సాక్షి, కామారెడ్డి జిల్లా: రేషన్ బియ్యం పథకంలో కేంద్రం వాటా ఎంత? రాష్ట్రం వాటా ఎంత? లబ్ధిదారుల వాటా ఎంత? అంటూ.. కామా రెడ్డి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రశ్నించా రు. కేంద్రమంత్రి వరుసగా వేసిన ప్రశ్నలతో కలెక్టర్ కాస్త తడబడ్డారు. దీంతో మంత్రి అసహనం వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలు అమలు చేస్తున్న పథకాలపై జిల్లా పాలనాధికారికి స్పష్టత లేకపోతే ఎలా? అని ప్రశ్నించారు.
శుక్రవారం బీర్కూర్ మండల కేంద్రంలోని ఓ రేషన్ దుకాణం వద్ద లబ్ధిదా రులతో కేంద్ర మంత్రి మాట్లాడారు. ఎన్ని కిలోల బియ్యం ఇస్తున్నారని అడిగి తెలుసుకు న్నారు. ఈ సందర్భంగానే పేదలకు చౌకధ రల దుకాణాల ద్వారా పంపిణీ చేస్తున్న బియ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటా ఎంత? అని కలెక్టర్‌ను అడిగారు. ఆయన సరైన సమాధానం చెప్పకపోవడంతో అరగంట సమయం తీసుకుని చెప్పాలని నిర్మలా సీతారామన్ సూచించారు. తర్వాత కేంద్రం బియ్యం పంపిణీకి రూ.28 ఖర్చు చేస్తోందని, ప్రజలు ఒక రూపాయి ఇస్తున్నారని, మిగతా నాలుగైదు రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తోందని వివరించారు.
ప్రధాని ఫొటోలు పెట్టాలి
కోవిడ్ నేపథ్యంలో నిరుపేదలకు ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం బియ్యం ఉచితంగా పంపిణీ చేస్తోందని సీతారామన్ అన్నారు. మోదీ ప్రభుత్వం పేదలకు ఉచితంగా రేషన్ ఇస్తున్న విషయాన్ని లబ్ధిదారులకు ఎందుకు చెప్పలేక పోతున్నారన్నారు. రేషన్ దుకాణాల దగ్గర ప్రధాని నరేంద్రమోదీ ఫొటో ఎందుకు లేదని ప్రశ్నించారు. వెంటనే ప్రధాని ఫ్లెక్సీని ఏర్పాటు చేయాలని లేకపోతే తానే ఏర్పాటు చేయిస్తానని స్పష్టం చేశారు. తెలంగాణ వ్యాప్తంగా అన్ని రేషన్ దుకాణాల్లో ప్రధాని మోదీ ఫోటోలు పెట్టాలన్నారు. అంతకు ముందు బీర్కూర్ గ్రామానికి చెందిన విద్యా ర్థులతో ఆమె కొద్దిసేపు ముచ్చటించారు.
Comments
Please login to add a commentAdd a comment