఘటన మైదుకూరు నియోజకవర్గంలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళితే.. చాపాడు మండలం మొర్రాయిపల్లెకు చెందిన కుమ్మితి వెంకటరాజ్యం షాపు నెంబరు 1114010 చౌకదుకాణం డీలర్‌గా ఉంటోంది. ఈమె భర్త హజరత్‌రెడ్డి అదే మండలంలోని బద్రిపల్లె దళితవాడ ప్రాథమిక పాఠశాలలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. భర్త టీచర్‌గా ఉంటూ భార్య చౌకదుకాణం డీలర్‌గా కొనసాగటం నిబంధనలకు వ్యతిరేకం. హజరత్‌రెడ్డి గత కొన్ని రోజులుగా తన భార్య వెంకట రాజ్యం దగ్గరే ఉంటూ నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తుండటం గమనార్హం. మొర్రాయిపల్లె పేరుతో చౌకదుకాణం ఉండగా వెంకటరాజ్యం నాగాయపల్లెలో ఓ ఇంటిలో రేషన్ పంపిణీ చేస్తోంది. గతంలో బినామీ డీలర్ ద్వారా సరకులు పంపిణీ చేయిస్తుండగా, ఈ నెలలో వీరిరువురే సరుకులు పంపిణీ చేస్తుండటం గమనార్హం. వీరు మాత్రం మైదుకూరులో నివాసం ఉంటున్నారు. గత సెపె్టంబర్ నెలలో రెవెన్యూ అధికారులు జరిపిన తనిఖీల్లో తూకాల్లో వ్యత్యాసాలు రావటంతో చౌకదుకాణంపై కేసు నమోదు చేశారు. అయితే వీరు కోర్టుకెళ్లి స్టే తెచ్చుకున్నారు. నవంబరు నెలలో వీరే రేషన్ పంపిణీ చేసేందుకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో నవంబరు నెల సరుకులను తెచ్చుకున్నారు. తహసీల్దారు ఏమన్నారంటే.. మండలంలోని మొర్రాయిపల్లె చౌకదుకాణం డీలర్‌గా ఉంటున్న కుమ్మితి వెంకటరాజ్యం భర్త హజరత్‌రెడ్డి ప్రభుత్వ టీచర్‌గా పని చేస్తున్నా చౌకదుకాణం నిర్వహించటంపై తహసీల్దారు శ్రీహరిని వివరణ కోరగా.. ప్రభుత్వ ఉద్యోగి భార్య చౌకదుకాణం డీలర్‌గా ఉండకూడదన్నారు. సరుకుల పంపిణీలో టీచర్ ఉండకూడదని, దీనిపై విచారించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఖాజీపేటలోనూ ఇలాంటి పరిస్థితే.. ఖాజీపేట: పట్టణంలోని 16వ నంబర్ చౌకదుకాణం డీలర్ లక్షి్మదేవి భర్త కొండయ్య ఆర్‌ఆండ్‌బీ శాఖలో ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. ఆమె మాత్రం కొన్నేళ్లుగా డీలర్‌గా కొనసాగుతోంది. సరుకుల పంపిణీలో అవకతవకలకు పాల్పడుతోందంటూ ఆమెపై అందిన ఫిర్యాదుల మేరకు ఇటీవల విజిలెన్స్ అధికారులు ఆ చౌక దుకాణంపై దాడులు నిర్వహించి 6ఏ కేసు నమోదు చేశారు. అలాగే షాపును సీజ్ చేశారు. ఈ దుకాణం తనే నిర్వహించాలంటూ ఆమె కోర్టుకెళ్లి స్టే తెచ్చుకుంది. ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి సీజ్ చేసిన సరుకును స్వా«దీనం చేసుకునేందుకు వెళ్లిన అధికారులను సైతం ఆమె అడ్డుకుని నానా హంగామా సృష్టించింది. ప్రభుత్వ ఉద్యోగుల భార్యలు చౌక దుకాణం డీలర్లుగా కొనసాగుతుండటం.. వారికి భర్తలు చేదోడు వాదోడుగా ఉంటుండటంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ సంఘటనపై ఖాజీపేట తహసీల్దార్ సూర్యనారాయణరెడ్డిని వివరణ కోరగా ఆమె భర్త ప్రభుత్వ ఉద్యోగి అనే విషయం తమకు ఇప్పుడే తెలిసిందని, విచారించి చర్యలు తీసుకుంటామన్నారు. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. -
పేదలకు సంతృప్తిగా భోజనం
సాక్షి, శ్రీకాకుళం/అమరావతి: ‘రేషన్ డిపోల ద్వారా ఇస్తున్న బియ్యం ప్రజలు తినే పరిస్థితి లేదు. ఏ బియ్యం అయితే మనం తినగలుతామో వాటినే పేదలకు పంపిణీ చేస్తాం. పూర్తిగా ఫిల్టరింగ్ చేసి.. 5, 10, 15, 20 కేజీలుగా ప్యాక్ చేసి సెప్టెంబర్ నుంచి నేరుగా లబ్ధిదారుల ఇళ్లకే సరఫరా చేస్తాం’ అధికారంలోకి వచ్చిన అనంతరం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసిన వ్యాఖ్యలివి. అందుకు అనుగుణంగానే తొలుత శ్రీకాకుళం జిల్లాలో నాణ్యమైన బియ్యాన్ని పైలట్ ప్రాజెక్ట్ కింద వలంటీర్ల ద్వారా పేదల ఇంటికే పంపిణీ చేయనున్నారు. ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం కాశీబుగ్గలో ప్రారంభించనున్నారు. అనంతరం ఈ నెల 7, 8 తేదీల్లో జిల్లావ్యాప్తంగా బియ్యం పంపిణీ పూర్తి చేసేందుకు చర్యలు తీసుకున్నారు. ఈ కార్యక్రమం రెండో విడతలో విజయనగరం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో చేపడతారు. పంపిణీ ఏర్పాట్లు ఇలా.. జిల్లాను 15,344 క్లస్టర్లుగా విభజించారు. జిల్లాలో ఒక నగరపాలక సంస్థ, ఐదు పురపాలక సంఘాలు, 1,141 గ్రామ పంచాయితీల పరిధిలో 1,865 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. వీటికి మొత్తం 11,924 మంది వలంటీర్లను నియమించారు. ఒక్కొక్క క్లస్టర్లో 50 నుంచి 60 వరకు కుటుంబాలను చేర్చారు. వలంటీర్ల ద్వారా పేదలకు పంపిణీ చేసేందుకు ఇప్పటికే 9,48,105 బియ్యం బ్యాగ్‌లను 2,015 రేషన్ డిపోల్లో సిద్ధంగా ఉంచారు. వీటిలో 5 కిలోల బ్యాగ్‌లు 1,24,049, 10 కిలోల బ్యాగ్‌లు 2,42,035, 15 కిలోల బ్యాగ్‌లు 2,73,764, 20 కిలోల బ్యాగులు 3,08,257 ఉన్నాయి. పంపిణీ కార్యక్రమంలో ఏవైనా లోటుపాట్లు తలెత్తితే తెలుసుకుని పరిష్కరించేందుకు వీలుగా కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. కార్డుదారుల మ్యాపింగ్‌లో సమస్యలు, పోర్టబులిటీ, డీలర్ లేదా వలంటీర్ అందుబాటు, యూనిట్లో తేడాలు రావడం వంటి ఇబ్బందులు ఏమైనా తలెత్తితే లబ్ధిదారులు నేరుగా కంట్రోల్ రూమ్‌కు ఫోన్ ద్వారా తెలియజేస్తే అక్కడికక్కడే పరిష్కరిస్తారు. మరోవైపు నూతన విధానం వల్ల పీడీఎస్ బియ్యం రీసైక్లింగ్ దందాకు, తూకంలో మోసాలకు అడ్డుకట్ట పడనుంది. 20 ఏళ్లుగా పరిశోధనలకే పరిమితం ఉద్దానంలో కిడ్నీ వ్యాధి ఆనవాళ్లు 1990 దశకంలోనే కనిపించాయి. 2000లో సోంపేటకు చెందిన ఐఎంఏ వైద్యులు వై.కృష్ణమూర్తి, పి.శివాజీ బృందం కవిటి ప్రాంతంలో ఈ కేసులను అధికారికంగా గుర్తించారు. 2004లో కేజీహెచ్ వైద్యులు 2005లో పరిశోధన వైద్య శిబిరాలు చేపట్టగా.. 2008 మే 24న నెఫ్రాలజిస్ట్ డాక్టర్ గంగాధర్, హైదరాబాద్ నిమ్స్ ఆర్ఎంఓ శేషాద్రి పర్యటించారు. అదే ఏడాది రాష్ట్ర నీటి విశ్లేషణ పరిశోధనా సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎం.కృష్ణమూర్తి , చీఫ్ కెమిస్ట్ ఎ.సతీష్, 2009లో న్యూయార్క్‌కు చెందిన కిడ్నీ వ్యాధుల నిపుణుడు డాక్టర్ శివప్రసాద్ ఇక్కడ పర్యటించారు. 2011లో డాక్టర్ రవిరాజ్, డాక్టర్ వెలగల శ్రీనివాస్, డాక్టర్ కల్యాణ్ చక్రవర్తి, ఎ.వేణుగోపాల్ బృందం, న్యూయార్క్‌కు చెందిన స్టోనీబ్రూక్స్ యూనివర్సిటీ బృందం, హైదరాబాద్‌కు చెందిన పరిశోధకురాలు సీఐఎస్ఆర్ సుజాత, 2012లో జపాన్, అమెరికన్ బృందాలతోపాటు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కమ్యూనికల్ డిసీజెస్ బృందం అధ్యయనం జరిపాయి. 2013లో హార్వర్డ్ విశ్వవిద్యాలయం, బాబా అటామిక్ రీసెర్చ్ బృందాలు పరిశోధనలు చేశాయి. 2017 నుంచి భారతీయ వైద్యపరిశోధనా మండలి పరిశోధన సాగుతోంది. కిడ్నీ బాధితులకు కొండంత అండ శ్రీకాకుళం జిల్లాలోని ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్యను శాశ్వతంగా పరిష్కరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. పాదయాత్రలోనూ.. అంతకుముందు ఉద్దాన ప్రాంత పర్యటనలో కిడ్నీ బాధితుల కష్టాలను కళ్లారా చూసిన వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి రాగానే చర్యలకు ఉపక్రమించారు. ఐదేళ్లలో చంద్రబాబు చేయలేని పనిని 100 రోజుల పాలనలో చేసి చూపించారు. కిడ్నీ రోగులకు నెలకు రూ.10 వేల పింఛను అందజేస్తున్నారు. వైద్య సేవలందించేందుకు వీలుగా 200 పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, దానికి అనుగుణంగా రీసెర్చ్ సెంటర్, అతి పెద్ద డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేసేందుకు రూ.50 కోట్లు మంజూరు చేశారు. దీంతో సరిపెట్టకుండా వ్యాధికి మూలమైన తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు ఇంటింటికీ కుళాయిల ద్వారా శుద్ధ జలాలను సరఫరా చేసేందుకు ఉపక్రమించారు. ఇందుకోసం రూ.600 కోట్లతో భారీ మంచినీటి పథకాన్ని మంజూరు చేశారు. వీటన్నిటికీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం శంకుస్థాపన చేయనున్నారు. -
రేషన్ షాపుల్లో నయా దందా!
‘‘మహబూబ్‌నగర్‌లోని న్యూటౌన్ పరిధిలో నివసిస్తున్న శివశంకర్ బియ్యం కోసం రేషన్‌షాపుకు వెళ్లాడు. సదరు రేషన్ డీలర్ ముందుగా అతనికి రేషన్ బియ్యం ఇస్తూనే టేబుల్‌పై గోధుమ పిండి, వంటనూనె, సర్ఫ్ పాకెట్ పెట్టాడు. ఇవీ కొత్తగా వచ్చిన మంచి బ్రాండ్లు.. బయట మార్కెట్లో ధర ఎక్కువగా ఉంది. మా దగ్గర తక్కువ ధరకే ఇస్తున్నాం. తీసుకోవాలని పట్టుబట్టాడు. దానికి శివశంకర్ ససేమిరా అన్నాడు. అటు రేషన్ డీలర్ కూడా పట్టు వదలకుండా అతన్ని కనీసం రెండు సరుకులైనా తీసుకోవాలని ఒత్తిడి తెచ్చాడు. దీంతో శంకర్ గత్యంతరం లేక రూ. 35లు చెల్లించి గోధుమ పిండి పాకెట్ తీసుకున్నాడు. ఇలాంటి డీలర్లు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా చాలా మందే ఉన్నారు. ప్రభుత్వం సరఫరా చేసే సరుకుల కోసం తమ వద్దకు వచ్చే వినియోగదారులను బలవంత పెట్టి మరీ అనధికారికంగా నిత్యావసర వస్తువులు అంటగడుతున్నారు. సాక్షి, మహబూబ్‌నగర్ : ఉమ్మడి పాలమూరు జిల్లాలో పలు రేషన్ దుకాణాలు గాడితప్పాయి. ప్రభుత్వం సరఫరా చేసే బియ్యం, కిరోసిన్ మాత్రమే ఆయా దుకాణాల్లో విక్రయించాల్సి ఉండగా ఇప్పుడవి కిరాణం షాపులుగా దర్శనమిస్తున్నాయి. సబ్బులు, సర్ఫ్, గోధుమలు, గోధుమ పిండి, వంటనూనె, పప్పుతోకళకళలాడుతున్నాయి. వీటిలో దాదాపు అన్నీ లోకల్ బ్రాండ్లే కావడం విశేషం. ప్రభుత్వేతరసరుకులు వద్దన్నా చాలా మంది డీలర్లు బలవంతంగా వినియోగదారులకు వాటిని అంటగడుతున్నారు. పలు ప్రాంతాల్లోనయితే ఇచ్చిన సరుకులు తీసుకుంటేనే బియ్యం, కిరోసిన్ ఇస్తున్నట్లు సమాచారం. ఇంకొన్ని చోట్ల బియ్యం కోసం వచ్చిన వినియోగదారులకు ప్రభుత్వేతర సరుకులు అంటగట్టి.. రూ.1కిలో ఉన్న రేషన్ బియ్యాన్ని ఉచితంగా అందజేస్తున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. దీంతో చాలా మంది వినియోగదారులు చేసేదేమీ లేక బియ్యం, కిరోసిన్ కోసం డీలర్లు ఇచ్చిన సరుకులు కొనుగోలు చేయాల్సివస్తోంది. ము ఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ అక్రమ వ్యా పారం మూడు పువ్వులు ఆరుకాయలుగా సా గుతోంది. తెరచాటున జరుగుతున్న ఈ వ్యా పారంతో రేషన్ షాపులకు నిత్యావసర వస్తువులు సరఫరా చేస్తోన్న వ్యాపారులతో పాటు డీలర్లూ పెద్ద మొత్తంలో లాభపడుతున్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలో 510 రేషన్ షాపులు ఉండగా 2,38,932 ఆహారభద్రత కార్డులున్నాయి. నాగర్‌కర్నూల్ జిల్లాలో 558 షాపులు, 3.33లక్షల కార్డులు..వనపర్తి జిల్లాలో 325 షాపులు, 1,55,021 ఆహార భద్రత కార్డులున్నాయి. ఏడాది క్రితం వరకు రేషన్ షాపుల్లో కందిపప్పు, చింతపండు, పామాయిల్, చక్కెర, గోధుమలు, కారం, ఉప్పు, పసుపు, పెసరపప్పు, బియ్యం, కిరోసిన్ ఇచ్చేవారు. ఒక్కొక్కటీగా అన్ని సరుకులపై సబ్సిడీ ఎత్తివేసిన ప్రభుత్వం రేషన్ షాపులను కేవలం బియ్యం, కిరోసిన్, ఏఏవై కార్డుదారులకు చక్కెర ఇస్తుంది. కుటుంబంలో ఎంత మంది ఉంటే అంత మందికి ఒక్కొక్కరికి ఆరు కిలోల చొప్పున బియ్యం.. ప్రతి కార్డుపై లీటరు కిరోసిన్ ఇస్తున్నారు. అయితే.. పంపిణీ చేస్తోన్న బియ్యం, కిరోసిన్‌పై ఒక రూపాయి నుంచి రూ.2 వరకు కమీషన్ అందుతోంది. షాపులకు సరుకులు.. డీలర్లకు కమీషన్లు.. డీలర్ల ఆర్థిక పరిస్థితిని గమనించిన కొందరు బడా వ్యాపారులు కొత్త తరహా మార్కెటింగ్‌కు తెరలేపారు. రేషన్ షాపుల ద్వారా పలు రకాల నిత్యావసర సరుకులు విక్రయిస్తే ఎక్కువ కమీషన్లు ఇచ్చేందుకు చాలా మంది డీలర్లతో ఒప్పందం కుదుర్చుకున్నారు. గుట్టుచప్పుడు కాకుండా.. వంట పాత్రలు కడిగే సబ్బు మొదలు వంట నూనె వరకు సుమారు పది సరుకులు ఆయా షాపులకు సరఫరా చేసి ఎంఆర్పీ ధరల ప్రకారం డీలర్లతో అమ్మిస్తున్నారు. ఒక్కో సరుకుపై ఒక్కో కమీషన్ మేరకు డీలర్లకు లాభం చేకూరుస్తున్నారు. ఉదాహరణకు విజయ, కోటా, టేస్టీ గోల్డ్ పేరిట రూ.50 నుంచి రూ.60 వరకు పాకెట్లలో పామాయిల్ విక్రయిస్తున్నారు. మినార్ పేరిట రూ. 35 చొప్పున గోధుమ పిండి (లోకల్ బ్రాండ్) డీలర్ల ద్వారా విక్రయిస్తున్నారు. ఈఈఈ పేరిట బట్టలు ఉతికే సర్ఫ్, సబ్బులు వంటి లోకల్ బ్రాండ్లు విక్రయిస్తూ కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నారు. ప్రస్తుతం ఈ వ్యాపారం ముఖ్యంగా మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి జిల్లాలో జోరుగా సాగుతోంది. ఆయా జిల్లాలకు చెందిన పలువురు డీలర్లే హైదరాబాద్ నుంచి సరుకులు తెప్పించి అన్ని షాపులకు చేరవేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇందుకోసం జిల్లా కేంద్రాల్లో స్టాక్ పాయింట్లు కూడా ఏర్పాట్లు చేసుకున్నారు. పలు రేషన్ దుకాణాల్లో ఈ అక్రమ వ్యాపారం జోరుగా సాగుతున్నా సంబంధిత అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
గ్యాస్ ఉంటే.. కిరోసిన్ కట్
గ్యాస్ కనెక్షన్ ఉన్న వారికి కిరోసిన్ బంద్ చేయనున్నారు. రేషన్ దుకాణాల ద్వారా ఇచ్చే నీలి కిరోసిన్‌ను ఈనెల నుంచే నిలిపి వేయనున్నారు. ఈ మేరకు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ ఉత్తర్వులు జారీ చేసిందని సంబంధిత అధికారులు పేర్కొంటున్నారు. గ్యాస్ కనెక్షన్లు లేని దీపం పథకం కింద సిలిండర్లు పొందిన లబ్ధిదారులకు మాత్రమే నెలకు లీటర్ చొప్పున కిరోసిన్ ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించినట్లు తెలిపారు. గ్యాస్ సిలిండర్లు ఉన్నవారికి కిరోసిన్ ఇస్తే దానిని బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్నారని భావించిన పౌరసరఫరాల శాఖ ఈ మేరకు నిర్ణయం తీసుకుందని చెబుతున్నారు. సాక్షి, మెదక్ : జిల్లా వ్యాప్తంగా 521 రేషన్‌దుకాణాలు ఉండగా 2,14,165 రేషన్ కార్డులు ఉన్నాయి. వాటిలో ఆహారభద్రత(తెల్లరేషన్) కార్డులు 2,01,059 అంత్యోదయ కార్డులు 13018 అన్నపూర్ణ 88 కార్డులు చొప్పున జిల్లాలో ఉన్నాయి. వీరికి నెలకు 2,14,000 లీటర్ల కిరోసిన్‌ను పంపిణీ చేస్తున్నారు. జిల్లాలో నేరుగా తీసుకున్న వాటితో పాటు దీపం, పథకం కింద గ్యాస్పు పొందిన వారితో పాటు అసలే గ్యాస్ కనెక్షన్లు లేని వారు మొత్తం జిల్లాలో 84 వేల కుటుంబాలు ఉన్నాయి. ఈలెక్కన స్వయంగా గ్యాస్కనెక్షన్లు పొందిన వారి సంఖ్య 1,30,165 మంది ఉన్నారు. దీంతో వీరందరికి ఈనెల నుంచి కిరోసిన్ బంద్ కానుంది. కేవలం దీపం పథకం ద్వారా గ్యాస్ పొందిన వారితో పాటు అసలు ఏ గ్యాస్కనెక్షన్ లేనటువంటి 84 వేల కుటుంబాలకు మాత్రమే నెలకు ఒక్కో కుటుంబానికి 1లీటర్ కిరోసిన్ ఇవ్వనున్నారు. ఇంతకు ముందు గ్యాస్కనెక్షన్తో సంబంధం లేకుండా ఒక్కో కార్డుపై రూ.33కు లీటర్ చొప్పున అందించే వారు. ఇక నుంచి అన్ని కుటుంబాలకు ఇవ్వరాదని అధికారులు నిర్ణయించారు. నల్లబజారుకు తరలిస్తున్నారని.. కిరోసిన్ నల్లబజారుకు తరలిపోకుండా ఉండేందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ముఖ్యంగా పట్టణాల్లో అందరికి గ్యాస్ కనెక్షన్లు ఉండగా పల్లెలోనూ వివిధ పథకాల కింద కొంత మంది లబ్ధిదారులకు అందించారు. వీరికి రేషన్ కార్డులు ఉండటంతో ప్రతినెలా రేషన్ దుకాణాల ద్వార కిరోసిన్ తీసుకునే వారు. వారిలో కొందరికి కిరోషిన్ అవసరం లేకున్నా తీసుకెళ్లి బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తూ అమ్ముకుంటుండగా, అవసరం లేని వారు రేషన్ షాపుల్లో నుంచి తీసుకెళ్లేవారు కాదు. దీంతో సదరు డీలర్ మిగిలిన దానిని నల్లబజార్లో విక్రయించుకునే వారు. దీంతో గ్యాస్ కనెక్షన్ ఉన్న వారికి కిరోసిన్ నిలిపి వేయాలని పౌరసరఫరాలశాఖ నిర్ణయించి ఈ నెల నుంచి జిల్లాకు కిరోసిన్ నిలిపివేశారు. కరెంట్‌పోతే చీకట్లోనే.. గ్యాస్ కనెక్షన్ ఉన్నవారికి కిరోసిన్ నిలిపివేస్తునట్లు పౌరసరాఫరాలశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో జిల్లాలో 1,30,165 కుటుంబాలకు సంబంధించి గ్యాస్ కనెక్షన్లు నేరుగా తీసుకున్న వారు ఉన్నారు. దీంతో వీరందరికి ఈనెల నుంచే కిరోసిన్ నిలిపివేస్తునట్లు జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు పేర్కొంటున్నారు. కానీ రాత్రి వేళలో కరెంట్ పోయినట్లయితే ఆ కుటుంబాలు చీకట్లో మగ్గే పరిస్థితి నెలకొంటుంది. దీంతో జిల్లాలో ఈ విషయంలో ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయని పలువురు పేర్కొంటున్నాయి. నేడు గ్యాస్ కనెక్షన్ పొందిన వారు ధనవంతులు అనుకుంటే పౌరసరఫరాల శాఖ పప్పులో కాలు వేసినట్లే. గతంలో వంటచెరుకు కోసం అడవులను నరికిన జనాలకు వాటిని నరకటంతో జరిగిన నష్టాలను తెలుసుకొని ఎన్ని ఇబ్బందులు ఎదురైనా గ్యాస్ కనెక్షన్లు తీసుకున్నారు. వారిని అభినందించాల్సిన పౌరసరఫరాలశాఖ, ప్రభుత్వం వారిని ధనవంతుల కింద జమకట్టి కిరోసిన్ కట్ చేయటం సమంజసం కాదని పలువురు పేర్కొంటున్నారు. ఇక నుంచి కిరోసిన్ బంద్ గ్యాస్ కనెక్షన్ ఉన్న వారందరికీ ఈనెల నుంచి కిరోసిన్ నిలిపివేస్తున్నాం. దీపం పథకంలో గ్యాస్ కనెక్షన్లు పొందిన పేదలతో పాటు అసలు గ్యాస్ కనెక్షన్ లేని వారికి మాత్రమే నెలకు ఒక లీటర్ చొప్పున కిరోసిన్ ఇస్తాం. జిల్లాలో మొత్తం 2,14,165 రేషన్ కార్డులు ఉండగా అందులో దీపం పథకం ద్వారా గ్యాస్ కనెక్షన్ తీసుకున్న వారితో పాటు అస్సలు గ్యాస్ కనెక్షన్లు లేనివారు 84 వేల మంది ఉన్నారు. వారికి మాత్రమే నెలకు లీటర్ చొప్పున కిరోసిన్ ఇవ్వటం జరుగుతుంది. ఈలెక్కన 1,30,165 మందికి కిరోసిన్ నిలిపి వేయటం జరిగింది. – శ్రీకాంత్‌రెడ్డి, ఇన్చార్జి డీఎస్వో -
రేషన్ షాపులపై నిఘా!
సాక్షి, సిటీబ్యూరో: ప్రభుత్వ చౌకధరల దుకాణాల డీలర్ల అక్రమాలకు కళ్లెం వేసేందుకు పౌరసరఫరాల శాఖ దృష్టి సారించింది. ప్రత్యేక విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగాన్ని రంగంలోకి దింపింది. ఈ బృందాలు రేషన్ షాపులపై ఆకస్మికంగా దాడులు నిర్వహిస్తూ రికార్డులు, సరుకుల నిల్వల తనిఖీలకు శ్రీకారం చుట్టాయి. వాటిలో ఏ మాత్రం హెచ్చుతగ్గులున్నా డీలర్లకు నోటీసులివ్వడంతో పాటు కేసులు నమోదు చేస్తున్నారు. ఇప్పటికే నగరంలోని పలు దుకాణాలపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు చేసి డీలర్ల అక్రమాలను గుర్తించారు. ఖైరతాబాద్‌లోని చింతల బస్తీ, అంబర్‌పేటలోని గోల్నాక తులసినగర్‌లోని రేషన్ షాపులను తనిఖీ చేయగా రికార్డులు, స్టాక్ నిల్వలకు పొంతన లేదని తేలింది. దీంతో డీలర్లకు నోటీసులు జారీ చేయడమే కాకుండా కేసులు నమోదు చేశారు. ఈ–పాస్‌లో సైతం అక్రమాలు ప్రభుత్వ చౌకధరల దుకాణాల్లో అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి ఈ–పాస్ (బయోమెట్రిక్) ద్వారా çసబ్సిడీ సరుకుల పంపిణీ జరుగుతున్నా..అందులో సైతం డీలర్లు తమ చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నారు. ఆహార భద్రత కార్డు లబ్ధి కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరు వచ్చి వేలిముద్ర వేసి సరుకులు డ్రా చేయాల్సి ఉంటుంది. ఇక్కడి వరకు బాగానే ఉన్నా... సరుకుల పంపిణీలోనే డీలర్లు చేతివాటం ప్రదర్శిన్నారు. కేవలం బియ్యం మాత్రమే ఇచ్చి కిరోసిన్, గోధుములు ఇతరత్రా ఇవ్వకుండా ఈ–పాస్ యంత్రంలో మాత్రం డ్రా చేస్తున్నట్లు నమోదు చేయడం సర్వసాధారణమైంది. వాస్తవంగా సరుకుల డ్రాకు సంబంధించి సంక్షిప్త సమాచారం సంబంధిత కార్డుదారుడి ఫోన్‌కు రావాల్సి ఉంటుంది. అయితే ఈ–పాస్‌ద్వారా ఎస్ఎంఎస్లు ఫోన్లకు చేరకుండా చేయడంలో డీలర్లు సఫలీకృతమయ్యారు. దీంతో లబ్ధిదారులకు కేవలం బియ్యం మాత్రమే అంటగడుతూ మిగతా సరుకు బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్నారు. లబ్ధిదారులు గట్టిగా నిలదీస్తే స్టాక్ రాలేదని, లేకుంటే అయిపోయిందని చెబుతున్నారు. రేషన్ పోర్టబిలిటీ అమలవుతున్న కారణంగా సరుకుల ఎగవేత మరింత కలిసి వస్తోంది. 520 దుకాణాల గుర్తింపు? గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని సుమారు 520 ప్రభుత్వ చౌకధరల దుకాణాల్లో డీలర్లు అక్రమాలకు పాల్పడుతున్నట్లు పౌరసరఫరాల శాఖ ప్రాథమికంగా గుర్తించి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు జాబితా అందించినట్లు తెలుస్తోంది. ఎక్కువ ఫిర్యాదుల గల చౌకధరల దుకాణాలపై దాడులు ప్రారంభమయ్యాయి. మహానగర పరిధిలో మూడు పౌరసరఫరాల జిల్లాలు విస్తరించి ఉన్నాయి. హైదరాబాద్–రంగారెడ్డి– మేడ్చల్ జిల్లాల పరిధిలో పన్నెండు పౌరసరఫరాల సర్కిల్స్ ఉన్నాయి. వాటి పరిధిలోని 1545 ప్రభుత్వ చౌకధరల దుకాణాల ద్వారా సుమారు 16,02,134 ఆహార భద్రత కార్డులకు సబ్సిడి సరుకుల పంపిణీ జరుగుతోంది. హైదరాబాద్ పౌరసరఫరాల విభాగం పరిధిలో 5,85,039 కార్డులు ఉండగా, అందులో 21,85,668 యూనిట్లు ఉన్నాయి. రంగారెడ్డి జిల్లా పరిధిలో 5,23,089 కార్డులు ఉండగా అందులో 17,46,078 యూనిట్లు, మేడ్చల్ మల్కాజిగిరి పరిధిలో 4,94,006 కార్డులు ఉండగా, అందులో 16,47,263 యూనిట్లు ఉన్నట్లు అధికార లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. బియ్యం అవసరం లేని లబ్ధిదారులు బయోమెట్రిక్ ఇచ్చి డీలర్లకే కిలోకు పది రూపాయల చొప్పున అప్పగిస్తుండగా, ఇక గోధుములు, కిరోసిన్‌ను మాత్రం డీలర్లు నల్లబజారుకు తరలించడం మామూలైంది. -
అంగన్వాడీలకు రేషన్ ద్వారా బియ్యం
సాక్షి, హైదరాబాద్: అంగన్వాడీ కేంద్రాలకు రేషన్ షాపుల ద్వారా బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని శుక్రవారం పౌరసరఫరాల శాఖ రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించింది. అంగన్వాడీ కేంద్రాలకు బియ్యం పంపిణీలో పారదర్శకత, జవాబుదారీతనం పెంచడం కోసం వేలిముద్రల ఆధారంగా రాష్ట్రంలో ఉన్న 35,700 అంగన్వాడీ కేంద్రాలకు సమీపంలో ఉన్న రేషన్‌షాపుల్లో ఈ–పాస్ యంత్రాల ద్వారా బియ్యం పంపిణీ ప్రక్రియను చేపట్టింది. ఇందుకోసం అంగన్వాడీ కేంద్రాల్లో పనిచేస్తున్న 72 వేల మంది అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు, సూపర్వైజర్ల ఆధార్‌తోపాటు వేలిముద్రలను ఈ–పాస్ మెషీన్లకు నేషనల్ ఇన్ఫర్మాటిక్ సెంటర్ (ఎన్ఐసీ) సహకారంతో అనుసంధానం చేసింది. రాష్ట్రంలోని 31 జిల్లాల్లో శుక్రవారం పంపిణీ ప్రక్రియ ప్రారంభమైంది. మేడ్చల్ జిల్లాలోని కొన్ని రేషన్ షాపుల్లో బియ్యం సరఫరా ప్రక్రి య, అంగన్వాడీ కేంద్రాల్లో బియ్యం నాణ్యతను మహిళా, శిశు సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జగదీశ్వర్, డైరెక్టర్ విజయేందిర బోయి, పౌరసరఫరాల శాఖ కమిషనర్ అకున్ సబర్వాల్ పరిశీలించారు. బియ్యం పంపిణీలో ఎలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తకుండా పౌరసరఫరాల శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖ సమన్వయంతో పనిచేయాలని అకున్ సభర్వాల్ సూచించారు. కాగా, రేషన్‌షాపుల ద్వారా వేలిముద్రలతో బియ్యం సరఫరాతో అక్రమాలకు అడ్డుకట్ట పడనుంది. -
పుచ్చిపోయిన పప్పు.. బూజు పట్టిన బెల్లం
సాక్షి, అమరావతి/సాక్షి నెట్వర్క్: ఈమె పేరు జయమ్మ (రేషన్ కార్డు నంబర్122700100427). అనంతపురం జిల్లా నార్పల మండల కేంద్రంలో రేషన్ దుకాణంలో ప్రభుత్వం ఇచ్చిన చంద్రన్న సంక్రాంతి కానుక సరుకులు తీసుకొని ఇంటికొచ్చింది. ప్యాకింగ్‌లో ఉన్న కందిపప్పు, గోధుమపిండి తీసి చూడగా అందులో పురుగులు కన్పించాయి. బెల్లం బూజు పట్టింది. రేషన్ డీలర్ వద్దకు తీసుకెళ్లి సమస్యను వివరించింది. పురుగులున్న విషయాన్ని గుర్తించి అధికారులు ఆమెకు వేరే సరుకులు ఇచ్చారు. ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం గోనేపల్లివారిపాలెం గ్రామానికి చెందిన కోనేటి వెంకటసుబ్బయ్య సంక్రాంతి పండుగకు ప్రభుత్వం ఇచ్చిన చంద్రన్న సరుకులు తీసుకున్నాడు. ప్లాస్టిక్ డబ్బాలో బూజు పట్టిన బెల్లం కన్పించింది. ఆ గ్రామంలో మరో 100 మందికి ఇలాగే బూజు పట్టిన బెల్లం వచ్చింది. దాన్ని వెనక్కి తీసుకుని, నాణ్యమైన బెల్లం ఇవ్వాలని కోరితే తనకు సంబంధం లేదంటూ రేషన్ డీలర్ చేతులెత్తేశాడు. పండుగల సందర్భంగా ప్రభుత్వం ఇస్తున్న చంద్రన్న కానుకలో నాణ్యత మచ్చుకైనా కనిపించడం లేదు. పుచ్చిపోయిన కందిపప్పు, పురుగులు పట్టిన శనగపప్పు, బూజు పట్టి పాకంలా మారిన బెల్లం, కాలం చెల్లిన నెయ్యితో పండుగపూట పిండివంటలు ఎలా చేసుకోవాలని లబ్ధిదారులు ప్రశ్నిస్తున్నారు. ఈ సరుకుల పంపిణీ టెండర్లను ప్రతిఏటా అధికార పార్టీ నాయకులే దక్కించుకుంటున్నారు. వారు పనికిరాని సరుకులు పంపిణీ చేస్తున్నా అధికారులు గట్టిగా నిలదీయలేకపోతున్నారు. చంద్రన్న కానుక పథకం అమలుకు ప్రతిఏటా దాదాపు రూ.350 కోట్లు ఖర్చు చేస్తున్నారు. నాసిరకం సరుకులు ఇస్తున్నారంటూ లబ్ధిదారులు సాక్షాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబుకే ఫిర్యాదులు చేస్తున్నా పరిస్థితిలో మార్పు రావడం లేదు. నాణ్యత లేని కానుక సరఫరా చేసిన కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్టులో ఉంచుతామని ప్రభుత్వం ప్రకటించినా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు లేవు. పనికిరాని సరుకులు తీసుకుని ఏం చేసుకోవాలని ప్రశ్నిస్తే... ఉచితంగా ఇస్తున్నాం, నోరు మూసుకొని తీసుకెళ్లండి అంటూ అధికార పార్టీ నేతలు, డీలర్లు దబాయిస్తున్నారని లబ్ధిదారులు వాపోతున్నారు. నాణ్యత లేని, కాలం తీరిన సరుకులను సేకరించి, చంద్రన్న కానుక పేరిట పేదలకు పంపిణీ చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వేలిముద్ర పడితేనే సరుకులు ఈ–పాస్ యంత్రంలో వేలిముద్రలు పడితేనే లబ్ధిదారులకు సంక్రాంతి కానుక సరుకులు అందజేస్తున్నారు. వివిధ కారణాలతో వేలిముద్రలు సరిగా పడని 18 నుండి 20 శాతం మందికి సరుకులు ఇప్పటికీ అందలేదు. రాష్ట్రంలో 1.44 కోట్ల తెల్లరేషన్‌కార్డులున్న కుటుంబాలు ఉండగా, ఇప్పటిదాకా 1.17 కోట్ల కుటుంబాలకు మాత్రమే చంద్రన్న కానుక సరుకులు అందాయి. దాదాపు 27 లక్షల కుటుంబాలకు సరుకులు అందలేదు. తూకాల్లోనూ మోసాలే.. చంద్రన్న కానుక పేరిట ఇస్తున్న సరుకుల్లో నాణ్యత లేకపోవడంతోపాటు తూకాల్లోనూ మోసాలు జరుగుతున్నాయి. నెయ్యి 100 గ్రాములు ఇవ్వాల్సి ఉండగా ప్యాకెట్లలో 90 గ్రాములు మాత్రమే ఉంటోంది. అరకిలో నూనెకు బదులు 450 గ్రాములే ఇస్తున్నారు. గోధుమపిండి, కందిపప్పు, శనగపప్పు 10 నుంచి 30 గ్రాముల తక్కువగా వస్తున్నాయని లబ్ధిదారులు అంటున్నారు. ఒక్కో కానుకకు రాష్ట్ర ప్రభుత్వం రూ.207.94 వెచ్చిస్తోంది. ఇందులో అరకిలో బెల్లం ధర రూ.24.70, అరకిలో గోధుమ పిండి రూ.29.78, అరకిలో శనగపప్పు రూ.29.58, అరకిలో కందిపప్పు రూ.36.50, అర లీటర్ పామాయిల్ రూ.39.83, 100 గ్రాముల నెయ్యి ధర రూ.30.55, సంచికి రూ.17 చొప్పున కేటాయిస్తోంది. బయట మార్కెట్లో ఇవే ధరలకు నాణ్యమైన సరుకులు వస్తాయని లబ్ధిదారులు చెబుతున్నారు. చంద్రన్న కానుక పథకం కాంట్రాక్టర్లకే లబ్ధి చేకూర్చేలా ఉందని పేర్కొంటున్నారు. మిగిలిపోయిన పాత పప్పు అంటగట్టారు ‘‘సంక్రాంతి సందర్భంగా ఇచ్చిన చంద్రన్న కానుక పూర్తిగా నాసిరకంగా ఉంది. నల్లగా మారిన బెల్లం ఇచ్చారు. తింటే ఏమౌతుందోనని భయమేస్తోంది. శనగపప్పు, కందిపప్పులో పురుగులు కనిపించాయి. మిగిలిపోయిన పాత పప్పును అంటగట్టారని అనుమానంగా ఉంది’’ – మల్లెల భవానీ, ఆటోనగర్, విజయవాడ -
పోర్టబులిటీ ద్వారా రేషన్ సరుకులు
గజపతినగరం : జిల్లాలో 70 వేల రేషన్‌కార్డుదారులకు పోర్టబులిటీ ద్వారా రేషన్ సరుకులు ఇస్తున్నట్లు జిల్లా పౌరసరఫరాల అధికారి ఎన్.సుబ్బరాజు అన్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాలలో సమారు మూడు లక్షల మందికి ఈ విధానం వల్ల సరుకులు ఇస్తున్నట్లు చెప్పారు. పురిటిపెంట రేషన్‌డిపోను ఆదివారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ, ఈకేవైసీ వేగవంతం చేయడంలో భాగంగా తాను పర్యటిస్తున్నట్లు చెప్పారు. జిల్లాలో 1.36 లక్షల మందికి ఈకేవైసీ చేయాల్సి ఉందన్నారు. అందుకోసమే డిపోలను సందర్శిస్తూ వేగవంతానికి చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. అలాగే 2.1 లక్షల మందికి యూఐడీ ఈకేవైసీ చేయాల్సి ఉందని తెలిపారు. 1117 కార్డులకు బయోమెట్రిక్ అథంటికేషన్ పూర్తికాలేదని, ఐదు రోజుల్లో కార్డుదారులు అప్డేట్ చేసుకోవాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వ గ్రామ స్వరాజ్య అభియాన్‌లో ఉజ్వల పథకం ద్వారా జిల్లాలో 25 వేల కుటుంబాలకు గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేసినట్లు చెప్పారు. గత ఖరీఫ్‌లో సేకరించిన ధాన్యానికి మిల్లర్ల నుంచి 73 వేల మెట్రిక్ టన్నుల బియ్యం ఎఫ్‌సీఐకి రావాల్సి ఉందని తెలిపారు. కొత్తగా రేషన్‌కార్డులో సభ్యులు చేరడానికి అవకాశం కల్పించినట్లు చెప్పారు. పాఠశాలలు, వసతిగృహాలు, అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేసే బియ్యం నాసిరకంగా ఉండడం వల్ల తినడానికి విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని విలేకరులు ప్రశ్నించగా, నాణ్యమైన బియ్యం పంపిణీ చేసేలా గిడ్డంగుల ఇన్చార్జులకు ఆదేశాలు జారీ చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో గజపతినగరం పౌరసరఫరాల ఉప తహసీల్దార్ ఎన్‌వీవీఎస్‌ఎన్ మూర్తి పాల్గొన్నారు. 1100 నంబర్‌కు ఫోన్ చేయాలి.. దత్తిరాజేరు: కొత్తగా రేషన్‌కార్డులు కావాలనకునేవారు 1100 నంబర్‌కు ఫోన్ చేస్తే పూర్తి సమాచారం తెలుస్తుందని డీఎస్ఓ ఎన్. సుబ్బరాజు తెలిపారు.మండలంలోని పెదమానాపురం, మరడాంలో గల రేషన్ షాపులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సరుకుల పంపిణీలో తేడాలుంటే చర్యలు తప్పవన్నారు. ఈ నెల 19 నుంచి 24 వరకు కార్డుల్లో పేర్లు రద్దయిన వారికి డీలర్ద ద్వారా సరుకులు ఇప్పిస్తున్నట్లు చెప్పారు. ఇంతవరకు బయోమెట్రిక్ చేసుకోలేని వారందరూ వెంటనే బయోమెట్రిక్ చేసుకోవాలని సూచించారు. 13 సంవత్సాలు దాటిన పిల్లలకు కూడా తప్పనిసరిగా బయోమెట్రిక్ చేయించాలన్నారు. గతంలో చాలా కటుంబాలు పల్స్‌సర్వేలో పాల్గొన్నా వారి పేర్లు పౌరసరఫరాల జాబితాలో చేరకపోవడంతో రేషన్ సరుకులు అందలేదన్నారు.త్వరలో వారిందరికీ సరుకులు అందించడానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. అనంతరం పెదమానాపురంలో చంద్రన్న విలేజ్ మాల్స్‌ను పరిశీలించారు. కార్యక్రమంలో మండల పౌరసరఫరాల అధికారి రవిశంకర్ పాల్గొన్నారు. -
ఐరిష్‌తో రేషన్
సిరిసిల్ల : ప్రజాపంపిణీని మరింత పారదర్శకంగా నిర్వహించేందుకు రేషన్ బియ్యం పొందే లబ్ధిదారులకు ఐరిష్ (కంటిపాపల) పరీక్షలను నిర్వహిస్తున్నారు. రేషన్ బియ్యం పొందే వారు ఇప్పటి వరకు బయోమెట్రిక్ (వేలిముద్రలు) విధానంలో సరకులు తీసుకునే వారు. ఇప్పటి నుంచి బయోమెట్రిక్‌తో పాటు ఐరిష్ విధానాన్ని పయోగాత్మకంగా రాష్ట్రంలోని నాలుగు జిల్లాల్లో అమలు చేస్తున్నారు. తొలి విడతగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆగస్ట్ 15వ తేదీ నుంచి ఐరిష్ విధానం అమలులోకి వచ్చింది. జిల్లాలో కొత్తగా ఆవిర్భవించిన గ్రామపంచాయతీల్లోనూ రేషన్ దుకాణాలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రజాపంపిణీలో ఐరిష్‌తో మరో సంస్కరణలకు సిరిసిల్ల జిల్లాలో శ్రీకారం చుడుతున్నారు. పైలెట్ ప్రాజెక్టుగా సిరిసిల్లలో.. రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, యాదాద్రి, మంచిర్యాల జిల్లాల్లో పైలెట్ ప్రాజెక్టుగా ఐరిష్ విధానం అమలు చేయనున్నారు. ఈనెల 15వ తేదీనుంచి రేషన్ బియ్యం పంపిణీలో ఈపద్ధతి పాటిస్తున్నారు. ఇప్పటికే జిల్లావ్యాప్తంగా బయోమెట్రిక్ విధానం అమలులో ఉండగా.. ఇటీవల ఫోర్టబులిటీ ద్వారా రేషన్ సరుకులను ఏ దుకాణంలోనైనా పొందే వెసులుబాటు కల్పించారు. ఆన్లైన్ విధానాన్ని సమర్థవంతంగా అమలు చేస్తున్నారు. ఈవిధానంలో వేలిముద్రలు పడక ఇబ్బందులు పడే వృద్ధులు, ఇతరులకు మరో వెసులుబాటు కల్పిస్తూ.. ఐరిష్ విధానాన్ని తెరపైకి తెచ్చారు. జిల్లాలో ఈ పద్ధతిని పైలెట్ ప్రాజెక్టుగా ప్రవేశపెడుతున్నారు. రెండోవిడతలో.. సెప్టెంబరు 1వ తేదీనుంచి సిద్దిపేట, జగిత్యాల, మహబూబ్‌నగర్ జిల్లాలో అమలు చేస్తారు. సెప్టెంబరు 25వ తేదీ నుంచి రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ ఐరిష్ విధానం అమలు చేయనున్నట్లు పౌరసరఫరా అధికారులు ప్రకటించారు. బయోమెట్రిక్‌తో 2619.80 క్వింటాళ్ల మిగులు.. బయోమెట్రిక్ విధానం అమలులోకి రావడంతో జిల్లావ్యాప్తంగా 2,619.80 క్వింటాళ్ల బియ్యం మిగులుతున్నాయి. 344 రేషన్ దుకాణాల ద్వారా నెలనెలా సరఫరా అయ్యే బియ్యం.. బోగస్ లబ్ధిదారుల పేరుతో స్వాహా అయ్యేవి. ప్రతీ లబ్ధిదారు విధిగా వేలిముద్ర వేసి రేషన్ బియ్యం పొందాలనే నిబంధనలు విధించడంతో బియ్యం మిగులుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఈవిధానంతో ప్రజాధనం భారీగా ఆదా కావడంతో ప్రభుత్వం ఐరిష్ విధానాన్ని అమలు చేయాలని భావిస్తోంది. ఇప్పటికే ఉన్న బయోమెట్రిక్ మిషన్లకు కొత్త సాఫ్ట్వేర్ జతచేసి ఐరిష్‌ను నమోదు చేస్తారు. దీంతో బయోమెట్రిక్‌కు తోడుగా.. ఐరిష్ నమోదుతో రేషన్ పంపిణీలో అక్రమాలను పూర్తిస్థాయిలో కట్టడి చేయవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. కొత్త గ్రామపంచాయతీల్లో రేషన్ దుకాణాలు.. జిల్లాలో కొత్తగా ఏర్పాటైన 61 గ్రామపంచాయతీల్లో కొత్తగా రేషన్ దుకాణాలను ఏర్పాటు చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా ఈనెల 2వ తేదీ నుంచి శివారు గ్రామాలుగా, గిరిజన తండాలుగా ఉన్న పల్లెల్లో కొత్త గ్రామపంచాయతీ పాలన మొదలైంది. దీంతో ఆయా గ్రామాల్లోనూ ఈనెల 15వ తేదీనుంచి రేషన్ దుకాణాలను ఏర్పాటు చేయాలని రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఉన్న దుకాణాలను విభజిస్తూ.. కొత్త గ్రామాల్లో ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. తద్వారా నూతన గ్రామపంచాయతీలకూ రేషన్ సరకులు దరి చేరుతాయి. ఇన్నాళ్లూ దూరభారంతో ఇబ్బందులు పడిన ప్రజలకు ప్రజాపంపిణీ చేరువ కానుంది. -
మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుకు చుక్కెదురు
సాక్షి, విజయవాడ : ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా నిత్యవసర సరుకులు పంపిణీ ఏ విధంగా చేస్తున్నారో తెలుసుకునేందుకు పౌరసరఫరాలశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఆదివారం సాయంత్రం లబ్బీపేటలోని 237 వ నెంబరు చౌకధరల దుకాణాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్న ఒక మహిళను బియ్యం, కందిపప్పు, పంచదార ఏ విధంగా ఉన్నాయని ప్రశ్నించగా.. ఆమె పెదవి విరిచింది. పంచదార సన్నగా ఉంటోందని, కందిపప్పులో పురుగులున్నాయని మంత్రి దృష్టికి తెచ్చింది. రేషన్ దుకాణంలోని కందిపప్పు, పంచదారను తెప్పించి పరిశీలించారు. పంచదార పరిమాణం తక్కువగా ఉండటంతో ఆయన నీళ్లు నమిలాడు. వెంటనే ఆ పంచదారను ల్యాబ్‌కు పంపాలని అధికారుల్ని ఆదేశించారు. కందిపప్పు పరిశీలించిన అనంతరం తూకంలో తేడా వస్తోందని తెలుసుకున్నారు. కొన్ని చోట్ల డీలర్లు పంపిణీ చేసే కందిపప్పులో తూకంలో కొద్దిగా తేడా వస్తుందని పేర్కొన్నారు. ఎంఎల్ఎస్ పాయింట్స్ నుంచి డీలరుకు కందిపప్పు సంచితో కలుపుకుని 50 కేజీలు 600 గ్రాములు రావాల్సి ఉండగా కొన్ని చోట్ల 49,600 మాత్రమే వస్తోందని తెలిపారు. ఈ తేడాను సరిచేసి పంపిణీ చేస్తామన్నారు. మంత్రితో పాటు డీఎస్ఓ జి. నాగేశ్వరరావు, ఎఎస్‌ఓ ఉదయభాస్కర్ తదితరులు పాల్గొన్నారు. -
పంపిణీ పకడ్బందీ!
సాక్షి ప్రతినిధి, ఖమ్మం : రేషన్ బియ్యం పంపిణీ పకడ్బందీగా చేపట్టేందుకు ప్రభుత్వం పోర్టబులిటీ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఏప్రిల్ నుంచి ఈ విధానం అమలులోకి రానుంది. ఇప్పటివరకు తమ పరిధిలోని రేషన్ దుకాణంలో బియ్యం తీసుకున్న లబ్ధిదారులు.. పోర్టబులిటీ విధానం ద్వారా రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా బియ్యం తీసుకునే వెసులుబాటు కల్పించారు. దీంతో ప్రతి రేషన్ దుకాణానికి కోటాకన్నా.. 20 శాతం ఎక్కువ బియ్యం సరఫరా చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం పౌరసరఫరాల వ్యవస్థను మరింత పటిష్టం చేస్తోంది. పోర్టబులిటీ విధానం ప్రవేశపెట్టి.. ఎటువంటి అక్రమాలకు తావు లేకుండా సరుకులు లబ్ధిదారులకు అందేలా కొత్త ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. జిల్లాలో మొత్తం 669 రేషన్ దుకాణాలు ఉండగా.. ప్రతి నెలా 7,251 మెట్రిక్ టన్నుల బియ్యం సరఫరా అవుతున్నాయి. వీటిని డీలర్లు.. లబ్ధిదారులకు నిర్ణీత తేదీలు, సమయాల్లో పంపిణీ చేస్తుంటారు. అయితే రేషన్ పంపిణీ చేసే సమయంలో కార్డుదారులు సుదూర ప్రాంతాలకు వెళ్లినా.. బతుకు దెరువు కోసం మరోచోట నివాసం ఉంటున్నా.. డీలర్లు సరుకులు ఇచ్చే సమయానికి ఎన్నో వ్యయ ప్రయాసలకోడ్చి సొంత ఊరికి రావాల్సి వచ్చేది. అటువంటి వారికి వెసులుబాటు కల్పించేందుకు.. సరుకులు పక్కదారి పట్టకుండా.. అవినీతి అక్రమాలకు చోటు లేకుండా ఉండేందుకు ప్రభుత్వం రేషన్ దుకాణాల్లో పోర్టబులిటీ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఎక్కడి నుంచైనా.. ప్రస్తుతం అమలు చేయనున్న పోర్టబులిటీ విధానంతో లబ్ధిదారులు రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా బియ్యం సులువుగా తీసుకోవచ్చు. రేషన్ దుకాణానికి వెళ్లి.. కార్డు నంబర్ చెప్పి.. అక్కడ వేలిముద్ర వేసి బియ్యం తీసుకునే అవకాశం ఉంది. దీనివల్ల రేషన్ సరఫరా చేసే సమయంలో సొంత గ్రామంలోనే ఉండి రేషన్ తీసుకోవాల్సిన అవసరం ఇక నుంచి ఉండదు. ఏ పని కోసమైనా ఇతర ప్రాంతాలకు వెళ్లినా.. ఇంట్లో వారు ఎక్కడికి వెళ్లినా.. రేషన్ తీసుకోవడం కుదరకపోవడంతో ఆ నెల సరుకులు నష్టపోవాల్సిన అవసరం లేదు. దీనికి సంబంధించి పౌరసరఫరాల శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. మార్చి నుంచే జిల్లావ్యాప్తంగా పోర్టబులిటీ విధానం అమలవుతోంది. ఏప్రిల్ నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఈ విధానాన్ని అమలు చేయనున్నారు. దీంతో రాష్ట్రంలో ఏ ప్రాంతానికి వెళ్లినా కార్డు నంబర్ చెప్పి రేషన్ సరుకులు తీసుకునే వీలుంటుంది. 20 శాతం అదనంగా కేటాయింపు.. రేషన్ బియ్యం ఎక్కడి నుంచైనా తీసుకునే వీలుండటంతో అందుకు అనుగుణంగా బియ్యం కేటాయింపులు కూడా చేశారు. ప్రతి రేషన్ దుకాణానికి అదనంగా 20 శాతం బియ్యం కేటాయించారు. ఏ రేషన్ షాపు నుంచైనా తమ లబ్ధిదారుడు కాకుండా ఇతర ప్రాంతాలకు చెందిన కార్డుదారులు బియ్యం తీసుకెళ్తే ఇచ్చేందుకు వీలుగా ఎక్కువ మొత్తం కేటాయించారు. రేషన్ దుకాణంలో బియ్యం మిగిలితే తర్వాతి నెలకు కేటాయిస్తారు. ఇప్పటి వరకు జిల్లాకు ప్రతి నెలా 7,251 మెట్రిక్ టన్నుల బియ్యం సరఫరా అవుతోంది. ఇకనుంచి 8,699.64 మెట్రిక్ టన్నులు సరఫరా కానున్నది. అదనంగా బియ్యం వచ్చాయి.. రాష్ట్ర ప్రభుత్వం పౌరసరఫరాల శాఖ ద్వారా రేషన్ షాపులకు పకడ్బందీగా బియ్యం పంపిణీ చేసేందుకు మరింత చర్యలు చేపట్టింది. పోర్టబులిటీ ద్వారా లబ్ధిదారులు రాష్ట్రంలో ఎక్కడైనా బియ్యం తీసుకునే అవకాశం ఉంది. ఇందుకోసం ప్రభుత్వం 20 శాతం బియ్యాన్ని అదనంగా కేటాయించింది. ఏప్రిల్ నుంచి ఈ విధానం అమలు కానుంది. – సంధ్యారాణి, జిల్లా పౌరసరఫరాల అధికారిణి, ఖమ్మం -
రేషన్.. పరేషాన్..
సాక్షిప్రతినిధి, కరీంనగర్: రేషన్ దుకాణాలకు అందజేసిన ఈపాస్ మిషన్లలో లబ్ధిదారులు వేలిముద్ర వేస్తేనే సరుకులను అందజేస్తారు. అయితే సర్వర్ సమస్యతో ఈపాస్ మిషన్లు మొరాయిస్తుండటంతో సరుకుల పంపిణీ 40 శాతం నిలిచిపోయినట్లు తెలుస్తోంది. దుకాణాల ఎదుట లబ్ధిదారులు పడిగాపులు కాస్తూ అవస్థలు పడుతుండగా, అటు డీలర్లు మొరాయిస్తున్న మిషన్లతో గడువులోగా సరుకులు పంపిణీ చేయక ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో సరుకుల పంపిణీలో ఆలస్యం జరుగుతోంది. ఆగస్టులో ఈ పాస్ యంత్రాలు అందజేసిన ఒయాసిస్ కంపెనీ సెప్టెంబర్ నుంచి నూతన విధానంలో సరుకులు పంపిణీ చేసేలా సాంకేతిక జోడించింది. ఆ సమయంలో తదనుగుణంగా సంబంధిత యంత్రాలు అందజేయగా సరుకుల పంపిణీ సాగింది. తాజాగా రాష్ట్రవ్యాప్తంగా సర్వర్‌ను మార్పు చేయడంతో ఈపాస్ యంత్రాలు దాదాపు స్థంబించిపోయాయని డీలర్లు వాపోతున్నారు. సరుకుల కోసం వెళ్లిన లబ్ధిదారులు పడిగాపులు గాసి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈసారి 7వ తేదీ దాటినప్పటికీ సరుకుల పంపిణీ ప్రారంభించని దుకాణాలు ఉమ్మడి జిల్లాలో 600కు పైగానే ఉన్నాయని సమాచారం. సాంకేతిక సమస్యతో పరికరాలను పట్టుకుని పౌరసరఫరాల శాఖ కార్యాలయానికి వస్తున్నారు. ఈ–పాస్ యంత్రాల వెనుక ఉద్దేశం.. పేదల పొట్ట నింపేందుకు ప్రభుత్వం నెలనెలా పౌరసరఫరాల దుకాణాల ద్వారా రూపాయికే కిలో బియ్యాన్ని, ఒక్కొక్కరికి ఆరు కిలోల చొప్పున పంపిణీ చేస్తోంది. కుటుంబంలో ఎంత మంది ఉంటే అంత మందికి ఆరు కిలోల చొప్పున పంపిణీ చేస్తోంది. బియ్యం పంపిణీ ఎంతగా పెరిగిందో, అదే స్థాయిలో రేషన్ బియ్యంలో అక్రమాలకు తావు ఏర్పడింది. బియ్యం రేషన్ దుకాణాలకు పూర్తిగా చేరకుండానే, మిల్లర్లకు, వ్యాపారుల దరికి చేరుతున్నాయి. ఇలా ప్రతి నెలా లారీల కొద్ది బియ్యం పక్కదారి పడుతున్నాయి. బియ్యం అక్రమ రవాణాకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. అక్రమాలను అడ్డుకోలేక పోయింది. చివరకు పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్, కమిషనర్, ఐపీఎస్ అధికారి సీవీ ఆనంద్‌లు నియంత్రణపై దృష్టి సారించారు. హైదరాబాద్ నగరంలో ఈ– రేషన్ ప్రక్రియకు ఈ ఏడాది మార్చి నెల నుంచి శ్రీకారం చుట్టింది. రేషన్ దుకాణాలలో వేలిముద్రల (ఈ–పాస్) యంత్రాలను ఏర్పాటు చేశారు. తద్వారా రేషన్ సరుకుల్లో అక్రమాలను అరికట్టగలిగారు. ఈ ప్రక్రియ విజయవంతం కావడంతో జిల్లాలకు విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు సంబంధించిన కసరత్తును అన్ని జిల్లాల్లో ప్రారంభించింది. ఇబ్బందికరంగా సరుకులకు పంపిణీకి గడువు... ప్రభుత్వం రేషన్‌సరుకులను ప్రతి నెల ఒకటి నుంచి 15 వరకే పంపిణీ చేయాలని మార్గదర్శకాలను విడుదల చేసింది. అయితే 7వ తేదీ దాటినప్పటికీ ఈ పాస్ యంత్రాలు పూర్తి స్థాయిలో పనిచేయకపోవడంతో గడువులోగా పంపిణీ జరగడం లేదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రతి రోజు ఉదయం 8 నుంచి 12 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి 8 గంటల వరకు రేషన్ డీలర్ సరుకులను పంపిణీ చేయాల్సి ఉండగా సర్వర్ సమస్యతో ఒక్కో డీలరు రోజుకు 50 మందికి మించి సరుకులు పంపిణీ చేయలేకపోతున్నారు. ఈ పాస్ యంత్రంలో వేలిముద్ర వేసిన అనంతరం డిస్ప్లేలో పేరు రావడం తదుపరి తూకం వేయడం ప్రక్రియతో దాదాపు 10 నుంచి 20 నిమిషాలు పడుతున్న సంధర్డాలుంటున్నాయి. ఈ పాస్ యంత్రానికి.. తూకం యంత్రానికి అనుసంధానం కాకపోవడం ప్రధాన సమస్యగా మారింది. ఉమ్మడి జిల్లాలో 40 శాతానికి పైగా దుకాణాల్లో సమస్య తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఈ నేపథ్యంలో సరుకులను సకాలంలో.. గడువులోగా పంపిణీ చేయడం సందిగ్ధంగా మారింది. యంత్రాల సాంకేతిక సమస్యలను కంపెనీ ప్రతినిధులు పట్టించుకోవడం లేదని డీలర్లు వాదిస్తున్నారు. వేలిముద్రలు పడక తిప్పలు...15వ తేదీ వరకే పంపిణీతో ఇబ్బంది రేషన్‌దుకాణాల వద్దకు కార్డుదారులే స్వయంగా వచ్చినా బయోమెట్రిక్ యంత్రంపై వారి వేలిముద్రలు పడనికారణంగా డీలర్లు సరుకులను ఇచ్చేందుకు నిరాకరిస్తున్నారు. వేలిపై ఉన్న గీతలు యంత్రంపై పడని కారణంగానే ఈ పరిస్థితి ఏర్పడుతోందని అధికారులంటున్నారు. అయితే చాలా కొద్దిమందికే ఇలాంటి పరిస్థితి ఉంటుందని, అలాంటి వారికి సరుకులను ఇచ్చేందుకు (కార్డుదారుల్లో 1శాతం మించకుండా) డీలర్లకు అనుమతిచ్చామని తెలిపారు. ఈ పాస్ విధానంతో సబ్సిడీ సరుకులను తీసుకెళ్లేందుకు వద్దులు, ఒంటరిగా ఉన్నవారు ఇబ్బందులు పడుతున్నారు. గతంలో కార్డుదారులు లేకున్నా వారి బంధు, మిత్రులు వచ్చి సరుకులు తీసుకెళ్లే అవకాశముండేది. ఇపుడు ఆ అవకాశం లేకపోవడంతో డీలర్ల వద్ద సరుకులు ఎక్కువ మొత్తంలో మిగులుతున్నాయి. కాగా ప్రతి నెల 15వతేది లోగానే లబ్ధిదారులు రేషన్ దుకాణాలనుంచి సరుకులను పొందాలని అధికారులు పేర్కొంటున్నారు. ఈపాస్ మిషన్లు అపుడపుడు పనిచేయకపోవడంతో సమయమంతా వధా అవుతోందని, తమకు వీలున్నపుడు వచ్చే అవకాశం లేకుండా పోతోందని లబ్ధిదారులు పేర్కొంటున్నారు. గతంలో మాదిరిగానే నెల చివరి వారం వరకు పంపిణీ చేసేలా చూడాలన్న అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. పంపిణీ అంతకంతే.. 10 రోజుల్లో 50 శాతమే ఉమ్మడి జిల్లాల్లో ని రేషన్ దుకాణాలలో ఈ పాస్ విధానంలో సాంకేతిక అంతరాయాలు అవరోధంగా మారాయి.. కరీంనగర్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల జిల్లాల్లో 16 మండల లెవెల్ స్టాక్ పాయింట్ల (ఎంఎల్ఎస్) నుంచి 1,880 రేషన్ దుకాణాల ద్వారా ప్రతినెల 16,644 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని పంపిణీ చేస్తున్నారు. పంచదారను అంత్యోదయ, అన్నపూర్ణ కార్డుదారులకు అందజేస్తున్నారు.. మొత్తంగా ఉమ్మడి జిల్లాలో 9,41,948 కార్డులు 27,73,996 యూనిట్లపై 16,643.976 బియ్యంకు పంపిణీ చేయాల్సి ఉండగా ఇప్పటికీ 50 శాతం కూడా పంపిణీ చేయలేదని తెలుస్తోంది. అయితే సర్వర్ మార్పుతో గత కొద్ది రోజులుగా ఈపాస్ మిషన్లు మొరాయిస్తుండటమే ఇందుకు కారణంగా అధికారులు చెప్తుండగా... లబ్దిదారులకు తిప్పలు తప్పడం లేదు.. ఈ విషయంలో అధికారుల ముందస్తు ప్రణాళికలోపం స్పష్టమవుతోంది. కిరోసిన్ పంపిణీలోను ఇదే రకమైన సమస్య ఉత్పన్నమవడం చర్చనీయాంశంగా మారింది. సరుకుల పంపిణీకు ముందే సర్వర్ మార్పును, సాంకేతిక సమస్యలను అధిగమిస్తే డీలర్లకు.. ఇటు లబ్దిదారులకు తిప్పలుండేవి కావని స్పష్టమవుతోంది. ఇప్పటివరకు బియ్యం తీసుకోలే.. గీ ఏలి ముద్రలు ఎప్పుడు సురువు అయినయో గప్పడి నుంచి నా చేతి వేలిముద్రలు వస్తలేవు అంటున్నారు. నా భర్త వేలిముద్రలు కూడ మిషన్ తీసుకుంట లేదు. బియ్యం పంచినప్పుడల్ల పోయినా ఎన్నిసార్లు వేలిముద్రలు పెట్టిన రాలేదు. ఇప్పటి వరకు బియ్యం తీసుకోలేదు. మరునాడు పోతే గడువు ముగిసిందని ఇస్తలేరు. బియ్యం కాడికి పోతే బాగా తిప్పలు అవుతుంది. గిట్లయితే ఎట్ల. బియ్యం వచ్చేలా చూడాలి సారు. –మసర్తి నర్సవ్వ, బుగ్గారం -
ప‘రేషాన్’!
మన్ననూర్ : ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ–పోస్ విధానంతో లబ్ధిదారులకు సరుకులు అందక ఇబ్బందులు పడుతున్నారు. రేష న్ షాపుల్లో అక్రమాలకు చెక్‌పెట్టేందుకు ప్రభుత్వం ఈ విధానాన్ని అమల్లోకి తీ సుకొచ్చింది. అయితే సిగ్నల్స్ అందక, లబ్ధిదారులు వేలిముద్రలు పడకపోవడంతో సరుకులు తీసుకెళ్లలేని పరిస్థితి నె లకొంది. దీంతో ఎవరికీ చెప్పుకోవాలో అయోమయంలో ఉన్నా రు. ముఖ్యంగా బియ్యం రాకపోవడంతో పస్తులుండాల్సిన పరిస్థితి దాపురించింది. అయోమయంలో నిరక్షరాస్యులు కొంత మంది నిరక్షరాస్యులు సరుకుల విషయమై తెలిసిన వారిని అడిగితే మండలంలో దరఖాస్తు చేసుకోవాలని అంటున్నారని, తీరా మండల అధికారులు సిబ్బంది అందుకు సంబంధించి మాకెలాంటి ఆదేశాలు రాలేదని అంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో గ్రామంలో డీలర్లు, సేల్స్మెన్లు రేషన్ కార్డు చూసి సరుకులు ఇచ్చేవారని కొత్తగా వచ్చిన పద్ధతితో సరుకులు ఇవ్వడం లేదంటున్నారు. 50శాతం సరుకుల పంపిణీ ఇప్పటివరకు లబ్ధిదారులకు 50శాతం సరుకులు పంపిణీ చేశారు. ఈనెల 26లోగా సరుకులు పంపిణీ చేయాలని అధికారుల ఆదేశాలు ఉన్నాయి. ఆ తర్వాత పంపిణీ చేయకపోవడంతో లబ్ధిదారులు పలు అవస్థలు పడుతున్నారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. వేలి ముద్రలు సరిపోవడం లేదు మిషన్‌లో వేలి ముద్ర సరిపోవడం లేదు. దాంతో బి య్యం, కిరోసిన్ ఇవ్వడం లేదు. ఏమి చేయాలో పాలుపోవడం లేదు. అధికారులు సరుకులు ఇప్పించేందుకు చర్యలు తీసుకోవాలి. – చందాజీ, లబ్ధిదారుడు, మన్ననూర్ ఆందోళన అవసరం లేదు ఈ–పోస్ విధానంతో సమస్య ఉందని ఫిర్యాదులు వస్తున్నాయి. ఇం దుకు సంబంధించి వీ ఆర్ఓకు అధికారం ఇ చ్చారు. వందలో ఒకరిద్దరికీ సొంత నిర్ణయంతో సరుకులు ఇప్పించే అధికారం ఉం ది. వచ్చేనెల నుంచి ఈ సమస్య రా కుండా జాగ్రత్తలు తీసుకుంటాం. లబ్ధిదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. – కృష్ణయ్య, తహసీల్దార్, అమ్రాబాద్ -
రేషన్ ఇక..బయోమెట్రిక్
బెల్లంపల్లి : రేషన్ సరకుల పంపిణీలో అవకతవకలకు అడ్డుకట్ట వేసేలా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇన్నాళ్లుగా సరుకుల పంపిణీలో సాగిన అవినీతి, అక్రమాలకు చెక్ పెట్టేందుకు బయోమెట్రిక్ విధానం ప్రవేశపెడుతుంది. ఈ విధానంతో సరకుల పంపిణీ పారదర్శకంగా జరుగుతుందని ఫౌరసరఫరాల శాఖ భావిస్తుంది. బెల్లంపల్లి నియోజకవర్గ పరిధిలోని ఏడు మండలాల్లో సుమారు 200 వరకు ప్రభుత్వ చౌకధరల దుకాణాలు ఉన్నాయి. వీటి ద్వారా ప్రతి నెలా నిర్ధేశించిన ప్రకారం లబ్ధిదారులకు సరకులు పంపిణీ చేస్తున్నారు. పౌరసరఫరాల శాఖ ద్వారా అందుతున్న సరకులు నిత్యం ఏదో ఓ రూపంలో పక్కదారి పడుతున్నాయి. ముఖ్యంగా లబ్ధిదారులు రేషన్ షాపుకు వెళ్లి సరుకులు తీసుకోకున్నా పంపిణీ చేసినట్లు రికార్డులు రాసుకోవడం, ఏదేనీ కారణంతో సరుకులు ఓ నెల తీసుకెళ్లకున్నా తీసుకున్నట్లు నమోదు చేయడం వంటివి జరుగుతున్నాయి. దీంతో సరుకులు వంద శాతం లబ్ధిదారులకు దక్కడం లేదనే ఉద్ధేశ్యంతో ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించింది. బయోమెట్రిక్ విధానం.. రేషన్ దుకాణాల్లో బయోమెట్రిక్ విధా నం అమలుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఎలాంటి అవకతవకలకు ఆస్కా రం లేకుండా ఎంతో పారదర్శకంగా సరుకులను లబ్ధిదారులకు అందించాలని నిర్ధేశించింది. ఆహార భద్రత కార్డు కలిగిన ప్రతి లబ్ధిదారుడు ఇకపై విధిగా రేషన్ దుకాణానికి వెళ్లి బయోమెట్రిక్ యంత్రంపై వేలి ముద్ర వేస్తే కానీ సరుకులు పంపిణీ కావు. కార్డుదారు సంతకం సరిపోలితేనే సరుకులు అందిస్తారు. ఇతరులు మళ్లీ సరుకులు పంపిణీ చేయాలని అడిగినా లేదా డీలర్ చేతి వాటం ప్రదర్శించడానికి యత్నించినా కుదరని పరిస్థితులు ఉంటాయి. డీలర్లకు అవగాహన.. ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ విధానంపై రేషన్ డీలర్లకు ఇప్పటికే అవగాహన కల్పించారు. బయోమెట్రిక్ యంత్రం వినియోగంపై తహసీల్దార్ ఆధ్వర్యంలో డీలర్లకు అవగాహన కల్పిస్తున్నారు. యంత్రం వినియోగించే తీరు, లబ్ధిదారు వివరాల నమోదు, వేలి ముద్రలు తీసుకునే పద్ధతి, సరుకుల వివరాలను నమోదు చేసే పద్ధతి తదితర అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు. చాలామట్టుకు డీలర్లకు ఈపాటికే బయోమెట్రిక్ యంత్రాలను అందజేశారు. ఆ యంత్రం వినియోగంపై డీలర్లు తీవ్ర కసరత్తు చేస్తున్నారు. అయితే ప్రభుత్వం అమలులోకి తెచ్చిన బయో మెట్రిక్ విధానాన్ని డీలర్లు వ్యతిరేకిస్తున్నారు. వేతనం పెంచి, ఉద్యోగ భద్రత కల్పించి బయోమెట్రిక్ విధానాన్ని అమలులోకి తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. మరోవైపు ఫిబ్రవరి 1 నుంచే రేషన్ సరకుల పంపిణీలో బయోమెట్రిక్ విధానం రానుంది. దీనివల్ల కొంతవరకైనా సరుకుల పంపిణీలో అవకతవకలు నివారించే అవకాశాలు ఉంటాయనడంలో అతిశయోక్తి లేదని లబ్ధిదారులు పేర్కొంటున్నారు. -
రేషన్ ఇవ్వలేదు. ఆకలితో అలమటించి..
బరేలీ (ఉత్తరప్రదేశ్): చూడటానికి బక్కపలుచగా, బొక్కలు కనిపించేలా ఉండే 50 ఏళ్ల షకీనా అష్ఫక్ మంగళవారం తన ఇంట్లో ప్రాణాలు విడించింది. ఐదురోజులుగా ఏమీ తినకపోవడంతో ఆమె ఆకలితో అలమటించి ప్రాణాలు విడిచిందని కుటుంబసభ్యులు చెప్తున్నారు. ఇంటిపెద్ద కావడంతో షకీనా పేరిట రేషన్ కార్డు ఉంది. కానీ, పక్షవాతంతో మంచం పట్టిన షకీనా వేలిముద్రలు ఇవ్వడానికి ఈ నెల రేషన్ షాప్‌కు వెళ్లలేకపోయింది. దీంతో ఈ నెల కోటా చౌకబియ్యం ఆమె కుటుంబానికి ఇవ్వడానికి రేషన్ దుకాణం నిరాకరించింది. దీంతో అన్నం లేక.. ఆకలితో అలమటించి షకీనా ప్రాణాలు విడించిందని కుటుంబసభ్యులు చెప్తున్నారు. బరేలీలో జరిగిన ఈ ఘటనపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఆకలితో కాదు అనారోగ్యంతోనే షకీనా చనిపోయిందని యోగి సర్కారు ఇంతకుముందు వాదించింది. ఆమె కుటుంబసభ్యులు మాత్రం నవంబర్ నెలకు తమకు ఇవ్వాల్సిన రేషన్ బియ్యం ఇవ్వలేదని, షకీనా ఇంటిపెద్ద కావడంతో ఆమె పేరిట రేషన్ కార్డు ఉందని, అనారోగ్యంతో ఉన్న ఆమెను రిక్షాలో సైతం రేషన్ దుకాణం తీసుకెళ్లడానికి కుదరలేదని, ఈ విషయాన్ని రేషన్ దుకాణంలో వివరించి ఈ నెల చౌకబియ్యం ఇవ్వాల్సిందిగా వేడుకున్నామని, అయినా, బయోమెట్రిక్ లేనిదే చౌకబియ్యం ఇవ్వడం కుదరదని రేషన్ డీలర్ తెలిపాడని షకీనా భర్త మహమ్మద్ ఇషాక్ తెలిపారు. షకీనా అనారోగ్యంతో ఉన్న విషయం వాస్తవమేనని, కానీ, ఆహారం లేక ఆమె ఆకలితోనే ప్రాణాలు విడిచిందని ఆయన తెలిపారు. అయితే, ప్రభుత్వ అధికారులు మాత్రం ఆధార్ లేకపోతే.. రేషన్ ఇవ్వకూడదన్న ఆదేశాలు ఏమీ లేవని, ఈ షకీనా కుటుంబానికి రేషన్ అందకపోవడం, ఆమె మరణంపై విచారణ జరుపుతున్నామని తెలుపుతున్నారు. -
ఎన్నాళ్లకెన్నాళ్లకు
సాక్షి, కడప : రేషన్ షాపు వ్యవహారాలకు సం బంధించి చాలా రోజుల తర్వాత మంచి అవకాశం లభించింది. 2015కు ముందు డీలర్ల ప్రక్రియను పూర్తి చేసినా తర్వాత అవకాశం రాలేదు. మళ్లీ ఇప్పుడు అవకాశం వచ్చింది. కడప రెవెన్యూ డివిజన్ పరిధిలో సుమారు 275 రేషన్ షాపులకు నో టిఫికేషన్ వెలువడింది. అందుకు సంబం ధించి నవంబరు 3లోపు అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాత పరీక్ష, ఇంటర్వూ్య ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. చాలా రోజులుగా రేషన్‌షాపుల కోసం ఎదురు చూస్తున్న వారికి ఇప్పుడు అవకాశం లభించనుంది. 2015 తర్వాత.. ఇప్పుడు.. 2015లో ఒకసారి రేషన్‌షాపు డీలర్ల కోసం ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. అ యితే దరఖాస్తుదారులకు సంబంధిం చి పరీక్ష అనంతరం కొంత మంది కోర్టుకు వెళ్లడంతో.. అప్పట్లో కో ర్టు నోటిఫికేషన్‌ను రద్దు చేసిం ది. తర్వాత 2016లో నోటిఫికేషన్ ఇచ్చినా మళ్లీ కొంత మం ది రోస్టర్ విధానంపై కోర్టుకు వెళ్లడంతో అప్పట్లో స్టే విధించింది. రోస్టర్, రిజర్వేషన్ విధానాన్ని సరిదిద్దిన అనంతరం మళ్లీ ఇప్పుడు తాజాగా నోటిఫికేషన్‌కు అవకాశం ఉండడంతో.. ప్రస్తుతం రేషన్ డీలర్ల నియామకానికి రెవెన్యూశాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటికే నోటిఫికేషన్ జారీ అయిన నేపథ్యంలో అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. 275 రేషన్ డీలర్ల నియామకానికి చర్యలు కడప రెవెన్యూ డివిజన్ పరిధిలో కడపలో 36, చక్రాయపేటలో 20, చెన్నూరు 10, చిన్నమండెం 18, చింతకొమ్మదిన్నె 12, గాలివీడు 19, కమలాపురం 10, ఖాజీపేట 8, లక్కిరెడ్డిపల్లె 7, పెండ్లిమర్రి 9, రామాపురం 15, రాయచోటి 23, సంబేపల్లె 8, టి.సుండుపల్లె 15, వల్లూరు 15, వీరబల్లి 15, వీఎన్ పల్లె 9, ఎర్రగుంట్ల మండలంలో 29 మంది డీలర్ల నియామకం చేపట్టనున్నారు. పై మండలాల్లో మొత్తం 275 మంది రేషన్ డీలర్ల నియామకానికి అధికారులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అర్హులు దరఖాస్తు చేసుకోవాలి కడప రెవెన్యూ డివిజన్ పరిధిలో అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని కడప ఆర్డీఓ దేవేందర్‌రెడ్డి తెలిపారు. అందుకు సంబంధించి నవంబరు 3వ తేది వరకు అవకాశం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. 18 మండలాల్లో 275 రేషన్ డీలర్లకు సంబంధించి జీఓ నంబర్ 4 మేరకు... రోస్టర్, రిజర్వేషన్ ప్రకారం నోటిఫికేషన్ జారీ చేశామని వివరించారు. కోర్టు అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని రోస్టర్ రిజర్వేషన్ ప్రకారం నియామకాలు చేపడుతున్నామని, అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. రేషన్ డీలర్లకు అర్హతలివే కడప రెవెన్యూ డివిజన్ పరిధిలో రేషన్ డీలర్లుగా దరఖాస్తు చేసుకునే వారు ఈ కింది అర్హత కలిగి ఉండాలి. పదో తరగతి కచ్చితంగా ఉత్తీర్ణత కావడంతోపాటు వయస్సు 18 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి. నవంబరు 3వ తేది సాయంత్రంలోపు దరఖాస్తులను సంబంధిత తహసీల్దార్ కార్యాలయంలో అందజేయాలి. రాత పరీక్ష 80 మార్కులకు, ఇంటర్వూ్య 20 మార్కులుకు ఉంటుందని రెవెన్యూ అధికారులు తెలియజేశారు. -
రేషన్ షాపుల రద్దు ఆలోచన విరమించాలి
సాక్షి, హైదరాబాద్: రేషన్ షాపుల ద్వారా ఇచ్చే సబ్సిడీ బియ్యం పంపిణీని నిలిపివేసి, ఆ స్థానంలో నగదు బదిలీ చేయాలనే ప్రభుత్వ ఆలోచనను తక్షణం విరమించుకోవాలని సీపీఎం డిమాండ్ చేసింది. ప్రజాపంపిణీ వ్యవస్థను పటిష్టం చేసి 14 రకాల నిత్యావసర సరుకులను అందుబాటులో ఉంచాలని కోరింది. ఈ మేరకు పార్టీ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఓ ప్రకటన విడుదల చేశారు. అవినీతి, బ్లాక్‌మార్కెటింగ్ పేరుతో రేషన్ దుకాణాలను రద్దు చేసి లబ్ధిదారులకు నగదు బదిలీ చేయాలన్న ఆలోచన సమంజసం కాదన్నారు. -
ఏమాయ చేశారో..!
అనంతపురంలోని మూడో డివిజన్ పరిధిలో భాస్కర్‌రెడ్డి అనే వ్యక్తికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. తెల్లరేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోగా ఇటీవల రెండు కార్డులు మంజూరయ్యాయి. అతను, అతని భార్యకు కలిపి ఒక కార్డు ఇచ్చారు. ఇద్దరు పిల్లలకు మాత్రమే మరో కార్డు జారీ చేశారు. రెండింటిలోనూ కుటుంబ పెద్ద భాస్కర్‌రెడ్డిని చూపించారు. ఉంటున్నది 3వ డివిజన్ అయితే 16వ డివిజన్ కమలానగర్‌లోని 51 నెంబరు రేషన్ షాపును నమోదు చేశారు. ఒక్క భాస్కర్‌రెడ్డి విషయంలో మాత్రమే జరిగిన తప్పదం కాదు.. జిల్లాలోని వేల సంఖ్యలోని కార్డుల్లో ఇలాంటి తప్పిదాలు చోటు చేసుకున్నాయి. అనంతపురం అర్బన్ : నాల్గో విడత జన్మభూమి సందర్భంగా దారిద్య్రరేఖకు దిగువన ఉన్న పేదలకు జారీ చేసిన తెల్లకార్డుల్లో వివరాలు ఇష్టానుసారంగా నమోదయ్యాయి. కంప్యూటర్ ఆపరేటర్ల నిర్వాకంతో తప్పిదాలు చోటు చేసుకున్నాయి. ఒక కుటుంబాన్ని రెండుగా విభజించి వేర్వేరుగా రెండు కార్డులు జారీ అయ్యాయి. కొన్ని కార్డుల్లో కుటుంబ యజమానిని మాత్రమే చూపిస్తూ, మిగతా కుటుంబ సభ్యుల ఫొటోలను, పేర్లను చేర్చలేదు. కొన్ని కార్డుల్లో పేర్లు చేర్చారు తప్ప సభ్యుల ఫొటోలు ముద్రించలేదు. వేలాది కార్డుల్లో ఇలాంటి తప్పిదాలు దొర్లాయి. 99,954 కార్డుల మంజూరు జన్మభూమి కార్యక్రమం సందర్భంగా జిల్లాకు 99,954 కార్డులను ప్రభుత్వం మంజూరు చేయగా జన్మభూమి గ్రామ సభల్లో 72,531 కార్డులను లబ్ధిదారులకు జారీ చేశారు. మిగతా కార్డులను తహసీల్దారు కార్యాలయాలకు లబ్ధిదారులు స్వయంగా వెళ్లి తీసుకున్నారు. జారీ అయిన కార్డుల్లో వివరాలు తప్పుగా నమోదయ్యాయి. దీంతో లబ్ధిదారులు చేర్పులు, మార్పుల కోసం తహసీల్దారు కార్యాలయాలకు పరుగులు పెడుతున్నారు. కంప్యూటర్ ఆపరేటర్ల నిర్వాకం కార్డుల్లో లబ్ధిదారుని వివరాల నమోదు విషయంలో కంప్యూటర్ ఆపరేటర్ల నిర్వాకం కనిపిస్తోంది. కార్డుకోసం దరఖాస్తు చేసుకునే సమయంలో తమ కుటుంబం గ్రూప్ ఫొటోను జతచేసి ఇచ్చారు. దీన్ని స్కాన్ చేసి కార్డులో పొందుపర్చకుండా ఇష్టానుసారంగా వివరాలు, ఫొటోలను నమోదు చేశారు. చాలా కార్డుల్లో కేవలం కుటుంబ యజమాని ఫొటో ఒక్కటే ముద్రించారు. కుటుంబ సభ్యల ఫొటోలు లేవు. కొన్ని కార్డుల్లో కుటుంబ సభ్యుల ఫొటోలు, పేర్లు కూడా నమోదు చేయలేదు. మరికొన్ని కార్డుల్లో ఆధార్‌లోని ఫొటోలను రేషన్ కార్డుల్లో ఉంచారు. ఇవి ఒక రకం తప్పదాలైతే...లబ్ధిదారుల నివాస ప్రాంతానికి సంబంధం లేని డివిజన్లలోని రేషన్ దుకాణం కేటాయించారు. చంద్రబాబు కొట్టాల్లో నివాసముంటున్న ఒకరికి పాపంపేట పంచాయతీలోని చౌక దుకాణం కేటాయించారు. తమకు కేటాయించిన చౌక దుకాణం ఎక్కడ వస్తుందో అంతుపట్టక లబ్ధిదారులు కాలనీలు పట్టుకుని తిరగాల్సి వస్తోంది. ఇలాంటి తప్పిదాలు కేవలం కంప్యూటర్ ఆపరేటర్ల నిర్లక్ష్యంగా కారణంగానే చోటు చేసుకున్నాయి. కొరవడిన పర్యవేక్షణ కార్డుల్లో లబ్ధిదారులు వివరాలు నమోదు ప్రక్రియ చేపట్టినప్పటి నుంచి అధికారుల పర్యవేక్షణ కొరవడింది. కంప్యూటర్ ఆపరేటర్లు కార్డుల్లో వివరాలో ఏ విధంగా నమోదు చేస్తున్నారు. ఫొటోలను ఎలా ఉంచుతున్నారు. అనేవాటిని అధికారులు కనీసంగా కూడా పట్టించుకోలేదని తెలిసింది. దరఖాస్తులను కంప్యూటర్ ఆపరేటర్లకు అందజేసి వివరాలను నమోదు చేయాలని చెప్పి వదిలేశారు. దీంతో కంప్యూటర్ ఆపరేటర్లు ఇష్టానుసారంగా వివరాలను నమోదు చేశారు. త్వరలో మార్పులు, చేర్పులు రేషన్ కార్డుల్లో చోటు చేసుకున్న తప్పిదాలను సరిచేసేందుకు ఒక నెల రోజుల్లో ప్రభుత్వం నుంచి అనుమతి వస్తుంది. కుటుంబ సభ్యుల చేర్పులు, ఫొటో అప్లోడ్ ప్రక్రియను మీ సేవ ద్వారా చేస్తారు. చేర్పులకు, మార్పులకు ప్రభుత్వం అనుమతించిన వెంటనే ప్రకటిస్తాం. అప్పుడు లబ్ధిదారులు మీ సేవలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. – శివశంకర్‌రెడ్డి, ఇన్చార్జ్ డీఎస్ఓ -
రేషన్ బియ్యానికి దళారి దయ్యం
నల్లగొండ జిల్లా తిప్పర్తి మేజర్ గ్రామ పంచాయతీకి చెందిన ఓ తెల్ల రేషన్ కార్డుదారుడికి నెలకు 24 కిలోల బియ్యం ఇస్తున్నారు. బియ్యం దొడ్డుగా ఉండటంతోపాటు పురుగులు, మెరిగలు ఎక్కువగా ఉంటుండటంతో వాటిని అదే గ్రామానికి చెందిన వ్యాపారికి కిలోకు రూ.8 చొప్పున అమ్ముతున్నాడు. ఆ వ్యాపారి అవే బియ్యాన్ని రైస్‌మిల్లుకు రూ.10 చొప్పున విక్రయిస్తున్నాడు. మిల్లులో పాలిష్ చేసి ఆ బియ్యాన్నే మార్కెట్లో కిలో రూ.35కు విక్రయిస్తున్నారు. .. రాష్ట్రంలో రేషన్ బియ్యం దందాలో ఇదో కోణం! అనేకచోట్ల రేషన్ షాపుల్లో కొన్న బియ్యాన్ని అదే డీలర్‌కు విక్రయిస్తున్నారు. అందుకు బదులుగా డబ్బులు లేదా చక్కెర, పప్పు, ఇతర సరుకులు తీసుకుంటున్నారు. సదరు డీలర్ ఆ బియ్యాన్ని గంపగుత్తగా మిల్లర్‌కు అప్పగించేస్తున్నాడు. .. ఇది మరో కోణం!! సాక్షి, నెట్వర్క్: ప్రభుత్వం పేదల కోసం అం దిస్తున్న సబ్సిడీ బియ్యం పక్కదారి పడుతున్నాయి. ఓవైపు డీలర్లు, అధికారులు కుమ్మక్కై అక్రమాలకు పాల్పడుతుంటే.. మరోవైపు దొడ్డుగా ఉన్నాయని, అన్నం బాగుండటం లేదంటూ చాలామంది లబ్ధిదారులు బియ్యాన్ని అమ్మేసుకుంటున్నారు. మరికొన్నిచోట్ల రూపాయి కిలో బియ్యాన్ని పాలిష్ చేసి బహిరంగ మార్కెట్లో ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారు. రాష్ట్రంలో ఉమ్మడి హైదరాబాద్ మినహా మిగతా 9 జిల్లాల్లో అంత్యోద య, అన్నపూర్ణ, ఆహార భద్రత కార్డులు 75,01,851 ఉన్నాయి. వీటికి ప్రతినెలా సుమారు 14,79,07,851 యూనిట్ల బియ్యం(యూనిట్‌కు 6 కేజీలు) కోటా కేటాయిస్తున్నారు. తెల్లరేషన్ కార్డుదారుడికి ఒక్కొ క్కరికి 6 కిలోలు, అంత్యోదయ కార్డుకు 35 కేజీలు, అన్నపూర్ణ కార్డుదారులకు ఉచితంగా 10 కేజీల బియ్యాన్ని అందజేస్తున్నారు. ఎంఎల్ఎస్(మండల్ లెవల్ స్టాక్) పాయింట్ల నుంచి రేషన్ దుకా ణాలకు బియ్యం సరఫరా సక్రమంగానే జరుగుతుండగా.. చాలాచోట్ల డీలర్లు, అధికారులు కుమ్మక్కై పక్కదారి పట్టిస్తున్నారు. కొన్నిచోట్ల రేషన్ బియ్యాన్ని వండుకొని తినేందుకు లబ్ధిదారులు ఆసక్తి చూపడం లేదు. ఇటీవల బియ్యం తీసుకెళ్లకుంటే కార్డులు రద్దు చేస్తారని కొందరు డీలర్లు ప్రచారం చేశారు. దీంతో చాలామంది బియ్యాన్ని తీసుకెళ్లినా అవి ఇళ్లలోనే మూలుగుతున్నాయి. ఇంకొందరు బియ్యాన్ని కోళ్లఫాంలకు, పశువులకు దాణాగా వాడుతున్నారు. కొందరు వ్యాపారులు రేషన్ బియ్యాన్ని బాగా పాలిష్ పట్టి విదేశాలకు కూడా ఎగుమతి చేస్తున్నారు. ఇలా పేదలకు అందాల్సిన రేషన్ బియ్యంలో దాదాపు 80 శాతం వివిధ మార్గాల ద్వారా పక్కదారి పడుతున్నట్టు ‘సాక్షి’ క్షేత్రస్థాయి పరిశీలనలో తేలింది. ఎక్కడెక్కడ ఏం చేస్తున్నారంటే.. సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్‌లో 8 వేల మంది లబ్ధిదారులుండగా.. అందులో 4 వేల మందికిపైగా రేషన్ బియ్యం తింటున్నారు. మిగతావారు రైస్‌డిపోలు లేదా గిరిజనులు, బాలసంతుల వారికి విక్రయిస్తున్నారు. కిలో బియ్యం రూ.10 చొప్పున విక్రయిస్తున్నారు. వ్యాపారులు రైస్ డిపోల్లో ఇతరులకు కిలో బియ్యం రూ.15కు విక్రయిస్తున్నారు. రైస్‌మిల్లుల్లో రేషన్ బియ్యాన్ని పాలిష్ చేసి స్టీమ్‌రైస్ పేరుతో మార్కెట్లో క్వింటాలుకు రూ.3,500 నుంచి రూ.4 వేల దాకా విక్రయిస్తున్నారు. పేదలకు ఈ బియ్యమే దిక్కు మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం క్యాతనపల్లి మేజర్ గ్రామపంచాయతీ పరిధిలో చాలామంది లబ్ధిదారులు రేషన్ బియ్యం తింటున్నారు. ఈ పంచాయతీ పరిధిలో మొత్తం 15 వేలకుపైగా కుటుంబాలు నివసిస్తున్నాయి. వీరిలో 5,500 మందికి తెల్లకార్డులు ఉన్నాయి. మొత్తం 12 రేషన్ షాపుల ద్వారా సుమారు 770 క్వింటాళ్ల బియ్యం నెలనెలా అందిస్తున్నారు. మేజర్ గ్రామపంచాయతీ పరిధిలోని పట్టణ ప్రాంతం(రామకృష్ణాపూర్) మినహా నిరుపేదవాడల్లో చాలామంది రేషన్ బియ్యమే తింటున్నారు. అక్కడ వినియోగం 10 శాతమే.. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలోని చెరువుమాధారం గ్రామ పంచాయతీలో 1,630 కుటుంబాలు ఉన్నాయి. 1,435 తెల్ల రేషన్‌కార్డులు ఉన్నాయి. ప్రతినెలా 250 క్వింటాళ్ల రేషన్ బియ్యం దుకాణాలకు వస్తాయి. వీరిలో 80 శాతం బియ్యాన్ని కార్డుదారులు తీసుకెళ్తున్నా... వారిలో కేవలం 10 శాతం మంది మాత్రమే వినియోగించుకుంటున్నారు. కొందరు పశువులకు దాణాగా వాడుతున్నారు. దళారులు ఇంటింటా తిరిగి కిలో రూ.6 నుంచి రూ.7 వరకు కొనుగోలు చేసి తీసుకెళ్తున్నారు. పసుపు కలిపేసి.. జనగామ జిల్లా నర్మెట మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలోని పలు గ్రామాల్లో 9,571 జనాభా ఉంది. మూడు రేషన్ దుకాణాలున్నాయి. 1,653 మందికి తెల్లరేషన్ కార్డులు ఉన్నాయి. రేషన్ దుకాణాలకు 290.22 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం కేటాయిస్తున్నారు. లబ్ధిదారుల నుంచి కొందరు వ్యాపారులు ఈ బియ్యాన్ని సేకరించి అధికారులకు అనుమానం రాకుండా అందులో పసుపు కలిపి దేవుడి బియ్యంగా రైస్‌మిల్లులకు తరలిస్తున్నట్లు తెలుస్తోంది. పాలమూరు బియ్యంపై డోన్ వ్యాపారుల కన్ను పాలమూరు రేషన్ బియ్యంపై రాయలసీమలోని డోన్ ప్రాంతానికి చెందిన వ్యాపారులు కన్నేశారు. వీరు ఇంటింటికి తిరిగి బియ్యాన్ని కొని దళారులకు చేరవేస్తున్నారు. ఆ బియ్యాన్ని కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాలకు తరలిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. బస్తాల్లో కలిపేస్తున్నారు.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలం సుదిమళ్ల గ్రామంలోని రేషన్ షాపు పరిధిలో ఆరు గ్రామాలు ఉన్నాయి. ఈ గ్రామాల్లో సుమారు వెయ్యి కుటుంబాలు నివసిస్తున్నాయి. 666 రేషన్ కార్డులు ఉండగా 631 తెల్ల రేషన్‌కార్డులు, 35 ఏఏవై (35 కిలోల బియ్యం లభించేవి) రేషన్‌కార్డులు ఉన్నాయి. రేషన్ బియ్యం సరఫరా చేయగానే దళారీలు ఆటోల ద్వారా పల్లెల్లోకి వచ్చి ఇంటింటికీ తిరిగి లబ్ధిదారుల నుంచి కిలో రూ.4, రూ.5 చొప్పున కొనుగోలు చేస్తున్నారు. వాటిని నేరుగా మహబూబాబాద్, కాకినాడ మిల్లులకు తరలిస్తున్నారు. అక్కడి మిల్లర్లు కిలో రూ.15కు కొనుగోలు చేస్తున్నారు. రీసైక్లింగ్ చేసి.. మార్కెట్లో లభిస్తున్న 25 కిలోల బ్యాగులో ఈ బియ్యాన్ని 5 నుంచి 10 కిలోల వరకు కలుపుతున్నట్లు తెలిసింది. బయట కూడా సన్నబియ్యం పేరుతో కిలో రూ.28 నుంచి రూ.30లకు అమ్ముతున్నారు. రీసైక్లింగ్ బియ్యాన్నే బియ్యం రవ్వగా మార్చి కిలో రూ.25కు, పిండి కొట్టి రూ.30లకు విక్రయిస్తున్నారు. 212 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం పట్టివేత నర్సింహులపేట(డోర్నకల్)/దామరచర్ల/కోదాడ: మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం కొమ్ములవంచలో పోలీసులు ముగ్గురి ఇళ్లలో సోదాలు చేసి 212 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని పట్టుకున్నారు. ఈ ముగ్గురితోపాటు మరో ఇద్దరు వ్యాపారులపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి మంగళవారం తెలిపారు. మరో 145 బస్తాల బియ్యం.. పోలీసులు దాడులు చేసి మొత్తం 145 బస్తాల పీడీఎస్ బియ్యం పట్టుకున్నారు. నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం కేశవాపురం గ్రామపంచాయతీ పరిధిలోని తెట్టెకుంటలో 72 బస్తాలు, సూర్యాపేట జిల్లా కోదాడ మండలం కొమరబండలో 73 బస్తాల పీడీఎస్ బియ్యాన్ని పట్టుకున్నారు. తినబుద్ధి అయితలె.. రేషన్ బియ్యం వండితే అన్నం ముద్ద అయితంది. ఉడుకు ఉన్నప్పుడే తినబుద్ధి అయితంది. చల్లారినంక తినబుద్ధి అయిత లేదు. సర్కారోళ్లు రూపాయి కిలో బియ్యం అని చెబుతుండ్రు కానీ ఉపయోగపడ్తలె. మాకు సన్నబియ్యం అందించాలె.. – అలుగు కొమురమ్మ, ముల్కనూర్, వరంగల్ అర్బన్ జిల్లా ధర ఎక్కువైనా సన్నబియ్యం ఇయ్యాలె.. రేషన్ బియ్యం ఎవ్వరూ కొనుగోలు చేయడం లేదు. ఇళ్లలోనే నిల్వలు పేరుకు పోతున్నాయి. పాడైపోయిన బియ్యాన్ని పందుల్ని సాదు కునేటోళ్లు కొనుక్కపోతున్నరు. కిలోకు రూ.10 అయినా సరే సన్నబియ్యం అందిస్తే మేలు. – కొన్నె తిరుపతి, నర్మెట -
పక్కదారికి అడ్డుకట్ట..
సాక్షి, రంగారెడ్డి జిల్లా: జిల్లాలో 95 శాతం రేషన్ దుకాణాల్లో సంప్రదాయ గొలుసు కాంటాలను వినియోగించడంతో కార్డుదారులు తీవ్రంగా నష్టపోయారు. ప్రతి కిలోకు సగటున 80నుంచి 120 గ్రాముల తరుగుదల వచ్చేది. పైగా లబ్ధిదారులు బియ్యం తీసుకోలేకపోతే కొందరు రేషన్ డీలర్లే కాజేస్తున్నట్లు అధికారుల పరిశీలనలో వెల్లడైంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఎలక్ట్రానిక్ కాంటాలను తప్పనిసరి చేసినా పెద్దగా ప్రయోజనం లేదని భావించిన పౌరసరఫరాల శాఖ.. పటిష్టమైన వ్యవస్థను తీసుకరావడం తోనే పక్కదారికి, తూకంలో కోతకు అడ్డుకట్టకు వేయవచ్చన్న నిర్ణయానికి వచ్చింది. తదనుగుణంగా వేలిముద్రల (బయోమెట్రిక్) ఆధారంగా పనిచేసే ఈ–పాస్ (ఎలక్ట్రానిక్ పాయింట్ ఆఫ్ సేల్) యంత్రాలను ప్రయోగాత్మకంగా పరిచయం చేసింది. తొలుత మన జిల్లా పట్టణ (జీహెచ్ఎంసీ) ప్రాంతంలో 218 రేషన్ దుకాణాల్లో గతేడాది మార్చి నెలలో పైలట్ ప్రాజెక్టుగా ఈ–పాస్ యంత్రాల ద్వారా సరుకుల పంపిణీ చేశారు. ఈ విధానంలో సగటున 30 శాతం బియ్యం కోటా మిగలడంతో రూ.కోట్ల ప్రజాధనం ఆదా అయ్యింది. ఇలా విజయవంతం కావడంతో ఈ పద్ధతిని ఏప్రిల్ నుంచి కొనసాగించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఈ ఏడాది జూలై నుంచి అమల్లోకి తెచ్చారు. పట్టణ ప్రాంతాలతో పోల్చుకుంటే మరింత ఆధునిక సాంకేతికతో పనిచేసే మిషన్లను వినియోగిస్తున్నారు. ఈ–పాస్ మిషన్లకు ఆటోమేటెడ్ ఎలక్ట్రానిక్ కాంటాలను అనుసంధానించి బియ్యం అందజేస్తున్నారు. ఫలితంగా పట్టణ ప్రాంతాల్లో 30 శాతం, గ్రామీణ ప్రాంతాల్లో 11శాతం బియ్యం మిగులుతున్నాయి. సగటున 18 శాతం బియ్యం మిగులుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. మూడు నెలల్లో రూ.4.20 కోట్లు ఆదా.. జిల్లాలో మూడు నెలల్లో రూ.4 కోట్ల ప్రజాధనం ఆదా అయ్యింది. ఈ–పాస్ మిషన్ల రాకతో ప్రతినెలా సగటున 550 టన్నుల బియ్యం పౌరసరఫరాల శాఖకు మిగులుతున్నాయి. జిల్లాలో 5.18 లక్షల రేషన్ కార్డులు ఉండగా.. వీరికి ప్రతినెలా 11,038 టన్నుల బియ్యం అవసరం. కొందరు క్రమం తప్పకుండా తీసుకెళ్లకపోక పోవడం కారణంగా డీలర్ల వద్ద ప్రతినెలా సగటున రెండు వేల టన్నుల బియ్యం కోటా బ్యాలెన్స్ ఉంటోంది. ఇది పోను సుమారు 9వేల టన్నుల బియ్యం కోటాకు చౌకధరల దుకాణాల డీలర్లు ప్రతినెలా డీడీలు చెల్లిస్తున్నారు. అయితే ఇందులో 8,580 టన్నుల బియ్యాన్ని మాత్రమే కార్డుదారులు తీసుకెళ్తుండగా.. రమారమి మరో 610 టన్నుల బియ్యం వరకు మిగులుతున్నాయి. ప్రభుత్వం ఒక్కో కిలో బియ్యాన్ని దాదాపు రూ. 26 చొప్పున కొనుగోలు చేసి.. పేద కుటుంబాలకు రూపాయికి అందజేస్తున్న విషయం తెలిసిందే. అంటే ఒక్కో కిలోపై ప్రభుత్వం రూ.25 సబ్సిడీ భరిస్తోందన్నమాట. ఈ లెక్కన ప్రతినెలా 1.50 కోట్ల రూపాయల వరకు ఆదా అవుతున్నాయి. గత నెలలో 560 టన్నుల బియ్యం మిగలగా.. 1.34 కోట్ల రూపాయల ప్రజాధనం వృథాకు అడ్డుకట్ట పడింది. మొత్తం మీద మూడు నెలల్లోనే 4.20 కోట్ల రూపాయలు ఆదా అవడం విశేషం. -
ఇంకెన్నాళ్లు..
♦ రేషన్ బియ్యం పంపిణీలో తీవ్ర జాప్యం ♦ ఎట్టకేలకు జిల్లాకు చేరుకున్న వేయింగ్ మిషన్లు ♦ తాజాగా ఈ పాస్ మిషన్లలో సాంకేతిక లోపం ♦ వారం గడిచినా.. ప్రారంభం కాని రేషన్ సరఫరా ♦ పండుగలు సమీపిస్తుండడంతో ప్రజల్లో ఆందోళన హన్మకొండ అర్బన్: జిల్లాలో రేషన్ బియ్యం అందక పేద, మధ్య తరగతి వర్గాలు అల్లాడుతున్నాయి. ప్రతి నెలా ఒకటి నుంచి 14వ తేదీ వరకు రేషన్ షాపుల ద్వారా నిత్యావసర సరుకులు పంపిణీ చేయాల్సి ఉండగా... ఇప్పటివరకూ మొదలుకాలేదు. పౌరసరఫరాల వ్యవస్థలో రేషన్‌షాపుల ద్వారా బియ్యం పంపిణీ కోసం చేపట్టిన ఈ పాస్ విధానం అమలులో అధికారుల నిర్లక్ష్యమే ఇందుకు కారణం. మరో పది రోజుల్లో బతుకమ్మ పండుగ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో బియ్యం పంపిణీ కాకపోవడం.. ఎప్పుడిస్తారో స్పష్టత లేకపోవడంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. మరో వైపు షాపుల చుట్టూ తిరుగుతున్న పేదలకు సమాధానం చెప్పలేక డీలర్లు తలపట్టుకుంటున్నారు. మిషన్లు వచ్చినా.. రేషన్‌డీలర్లకు ఈ పాస్ యంత్రాలు పంపిణీ చేసిన అధికారులు వేయింగ్ మిషన్లు లేక హిమాచల్ ప్రదేశ్ నుంచి వచ్చే వాటి కోసం ఎదురుచూశారు. ఎట్టకేలకు జిల్లాకు వేయింగ్ మిషన్లు చేరుకున్నా యి. అయితే ఈ పాస్ యంత్రాలను వేయింగ్ మిషన్‌కు అనుసంధా నం చేసే విషయంలో సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. శుక్రవారం హన్మకొండ మండలం పరిధిలోని డీలర్లను ఈ పాస్ మిషన్లతో కలెక్టరేట్‌కు రావాలని అధికారులు ఆదేశించారు. అయితే ఎంత సేపు ప్రయత్నించినా.. చాలా మిషన్ల అనుసంధానం ప్రక్రియ పూర్తి కాలేదు. దీంతో డీలర్లు వెనుదిరిగారు. జిల్లాలో 599 షాపుల్లో ఈ ప్ర క్రియ పూర్తి కావడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. ఈ నెల వరకు అవకాశమివ్వండి.. మిషన్లలో సాంకేతిక సమ్స్యలను దృష్టిలో పెట్టుకుని పండుగలు ఉన్నందున ఆగస్టు నెలలో మాదిరిగా పంపిణీ చేసేందుకు అవకాశం ఇవ్వాలని కోరుతూ రేషన్‌డీలర్ల సంఘం ప్రతినిధులు శుక్రవారం జేసీ దయానంద్‌కు వినతిపత్రం అందజేశారు. జేసీ నిర్ణయం మేరకు అధికారులు తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఆలస్యమైనా ఈ పాస్ ద్వారానే... ఈ నెల తప్పనిసరిగా ఈ పాస్ విధానం ద్వారానే బియ్యం పంపిణీ చేయాలని కమిషనర్‌నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. అందువల్ల కాస్త ఆలస్యమైనా ఈ పాస్ ద్వారానే పంపిణీ చేస్తాం. జిల్లాలో వేలేరుతోపాటు మరికొన్ని మండలాల్లో మిషన్ల అనుసంధానం పూర్తయింది. ఒకటి రెండు రోజుల్లో జిల్లా మొత్తం పూర్తి చేస్తారు. గతంలో మాదిరిగా ఒక్కనెల పంపిణీకి అనుమతి ఇవ్వాలని రేషన్‌డీలర్లు విజ్ఞప్తి చేశారు. ఈ విషయంలో జేసీకూడా ఈ పాస్ ద్వారానే పంపిణీ చేయమన్నారు.– విజయలక్ష్మి, డీసీఎస్ఓ -
‘చౌక’బారు దోపిడీ
♦ రేషన్ షాపుల నుంచి నెలవారీ మామూళ్ళు ∙ ♦తొలుత దాడులు... ఆపై మధ్యవర్తిత్వం ♦కాకినాడలో ‘పచ్చ’ నేతల బరితెగింపు ∙ ♦దారికి రాకుంటే కక్ష సాధింపు సాక్షి ప్రతినిధి, కాకినాడ :మూడేళ్ల టీడీపీ పాలనలో సాధించిన ప్రగతి ఏదైనా ఉందంటే అదొక్క అవినీతే. ఇచ్చుకో...పుచ్చుకో విధానం భాగా అమల్లోకి వచ్చింది. చెప్పినట్టు చేస్తే సరి...లేదంటే కక్ష సాధింపు చర్యలే. వీరి బాధితులు కాకినాడ నగరంలోనే లెక్కలేనంత ఉన్నారు. అవినీతికి కాదేదీ అనర్హమన్న చందాన పచ్చనేతలు చివరకు రేషన్ దుకాణాలను కూడా వదిలిపెట్టడం లేదు. నెలవారీ మామూళ్లతో చౌక డిపో డీలర్లను నిలువు దోపిడీ చేస్తున్నారు. వచ్చే అరకొర కమీషన్లు, నిర్వహణ వ్యయంతో లబోదిబోమంటున్న రేషన్ డీలర్లు అధికార పార్టీ నేతల వసూళ్ల దందాకు హడలిపోతున్నారు. అడిగిన మేరకు ఇవ్వకపోతే ఎదురయ్యే ఇబ్బందులను తలుచుకుని ఎటూ చెప్పుకోలేక ముడుపులు సమర్పించుకుంటున్నారు. ప్రతీనెలా రూ. 2 లక్షలకు పైగా వసూళ్లు... జిల్లా కేంద్రం కాకినాడలోని అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధి, అతని బంధువుల ఇబ్బందులకు చౌకడిపో డీలర్లు కూడా బాధితులుగా మారిపోయారు. కాకినాడలో దాదాపు 117 రేషన్ దుకాణాలున్నాయి. దాదాపు 77 వేల 152 రేషన్ కార్డులు ద్వారా ప్రజలకు రేషన్ సరుకులు అందిస్తున్నారు. మెజార్టీ చౌకడిపోల నుంచి నెలవారీ వసూళ్ల వ్యవహారం చాలా కాలంగా గుట్టుగా సాగిపోతోంది. ఆయా రేషన్ దుకాణాల పరిధిలోని ఒక్కో రేషన్ కార్డుకు నెలకు రూ.3లు చొప్పున కార్పొరేషన్ పరిధిలో నెలకి 2 లక్షల 31 వేలు చొప్పున ముక్కుపిండి వసూలు చేస్తున్నట్టు తెలుస్తోంది. వీటిని వసూళ్లు చేసేందుకు అధికార పార్టీకి చెందిన వ్యక్తులతో నాలుగైదు బృందాలు ఏర్పడ్డాయి. వీరికి అనుకూలంగా ఉండే డీలర్లు క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారన్నది ఇక్కడ హాట్‌టాఫిక్‌గా మారింది. ఇలా నెలవారీ మామూళ్లను క్రమం తప్పకుండా తమ జేబుల్లో వేసుకుంటున్నారన్న విమర్శలున్నాయి. దాడులతో లొంగదీసుకుని... వసూళ్లకు సహకరించని రేషన్ డీలర్లను లొంగదీసుకునేందుకు అనేక ఎత్తులు వేస్తున్నారు. నచ్చని డీలర్లపై రెవెన్యూ, సివిల్ సప్లయిస్ అధికారుల ద్వారా దాడులు చేయించి కేసులు పెట్టిస్తున్నారు. తరువాత అదే పార్టీకి చెందిన సదరు ప్రజాప్రతినిధి సీజ్ చేసిన దుకాణాన్ని తిరిగి అనుమతించేందుకు రూ.లక్ష వరకు డిమాండ్ చేయడం, అనక యథావిధిగా పనిచేసుకునేలా అనుమతి ఇప్పించడం ఇక్కడ సర్వసాధారణమైపోయిందంటున్నారు. గడచిన మూడేళ్లలో 20 నుంచి 25 దుకాణాలపై దాడులు చేయించి డీలర్లను లొంగదీసుకున్నారన్న విమర్శలున్నాయి. అధికారంలోకి రాక ముందు కేసులున్న అనేక దుకాణాల విషయంలో కూడా మధ్యవర్తిత్వం జరిపారని ఆరోపణలున్నాయి. సొమ్ములు తీసుకుని వాటికి కూడా అనుమతి ఇచ్చారన్న వాదన ఆ వర్గాల్లో వినిపిస్తోంది. అక్రమాలకు పాల్పడక తప్పదు నేతలకు ముడుపులు చెల్లించుకోవాలంటే అక్రమాలు చేయక తప్పదు. చేతి సొమ్ము ఇచ్చే పరిస్థితి ఉండదు. కాదనలేక ఒకర్ని కొట్టి ఇంకొకరికి పెట్టాల్సిన దుస్థితి ఏర్పడింది. ఒకర్ని సంతృప్తి పరచడానికి అడ్డదారులు తొక్కాల్సిన పరిస్థితి నెలకుంది. దీంతో కొందరు అవకాశం మేరకు దారి తప్పుతున్నారు. కాకపోతే, ఏ ఒక్కరూ బయటపడలేని పరిస్థితిలో ఉన్నారు. టార్గెట్ అయిపోతామని కిమ్మనకుండా ఉంటున్నారని ఓ వ్యాపారి, మరో డీలరు ‘సాక్షి’ వద్ద వాపోయారు. పీడీఎస్ బియ్యం పైనా కమీషన్లు... చౌక డిపోల్లో కార్డుదారులకు సంబంధించిన కిలో రూపాయి బియ్యాన్ని కొనుగోలు చేసే వ్యాపారం కూడా అధికార పార్టీ కనుసన్నలో జోరుగానే సాగుతోంది. పీడీఎస్ బియ్యాన్ని డీలర్ల నుంచి కొందరు పెద్ద ఎత్తున కొనుగోలు చేసే వ్యాపారంలో కూడా గట్టిగానే దండుతున్నారనే విమర్శలున్నాయి. ఇలా రేషన్ దుకాణాలను అడ్డుపెట్టుకుని నెలనెలా లక్షల్లోనే గుంజుతున్నారని బయటపడని డీలర్లు భగ్గుమంటున్నారు. -
రాష్ట్రవ్యాప్తంగా రేషన్ ‘పోర్టబిలిటీ’
- ఇప్పటికే ప్రయోగాత్మకంగా హైదరాబాద్‌లో అమలు - ఆధార్ అనుసంధానం తర్వాత రాష్ట్రమంతా అమలు సాక్షి, హైదరాబాద్: రేషన్ వినియోగదారుల కష్టాలు త్వరలోనే తీరనున్నాయి. తమకు కేటాయించిన రేషన్ దుకాణంలోనే కాకుండా, ఎక్కడ వీల యితే అక్కడ రేషన్ సరుకులు తీసుకునే వెసులుబాటు అందుబాటులోకి రానుంది. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ ‘రేషన్ పోర్టబిలిటీ’ విధానంపై ఇప్పటికే కసరత్తు పూర్తి చేసింది. హైదరాబాద్ పరిధిలోని 1,545 రేషన్ దుకాణాల్లో ప్రయోగాత్మకంగా ఈ నెల ఒకటో తేదీ నుంచి రేషన్ పోర్టబిలిటీ విధానం అమల్లోకి రాగా, ఇప్పటివరకు సుమారు 70 వేల లావాదేవీలు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని నిర్ణయిం చారు. రెండు నెలల్లోగా రేషన్ పోర్టబిలిటీని పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెస్తామని సివిల్ సప్లైస్ అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇందుకోసం వినియోగదారుల ఆధార్ కార్డుల అనుసంధానాన్ని వేగవంతంగా పూర్తి చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఈ–పాస్ అమలులో ఉన్న అన్ని రేషన్ షాపుల్లో పోర్టబిలిటీ సాధ్యమవుతుందని, దీంతో ఈ–పాస్‌లో వినియోగదారుల ఆధార్ కార్డు వివరాలను నమోదు చేయడమేనని అంటున్నారు. శరవేగంగా ఈ–పాస్: రాష్ట్రవ్యాప్తంగా ఈ–పాస్ యంత్రాలను అమర్చే కార్యక్రమం శరవేగంగా జరుగుతోందని ఆ శాఖ అధికార వర్గాలు చెప్పాయి. హైదరాబాద్‌లోని రేషన్ దుకాణాల్లో ఈ–పాస్ యంత్రాలను వినియోగించడం వల్ల 14 నెలల కాలంలో రూ.280 కోట్లు ప్రభుత్వానికి ఆదా అయ్యింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 17,200 రేషన్ దుకాణాల్లో ఈ–పాస్‌ను అమలు చేస్తే ఏటా రూ.800 కోట్లు ఆదా అవుతుందని అంచనా వేశారు. దీంతో రాష్ట్రంలోని అన్ని రేషన్ దుకా ణాలను ఈ–పాస్ పరిధిలోకి తెస్తున్నారు. ఇప్పటికే మహబూబ్‌నగర్ జిల్లాలో పూర్తికాగా, ఈ జిల్లాలోని 800 రేషన్ దుకాణల పరిధిలో రూ.3.39 కోట్లు ఆదా అయినట్లు చెబుతున్నారు. మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో ముగింపు దశలో ఉందని, మిగిలిన అన్ని జిల్లాల్లో 2 నెలల వ్యవధిలో పూర్తిస్థాయిలో యంత్రాలను అమర్చే పని పూర్తవుతుందని అధికార వర్గాల సమాచారం. ఈ–పాస్‌తో అక్రమాలకు చెక్ ఈ–పాస్ విధానాన్ని అమల్లోకి తెచ్చాక రేషన్ అక్రమాలకు తెరపడిందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. హైదరాబాద్‌లోని రేషన్ దుకాణల్లో ఈ–పాస్ యంత్రాలు వేలిముద్రలపై ఆధారపడినవి కాగా, కొత్త యంత్రాల్లో ఐరిష్ ఏర్పాట్లు చేశారు. వేలిముద్రల వల్ల కూడా అక్రమాలకు అవకాశం ఏర్పడిందని, వేలిముద్రలు అరిగిపోయిన వినియోగదారులు సరుకులు తీసుకునేందుకు వీలుగా ఆయా ప్రాంతాల సివిల్ సప్లైస్ ఇన్స్పెక్టర్లకు అవకాశం కల్పించారు. దీంతో ఇది దుర్వినియోగం అయినట్లు గుర్తించారు. ఈ కారణంగానే కొత్త ఈ–పాస్ యంత్రాల్లో ఐరిష్ సౌకర్యం కల్పించారు. కొత్త ఈ–పాస్ అమలులోకి వచ్చిన వెంటనే ‘రేషన్ పోర్టబిలిటీ’ అందుబాటులోకి వస్తుందని పౌరసరఫరాల శాఖ వర్గాలు చెప్పాయి. -
రేషన్ షాపులో ప్లాస్టిక్ బియ్యం
శ్రీరామనగర్: కొప్పళ జిల్లాలోని ఒక చౌక దుకాణంలో ప్లాస్టిక్ బియ్యం ఇచ్చారని లబ్ధిదారులు గొడవకు దిగారు. గంగావతి తాలూకా శ్రీరామనగర్ గ్రామంలోని 6వ వార్డులో ఉన్న చౌకడిపోలో గురువారం అన్నభాగ్య పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేసిన బియ్యం బస్తాలలో ప్లాస్టిక్ బియ్యం ఉన్నట్లు కలకలం రేగింది. చౌకడిపోలో బియ్యం తీసుకెళ్లిన కొందరు ఇంట్లో యథావిధిగా వండి చూశారు. అన్నంలో ఏదో తేడా రావడంతో ఇది ప్లాస్టిక్ బియ్యమే అయి ఉంటుందని చెప్పారు. అలాగే మరో గ్రామస్తుడు కూడా ఈ బియ్యం వండి చూడగా ప్లాస్టిక్ వాసన వస్తోందని తెలిపాడు. దీంతో ప్రజలు బియ్యం తీసుకొచ్చి ఆగ్రహం వ్యక్తంచేశారు. పరీక్షలకు బియ్యం నమూనాలు ఆహార పౌర సరఫరాల శాఖ అధికారులను ప్రజలు, మీడియా ప్రశ్నించగా, బియ్యం నాణ్యతను పరిశీలించడానికి శ్యాంపిల్‌ను సేకరించి జిల్లా కేంద్రానికి పంపినట్లు చెప్పారు. ప్రభుత్వం ప్రజలకు ప్లాస్టిక్ బియ్యంను సరఫరా చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతోందని పలువురు లబ్ధిదారులు ఆరోపించారు. ప్రభుత్వం సమగ్ర దర్యాప్తు జరిపించి బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
రేషన్‌షాపులు ఎత్తివేత ఆలోచన సరికాదు
జైనథ్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రేషన్ షాపులను ఎత్తేసి నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో డబ్బులు జమ చేసే నగదు బదిలీ పథకాన్ని తీసుకొచ్చే ఆలోచనలను మానుకోవాలని ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి కుంటాల రాములు అన్నారు. గురువారం ఆయన మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట నాయకులతో కలిసి ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2013 ఆహార భద్రత చట్టం ప్రకారం ప్రతీ పౌరునికి చౌకగా ఆహారం పొంది జీవించే హక్కు ఉందన్నారు. దీన్ని కాలరాసేలా ప్రభుత్వాలు వ్యవహరించడం సరికాదన్నారు. కేరళ వంటి రాష్ట్రాల్లో అన్ని రకాల నిత్యావసర వస్తువులను ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా అందిస్తుంటే తెలంగాణలో మాత్రం కేవలం బియ్యానికే పరిమితం కావడం బాగోలేదన్నారు. గతంలో ఇచ్చిన పప్పు, గోదుమలు, చక్కెర ఇలా అన్ని రకాల సరుకులను నిలిపి వేసిన ప్రభుత్వం రేషన్ షాపులను నిర్వీర్యం చేస్తుందన్నారు. ఇకనైన ఈ ఆలోచన మానుకొని, ప్రజలకు తక్కువ ధరకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేయాలన్నారు. -
అంత్యోదయ’కు సబ్సిడీపై కిలో చక్కెర!
జూన్ నుంచి అమలుకు ఆదేశాలు సాక్షి, హైదరాబాద్: రేషన్ షాపుల ద్వారా అంత్యోదయ ఆహార భద్రత కార్డు (ఏఎఫ్ ఎస్సీ) కలిగిన వారికి జూన్ నుంచి సబ్సిడీ ధరపై కిలో చక్కెర పంపిణీ జరుగనుంది. ఈమేరకు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమి షనర్ సీవీ ఆనంద్ ఆదేశాలు జారీ చేశారు. ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా పంపిణీ చేసే చక్కెరకు సబ్సిడీ ఎత్తివేసి కేవలం అంత్యో దయ అన్నయోజన లబ్ధిదారులకు మాత్రమే సబ్సిడీని కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇప్పటికే సబ్సిడీ చక్కెర సరఫరా నిలిచిపోగా, గోదా ముల్లో ఉన్న పాత స్టాక్, డీలర్ల వద్ద మిగులు నిల్వలను మే నెలలో కొంత వరకు పంపిణీ చేశారు. ఇక ఆహార భద్రత కార్డుదారులకు సబ్సిడీపై చక్కెర పంపిణీ పూర్తిగా నిలిపివేశారు. సబ్సిడీపై కిలో చక్కెర రూ. 13.50.. అంత్యోదయ ఆహార భద్రత కార్డుదారులకు సబ్సిడీపై కిలో చక్కెర రూ.13.50కు లభించనుంది. రాష్ట్రంలో మొత్తం 85,72,859 ఆహార భద్రత కార్డుదారులు ఉండగా అందులో అంత్యోదయ ఆహార భద్రత కార్డుదారులు 5,54,127 వరకు ఉన్నారు. ఇప్పటివరకు ఆహార భద్రత, అంత్యోదయ కార్డుదారులందరికీ సబ్సిడీ ధరపై అర కిలో చక్కెర పంపిణీ జరిగేది. కేంద్ర ప్రభుత్వం చక్కెరపై సబ్సిడీ ఎత్తివేసి, కేవలం అంత్యోదయ కార్డులకు మాత్రమే సబ్సిడీపై పంపిణీ చేయాలని సూచించింది. ఒక్కో కార్డుపై మరో అర కిలో కోటాను పెంచి ఆదేశాలు జారీ చేసింది. -
ప్రజా పంపిణీపై పక్కా నిఘా
♦ పంచాయతీ నుంచి జిల్లాస్థాయి వరకు విజిలెన్స్ కమిటీల ఏర్పాటు ♦ పనితీరుపై ప్రతినెలా సమావేశాలు ♦ సరుకుల పక్కదారిపై కన్ను.. ♦ పారదర్శకతకు పెద్దపీట సాక్షి, రంగారెడ్డి జిల్లా: చౌక ధరల దుకాణాల ద్వారా పేదలకు అందజేస్తున్న సరుకులు పక్కదారి పట్టకుండా పటిష్టమైన నిఘా వ్యవస్థ ఏర్పాటు కానుంది. అంతేగాక సరుకుల అందజేతలో అత్యంత పారదర్శకత రానుంది. ప్రజా పంపిణీ వ్యవస్థలో పెద్ద ఎత్తున అక్రమాలు చోటుచేసుకుంటున్న విషయం తెలిసిందే. ఫలితంగా రూ.కోట్ల ప్రజా ధనం దుర్వినియోగం అవుతోంది. దీనికి అడ్డుకట్ట వేసేందుకు సర్కారు నడుంబిగించింది. పంపిణీ వ్య వస్థపై డేగకన్ను వేసేందుకు విజిలెన్స్ కమిటీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు గురువా రం పౌర సరఫరాల శాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. గ్రామ పంచాయతీ నుంచి మొదలుకొని జిల్లా స్థాయి వరకు కమిటీలు రూపుదిద్దుకోనున్నాయి. కమిటీలు ఏర్పాటు చేసే బాధ్యతల్ని జిల్లా యంత్రాంగానికి అప్పగించింది. అక్రమాలకు చెక్... దారిద్య్ర రేఖకు దిగువగా ఉన్న కుటుంబాలకు అందజేస్తున్న బియ్యం, కిరోసిన్ జిల్లాలో పెద్ద ఎత్తున పక్క దారి పడుతున్నాయి. ఎంఎల్ఎస్ పాయింట్ల నుంచి మొదలుకొని రేషన్ షాపుల వరకు అన్నిచోట్ల అక్ర మాలు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా నీలి కిరోసిన్ ... వ్యాపారులకు కాసులు కురిపిస్తున్నాయి. లారీల యజమానులు పెద్ద ఎత్తున మధ్యవర్తుల ద్వారా కొనుగోలు చేస్తున్నారు. జిల్లాలో పేదలకు అందా ల్సిన కిరోసిన్ కోటాలో దాదాపు 50 శాతానికిపైగా పక్కదారి పడుతున్నట్లు అధికారిక వర్గాలే వెల్లడిస్తు న్నాయి. మరోపక్క సంక్షేమ వసతి గృహాల్లోని విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. హాస్టళ్ల వార్డన్ల సహకారంతో... గుట్టుచపు్పడు కాకుండా మార్కెట్లోకి తరలుతున్నా యని పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. కిలో సన్నబియ్యం ధర బహిరంగ మార్కెట్లో రూ. 40కిపైగా ఉండడంతో.. వీటికి అంతటి ప్రాధాన్యత ఏర్పడింది. హాస్టళ్లకు ఉచితంగా పంపిణీ చేస్తుండడంతో.. వార్డెన్ల కు భారీగా గిట్టుబాటు అవుతోందని తెలుస్తోంది. వీటితోపాటు రేషన్ డీలర్లు హస్తలాఘవాన్ని ప్రదర్శి స్తున్నారు. కార్డుదారులకు అందించాలి్సన యూనిట్లలో కొంత కోత విధిస్తున్నారు. ఆ మేరకు వెనకేసుకుని బ్లాక్‌లో అమ్ముకుంటున్నారని అధికారులకు ఫిర్యాదులు అందుతూనే ఉన్నాయి. ముఖ్యంగా పట్టణ ప్రాంతంలోని రేషన్ దుకాణాల్లో ఇటువంటì ఘటనలు ఎక్కువగా చోటుచేసుకుంటున్నట్లు అధికారుల పరిశీలనలో సైతం తేలింది. ఈ–పాస్ విధానంలోని కొన్ని లోటుపాట్లు డీలర్లకు కలిసి వస్తున్నాయి. అక్రమాల గురించి తెలుసుకున్న అధికారులు తనిఖీలకు వెళితే.. డీలర్లు తమ రాజకీయ పలుకుబడి ఉపయోగిస్తున్నారు. అక్రమాల వెలికితీతను అడ్డుకునేందుకు మంత్రులతోనూ అధికారులకు ఫోన్లు చేయించిన దాఖలాలు అధికంగానే ఉన్నాయి. కష్టపడి తనిఖీలు చేసినా.. కళ్లముందు అక్రమాలు జరుగుతున్నా ఏమీ చేయలేకపోతున్నామని అధికారులు వాపోతున్నారు. పైగా తమను డీలర్లు లక్ష్యంగా చేసుకుని కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన చెందుతున్నారు. విజిలెన్స్ కమిటీల ఏర్పాటు ద్వారా ఇకపై ఇటువంటి ఆగడాలకు చెల్లుపడునుందని అధికారులు సైతం ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కమిటీల ఏర్పాటు ఇలా... కలెక్టర్ నేతృత్వంలో జిల్లా, మున్సిపాలిటీ, మండల, గ్రామపంచాతీ స్థాయి విజిలెన్స్ కమిటీలు త్వరలో ఏర్పాటు కానున్నాయి. జిల్లా స్థాయి కమిటీలో వినియోగదారులు, మానవ హక్కులు, సామాజిక సేవ, ఆరోగ్యం తదితర రంగాల్లోని వ్యక్థులకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ఈ కమిటీకి కలెక్టర్ చైర్మన్ గా, జెడ్పీ చైర్ పర్సన్ .. కో చైర్ పర్సన్ గా, జేసీ ఉప చైర్పర్సన్ గా, కన్వీనర్‌గా జిల్లా సరఫరాల అధికారి వ్యవహరిస్తారు. వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారులు, ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీల నాయకులకు చోటు కల్పిస్తారు. అలాగే ఎస్సీ, ఎస్టీ కేటగిరీ నుంచి ఇద్దరిని కలెక్టర్ నామినేట్ చేస్తారు. మండల స్థాయి కమిటీకి చైర్ పర్సర్‌గా ఆర్డీఓ, కన్వీనర్‌గా తహసీల్దార్, గ్రామపంచాయతీ స్థాయి కమిటీలకు చైర్ పర్సన్ గా సర్పంచ్, కన్వీనర్‌గా వీఆర్ఓ వ్యవహరిస్తారు. మహిళా సంఘాల సభ్యులు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు, ఎస్టీ,ఎస్టీ కేటగిరీల నుంచి ఇద్దరు సభ్యులుగా ఉంటారు. చర్చ.. చర్యలు.. నివేదిక అన్ని స్థాయిల కమిటీలు ప్రతినెలా సమావేశం అవుతాయి. గ్రామపంచాయతీ స్థాయి కమిటీ ప్రతినెలా తొలి సోమవారం, రెండో సోమవారం మండల స్థాయి కమిటీ, నాలుగో సోమవారం జిల్లా స్థాయి విజిలెన్స్ కమిటీ సమావేశమై ప్రజా పంపిణీ వ్యవస్థపై చర్చించాల్సి ఉంటుంది. సరుకుల కేటాయింపు, కార్డుదాలరుకు పంపిణీ, స్టాక్‌పై పరిశీలన, సరుకుల సరఫరా తీరు, డబ్బుల చెల్లింపులు, ఫిర్యాదులు, అక్రమాలు, కార్డుల స్థితి, బోగస్ కార్డుల ఏరివేత, ఖాళీ రేషన్ షాపుల డీలర్ల భర్తీ, బియ్యం సేకరణ, అవగాహన కార్యక్రమాలు తదితర అంశాలపై విస్తృతంగా చర్చిస్తారు. తీసుకున్న చర్యలపై ఎప్పటికపు్పడు నివేదక తయారు చేయాలి. ఇలా ప్రతి చర్యపై నిఘా పెట్టడం ద్వారా అక్రమాలకు అడ్డుకట్ట వేయడంతోపాటు నిజమైన అర్హులకు సక్రమంగా సరుకులు పంపిణీ చేయవచ్చని భావిస్తోంది. రేషన్ షాపులు 916 ఏఎఫ్ఎస్సీ కార్డులు 35,550 ఆహార భద్రత కార్డులు 4.82 లక్షలు ప్రతినెలా బియ్యం కోటా 11,025 మెట్రిక్ టన్నులు చక్కెర కోటా 5.17 లక్షలు (అర కేజీ ప్యాకెట్లు) కిరోసిన్ కోటా 300 కిలో లీటర్లు -
‘రేషన్ ’లో దశల వారీగా నగదు రహిత లావాదేవీలు
సబ్బవరం (పెందుర్తి) : రేషన్ షాపుల్లో నిర్భంధ విధానం కాకుండా దశలవారీగా నగదు రహిత లావాదేవీలు అమలు చేయాలని రేషన్ డీలర్ల రాష్ట్ర సంఘం ప్రధాన కార్యదర్శి దివిలీల మాధవరావు అన్నారు. ఆదివారం మండలంలోని ఆర్అండ్బీ అతిథి గృహంలో మండల రేషన్ డీలర్లతో సమావేశమయా్యరు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సోమవారం ఉదయం విజయనగరంలో రాష్ట్ర రేషన్ లర్ల సమావేశం జరుగుతుందన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ–పోస్ విధానాన్ని రాష్ట్ర డీలర్లు విజయవంతం చేసి ప్రజాపంపిణీ వ్యవస్థను దేశంలోనే తొలిస్థానానికి తీసుకువెళ్లారన్నారు. డీలర్ల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లగా రూ.20 నుంచి రూ.70కు కమీషన్ పెంచిం దని తెలిపారు. రేషన్ డీలర్లను బ్యాంక్ కరస్పాం డెంట్లు నియమిస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసిందన్నారు. అందువల్ల వీరికి ఖర్చులు పోనూ 5 శాతం కమీషన్ వచ్చేవిధంగా విధివిధానాలు రూపొం దించాలని కోరారు. డీలర్ల సంక్షేమ నిధిని ఏర్పాటు చేయాలని కోరారు. కార్యక్రమంలో రేషన్ డీలర్ల రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆర్.గంగాధరగౌడ, రాష్ట్ర కోశాధికారి పి.చిట్టిరాజు, కె.అప్పారావు, వాసిరెడ్డి నరసింగరావు తదితరులు పాల్గొన్నారు. -
‘రేషన్’ కోసం మైళ్ల దూరం..
కామారెడ్డి : జిల్లాలో ఒక మున్సిపాలిటీతో పాటు 323 పంచాయతీలు ఉన్నాయి. రెవెన్యూ గ్రామాలు 478. మరో వందకుపైగా శివారు గ్రామాలు, గిరిజన తండాలు ఉన్నాయి. జిల్లాలో 2,22,513 కుటుంబాల్లో 9,72,625 నివసిస్తున్నారు. అన్ని రకాల రేషన్‌కార్డులు కలిపి 2,46,039 ఉన్నాయి. వీరికి 578 రేషన్ షాపుల ద్వారా నెలనెలా 48.50 మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యం సరఫరా అవుతోంది. అలాగే కిరోసిన్, గోధుమలు, చక్కెర సరఫరా చేస్తున్నారు. అయితే అన్ని సరుకులను ఒకేసారి అందించడం లేదు. బియ్యం, చక్కెర ఒకసారి, కిరోసిన్ మరోసారి పంపిణీ చేస్తున్నారు. దీంతో ఆయా సరుకులను తెచ్చుకోవడానికి లబ్ధిదారులు రేషన్ దుకాణాలకు రెండు సార్లు వెళ్లాల్సి వస్తోంది. జిల్లా కేంద్రమైన కామారెడ్డి పట్టణంలో 30 రేషన్ షాపులు ఉండగా, బాన్సువాడ, ఎల్లారెడ్డిలాంటి పట్టణాల్లో పదికిపైగా రేషన్ షాపులు ఉన్నాయి. చాలా గ్రామాల్లో రేషన్ దుకాణాలు లేకపోవడంతో ప్రజలు సరకుల కోసం పొరుగూళ్లకు వెళ్లాల్సి వస్తోంది. జిల్లాలో 70కి పైగా హాబిటేషన్లలో రేషన్‌షాపులు లేవు. ఆయా గ్రామాల ప్రజలంతా సమీపంలో ఉన్న రేషన్‌షాప్‌లకు వెళ్లి సరుకులు తెచ్చుకుంటున్నారు. అక్కడికి వెళ్లేసరికి డీలర్ లేకుంటే గంటల తరబడి వేచి ఉండాల్సిందే. ఒక్కోసారి డీలర్లు సమయానికి రాలేదంటూ రేషన్ సరకులు ఎగ్గొడుతున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. మారుమూల గ్రామాల్లో.. మారుమూల మండలాల్లోని చాలా గ్రామాల్లో రేషన్ షాపులు అందుబాటులో లేవు. జిల్లాలో మారుమూల నియోజకవర్గమైన జుక్కల్‌లో పరిస్థితి మరీ దారుణం. జుక్కల్ మండలంలో లొంగన్, చిన్నగుళ్ల, కత్తల్వాడి, మంగాపూర్, మెబాపూర్, సిద్దాపూర్, దోస్పల్లి, బంగారుపల్లి, సావర్గావ్, శక్తినగర్, మైలార్ తదితర గ్రామాల్లో రేషన్ షాపులు లేవు. ఈ మండలంలో 24 రేషన్ షాపులు ఉండగా 13 మంది డీలర్లు మాత్రమే ఉన్నారు. 11 దుకాణాలు ఇన్చార్జీల పాలనలో నడుస్తున్నాయి. మద్నూర్ మండలంలో 42 గ్రామాలుండగా 33 గ్రామాల్లో రేషన్ దుకాణాలు ఉన్నాయి. గోజేగావ్, సలాబత్పూర్, ఇలేగావ్, లచ్మాపూర్, రాచూర్, చిన్న తడ్గూర్, ఖరగ్, అంతాపూర్, సోమూర్ గ్రామాల్లో రేషన్ దుకాణాలు లేవు. ఆయా గ్రామాల ప్రజలు పక్క గ్రామంలోని రేషన్ దుకాణాలకు వెళ్లి సరుకులు తెచ్చుకుంటున్నారు. పిట్లం, బిచ్కుంద, పెద్దకొడప్గల్, నిజాంసాగర్ మండలాల్లోనూ ఇదే పరిస్థితి.. ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని సదాశివనగర్ మండలంలో తుక్కోజీవాడి, ముద్దొజీవాడి గ్రామాల్లో రేషన్ షాపులు లేవు. లింగంపేట మండలంలో గట్టుమైసమ్మతండా, ఒంటరిపల్లి, కొట్టాల్‌గడ్డ తండా, రాంపల్లి గ్రామాల ప్రజలు కూడా రేషన్ సరకుల కోసం పొరుగు గ్రామాలపై ఆధారపడాల్సిందే. గాంధారి మండల కేంద్రానికి ఆవాస గ్రామాలైన మాధవపల్లి, గుడిమెట్, పిసికిల్గుట్ట, తిమ్మాపూర్ గ్రామాల ప్రజలు గాంధారికి వెళ్లాల్సి. కరక్వాడీ గ్రామస్తులు బూర్గుల్కు వెళతారు. కామారెడ్డి, బాన్సువాడ నియోజకవర్గాల్లోనూ కొన్ని గ్రామాల్లో ఈ పరిస్థితి ఉంది. రేషన్‌షాపులు ఏర్పాటు చేయాలని అధికారులు, ప్రజాప్రతినిధులను వేడుకున్నా లాభం లేకుండాపోయిందని పలు గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ గ్రామాల్లో రేషన్ షాప్‌లను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. -
బినామీలే!
సగం రేషన్ షాపులు బినామీల చేతుల్లోనే.. ఏళ్లుగా ఇదే వ్యవహారం కామారెడ్డి :జిల్లాలో 575 రేషన్ షాపుల పరిధిలో 2,28,260 ఆహారభద్రత కార్డులు, 16,419 అంత్యోదయ కార్డులు, 1,090 అన్నపూర్ణ కార్డులు ఉన్నాయి. నెలలో పక్షం రోజుల పాటు రేషన్ సరకులు సరఫరా చేయాల్సిన డీలర్లు.. కొన్ని చోట్ల రెండు, మూడు రోజులు మాత్రమే దుకాణాలను తెరుస్తున్నారని తెలుస్తోంది. జిల్లాలో 575 రేషన్ షాపుల్లో దాదాపు సగం దుకాణాలు బినామీల ఆధ్వర్యంలోనే కొనసాగుతున్నాయని తెలుస్తోంది. జిల్లా కేంద్రమైన కామారెడ్డి పట్టణంలో సగానికిపైగా షాపులను బినామీలే నిర్వహిస్తున్నారు. రేషన్ డీలర్లుగా స్థిరపడిన కొందరు.. అధికారులతో కుమ్మక్కై ఒక్కొక్కరు నాలుగైదు రేషన్ షాపుల బాధ్యతలు చూస్తున్నారు. వీరు అసలు డీలర్లకు ఎంతోకొంత కమీషన్ ఇచ్చి ఆయా షాప్‌లను తమ గుత్తాధిపత్యంలోకి తీసుకుంటున్నారు. ఏదైనా కేసుల్లో ఇరుక్కుని డీలర్లు సస్పెండ్ అయితే.. వాటిని కూడా తమ అధీనంలోకి తెచ్చుకుంటున్నారు. జిల్లా అంతటా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. అధికారులతో పాటు అధికార పార్టీ నేతలను ప్రసన్నం చేసుకుని తమ బినామీ దందాను యథేచ్ఛగా సాగిస్తున్నారు. చాలా రేషన్ షాపులు మహిళల పేరిట ఉన్నాయి. వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నేతలు తమ కూతుళ్ల పేరిట రేషన్ షాప్ అనుమతులు పొందినవారు.. కూతుళ్ల వివాహమయ్యాక కూడా ఆ షాప్‌లను తమ అధీనంలోనే ఉంచుకుని బినామీ డీలర్లుగా కొనసాగుతున్నారు. దారిమళ్లుతున్న సరకులు బినామీ డీలర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ పేదలకు అందాల్సిన రేషన్ సరకులను నల్లబజారుకు తరలిస్తున్నారు. ప్రధానంగా జిల్లా కేంద్రమైన కామారెడ్డి పట్టణంలో బినామీ డీలర్ల హవా కొనసాగుతోంది. ఒక్కొక్కరు రెండు, మూడు షాపులు నిర్వహిస్తూ పెద్ద ఎత్తున సరకులను రవాణా చేస్తున్నారు. బినామీ డీలర్లు అసలు డీలర్లకు నెలనెలా రూ. 3 వేల నుంచి రూ. 6 వేల దాకా కమీషన్ ఇస్తున్నారని తెలిసింది. అలాగే అధికారులకు మామూళ్లు ఇస్తూ బినామీ డీలర్లుగా తమ అక్రమాలు కొనసాగిస్తున్నారు. చర్యలు తీసుకుంటాం రేషన్ షాప్ ఎవరి పేరిట ఉందో వారే నిర్వహించాలి. బినామీలతో నిర్వహిస్తే కచ్చితంగా చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే కొన్ని షాపులపై చర్యలు తీసుకున్నాం. రేషన్ సరకులను లబ్ధిదారులకు అందించకుండా నల్లబజారుకు తరలిస్తే లైసెన్సులు రద్దు చేస్తాం. బినామీ షాపుల గురించి వివరాలు సేకరిస్తున్నాం. త్వరలోనే చర్యలు తీసుకుంటాం. – రమేశ్, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి, కామారెడ్డి -
రేషన్ షాపుల్లో నగదు రహితం
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ హైదరాబాద్‌లోని రేషన్ షాపుల్లో నగదు రహిత లావాదేవీలకు రంగం సిద్ధమవుతోంది. ఇప్పటికే నగర శివారులోని జిల్లాల్లో నగదు రహిత లావాదేవీలు ప్రారంభమవడంతో ఇక్కడ కూడా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు పౌరసరఫరాల శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే సంబంధిత అధికారులు, డీలర్లతో సమావేశమై నగదు రహిత లావాదేవీలపై చర్చించారు. ముందుగా రేషన్ సరుకులతో పాటు వివిధ శాఖల బిల్లులు, చార్జీలు వసూళ్లు చేసే బాధ్యతలను డీలర్లకు అప్పగించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. కాగా ఇప్పటికే ఈ–పోస్ యంత్రాల ద్వారా సరుకుల పంపిణీ కొనసాగుతోంది. అయితే ప్రస్తుతమున్న ఈ యంత్రాలకు తోడు స్వైపింగ్ మిషిన్లను అందించాలా? లేదా ఈ–పోస్ యంత్రాల్లోనే కొత్త సాఫ్ట్వేర్ అమర్చడం సాధ్యమేనా? అన్న అంశంపై అధికారులు నిపుణలతో చర్చిస్తున్నారు. త్వరలో ఒక నిర్ణయం తీసుకొని నగదు రహిత లావాదేవీలు ప్రారంభించాలని యోచిస్తున్నారు. తొలివిడతలో సర్కిల్‌కు ఒకటి... గ్రేటర్లో సుమారు 12 సర్కిళ్లు ఉండగా సుమారు 1,545 పైగా చౌక ధరల దుకాణాలున్నాయి. అయితే తొలివిడతలో సర్కిల్‌కు ఒక దుకాణం చొప్పున ఈ నగదు రహిత లావాదేవీలకు శ్రీకారం చుట్టాలని అధికారులు భావిస్తున్నారు. -
అనుకున్నంతా అయింది..
ఏలూరు(ఆర్‌ఆర్‌పేట) : నగదు రహిత లావాదేవీలను ప్రోత్సాహించాలనే అత్యుత్సాహంతో జిల్లా అధికారులు తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు కొన్నివర్గాలకు శాపంగా పరిణమిస్తున్నాయి. రేషన్ సరుకులను కూడా నగదు రహితంగానే సరఫరా చేయాలని ఆదేశాలిచ్చిన అధికారులు అందుకు తగిన సౌకర్యాలు కల్పించకపోవడంతో అటు లబ్దిదారులు, ఇటు రేషన్ డీలర్లు గగ్గోలు పెడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా డిశంబర్ ఒకటవ తేదీ నుండి కేవలం స్వైపింగ్ యంత్రాల ద్వారా మాత్రమే రేషన్ సరుకులు సరఫరా చేయాలని, లబ్దిదారులకు డెబిట్, క్రెడిట్, రూపే వంటి కార్డులు లేని పక్షంలో వారికి డీలర్లు సరుకులను అప్పుగా ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. ఐతే అందుకు తగిన యంత్రాలను సరఫరా చేయలేదని, డీలర్లకు వాటి వినియోగంపై అవగాహన కూడా కల్పించ కుండా నగదు రహిత లావాదేవీలు చేయడం ఎలా సాధ్యపడుతుందనే కోణంలో సాక్షి దినపత్రిక గత మంగళవారం ఒక ప్రత్యేక థనం ప్రచురించింది. ఈ మేరకు ఆ అనుమానాన్ని నిజం చేస్తూ జిల్లాలో ఒక్క స్వైపింగ్ యంత్రాన్ని కూడా అధికారులు సరఫరా చేయలేకపోయారు. గతంలో డీలర్ల వద్ద ఉన్న ఈ పోస్ యంత్రాల్లోనే స్వైపింగ్ సౌకర్యం ఉందని దానిని వినియోగించి, నగదు రహిత లావాదేవీలు చేయాలని సూచించారు. ఐతే ఆ యంత్రాల వినియోగంపై కూడా డీలర్లకు అవగాహన కల్పించకపోవడంతో ఈ నెల తొలిరోజు మొత్తం జిల్లా వ్యాప్తంగా కేవలం అప్పుగా మాత్రమే సరుకులను సరఫరా చేయాల్సి వచ్చింది. 1300 మంది డీలర్ల వద్ద స్వైపింగ్ అవకాశం.. జిల్లా వ్యాప్తంగా 2,140 మంది రేషన్ డీలర్లు ఉండగా వారిలో సుమారు 1300 మంది వద్ద విజన్‌టెక్ కంపెనీకి చెందిన ఈ పోస్ యంత్రాలు ఉన్నాయి. మరో సుమారు 850 మంది వద్ద ఎనలాజిక్ కంపెనీకి చెందిన ఈ పోస్ యంత్రాలు ఉన్నాయి. వీటిలో విజన్‌టెక్ యంత్రాల్లో డెబిట్ తదితర కార్డులతో స్వైపింగ్ చేసుకునే సౌకర్యం అందుబాటులో ఉంది. కానీ వాటి వినియోగంపై డీలర్లకు అవగాహన కల్పించకపోవడంతో ఈ నెలకు మొత్తం రేషన్ సరుకులను అప్పుగానే ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొంది. మొత్తంమీద జిల్లా వ్యాప్తంగా రేషన్ సరుకులు అప్పుగా ఇవ్వాల్సి వస్తే తమ పెట్టుబడి మొత్తం ప్రజల వద్దనే ఉండిపోతుందని డీలర్లు గగ్గోలు పెడుతున్నారు. రెండు నెలలది ఒకేసారి ఎలా కట్టేది.. తుపాకుల ఆదిలక్ష్మి. తెల్లరేషన్ కార్డు లబ్దిదారు ఈ నెల రేషన్ సరుకులకు గాను రూ.46 చెల్లిస్తే సరిపోయేది. దాని నిమిత్తం నేను డబ్బులు కూడా తీసుకువచ్చాను. కానీ డీలర్ నా వద్ద డబ్బు తీసుకోకుండా అప్పుగా ఇస్తున్నానని చెప్పి సరుకులు ఇచ్చేశారు. వచ్చే నెల అదేదో కార్డు తీసుకురమ్మాన్నారు. అదేంటోకూడానాకు తెలవదు. ఒకే సారి రెండు నెలల డబ్బు చెల్లించడమంటే నాలాంటి కూలీనాలీ చేసుకునేవారికి కష్టమే. కార్డు ఉంది.. డీలర్వద్ద మిషనే లేదు.. సీహెచ్ దుర్గా ప్రసాద్, తెల్లరేషన్ కార్డు లబ్దిదారు. నాదగ్గర డెబిట్ కార్డు ఉంది, ప్రభుత్వం ప్రకటించినట్లు నగదు రహిత లావాదేవీలకు నేను సిద్ధంగా ఉన్నాను. ఐతే రేషన్ డీలర్ వద్ద స్వైపింగ్ మిషన్ లేకపోవడంతో అప్పుగా ఇచ్చారు. కేవలం 40 50 రూపాయలే కాబట్టి ఇటువంటి వాటికి డబ్బు తీసుకుంటే సరిపోతుంది -
విలేజ్ మాల్స్‌గా చౌక దుకాణాలు
ఒకే చోట అన్ని నిత్యావసరాల పంపిణీకి చర్యలు – మార్కెట్ ధర కంటే 20 శాతం తక్కువకు పంపిణీ – డిసెంబర్లో 20 శాతం కార్డులకు పంపిణీ చేయాలని నిర్ణయం కర్నూలు(అగ్రికల్చర్): గ్రామాల్లోని చౌక ధరల దుకాణాలు విలేజ్ మాల్స్‌గా మారనున్నాయి. ఇప్పటి వరకు వీటి ద్వారా బియ్యం, కిరోసిన్, చక్కెర మాత్రమే పంపిణీ చేస్తున్నారు. డిసెంబర్ నెల నుంచి షాపులను విలేజ్ మాల్స్‌గా మార్చి మార్కెట్ ధర కంటే 20శాతం తక్కువకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేయాలని పౌరసరఫరాల శాఖ నిర్ణయించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేయడంతో అమలుపై జాయింట్ కలెక్టర్ నేతృత్యంలో కసరత్తు జరుగుతోంది. డిసెంబర్ నెలలో 20శాతం కార్డుదారులకు అదనపు సరుకులు పంపిణీ చేయాలని ఆదేశించడంతో ఆ దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేశారు. విలేజ్ మాల్స్ ద్వారా కందిపప్పు, పామోలిన్ ఆయిల్, అయోడైజ్డ్ ఉప్పు, ఉల్లి, బంగాళ దుంపలను మార్కెట్ ధర కంటే 20శాతం తక్కువకు పంపిణీ చేయాలని పౌరసరఫరాల శాఖ కమిషనర్ ఆదేశించారు. స్థానిక పరిస్థితులను బట్టి ప్రజలకు ఉపయోగపడే నిత్యావసర వస్తువులను పంపిణీ చేయవచ్చని సూచించారు. ఈ నేపథ్యంలో జిల్లాలో అదనంగా కారంపొడి, శనగపప్పు, పెసరపప్పు కూడా పంపిణీ చేయాలని ప్రయత్నిస్తున్నారు. ఈ సరుకులను జిల్లా స్థాయి నుంచే సరఫరా చేస్తారు. నిబంధనల ప్రకారం టెండర్ పిలిచి ధరలను ఖరారు చేసి వారి ద్వారా గ్రామాలకు సరఫరా చేయాల్సి ఉంది. అయితే డిసెంబర్ మొదటిì వారం నుంచే పంపిణీ చేయల్సి ఉండటం వల్ల సమయం లేనందున హోల్‌సేల్ డీలర్లతో చర్చించి వారి ధరలు ఖరారు చేసి ఆ మేరకు చర్యలు చేపట్టనున్నారు. అయితే రూ.300 విలువ వరకు మాత్రమే ఈ సరుకులు ఇస్తారు. సరుకలు ఎట్టి పరిస్థితుల్లో లూజుగా ఇవ్వరాదు. ప్యాకింగ్‌లో మాత్రమే ఇవ్వాల్సి ఉంది. ఈ కార్యక్రమాన్ని గ్రామీణ ప్రాంతాల్లోనే పెద్ద ఎత్తున అమలు చేయాలని జేసీ భావిస్తున్నారు. డిసెంబర్లో 20శాతం కార్డులకు పంపిణీ చేయడంలో విజయవంతం అయితే జనవరి నెల నుంచి కార్డుదారులందరికీ వీటిని పంపిణీ చేయాలని ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ఐదు రకాల సరుకుల మార్కెట్ ధరలు, మాల్స్ ధరలు ఇలా.. సరుకు పేరు మార్కెట్ ధర 20 శాతం తక్కువ ధర –––––––––––––––––––––––––––––– కందిపప్పు రూ.120 రూ. 90 పామోలిన్ ఆయిల్ రూ. 65 రూ. 52 ఉప్పు రూ. 20 రూ.15 ఉల్లి రూ.10 రూ. 8 బంగాళదుంప రూ.20 రూ.15 –––––––––––––––––––––––––––––– -
రేషన్ షాపులే మినీ బ్యాంకులు
► తెరపైకి రేషన్ షాపు బ్యాంకుల లావాదేవీలు ► డీలర్లకు మైక్రో ఏటీఎంలు అందించేందుకు సిద్ధం ► మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స డైరక్టర్ అశోక్ కుమార్ సింగ్ నుంచి ఆదేశాలు జారీ ► డీలర్లతో సమావేశమైన జేసీ, లీడ్‌బ్యాంక్ మేనేజర్, ఎన్ఐసీ అధికారులు విజయనగరం కంటోన్మెంట్: పెద్ద నోట్ల రద్దు వ్యవహారంతో ప్రజానీకం అతలాకుతలం అవుతుండటంతో కేంద్ర ప్రభుత్వం రేషన్ డీలర్లను బిజినెస్ కరస్పాండెంట్లుగా నియమించనున్నది. మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స డెరైక్టర్ అశోక్ కుమార్ సింగ్ ఆదేశాలతో హుటాహుటిన డీలర్లతో జిల్లా అధికారులు సమావేశాన్ని నిర్వహించి బిజినెస్ కరస్పాండెంట్లుగా కొద్ది పాటి మొత్తాలకు పనిచేయాలని సూచనలు చేశారు. వీరి ద్వారా గ్రామాల్లో పరిమిత నగదు లావాదేవీలను నిర్వహింపజేసేందుకు చర్యలు తీసుకోనున్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న రేషన్ డీలర్లతో మినీ కాన్ఫరెన్స హాలులో జారుుంట్ కలెక్టర్ శ్రీకేశ్ బి.లఠ్కర్, లీడ్ బ్యాంకు మేనేజర్ గురవయ్య, ఎన్ఐసీ అధికారులు బుధవారం సమావేశాన్ని నిర్వహించారు. రేషన్ డీలర్ల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బుగత వెంకటేశ్వర రావు, జిల్లా ఉపాధ్యక్షుడు సముద్రపు రామారావులతో బిజినెస్ కరస్పాండెంట్లుగా ఉండేందుకు ఎంత మంది రేషన్ డీలర్లు ఆసక్తిగా ఉన్నారో చర్చించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ పరిమిత నగదు లావాదేవీలతో బ్యాంకింగ్ చేసేందుకు అర్హులైన డీలర్లు ముందుకు రావాలన్నారు. వీరికి రూ.ఐదారు వేల ఆదాయం వచ్చే అవకాశం ఉందన్నారు. లీడ్ బ్యాంకు మేనేజర్ గురవయ్య మాట్లాడుతూ గ్రామాల్లోని రేషన్ షాపులే ఇక బ్యాంకు లావాదేవీలను పరిమితంగా నిర్వహించాల్సి ఉంటుందన్నారు. బిజినెస్ కరస్పాండెంట్లు తమ పరిధిలో నెలలో కనీసం 20 రోజులు అందుబాటులో ఉండాలని, అదనపు వ్యాపార ప్రతినిధిగా పేరు నమోదు చేసుకోవాలని ఆయనతెలిపారు. ఆరుగురు సభ్యులతో కమిటీ.. డీలర్లను బిజినెస్ కరస్పాండెంట్లుగా నియమించేందుకు జిల్లా స్థారుులో ఓ కమిటీ ఉంటుంది. ఈ కమిటీకి జిల్లా కలెక్టర్ చైర్మన్‌గానూ లీడ్ జిల్లా మేనేజర్ కన్వీనర్‌గానూ వ్యవహరిస్తారు. మరో నలుగురు అధికారులు సభ్యులుగా వ్యవహరిస్తారు. డీలర్లకు మైక్రో ఏటీఎంలు బిజినెస్ కరస్పాండెంట్లుగా లావాదేవీలు నిర్వహించేందుకు చేతిలో ఇమిడే మైక్రో ఏటీఎంలను రేషన్ డీలర్లకు అప్పగించేందుకు సిద్ధం చేశారు. వీటిని ఎన్ఐసీ, జేసీ, డీఎస్ఓ తదితర అధికారులతో కలసి సమన్వయంతో పనిచేసేందుకు సిద్ధం చేస్తున్నారు. ఈ సమావేశంలో ఏఎస్ఓలు పి.నాగేశ్వరరావు, ఆర్.సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
‘చౌక ధర’ల్లోనే ఖరీదెక్కువ
పామాయిల్ మార్కెట్లోనే చౌక రేషన్ షాపుల్లో 750 ఎంఎల్ రూ. 63 బహిరంగ మార్కెట్లో లీటర్ రూ. 67 ఎల్లారెడ్డి : పేరుకు చౌక ధరల దుకాణం.. పామాయిల్ రేటు మాత్రం బహిరంగ మార్కెట్‌లోకంటే అధికం.. దీంతో రేషన్ షాపుల్లో పామారుుల్ తీసుకోవడానికి వినియోగదారులు ఆసక్తి చూపడం లేదు. అరుుతే డీలర్లు బలవంతంగా అంటగడుతున్నారని ఆరోపిస్తున్నారు. పేదలకు చౌకధరలకే నిత్యవసరాలను అందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం రేషన్‌దుకాణాలను ఏర్పాటు చేసింది. రూపారుుకి కిలో బియ్యం సరఫరా చేస్తోంది. దీంతో పాటు పలు వస్తువులను అందిస్తోంది. అరుుతే మిగతా వస్తువుల ధరలు బహిరంగ మార్కెట్లోనే తక్కువగా ఉండడం గమనార్హం. రేషన్ షాప్‌లలో విజయ పామారుుల్‌ను సరఫరా చేస్తున్నారు. ఒక్కో ప్యాకెట్ రూ. 63కు విక్రరుుస్తున్నారు. అరుుతే ఇది 750 మిల్లీలీటర్లే కావడం గమనార్హం. ఇదే కంపెనీకి సంబంధించిన లీటర్ ప్యాకెట్ బహిరంగ మార్కెట్లో రూ. 67కు లభిస్తోంది. డబుల్ ఫిల్టర్ చేయబడే ప్రైవేట్ కంపెనీల లీటర్ పామారుుల్ ప్యాకెట్ కూడా రూ. 68 ఉంది. ప్రభుత్వం రేషన్ షాపుల్లో అందించే పామారుుల్ ధర ఎక్కువగా ఉండడంతో వాటిని తీసుకోవడానికి ప్రజలు ఆసక్తి చూపడం లేదు. రేషన్ డీలర్లు సైతం వీటిని తెప్పించడానికి విముఖత చూపుతున్నారు. అరుుతే పౌరసరఫరాల శాఖ అధికారుల ఖచ్చితమైన ఆదేశాల మేరకు తప్పనిసరిగా పామారుుల్ ప్యాకెట్లు తీసుకోవాల్సి వస్తోందని ఉమ్మడి నిజామాబాద్ జిల్లా రేషన్ డీలర్ల సంఘం గౌరవ అధ్యక్షుడు నాగం సురేందర్ తెలిపారు. ఇదిలా ఉండగా చౌకధరల దుకాణాలలో బలవంతంగా విక్రరుుస్తున్న సబ్బులు, పప్పులు, ఉప్పు, టీ పొడి, అగ్గిపెట్టెలు తదితర వస్తువులతోనూ వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. నాణ్యతలేని ఈ వస్తువులను బలవంతంగా తమ నెత్తిన రుద్దుతున్నారని ఆరోపిస్తున్నారు. ఈ విషయమై పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తహసీల్దార్ బాలలక్ష్మిని వివరణ కోరగా.. ప్రభుత్వ రంగ సంస్థ అరుున విజయ పామారుుల్‌ను మాత్రమే చౌక ధరల దుకాణాలలో విక్రరుుస్తున్నామని, రేషన్ దుకాణాలలో విక్రరుుస్తున్న ఇతర వస్తువుల నాణ్యతలో తేడాలు ఉంటే చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. రేషన్ దుకాణాలలో వినియోగదారులు తమకు ఇష్టమైన వస్తువులనే తీసుకోవచ్చని, ఇందులో బలవంతం ఏమీ లేదని స్పష్టం చేశారు. పప్పులు, నూనెలు అంటగడుతున్నారు.. రేషన్ దుకాణాలలో ఇష్టమైన సామాన్లనే తీసుకోవచ్చని సార్లు చెబుతున్నరు. కానీ కంట్రోల్ దుకాణాలలో బలవంతంగా నూనెలు, పప్పులు అంటగడుతున్నారు. లేకపోతే బియ్యం ఇయ్యం అంటున్నరు. రేషన్ దుకాణాలలో ఇస్తున్న సామాన్లు నాసిరకంవి ఉంటున్నై. మార్కెట్‌లోకంటే ఇక్కడే ఎక్కువ ధర ఉంది. - పోచయ్య, వినియోగదారుడు, ఎల్లారెడ్డి -
క్యూల్లోనే వారాంతం!
- మూడోరోజూ బారులు తీరిన ప్రజలు... పలుచోట్ల బ్యాంకు అధికారులతో వాగ్వాదం - మరో 8-10 రోజులు ఇదే పరిస్థితంటున్న బ్యాంకర్లు - గుజరాత్, కర్ణాటకల్లో లైన్లోనే కుప్పకూలిన ఇద్దరు వృద్ధులు న్యూఢిల్లీ: పాతనోట్లను మార్చుకునేందుకు వరుసగా మూడోరోజూ దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకుల ముందు ప్రజలు బారులు తీరారు. వారాంతం కావటం, బ్యాంకులు అదనపు గంటలు పనిచేస్తుండటంతో శనివారం రద్దీ కాస్త ఎక్కువగా కనిపించింది. దీంతో గంటల తరబడి ప్రజలు డిపాజిట్లు, విత్‌డ్రాల కోసం వేచిచూశారు. కేరళ, గుజరాత్‌లలో క్యూలైన్లో వేచి ఉన్నవారికి బ్యాంకు ఉద్యోగులకు మధ్య వాగ్వాదం ఘర్షణకు దారితీసింది. చాలా బ్యాంకుల వద్ద పోలీసులతో బందోబస్తు పెట్టుకోవాల్సి వచ్చింది. ఢిల్లీలో బ్యాంకులు, ఏటీఎంల వద్ద బందోబస్తు కోసం 3,400 మంది పారామిలటరీ బలగాలు, 200 క్విక్ రెస్పాన్స టీమ్స్‌ను రంగంలోకి దించారు. అటు మధ్యప్రదేశ్‌లో చిల్లరలేక నిత్యావసర వస్తువులు అందకపోవటంతో ఆగ్రహించిన ప్రజలు ఓ రేషన్ షాపును కొల్లగొట్టినట్లు తెలిసింది. ముంబైలో పలు బ్యాంకులు ముఖ్యమైన కూడళ్లలో మొబైల్ ఏటీఎంలు అందుబాటులో ఉంచారు. కాగా, బ్యాంకులకు వస్తున్న రద్దీని, నోట్లు మార్చుకునేందుకు ప్రజల్లో ఉన్న ఆతృతను చూస్తుంటే.. మరో 8-10 రోజుల పాటు ఇదే పరిస్థితి తప్పదని బ్యాంకర్లు అంటున్నారు. బ్యాంకుల వద్ద సరైన డబ్బుల్లేవని ప్రజలు అపోహపడుతున్నారన్నారు.కాగా, పింఛనుదారులు రూ. 10వేలకన్నా ఎక్కువ మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవచ్చని ఆర్బీఐ (భువనేశ్వర్) స్పష్టం చేసింది. ఏటీఎంలు ఖాళీ వారాంతం వేడి ఏటీఎం వద్ద కూడా కనిపించింది. చాలా ఏటీఎంలను అర్దరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు డబ్బులతో నింపారు. అరుుతే తెల్లారిన కాసేపటికే ఇవన్నీ ఖాళీ అరుుపోయారుు. అసలే డబ్బుల్లేక ఇబ్బందులు పడుతుంటే సాంకేతిక కారణాలతో ఏటీఎంలు పనిచేయకపోవటం జనాగ్రహానికి కారణమైంది. దేశవ్యాప్తంగా 2 లక్షల ఏటీఎంలుండగా.. అందులో సగానికి పైగా పనిచేయటం లేదని తెలిసింది. కాగా, గంటల తరబడి క్యూ లైన్లలో వేచి ఉండటం వల్లచాలా చోట్ల కొందరు లైన్లలోనే కుప్పకూలిపోయారు. శుక్రవారం మహారాష్ట్రలో ముగ్గురు, కేరళలో ఇద్దరు చనిపోగా.. శనివారం గుజరాత్లో బర్కాత్ షేక్ అనే వృద్ధుడు లైన్లోనే గుండెపోటుతో కుప్పకూలాడు. కర్ణాటకలోని ఉడిపి జిల్లాలో ఓ 93 ఏళ్ల వృద్ధుడు కూడా క్యూలోనే గుండెపోటుతో మృతిచెందాడు. ఆదివారం కూడా బ్యాంకులు తెరిచి ఉండటంతో రద్దీ మరింత ఎక్కువగా ఉంటుందని భావిస్తున్నారు. తిరగబడ్డ జనం బ్యాంకుల్లో పాతనోట్లు మార్చుకునేందుకు వస్తున్న వారి సంఖ్య పెరిగిపోవటంతో.. కేరళలోని కొల్లాం జిల్లాలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావన్‌కోర్ బ్రాంచ్ ఉద్యోగులు షెటర్లు మూసేసేందుకు ప్రయత్నిం చారు. దీంతో బ్యాంకు ఆవరణలో ఉన్న 200 మంది కోపంతో బ్యాంకు అద్దాలను పగులగొట్టారు. దీంతో బ్యాంకు ఉద్యోగులకు, ప్రజలకు వాగ్వాదం ముదిరింది. పోలీసులు జోక్యం చేసుకోవటంతో పరిస్థితి సద్దుమణిగింది. గుజరాత్‌లోనూ పలుచోట్ల బ్యాంకు అధికారులు, ప్రజలకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. బాణస్కంఠ, కచ్ జిల్లాల్లో అధికారులు నోట్ల మార్పిడికి తిరస్కరించటంతో ప్రజలు ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు లాఠీచార్జ్ చేయాల్సి వచ్చింది. మధ్యప్రదేశ్‌లో చిల్లర నోట్లు లేక ఎదురవుతున్న సమస్యలతో ప్రజల్లో ఆగ్రహజ్వాలలు పెరిగిపోయారుు. బర్దాహా అనే గ్రామంలో స్థానికులు పౌరసరఫరాల దుకాణాన్ని కొల్లగొట్టి తమకు కావాల్సిన వస్తువులు ఎత్తుకెళ్లినట్లు తెలిసింది. -
పదో తేదీ దాటినా పత్తాలేని బియ్యం
నిత్యావసర వస్తువుల సరఫరాలో జాప్యం బియ్యం కోసం నిరుపేదల ఎదురు చూపు వర్షాల కారణంగా ఆలస్యమైందన్న పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజరు లింగాలఘణపురం : ప్రభుత్వం చౌకధరల దుకాణాల నుంచి నిత్యావసర వస్తువుల సరఫరాలో జాప్యం జరుగుతోంది. ప్రతీ నెల 1వ తేదీ లోపు మండల లెవల్ స్టాక్ (ఎంఎల్ఎస్) పాయింట్ నుంచి గ్రామాల్లోని చౌకధరల డిపోలకు సరుకులు అందాల్సి ఉంటుంది. గత మూడు మాసాలుగా ఎంఎల్ఎస్ పాయింట్ నుంచి రావాల్సిన సరకులు సకాలంలో రావడం లేదు. దీంతో నిరుపేదలకు ప్రతీ నెల బియ్యం కోసం ఎదురు చూపులు తప్పడం లేదు. వచ్చిన బియ్యం డీలర్లు సకాలంలో పంపిణీ చేయడం లేదని ఇప్పటికే ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ఎంఎల్ఎస్ పాయింట్ నుంచి రావడం ఆలస్యం కావడంతో పేదలు మరిన్ని కష్టాలు ఎదుర్కొంటున్నారు. లింగాలఘణపురం మండలంలోని 17 గ్రామ పంచాయితీల పరిధిలో 26 చౌకధరల దుకాణాలు ఉండగా 1,962.30 కిలోల బియ్యం, 11,048 కిలోల చక్కెర సరఫరా చేయాల్సి ఉంటుంది. కాగా 10వ తేదీ వరకు కూడా సగం షాపులకు కూడా బియ్యం సరఫరా కాలేదు. 15 తేదీలోగా స్టాక్ వివరాలను తెలియజేస్తూ డీలర్లు డీడీలు తీయాల్సి ఉంటుంది. 10 తేదీ వరకు కూడా బియ్యం రాకపోవడంతో అయోమయ పరిస్థితిలో ఉన్నారు. చాలా మండలాల్లో ఇదే పరిస్థితి ఉంది. వర్షాల కారణంగా ఎంఎల్ఎస్ పాయింట్ల నుంచి బియ్యం సరఫరాలో ఆలస్యమైందని పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజరు విజయేందర్‌రెడ్డి చెప్పారు. జిల్లాలో 2115 చౌకధరల దుకాణాలు ఉండగా 384 షాపులకు సరుకులు చేరలేదని ఆయన చెప్పారు. -
ఈ-పాస్ అక్కడ ఫెయిల్
విజయనగరం కంటోన్మెంట్: జిల్లాలో రేషన్ షాపులతో పాటు అంగన్వాడీ కేంద్రాలకూ ఈపాస్ ద్వారా రేషన్ సరుకులు పంపిణీ చేయాలని ఆదేశాలిచ్చినా జిల్లాలో అమలు కావడం లేదు. చాలా చోట్ల సాధారణ పద్ధతుల్లోనే సరుకులను అందజేస్తున్నారు. దీనిపై జేసీ శ్రీకేశ్ బి లఠ్కర్ ఇచ్చిన ఆదేశాలు అమలు కావడంలేదు. జిల్లాలో 3,728 అంగన్వాడీ కేంద్రాలుండగా వాటికి గతంలో కాంట్రాక్టు పద్ధతిలో సరుకులు ఇచ్చేవారు. కాంట్రాక్టు పొందిన వారు బియ్యం తదితర సరుకులను ఇచ్చేవారు. ఏప్రిల్ నుంచి అంగన్వాడీలకు కూడా ఈ-పాస్ వర్తింపజేయాలనీ, కార్యకర్తల వేలిముద్రలు తీసుకుని సరుకులు ఇవ్వాలని సూచిం చారు. దీనివల్ల చాలా వరకూ అనధికార హాజరు తగ్గి, సరుకులు చాలావరకూ మిగులుతాయని భావించారు. రేషన్‌డీలర్ల ఇబ్బందులు దీనిపై పలువురు రేషన్ డీలర్లు ఇబ్బందులు పడుతున్నామని చెబుతున్నారు. తమకు సాధారణ రేషన్ సరుకులకే కమీషన్ ఇవ్వడం లేదనీ, అంగన్వాడీల బాధ్యతను అప్పగించినా దానికీ కమీషన్ లేదని చెబుతున్నారు. సాంకేతిక సమస్యలతో అంగన్వాడీ కేంద్రాలకు సరుకులు ఇవ్వలేకపోతున్నామని డీలర్లే స్వయంగా చెబుతున్నారు. ముఖ్యం గా జిల్లాలోని పంపిణీ చేయాల్సిన సరుకులన్నీ ఒకేసారి పంపించకుండా నచ్చినప్పుడు పంపించడంతో ఇబ్బందు లు పడుతున్నట్టు రేషన్ డీలర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు సముద్రపు రామారావు తెలిపారు. కమీషన్లు ఇవ్వకుండా ఇలా సాంకేతిక తప్పిదాలతో అదనపు బాధ్యతలు అప్పగిస్తున్నారన్నారు. ఇదే కొనసాగితే రాష్ట్ర నాయకులతో చర్చించి త్వరలోనే రేషన్ పంపిణీని నిలిపివేస్తామని తెలిపారు. దీనిపై ఐసీడీఎస్ పీడీ ఏఈ రాబర్ట్స్ మాట్లాడుతూ అతి తక్కువ కేంద్రాలకు మాత్రమే మాన్యువల్‌గా ఇస్తున్నామని, చాలావరకూ ఈ-పాస్ విధానంలోనే ఇస్తున్నామని తెలిపారు. -
డీలర్ మాయాజాలం
► కిరోసిన్ పంపిణీ చేసినట్లు ఈపాస్‌లో నమోదు ► 1323 లీటర్ల స్వాహాకు యత్నం హిందూపురం టౌన్ : రేషన్ షాపుల్లో జరుగుతున్న మోసా లను అరికట్టడానికి ప్రభుత్వం ఈపాస్విధానంతో రేషన్ సరుకులు పంపిణీ చేయడానికి శ్రీకారం చుట్టింది. అయితే ఈపాస్ విధానంలోనే మోసం చేయడానికి పూను కున్నాడో డీలర్. అధికారులు గమనించడంతో డీలర్ మోసం బయటపడింది. వివరాలు.. హిందూపురం పట్ట ణంలోని రహమత్‌పురం ఉన్న 9వ ఎఫ్పీ షాపు డీలర్ షఫీ రేషన్‌కార్డు దారులకు కిరోసిన్ పంపిణీలో చేతివాటం ప్రదర్శించాడు. లబ్ధిదారులకు కిరోసిన్ పంపిణీ చేయకుం డానే పంపీణీ చేసినట్లు ఈ పాస్‌లో నమోదు చేయించి ఏకంగా 1,323 లీటర్ల కిరోసిన్‌ను స్వాహా చేయడానికి సిద్ధమయ్యాడు. దీంతో పాటు 1,550 కిలోల మిగిలిన బియ్యం కూడా లేదని అధికారుల తనిఖీలో తేలింది. మోసం బయట పడింది ఇలా.. ప్రతి నెలా 1 నుంచి 5వ తేదీ లోపు కార్డు లబ్ధిదారులకు బియ్యం, పంచదార పంపిణీ చేసే సమయంలో ఆరోజే కిరోసిన్‌ను సైతం పంపిణీ చేసినట్లు లబ్ధిదారులతో ఈ పాస్‌లో నమోదు చేయించాడు. అయితే శనివారం సదరు షాపు వద్దకు కిరోసిన్ కోటా వేయడానికి అధికారులు ట్రక్కును తీసుకెళ్లారు. ఈపాస్‌లో బఫర్ స్టాక్‌ను పరి శీలించగా అప్పటికే కిరోసిన్ కోటాను పంపిణీ చేసినట్లు ఈపాస్‌లో నమోదైంది. దీంతో అధికారులు అవాక్క య్యారు. ఆరా తీస్తే కిరోసిన్‌ను లబ్ధిదారులకు అందజేయనప్పటికీ పంపిణీ చేసినట్లు ఈపాస్‌లో నమోదు చేసి మోసానికి పాల్పడ్డాడని గ్రహించారు. అక్కడికి చేరుకున్న తహశీల్దార్ విశ్వనాథ్, డిప్యూటీ తహశీల్దార్ మైనుద్దీన్, సీఎస్‌డీటీ రాజా పరిశీలించి డీలర్‌పై 6ఏ కేసు నమోదు చేశారు. ఆ షాపు నిర్వహణను మరో డీలర్‌కు అప్పగించినట్లు అధికారులు తెలిపారు. -
ఆగని బియ్యం స్మగ్లింగ్
సాక్షి టాస్క్‌ఫోర్స్ : తడ పోలీస్‌స్టేషన్‌కు కూతవేటు దూరంలోని తడకండ్రిగ పంచాయతీ మదీనా కుప్పం కేంద్రంగా బియ్యం స్మగ్లింగ్ జరుగుతోంది. పోలీసులు నెల మామూళ్లకు అలవాటుపడి ఏనాడూ అటువైపు తొంగి చూసిన దాఖలాల్లేవని స్థానికంగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పట్టపగలే తమిళనాడు నుంచి ఉప్పుడు బియ్యం మండలంలో మదీనాకుప్పం, పూడికుప్పానికి చేరుతున్నాయి. జిల్లా లో వివిధ రేషన్‌షాపుల్లో ఇచ్చే బియ్యం కూడా ఇక్కడికే చేరుతున్నాయి. మదీనా కుప్పంలో ఒకరిద్దరు మత్స్యకారులు ఈ వ్యాపారంలో ఆరితేరిపోయారు. ఇళ్లల్లోనే లోడ్లకు లోడ్లు బియ్యం స్టాక్ చేసి రాత్రి వేళల్లో లారీలకు ఎత్తి పోలీస్‌స్టేషన్ వెనుక వైపు రోడ్డు మీద నుంచి నేషనల్ హైవే ఎక్కి నెల్లూరుకు దర్జాగా తరలిస్తున్నారు. నెల్లూరులోని కొన్ని రైస్‌మిల్లర్లు ఈ బియ్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. ప్రతి రోజు రాత్రి వేళల్లోనే బియ్యం లోడ్‌చేసి లారీ రోడ్డు ఎక్కే వరకు అడుగడుగునా స్మగ్లర్లు నిఘా పెట్టి దాటించేస్తున్నారు. అయితే ఇదంతా పోలీసుల సహకారంతోనే జరుగుతుందనే ఆరోపణలున్నాయి. సూళ్లూరుపేట, తడ మండలం వాటంబేడుకు చెందిన కొంత మంది సిండికేట్‌గా ఏర్పడి ఈ అక్రమ వ్యాపారాన్ని నిర్వహిస్తున్నారు. తడలో లారీ బయలు దేరిందంటే తడ నుంచి నాయుడుపేట వరకు అన్ని స్టేషన్లకు మామూళ్లు కట్టుకుంటూ ఒక బ్యాచ్ వెళుతుంది. నాయుడుపేట తర్వాత ఎవరైనా లారీ ఆపితే రూ.10 వేల నుంచి రూ.20 వేలు ముట్టచెప్పి పోతున్నట్లు సమాచారం. బియ్యం అక్రమ వ్యాపారులు తడ, సూళ్లూరుపేట పోలీస్స్టేషన్లకు నెలకు రూ.3 లక్షల వరకు మామూళ్లు ముట్టజెప్పుతున్నారని ప్రచారం జరుగుతోంది. గతంలో ఈ వ్యాపారంలో రాజకీయ నాయకులు కూడా భాగస్తులుగా ఉండేవారంటే ఏ స్థాయిలో ఆదాయా లు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. అప్పట్లో ఈ వ్యాపారం చేస్తున్న వారు రెండు వర్గాలుగా విడిపోయి లారీలు పట్టించడంతో కొం తకాలం ఆపేశారు. గడిచిన రెండేళ్లుగా మళ్లీ వ్యాపారులు కొంత మంది సిండికేట్‌గా ఏర్పడి తడ కేంద్రంగా ఈ వ్యాపారాన్ని పునః ప్రారంభించారు. తాజాగా మళ్లీ వీరి మధ్య విభేదాలు వచ్చాయి. బియ్యం లారీలు వెళుతున్న విషయాన్ని విజిలెన్స్ అధికారులకు ఫోన్ చేసి సమాచారం అందించడంతో ఇటీవల వెంకటాచలం వద్ద ఒక లారీని పట్టుకున్నారు. వెంకటాచలంలోని ఓ రైసుమిల్లులో కూడా రేషన్ బియ్యాన్ని పట్టుకుని సీజ్ చేసిన విషయం తెలిసిందే. ఇది జరిగిన వెంటనే నాయుడుపేటలో కూడా పోలీసులు ఒక లారీ ని పట్టుకున్నారు. పోలీసుల సాక్షిగా జరుగుతున్న ఈ అక్రమ వ్యాపారాన్ని అరికట్టేందుకు విజిలెన్స్ అధికారులైనా రంగంలో దిగి పేదల నోటికాడ కూడు లాగేసుకుంటున్న ఈ అక్రమార్కులకు కళ్లెం వేయాల్సిన అవసరం ఉంది. -
హాస్టల్ విద్యార్థులతో ‘చంద్రన్న’ చెలగాటం
పేద బిడ్డల ప్రాణాలతో ప్రభుత్వం చెలగాటమాడుతోంది. చదివించుకోలేక సంక్షేమ హాస్టల్లో చేర్చితే ప్రజాప్రతినిధులు, అధికారులు ‘హాస్టల్లో ఉండేవాళ్లకు ఏమైతే నేం’ అడిగేదెవరన్నట్టు ప్రవర్తిస్తున్నారు. తమకు గుర్తుకొచ్చినప్పుడు హాస్టల్లో నిద్రించి, పేద విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించడమే లక్ష్యమంటూ ప్రకటనలు ఇస్తారు. ఫొటోలకు ఫోజులిస్తారు. నిజానికి ఆ పిల్లల పట్ల అధికారులకున్న ప్రేమ ఏపాటిదో ఇటీవల హాస్టళ్లకు అందించిన సరుకులే చెబుతున్నాయి. చంద్రన్న కానుకల పేరుతో రేషన్‌షాపులకు ఇటీవల పంపినవి కొంతమంది వినియోదారులు నాసిరకంగా ఉన్నాయని తీసుకోలేదు. దీంతో జిల్లావ్యాప్తంగా చాలా చోట్ల సరుకులు మిగిలిపోయాయి. సగానికి సగం పురుగులు పట్టాయి. వాటిని సంక్షేమ హాస్టళ్లకు తరలించి విద్యార్థులకు ఆహార పదార్థాలు తయారుచేసి వడ్డిస్తున్నారు. తిరుచానూరు: తిరుపతిలోని హాస్టళ్లలో చంద్రన్న సరుకులతో త యారు చేసిన ఆహార పదార్థాలను విద్యార్థులు తినలేక పోతున్నారు. తిరుపతిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ బాలురు, బాలికల సంక్షేమ గృహాలున్నాయి. వీటిలో 3నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులు సుమారు 800మంది ఉన్నారు. వీరికి రోజూ ఉదయం అల్పాహారం, రాత్రి భోజనం వడ్డిస్తా రు. ఇందుకోసం ప్రభుత్వం నిత్యావసర సరుకులను అంది స్తుంది. ఇటీవల కాలం చెల్లిన చంద్రన్న కానుక సరుకులను రాష్ట్ర ప్రభుత్వం వసతి గృహాలకు సరఫరా చేసింది.ఇందులోని గోధుమ పిండి, రంగుమారిన బెల్లం, పుచ్చిన కంది పప్పు, శెనగపప్పు ఉన్నాయి. వీటినే ఆహార పదార్థాలలో వినియోగిస్తున్నారు. జనవరి 2015లో తయారుచేసిన గోధుమ పిండి ప్యాకెట్లపైన రెండు నెలలలోపు వాడాలని ముద్రించి కూడా ఉన్నారు. గడువు తేదీ దాటి ఏడాదిపైనే గడిచిన గోధుమ పిండి ప్యాకెట్లను సరఫరా చేశారు. ఇవి పురుగులు పట్టి ఉన్నాయి. వీటినే జల్లించి పిల్లలకు చపాతీ, పూరీలు తయారు చేస్తున్నారు. పురుగులు పట్టిన కంది పప్పులతో సాంబారు తయారు చేస్తున్నారు. పేద విద్యార్థుల ఆరోగ్యంపై ప్రభుత్వ పెద్దలు శ్రద్ధచూపాలని, నాసిరకం, కాలం చెల్లిన ఆహారపదార్థాలను సరఫరా చేయడం మానుకోవాలని విద్యావేత్తలు, మేధావులు కోరుతున్నారు. నాశిరకం వస్తువులతో తయారు చేసిన పదార్థాలు తింటే పౌష్టికాహరం మాట అటుంచితే లేనిపోని రోగాలు వ స్తాయని వైద్యాధికారులు చెబతున్నారు. నాణ్యత కొరవడింది.. పీలేరు /వాల్మీకిపురం/ గుర్రంకొండ: నియోజకవర్గ పరిధిలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ హాస్టళ్లకు పంపిణీ చేసిన నాణ్యతలేని చంద్రన్న సరుకులతో ఆహార పదార్థాలు తయారు చేస్తున్నారు. ఈ పదార్థాలు తినలేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందు లు ఎదుర్కొంటున్నారు. నియోజకవర్గంలోని పీలేరు, కేవీ పల్లె, కలకడ, గుర్రంకొండ, కలికిరి, వాల్మీకిపురం మండలాల్లోని హాస్టళ్లకు కాలం చెల్లిన చంద్రన కానుకలను గుట్టు చప్పుడు కాకుండా సరఫరా చే శారు. సరఫరా చేసిన సరుకుల్లో నాణ్యత కొరవడింది. కా లం చెల్లిన గోధువు పిండి ప్యాకెట్‌పై వూర్కర్తో తేదీ వూ ర్పు చేసి ఉన్నారు. రంగువూరిన, నాణ్యత లేని కంది ప ప్పు, బుడ్డశెనగలు, బెల్లం సరఫరా చేశారు. కందిపప్పు సగానికిపైగా పుచ్చిపోరుు రంగువూరి మగ్గిపోయి ఉంది. గోధువు పిండిలో కూడా నాణ్యత కొరవడింది. ప్యాకింగ్ కవర్‌పై ఉన్న 2015 సంవత్సరంలోని 5ను వూర్కర్తో 6గా వూర్చిన విషయుం స్పష్టం గా కనిపిస్తోంది. ఈ లెక్కన ఏడాది క్రితం తయూరు చేసిన గోధువు పిండినే ప్రస్తుతం చంద్రన్న కానుకల్లో పంపిణీ చేసారనే విషయుం స్పష్టంగా అర్థవువుతోంది. గోధువు పిండిలో పురుగులు ఉన్నాయని విద్యార్థులు అంటున్నారు. రంగువూరిన బెల్లంతోనే పాయుసం చేసి పెడుతున్నారు. వీటితో తయారు చేసే ప దార్థాలు తిని విద్యార్థులు అనారోగ్యం పాలవుతున్నారు. ఉచితంగా ఇస్తున్నావుని ఇలాంటి సరుకులను హాస్టళ్లకు అంటగట్టడం ఎంతవరకు సమంజసమని విద్యార్థుల తలి ్లదండ్రులు ప్రశ్నిస్తున్నారు. ఈవిషయుమై హాస్టల్ వార్డన్లను వివరణ కోరగా, గోధువు పిండిని జల్లెడ పట్టి వాడుకుంటున్నావుని చెబుతున్నారు. రంగువూరిన, పనికిరాని బెల్లంను పారవేస్తున్నావుని పేర్కొంటున్నారు. పై అధికారుల ఆదేశాలను పాటిస్తున్నామని చెబుతున్నారు. అన్నీ నాసిరకమే.. వి.కోట : వుండలంలోని ఎస్సీ బాలురు, బీసీ బా లికల హాస్టళ్లకు చంద్రన్న కానుకల సరుకులను పంపిణీ చేశారు. బాలుర హాస్టల్‌కు పంపిణీ చేసిన గోధువుపిండిలో పురుగులు ఉండడంతో జల్లించి వాడుకుం టున్నారు. కందిపప్పులో పురుగులు ఉన్నాయి. బాలికల హాస్టల్‌కు పంపిణీ చేసిన వస్తువులు నాణ్యతగా ఉన్నట్లు సిబ్బంది తెలిపారు. చెడిన సరుకులు తినిపించేశారు.. పలమనేరు : పలమనేరు నియోజకవర్గంలో పది సాంఘిక సంక్షేమ హాస్టళ్లు ఉన్నాయి. సుమారు 1000 మందికి పైగా విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. పట్టణంలో మూడు, మండలాల్లో ఏడు సాంఘిక సంక్షేమశాఖ హాస్టళ్ళున్నాయి. చంద్రన్న సంక్రాంతి మిగిలిన సరుకులను హాస్టళ్లకు పంపిణీ చేశారు. సరుకులు నాసిరకంగా ఉన్నాయి. గోధుమపిండి, నెయ్యి మగ్గిన వాసన వస్తున్నట్లు విద్యార్థులు పేర్కొంటున్నారు. కందిపప్పు పుచ్చిపోయి ఉందని, బెల్లం బంకపట్టి ఉందని చెబుతున్నారు. వీటితోనే పాయసం, తీపి బోం డాలు, తదితరాలను వండి పెట్టినట్టు తెలిసింది. ప్రస్తుతం తం చంద్రన్న సరుకులు పూర్తిగా ఖాళీ అయినట్టు వార్డెన్లు చెబుతున్నారు. పురుగులు కనిపిస్తున్నా.. తిరుపతి రూరల్ : చంద్రగిరి నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో 16 హాస్ట ళ్లు ఉన్నాయి.1348 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇందులో1348 మంది విద్యార్థులు వసతి పొందుతున్నారు. హాస్టళ్లకు గత నెలలో చంద్రన్న కానుకలకు సంబంధించి గోధుమపిండి 1,860 కిలోలు, పచ్చి శెనగపప్పు 960 కిలోలు, కందిపప్పు 960 కిలోలు, బెల్లం 960 కిలోలు, నెయ్యి 18.6 కిలోలు, పామోలిన్ ఆయిల్ 1,860 లీటర్లను సరఫరా చేశారు. కందిపప్పు పుచ్చిపోయి ఉంది. పురుగులు పైకి కనిపిస్తున్నాయి. పచ్చిశెనగపప్పు సైతం పురుగులు పట్టి ఉంది. బెల్లం రంగుమారి ఉంది. కాలం చెందిన గోధుమ పిండిని సరఫరా చేశారు. వీటితో తయారు చేసిన పదార్థాలనే విద్యార్థులకు వడ్డిస్తున్నారు. కంపుకొడుతున్న బెల్లం శ్రీకాళహస్తి: చంద్రన్న కానుకలో కాలం చెల్లిన బెల్లం,గోధువుపిండి, పామారుుల్,కందిపప్పు, శెనగపప్పును నియోజకవర్గంలోని 14 హాస్టళ్లకు పంపిణీ చేశారు. సరుకుల్లో నాణ్యత లేకపోవడంతోపాటు దీర్ఘకాలంగా వస్తువులు నిల్వ ఉండడంతో బెల్లం, కందిపప్పు, పా మారుుల్ కంపుకొడుతున్నారుు. గోధువుపిండి, శెనగపప్పు పురుగులు పట్టి ఉన్నాయి. వాటితో తయారు చేసిన పదార్థాలనే వడ్డిస్తుండడంతో విద్యార్థులు అనారోగ్యం పాలవుతున్నారు. సంక్రాంతి సందర్భంగా పంపిణీ చేసిన సమయంలో నాశిరకంగా ఉన్నాయని ఫిర్యాదు వెల్లువెత్తినా, సరుకులు బాగా లేవని వార్డెన్లు చెబుతున్నా హాస్టళ్లకు సరఫరా చేయడం పేద విద్యార్థులపై ప్రభుత్వానికి ఎంత ప్రేమ ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. -
జల సంరక్షణ పనులు వేగవంతం చేయాలి
అటవీ శాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి చిత్తూరు(రూరల్): జిల్లాలో జల సంరక్షణ పనులను వేగవంతం చేసేలా నాయకులు కృషి చేయాలని అటవీ శాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి అన్నారు. చిత్తూ రు జిల్లా టీడీపీ కార్యాలయంలో శుక్రవారం జిల్లా సా ్థయి సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. రేషన్‌షాపు డీల ర్ల భర్తీని వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. ఇసుక తరలింపులో అవ కతవకలు చోటు చేసుకోకుండా చూ డాలన్నారు. జీడీనెల్లూరు నేత కుతూహలమ్మపై వెదురుకుప్పం మండల నాయకులు ఫిర్యాదు చేసినట్టు, అధిష్టానం దృష్టికి తీసుకెళ్తామని పేర్కొన్నట్టు తెలిసింది. ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు, జెడ్పీ చైర్ పర్సన్ గీర్వాణీ, ఎమ్మెల్యే సత్యప్రభ పాల్గొన్నారు. -
చక్కెర రాలే...
రేషన్ షాపులకు విడుదలకాని కోటా స్టాక్ లేకపోవడమే కారణం హసన్‌పర్తి : జిల్లా వ్యాప్తంగా రేషన్ షాపులకు చక్కెర నిలిచిపోరుుంది. సుమారు 15లక్షల మంది లబ్ధిదారులకు ఈ నెల చక్కెర అందలేదు. ప్రతి నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు అన్ని రేషన్‌షాపుల్లో లబ్ధిదారులకు బియ్యంతో పాటు చక్కెర, ఇతర సరుకులు పంపిణీ చేయాల్సి ఉంటుంది. ఈ నెలలో డీలర్లు లబ్దిదారులకు బియ్యం మాత్రమే ఇచ్చారు. చక్కెరతో పాటు ఇతర సరుకుల విషయమై ప్రశ్నించినప్పటికీ ఇంకా రాలేదని సమాధానం చెప్పారు. స్టాక్ లేకపోవడం వల్ల ఈ నెల (మార్చి)లో చక్కెర కోటా విడుదల చేయలేకపోయినట్లు పౌరసరఫరాల శాఖ అధికారులు పేర్కొంటున్నారు. డీలర్లు ప్రతీ నెల మాదిరిగానే ఈ నెల కూడా యధావిధిగా బియ్యంతో పాటు చక్కెరకు డీడీలు చెల్లించారు. ఇప్పటి వరకు చక్కెర చేరకపోవడంతో అబ్ధిదారులకు సమాధానం చెప్పలేకపోతున్నారు. జిల్లా వ్యాప్తంగా 2018 రేషన్‌షాపులు ఉండగా మార్చిలో ఎక్కడ కూడా చక్కెర విడుదల కాలేదు. ప్రతి షాపునకు ప్రతీ నెలా రెండున్నర క్వింటాళ్ల నుంచి మూడు క్వింటాళ్ల వరకు చక్కెర విడుదలవుతుంది. ఒక్కో రేషన్ షాపులో సుమారు ఐదువందల నుంచి ఆరువందల కార్డుల వరకు ఉన్నాయి. -
నిఘా నీడలో..!
♦ రేషన్ దుకాణాల్లో సీసీ కెమెరాలు ♦ మండలస్థాయి స్టాక్ పాయింట్లలోనూ.. ♦ స్టాకు తీరు, ఇతరత్రాలపై దృష్టి ♦ పోలీస్ కమిషనరేట్ నుంచి పర్యవేక్షణ ప్రజాపంపిణీ వ్యవస్థలో అక్రమాలనుఅరికట్టేందుకు జిల్లా యంత్రాంగం సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటోంది. ఇప్పటికే మండలస్థాయి స్టాక్ పాయింట్లకు సరుకులు చేర్చే వాహనాలకు జీపీఎస్ విధానాన్ని అందుబాటులోకి తెచ్చిన అధికారులు.. తాజాగా ఎంఎల్ఎస్ పాయింట్లు, రేషన్ దుకాణాల్లో సీసీ (క్లోజ్డ్ సర్క్యూట్) కెమెరాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీంతో ఆయా గోదాములు, దుకాణాల్లో స్టాకు తీరు, ఉద్యోగుల పరిస్థితిని కనిపెట్టేందుకు ఈ పరిజ్ఞానం ఉపయోగపడనుంది. - సాక్షి, రంగారెడ్డి జిల్లా సాక్షి, రంగారెడ్డి జిల్లా : జిల్లాలో 1,850 వరకు చౌకధరల దుకాణాలున్నాయి. ఇందులో సైబరాబాద్ పరిధిలో వెయ్యి వరకు ఉన్నట్లు అంచనా. ఈ క్రమంలో లబ్ధిదారులు ఎక్కువ సంఖ్యలో ఉన్న సైబరాబాద్ పరిధిలోని దుకాణాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేందుకు యంత్రాంగం కసరత్తు చేస్తోంది. అదేవిధంగా ఈ పరిధిలో ఉన్న 12 మండల స్థాయి స్టాక్ (ఎంఎల్ఎస్)పాయింట్లలోనూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేయనుంది. ఇందుకు సంబంధించి ఖర్చునంతా సైబరాబాద్ పోలీసు యంత్రాంగం భరించనుంది. అదేవిధంగా స్టేజీ 1 కాంట్రాక్టర్లు వినియోగించే వాహనాలకు జీపీఎస్‌ను అనుసంధానం చేసినప్పటికీ.. వీటిని ఇతర అవసరాలకు వినియోగించుకోవద్దని పౌరసరఫరాల శాఖ అధికారులు కాంట్రాక్టర్లకు ఆదేశాలిచ్చారు. ఇతర అవసరాలకు వినియోగిస్తున్నట్లు సమాచారమందితే కాంట్రాక్టు రద్దు చేసేందుకు సైతం వెనకాడబోమని అధికారులు చెబుతున్నారు. రెండువైపులా నిఘా.. రేషన్ దుకాణాల్లో, మండలస్థాయి స్టాక్ పాయింట్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్న అధికారులు వాటి పర్యవేక్షనపైనా ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నారు. సీసీ కెమెరాల సమాచారమంతా సైబరాాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో ప్రత్యేకంగా ఒక ఇన్స్పెక్టర్ పర్యవేక్షిస్తారు. తేడా వచ్చినట్లు భావిస్తే వెంటనే పోలీసు బృందంతో దాడికి ఉపక్రమిస్తారు. అదేవిధంగా పౌరసరఫరాల శాఖ కార్యాలయంలోనూ విజువల్స్‌ను పర్యవేక్షించేందుకు ప్రత్యేక అధికారికి బాధ్యతలు అప్పగించారు. రేషన్ తీసుకున్నారా.. రసీదు పొందండి ఇకపై రేషన్ సరుకులు తీసుకునే ప్రతి లబ్ధిదారుడు డీలరు నుంచి తప్పనిసరిగా రసీదు పొందాల్సిందే. ఈ మేరకు జిల్లా యంత్రాంగం చర్యలు చేపడుతోంది. ప్రతి డీలరు తప్పకుండా ఈపీఓఎస్ యంత్రాల్ని కొనుగోలు చేయాల్సిందిగా జేసీ ఆమ్రపాలి స్పష్టం చేశారు. వాటిని వినియోగించి రేషన్ సరుకులు ఇవ్వాల్సిందిగా మంగళవారం కలెక్టరేట్లో జరిగిన పౌరసరఫరాల శాఖ సమావేశంలో ఆమె వెల్లడించారు. -
సంకు‘రాత్రి జాగారాలు’
♦ 4.18 లక్షలమందికి అందని ‘చంద్రన్న కానుక’ ♦ సాంకేతిక లోపాలతో పంపిణీలో విపరీత జాప్యం ♦ రేషన్‌డిపోల ముందు కార్డుదారుల బారులు ♦ సరుకుల కోసం అర్ధరాత్రి వరకూ పడిగాపులు సాక్షి ప్రతినిధి, కాకినాడ : ఆడామగా, పిన్నాపెద్దా పడిగాపులు పడుతూ ఉన్న పై ఫొటో అంబాజీపేటలోని ఓ రేషన్‌షాపు వద్ద తీసింది. అప్పుడు సమయం ఎంతో తెలుసా.. ఆదివారం రాత్రి 11 గంటలు! పాపం.. వారి నిరీక్షణ ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించి, ఊరించిన చంద్రన్న సంక్రాంతి కానుక కోసం! ఆ చౌక దుకాణం వద్ద ఆదివారం ఉదయం ఆరు గంటల నుంచీ అదే పరిస్థితి. అలాగని పంపిణీలో డీలరు నిర్లక్ష్యం వహించాడని కాదు.. అలా పూటలుపూటలు.. కళ్లు కాయలు కాసేలా ఎదురు చూసినా ‘కానుక’ చేతికి అందకపోవడానికి కారణం.. ఈ-పాస్ యంత్రం సరిగా పనిచేయకపోవడమే. ఒక్క అంబాజీపేటలోనే కాదు.. జిల్లా అంతటా చంద్రన్న సంక్రాంతి కానుల పంపిణీలో ఇదే పరిస్థితి. అమలాపురంలో గత మూడురోజులుగా పంపిణీ అర్ధరాత్రి వరకూ కొనసాగుతోంది. చాలా గ్రామాల్లో గత మూడు రోజులుగా సర్వర్ పనిచేయకపోవటంతో కానుక సరుకులు అందలేదు. రోజూ కార్డుదారులు చౌకడిపోల వద్ద ఉదయం నుంచి రాత్రి వరకూ నిరీక్షించి చివరకు నిరాశతో తిరుగుముఖం పడుతున్నారు. ఎముకలు కొరికే చలిలో ఎదురుతెన్నులు.. చంద్రన్న సంక్రాంతి కానుక పేరుతో చౌక డిపోల్లో ఆరు రకాల సరకుల పంపిణీని ప్రభుత్వం ప్రారంభించింది. అయితే ఈ ప్రక్రియ ఈ-పాస్ యంత్రాల పుణ్యాన తాబేలు నడక కన్నా మందకొడిగా మారింది. దీంతో వృద్ధులు కూడా ఎముకలు కొరికే చలిలో వేచి ఉండాల్సి వస్తోంది. సోమవారం నుంచి రెండో సర్వరును అందుబాటులోకి తేవడంతో పంపిణీ కాస్త మెరుగుపడింది. మంగళవారం సాయంత్రానికల్లా జిల్లాలోని తెల్లరంగు కార్డుదారులందరికీ చంద్రన్న కానుక అందజేస్తామని అధికారులు చెబుతున్నా కనీసం బుధవారం నాటికైనా పూర్తవుతుందా అన్న సందే హం వ్యక్తమవుతోంది. జిల్లాలో పాత కార్డులు, ఇటీవల మంజూరు చేసినవి కలిపి మొత్తం 16.43 లక్షల తెల్ల రేషనుకార్డులు ఉన్నాయి. ఇప్పటికే వాటిలో 4.15 లక్షల మంది కార్డుదారులకు క్రిస్మస్కు చంద్రన్న కానుక పేరుతో సరుకులు పంపిణీ చేశారు. ఇక మిగిలిన 12.28 లక్షల కార్డుదారులకు ఈనెల 7 నుంచి సంక్రాంతి కానుక పంపిణీ ప్రారంభించారు. అయితే కలెక్టరేట్లో ఉన్న సర్వరు కాలిపోవడంతో పంపిణీ ప్రక్రియ నిలిచిపోయింది. తర్వాత పునరుద్ధరించినా నెట్‌వర్క్‌లో సాంకేతిక సమస్యలు ఏర్పడటంతో లబ్ధిదారుల వేలిముద్రలు ఇ-పాస్ యంత్రంలో సరిగా నమోదవడం లేదు. దీంతో ఒక్కో చౌక దుకాణం వద్ద రోజుకు 50 కార్డులకు మించి పంపిణీ జరగలేదు. సోమవారం రెండో సర్వరును అందుబాటులోకి తేవడంతో ప్రక్రియ కాస్త మెరుగుపడింది. సోమవారం సాయంత్రానికి క్రిస్మస్, సంక్రాంతి కానుకలు కలిపి మొత్తం 12.25 లక్షల కార్డులకు పంపిణీ పూర్తయిందని పౌరసరఫరాల అధికారులు చెబుతున్నారు. ఈ ప్రక్రియపై కలెక్టరు అరుణ్‌కుమార్ సోమవారం సాయంత్రం అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో సమీక్షించారు. మంగళవారం సాయంత్రం నాటికి కానుకల పంపిణీ ప్రక్రియ పూర్తి చేస్తామని అధికారులు చెబుతున్నారు. భోగి నాటికైనా అందేనా? సంక్రాంతి కానుక సరుకులు ఇంకా దాదాపు 4.18 లక్షల తెల్లకార్డుదారులకు పంపిణీ చేయాల్సి ఉంది. కనీసం భోగి నాటికైనా చేతికందుతాయో లేదోనని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారిలో ఎక్కువ మంది దినసరి కూలీలే. రోజుల తరబడి చౌక దుకాణాల వద్ద వరుసలో ఉండటం వల్ల అటు కూలి కోల్పోతున్నామని, ఇటు సరుకులు చేతికి అందట్లేదని లబోదిబోమంటున్నారు. ఇక వృద్ధులైతే నీరసించి, డిపోల ముందే కుప్పకూలిపోతున్నారు. కొందరు కార్డుదారులైతే పిల్లలను సైతం క్యూల్లో నిలబెడుతున్నారు. కొత్తకార్డుదారులకు కానుకే దిక్కు... జన్మభూమి-మా ఊరు కార్యక్రమంలో ప్రభుత్వం ఘనంగా పంపిణీ చేసింది ఏవైనా ఉన్నాయంటే కొత్త రేషన్‌కార్డులు ఒక్కటే. అయితే అవి చేతికొచ్చాయనే సంతోషం లబ్ధిదారులకు ఉండడం లేదు. వారికి జనవరి నెల రేషన్ సరుకులు ఉండవు. కేవలం చంద్రన్న కానుకతో సరిపెట్టుకోవాల్సిందే. అయితే రెండు నెలల క్రితమే రేషనుకార్డు అర్హుల జాబితా ఖరారు చేసిన అధికారులు ఆమేరకు సరుకులను ఎందుకు సిద్ధం చేయలేకపోయారని వారు ప్రశ్నిస్తున్నారు. ఫిబ్రవరి నుంచి ప్రతినెలా రేషను సరుకులు ఇస్తామని అధికారులు సరిపెడుతున్నారు. నేటి సాయంత్రానికి పూర్తి... క్రిస్మస్తో కలుపుకొని చంద్రన్న కానుకగా సరుకులు జిల్లావ్యాప్తంగా సోమవారం సాయంత్రానికి మొత్తం 12.25 లక్షల కార్డుదారులకు అందజేశాం. ఇంకా దాదాపు నాలుగు లక్షల కార్డులకు సరుకులు అందజేయాల్సి ఉంది. ఇప్పటివరకు ఒకే సర్వరు ఉండటం, అదీ సరిగా పనిచేయకపోవడం వల్ల పంపిణీ జాప్యమైంది. సోమవారం నుంచి రెండు సర్వర్లు అందుబాటులోకి తెచ్చాం. మంగళవారం సాయంత్రంలోగా పంపిణీ పూర్తి చేస్తాం. - జి.ఉమామహేశ్వరరావు, జిల్లా పౌరసరఫరాల అధికారి -
చంద్రన్న...ఇవేమి కానుకలన్నా..
కల్తీ గోధుమ పిండి-సుద్ద బెల్లం కందిపప్పులో బఠాణీలు కార్డుదారుల ఆగ్రహం పెనమలూరు సుద్ద బెల్లం..తవుడు కలిసిన గోధుమ పిండి..కందిపప్పులో బఠాణీలు ఇవీ సంక్రాంతి సందర్భంగా ప్రభుత్వం పంపిణీ చేస్తున్న సరుకులు. సరుకులు నాసిరకంగా ఉండడంతో పేదలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ప్రభుత్వం తెల్లరేషన్‌కార్డుదారులకు ఆరు రకాల సరుకులు పంపిణీ చేయాలని నిర్ణయించింది. మండలంలో మొత్తం 30వేల తెల్ల రేషన్‌కార్డులు ఉన్నాయి. క్రిస్మస్ సందర్భంగా సుమారు ఐదుల కార్డుదారులకు క్రిస్మస్ కానుక అందజేశారు. ప్రస్తుతం వాటిని మినహాయించి మిగిలిన 25 వేల కార్డుదారులకు సరుకులు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేశారు. మండలంలోని 53 రేషన్ షాపుల ద్వారా సరుకులు పంపిణీ చేయనున్నారు. ప్రతీ తెల్లరేషన్ కార్డుదారుకు ఆరు రకాల సరుకులు ఇవ్వాలని నిర్ణయించారు. ఇందులో బెల్లం, కందిపప్పు, శెనగపప్పు అరకిలో చొప్పున, నెయ్యి వంద గ్రాములు, గోధుమ పిండి కిలో, అరలీటరు పామాయిల్ ఉన్నాయి. ఈ సరుకులను గురువారం నుంచి రేషన్ షాపుల్లో పంపిణీ చేశారు. సరుకులు తీసుకున్న లబ్ధిదారులు వాటిని చూసి తెల్లమొఖం వేశారు. బెల్లం నల్లగా, సుద్దగా ఉంది. ఇక కందిపప్పులో బఠాణీ గింజలు కలసి నాసిరకంగా ఉంది. గోధుమ పిండి జల్లడపడితే తవుడు బయట పడింది. ఇక మిగితా సరుకులు అంతంతమాత్రంగా ఉన్నాయి. కార్డుదారులు పెదవి విరుస్తున్నారు. పేదలంటే అలుసా..? చంద్రన్న కానుక కింద ఇచ్చిన సరుకులు కల్తీ, నాసిరకంగా ఉన్నాయని, వీటిని చంద్రబాబు తిని చూపితే తాము తింటామని పేదలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పేదల సొమ్ముతో అవినీతికి పాల్పడి ఇటువంటి సరుకులు పండుగకు ఇవ్వటం న్యాయమా అని ప్రశ్నిస్తున్నారు. ఈ సరుకులు తీసుకుని పండుగకు ఏ వంటకాలు చేసుకోవాలని వాపోతున్నారు. రేష్షాపుల్లో నాణ్యమైన సరుకులు ఇస్తారని ఎంతగానో ఆశపడ్డామని తీరా సరుకులు తీసుకెళ్లిన తర్వాత నిరాశేమిగిలిందని తెలిపారు. కొత్త కార్డులకు అందేనా? జన్మభూమి సభల్లో పంపిణీ చేస్తున్న తెల్లరేషన్‌కార్డులకు చంద్రన్న కానుక సరుకులు అందుతాయో లేదో తెలియన లబ్ధిదారులు అయోమయంలో ఉన్నాయి. మండలంలో కొత్తగా సుమారు 2,500 కార్డులు పంపిణీ చేశారు. వీరికి కూడా సరుకులు అందిస్తామని ప్రభుత్వం ప్రకటన చేయడంతో వారిలో ఆశలు చిగురించాయి. అయితే గురువారం నుంచి పంపిణీ ప్రారంభించిన డీలర్లు కొత్తకార్డులకు సరుకులు ఇవ్వడం లేదు. రెండురోజుల తర్వాత ఇస్తారని భావిస్తున్నారు. ఇదేమి బెల్లం రేషన్ షాపుల్లో చంద్రన్న కానుక కింద ఇచ్చిన బెల్లం దారుణంగా ఉంది. ఈ బెల్లం తింటే జబ్బులు వచ్చి మంచాన పడతాము. బెల్లం నల్లగా ఉండి కారిపోతుంది. పండుగకు నాణ్యమైన సరుకులు ఇవ్వాలి. కె.పంచాద్రీయరావు, యనమలకుదురు కందిపప్పులో బఠాణీలు కందిపప్పులో బఠాణీ గింజలు కలిపారు. పైగా పప్పు మందంగా ఉంది. దీనిని వండుకోవటం వలన ఉపయోగంలేదు. పండుగకు నాసిరకం సరుకులు ఇవ్వటం తగదు. నాణ్యమైన సరుకులు పంపిణీ చేయాలి. ఎం.నిర్మల, యనమలకుదురు గోధుమ పిండి పనికిరాదు గోధుమ పిండిలో తవుడు కలిపారు. ఈ పిండి తో ఏమి చేయాలో తెలియటంలేదు. ఈ పిండితో చేసిన వంటకాలు తింటే ఇబ్బందే. పండుగకు నాసిరకం సరుకులు ఇవ్వటం తగదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మంచి సరుకులు ఇవ్వాలి. చల్లా జయలక్ష్మి, యనమలకుదురు -
రేషన్ షాపుపై విజిలెన్స్ దాడులు
ముదిగొండ : ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం ఎడవల్లి గ్రామంలోని రేషన్ దుకాణంపై పౌరసరఫరాల శాఖ, విజిలెన్స్ అధికారులు మంగళవారం దాడులు నిర్వహించారు. రేషన్ షాపు నంబర్ 5 లో అక్రమంగా పెద్ద మొత్తంలో సరుకులు నిల్వ ఉన్నట్టు గుర్తించారు. 20 క్వింటాళ్ల రేషన్ బియ్యం, రెండు క్వింటాళ్ల కందిపప్పు, 1.5 క్వింటాళ్ల పంచదారను సీజ్ చేశారు. నిర్వాహకుడు వెంకయ్యపై నిత్యావసరాల చట్టంలోని సెక్షన్ 6ఏ కింద కేసు నమోదు చేశారు. -
పేదింట పప్పన్నం లేనట్టే
రేషన్డిపోలలో నిలిచిన కందిపప్పు సరఫరా మంత్రి ఆదేశించినాపట్టని అధికారులు టెండర్లు ఖరారుకాలేదంటూ కుంటిసాకు బహిరంగ మార్కెట్లో కొండెక్కిన ధరలు విశాఖపట్నం అసలే పండుగ రోజులు. చుక్కలనంటిన ధరలతో పిండివంటలకు ఎలాగూ దిక్కులేదు. కనీసం పప్పన్నం తినే భాగ్యానికి కూడా నిరుపేదలు నోచుకోలేకపోతున్నారు. రేషన్‌షాపులో ఈనెల కూడా కందిపప్పు సరఫరా జరిగే అవకాశాలు కన్పించడం లేదు. జిల్లాలో బీపీఎల్ పరిధిలో 11.22లక్షల రేషన్‌కార్డులున్నాయి. కందిపప్పు కిలో రూ.50ల చొప్పున పంపిణీ చేసేవారు. మిగిలిన సరుకులు విషయం ఎలా ఉన్నా కందిపప్పు వరకు చూస్తే కార్డుకు కిలో చొప్పున మన జిల్లాలోని రేషన్కార్డుహోల్డర్లకు పూర్తిస్థాయిలో సరఫరా చేయాలంటే 1122 మెట్రిక్ టన్నుల అవసరం. జూన్ వరకు అరకొరగా పంపిణీ చేసిన కందిపప్పును జూలై నుంచి పూర్తిగా నిలిపి వేశారు. కారణం జూలైలో 280ఎంటీలు మాత్రమే కేటాయిం చారు. ఇవి మూడోవంతు కార్డుదారులకు కూడా సరిపోయే పరిస్థితి లేదు. దీంతో వీటి పంపిణీని నిలిపివేశారు. ఇటీవల రాష్ర ్టపౌర సరఫరాల శాఖమంత్రి పరిటాల సునీత జిల్లాకు కేటాయించిన కంది పప్పు ఎందుకు పంపిణీచేయడం లేదంటూ మండిపడ్డారు. బహిరంగ మార్కెట్లో కందిపప్పు సామాన్యులు కొనలేని స్థితికి చేరుకోవడంతో కనీసం అరకిలో చొప్పునైనా పంపిణీ చేయొచ్చు కదా అని ప్రశ్నించారు. అరకిలో చొప్పున పంపిణీ చేయాలన్నా కనీసం 560 మెట్రిక్ టన్నుల వరకు కావాలి. అందు బాటులో కేవలం 280 ఎంటీలు మాత్రమే ఉండడంతో ఏ మూలకు సరిపోదన్న భావనతో పంపిణీ చేయలేదంటూ సివిల్‌సప్లయిస్ కార్పొరేషన్ అధికారులు బదులిచ్చారు. ఇప్పటికే సబ్సిడీపై కందిపప్పు ఇచ్చేందుకు రూ.50కోట్లు ఖర్చు చేస్తున్నామని, జిల్లాఅవసరాలకు తగ్గట్టుగా కందిపప్పుకేటాయిస్తామని మంత్రిచెప్పుకొచ్చారు. ఇటీవలే మరో 170 మెట్రిక్ టన్నులు కేటాయించారు.ప్రస్తుతం నిల్వ ఉన్న 280 ఎంటీలతో కలుపుకొని జిల్లాలో 450 ఎంటీలు మాత్రమే అందు బాటులో ఉన్నాయి. కనీసం అరకిలో చొప్పున పంపిణీ చేసేందుకు కూడా నిల్వలు సరిపోని పరిస్థితి. మరొక పక్క ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో కిలో కందిపప్పు రూ.170కు చేరింది. దీంతో రాష్ర్టస్థాయిలో టెండర్లు పిలిచినప్పటికీ ఎవరూ ముందుకు రావడంలేదని,అందువలనే జిల్లాకు కేటాయింపులు జరపడం లేదని అధికారులు చెబుతున్నారు. జిల్లాస్థాయిలో ధరల నియంత్రణ కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక నిధి నుంచి కందిపప్పు కొనుగోలు ఖర్చుచేసి జిల్లాలోని కార్డుదారులకు పంపిణీ చేయాల్సి ఉంది.ఈ నెలలో కూడా పంపిణీ చేయకపోతే మరో వారం రోజుల్లో రానున్న వినాయకచవతి పండుగకు సామాన్యుల ఇంట పప్పన్నం కరువైనట్టే. జిల్లా అధికారులు ఇప్పటికైనా కందిపప్పు పంపిణీ విషయంలో సత్వరమే నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. -
రేషన్ దుకాణం సీజ్
ఎర్రగుంట్ల: దుకాణంలో సరుకులు ఉన్నా ఇవ్వకపోవడంతో తహశీల్దార్ మహేశ్వర్‌రెడ్డి ఆ దుకాణాన్ని తనిఖీ చేసి సీజ్ చేశారు. ఈ సంఘటన గురువారం వైఎస్సార్ జిల్లా ఎర్రగుంట్ల మున్సిపాలిటీలో జరిగింది. వివరాలు.. మున్సిపాలిటీలోని ఆరో నంబర్ రేషన్ దుకాణంలో నిత్యం సరుకుల కొరత ఉందని, ప్రజలకు అరకొరగా సరుకులు ఇస్తున్నారు. అంతేకాకుండా బియ్యం తూకాల్లో తేడా రావడం, కిరోసిన్ ఉన్నా లేదని చెబుతుండటంతో ప్రజలు తహశీల్దార్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో తహశీల్దార్ దుకాణాన్ని తనిఖీ చేసి జరుగుతున్న అక్రమాలను గుర్తించి సీజ్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పల్లెల్లోనూ ఈ- పాస్
ఆగస్టు 1నుంచి అమలుకు ఏర్పాట్లు 500 డిపోలకు బయోమెట్రిక్ మెషిన్లు మండలాలకు చేరిన పరికరాలు డీలర్లకు పూర్తయిన శిక్షణ అక్రమాల నిరోధమే లక్ష్యం నరసన్నపేట :సాంకేతిక పరిజ్ఞానంతో క్షేత్ర స్థాయిలో రేషన్సరకుల పంపిణీలో అక్రమాలను నివారించేందుకు జిల్లా పౌర సరఫరాల విభాగం సన్నద్ధమైంది. ఆగస్టు ఒకటి నుంచి జిల్లాలో రెండో విడతగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న 500 రేషన్‌డిపోల్లో ఎలక్ట్రానిక్ పాయింట్ ఆఫ్ సేల్స్(ఈ-పాస్) అమలుచేయనున్నారు. ఇందుకు అవసరమైన కసరత్తు ఇప్పటికే పూర్తయింది. నియోజకవర్గ స్థాయిలో డీలర్లకు ఈ -పాస్ యంత్రాల వినియోగంపై శిక్షణ కూడా పూర్తి చేశారు. ఇందులో భాగంగా నరసన్నపేటలో 21న నాలుగు మండలాలకు చెందిన డీలర్లకు శిక్షణ నిచ్చారు. ఈ-పాస్ అమలైతే రేషన్‌డిపోల్లో అక్రమాలను అరికట్టవచ్చని అధికారులు భావిస్తున్నారు. మొదటి విడతగా మండల కేంద్రాలు, మున్సిపాల్టీల్లోని 282 రేషన్‌డిపోల్లో అమలు చేశారు. ఒక్క నరసన్నపేట మండలంలోనే నెలకు 50 క్వింటాళ్ల వరకూ బియ్యం ఆదా కన్పించింది. 500 కార్డు దారులు సరుకులు విడిపించలేదు. దీనివల్ల ప్రభుత్వానికి మంచి ఆదాయం వచ్చింది. ఇక పల్లెల్లోనూ వీటిని ఉపయోగించడం ద్వారా మరిన్ని ఫలితాలు సాధించవచ్చని, ప్రభుత్వానికి అధికంగా మిగులు చూపించవచ్చని అధికారులు భావించి ఆగస్టు నుంచి అమలుకు ఏర్పాట్లు చేశారు. జిల్లాలో ఉన్న అన్ని రేషన్ షాపుల్లో మరో రెండు నెలల్లో ఈ-పాస్ అమలు కానుంది. జిల్లాలో మొత్తం 2020 రేషన్‌షాపులున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఈ-పాస్ అమలైతే 20 శాతం వరకూ సరకులు మిగిలే అవకాశం ఉంది. ఆమదాలవలసలో 15, సరుబుజ్జిలి మండలంలో 13, బూర్జలో 11, పొందూరులో 13 డిపోల్లో ఈ-పాస్ అమలు కానుంది. అలాగే ఎచ్చెర్ల, కంచిలి, పోలాకి, సోంపేట, జలుమూరు, పాలకొండ, మందస, మెళియాపుట్టి, పాతపట్నం, హిరమండలం, ఎల్‌ఎన్‌పేట, రేగిడి ఆమదాలవలస, సంతకవిటి, గార, కోటబొమ్మాళి, నందిగాం, సంతకవిటిమండలాల్లో 13 డిపోల చొప్పున్న ఈ-పాస్ అమలు చేయనున్నారు. అలాగే లావేరు, రణస్థలం, నరసన్నపేట, కొత్తూరు, రాజాం మండలాల్లో 15 డిపోలు చొప్పున అమలు చేస్తారు. జి.సిగడాంలో 11, ఇచ్ఛాపురంలో 14, కవిటిలో 12, భామినిలో11, సీతంపేటలో 8, పలాసలో10, వీరఘట్టంలో 11, వంగరలో 12, శ్రీకాకుళం రూరల్ మండలంలో 20, టెక్కలిలో 17 డిపోల్లో ఈ-పాస్ అమలు చేస్తారు. డీలర్లలో ఆందోళన జిల్లా సివిల్ సపై్ల అధికారులు ఈ-పాస్ అమలుకు ఒక వైపు చర్యలు తీసుకుంటుంటే మరో వైపు రేషన్ డీలర్లు ఆందోళన చెందుతున్నారు. ఈ పాస్‌తో చిన్న తప్పు చేయలేమనీ, కచ్చినమైన తూకం అమలు చేయాలని దీనివల్ల తాము తీవ్రంగా నష్టపోవాల్సి ఉంటుందని భయపడుతున్నారు. అన్ని స్థాయిల్లో అధికారులకు నెలవారీ మామూళ్లు చెల్లించుకుని నిజాయితీగా సరకులు అందిస్తే తాము చేతులు కాల్చుకోవాల్సిందేనని వ్యాఖ్యానిస్తున్నారు. అలాగే ఎంఎల్ఎస్ పాయింట్ల నుంచి బియ్యం, పంచదార, పప్పు ఇతర సరుకులు ఇస్తున్నప్పుడు తూకంవేసి అప్పగించడంలేదనీ, ప్రతీ బస్తాకు కనీసం రెండు నుంచి 4 కేజీలు తరుగు ఉంటోందని చెబుతున్నారు. ఈ నష్టాన్ని ఎవరు భరిస్తారని ప్రశ్నిస్తున్నారు. కమీషన్ పెంచకుండా... నిర్బంధంగా ఈపాస్ అమలు చేస్తే డీలర్షిప్ కొనసాగించలేమని స్పష్టం చేస్తున్నారు. ఎంఎల్ఎస్ పాయింట్లో తూకంవేసి సరకులు అప్పగించాలి ఈ-పాస్ అమలు మంచిదే. అయితే మమ్మల్ని ఇబ్బంది పెట్టి, నష్టాలకు గురి చేసి ఈ పద్ధతి అమలు చేయడం సరికాదు. ఈ-పాస్ అమలు చేస్తున్న డిపోలకు కచ్చితంగా సరకులు సరైన తూకంతో అప్పగించాలి. అలాగైతే పూర్తిగా సహకరిస్తాం. డీలర్లకు ఇచ్చే కమీషన్ పెంచాలి. ఇతర ఖర్చులుతగ్గించాలి.పాసిన ఆదెయ్య. డీలరు, గంగివలస -
‘రేషన్’కూ ఆన్లైన్
చండూరు: డీలర్లు రేషన్ సరుకుల కోసం తహసీల్దార్ కార్యాలయం చుట్టూ, అధికారుల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు. ఇక ఆన్లైన్(మీసేవ)లో నగదు చెల్లిస్తే ఆలస్యం చేయకుండా వెంటనే సరుకులు సరఫరా చేస్తారు. ఈ మేరకు ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ఆగస్టు నెలకు సంబంధించిన సరుకులకు బుధవారం నుంచి మీ సేవలోనే డీలర్లు నగదు చెల్లించే విధంగా డీఎస్ఓ కార్యాలయం నుంచి సంబంధిత అధికారులకు మంగళవారం సాయంత్రం ఉత్తర్వులు వెలువడ్డాయి. గతంలో డీలర్లు బ్యాంకులలో నగదు చెల్లించి డీడీలు తీసుకుని ఆ డీడీలను తహసీల్దార్ కార్యాలయంలో అందజేస్తే అప్పుడు గానీ సెక్షన్లో ఆర్ఓ(రిలీజ్ ఆర్డర్) రాసి ఐఎంజీ గోదాంకు పంపిస్తే ఆ గోదాం ఇన్చార్జి రేషన్ షాపులకు సరుకులు పంపిణీ చేసే వారు.ఈ ప్రక్రియతో వినియోగదారులకు సరైన సమయంలో రేషన్ అందించ లేక పోతున్నామని ఆన్లైన్ తో వేగంగా సరుకులను రేషన్ షాపులకు చేరవేయ వచ్చని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో వినియోగదారులకు ,డీలర్ల కు సమయం ఆదా అవుతుంది. ప్రక్రియ ఇలా.. డీలర్లు మీ సేవ లో నగదు చెల్లిస్తే ఆ సెంటర్ నిర్వాహకుడు డీలర్లకు ఓ రశీదు ఇస్తారు. చెల్లించిన నగదుపై ఆర్ఓను నేరుగా సివిల్‌సప్లయ్ డీఎంకు మీ సేవ కేంద్రం నుంచి పంపిస్తారు. దీంతో ఆ కార్యాలయం నుంచి సంబంధిత ఐఎంజీ పాయింట్‌కు ఆర్ఓలు జారీ చేస్తారు. గోదాం ఇన్చార్జిలు రేషన్ షాపులకు సరుకులను పంపిణీ చేస్తారు. నిత్యం ఎప్పటికప్పుడు ఆన్లైన్లో అధికారులకు సమాచారం అందుబాటులో ఉంటుంది. డీలర్లకు తగ్గనున్న ఖర్చు .. ఆన్లైన్ ప్రక్రియతో డీలర్లకు డీడీల ఖర్చు కొంత మేర తగ్గనుంది. బ్యాంకులలో రూ. 10 వేల లోపు డీడీ కోసం రూ.30 , ఆ పైన రూ. 50నుంచి రూ. 100 వరకు ఖర్చు వచ్చేది. ఇక ఆ సమస్య లేదు. ఒకే ఒక్క సరుకు డబ్బులు చెల్లిస్తే రూ.10 మాత్రం రుసుం తీసుకుంటారు. ఆ సరుకుకు ఎంత డబ్బులు చెల్లించినా పర్వాలేదు. ఎన్ని సరుకులకు చెల్లిస్తే అన్ని పది రూపాయల చొప్పున ఇవ్వాల్సి ఉంటుంది. ఉదాహరణకు బియ్యం, చక్కెరకు రుసుము రూ. 20 తీసుకుంటారు. ఈ విధానం వల్ల సమయం ఆదా అవుతుంది. డీడీలు కట్టడం మొదలుకొని ఆర్ఓలు గోదాంలకు చేరుకునే వరకు రెండు మూడు రోజుల సమయం పట్టేది. కేవలం అరగంటలో పని పూర్తవుంది. -
రేషన్ దుకాణంపై విజిలెన్స్ దాడులు
కుంటాల: ఆదిలాబాద్ జిల్లా కుంటాల మండల కేంద్రంలోని ఓ రేషన్ దుకాణాన్ని విజిలెన్స్ అధికారులు శుక్రవారం సీజ్ చేశారు. గోవర్ధన్‌రావు అనే డీలర్ ఆధ్వర్యంలోని దుకాణంలో అధికారులు తనిఖీలు నిర్వహించగా... స్టాక్ రిజిస్టర్, కీ రిజిస్టర్లో తేడాలున్నట్టు గుర్తించారు. 23 క్వింటాళ్ల బియ్యం నిల్వలతోపాటు, పంచదార, కిరోసిన్ నిల్వల్లోనూ లెక్కలు సరిపోలలేదు. దీంతో వినియోగదారులను మోసగిస్తున్నట్టు గుర్తించిన అధికారులు దుకాణాన్ని సీజ్ చేశారు. డీలర్ ను అదుపులోకి విచారిస్తున్నారు. -
రేషన్ అడిగిన మహిళపై దాడి
హైదరాబాద్: రేషన్ సరుకులు అడిగిన మహిళపై ఓ రేషన్ డీలర్ దాడికి పాల్పడ్డాడు. ఈ సంఘటన మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జనప్రియ అపార్ట్మెంట్లోని రేషన్ షాపు వద్ద బుధవారం ఉదయం చోటుచేసుకుంది. స్థానిక కాలనీకి చెందిన మహిళ బియ్యం కోసం షాపుకు రాగా, ఆమెకు రేషన్ ఇచ్చేందుకు నిరాకరించడంతో పాటు డీలర్ ఆమెపై దాడి చేశాడు. దీంతో ఆగ్రహించిన స్థానికులు రేషన్ షాపు ముందు ధర్నాకు దిగారు. -
పేదల వంటనూనెకు మంగళం
- ఇక పామాయిల్ లేనట్లే.. - ఏడాదిన్నర నుంచి ఇదేతంతు.... - రేషన్ షాపుల్లో ప్రైవేట్ బ్రాండ్ల విక్రయం - పట్టని పౌరసరఫరాల శాఖ సాక్షి,సిటీబ్యూరో: ప్రభుత్వ చౌకధరల దుకాణాల ద్వారా పంపిణీ చేసే పేదల వంట నూనె (పామాయిల్)కు కేంద్ర ప్రభుత్వం మంగళం పాడింది. ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా ప్రభుత్వ పామాయిల్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. ఏడాదిన్నర కాలంగా పామాయిల్ కోటా కేటాయింపు లేక పోవడంతో రేషన్ షాపుల్లో ప్రైవేట్ బ్రాండ్లు దర్శనమిస్తున్నాయి. సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడంతో డీలర్లు బహిరంగంగా ప్రైవేట్ బ్రాండ్ పామాయిల్ ప్యాకెట్లను లబ్ధిదారులకు అంటగట్టి సొమ్ము చేసుకుంటున్నారు. నిరుపేదలకు దూరమే.. నిరుపేదలకు పామాయిల్ దూరమైంది. హైదరాబాద్-రంగారెడ్డి జిల్లాల్లో ప్రతీ నెల సుమారు 20.29 లక్షల లీటర్ల పామాయిల్ అవసరం ఉంటుంది. ప్రస్తుతం అసలు కేటాయింపులే లేకుండా పోయాయి. గతంలో పామాయిల్ కోసం డీలర్లు డీడీలు చెల్లించినా పూర్తి స్థాయిలో సరఫరా చేయకపోవడంతో వారి డబ్బు ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో పడిపోయింది. అసలు కేటాయింపులు లేకపోవడంతో డీలర్లు పామాయిల్ కోసం డీడీలు చెల్లించడం మానేశారు. దీంతో ప్రభుత్వ పామాయిల్ అడ్రస్ లేకుండా పోయింది. భగ్గుమంటున్న వంట నూనె ధరలు... బహిరంగ మార్కెట్లో వంట నూనె ధరలు భగ్గుమంటున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో కనీసం లీటర్ నూనె ధర రూ.85 నుంచి 95ల వరకు పలుకుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో పామాయిల్ ధరకు రెక్కలు రావడంతో మార్కెట్లో పామాయిల్ ధర రూ.58 నుంచి 65 వరకు పెరిగింది. గతంలో చౌకధరల దుకాణాల ద్వారా లీటరు రూ.40లకు లభించేది. బహిరంగ మార్కెట్లో మంచి నూనె ధరలు మండిపోతుండటంతో లబ్ధిదారులు పామాయిల్ కోసం గగ్గోలు పెడుతున్నా ఫలితం లేకుండా పోతోంది. డీలర్లు ప్రైవేట్ బాండ్లను లబ్ధిదారులకు అంటగట్టి లీటర్‌కు రూ.65 రూపాయలు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
కొనసాగుతున్న ‘రేషన్’ఆత్మహత్యలు
రాష్ట్రంలోని రేషన్ షాపుల్లో పనిచేస్తున్న సిబ్బంది ఆత్మహత్యాయత్నాల పర్వం కొనసాగుతూనే ఉన్నది. సీఎం పన్నీరు సెల్వం బంధువుకు సైతం అధికారుల వేధింపులు తప్పలేదు. సీఎం సొంత గ్రామం తేని జిల్లా పెరియకుళంలో గురువారం రేషన్ ఉద్యోగి ఆత్మహత్యాయత్నం చేశాడు. అలాగే, తేనిలో మరో ఉద్యోగి ఆసుపత్రి పాలయ్యాడు. సాక్షి, చెన్నై : రాష్ర్టంలో పౌరసరఫరాల విభాగం నేతృత్వంలో ముప్పై వేలకు పైగా రేషన్ దుకాణాలు ఉన్న విషయం తెలిసిందే. ఇటీవల కాలంగా అధికారులు తమను వేధిస్తున్నారంటూ, రేషన్ దుకాణాల్లో పనిచేస్తున్న సిబ్బంది ఆత్మహత్యాయత్నాల బాట పడుతున్నారు. ఈ ఘటనలకు నిరసన తెలుపుతూ ఓ రోజు బంద్‌కు సైతం రేషన్ సిబ్బంది పిలుపునిచ్చారు. తమపై వేధింపులు మానుకోవాలని డిమాండ్ చేస్తూ, ఆందోళనలు కొనసాగిస్తూ వస్తున్నారు. ఈ పరిస్థితుల్లో సీఎం పన్నీరు సెల్వం బంధువుకు సైతం అధికారుల వేదింపులు తప్పలేదని చెప్పవచ్చు. బుధవారం రాత్రి సీఎం పన్నీరు సెల్వం సొంత జిల్లా తేనిలో ఇద్దరు రేషన్ సిబ్బంది వేర్వేరుగా ఆత్మహత్యాయత్నాలకు పాల్పడ్డారు. ఆత్మహత్యాయత్నాల బాట : తేని జిల్లా పెరియకుళంకు దక్షిణ వీధికి చెందిన పళని స్వామి కుమారుడు రమేష్(27) సీఎం పన్నీరు సెల్వంకు బంధువుగా సమాచారం. అక్కడి రేషన్ దుకాణంలో పనిచేస్తున్న రమేష్ బుధవారం రాత్రి విషం సేవించి ఆత్మహత్యాయత్నం చేశాడు. అపస్మారక స్థితిలో ఉన్న అతడ్ని చికిత్స నిమిత్తం పెరియకుళం ఆసుపత్రికి తరలించారు. అతడు రాసి పెట్టిన లేఖలో తనను అధికారులు వేధిస్తున్నారని, తడిసిన, చెడి పోయిన బియ్యం వినియోగం చేయమని హెచ్చరిస్తున్నారని ఆరోపిస్తూ ఆ లేఖలో పేర్కొన్నాడు. ఆ ప్రాంత ఉన్నతాధికారి మనోహర్‌పై ఆరోపణలు గుప్పించడంతో ఆ దిశగా విచారణ సాగుతున్నది. ఇక, తేనిలో మరో సిబ్బంది ఆత్మహత్యాయత్నం చేశాడు. తనను అధికారులు బలవంతంగా మరో చోటకు బదిలీ చేశారని ఆరోపిస్తూ, అధికారుల తీరును ఖండిస్తూ ఆత్మహత్యాయత్నం చేసుకుంటున్నట్టుగా తేనికి చెందిన అజ్మత్ ఖాన్ లేఖ రాసి పెట్టడం గమనార్హం. ఇక, రేషన్ సిబ్బంది అధికారుల ఒత్తిళ్లతో ఆత్మహత్యాయత్నాల బాట పడుతుండటంతో ఆ సంఘం నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు. -
అమల్లోకి రేషన్ పోర్టబులిటీ
రేషన్‌డీలర్లు పనితీరును మెరుగుపర్చుకోవాలి ఈ-పాస్ సర్వర్ కెపాసిటీని పెంచుతాం పౌరసరఫరాల శాఖ డెరైక్టర్ రవిబాబు గూడూరు టౌన్ : ఈ-పాస్ విధానంలో భాగంగా వినియోగదారులకు మరిన్ని మెరుగైన సేవలందించేందుకు ఏ రేషన్ దుకాణం నుంచైనా వినియోగదారులు సరుకులను తీసుకువెళ్లేలా రేషన్ పోర్టబులిటీని బుధవారం నుంచి అమలు చేస్తున్నామని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ డెరైక్టర్ రవిబాబు తెలిపారు. గూడూరులోని 3వ వార్డులో ఉన్న 11వ రేషన్ దుకాణాన్ని బుధవారం ఆయన పరిశీలించారు. సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి రేషన్ డీలర్లకు ఇస్తున్న కమీషన్‌ను పెంచేందుకు కృషిచేస్తున్నట్లు ఆయన తెలిపారు. పట్టణంలోని 11వ నంబరు చౌక దుకాణాంలో అతి తక్కువమంది రేషన్ తీసుకున్నారని, అదే సమయంలో 13లో 60 మంది వరకు సరుకులు తీసుకున్నట్లు సమాచారం రావడంతో దుకాణాన్ని పరిశీలించామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రోజుకు 1.50 లక్షల మంది ఈ-పాస్ విధానం ద్వారా సరుకులు తీసుకుంటున్నారని, దీనిని 3 లక్షలకు పెంచేలా చర్యలు చేపడుతున్నామన్నారు. ఈ-పాస్ సర్వర్ కెపాసిటీని పెంచి సరుకులను అందజేయడంలో అలసత్వం లేకుండా చూస్తామన్నారు. ఆయన వెంట డీఎస్ఓ ధర్మారెడ్డి, ఆర్డీఓ రవీంద్ర, తహశీల్దార్ వెంకటనారాయణమ్మ ఉన్నారు. -
రేషన్ బంద్
తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సోమవారం రాష్ట్రంలోని రేషన్ దుకాణాల్లో పనిచేసే సిబ్బంది ఆందోళనకు దిగారు. రేషన్ దుకాణాలకు తాళం వేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ కారణంగా రాష్ట్రవ్యాప్తంగా నిత్యావసర వస్తువుల సరఫరా నిలిచిపోవడంతో కార్డుదారులకు ఇబ్బంది తప్పలేదు. సాక్షి, చెన్నై:అధికార పార్టీ నేతల ఒత్తిడి, అధికారుల వేధింపుల నుంచి రక్షణ కల్పించాలని కోరుతూ రేషన్ షాపు సిబ్బంది సమ్మెకు దిగారు. తద్వారా సరుకుల సరఫరా నిలిచిపోయింది. రాష్ర్టంలో 30 వేలకు పైగా రేషన్ దుకాణాలు ఉన్నాయి. ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత పథకాలు ఇక్కడి నుంచే లబ్ధిదారులకు అందుతున్నాయి. కోటి 97 లక్షల మంది కార్డుదారులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నారు. కొన్నిచోట్ల రేషన్ అక్రమాలు జోరుగా పెరుగుతున్నాయి. ఉచిత బియ్యం పక్కదారి పడుతున్నాయి. ఇందులో అధికార పక్షం నాయకులు, అధికారుల చేతివాటాలు బయట పడుతున్నాయి. అదే సమయంలో అధికారులు, అధికార పక్షం నాయకుల వేధింపులు రేషన్ దుకాణాల్లో పనిచేస్తున్న సిబ్బందికి సంకటంగా మారాయి. ఈ పరిస్థితుల్లో అధికారుల వేధింపులు తాళలేక చెన్నై జేజే నగర్‌లోని రేషన్ దుకాణం సిబ్బంది ఇళంగో ఆత్మహత్య చేసుకోవడం రేషన్ దుకాణాల్లో పనిచేస్తున్న సిబ్బందిలో ఆగ్రహం రేపింది. అలాగే సేలం, నంగనల్లూరు తదితర ప్రాంతాల్లో అధికారుల వేధింపులు భరించలేక పలువురు సిబ్బంది ఆత్మహత్యాయత్నం చేయడం వెలుగులోకి వచ్చింది. అధికారుల తీరుకు నిరసనగా, తమ గోడును ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే విధంగా మొదటిసారిగా రేషన్ సిబ్బంది సోమవారం ఒక రోజు బంద్‌కు పిలుపునిచ్చారు. మూతపడ్డ రేషన్ దుకాణాలు బంద్ కారణంగా రాష్ట్రంలోని 30వేలకు పైగా ఉన్న రేషన్ దుకాణాలు మూతబడ్డాయి. ఉదయాన్నే దుకాణాలకు తాళం వేసిన సిబ్బంది నిరసన వ్యక్తం చేశారు. కొన్నిచోట్ల ఉదయం కాసేపు తెరిచినా సంఘం నాయకుల ఒత్తిడితో తాళం వేసుకోక తప్పలేదు. మరికొన్ని చోట్ల మధ్యాహ్నం వరకు తెరచి ఉంచి తర్వాత మూసి వేశారు. చెన్నైలో అన్ని దుకాణాలు మూతపడ్డాయి. సాయంత్రం వన్నార్ పేటలోని పౌరసరఫరాల విభాగం కార్యాలయం ఎదుట సిబ్బంది ఆందోళనకు దిగారు. తమ డిమాండ్లను ఎత్తి చూపుతూ నినాదాలతో హోరెత్తించారు. రేషన్ షాపుల సిబ్బంది సంఘం నాయకుడు పల్లిపట్టి శక్తి వేల్ మాట్లాడుతూ అధికారుల వేధింపులు తమ మీద పెరిగాయని తెలిపారు. చాలీచాలనీ జీతాలతో విధులు నిర్వర్తిస్తున్న తమపై వేధింపులు తగదని మండిపడ్డారు. తమకు జీతాలు పెంచాలని, ఆత్మహత్య చేసుకున్న ఇలంగోవన్ కుటుంబానికి రూ.పది లక్షలు నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. తమను వేధిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై ప్రభుత్వం తీసుకునే నిర్ణయం ఆధారంగా తదుపరి కార్యాచరణ ఉంటుందని తెలిపారు. -
ఈ సారైనా.. పాస్ అయ్యేనా?
ఈ పద్ధతిలో జిల్లాలో 2 లక్షల మందికే సరకులు 6.5 లక్షల మందికి పాతపద్ధతిలోనే పంపిణీ మే 1 నుంచి ఏజెన్సీలో కూడా అమలు సాక్షి, విశాఖపట్నం : ఈ-పాస్ విధానం జిల్లాలో తుస్సుమంది. అధికారులను.. డీలర్లను ముప్పుతిప్పలు పెట్టింది. ఇక సామాన్యప్రజల సహనానికి పరీక్షగా నిలిచింది. ప్రారంభించిన తొలి నెలలో నాలుగో వంతు మందికి మించి ఈ మెషీన్ల ద్వారా సరకులు అందించలేని దుస్థితి ఏర్పడింది. మిగిలిన వారికి పాతపద్ధతిలోనే సరకులు పంపిణీ పూర్తి చేయడంతో గండం గడిచి పిండం బయట పడినట్టయ్యింది. జిల్లాలో జీవీఎంసీ పరిధిలోని 412, భీమిలి, అనకాపల్లి, యలమంచలి, నర్సీపట్నం మున్సిపాల్టీల పరిధిలో 274 రేషన్‌షాపులో ఈ నెల 1వ తేదీ నుంచి ఈ-పాస్ (ఎలక్ట్రానిక్ పేమెంట్ అండ్ అప్లికేషన్ సిస్టమ్) విధానానికి శ్రీకారం చుట్టారు. తొలి రోజు నుంచి దాదాపు అన్ని షాపుల్లోనూ సర్వర్లు డౌన్ అయిపోవడం, సెల్నెట్వర్క్ సిగ్నెల్స్ పనిచేయకపోవడం, మెషీన్లు మొరాయించడం వంటి సమస్యలతో పంపిణీలో తీవ్ర జాప్యం చోటు చేసుకుంది. రోజుకు పట్టుమని పదిమందికి కూడా సరఫరా చేయలేకపోయేవారు. ఈ విధానం ద్వారా పంపిణీ మా వల్ల కాదని, పాతపద్ధతిలోనే పంపిణీ చేస్తామని డీలర్లు చెప్పడం.. ఏదేమైనా ఈ పాస్ ద్వారానే పంపిణీ చేయాలని అధికారులు ఒత్తిడి తీసుకురావడంతో 15వ తేదీ వరకు కనీసం జిల్లాలో 20 శాతం మంది కార్డుదారులకు కూడా సరకులు పంపిణీచేయలేకపోయారు. చివరకు క్షేత్ర స్థాయి సాంకేతిక సమస్యలను గుర్తించిన యంత్రాంగం ఈ నెల వరకు పాతపద్ధతి (డిజిటల్ కీ రిజిస్ట్రర్)లోనే పంపిణీ చేసేందుకు గ్రీన్సిగ్నెల్ఇచ్చింది. రెండు రోజుల గడువు పెంచింది. దీంతో 20వ తేదీ నాటికి కిరోసిన్ మినహా మిగిలిన నిత్యావసరాల పంపిణీని పూర్తి చేయగలిగారు. కిరోసిన్‌ను మాత్రం ఈనెల 25వ తేదీ వరకు పంపిణీ చేసేందుకు గడువు ఇచ్చారు. కె.కోటపాడు, బుచ్చియ్యపేటల్లో ఒక్కొక్కరికే.. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా అమలు చేసిన ఈ పాస్ మెషీన్ల ద్వారా 2,09,982 కార్డులకు మాత్రమే పంపిణీ చేయగలిగారు. మిగిలిన6,26,548 మందికి పాతపద్ధతిలోనే పంపిణీ చేశారు. జీవీఎంసీ పరిధిలో 412 షాపుల పరిధిలో 3,68,496 కార్డుదారులుండగా, కేవలం 86,311 కార్డులకు మాత్రమే ఈపాస్ విధానంలో సరకులు పంపిణీ చేయగలిగారు. మిగిలిన 2,70,419 కార్డుదారులకు పాతపద్ధతిలోనే పంపిణీ చేయగలిగారు. అనకాపల్లి, యలమంచిలి, నర్సీపట్నం, భీమిలి మున్సిపాలిటీలతో పాటు పెందుర్తి, బుచ్చెయ్యపేట, కె.కోటపాడు, ఆనందపురం, పరవాడ మండలాల్లో 274 షాపుల పరిధిలో 4,68,034 కార్డుదారులకు ఈ పాస్ ద్వారా పంపిణీ చేయాల్సి ఉండగా, 1,23,671 కార్డుదారులకు మాత్రమే పంపిణీ చేయగలిగారు. మిగిలిన 3,44,363 కార్డుదారులకు పాతపద్ధతిలోనే పంపిణీ చేశారు. ఈ-పాస్ ద్వారా జీవీఎంసీ పరిధిలో 23.72 శాతం మందికి, ఇతర మున్సిపాల్టీలతో పాటు ఎంపిక చేసిన మండలాల్లో 26.42శాతం మందికి సరకులు ఇవ్వగలిగారు. బుచ్చియ్య పేటలో 272, కె.కోటపాడులో 501 కార్డుదారులకు పంపిణీ చేయాల్సి ఉండగా, కేవలం ఒక్కొక్కరికి మాత్రమే ఈపాస్ద్వారా పంపిణీ చేయగలిగారు. విశాఖపట్నం రూరల్-2లో కూడా 17 మందికి మాత్రమే పంపిణీ చేశారు. మెషీన్ల పనితీరుపై టెస్టింగ్ డ్రైవ్ వచ్చేనెలలో ఈ పరిస్థితిని అధిగమించేందుకు గురవారం నుంచి ఈ పాస్ మెషీన్ల పనితీరుపై ప్రత్యేకంగా టెస్టింగ్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. మరో పక్క ఏజెన్సీలో పరిధిలో జీసీసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న డీఆర్ డిపోల్లో కూడా మే 1వ తేదీ నుంచి ఈ పాస్ ద్వారా సరుకుల పంపిణీ చేయాలని జిల్లా యంత్రాంగం నిర్ణయించింది. అందుకు తగిన ఏర్పాట్లు చేస్తోంది. తొలినెలలో ఎదురైనా అవరోధాలను అధిగమించేందుకు ఇకనైనా పగడ్బందీ చర్యలు చేపట్టాల్సి ఉంది. -
రేషన్ వేలిముద్ర
- సరుకుల పంపిణీకి బయోమెట్రిక్ - తొలుత గ్రేటర్ పరిధిలో అమలు - దశలవారీగా జిల్లా అంతటా విస్తరణ - యంత్రాల కొనుగోలుకు ప్రతిపాదనలు ప్రజాపంపిణీ వ్యవస్థ పక్కదారి పట్టకుండా జిల్లా యంత్రాంగం సరికొత్త విధానానికి శ్రీకారం చుడుతోంది. రేషన్ సరుకుల జారీలో అక్రమాలకు చెక్ పెట్టేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడిస్తోంది. చౌకధరల దుకాణాల్లో బయోమెట్రిక్ యంత్రాలను ప్రవేశ పెడుతోంది. సరుకుల పంపిణీలో పారదర్శకత, అవకతవకలు జరగకుండా బయోమెట్రిక్ విధానాన్ని ప్రవేశపెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఇందులో భాగంగా తొలివిడతగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని రేషన్‌షాపుల్లో తొలిసారిగా అమలు చేసేందుకు యంత్రాంగం సన్నద్ధమవుతోంది. జిల్లా పరిధిలోకి వచ్చే జీహెచ్ఎంసీలోని 800 చౌకధరల దుకాణాల్లో ఈ విధానాన్ని ప్రారంభించాలని నిర్ణయించిన అధికారులు... బయోమెట్రిక్ మిషన్లను సమకూర్చుకునే దిశగా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. యంత్రాల కొనుగోలుకు దాదాపు రూ.3 కోట్లు అవసరమవుతాయని లెక్కగట్టింది. సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి:బయోమెట్రిక్ ద్వారా విధానంతో రేషన్‌డీలర్ల అక్రమ వ్యాపారానికి ఫుల్స్టాప్ పెట్టవచ్చని అధికార యంత్రాంగం భావిస్తోంది. కనిష్టంగా ప్రతి షాపులో 30 శాతం దుర్వినియోగాన్ని అరికట్టువచ్చని ప్రభుత్వం అంచనా వేస్తోంది. తద్వారా యేటా రూ.150 నుంచి రూ. 300 కోట్ల వరకు ప్రభుత్వ సొమ్ము ఆదా అవుతుందని భావిస్తోంది. అంతేకాకుండా సరుకులు నల్లబజారుకు తరలకుండా డీలర్లలో జవాబుదారీతనం పెరుగుతుందని అంచనా వేస్తోంది. ప్రస్తుతం కార్డుదారులు వచ్చినా.. రాకున్నా, సరుకులు తీసుకున్నా. తీసుకోకపోయినా ఎంఎల్ఎస్ పాయింట్ నుంచి తీసుకున్న సరుకులు మాత్రం వెనక్కి రావడంలేదు. అంటే రేషన్ తీసుకోనివారి కోటా కూడా పక్కదారిపడుతుందన్నమాట. ఈ నేపథ్యంలో ప్రజాపంపిణీ వ్యవస్థను పకడ్బందీగా నిర్వహించాలని నిర్ణయించిన రాష్ట్ర సర్కారు.. కొత్త విధానాన్ని అమలు చేయడం ద్వారా అక్రమార్కులకు ముకుతాడు వేయాలని సంకల్పించింది. వేలిముద్ర తప్పనిసరి! బయో మెట్రిక్ విధానంలో రేషన్ సరుకులు తీసుకోవాలంటే కార్డుదారుడు తప్పనిసరిగా దుకాణానికి రావాల్సివుంటుంది. వేలిముద్ర సరిపోలినట్లు గుర్తించిన తర్వాతే సరుకులు పంపిణీ చేస్తారు. అయితే, ప్రస్తుతం కుటుంబసభ్యుల్లో ఎవరు వచ్చినా సరకులు ఇస్తారా? కుటుంబ పెద్ద వస్తేనే రేషన్ ఇవ్వడమన్న విషయంపై ప్రభుత్వం ఇంకా స్పష్టత ఇవ్వలేదు. ఈ విధానంలో కార్డుదారులకు మరో వెసులుబాటు కూడా ఉంది. తమ దగ్గర ఉన్న నగదుకు అనుగుణంగా నిర్దేశించిన సరకులను ఎన్నిసార్లయినా పొందే వీలుంది. ఉదాహరణకు.. తమకు రావాల్సిన రూ.20 కేజీల బియ్యాన్ని నాలుగు దఫాలుగా కూడా తీసుకోవచ్చన్నమాట. ప్రస్తుతం నగర శివార్లకే పరిమితం చేస్తున్న బయోమెట్రిక్ విధానాన్ని దశలవారీగా జిల్లా అంతటా విస్తరించనున్నట్లు ఆ శాఖ ఉన్నతాధికారి ‘సాక్షి’కి వివరించారు. -
డీలర్ చెబితేనే రేషన్ కార్డు!
సాక్షి, హన్మకొండ : ఒక రేషన్‌షాపు పరిధిలో ఉన్న రేషన్‌కార్డులు(ఆహార భద్రత కార్డు) మరో షాపు పరిధిలోకి మారుతున్నారుు. ఇది కంప్యూటర్ తప్పి దం వల్లో.. అధికారుల పొరపాటు వల్లో కా దు.. ఉద్దేశ పూర్వకంగానే అధికారుల ఆదేశాల తో డాటా ఎంట్రీ ఆపరేటర్లు రేషన్‌షాపు డీలర్లకు చేస్తున్న సహాయం. 2015 జనవరిలో కొ త్త రేషన్ కార్డులు మంజూరైన తర్వాత రాంనగర్, యాదవనగర్, రెడ్డికాలనీ ప్రాంతాల్లోని రే షన్ దుకాణాలకు చెందిన వందకుపైగా కా ర్డులు 71వ నంబర్ రేషన్ దుకాణం పరిధిలోకి వెళ్లాయి. ఇదే పద్ధతిలో కాజీపేటలోని 102 నం బరు చౌకదుకాణం పరిధిలో ఉన్న లబ్ధిదారులను రహమత్ నగర్ రేషన దుకాణం పరిధిలోకి మార్చారు. ఇలా లాభం.. కార్డులు ఒక చౌకధర దుకాణం నుంచి మరో చౌకధర దుకాణం పరిధిలోకి మార్చడం వల్ల లబ్ధిదారులు మొదట ఇబ్బంది పడతారు. తెలియని ప్రాంతానికి వెళ్లి రేషన్ సరుకులు తీసుకునే వారి సంఖ్య తగ్గుతుంది. ఓ కార్డులో నలుగురు కుటుంబ సభ్యులు ఉంటే ఆ కార్డుకు 24 కిలోల బియ్యం వస్తాయి. ఇలా నాలుగు కార్డులు కలిస్తే ఒక క్వింటాలు బియ్యం మిగులుతారుు. రేషన్ దుకాణాల మార్పిడి ప్రక్రియ వల్ల ప్రస్తుతం కనీసం ఒక్కో చౌకదుకాణం పరిధిలో 50 రేషన్ కార్డుల బియ్యం పక్కదారి పట్టే అవకాశం ఉంది. ఇంటి నంబర్లతో షాపుల కేటాయింపు సహజంగా పాతకార్డులు చించేసి కొత్తగా దరఖాస్తు చేసుకున్నావారికి పాత కార్డు ఉన్న షాపులోనే కొత్త కార్డు ఇవ్వాలి. కానీ అధికారులు కొత్త పద్ధతికి తెరలేపారు. ఇంటి నంబర్ల ఆధారంగా కార్డులకు రేషన్‌షాపులకు కేటాయించారు. దీనివల్ల చాలా కార్డులు కంటి పక్కన ఉన్న షాపు కాకుండా ఎక్కడో ఉన్న షాపుకు మళ్లాయి. ఆపరేటర్ల అండతో.. రేషన్‌కార్డుల డేటా ఎంట్రీ విషయంలో ప్రైవేటు ఆపరేటర్ల ఇష్టారాజ్యం సాగుతోంది. కొందరు డీలర్లు ఆపరేటర్లను మచ్చిక చేసుకుని తమ పనులు చక్కబెట్టు కుంటున్నారు. ఈ విషయంలో ఎవరికి అందాల్సిన వాటా వారికి పక్కాగా అందుతుండటంతో నాలుగు నెలలుగా ఈ దందా కొనసాగుతోంది. ఈ వ్యవహారం బాగుండటంతో పకడ్బందీగా అమలు చేసేందుకు కొద్ది రోజుల క్రితం కాజీపేట సమీపంలోని ఓ ఫంక్షన్ హాల్లో డీలర్లు, అధికారులు సమావేశమైనట్లు సమాచారం. విషయం వేరే వారికి తెలియకూడదని, అవసరాన్ని బట్టి రోటేషన్ పద్ధతి పాటించాలని సయోధ్య కుదుర్చుకున్నట్లుగా సమాచారం. దీనితోపాటు ఎక్కువ కార్డులు పొందిన డీలర్లు అదనపు మొత్తంలో ముట్టచెప్పాలని ఆ సమావేశంలో నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. -
ఎస్ఎంఎస్ వస్తే రేషన్ బియ్యం వచ్చినట్టే
లబ్ధిదారుల మొబైల్ ఫోన్లకు సమాచారం ఇస్తాం వచ్చే నెల నుంచి మిర్యాలగూడ, భువనగిరి, నల్లగొండ ఎంఎల్ఎస్ పాయింట్లలో అమలు రేషన్‌బియ్యం అమ్మినా, కొన్నా కేసులు పెడతాం వంటగ్యాస్‌కు ఆధార్‌సీడింగ్‌లో సమస్యలుంటే 18004251442 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేయండి ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల కోసం ‘విద్యార్థికి రెవెన్యూ నేస్తం’ జిల్లా జాయింట్ కలెక్టర్. డా.ఎన్.సత్యనారాయణ సాక్షి ప్రతినిధి, నల్లగొండ : ఆహారభద్రత కింద మీ కుటుంబంలో ఒక్కొక్కరికి నెలకు ఆరు కిలోల బియ్యం ప్రభుత్వం ఇస్తోందా? ఆ బియ్యం మీ రేషన్ షాపుకు ఎప్పుడు వస్తాయో మీకు తెలియదు కదా..! ఒకటి, రెండుసార్లు షాపుకు వెళ్లి లేదంటే డీలర్‌ను కలిసి అడిగితేనే మీకు రేషన్ బియ్యం వ చ్చిందో లేదో తెలుస్తుంది. కానీ వచ్చే నెల నుంచి అలాంటి అవసరం లేదు. మీ రేషన్ డీలర్ వద్దకు మీ కోటా బియ్యం రాగానే మీ మొబైల్‌ఫోన్ మోగుతుంది. మీ డీలర్ వద్దకు బియ్యం వచ్చాయి.. తీసుకెళ్లండి అని మీ ఫోన్‌కు సంక్షిప్త సమాచారం (ఎస్ఎంఎస్) వస్తుంది. మన జిల్లాలోని మూడు ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా చేపడుతున్న ఈ ఎస్ఎంఎస్ సమాచారాన్ని వచ్చే నెల నుంచి అమల్లోకి తెస్తామంటున్నారు జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్. ఎన్.సత్యనారాయణ. రేషన్‌బియ్యం సరఫరాలో జరుగుతున్న అక్రమాలను అరికట్టేందుకు గాను పలు మార్గాలను అన్వేషిస్తున్నామని, అందులోభాగంగానే ఈ ఎస్ఎంఎస్ విధానాన్ని ప్రవేశపెడుతున్నామని ఆయన వివరించారు. జిల్లాలో నిత్యాసవరాల పంపిణీ, వంటగ్యాస్‌కు నగదు బదిలీ, ప్రభుత్వ భూముల క్రమబద్ధీకరణ, రెవెన్యూ కార్యాలయాల్లో ధ్రువపత్రాల మంజూరు లాంటి విషయాలపై శనివారం ఆయన ‘సాక్షి’ ప్రతినిధికి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూ విశేషాలివి.... సాక్షి: జిల్లాలో నిత్యావసరాల పంపిణీ ఎలా ఉంది? ఈ పంపిణీలో జరుగుతున్న అవకతవకలను ఎలా అరికట్టాలనుకుంటున్నారు? జేసీ: జిల్లాలో చౌకధరల దుకాణాల ద్వారా నిత్యావసరాల పంపిణీ సక్రమంగానే జరుగుతోంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విధంగా కుటుంబంలో ఒక్కొక్కరికి ఆరుకిలోల చొప్పున బియ్యాన్ని డీలర్ల ద్వారా అందిస్తున్నాం. ఇతర వస్తువులు పంపిణీ చేసేందుకు కూడా ప్రతినెలా పకడ్బందీ ఏర్పాట్లు చేసుకుంటున్నాం. అయితే, కొన్ని చోట్ల ఈ పంపిణీ సక్రమంగా లేదనే ఫిర్యాదులు మాకు కూడా వస్తుంటాయి. ఈ ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకుని పంపిణీలో మార్పులు చేస్తుంటాం. అందులో భాగంగానే జిల్లాలో ప్రయోగాత్మకంగా ఎస్ఎంఎస్ల ద్వారా లబ్ధిదారులకు రేషన్ సమాచారాన్ని చేరవేసే ఏర్పాట్లు చేస్తున్నాం. రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో ఇప్పటికే దీనిని అమలు చేశారు. జిల్లాలో మొదటి దశలో భాగంగా వచ్చే నెల నుంచి మిర్యాలగూడ, భువనగిరి, నల్లగొండ ఎంఎల్ఎస్ పాయింట్ల పరిధిలోని షాపుల్లో రేషన్ తీసుకునే లబ్ధిదారులకు ఈ ఎస్ఎంఎస్ సౌకర్యం కల్పిస్తాం. రేషన్ డీలర్‌వద్దకు బియ్యం రాగానే లబ్ధిదారుల మొబైల్ఫోన్లకు ఎస్ఎంఎస్ పెడతాం. తద్వారా రేషన్ సరుకులు లబ్ధిదారుడు సకాలంలో తీసుకునే అవకాశం ఉంటుంది. దుర్వినియోగానికి అవకాశం ఉండదు. సాక్షి: మనిషికి ఆరుకిలోల బియ్యం ఇస్తే అవి దుర్వినియోగం అవుతున్నాయన్న ఫిర్యాదులు ఏమైనా వస్తున్నాయా? జేసీ: ప్రభుత్వం నిర్ణయించిన విధంగా కుటుంబంలో ఎంత మంది సభ్యులుంటే అంతమందికి ఆరుకిలోల చొప్పున బియ్యం ఇస్తున్నాం. అయితే, ఈ బియ్యాన్ని చాలా మంది తినడం లేదని, అమ్ముకుంటున్నారని తెలుస్తోంది. చట్టం ప్రకారం అయితే రేషన్ బియ్యం అమ్మినా, కొన్నా కేసులు పెడతాం. బియ్యాన్ని పెద్ద మొత్తంలో సైకిల్‌పై తీసుకెళ్లినా ఆ సైకిల్‌ను కూడా సీజ్ చేయవచ్చని చట్టం చెబుతోంది. రేషన్ బియ్యాన్ని దుర్వినియోగం చేయవద్దని ఊర్లలో టాంటాం వేయిస్తున్నాం. ఈ మేరకు తహసీల్దార్లకు, ఆర్డీఓలకు సూచనలు పంపాం. అదే విధంగా ఆరుకిలోల చొప్పున ఇచ్చేందుకు గాను డీలర్లు స్టాక్పెట్టుకునే స్థలం లేక ఎంఎల్ఎస్ పాయింట్ల నుంచి రెండు సార్లు బియ్యం తీసుకెళతామని అంటున్నా దానిని అంగీకరించే ప్రసక్తే లేదు. ఒక షాపునకు కేటాయించిన బియ్యాన్ని ఎంఎల్ఎస్ పాయింట్ నుంచి ఒకేసారి తీసుకెళ్లాలి. దానిని నిల్వచేసి లబ్ధిదారులకు ఇచ్చే బాధ్యత డీలర్దే. ఈవిషయంలో తేడా వస్తే చర్యలు తీసుకుంటాం. సాక్షి: ఆహారభద్రత కార్డులు ఎప్పుడొస్తాయి? ఈనెల కూడా కూపన్ల ద్వారానే రేషన్ ఇస్తారా? జేసీ: ఆహారభద్రత కార్డుల జారీ అనేది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశం. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉన్నందున ప్రభుత్వం ఎలాంటి అధికారిక ప్రకటన చేయడం లేదు. కార్డులు వచ్చేంతవరకు కూపన్లు ఇచ్చాం. అయితే, ఈనెల మాత్రం కీరిజస్టర్ ద్వారానే రేషన్ పంపిణీ చేయాలని ఆదేశాలిచ్చాం. కార్డుల జారీకి ప్రభుత్వం ఆదేశిస్తే పంపిణీ చేసేందుకు మా యంత్రాంగం సిద్ధంగా ఉంది. ఈ కార్డులు వచ్చిన తర్వాతే రేషన్‌షాపుల క్ర మబద్ధీకరణ చేపడతాం. సాక్షి: వంటగ్యాస్‌కు నగదు బదిలీ ఎంత వరకు వచ్చింది? జేసీ: కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన విధంగా వంటగ్యాస్‌కు నగదుబదిలీ ఏప్రిల్1 నుంచి ప్రారంభం అవుతుంది. ఇందుకోసం జిల్లాలోని 90శాతం మంది వినియోగదారులను వివరాలను ఆధార్‌తో అనుసంధానం చేశాం. ఇందుకోసం ప్రత్యేకంగా జిల్లా బ్యాంకర్ల కమిటీ సమావేశం ఏర్పాటు చేశాం. అటు గ్యాస్ ఏజెన్సీలు, బ్యాంకుల వద్ద ఆధార్‌సీడింగ్ వేగంగా జరుగుతోంది. అయితే, గ్యాస్ఏజెన్సీలు ఈ విషయంలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయడంతో పాటు వ్యక్తిగత బాధ్యతలు తీసుకోవాల్సి ఉంటుంది. ఎప్పటికప్పుడు బ్యాంకర్లను అప్రమత్తం చేస్తున్నాం. వంటగ్యాస్‌కు ఆధార్‌సీడింగ్‌లో సమస్యలుంటే 18004251442 టోల్‌ఫ్రీనంబర్‌కు ఫోన్‌చేసి చెప్పవచ్చు. సాక్షి: ప్రభుత్వ భూముల క్రమబద్ధీకరణ పరిస్థితి ఏంటి? జేసీ: ప్రభుత్వ భూముల క్రమబద్ధీకరణకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన 58, 59 జీఓల్లోని నిబంధనలకు అనుగుణంగా ముందుకు వెళుతున్నాం. ఇందుకు సంబంధించి 125 గజాల్లోపు భూమిని క్రమబద్ధీకరించుకునేందుకు జిల్లా వ్యాప్తంగా 15వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. అయితే, వీటిని పరిశీలిస్తే 12వేలకు పైగా దరఖాస్తులు సక్రమంగా లేవు. ఈ భూములు అసైన్డ్, శిఖం, ఎఫ్టీఎల్, మున్సిపల్, పార్కులు, రోడ్ల సరిహద్దులకు సంబంధించినవి ఉన్నాయి. వీటిని మినహాయించి మరో 2,500 దరఖాస్తుల క్షేత్రస్థాయి విచారణ పూర్తయింది. 59 జీఓ కింద వచ్చిన 1815 దరఖాస్తులకు గాను దరఖాస్తుదారులు మార్కెట్ ధరలో 25శాతం చెల్లించడం ద్వారా 2.64 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. ఈ దరఖాస్తులను ఆన్లైన్లో అప్లోడ్ చేస్తున్నాం. సాక్షి: రెవెన్యూ కార్యాలయాల్లో విద్యార్థులకు ధ్రువపత్రాల మంజూరులో ఏమైనా మార్పులు తెస్తున్నారా? జేసీ: విద్యాసంవత్సరం ముగుస్తున్న నేపథ్యంలో పాఠశాలలు, కళాశాలల్లో అడ్మిషన్లు, సెట్లకు హాజరయ్యేందుకు, పోటీపరీక్షల్లో పాల్గొనేందుకు గాను విద్యార్థులకు అనేక ధ్రువపత్రాలు అవసరం అవుతాయి. ఇందుకోసం ఈ ఏడాది కొత్త విధానాన్ని తీసుకువస్తున్నాం. ‘విద్యార్థికి రెవెన్యూ నేస్తం’ పేరుతో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులకు కుల, ఆదాయ, నివాస ధ్రువపత్రాలను వారి వారి పాఠశాలలకే పంపిస్తున్నాం. ఇందుకోసం ఈనెల తొమ్మిదిన తహశీల్దార్లు, ఎంఈవోలు, పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో సమావేశాలు నిర్వహిస్తున్నాం. ఈ సమావేశాల్లో ఇచ్చే ఫార్మాట్ల ప్రకారం ప్రధానోపాధ్యాయులు తమ పాఠశాలల్లోని 5 నుంచి 10 తరగతుల విద్యార్థుల వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత రెవెన్యూ అధికారులు పరిశీలించి ఆయా విద్యార్థుల కుల, ఆదాయ, నివాస ధ్రువ పత్రాలను పాఠశాలలకు తీసుకెళ్తారు. తొలివిడతలో భాగంగా వచ్చే నెల మొదటివారంలోపు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో 5, 10 తరగతులు చదువుతున్న విద్యార్థులకు ద్రువపత్రాలిస్తాం. పాఠశాలలు తెరిచిన తర్వాత 6,7,8,9 తరగతుల విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేస్తాం. తద్వారా ధ్రువపత్రాల కోసం విద్యార్థులు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేసే అవసరం ఉండదు. -
రేషన్ షాపులో పింఛన్లు!
డీలర్లతో సర్కారు చర్చలు రూ. 10ల యూజర్ చార్జీ డిమాండ్ సాక్షి, హైదరాబాద్: ఇప్పటి వరకు వివిధ పద్ధతుల్లో పంపిణీ చేస్తున్న సామాజిక పింఛన్లను ఇకపై రేషన్ షాపుల ద్వారా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రజా పంపిణీ కోసం రాష్ట్రంలో ఉన్న 27,176 రేషన్ షాపుల్లో ఈ-పాస్ (బయోమెట్రిక్) పరికరాలు ఏర్పాటు చేయడానికి సర్కారు చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే ఈ-పాస్ పరికాలను అద్దె ప్రాతిపదికన తీసుకునేందుకు పౌరసరఫరాల శాఖ ప్రభుత్వ ఎక్స్ అఫీషియో కార్యదర్శి బి.రాజశేఖర్ వారం కిందట ఉత్తర్వులు జారీ చేశారు. బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేస్తున్నందున వృద్ధాప్య, వికలాంగు, వితంతు, చేనేత పింఛన్లను డీలర్ల ద్వారా పంపిణీ చేస్తే బాగుంటుందని నిర్ణయించిన ప్రభుత్వం ఈ మేరకు వారితో చర్చలు ప్రారంభించింది. ఈ సందర్భంగా ఒక్కో లబ్ధిదారునికి పింఛన్ పంపిణీ చేసినందుకు గాను యూజర్ చార్జీ కింద నెలకు రూ.10లు ఇవ్వాలనే డిమాండ్‌ను డీలర్లు తెచ్చారు.ఉపాధి హామీ పథకం పనుల కూలి డబ్బులు కూడా తామే చెల్లింపులు చేస్తామని తెలిపారు. ఈ విషయాలపై చర్చించేందుకు ప్రభుత్వం ఈ నెల 20, 21న హైదరాబాద్‌లో సమావేశం కానుంది. -
రేషన్ దుకాణంలో అక్రమ నిల్వలు..
గుంటూరు: గుంటూరు జిల్లా ఈపూరు మండలం ఊడిజర్ల గ్రామం ఎస్సీ కాలనీలోని చౌక ధరల దుకాణంలో అక్రమంగా నిల్వ చేసిన బియ్యం ఉన్నాయంటూ గ్రామస్తులు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. దీంతో స్పందించిన ఎస్పీ శుక్రవారం ఆ దుకాణం వద్దకు సీఐ, ఎస్సైలను పంపించారు. మధ్యాహ్నం అక్కడికి పోలీసులు చేరుకున్నప్పటికీ సాయంత్రం వరకు దుకాణాన్ని డీలర్ తెరవలేదు. దీంతో పోలీసులు.. సాయంత్రం వరకు ఆయన కోసం అక్కడే వేచి ఉన్నారు. కొద్దిసేపు వేచి ఉన్న సీఐ, డిప్యూటీ తహశీల్దారు.. రాజకీయ ఒత్తిళ్లు కారణంగా అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఎస్సై మాత్రం ఇంకా అక్కడే ఉన్నారు. కాగా, దుకాణంలో ఏ మేరకు బియ్యం నిల్వలు ఉన్నాయో తెలియరాలేదు. -
పైరవీ షురూ!
రేషన్‌షాప్ డీలర్షిప్ కోసం తమ్ముళ్ల ఒత్తిళ్లు ఆర్డీఓ కార్యాలయం చుట్టూ తిరుగుతున్న నాయకులు నేరుగా రంగంలోకి దిగిన ఓ సీనియర్‌నాయకుడు తల పట్టుకుంటున్న అధికారులు జమ్మలమడుగు: శాశ్విత ప్రతి పాదికన డీలర్ షాపులకు అభ్యర్థుల ఎంపికకు పరీక్షలు పూర్తయ్యాయి. దీంతో అధికార పార్టీ నాయకులు తమ వారికే డీలర్షిప్ దక్కాలని ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఎం చేస్తారో తెలియదు మా వాడు పరీక్షలు సక్రమంగా రాకపోయిన టాప్ 3లో ఉండేవిధంగా చూడాలంటూ ఒత్తిడి తెస్తుండటంతో రెవెన్యూ అధికారులు తల పట్టుకుంటున్నారు. డివిజన్ పరిధిలోని 153 డీలర్షాపులకు 703 దరఖాస్తులు చేసుకోగా వారికి ఆదివారం ప్రొద్దుటూరు వాగ్దేవి ఇంజనీరింగ్ కాలేజిలో పరీక్ష నిర్వహించారు. అందులో పరీక్షల్లో 80 మార్కులకు, 20 మార్కులు ఇంటర్వ్యూకు ఉంటారుు. ప్రస్తుతం ఒక దశ పూర్తి కావడంతో ఆర్డీఓ కార్యాలయంలో పరీక్షలు రాసిన అభ్యర్ధుల మార్కుల జాబితా తయారు చేసి నోటీసు బోర్డుపై ఉంచారు. దీంతో రాజకీయ నాయకులు ఆర్డీఓ కార్యాలయం చుట్టూ తిరుగుతూ అధికారులపై ఒత్తిడి తీసుకు వస్తున్నారు. దీంతో అధికారులు ఏం చేయాలో అర్థంకాక తల పట్టుకుంటున్నారు. పరీక్షల్లో అత్యల్యంగా వచ్చిన వారిని ముందువరుసలో పెట్టాలంటే తమ ఉద్యోగాలకు ముప్పు వాటిల్లేలా ఉందంటూ చెవులు కొరుక్కుంటున్నారు. ఇప్పటికే డివిజన్ పరిధిలోని అధికార పార్టీకి చెందిన ఓసీనియర్ నాయకుడు అధికారులపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. తమ నియోజకవర్గంలో కేవలం తాము చెప్పిన వారికే డీలర్ షాపులు దక్కాలని హుకుం జారీచేయడంతో పాటు మార్కులు రాకున్నా తమ అభ్యర్ధులను టాప్ త్రీలో పెట్టి ఇంటర్వ్యూకు పిలువాలంటూ పేర్కొనడంతో అధికారులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. చివరికి పులివేందుల ప్రాంతంలో త మ వారికే డీలర్‌షాపులు వచ్చేలా చూడాలని తమ్ముళ్లు చెప్పడం అధికారులకు ఇబ్బందిగా తయూరైంది. ఒక్కో షాప్‌కు అత్యధిక మార్కులు సంపాదించిన వారిలో ముగ్గురిని మాత్రమే ఎంపిక చేస్తామని, ఒకే మార్కులు వచ్చినప్పుడు మొత్తం నలుగురిని ఇంటర్వ్యూకు పిలుస్తామని తెలుపుతున్నారు. ఈనెల 4వతేదీ పులివేందుల, మైదుకూరు, 6వతేదీ జమ్మలమడుగు, 8వతేదీ ప్రొద్దుటూరు నియోజకవర్గాలకు చెందిన అభ్యర్ధులకు ఇంటర్వ్యూలు ఉంటాయన్నారు. ఎలాగైనా తమవారికే దక్కించుకోవాలని అధికార పార్టీకి చెందిన నాయకులు ఒత్తిడి తీసుకొని వస్తుండటంతో చివరికి అధికారులు ఏం చేస్తారన్నది ఆసక్తిగా మారింది. -
కరీంనగర్లో గొలుసు దొంగతనాలు; 8తులాల బంగారం చోరీ
కరీంనగర్ క్రైం: నగరంలో చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. ఎనిమిది తులాల బంగారం చోరీ చేశారు. నగరంలోని భాగ్యనగర్‌కు చెందిన చవోటి విజయవర్షిణి శనివారం ఉదయం పాలు తీసుకురావడాని సమీపంలోని కిరాణ దుకాణం వద్దకు వెళ్లి పాలు తీసుకుని వస్తుండగా వెనుకనుంచి వచ్చిన గుర్తు తెలియని వ్యక్తి ఆమె మెడలోని 3 తులాల పుస్తెలతాడు తెంచుకుని పారిపోయాడు. ద్యానగర్‌కు చెందిన పెండ్యాల విద్యాగౌతమి(34) శనివారం మధ్యాహ్నం మిత్రురాలితో కలిసి చైతన్యపురికాలనీలోని మహాశక్తి ఆలయానికి వెళ్లింది.తిరిగి వస్తుండగా ఆలయం సమీపంలో వెనుక నుంచి బైక్‌పై వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు అమె మెడలోని 5 తులాల పుస్తెలతాడు, నల్లపూసల దండ తెంపుకుని పారిపోయారు. దొంగల కోసం ప్రత్యేక బృందాలు...సీఐ హరిప్రసాద్ నగరంలో శనివారం జరిగిన చోరీల నేపథ్యంలో వారిని పట్టుకునేందుకు ప్రత్యేకంగా మూడు బృందాలు ఏర్పాటు చేశామని టుటౌన్ సీఐ హరిప్రసాద్ తెలిపారు. కొందరు అనుమానితుల సమాచారం తెలిసిందని త్వరలోనే వారిని పట్టుకుంటామని ఆయన చెప్పారు. -
బీహార్‌లో రేషన్ షాపుల కేటాయింపులోనూ రిజర్వేషన్లు
పాట్నా: చౌక ధరల దుకాణాల కేటాయింపులోనూ రిజర్వేషన్లు కల్పిస్తూ బీహార్ ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థకు సవరణ చేసింది. దీని ప్రకారం కేటాయింపుల్లో ఎస్సీలకు 16%, ఎస్టీలకు 1%, చాలా వెనుకబడిన తరగతులకు 18%, బీసీలకు 12%, బీసీ మహిళలకు 3% రిజర్వేషన్ ఇవ్వనున్నట్లు ఆ రాష్ట్ర ఆహార, విని యోగదారుల సంక్షేమ శాఖ జాయింట్ సెక్రెటరీ లాలన్ ప్రసాద్ సింగ్ తెలిపారు. ఈ రిజర్వేషన్లు సబ్ డివిజన్ స్థాయిలో అమలవుతాయని పే ర్కొన్నారు. స్వయం సహాయక సంఘాలు, గ్రామ పంచాయితీలు, కో-ఆపరేటివ్ సొసైటీలు, వికలాంగులు, నిరుద్యోగులకు కేటాయిం పుల్లో ప్రాధాన్యం ఇస్తామన్నారు. అన్ని కులాల వారికి రేషన్ దుకాణాల నిర్వహణలో భాగస్వామ్యం కల్పించేందుకు వీలుగా రిజర్వేషన్లు తేనున్నట్లు ఆ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి గత నెల ప్రకటించిన విషయం తెలిసిందే. -
కోమాలో గుడిబండ తహశీల్దార్?
గుడిబండ : రేషన్ షాపుల కేటాయింపులపై అధికార పార్టీ నేతల ఒత్తిళ్లు తాళలేని గుడిబండ తహశీల్దార్ తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. అతని ఆరోగ్య పరిస్థితి విషమించడం తో హైదరాబాద్‌లోని ఓ కార్పొరేట్ వైద్యశాలలో చేర్పించా రు. పరిస్థితిలో మెరుగుదల లేకపోవడంతో రెండ్రోజులు గా అతను కోమాలో ఉన్నట్లు తెలిసింది. వివరాల్లోకి వెళి తే... రాష్ర్టంలో తెలుగు దేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రేషన్ షాపులు దక్కించుకునేందుకు ఆ పార్టీ నేతలు అడ్డదారులు తొక్కడం మొదలుపెట్టారు. ఇందులో భాగంగా గుడిబండ తాలూకాలోనూ తమ పార్టీ మద్దతుదారులకే రేషన్ షాపులు ఇవ్వాలంటూ తహశీల్దార్ వేణుగోపాల్‌పై టీడీపీ నేతలు ఒత్తిళ్లు తీసుకెళ్లారు. ఈ నేపథ్యం లోనే డీలర్లు కొందరు హైకోర్టును ఆశ్రయించి స్టే తీసుకున్నారు. దీంతో పాత డీలర్లతోనే డీడీలు తీసుకుని స్టాక్ రిలీ జ్ ఇవ్వాలంటూ తహశీల్దార్‌ను పెనుకొండ ఆర్డీఓ రామ్మూ ర్తి ఆదేశించారు. ఆ మేరకు తహశీల్దార్ వ్యవహరించి స్టాక్ రిలీజ్ చేశారు. ఈ నెల 2న స్టాక్ పాయింట్ నుంచి నిత్యావసర సరుకులతో మండలంలోని మోరుబాగిల్ గ్రామానికి లారీ చేరుకుంది. విషయాన్ని గుర్తించిన టీడీపీ నేతలు లారీని అడ్డుకున్నారు. సరుకులు దించకుండా తమ పర్యవేక్షణలోనే నిత్యావసరాలను పంపిణీ చేస్తామని భీస్మించారు. విషయం తెలుసుకున్న తహశీల్దార్ అదే రోజు రాత్రి ఏడు గంటలకు మోరుబాగిల్ చేరుకున్నారు. అప్పటికే తహశీల్దార్‌పై ఆగ్రహంతో ఉన్న కొందరు టీడీపీ నేతలు ఆయనను చూడగానే దురుసుగా వ్యవహరిస్తూ దాడికి సైతం యత్నించారు. సకాలంలో సీఐ హరినాథ్ అక్కడకు చేరుకుని పరిస్థితి చక్కదిద్ది, సమస్య పరిష్కారమయ్యేంత వరకూ నిత్యావసర సరుకులను వీఆర్వో ఆధీనంలో ఉం చేలా చర్యలు తీసుకున్నారు. అంతకు ముందే రక్తపోటు, మధుమేహంతో బాధపడుతున్న తహశీల్దార్ ఈ సంఘట నతో భయపడి అస్వస్థతకు లోనయ్యారు. ఈ నెల 8వ తే దీ వరకూ జిల్లా కేంద్రంలో చికిత్సలు నిర్వహించినా ఫలి తం లేకపోవడంతో సోమవారం సాయంత్రం ఆయనను హైదరాబాద్‌లోని ఓ కార్పొరేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడికెళ్లిన తర్వాత అతని పరిస్థితి మరింత విషమించి కోమాలో వెళ్లినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ విషయం పై దళిత నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. దళిత వర్గానికి చెందిన అధికారి కావడంతోనే అధికార పార్టీ నాయకులు దౌర్జన్యాలకు తెగించారంటూ మండిపడుతున్నారు. తహశీల్దార్‌కు ఏమైనా జరిగితే రాష్ర్ట వ్యాప్త ఆందోళనలకు సిద్ధపడతామంటూ ఈ సందర్భంగా దళిత సంఘం నా యకులు ఎల్.కె.నరసింహులు, నరసయ్య, ఈరలక్కప్ప, కదిరప్ప, లింగరాజు తదితరులు హెచ్చరించారు. -
నేనేం పాపం చేశానయ్యా...!
ఒంగోలు సబర్బన్: రాష్ట్ర రోడ్లు, భవనాల రవాణా శాఖమంత్రి శిద్దా రాఘవరావు సొంత నియోజకవర్గంలో గత 28 సంవత్సరాలుగా రేషన్ దుకాణం నిర్వహించుకుంటున్న ఓ వికలాంగుడి డీలర్‌షిప్‌ను రద్దు చేసి మరొకరి ఇచ్చేయడంతో ‘నేను ఏ అన్యాయం చేశానయ్యా’ అంటూ సోమవారం జరిగిన ప్రజావాణిలో కలెక్టర్‌ను కలిసి తమ పరిస్థితిని మొరపెట్టుకున్నారు. దర్శి మండలం తానంచింతల గ్రామానికి చెందిన ఏకాశి శివయ్య 1986 నుంచి రేషన్ దుకాణం సక్రమంగా నిర్వహించుకుంటూ వస్తున్నాడు. ఏ తప్పు చూపించకుండానే అర్థంతరంగా తొలగించినట్లు ఈ ఏడాది అక్టోబర్ నెలలో దర్శి తహశీల్దార్ చెప్పటంతో శివయ్య కంగుతిన్నాడు. తాను ఏం నేరం చేస్తే రేషన్ షాప్‌ను తొలగించారని ప్రశ్నించినా తహశీల్దార్ నుంచి సమాధానం లేదు. అదే గ్రామానికి చెందిన సంధు నాగమణి అనే మహిళకు రేషన్ షాప్‌ను కేటాయించేశారు. ఓ పక్క పుట్టు వికలాంగుడిగా రెండు కాళ్ళు మెలికతిరిగి కర్ర ఆసరాతో సైతం నడవలేని స్థితిలో ఉన్న శివయ్య తన గోడును జిల్లా కలెక్టర్‌కు ప్రజావాణిలో విన్నవించుకునేందుకు సోమవారం ఒంగోలుకు చేరుకున్నాడు. ఈయన భార్య కూడా వికలాంగురాలు. వీరిరువురికితోడు వీరి బిడ్డ కూడా వికలాంగురాలిగానే పుట్టింది. -
విభజించు... దక్కించుకో...!
విభజించు....పాలించు సూత్రాన్ని ఇప్పుడు జిల్లాలో టీడీపీనేతలు అమలు చేయనున్నారు. రేషన్‌షాపులను తమ చేతుల్లోకి తెచ్చుకునేందుకు ఇప్పటికే డీలర్లపై ఆరోపణలు చేస్తున్న నేతలు, తాజాగా మరో ఎత్తు వేశారు. 250 కార్డులకు ఒక షాపు చొప్పున పునర్విభజించే అవకాశం ఉండడంతో షాపులను విభజించాలని అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. వాటిని తమ అనుయాయులకు కేటాయించేందుకు పావులు కదుపుతున్నారని తెలిసింది. విజయనగరం కంటోన్మెంట్ : మరో పందేరానికి రంగం సిద్ధమవుతోంది. జిల్లాలో ఉన్న రేషన్ దుకాణాలను విభజించి, అధిక పోస్టులను సృష్టించడమే కాకుండా వాటిని తమ అనుయాయులకు అప్పగించేందుకు తెలుగుదేశం పార్టీ నేతలు పావులు కదుపుతున్నారు. ఇప్పటికే డీలర్లను సస్పెండ్ చేసిన పలు రేషన్ దుకాణాల్లో దాదాపు తెలుగు దేశం పార్టీ కార్యకర్తలతో సరుకులు విక్రయిస్తున్నారు. ఇప్పుడు వాటిని శాశ్వతంగా దక్కించుకోవడంతో పాటు, కొత్త రేషన్ డిపోలను ఏర్పాటు చేసి, తమ వారికి అప్పగించాలని యత్నిస్తున్నట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఇందుకోసం కొన్ని ప్రతిపాదనలను తెరపైకి తెస్తున్నారు. తహశీల్దార్లపై ఒత్తిడి తెచ్చి ఆర్డీఓ కార్యాలయానికి పంపించి అక్కడి నుంచి తమ నాయకుల ద్వారా పనులు చేయించుకోవాలనే ఆలోచనలో ఉన్నారు. ఇటీవల పౌరసరఫరాల శాఖ మంత్రి పరి టాల సునీత చేసిన ప్రకటన వీరి ప్రయత్నాలకు మరింత బలం చేకూర్చినట్టయింది. మంత్రి ప్రకటించిన మేరకు 500 కార్డులకు ఒక రేషన్ షాపు ఉండేలా త్వరలో జీఓ తీసుకు రానున్నారు. దీంతో జిల్లాలో రేషన్ షాపుల సంఖ్య కనీసం వందవరకూ పెరుగుతుంది. జిల్లాలో ప్రస్తుతం 79 షాపులకు డీలర్లు లేరు. ఆ ఖాళీలను భర్తీ చేయ డంతో పాటు ఇన్‌చార్జ్‌లతో నడిపిస్తున్న, సస్పెండ్‌లో ఉన్న మరో 70 డీలరు స్థానాలపై అధికార పార్టీ నేతల కన్నుపడింది. అంతే కాకుండా పరిమితికి మించి రేషన్ కార్డులున్న షాపులను పునర్విభజన చేసి వాటి స్థానాల్లో కొత్తగా డీలర్లను నియమించుకోవాలని ప్రయత్నాలు సాగుతున్నాయి. వాస్తవానికి వెయ్యి రేషన్ కార్డులు దాటితేనే పునర్విభజన చేయాలన్న నిబంధన గతంలో ఉండేది. ఇప్పుడు ఆ సంఖ్యను 800కు తగ్గించినట్టు తెలుస్తోంది. అయితే జిల్లాలో రేషన్ షాపులను పునర్విభజన చేయాలని ఒత్తిడి తెస్తున్న కారణంగా కనీసం రేషన్ కార్డుల సంఖ్యను అమలు చేయాలని జిల్లా ప్రభుత్వ యంత్రాంగం భావిస్తున్నట్టు తెలిసింది. స్థానికులు, ప్రజా ప్రతినిధుల సూచనల మేరకు (అక్కడి అవసరాలను దృష్టిలో పెట్టుకుని) 250 రేషన్ కార్డులకు ఒక షాపును కూడా ఏర్పాటు చేయవచ్చు. దీనికి తగిన కారణాలు చూపించాలి. తమ నాయకులు, కార్యకర్తలకు కలసి వచ్చేలా చాలాచోట్ల ఇదేమాదిరిగా రేషన్‌షాపులను పునర్విభజించాలని అధికార పార్టీ నేతలు ప్రతిపాదనలు తయారు చేసుకుంటున్నారు. జిల్లాలో 1365 రేషన్ షాపులున్నాయి. వీటిని బైఫర్కేషన్ చేస్తే 250 కార్డులకు ఒక షాపు లెక్కన 2344 షాపులవుతాయి. అయితే కొన్ని ఏజెన్సీ ప్రాంతాల్లోనూ, విభజనకు వీలులేని కొన్ని ప్రాంతాల్లోనూ(అధికార పార్టీకి చెందిన వ్యక్తులు డీలర్లుగా వ్యవహరిస్తున్న ప్రాంతాలు) విభజించరు. మిగతా చోట్ల రేషన్ షాపులను విభజిస్తే జిల్లాలో రేషన్ షాపులు పెరిగే అవకాశముంది. వీటిలో కొన్ని చోట్ల వెయ్యి కార్డులున్నవి, ఐదువందలున్నవీ, ఏడెనిమిది వందలున్నవీ ఉన్నాయి. వీటిలో రాజకీయ అవసరాల మేరకు పునర్వ్యవస్థీకరించేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. కచ్చితంగా కొత్త రేషన్ షాపు కావాల్సిన చోట 250 కార్డులకు ఒక రేషన్ షాపును చేసేందుకు అవకాశాలున్నాయి. అదేవిధంగా పెద్ద రేషన్ షాపుల్లో 500నుంచి 600 కార్డులకు ఒక రేషన్ షాపును పెట్టేందుకు కూడా పావులు కదుపుతున్నారు. నియోజకవర్గాల వారీగా ఎన్ని రేషన్ షాపులు ఏర్పాటు చేయాలనే దానిపై అన్ని నియోజకవర్గాలనుంచి ఒక ప్రతిపాదనను కోరుతున్నట్టు తెలిసింది. ఇంకా ఆదేశాలు రాలేదు. జిల్లాలో రేషన్‌షాపులను పునర్వ్యవస్థీకరించేందుకు మార్గదర్శకాలు రాలేదు. ఇది వినియోగదారుల అవసరాలను బట్టి చేయాల్సిన ప్రక్రియ. కనీసం 250 కార్డులకు ఒక రేషన్ షాపు ఏర్పాటు చేయొచ్చు. జిల్లాలో చాలా వరకూ ఎక్కువ కార్డులున్న షాపులున్నాయి. ఇంకా ఎటువంటి ఆదేశాలూ రాలేదు. -జే వెంకటరావు, ఆర్డీఓ, విజయనగరం . -
గోదాముల్లో తగ్గిన ‘చౌక’ సరుకులు
ఒంగోలు: చౌకదుకాణాలపై ఆధారపడిన పేదలకు ఇక కష్టాలే ఆహ్వానం పలకనున్నాయి. జిల్లాలోని పౌర సరఫరాల శాఖ వద్ద సరుకుల నిల్వలు గణనీయంగా తగ్గడం.. కొత్త స్టాకు ఇప్పట్లో వచ్చే అవకాశం లేకపోవడంతో చౌక దుకణాల వద్ద కార్డుదారులు పడిగాపులు కాయాల్సిందే. దీనికి తోడు కొత్త ప్రభుత్వం రేషన్ కార్డులకు ఆధార్ జత చేయడంతో లబ్ధిదారుల్లో టెన్షన్ మొదలైంది. కొత్త పథకాలతో పాలన గాడిలో పెడతామన్న టీడీపీ ఇప్పుడు యూ టర్న్ తీసుకుంది. అధికారులు మంగళవారం నిర్వహించిన సమీక్ష అనంతరం డీలర్లకు ఈ విషయం స్పష్టమైంది. వణికిస్తున్న ఆధార్ సీడింగ్ జిల్లాలో ఇప్పటివరకు రేషన్ కార్డులకు సంబంధించి 75 శాతమే ఆధార్ ప్రక్రియ పూర్తయింది. వాస్తవానికి కార్డుదారులో కొంతమంది ఆధార్ నమోదు చేయించుకోలేదు.. మరికొంతమంది తీయించుకున్నా తప్పులు నమోదవ్వడం.. కార్డులు ఇంకా చేతికి రాకపోవడం వంటి కారణాలతో చాలామందికి బ్రేక్ పడింది. జిల్లాలో మొత్తం 8,87,636 కార్డులుండగా 30,23,263 మంది పేర్లు నమోదయ్యాయి. ప్రస్తుతం ఆధార్ సీడింగ్ జరుగుతుండటంతో ఒకటికంటే ఎక్కువ ప్రాంతాల్లో కార్డులుంటే తొలగిస్తున్నారు. కొంతమంది తమకు అవసరంలేని కార్డులను ముందుగానే రెవెన్యూ శాఖకు అందజేయలేదు. దీంతో సీడింగ్ సమయంలో ఒకే కుటుంబానికి ఒకటి కంటే ఎక్కువచోట్ల ఉన్న కార్డులు తొలగించక తప్పడంలేదు. దీంతో జనాలకు పచ్చి వెలక్కాయ నోట్లో పడినట్లవుతోంది. ఆధార్ ఉంటేనే రేషన్ ఇవ్వాలని.. దీనికి ఈ నెల 5వ తేదీ తుది గడువని అధికారులు ప్రకటించారు. అయితే ఇప్పటికీ కొన్ని చోట్ల 60 శాతం మాత్రమే నమోదు ప్రక్రియ పూర్తవ్వడంతో.. దాదాపు నాలిగింట ఒక వంతు బియ్యం పంపిణీకి కోత పడక తప్పేలా లేదు. అన్నీ అరకొరగా.. జిల్లాలోని 8.87 లక్షల కార్డులకుగాను గతంలో 12463 మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ చేసేవారు. కానీ ఈ నెల నుంచి పద్ధతి మార్చడంతో బియ్యం పంపిణీ పూర్తిగా జరిగేలా కనిపించడంలేదు. కార్డుకు కిలో లెక్కన మొత్తం 887 మెట్రిక్ టన్నుల కందిపప్పు అవసరం. కానీ ప్రస్తుతం జిల్లాలోని గోదాముల్లో 90 మెట్రిక్ టన్నులు మాత్రమే ఉన్నాయి. ప్రతి రేషన్ షాపునకు సగం స్టాకు మాత్రమే ఇస్తున్నందున సగం మందికి కందిపప్పు లభించదు. మరికొన్ని చోట్ల దాదాపు పదోవంతు మందికి కూడా అందే అవకాశం లేదు. ప్రతి కార్డుదారునికి అరకిలో పంచదార ఇస్తారు. పండగ సందర్భాల్లో మరో అరకిలో ఇస్తారు. అంటే దసరా సరుకు కింద సెప్టెంబర్‌లో కిలో పంచదార ఇవ్వాలి. దీని కోసం మొత్తం 887 మెట్రిక్ టన్నుల పంచదార అవసరం. కానీ ప్రస్తుతం 322 మెట్రిక్ టన్నులు మాత్రమే ఉన్నాయి. సాల్ట్ 63 టన్నులు ఉన్నాయి. వాస్తవానికి 824 మెట్రిక్ టన్నులు అవసరం. దీనిపై పౌరసరఫరాల శాఖ డీఎం కొండయ్య మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న స్టాక్‌ను పంపిణీ చేస్తున్నామని చెప్పారు. కొత్త స్టాక్‌కు టెండర్లు ఖరారు కావాల్సి ఉందని, త్వరలోనే ప్రక్రియ చేపట్టే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతానికి అదనంగా స్టాకు వచ్చే పరిస్థితి లేదన్నారు. -
సరుకుల్లేవ్..
సాక్షి, అనంతపురం : కాంగ్రెస్ సర్కారు అమలు చేసిన ‘అమ్మహస్తం’ పథకానికి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మంగళం పాడనుంది. ఫలితంగా రేషన్ షాపుల ద్వారా రూ.185కే తొమ్మిది రకాల సరుకుల పంపిణీ నిలిచిపోనుంది. పథకంలో లోపాలుంటే సరిచేసి పకడ్బందీగా అమలు చేయాల్సిందిపోయి పూర్తిగా నిలిపివేయడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వివరాల్లోకి వెళితే.. జిల్లాలో 11 లక్షల తెల్లరేషన్ కార్డుదారులు ఉన్నారు. వీరికి ‘అమ్మహస్తం’ పథకానికి సంబంధించి పంచదార, గోధుమలు, పామాయిల్, చింతపండు, పసుపు, గోధుమ పిండి, కందిపప్పు, ఉప్పు, కారంపొడి పంపిణీ చేస్తారు. అంతర్జాతీయ మార్కెట్లో పామాయిల్ ధరపై పన్నులు పెరగడంతో ఐదు నెలలుగా పామాయిల్ సరఫరా నిలిపివేశారు. చింతపండు, పసుపు రెండు నెలలుగా సరఫరా కావడం లేదు. మిగిలిన సరుకులు కూడా పూర్తి స్థాయిలో రావడం లేదు. ఆగస్టులో కార్డుదారులు తీసుకోకపోవడంతో పౌరసరఫరాల శాఖలో గోధుమ పిండి, కందిపప్పు, ఉప్పు, కారంపొడి సరుకులు ఓపెనింగ్ బ్యాలెన్స్ (నిల్వ)గా ఉన్న కొన్ని సరుకులతో పాటు సెప్టెంబర్ మాసానికి కేవలం బియ్యం, పంచదారకు మాత్రమే అధికారుల సూచనల మేరకు కొంత మంది డీలర్లు డీడీలు తీశారు. ప్రస్తుతం జిల్లాలో ఉన్న కొద్దిపాటి సరుకులు సెప్టెంబర్‌లో క్లియర్ చేసిన తరువాత అక్టోబర్ మాసం నుంచి అమ్మహస్తం పథకానికి ప్రభుత్వం టాటా చెప్పడానికి సిద్ధమైనట్లు తెలిసింది. నాణ్యత పెంచితే సరి నిత్యావసర సరుకుల ధరలు చుక్కలనంటుతున్న నేపథ్యంలో ప్రభుత్వం పేదలకు ఆసరాగా ఉండేందుకు 18 నెలల క్రితం ప్రారంభమైన ఈ పథకం కింద పంపిణీ చేస్తున్న సరుకుల్లో కొన్ని నాణ్యతగా ఉండడం లేదన్న విమర్శలు ఉన్నాయి. పురుగులు పట్టిన చింతపండు, ఇటుక పొడి కలిపిన కారం, కంపుకొడుతున్న గోధుమ పిండి కార్డుదారులకు పంపిణీ చేస్తున్నారు. కందిపప్పు ఎంత ఉడకబెట్టినా ఉడకడం లేదన్న విమర్శలు ఉన్నాయి. దీంతో పాటు కొన్ని సరుకులు అమ్మహస్తం పథకం కంటే బహిరంగ మార్కెట్లోనే తక్కువ ధరకు లభిస్తుండడంతో కార్డుదారులు వీటిని తీసుకునేందుకు ముందుకు రావడం లేదు. దీంతో డీలర్ల నుంచి కూడా ఈ పథకం పట్ల నిరాసక్తత వ్యక్తమవుతోంది. తాము వేలకు వేలు డీడీలు చెల్లించి అమ్మహస్తం సరుకులు తీసుకువస్తే కార్డుదారులు తీసుకోకపోవటంతో నష్టపోతున్నామంటూ ఎంతో కాలంగా డీలర్లు గగ్గోలు పెడుతున్నారు. ఆ వస్తువుల్లో నాణ్యత పెంచి సరఫరా చేస్తే కార్డుదారుల నుంచి డిమాండ్ ఉంటుంది. ఈ లోపాలను సవరించే ప్రయత్నం చేయకుండా ఈ పథకానికి మంగళం పాడాలనుకోవడం తగదని కొందరు డీలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నెలకో సరుకు చొప్పున తగ్గిస్తూ.. నాణ్యత లేకుండా ఇస్తే ఎలా తీసుకోవాలని జనం ప్రశ్నిస్తున్నారు. సరుకు బాగోలేదంటే నాణ్యత పెంచాల్సింది పోయి ఇలా బంద్ చేయడం తగదని వాపోతున్నారు. సరుకులు రావడం లేదు అమ్మహస్తం పథకానికి సంబంధించి తొమ్మిది రకాల సరుకులు రావడం లేదు. ప్రభుత్వానికి నివేదించాము. సెప్టెంబర్ మాసానికి సంబంధించి కొద్దిపాటి డీలర్లు మాత్రమే డీడీలు తీశారు. వారికి బియ్యం, పంచదారతో పాటు గత నెలకు సంబంధించి ఓపెనింగ్ బ్యాలెన్స్‌గా ఉన్న గోధుమ పిండి, కంది పప్పు, ఉప్పు, కారం పొడి సరఫరా చేస్తే స్టాక్ క్లియర్ అవుతుంది. వచ్చే నెల నుంచి సరుకులు పంపిణీకి సంబంధించి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. - వెంకటేశం, పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజర్, అనంతపురం. -
‘అమ్మహస్తం’లో సరుకుల కుదింపు!
హైదరాబాద్: ‘అమ్మహస్తం’ పథకంలోని సరుకులను కుదించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అమ్మహస్తం పేరుతో 9 రకాల నిత్యావసర వస్తువులను రేషన్‌షాపుల ద్వారా అందించడం తెలిసిందే. వాటిలో నుంచి ఇప్పటికే పామాయిల్ సరఫరాను నిలిపివేయగా, పసుపు, చింతపండు, కారంపొడిని ఈ పథకం నుంచి తొలగించాలని నిర్ణయించారు. మంగళవారం ఆర్థికశాఖ మంత్రి ఈటెల రాజేందర్ సచివాలయంలోని తన చాంబర్లో నిర్వహించిన పౌర సరఫరాల శాఖ అధికారుల సమావేశంలో ఈ రెండు పథకాలపై సమీక్ష జరిపారు. గోధుమ ధరలు పెరిగిన నేపథ్యంలో రేషన్‌షాపుల్లో ఇస్తున్న గోధుమలు, గోధుమపిండి స్థానంలో ఏదో ఒకదాన్నే సబ్సిడీ ధరలకు అందించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఆహార భద్రత పథకాన్ని ఎప్పటి నుంచి అమలు చేయాలన్న అంశంపై కూడా ఈ సమావేశంలో చర్చించారు. సబ్సిడీ కింద రూపాయికి కిలో బియ్యం పథకానికి రూ. 1400 కోట్లు, అమ్మహస్తం పథకానికి రూ. 400 కోట్లు ప్రభుత్వం భరించాలని నిర్ణయించినట్లు తెలిసింది. కొత్త రేషన్ కార్డుల జారీకి అధికారిక కమిటీ ప్రస్తుత రేషన్‌కార్డుల స్థానంలో ఐటీ సాంకేతిక పరిజ్ఞానంతో కొత్త కార్డుల జారీ మార్గదర్శకాలను రూపొందించేందుకు ప్రభుత్వం ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పంచాయితీరాజ్ ముఖ్య కార్యదర్శి చైర్మన్‌గా వ్యవహరించే ఈ కమిటీలో పౌరసరఫరాల శాఖ కమిషనర్ కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. -
123 బస్తాల చౌకబియ్యం పట్టివేత
చిన్నమండెం: మండలంలోని కలిబండ రేషన్ షాపు(షాపు నెం:3) నుంచి అక్రమంగా చిత్తూరు జిల్లా తుమ్మలగొందికి ఐచర్ వాహనంలో తరలిస్తున్న 123 బస్తాల చౌకబియ్యాన్ని పెద్దమండెం పోలీసులు పట్టుకున్నారు. వాహనం డ్రైవర్, కొనుగోలు దారులను విచారించిన తరువాత కలిబండ రేషన్‌షాపు డీ లర్ పెద్దిరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చిన్నమండెం మండలంలోని అన్ని రేషన్ షాపుల నుంచి బియ్యం కొనుగోలు చేసి, మొత్తం ఒక్కసారిగా అమ్ముతున్నట్లు పెద్దిరెడ్డి తెలిపినట్లు సమాచారం షాపు పరిధిలోని పల్లెల్లో పోలీసులు విచారించగా నిత్యావసర వస్తువుల పంపిణీ సరిగ్గా చేయనట్లు తెలిపారు. దీంతో కేసు నమోదు చేశారు. కాగా మూడు రోజుల వ్యవధిలో రెండుమార్లు కలిబండ షాపునకు బియ్యం సరఫరా చేయడంపై స్థానికులు అధికారులను విమర్శిస్తున్నారు. చాలా మంది రేషన్‌డీలర్లు బస్తా చౌకబియ్యం బ్లాక్ మార్కెట్లో రూ.800 నుంచి రూ.1000లకు అమ్ముతున్నట్లు తెలిసింది. -
రేషన్ కట్
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ప్రజాపంపిణీ వ్యవస్థ (పీడీఎస్) ద్వారా రేషన్‌షాపుల్లో ఇచ్చే బియ్యం, కిరోసిన్ కోటాకు కోత పడనుంది. వచ్చే నెల ఇచ్చే రేషన్‌లో కొందరు తెల్ల రేషన్‌కార్డుదారులకు బియ్యం, కిరోసిన్ కట్ చేయనున్నారు. ఆధార్ వివరాలతో సరిపోల్చడం ద్వారా గుర్తించిన బోగస్ యూనిట్లకు, గ్యాస్ కనెక్షన్ ఉన్న కార్డుదారులకు ఈ నిబంధన వర్తింపజేయనున్నారు. బోగస్ యూనిట్లుగా తేలిన వారికి నాలుగు కిలోల బియ్యం, గ్యాస్ కనెక్షన్ ఉన్న వారికి ఒక లీటర్ కిరోసిన్ కట్ చేయనున్నారు. గురువారం రాష్ట్రస్థాయి అధికారుల సమక్షంలో జరిగిన ఎలక్ట్రానిక్ ప్రజా పంపిణీ వ్యవస్థ (ఈపీడీఎస్) సమావేశంలో ఈ నిబంధన ద్వారా వచ్చే నెల జిల్లా రేషన్‌కోటాలో తగ్గే బియ్యం, కిరోసిన్‌లపై అధికారులు ఒక నిర్ధారణకు వచ్చారు. జిల్లాలో ఇప్పటివరకు గుర్తించిన 14 వేలకుపైగా బోగస్ కార్డులు, 2.5 లక్షల యూనిట్ల (వ్యక్తుల)కు గాను వచ్చే నెల రేషన్‌లో దాదాపు 4.8 లక్షల కిలోల బియ్యం, 75 వేల లీటర్ల కిరోసిన్ కోత పడనుంది. ఇందుకు సంబంధించి అన్ని వివరాలను జాయింట్ కలెక్టర్ కె. సురేంద్రమోహన్ సమన్వయపరుస్తున్నారు. ఆధార్ సరిపోల్చిన వివరాలను, ఎల్పీజీ కనెక్షన్ ఉన్న కార్డుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు ఉన్నతాధికారులు చెపుతున్నారు. జిల్లాలో 2.5 లక్షల యూనిట్లు ఎక్కువ.. జిల్లాలో ఉన్న కుటుంబాల కన్నా రేషన్‌కార్డులు ఎక్కువగా ఉన్నాయనే ఆరోపణలున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా అధికారంలోనికి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా తెల్లకార్డుల విషయంపై ప్రత్యేక దృష్టి పెట్టి బోగస్కార్డులుంటే తీసేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఆధార్ కార్డుల ద్వారా కార్డుదారుల వివరాలను జిల్లా యంత్రాంగం సరిపోల్చింది. జిల్లాలో 97 శాతం మందికి ఆధార్ నంబర్లు వచ్చినా ఇందులో 74 శాతం మంది వివరాలను మాత్రమే రేషన్‌కార్డులతో పోల్చి చూశారు. అలా చూస్తే దాదాపు జిల్లాలో 2.5 లక్షల బోగస్ యూనిట్లు (రేషన్‌కార్డులో పేరున్న వ్యక్తులు) ఉన్నట్టు తేలింది. అంటే... ఇకే వ్యక్తి పేర్లు రెండు, మూడు కార్డుల్లో ఉండడం, కొందరు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిపోవడం, కుటుంబ యజమానుల పేర్లు కుటుంబ సభ్యుల పేరిట జారీ అయిన కార్డుల్లో ఉండడం వంటి అవకతవకలు ఉన్నాయని తేలింది. ఈ విధంగా తెలంగాణలోనే అత్యధికంగా జిల్లాలో 2.5 లక్షల యూనిట్లు వెలుగులోనికి వచ్చాయి. అంటే ఒక్కో యూనిట్‌కు నాలుగు కిలోల బియ్యం ఇప్పటివరకు అదనంగా ఇస్తున్నారు. వీరందరికీ ఆ నాలుగు కిలోల బియ్యాన్ని నిలిపివేయనున్నారు. కుటుంబ సభ్యులు ఎంత మంది ఉన్నా నెలకు 20 కిలోల బియ్యం మాత్రమే ఇస్తారు. ఇలాంటి కార్డుల్లో ఐదుగురి కన్నా ఎక్కువ మంది ఉన్న కార్డుల్లో నుంచి కొందరిని తీసివేసినా ఆ కార్డుపై కోటా మాత్రం తగ్గదు. అంటే కొన్ని యూనిట్లు తగ్గినా కోటా తగ్గదు. ఈ నేపథ్యంలో జిల్లాలో వచ్చే నెల బియ్యం కోటాలో 4.8 లక్షల కిలోల బియ్యం (408 టన్నులు) తగ్గనుంది. తద్వారా ప్రభుత్వానికి నెలకు రూ.65 లక్షలకు పైగా ఆదా కానుంది. వాస్తవానికి రేషన్ ద్వారా ఇచ్చే బియ్యాన్ని ప్రభుత్వం కిలోకు రూ.25 చొప్పున కొనుగోలు చేస్తోంది. ఇందులో రూ.8 కేంద్రం భరిస్తుండగా, మరో రూపాయి కార్డుదారుడి నుంచి వసూలు చేస్తున్నారు. అంటే కిలో బియ్యంపై రాష్ట్ర ప్రభుత్వం రూ.16 చెల్లించాల్సి వస్తోంది. వచ్చే నెల నుంచి 4.8 లక్షల కిలోల బియ్యం తగ్గితే ప్రభుత్వానికి కిలోకు రూ.16 చొప్పున రూ.65 లక్షల మేరకు ఆదా కానుంది. గ్యాస్ ఉంటే కిరోసిన్ లేదు.. తెల్లకార్డుల ద్వారా ఒక్కో కుటుంబానికి నె లకు రెండు లీటర్ల కిరోసిన్ ఇస్తున్నారు. అయితే, నిబంధనల ప్రకారం గ్యాస్ కనెక్షన్ ఉన్న కుటుంబానికి కేవలం ఒక లీటర్ కిరోసిన్ మాత్రమే ఇవ్వాల్సి ఉంటుందని అధికారులు చెపుతున్నారు. ఈ కారణంతో ఇప్పటికే గ్యాస్ ఏజెన్సీల నుంచి మండలాల వారీగా క నెక్షన్ల వివరాలను జేసీ తెప్పించుకున్నారు. ఈ వివరాలను మండల స్థాయిలో తహశీల్దార్లకు పంపి పరిశీలన జరిపిన అనంతరం ఏ కార్డుదారునికి లీటర్ కిరోసిన్ ఇవ్వాలో నిర్ణయించనున్నారు. ఈ మేరకు జిల్లా అధికారులకు క్షేత్రస్థాయి నుంచి అందిన వివరాల విషయంలో ఎక్కడా తప్పులు జరగకుండా ఉండేందుకు గాను తహశీల్దార్ల నుంచి వ్యక్తిగత పూచీకత్తు కూడా తీసుకున్నారు. ఈ విధంగా గ్యాస్‌కు, కిరోసిన్‌కు లింకు పెట్టడం ద్వారా వచ్చే నెల 75 వేల లీటర్ల కిరోసిన్ కోత పడనుంది. లీటర్‌కు ప్రభుత్వంపై పడే భారం రూ.15 చొప్పున మరో రూ.11.25 లక్షలు కిరోసిన్ కోత ద్వారా ప్రభుత్వానికి ఆదా కానుంది. -
‘రేషన్’ పక్కదారికి చెక్
నల్లగొండ : ప్రజా పంపిణీ విధానంలో సరుకుల పక్కదారికి చెక్ పడనుంది. రేషన్ దుకాణంలో ఏ రోజు ఎంత విక్రయించింది, ఎవరి పేరున కొనుగోలు చేశారనే విషయంతో పాటు దుకాణంలో ఎంత నిల్వ ఉందనే వివరాలు ఎప్పటికప్పుడు రాష్ట్ర స్థాయి వరకు ఆన్లైన్లో తెలిసే విధంగా టెక్నాలజీని రూపొం దించి కసరత్తు నిర్వహిస్తున్నారు. దాం తో పీడీఎస్ బియ్యంతో పాటు ఇతర సరుకులు కూడా పక్కదారికి వెళ్లకుండా నేరుగా లబ్ధిదారులకు చేరే అవకాశం ఉంది.అందుకు గాను రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఈ- పీడీఎస్ విధానాన్ని అమలులోకి తెస్తున్నారు. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్ నుం చి రేషన్ దుకాణం వరకు అం తా ఆన్లైన్ విధానాన్ని అమలు చేయనున్నారు. అందులో భా గంగానే రెవెన్యూ, పౌరసరఫరాల అధికారులకు అవగాహన కల్పించడానికి గాను వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలో ప్రస్తుతం 10.02 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. కాగా వాటిలో 32,49, 226 యూనిట్లు ఉన్నాయి. కాగా ప్రస్తుతం బోగస్ రేషన్ కార్డుల ఏరివేతలో భా గంగా ఇప్పటి వరకు 90 వేల యూనిట్లు రద్దయ్యాయి. బోగస్ కార్డుల ఏరివేత పూర్తయ్యే వరకు మరో 60 వేల యూనిట్లు రద్దయ్యే అవకాశం ఉంది. కాగా మిగతా యూనిట్లకు కూ డా సక్రమంగా రేషన్ అం దుతుందా? అందడం లేదా? అనే విషయంతో పాటు అక్రమాలు చోటు చేసుకోకుండా చర్యలు చేపడుతున్నారు. పారదర్శకత కోసమే.. జిల్లాలోని ప్రజా పంపిణీ సరుకులు పక్కదారి ప ట్టకుండా ఈ- టెక్నాలజీ చెక్ పెట్టనుంది. జిల్లాలోని పేదలకు ప్రస్తుతం 14,500 మెట్రిక్ టన్ను ల బియ్యం, 1542 కిలో లీటర్ల కిరోసిన్ పంపిణీ చేస్తున్నారు. కాగా రేషన్ దుకాణాల నుంచే బియ్యం, కిరోసిన్ పక్కదారి పడుతున్నట్లుగా ఆరోపణలు వినవస్తున్నాయి. దాంతో వీటి పంపిణీలో పారదర్శకత ఉండేందుకు గాను ఈ -టెక్నాలజీని ప్రవేశపెడుతున్నారు. ఈ- టెక్నాలజీ అనుసంధానం ఇలా.. ఈ టెక్నాలజీని రెవెన్యూ - పౌరసరఫరాల శాఖతో ప్రజా పంపిణీ విధానాన్ని అనుసంధానం చేయనున్నారు. మండల స్థాయి గోదాములు, తహసీల్దార్ కార్యాలయాలు, జిల్లా పౌరసరఫరాల శాఖ అధాకారి కార్యాలయం, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్‌కు ఈ - టెక్నాలజీని అనుసంధానం చేయనున్నారు. బియ్యం, కిరోసిన్ ఇతర సరుకులు నిల్వ ఉంచే గోదాములలో కంప్యూటర్లు ఏర్పాటు చేసి అక్కడి ఏ రోజు ఏ డీలర్‌కు ఎంత మేరకు పంపిణీ చేశారనే విషయంతో పాటు ఎంత నిల్వ ఉంది అనే విషయాన్ని ఈ - టెక్నాలజీతో పూర్తి వివరాలు నమోదు చేస్తారు. అదే విధంగా డీలర్ కూడా దుకాణంలో ఎంత మేరకు పంపిణీ చేసింది, లబ్ధిదారుడి పేరుతో సహా పేర్కొంటారు. దాంతో పాటు డీలర్ వద్ద నిల్వ ఉన్న సరుకుల వివరాలు కూడా డీలర్ల వారిగా, లబ్ధిదారుల వారీగా ఆన్లైన్లో ఎప్పటికప్పడు తెలుస్తుంది. జిల్లాలోని 59 మండలాల తహసీల్దార్లతో 2071 డీలర్ షాపులను అనుసంధానం చేస్తారు. మీ- సేవల్లోనే రేషన్ కార్డుల జారీ? ఇక నుంచి మీ సేవా కేంద్రాల్లోనే రేషన్ కార్డుల దరఖాస్తులు అందజేయాల్సి ఉంది. అదే విధంగా అర్హులైన వారికి మీ- సేవా కేంద్రాల ద్వారానే రేషన్ కార్డులు జారీ చేస్తారు. కానీ బోగస్ రేషన్ కార్డుల ఏరివేత కార్యక్రమం ముమ్మరంగ సాగుతుండగా మీ - సేవా కేంద్రాల్లో రేషన్ కార్టుల జారీ ప్రక్రియను ప్రారంభించలేదు. కాగా బోగస్ కార్డుల ఏరివేత కార్యక్రమం అనంతరం కార్డుల జారీని మీ- సేవా కేంద్రాలకే అప్పగించే అవకాశాలు ఉన్నాయి. -
పేదల బియ్యం.. పెద్దల భోజ్యం
కనిగిరి: చౌకడిపోల ద్వారా పేదవాడికి కడుపునిండా బువ్వపెట్టాలనే ఉద్దేశంతో ప్రభుత్వం కిలో రూపాయి బియ్యం పథకాన్ని ప్రవేశపెడితే అధికారుల అవినీతి, నిర్లక్ష్యంతో అది అక్రమార్కుల జేబులు నింపుతోంది. కనిగిరి కేంద్రంగా బియ్యాన్ని ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారు. రాజకీయ నాయకుల అనుయాయులకు ఇది మంచి ఉపాధి మార్గంగా మారింది. దీంతో అధికార పార్టీ నాయకులు డీలర్ షాపులను లాక్కునే పనిలో పడ్డారు. ఈక్రమంలో ఇతర పార్టీల వారిపై దాడులకు దిగడంతో పాటు వారిలో వారే గ్రూపులుగా మారి కొట్లాడుకుంటున్నారు. జిల్లాలో 6,74,243 తెల్లరేషన్ కార్డులు ఉండగా, రచ్చబండ రేషన్ కూపన్లు 1.26,450 వరకు ఉన్నాయి. అంత్యోదయ కార్డులు 52,155, అన్న యోజనకార్డులు 1,034 ఉన్నాయి. జిల్లాలో మొత్తం 2,202 చౌక దుకాణాలుండగా, కనిగిరి నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో 217 షాపులున్నాయి. నియోజకవర్గంలో 40 శాతానికిపైగా చౌక బియ్యం పక్కదారిపడుతున్నాయంటే అతిశయోక్తి కాదు. కనిగిరి నుంచి ఇతర రాష్ట్రాలకు.. అక్రమార్కులు ఈ ప్రాంతం నుంచి సేకరించిన రేషన్ బియ్యాన్ని పోరుమామిళ్ల, సింగరాయకొండ మీదుగా ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నట్లు సమాచారం. రేషన్ బియ్యాన్ని కేజీ రూ.5 నుంచి రూ.6 వరకు కొనుగోలు చేసి బయట రూ.12 నుంచి రూ.17 వరకు అమ్ముకుంటున్నారు. వీరు ముందుగా గ్రామాల్లోని రేషన్ షాపుల నుంచి సేకరించిన బియ్యాన్ని చిన్నచిన్న మూటల్లో ఒకచోటికి రహస్యంగా చేర్చుతారు. ఆ తరువాత వాటిని బస్తాలు మార్చి నల్లబజారుకు తరలిస్తారు. ఇప్పటి వరకు పట్టుబడినవివీ... 2012 జులైలో కనిగిరి పట్టణంలో రెండు రేషన్‌షాపుల్లో అక్రమ రవాణాకు సిద్ధంగా ఉన్న సుమారు 88 క్వింటాళ్ల బియ్యాన్ని పట్టుకున్నారు. అందులో ఒకరు బినామీ డీలరు కాగా మరొక డీలర్‌కు సంబంధించి ఒక ప్రైవేటు వైద్యశాలలో బియ్యాన్ని అక్రమంగా నిల్వ ఉంచారు. అజ్ఞాత వ్యక్తుల సమాచారంతో అధికారులు పట్టుకున్నారు. - ఆగస్టు నెలలో 7 క్వింటాళ్ల అక్రమ బియ్యం కనిగిరి నుంచి వేములపాడు వైపునకు ఆటోల్లో తరలిస్తుండగా మార్కెటింగ్ శాఖ అధికారులు పట్టుకున్నారు. - 2012 డిసెంబర్లో స్థానిక 8 వార్డులో అక్రమంగా బియ్యం రవాణా చేస్తున్న లారీ కుక్కను తొక్కించింది. స్థానికులు అప్రమత్తమై వెంటపడ్డారు. లారీలో నుంచి కింద పడిన రేషన్ బియ్యం బస్తాను అధికారులకు అప్పగించారు. అదే నెలలో హనుమంతునిపాడులో కూడా రేషన్ బియ్యం బస్తాలు రోడ్డు మీదపడి ఉండడంతో అధికారులకు అప్పగించారు. - 2013లో ఏప్రిల్‌లో స్థానిక తాళ్లూరి కల్యాణ మండపం వీధిలో ఆటోలో అక్రమంగా తరలిస్తున్న 30 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. పీసీపల్లి మండలంలో తలకొండపాడు, పెద అలవలపాడు ప్రాంతంలో అక్రమంగా తరలిస్తున్న మూడు టన్నుల చౌక బియ్యాన్ని స్థానికుల ఫిర్యాదు మేరకు అధికారులు పట్టుకున్నారు. అలాగే మిట్టపాలెంలో ఓ ఇంటిలో నిల్వ ఉంచిన చౌక బియ్యాన్ని అజ్ఞాత వ్యక్తుల ఫిర్యాదుతో అధికారులు స్వాధీనం చేసుకున్నారు. - ఇటీవల స్థానిక కాశీనాయన గుడి వద్ద ట్రాక్టర్లో అక్రమంగా తరలిస్తున్న 5 టన్నుల రేషన్ బియ్యాన్ని అజ్ఞాత వ్యక్తుల సమాచారంతో పోలీసులు పట్టుకుని రెవెన్యూ అధికారుల అప్పగించారు. - అలాగే 10 రోజుల క్రితం పీసీపల్లిలో అక్రమంగా తరలిస్తున్న 47 బస్తాల రేషన్ బియ్యాన్ని అధికారులు పట్టుకున్నారు. ఇలా ఎవరైనా సమాచారం ఇస్తే..అరకొరగా దాడులు చేయడమే తప్ప గట్టి నిఘా ఉంచి అక్రమాలకు అడ్డుకట్ట వేసిన సంఘటనలు లేవు. గోతాలు మార్చి శఠగోపం బియ్యాన్ని అక్రమంగా రవాణా చేసి డబ్బులు సంపాదించుకోవడం ఒక తరహా అయితే, మరో తరహా అక్రమ వ్యాపారం కూడా సాగుతోంది. రకరకాల కంపెనీల పేర్లను గోతాలపై ముద్రించి రేషన్ బియ్యాన్ని అందులో నింపి సీల్ వేసి పాతిక కేజీల బస్తాలను తయారుచేస్తున్నారు. వీటికీ రేషన్ షాపులనే అడ్డాగా మార్చుకోవడం గమనార్హం. ఇటీవల ఒక రేషన్ షాపులో ఈ తరహా సీల్ వేసే మిషన్ కూడా పట్టుబడింది. ఇంత జరుగుతున్నా అధికారులకు తెలియదనుకోవడం పొరపాటే. డీలర్లు, అక్రమార్కులు, అధికారులు కుమ్మక్కై తిలాపాపం, తలాపిడికెడు అన్న చందంగా దోచుకుంటున్నారు. వివిధ బియ్యం అక్రమ కేసుల్లో డీలర్ల పేర్లు బయటపడినా అధికారులు 6ఏ కేసులతో సరిపెడుతున్నారు. డీలర్ షాపుల కోసం కొట్లాటలు: రేషన్ షాపులు ప్రస్తుతం అధికార పార్టీ నాయకులకు ఆదాయ వనరులుగా మారాయి. అధికార పార్టీ నాయకులు బలవంతంగా డీలర్ల షాపులను లాక్కుని తమ పార్టీ కార్యకర్తలకు కట్టబెడుతున్నారు. కేవలం డీలర్ షాపు కోసం పీసీపల్లి మండలం పెద అలవలపాడులో వైఎస్సార్ సీపీకి చెందిన గోగాడి గంగయ్యను, టీడీపీ నాయకులు దారుణంగా కొట్టి చంపిన సంఘటన జరిగింది. కనిగిరి నియోజకవర్గంలో డీలర్ షాపుల కోసం టీడీపీ నాయకులు రెండు గ్రూపులుగా విడిపోయి కొట్టుకుంటున్నారు. ఇటీవల ఎమ్మెల్యే బాబూరావు సమక్ష ంలోనే పీసీపల్లి టీడీపీ నాయకులు కొట్టుకున్నారు. దీన్ని బట్టి చూస్తే రేషన్ షాపుల అక్రమ వ్యాపారం ఎంత లాభసాటిగా ఉందో అర్థమవుతోంది. -
రేషన్‌లో కోత!
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: రేషన్ షాపుల్లో పంపిణీ చేసే బియ్యం, కిరోసిన్ కోటాకు కోత పడనుంది. తెల్ల రేషన్‌కార్డుదారులకు వచ్చే నెల నుంచి రేషన్ కట్ చేసేందుకు రంగం సిద్ధమైంది. ఆధార్ వివరాలతో సరిపోని, గ్యాస్ కనెక్షన్ ఉన్న కార్డుదారులకు ఈ నిబంధన వర్తింపజేయనున్నారు. బోగస్ యూనిట్లుగా తేలినవారికి నాలుగు కిలోల బియ్యం, గ్యాస్ కనెక్షన్ ఉన్న వారికి లీటర్ కిరోసిన్ కోత విధించనున్నారు. ప్రాథమిక అంచనాల మేరకు వచ్చే నెల రేషన్‌లో దాదాపు 800 టన్నులకు పైగా బియ్యం, 2.70 లక్షల లీటర్ల కిరోసిన్ కోత పడనుంది. ఇందుకు సంబంధించి అన్ని వివరాలను ఇన్చార్జి కలెక్టర్ డాక్టర్ శరత్ ఇప్పటికే సేకరించినట్టు సమాచారం. ఈ సమాచారాన్ని మండలాలకు పంపి, మరోసారి పరిశీలన జరిపి బియ్యం, కిరోసిన్ కోటాలో కోత పెట్టనున్నారు. వాస్తవానికి జిల్లాలో ఉన్న కుటుంబాల కన్నా రేషన్‌కార్డులు ఎక్కువగా ఉన్నాయనే ఆరోపణలున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా అధికారంలోనికి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా తెల్లకార్డుల విషయంపై ప్రత్యేక దృష్టి సారించిన విషయం తెలిసిందే. బోగస్ కార్డులుంటే తీసేయాలని ఆదేశాలు కూడా జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఆధార్ ద్వారా కార్డుదారుల వివరాలను జిల్లా యంత్రాంగం సరిపోల్చింది. జిల్లాలో 97 శాతం మందికి ఆధార్ నంబర్లు వచ్చినా ఇందులో 74 శాతం మంది వివరాలను మాత్రమే రేషన్‌కార్డులతో పోల్చిచూశారు. అలా చూస్తే దాదాపు జిల్లాలో 2 లక్షల బోగస్ యూనిట్లు ఉన్నట్టు తేలింది. అంటే... ఒకే వ్యక్తి పేరు.. రెండు, మూడు కార్డుల్లో ఉండడం, కొందరు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిపోవడం... కుటుంబ యజమానుల పేర్లు కుటుంబ సభ్యుల పేరిట జారీ అయిన కార్డుల్లో ఉన్నాయని తేలింది. జిల్లాలో 7,80,100 రేషన్‌కార్డులు ఉండగా... వీటిలో 6.5 లక్షలు తెల్లరేషన్‌కార్డులున్నాయి. ఇప్పటివరకు అధికారులు సేకరించిన వివరాల ప్రకారం గ్రామీణ ప్రాంతంలో ఐదు శాతం, పట్టణ ప్రాంతంలో 10 శాతం బోగస్ రేషన్ కార్డులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ విధంగా జిల్లాలో సుమారు 2 లక్షల యూనిట్లు బోగస్ ఉన్నట్లు తేలింది. (రేషన్‌కార్డులో ఉన్న ఒక వ్యక్తి ఒక యూనిట్ కింద లెక్క) అంటే ఒక్కో యూనిట్‌కు నాలుగు కిలోల బియ్యం ఇప్పటివరకు ఇస్తున్నారు. వీరందరికీ ఆ నాలుగు కిలోల బియ్యాన్ని నిలుపుదల చేయనున్నారు. జిల్లాలో వచ్చే నెల బియ్యం కోటాలో 8 లక్షల కిలోల బియ్యం(800 టన్నులు) తగ్గనుంది. తద్వారా ప్రభుత్వానికి నెలకు రూ.1.3 కోట్లు ఆదా కానున్నాయి. వాస్తవానికి రేషన్ ద్వారా ఇచ్చే బియ్యాన్ని ప్రభుత్వం కిలోకు రూ.25 చొప్పున కొనుగోలు చేస్తోంది. ఇందులో రూ.8 కేంద్రం భరిస్తుండగా, మరో రూపాయి కార్డుదారుడి నుంచి వసూలు చేస్తున్నారు. అంటే కిలో బియ్యంపై రాష్ట్ర ప్రభుత్వం రూ. 16 చెల్లించాల్సి వస్తోంది. వచ్చే నెల నుంచి 8 లక్షల కిలోల బియ్యం తగ్గితే ప్రభుత్వానికి కిలోకు రూ.16 చొప్పున 1.3 కోట్ల మేరకు ఆదా కానుంది. గ్యాస్ ఉంటే కిరోసిన్ లేదు.. తెల్లకార్డుల ద్వారా ఒక్కో కుటుంబానికి నె లకు రెండు లీటర్ల కిరోసిన్ ఇస్తున్నారు. అయితే, నిబంధనల ప్రకారం గ్యాస్ కనెక్షన్ ఉన్న కుటుంబానికి కేవలం లీటర్ కిరోసిన్ మాత్రమే ఇవ్వాలని అధికారులు చెపుతున్నారు. ఈ కారణంతో ఇప్పటికే గ్యాస్ ఏజెన్సీల నుంచి మండలాలవారీగా గ్యాస్ క నెక్షన్ల వివరాలను జాయింట్ కలెక్టర్ తెప్పించుకున్నారు. ఈ వివరాలను మండల స్థాయిలో తహశీల్దార్లకు పంపనున్నారు. తహశీల్దార్లు గ్రామాల వారీగా గ్యాస్ కనెక్షన్ వివరాలను పరిశీలించి ఏ కార్డుదారునికి ఎంత కిరోసిన్ ఇవ్వాలో నిర్ణయించనున్నారు. ఈ మేరకు తహశీల్దార్లు జిల్లా అధికారులకు ఈ నెల 16వ తేదీలోపు అన్ని వివరాలు పంపించాల్సి ఉంటుంది. ఈ విషయంలో ఎక్కడా తప్పులు జరగకుండా ఉండేందుకు గాను తహశీల్దార్ల నుంచి వ్యక్తిగత పూచీకత్తు కూడా తీసుకోవాలని అధికారులు యోచిస్తున్నారు. ఈ విధంగా గ్యాస్‌కు, కిరోసిన్‌కు లింకు పెట్టడం ద్వారా వచ్చే నెల 2 లక్షల లీటర్ల కిరోసిన్ కోత పడనుంది. లీటర్‌కు ప్రభుత్వంపై పడే రూ.15 భారం తగ్గనుంది. అంటే మరో రూ.40 లక్షలు కిరోసిన్ కోత ద్వారా ప్రభుత్వానికి ఆదా కానుందన్న మాట. -
పామాయిల్ పంపిణీకి గ్రహణం
నెల్లూరు(పొగతోట): తెల్లకార్డు లబ్ధిదారులకు రేషన్‌షాపుల ద్వారా ప్రతి నెలా జరిగే పామాయిల్ పంపిణీకి గ్రహణం పట్టింది. మూడు నెలలుగా పామాయిల్ పంపిణీ ప్రక్రియ నిలిచిపోవడంతో పేదలు అవస్థ పడుతున్నా రు. అధిక ధరలు చెల్లించి బజారు లో నూనెలు కొనుగోలు చేయలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పామాయిల్ పంపిణీకి టీడీపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడంతోనే ఈ పరిస్థితి నెలకొన్నట్లు తెలిసింది. జిల్లాలో 8.50 లక్షల రేషన్‌కార్డులు ఉన్నాయి. వీటి లబ్ధిదారులకు ప్రతి నెలా 8.50 లక్షల పామాయిల్ ప్యాకెట్లను సబ్సిడీపై పంపిణీ చేస్తున్నారు. లీటర్ పామాయిల్ ధర మార్కెట్ లో రూ.65 నుంచి రూ.70 పలుకుతుండగా రేషన్‌దుకాణాల ద్వారా రూ.40కే అందిస్తున్నారు. ఈ క్రమంలో పేద ప్రజలందరూ ఈ పామాయిల్‌తోనే వంట చేసుకుంటున్నారు. అయితే మూడు నెలలుగా ఈ పామాయిల్ పంపిణీకి బ్రేక్ పడింది. రేషన్‌డీలర్లు డీడీలు తీసినా బియ్యం సరఫరా చేసి సరిపెట్టుకుంటున్నారు. ఈ విషయమై సివిల్ సప్లయీస్ డీఎం ధర్మారెడ్డి మాట్లాడుతూ పామాయిల్ పంపిణీపై ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి ఆదేశాలు అందలేదని వెల్లడించారు. ఆదేశాలు వస్తే పంపిణీకి చర్యలు తీసుకుంటామని చెప్పారు. చంద్రబాబు ఫొటో కోసమేనా ! ఇటీవల వరకు పంపిణీ అయిన పామాయిల్ ప్యాకెట్లపై సోనియాగాంధీ, మన్మోహన్సింగ్, అప్పటి సీఎం కిరణ్, మంత్రి శ్రీధర్‌బాబు ఫొటోలు ఉండేవి. వాటి స్థానంలో ప్రస్తుత సీఎం చంద్రబాబు, మంత్రుల ఫొటోలు ముద్రించడం కోసమే ప్రభుత్వం ఉత్తర్వుల జారీలో తాత్సారం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మొత్తం మీద వీరి ఫొటోల పంచాయితీ ప్రజలను కష్టాలపాల్జేస్తోంది. -
వేధిస్తే ఊరుకోం
జమ్మలమడుగు: అధికారాన్ని అడ్డంగా పెట్టుకుని తమ కార్యకర్తలతో పాటు ఇతరులకు అన్యాయం చేస్తే ఊరుకోమని వైఎస్సార్సీపీ నేతలు హెచ్చరించారు. అవసరమైతే అసెంబ్లీవరకు ఉద్యమిస్తామన్నారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు సి. ఆదినారాయణరెడ్డి,రాచమల్లు ప్రసాద్‌రెడ్డి, ఎస్.రఘురామిరెడ్డి, జయరాములు, కొరముట్ల శ్రీనివాసులు,ఆంజాద్‌బాష, ఎమ్మెల్సీదేవగుడినారాయణరెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆకేపాటి ఆమరనాథరెడ్డి, జిల్లా పార్టీ కన్వీనర్ సురేష్‌బాబు సోమవారం ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. రేషన్‌షాపులను నిర్వహిస్తున్న వైఎస్సార్సీపీ కార్యకర్తలను తొలగిస్తుండడం అన్యాయమన్నారు. అధికారంలోకి వచ్చి నెలరోజులు కాకమునుపే టీడీపీ ప్రభుత్వం ఇటువంటి చర్యలకు పాల్పడటం హేయమన్నారు. చిన్న చిన్న ఉద్యోగుల కడుపులు కొట్టే కార్యక్రమం మంచిది కాదన్నారు. రుణమాఫీ విషయంలో రాష్ర్ట ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రైతులను మభ్యపెడుతున్నారన్నారు. ప్రజలను నమ్మించి మోసగించడం టీడీపీకి మాత్రమే చెల్లిందన్నారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారని, ఇందుకు అధికారులు కూడా సహకరిస్తున్నారన్నారు. ప్రభుత్వాలు వస్తుంటాయి.. పోతుంటాయని శాశ్వతంగా ఉండేది ఉద్యోగులేనని.. అటువంటి వారు న్యాయబద్ధంగా వ్యవహరించాలన్నారు. అధికారపార్టీ నాయకుల ఒత్తిళ్లకు లొంగి తమ కార్యకర్తలను వేధిస్తే ఊరుకోమన్నారు. ప్రశాంతంగా ఉన్న జమ్మలమడుగు నియోజకవర్గంలో కొంతమంది నాయకులు ఫ్యాక్షన్ రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారన్నారు. ధర్నాలో డీసీసీ బ్యాంక్ అధ్యక్షుడు తిరుపాల్‌రెడ్డి, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్లు తాతిరెడ్డి సూర్యనారాయణరెడ్డి, ముక్తియార్. మాజీ జెడ్పీటీసీ శివనాథరెడ్డి, శివనారాయణరెడ్డి, జానకీరామిరెడ్డి, అంకిరెడ్డి, స్టీరింగ్ కమిటీ సభ్యుడు హనుమంతరెడ్డి, ట్రేడ్ యూనియన్ నాయకుడు కుతుబుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. -
ప‘రేషన్’
చౌకధరల దుకాణాల్లో సరుకుల పంపిణీ నెలాఖరులోనూ ఆన్లైన్ అలాట్మెంట్ ఇవ్వని వైనం డీడీలు తియ్యకుండా మిన్నకున్న రేషన్ డీలర్లు టీడీపీ నేతల ఒత్తిడే కారణమని అనుమానాలు..! మరో రెండు రోజుల్లో డీడీలు తీయిస్తామంటున్న అధికారులు జూలై కోటాపై కార్డుదారుల్లో ఆందోళన గుంటూరు : చౌకధరల దుకాణాల్లో జూలై నెల సరుకుల పంపిణీపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా రేషన్‌షాపులకు ఈ నెల అలాట్మెంట్ను ఆన్లైన్ చేయకపోవడం.. ఇప్పటి వరకు అనేక ప్రాంతాల్లో డీలర్లు డీడీలు తీయక పోవడం ఇందుకు కారణాలుగా కనిపిస్తున్నాయి. ప్రతినెలా 18వ తేదీలోగా అలాట్మెంట్లు పూర్తయి డీడీలు తీయాల్సి ఉండగా ఇప్పటి వరకు ఆ ప్రక్రియ పూర్తి కాకపోవడంతో ఇక సరుకెప్పుడు దిగుమతి అవుతుందో.. వచ్చే నెల కోటా తమకెప్పుడు అందుతుందోనని కార్డుదారులు ఆందోళన చెందుతున్నారు. పెరిగిన నిత్యావసర వస్తువుల భారం పేదలపై పడకుండా వారికి బియ్యం, పామాయిల్, పంచదార, కిరోసిన్, కందిపప్పు, కారం, చింతపండు, పసుపు, గోధుమపిండి వంటితెలుగు తమ్ముళ్లకు కట్టబెట్టేందుకేనా..!.. జిల్లాలో అధికార పార్టీ నేతలు తమకు అనుకూలంగా లేని వ్యక్తులు నిర్వహిస్తున్న చౌకధరల దుకాణాలను తెలుగు తమ్ముళ్లకు కట్టబెట్టేందుకే అధికారులపై ఒత్తిడి తీసుకొస్తున్నారని, అలాట్మెంట్ ఇవ్వకుండా నిలిపివేశారనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే అనేక నియోజకవర్గాల్లో ఇన్‌చార్జ్‌లుగా వ్యవహరిస్తున్న డీలర్ల వద్ద నుంచి షాపులను లాగేసుకున్నారని, పర్మినెంట్ డీలర్లను సైతం రాజీనామా చేయాలంటూ ఒత్తిడి తీసుకువస్తున్నారని తెలుస్తోంది. అలా చెయ్యని వారి దుకాణాలపై రెవెన్యూ అధికారులతో దాడులు చేయించి, వారంతట వారే వదులుకునేలా చేస్తున్నట్లు ఆరోపణలు వినివస్తున్నాయి. కార్డుల తొలగింపు ప్రక్రియ వల్లే ఆలస్యం... రేషన్ డీలర్లకు సరుకుల అలాట్మెంట్ ఆలస్యం కావడంపై డీఎస్వో రవితేజా నాయక్ ‘సాక్షి’తో మాట్లాడుతూ చౌకధరల దుకాణాల్లో సరుకులు తీసుకోని కార్డుదారులను గుర్తించి, తొలగింపు చేపట్టామని, ఈ ప్రక్రియ వల్లే సరుకుల అలాట్మెంట్ చేయడంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆలస్యమైందని సమాధానమిచ్చారు. జిల్లాలో సోమవారం కొన్ని మండలాల తహశీల్దార్లు వారి వద్ద ఉన్న కార్డు దారుల ఆధారంగా డీలర్లతో డీడీలు తీయించారని చెప్పారు. మిగతా మండలాలు, పట్టణాల్లోనూ రెండు రోజుల్లో డీడీలు తీయించి సరుకుల పంపిణీ సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు. . నూతన మద్యం విధానంలో దుకాణాల లెసైన్స్‌లను ఐదు శ్లాబులుగాను, బార్ లెసైన్స్ విధానాన్ని మూడు శ్లాబులగాను నిర్ణయించారు. కొత్త విధానం అంటూ హడావుడి చేసిన ప్రభుత్వం ప్రస్తుతం తెచ్చిన విధానాన్ని చూసి కొత్తసీసాలో పాత సారా నింపినట్లు ఉందని వ్యాపారులు వ్యాఖ్యానిస్తున్నారు. నోటిఫికేషన్ విడుదల..జిల్లాలో మొత్తం 342 మద్యం దుకాణాలు, 187 బార్లు ఉన్నాయి. వీటిని లాటరీ విధానంలో కేటాయించేందుకు సోమవారం నోటిఫికేషన్ విడుదలయింది. సోమవారం నుంచి ఈ నెల 27వ తేదీ మధ్యాహ్నం వరకూ దరఖాస్తులు స్వీకరిస్తారు. 28వ తేదీన గజిట్ నంబర్ల ఆధారంగా లాటరీ విధానంలో దుకాణాల కేటాయింపు జరుగుతుంది. పెరిగిన ఫీజుల ప్రకారం బార్లను యథాతధంగా రెన్యువల్ చేస్తారు. జిల్లాలో రూ.32.50 లక్షల లెసైన్స్ ఫీజు ఉన్న మద్యం దుకాణాలు 119 ఉండగా, రూ.34 లక్షలు ఉన్న దుకాణాలు 103, రూ. 42 లక్షలు ఉన్న దుకాణాలు 85, రూ.64 లక్షలు ఉన్న దుకాణాలు 35 ఉన్నాయి. అదేవిధంగా జిల్లాలో రూ.35 లక్షలు లెసైన్స్ ఫీజులు ఉన్న బార్లు 98 ఉండగా, రూ.38 లక్షలు లెసైన్స్ ఫీజు ఉన్న బార్లు 89 ఉన్నాయి. బెల్టుషాపులను తొలగిస్తూ ప్రభుత్వం నిర్ణయించడంతో మద్యం వ్యాపారులు ఈసారి పెద్దగా ఆసక్తి కనబరచడం లేదని తెలుస్తోంది. -
'దేశం' దాష్టీకం
కనిగిరి : జిల్లా వ్యాప్తంగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు రెచ్చిపోతున్నారు. అధికారం ఉంది కదా.. అని ఇష్టారాజ్యంగా దాడులకు తెగబడుతున్నారు. ముఖ్యంగా కనిగిరి నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్లు స్వైరవిహారం చేస్తున్నారు. రేషన్ డీలర్లు, కాంట్రాక్ట్ ఉద్యోగుల నుంచి అంగన్వాడీల వరకూ అందరిపై దౌర్జన్యాలకు దిగుతున్నారు. ప్రశ్నించిన వారిని తెలుగు తమ్ముళ్లు భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. వైఎస్సార్ సీపీ కార్యకర్తలే లక్ష్యంగా దాడులకు తెగబడుతున్నారు. రేషన్ షాపు కోసం పదిమంది కలిసి ఓ వ్యక్తిని కర్రలు, రాళ్లతో కొట్ట్టి అతికిరాతకంగా చంపారంటే టీడీపీ నేతలు ఎంతటి దారుణాలకు వడిగడుతున్నారో అర్థమవుతోంది. పీసీపల్లి మండలం పెద అలవలపాడులో డీలర్ నర్సింహారావును టీడీపీ నాయకులు బెదిరించారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చినందున జూన్ నెల డీడీ కట్టవద్దని హుకుం జారీ చేశారు. ప్రశ్నించిన బాధితునిపై గోడవకు దిగి దాడి చేశారు. అంతటితో ఆగకుండా ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేసి తప్పుడు కేసు నమోదు చేయించారు. అసలు గోడవలో లేని తమ పేర్లను ఫిర్యాదులో ఎందుకు పేర్కొన్నారని ప్రశ్నించిన వైఎస్సార్ సీపీ కార్యకర్తలు గోగడ శింగయ్య, సురేష్, కంచర్ల తిరపతమ్మలపై టీడీపీ నాయకులు చెన్నుపాటి వెంకటేశ్వర్లు, పువ్వాడి మల్లికార్జున, జి.వెంకట్రావ్, నాగార్జున, డి.కృష్ణతో పాటు మరి కొందరు కలిసి కర్రలు, రాళ్లతో గురువారం రాత్రి దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన శింగయ్య ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం వేకువ జామున మృతి చెందాడు. తిరుపతమ్మ ఒంగోలులోని ఓ ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య కొట్టు మిట్డాడుతోంది. సురేష్‌దీ అదే పరిస్థితి. ఎంపీపీ సీటుపైనా కుట్ర = తగినంత బలం లేకున్నా కనిగిరి ఎంపీపీ పీఠం దక్కించుకునేందుకు టీడీపీ నాయకులు కుట్ర పన్నుతున్నారు. = వైఎస్సార్ సీపీ ఫ్యాను గుర్తుపై గెలిచిన చిన అలవలపాడు ఎంపీటీసీ సభ్యుడిని ప్రలోభపెట్టారు. = తన భర్తను టీడీపీ నాయకులు కిడ్నాప్ చేశారంటూ ఎంపీటీసీ భార్య సంతోషమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. = తన భర్తకు హాని జరిగే అవకాశం ఉందని, టీడీపీ నేతల చెర నుంచి తన భర్తను కాపాడాలంటూ సంతోషమ్మ అనేక సార్లు ఆందోళన వ్యక్తం చేసినా టీడీపీ నాయకులు కనికరించలేదు. = ఎంపీపీ పీఠాన్ని వైఎస్సార్ సీపీకి దక్కకుండా చేసేందుకు తెలుగు తమ్ముళ్లు కుయుక్తులు పన్నుతున్నారు. = ఈ సంఘటనలు వెలుగులోకి వచ్చినవి మాత్రమే. వెలుగులోకి రాన్ని టీడీపీ అక్రమాలు ఎన్నో ఉన్నాయని ఆయా గ్రామాల ప్రజలు పేర్కొంటున్నారు. = మొత్తంగా కనిగిరి నియోజకవర్గంలో టీడీపీ నేతల అక్రమాలకు అడ్డూఅదుపు లేకుండా పోతోందని చెప్పవచ్చు. పోలీస్ పికెట్ పెదఅలవలపాడులో పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. కందుకూరు డీఎస్పీ పి.శంకర్ తన సిబ్బందితో కలిసి గ్రామానికి వచ్చారు. మృతుడు శింగయ్య బంధువులతో మాట్లాడి వివరాలు సేకరించారు. మృతుని కుమారు సురేష్ ఫిర్యాదు మేరకు టీడీపీ నాయకులు పువ్వాడి మల్లికార్జున్, పువ్వాడి వెంకటనారాయణతో పాటు మరో పది మందిపై కేసు నమోదు చేసినట్లు ఇన్చార్జి ఎస్సై ఆరాధ్యుల సుబ్బరాజు తెలిపారు. -
వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలపై టీడీపీ నేతల దాడి
పీసీ పల్లి : కేవలం రేషన్ షాపునకు డీడీ కట్టినందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై టీడీపీ నాయకులు దాడి చేశారు. క్షతగాత్రుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ సంఘటన పీసీ పల్లి మండలంలోని పెదఅలవలపాడు గ్రామంలో గురువారం జరిగింది. ఆ వివరాల ప్రకారం... పెదఅలవలపాడులోని రేషన్ షాపును వైఎస్ఆర్ సీపీ మద్దతుదారుడు మాధవరపు నర్శింహులు నిర్వహిస్తున్నాడు. అయితే, ప్రస్తుతం టీడీపీ ప్రభుత్వం వచ్చినందున రేషన్ షాపునకు సరుకులకు సంబంధించి ఈ నెల డీడీ తీయవద్దని, డీలర్‌షిప్‌ను తాము తీసుకుంటామని టీడీపీ నాయకులు కొల్లా వెంకట్రావు, డి.కృష్ణ, నాగార్జున మరికొందరు కలిసి గురువారం డీలర్ నర్శింహులును బెదిరించారు. దీంతో రెండువర్గాల మధ్య వివాదం జరిగింది. దీనిపై పరస్పరం ఫిర్యాదు చేసుకునేందుకు పీసీ పల్లి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లారు. అయితే, అక్కడ ఎస్సై లేకపోవడంతో ఫిర్యాదు పత్రాలను సిబ్బందికి అందజేసి తిరిగి గ్రామానికి చేరుకున్నారు. కాగా, వివాదంలో తాము లేకపోయినప్పటికీ ఫిర్యాదులో తమ పేర్లు ఎందుకు పేర్కొన్నారంటూ వైఎస్ఆర్ సీపీకి చెందిన గోగడ శింగయ్య, గోగడ సురేష్, కంచర్ల తిరుపతమ్మలు టీడీపీ నాయకులను ప్రశ్నించారు. దీంతో ఆగ్రహించిన టీడీపీ నాయకులు చెన్నుపాటి వెంకటేశ్వర్లు, పువ్వాడి మల్లికార్జున, గొనుగుంట్ల వెంకట్రావు, దారపనేని కృష్ణ మరికొందరు కలిసి కర్రలు, రాళ్లతో విచక్షణారహితంగా వారిపై దాడిచేశారు. ఈ దాడిలో శింగయ్య, తిరుపతమ్మ తలలు పగలగా సురేష్‌కు కూడా తీవ్రగాయాలయ్యాయి. వారిని ముందుగా కనిగిరి వైద్యశాలకు తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం ఒంగోలు తీసుకెళ్లారు. వారిలో శింగయ్య, తిరుపతమ్మ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. సమాచారం అందుకున్న పీసీ పల్లి పోలీసులు గ్రామానికి చేరుకుని విచారణ చేపట్టారు. -
నీలికిరోసీన్ మారుతోంది
పాతగుంటూరు, న్యూస్‌లైన్: అసలే వేసవికాలం. విద్యుత్ సరఫరా ఉండటమే లేదు. అంతా కిరోసిన్ దీపాలపైనే ఆధారపడుతున్నారు. చిన్నపాటి పనికి కూడా లాంతర్ల అవసరం కలుగుతోంది. కొందరు వంటకోసం కూడా కిరోసిన్ వినియోగిస్తున్నారు. మార్కెట్లో పెరుగుతున్న డిమాండ్‌ను రేషన్ డీలర్లకు వరంగా మారింది. లబ్ధిదారులకు అందించాల్సిన కిరోసిన్ ఎంచక్కా అక్రమ వ్యాపారులకు అప్పగించేసి అధిక లాభాలు ఆర్జిస్తున్నారు. కిరోసిన్ లోడ్ వస్తోందని తెలియగానే అక్రమవ్యాపారులు అక్కడ వాలిపోతారు. మొత్తం కిరోసిన్ వారికి అప్పగించేసి కొద్దిపాటి సరకును లబ్ధిదారులకు అందజేస్తున్నారు. పైగా రెండు నెలలకోసారి మాత్రమే కిరోసిన్ ఇస్తామంటూ బహిరంగంగానే లబ్ధిదారులకు చెబుతున్నారు. స్టాకు రాలేదనీ, ఎన్నాళ్లవరకు మీకోసం ఎదురు చూడాలని ఇలా రకరకాలుగా లబ్ధిదారులకు ఎదురు ప్రశ్నలు వేసి చేతులు దులుపుకుంటున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో లబ్ధిదారులు అధికమొత్తాలు చెల్లించి బయటి మార్కెట్లో కొనుగోలు చేయాల్సిన పరిస్థితులు దాపురించాయి. జిల్లాలోని బొల్లాపల్లి, మాచవరం, బెల్లంకొండ, క్రోసూరు, రాజుపాలెం, నకరికల్లు, దుర్గి మండలాల్లో అధికంగా అక్రమ రవాణా సాగుతోందని తెలుస్తోంది. ఇటీవల కాలంలోనే డీలర్లు, కిరోసిన్ హాకర్లు వ్యాపారులతో ముందుగానే కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం గుంటూరు నుంచి సరఫరా కేంద్రానికి వెళ్లే మార్గంలోనే కిరోసిన్ ఇచ్చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 2704 రేషన్ షాపులు, 780 కిరోసిన్ హాకర్లు ఉన్నాయి. జిల్లాలో 14500 మంది కార్డుదారులకు ప్రతీనెలా 22 వేల కిలోలీటర్లు కిరోసిన్ సరఫరా కావాల్సి ఉంది. కానీ అందులో పావువాటా కూడా కార్డుహోల్డర్లకు అందడంలేదనే ఫిర్యాదులు వస్తున్నాయి. అక్రమ వ్యాపారులు ముందుగానే డీలర్లకు నగదు చెల్లిస్తారు. ఆ మొత్తాలను డీడీల రూపంలో చెల్లించి సరకు తెచ్చుకుంటున్నారు. దానికి తగ్గట్టుగా రెండు, మూడు నెలలపాటు కిరోసిన్ వారికి అప్పగించేసి, ఇతర సరకులు అమ్ముకోవడం ద్వారా సంపాదించింది సొంతానికి వాడుకుంటున్నారని తెలుస్తోంది. కొరవడిన పర్యవేక్షణ.. పౌరసరఫరాల శాఖాధికారులు రేషన్ సరకు డీర్లకు చేర్చేందుకు రూట్ ఆఫీసర్లను ఏర్పాటు చేశారు. అయితే కిరోసిన్ రాత్రివేళ తరలిస్తుండటంతో రూట్ ఆఫీసర్లు వాటిని పర్యవేక్షించడంలేదని, ముందుగానే వారితో కుదుర్చుకున్న ఒప్పందంతో వారు కనీసం వాటిని పరిశీలించడం లేదని తెలుస్తోంది. రేషన్ డీలర్లు లబ్ధిదారులకు బియ్యం సరఫరా చేసినపుడే కిరోసిన్ కూడా అందుకున్నట్టు సంతకాలు చేయించేసి, ఎటువంటి కేసులు తమవరకు రాకుండా జాగ్రత్త పడుతున్నారని తెలుస్తోంది. ఇప్పటికైనా అధికారులు వీటిపై దృష్టిసారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం: డీఎస్ఓ రవితేజనాయక్ కిరోసిన్ అక్రమ తరలింపుపై జిల్లా పౌరసరఫరాల అధికారి రవితేజనాయక్వద్ద న్యూస్‌లైన్ ప్రస్తావించగా కిరోసిన్ సరఫరాపై ఇప్పటివరకూ తమకెలాంటి ఫిర్యాదులు రాలేదని, వచ్చిన తరువాత రుజువైతే చర్యలు తీసుకుంటామని చెప్పారు. అంతేంగాకుండా ప్రత్యేక నిఘా కూడా ఏర్పాటు చేస్తామని, అక్రమంగా కిరోసిన్‌ను తరలించే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. అవసరమైతే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. -
దొరికితేనే దొంగలు..
ఒంగోలు టూటౌన్, న్యూస్‌లైన్: ప్రజాపంపిణీపై పర్యవేక్షణ కొరవడింది. పేదలకు అందాల్సిన బియ్యం పక్కదారి పడుతున్నాయి. రేషన్ బియ్యాన్ని రీసైక్లింగ్ చేసి మార్కెట్లో యథేచ్ఛగా అమ్ముకుంటున్నారు. డీలర్ల నుంచి అక్రమార్కులు కేజీ రూ.10 కొని వాటిని రీ సైక్లింగ్ చేసి జిల్లా సరిహద్దులు దాటిస్తున్నారు. దీంతో వేల టన్నుల బియ్యం నల్లబజారుకు తరలిపోతున్నాయి. రేషన్ డీలర్లపై నిఘా పెట్టాల్సిన రెవెన్యూ అధికారులు మొక్కుబడి తనిఖీలు చేసి చేతులు దులుపుకుంటున్నారు. రైస్ మిల్లర్లు కూడా అక్రమ నిల్వలకు పాల్పడుతున్నారు. డీలర్లు, రైస్‌మిల్లుల యజమానులు దొరికితేనే దొంగలు..లేకపోతే దొరల్లా తిరుగుతున్నారు. జిల్లాలో 2,085 చౌకధరల దుకాణాలుండగా 8,90,507 రేషన్‌కార్డులున్నా యి. వాటిలో 6,73,999 తెల్లకార్డులు, 52,140 అంత్యోదయ కార్డులు, అన్నపూర్ణ కార్డులు వెయ్యివరకు ఉన్నాయి. ప్రతినెలా పది వేల టన్నుల బియ్యం సరఫరా అవుతుంటాయి. కిలో రూపాయికే ఇస్తున్న ఈ బియ్యాన్ని డీలర్లు కిలో పది రూపాయలకు అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారు. పర్యవేక్షించాల్సిందిలా... ప్రతినెలా డీలర్లు డీడీలు చెల్లించిన అనంతరం ఎంఎల్ఎస్ పాయింట్ల నుంచి రేషన్‌షాపులకు లారీల ద్వారా బియ్యం సరఫరా చేస్తుంటారు. సరుకులు తీసుకెళ్లే లారీ వెంట రూట్ ఆఫీసర్ ఉండాలి. షాపులో సరుకు దించిన వెంటనే స్టాక్ రిజిస్టర్లో సంతకం చేయాలి. బియ్యం పక్కదారి పట్టకుండా రెవెన్యూ, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు నిఘా పెట్టాలి. అవసరమైతే తనిఖీలు చేయాలి. స్టాక్‌బోర్డు సక్రమంగా నిర్వహిస్తోందీ లేనిదీ చూడాలి. నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తే 6ఏ కేసులు నమోదు చేసి డీలర్లపై చర్యలు తీసుకోవాలి. జరుగుతోందిలా... రెవెన్యూ అధికారులు మొక్కుబడి తనిఖీలు నిర్వహిస్తుంటారు. ఒక్కో రేషన్‌డీలరు నెలకు రూ.700 చొప్పున మండలంలో ఎంతమంది డీలర్లుంటే అంతమందీ వసూలు చేసి తహసీల్దార్ కార్యాలయానికి పంపిస్తుంటారన్న ఆరోపణలున్నాయి. ఫలితంగా తనిఖీలు మొక్కుబడిగా చేస్తూ చేతులు దులుపుకుంటున్నారు. ఇటీవల మేల్కొన్న విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం అధికారులు బియ్యం మాఫియాపై నిఘా పెట్టింది. ఒక్క మార్చి నెలలోనే టన్నులకొద్దీ బియ్యాన్ని స్వాధీనం చేసుకుందంటే డీలర్లు ఎంత అవినీతికి పాల్పడుతున్నారో తేటతెల్లమవుతోంది. కంభం పట్టణంలో మార్చి 5న ఒక ఆటోలో తరలిస్తున్న ప్రజాపంపిణీ బియ్యాన్ని స్థానికంగా ఉన్న ఒక పార్టీ నాయకులు చూసి పట్టుకున్నారు. ఇవి మధ్యాహ్న భోజన పథకం బియ్యం అని ఆటోడ్రైవర్ తెలపడంతో అక్కడున్న వారంతా అవాక్కయ్యారు. మార్చి 17న సంతమాగులూరు మండలం ఏల్చూరు పరిసర ప్రాంతమైన కొండ మలుపుల్లో దాడులు చేసి 300 క్వింటాళ్ల బియ్యాన్ని పట్టుకున్నారు. నిందితులపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. పర్చూరులో మార్చి 14న రేషన్‌షాపులపై విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ నిర్వహించిన దాడుల్లో స్థానిక 49వ వార్డులో ఉన్న షాపులో రికార్డులు సక్రమంగాలేవని తేలింది. డీలర్‌పై 6ఏ కేసు నమోదు చేశారు. ఏప్రిల్ 21న గుడ్లూరులో ఎన్ఫోర్స్మెంట్ అధికారులు 54 బస్తాల బియ్యాన్ని పట్టుకున్నారు. అదే నెలలో మార్టూరులోని ధాన్యం మిల్లుల్లో అక్రమ నిల్వల్ని కనుగొన్నారు. సరుకు వివరాలు లేనందున రూ.14 లక్షల విలువ చేసే 200 క్వింటాళ్ల ధాన్యం, 300 క్వింటాళ్ల బియ్యం, 100 క్వింటాళ్ల నూకలను సీజ్ చేశారు. అదేవిధంగా ముండ్లమూరు మండలంలోని పసుపుగల్లు సమీపంలో ఉన్న లక్ష్మీ నరసింహ రైస్‌మిల్లుపై దాడిచేసి 3,590 బస్తాల ధాన్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. చీరాల ప్రాంతంలో కూడా పేదల బియ్యానికి రెక్కలొచ్చాయి. అనేకసార్లు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల దాడుల్లో పలువురు బియ్యం మాఫియాదారులు దొరికిపోయిన సందర్భాలున్నాయి. ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు బుద్ధిపుట్టినప్పుడు తనిఖీలు చేస్తేనే ఇలా టన్నుల కొద్దీ బియ్యం పట్టుబడుతున్నాయి. ఈ లెక్కన ఏడాదంతా ప్రజా పంపిణీ బియ్యాన్ని నిరంతరం డీలర్లు నల్లబజారుకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారో స్పష్టమవుతుంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి పేదల బియ్యం పక్కదారి పట్టకుండా క్షేత్ర స్థాయిలో చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. -
రేషన్ షాపుల్లో కాంగ్రెస్ మార్కు రాజకీయం
సాక్షి, బెంగళూరు : ప్రజలకు చౌకధరల్లో నిత్యావసర వస్తువులను సరఫరా చేసే రేషన్ షాపుల్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయాలు చేయడానికి సిద్ధమవుతోందని మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే విశ్వేశ్వర హెగ్డే కాగేరి తీవ్ర విమర్శలు చేశారు. విధానసౌధలో శనివారం ఉదయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. చౌకధరల దుకాణాల పనితీరు, లబ్ధిదారుల ఎంపిక స్థానిక సంస్థలు పర్యవేక్షించేవన్నారు. అయితే రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రేషన్‌షాపుల పర్యవేక్షణకు ‘జాగృతి సమితి’లను ఏర్పాటు చేసి అందులోని సభ్యుల ఎంపిక జిల్లా ఇన్ఛార్జ్మంత్రులకు అప్పగించిందన్నారు. జిల్లా ఇన్ఛార్జ్మంత్రులుగా కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులే ఉంటారని అందువల్ల ‘జాగృతి సమితి’ సభ్యుల్లో గరిష్టంగా కాంగ్రెస్ కార్యకర్తలకే స్థానం దక్కుతుందన్నారు. తద్వారా రాజకీయ లబ్ధి పొందాలనేది కాంగ్రెస్ వ్యూహమన్నారు. అదేవిధంగా ‘కళాశాల అభివృద్ధి సమితి’ సభ్యుల ఎంపిక కూడా జిల్లా ఇన్ఛార్జ్మంత్రుల సిఫార్సుల మేరకు జరగాలని రాష్ట్ర ప్రభుత్వం అధికారిక ప్రకటన వెలువరించిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాల వల్ల ప్రజాస్వామ్య మూలసూత్రాలైన అధికారిక వికేంద్రీకరణ, స్థానిక సంస్థలకే నిర్ణాయాధికారాలు అనే విషయాలు వ ురుగున పడిపోయే ప్రమాదం ఉందన్నారు. రాష్ట్ర ప్రాథమిక విద్యాశాఖ మంత్రి కిమ్మన రత్నాకర్‌తో పాటు అధికారుల నిర్లక్ష్యం వల్ల పాఠశాలల భవనాల మౌలిక సదుపాయాలు, విద్యాప్రమాణాల పెంపునకు ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన రూ.1,000 కోట్లకు గండిపడిందన్నారు. దీనివల్లే బోధన పరికరాల తయారీ కోసం ఉపాధ్యాయులకు ఇవ్వాల్సిన రూ.500లకు కూడా ప్రభుత్వం కోత విధించిందన్నారు. ఎటువ ంటి ముందస్తు ఆలోచనలు లేకుండానే క్షీరభాగ్య, అక్షర దాసోహ పథకంలో ఒకరోజు గోధుమ సంబంధ పదార్థాలను విద్యార్థులకు ఇవ్వడం ప్రభుత్వం ప్రవేశపెట్టిందన్నారు. పాలు కాచడానికికాని, గోధుమ పిండి, రవ్వ చేసి వాటి ద్వారా పదార్థాలు తయారు చేయడానికి కాని అవసరమైన పరికరాలు పాఠశాలకు అందించలేదన్నారు. దీని వల్ల లక్ష్యం నేరవేరడం లేదని కాగేరి వాపోయారు. ఈ విషయాలపై ముఖ్యమంత్రి వెంటనే సమీక్ష సమావేశం జరపాలని కాగేరి డివ ూండ్ చేశారు. -
రాజకీయ ‘ఉపాధి’కి రెడీ
ఒంగోలు కలెక్టరేట్, న్యూస్‌లైన్ : రాజకీయ ఉపాధికి అధికార పార్టీకి చెందిన ద్వితీయశ్రేణి నాయకులు రెడీ అవుతున్నారు. చౌకధరల దుకాణాలు తమకే కేటాయించాలని అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. జిల్లాలో ఖాళీగా ఉన్న చౌకధరల దుకాణాలను జనవరి 21వ తేదీలోపు భర్తీ చేయాలని ఆర్డీఓలకు కలెక్టర్ విజయకుమార్ ఆదేశాలు జారీ చేయడంతో గ్రామాల వారీగా ఖాళీగా ఉన్న చౌకధరల దుకాణాల జాబితాలను వారు తయారు చేస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తుండటంతో తమ వారికి దుకాణాలు కేటాయించుకునేందుకు ఎమ్మెల్యేలు స్వయంగా రంగంలోకి దిగుతున్నారు. జిల్లాలో ఇప్పటికే 2107 చౌకధరల రెడీ దుకాణాలున్నాయి. ఒంగోలు డివిజన్లో 924, కందుకూరు డివిజన్లో 751, మార్కాపురం డివిజన్లో 432 ఉన్నాయి. ప్రస్తుతం ఒంగోలు డివిజన్లో 52, కందుకూరు డివిజన్లో 83, మార్కాపురం డివిజన్లో 17 చౌకధరల దుకాణాలు ఖాళీగా ఉన్నాయి. మొత్తం 152 దుకాణాలు ఖాళీగా ఉండటంతో వాటిని భర్తీ చేసేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధమైంది. ఇప్పుడలా కాదు! గతంలో డీలర్ల నియామకాలకు సంబంధించి క్లియర్ వేకెంట్ ఉంటే పక్షం రోజుల్లో భర్తీ చేసేవారు. ప్రస్తుతం అలాంటి పరిస్థితులు కనిపించడం లేదు. మితిమీరిన రాజకీయ జోక్యంతో ఖాళీలు అంత తొందరగా భర్తీ కావడం లేదు. సమీపంలోని డీలర్‌కు ఖాళీగా ఉన్న దుకాణం ఇన్చార్జి బాధ్యతలు అప్పగిస్తున్నారు. దీంతో తమకు నిత్యావసరాలు పూర్తి స్థాయిలో అందడం లేదని కార్డుదారులే బహిరంగంగా ఆరోపిస్తున్నారు. తాము ఎప్పుడు వెళ్లినా దుకాణాలకు తాళాలు వేసే ఉంటున్నాయని కొంతమంది గ్రీవెన్స్‌లో సైతం ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఖాళీగా ఉన్న 152 చౌకధరల దుకాణాలకు వెంటనే నోటిఫికేషన్ జారీ చేసి భర్తీ చేయాలని కలెక్టర్ విజయకుమార్ ముగ్గురు రెవెన్యూ డివిజనల్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. చౌకధరల దుకాణాల నిర్వహణపై గతంలో పెద్దగా ఆదాయం ఉండేది కాదు. ఇటీవల కాలంలో ఇవి మంచి ఆదాయ వనరులుగా మారాయి. దీంతో ఎక్కువ మంది ఈ దుకాణాలు పొందేందుకు ఆసక్తి చూపుతున్నారు. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలపై తీవ్ర ఒత్తిళ్లు తీసుకొస్తున్నారు. ఎన్నికల సీజన్ కావడంతోఎమ్మెల్యేలు కూడా చౌకధరల దుకాణాల భర్తీ విషయంలో ఆచితూచీ వ్యవహరిస్తున్నారు. మొదటి నుంచి తమను కనిపెట్టుకుని ఉన్న వారికి దుకాణాలు కేటాయించాలంటూ అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. ఇప్పటికే కొంతమంది ఎమ్మెల్యేలు తమ అనుయాయుల జాబితాలు అధికారులకు ఇచ్చినట్లు తెలుస్తోంది. సొమ్ము చేసుకునేందుకు సిద్ధం చౌకధరల దుకాణాల ద్వారా సొమ్ము చేసుకునేందుకు కొంతమంది ఇప్పటి నుంచే వెంపర్లాడుతున్నారు. గతంలో బియ్యం వంటి కొన్నిరకాల వస్తువులకే చౌకధరల దుకాణాలు పరిమితమయ్యాయి. ఎక్కువ మంది వాటిపై పెద్దగా దృష్టి సారించలేదు. ప్రస్తుతం వాటికి కేటాయింపులు పెరగడం..అక్రమార్కులకు ఈ దుకాణాలు కాసుల వర్షం కురిపిస్తుండటం.. గమనించిన అధికార పార్టీ ద్వితీయ శ్రేణి నాయడులు ఈ సారి ఆ దుకాణాలు తమకు కేటాయించేలా చూడాలని ఎమ్మెల్యేలను కోరుతున్నారు. తమ కళ్లెదుటే ఆర్థికంగా ఎదుగుతున్న కొంతమంది డీలర్లను చూసి వారు కూడా అదేవిధంగా ఎదగాలని ఆరాట పడుతున్నారు. చౌకధరల దుకాణాలకు కేటాయించే బియ్యానికి బహిరంగ మార్కెట్లో మంచి డిమాండ్ ఉండటంతో వాటిని సొమ్ము చేసుకోవాలన్న ఆలోచనతో ఉన్నారు. కిలో రూపాయి బియ్యానికి పాలిష్ పెట్టించి బయట మార్కెట్లో ఎక్కువ ధరకు విక్రయించుకుంటున్న వారి వివరాలు తెసుకుంటూ తాము కూడా తాము కూడా అలాగే చెయ్యాలని ఆశపడుతున్నారు. నోటిఫికేషన్ ఎప్పుడు వెలువడుతుందా.. అని అధికార పార్టీకి చెందిన ద్వితీయ శ్రేణి నాయకులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. -
ఆధార్ నంబరు ఇస్తేనే రేషన్ !?
=తెల్లకార్డుదారులకు చెబుతున్న డీలర్లు =నంబర్ల సేకరణపై అధికారులకు ప్రభుత్వం టార్గెట్ = 75శాతం మాత్రమే పూర్తయిన సేకరణ సాక్షి, విజయవాడ : ఆధార్ నంబర్ ఇస్తేనే ఇక నుంచి సరకులు ఇస్తామంటూ రేషన్ షాపుల డీలర్లు తెగేసి చెబుతున్నారు. ఇప్పటికే జిల్లాలో 75శాతం మంది తెల్లకార్డుదారుల నుంచి ఆధార్ నంబర్లను సేకరించారు. మిగిలిన వారి ఆధార్ నంబర్లు తీసుకోవాలని సివిల్ సప్లయిస్ అధికారులకు ప్రభుత్వం ఉంచి ఉత్తర్వులు అందడంతో అధికారులు డీలర్లపై ఒత్తిడి పెంచారు. ఈ కారణంగా ఆధార్ నంబరు ఉంటేనే రేషన్ సరకులు ఇవ్వాలన్న నిబంధనను కఠినంగా అమలు చేస్తున్నట్లు తెలిసింది. వచ్చే ఫిబ్రవరి ఆఖరుకు జిల్లాలోని 11.88 లక్షల రేషన్ కార్డులకు ఆధార్ నంబర్లు అనుసంధానం చేయాలని ప్రభుత్వం ఆదేశించినట్లు సమాచారం. సుప్రీం ఆదేశాలు పట్టించుకోరా? కొంతమంది తెల్లకార్డుదారులు ఆధార్ ఐరిష్ తీయించుకోలేదని చెబుతుండటంతో డీలర్లు అసహనం వ్యక్తం చేస్తూ.. సరకులు ఇచ్చేదిలేదని అంటున్నారు. దీంతో రేషన్ షాపుల వద్ద గొడవలు జరుగుతున్నాయి. వంటగ్యాస్ తదితర సంక్షేమ పథకాలకు ఆధార్ లింకు పెట్టవద్దని ఇప్పటికే సుప్రీంకోర్టు ఆదేశించింది. అలాంటప్పుడు మీరు ఎందుకు అడుగుతున్నారంటూ కొంతమంది డీలర్లను నిలదీస్తున్నట్లు తెలిసింది. అటువంటి వారికి సరకులు ఇవ్వకుండా పౌరసరఫరాల అధికారుల వద్దకు పంపుతున్నామని డీలర్లు చెబుతున్నారు. అయితే వీరిలో కొందరు స్థానిక నేతల వద్దకు వెళ్లి సిఫార్సులు చేయించుకుంటున్నారు. కాగా పౌరసరఫరాల అధికారులు రేషన్ డీలర్ల వద్ద ఉన్న ఆధార్ నంబర్లను ఎప్పటికప్పుడు సేకరించి ఆన్లైన్లో అప్లోడ్ చేస్తున్నారు. బోగస్ కార్డులు ఏరివే తకేనట! బోగస్ కార్డులను ఏరివేసేందుకే ఆధార్ నంబర్లు అడుగుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. కొంతమంది పేదలకు రెండు, మూడు చోట్ల తెల్లరేషన్ కార్డులు ఉంటున్నాయి. వీరు గాక కొంతమంది ఆదాయం ఎక్కువ ఉన్న వారు కూడా తెల్లరేషన్ కార్డులను పొందారు. ప్రస్తుతం కార్డుదారుల ఆస్తులతో పాటు బ్యాంకు డిపాజిట్లు, పాన్‌కార్డులు తదితరాలకు కూడా ఆధార్ అనుసంధానం చేస్తున్నారు. తెల్లరేషన్ కార్డులకు ఆధార్ నంబర్లు నమోదు ప్రక్రియ పూర్తికాగానే తనిఖీలు నిర్వహించి, అదనపు కార్డులు, ఆదాయం ఎక్కువ ఉన్నవారి కార్డులను రద్దు చేస్తామని అధికారులు అంటున్నారు. దీని వల్ల ప్రభుత్వం పై ఆర్ధిక భారం తగ్గడమే కాకుండా నిజమైన పేదలకే లబ్ధి చేకూరుతుందని చెబుతున్నారు. రేషన్ ఆపడం లేదు ఆధార్ ఇవ్వని వారికి రేషన్ సరకులు ఆపేయమని ఆదేశాలైతే ఇవ్వలేదు. అయితే కార్డుదారులంతా ఆధార్ నంబర్ తప్పని సరిగా ఇవ్వాలి. ఫిబ్రవరి వరకు చూసి ఆధార్ నంబర్ ఇవ్వకపోతే వారు లేనట్లుగా భావించి, వారి వివరాలను ప్రభుత్వానికి పంపుతాం. - సంధ్యారాణి, డీఎస్వో -
ఏజేసీ.. తనిఖీలు చేసి..
కూచిపూడి, న్యూస్‌లైన్ : మొవ్వ మండలం కోసూరులో శుక్రవారం నిర్వహించిన గ్రామదర్శిని కార్యక్రమానికి అదనపు జాయింట్ కలెక్టర్ బి.ఎల్.చెన్నకేశవరావు ఆకస్మికంగా రావడంతో అధికారులు హడలిపోయారు. ఏజేసీ ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తూ ప్రశ్నించిన తీరు వణుకు పుట్టించింది. ఆయన అంగన్వాడీ, రెగ్యులర్ ఎలిమెంటరీ పాఠశాల, రేషన్‌షాపు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను పరిశీలించారు. మండల వైద్యాధికారిణి, సూపర్వైజర్పై ప్రశ్నల వర్షం కురిపించారు. సూపర్వైజర్ కొన్నింటికి జవాబు చెప్పలేకపోవడంతో ఏజేసీ ఒకింత అసహనానికి గురయ్యారు. పిల్లలతో మమేకం.. అంగన్వాడీ కేంద్రం, ఎలిమెంటరీ పాఠశాల, జిల్లా పరిషత్ హైస్కూల్లో పిల్లలతో మమేకమై సమస్యలు తెలుసుకున్నారు. వారిని ఆప్యాయంగా పలుకరించారు. ప్రీస్కూల్, ఎలిమెంటరీ, జెడ్పీ హైస్కూల్లో మధ్యాహ్న భోజన పథకం అమలుతీరును పరిశీలించారు. జెడ్పీ స్కూల్లో వంట ఏజెన్సీ నిర్వాహకులు మార్చి నెల జీతం రాలేదని మొరపెట్టుకోగా.. పరిష్కారం చూపాలని ఎంఈవోను ఆదేశించారు. రుణ అర్హత కార్డులపై పలువురు కౌలు రైతులు గోడు వెళ్లబోసుకోగా దానిపై తహశీల్దార్‌ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. వైద్యసేవలందించడంలో నిర్లక్ష్యం చూపరాదని మండల వైద్యాధికారిణి ఆర్.నాగమౌనికకు సూచించారు. గ్రామాల్లో ఎంతమంది సీజనల్ వ్యాధుల బారిన పడ్డారో తెలపాలని వైద్య సిబ్బందిని ప్రశ్నించగా వారు తెల్లమొహం వేశారు. గ్రామంలో ప్రాథమిక (ఆర్) పాఠశాల పిల్లల హాజరు తక్కువగా ఉండడాన్ని గుర్తించిన చెన్నకేశవరావు ఎంఈవోను అడిగి డ్రాపవుట్స్‌పై సమాచారాన్ని సేకరించారు. ఎంఈవో, ఉపాధ్యాయులు చెప్పిన సమాధానాలకు పొంతన లేకపోవడంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. జెడ్పీ హైస్కూల్లో శిథిలమైన ఫ్లోరింగ్‌ను బాగుచేసుకోవాలని సూచించారు. అంతకుముందు అంగన్వాడీ కేంద్రంలో తుప్పుపట్టిన ఆట పరికరాలు, పొదలతో భయంకరంగా ఉన్న ఆవరణను పరిశీలించి అధికారులకు క్లాస్ తీసుకున్నారు. గ్రామదర్శిని మండల బృందం గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాలు, రేషన్ దుకాణాలు, ఐదు ప్రాథమిక పాఠశాలలు, ఒక జెడ్పీ పాఠశాల, సబ్‌సెంటర్‌ను పరిశీలించింది. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి కె.ఎన్.నాగేశ్వరరావు, ఎంపీడీవో వై.పిచ్చిరెడ్డి, తహశీల్దార్ జి. భద్రుడు, ఐసీడీఎస్ పీవో టి.గాయత్రీదేవి, ఎంఈవో పరసా సోమేశ్వరరావు, ఆర్ఐ ఏ శ్రీనివాసరావు, కార్యదర్శి కే పిచ్చయ్య, వీఆర్వో వీర్ల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
పంట పండింది
= బియ్యం ధరలు తగ్గు ముఖం = గత ఏడాది కంటే 40 వేల టన్నులు అధికం = ఈసారి వర్షాలు బాగా పడటమే కారణం = ‘బ్లాక్’ వ్యాపారుల్లో గుబులు = మార్కెట్లోకి పాత నిల్వలు = రూ.60 నుంచి రూ.45కు త గ్గనున్న ‘సోనా’ = బ్లాక్ మార్కెట్లో ‘అన్న భాగ్య’ బియ్యం = అధికారులు, డీలర్లు, వ్యాపారులు, దళారులు కుమ్మక్కు = వంద చౌక దుకాణాల డీలర్‌షిప్‌లను రద్దు చేసిన సర్కార్ సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ట్రంలో ఇన్నాళ్లూ బియ్యం ధరలతో ఠారెత్తిపోయిన వినియోగదారులకు శుభ వార్త. ఈ ఖరీఫ్ సీజన్లో వరి ఉత్పత్తి గణనీయంగా ఉండడంతో బియ్యం ధరలు తగ్గనున్నాయి. వ్యవసాయ శాఖ అంచనాల ప్రకారం 40.24 లక్షల టన్నుల వరి ధాన్యం దిగుబడి ఉంటుంది. గత ఏడాదితో పోల్చుకుంటే 40 వేల టన్నులు అధికం. ఈసారి వర్షాలు బాగా పడడంతో 10.45 లక్షల హెక్టార్లలో వరి నాట్లు వేశారు. గత ఏడాది కంటే సుమార లక్ష హెక్టార్లు ఎక్కువ. వచ్చే నెలలో పంట నూర్పిడి ప్రారంభమవుతుంది. దీంతో వర్తకులు గత కొద్ది వారాలుగా పాత నిల్వలను మార్కెట్‌కు విడుదల చేస్తున్నారు. దరిమిలా ధరలు క్రమంగా తగ్గు ముఖం పడుతున్నాయి. జనం మెచ్చే సోనా మసూరి బియ్యం సగటున రూ.60 నుంచి రూ.45కు తగ్గింది. ఈ సారి వరి దిగుబడి అంచనాల కంటే పది శాతం ఎక్కువగానే ఉంటుందని భావిస్తున్నారు. పంట నూర్పిడి తర్వాత మార్కెట్‌ను బియ్యం ముంచెత్తడం ఖాయమని వర్తకులు చెబుతున్నారు. తదనంతరం బియ్యం ధర మరింతగా తగ్గవచ్చని వారు కూడా అంచనా వేస్తున్నారు. భారీ వర్షాల కారణంగా రాష్ర్టంలో విసృ్తతంగా వర్షాలు పడడంతో జలాశయాలన్నీ నిండిపోయాయి. కనుక రైతులు రెండో పంట పెట్టడానికి సిద్ధమవుతున్నారు. వచ్చే ఏడాది మార్చి లేదా ఏప్రిల్‌లో ఈ పంటలు చేతికందతాయి. దీని వల్ల కూడా ధరలు మరింతగా తగ్గవచ్చని భావిస్తున్నారు. అడ్డదారిలో ‘అన్న భాగ్య’ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన రూపాయి కిలో బియ్యం పథకం ‘అన్న భాగ్య’ అక్రమాలకు నిలయంగా మారుతోంది. ఆహార, పౌర సరఫరాల శాఖ అధికారులు, డీలర్లు, బియ్యం వర్తకులు, దళారులు కుమ్మక్కై అక్రమాలకు పాల్పడుతున్నారని ప్రభుత్వానికి సమాచారం అందింది. అన్న భాగ్య పథకానికి అవసరమైన బియ్యం లభించక పోవడంతో ప్రభుత్వం వర్తకుల ద్వారా నేషనల్ కమోడిటీస్ అండ్ డిరెవైటివ్స్ ఎక్స్ఛేంజ్ (ఎన్‌సీడీఎక్స్) నుంచి కొనుగోలు చేస్తోంది. ఈ పథకానికి నెలకు 2.46 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం అవసరం కాగా కేంద్రం నుంచి 1.73 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే అందుతోంది. మిగిలిన బియ్యాన్ని ఎన్‌సీడీఎక్స్ నుంచి కొనుగోలు చేయాల్సి వస్తోంది. అన్న భాగ్య బియ్యాన్ని నకిలీ బిల్లుల ద్వారా దారి మళ్లిస్తున్నారు. రేషన్ షాపుల స్థాయిలోనే ఈ విధంగా జరుగుతుండడంతో ఇటీవల ఆహార, పౌర సరఫరా శాఖ అధికారులు తుమకూరు, బెల్గాం, మైసూరు, హాసన, హుబ్లీలలో వంద చౌక దుకాణాల డీలర్‌షిప్‌లను రద్దు చేశారు. -
పామాయిల్ కోత
సాక్షి, రంగారెడ్డి జిల్లా: రేషన్ లబ్ధిదారులకు సర్కారు పండుగ షాక్ ఇచ్చింది. దసరాలాంటి ముఖ్య పండుగల సమయంలో ప్రత్యేక ప్రోత్సాహకం కింద రేషన్ వినియోగదారులకు అదనపు కోటాకు మంగళం పాడిన ప్రభుత్వం.. తాజాగా అసలు కోటాకే ఎసరు పెట్టింది. సమైక్యాంధ్ర ఉద్యమ నేపథ్యంలో జిల్లాకు పూర్తిస్థాయి పామాయిల్ కోటా చేరలేదు. చివ రివరకు కోటా వస్తుందంటూ బుకాయించిన పౌర సరఫరాల శాఖ ఉన్నతాధికారులు.. తీరా పంపిణీ సమయంలో కోటా వచ్చే అవకాశం లేదంటూ చేతులెత్తేశారు. దీంతో జిల్లాలో సగానికిపైగా లబ్ధిదారులకు ఈ నెల రేషన్ సరుకుల్లో పామాయిల్ నూనె తీసుకునే భాగ్యం లేకుండా పోయింది. జిల్లా వ్యాప్తంగా 10.24లక్షల రేషన్ కార్డులున్నాయి. ఇందులో తెల్ల రేషన్ కార్డుదారులు 9.58 లక్షలు, 66 వేల అంత్యోదయ రేషన్ కార్డుదారులున్నారు. వీరికిగాను ప్రతి నెల 1,024 కిలోలీటర్ల పామాయిల్ నూనెను పౌర సరఫరాల శాఖ సరఫరా చేస్తోంది. ఇందుకుగాను కృష్ణపట్నం, కాకినాడ ఓడరేవుల నుంచి కోటా ఇక్కడికి వస్తుంది. అయితే కోటా వచ్చే ప్రాంతాల్లో సమైక్యాంధ్ర ఉద్యమ నేపథ్యంలో రవాణా వ్యవస్థ నిలిచిపోయింది. దీంతో గత మూడు నెలలుగా పామాయిల్ కోటా అరకొరగానే వస్తోంది. దీంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ఇటీవల జిల్లా యంత్రాంగం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లింది. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామంటూ హామీ ఇచ్చారు. అయితే నెలాఖరునాటికి కూడా ఎలాంటి ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టలేదు. దీంతో ఈ నెలకు రావాల్సిన 1,024 కిలోలీటర్ల కోటాలో కేవలం 526 కిలోలీటర్ల నూనె మాత్రమే జిల్లాకు చేరింది. వీటిని ప్రాధాన్యత ప్రకారం అధికారులు రేషన్ డీలర్లకు చేరవేస్తున్నారు. 500 కిలోలీటర్ల పామాయిల్ హుష్..! ఈ నెలలో జిల్లాకు రాావాల్సిన కోటాలో కేవలం 526 కిలోలీటర్ల పామాయిల్ రావడంతో మిగతా 500 కిలోలీటర్ల కోటాపై సందిగ్ధం నెలకొంది. సాధారణంగా నెల ప్రారంభం నాటికే ఈ కోటా రేషన్ దుకాణాలకు చేరితే పంపిణీ ప్రక్రియ సులభతరమయ్యేది. అయితే ఈ నెలలో దసరా పండుగ ఉండడంతో పామాయిల్‌కు డిమాండ్ ఉంటుంది. అయితే ఇప్పటివరకు అందుబాటులో ఉన్న కోటాను మాత్రమే రేషన్ దుకాణాలకు చేరవేశారు. మిగిలిన కోటా ఈ నెలలో వచ్చే అవకాశం లేదని అధికారులు అభిప్రాయపడుతున్నారు. దీంతో 500 కిలోలీటర్ల కోటా ఇక లేదనే తెలుస్తోంది. గత మూడు నెలలుగా జిల్లాకు పామాయిల్ కోటా అరకొరగా వస్తుండడంతో ఈ నెలలో డీలర్లు కూడా 70 శాతమే స్పందించి డీడీలు కట్టగా.. వారిలో 52 శాతం మందికి మాత్రమే అరకొరగా పామాయిల్ కోటా చేరింది. -
అధికారుల జబర్దస్తీ
తిమ్మాపూర్, న్యూస్‌లైన్: పౌర సరఫరాల సరుకులను రేషన్ షాపుల్లోకి తరలించడానికి వాహనదారులపై అధికారులు జబర్దస్తీ చేస్తున్నారు. సరుకులను సకాలంలో రేషన్‌షాపులకు తరలించాలని జాయింట్ కలెక్టర్ ఇటీవల ఆర్డీవోలకు, సివిల్ సప్లై అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. నెలాఖరులోగా బియ్యంతోపాటు అమ్మహస్తం సరుకులు రేషన్ షాపులకు రవాణా అయితే ఒకటో తేదీ నుంచి లబ్ధిదారులకు సరఫరా అవుతాయనేది ముఖ్య ఉద్దేశం. లక్ష్య సాధన కోసం, ఉన్నతాధికారుల మెప్పు పొందాలని అధికారులు నిబంధనలకు పాతరేస్తున్నారు. గోడౌన్ నుంచి షాపులకు సరుకుల రవాణా కోసం ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఇలా చేయకుండా అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మెటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్లు(ఎంవీఐలు) రోడ్డుపైకి వచ్చి వాహనాలను తనిఖీ చేస్తూ పత్రాలను తీసుకుంటున్నారు. ఆ తర్వాత వాటిని బలవంతంగా పౌరసరఫరాల సరుకుల రవాణాకు మళ్లిస్తున్నారు. వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులున్నా ఏమీ చేసే పరిస్థితి లేక అధికారులకు భయపడి వాహనాలను పెడ్తున్నారు. ఇందులో కూలీలు బలైపోతున్నారు. ఎంవీఐలు లారీలు, వ్యాన్లను ఆపుతూ సరుకులు రవాణా చేసి వస్తేనే వదులుతామని ఒత్తిడి తీసుకొచ్చి పత్రాలను తీసుకుంటున్నాని డ్రైవర్లు చెబుతున్నారు. తమ బాధలు చెప్పినా వినిపించుకోవడం లేదని వాపోతున్నారు. తాము కొన్ని కిరాయిలు మాట్లాడుకుని మాట ఇచ్చి సమయానికి వెళ్లలేకపోతున్నామని చెప్పారు. దూర ప్రాంతాలకు వెళ్లే లారీలు, వ్యాన్లను పట్టుకుంటున్నారని తెలిపారు. గురువారం హైదరాబాద్ నుంచి సుల్తానాబాద్ మండలం కాట్నపల్లికి వెళ్తున్న బూడిద లారీని పట్టుకుని అల్గునూర్ గోడౌన్‌కు తరలించారు. అయితే తినడానికి ఉపయోగించే బియ్యం, చక్కెర, ఇతర సరుకులను తరలించడానికి బూడిద లారీని ఉపయోగించారు. బూడిద రవాణా కోసం వచ్చిన ఒరిస్సా కూలీలు తమ పొట్టకొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక రోజు కూలి వృథా అవుతుందని వాపోయారు. లారీలు లోడింగ్ ఆలస్యం కావడంతో గంటల తరబడి గోడౌన్లోనే పడిగాపులు కాస్తున్నామని డ్రైవర్లు ఆవేదన చెందుతున్నారు. లోడింగ్, అన్లోడింగ్ సమస్యతో ఒక రోజు వృథా అవుతుండగా, కిరాయి గిట్టుబాటు కావడం లేదని ఆందోళనకు గురవుతున్నారు. ప్రతి నెలాఖరున పది రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుందని చెబుతున్నారు. ఇప్పటికైనా వాహనదారులను ఇబ్బందులకు గురి చేయకుండా ప్రత్యేకంగా వాహనాలను ఏర్పాటు చేసుకోవాలని లారీలు, వ్యాన్ల డ్రైవర్లు కోరుతున్నారు.