సాక్షి, కాకినాడ జిల్లా: పోర్టు అధికారి ఆదేశాలతోనే స్టెల్లా షిప్ సీజ్ చేశామని కాకినాడ కలెక్టర్ షాన్ మోహన్ తెలిపారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గత నెల 27న స్టెల్లా షిప్‌లో రేషన్ బియ్యం దొరికాయి. రేషన్ బియ్యం ఎవరు సప్లై చేశారనేది విచారణ చేస్తున్నాం.’’ అని వెల్లడించారు.
‘‘రేషన్ బియ్యం విషయంలో జిల్లా అధికారుల వైఫల్యం ఉంది. షిప్ ఆపే అధికారం కస్టమ్స్ అధికారులకు ఉంటుంది. షిప్‌లో స్టాక్‌పై పోర్ట్ అధికారులకు అధికారం ఉంటుంది. షిప్ సీజ్ చేయాలంటే హైకోర్టుకు వెళ్లాల్సిఉంటుంది. గోడౌన్ నుంచి షిప్ వరకు రైస్ ఎలా చేరిందో తేలాలి. కెన్‌స్టార్ షిప్‌లో బాయిల్డ్ రైస్‌ను గుర్తించాం. రేపు, ఎల్లుండి(బుధ,గురు) టీంలు క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తారు’’ అని కలెక్టర్ చెప్పారు.
ఇదీ చదవండి: పవన్ ‘న్యూట్రల్’ గేర్!
Comments
Please login to add a commentAdd a comment