Collector
-
పిల్లలకు పాఠాలు చెబుతున్న కలక్టర్
-
నిరాడంబరంగా చెంగల్పట్టు కలెక్టర్ వివాహం
అన్నానగర్: చెంగల్పట్టు జిల్లా కలెక్టర్ అరుణ్‌రాజ్ వివాహం తిరుపోరూర్ మురుగన్ ఆలయంలో సాదాసీదాగా జరిగింది. చెంగల్పట్టు జిల్లా కలెక్టర్ అరుణ్‌రాజ్. ఇతను రిటైర్డ్ ఐపీఎస్ అధికారి సముద్రపాండియన్ కుమారుడు. ఇతనికి చైన్నెకి చెందిన డాక్టర్ మేఘనాథన్ జయంతిల కుమార్తె కౌశిక ఉన్నారు. ఇరు కుటుంబాల అంగీకారంతో రెండు నెలల క్రితం కౌశిక నిశ్చితార్థం కూడా జరిగింది. అనంతరం సోమవారం తిరుపోరూర్ మురుగన్ ఆలయ ఉత్సవ మండపంలో కలెక్టర్ ఎస్.అరుణ్‌రాజ్, డాక్టర్ కౌశిక వివాహం సాదాసీదాగా సాగింది. -
పేదింటికి కలెక్టరచ్చిండు... పిల్లగాన్ని చదుకోనికి నిద్ర లేపిండు
తెల్లారింది లేవండోయ్ కొక్కురోకో !!పదోక్లాస్ పిల్లలను నిద్ర లేపుతున్న యాదాద్రి కలెక్టర్ హనుమంత రావుఅప్పుడే తెల్లారుతోంది...కోళ్లు కూస్తున్నాయి... సూరీడు రాలేదు.. ఇంకా మంచు తెరలు తొలగనే లేదు. ఆ చిన్న ఊళ్ళోకి పెద్ద కారొచ్చింది. ఇంత చిన్న పల్లెలోకి ఇంత పొద్దుగాల ఎవరచ్చిర్రా అని తెల్లారి పొలం పనులకు వెళ్ళే రైతులు..నీళ్ళకోసం బావులవద్దకు వెళ్ళే మహిళలు విస్తుపోయి చూస్తున్నారు. కార్లోంచి టిప్ టాప్ గా దిగిన ఒక ఆఫీసర్ ఆ ఊళ్ల పదోక్లాస్ చదూతున్న పిల్లవాడు ఇంటికి వెళ్ళి.. టక్.. టక్ అని డోర్ కొట్టారు.. ఏందబ్బా ఇంత మబ్బులల్ల ఇంటికి ఎవరొచ్చిర్రు.. చుట్టాలు ఇంత వేకువనే వస్తారా... అంటూ పిల్లగాని తల్లి విజయలక్ష్మి తలుపు తీసింది.. ఎదురుగా ఎవరో ఆఫీసర్...అమ్మో ఎవరాయన ఇంత ఉదయం ఎందుకు వచ్చాడు అనుకుంటూ విస్తుపోయి చూస్తుండగా ఆయనే ముందుగా మాట్లాడారు...అమ్మా నేను మీ జిల్లా కలెక్టర్‌ను.. మీ అబ్బాయి భరత్ చంద్ర పదోక్లాస్ చదువుతున్నాడు కదా..ఎలా ఉన్నాడు.. బాగా చదువుతున్నాడా..బాధ్యతగా ఉంటున్నాడా.. పొద్దున్నే మబ్బులల్ల నిద్ర లేపండి..ఉదయాన్నే చదివించండి...పొద్దీకి టీవీలు. ఫోన్లు చూడనివ్వకండి.. పదో క్లాస్ చాలా ముఖ్యం కదమ్మా.. బాగా చదివించండి.. అంటూ ఒక చైర్..ఎగ్జామ్ ప్యాడ్..పెన్నులు వంటివి అందజేశారు..అసలు కలెక్టర్ ఏందీ..తమ ఇంటికి రావడం ఏందీ అని ఆ తల్లి విజయలక్ష్మి నోట మాట రాలేదు..అసలిదంతా ఏమిటి అని ఆమె షాక్ లో ఉండిపోయింది.. తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఈ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. విద్యార్థులకు పదోక్లాస్ అనేది ఎంత ముఖ్యమో అందరికీ తెలుసు.ఈ నేపథ్యంలో టెన్త్ క్లాస్ పిల్లలను ప్రోత్సహించేందుకు.. భవిష్యత్తులో ఉన్నత చదువులు చదివేందుకు పదో క్లాస్ అనేది తొలిమేట్టు అనే విషయాన్ని తల్లిదండ్రులకు తెలియచెప్పేందుకు తానే నడుంబిగాంచారు. అందులో భాగంగా ఆయన సంస్థాన్ నారాయణపురం మండలంలోని కంకణాలు గూడెం గ్రామానికి వెళ్లి తెల్లవారి ఐదు గంటలకే విద్యార్థులు నిద్రలేపే వేకప్ కాల్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆ గ్రామంలో పదో క్లాస్ చదువుతున్న పిల్లలు పిల్లలకు వెళ్లి వారు చదువుతున్న తీరు గురించి తల్లిదండ్రులతో ఒక చేసి పిల్లల పట్ల మరింత శ్రద్ధ వహించాలని సూచించారు. అంతేకాకుండా భరత్ చంద్ర అనే విద్యార్థి ఇంటికి వెళ్లి ఆయన పదవ క్లాస్ పరీక్షలు పూర్తయ్యే వరకు నెలకు రూ.5000 రూపాయలు ఖర్చుల నిమిత్తం తాను చెల్లిస్తానని చెబుతూ.. వెనువెంటనే రూ. 5000 అందజేశారు. అంతేకాకుండా భరత్ ఉన్నత చదువులకు అయ్యే ఖర్చును తాను భరిస్తానని.. ఆయన జీవితం స్థిరపడేంతవరకు తాను తోడుగా ఉంటానని కలెక్టర్ హామీ ఇచ్చారు. తెల్లవారేసరికి గ్రామంలో కలెక్టర్ పర్యటన ఓ విద్యార్థి ఇంట్లో ఆయన కూర్చుని తల్లిదండ్రులతో మాట్లాడడం క్షణాల్లో ఊరంతా పాకేసింది. మన ఊరు అబ్బాయి భరత్ ఇంటికి కలెక్టర్ సాబ్ వచ్చాడంట.. చదువుకోడానికి డబ్బులు ఇచ్చారట.. పెన్నులు కుర్చీ ప్యాడ్ వంటివి ఇవ్వడంతో పాటు భవిష్యత్తులో ఆయన ఎంత చదివితే అంత చదివిస్తానని కూడా మాటిచ్చాడంట.. నిజంగా ఇంతలా ప్రోత్సహించే అధికారులు ఉంటే పిల్లలు ఎందుకు చదువుకోరు అంటూ గ్రామస్తులు అబ్బాయి తో పాటు కలెక్టర్‌ను సైతం అభినందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ హనుమంత రావు మాట్లాడుతూ విద్యార్థి దశలో పిల్లలు బాధ్యతగా ఉండాలని.. వృధా కాకుండా తెల్లవారు జామునే లేచి చదువుకోవాలని.. అలాంటప్పుడే ఉన్నత స్థానాలకు చేరుతారని ఉద్బోధించారు.. చదువుకునే పిల్లలకు తాను ఎప్పుడూ అండగా ఉంటానని హామీ ఇచ్చి ముందుకు కదలారు... ఆయన వెళుతున్న వైపే చూస్తూ భరత్... ఆయన తల్లి విజయలక్ష్మి.. చూస్తూ నిలబడిపోయారు. సిమ్మాదిరప్పన్న -
వికసిస్తా.. విరుచుకుపడతా!
సాక్షిప్రతినిధి,కరీంనగర్: కరీంనగర్లో శుక్రవారం మంత్రి పొంగులేటి ఉన్నతాధికా రులపై వ్యక్తంచేసిన ఆగ్రహం, మందలించేందుకు వాడిన పదాలు కలెక్టర్ పమేలా సత్పతిని బాధించాయని.. ఆమె తీవ్ర మనోవేదనకు గురవుతున్నారని కలెక్టరేట్ వర్గాలు తెలిపాయి. మరోవైపు ఆమె తన ఇన్‌స్టాలో పెట్టిన భావోద్వేగ పోస్టు ఆమె లోలోపల కుమిలిపోతున్నారనడానికి నిదర్శనమని పలువురు ఉదహరిస్తున్నారు. కాగా.. కలెక్టర్ ఇన్‌స్టాలో పెట్టినపోస్టు శనివారం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటనలో మంత్రి శ్రీనివాస్‌రెడ్డి తీరును తప్పుపడుతూ సామాజిక ఉద్యమకారుడు బక్క జడ్సన్ జాతీయ మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. మంత్రి బహిరంగంగా కలెక్టర్‌ను అవమానకర రీతిలో మాట్లాడారంటూ పేర్కొన్నారు. అసలేం జరిగిందంటే..శుక్రవారం పలుఅభివృద్ధి కార్యక్రమాల ప్రారంభానికి కేంద్ర కేబినెట్ మినిస్టర్ ఖట్టర్, కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్, రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి సీపీ మహంతి ప్రొటోకాల్ పాటించలేదని, నామమాత్రంగా వ్యవహరించారని మంత్రులు చిన్నబుచ్చుకున్నారు. బీజేపీ నాయకులూ అదే అభిప్రాయం వ్యక్తంచేశారు. అదే సమయంలో తోపులాట జరిగి.. ఓ గన్‌మెన్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై పదేపదే పడటంతో ఆయన ఆగ్రహించారు. ‘వాట్ దిస్ నాన్ సెన్స్, ఎక్కడ మీ ఏసీపీ, ఎక్కడ సీపీ? కామన్సెన్స్ లేదా? అని కలెక్టర్ ఎదుటే ఆగ్రహాన్ని ప్రదర్శించారు. ఏర్పాట్ల విషయంలో కలెక్టర్ ఎంత జాగ్రత్తగా ఉన్న మంత్రి అసంతృప్తి, ఆగ్రహం ఆమెను బాధించాయని పలువురు బీజేపీ నాయకులు పేర్కొన్నారు. ఈ క్రమంలోనే తన ఇన్‌స్టాలో ‘నేను మహిళను.. సందర్భానికి తగినట్లుగా ఉంటాను. మండిపడగలను, వికసించగలను, విరుచుకుపడగలను, మంచులా గడ్డకట్టిపోగలను, అవసరమైతే కరగిపోగలను’’ అంటూ ఆంగ్లంలో పోస్ట్ చేశారని అంటున్నారు. అయితే, ఈ పోస్టు కొన్ని నిమిషాల్లోనే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పలుమీడియాలోనూ వార్తగా వచ్చింది. తర్వాత ఆమె పెట్టినట్లుగా చెబుతున్న పోస్టు ఆమె ఇన్‌స్టాఖాతాలో కనిపించలేదు. ఈ విషయమై కలెక్టర్ పమేలా సత్పతిని సంప్రదించేందుకు ఫోన్ ద్వారా ‘సాక్షి’ ప్రయత్నించగా ఆమె అందుబాటులోకి రాలేదు. పోలీసుల వల్ల తనకు పదిమందిలో పరాభవం ఎదురైందని, ఆమె నొచ్చుకున్నారని పలువురు కలెక్టరేట్ సిబ్బంది వ్యాఖ్యానిస్తున్నారు.వాటిజ్ దిస్...వేర్ ఈజ్ సీపీ?అధికారులు ప్రొటోకాల్ పాటించాలికరీంనగర్ కార్పొరేషన్: జిల్లా అధికారులు ప్రొటోకాల్ పాటించాలని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి హి తవు పలికారు. కేంద్ర పట్టణాభివృది్ధశాఖ మంత్రి ఖట్టర్ నగరంలో పర్యటిస్తే అర్బన్ డెవలప్మెంట్ చైర్మన్‌గా ఉన్న తనకు ప్రొటోకాల్ వర్తింపజేయకపోవడం సరికాదన్నారు. శనివారం నగరంలోని ఆర్అండ్బీ అతిథిగృహంలో మాట్లాడుతూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని కూడా ఇబ్బంది పెట్టారన్నారు. మరోసారి ప్రొటోకాల్ ఉల్లంఘన జరగకుండా చూసుకోవాలని సూచించారు. -
వాటిజ్ దిస్...వేర్ ఈజ్ సీపీ?
సాక్షిప్రతినిధి,కరీంనగర్: ‘వాటిజ్ దిస్ నాన్సెన్స్...వేర్ ఈజ్ సీపీ...వేర్ ఈజ్ ఏసీపీ...కామన్సెన్స్ లేదు...ఇదేం పద్ధతి’ అంటూ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కలెక్టర్ పమేలా సత్పతిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హౌసింగ్‌బోర్డుకాలనీలో 24/7 నీటి సరఫరాను ప్రారంభిస్తున్న క్రమంలో గన్మెన్లు కొందరు పదేపదే పొంగులేటిని తోసివేయడంతో ఆయన తీవ్ర అసహనానికి గురయ్యారు. కేంద్ర, రాష్ట్ర మంత్రుల పర్యటనలో ఏర్పాట్లపై ఆయన తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఇదేం పద్ధతంటూ కలెక్టర్‌పై మండిపడ్డారు. సీపీ ఎక్కడా, ఏసీపీ ఎక్కడా అంటూ నిలదీశారు. అయితే వారెవరు అక్కడ లేకపోవడంతో ఆయన మరింత ఆగ్రహానికి గురయ్యారు. pic.twitter.com/nZwEHGf6Dj— Journalist Vijaya Reddy (@VijayaReddy_R) January 24, 2025 -
కలెక్టర్ పై కాకాణి సంచలన కామెంట్స్
-
డీఎస్పీదే తప్పు: సీఎంకు కలెక్టర్ నివేదిక
తిరుపతి: తిరుపతి తొక్కిసలాటలో పెనువిషాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ దుర్ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబుకు జిల్లా కలెక్టర్ నివేదిక సమర్పించారు. డీఎస్పీ అత్యుత్సాహం వల్ల ఒక్కసారిగా భక్తులు రావడంతో తొక్కిసలాట జరిగిందని అందులో పేర్కొన్నారు. డీఎస్పీ తొక్కిసలాట జరిగే సమయంలొ సరిగా స్పందించకపోవటంతోనే ఈ ఘటన చోటుచేసుకున్నట్లు కలెక్టర్ తెలిపారు. అయితే ఈ ప్రమాద సమయంలో ఎస్పీ సుబ్బారాయుడు వెంటనే సిబ్బందితో వచ్చి భక్తులకు సాయం చేసినట్లు చెప్పారు. అంబులెన్స్ వాహనాన్ని టికెట్ కౌంటర్ బయట పార్క్ చేసి డ్రైవర్ వెళ్లిపోయాడు. 20 నిమిషాల పాటు డ్రైవర్ అందుబాటులోకి రాలేనట్లు వివరించారు. ఈ విషాద ఘటన డీఎస్పీ, అంబులెన్స్ డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే జరిగిందని కలెక్టర్ సీఎంకు నివేదిక ఇచ్చారు. -
మంత్రి నాదెండ్లకు షాక్..!
-
‘సీజ్ ద షిప్’ ఎపిసోడ్లో బిగ్ ట్విస్ట్!
కాకినాడ, సాక్షి: సీజ్ ద షిప్ ఎపిసోడ్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. స్టెల్లా షిప్ సీజ్ చేయడం కుదరదని కాకినాడ కలెక్టర్ షాన్ మోహన్ పరోక్షంగా తేల్చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హైప్ నేపథ్యంలో .. ఈ ఎపిసోడ్లో నెక్ట్స్ ఏం జరగబోతుందా? అనే ఉత్కంఠ నెలకొంది. ‘‘ స్టెల్లా ఎల్ పనామా షిప్ లో12 శాంపిల్స్ సేకరించాం. షిప్ లో 640 టన్నుల రేషన్ బియ్యం ఉన్నాయని మొదట అనుకుంటే ..పరీక్షలు చేసిన తర్వాత 1,320 టన్నులు రేషన్ బియ్యం ఉన్నట్లు తేలింది. ఆ బియ్యాన్ని మొదట ఆన్ లోడ్ చేస్తాం. అసలు ఏ రైస్ మిల్లు నుంచి ఆ బియ్యం వచ్చాయో తేలాలి. .. ప్రస్తుతానికి ఆ లోడ్ సత్యం బాలాజీ అనే ఎక్సపర్టర్స్ కి చెందినది గా గుర్తించాం. వాళ్లు ఎక్కడి నుంచి బియ్యం తీసుకొచ్చారు, ఎక్కడ నిల్వ చేశారనేదానిపై దర్యాప్తు జరుగుతోంది. కాకినాడ పోర్టులో ఇంకా లోడ్ చేయాల్సిన బియ్యం 12వేల టన్నులు ఉన్నాయి. వాటిలో ఎక్కడా పీడీఎస్ బియ్యం లేవని నిర్ధరించుకున్న తర్వాతే లోడింగ్‌కు అనుమతిస్తాం. .. కాకినాడ యాంకేజ్ పోర్టు, డీప్సీ వాటర్ పోర్టులో కూడా మరో చెక్‌పోస్టు ఏర్పాటు చేశాం. ఒక్క గ్రాము పీడీఎస్ బియ్యం కూడా దేశం దాటకుండా చర్యలు తీసుకుంటాం. షిప్‌ను ఎప్పుడు రిలీజ్ చేయాలనే దానిపై త్వరలో నిర్ణయం తీసుకుంటాం. షిప్‌ను సీజ్ చేయడం అంత సులువుగా జరిగే పని కాదు’’ అని కలెక్టర్ మీడియా ద్వారా స్పష్టత ఇచ్చారు. ఇదిలా ఉంటే.. గత నెల 29న అప్పటికే అధికారులు పట్టుకున్న రేషన్ బియ్యపు అక్రమ రవాణా షిప్ వద్దకు చేరుకున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. సీజ్ ద షిప్ అంటూ ఆదేశాలిచ్చిన సంగతి తెలిసిందే. ఆ టైంలో.. తనను ఎవరూ పట్టించుకోలేదని అధికార యంత్రాంగంపైనా ఆయన చిర్రుబుర్రులాడారు కూడా.ఇదీ చదవండి: అందులో భాగంగానే తెరపైకి సీజ్ ద షిప్! -
షిష్‌లోకి ఎలా వచ్చాయో తేలుస్తాం.. రేషన్ రైస్‌పై కలెక్టర్ రియాక్షన్
సాక్షి, కాకినాడ జిల్లా: పోర్టు అధికారి ఆదేశాలతోనే స్టెల్లా షిప్ సీజ్ చేశామని కాకినాడ కలెక్టర్ షాన్ మోహన్ తెలిపారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గత నెల 27న స్టెల్లా షిప్లో రేషన్ బియ్యం దొరికాయి. రేషన్ బియ్యం ఎవరు సప్లై చేశారనేది విచారణ చేస్తున్నాం.’’ అని వెల్లడించారు.‘‘రేషన్ బియ్యం విషయంలో జిల్లా అధికారుల వైఫల్యం ఉంది. షిప్ ఆపే అధికారం కస్టమ్స్ అధికారులకు ఉంటుంది. షిప్లో స్టాక్‌పై పోర్ట్ అధికారులకు అధికారం ఉంటుంది. షిప్ సీజ్ చేయాలంటే హైకోర్టుకు వెళ్లాల్సిఉంటుంది. గోడౌన్ నుంచి షిప్ వరకు రైస్ ఎలా చేరిందో తేలాలి. కెన్‌స్టార్ షిప్లో బాయిల్డ్ రైస్‌ను గుర్తించాం. రేపు, ఎల్లుండి(బుధ,గురు) టీంలు క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తారు’’ అని కలెక్టర్ చెప్పారు.ఇదీ చదవండి: పవన్ ‘న్యూట్రల్’ గేర్! -
కేటీఆర్ క్షమాపణలు చెప్పాల్సిందే: ఐఏఎస్‌ల సంఘం
సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యల పట్ల ఐఏఎస్ అధికారుల సంఘం అభ్యంతరం వ్యక్తం చేసింది. సిరిసిల్ల కలెక్టర్‌పై కేటీఆర్ ఆరోపణలు సరికాదంటూ ఖండించింది.సివిల్ సర్వీసెస్ అధికారిపై కేటీఆర్ ఆరోపణలు నిరాధారం. ఇలాంటి ఆరోపణలతో వ్యవస్థలపై చెడు ప్రభావం పడుతుంది. కలెక్టర్ విధులను వక్రీకరించొద్దని ఐఏఎస్ అధికారుల సంఘం తెలిపింది.సివిల్ సర్వీసు అధికారుల గౌరవం, స్వతంత్రత, నిష్పక్షపాతత్వాన్ని కాపాడటానికి అండగా నిలబడతామని సంఘం స్పష్టం చేసింది. నిరాధారమైన ఆరోపణలు చేసిన కేటీఆర్ తక్షణమే క్షమాపణ చెప్పాలని తెలంగాణ ఐపీఎస్‌ల సంఘం డిమాండ్ చేసింది. -
లగచర్ల ఘటన : కోర్టు ఎదుట లొంగిపోయిన బోగమోని సురేష్
సాక్షి,కొడంగల్: వికారాబాద్ జిల్లా లగచర్లలో కలెక్టర్,ఇతర ఉన్నతాధికారులపై దాడి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. దాడి ఘటనలో ఏ2 నిందితుడు బోగమోని సురేష్ కొడంగల్ కోర్టు ముందు సురేష్ లొంగిపోయాడు. దీంతో లగచర్ల దాడి ఘటన కేసులో ఏ2గా ఉన్న సురేష్‌ను విచారించేందుకు అనుమతి ఇవ్వాలని పోలీసులు కోర్టుకు విజ్ఞప్తి చేశారు. కోర్టు మాత్రం సురేష్‌కు 14రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది.కొడంగల్ నియోజకవర్గం పరిధిలో ఫార్మా నిర్వాసిత రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. భూసేకరణపై గ్రామసభ నిర్వహించేందుకు దుద్యాల మండలం లగచర్లకు వచ్చిన అధికారులపై విరుచుకుపడ్డారు. పచ్చని పొలాల్లో విషం నింపొద్దని, తమ భూముల్లోకి ఫార్మాను రానిచ్చేది లేదంటూ మండిపడ్డారు.లగచర్లలో ఏం జరిగిందంటే?వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, అదనపు కలెక్టర్ లింగ్యానాయక్, ‘కొడంగల్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (కడా)’ ప్రత్యేకాధికారి వెంకట్‌రెడ్డిపై దాడికి దిగారు. కర్రలు, రాళ్లతో వెంటాడారు. వాహనాలను ధ్వంసం చేశారు. కలెక్టర్ ప్రతీక్ జైన్‌పై ఓ మహిళా రైతు చేయి చేసుకోగా.. కొందరు ఆందోళనకారులు కడా ప్రత్యేకాధికారి వెంకట్‌రెడ్డిని పరుగెత్తిస్తూ వెంటపడి దాడి చేశారు. రైతుల ఆగ్రహాన్ని గమనించిన భద్రతా సిబ్బంది వెంటనే కలెక్టర్, అడిషనల్ కలెక్టర్లను కారులో ఎక్కించి అక్కడి నుంచి పంపేశారు. కానీ కొందరు రైతులు వెంబడించి రాళ్లు రువ్వడంతో వాహనం అద్దాలు పగిలిపోయాయి.ఈ ఘటనను ప్రభుత్వంతో పాటు ఉద్యోగ సంఘాలు తీవ్రంగా పరిగణించాయి. కలెక్టర్ సహా అధికార యంత్రాంగంపై దాడికి నిరసన చేపట్టాలని ఉద్యోగ సంఘాలు నిర్ణయించాయి. లగచర్లలో ఉన్నతాధికారులపై దాడి ఘటనపై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. దాడి కారణమైన వారిని అదుపులోకి తీసుకోవాలని తెలంగాణ డీజీపీ జితేందర్.. ఏడీజీ మహేశ్ భగవత్‌కు ఆదేశాలు జారీ చేశారు.విచారణ చేపట్టిన ఏడీజీ మహేశ్ భగవత్.. దాడి ఘటనలో రాజకీయ కోణం ఉందని తెలిపారు. అంతేకాదు ఏ2 ముద్దాయిగా బోగమోని సురేష్‌ను చేర్చారు. కేసు విచారణ కొనసాగుతుండగా.. కొద్ది సేపటి క్రితం కోడంగల్ కోర్టు ఎదుట బోగమోని సురేష్ లొంగిపోయాడు. -
మాగొంతులు పిసికారు.. కళ్లకు బట్టలు కట్టి కొట్టారు
సాక్షి, న్యూఢిల్లీ: ‘ఫార్మా కంపెనీలకు భూములివ్వకుంటే కేసులు పెడతామంటున్నారు. జైలుకు పంపిస్తామని బెదిరిస్తున్నారు. మా జీవనాధారమైన భూముల్ని ఇవ్వలేమని తెగేసి చెబుతున్నవారిపై దౌర్జన్యాలకు దిగుతున్నారు. అక్రమ కేసులు బనాయిస్తున్నారు. బలవంతంగా భూములు లాక్కునేందుకు కుట్ర చేస్తున్నారు. కలెక్టర్‌పై దాడి జరిగిందనే సాకుతో పోలీసులు అర్ధరాత్రి మా ఇళ్లపై దాడులు చేశారు. మహిళలు, పిల్లలు, వృద్ధుల్ని భయభ్రాంతులకు గురిచేశారు. మా గొంతులు పిసికి, కళ్లకు బట్టలు కట్టి కొట్టారు. మాతో అనుచితంగా ప్రవర్తించారు. పిల్లలు ఏడుస్తున్నా విన్పించుకోకుండా మా భర్తల్ని కొడుతూ తీసుకెళ్లారు. కొందర్ని జైళ్లలో వేశారు. మరికొందరు ఎక్కడ ఉన్నారో కూడా చెప్పట్లేదు. గత మూడ్రోజులుగా అన్నం తినలేదు. నిద్ర కూడా పోవడం లేదు. ఊళ్లో ఉండాలంటేనే భయమేస్తోంది. ఢిల్లీలో న్యాయం జరుగుతుందని వచ్చాం..’ అంటూ లగచర్ల బాధిత మహిళలు జాతీయ ఎస్సీ, ఎస్టీ, మహిళా, మానవ హక్కుల కమిషన్ల ముందు కన్నీళ్లతో మొరపెట్టుకున్నారు. బీఆర్ఎస్ నేతలు సత్యవతి రాథోడ్, మాలోత్ కవిత, కోవా లక్ష్మిలతో కలిసి ఆదివారం ఢిల్లీకి వచ్చిన మహిళలు.. సోమవారం ఆయా కమిషన్లను కలిశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్వయంగా ప్రాతినిధ్యం వహిస్తున్న వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలో ఫార్మా విలేజ్ల ఏర్పాటు పేరుతో కేవలం గిరిజనుల భూముల లాక్కుంటున్నారని వారు ఫిర్యాదు చేశారు. మూడు పంటలు పండే భూములివ్వలేమని తొమ్మిది నెలలుగా అనేక అర్జీలు ఇస్తున్నా ఎవరూ పట్టించుకోలేదని తెలిపారు. సీఎం బంధువులకు కంపెనీలు కట్టబెట్టేందుకే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావుతో కలిసి వారు మీడియాతో మాట్లాడారు. మంచి చేస్తడని రేవంత్‌కు ఓటేసినం: కిష్టిబాయి‘మాకు మంచి చేస్తడని రేవంత్‌రెడ్డికి ఓటేసినం. కానీ మమ్మల్ని రోడ్డుమీద కూర్చునేలా చేసిండు. మేము చావనికైనా సిద్ధం కానీ గుంటెడు భూమి కూడా ఇవ్వం. మా దగ్గరికొస్తే బాగుండదు. తొమ్మిది నెలల నుంచి దీనిపై కొట్లాడుతున్నాం. ఎన్నోమార్లు కలెక్టర్‌కు లేఖలిచ్చి కాళ్ల మీద పడ్డాం. ఎంతోమందిని వేడుకున్నాం. అప్పుడు ముఖ్యమంత్రైనా, ఆయన అన్న తిరుపతిరెడ్డి అయినా రాలేదు. కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి 500 మంది పోలీసోళ్లను పంపి మా గొంతుక పిసుకుతాడా?, మా ఆడోళ్ల దాడిమీద చేపిస్తవా? ఇదేనా మీ తీరు? మా కొడంగల్ ముఖ్యమంత్రివి అనుకుంటే పూర్తిగా కొడంగల్ పేరునే కరాబ్ చేశావ్. అరెస్టు అయిన మా పిల్లలను బయటకు తేవాలే. మా భూముల జోలికి రావొద్దు..’ అని గిరిజన మహిళ కిష్టిబాయి డిమాండ్ చేసింది.గిరిజనుల భూములే ఎందుకు ఇవ్వమంటున్నారు?: జ్యోతి‘ఆ భూములు మా ముత్తాతల నుంచి మాకు వచ్చాయి. అవన్నీ పట్టా భూములే. వాటిని గుంజుకుందామని ఎందుకు ప్రయత్నిస్తున్నారు? మంచిగా పండే పంట పొలాలను లాక్కోవాలని ప్రభుత్వం చూస్తోంది. అక్కడ ఫార్మా కంపెనీ వద్దని చెబుతున్నా వినడం లేదు. చావనైనా చస్తాం కానీ భూములివ్వం. తనపై దాడి జరగలేదని స్వయంగా కలెక్టర్ చెబుతున్నా రైతులపై ఎందుకు కేసులు పెడుతున్నారు? గిరిజనుల భూములే ఎందుకు ఇవ్వమని అంటున్నారు. బెదిరించి సంతకాలు తీసుకుంటున్నారు. కలెక్టర్ ఊళ్లోకి వస్తే ఇద్దరు పోలీసులు కూడా రాలేదు కానీ ముఖ్యమంత్రి అన్న తిరుపతిరెడ్డి వస్తే రెండు బస్సుల పోలీసులు ఎందుకు వచ్చారు? తిరుపతిరెడ్డి వచ్చి భూములివ్వకుంటే బాగుండదని ఆడవాళ్లని బెదిరిస్తున్నాడు. కలెక్టర్‌పై దాడి జరిగిందని చెబుతూ తాగొచ్చి ఆడపిల్లలు అని కూడా చూడకుండా తప్పుగా ప్రవర్తించారు. మహిళలను కొట్టిన, తప్పుగా ప్రవర్తించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలి. జైల్లో ఉన్న నా భర్తను విపరీతంగా కొట్టారు. ఆయన్ను కొట్టిన వారందరిపై కఠిన చర్యలు తీసుకోవాలి..’ అని తొమ్మిది నెలల గర్భిణి జ్యోతి విజ్ఞప్తి చేసింది.మూడ్రోజుల నుంచీ ఏడుస్తూనే ఉన్నాం: దేవీబాయి‘తొమ్మిది నెలల నుంచి మమ్మల్ని సతాయిస్తున్నారు. అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారు. భూములు పోతున్నాయని మేము బాధపడుతుంటే రాత్రిళ్లు వచ్చి మా ఇంటోళ్లని, పిల్లలను పట్టుకెళ్లారు. వారెక్కడున్నారో కూడా తెలియదు. మూడ్రోజుల నుంచి తిండీతిప్పలు లేకుండా ఏడుస్తూనే ఉన్నాం. ఢిల్లీలో న్యాయం జరుగుతుందని భావిస్తున్నాం..’ అని దేవీబాయి ఆశాభావం వ్యక్తం చేసింది.దాడి జరగలేదని కలెక్టర్ చెప్పినా అరెస్టులు చేశారు: సుశీల‘భూములు పోతున్నాయని తిండికూడా పోతలేదు. నిద్రపోవడం లేదు. చిన్నచిన్న భూములున్న మమ్మల్ని అనేక ఇబ్బందులు పెడుతున్నారు. కలెక్టర్ స్వయంగా దాడి జరగలేదని చెప్పినా రాత్రి 12 గంటలప్పుడు కరెంట్ ఆపేసి ఇళ్లల్లోకి చొరబడి దౌర్జన్యం చేశారు. జైల్లో ఉన్న మా వాళ్లను కలవకుండా చేస్తున్నారు. మా ప్రాణాలు పోయినా సరే భూములు మాత్రం ఇవ్వం..’ అని సుశీల తెగేసి చెప్పింది. -
Lagcherla Incident: పరిగి డీఎస్పీ కరుణసాగర్‌పై వేటు
సాక్షి, వికారాబాద్ జిల్లా : దుద్యాల మండలం లగచర్లలో ఈ నెల 11న అధికారులపై జరిగిన దాడి ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్ బృందంపై దాడి ఘటనలో ఉన్నతాధికారులపై తెలంగాణ ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. ఇందులో భాగంగా పరిగి డీఎస్పీగా కరుణసాగర్‌రెడ్డిపై వేటు వేసింది. డీజీపీ ఆఫీస్‌కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పరిగి కొత్త డీఎస్పీగా శ్రీనివాస్‌ను నియమించింది.మరోవైపు కలెక్టర్‌పై దాడి కేసులో కొత్తకోణం చేసుకుంది. దాడి ఘటనలో పంచాయితీ సెక్రటరీ రాఘవేందర్ కీలక పాత్ర ఉన్నట్లు తేలింది. ప్రస్తుతం వికారాబాద్ జిల్లా దౌల్తాబాద్ మండలం సంగయ్య పల్లి పంచాయితీ సెక్రటరీగా పనిచేస్తున్న రాఘవేందర్ రైతుల్ని రెచ్చగొట్టినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ తరుణంలో సంగయ్యపల్లి పంచాయితీ సెక్రటరీపై రాఘవేందర్‌పై వేటు వేస్తూ సంబంధిశాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. Attack On #DistrictCollector in #TelanganaTension erupts in #Lagcherla village in #Dudyala mandal of #Vikarabad district, as villagers were attacked with sticks on District Collector Prateek Jain and govt officials and pelted stones on their vehicles.The officials today… pic.twitter.com/LjKtlrTujC— Surya Reddy (@jsuryareddy) November 11, 2024 -
లగచర్ల ఘటన కుట్ర కాదు.. తిరుగుబాటు: పైలట్ రోహిత్‌రెడ్డి
సాక్షి,హైదరాబాద్:లగచర్ల ఘటన రైతుల బాధతో జరిగిన తోపులాటే కానీ కుట్ర కానే కాదని బీఆర్ఎస్ నేత, తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డి అన్నారు. శనివారం(నవంబర్ 16) ఈ విషయమై రోహిత్‌రెడ్డి తెలంగాణభవన్‌లో మీడియాతో మాట్లాడారు.‘లగచర్ల గ్రామం చుట్టుపక్కల పచ్చని పంటపొలాలు,అధిక దిగుబడినిచ్చే పంట పొలాలు ఉన్నాయి.ప్రభుత్వం మొండితనంతో ముందుకు వెళ్తోంది. దాడి జరిగిన రోజు కలెక్టర్‌కు పోలీసులు భద్రత ఎందుకు కల్పించలేదు. బాధతో తిరగబడితే రైతులపై ప్రభుత్వం కక్ష పూరితంగా వ్యవహరించడం సరికాదు. కొడంగల్ మాజీ ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డి ఆ సంఘటన జరిగిన రోజు అక్కడ లేడు. నరేందర్ రెడ్డిని కుట్రతోనే జైల్లో వేశారు.బీఆర్ఎస్ సర్కార్ గతంలో 14 వేల ఎకరాల భూమిని ఫార్మా సిటీకి కేటాయించింది. మళ్ళీ ఇప్పుడు ఫార్మాసిటీకి కొత్తగా భూసేకరణ ఎందుకు.జిల్లాకు పెద్ద దిక్కు అని చెప్పుకుంటున్న పట్నం మహేందర్ రెడ్డి ఈ ఘటనపై ఎందుకు స్పందించడం లేదు? నరేందర్ రెడ్డి జైలుకి వెళ్ళడం వెనుక మహేందర్ రెడ్డి హస్తం ఉంది.నరేందర్ రెడ్డిని వెంటనే విడుదల చేయాలి.పట్నం కుటుంబంపై నిజంగా మహేందర్‌రెడ్డికి ప్రేమ ఉంటే ఎమ్మెల్సీ పదవికి,చీఫ్ విప్ పదవికి రాజీనామా చేయాలి’అని రోహిత్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఇదీ చదవండి: కేసీఆర్‌ను ఫినిష్ చేస్తా అన్న వాళ్లే ఫినిష్ అయ్యారు -
కలెక్టర్ నిజాంను మించిపోయారు!
సాక్షి, హైదరాబాద్: భూములను కట్టబెట్టడంలో రంగారెడ్డి జిల్లా గత కలెక్టర్ నిజాం నవాబ్‌ను కూడా మించిపోయారని హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. పేదలకు పంచడం కోసం రామచంద్రారెడ్డి దాదాపు 300 ఎకరాలు ఇచ్చారని, అందినకాడికి నొక్కిన అధికారులు వాటి స్వాహాకు సహకరించారని చెప్పింది. భూదాన్ భూములంటూ అప్పిలేట్ ట్రిబ్యునల్ అథారిటీగా ధ్రువీకరించిన వ్యక్తి.. జిల్లా కలెక్టర్‌గా వారసత్వ ధ్రువీకరణ పత్రం ఎలా జారీ చేస్తారని ప్రశ్నించింది. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం.. ఆరోపణలున్న అధికారులు కోర్టుకు సమాధానం చెప్పాల్సిందేనని స్పష్టం చేసింది. పీవీ నరసింహారావు లాంటి ఎందరో మహానుభావులు సీలింగ్ చట్టం వచ్చినప్పుడు వందల ఎకరాలు ఇచ్చేశారంది. తదుపరి విచారణను ఈ నెల 28కి వాయిదా వేసింది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారం గ్రామం సర్వే నం.182లో 10.29 ఎకరాలకు ఖాదర్ ఉన్నీసాకు వారసత్వ ధ్రువీకరణ పత్రం జారీ చేయడాన్ని సవాలు చేస్తూ నవాబ్ ఫారూక్ అలీఖాన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ సీవీ భాస్కర్‌రెడ్డి గురువారం విచారణ చేపట్టారు. గతంలో భూదాన్ భూములపై ఆర్డీవో ఆదేశాలివ్వగా స్పెషల్ ట్రిబ్యునల్ సమరి్థంచిందని పిటిషనర్ తరఫు న్యాయవాది పేర్కొన్నారు. దీనికి విరుద్ధంగా ఖాదర్ ఉన్నీసా ఇచ్చిన దరఖాస్తును కలెక్టర్ ఆమోదించి పాస్‌బుక్ కూడా జారీ చేశారని చెప్పారు. వాదనలను విన్న న్యాయమూర్తి.. భూదాన్ భూముల రక్షణకు అధికారులు చర్యలు తీసుకోకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎందరో మహానుభావులు ఇచ్చిన వందల ఎకరాలను అమ్ముకుని తినేశారని, భూదాన్ భూముల రక్షణలో గత బోర్డుతోపాటు అధికారులూ విఫలమయ్యారని చెప్పారు. భూదాన్ భూములకు సంబంధించిన వివాదం న్యాయస్థానంలో పెండింగ్‌లో ఉండగా పట్టా పాస్‌బుక్ జారీ చేశారన్నారు. వారసత్వ ధ్రువీకరణ పత్రం ఎలా జారీ చేశారో కౌంటరు దాఖలు చేయాలని భూదాన్ యజ్ఞబోర్డు, రెవెన్యూ ముఖ్యకార్యదర్శి, నాటి కలెక్టర్ అమోయ్‌కుమార్‌కు నోటీసులు జారీ చేశారు. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు ఈ భూములపై యథాతథస్థితిని కొనసాగించాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. -
దాడి బీఆర్ఎస్ కుట్రే !
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ అరాచక శక్తులతో కలిసి కుట్రపూరితంగా దళిత, గిరిజన రైతులను రెచ్చగొట్టి లగచర్లలో జిల్లా కలెక్టర్, ఆర్డీవో స్థాయి అధికారిపై దాడి చేయించిందని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆరోపించారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు తలకిందులుగా తపస్సు చేసినా ఈ ప్రభుత్వాన్ని అస్థిరపర్చలేరని చెప్పారు. లగచర్ల ఘటనలో నిందితుల కాల్ డేటాను సేకరించగా, బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన అభ్యర్థి ఉన్నట్టు తేలిందన్నారు. దీని వెనుక ఎంతటి పెద్దవారున్నా ఉపేక్షించేది లేదని, చట్టప్రకారం కఠినంగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఏదైనా సమస్య ఉంటే అధికారులకు వినతి పత్రాలు ఇవ్వడం, వారితో చర్చించడం, న్యాయ స్థానాలకు వెళ్లడం వంటి అవకాశాలుండగా, బీఆర్ఎస్ నేతలు రైతులను రెచ్చగొట్టి అధికారులపై దాడులు చేయించడం దుర్మార్గమన్నారు. భట్టి బుధవారం సచివాలయంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో పరిశ్రమలు, నిరుద్యోగులకు ఉద్యోగాలు రావొద్దని, అభివృద్ధి జరగొద్దనే దుర్మార్గమైన ఆలోచనతో ప్రతిపక్షం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ‘గత బీఆర్ఎస్ ప్రభుత్వం మల్లన్నసాగర్ కోసం భూసేకరణ చేపట్టినప్పుడు ప్రతిపక్ష పార్టీగా ప్రజాస్వామ్యయుతంగా రైతుల పక్షాన గొంతెత్తాం. అధికారులను కలిశాం. న్యాయస్థానాలకు వెళ్లాం. పత్రికల ద్వారా నిరసనను తెలియజేశాం. కానీ ఏనాడు ఇలా దాడులకు తెగబడలేదు’అని భట్టి అన్నారు. ఇలా దాడులు చేయించడం సబబేనా? అని కేసీఆర్‌ను ప్రశ్నించారు. బాధ్యత కలిగిన ప్రతిపక్ష నాయకుడిగా బయటకు వచ్చి ఈ అంశంపై మాట్లాడాలని కోరారు. అధికారులకు ప్రభుత్వం అండగా ఉంటుందని, కుట్రపూరిత దాడుల పట్ల కఠినంగా వ్యవహరిస్తుందన్నారు. ఉద్యోగులు అధైర్యపడకుండా ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తించాలని హితవు పలికారు. అభివృద్ధిని అడ్డుకునే కుట్రలు... ప్రజాప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని అడ్డుకోవడానికి బీఆర్ఎస్ కుట్రలు చేస్తోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆరోపించారు. అత్యంత వెనుకబడిన కొడంగల్ నియోజకవర్గంలో పారిశ్రామిక పార్కులు ఏర్పాటుచేసి పరిశ్రమల అభివృద్ధితో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటుందన్నారు. భూములు కోల్పోతున్న రైతులకు ఆర్అండ్ఆర్ ప్యాకేజీ ఇచ్చి.. ఇక్కడికొచ్చే పరిశ్రమల్లో ఉద్యోగ అవకాశాలు కలి్పస్తామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్న లక్ష్యంలో భాగంగానే రీజినల్ రింగ్ రోడ్– ఔటర్ రింగ్ రోడ్ మధ్య పరిశ్రమల ఏర్పాటుకు క్లస్టర్స్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. బీజేపీ పెద్దలతో కేటీఆర్ ఒప్పందం ఫార్ములా ఈ–రేస్ కేసు నుంచి తప్పించుకోవడానికి కేటీఆర్ ఢిల్లీకి పోయి బీజేపీ పెద్దలను కలిసి ఒప్పందం చేసుకున్నాడని భట్టి ఆరోపించారు. అందుకే మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఓటేయమని పిలుపునిచ్చి బీజేపీకి ఓటేయాలని కేటీఆర్ పరోక్షంగా చెప్పారని ఆరోపించారు. గవర్నర్‌పై సంపూర్ణమైన విశ్వాసం ఉందని, ఫార్ములా ఈ–రేస్ కేసు విచారణకు ప్రభుత్వానికి సహకరిస్తారని ఆశిస్తున్నామన్నారు. గవర్నర్ తిరస్కరిస్తే చట్టం ప్రకారం ఏం చేయాలో అదేవిధంగా ముందుకు వెళ్తామని పేర్కొన్నారు. బీఆర్ఎస్ నేతలు రైతుల పట్ల మొసలికన్నీరు కారుస్తున్నారని, అధికారులపై దాడిని వారు కనీసం ఖండించలేదని మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు. -
కలెక్టర్‌పై దాడి కేసు.. బీఆర్ఎస్ నేత నరేందర్‌రెడ్డికి రిమాండ్
సాక్షి,రంగారెడ్డిజిల్లా: వికారాబాద్ కలెక్టర్‌పై కొడంగల్ నియోజకవర్గం లగచర్లలో జరిగిన దాడి కేసులో బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డికి బుధవారం(నవంబర్13) కొడంగల్ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఫార్మా కంపెనీ భూ సేకరణ జరుపుతున్న క్రమంలో కలెక్టర్ ప్రతీక్‌జైన్ సోమవారం లగచర్ల వెళ్లారు.ఈ సమయంలో కలెక్టర్‌పై పలువురు గ్రామస్తులు దాడి చేశారు. దాడి నుంచి కలెక్టర్ తప్పించుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు.ఈ దాడి ఘటనలో వెనుక ఉండి నడిపించింది బీఆర్ఎస్ నేత నరేందర్‌రెడ్డి అనే ఆరోపణల నేపథ్యంలో పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం కొడంగల్ కోర్టులో హాజరుపరిచారు.దీంతో కోర్టు నరేందర్‌రెడ్డికి ఈనెల 27 వరకు రిమాండ్ విధించింది. దీంతో నరేందర్‌రెడ్డిని చర్లపల్లి జైలుకు తరలించారు.లగచర్ల ఘటనలో మంగళవారం 16 మందిని రిమాండ్‌కు తరలించిన పోలీసులు బుధవారం మరో నలుగురిని అరెస్ట్ చేశారు. వీరిలో ప్రధాన నిందితుడు సురేశ్ సోదరుడితో పాటు మరో ముగ్గురు ఉన్నారు.ఇదీ చదవండి: పట్నం నరేందర్‌రెడ్డి అరెస్ట్.. అప్డేట్స్ -
కేటీఆర్ అరెస్ట్ కావాల్సిందే: కోమటిరెడ్డి
హైదరాబాద్, సాక్షి: వికారబాద్ ఐఏఎస్‌పై దాడి కేసీఆర్,కేటీఆర్ కలిసి చేయించారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. తమకు భవిష్యత్తు లేదని దాడులకు కుట్ర చేశారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు.‘‘రేసింగ్ వ్యవహారంలో అనుమతులు లేకుండా డబ్బు బదిలీ చేశారు. గవర్నర్ అనుమతి రాగానే కేటీఆర్ అరెస్ట్ కావాల్సిందే. దాడులకు దిగిన వారికి మద్దతిస్తామని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. మాజీ మంత్రి కేటీఆర్‌తో ఫోన్లో మాట్లాడినట్లు సమాచారం ఉంది’’అని అన్నారు. -
లగచర్ల దాడి కేసు: రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు
సాక్షి, హైదరాబాద్: వికారాబాద్‌లోని లగచర్లలో కలెక్టర్‌పై దాడి కేసుకు సంబంధించి రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు బయటకు వచ్చాయి. ఈ దాడి కేసులో ఏ1గా బోగమోని సురేష్‌ను ప్రధాన నిందితుడిగా పోలీసులు పేర్కొన్నారు. ఇప్పటి వరకు 16 మందిని అరెస్ట్ చేయగా.. మరో 30 మంది పరారీలో ఉన్నట్టు రిపోర్టులో పోలీసులు తెలిపారు.కలెక్టర్‌పై దాడి కేసుకు సంబంధించి రిమాండ్ రిపోర్టు ఇలా.. ఈ దాడికి సంబంధించి బూంరాస్‌పేట్ పోలీసు స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు. 153/2024 క్రైం నెంబర్ కేసు.. సెక్షన్ 61(2), 191(4),132,109,121(1) 126(2)324 r/w190BNS Sec 30Of pdpp act, 128Of bnss కింద కేసులు నమోదయ్యాయి. అలాగే.. హత్యాయత్నం, అసాల్టింగ్, ఉద్యోగుల విధులకు ఆటంకం కలిగించడం వంటి నాన్ బెయిలబుల్ కూడా కేసులు నమోదు. వికారాబాద్ డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి ఫిర్యాదుతో పోలీసులు కేసు ఫైల్ చేశారు. ఈ దాడి కేసులో మొత్తం 46మందిని నిందితులుగా చేర్చారు.ఇదీ చదవండి: నరేందర్ రెడ్డిని తొక్కేయాలని రేవంత్ కుట్రఎఫ్ఐఆర్లో బోగమోని సురేష్‌ను ప్రధాన నిందితుడుగా(ఏ1) పోలీసులు పేర్కొన్నారు. ఇప్పటి వరకు 16మందిని అరెస్ట్ చేయగా.. మరో 30 మంది పరారీలో ఉన్నారు. పక్కా ప్లాన్ ప్రకారమే నిందితులు దాడిచేశారు. రాళ్లు, కర్రలు, కారంపొడి ముందే సిద్ధం చేసుకున్నారు. అధికారులు వచ్చిన వెంటనే దాడి చేయాలని ముందస్తు ప్రణాళిక సిద్ధం చేశాడు A1 నిందితుడు సురేష్. అరెస్ట్ అయిన నిందితులకు 14 రోజులపాటు రిమాండ్ విధించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు సురేష్ పాటు 29 మంది పరారీలో ఉన్నారు. ఈ ఘటనలో ప్రభుత్వ అధికారులకు, పోలీసులకు గాయాలయ్యాయి. ప్రభుత్వ వాహనాలు ధ్వంసం చేశారు. దాడి కేసులో నిందితుడు సురేష్ కీలకంగా మారాడు. సురేష్ ప్లాన్ ప్రకారమే కలెక్టర్‌ను లగచర్లకు తీసుకెళ్లాడు’ అని పోలీసులు పేర్కొన్నారు. ఇదీ చదవండి: లగచర్ల ఘటన: మార్నింగ్ వాక్‌లో పట్నం అరెస్ట్ -
కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్
-
ఊరంతా ఖాళీ
కొడంగల్/దుద్యాల్/పరిగి/పూడూరు: కలెక్టర్‌పై జరిగిన దాడితో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచర్లతో పాటు మరో రెండు గ్రామాల్లో సోమవారం రాత్రి భయానక వాతావరణం నెలకొంది. మంగళవారం ఉదయానికల్లా మూడు గ్రామాలూ నిర్మానుష్యంగా మారిపోయాయి. ఇక్కడ ఫార్మా సిటీ ఏర్పాటును వ్యతిరేకిస్తున్న స్థానికులు భూ సేకరణ సమావేశానికి హాజరైన కలెక్టర్ సహా ఉన్నతాధికారులపై దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రాత్రి ఒంటిగంట సమయంలో లగచర్లకు చేరుకున్న సుమారు 300 మంది సాయుధ పోలీసులు 2 గంటల ప్రాంతంలో లగచర్ల, రోటిబండతండా, పులిచెర్లకుంట తండాలను అష్ట దిగ్బంధనం చేశారు. ఇళ్లలో నిద్రిస్తున్న రైతులు, యువకులను అదుపులోకి తీసుకున్నారు. పిలిచినా స్పందించని వారి తలుపులు బద్ధలుకొట్టి లోనికి వెళ్లారు. మూడు గ్రామాల్లో సుమారు 50 మందికి పైగా అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే అనుమానితులను గుర్తించిన పోలీసులు వారి సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో పలువురిని అదుపులోకి తీసుకున్నారు. ఏ ఇంటిని చూసినా తాళాలే.. అర్ధరాత్రి వేళ పోలీసులు తమ కుటుంబ సభ్యులను తీసుకెళ్లడంతో మహిళలు భయాందోళనకు గుర య్యారు. అయితే ఎప్పుడైనా పోలీసులు దాడి చేసే అవకాశం ఉందని ఊహించిన పలువురు సాయంత్రంలోపే బంధువుల ఇళ్లకు వెళ్లిపోయారు. రాత్రి వేళ పోలీసులు రావడంతో భయకంపితులైన మిగిలిన వారు ఉదయాన్నే ఇతర గ్రామాలకు తరలివెళ్లారు. దీంతో ఉదయం 8 గంటల లోపే గ్రామాలు ఖాళీ అయిపోయాయి. గ్రామాల్లో ఏ ఇంటిని చూసి నా తాళాలే దర్శనమిచ్చాయి. పశువులు, గొర్రెలు, మేకలు మాత్రం దొడ్లలోనే ఉన్నాయి. పోలీసుల అదుపులోనే 16 మంది అనుమానంతో అదుపులోకి తీసుకున్న సుమారు 50 మందిని పోలీసులు మంగళవారం తెల్లవారుజామున పరిగి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఘటనకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు చూపిస్తూ విచారణ నిర్వహించారు. దాడికి పాల్పడిన వారి, ఇందుకు ప్రేరేపించిన వారి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఘటనతో సంబంధం ఉన్న 16 మందిని పీఎస్‌లోనే ఉంచుకుని మిగిలిన వారిని వదిలేశారు. 16 మందికి పరిగి ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించారు. వీరిని కొడంగల్ న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా రైతుల దాడిలో గాయపడిన కడా ప్రత్యేకాధికారి వెంకట్‌రెడ్డి సోమవారం సాయంత్రం నిమ్స్ ఆస్పత్రిలో వైద్యం చేయించుకున్నారు.బీఆర్ఎస్ నేతల అరెస్టు లగచర్లలో ఫార్మా బాధిత రైతులను పరామర్శించేందుకు బయలుదేరిన బీఆర్ఎస్ నేతలు.. మాజీ స్పీకర్ మధుసూదనాచారి, ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్‌తో పాటు మాజీ ఎమ్మెల్యేలు పట్నం నరేందర్‌రెడ్డి, కొప్పుల మహేశ్‌రెడ్డి, మెతుకు ఆనంద్, బీసీ కమిషన్ మాజీ సభ్యుడు శుభప్రద్‌పటేల్, కార్తీక్‌రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ నుంచి లగచర్లకు వెళ్తుండగా చన్గోముల్ పోలీస్ స్టేషన్ వద్ద అదుపులోకి తీసుకున్నారు. సుమారు 40 నిమిషాల తర్వాత హైదరాబాద్ పంపించేశారు. ఈ సందర్భంగా మధుసూదనాచారి మాట్లాడుతూ.. మోసపూరిత హామీలతో అధికారంలోకి వచి్చన కాంగ్రెస్ తెలంగాణ ప్రజల బతుకులను బజారుకీడుస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో దుర్మార్గపు పాలన కొనసాగుతోందని అన్నారు. ఫార్మా కంపెనీ కోసం తాతల కాలం నుంచి సాగు చేసుకుంటున్న భూములను లాక్కుని, వారి జీవితాలను నాశనం చేయాలని చూస్తున్నారన్నారు.రైతులపై పెట్టిన కేసులను బేషరతుగా వెనక్కి తీసుకోని పక్షంలో బీఆర్ఎస్ తరఫున ఆందోళన తప్పదని హెచ్చరించారు. సీఎం రేవంత్‌రెడ్డి అనాలోచిత నిర్ణయాలు, ప్రతీకారేచ్ఛతోనే ఇలాంటి దుష్పరిణామాలు జరుగుతున్నాయని ప్రవీణ్‌కుమార్ విమర్శించారు. బీఆర్ఎస్ ఏనాడూ అధికారులపై దాడులను ప్రోత్సహించలేదన్నారు. ఫోన్ లాక్కెళ్లారు.. పరీక్షలు ఉన్నాయన్నా వినలేదు అర్ధరాత్రి వేళ పోలీసులు వచ్చారు. అప్పుడు మా అత్త దేవీబాయి, నేను మాత్రమే ఇంట్లో ఉన్నాం. ఇల్లంతా వెతికిన పోలీసులు మగవారు ఎవరూ లేరని గమనించి నా ఫోన్ లాక్కెళ్లారు. నేను పరిగిలోని పల్లవి కాలేజీలో డిగ్రీ చదువుతున్నా. మంగళవారం ప్రాక్టికల్ పరీక్షలు ఉన్నాయని, ఫోన్ ద్వారా ప్రిపేర్ కావాలి సార్ అని బతిమాలినా వినలేదు. – అనూష, పులిచెర్లకుంట తండా -
కేటీఆర్ ఢిల్లీకి ఎందుకు పోతారో తెలుసు: మంత్రి శ్రీధర్‌బాబు
సాక్షి,హైదరాబాద్: వికారాబాద్ జిల్లా లగిచర్లలో కలెక్టర్‌పై దాడి వెనుక ఉన్న కుట్రను ఛేదిస్తామని రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. ఈ విషయమై శ్రీధర్‌బాబు మంగళవారం(నవంబర్ 12) సచివాలయంలో మీడియాతో మాట్లాడారు.‘పరిశ్రమలు రాకుండా ప్రతిపక్ష బీఆర్ఎస్ అశాంతిని రగులుస్తోంది.ప్రభుత్వ పరంగా ఎక్కడ తప్పు జరిగిందో తేల్చుతాం.లా అండ్ ఆర్డర్ విషయంలో వెనక్కి తగ్గేది లేదు.కేటీఆర్ అన్నంత మాత్రానా ఎవరికి ఎవరూ భయపడరు.రాజకీయాల కోసం దాడులకు తెగబడితే కఠిన చర్యలు తప్పవు.కేటీఆర్ ఢిల్లీకి ఎందుకు పోతారో అందరికీ తెలుసు.కేసుల నుంచి తప్పించాలని ఢిల్లీని వేడుకుంటున్నారు.అన్ని రాష్ట్రాల్లో జరిగే ఎన్నికలకు కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఏటీఎంగా ఉందా..మోదీ ఆరోపణలన్నీ రాజకీయ లబ్ది కోసమే.బీజేపీ,బీఆర్ఎస్ కలిసే పనిచేస్తున్నాయి’అని శ్రీధర్‌బాబు ఆరోపించారు.కాగా కలెక్టర్‌పై దాడి ఘటన మీద జిల్లా ఇంఛార్జ్ మంత్రి శ్రీధర్‌బాబు మంగళవారం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్,ఐజీ సత్యనారాయణ,ఎస్పీ నారాయణ రెడ్డి హాజరయ్యారు.ఘటన వివరాలను శ్రీధర్‌బాబు అడిగి తెలుసుకున్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లా పోలీసుల తీరుపై శ్రీధర్‌బాబు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇప్పటికే ఘటనపై రిపోర్టు ఇవ్వాలని డీజీపీ, సీఎస్‌ను ప్రభుత్వం ఆదేశించింది. దాడిపై పోలీస్ శాఖ నివేదికను సిద్ధం చేస్తోంది. ఇదీ చదవండి: ఫార్మాపై రైతుల ఫైర్.. అధికారులపై దాడి -
కలెక్టర్ పై మూకుమ్మడి దాడి
-
లగచర్ల ఘటన: ‘కీలకంగా వ్యవహరించిన బీఆర్ఎస్ నేత’
వికారాబాద్, సాక్షి: దుద్యాల మండలం లగచర్ల గ్రామంలో నిన్న(సోమవారం) ఫార్మా రైతుల ప్రజాభిప్రాయం సేకరణకు వచ్చిన అధికారులపై దాడి ఘటనపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అయింది. దాడికి కారణమైన బీఆర్ఎస్ నేతలతో పాటు గ్రామస్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు. వెంటనే వికారాబాద్ వెళ్లాళని ఏడీజీ మహేశ్ భగవత్‌కు రాష్ట్ర డీజీపీ ఆదేశించారు. దాడి ఘటనపై మహేశ్ భగవత్ నివేదిక ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.మరోవైపు.. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటివరకు మొత్తం 52 మందిని అదుపులోకి తీసుకున్నామని వికారాబాద్ ఎస్పీ నారాయణ రెడ్డి వెల్లడించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘‘లగచర్ల ఘటనలో మొత్తం 52 మందిని అదుపులోకి తీసుకున్నాం. అధికారులపై దాడి ఘటనలో కుట్ర కోణంపై విచారణ చేస్తున్నాం. అధికారులపై దాడి చేసిన వారిలో బీఆర్ఎస్ నాయకుడు సురేష్ కీలకంగా వ్యవహరించారు. రాజకీయ కోణం ఏదైనా ఉందా? అని విచారణ చేస్తున్నాం. సురేష్ వెనక ఎవరు ఉన్నారనేది విచారణలో తేలుతుంది. కలెక్టర్‌పైకి దూసుకువచ్చే దృష్యాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. దాడిలో పలువురి అధికారులకు గాయాలయ్యాయి’’ అని అన్నారు. కలెక్టర్ ఘటన నేపథ్యంలో ఇవాళ.. దుద్యాల, కొడంగల్, బోంరాస్‌పేట మండలాల్లో భారీగా పోలీసులు పహారా కాస్తున్నారు.మరోవైపు.. లగచర్ల ఘటన ప్రభావం మిగతా చోట్ల పడేలా కనిపిస్తోంది. నల్గొండ జిల్లాలోని దామరచర్ల మండలం గణేష్ పహాడ్‌లో ఉన్న అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ ప్రజాభిప్రాయ సేకరణ వాయిదా పడింది. వికారాబాద్ కలెక్టర్ ఘటన నేపథ్యంలో అధికారులు వాయిదా వేసినట్లు తెలుస్తోంది.దుద్యాల మండలం లగచర్ల గ్రామంలో నిన్న(సోమవారం) ఫార్మా రైతుల ప్రజాభిప్రాయం సేకరణకు వచ్చిన అధికారులపై దాడి ఘటనకు సంబంధించి అర్ధరాత్రి కొంతమంది వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు అక్కడ పోలీసు బలగాలు ఇంకా మోహరించే ఉన్నాయి.లగచర్ల ఘటన ప్రభావం మిగతా చోట్ల పడేలా కనిపిస్తోంది. నల్గొండ జిల్లాలోని దామరచర్ల మండలం గణేష్ పహాడ్‌లో ఉన్న అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ ప్రజాభిప్రాయ సేకరణ వాయిదా పడింది. వికారాబాద్ కలెక్టర్ ఘటన నేపథ్యంలో అధికారులు వాయిదా వేసినట్లు తెలుస్తోంది.ఇదిలా ఉంటే.. కొడంగల్ నియోజకవర్గం పరిధిలో ఫార్మా నిర్వాసిత రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. భూసేకరణపై గ్రామసభ నిర్వహించేందుకు దుద్యాల మండలం లగచర్లకు వచ్చిన అధికారులపై విరుచుకుపడ్డారు. పచ్చని పొలాల్లో విషం నింపొద్దని, తమ భూముల్లోకి ఫార్మాను రానిచ్చేది లేదంటూ మండిపడ్డారు.వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, అదనపు కలెక్టర్ లింగ్యానాయక్, ‘కొడంగల్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (కడా)’ ప్రత్యేకాధికారి వెంకట్‌రెడ్డిపై దాడికి దిగారు. కర్రలు, రాళ్లతో వెంటాడారు. వాహనాలను ధ్వంసం చేశారు. కలెక్టర్ ప్రతీక్ జైన్‌పై ఓ మహిళా రైతు చేయి చేసుకోగా.. కొందరు ఆందోళనకారులు కడా ప్రత్యేకాధికారి వెంకట్‌రెడ్డిని పరుగెత్తిస్తూ వెంటపడి దాడి చేశారు. రైతుల ఆగ్రహాన్ని గమనించిన భద్రతా సిబ్బంది వెంటనే కలెక్టర్, అడిషనల్ కలెక్టర్లను కారులో ఎక్కించి అక్కడి నుంచి పంపేశారు. కానీ కొందరు రైతులు వెంబడించి రాళ్లు రువ్వడంతో వాహనం అద్దాలు పగిలిపోయాయి. ఈ ఘటనతో లగచర్లలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. గ్రామంలో 250 మందికిపైగా పోలీసు సిబ్బందిని మోహరించారు.ఈ ఘటనను ప్రభుత్వంతో పాటు ఉద్యోగ సంఘాలు తీవ్రంగా పరిగణించాయి. కలెక్టర్ సహా అధికార యంత్రాంగంపై దాడికి నిరసన చేపట్టాలని ఉద్యోగ సంఘాలు నిర్ణయించాయి. -
Vikarabad: కలెక్టర్‌పై దాడి చేసిన రైతులు
-
TG: కలెక్టర్‌పై దాడి.. ప్రభుత్వం సీరియస్
సాక్షి,హైదరాబాద్:వికారాబాద్ జిల్లా కలెక్టర్‌పై లగచర్ల గ్రామంలో సోమవారం(నవంబర్ 11) ఉదయం జరిగిన దాడి ఘటనపై ప్రభుత్వం సీరియస్ అయింది. కలెక్టర్ మీద దాడి జరగడంపై రిపోర్ట్ ఇవ్వాలని సీఎస్,డీజీపీలను ప్రభుత్వం ఆదేశించింది.కాగా, కలెక్టర్‌పై దాడి ఘటన మీద సీఎస్ శాంతికుమారి ఇప్పటికే ఆరా తీశారు. కలెక్టర్ ప్రతీక్‌జైన్‌తో సీఎస్ ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.ఘటనపై నివేదిక పంపాలని జిల్లా యంత్రాంగాన్ని సీఎస్ ఆదేశించారు. కాగా, ఫార్మా కంపెనీల కోసం భూ సేకరణ విషయమై వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్‌జైన్ లగచర్ల వెళ్లినపుడు గ్రామస్తులు ఒక్కసారిగా ఆయనపై దాడికి దిగారు. ఇదీ చదవండి: వికారాబాద్ జిల్లా కలెక్టర్‌పై దాడి.. లగచర్లలో ఉద్రిక్తత -
వికారాబాద్ జిల్లా కలెక్టర్‌పై దాడి.. లగచర్లలో ఉద్రిక్తత
వికారాబాద్, సాక్షి: జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్‌కు చేదు అనుభవం ఎదురైంది. దుద్యాల మండలం లగచర్లకు వెళ్లిన ఆయనకు నిరసన సెగ తగలడంతో పాటు గ్రామస్తులు దాడి చేశారు. లగచర్లలో సోమవారం ఫార్మా కంపెనీ ఏర్పాటుపై అభిప్రాయ సేకరణ జరిగింది. దుద్యాల, లగచర్ల పోలేపల్లి, లగచర్ల తాండలో ప్రజలతో చర్చించేందుకు కలెక్టర్ సహా అధికారులు వచ్చారు. అయితే ఫార్మా కంపెనీకి గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ మహిళ కలెక్టర్ ప్రతీక్ జైన్‌పై చేయి చేసుకున్నట్లు తెలుస్తోంది. కొడంగల్ ఏరియా డెవలప్ మెంట్ అథారిటీ ప్రత్యేక అధికారి వెంకట్ రెడ్డిపై దాడి జరిగినట్లు సమాచారం. ఆపై గ్రామస్తులు పట్టరాని కోపంతో అధికారుల వాహనాలపై గ్రామస్తులు కర్రలు, రాళ్లతో దాడికి దిగారు. ఈ దాడిలో మూడు వాహనాలు ధ్వంసం అయ్యాయి. ఆ వెంటనే అధికారులంతా అక్కడి నుంచి వెళ్లేపోయే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం లగచర్లలో ఉద్రిక్త వాతావరణం నెలకొనగా.. భారీగా పోలీసులు మోహరించారు. -
చెల్లెమ్మా.. టీ స్టాల్ ఎలా నడుస్తోంది?
ఖమ్మం: మహిళలు ఆసక్తి ఉన్న రంగంలో ఆర్థికంగా రాణించేలా ఇందిరా మహిళా శక్తి పథకం అండగా నిలుస్తుందని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తెలిపారు. కలెక్టరేట్ ఎదుట బస్టాప్ వద్ద ఇందిరా మహిళాశక్తి సహకారంతో ఏర్పాటుచేసిన ‘స్త్రీ టీ స్టాల్’ను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా నిర్వాహకురాలితో మాట్లాడిన ఆయన ‘చెల్లెమ్మా చాయ్ సెంటర్ ఎలా నడుస్తోంది, వ్యాపారం అనుకూలంగా ఉందా’ అని ఆరా తీయడంతో పాటు టీ చేయించుకుని తాగారు. ఏమైనా సమస్యలు ఉన్నాయా, వ్యాపార అభివృద్ధికి సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉందా అని తెలుసుకున్నారు. ఇందిరా మహిళా శక్తి పథకం కుటుంబాల ఆర్థికాభివృది్ధకి అండగా నిలుస్తుందని, స్వయం సహాయక గ్రూపుల సభ్యులు సద్విని యోగం చేసుకోవాలని సూచించారు. -
అమ్మానాన్నల మాట.. సివిల్స్‌కు బాట
చదువుకోవాలి.. చదువుకొని తన కాళ్లపై తాను నిలబడి, ఆదర్శంగా ఉండాలని చెప్పిన అమ్మ మాట.. సమాజంలో ప్రజా సమస్యలు పరిష్కరిస్తూ ప్రజాసేవలో ఉండాలని చూపిన నాన్న బాట.. ఇలా తల్లిదండ్రులు చెప్పిన మాటలు ఆలోచనలో పడేశాయి. అప్పుడే తాను ఒక ఉన్నతాధికారిగా ప్రజాసేవ చేయాలని సంకల్పంతో 24 ఏళ్లకే ఐఏఎస్ సాధించారు. దేశంలోనే యువ ఐఏఎస్‌లలో ఒకరిగా నిలిచి పాలనలో పరుగులు పెట్టిస్తున్న సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి సక్సెస్ స్టోరీ మీకోసం..బాల్యం.. విద్యాభ్యాసంవల్లూరు క్రాంతి స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌ని కర్నూలు పట్టణం. తండ్రి డా.రంగారెడ్డి, తల్లి డాక్టర్ లక్ష్మి. ఇద్దరూ కూడా వైద్యులే. అక్క కూడా వైద్యురాలే, అమెరికాలో స్థిరపడ్డారు. ఒకటో తరగతి నుంచి పదవ తరగతి వరకు కర్నూల్లోనే చదువుకున్నారు. ఇంటర్మీడియట్ హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ కళాశాలలో చదువుకున్నారు. బీటెక్ ఢిల్లీ లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ) లో మెకానికల్ ఇంజనీర్ పూర్తి చేశారు.మూడో ప్రయత్నంలోనే..అనుకున్న లక్ష్యాన్ని సాధించేందుకు ఓ వైపు వచ్చిన జాబ్‌ను వదలకుండా ఉద్యోగం చేసుకుంటూ సివిల్స్‌కు ప్రిపేర్ అయ్యారు. తొలిసారిగా 2013లో సివిల్స్‌కు హాజరై 562 ర్యాంకు రావటంతో (ఐఆర్టీఎస్) ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీస్‌లో ఉద్యోగం వచ్చింది. అయినా నిరాశ చెందకుండా రెండోసారి 2014లో సివిల్స్ పరీక్ష రాసి 230 ర్యాంకు సాధించి, ఇండియన్ రెవెన్యూ సర్వీస్‌లో ఉద్యోగం సాధించారు. ఐఏఎస్ కావాలని పట్టుదల, నాన్న సూచన సలహా మేరకు 2015లో జరిగిన సివిల్స్‌లో 65 ర్యాంకు సాధించి ఐఏఎస్‌కు ఎంపిక అయ్యారు. 24 సంవత్సరాలకే ఐఏఎస్ సాధించి యువ ఐఏఎస్‌గా నిలిచారు. ముస్సోరిలో ఐఏఎస్ శిక్షణ పూర్తి చేసి, 2016 బ్యాచ్ తెలంగాణ క్యాడర్‌కు ఎంపిక అయ్యారు.శిక్షణలో క్షేత్రస్థాయి సమస్యలుముస్సోరిలో ఐఏఎస్ శిక్షణ తీసుకోవడం జరిగింది. శిక్షణలో భాగంగా వారం రోజుల పాటు ఓ గ్రామాన్ని సందర్శించడం జరిగింది. ప్రజాసేవలో ఎలా ముందుకు సాగాలో నేర్పించారు. అక్కడ క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలు తెలుసుకున్నాను. ట్రెక్కింగ్ నేర్పించారు.కొత్త ఆశల ఉగాది అంటే ఇష్టంపండుగలలో కొత్త ఆశ ఆశయాలతో ప్రారంభమయ్యే ఉగాది పండుగ అంటే నాకెంతో ఇష్టం. చదువుతోపాటు ఆటలు కూడా ఆడేవాళ్లం.ప్రతీ విజయం వెనుక ఎంతో కష్టంప్రతి ఒక్కరూ తమ జీవితంలో ముందుగానే ఒక లక్ష్యాన్ని ఎంచుకోవాలి. ఎంత కష్టం వచ్చినా నిరాశ చెందకుండా లక్ష్యం వైపు ముందుకు సాగాలి. లక్ష్యం సాధించే వరకు అదే పనిగా ఉంటూ ఆత్మస్థైర్యం, నమ్మకంతో ఉండాలి. ప్రణాళికబద్ధంగా సిలబస్ ప్రిపేర్ అవుతూ పరీక్షలకు సన్నద్ధం కావాలి. విజయం అనేది ఊరికే రాదు. ప్రతీ విజయం వెనుక ఎంతో కష్టం ఉంటుందనేది గుర్తు పెట్టుకోవాలి. పోటీ పరీక్షలు రాసే విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురి కాకుండా సరైన ప్రణాళికతో ముందుకెళ్లాలి.అమ్మానాన్నల ప్రోత్సాహంతోనే..ఇంట్లో అందరూ సైన్స్ పై ఎక్కువగా ఇష్టం.. తనకు మాత్రం మ్యాథ్స్‌పై ఇష్టం ఎక్కువ. తనకు చిన్నప్పటి నుంచే లీడర్ షిప్ లక్షణాలపై ఇష్టం. ప్రజలకు సేవ చేయాలనే తపన ఉండేది. ఒక ఉన్నత స్థానంలో ఉంటేనే ప్రజాసేవ చేయగలుగుతామనే ఆలోచన, చిన్నప్పటి నుంచి అమ్మ నాన్న చెప్పిన మాట లు మ్యాథ్స్ ఉన్న ఇంట్రెస్ట్‌తోనే ఐఏఎస్ సాధించేలా చేశాయి. ప్రైవేటుగా ఉండి ఎంత సంపాదించినా సరైన విధంగా ప్రజాసేవ సాధ్యం కాదు. అందుకే ఉన్నతమైన ఐఏఎస్‌ను సాధించడం జరిగింది. నిర్మల్ జిల్లాలో ట్రైనీగా, మహబూబ్ నగర్ జిల్లా ప్రత్యేక అధికారిగా, కరీంనగర్ మున్సిపల్ కమిషనర్, జోగులాంబ కలెక్టర్‌గా నిర్వహించి ప్రస్తుతం సంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా కొనసాగుతున్నారు.భార్యాభర్తలిద్దరూ కలెక్టర్లువల్లూరి క్రాంతి సంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా ఉన్నారు. భర్త ఆశిష్ సంగ్వాన్ కామారెడ్డి జిల్లా కలెక్టర్‌గా కొనసాగుతున్నారు. వీరిద్దరిదీ ప్రేమ వివాహం. వీరికి పాప(ఆర్యన్) ఉంది. -
మా కారు ఎక్కండి... సున్నితంగా తిరస్కరించిన కలెక్టర్ అన్సారియా
ఒంగోలు అర్బన్: సాధారణ విషయాలు మాట్లాడేందుకు కలెక్టర్ కార్యాలయానికి స్థానిక ఎమ్మెల్యే దామచర్ల జనార్దనరావు మంగళవారం వచ్చి కలెక్టర్ తమీమ్ అన్సారియాను కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కూడా సాధారణ విష యాలు చర్చించేందుకు వచ్చామని దామచర్ల తెలిపారు. అయితే కలెక్టరేట్ నుంచి నగరపాలక సంస్థలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి వెళ్లేందుకు అప్పుడే కలెక్టర్ కూడా కారు వద్దకు వచ్చారు. దీంతో దామచర్ల తాను మున్సిపల్ కార్యాలయానికి వెళ్తున్నానని కలిసి వెళ్లేందుకు తన కారు ఎక్కాలని పదేపదే కలెక్టర్‌ను కోరారు. దీంతో కలెక్టర్ ఎమ్మెల్యే కారు ఎక్కబోయి కూడా వెనక్కు వెళ్లిపోయారు. మళ్లీ ఎమ్మెల్యే తన కారు ఎక్కాలంటూ కోరడంతో కలెక్టర్ సున్నితంగా తిరస్కరించి తన కారులో మున్సిపల్ కార్పొరేషన్‌కు బయలు దేరారు. జరిగిన సంఘటనను అక్కడే ఉన్న కూటమి నాయకులు, అధికారులు ఆసక్తిగా గమనించారు. -
రూలర్స్..రూల్స్ బ్రేక్
ఈ ఫొటోల్లో రవాణా శాఖ అధికారులు ఎక్కడికక్కడ ద్విచక్ర వాహనదారులను నిలిపివేసి... హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్న వారికి రూ.1,030 అపరాధ రుసుం విధించడంతో పాటు మూడు నెలల పాటు లైసెన్స్‌ను తాత్కాలికంగా రద్దు చేశారు.ఈ ఫొటోల్లో ఏకంగా జిల్లా కలెక్టర్ హరేందర్ ప్రసాద్, విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు ద్విచక్ర వాహనంలో వెనుక కూర్చొని మేహాద్రి గెడ్డ రిజర్వాయర్‌ను పరిశీలించారు. వాహనం నడుపుతున్న వ్యక్తి గానీ వెనుక కూర్చున్న కలెక్టర్, గణబాబు గానీ హెల్మెట్ ధరించలేదు. ద్విచక్ర వాహనం మీద ప్రయాణించే ఇద్దరూ హెల్మెట్లు ధరించాలని సుప్రీంకోర్టు ఆదేశాలను స్వయంగా అధికారులు, ప్రజాప్రతినిధులు తుంగలో తొక్కుతున్నా.. అటువైపు కనీసం రవాణా శాఖ అధికారులు కన్నెత్తి చూడలేదు. చట్టం అధికారం ఉన్న వాడికి చుట్టమనే నానుడి ఇటువంటి అధికారులు, ప్రజాప్రతినిధుల వల్ల మరింత బలపడినట్టయింది.గోపాలపట్నం: జిల్లాలో హెల్మెట్లు లేకుండా ద్విచక్ర వాహనం నడుపుతున్నారంటూ... ఈ నెల ఒకటి నుంచి 5వ తేదీ వరకు 1,199 మందికి రూ.1,035 అపరాధ రుసుం విధించడంతో పాటు లైసెన్సులను తాత్కాలికంగా మూడు నెలల పాటు రద్దు చేశారు. మూడు నెలల వరకు వీరెవ్వరూ వాహనాన్ని నడిపేందుకు అవకాశం లేదు. వాహనదారుల్లో అవగాహన పెంచేందుకు కఠినంగా వ్యవహరించాల్సిందే. దీనిని ఎవరూ తప్పుపట్టడం లేదు. అయితే సాధారణ ప్రజలకు ఒక విధంగా.. అధికారం ఉన్న వారి పట్ల మరో విధంగా ప్రవర్తించడంపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది.విస్తృతంగా తనిఖీలుద్విచక్రవాహనం నడిపేవారితోపాటు వెనుక కూర్చున్నవారు కచ్చితంగా హెల్మెట్లు ధరించాలని సుప్రీం కోర్టు ఆదేశాలను ఈ నెల ఒకటో తేదీ నుంచి జిల్లాలో అమలు చేస్తున్నారు. ట్రాఫిక్ పోలీసులతో పాటు రవాణా శాఖ అధికారులు పలు చోట్ల విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. హెల్మెట్ లేకుండా వాహనం నడిపే వారికి రూ.1035 జరిమానాతో పాటు 3 నెలల పాటు డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేస్తున్నారు. కేవలం ఐదు రోజుల్లో 1,199 మంది లైసెన్సులను తాత్కాలికంగా రద్దు చేశారు. వీరు మూడు నెలల తరువాత రవాణాశాఖ కార్యాలయానికి వెళ్లి జరిమానా విధించిన రశీదు, ఆధార్ కార్డు అందజేస్తే లైసెన్సును పునరుద్ధరిస్తారు.హెల్మెట్ ధారణ తప్పనిసరిహెల్మెట్లు లేకుండా ప్రయాణించడంతోనే చాలా మంది రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. ద్విచక్రవాహనంపై వెనుక కూర్చున్నవారు కూడా కచ్చితంగా హెల్మెట్లు ధరించాలని కొద్ది రోజులుగా అవగాహన కల్పించాం. ఈ నెల ఒకటో తేదీ నుంచి నిబంధనలను అమలు చేస్తున్నాం. ఐదు రోజుల్లో 1,199 మంది లైసెన్సులను రద్దు చేశాం. పోలీసుల వద్ద సుమారు 3 వేల వరకు ఈ రశీదులున్నాయి. వాటిని కూడా సేకరించి రద్దు చేసే చర్యలు చేపడతాం.– రాజారత్నం, ఉప రవాణా కమిషనర్, విశాఖ -
రంగారెడ్డి: రెడ్ హ్యాండెడ్‌గా ఏసీబీకి చిక్కిన అడిషనల్ కలెక్టర్
సాక్షి, రంగారెడ్డి జిల్లా: రంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ భూపాల్‌రెడ్డి ఏసీబీకి చిక్కారు. రూ.8 లక్షల లంచం తీసుకుంటూ భూపాల్ రెడ్డితో పాటు సీనియర్ అసిస్టెంట్ దొరికిపోయారు. ఆయన ఇంట్లో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. సీనియర్ అసిస్టెంట్ మదన్‌మోహన్‌లాల్ ఇంట్లోనూ ఏసీబీ సోదాలు నిర్వహిస్తోంది. రంగారెడ్డి కలెక్టర్ ఆఫీసులో నిన్న సాయంత్రం నుంచి ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి.వ్యక్తి ధరణి వెబ్ సైట్లో ప్రొహిబిటెడ్ లిస్ట్ నుంచి 14 గుంటల ల్యాండ్‌ను తొలగించాలని సీనియర్ అసిస్టెంట్‌ను బాధితుడు కోరాడు. ఈ పని చేసేందుకు సీనియర్ అసిస్టెంట్ మదన్‌మోహన్‌లాల్ రూ. 8 లక్షలు డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. ఆ డబ్బులు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా అధికారులు పట్టుకున్నారు. -
కలెక్టర్ సీసీ లైంగికంగా వేధిస్తున్నాడు
నరసరావుపేట: కలెక్టర్ బంగ్లాలో పనిచేస్తున్న తనపై క్యాంపు క్లర్క్ (సీసీ)గా వ్యవహరిస్తున్న జానీబాషా లైంగిక, మానసిక వేధింపులకు పాల్పడుతున్నాడని ముద్దా నాగమణి ఆరోపించింది. ఈ మేరకు సోమవారం పల్నాడు జిల్లా కలెక్టరేట్, పోలీసు కార్యాలయాల్లో నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్ పి.అరుణ్‌బాబు, ఎస్పీ కె.శ్రీనివాసరావులకు ఆమె ఫిర్యాదు చేసింది. అనంతరం కలెక్టరేట్ ఆవరణలో ఆమె మీడియాతో మాట్లాడింది. తాను పెద్దచెరువులోని కలెక్టర్ బంగ్లాలో రెండేళ్లుగా వంటమనిషిగా పనిచేస్తున్నానని, సీసీగా జానీబాషా వచ్చిన దగ్గర నుంచి తనతో అనుచితంగా వ్యవహరిస్తున్నాడని తెలిపింది. తాను నాలుగైదు నెలలుగా జీతాలు లేకుండా పనిచేశానని, గత కలెక్టర్ ఎల్.శివశంకర్ తనను అప్కాస్‌లో ఉద్యోగిగా చేర్చారన్నారు. ఏడాది క్రితం కలెక్టర్ బంగ్లాకు సీసీగా వచ్చిన జానీబాషా ఇబ్బందులు పెట్టడం ప్రారంభించాడన్నారు. గత ఆరు నెలల నుంచి తనను లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడని, ఒక నెల నుంచి తనను ఉద్యోగం చేయకుండా ఆపేశారన్నారు. టీ ఇచ్చే సమయంలో తన చేయి పట్టుకొని లాగటం చేసేవాడన్నారు. తానంటే ఇష్టమని చెబుతూ.. రూం బుక్ చేశాను రమ్మంటూ లైంగిక వేధింపులకు పాల్పడేవాడని ఆవేదన వ్యక్తం చేశారు.అయినా అతనికి లొంగనందువల్ల తనను ఉద్యోగం నుంచి తొలగించాడని చెప్పారు. అదే బంగ్లాలో తన సోదరుడు కూడా పనిచేస్తున్నాడని, సీసీ చేస్తున్న పనులను గురించి అతనికి చెప్పానని, దీనిపై సీసీని అడిగితే నా ఇష్టం వచ్చినట్లుగా ఉంటానని, జరిగిన విషయం ఎవరికై నా చెబితే మీ ఉద్యోగాలు తొలగిస్తామని బెదిరించాడన్నారు. వారం రోజుల క్రితం కలెక్టరేట్లో డీఆర్ఓకు తాను ఫిర్యాదు చేయగా ఇప్పటివరకు ఏ చర్య తీసుకోలేదన్నారు. ఇప్పటికై నా తనకు లొంగితే నీకు, నీ తమ్ముడికి ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఒత్తిడి చేస్తున్నాడన్నారు. దీనిపై కలెక్టర్, ఎస్పీలకు విన్నవించేందుకు వచ్చానని ఆమె తెలిపారు. -
ప్రఫుల్ దేశాయ్‌పై ట్రోలింగ్!
సాక్షిప్రతినిధి, కరీంనగర్: కరీంనగర్ అడిషనల్ కలెక్టర్(లోకల్ బాడీస్) ప్రఫుల్ దేశాయ్‌పై వివాదాస్పద ఐఏఎస్ పూజా ఖేద్కర్ తరహాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 2019 ఐఏఎస్ బ్యాచ్‌కి చెందిన ఆయన సివిల్స్‌లో 523వ ర్యాంకుతోపాటు ఆర్థోపెడికల్లీ హ్యాండీక్యాప్డ్ సర్టిఫికెట్ కూడా క్లెయిమ్ చేశారు. ఇటీవల మహారాష్ట్రలో ట్రైనీ ఐఏఎస్ ఖేద్కర్ తరహాలోనే ప్రపుల్ దేశాయ్ కూడా నకిలీ దివ్యాంగుడని, ఆయన సర్టిఫికెట్ తప్పని పలువురు ‘ఎక్స్’ వేదికగా ట్రోల్ చేస్తున్నారు. ఇందుకు సోషల్ మీడియాలోని ఆయన సైక్లింగ్, హార్స్ రైడింగ్, బోటింగ్, ట్రెక్కింగ్ చేసిన ఫొటోలను ఉదహరిస్తున్నారు. కాలు బాగాలేని వ్యక్తి ఇవన్నీ ఎలా చేస్తున్నాడు? అంటూ విమర్శలకు దిగుతున్నారు. ఈ పోస్టులపై మిశ్రమ స్పందన వ్యక్తమైంది. ఆయన మిత్రులు, తెలిసినవారు ప్రఫుల్ దేశాయ్‌కి మద్దతుగా నిలుస్తున్నారు. ముఖ్య ంగా ఆయనతో చిన్ననాటి నుంచి కలిసి చదువుకున్న వారంతా ప్రఫుల్ కాలికి ఉన్న సమస్య నిజమైనదేనని, వాస్తవాలు తెలుసుకోకుండా ఆయన మనసు గాయపరచవద్దని హితవు పలుకుతున్నారు. అయినా, ట్రోలింగ్ ఆగడకపోవడం గమనార్హం. ఒక ఖాతా నుంచి కాకుండా వివిధ సోషల్ మీడియా ఖాతాల నుంచి ట్రోల్ చేస్తుండటంతో ఇది ఉద్దేశపూర్వక చర్యగా కరీంనగర్ కలెక్టరేట్ అధికారులు భావిస్తున్నారు.చట్టపరమైన చర్యలు తీసుకుంటాంతనపై జరుగుతున్న ట్రోలింగ్‌పై ఐఏఎస్ ప్రఫుల్ దేశాయ్ ఎక్స్ వేదికగా స్పందించారు. మూడు పేజీల లేఖతో నెటిజన్లకు స్పష్టత ఇచ్చారు. అందులో.. ‘2019 యూపీఎస్సీ ఇంటర్వ్యూ అనంతరం ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ అండ్ సైన్సెస్(ఏఐఐఎంఎస్) మెడికల్ బోర్డు ముందు హా జరయ్యాను. వారు నాకున్న లోపాన్ని సర్టిఫై చేశారు. అనంతరం అదే రిపోర్టును డీవోపీటీతోపాటు యూపీఎస్సీకి పంపారు. కొందరు నా మీద తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్న విషయం నా దృష్టికి వచ్చింది. ఇది ఎంతో బాధాకరం. నిజంగానే తప్పుడు సర్టిఫికెట్లు పెట్టిన వారిని ప్రశ్నిస్తే అందులో అర్థముంది. కానీ, నిజాయతీగా ఉన్న వారిని ఆన్లైన్లో వ్యక్తిగత ఫొటోలు పెట్టి మరీ తప్పుడు ఆరోపణలు చే యడం మా పనితీరును, వ్యక్తిత్వాన్ని దెబ్బతీయడమే అవుతుంది.’ అని స్పష్టం చేశారు. ఈ అంశంపై ‘సాక్షి’కి వివరణ ఇస్తూ.. తనను ఆన్లైన్లో ట్రోల్ చేసిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకునే విషయాన్ని పరిశీలిస్తున్నామన్నారు.యూపీఎస్సీ స్కాం పేరిట ట్రెండింగ్మొత్తం మీద ఖేద్కర్ వ్యవహారంతో ఇప్పుడు సోషల్ మీడియాలో యూపీఎస్సీ స్కాం, ఈడబ్ల్యూఎస్, వీల్‌చైర్ యూజర్ హ్యాష్‌ట్యాగ్‌లు ట్రెండింగ్‌లో ఉన్నాయి. ఫేస్బుక్, ఎక్స్, ఇన్‌స్ట్రాగామ్‌లలో ఎకనమిక్ వీకర్ సెక్షన్ (ఈడబ్ల్యూఎస్), నకిలీ దివ్యాంగుల సర్టిఫికెట్లు తీసుకొని, సివిల్స్ ర్యాంకు సాధిస్తున్నారంటూ ఇటీవల సివిల్స్ ర్యాంకు సాధించినవారి ఫొటోలతో నేరుగా ట్రోలింగ్‌కు దిగుతున్నారు. వీటిని ప్రధాని కార్యాలయం, డీవోపీటీ, ప్రధాని నరేంద్రమోదీకి ట్యాగ్ చేస్తున్నారు. మొత్తానికి పూజా ఖేద్కర్ వివాదంతో యూపీఎస్సీ తీవ్ర విమర్శలను మూటగట్టుకుంటోంది. ఆన్లైన్లో ర్యాంకర్ల ర్యాంకులు, వారి రిజర్వేషన్లను స్క్రీన్ షాట్లు తీసి, పెడుతుండటంతో సదరు అభ్యర్థులు తల పట్టుకుంటున్నారు. -
Palnadu: పల్నాడు కలెక్టర్‌గా శ్రీకేష్ బాలాజీ
సాక్షి, అమరావతి: ఎన్నికల అనంతరం జరిగిన హింసాత్మక ఘటనలను నివారించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పలువురు ఉన్నతాధికారులను బదిలీ, సస్పెన్షన్ చేసిన కేంద్ర ఎన్నికల సంఘం వారి స్థానాల్లో కొత్తవారిని నియమిస్తూ ఆదేశాలిచి్చంది. పల్నాడు జిల్లా కలెక్టర్‌గా శ్రీకేష్ బాలాజీ, పల్నాడు ఎస్పీగా మలికా గర్గ్, తిరుపతి ఎస్పీగా హర్షవర్థన్, అనంతపురం ఎస్పీగా గౌతమి శాలిని ఎంపిక చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డికి కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు సీఎస్ జవహర్‌రెడ్డి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. -
ఈసీ సీరియస్..కలెక్టర్, ఎస్పీలపై సస్పెన్షన్ వేటు
-
ఓటరు స్వేచ్ఛగా ఓటేసేలా ఏర్పాట్లు చేశాం: కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి
-
అదనపు కలెక్టర్‌కు అద్దె కారు..?
సాక్షి, ఆసిఫాబాద్: జిల్లా కలెక్టరేట్లో కంప్యూటర్ ఆపరేటర్లే పరిపాలన కొనసాగిస్తున్నారా..? అంటే అవుననే సమాధానం అధికారవర్గాల నుంచే వ్యక్తమవుతోంది. ఉన్నతాధికారులు సైతం వారి మీదే ఆధారపడటంతో అనధికారికంగా వారు(కంప్యూటర్ ఆపరేటర్లు) క్యాంప్ క్లర్క్‌ల హోదాల్లో విధులు నిర్వహిస్తుండటం గమనార్హం. జిల్లా సర్వోన్నతాధికారి సైతం వారికి వత్తాసు పలుకుతుండటం కొసమెరుపు. దీంతో కలెక్టరేట్లో అనధికారిక సీసీల ఇష్టారాజ్యం నడుస్తోందన్న విమర్శలు అన్ని వర్గాల నుంచి వెల్లువెత్తుతున్నాయి. ‘అర్హత లేకున్నా అందలం’ శీర్షికతో గత నెలలో ‘సాక్షి’ అనధికారిక సీసీలపై కథనం ప్రచురించిన విషయం తెలిసిందే. ఈ కథనానికి కలెక్టర్ స్పందిస్తూ.. తన వద్ద పనిచేస్తున్న రాజశేఖర్(అనధికారిక సీసీ) హ్యాండ్ హోల్డింగ్ పర్సన్(హెచ్‌హెచ్‌పీ) కేవలం కంప్యూటర్ విధులకు మాత్రమే అతని సేవలు వినియోగిస్తున్నామన్నారు. అదేవిధంగా ఇద్దరు అదనపు కలెక్టర్లు, డీఆర్వో వద్ద పనిచేస్తున్న కార్తీక్, షఫీ, జావీద్ కూడా కంప్యూటర్ ఆపరేటర్లుగానే సేవలందిస్తున్నారని అప్పట్లో స్పష్టం చేశారు. అయితే వారు ఏనాడు కంప్యూటర్ విధుల్లో పనిచేసిన దాఖలాలు కనిపించలేదని కలెక్టరేట్ వర్గాల నుంచే విమర్శలు వినిపించాయి. ఇటీవల ఓ అనధికారిక సీసీ ఏకంగా జిల్లా అధికారులతో రివ్యూ చేసినట్లు సమాచారం. ‘ఉన్నతాధికారి లేకుండా ఇదేం రివ్యూ రా బాబు’ అంటూ సమావేశంలో పాల్గొన్న అధికారులు తల పట్టుకొన్నట్లు తెలుస్తోంది. కలెక్టర్ స్పష్టం చేసినట్లుగా రాజశేఖర్ కంప్యూటర్ విధులేమీ నిర్వహించడం లేదని సమాచారం. అతను మళ్లీ కలెక్టర్ సమావేశాల్లో పాల్గొంటుండడం గమనార్హం. కలెక్టర్ ఎక్కడికి వెళ్లినా అతను తప్పకుండా వెంట వెళ్తున్నారు. కలెక్టర్‌కు అన్నీ అతనే అన్నట్లుగా వ్యవహారం నడుస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అదనపు కలెక్టర్(స్థానిక సంస్థలు), అదనపు కలెక్టర్(రెవెన్యూ), డీఆర్వోల వద్ద కంప్యూటర్ ఆపరేటర్ పేరిట విధులు నిర్వహిస్తున్న కార్తీక్, షఫీ, జావీద్‌లు సైతం అనధికారిక సీసీలుగా కొనసాగుతుండడం విశేషం. మంగళవారం సైతం గంగాపూర్ పర్యటనలో కలెక్టర్ వెంట రాజశేఖర్, కాగజ్‌నగర్ పర్యటనలో అదనపు కలెక్టర్ దాసరి వేణు వెంట షఫీ పాల్గొన్నారు. నిజంగా వారిని కంప్యూటర్ విధులకే వినియోగిస్తుంటే వారిని తమ వాహనాల్లో ఉన్నతాధికారులు ఎందుకు తీసుకెళ్తున్నారో అర్థం కాని ప్రశ్నగా నిలుస్తోంది. వాస్తవానికి అధికారిక సీసీలు ఉన్నప్పటికీ వారి సేవలు పెద్ద వినియోగించుకోకపోవడం విడ్డూరంగా కనిపిస్తోంది. ఉన్నతాధికారుల పేర్లు చెప్పి మామూళ్లు వసూళ్లు చేస్తున్నారనే ఆరోపణలు వారిపై ఉన్నా.. ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం కలెక్టరేట్లో ఇష్టారాజ్యానికి అద్దం పడుతోంది. అధికార దుర్వినియోగం... కలెక్టరేట్లో కలెక్టర్, అదనపు కలెక్టర్లకు ప్రభుత్వ వాహనాలు ఉన్నాయి. అలాగే ఆసిఫాబాద్ ఆర్డీవో, పదిహేను మండలాల తహసీల్దార్లకు సంబంధించిన వాహనాలకు సర్కారు అద్దె చెల్లిస్తోంది. అయితే గత రెండు నెలలుగా అదనపు కలెక్టర్(రెవెన్యూ) దాసరి వేణు మాత్రం ప్రభుత్వ వాహనానికి బదులుగా ఒక ప్రైవేటు వాహనాన్ని వినియోగిస్తున్నారు. అతని కోసం కేటాయించిన ప్రభుత్వ వాహనాన్ని జిల్లా కలెక్టర్ తీసుకున్నారు. అయితే ఆ వాహనాన్ని అతను అధికారి విధుల కోసం వినియోగించడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. తన సొంత పనులకు ఆ కారును వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది. కుమార్తెను పాఠశాలకు తీసుకెళ్లేందుకు, ఇతరత్రా అవసరాలకు ప్రభుత్వ కారును వినియోగిస్తూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాగా, జిల్లా సర్వోన్నతాధికారి వాహనాన్ని మరమ్మతుల కోసం హైదరాబాద్‌లోని షోరూంకి తరలించగా.. ఆయన మంచిర్యాలకు చెందిన మరో అద్దె కారును ప్రస్తుతం వినియోగిస్తున్నారు. ఈ వాహనం అద్దె సైతం సింగరేణి సంస్థ చెల్లిస్తోందని సమాచారం. అయితే ఆయనకు మరో కారు ఉండగా.. మళ్లీ అదనపు కలెక్టర్ కారును రెండు నెలలుగా వినియోగిస్తుండటంపై కలెక్టరేట్ ఉద్యోగవర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. కాగా, అదనపు కలెక్టర్ అద్దె వాహనాన్ని ఎందుకు వినియోగిస్తున్నారని కలెక్టరేట్లోని ఓ ముఖ్య అధికారిని ‘సాక్షి’ ప్రశ్నించగా.. ఆ కారు రిపేర్‌లో ఉందని సమాధానం ఇవ్వడం కొసమెరుపు. -
మన్యం మిరియాలు అ‘ధర’హో..!
సాక్షి,పాడేరు: ఏజెన్సీలో గిరిజన రైతుల నుంచి 100 మెట్రిక్ టన్నుల మిరియాలను పాడేరు ఐటీడీఏ ద్వారా కొనుగోలు చేయాలని లక్ష్యంగా నిర్ణయించినట్టు కలెక్టర్ సుమిత్‌కుమార్ తెలిపారు. పాడేరు డివిజన్లోని వ్యవసాయ, ఉద్యానవన, కాఫీ విభాగం అధికారులు, సిబ్బందితో సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి మండలం నుంచి 10 టన్నులు కొనుగోలు చేయాలని తెలిపారు. మిరియాల పంటను సాగుచేస్తున్న గిరిజన రైతుల ఆర్థికాభివృద్ధి లక్ష్యంగా కిలో రూ.500 మద్దతు ధరతో నాణ్యమైన మిరియాలను కొనుగోలు చేస్తామన్నారు. తక్కువ ధరతో దళారీలకు అమ్ముకుని మోసపోకుండా రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. మిరియాల ఉత్పత్తిలో గిరిజన రైతులు తగిన నాణ్యత పాటించాలని, ఎండిన మిరియాలలో తేమశాతం తక్కువుగా ఉండాలన్నారు. వచ్చేనెల 1వతేదీ నుంచి 15వ తేదీ వరకు కాఫీ లైజన్ వర్కర్లు గ్రామాల్లో పర్యటించి మిరియాల కొనుగోలుపై రైతులకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. మిరియాల నిల్వలకు గాను గిరిజన రైతులకు ఉచితంగా గోనెసంచులను పంపిణీ చేస్తామన్నారు.10వేల ఎకరాల్లో కాఫీ తోటల కన్సాలిడేషన్‌కు ప్రతిపాదనలు పంపాలని ఆదేశించారు. మిరియాల నూర్పిడికి యంత్రాల వినియోగం స్పైసెస్ బోర్డు విస్తరణ అధికారి కల్యాణి మాట్లాడుతూ గిరిజన రైతులు పాదుల నుంచి సేకరించిన మిరియాల నూర్పిడిలో యంత్రపరికరాలను వినియోగించాలన్నారు. కంకుల నుంచి మిరియాలను వేరుచేసేందుకు కాళ్లతో తొక్కడం వల్ల బ్యాక్టిరీయా చేరి నాణ్యత తగ్గే పరిస్థితి ఉందన్నారు. పచ్చిమిరియాలను ఒక నిమిషం వేడినీటిలో ముంచి తీసిన తరువాత ఎండబెడితే గింజ నల్లగా ఉండి మంచి ధర వస్తుందని చెప్పారు. తేమ 10 శాతం ఉండేలా చూసుకోవాలని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ ఏపీవో వెంకటేశ్వరరావు, కాఫీ ఏడీ అశోక్, కేంద్ర కాఫీబోర్డు డీడీ రమేష్,జిల్లా వ్యవసాయ,ఉద్యానవనశాఖ అధికారులు నందు, రమేష్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ని‘వేదనలు..’ ప్రజావాణికి వినతుల వెల్లువ*
ఆదిలాబాద్: ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించే ప్రజావాణికి ఈ వారం వినతులు వెల్లువెత్తాయి. తమ ఆవేదనను ఉన్నతాధికారులకు నివేదించేందుకు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అదనపు కలెక్టర్లు శ్యామాలాదేవి, ఖుష్బూగుప్తాతో కలిసి కలెక్టర్ రాహుల్‌రాజ్ అర్జీలు స్వీకరించారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. బాధితుల అర్జీ లను సంబంధిత శాఖ అధికారులకు అందజేస్తూ పరిష్కరించాల్సిందిగా ఆదేశించారు. పెండింగ్‌లో ఉంచొద్దన్నారు. అలాగే గ్రీవెన్స్‌కు జిల్లాస్థాయి అధికారులంతా తప్పనిసరిగా హాజరువాలన్నారు. కాగా అర్జీల స్వీకరణ సమయంలో కలెక్టర్ అధికారులతో సమీక్ష నిర్వహించడంతో బాఽధితులు గంటన్నర పాటు బయటే ఇబ్బందులు పడుతూ నిరీక్షించాల్సి వచ్చింది. అర్జీల స్వీకరణ సమయంలో సమావేశాల నిర్వహణ ఏంటంటూ పలువురు ఆసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ వారం అందిన అర్జీల్లో అత్యధికంగా ఆసరా పింఛన్లు, ధరణి, భూ సమస్యలు, డబుల్ బెడ్రూం ఇళ్లు, స్వయం ఉపాధి కల్పన, రుణాల మంజూరు వంటివి ఉన్నాయి. బాధితుల్లో కొందరి నివేదన వారి మాటల్లోనే.. రెండేళ్లుగా వేతనాల్లేవ్.. మేమంతా జిల్లాలోని గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో 15 ఏళ్లుగా ఏఎన్ఎంలుగా పనిచేస్తున్నాం. వేతనాలు తక్కువే అయినా మా పిల్లలనే ఉద్దేశంతో బాధ్యతగా సేవలందిస్తున్నాం. అలాంటి మా కు రెండేళ్లుగా ప్రభుత్వం వేతనాలు చెల్లించట్లేదు. ఏఎన్ఎం పోస్టుల భర్తీ కోసం ఇటీవల చేపట్టిన నియామక ప్రక్రియలోఎంపికయ్యాం. కానీ కొంతమంది కోర్టుకు వెళ్లడంతో మమ్మల్ని విధులకు రావద్దని అధికారులు చెబు తున్నారు. పెండింగ్ బకాయిలు చెల్లించకపోగా ఉపాధి దూరం చేసే పరిస్థితి నెలకొంది. మమ్ముల్ని యథావిధిగా కొనసాగిస్తూ వేతనాలు చెల్లించాలి. – ఆశ్రమ పాఠశాలల ఏఎన్ఎంలు బోర్లకు అడ్డుపడుతున్నరు మేమంతా ఆదివాసీ గిరిజన రైతులం. గిరి వికాసం పథకం కింద మా వ్యవసాయ భూములకు బోరుబావి,త్రీఫేజ్ విద్యుత్ మంజూరైంది. కరెంట్ సౌకర్యం కల్పించగా.. బోరుబావులు వేసుకుందామంటే అటవీశాఖ అధికారులు అడ్డుపడుతున్నరు. గ్రామంలోకి మిషన్లను రాకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నరు. బోరు బావుల తవ్వకానికి అనుమతిచ్చి యాసంగి పంటల సాగుకు అవకాశం కల్పించాలని కోరుతున్నాం. – గిరిజై గ్రామస్తులు, బజార్హత్నూర్ పట్టా చేయడం లేదు నా భర్త గుండెన ఎల్లన్న పేరిట ఆ దిలాబాద్ పట్టణంలోని ఖానాపూర్‌లో గల సర్వేనంబర్ 47/2/9లో 1.12 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఆయన చనిపోవడంతో ఆ భూమిని నా పేరిట పట్టా చేసి ఇవ్వాలని తహసీల్దార్‌కు దరఖాస్తు పెట్టిన. ఐదేళ్లుగా ఆఫీస్ చుట్టూ నా నలుగురు బిడ్డలతో కలిసి తిరుగుతూనే ఉన్నా. అయినా అధికారులెవరు కనికరించట్లేదు. దయచేసి విచారణ జరిపించి నా పేరిట పట్టా చేసి ఆదుకోవాలని కోరుతున్నా.– గుండెన రాంబాయి, ఆదిలాబాద్ షెడ్లు కేటాయించాలి మేమంతా చిరు వ్యాపారులం. పట్టణంలోని రోడ్లపై వివిధ వ్యాపారాలతో కుటుంబాలను పోషించుకుంటున్నాం. పట్టణంలోని డైట్ కళాశాల వద్ద గల షెడ్లను మేము ఏర్పాటు చేసుకుంటే మున్సిపల్ అధికారులు ఇటీవల తొలగించారు. దీంతో ఉపాధికి దూరమయ్యే పరిస్థితి ఏర్పడింది. బల్దియా నిర్మించే షెడ్లను కేటాయించి ఆదుకోవాలని కలెక్టర్‌కు విన్నవించాం. – చిరు వ్యాపారులు, ఆదిలాబాద్ అనుమతి లేదని కూల్చేశారు సర్వేనంబర్ 170లోని ప్లాట్ నంబర్ 428లో రేకుల ఇల్లు నిర్మించుకున్న. గ్రామ పంచాయతీలో ట్యాక్స్ కూడా కట్టిన. కానీ ఇంటికి బల్దియా నుంచి అనుమతి లేదనే కారణంతో మున్సిపల్ అధికారులు నా ఇంటిని కూల్చివేశారు. ఎన్నో ఇళ్లు అనుమతి లేకుండా నిర్మించినవి ఉన్నప్పటికి కేవలం నా ఒక్క ఇంటిని మాత్రమే కూల్చివేసి నష్టం చేశారు. దీనిపై విచారించి నాకు న్యాయం చేయాలి. – బత్తుల రాములు, మావల. -
ఎన్నికల ఏర్పాట్లపై కసరత్తు!
కర్నూలు: సార్వత్రిక ఎన్నికలు మార్చి, ఏప్రిల్ నెలల్లో జరిగే అవకాశం ఉండటంతో ఏర్పాట్లపై జిల్లా అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే పోలింగ్ కేంద్రాలను గుర్తించి వాటిలో మౌలిక వసతుల కల్పనపై దృష్టి సారించారు. వీటితోపాటు డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ , కౌంటింగ్ కేంద్రాల్లో పని చేసేందుకు అవసరమైన ఉద్యోగుల వివరాల సేకరించే ప్రయత్నంలో ఉన్నారు. ఇందుకోసం ట్రేజరీస్ డీడీ, జిల్లా ఎంప్లాయ్మెంట్ అధికారుల ఆధ్వర్యంలో మ్యాన్ పవర్ కమిటీని ఏర్పాటు చేశారు. ఒకటి, రెండు రోజుల్లో నివేదికకు సిద్ధం ఎన్నికలు ఎప్పుడొచ్చినా అధికార యంత్రాంగం సిద్ధంగా ఉండడానికి సమాయత్తం అవుతోంది. ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులను నియమించేందుకు ఏర్పాట్లను ముమ్మరం చేస్తోంది. ఇప్పటికే ఉద్యోగుల వివరాలు సేకరణ కోసం ఏర్పాటు చేసిన మ్యాన్‌పవర్ కమిటీ తన విధులను ప్రారంభించింది. అన్ని శాఖల్లో పని చేస్తున్న ఉద్యోగుల వివరాలు సేకరిస్తోంది. విద్యాశాఖలో పనిచేసే ఉపాధ్యాయులు, ఇతర అధికారులు, ఫోర్త్ క్లాస్ ఎంప్లాయిస్, జూనియర్ , సీనియర్ అసిస్టెంట్లు, డిప్యూటీ తహసీల్దార్లు, తహసీల్దార్లు, వివిధ శాఖల ఇంజినీరింగ్ విభాగాల్లో పనిచేసే ఏఈలు, డీఈలు, ఈఈలు, ఎస్ఈలు డిప్యూటీ కలెక్టర్లు, ఆర్డీఓలు, సబ్ కలెక్టర్లు, జేసీలు, కలెక్టర్ వరకు ఇలా అన్ని స్థాయిలా అధికారులు ఎన్నికల విధుల్లో పాల్గొంటారు. ఒకటి, రెండు రోజుల్లో దాదాపు 33 శాఖల్లో పనిచేసే అధికారుల వివరాలను నివేదించేందుకు మ్యాన్ పవర్ కమిటీ సిద్ధమవుతోంది. 18 వేల మంది సిబ్బంది అవసరం.. ఎన్నికల విధుల్లో ప్రధానంగా పోలింగ్, డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్, కౌంటింగ్ కేంద్రాలతోపాటు ఇతర విధుల్లో పాల్గొనేందుకు జిల్లాకు 18 వేల మంది సిబ్బంది అవసరం అవుతారు. జిల్లాలో 2,186 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో ప్రతి పోలింగ్ కేంద్రానికి ఒక ప్రైసెడింగ్ ఆఫీసర్, ఒక అడిషినల్ ప్రైసెడింగ్ ఆఫీసర్, నలుగురు అదర్ ప్రైసెడింగ్ ఆఫీసర్లు ఉంటారు. ఈ లెక్కన దాదాపు 13,116 మంది సిబ్బంది అవసరం అవుతారు. అంతేగాక మరో 2 వేల మంది వరకు రిజర్వ్‌లో ఉండేందుకు అవసరం. వీరితోపాటు డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్, కౌంటింగ్ తోపాటు ఇతర విధులకోసం మరో 3 వేల వరకు సిబ్బంది అవసరం అవుతారు. పోలీసులు కాకుండానే జిల్లాలో మొత్తంగా దాదాపు 18 వేల మంది వరకు ఉద్యోగులు ఎన్నికల విధుల్లో పాల్గొనాల్సి ఉంటుంది. ఇప్పటికే ఎన్నికల విధుల్లో సెక్టోరల్, నోడల్ ఆఫీసర్లు ఇప్పటికే 20 మందిని నోడల్ అధికారులుగా నియమించగా.. వారు ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారు. జిల్లాలో 234 మంది సెక్టోరల్ ఆఫీసర్లను నియమించారు. వీరంతా పోలింగ్ కేంద్రాల్లో మౌలిక వసతులపై ఆరా తీస్తున్నారు. పోలీసులకు సంబంధించి 234 మంది పోలీసు సెక్టోరల్ అధికారులను నియమించారు. వీరు పోలింగ్ కేంద్రాల భద్రత అంశాలపై పరిశీలన చేస్తున్నారు. వీరంతా కూడా ఒకటి, రెండురోజుల్లో కలెక్టర్‌కు నివేదిక ఇవ్వాల్సి ఉంది. ఎంపికై న ఉద్యోగులకు శిక్షణ ఇస్తాం సార్వత్రిక ఎన్నికలు ఎప్పుడు వచ్చినా నిర్వహించేందుకు అన్ని రకాలుగా సిద్ధమవుతున్నాం. సిబ్బంది ఎంపిక కోసం మ్యాన్ పవర్ కమిటీని నియమించాం. ఒకటి, రెండు రోజుల్లో నివేదికలు వస్తాయి. ఎన్నికల సంఘం నిబంధనలు మేరకు కావాల్సిన వారిని ఎంపిక చేసుకుని శిక్షణ ఇస్తాం. – డాక్టర్ జి.సృజన, కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికార ఇవి చదవండి: ఎన్నికల పటిష్ట నిర్వహణకు కార్యాచరణ -
గంటలో హామీ అమలు
సాక్షి ప్రతినిధి, కాకినాడ: కాకినాడ పర్యటన సందర్భంగా బుధవారం తనను కలిసిన పలువురు అనారోగ్య బాధితుల పరిస్థితి చూసి చలించిపోయిన ముఖ్యమంత్రి జగన్ తక్షణ సాయం అందించాలని కలెక్టర్ కృతికా శుక్లాను ఆదేశించారు. సీఎం కార్యక్రమం ముగించుకుని వెళ్లిన గంటలోపే తొమ్మిది మందికి రూ.13 లక్షల ఆర్థిక సాయాన్ని కలెక్టరేట్లో చెక్కు రూపంలో అందజేశారు. వీరిలో 8 మందికి రూ.లక్ష చొప్పున ఇవ్వగా ఒక బాధితుడికి రూ.5 లక్షలు కలిపి మొత్తం రూ.13 లక్షల విలువైన చెక్కులను కలెక్టర్ అందజేశారు. ముఖ్యమంత్రిని కలిసిన గంటలోపే సాయం అందడంపై బాధిత కుటుంబాలు కృతజ్ఞతలు తెలిపాయి. సాయివెంకట్కిరణ్ తల్లికి రూ.లక్ష, కోట సత్యసాయి జన్విర్కు రూ.లక్ష, జి.సుష్మశ్రీ తండ్రికి రూ.లక్ష, పత్తికాయల డేవిడ్ రోషన్‌కు రూ.లక్ష, దూడ రవికుమార్‌కు రూ.లక్ష, గనిశెట్టి రూపాలక్ష్మికి రూ.లక్ష, మర్రిరపూడి విశ్వేశ్వరరావుకు రూ.5 లక్షలు, పటేల కుష్మిత కుమారికి రూ.లక్ష, గనిశెట్టి కనక మహాలక్ష్మికి రూ.లక్ష చొప్పున చెక్కు రూపంలో ఆర్థిక సాయం అందిస్తున్న కలెక్టర్ కృతికా శుక్లా ► కాకినాడ భానుగుడి తిరుమలశెట్టి వీధికి చెందిన కృష్ణారావు కుమారుడు 41 ఏళ్ల మర్రిపూడి విశ్వేశ్వరరావుకు రూ.5 లక్షలు. ► కాకినాడ రూరల్ మండలం సర్పవరానికి చెందిన శ్రీనివాస్ కుమారుడు ఏడేళ్ల జి.జయసాయి వెంకట కిరణ్ కిడ్నీ చికిత్సకు రూ.లక్ష. ► కరప మండలం వేములవాడకు చెందిన నాగార్జున కుమారుడు కోట సత్య వెంకట సాయి జశి్వక్ వైద్యానికి రూ.లక్ష. ► పిఠాపురం మండలం కందరాడ గ్రామానికి చెందిన రెండేళ్ల బాలిక జి.సుష్మశ్రీ వైద్యానికి రూ.లక్ష. ► కాకినాడ గాం«దీనగర్‌కు చెందిన పి.శ్రీనివాస్ కుమారుడు 17 ఏళ్ల పత్తికాయల డేవిడ్ రోషన్ వైద్యం నిమిత్తం రూ.లక్ష. ► యు.కొత్తపల్లి మండలం కోనపాపపేటకు చెందిన చిట్టిబాబు కుమారుడు 17 ఏళ్ల దూడ రవికుమార్ వైద్యానికి రూ.లక్ష. ► పిఠాపురం మండలం కోలంకకు చెందిన రెండేళ్ల బాలిక గనిశెట్టి రూపాలక్ష్మి వైద్య సహాయానికి రూ.లక్ష. ► కాకినాడ పల్లంరాజు నగర్‌కు చెందిన కులదీప్‌కుమార్ కుమార్తె మూడేళ్ల పటేలా కుష్మిత కుమారికి రూ.లక్ష. ► కరపకు చెందిన 11 సంవత్సరాల బాలిక గనిశెట్టి కనకమహాలక్ష్మి కి రూ.లక్ష. -
ఆధార్‌కార్డులో ఆంధ్రప్రదేశ్ ఉన్నా దరఖాస్తు చేసుకోవచ్చు : కలెక్టర్ డాక్టర్ ప్రియాంక
భద్రాద్రి/కొత్తగూడెం: ప్రజాపాలన దరఖాస్తులకు ఆదాయం, లోకల్ ఏరియా సర్టిఫికెట్లు జతపర్చాల్సిన అవసరంలేదని కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ఆల తెలిపారు. దరఖాస్తుదారులు వ్యక్తం చేస్తున్న సందేహాలపై శుక్రవారం ఆమె స్పష్టతనిచ్చారు. ఆధార్‌కార్డుల్లో ఆంధ్రప్రదేశ్ అని ఉన్నా మార్చాలిన అవసరం లేదని తెలిపారు. ఆధార్, రేషన్ కార్డు జిరాక్స్, పాస్‌పోర్టు ఫొటో సరిపోతాయని పేర్కొన్నారు. ఆధార్ కార్డులో ఆంధ్రప్రదేశ్, ఖమ్మం జిల్లా ఉంటే దరఖాస్తులు తీసుకోరని, ఆదాయం, కుల ధ్రువీకరణపత్రాలు అడుగుతున్నారని సామాజిక మాధ్యమాల్లో వచ్చే పుకార్లను నమ్మవద్దని సూచించారు. సందేహాలు ఉంటే ప్రజలు హెల్ప్‌డెస్క్‌ను, రెవెన్యూ, ఎంపీడీఓ, ఎంపీఓ, గ్రామకార్యదర్శి, అంగన్వాడీ సిబ్బంది, మహిళాస్వయం సహాయక సంఘ సభ్యులను సంప్రదించాలని వివరించారు. అసత్య ప్రచారాలను నమ్మొద్దన్నారు. ఇతర వివరాలకు కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కంట్రోల్‌రూం 08744–241950కు కార్యాలయ పనివేళల్లో ఫోన్ చేయాలని చెప్పారు. రెండో రోజు 74 గ్రామ పంచాయతీల్లో, మూడు మున్సిపల్ వార్డుల్లో ప్రజాపాలన గ్రామసభలు నిర్వహించామని తెలిపారు. 34,995 గృహాల లబ్ధిదారుల నుంచి 44,711 దరఖాస్తులు స్వీకరించినట్లు తెలిపారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమానికి ప్రజల నుంచి విశేషస్పందన లభిస్తోందని తెలిపారు. స్వీకరించిన ప్రతి దరఖాస్తుకు బాధ్యతగా రశీదు అందజేయడంతోపాటు ప్రత్యేకంగా రిజిస్టర్లో నమోదు చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఇంటికి దరఖాస్తులను ఉచితంగా అందజేస్తున్నట్లు చెప్పారు. జిరాక్స్ కాపీలకు అధిక ధరలు వసూలు చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని, సంబంధిత జిరాక్స్ కేంద్రం అనుమతులు రద్దు చేస్తామని హెచ్చరించారు. ఎవరైనా ఎక్కువ వసూలు చేస్తే తహసీల్దార్, ఎంపీడీఓ, ఆర్డీఓ కార్యాలయంలో ఫిర్యాదు చేయాలని సూచించారు. 30న గ్రామ పంచాయితీ, మున్సిపాలిటీలలో షెడ్యూల్ ప్రకారం గ్రామ సభలు జరుగుతాయని తెలిపారు. ఇవి చదవండి: దరఖాస్తు ఫారాలు విక్రయిస్తే కేసులు.. : కలెక్టర్ రాహుల్‌రాజ్ -
విద్య రంగానికి సీఎం జగన్ ఎంతో చేసారు
-
అటెండర్ తో బూట్లు మోపించిన కలెక్టర్ భవేశ్ మిశ్రా
-
ఔను..! నిజంగానే కలెక్టర్‌కు కోపమొచ్చింది!
ఆదిలాబాద్: కలెక్టర్‌కు కోపమొచ్చింది.. ఎప్పుడు శాంతంగా, సరదాగా కన్పించే రాహుల్‌రాజ్ తొలిసారిగా ఆగ్రహం వ్యక్తం చేయడం అధికారులను విస్మయానికి గురిచేసింది. ప్రజావాణి అర్జీలు పెండింగ్‌లో ఉంచిన అధికారులను తీవ్రంగా మందలించిన కలెక్టర్, పది, ఇంటర్మీడియెట్ ఫలితాల్లో మెరుగైన ర్యాంకులు సాధించాల్సిందేనని స్పష్టం చేశారు. తన అనుమతి లేకుండా అధికారులేవరూ సెలవులో వెళ్లవద్దని ఆదేశించిన కలెక్టర్ ప్రజావాణిని లైట్‌గా తీసుకుంటే సహించబోనని కాస్త గట్టిగానే హెచ్చరికలు జారీ చేశారు. అర్జీదారులు వచ్చిన రాకపోయినా ప్రతి జిల్లా స్థాయి అధికారి ఉదయం 10.30 గంటలకు సోమవారం జరిగే ప్రజావాణికి విధిగా రావాలని లేకుంటే కుదరని తెల్చిచెప్పారు. ఈ నెల 21 న హైదరాబాద్‌లో జిల్లా కలెక్టర్లతో సీఎం సమీక్ష ఉన్నందున జిల్లా అధికారులు తమ శాఖలకు సంబంధించి ప్రగతి నివేదికలను సంక్షిప్త సమాచారంతో మంగళవారం సాయంత్రంలోగా అందించాలని ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో హాజరు శాతం పెంచడంతో పాటు పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించేలా ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. అనంతరం గుండె పోటుతో మరణించిన భీంపూర్ తహసీల్దార్ నారాయణ మృతికి సంతాప సూచకంగా అధికారులతో కలిసి రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఇవి చదవండి: ‘గృహలక్ష్మి’ దరఖాస్తులు పరిశీలించొద్దు! -
నల్లగొండ కలెక్టర్ ఆర్వి.కర్ణన్ బదిలీ
నల్లగొండ : జిల్లా కలెక్టర్ ఆర్వి.కర్ణన్ బదిలీ అయ్యారు. ఆయనను రాష్ట్ర పబ్లిక్ హెల్త్ డైరెక్టర్‌గా ప్రభుత్వం బదిలీ చేసింది. కలెక్టర్ ఆర్వి.కర్ణన్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కరీంనగర్ నుంచి బదిలీపై నల్లగొండకు వచ్చారు. జూలై 26, 2023న ఇక్కడ విధుల్లో చేరారు. జిల్లా యంత్రాంగంతో కలిసి ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించారు. అయితే నల్లగొండ కలెక్టర్‌గా ఇంకా ఎవరినీ నియమించలేదు. -
లబ్ధి చేకూరేలా.. ఫైల్ తొక్కి పెట్టిందెవరు?
కరీంనగర్: అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు అధికారులు కమిషనర్లుగా పదోన్నతి పొందిన వ్యవహారం ఓ ఉన్నతాధికారి మెడకు చుట్టుకునే అవకాశం కనిపిస్తోంది. సదరు అధికారులపై చార్జెస్ ఫ్రేమ్ అయి ఉన్నా ఆ ఫైల్‌ను తొక్కి పెట్టి, దొడ్డిదారిన పదోన్నతి వచ్చేట్లు చేయడంలో గతంలో కరీంనగర్లో పనిచేసి, వెళ్లిన ఓ ఉన్నతాధికారి పాత్ర ఉందన్న ఆరోపణలున్నాయి. ‘ఆరోపణలున్నా అందలం’ పేరిట ‘సాక్షి’లో కథనం ప్రచురితమవడంతో విచారణ చేపట్టాలంటూ నగరపాలక సంస్థ కమిషనర్ సీడీఎంఏను కోరిన విషయం విధితమే. రెండున్నరేళ్ల కిందటి ఈ వ్యవహారం ఇప్పటివరకు ఎందుకు వెలుగు చూడలేదు? ఆన్యువల్ కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ (ఏసీఆర్)లో తప్పుడు సమాచారాన్ని ఎవరు సీడీఎంఏకు పంపించారన్న అంశాలు ప్రస్తుతం తెరపైకి వస్తున్నాయి. అప్పట్లో ఆదేశించినా లేఖ రాయలే.. 2021లో నగరపాలక సంస్థ రెవెన్యూ విభాగంలో పని చేస్తున్న అధికారి, అకౌంటెంట్లపై ఆరోపణలు రావడం, అప్పటి కమిషనర్ ఇరువురిపై చార్జెస్ ఫ్రేమ్ చేయడం తెలిసిందే. దీనిపై విచారణ చేపట్టాలని కోరుతూ సీడీఎంఏకు నివేదించాలని అప్పటి కలెక్టర్ నగరపాలక సంస్థను ఆదేశించారు. కానీ ఈ విషయమై నగరపాలక సంస్థ సీడీఎంఏకు ఎలాంటి లేఖ రాయలేదు. దీంతో విచారణ అంశం అటకెక్కింది. అటు చార్జెస్ ఫ్రేమ్ ఫైల్‌ను, ఇటు కలెక్టర్ ఇచ్చిన ఆదేశాలను తొక్కి పెట్టి, అడ్డదారిలో ఇద్దరు అధికారులకు లబ్ధి చేకూరేలా చేయడంలో గతంలో పని చేసిన ఓ ఉన్నతాధికారి కీలకంగా వ్యవహరించారన్న ప్రచారం జరుగుతోంది. ఉద్యోగి పదోన్నతికి ముందు సీడీఎంఏకు పంపించే ఏసీఆర్లోనూ చార్జెస్ ఫ్రేమ్ అంశాన్ని పొందుపరచకుండా, క్లీన్ ఇమేజ్‌తో పంపించడంలోనూ ఆ ఉన్నతాధికారిదే కీలక పాత్ర అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏసీఆర్ను స్వయంగా ఉద్యోగి పూర్తి చేసినప్పటికీ, సంబంధిత ఉన్నతాధికారే సీడీఎంఏకు పంపించాల్సి ఉంటుంది. అన్నీ తెలిసి, సదరు అధికారులతో కుమ్మక్కవడం వల్లే తప్పుడు సమాచారాన్ని పంపించారన్న ఆరోపణలున్నాయి. నగరపాలక సంస్థ కోరిన మేరకు సీడీఎంఏ ఒకవేళ విచారణకు ఆదేశిస్తే నిజాలు వెల్లడి కానున్నాయి. ఇవి చదవండి: కర్ణాటకనే దిక్కు! ‘ట్రైడెంట్’లో ఊసేలేని చెరకు క్రషింగ్.. -
భార్య, పిల్లల్ని చంపేసి.. సిద్ధిపేట కలెక్టర్ గన్‌మెన్ ఆత్మహత్య
సాక్షి, సిద్ధిపేట జిల్లా: సిద్ధిపేట కలెక్టర్ గన్‌మెన్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భార్య, ఇద్దరు పిల్లల్ని చంపిన నరేష్.. గన్‌తో కాల్చుకున్నాడు. చిన్నకోడూర్ మండలం రామునిపట్లలో ఘటన జరిగింది. విధులు నిర్వహించుకుని ఇంటికి వచ్చే సమయంలో 9 mm పిస్తొల్‌తో భార్య చైతన్య, కుమారుడు రేవంత్, కుమార్తె హిమశ్రీలను కాల్చి, తాను ఆత్మహత్య చేసుకున్నాడు. ఆన్లైన్ బెట్టింగ్తో అప్పుల పాలై నరేష్ ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు. తనకున్న ఎకరం భూమిని అమ్మిన అప్పులు తీరకపోవడంతో సూసైడ్‌కు పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. సిద్ధిపేట పోలీస్ కమిషనర్ శ్వేత ఏమన్నారంటే.. 11గంటల 15 నిముషాల సమయంలో ఈ ఘటన జరిగింది 2013బ్యాచ్ కి చెందిన నరేష్ సర్వీస్ రివాల్వర్‌తో కుటుంబ సభ్యులను కాల్చి, తనను తాను కాల్చుకొని మరణించాడు కొంత అప్పులు ఉన్నట్లు ప్రాథమిక సమాచారం ఉంది ఆన్ డ్యూటీ లో ఉండగా ఈ ఘటన జరిగింది నరేష్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నాం కేసును దర్యాప్తు చేసి పూర్తి వివరాలు కనుక్కుంటాం మృతుల వివరాలు ఆకుల నరేష్, కానిస్టేబుల్, వయస్సు 35 సంవత్సరాలు, ARPC 2735, ప్రస్తుతం కలెక్టర్ వద్ద PSO గా విధులు నిర్వహిస్తున్నాడు. ఆకుల చైతన్య, నరేష్ భార్య, వయస్సు 30 సంవత్సరాలు ఆకుల రేవంత్, వయస్సు 6 సంవత్సరాలు, 1st క్లాస్ విద్యార్థి ఆకుల రిషిత, వయస్సు 5 సంవత్సరాలు, UKG విద్యార్థిని ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
'పదేళ్లకు పైగా ఒకేచోటు' వదలరు.. కదలరు!
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ప్రభుత్వ అధికారులు రెండు మూడు ఏళ్లకు ఒకసారి బదిలీ కావడం సర్వసాధారణం. అడ్మినిస్ట్రేషన్‌తో పాటు ప్రభుత్వ పథకాలను అమలు చేసే విషయంలో ఎలాంటి పక్షపా త ధోరణి ప్రదర్శించకుండా ఉండేందుకు గాను బ దిలీలు చేయడం అనేది తప్పనిసరి, ఆనవాయితీ కూడా. అయితే జిల్లాలో కొందరు జిల్లా, మండల స్థాయి అధికారులు తాము ఉన్న సీట్లను వదిలేది లేదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. కొందరు కీలక అధి కారులు పదేళ్లకు పైగా ఒకేచోట పని చేస్తుండడంగ మనార్హం. కొత్త ప్రభుత్వం కొలువుదీరిన నేపథ్యంలో సుదీర్ఘకాలంగా ఒకే చోట పనిచేస్తున్న అధికారులను బదిలీ చేయాలని ప్రజలు కోరుతున్నారు. ఇటీవల జిల్లాలోని నందిపేట, డొంకేశ్వర్ మండలాల ఎంపీడీవో నాగవర్ధన్ 12 ఏళ్లుగా అక్కడ నుంచి కదలకుండా ఉంటూ గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించాడంటూ కలెక్టర్‌కు పలువురు ఫిర్యాదు చేయడం గమనార్హం. నాగవర్ధన్ అక్రమాలపై విచారణ చేపట్టాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇదిలా ఉండగా కొందరు జిల్లా అధికారులు స్థాయి లేకున్నప్పటికీ ఇన్చార్జి హోదాలో (ఎఫ్ఏసీ) ఏళ్లతరబడి కొనసాగుతుండడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. దీంతో కిందిస్థాయి సిబ్బంది సైతం అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో సమాచారహక్కు చట్టానికి సైతం కొందరు అధికారులు తూట్లు పొడవడం గమనార్హం. మండలాల్లో.. నందిపేట, డొంకేశ్వర్ మండలాల ఎంపీడీవో నాగవర్ధన్ 12 సంవత్సరాలుగా అక్కడే తిష్ట వేశారు. బోధన్ మున్సిపల్ డీఈ శివానందం తొమ్మిదిన్నర ఏళ్లుగా, మేనేజర్ నరేందర్ ఐదేళ్లుగా కొనసాగు తున్నారు. రుద్రూర్ ఎంపీడీవో బాలగంగాధర్, కో టగిరి, రుద్రూర్ ఎంఈవో శాంతికుమారి ఐదేళ్లుగా అక్కడే పని చేస్తున్నారు. కమ్మర్పల్లి, మోర్తాడ్, ఏర్గట్ల ఎంఈవో ఆంధ్రయ్య తొమ్మిదేళ్లుగా, బాల్కొండ వ్యవసాయ అధికారి మహేందర్‌రెడ్డి తొమ్మిదేళ్లుగా అక్కడే పనిచేస్తున్నారు. మోర్తాడ్ వ్యవసాయ అధికా రి లావణ్య ఎనిమిది ఏళ్లుగా, కమ్మర్పల్లి ఐకేపీ ఏపీ ఎం గంగారెడ్డి ఎనిమిదేళ్లుగా కొనసాగుతున్నారు. మోర్తాడ్ ఎంపీడీవో శ్రీనివాసరెడ్డి, ముప్కాల్ ఎంపీడీవో దామోదర్ ఐదేళ్లుగా అదే పోస్టులో ఉన్నారు. ఇదిలా ఉండగా నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో కొందరు అధికారులకు ప్రమోషన్లు వచ్చినప్పటికీ అక్కడే కొనసాగుతుండడం విశేషం. ఎనిమిదేళ్లుగా.. జిల్లా సహకార అధికారి సింహాచలం ఎనిమిది సంవత్సరాలుగా ఆ పోస్టు నుంచి కదలడం లేదు. సింహాచలం ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా నుంచి రావడం గమనార్హం. ఇక జెడ్పీ సీఈవో గోవింద్‌నాయక్, మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ ఇందిర సైతం ఆరేళ్లుగా కొనసాగుతున్నారు. జీజీహెచ్ సూపరింటెండెంట్ ప్రతిమారాజ్ మాజీ మంత్రి అండతో ఇన్చార్జి హోదాలో గత ఐదేళ్లుగా కదలకుండా తిష్ట వేశారు. రెగ్యులర్ సూపరింటెండెంట్ వచ్చినప్పటికీ ఛార్జి తీసుకోకుండానే వెళ్లేలా చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అలాగే డీఎంహెచ్‌వో సుదర్శన్ సైతం ఆరేళ్లుగా ఇన్చార్జి హోదాలో కొనసాగుతున్నారు. సుదర్శన్ సైతం పలువురు కిందిస్థాయి సిబ్బందిని, కార్లు అద్దెకు పెట్టిన వ్యక్తులను వేధించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇక జిల్లా ఉద్యాన అధికారి నర్సింగ్‌దాస్, జిల్లా భూగర్భ జలవనరుల శాఖ అధికారి దేవేంద్రప్రసాద్ ఐదేళ్లుగా ఇక్కడే ఉన్నారు. ఇవి కూడా చదవండి: 'లంచం అడిగిన ఆర్ఐ..' సోషల్ మీడియాలో వాయిస్ వైరల్! -
నిజామాబాద్ జిల్లాలో పోలింగ్ కు ఏర్పాట్లు
-
ఎన్నికలకు 2 రోజుల ముందు నుంచే బల్క్ మెసేజ్‌లు బంద్! : రాజర్షిషా
సాక్షి, మెదక్: ఎన్నికల నియమావళి ప్రకారం పోలింగ్ తేదీకి 72 గంటల ముందు స్టాండింగ్ అవర్, 48 గంటల నుంచి నిశ్శబ్ద వ్యవధి ప్రారంభమవుతుందని జిల్లా ఎన్నికల అధికారి రాజర్షిషా తెలిపారు. సోమవారం ఐడీఓసీలోని సమావేశ మందిరంలో రిటర్నింగ్ అధికారులు, నోడల్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ 28 సాయంత్రం 5 నుంచి పోలింగ్ ముగిసే వరకు నిశ్శబ్ద వ్యవధి అమలులో ఉంటుందని, కాబట్టి రెండు రోజుల ముందే పత్రికా ప్రకటనలకు అనుమతులు పొందాలని సూచించారు. అలాగే లోకల్ ఛానళ్లతో పాటు శాటిౖ లెట్ ఛానళ్లలో కూడా ఎటువంటి రాజకీయ ప్రకటనలు చేయకూడ దని ఆదేశించారు. 28 నుంచి 30 సాయంత్రం 5 గంటల వరకు బల్క్ మెసేజ్‌లను నిషేధిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఎవరైనా బల్క్ మెసేజ్‌లు పంపితే 73373 40816కు ఫోన్, లేదా వాట్సప్ ద్వారా ఫిర్యాదు చేయాలని ప్రజలను కోరారు. నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సిబ్బందికి సౌకర్యాలు కల్పించాలి.. 30న జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల విధులకు వచ్చే సిబ్బందికి అన్ని వసతులు కల్పించాలని రాజర్షిషా పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్లో మెదక్ జిల్లాలోని నర్సాపూర్, మెదక్ నియోజకవర్గాలకు చెందిన ఆర్ఓలు, అధికారులతో సమావేశం నిర్వహించారు. డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ సెంటర్లో సౌక ర్యాలు కల్పించాలని, పోలింగ్ సామగ్రి సరఫరా, పోలింగ్ సిబ్బందికి సౌకర్యాలు, భోజనాలు , వెబ్‌కాస్టింగ్, సీసీ కెమెరా, వీడియో రికార్డ్, సెక్యూరిటీ లాంటి సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. పకడ్బందీగా ఏర్పాట్లు! ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని రాజర్షిషా ఆదేశించారు. సోమవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ జిల్లా ఎన్నికల అధికారులతో వీడియో సమావేశం నిర్వహించారు. పోలింగ్ నిర్వహణ, ఓటరు గుర్తింపు కార్డులు, ఓటరు స్లిప్పుల పంపిణీ, ఈవీఎంల తరలింపు, కౌంటింగ్ ఏర్పాట్లపై సూచనలు చేశారు. అనంతరం రాజర్షిషా మాట్లాడుతూ పోలింగ్‌కు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇవి చదవండి: ప్రతి ఏడాదీ జాబ్ క్యాలెండర్! : హరీశ్‌రావు -
కోడ్ ఉల్లంఘనులపై కఠిన చర్యలు.. : రాహుల్‌రాజ్
సాక్షి, ఆదిలాబాద్: 'జిల్లాలో అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నాం. ఈవీఎంలు, ఎన్నికల అధికారుల ర్యాండమైజేషన్ను పూర్తి చేసి నియోజకవర్గాల వారీగా కేటాయించాం. పీవోలు, ఏపీవోలకు శిక్షణ కొనసాగుతోంది. గురువారం నుంచి బ్యాలెట్ యూనిట్ల కమిషనింగ్ ప్రక్రియ చేపడుతాం. సమస్యాత్మక కేంద్రాల్లో పోలింగ్ ప్రశాంతంగా సాగేలా వెబ్‌కాస్టింగ్ ఏర్పాట్లు చేస్తున్నాం. ప్రతీ ఓటరు మొబైల్లో సీ–విజిల్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ప్రలోభాలకు గురిచేసినట్లు తెలిస్తే ఈ యాప్ ద్వారా ఫిర్యాదు చేయాలి. వారి వివరాలు గోప్యంగా ఉంచుతాం. అలాగే ఓటర్లంతా స్వేచ్ఛగా ఓటు వేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. పోలింగ్ శాతం పెంపు కోసం ిస్వీప్ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు. ఈమేరకు బుధవారం ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పలు వివరాలు వెల్లడించారు.' సాక్షి: జిల్లాలో పోలింగ్ కేంద్రాలు, ఓటర్ల సంఖ్య ఎంత..? ఎన్నికల నిర్వహణకు ఎంతమంది సిబ్బందిని నియమించారు? కలెక్టర్: జిల్లాలో 4,48,374 మంది ఓటర్లున్నారు. వీరి కోసం 592 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశాం. ఆదిలాబాద్ నియోజకవర్గంలో 290, బోథ్ నియోజకవర్గంలో 302 ఉన్నాయి. ఎన్నికల నిర్వహణ కోసం 4వేల మంది సిబ్బందిని నియమించాం. సాక్షి: ఎన్నికల నిర్వహణకు ఎలాంటి ఏర్పాట్లు చేపడుతున్నారు..? కలెక్టర్: ఈవీఎంలు, పోలింగ్ సిబ్బంది ర్యాండమైజేషన్ను పూర్తి చేసి నియోజకవర్గాల వారీగా కేటా యించాం. పీవో ఏపీవోలకు రెండు రోజులుగా శిక్షణ ఇస్తున్నాం. ఓపీవోలకు గురువారం నుంచి శిక్షణ ప్రారంభమవుతుంది. రూట్, సెక్టోరల్ అధికారులను నియమించాం. పోలింగ్‌కు అవసరమైన సా మగ్రి అంతా ఇప్పటికే జిల్లాకు చేరుకుంది. దాని డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ కేంద్రాన్ని స్థానిక టీటీడీసీలో ఏర్పాటు చేస్తున్నాం. స్ట్రాంగ్ రూంలతో పాటు ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను కూడా అక్కడే చేపడుతాం. సాక్షి: జిల్లాలో ఎంత మంది అభ్యర్థులు బరిలో ఉ న్నారు.బ్యాలెట్యూనిట్ల వినియోగంఎలాఉంది..? కలెక్టర్: 15 మంది కంటే ఎక్కువ అభ్యర్థులు పోటీలో ఉంటే 2 బ్యాలెట్ యూనిట్లు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఆదిలాబాద్ నియోజకవర్గంలో 25 మంది అభ్యర్థులు ఉన్నందున రెండు ఏర్పాటు చేస్తున్నాం. బోథ్ నియోజకవర్గంలో 10 మంది అభ్యర్థులున్నారు. వారి గుర్తులు, వీవీ ప్యాట్స్ కమిషనింగ్ ప్రక్రియ నేటి నుంచి ప్రారంభం కానుంది. ఎన్నికల కమిషన్ నుంచి వచ్చిన ఆరుగురు ఇంజనీర్లు నియోజకవర్గానికి ముగ్గురు చొప్పున ఈ ప్రక్రియను చేపడుతారు. సాక్షి: పోస్టల్ బ్యాలెట్‌కు ఎంత మంది సిబ్బందిని వినియోగించనున్నారు. వారి కోసం ఎలాంటి ఏర్పాట్లు చేశారు.? కలెక్టర్: జిల్లాలో 4వేల మంది సిబ్బందిని పోస్టల్ బ్యాలెట్‌కు వినియోగించనున్నాం. ట్రైనింగ్ సెంట ర్లో ఫెసిలిటేషన్ సెంటర్‌ను ఏర్పాటు చేశాం. అక్క డ ఎంత మంది ఓటర్లు ఓటు వేశారనే వివరాలు రావాల్సి ఉన్నాయి. ఎవరైన ఆలస్యంగా వచ్చి ఉంటే ఓటేసేందుకు వీలుగా రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో ఫెసిలిటేషన్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నాం. పోలీసు ఉద్యోగుల కోసం ఇక్కడే ప్రత్యేకంగా మరో కేంద్రాన్ని ఏర్పాటు చేస్తాం. సాక్షి: జిల్లా వ్యాప్తంగా ఎన్ని సమస్యాత్మక కేంద్రాలను గుర్తించారు. వాటిలో పోలింగ్ ప్రశాంతంగా జరిగేలా ఎలాంటి చర్యలు చేపడుతున్నారు..? కలెక్టర్: జిల్లాలో 301 సమస్యాత్మక కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్ నిర్వహించనున్నాం. మరో 78 పోలింగ్ కేంద్రాల్లో బయట సీసీకెమెరాలు ఏర్పాటు చేస్తున్నాం. పోలింగ్ ప్రశాంతంగా సాగేందుకు వీలుగా ప్రత్యేక బలగాలను మోహరించనున్నాం. సాక్షి: ఓటింగ్ శాతం పెంచడం కోసం ఎలాంటి చర్యలు చేపట్టారు..? కలెక్టర్: ప్రతిఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకునేలా స్విప్ ద్వారా బైక్, ఆటోలతో ప్రచారంతో పాటు కలెక్టరేట్లో సెల్ఫీ పాయింట్ ద్వారా అవగాహన కల్పించాం. వృద్ధులు, యువత, దివ్యాంగులతో ర్యాలీలు చేపట్టాం. యువత కోసం రంగోలి పోటీలు ఏర్పాటు చేశాం. గతంలో పోలింగ్ శాతం తక్కువగా నమోదైన కేంద్రాల్లో ఈ సారి ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు గాను పాఠశాలల విద్యార్థుల ద్వారా వారి తల్లిదండ్రులకు ఓటు సంకల్ప పత్రాలను పంపించాం. సాక్షి: ప్రలోభాల కట్టడికి ఎలాంటి చర్యలు చేపడుతున్నారు..? కలెక్టర్: ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి మద్యం, డబ్బు ప్రవాహం జరగకుండా కట్టడి చేస్తున్నాం. జిల్లాలోని ఏడు ప్రాంతాల్లో ప్రత్యేక చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి నిరంతరం నిఘా ఉంచుతున్నాం. ఫ్లయింగ్ స్క్వాడ్, స్టాటిస్టికల్ సర్వైలెన్స్ టీమ్, వీడియోగ్రఫీ బృందాల ద్వారా ప్రత్యేక నిఘా ఉంచాం. రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ఓటర్లను ప్రలోభాలకు గురిచేసినా, కోడ్‌ను ఉల్లంఘించినా ప్రజలు నిర్భయంగా సీ–విజిల్ యాప్ ద్వారా ఫి ర్యాదు చేయాలి. ఫిర్యాదు అందిన వంద నిమిషా ల్లోపు వారిపై చర్యలు తీసుకుంటాం. సాక్షి: ఇప్పటివరకు మోడల్ కోడ్ ఉల్లంఘన కేసులేమైనా నమోదయ్యాయా. వాటిపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు..? కలెక్టర్: జిల్లాలో 17 మోడల్ కోడ్ ఉల్లంఘన కేసులు నమోదయ్యాయి. ఇందులో 16 కేసుల్లో బాధ్యులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశాం. ఒక కేసు తప్పని తేలడంతో దాన్ని తిరస్కరించాం. సాక్షి: పోల్ చీటీల పంపిణీ ఎంత వరకు జరిగింది. ఎప్పటివరకు పూర్తవుతుంది..? కలెక్టర్: ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ప్రతి ఓటరుకు పోల్ చీటీలను అందించేలా గత శుక్రవారం నుంచి పంపిణీని షురూ చేశాం. 95 శాతం వరకు పూర్తయింది. ప్రస్తుతం షిఫ్టెడ్, డెలిటెడ్ వంటి వివరాలను బీఎల్వోల నుంచి సేకరిస్తున్నాం. సాక్షి: పోలింగ్ కేంద్రాల్లో ఎలాంటి వసతులు కల్పిస్తున్నారు..? కలెక్టర్: ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రతి పోలింగ్ కేంద్రంలో షామియానాలు, కుర్చీ లు, బారికేడ్లను ఏర్పాటు చేస్తున్నాం. దివ్యాంగులు, వృద్ధుల కోసం వీల్చైర్లతో పాటు ఒక సహాయకుడిని అందుబాటులో ఉంచుతాం. -
కొత్త పంథా.. అదే దందా!
హైదరాబాద్: కబ్జారాయుళ్లు కొత్త పంథా ఎంచుకున్నారు. ప్రభుత్వ స్థలంలో నిర్మిస్తున్న గదుల వద్ద ట్రాన్స్జెండర్లను ముందు పెట్టి.. వెనక కబ్జాల పర్వాన్ని కొనసాగిస్తున్నారు. గాజుల రామారం డివిజన్ కై సర్ నగర్‌లోని ప్రధాన రహదారిని ఆనుకొని హనుమాన్ దేవాలయానికి ఎదురుగా ఉన్న సర్వే నంబర్ 342/1 ప్రభుత్వ స్థలంలో ఓ కుల సంఘం పేరిట వారం రోజులుగా 200కు పైగా గదులు నిర్మించారు. ఈ నిర్మాణాల వెనక సదరు కుల సంఘం పెద్దగా చెప్పుకుంటున్న ఓ వ్యక్తి తన తతంగాన్ని కొనసాగిస్తున్నాడు. ఈ విషయమై సోమవారం ‘ఇదే తరుణం.. కబ్జా చేద్దాం’ అని శీర్షికన ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. దీంతో మేడ్చల్ జిల్లా కలెక్టర్ గౌతమ్ స్పందించారు. అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలని. కబ్జాకు పాల్పడుతున్న వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు రెవెన్యూ ఇన్స్పెక్టర్లు రజనీకాంత్, రేణుకలు తమ సిబ్బందితో అక్కడికి చేరుకొని రెండు గదులను కూల్చివేశారు. దీంతో కబ్జా వెనకాల ఉన్న ఓ కుల పెద్ద ట్రాన్స్జెండర్లను రంగంలోకి దింపాడు. కూల్చివేతలను అడ్డుకొని నానా హంగామా చేసి రెవెన్యూ అధికారులను పరుగులెత్తించారు. చేసేదేమీ లేక వెనుదిరగాల్చి వచ్చింది. సదరు వ్యక్తిపై విచారణ.. సర్వే నంబర్ 342/1 ప్రభుత్వ స్థలంలో కుల సంఘం పేరుతో గదులను నిర్మిస్తూ రూ.కోట్లు ఆర్జిస్తున్న వ్యక్తిపై సంబంధిత అధికారులు రహస్యంగా విచారణ చేపట్టారు. సదరు వ్యక్తి గతంలో చాలాచోట్ల కుల సంఘం పేరిట ప్రభుత్వ స్థలాన్ని ప్లాట్లుగా చేసి, ఒక్కో ప్లాటును నలుగురికి అమ్మి ఎంతో మందిని మోసం చేసినట్లు బహిరంగంగా ఆరోపిస్తున్నారు. -
ఇప్పుడు మీ పాత్రే చాలా కీలకం.. కలెక్టర్..!
నల్లగొండ: స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడంలో మైక్రో అబ్జర్వర్ల పాత్ర ఎంతో కీలమైందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆర్వీ కర్ణన్, కేంద్ర ఎన్నికల సాధారణ పరిశీలకులు అవినాష్ చంపావత్, ఆర్.కన్నన్, కె.బాలసుబ్రహ్మణ్యం అన్నారు. మంగళవారం కలెక్టరేట్లో మైక్రో అబ్జర్వర్లకు నిర్వహించిన శిక్షణలో వారు మాట్లాడారు. పోలింగ్ విధానాన్ని పరిశీలిస్తూ తప్పిదాలు, కోడ్ ఉల్లంఘనలు జరిగితే వెంటనే రిటర్నింగ్ అధికారులు, ఎన్నికల పరిశీలకుల దృష్టికి తేవాలన్నారు. అభ్యర్థికి ఒక పోలింగ్ ఏజెంట్ మాత్రమే కేంద్రంలో ఉండేలా చూడాలన్నారు. పోలింగ్ కేంద్రంలో పోలింగ్ విధానాన్ని, ఈవీఎం వీవీప్యాట్లను ఉపయోగించే విధానాన్ని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. మైక్రో అబ్జర్వర్లు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటుహక్కు వినియోగించుకోవడానికి ఫారం 12 ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఎన్నికల సిబ్బందికి విధులు కేటాయింపు నియోజవర్గాల వారీగా వివిధ పోలింగ్ కేంద్రాలకు కేటాయించిన ప్రిసైడింగ్ అధికారులు (పీఓలు), అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు (ఏపీఓలు), ఓపీఓలు బాధ్యతగా ఎన్నికల విధులు నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆర్వీ.కర్ణన్ ఆదేశించారు. మంగళవారం నల్లగొండలోని కలెక్టరేట్లో పోలింగ్ సిబ్బందికి ఏర్పాటు చేసిన రెండో ర్యాండమైజేషన్ కార్యక్రమంలో ఆయన పాల్గొని సిబ్బందికి జిల్లాలోని ఆరు నియోజకవర్గాల వారీగా విధులు కేటాయించారు. -
Mahabubnagar: సమస్యాత్మక కేంద్రాలలో వెబ్‌కాస్టింగ్.. ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరింవచాలి
మహబూబ్‌నగర్: జిల్లాలోని ఓటర్లకు బుధవారం నుంచి ఓటరు సమాచార స్లిప్పులను పంపిణీ చేయాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి జి.రవినాయక్ ఆదేశించారు. ఓటరు సమాచార స్లిప్పుల పంపిణీ, వెబ్ కాస్టింగ్ తదితర అంశాలపై మంగళవారం ఆయన ఐడీఓసీ నుంచి సెక్టోరల్ అధికారులు, ఏఆర్వోలు, బీఎల్వోలు తదితరులతో వెబెక్స్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు పోలింగ్ నిర్వహించే ఐదు రోజుల ముందే అంటే 25వ తేదీలోగా ఓటరు సమాచార స్లిప్పుల పంపిణీని పూర్తి చేయాల్సిందిగా ఆదేశించారు. సెక్టోరల్ అధికారులు ప్రతిరోజు ఏ ప్రాంతంలో ఓటరు సమాచార స్లిప్పులు పంపిణీ చేస్తున్నది ముందుగానే షెడ్యూల్లో పేర్కొనాలని, సదరు షెడ్యూల్‌ను రాజకీయ పార్టీలకు తెలియజేయాలని, బీఎల్ఓలతో పాటు, బీఎల్ఏలకు ఈ విషయం చెప్పాలన్నారు. ఓటరు సమాచార స్లిప్పుల పంపిణీపై తక్షణమే బీఎల్వోలు, సూపర్వైజర్లతో సమావేశం నిర్వహించాలని, అదేవిధంగా సెక్టోరల్ అధికారులు సమావేశం ఏర్పాటు చేసుకోవాలని, ఏ రోజుకు ఆ రోజు ఎన్ని స్లిప్పులు పంపిణీ చేసింది నివేదిక సమర్పించాలన్నారు. ఓటరు సమాచార స్లిప్పులను, ఓటరు గైడ్, సీ–విజిల్ పోస్టర్లను తక్షణమే సేకరించుకోవాలని ఆదేశించారు. ఒకసారి ఓటరు ఇంటికి వెళ్లినప్పుడు ఓటరు లేనట్లయితే మరోసారి వెళ్లాలని సూచించారు. ఓటరు సమాచార స్లిప్పులు కేవలం బీఎల్ఓలు మాత్రమే పంపిణీ చేయాలని, ఎట్టి పరిస్థితులలో ఇతరులు పంపిణీ చేయకూడదని, ఇంట్లో ఓటరు లేనట్లయితే పెద్ద వారికి మాత్రమే ఇచ్చి సంతకం తీసుకోవాలన్నారు. ఓటరు సమాచార స్లిప్పులు బీఎల్ఓ దగ్గర కాకుండా ఇతరుల వద్ద కనబడితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఓటరు సమాచార స్లిప్పుల పంపిణీ వ్యవస్థ సక్రమంగా నిర్వహించేందుకు సెక్టోరల్ అధికారులు సరాసరిన తనిఖీ చేయాలన్నారు. రిటర్నింగ్ అధికారులు ఓటరు సమాచార స్లిప్పులపై హెల్ప్ డెస్క్‌ను ఏర్పాటు చేయాలని, ఫోన్ నంబర్ ఏర్పాటు చేసి ఓటరు సమాచార స్లిప్పులపై వచ్చే ఫిర్యాదు ఎప్పటికప్పుడు పరిష్కరించాల్సిందిగా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. వెబ్‌కాస్టింగ్‌పై కలెక్టర్ మాట్లాడుతూ ముఖ్యమైన, సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక పోలింగ్‌కేంద్రాలలో వెబ్‌కాస్టింగ్ నిర్వహించాలని, ఇందుకు తక్షణమే ఏఆర్వోలు పోలింగ్‌కేంద్రాల లేఔట్లను రూపొందించి పంపించాలని ఆదేశించారు. కేంద్రాలలో కరెంటు సరఫరా, త్రీ పిన్ ఫ్లగ్ వంటివి ఉన్నాయో లేదో చూడాలని, ఏజెన్సీ వెబ్ కాస్టింగ్ కెమెరాలు ఏర్పాటు చేసే సమయంలో పూర్తిగా సహకరించి లే ఔట్ ప్రకారం కెమెరా ఎక్కడ ఏర్పాటు చేయాలో తెలియజేయాలని ఆదేశించారు. ఆబ్సెంట్ ఓటర్లను సమీక్షిస్తూ ఫామ్–12–డీ ప్రకారం ఏ పోలింగ్ కేంద్రంలో ఎంతమంది హోం ఓటర్లు ఉన్నారో చూసుకుని అందుకు తగ్గట్టుగా రూట్ మ్యాప్ తయారు చేయాలని, ఎంత మంది పోలింగ్ సిబ్బంది అవసరం ఉంటుందో ప్రణాళిక రూపొందించుకోవాలని చెప్పారు. -
ప్రభుత్వాస్పత్రిలో కలెక్టర్ భార్య ప్రసవం
పార్వతీపురం: ఆయన ఆ జిల్లాకే ప్రధాన అధికారి. ఆయన తలచుకుంటే కార్పొరేట్ ఆస్పత్రుల్లో వైద్య సేవలు పొందగలరు. కానీ ప్రభుత్వ ఆస్పత్రుల్లో అందుతున్న మెరుగైన వైద్య సేవల గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని నిర్ణయించుకున్నారు. ధైర్యంగా తన భార్యకు ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవం చేయించారు. పలువురికి ఆదర్శంగా నిలిచారు. ఆయన మరెవరో కాదు పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ నిషాంత్‌కుమార్. వివరాల్లోకి వెళితే...పార్వతీపురం జిల్లా ఆస్పత్రిలో కలెక్టర్ నిషాంత్‌కుమార్ భార్య కరుణ బుధవారం సాయంత్రం మగబిడ్డకు జన్మనిచ్చారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ బి.వాగ్దేవి, వైద్యులు త్రివేణి, చిన్నపిల్లల వైద్యుడు బి.గణేష్ చైతన్య వైద్యసేవలందించి సుఖప్రసవం చేశారు. తల్లీబిడ్డ ఆరోగ్యంగా ఉన్నారు. కలెక్టర్ నిషాంత్‌కుమార్ గతంలో రంపచోడవరం ఐటీడీఏ పీవోగా పనిచేసిన సమయంలో అక్కడి సమీపంలోని ప్రభుత్వాస్పత్రిలోనే ఆయన భార్య తొలి సంతానంగా ఆడబిడ్డకు జన్మనిచ్చారు. అలాగే పార్వతీపురంలో పనిచేసిన జాయింట్ కలెక్టర్ ఒ.ఆనంద్ భార్య కూడా ఇటీవల 108 వాహనంలో వెళ్లి పార్వతీపురం జిల్లా ఆస్పత్రిలోనే మగబిడ్డకు జన్మనిచి్చన సంగతి తెలిసిందే. -
పేదల ఇళ్లకు పావలా వడ్డీకే రుణాలు
సాక్షి, అమరావతి: ప్రభుత్వం మంజూరు చేసిన ఇళ్లను సొంతంగా నిర్మించుకుంటున్న లబ్ధిదారులకు ఆర్థిక వెసులుబాటు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పావలా వడ్డీకే బ్యాంకుల ద్వారా రుణాలు మంజూరు చేయిస్తోంది. ఇప్పటికే ఇళ్ల లబ్ధిదారుల్లో 79 శాతం మందికి పావలా వడ్డీకే బ్యాంకుల ద్వారా రుణాలు మంజూరు చేయించింది. ఒక్కో ఇంటి నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.1.80 లక్షలు ఇస్తుండగా.. ఈ మొత్తానికి అదనంగా ఒక్కో లబ్ధిదారుకు రూ.35 వేల చొప్పున పావలా వడ్డీకి రుణాలు మంజూరు చేయిస్తోంది. లబ్ధిదారులకు ఉచితంగానే ఇసుక సరఫరా చేస్తున్న ప్రభుత్వం ఇంటికి అవసరమైన ఇతర సామగ్రిని తక్కువ ధరకే సరఫరా చేస్తోంది. రాష్ట్రంలో మొత్తం 16,06,301 మంది లబ్ధిదారులు సొంతంగా ఇళ్ల నిర్మాణాలు చేపట్టగా.. ఇందులో 12,61,203 మందికి పావలా వడ్డీకి రూ.4,443.13 కోట్ల రుణాన్ని బ్యాంకులు మంజూరు చేశాయి. ఇళ్ల స్థలాలతో పాటు ఇళ్లు మంజూరు మహిళల పేరుతో చేసినందున పావలా వడ్డీ రుణాలు మహిళల పేరుమీదే ఇస్తున్నారు. నిర్మాణాలపై సీఎస్ సమీక్ష ఇటీవల కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పేదల ఇళ్ల నిర్మాణాల పురోగతిపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్‌రెడ్డి సమీక్షించారు. వర్షాకాలం ముగిసిన దృష్ట్యా ఇళ్ల నిర్మాణాలను మరింత వేగంగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు. ప్రతి వారం ఎన్ని ఇళ్లు పూర్తి చేయాలనేది లక్ష్యంగా నిర్ణయించుకుని.. ఆ లక్ష్యాలను సాధించేలా చర్యలు తీసుకోవాలన్నారు. కలెక్టర్లు తరచూ ఇళ్ల నిర్మాణాల పురోగతిని సమీక్షించాలని సూచించారు. పావలా వడ్డీ రుణాలు మంజూరు చేయించడంపై శ్రీకాకుళం, ఎన్టీఆర్, చిత్తూరు, నెల్లూరు, విశాఖ జిల్లా కలెక్టర్లు మరింత దృష్టి సారించాలని సీఎస్ ఆదేశించారు. వెనుకబడిన జిల్లాల్లో మరింత దృష్టి లబ్ధిదారులకు మరింత ఆర్థిక వెసులుబాటు కల్పించేలా బ్యాంకుల ద్వారా పావలా వడ్డీకే రుణాలు మంజూరు చేస్తున్నామని గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక సీఎస్ అజయ్‌జైన్ చెప్పారు. ఇటీవల కలెక్టర్లతో నిర్వహించిన సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్‌రెడ్డి ప్రత్యేక సూచనలు ఇచ్చారన్నారు. పావలా వడ్డీ రుణాలు మంజూరులో నాలుగైదు జిల్లాలు వెనుకబడగా.. ఆయా కలెక్టర్లు ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారించాలని ప్రధాన కార్యదర్శి ఆదేశించారన్నారు. ఇప్పటికే ఐదు లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసినందున అదే స్ఫూర్తితో రెండో దశలో మరో ఐదు లక్షల ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసేందుకు వారం వారం లక్ష్యాలను నిర్థేశించుకోవాలని జైన్ పేర్కొన్నారు. -
సరిహద్దుల్లో పటిష్ట నిఘా! కలెక్టర్‌తో వ్యయ పరిశీలకుల భేటీ..
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: జిల్లా సరిహద్దులో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి పటిష్ట పర్యవేక్షణ చేస్తున్నామని, వాహనాలను నిశిత పరిశీలన చేస్తూ నగదు, మద్యం, ఇతర వస్తువుల రవాణాపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ఆల వివరించారు. కలెక్టర్‌తో శనివారం ఎన్నికల వ్యయ పరిశీలకులు సంజీబ్‌కుమార్ పాల్, అజయ్‌లాల్ చంద్‌లు కలెక్టరేట్లో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. జిల్లాలోని పినపాక, భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గాలకు అజయ్‌లాల్ చంద్, కొత్తగూడెం, ఇల్లెందు, అశ్వారావుపేట నియోజకవర్గాలకు సంజీబ్‌కుమార్ పాల్ వ్యయ పరిశీలకులుగా ఎన్నికల సంఘం నియమించింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్ని కల ప్రవర్తనా నియమావళిని పకడ్బందీగా అమలు చేసేందుకు కమిటీలను నియమించినట్లు తెలిపారు. సెన్సిటివ్ నియోజకవర్గాలైన ఇల్లెందు, కొత్తగూడెంలలో అదనపు సహా వ్యయ పరిశీలకులను, వీడియో వ్యూయింగ్ టీంలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఫిర్యాదులకు తీసుకుంటున్న చర్యలను వివరించారు. జిల్లా సరిహద్దుగా ఉన్న ఇతర రాష్ట్రాల నుంచి మద్యం, ఇతర వస్తువులు రాకుండా చర్యలు తీసుకున్నామని, చెక్‌పోస్టులు, సీసీ కెమెరాలతో నిరంతర పర్యవేక్షణ జరుగుతోందని అన్నారు. ఎన్నికల వ్యయ పరిశీలకులు మాట్లాడుతూ సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఖర్చులు పక్కాగా నమోదు చేయాలి.. అభ్యర్థుల ఖర్చులు కచ్చితంగా నమోదు చేయాలని ఎన్నికల వ్యయపరిశీలకులు సంజీబ్‌కుమార్ పాల్ అన్నారు. శనివారం కలెక్టరేట్లో కొత్తగూడెం, అశ్వారావుపేట, ఇల్లెందు నియోజకవర్గాల వ్యయ, ఎంసీఎంసీ, ఆబ్కారీ, ఆదాయపన్ను శాఖ, ఎన్నికల ప్రవర్తనా నియమావళి నోడల్ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల ప్రక్రియలో పాటించాల్ని విషయాలను సోదాహరణంగా వివరించారు. పెయిడ్ న్యూస్‌ను గుర్తించాలి! నిరంతర పర్యవేక్షణతో పెయిడ్ న్యూస్‌ను గుర్తించాలని ఎన్నికల వ్యయ పరిశీలకులు సంజీబ్‌కుమార్ పాల్ సూచించారు. శనివారం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన ఎంసీఎంసీ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోజూ వివిధ దినపత్రికలు, శాటిలైట్ చానల్స్, కేబుల్, సిటీ కేబుల్, సామాజిక మాధ్యమాల్లో అభ్యర్థుల ప్రచారాలను పరిశీలించాలని చెప్పారు. గుర్తించిన పెయిడ్ న్యూస్, ప్రకటనలపై ఆయా నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారుల ద్వారా అభ్యర్థులకు నోటీసులు జారీ చేయాలన్నారు. జిల్లాలో చెక్‌పోస్టుల వద్ద కొనసాగుతున్న పర్యవేక్షణను, సీసీ కెమెరాల రికార్డింగ్ పనితీరును పరిశీలించారు. సీ విజిల్ వచ్చిన ఫిర్యాదులు వాటి పరిష్కారాలు, ఎస్ఎస్టీ, ఎఫ్‌ఎస్‌టీి టీముల పనితీరును అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమాల్లో పినపాక రిటర్నింగ్ అధికారి ప్రతీక్‌జైన్, వ్యయ నియంత్రణ నోడల్ అధికారులు వెంకటేశ్వరరెడ్డి, వెంకటేశ్వర్లు, లైజన్ అధికారులు సంజీవరావు, సీతారాంనాయక్, ఎన్నికల విభాగం పర్యవేక్షకులు దారా ప్రసాద్, ఎంసీఎంసీ నోడల్ అధికారి, డీపీఆర్వో ఎస్.శ్రీనివాసరావు, మైనార్టీ సంక్షేమ అధికారి సంజీవరావు తదితరులు పాల్గొన్నారు. ఇల్లెందులో.. ఎన్నికల వ్యయ పరిశీలకులు సంజీవ్‌కుమార్ పాల్, అజయ్ లాల్‌చంద్ సోనేజీ శనివారం ఇల్లెందులో పర్యటించారు. తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించి ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం కార్యాలయంల అకౌంటింగ్ బృందాన్ని కలుసుకున్నారు. ఇవి చదవండి: జంప్ జిలానీలు..! ఉన్న నేతలు ఎప్పుడో ఏ పార్టీలో చేరుతారో? -
కలెక్టర్ ఇంట్లో చోరీ.. ల్యాప్ టాప్ మాయం
సాక్షి, కరీంనగర్: బదిలీపై మరోచోటికి వెళ్లేందుకు సామాన్లు సర్దుకున్న కలెక్టర్ ఇంట్లో చోరీ జరిగింది. ఎన్నికల వేళ బదిలీ అయి అసలే టెన్షన్ లో ఉన్న కరీంనగర్ కలెక్టర్ గోపీ ఇంట్లో దొంగలు పడ్డారు. ల్యాప్ టాప్ తో పాటు కలెక్టర్ కు చెందిన పలు డాక్యుమెంట్లను దొంగలు ఎత్తుకెళ్లినట్లు సీసీ టీపీ ఫుటేజ్ లో బయటపడింది. ఎన్నికల సంఘం తీసుకున్న చర్యల్లో భాగంగా కరీంనగర్ కలెక్టర్ గోపీ బదిలీ అయిన విషయం తెలిసిందే. బుధవారం ఆయన హైదరాబాద్ లో రిపోర్ట్ చేయాలి. దీని కోసం తన సామాన్లన్నింటిని రెడీ చేసుకుని ఆయన హాయిగా బెడ్ రూమ్ లో నిద్రపోతున్నారు. అర్ధరాత్రి టైమ్ లో దొంగలు వెనుకవైపు గోడ నుంచి కలెక్టర్ బంగ్లా లోపలికి ఎంటర్ అయ్యారు. ఇంట్లో ముందు రూమ్ లో ఉంచిన కలెక్టర్ ల్యాప్ టాప్ తో పాటు ఒరిజినల్ సర్టిఫికెట్లు ఉన్న బ్యాగు, మరికొన్ని వస్తువులు దొంగిలించారు. దొంగలే వస్తువులు చోరీ చేసినట్టు సీసీ టీవీలో రికార్ట్ అయింది. ఇరవై నాలుగు గంటలు పోలీసు పహారాలో ఉండే కలెక్టర్ బంగ్లాలో దొంగలు పడడం సంచలనంగా మారింది. చోరీపై కలెక్టర్ ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
కలెక్టరేట్ ఉద్యోగి.. అలా అవ్వడానికి అసలు కారణాలేంటి?
సాక్షి, సంగారెడ్డి: కలెక్టరేట్ ఉద్యోగి అనుమా నాస్పదంగా మృతిచెందాడు. ఎస్సై వినయ్ కథనం ప్రకారం.. మల్కాపూర్‌లో ఉన్న తెలంగాణ టౌన్ షిప్లో విష్ణు వర్ధన్ (45) నివాసం ఉంటున్నాడు. అడిషనల్ కలెక్టర్ మాధురి వద్ద సీసీగా అతను విధులు నిర్వర్తిస్తున్నాడు. మూడు నెలల క్రితం అతడి గుండెకు స్టంట్ వేయగా సెలవులో ఉన్నాడు. ఈనెల 28న మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. ఆదివారం ఉదయం మల్కాపూర్ శివారులో అనుమానాస్పదంగా పూర్తిగా కాలిపోయి శవమై కనిపించాడని వినయ్ వివరించారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
ఓటింగ్‌పై అవగాహన గ్రామీణ ఓటర్ల కంటే.. పట్టణ ఓటర్లకే తక్కువ..
నల్లగొండ: ‘పట్టణ ప్రాంతాల్లో పోలింగ్ శాతం పెంచేందుకు చర్యలు చేపడుతున్నాం. గ్రామీణ ప్రాంతాలతో పోల్చితే.. పట్టణ ప్రాంతాల్లోని వారంతా ఓటు హక్కు వినియోగించుకోవడం లేదు. నల్లగొండ, మిర్యాలగూడ, నందికొండ వంటి అర్బన్, మున్సిపల్ ప్రాంతాల్లో గత ఎన్నికల్లో ఓటింగ్ శాతం తక్కువగా నమోదైంది. ఈసారి దానిని పెంచేందుకు అవగాహన కల్పిస్తున్నాం’ అని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆర్వీ కర్ణన్ చెప్పారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకూ అవకాశం లేకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహిస్తామని, ప్రతిఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆయన సూచించారు. ఎన్నికల ఏర్పాట్లకు సంబంధించిన వివరాలను ఆయన శుక్రవారం ‘సాక్షి’కి వివరించారు. కలెక్టర్ వెల్లడించిన అంశాలు ఆయన మాటల్లోనే.. పట్టణాల్లో 356 పోలింగ్ స్టేషన్లు గ్రామీణ ప్రాంతాలతో పోల్చితే పట్టణాల్లో చాలా తక్కువ పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. జిల్లాలో మొత్తం 1,766 పోలింగ్ స్టేషన్లు ఉండగా.. మున్సిపల్, పట్టణ ప్రాంతాల్లో కేవలం 356 పోలింగ్ స్టేషన్లే ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లోని 1,410 పోలింగ్ కేంద్రాల పరిధిలోనే దాదాపు 80 శాతం వరకు ఓటర్లు ఉన్నారు. నల్లగొండ జిల్లాలోని ఆరు నియోజకవర్గాల్లో మొత్తంగా 14,26,480 ఓటర్లు ఉన్నారు. ఏర్పాట్లు ముమ్మరం ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లు ముమ్మరం అయ్యాయి. శుక్రవారం నుంచే ఈవీఎంలను నియోజకవర్గాలకు పంపిస్తున్నాం. శనివారం నాటికి అవి నియోజకవర్గాలకు చేరుతాయి. ఒక్కో నియోజకవర్గానికి అవసరమైన ఈవీఎంల సంఖ్య కంటే అదనంగా 25శాతం ఈవీఎంలను పంపిస్తున్నాం. అనుకోకుండా ఏదైనా పని చేయకపోయినా, రిపేర్ వచ్చినా ఉపయోగించుకునేలా వాటిని అందుబాటులో ఉంచుతున్నాం. సమస్యాత్మక కేంద్రాల్లో వెబ్ క్యాస్టింగ్ జిల్లాలో 521 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా గుర్తించాం. వాటి వద్ద ప్రత్యేక భద్రత ఏర్పాట్లు చేస్తున్నాం. వాటిల్లో మైక్రో అబ్జర్వర్లు ఉంటారు. వీడియో కెమెరాల రికార్డింగ్ ఏర్పాటు చేస్తాం. వెబ్ క్యాస్టింగ్ ఉంటుంది. నగదు రవాణాపై ప్రత్యేక దృష్టి.. ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు నగదు, విలువైన వస్తువుల రవాణాపై ప్రత్యేక దృష్టి సారించాం. ఇప్పటివరకు పోలీసు, ఇతర శాఖలు రూ.11.54కోట్ల నగదును పట్టుకోగా, రూ.27.49కోట్లు విలువైన బంగారు ఆభరణాలు, ఇతర వస్తువులను పట్టుకున్నాయి. గురువారం ఒక్కరోజే పెద్ద మొత్తంలో సీజ్ చేశారు. అది ఎన్నికల రిలేటెడ్ కాకపోయినా డాక్యుమెంట్లు లేకపోవడంతో సీజ్ చేశాం. పన్ను ఎగవేసేందుకు డాక్యుమెంట్లు లేకుండా బంగారాన్ని విజయవాడవైపు తీసుకెళ్తున్నట్లు గుర్తించాం. దానిని కమర్షియల్ టాక్స్ విభాగానికి అప్పగించాం. టాక్స్ ఎగ్గొట్టే ప్రయత్నం చేశారు కనుక జరిమానా విధించే అవకాశం ఉంది. ఇప్పటివరకు మొత్తంగా దాదాపు రూ.40కోట్ల విలువైన డబ్బు, వస్తువులు సీజ్ చేయగా, రూ.3కోట్ల డబ్బుకు సంబంధించి ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. ఎఫ్ఆర్ లేకుండా మరో 3,26,24,000 సీజ్ చేశాం. అందులో రూ.2.89కోట్లు రిలీజ్ చేశాం. రూ.10లక్షల కంటే ఎక్కువ ఉంటేనే సమస్య వస్తోంది. వారే లెక్కలు చూపించుకోవాలి. 24 గంటల్లో డాక్యుమెంట్లు సబ్మిట్ చేస్తే రిలీజ్ చేస్తాం. లేదంటే ఆదాయ పన్నుల శాఖకు వారికి అప్పగిస్తాం. వారికి లెక్కలు చూపించుకోవాల్సి ఉంటుంది. వారు రిలీజ్ చేయమంటేనే చేస్తాం. 86 ఫిర్యాదులు పరిష్కరించాం ఎన్నికలు, కోడ్ ఉల్లంఘనకు సంబంధించి సి–విజిల్ యాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. ఇప్పటివరకు 113 ఫిర్యాదులు రాగా, అందులో సరైనవి 86 ఫిర్యాదులను పరిష్కరించాం. మిగతావి సరైనవి కావు. ఉల్లంఘనలపై 1950 టోల్ ఫ్రీ నంబరులో ఫిర్యాదు చేస్తే.. 100 నిమిషాల్లో పరిష్కరిస్తాం. వృద్ధులు, వికలాంగులకు హోం బేస్డ్ ఓటింగ్ 80 ఏళ్లు దాటిన వృద్ధులు, వికలాంగులకు హోంబేస్డ్ (ఇంటి నుంచి) ఓటింగ్‌కు అవకాశం కల్పిస్తాం. జిల్లాలో వికలాంగులు 32వేల మంది ఉండగా, వృద్ధులు 17వేల మంది ఉన్నారు. పోలింగ్ స్టేషన్‌కు రాలేను అనుకున్నవారికే ఈ అవకాశం కల్పిస్తాం. రావాలనుకునే వారు రావచ్చు.. రాలేని వారు ఫారం 12(డి) సబ్మిట్ చేయాలి. వికలాంగులైతే 40శాతం వైకల్యం ఉన్న సదరం సర్టిఫికెట్ ఉండాలి. మునుగోడు ఎన్నికల్లో వెయ్యి మంది హోంబేస్డ్ ఓటింగ్ వినియోగించుకున్నారు. ఈసారి ప్రతి నియోజకవర్గంలో వెయ్యి మంది వరకు ఈ అవకాశాన్ని వినియోగించుకుంటారని భావిస్తున్నాం డాక్యుమెంట్‌తోనే డబ్బు తీసుకెళ్లండి ఎన్నికల నేపథ్యంలో ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం.. సాధారణ ప్రజలు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు రూ.50వేల కంటే ఎక్కువ తీసుకెళ్తున్నప్పుడు వాటికి సంబంధించి డాక్యుమెంట్లు, ప్రూఫ్ కచ్చితంగా తీసుకెళ్లండి, నగదు రవాణాతో మిస్ యూజ్ జరిగే అవకాశం ఉన్నందును ఎన్నికల కమిషన్ ఈ నిబంధన విధించింది. వీలైతే ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేసుకోండి. క్యాష్ తీసుకెళ్తే మాత్రం ప్రూఫ్ ఉండేలా చూసుకోండి. సీజ్ చేసిన మొత్తాన్ని విడిపించుకునేందుకు జిల్లా గ్రీవెన్స్ కమిటీకి దరఖాస్తు చేసుకోండి. డాక్యుమెంట్లు సమర్పిస్తే ఒక్క రోజులోనే రిలీజ్ చేస్తాం. -
ప్రజల జీవన విధానంపై అధ్యయనం చేయాలి.. కలెక్టర్
మహబూబ్‌నగర్: గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల జీవన విధానం, ఆర్థిక పరిస్థితులు తదితర అంశాలపై అధ్యయనం చేయాలని కలెక్టర్ పి.ఉదయ్ కుమార్ కేంద్ర ప్రభుత్వ ఏఎస్‌ఓలకు సూచించారు. సోమవారం 25 మంది కేంద్ర ప్రభుత్వ సర్వీసుల నుంచి శిక్షణ నిమిత్తం నాగర్‌కర్నూల్ జిల్లాకు వచ్చిన ఏఎస్ఓ లతో వీడియో కాన్ఫరెన్స్ మందిరంలో కలెక్టర్ ఉదయ్ కుమార్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ వారిని ఉద్దేశించి మాట్లాడారు. ఏఎస్ఓలు 5 రోజుల పర్యటనలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించాలని, రాష్ట్రం ఏర్పాటయిన తర్వాత గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో అనేక మార్పులు ఎలా ఉన్నాయో, ప్రజల జీవన ప్రమాణాలు పెరిగాయని, వాటన్నిటిని డేటా రూపంలో సేకరించాలని అన్నారు. ప్రతి గ్రామంలో హరితహారం కింద నర్సరీలను ఏర్పాటు చేశామని, శ్మశానవాటికలు, పల్లె ప్రకృతి వనాలు, ప్రతి గ్రామానికి ట్రాక్టర్, డంపింగ్ యార్డ్ వంటివి ఏర్పాటు చేశామని, గ్రామాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు ఎలా ఉన్నాయో చూడాలన్నారు. ముఖ్యంగా తాగునీటి కల్పనకు మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, కల్యాణ లక్ష్మి, షాదీముబారక్, రైతుబంధు, రైతు బీమా పథకాలు గ్రామీణ ప్రాంత ప్రజల ఆర్థిక స్థితిగతులను అధ్యయనం చేయాలన్నారు. గ్రామస్థాయిలో సుమారు 40 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని వారందరితో అన్ని వివరాలు తెలుసుకోవాలని సూచించారు. శిక్షణ నిమిత్తం వచ్చిన ఏఎస్‌ఓలకు ఐదు గ్రూపులుగా విభజించి నాగర్‌కర్నూల్, తాడూర్, తెలకపల్లి, కల్వకుర్తి నాలుగు మండలాలను కేటాయించి ఒక్కో ఏఎస్‌ఓకు ఒక ఇన్చార్జ్ అధికారితో పాటు, వారికి అవసరమైన సమాచారం ఇవ్వడం జరుగుతుందని వివరించారు. నేటి నుంచి అక్టోబర్ 20వ తేదీ వరకు ఐదు రోజుల పాటు గ్రామీణ ప్రాంత ప్రజల సామాజిక, ఆర్థిక, రాజకీయ అంశాలపై మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల శిక్షణ కేంద్రం ఆధ్వర్యంలో ఢిల్లీ కేంద్ర సచివాలయానికి సంబంధించిన అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్లు గ్రామీణ ప్రాంత అధ్యయనంలో పాల్గొన్నట్లు కలెక్టర్ తెలిపారు. సమావేశంలో డీపీఓ కృష్ణ, మహబూబ్‌నగర్ ట్రైనింగ్ సెంటర్ ఇన్చార్జ్ గోపాల్, కలెక్టరేట్ ఏఓ శ్రీనివాసులు ఉన్నారు. -
నిబంధనలు పక్కాగా అమలు చేయాలి.. లేదంటే కఠిన చర్యలుంటాయ్..!
సూర్యపేట్: జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ను పకడ్బందీగా అమలు చేయాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి వెంకట్రావ్ అన్నారు. శుక్రవారం కోదాడ పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయంలో ఎన్నికల నిర్వహణపై ఎస్ఎస్టీ, ఎంసీసీ, ఎఫ్ఎస్టీ టీం సిబ్బందితో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో 1,201 పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేశామని, వాటిలో 152 సమస్యాత్మక కేంద్రాలు గుర్తించినట్లు చెప్పారు. తమ పరిధిలోని అన్ని పోలింగ్ బూత్‌లు పరిశీలించి ఓటర్లు, సిబ్బందికి కావాల్సిన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలన్నారు. ప్రచార మాధ్యమాలతో పాటు బ్యాంకు ఖాతాలపై నిఘా పెంచాలని తెలిపారు. 80 సంవత్సరాలు దాటిన వయోవృద్ధులు, దివ్యాంగులకు ఇంటి వద్ద నుంచే ఓటు వేసేందుకు దరఖాస్తు చేసుకునే సదుపాయంపై అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. అంతర్రాష్ట్ర సరిహద్దు చెక్‌పోస్ట్‌లో సిబ్బంది అక్రమ రవాణాలపై నిఘా పెంచాలన్నారు. ఇన్చార్జ్ ఎస్పీ నాగేశ్వరరావు మాట్లాడుతూ నియోజకవర్గంలో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి, పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. శాంతియుతంగా ఎన్నికలు జరిగేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. సమావేశంలో జిల్లా వ్యవసాయాధికారి రమణనాయక్, డీఎస్పీ ప్రకాష్, ఎకై ్సజ్ సీఐ శ్రీనివాస్, స్థానిక తహసీల్దార్, తదితర సిబ్బంది పాల్గొన్నారు. రూ.50వేల వరకు మాత్రమే అనుమతి ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చిన నేపథ్యంలో వాహనదారులు రూ.50వేల లోపు నగదును మాత్రమే తీసుకెళ్లేందుకు అనుమతి ఉంటుందని కలెక్టర్ వెంకట్రావ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. నిబంధనలు అతిక్రమించి ఎక్కువ మొత్తంలో నగదు దొరికితే ఆమొత్తాన్ని సీజ్ చేసి జిల్లా ట్రెజరీలో జమ చేస్తారని పేర్కొన్నారు. రూ.10 లక్షలకు పైగా ఎక్కువ నగదు పట్టుబడితే సంబంధిత ఆదాయపు పన్ను శాఖ అధికారులకు తెలిపి, నగదు విడుదలకు నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. అత్యవసరంగా వైద్యం, కళాశాల ఫీజులు, వ్యాపారం, పెళ్లిళ్లు, ఇతర అవసరాలకు నగదును తీసుకెళ్తున్న వారు సరైన పత్రాలతో నగదు తీసుకెళ్లాలని సూచించారు. అధికారులకు ఆధారాలుగా నగదు డ్రా చేసిన అకౌంట్ పుస్తకం, ఏటీఎం స్లిప్, వస్తువులు, ధాన్యం విక్రయ నగదు అయితే సంబంధిత బిల్లు, భూమి విక్రయించిన సొమ్ము అయితే డాక్యుమెంట్లు, వ్యాపారం సేవల నగదు అయితే లావాదేవీల వివరాలు చూపించాల్సి ఉంటుందని తెలిపారు. సీజ్ అయిన నగదు విషయంపై అప్పీలు, ఆధారాలు పొంది దరఖాస్తు చేసుకోవడానికి కలెక్టరేట్లో జిల్లా గ్రీవెన్స్ కమిటీ కార్యాలయం ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఇందుకుగాను జిల్లా గ్రీవెన్స్ కమిటీ ఇన్చార్జ్ జెడ్పీ సీఈఓ సురేష్ నంబర్ 83745 66222, కమిటీ కన్వీనర్ డీసీఓ శ్రీధర్ నంబర్ 91001 15651ను సంప్రదించాలని కోరారు. -
ఎన్నికల నిర్వాహణ ఏర్పాట్లలో అధికారులకు క్షణం తీరిక దొరకడం లేదు..!
సూర్యాపేట: అసెంబ్లీ ఎన్నికల ఏర్పాట్లలో అధికారులు తలమునకలయ్యారు. కలెక్టరేట్లోని దాదాపు అన్ని శాఖల జిల్లా అధికారులకు, సిబ్బందికి ఎన్నికల విధులు కేటాయించారు. రోజూ కలెక్టరేట్లో ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లపై చర్చలు జరపడం, సమావేశాలు నిర్వహిస్తూ బిజీగా మారారు. కలెక్టర్ ఎస్. వెంకట్రావు ఎన్నికలకు సంబంధించి సమీక్షలు, సమావేశాలు, వీడియో కాన్ఫరెన్స్‌లు నిర్వహిస్తున్నారు. ఎన్నికల పర్యవేక్షణకు కమిటీలు.. జిల్లాలో ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు కలెక్టర్ ఎస్. వెంకట్రావు 17 కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ బృందాలకు జిల్లా అధికారులను నోడల్ అధికారులుగా విధులు కేటాయించారు. ఇందులో మోడల్ కోడ్ అమలు, ఈవీఎం, వీవీ ప్యాట్ల పర్యవేక్షణ, ఉద్యోగులకు విధుల కేటాయింపు, అభ్యర్థి తరఫున ఏజెంట్లకు లైసెన్స్ ఇవ్వడానికి, పోలింగ్ కేంద్రాల వద్ద మౌలిక వసతుల కల్పన, ఎన్నికల సిబ్బందికి శిక్షణ, ఓటరు నమోదుపై అవగాహన, ఎన్నికల వ్యయ నిర్ధారణ, మీడియా కమ్యూనికేషన్, పోస్టల్ బ్యాలెట్– ఈవీఎం బ్యాలెట్ కమిటీ, ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ, గెస్ట్ హౌస్‌ల ఏర్పాటు, మైక్రో అబ్జర్వర్, హెల్ప్‌లైన్ అండ్ కంట్రోల్ యూనిట్, ఎంసీఎంసీఏ, పోలీస్ కోఆర్డినేషన్, హెలిపాడ్ కోఆర్డినేషన్ వంటి వాటికి వివిధ శాఖల అధికారులతో కమిటీలను ఏర్పాటు చేశారు. ఇటు శాఖా పరమైన విధులు.. అటు ఎన్నికల పనులు కలెక్టరేట్లో ఎన్నికల విభాగం ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా జిల్లా ఎన్నికల అధికారికి సహాయకులుగా మొత్తం ఎనిమిది మంది ఉన్నారు. వీరిలో ఎన్నికల సూపరింటెండెంట్, డిప్యూటీ తహసీల్దార్, ఇద్దరు జూనియర్ అసిస్టెంట్లు కాగా మరో నలుగురు కంప్యూటర్ ఆపరేటర్లు ఉన్నారు. వీరంతా నెల రోజులుగా ఉదయం నుంచి రాత్రి వరకు ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. వీరే కాకుండా ఆయా శాఖల అధికారులు ఎన్నికల ఏర్పాట్లలో బిజీగా మారారు. జిల్లా స్థాయి అధికారులైతే ఇటు తమ శాఖకు సంబంధించిన పనులు చేస్తూ అటు ఎన్నికల ఏర్పాట్లపై తమకు కేటాయించిన మండలాలు, గ్రామాలకు వెళ్లి క్షేత్ర పర్యటన చేస్తున్నారు. అక్కడ పోలింగ్ కేంద్రాల్లో ఉన్న సదుపాయాలు, ఇంకా కావాల్సిన అవసరాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. రిటర్నింగ్, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు జిల్లాలో నాలుగు నియోజకవర్గాలకు రిటర్నింగ్ అధికారులను ఇప్పటికే కేటాయించారు. తుంగతుర్తి నియోజకవర్గానికి జిల్లా అదనపు కలెక్టర్ వెంకట్‌రెడ్డి, హుజూర్నగర్ నియోజకవర్గానికి జగదీశ్వర్‌రెడ్డి, సూర్యాపేట నియోజకవర్గానికి సూర్యాపేట ఆర్డీఓ వీరబ్రహ్మచారి, కోదాడ నియోజకవర్గానికి కోదాడ ఆర్డీఓ సూర్యానారాయణలను రిటర్నింగ్ అధికారులుగా నియమించారు. అదే విధంగా నియోజకవర్గాల పరిధిలోని తహసీల్దార్లు అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులుగా వ్యవహరించనున్నారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల నామినేషన్ దగ్గర నుంచి పోలింగ్, కౌంటింగ్ వరకు అన్ని బాధ్యతలను వీరు నిర్వర్తించనున్నారు. అదే విధంగా అభ్యర్థుల వ్యయ నిర్ధారణ, ఫిర్యాదులు, చర్యలు వంటివి రిటర్నింగ్ అధికారులు చూసుకుంటారు. పోలింగ్ నిర్వహణకు సుమారు 12 వేల మంది పోలింగ్ నిర్వహణకు సిబ్బందిని కేటాయించే పనిలో జిల్లా అధికారులు ఉన్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయులతో పాటు, ఇతర శాఖల ఉద్యోగులను పోలింగ్ నిర్వహణకు వినియోగించుకోనున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు సరిపడక పోతే ప్రైవేట్ ఉపాధ్యాయులను విధులకు వాడనున్నారు. జిల్లాలో 1,201 పోలింగ్ కేంద్రాలు ఉండగా ప్రతి పోలింగ్ కేంద్రానికి ఒక పోలింగ్ ఆఫీసర్, ఒక అసిస్టెంట్ పోలింగ్ అధికారి, ఇద్దరు, లేదా ముగ్గురు పోలింగ్ సిబ్బందిని కేటాయించనున్నారు. దీని ప్రకారం 1,201 మంది పోలింగ్ అధికారులు, 1,201 మంది అసిస్టెంట్ పోలింగ్ అధికారులు , ఇద్దరు సిబ్బందిని వాడితే 2,402 మంది, లేదా ముగ్గురిని కేటాయిస్తే 3,603 మంది ఎన్నికల సిబ్బందికి విధులు కేటాయించనున్నారు. -
TS Election 2023: ‘సీ–విజిల్’ యాప్ ఫిర్యాదుతో.. ఇకపై ప్రలోభాలకు చెక్!
ఖమ్మం: శాసనసభ ఎన్నికల నేపథ్యాన ఓటర్లను ప్రలోభపెట్టేందుకు అభ్యర్థులు యత్నించే అవకాశముంది. ఈ నేపథ్యాన వీరికి చెక్ పెట్టేందుకు, ఓటర్లు ఫిర్యాదు చేసేందుకు ఎన్నికల సంఘం సీ–విజిల్ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఫొటోలు, వీడియోల ఆధారంగా నేరుగా ఫిర్యాదు చేసేందుకు ఈ యాప్ ఉపయోగపడుతుంది. డౌన్లోడ్ ఇలా.. ఆండ్రాయిడ్ ఫోన్ ఉన్న వారెవరైనా ప్లే స్టోర్ నుంచి సీ–విజిల్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఫోన్ నంబర్ నమోదు చేస్తే ఓటీపీ వస్తుంది. అనంతరం ఫొటో, వీడియో, ఆడియో మూడు రకాల ఆప్షన్లు వస్తాయి. లైవ్ లొకేషన్ ఆన్ చేసి అక్కడి పరిస్థితుల ఆధారంగా ఆప్షన్ ఎంపిక చేసుకుని ప్రొసీడ్ కొడితే నేరుగా సంబంధిత అధికారులకు విషయం చేరిపోతుంది. వంద నిమిషాల్లోనే.. ఎక్కడైనా ఓటర్లను ప్రలోభాలకు గురిచేసేలా మద్యం, డబ్బు, ఇతర సామగ్రి పంపిణీ చేస్తున్నట్లయితే సీ–విజిల్ యాప్ ద్వారా ఫొటో, వీడియో ఆధారంగా ఫిర్యాదు చేయొచ్చు. ఈ వివరాలు అధికారులకు చేరిన 100నిమిషాల్లో ఘటనాస్థలికి చేరుకుని చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అంతేకాక బాధ్యులపై ఏం చర్యలు తీసుకున్నారనే అంశాన్ని కూడా ఫిర్యాదుదారులకు చేరవేస్తారు. అంతేకాక ఫిర్యాదు చేసిన వారి వివరాలను బయటకు వెల్లడించబోమని అధికార యంత్రాంగం చెబుతోంది. కాగా, సీ విజిల్ యాప్‌ను ఎక్కువ మంది డౌన్లోడ్ చేసుకునేలా, ప్రలోభాలపై ఫిర్యాదు చేసేలా విస్తృత అవగాహన కల్పిస్తున్నామని కలెక్టర్ వీ.పీ.గౌతమ్ వెల్లడించారు. -
ప్రశాంతంగా ఎన్నికలు జరిగేలా సహకరించాలి.. కలెక్టర్..
నారాయణపేట: ఎన్నికల ప్రవర్తన నియమావళిని పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఎన్నికల నియామవళి అమలు, విధివిధానాలపై వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఎన్నికల్లో విధులు నిర్వర్తించే అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి పలు సూచనలు, సలహాలను కలెక్టర్ నిర్దేశించారు. ఎన్నికలు సజావుగా , ప్రశాంతంగా ఎన్నికలు జరిగేలా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రవర్తనా నియమావళి అనుసరించి ఎన్నికలు సాఫీగా, సజావుగా జరిగేలా సహాకరించాలన్నారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘనకు పాల్పడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ సమర్థవంతంగా పని చేయాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. గ్రామ స్థాయి నుంచి వివిధ పార్టీలకు సంబంధించిన ప్లెక్సీలు, బ్యానర్లు, గోడలపై ఉన్న రాతలను వెంటనే తొలగించేందకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. పార్టీలు గానీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు అనుమతులు లేకుండా ప్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేసి ఎన్నికల నిబంధనల ఉల్లంఘనను పాల్పడితే వారిపై కేసులు నమోదు చేయడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. ప్రచార ఖర్చుల లెక్క పక్కా.. ఎన్నికల ప్రచార ఖర్చు గరిష్ట పరిమితిని రూ.40 లక్షలుగా నిర్ణయించినట్లు, సమావేశాలు, ర్యాలీలు, వాహనాల కోసం, తాత్కాలిక ఎన్నికల కార్యాలయం, లౌడ్ స్వీకర్ల. హెలికాప్టర్లు ల్యాండింగ్‌కు హెలిప్యాడ్లకు ప్రతి సబ్ డివిజన్లో ప్రతి ఆర్ఓ స్థాయిలో ఉంచబడిందన్నారు. ఆప్లికేషన్ వివరంగా పూర్తి ఆకృతిలో చేయాలని, తద్వారా ఖర్చు గణన సులభం అవుతుందని, హైటెక్ డిజిటల్ ఎన్నికల ప్రకటన అండ్ ఎల్ఈడీ స్క్రీన్ స్థిరంగా ఉండేలా ప్రామాణిక రేట్లు వర్తించబడతాయన్నారు. సమావేశంలో వ్యయ నోడ్‌ల్ అధికారి కోదండరాములు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు సలీం, వినయ్‌మిత్ర, వెంకట్రామరెడ్డి, రఘురామయ్య గౌడ్, సుదర్శన్‌రెడ్డి, ఎండి అబ్దుల్ ఖాదర్ తదితరులు పాల్గొన్నారు. రూ.50వేల నగదుతో పట్టుబడితే సీజ్ చెక్‌పోస్టును ఏర్పాటు చేయడం జరిగిందని, రూ.50 వేల కంటే పైబడి నగదుతో పట్టుబడితే వాటిని సీజ్ చేయడం జరుగుతుందని తెలిపారు. షాడో రిజిస్టర్ పెట్టాలని, సర్వేలైన్ టీం రికార్డ్ చేయాలన్నారు. ఈసమావేశంలో ఎస్డీసీ రాజేందర్‌గౌడ్, డీపీఓ మురళీ, అధికారులు పాల్గొన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే లైసెన్స్ రద్దు ఎన్నికల ప్రచార సామగ్రి ముద్రణను నిబంధనల ప్రకారం ప్రింటింగ్ ప్రెస్ యాజమానులు నిర్వహించాలని.. లేదంటే ప్రింటింగ్ ప్రెస్ లైసెన్స్‌ను రద్దు చేయడం జరుగుతుందని కలెక్టర్ అన్నారు. ప్రింటింగ్ ప్రెస్ యజమానులతో కలెక్టర్ మాట్లాడారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో ఎన్నికల కరపత్రాలు, పోస్టర్లు, ఇతర మెటీరియల్ ముద్రించినప్పుడు లేదా ప్రచురించినప్పుడు తప్పనిసరిగా ప్రింటర్, ప్రచురణ కర్త పేర్లు, చిరునామా , సెల్‌ఫోన్ నంబర్లు ప్రింట్ లైన్లో స్పష్టంగా సూచించాలని, ముద్రించబడిన ప్రతులను మూడు అదనపు ప్రింట్లతో పాటు ప్రింట్ చేసిన మూడు రోజుల్లోపు ప్రచురణ కర్త నుంచి కలెక్టర్ కార్యాలయం నందు ప్రజాప్రాతినిధ్యం చట్టం 1951 సెక్షన్ 127(ఏ) ప్రకారం పంపాలన్నారు. -
నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించడానికి అధికారులు సిద్ధం కావాలి
కొత్తగూడెం: నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించడానికి అధికారులు సిద్ధం కావాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ఆల అన్నారు. కలెక్టరేట్లో మంగళవారం అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. విధులు కేటాయించిన సిబ్బంది ఎన్నికల నిర్వహణ పట్ల అవగాహన కలిగి ఉండాలని, ఎన్నికల నియామవళి అమల్లో ఉన్నందున పటిష్ట పర్యవేక్షణ జరగాలని అన్నారు. ఎన్నికల ప్రక్రియకు సంబంధించి 1950, సీ – విజిల్ యాప్‌నకు వచ్చిన ఫిర్యాదులను తక్షణమే విచారించి పరిష్కారానికి చర్యలు చేపట్టాలన్నారు. పోలింగ్ కేంద్రాల వారీగా రూట్ మ్యాప్‌లు, సమస్యాత్మక ప్రాంతాలకు మ్యాపింగ్ చేయాలని సూచించారు. విధుల పట్ల నిర్లక్ష్యం చేస్తే ఎన్నికల సంఘ నియమావళి ప్రకారం కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. ఎస్పీ డాక్టర్ వినీత్ మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణలో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. ఏదైనా సమస్య వస్తే సమీప పోలీస్‌స్టేషన్‌లో సమాచారం అందించాలని కోరారు. లైసెన్స్డ్ పిస్టళ్లను పోలీస్ శాఖకు సరెండర్ చేయాలని, లేదంటే రద్దుచేస్తామని అన్నారు. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు లౌడ్ స్పీకర్లకు అనుమతిలేదని చెప్పారు. నగదుతో రవాణా చేసే వారు తగిన ఆధారాలు చూపించకుంటే సీజ్ చేస్తామని తెలిపారు. ఆ నగదు విడుదలకు ముగ్గురు సభ్యులతో కమిటీ ఉంటుందని, పరిశీలన తర్వాత విడుదల చేస్తామని చెప్పారు. ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియాలలో వచ్చే వార్తలపై పర్యవేక్షణ ఉంటుందని, తప్పుడు సమాచారంతో పోస్టు చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని అన్నారు. సమావేశంలో ఐటీడీఏ పీఓ ప్రతీక్‌జైన్, డీఎఫ్ఓ కిష్టగౌడ్, అదనపు కలెక్టర్లు రాంబాబు, మధుసూదన్‌రాజు, డీఆర్ఓ రవీంద్రనాథ్, భద్రాచలం ఏఎస్పీ పరితోష్ పంకజ్ తదితరులు పాల్గొన్నారు. నోడల్ అధికారుల నియామకం అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు నోడల్ అధికారులను నియమించినట్లు ప్రియాంక ఆల తెలిపారు. జిల్లాలో ఎన్నికల కోడ్ ఉన్నందున నోడల్ అధికారులు నిరంతర పర్యవేక్షణ చేయాలన్నారు. మ్యాన్‌పవర్ మేనేజ్మెంట్కు నోడల్ అధికారులు(ఎన్ఓ)గా డీఈఓ వెంకటాచారి, ఇరిగేషన్ డిప్యూటీ ఎస్ఈ కె. మహేశ్వరరావు, కోఆర్డినేటర్‌గా మైనార్టీ సంక్షేమాధికారి కె.సంజీవరావు వ్యవహరిస్తారని తెలిపారు. ట్రైనింగ్ మేనేజ్మెంట్ ఎన్‌ఓగా సీపీఓ శ్రీనివాసరావు, కోఆర్డినేటింగ్, మాస్టర్ ట్రైనర్లుగా డీఈఓ కార్యాలయ ఏపీఓ కిరణ్‌కుమార్, పి సాయికృష్ణ వ్యవహరిస్తారని, మెటీరియల్ మేనేజ్మెంట్ ఎన్‌ఓగా భూగర్భ జల శాఖాధికారి ఎం.బాలు కోఆర్డినేటింగ్ అధికారిగా డీఏఓ అభిమన్యుడు ఉంటారని తెలిపారు. ట్రాన్స్పోర్ట్ మేనేజ్మెంట్కు ఎన్‌ఓగా ఎంవీఐ జైపాల్‌రెడ్డి, కో ఆర్డినేటర్లుగా ఆర్టీఓ పి.వేణు, కొత్తగూడెం, మణుగూరు, భద్రాచలం డీఎంలు వ్యవహరిస్తారు. కంప్యూటరైజేషన్, సైబర్ సెక్యూరిటీకి ఎన్‌ఓగా డీఐ సీహెచ్ సంపత్, స్వీప్ ఎన్‌ఓగా సివిల్ సప్లై డీఎం త్రినాథ్‌బాబు, కో ఆర్డినేటర్‌గా డీఆర్డీఓ మధుసూదన్‌రాజు ఉంటారు. ఈవీఎం మేనేజ్మెంట్ ఎన్‌ఓగా అదనపు కలెక్టర్ పి.రాంబాబు వ్యవహరిస్తారు. ఎంసీసీ ఎన్‌ఓగా జెడ్పీ డిప్యూటీ సీఈఓ నాగలక్ష్మి, కో ఆర్డినేటర్లుగా సీఈఓ విద్యాలత, డీఎల్పీఓ పవన్ ఉంటారని కలెక్టర్ వివరించారు. -
ఇప్పుడు ప్రజల చేతుల్లోనే పవర్.. ఓటు హక్కు స్వేచ్ఛగా వినియోగించుకోండి..
ఖమ్మం: ఎన్నికల షెడ్యూల్ వెలువడటంతోనే కోడ్ అమలులోకి వచ్చింది. ఇప్పుడు ప్రజల చేతుల్లోనే పవర్ ఉంది. స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలి. గత ఎన్నికల్లో జిల్లాలో 90 శాతం వరకు పోలింగ్ నమోదు కాగా, ఈసారి మరింత పెరిగేలా అవగాహన కల్పిస్తున్నాం... అని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి వీ.పీ. గౌతమ్ తెలిపారు. సీపీ విష్ణు ఎస్.వారియర్‌తో కలిసి ఆయన జెడ్పీ హాల్లో విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వ కార్యాలయాలు, స్థలాల్లోని రాజకీయ నేతల ఫ్లెక్సీల తొలగింపు, విగ్రహాలకు ముసుగు కప్పడం వంటి పనులు చురుగ్గా సాగుతున్నాయని తెలిపారు. ప్రభుత్వ స్థలాల్లో సభలు, సమావేశాల నిర్వహణ, సొంత ఖర్చులతో హోర్డింగ్స్ పెట్టుకోవాలనుకునే వారు మున్సిపాలిటీల్లో అనుమతి తీసుకోవాలని సూచించారు. ఖమ్మంకు మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి, వైరాకు అదనపు కలెక్టర్, సత్తుపల్లికి కల్లూరు ఆర్డీఓ, మధిరకు ఖమ్మం ఆర్డీఓ, పాలేరుకు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఆర్‌ఓలుగా వ్యవహరిస్తారని చెప్పారు. డబ్బు, మద్యం పంపకంపై సమాచారం ఇచ్చేందుకు ఎన్నికల కమిషన్ సీ విజిల్ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చిందని తెలిపారు. కాగా, కొత్త కోడళ్లు తమ పుట్టింటి నుంచి ఓటు హక్కును అత్తింటి వద్దకు మార్చుకోవడానికి ఫామ్–18ను దరఖాస్తు చేసుకోవాలని, వృద్ధులు ఇంటి నుంచి ఓటు వేసుకునే హక్కు ఉందని చెప్పారు. ఓటర్లకు అవగాహన కల్పించేందుకు ప్రతీ నియోజకవర్గంలో ఐదు మోడల్పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామని కలెక్టర్ వివరించారు. జింకలతండా గోదాంలో లెక్కింపు వచ్చేనెల 30న పోలింగ్ ముగిశాక ఈవీఎంలను రఘునాథపాలెం మండలం జింకలతండాలోని గోడౌన్‌కు తరలిస్తామని కలెక్టర్ గౌతమ్ తెలిపారు. డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు ఉంటుందన్నారు. జిల్లాలో గతంతో పోలిస్తే 63 పోలింగ్‌కేంద్రాలు పెరగగా, ఓటర్లకు ఇబ్బంది రాకుండా అన్ని ఆవాసాల్లో పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. సీపీ విష్ణు ఎస్.వారియర్ మాట్లాడుతూ సోమవారం జిల్లావ్యాప్తంగా రూ.53 లక్షలు సీజ్ చేసి 17 కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. గత ఎన్నికల్లో 10 వేల మందిని బైండోవర్ చేయగా, ఈసారి వారంలోగా ప్రక్రియ పూర్తిచేస్తామన్నారు. ఇక జిల్లాలో 131 మంది గన్ లైసెన్స్ కలిగి ఉండగా.. 128 మంది వద్ద తుపాకులు ఉన్నాయని చెప్పారు. వీరిలో బ్యాంక్ లైసెన్స్‌దారులు మినహా మిగతా వారు డిపాజిట్ చేయాలని సూచించినట్లు తెలిపారు. జిల్లాలో 390 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి ప్రత్యేక ఏర్పాట్లుచేయనున్నట్లు చెప్పారు. కొత్త జాబితాలో తొలగింపులు ఉండవు.. ఎన్నికల నియమావళిని అన్ని పార్టీలు తప్పక పాటించాలని కలెక్టర్ గౌతమ్ సూచించారు. గుర్తింపు పొందిన పార్టీల ప్రతినిధులతో సీపీ వారియర్‌తో కలిసి సమావేశమైన ఆయన మాట్లాడారు. కొత్తగా ఓటరు జాబితాలో తొలగింపులకు అవకాశం లేకపోగా, అర్హులు ఉంటే పేర్ల నమోదుకు అవగాహన కల్పించాలని సూచించారు. అనంతరం వ్యయ పర్యవేక్షణ అమలు కమిటీ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ అనుమానాస్పద లావాదేవీలపై రిటర్నింగ్ అధికారులకు బ్యాంకర్లు సమాచారం ఇవ్వాలని తెలిపారు. వైన్స్‌లో అమ్మకాలకు సంబంధించి గత మూడు నెలల నివేదిక సేకరించాలన్నారు. ఎంసీఎంసీ ప్రారంభం.. కలెక్టరేట్లోని జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయంలో ఏర్పాటుచేసిన మీడియా సెంటర్, మీడియా సర్టిఫికేషన్ – మానిటరింగ్ కమిటీ(ఎంసీఎంసీ) సెల్‌ను కలెక్టర్ గౌతమ్, సీపీ వారియర్ ప్రారంభించారు. ఎన్నికల సంబంధ వార్తలపై నిఘా వేయడమే కాక ఫిర్యాదులపై దృష్టి సారించాలని చెప్పారు. అనంతరం డబ్బు, మద్యం, ప్రలోభాల నియంత్రణకు ఏర్పాటుచేసిన ఎంసీసీ, ఫ్లయింగ్ స్క్వాడ్, ఎస్ఎస్టీ బృందాలకు కేటాయించిన వాహనాలను కలెక్టర్ ప్రారంభించారు. జిల్లాలో 15 ఫ్లయింగ్ స్క్వాడ్, 24 ఎంసీసీ, 15 ఎస్ఎస్టీ బృందాలను ఏర్పాటుచేశామని, ఈ బృందాలు షిఫ్ట్‌ల వారీగా 24గంటలు పనిచేస్తాయని తెలిపారు. ఈ సమావేశాల్లో అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్, అడిషనల్ డీసీపీ ప్రసాదరావు, వ్యయ పర్యవేక్షణ జిల్లా నోడల్ అధికారి సాయికుమార్, డీటీఓ కిషన్‌రావు, ఎక్సైజ్ సూపరింటెండెంట్ నాగేందర్‌రెడ్డి, డీసీఓ విజయకుమారి, ఎల్డీఎం శ్రీనివాసరెడ్డి, ఏసీపీ గణేష్, డీఆర్డీఓ విద్యాచందన, సీపీఓ ఏ.శ్రీనివాస్, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి వేణుమనోహర్, డీపీఆర్వో ఎం.ఏ.గౌస్, ఏపీఆర్వో వి.శ్రీనివాసరావు, ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ రాంబాబు తదితరులు పాల్గొన్నారు. 1950, 90632 11298 నంబర్లతో కంట్రోల్‌రూం ఎన్నికల నేపథ్యాన కలెక్టరేట్లో ఏర్పాటుచేసిన కంట్రోల్ రూమ్‌ను కలెక్టర్ గౌతమ్, సీపీ వారియర్ పరిశీలించారు. ఏ ఫిర్యాదు ఏ అధికారికి అందజేయాలో చార్జ్ ఏర్పాటుచేయాలని సూచించారు. ఓటర్లు తమ ఫిర్యాదులను 1950, 90632 11298 నంబర్లకు ఇచ్చేలా ప్రచారం చేయాలని తెలిపారు. -
ఎన్నికల కోడ్ పకడ్బందీగా అమలు చేయాలి..కలెక్టర్
కుమరం భీం: జిల్లాలో ఎన్నికల కోడ్‌ను పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హేమంత్ బోర్కడే అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంగళవారం అదనపు కలెక్టర్లు దీపక్ తివారి, దాసరి వేణు, ఎస్పీ సురేశ్‌కుమార్‌తో కలిసి ఎన్నికల ప్రవర్తన నియమావళి పై పోలీస్, రెవెన్యూ, పంచాయతీరాజ్ శాఖల అ ధికారులు, ఫ్లయింగ్ స్క్వాడ్, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అధికారులకు శిక్షణా కార్యక్రమం నిర్వహించా రు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఖర్చుల పరిశీలకులు, సహాయ పరిశీలకులు, ఫ్లయింగ్ స్క్వాడ్– స్టాటిక్ సర్వేయలెన్స్, వీడియో సర్వేయలెన్స్ బృందాలు, అకౌంటింగ్ బృందం, ఎక్సైజ్ బృందం, మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీలు ఏర్పాటు చేశామని తెలిపారు. బృందాలను నియోజకవర్గాల వారీగా విభజించి విధులు కేటాయించామన్నారు. అధికారులు అలసత్వం వహించకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎన్నికల నోటిఫికేషన్ తర్వాత ప్రత్యేక వీడియో సర్వేయలెన్స్ టీం నియోజకవర్గంలో జరిగే ర్యాలీలు, బహిరంగ సభలు, ఎన్నికలకు సంబంధిత అంశాలను వీడియో రికార్డింగ్ చేస్తుందని తెలిపారు. ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు ఫిర్యాదులపై స్పందించాలని, మద్యం, నగదు, కానుకల పంపిణీపై నిఘా ఉంచాలన్నారు. రాజకీయ పార్టీలకు సంబంధించి ఖర్చులపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. 1950, 08733279411 నంబర్లతో కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామన్నారు. ఆధారాలు లేకుండా రూ.50 వేల కంటే అధికంగా నగదు, రూ.10 వేల కంటే ఎక్కువ విలువైన మద్యం తరలిస్తే సీజ్ చేస్తామని తెలిపారు. ఎంసీఎంసీ బృందం దినపత్రికలు, టీవీ చానళ్లు, మొబైల్ సందేశాలు, సోషల్ నెట్‌వర్క్‌లపై దృష్టి సారించాలన్నారు. రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ప్రచార సమయంలో ఎంసీఎంసీ అనుమతి పొందాలన్నారు. ప్రతిరోజూ ఫ్లయింగ్ స్క్వాడ్ నివేదికలు అందించాలని ఆదేశించారు. -
'సాక్షి' ప్రచురిత కథనానికి.. రిమ్స్ అక్రమార్కులపై స్పందించిన కలెక్టర్!
ఆదిలాబాద్: రిమ్స్‌లో అవినీతి, అక్రమార్కులపై కలెక్టర్ రాహుల్‌రాజ్ సీరియస్ అ య్యారు. డైరెక్టర్ జైసింగ్ రా థోడ్‌ను మంగళవారం సాయంత్రం పిలిపించి తాజా ఘటనలపై ఆరా తీశారు. అక్రమాలకు పాల్పడుతున్న వారిపై కఠినంగా వ్యవహరించాలని డైరెక్టర్‌ను ఆదేశించారు. ఈనెల 18న ‘సాక్షి’లో ‘అవుట్సోర్సింగ్ మోసాలు.. ’శీర్షికన ప్రచురితమైన కథనానికి స్పందించారు. నిరుద్యోగి నుంచి డబ్బులు వసూలు చేసిన సంబంధిత ఉద్యోగిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ విషయమై డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ మాట్లాడుతూ, విచారణ కమిటీ ఏర్పాటు చేసి అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. -
బాల్య వివాహం నుంచి బాలికకు విముక్తి
ఏలూరు(మెట్రో): ఫేస్బుక్ ద్వారా కలెక్టర్‌కి వచ్చిన సమాచారం మేరకు బాల్య వివాహం నుంచి ఓ బాలికకు విముక్తి కలిగింది. స్థానిక చెంచుల కాలనీలో బాల్యవివాహానికి పెద్దలు పాల్పడుతున్నారనే సమాచారం మేరకు వెంటనే స్పందించిన కలెక్టర్ వె.ప్రసన్న వెంకటేష్ చర్యలు చేపట్టారు. జిల్లా బాలల సంరక్షణ అధికారి డాక్టర్ సీహెచ్ సూర్య చక్రవేణి చైల్డ్ హెల్ప్‌లైన్ బృందం సమన్వయంతో అంగన్వాడీ వర్కర్ సహకారంతో బాలిక ఇంటికి చేరుకొని విచారణ చేశారు. బాలిక తండ్రి 12 ఏళ్ల క్రితం చనిపోగా, తల్లి మరో వ్యక్తిని పెళ్లి చేసుకుని వెళ్లిపోయింది. అప్పటినుంచి బాలిక తన అక్క, అన్నతో కలిసి నానమ్మ ఇంటి వద్ద ఆశ్రయం పొందుతోంది. కూలీ పని చేసుకొనే నానమ్మ, తాతయ్య ఆమెకు వివాహం చేయాలని భావించి ఓ అబ్బాయితో నిశ్చితార్థం చేయించారు. మరో నాలుగు రోజుల్లో వివాహ తేదీని నిర్ణయిస్తారని తెలిసిన బాలిక తనకు తెలిసిన వారి ద్వారా విషయాన్ని ఫేస్బుక్ ద్వారా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లింది. దీనిపై స్పందించిన కలెక్టర్ చర్యలు తీసుకున్నారు. బాలిక నానమ్మ, తాతయ్యలకు కౌన్సెలింగ్ నిర్వహించి, బాల్యవివాహా ప్రక్రియను రద్దు చేయాలని డీపీపీఓను ఆదేశించారు. అలాగే బాలిక చదువుతున్న పాఠశాలకు వెళ్లి ఆమెకు అడ్మిషన్ ఇప్పించడంతో పాటు చదువుకు కావాల్సిన అవసరాలను గుర్తించాలని కలెక్టర్ ఆదేశించారు. అలాగే సొంత ఖర్చులతో ఆ బాలికకు సైకిల్, బ్యాగ్, పుస్తకాలు, యూనిఫాం మొదలైనవి కలెక్టర్ సమకూర్చారు. బాలికకు ధైర్యం చెప్పి జీవితంలో ఉన్నత లక్ష్యంతో ముందుకు వెళ్లాలని సూచించారు. డీసీపీవో సీహెచ్ సూర్యచక్రవేణి, సిబ్బంది రాజేష్, శ్రీకాంత్, చైల్డ్ హెల్ప్‌లైన్ సిబ్బంది రాజు, ప్రసాద్, సునీత తదితరులు పాల్గొన్నారు. -
పోర్టు నిర్మాణంపై విషం కక్కిన ‘ఈనాడు’
టెక్కలి: టీడీపీ హయాంలో జరగని పని వైఎస్సార్ సీపీ హయాంలో జరుగుతోందనే బాధ.. శంకుస్థాపన నుంచి పనులు వేగంగా జరుగుతున్నాయనే కక్ష.. పరిహారాల నుంచి నిర్మాణాల వరకు ప్రభుత్వం చూపిస్తున్న చొరవపై ఓర్వలేని తనంతో.. మూలపేట పోర్టు నిర్మాణంపై ‘ఈనాడు’ ఓ కథనాన్ని మంగళవారం అచ్చేసింది. ‘నమ్మించి నట్టేట ముంచారు’ అన్న శీర్షికన అబద్ధాల వార్తను ప్రచురించింది. ఈ కథనాన్ని కలెక్టర్ శ్రీకేష్ బి.లాఠకర్ తీవ్రంగా ఖండించారు. దీనిపై పూర్తిస్థాయిలో వాస్తవాలను వెల్లడిస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు. అధికారులను సంప్రదించకుండా, సరైన సమాచారం లేకుండా ఇలాంటి కథనాలను ప్రచురిస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ► మూలపేట, విష్ణుచక్రం గ్రామాల్లో ఒక్కో జీడి, మామిడి చెట్టుకు, రూ.5 వేల చొప్పున పరిహారమిస్తామని చెప్పి రూ.2,500 పరిహారం ఇచ్చారని, కొందరికే ఇచ్చారని ‘ఈనాడు’ కథనంలో పేర్కొన్నారు. కానీ ఈ ఏడాది మూడు సార్లు నిర్వాసితులతో జరిపిన సమావేశాల్లో ప్రభుత్వ భూముల్లో చెట్లకు ఎలాంటి నష్టపరిహారం ఉండదని, జిరాయితీ భూముల్లో మాత్రమే చెల్లిస్తామని స్పష్టంగా చెప్పామని కలెక్టర్ తెలిపారు. ► కటాఫ్ తేదీ నాటికి, 18 ఏళ్లకు ఒకటి, రెండు నెలలు తక్కువ వయసున్నా, వారిని నిర్వాసిత కుటుంబంగా గుర్తించి ప్యాకేజీ ఇస్తామని చెప్పి ఇవ్వలేదని, స్థానిక యువతకు ఉద్యోగాల ఊసే లేదని ఈనాడు ప్రచురించింది. అయితే భూసేకరణ, పునరావాస చట్టం ప్రకారం 18 ఏళ్ల వయసు నిండని వారికి పరిహారం ఇవ్వబోమని ముందే చెప్పామని కలెక్టర్ స్పష్టం చేశారు. 18 ఏళ్ల వయసున్న వారందరికీ నిర్వాసిత ప్యాకేజీ అందించామని, పోర్టు నిర్మాణం చేస్తున్న విశ్వ సముద్ర కంపెనీ యాజమాన్యంతో మాట్లాడి మూలపేట,విష్ణు చక్రం గ్రామాల్లో గల యువత నైపుణ్య తర్ఫీదు కోసం ఒక నైపుణ్య శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరామని, ఈ గ్రామాలకు చెందిన 25 మందికి ఉపాధి అవకాశాలు కల్పించామని తెలిపారు. ► తాత్కాలిక వలసదారులను నిర్వాసితులుగా గుర్తించలేదని కథనంలో ప్రచురించారు. అయితే వీరి జాబితాను సమర్పించాలని టెక్కలి ఆర్డీఓను ఇదివరకే ఆదేశించామని, నివేదిక అందిన వెంటనే చర్యలు తీసుకుంటామని చెప్పారు. ► నిర్వాసితులకు ప్రభుత్వమే ఇల్లు నిర్మిస్తుందని హామీ ఇచ్చి ఇప్పుడు ఇచ్చిన ప్యాకేజీ నుంచి ఇంటి నిర్మాణానికి రూ.3.50 లక్షలు భరించాలని చెబుతున్నట్లు కథనంలో వివరించారు. అయితే ఇంటి నిర్మాణ ఖర్చు రూ.3.55 లక్షలుగా ప్రభు త్వం ఉత్తర్వులు జారీ చేసిందని, దీనిపై గ్రామస్తులు సంతకాలు కూడా చేశారని తెలిపారు. నిర్వాసితుల కోసం కస్పానౌపడ గ్రామంలో సుమారు 55 ఎకరాల విస్తీర్ణంలో నిర్వాసిత కాలనీ నిర్మిస్తున్నామని వివరించారు. ► పోర్టు నిర్మిత గ్రామాల ప్రభుత్వ ఉద్యోగులకూ, నిర్వాసితుల తరహాలో ప్యాకేజీ అమలు చేస్తామ ని హామీ ఇచ్చి, పోర్టు నిర్మిత గ్రామాల్లో ఉన్న ఆర్మీ జవాన్లు, ఉపాధ్యాయులు ఇతర ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న దాదాపు 20 మంది ప్రభుత్వ ఉద్యోగులకు రూ.9.90 లక్షలకి బదులుగా రూ.4.41 లక్షలే చెల్లించినట్టు కథనం ప్రచురించారు. అయితే భూసేకరణ, పునరావాస చట్టం ప్రకారం ఉద్యోగుల వార్షిక భత్యం, ఉద్యోగం ఎంపిక కింద రూ.5,50,000 మినహాయించడం వల్ల మొత్తం ప్యాకేజీ సొమ్ములో నుంచి రూ.4.40లక్షలు ఉద్యోగులకి పరిహారం ఇచ్చామన్నారు. దీనిపై నిబంధనలు తెలుసుకోవాలని హితవు పలికారు. -
నగర యువకుడి ట్వీట్‌కు కేటీఆర్ రియాక్షన్
హన్మకొండ: ‘హైదరాబాద్‌లోని బన్సీలాల్ మెట్లబావి సుందరీకరణ చాలా బాగుంది. మీకు విజ్ఞప్తి చేస్తున్నా.. వరంగల్ నగరంలోని కాకతీయుల మెట్లబావిని పునరుద్ధరించండి. ఈ ప్రాంతం చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాంతంగా గుర్తింపు పొందుతుంది’ అని నగరానికి చెందిన తోట మహేశ్ అనే సామాజిక కార్యకర్త ట్విట్టర్లో ఐటీ మంత్రి కేటీఆర్‌కు విన్నవించాడు. దీనికి కేటీఆర్ స్పందించి బావి దగ్గరికి అధికారులను పంపించి పరిశీలించాలని, ఆధునికీరణకు పనులు చేపట్టాలని, ఇందుకు బల్దియా సహకారం తీసుకోవాలని ట్యాగ్ చేస్తూ సమాధానం ఇచ్చారు. దీనిపై కలెక్టర్ ప్రావీణ్య కూడా స్పందించి చర్యలు తీసుకుంటామని చెప్పారు. దీంతో ఆ యువకుడు కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపాడు. -
అనకాపల్లి కలెక్టర్‌కు గౌరవ డాక్టరేట్
సాక్షి, అనకాపల్లి: పరిపాలనా దక్షతకు గుర్తింపు వచ్చింది. అంకిత భావానికి కితాబు లభించింది. సేవాతత్పరతకు అరుదైన గౌరవం దక్కింది. పెట్రోలియం అండ్ ఎనర్జీ యూనివర్సిటీ తొలి గౌరవ డాక్టరేట్‌ను అనకాపల్లి కలెక్టర్ రవి పట్టాన్‌శెట్టికి ప్రదానం చేసింది. శనివారం విశాఖలో జరిగిన ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ (ఐఐపీఈ) మూడో స్నాతకోత్సవంలో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ జియోమాగ్నెటిజం ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ గౌరవ శాస్త్రవేత్త, ప్రొఫెసర్ అర్చన భట్టాచార్య డాక్టరేట్‌ను అందించారు. ఐటీడీఏ పీఓగా, జేసీగా, కలెక్టర్‌గా గిరిజనులకు అందించిన సేవలు, ఆయన హయాంలో గిరిజన ప్రాంతాల అభివృద్ధి, పరిపాలన దక్షతకు గుర్తింపుగా ఆయనకు ఈ గౌరవం దక్కింది. రవి పట్టాన్‌శెట్టి ఇటీవల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ‘స్వస్థ భారత్’లో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో అనకాపల్లి జిల్లా నుంచి అందుకున్న అవార్డును కూడా పరిగణనలోకి తీసుకున్నారు. ఇనిస్టిట్యూట్ భూ వివాదంపరిష్కారంలో కీలక పాత్ర పెట్రో యూనివర్సిటీ పున:ప్రారంభంలో కలెక్టర్ రవి పట్టాన్‌శెట్టి కీలక పాత్ర పోషించారు. తాత్కాలిక క్యాంపస్ ఏయూ ఇంజనీరింగ్ కళాశాలలో ఉండగా.. సబ్బవరం వంగలి గ్రామంలో వర్సిటీని నిర్మించేందుకు రూ.855 కోట్లు మంజూరయ్యాయి. దీనికోసం 201.08 ఎకరాల వరకు ల్యాండ్ పూలింగ్ చేశారు. మధ్యలో సుమారు 20 ఎకరాల వరకు రైతులు తమకు అన్యాయం జరిగిందని హైకోర్టును ఆశ్రయించారు. దీంతో నిర్మాణ పనులకు ఆటంకం కలిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలతో అనకాపల్లి కలెక్టర్ రవిపట్టాన్ శెట్టి నిర్వాసితులతో మాట్లాడి సమస్యను పరిష్కరించారు. దీంతో హైకోర్టు వర్సిటీ నిర్మాణానికి అనుకూలంగా తీర్పు ఇవ్వడం, పెట్రో యూనివర్సిటీకి అవరోధాలు తొలగిపోవడం జరిగింది. 2022 డిసెంబర్ 23న పనులు పున:ప్రారంభించారు. ప్రస్తుతం కాంపౌండ్ వాల్ నిర్మాణం చేశారు. పనులు కూడా జరుగుతున్నాయి. -
ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు..
ఆదిలాబాద్: రానున్న అసెంబ్లీ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టర్ రాహుల్‌రాజ్ పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరేట్లోని తన కార్యాలయంలో ఎన్నికల నిర్వహణ, ఓటరు జాబితా, పోలింగ్ కేంద్రాల తయారీ తదితర అంశాలపై వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ముందుగా ఎన్నికల నిర్వహణ, ఓటరు జాబితా రూపకల్పనపై వారి అభిప్రాయాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమగ్ర ఓటరు జాబితాను ఈ నెల 21 అన్ని పోలింగ్ కేంద్రాల్లో ప్రదర్శించనున్నట్లు తెలిపారు. 1,350 కంటే ఎక్కువ ఓటర్లున్న పోలింగ్ కేంద్రం పరిధిలో అదనంగా మరో కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. జిల్లాలో తొమ్మిది నూతన పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. నాలుగు కేంద్రాలను మరోచోటుకు మార్చినట్లు తెలిపారు. ఓటర్లు వారి పోలింగ్ కేంద్రాన్ని జాబితాలో సరిచూసుకోవాలని సూచించారు. జిల్లాలో 592 పోలింగ్ కేంద్రాలున్నాయని, అందులో ఆదిలాబాద్ నియోజకవర్గంలో 290, బోథ్ నియోజకవర్గంలో 302 ఉన్నాయని తెలిపారు. బూత్ లెవెల్ ఏజెంట్ల జాబితాను అందించాలని రాజకీయ పార్టీల ప్రతినిధులకు సూచించారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికల ప్రక్రియ పూర్తి చేసేందుకు అన్ని పార్టీల ప్రతినిధులు సహకరించాలని కోరారు. సమావేశంలో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, ఆర్డీవో స్రవంతి, ఎన్నికల విభాగం పర్యవేక్షకురాలు నలందప్రియ తదితరులు పాల్గొన్నారు. -
ముగ్గురు అధికారుల సస్పెన్షన్
ఒడిశా: జిల్లాలో కల్యాణ సింగుపూర్ సమితి మజ్జిగుడ పంచాయతీలోని ఉపొరొసొజ్జ గ్రామంలో సోమవారం కల్వర్టు సెంట్రింగ్ కూలిన ఘటనలో ఐదుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన ప్రభుత్వం అందుకు సంబంధించి రూరల్ డవలప్మెంట్ డివిజన్–1 ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ప్రదీప్ కుమార్ మహంతి, అసిస్టెంట్ ఇంజినీర్ రాజేష్ కుమార్ మండల్, జూనియర్ ఇంజినీర్ వెంకటరమణ ముదిలిలను సస్పెండ్ చేసింది. ఈ మేరకు ఆ శాఖ కార్యదర్శి సంజయ్ సింహ సోమవారం రాత్రి ఉత్తర్వులను జారీ చేశారు. వారి నిర్లక్ష్యం కారణంగా నిండు ప్రాణాలు బలయ్యాయని, సమగ్ర దర్యాప్తు జరిపిన అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటామని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కాంట్రాక్టర్‌పై కేసు నమోదు కల్వర్టు కూలిన ఘటనలో సమగ్ర దర్యాప్తు చేపట్టి ప్రభుత్వానికి నివేదికను సమర్పిస్తామని జిల్లా కలెక్టర్ స్వాధాదేవ్ సింగ్ తెలియజేశారు. మంగళవారం ఆమె మాట్లాడుతూ.. ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన అన్నారు. కల్వర్టు నిర్మాణానికి సంబంధించిన కాంట్రాక్టర్‌పై ఇప్పటికే కేసు నమోదయ్యిందని పేర్కొన్నారు. చర్యలు తీసుకోవాలి బాధితులకు నష్ట పరిహారం చెల్లించి చేతులు దులుపుకోకుండా, బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు బిజయ్ కుమార్ గొమాంగొ డిమాండ్ చేశారు. ఘటనా స్థలానికి ఆయన చేరుకొని బాధిత కుటుంబాలను పరామర్శించారు. ఇటువంటి తరహా ఘటనలు పునరావృతమవ్వకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వం అభివృద్ధి పనులకు నిధులు కేటాయిస్తున్నా, తగిన పర్యవేక్షణ లేకపోవడంతో నిధులు పక్కదారి పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు, కాంట్రాక్టర్లు కుమ్మకై ్క నిధులను దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికై నా ప్రభుత్వం కళ్లు తెరవాలని సూచించారు. -
ఆంగ్లంలో సుశిక్షిత సైన్యం
విశాఖ విద్య: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులు ప్రపంచ స్థాయిలో పోటీపడేలా ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. ఈ నేపథ్యంలోనే ఇంగ్లిష్ మీడియం చదువులకు ప్రాధాన్యం ఇస్తోంది. 2023–24 విద్యా సంవత్సరానికి మంగళవారం నుంచి ప్రారంభమవుతున్న ఫార్మటివ్ పరీక్షలతో అదనంగా ఇంగ్లిష్ లో విద్యార్థుల నైపుణ్యాన్ని తెలుసుకునేందుకు ‘టోఫెల్’ పరీక్షను సైతం నిర్వహిస్తున్నారు. విద్యార్థులకు మేలు చేయాలనే ఉన్నతాశయంతో ఇలాంటి ప్రయోగాలకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుండగా.. వీటిని క్షేత్రస్థాయిలో విజయవంతం చేసేందుకు విశాఖ జిల్లా అధికారులు సైతం చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు. దీనిలో భాగంగానే జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో 3 నుంచి 10వ తరగతి వరకు బోధించే ఇంగ్లిష్ సబ్జెక్టు టీచర్లకు రోజుకు 50 మంది చొప్పున జిల్లాలోని మొత్తం 500 మందికి శిక్షణ ఇప్పించేలా ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు అంతర్జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు శిక్షణ ఇచ్చే ఐడియల్ లెర్కింగ్ సంస్థతో ఒప్పందం చేసుకున్నారు. జిల్లా విద్యాశాఖాధికారుల ప్రతిపాదనలకు కలెక్టర్ డాక్టర్ మల్లికార్జున సానుకూలంగా స్పందించి, శిక్షణకు అయ్యే మొత్తాన్ని కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ(సీఎస్ఆర్) కింద చెల్లించేందుకు ముందుకొచ్చారు. ఈ నెల 28న ప్రారంభమైన శిక్షణ మూడు నెలల పాటు కొనసాగనుంది. విదేశాలకు వెళ్లి చదువుకుంటామనే పేద విద్యార్థులకు తోడ్పాటుగా నిలిచేలా జగనన్న విదేశీ విద్యా కానుక అందజేస్తోంది. అయితే విదేశాల్లో చదువులకు జీఆర్ఈ, కాట్, ఐల్ట్సŠ, క్లాట్, టోపెల్, సాట్ వంటి అంతర్జాతీయ స్థాయి ఎంట్రన్స్ పరీక్షలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ప్రభుత్వ స్కూళ్లలో చదువుకునే విద్యార్థులకు ఇలాంటి పోటీ పరీక్షలపై అవగాహనలేక వెనుకబడిపోతున్నారు. ఉపాధ్యాయులకు ఇలాంటి శిక్షణతో ఆ లోటు భర్తీ కానుంది. పట్టుసాధించేలా ఇంగ్లిష్ మీడియం చదువులకు ప్రాధాన్యం పెరిగింది. ఉపాధ్యాయులకూ సబ్జెక్టుపై పట్టుండాలి. కలెక్టర్ డాక్టర్ మల్లికార్జున సహకారంతో విశాఖ జిల్లాలో తొలిసారిగా ఇలాంటి శిక్షణ ఇస్తున్నాం. – బి.శ్రీనివాసరావు, సమగ్ర శిక్ష, ఏపీసీ, విశాఖపట్నం మెలకువలు నేర్పుతున్నాం.. ఇంగ్లిష్ భాషలో మెలకువలు తెలిస్తే.. విద్యార్థులను ఆకట్టుకునే రీతిలో బోధించవచ్చు. అలాంటి మెలకువలనే వారికి నేర్పుతున్నాం. ప్రతి ఉపాధ్యాయుడు కనీసం 30 గంటలైనా శిక్షణలో పాల్గొంటే మంచి ఫలితాలొస్తాయి. విద్యాశాఖాధికారులు ఈ విషయంలో చొరవ తీసుకోవాలి. – ఫిలిప్, ట్రైనర్,ఐడియల్ లెర్కింగ్ సంస్థ, విశాఖపట్నం ఉపయోగకరంగా ఉంది.. నా 23 ఏళ్ల సరీ్వసులో ఇలాంటి శిక్షణ ఇదే తొలిసారి. ఇంగ్లిష్ మీడియం బోధన అమలు చేస్తున్నందున ఇలాంటి శిక్షణ ఉపాధ్యాయులకు ఉపయోగకరంగా ఉంటుంది. – రామలక్ష్మి, ఉపాధ్యాయురాలు, జెడ్పీ హైస్కూల్, గిరిజాల, విశాఖపట్నం అలా ఉంటేనే మెరుగైన ఫలితాలు విద్యార్థులకు పాఠాలు చెప్పే మేము, మళ్లీ విద్యార్ది గా మారి శిక్షణకు హాజరవుతున్నాం. ఉపాధ్యాయుడైనా నిత్య విద్యార్ది గా ఉంటేనే ఉత్తమ ఫలితాలు వస్తాయి. నిరంతరం నేర్చుకోవాలి. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం బోధన రీత్యా శిక్షణ ఎంతో మేలు చేస్తుంది. – ఆర్.విజేత, జీవీఎంసీ హైస్కూల్, మల్కాపురం, విశాఖపట్నం -
నీరు లేదు.. వాన నీరే..
నార్నూర్(ఆదిలాబాద్): ఒకటి, రెండు రోజులు కాదు.. ఏకంగా 15 రోజులుగా నీటి వసతిలేక 367 మంది విద్యార్థినులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ఆదుకునేనాథుడే లేక వారికి వానదేవుడే దిక్కు అయ్యాడు. కొద్దిరోజులుగా నిల్వ చేసుకున్న వాననీటితోనే స్నానాలు చేస్తున్నారు. కాలకృత్యాలు తీర్చుకుంటున్నారు. ఇదీ ఆదిలాబాద్ జిల్లా గాదిగూడ మండల కేంద్రంలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయం, కళాశాల దుస్థితి. వంట చేయడానికి నీళ్లు లేక వర్కర్లు ఇబ్బందులు పడుతున్నారు. సమస్యను ఎస్వో ప్రియాంక సర్పంచ్ మెస్రం జైవంత్‌రావు దృష్టికి తీసుకెళ్లగా రెండ్రోజులు గ్రామపంచాయతీ ట్రాక్టర్ ద్వారా నీరు సరఫరా చేశారు. తర్వాత పంచాయతీ వర్కర్లు సమ్మెలో ఉండటంతో సమస్య మళ్లీ మొదటికి వచ్చింది దీంతో విద్యార్థినులు ఇంటిబాట పడుతున్నారు. నీటిసమస్యను డీఈవో ప్రణీత, కేజీబీవీ జిల్లా సెక్టోరియల్ అధికారి ఉదయశ్రీ దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం లభించలేదని విద్యార్థినులు అంటున్నారు. కలెక్టర్ స్పందించి నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు. రెండ్రోజుల్లో నీటిసమస్య పరిష్కరించకుంటే కలెక్టర్ కార్యాలయానికి వెళ్తామని పేర్కొన్నారు.