Ration rice
-
సన్నాల కోసం చూస్తే.. దొడ్డు బియ్యం కూడా రాలే
సాక్షి, హైదరాబాద్: ఈ నెల నుంచి రేషన్ దుకాణాల ద్వారా సన్న బియ్యం సరఫరా జరుగుతుందని ఆశించిన పేదలకు నిరాశే మిగిలింది. సన్నబియ్యం సంగతి దేవుడెరుగు.. నెలనెలా వచ్చే దొడ్డు బియ్యం కూడా ఇంకా రాకపోవటంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. బియ్యం ఎప్పుడిస్తారోనని లబ్ధిదారులు సంచులు పట్టుకొని రేషన్ షాపుల చుట్టూ తిరుగుతున్న దృశ్యాలు వారం రోజులుగా చాలా జిల్లాల్లో కనిపిస్తున్నాయి. దుకాణాలకు చేరని బియ్యంప్రతినెల ఒకటో తేదీ నుంచి రేషన్ బియ్యం పంపిణీ మొదలై పదో తేదీ నాటికి దాదాపు పూర్తవుతుంది. ఈసారి పదో తేదీ వచ్చినా ఇంకా సుమారు 50 శాతం రేషన్ దుకాణాలకు బియ్యమే చేరలేదు. మండల స్థాయి స్టాక్ (ఎంఎల్ఎస్) పాయింట్ల నుంచి నెలాఖరులోగానే దుకాణాలకు బియ్యం సరఫరా కావాలి. ఈసారి ఎంఎల్ఎస్ పాయింట్లకే ఒకటో తారీఖు తరువాత అలాట్మెంట్ ఇవ్వడంతో ఈ సమస్య ఏర్పడింది. దీంతో రాష్ట్రంలోని 17,335 రేషన్ దుకాణాలకు గాను చాలా దుకాణాలకు కూడా రేషన్ బియ్యం అందలేదు. ఈ నెల కోసం 1.51 లక్షల మెట్రిక్ టన్నుల దొడ్డు బియ్యం రావాల్సి ఉండగా, వచ్చింది 62,346 మెట్రిక్ టన్నులే. అంటే 42 శాతమే సరఫరా అయ్యింది.సన్నబియ్యంపై డైలమా..మార్చి నెల నుంచి సన్న బియ్యం పంపి ణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించడంతో దొడ్డు బియ్యం బఫర్ స్టాక్‌ను పూర్తిచేసే పనిలో పౌరసర ఫరాల సంస్థ అధికారులు ఉన్నారు. వానాకాలం సీఎంఆర్ సన్న వడ్లను రెండు నెలలుగా మిల్లింగ్ చేయించి గోదా ములకు పంపుతున్నారు. దీంతో దొడ్డు బియ్యం స్టాక్ లేకుండా పోయింది. అయితే ఈ నెలలో కూడా దొడ్డు బియ్యమే సరఫరా చేయాలని ప్రభుత్వం ఆలస్యంగా నిర్ణయించడంతో.. గత నెల 20వ తేదీ నుంచే ఎంఎల్ఎస్ పాయింట్లకు చేరాల్సిన దొడ్డు బి య్యం స్టాక్ వెళ్లలేదు. 2వ తేదీ నుంచి బియ్యాన్ని ఎంఎల్ఎస్ పాయింట్లకు పంపినట్లు ఓ అధికారి తెలిపారు. ఒకటి రెండు రోజుల్లో అన్ని దుకాణాలకు బియ్యం పంపేందుకు కృషి చేస్తున్నట్లు ఓ జిల్లాకు చెందిన డీఎస్ఓ ‘సాక్షి’కి తెలిపారు.ఉగాది నుంచి సన్న బియ్యం పంపిణీ...?ఈ వానాకాలం సీజన్లో 24 లక్షల మెట్రిక్ టన్నుల సన్న ధాన్యం రాగా, దాన్ని మిల్లింగ్ చేస్తే 16 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం వస్తాయని అంచనా. రాష్ట్ర అవసరాలకు ఈ బియ్యం 8 నెలలు సరిపోతాయి. వచ్చే ఉగాది నుంచి సన్నబియ్యం పంపిణీ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది. అంటే ఏప్రిల్‌లో ఇచ్చే కోటాను లెక్కలోకి తీసుకోవలసి ఉంటుంది. వానాకాలం సీజన్లో రైతుల నుంచి సేకరించిన సన్న «ధాన్యాన్ని మిల్లింగ్ చేసి పేదలకు సన్న బియ్యంగా సరఫరా చేస్తే.. కొత్త బియ్యం సరిగా ఉడకదు. అందుకని రెండు నెలలు నిల్వ చేసి మార్చి నుంచి పంపిణీ చేస్తాం. – గత డిసెంబర్లో పౌరసరఫరాల సంస్థ కమిషనర్ డీ.ఎస్. చౌహాన్ వెల్లడిమార్చి నెల నుంచి రాష్ట్రంలోని పేదలందరికీ రేషన్ దుకాణాల ద్వారా సన్నబియ్యం పంపిణీ చేస్తాం. – పలు సందర్భాల్లో పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టీకరణ -
బాపట్ల టు గుజరాత్..
సాక్షి ప్రతినిధి, బాపట్ల: బాపట్ల జిల్లాలో పేదలకు అందాల్సిన రేషన్ బియ్యం పక్కదారి పడుతోంది. కొందరు వ్యాపారులు గుజరాత్ రాష్ట్రానికి తరలించి అక్రమార్జనకు పాల్పడుతున్నారు. బాపట్ల సమీపంలోని వెదుళ్లపల్లిలో ఉన్న ఓ రైస్‌మిల్లు యజమాని ఈ చౌక బియ్యాన్ని సేకరించి పాలిషింగ్ చేసి తరలిస్తున్నట్లు సమాచారం. ఆయనతోపాటు బాపట్ల పట్టణం పరిధిలోని మరో రైస్‌మిల్లు యజమానితోపాటు ఇదే మండలం అప్పికట్ల ప్రాంతంలోని ఇంకో రైస్‌మిల్లుకు చెందిన బాపట్ల టీడీపీ నేత అనుచరుడు రేషన్ బియ్యాన్ని కొని పాలీíÙంగ్ చేసి రాష్ట్ర సరిహద్దులు దాటించేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా సేకరణ.. బాపట్లతో పాటు పర్చూరు, అద్దంకి, రేపల్లె, చీరాల, వేమూరు, పొన్నూరు ప్రాంతాల్లోని డీలర్ల నుంచి కిలో బియ్యాన్ని రూ.15కు ఈ ముఠా కొనుగోలు చేస్తోంది. ఇలా సేకరించిన బియ్యాన్ని వెదుళ్లపల్లితో పాటు మిగిలిన ఇద్దరు మిల్లర్లకు కిలో రూ.22 చొప్పున విక్రయిస్తున్నారు. వెదుళ్లపల్లి మిల్లు యజమాని ఒక్కరే నెలకు సుమారు 15 వేల క్వింటాళ్ల బియ్యాన్ని తన మిల్లుకు తరలించి ఎప్పటికప్పుడు పాలీషింగ్ చేసి లారీలు, ట్రక్కుల ద్వారా పొన్నూరు, గుంటూరు, మిర్యాలగూడా మీదుగా హైదరాబాద్‌కు, అక్కడి నుంచి గుజరాత్‌కు తరలిస్తున్నట్లు సమాచారం. ఇక్కడ కిలో రూ.22కు కొన్న రేషన్ బియ్యాన్ని గుజరాత్లో కిలో రూ.40కు అమ్ముతున్నట్లు సమాచారం. ఇలా ఒక్కో కిలోకు అన్ని ఖర్చులూపోను రూ.15 తక్కువ కాకుండా వస్తోంది. ఈ లెక్కన నెలనెలా రూ.కోట్లలోనే రాబడి ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, వెదుళ్లపల్లి మిల్లు యజమాని నెలకు 15 వేల క్వింటాళ్లు సేకరిస్తుండగా.. మిగిలిన రెండు మిల్లుల నుంచి మరో 10 వేల క్వింటాళ్లు అనుకున్నా మొత్తంగా జిల్లా నుంచి గుజరాత్‌కు సగటున 25 వేల క్వింటాళ్లు తరలిపోతున్నట్లు సమాచారం. వెదుళ్లపల్లి మిల్లుకు చెందిన వ్యాపారితోపాటు బాపట్ల, అప్పికట్ల మిల్లులకు చెందిన వ్యాపారులు జిల్లాలోని అన్ని నియోజకవర్గాలతోపాటు గుంటూరు జిల్లా పొన్నూరు, పల్నాడు జిల్లాలోని వివిధ నియోజకవర్గాల్లో రేషన్ బియ్యాన్ని సేకరించి ఎగుమతి చేస్తున్నారు.రేషన్ బియ్యం ఖరీదు ఇలా.. నిజానికి.. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే కార్డుదారులకు డీలర్లు కిలోకు రూ.8 చెల్లించి బియ్యం వ్యాపారులకు రూ.12కు ఇచ్చేవారు. అలాగే, బియ్యం అక్రమ రవాణాదారులు బియ్యం సేకరణ వ్యాపారులకు రూ.20 చెల్లించేవారు. కానీ, రేషన్ బియ్యానికి డిమాండ్ పెరగడంతో కార్డుదారులకు రూ.10 నుంచి రూ.12.. డీలర్లకు రూ.15 నుంచి రూ.17 వస్తోంది. ఇక వ్యాపారుల వద్ద నుంచి అక్రమ ఎగుమతిదారులు కిలో రూ.22 నుంచి రూ.24కు కొనుగోలు చేస్తున్నారు. కార్డుదారులను వంచిస్తున్న డీలర్లు.. మరోవైపు.. కొందరు డీలర్లు కార్డుదారులకు మొక్కుబడిగా డబ్బులు చెల్లిస్తుండగా.. మరికొందరు దౌర్జన్యంగా లాగేసుకుంటున్నారు. ఏమైనా ప్రశ్నిస్తే తెల్లకార్డు గల్లంతవుతుందని పచ్చనేతలు బెదిరిస్తున్నారు. దీంతో.. బియ్యం పోతే పోయింది కార్డు అయినా మిగులుతుందని చాలామంది పేదలు మిన్నకుండిపోతున్నారు. దీంతో మంత్రులు గొట్టిపాటి రవికుమార్, అనగాని సత్యప్రసాద్ ప్రాతినిధ్యం వహిస్తున్న అద్దంకి, రేపల్లెతోపాటు పర్చూరు, చీరాల, బాపట్ల, వేమూరు నియోజకవర్గాల్లోనూ చాలామంది డీలర్లు గోడౌన్ల నుంచే రేషన్ బియ్యాన్ని వ్యాపారులకు అప్పగించి సొమ్ము చేసుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం అస్సలు పట్టించుకోవడంలేదు. -
రెడ్ బుక్ కుట్రకు రెడ్ సిగ్నల్!
సాక్షి, అమరావతి: ‘మీకూ మీ రెడ్‌బుక్ రాజ్యాంగానికి ఓ దండం.. నిబంధనలకు విరుద్ధంగా పని చేయడం నా వల్ల కాదు.. అక్రమ కేసులు, వేధింపులకు నేను పాల్పడ లేను..’ అని సీఐడీ ఐజీ వినీత్ బ్రిజ్‌లాల్ తేల్చి చెప్పారు. అదంతా కాదు.. తాము చెప్పింది చేయాల్సిందేనని, నిబంధనలు జాన్తానై అంటూ డీజీపీ సీహెచ్.ద్వారకా తిరుమలరావు, సీఐడీ డీజీ రవిశంకర్ అయ్యన్నార్ హుకుం జారీ చేయడంతో తీవ్ర మనస్థాపానికి గురైన ఆయన ఏకంగా రాజీనామా చేస్తానని చెప్పడంతో ఆ ఉన్నతాధికారులు హడలిపోయారు. దాంతో తమ పుట్టి మునుగుతుందని హడలిపోయిన డీజీపీ, సీఐడీ చీఫ్ చాలాసేపు సర్ది చెప్పడంతో అతి కష్టం మీద రాజీనామా విషయంలోబ్రిజ్లాల్ వెనక్కి తగ్గారు. రెడ్‌బుక్(Redbook) వేధింపులకు పాల్పడలేనని స్పష్టం చేస్తూ సెలవుపై వెళ్లిపోయారు. పోలీసు ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ ఉదంతం విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఇలా ఉంది. చంద్రబాబు ప్రభుత్వం తమ రెడ్‌బుక్ రాజ్యాంగ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా కాకినాడ పోర్టు నుంచి రేషన్ బియ్యం(Ration rice) అక్రమ రవాణా అవుతోందని గగ్గోలు పెట్టిన విషయం తెలిసిందే. ముందస్తు పన్నాగంతో మంత్రి నాదేండ్ల మనోహర్ (Nadendla Manohar) ద్వారా కుట్రకు తెరతీసి.. అనంతరం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ద్వారా ‘సీజ్ ద షిప్’ డ్రామాను రక్తి కట్టించేందుకు యత్నించింది. కాగా, కేంద్ర కస్టమ్స్ అధికారులు నిబంధనలకు కట్టుబడటంతో టీడీపీ(TDP) కూటమి ప్రభుత్వం కుట్ర బెడిసికొట్టింది. దాంతో చంద్రబాబు (Chandrababu Naidu) ప్రభుత్వం కాకినాడ పోర్టు నుంచి రేషన్ బియ్యం అక్రమ రవాణాపై దర్యాప్తు కేసును తమ ఆధీనంలోని సీఐడీకి అప్పగించింది. అందుకోసం నియమించిన సిట్‌కు సీఐడీ ఐజీ వినీత్ బ్రిజ్‌లాల్‌ను చీఫ్‌గా నియమించింది. సిట్ సభ్యులుగా ముందు కొందరు పోలీసు అధికారులను నియమించింది. కానీ ఒక్క రోజులోనే వారిని మార్చి పూర్తిగా తమ మాట వినే అధికారులను నియమించింది. అనంతరం వినీత్ బ్రిజ్‌లాల్ కాకినాడలో పర్యటించిన పోర్టు, గోదాములు మొదలైన వాటిని పరిశీలించి వచ్చారు. తాను గుర్తించిన వాస్తవ విషయాలతో నివేదిక రూపొందించేందుకు ఉపక్రమించారు. పెద్దలు చెప్పినట్టుగా నివేదిక ఇవ్వాలి తాము అనుకున్న రీతిలో నివేదిక సిద్ధం కావడం లేదని తెలుసుకున్న ప్రభుత్వ పెద్దలు.. పోలీసు పెద్దకు దిశా నిర్దేశం చేయడంతో అసలు కుట్రకు తెరలేచింది. ఈ నేపథ్యంలో సీఐడీ డీజీ రవిశంకర్ అయ్యన్నార్.. సిట్ చీఫ్ వినీత్ బ్రిజ్‌లాల్‌ను పిలిచి మాట్లాడారు. తాము చెప్పినట్టుగా నివేదిక రూపొందించాలని ఆదేశించారు. ‘క్షేత్ర స్థాయిలో పరిశీలించిన విషయాలతో పని లేదు.. ప్రభుత్వ పెద్దలు చెప్పినట్టుగా నివేదిక రూపొందించాలి. రేషన్ బియ్యం స్మగ్లింగ్ జరిగిందా లేదా అన్నదానితో నిమిత్తం లేదు. జరిగినట్టు నివేదిక ఇవ్వాలి. ప్రభుత్వ పెద్దలు ఎవరెవరి పేర్లు చెబుతారో వారిని బాధ్యులుగా పేర్కొనాలి’ అని ఆదేశించినట్టు తెలుస్తోంది. సీఐడీ చీఫ్ ఆదేశాలను వినీత్ బ్రిజ్‌లాల్ నిర్ద్వందంగా తిరస్కరించారు. తాను క్షేత్ర స్థాయిలో కనుగొన్న వాస్తవ విషయాలతోనే నివేదిక రూపొందిస్తానని స్పష్టం చేశారు. అలా అయితే కుదరదని, ప్రభుత్వ పెద్దలు చెప్పినట్టుగానే నివేదిక ఇచ్చి తీరాలని సీఐడీ చీఫ్ తేల్చి చెప్పారు. దీనిపై వినీత్ బ్రిజ్‌లాల్ తీవ్రంగానే స్పందించినట్టు తెలుస్తోంది. డీజీపీదీ అదే మాట.. బ్రిజ్‌లాల్ వైఖరిని సీఐడీ చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్ డీజీపీ ద్వారకా తిరుమలరావు దృష్టికి తీసుకువెళ్లారు. దాంతో బ్రిజ్‌లాల్‌ను డీజీపీ తన చాంబర్‌కు పిలిపించారు. డీజీపీ ద్వారకా తిరుమలరావు, సీఐడీ చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్ మరోసారి ఆయనపై తీవ్ర ఒత్తిడి తెచ్చారు. ప్రభుత్వ పెద్దలు చెప్పినట్టు చేయాల్సిందేనని ఆదేశించారు. బ్రిజ్‌లాల్ మరోసారి తన వైఖరిని పునరుద్ఘాటిస్తూ నిబంధనలకు విరుద్ధంగా నివేదిక ఇవ్వనని తేల్చి చెప్పారు. అంతేకాదు తనకు పార్టీలతో సంబంధం లేదని, ఏ పార్టీ అధికారంలో ఉన్నా సరే నిబంధనల మేరకే పని చేస్తున్నానన్నారు. 2014–19 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో విశాఖపట్నంలో భూముల కుంభకోణంపై నియమించిన సిట్‌కు నేతృత్వం వహించానని, అనంతరం వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఏవోబీలో గంజాయి నిర్మూలనకు సెబ్ కమిషనర్‌గా పని చేశానని చెప్పారు. విశాఖపట్నంలో భూముల కుంభకోణంలో ప్రమేయం ఉన్న అప్పటి టీడీపీ మంత్రిపై చర్యలు తీసుకోని విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించినట్టు సమాచారం. ఆయన వాదనను ఏమాత్రం వినిపించుకోకుండా తాము చెప్పినట్టుగా నివేదిక ఇవ్వాల్సిందేనని డీజీపీ, సీఐడీ చీఫ్ తేల్చి చెప్పారు. దాంతో తీవ్ర మనస్థాపానికి గురైన బ్రిజ్‌లాల్ ఇలా అయితే తాను ఏకంగా పోలీసు ఉద్యోగానికి రాజీనామా చేస్తానని చెప్పి బయటకు వచ్చేశారు. ఆయన రాజీనామా పత్రాన్ని కూడా డీజీపీకి సమర్పించినట్టు సమాచారం. దాంతో డీజీపీ, సీఐడీ చీఫ్ హడలిపోయారు. ఈ వ్యవహారం బయటకు పొక్కితే తాము ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుందని భావించారు. ఆ మర్నాడు మళ్లీ బ్రిజ్‌లాల్‌ను పిలిపించి రాజీనామా నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ఒత్తిడి చేశారు. అతి కష్టం మీద అందుకు సమ్మతించిన ఆయన తాను మాత్రం నిబంధనలకు విరుద్ధంగా నివేదిక ఇవ్వలేనని స్పష్టం చేశారు. ఉన్నతాధికారుల ఒత్తిడి కొనసాగుతుందని స్పష్టం కావడంతో ఆయన సెలవుపై వెళ్లిపోయారు.త్వరలో సిట్ చీఫ్‌గా మరొకరు! తమ కుట్రలకు వినీత్ బ్రిజ్‌లాల్ ససేమిరా అనడంతో ఆయన స్థానంలో సిట్ చీఫ్‌గా మరొకర్ని నియమించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఆయన్ని సీఐడీ విభాగం నుంచి తప్పించి గ్రేహౌండ్స్‌కు బదిలీ చేయాలని సూత్ర ప్రాయంగా నిర్ణయించినట్టు తెలుస్తోంది. సెలవు నుంచి వచ్చిన తర్వాత ఆయన్ను బదిలీ చేస్తారని సమాచారం. కాగా, వినీత్ బ్రిజ్‌లాల్ ఉదంతం పోలీసు శాఖలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రాజకీయ పార్టీల కక్ష సాధింపు కుట్రలకు పోలీసు వ్యవస్థను భాగస్వామిని చేస్తున్న పోలీసు ఉన్నతాధికారుల తీరుపై యంత్రాంగం తీవ్రంగా మండిపడుతోంది. ఉన్నత పదవులు పొందేందుకు, రిటైరైన తర్వాత కూడా పదవులు పొందేందుకు యావత్ పోలీసు వ్యవస్థను ప్రభుత్వ పెద్దలకు ఊడిగం చేసే వ్యవస్థగా మార్చి వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పోలీసు అధికారులు బలవుతున్నా, వారికి పోస్టింగులు ఇవ్వకుండా వేధిస్తున్నా.. పట్టించుకోని ఉన్నతాధికారులు ప్రభుత్వ రెడ్ బుక్ కుట్రలకు మాత్రం వత్తాసు పలుకుతున్నారని పోలీసు వర్గాలు దుయ్యబడుతున్నాయి. చదవండి: చెప్పారంటే.. చేయరంతే!డీజీపీ కావాలనే లక్ష్యంతో సీఐడీ చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్, డీజీపీగా పదవీ కాలం పొడిగింపు సాధ్యం కాకపోవడంతో రిటైరైన తర్వాత ఆర్టీసీ ఎండీగా పోస్టింగు లక్ష్యంగా ద్వారకా తిరుమలరావు పని చేశారన్నది స్పష్టమవుతోందని తేల్చి చెబుతున్నాయి. ప్రభుత్వ ఒత్తిళ్లకు తలొగ్గక బ్రిజ్‌లాల్ నిబద్ధతతో వ్యవహరించడాన్ని ప్రశంసిస్తున్నాయి. -
హమాలీల సమ్మెతో పేదలకు ప‘రేషన్’!
సాక్షి, హైదరాబాద్: కొత్త సంవత్సరంలో రేషన్ బియ్యం కోసం పేదలు పడిగాపులు పడుతున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలు మినహా ఇప్పటివరకు చాలా జిల్లాల్లో రేషన్ దుకాణాలకు బియ్యం సరఫరా కాలేదు. స్టేజ్–1 గోడౌన్ల నుంచి జిల్లాల్లోని మండల స్థాయి స్టాక్ (ఎంఎల్ఎస్) పాయింట్లకు బియ్యం వచ్చినప్పటికీ ఎంఎల్ఎస్ పాయింట్లలో ఈ నెల ఒకటో తేదీ నుంచి హమాలీలు సమ్మె చేస్తున్న కారణంగా చాలా చోట్ల బియ్యం గ్రామాలకు చేరడం లేదు. రెండేళ్లకోసారి పెంచాల్సిన హమాలీ రేట్లను గడువు దాటి ఏడాదైనా పెంచకపోవడంతోపాటు ఇటీవల ఇచ్చిన హామీని కూడా పౌరసరఫరాల శాఖ కమిషనర్ పట్టించుకోకపోవడంతో సమ్మెలోకి వెళ్లినట్లు హమాలీలు చెబుతున్నారు. రేట్లు పెంచే వరకు సమ్మె కొనసాగిస్తామని హమాలీలు తెగేసి చెబుతున్నారు. సమ్మె ఫలితంగా నాలుగు రోజులుగా చాలా గ్రామాల్లో రేషన్ దుకాణాలు తెరుచుకోవడంలేదు. ఇంత జరుగుతున్నా పౌరసరఫరాల శాఖ అధికారులు స్పందించడం లేదు. హమాలీలు సమ్మె నోటీసు ఇచ్చినా.. రాష్ట్రంలోని ఎంఎల్ఎస్ పాయింట్లలో పనిచేస్తున్న హమాలీల రేట్లను రెండేళ్లకోసారి పెంచేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది. అందుకు అనుగుణంగా 2022 వరకు రేట్ల పెంపు ప్రక్రియ కొనసాగింది. ఎంఎల్ఎస్ పాయింట్లకు వచ్చే బియ్యాన్ని దించడానికి, అక్కడి నుంచి రేషన్ దుకాణాలకు తరలించడానికి హమాలీలకు క్వింటాలుకు రూ. 26 లెక్కన కూలి చెల్లిస్తున్నారు. ఈ రేట్లను 2024లో సవరించాల్సి ఉండగా ప్రభుత్వం మారడంతో కాలయాపన జరుగుతూ వచ్చింది. ఎట్టకేలకు గతేడాది అక్టోబర్ 4న పౌరసరఫరాల శాఖ కమిషనర్ చౌహాన్ వద్ద జరిగిన సమావేశంలో కూలి రేట్లను రూ. 26 నుంచి రూ. 29కి పెంచేందుకు ఒప్పందం కుదిరింది. అయితే అందుకు సంబంధించి ప్రభుత్వ ఉత్తర్వులు విడుదల కాకపోవడంతో డిసెంబర్ 18న హమాలీలు పౌరసరఫరాల శాఖ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. నెలాఖరులోగా ప్రభుత్వ ఉత్తర్వులు జారీ కాకుంటే జనవరి 1 నుంచి సమ్మెలోకి వెళ్తామని నోటీసు కూడా ఇచ్చారు. అలాగే గతేడాది డిసెంబర్ 28న మరోసారి నోటీసు పంపారు. అయినప్పటికీ రేట్ల పెంపు ఉత్తర్వులు కొత్త ఏడాదిలోనూ విడుదల కాకపోవడంతో ఒకటో తేదీ నుంచి సమ్మెకు దిగినట్లు హమాలీ సంఘం (ఏఐటీయూసీ) అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి. మునీశ్వర్, ఎస్. బాలరాజ్ తెలిపారు. హైదరాబాద్, రంగారెడ్డి మినహా... రాష్ట్రంలో 187 ఎంఎల్ఎస్ పాయింట్లు ఉండగా సుమారు 3,600 మంది హమాలీలు పనిచేస్తున్నారు. వారంతా ఏఐటీయూసీ, సీఐటీయూ, ఐఎఫ్టీయూ, బీఆర్‌ఎస్‌కేయూ సంఘాల్లో సభ్యులుగా ఉండగా ఏఐటీయూసీ అనుబంధ హమాలీ సంఘం సమ్మెకు పిలుపునిచ్చింది. బీఆర్‌ఎస్‌కేయూ మినహా అన్ని సంఘాలు సమ్మెకు మద్దతిస్తున్నట్లు హమాలీ సంఘం నాయకులు చెప్పారు. రాష్ట్రంలో 17,335 దుకాణాలు ఉండగా అందులో శనివారం 9,319 దుకాణాలనే తెరిచారు. అంటే దాదాపు సగం దుకాణాలు ఇప్పటికీ తెరవలేదు. తెరిచిన చోట కూడా కోటా పూర్తిస్థాయిలో బియ్యం రాలేదని సమాచారం. -
పీడీఎస్ కాదు.. ‘మనోహర‘మైన బియ్యం..!
సాక్షి, విశాఖపట్నం: మంత్రి పట్టుకున్నప్పుడు రేషన్ బియ్యం నెల రోజుల్లోనే సాధారణ బియ్యంగా మారిపోవడం కూటమి నేతలు చేసిన మ్యాజిక్కే. మంత్రి అనుచరుల మంత్రాంగమే. చేతులు తడిపితే చాలు.. పేదోడి బియ్యం కూడా ‘మనోహర’మైన బియ్యంగా మారిపోతున్నాయి. రేషన్ బియ్యమే అయినా.. దర్జాగా షిప్ ఎక్కి దేశాలు దాటిపోతున్నాయి. పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గత నెల 9న విశాఖపట్నం కంటైనర్ టెర్మినల్‌కు వచ్చి పోర్టు కంటైనర్ ఫ్రైట్ స్టేషన్లలో తనిఖీలంటూ హడావుడి చేశారు. బియ్యాన్ని నాలుగైదుసార్లు రెండు చేతుల్లో అటు ఇటూ తిప్పి.. ఇవి 100 శాతం పీడీఎస్ బియ్యం.. సీజ్ ది రైస్.. అంటూ ఆదేశాలు జారీ చేసి, అక్కడ ఉన్న రెండు సంస్థలకు చెందిన 483 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. కాకినాడ నుంచి బిబో ఇంటర్నేషనల్ సంస్థ తెచ్చిన 8 లారీల లోడు (259 టన్నులు) మొత్తం రేషన్ బియ్యమే అని మంత్రి, అధికారులు, ప్రత్యేక బృందాలు ప్రకటించారు. 48 గంటల్లో సమగ్ర డాక్యుమెంట్లు తేకపోతే బియ్యాన్ని ప్రభుత్వం పూర్తిగా స్వాధీనం చేసుకుంటుందని హెచ్చరించారు. 48 గంటలు గడిచినా ఏ చర్యా లేదు. ఇంతలో మంత్రి అనుచరులు రంగప్రవేశం చేసి, సీను మొత్తాన్ని మార్చేసినట్లు చెబుతున్నారు. మొత్తం బియ్యం వ్యాపారాన్ని నిలిపివేయిస్తామని ఆ ఎక్స్‌పోర్టు సంస్థని బెదిరించినట్లు సమాచారం. దీంతో ఆ సంస్థ వారు అడిగిన మొత్తానికి ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత ఆ బియ్యం రేషన్ బియ్యం కాదని క్లీన్చిట్ ఇచ్చేస్తున్నారని కొందరు అధికారులే చెబుతున్నారు. మంత్రి అనుచరులు ఉన్నతాధికారులపై తీవ్రంగా ఒత్తిడి తేవడంతో ఆ బియ్యానికి క్లీన్ చిట్ ఇచ్చి, ఎగుమతికి ప్రొసీడింగ్స్ ఇచ్చినట్లు సమాచారం. దీంతో ఈ బియ్యాన్ని రేపో మాపో నౌకలో చైనా పంపేందుకు చకచకా ఏర్పాట్లు జరిగిపోతున్నాయి. మరో సంస్థ మాత్రం ఇంకా బేరం కుదుర్చుకోకపోవడంతో మిగతా బియ్యం అలాగే ఉండిపోయింది.విశాఖ కంటైనర్ ఫ్రైట్ స్టేషన్ (సీఎఫ్ఎస్) నుంచి ఎగుమతికి సిద్ధంగా ఉన్న 483 టన్నుల రేషన్ బియ్యాన్ని గుర్తించి సీజ్ చేశాం. కాకినాడ పోర్టులో నిఘా పెరగడం వల్ల వైజాగ్ పోర్టు నుంచి స్మగ్లింగ్ చేస్తున్నారు. అందుకే తనిఖీ చేసి పట్టుకున్నాం. వారిపై కేసులు కూడా పెడుతున్నాం. ఇకపై ఒక్క గింజ పీడీఎస్ బియ్యం కూడా పోర్టు దాటి వెళ్లకుండా పేదలకు చేర్చడమే మా లక్ష్యం. – డిసెంబర్ 9న పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చేసిన ప్రకటనకట్ చేస్తే..: పోర్టులో మంత్రి నాదెండ్ల సమక్షంలో పట్టుకున్న 483 టన్నుల బియ్యంలో 259 టన్నులు రేషన్ బియ్యం కాదు. ఆ 8 లారీల్లో బిబో సంస్థ తెచ్చిన బియ్యాన్ని నిరభ్యంతరంగా ఎగుమతి చేసుకోవచ్చు.– ఈ నెల 2న జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్ జారీ చేసిన సర్క్యులర్ -
నా తల్లి మీద ఒట్టేసి చెబుతున్నా.. ఏ తప్పు చేయలేదు: పేర్ని నాని
గుంటూరు, సాక్షి: రేషన్ బియ్యం మాయం కేసులో తనపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని మాజీ మంత్రి పేర్ని నాని(Perni Nani) ఖండించారు. ఈ విషయంలో అధికారుల దర్యాప్తు కంటే సోషల్ మీడియాలో రచ్చ ఎక్కువైందని, పోలీసుల విచారణ పూర్తి కాకముందే ఉద్దేశపూర్వకంగా తనను దొంగగా ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారాయన. శనివారం తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడారు.‘‘అద్దె కోసమే గోడౌన్ కట్టుకున్నాం. తప్పుడు పనులు చేయడానికి కాదు. సివిల్ సప్లై అధికారులు నా భార్య జయసుధకు చెందిన గోడౌన్లో స్టాక్ ఉంచారు. మా గోడౌన్లో బియ్యం తగ్గిందని అధికారులు చెప్పారు. టెక్నికల్‌గా మా తప్పు లేకపోయినా.. నైతికంగా బాధ్యత తీసుకుంటామని చెప్పాం. అధికారులు 3,800 బస్తాలు తగ్గాయని చెబితే.. నగదు చెల్లించాం. అయినా సరే మాపై కక్షగట్టి కేసు నమోదు చేశారు. ఈ కేసులో విచారణ పూర్తి కాలేదని పోలీసులే చెబుతున్నారు. ఏదీ తేలకముందే నేనే దొంగనంటూ కూటమి(Kutami) నేతలు కొద్దిరోజులుగా నాపై ఆరోపణలు చేస్తూనే ఉన్నారు’’ అని అన్నారాయన. అయినా కూడా ఈ వ్యవహారంలో డిపార్ట్మెంట్ విచారణ కంటే సోషల్ మీడియా(Social Media) రచ్చ ఎక్కువైంది. మాపై ఎల్లో మీడియా, ఐటీడీపీ తప్పుడు రాతలు రాస్తోంది. కూటమి అనుకూల నేతలు, విశ్లేషకులు ఈ తప్పుడు ప్రచారంలో భాగం అయ్యారు. నేను పారిపోయానంటూ ప్రచారాలు చేశారు. నేనెక్కడికి పారిపోలేదు. 15వ తేదీ నుంచి మూడు రోజులపాటు బందరులోనే ఉన్నా. కేవలం లాయర్ల సూచన మేరకే ఇంతకాలం మీడియా ముందుకు రాలేదు. నాపై ప్రతీకారం తీర్చుకోవాలని నా ఇంట్లో ఆడవాళ్లను ఇబ్బంది పెడుతున్నారు. గోడౌన్ మేనేజర్‌ను అరెస్ట్ చేసి.. ఆయన ద్వారా నా పేరు చేర్చడానికి ప్లాన్ చేశారు. గోడౌన్‌ను పగలగొట్టి సరుకును తీసుకెళ్లారు. ఓ సీఐ ఈ స్వామికార్యాన్ని దగ్గరుండి జరిపించారు. ఇలా ఏదో ఒక రకంగా నన్ను, నా భార్యను అరెస్ట్ చేయాలని చూస్తున్నారు. కొన్ని యూట్యూబ్ చానెల్స్‌లో నా భార్య గురించి దారుణమైన కామెంట్స్ పెట్టారు. ఇప్పటికే చాలామంది స్టేషన్‌కు తీసుకెళ్లి కొడుతున్నారు. రాజకీయ కక్ష ఉంటే నాపై తీర్చుకోండి. నా ఇంట్లో ఆడవాళ్లతో ఏం పని?’’.. .. సామాన్య ప్రజలు ఆలోచించాలి. నేను మూడుసార్లు ఎమ్మెల్యేగా చేశా. ప్రభుత్వం రూల్స్ ఏంటో నాకు తెలుసు. నేను మంత్రిగా చేసినప్పుడు.. ఇదే డీజీపీ నా శాఖలో పని చేశారు. ఆయనకు నేనేంటో తెలుసు. నా తల్లి మీద ఒట్టేసి చెబుతున్నా.. ఎలాంటి తప్పు చేయలేదు. నేను, నా భార్య ఎలాంటి అవినీతికి పాల్పడలేదు. తప్పుడు మార్గంలో సంపాదించాలనే ఆలోచన ఏనాడూ నాకు లేదు. కేవలం నన్ను, నా కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. తప్పు చేసి ఉంటే ఈ ఐదు నెలలు ఏం చేశారు?. నా మీద అధికార పార్టీ, ఎల్లో మీడియా కక్ష కట్టాయి. వైఎస్ జగన్ కంటే నేనే వాళ్ల మొదటి టార్గెట్. అందుకే నన్ను తప్పుడు కేసులో ఇరికించాలని చూస్తున్నారు. నా వ్యక్తిత్వాన్ని హననం చేయాలనుకుంటున్నారు. త్వరలోనే అన్ని విషయాలు బయటకు వస్తాయి. ముందస్తు బెయిల్ కోసం హైకోర్టుకు వెళ్తే రకరకాల కుట్రలు చేశారు. పీపీలను మారుస్తూ అడ్డంకులు సృష్టించారు. జనవరి 2వ తేదీలోగా నన్ను, నా కుమారుడిని అరెస్ట్ చేయాలని చూస్తున్నారని తెలిసింది. ఇంకోవైపు.. నా దగ్గర రూ.5 వేల కోట్లు ఉన్నాయని టీడీపీ పత్రికల్లో అసత్య ప్రచారం చేస్తున్నారు. నా దగ్గరే అంత డబ్బు ఉంటే సీజ్ చేస్కోండి. 3 శాతం లంచాలు తీసుకునేవాళ్లు కూడా నాపై ఆరోపణలు చేస్తున్నారు. మంత్రిగా ఉంటూ తన శాఖలోని ఉద్యోగుల బదిలీలకు లంచాలు తీసుకున్నవాళ్లు కూడా నాపై ఆరోపణలు చేస్తున్నారు. ఈ నెల 30న బెయిల్ తీర్పు ఉన్నందున అన్ని విషయాల గురించి మాట్లాడలేకపోతున్నా’’ అని పేర్ని నాని అన్నారు. -
కుప్పంలో రైస్ మాఫియా!
-
ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పక్కదారి పడుతున్న రేషన్ బియ్యం
-
కాకినాడ పోర్టులో ‘పట్టాభి’ బియ్యం లారీలు
సాక్షి ప్రతినిధి, కాకినాడ: కాకినాడ పోర్టులో పర్యటన సందర్భంగా స్టెల్లా–ఎల్ నౌకను తనిఖీ చేసి రేషన్ బియ్యం అక్రమ రవాణా జరుగుతోందంటూ హడావుడి చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అక్కడే సముద్ర జలాల్లో ఉన్న కెన్‌స్టార్ నౌకను కనీసం కన్నెత్తి కూడా చూడకపోవడం వెనుక అసలు నిజాలు బయటకు వస్తున్నాయి. కెన్‌స్టార్ నౌకలో బియ్యాన్ని ఎగుమతి చేస్తున్న కంపెనీ స్వయంగా ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ వియ్యంకుడిది కావడమే దీనికి కారణం. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన పట్టాభి ఆగ్రో ఫుడ్స్ అధినేత కేవీ కృష్ణారావు బియ్యాన్ని కాకినాడ పోర్టు ద్వారా విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. అయితే ఆర్థిక మంత్రి పయ్యావుల తన వియ్యంకుడు కేవలం బాయిల్డ్ రైస్ మాత్రమే ఎగుమతి చేస్తున్నాడని, ముడి బియ్యం ఎగుమతి చేయడంలేదని మంగళవారం చెప్పారు. మూడు తరాలుగా ఈ వ్యాపారంలో ఉన్న తన వియ్యంకుడు అసలు ఇప్పుడు ఇక్కడ వ్యాపారం చేయడం లేదన్నారు. తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో మాత్రమే వ్యాపారం చేస్తున్నారని చెప్పారు. అయితే తన వియ్యంకుడి సంస్థ గురించి ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ చెప్పిన మాటలన్నీ ‘పచి్చ’ అబద్ధాలని తాజాగా తేలిపోయింది. పోర్టులో పట్టాభి బియ్యం లారీలు.. కాకినాడ యాంకరేజ్ పోర్టులో బియ్యం ఎగుమతి కార్యకలాపాలను బుధవారం పరిశీలించగా మంత్రి పయ్యావుల మాటలు పచ్చి బూటకమని తేలిపోయింది. పట్టాభి ఆగ్రోఫుడ్స్ లిమిటెడ్ పేరుతోనే ఆ లారీలు రా రైస్‌ను పోర్టులో దిగుమతి చేస్తున్నాయి. ఓమ్ సాయి–2 ఏపీ ఏవీ కే 0024 బార్జ్‌లో పట్టాభి ఆగ్రోఫుడ్స్ పచ్చి బియ్యాన్ని ‘బిరస్ బుల్లోగ్’ ప్యాకింగ్‌తో పోర్టులో ఉన్న ఎంవీడీడీఎస్ మెరీనా అనే నౌకకు తరలిస్తున్నారు. 12 వేల మెట్రిక్ టన్నుల పచ్చి బియ్యాన్ని ఇండోనేషియాకు ఎగుమతి చేసేందుకు పట్టాభి ఆగ్రోఫుడ్స్ ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం. కాకినాడ పోర్టు నుంచి బియ్యం ఎగుమతుల్లో మంత్రి పయ్యావుల వియ్యంకుడి సంస్థ పట్టాభి ఆగ్రో ప్రైవేటు లిమిటెడ్ చురుగ్గా వ్యవహరిస్తోంది. వాస్తవాలు ఇలా ఉండగా మంత్రి పయ్యావుల తన వియ్యంకుడికి వత్తాసు పలుకుతూ పచ్చి అబద్ధాలు వల్లించడంపై విస్మయం వ్యక్తమవుతోంది. పచ్చ మీడియాకే అనుమతి.. కాకినాడ యాంకరేజ్ పోర్టులో నిలిపివేసిన స్టెల్లా–ఎల్ నౌకలో పీడీఎస్ బియ్యం తనిఖీల కోసం నియమించిన అధికారుల కమిటీ బుధవారం నౌకను పరిశీలించింది. టీవీ–5, ఈటీవీ, ఈనాడు, ఏబీఎన్ ఆంధ్రజ్యోతిని మాత్రమే తనిఖీల సందర్భంగా కమిటీ తమ వెంట తీసుకెళ్లడం గమనార్హం. నౌకలో తనిఖీకి వెళుతున్నట్లు ఎల్లో మీడియాకు మాత్రమే సమాచారం ఇచ్చి గుట్టుగా వ్యవహరించారు. -
షిష్‌లోకి ఎలా వచ్చాయో తేలుస్తాం.. రేషన్ రైస్‌పై కలెక్టర్ రియాక్షన్
సాక్షి, కాకినాడ జిల్లా: పోర్టు అధికారి ఆదేశాలతోనే స్టెల్లా షిప్ సీజ్ చేశామని కాకినాడ కలెక్టర్ షాన్ మోహన్ తెలిపారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గత నెల 27న స్టెల్లా షిప్లో రేషన్ బియ్యం దొరికాయి. రేషన్ బియ్యం ఎవరు సప్లై చేశారనేది విచారణ చేస్తున్నాం.’’ అని వెల్లడించారు.‘‘రేషన్ బియ్యం విషయంలో జిల్లా అధికారుల వైఫల్యం ఉంది. షిప్ ఆపే అధికారం కస్టమ్స్ అధికారులకు ఉంటుంది. షిప్లో స్టాక్‌పై పోర్ట్ అధికారులకు అధికారం ఉంటుంది. షిప్ సీజ్ చేయాలంటే హైకోర్టుకు వెళ్లాల్సిఉంటుంది. గోడౌన్ నుంచి షిప్ వరకు రైస్ ఎలా చేరిందో తేలాలి. కెన్‌స్టార్ షిప్లో బాయిల్డ్ రైస్‌ను గుర్తించాం. రేపు, ఎల్లుండి(బుధ,గురు) టీంలు క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తారు’’ అని కలెక్టర్ చెప్పారు.ఇదీ చదవండి: పవన్ ‘న్యూట్రల్’ గేర్! -
బాధ్యత మరచి ఎదురుదాడా!
సాక్షి, అమరావతి: టీడీపీ కూటమి సర్కారు అధికారంలోకి వచ్చి ఆర్నెల్లు గడుస్తున్నా తన వైఫల్యాలను, తప్పిదాలను ఒప్పుకోకుండా వైఎస్సార్ సీపీపై బురద చల్లేందుకు ఆపసోపాలు పడటం సిగ్గుచేటనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సూపర్ సిక్స్ హామీలను అమలు చేయకుండా ప్రజలపై రూ.15 వేల కోట్లకుపైగా విద్యుత్తు చార్జీల భారాన్ని మోపడం.. మరోవైపు నిత్యం జగన్ జపం చేస్తూ ఎల్లో మీడియాలో బురద కథనాలకే పరిమితమైందని రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు. ఇసుక నుంచి మద్యం వరకు.. కాకినాడలో పీడీఎస్ బియ్యం నుంచి ధాన్యం రైతులను తుపాన్‌కు వదిలేయడం దాకా అడుగడుగునా కూటమి సర్కారు వైఫల్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని గుర్తు చేస్తున్నారు.ఇసుకలో లూటీ చేసేదీ వారే..! బెల్టు షాపులకు అనుమతి ఇచ్చేదీ వారే..! బియ్యాన్ని ఎగుమతి చేసేది వారే.. మళ్లీ స్మగ్లింగ్ జరుగుతోందంటూ హడావుడి చేసేదీ వారేనని పేర్కొంటున్నారు. అసలు కాకినాడ పోర్టుకు రేషన్ బియ్యం ఎందుకు వస్తోంది? పీడీఎస్ బియ్యం వస్తుంటే గత ఆర్నెల్లుగా ఈ ప్రభుత్వం ఏం చేస్తున్నట్లు? ఎవరు పంపుతున్నట్లు? కూటమి పార్టీల ప్రజాప్రతినిధులే దోపిడీ చేసి అమ్ముకుంటున్నారు కదా? తన పార్టీకి చెందిన మంత్రి పౌరసరఫరాల శాఖను పర్యవేక్షిస్తుంటే డిప్యూటీ సీఎం వచ్చి హడావుడి చేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. స్థానిక ఎంపీ కూడా అదే పార్టీకి చెందిన వారని ప్రస్తావిస్తున్నారు. సీఎంఆర్ బియ్యం బకాయిల విడుదలలో కమీషన్ల పర్వం వెలుగులోకి రావడంతో దీని నుంచి ప్రజల దృష్టి మళ్లించడం.. మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి, గత సర్కారుపై బురద చల్లడమే లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు స్పష్టమవుతోందంటున్నారు. ఊరూరా బెల్ట్ షాపులు తెరిచి.. బెల్ట్ తీస్తామంటారా?మద్యం దుకాణాలను లాటరీ పేరుతో కూటమి శ్రేణులకు కట్టబెట్టిన ప్రభుత్వ పెద్దలు.. టీడీపీ కార్యకర్తలకు లబ్ధి చేకూర్చడం కోసం ఊరూరా బెల్ట్ షాపులను తెరిపించారు. సీఐ, ఎస్ఐలను పంపి ఇతరులకు మద్యం దుకాణాలు దక్కకుండా బెదిరింపులకు పాల్పడ్డారు. ఊరూరా ఒక్కో బెల్ట్ షాపును వేలం వేసి వచ్చిన డబ్బులను టీడీపీ కార్యకర్తలకు పంచిపెట్టారు. రూ.2 లక్షల నుంచి మూడు లక్షల దాకా వసూలు చేస్తూ నీకింత.. నాకింత! అని వాటాల దందా నడిపిస్తున్నారు. బెల్ట్ షాపులతో వాడవాడలా మద్యం ఏరులై పారుతోంది. ఈ అక్రమాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు.. బెల్ట్ షాపులు పెడితే బెల్ట్ తీస్తానంటూ సీఎం చంద్రబాబు బీరాలు పలుకుతుండటంపై ఎక్సైజ్‌శాఖ వర్గాలే విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. స్వయంగా హోంమంత్రి అనిత ఇలాకాలో కూడా బెల్టు షాపుల దందా తాజాగా వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే.కాకినాడ కేంద్రంగా బియ్యం డ్రామా!ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా బియ్యం పంపిణీ కోసం సేకరించిన వరి ధాన్యాన్ని మర ఆడించేందుకు పౌరసరఫరాల శాఖ మిల్లర్లకు అప్పగిస్తుంది. మిల్లర్లు మర ఆడించి సీఎంఆర్ కింద బియ్యాన్ని తిరిగి అప్పగిస్తారు. దీనికి సంబంధించి సుమారు రూ.1,600 కోట్ల వరకు మిల్లర్లకు ప్రభుత్వం చెల్లించాలి. ఆ బిల్లుల చెల్లింపులో భారీ ఎత్తున కమీషన్లు చేతులు మారాయని రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఈ కుంభకోణం నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు కాకినాడ కేంద్రంగా సరి కొత్త డ్రామాకు తెర తీశారు.స్మగ్లింగ్‌కు కాకినాడ పోర్టు అడ్డాగా మారిందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆరోపించడం విస్మయానికి గురి చేస్తోంది. కాకినాడ యాంకరేజ్ పోర్టు రాష్ట్ర ప్రభుత్వ అధీనంలోనే ఉంటుంది. బియ్యం ఎగుమతి.. ఎరువుల దిగుమతి అంతా యాంకరేజ్ పోర్టు మీదుగానే సాగుతుంది. కాకినాడ యాంకరేజ్ పోర్టుకు.. కాకినాడ పోర్టుకు ఎలాంటి సంబంధం ఉండదు. అలాంటప్పుడు రాష్ట్ర ప్రభుత్వ అధీనంలో ఉన్న యాంకరేజ్ పోర్టు ద్వారా బియ్యం అక్రమ రవాణా ఎలా సాధ్యమవుతుందని అధికార వర్గాలే ప్రశ్నిస్తున్నాయి. పారదర్శక వ్యవస్థను తొలగించి ఇంటికే పౌరసేవలా?ప్రభుత్వ సేవలు, పథకాలను పారదర్శకంగా ఇంటి గుమ్మం వద్దే ప్రజలకు అందించే లక్ష్యంతో వైఎస్సార్సీపీ అధికారంలో ఉండగా దేశంలోనే ఎక్కడా లేనివిధంగా గ్రామ, వార్డు సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థను ప్రవేశపెట్టింది. తాము అధికారంలోకి వస్తే వలంటీర్ల గౌరవ వేతనాన్ని రూ.5 వేల నుంచి రూ.10 వేలకు పెంచుతామని ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు నమ్మబలికారు. తీరా అధికారంలోకి వచ్చాక 2.60 లక్షల మంది వలంటీర్లను తొలగించి దారుణంగా వంచించారు. వలంటీర్ వ్యవస్థను రద్దు చేసిన సీఎం చంద్రబాబు తాజాగా ఇంటి గుమ్మం వద్దకే పౌర సేవలు అందిస్తానని చెప్పడంపై విస్తుపోతున్నారు. వలంటీర్లు లేకపోవడంతో టీడీపీ నేతలు లబ్ధిదారులను పెన్షన్ల కోసం ఇళ్ల వద్దకు రప్పించి చుట్టూ తిప్పుకుంటున్నారు. సచివాలయాల వద్ద ప్రజలు పడిగాపులు కాస్తున్న ఫోటోలు మీడియాలోనూ వచ్చాయి. మరోవైపు కూటమి సర్కారు దాదాపు లక్షన్నర పెన్షన్లను కుదించింది. ఇక పౌరసేవలు, పథకాలను ప్రజలకు చేరవేయడంలో కీలక పాత్ర పోషించిన గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు ప్రభుత్వం షోకాజ్ నోటీసులు జారీ చేయడంపై ఆందోళన వ్యక్తమవుతోంది.విద్యుత్ చార్జీలు తగ్గిస్తామంటూ బాదుడే బాదుడు..కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే విద్యుత్ చారీలను ఏమాత్రం పెంచబోమని.. వాటిని తగ్గిస్తామని ఎన్నికల్లో చంద్రబాబు ఊరూవాడా ప్రచారం చేశారు. అయితే హామీని నిలబెట్టుకోకుండా అధికారంలోకి వచ్చాక ఇప్పటికే రూ.15,485.36 కోట్ల భారాన్ని విద్యుత్ చార్జీల రూపంలో ప్రజలపై మోపారు. విద్యుత్ చార్జీల మంటతో వినియోగదారులు గగ్గోలు పెడుతున్నారు. దాంతో ఆ నెపాన్ని వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై నెడుతూ సీఎం చంద్రబాబు బురద చల్లుతున్నారు.ధాన్యం రైతుకు దగా..ధాన్యం రైతులకు మద్దతు ధర కల్పించి ఆదుకోవడంలో కూటమి సర్కారు దారుణంగా విఫలమైంది. ఎమ్మెస్పీ దక్కకపోవడంతో అన్నదాతకు బస్తాకు రూ.300 – రూ.400 వరకు నష్టం వాటిల్లింది. దళారులకు అయినకాడికి అమ్ముకోవాల్సిన దుస్థితి నెలకొంది. ఇప్పుడు తుపాన్ కారణంగా అన్నదాతల పరిస్థితి దయనీయంగా మారింది. నాలుగు రోజులు ముందే తుపాన్ హెచ్చరికలున్నా సీఎం చంద్రబాబు అధికారులతో సమీక్షించి ముందస్తు జాగ్రత్తలు చేపట్టలేదు. ప్రభుత్వం పంటను కొనుగోలు చేయకుండా చోద్యం చూసింది. గోనె సంచులు సమకూర్చలేదు. పంట చేతికందే సమయంలో వర్షాలకు ధాన్యం తడిచిపోవడంతో రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది.అప్పులపై అవే అబద్ధాలు..వైఎస్సార్సీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చిందని.. రూ.పది లక్షల కోట్లు.. రూ.12 లక్షల కోట్లు.. రూ.14 లక్షల కోట్లు అప్పు చేసిందని ఎన్నికలకు ముందు చంద్రబాబు, కూటమి నేతలు, ఎల్లో మీడియా ప్రచారం చేసింది. ఎన్నికల్లో సూపర్ సిక్స్‌తోపాటు వందల హామీలను ప్రజలకు చంద్రబాబు ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక సూపర్ సిక్స్తోసహా ఎన్నికల హామీల అమలు నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి అప్పులతోపాటు రోజుకో డ్రామాకు తెర తీస్తున్నారు. అసెంబ్లీలో ప్రవేశపెట్టిన 2024–25 బడ్జెట్ సాక్షిగా రాష్ట్ర అప్పు రూ.6.46 లక్షల కోట్లేనని కూటమి ప్రభుత్వమే అంగీకరించింది. అయినా సరే రాష్ట్రం అప్పు రూ.పది లక్షల కోట్లు కంటే ఎక్కువ ఉందంటూ సీఎం చంద్రబాబు పచ్చి అబద్ధాలను వల్లె వేస్తూ.. ఆర్థిక పరిస్థితి సంక్లిష్టంగా ఉండటం వల్లే హామీలను అమలు చేయలేకపోతున్నానని సమర్థించుకోవడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నారు.పోలవరానికి ద్రోహం..వైఎస్సార్సీపీ అధికారంలో ఉన్నప్పుడు పోలవరం ఎత్తును 41.15 మీటర్లకే తగ్గిస్తున్నారంటూ చంద్రబాబు, టీడీపీ నేతలు దుష్ఫ్రచారం చేశారు. అయితే ఇప్పటికే స్పిల్ వేను 45.72 మీటర్ల ఎత్తులో నీటిని నిల్వ చేసేలా నిర్మించామని.. పోలవరం ప్రధాన డ్యామ్‌ను కూడా అదే రీతిలో నిర్మిస్తామని.. కావాలంటే టేపు తీసుకుని వచ్చి కొలుచుకోవాలని నాడు సీఎంగా ఉన్న వైఎస్ జగన్ సవాల్ విసరడంతో తోక ముడిచారు. పోలవరంలో నీటిని నిల్వ చేసే ఎత్తును 45.72 మీటర్ల నుంచి ఒక్క అంగుళం కూడా తగ్గించబోమని అప్పటి కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ సైతం పార్లమెంట్ ఉభయ సభల్లో అనేక మార్లు స్పష్టం చేశారు.కానీ.. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ ఏడాది ఆగస్టు 28న పోలవరంలో 41.15 మీటర్ల ఎత్తు వరకే నీటి నిల్వను పరిమితం చేస్తూ కేంద్ర కేబినెట్ తీర్మానం చేయడం గమనార్హం. దీనిపై ఆ సమావేశంలో పాల్గొన్న టీడీపీకి చెందిన కేంద్ర మంత్రి కె.రామ్మోహన్నాయుడు నోరు మెదపలేదు. పోలవరానికి కూటమి ప్రభుత్వం తలపెట్టిన ద్రోహానికి ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి? దీన్ని కప్పిపుచ్చుకోవడానికి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేసిన దుష్ఫ్రచారాన్నే సీఎం చంద్రబాబు, మంత్రి నిమ్మల ఇప్పుడూ చేస్తుండటం గమనార్హం.ఇసుకపై ఇష్టారాజ్యంగా.. ఇసుక ఉచితంగా ఇస్తామంటూ ఎన్నికల సమయంలో చంద్రబాబు హామీలిచ్చారు. వర్షాకాలంలో అవసరాల కోసం గత సర్కారు స్టాక్ పాయింట్లలో నిల్వ చేసిన 80 లక్షల టన్నుల ఇసుకలో 40 లక్షల టన్నులను అధికారంలోకి వచ్చిన పది రోజుల్లోనే టీడీపీ నేతలు తెగనమ్మి సొమ్ము చేసుకున్నారు. అందరూ దసరా పండుగ సందడిలో ఉన్న సమయంలో కేవలం రెండు రోజులే గడువు ఇచ్చి ఇసుక రీచ్‌లకు టెండర్లు నిర్వహించారు. ఇసుక రీచ్‌లన్నీ టీడీపీ నేతలకే కట్టబెట్టారు. ఇసుక ధరలను పచ్చ ముఠాలు ఇష్టారాజ్యంగా వసూలు చేయడంపై వెల్లువెత్తుతున్న ప్రజాగ్రహాన్ని తప్పించుకునేందుకు సీఎం చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్‌కు తెరతీశారు. -
రేషన్ బియ్యం తరలింపు వెనుక టీడీపీ మాఫియా
సాక్షి ప్రతినిధి, బాపట్ల: ‘పేదలకు అందాసన బియ్యాన్ని కొందరు స్మగ్లింగ్ చేస్తున్నారు. అక్రమాలకు పాల్పడుతున్నారు. అక్రమ ఎగుమతులు జరుపుతున్న నౌకల యజమానులెవరో కనుక్కుంటాను. కేసును సీఐడీకి ఇవ్వాలా, సీబీఐకి అప్పగించాలా అన్నది కేబినెట్లో నిర్ణయం తీసుకుంటాం’ శుక్రవారం రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌తో కలిసి కాకినాడు పోర్టులో బియ్యం అక్రమ ఎగుమతులను పరిశీలించాక డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ చెప్పిన మాటలివి. ఆయనకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే కూటమి పార్టీలు అధికారంలోకి వచ్చాక రేషన్ బియ్యాన్ని పేదల నుంచి అక్రమంగా సేకరిస్తూ విదేశాలకు రవాణా చేస్తున్న టీడీపీ నేతలను అడ్డుకోవాలి.మాఫియా వెనుక చక్రం తిప్పుతున్న కొందరు ఎమ్మెల్యేలు, మంత్రులను కట్టడి చేయాలి. అవన్నీ వదిలేసి పోర్టుకెళ్లి బియ్యం అక్రమ రవాణా అంటూ పవన్‌కళ్యాణ్ హంగామా చేయడాన్ని చూసి టీడీపీ నేతలు నవ్వుకుంటున్నారు. పేదల నోటికాడి బియ్యాన్ని కాజేస్తున్న పచ్చనేతల సంగతి వదిలేసి తమ పార్టీ అధినేత కాకినాడ పోర్టులో చేసిన విన్యాసాలు అర్థంగాక జనసేన శ్రేణులు తలలు పట్టుకుంటున్నారు.నియోజకవర్గాల వారీగా సేకరించి..పర్చూరు నియోజకవర్గంలో ఇంకొల్లుకు చెందిన ఇద్దరు నేతలు నియోజకవర్గ వ్యాప్తంగా బియ్యాన్ని సేకరించి ఇడుపులపాడు ప్రాంతంలోని ఒక రైస్ మిల్లులో రీసైక్లింగ్‌చేసి అక్కడి నుంచి బియ్యాన్ని అద్దంకి కేంద్రంగా ఉన్న మాఫియాకు అందిస్తున్నారు. చీరాల నియోజకవర్గంలో ఒంగోలుకు చెందిన వ్యక్తి మొత్తం బియ్యాన్ని సేకరించి వాటిని మంత్రి అనుచరులకు అప్పగిస్తున్నారు. బాపట్ల నియోజకవర్గం వెదుళ్లపల్లి, రైల్‌పేట, అప్పికట్లకు చెందిన కొందరు రైస్ మిల్లుల యజమానులే నియోజకవర్గ వ్యాప్తంగా బియ్యం సేకరించి రీసైక్లింగ్ చేసి బియ్యాన్ని అద్దంకి మాఫియాకు అప్పగిస్తున్నారు.వేమూరు నియోజకవర్గంలో భట్టిప్రోలుకు చెందిన నేత రేషన్ బియ్యాన్ని సేకరిస్తున్నారు. ఇందుకోసం ప్రతి గ్రామానికి ఇద్దరు చొప్పున పచ్చనేతలకు బియ్యం సేకరణ బాధ్యతలు అప్పగించారు. రేపల్లె నియోజకవర్గంలో నిజాంపట్నం మండలానికి చెందిన మంత్రి అనగాని సత్యప్రసాద్ అనుచరుడు బియ్యం మాఫియాను నడిపిస్తున్నాడు. పల్నాడు జిల్లా నుంచి సైతం చౌక బియ్యాన్ని సేకరించి అద్దంకికి తరలిస్తున్నారు. రీసైక్లింగ్ అనంతరం కృష్ణపట్నం పోర్టుకు తరలిస్తున్నారు.మంత్రి ఇలాకా నుంచే..బాపట్ల, పల్నాడు జిల్లాల్లో పేదలకు ఇస్తున్న రేషన్ బియ్యాన్ని టీడీపీ నేతలే అక్రమంగా సేకరిస్తున్నారు. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రధాన అనుచరుడితోపాటు అద్దంకి నియోజకవర్గానికి చెందిన మరో టీడీపీ నేత కలిసి అక్రమ బియ్యం వ్యాపారాన్ని సాగిస్తున్నట్టు సమాచారం. కొన్నిచోట్ల కార్డుదారులకు కిలోకు రూ.10 చొప్పున చెల్లించి బియ్యాన్ని సేకరిస్తున్న మాఫియా చాలా నియోజకవర్గాల్లో కార్డుదారులకు పైసా ఇవ్వకుండా కొందరు పౌరసరఫరాల శాఖ అధికారుల సహకారంతో స్టాక్ పాయింట్ల నుంచే బియ్యాన్ని తరలిస్తున్నారు. బియ్యం సేకరిస్తున్న పచ్చ నేతలకు కిలోకు రూ.4 నుంచి రూ.5 ఇస్తుండగా.. నియోజకవర్గ స్థాయి నేతలకు రూ.లక్షల్లో ముట్టజెపుతున్నారు.బియ్యం ప్రస్తావన తెస్తే కార్డులు రద్దు చేస్తామని బెదిరింపులకు దిగుతుండటంతో చాలామంది పేదలు బియ్యం అందకపోయినా నోరు మెదపడం లేదు. జిల్లా వ్యాప్తంగా ఈ బెదిరింపుల పర్వం కొనసాగుతోంది. ఇలా సేకరించిన బియ్యాన్ని మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రాతినిధ్యం వహిస్తున్న అద్దంకి నియోజకవర్గ పరిధిలోని రేణంగివరం, కోనంకి, కశ్యాపురం ప్రాంతాల్లో లీజుకు తీసుకున్న కొన్ని రైస్ మిల్లుల్లో రీసైక్లింగ్ చేసి బస్తాల్లో నింపి గోడౌన్లలో స్టాక్ పెడుతున్నారు. అక్కడి నుంచి కృష్ణపట్నం పోర్టుకు తరలించి రూ.కోట్ల అక్రమార్జనకు పాల్పడుతున్నారు. -
ఇక బియ్యం అక్రమార్కుల భరతం
సాక్షి, హైదరాబాద్: రేషన్ బియ్యం అక్రమార్కుల భరతం పట్టేందుకు పోలీస్‌శాఖ సిద్ధమైంది.ఇప్పటికే డీజీపీ జితేందర్ అన్ని జిల్లాల ఎస్పీలు, పోలీస్ కమిషనర్లకు రేషన్ బియ్యం అక్రమ రవాణా కట్టడి చేయాలని స్పష్టమైన ఆదేశాలిచ్చారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా పోలీస్, పౌరసరఫరాలశాఖ అధికారులతో కలిసి జాయింట్ ఆపరేషన్స్ చేపట్టనున్నట్టు ఓ పోలీస్ ఉన్నతాధికారి ‘సాక్షి’కి తెలిపారు. పేదల కోసం ప్రభుత్వం సరఫరా చేస్తున్న రేషన్ బియ్యాన్ని కొన్ని ముఠా లు అక్రమంగా ఇతర రాష్ట్రాలు, దేశాలకు తరలిస్తున్నాయి.గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి లో ఈ ముఠాలు బియ్యాన్ని తక్కువ ధరకు వివి ధ మార్గాల్లో సేకరించి, వాటిని ఇతర రాష్ట్రాలకు తర లిస్తుండగా, అన్ని స్థాయిల్లో నిఘా పెట్టారు. రేషన్ బియ్యం అక్రమ రవాణా ముఠాలతో అంటకాగుతున్న పోలీసు అధికారులపైనా వేటు వేసేందుకు ఉన్నతాధికారులు సిద్ధమవుతున్నా రు. ఇప్పటికే నిఘా వర్గాల నుంచి, ఇతర పద్ధతు ల్లో అవినీతి అధికారుల వివరాలు సేకరిస్తున్నట్టు తెలిసింది. కీలక నిందితులపైనే గురి ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం, నిజామాబాద్, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల పరిధిలో రేషన్ బియ్యం అక్రమ రవాణా దందా ఎక్కువగా సాగుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో బ్రోకర్ల ద్వారా ఈ ముఠాలు లబి్ధదారుల నుంచి బియ్యాన్ని సేకరిస్తున్నాయి. రేషన్ దుకాణాల నుంచి బియ్యం లబ్ధిదారులు తీసుకున్న వెంటనే వారికి కిలోకు రూ.10 నుంచి రూ.12 చెల్లిస్తున్నారు. వాటిని మండల స్థాయిలో మరో దళారీకి చేరవేసి, అక్కడి నుంచి జిల్లా స్థాయికి పంపించి అక్రమ రవాణా చేస్తున్నారు. ఇదంతా స్థానిక పోలీసు, రెవెన్యూ, పౌరసరఫరాల అధికారులకు తెలిసే జరుగుతుందన్నది బహిరంగ రహస్యం.ప్రధానంగా వీటిని మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాలకు, ఏపీలోని కాకినాడ, కృష్ణపట్నం పోర్టులకు తరలిస్తున్నట్టు పోలీస్ అధికారి ఒకరు తెలిపారు. పోర్టుల నుంచి విదేశాలకు ఈ బియ్యం వెళుతోందన్నారు. మరికొన్ని ముఠాలు స్థానికంగా హోటళ్లకు సైతం రేషన్ బియ్యాన్ని విక్రయిస్తున్నట్టు పేర్కొన్నారు. రీసైక్లింగ్ కోసం కొందరు మిల్లర్లు కూడా కొనుగోలు చేస్తున్నట్టు తెలిపారు. అయితే బియ్యం అక్రమ రవాణా కట్టడిలో కేవలం స్థానిక ముఠాలను అరెస్టు చేస్తే లాభం లేదని ఆ అధికారి అభిప్రాయపడ్డారు. ఈ అక్రమ రవాణాలో కీలక వ్యక్తులను గుర్తించేందుకు ఇప్పటికే ప్రత్యేక బృందాలతో సమాచారం సేకరిస్తున్నామన్నారు. అక్రమ అధికారులపైనా కొరడా ఇసుక అక్రమ రవాణా, పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా, గ్యాంబ్లింగ్, మట్కాలకు సహకరిస్తున్న పోలీసులపై ఉన్నతాధికారులు కొరడా ఝుళిపిస్తున్నారు. మల్టీజోన్–2 పరిధిలో ఇసుక అక్రమ రవాణా కట్టడిలో విఫలమైన, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ముగ్గురు ఇన్స్పెక్టర్లను, 13 మంది ఎస్సైలను వీఆర్‌కు పంపిన విషయం తెలిసిందే. అంతకు ముందు సైతం ఇదే విషయంలో 14 మంది ఎస్సైలను వారు పనిచేస్తున్న స్థానాల నుంచి బదిలీ చేశారు. ఇసుక అంశంలో మాదిరిగానే రేషన్ బియ్యం అక్రమ రవాణా ముఠాలకు సహకరిస్తున్న పోలీసులపై నిఘా విభాగం దృష్టి పెట్టింది. దీంతో అక్రమాలకు పాల్పడుతున్న పోలీస్ అధికారుల్లో భయం మొదలైంది. -
AP: బియ్యం బండికి బ్రేక్
ఇది విజయనగరం జిల్లా వంగర మండలం కొండచాకరాపల్లి పంచాయతీ పరిధిలోని ఐటీడీఏ కాలనీ (ఎస్టీ కాలనీ). 45 ఏళ్ల కిందట ఏర్పడిన ఈ కాలనీకి వైఎస్సార్ సీపీ హయాంలో ప్రభుత్వ సేవలు నడిచొచ్చాయి. ప్రతి నెలా రేషన్ బండి ఇంటి వద్దకే వచ్చి బియ్యం పంపిణీ చేసింది. రెండు కి.మీ. దూరంలోని కొండచాకరాపల్లి రేషన్ డిపో దగ్గరకు వెళ్లి రోజంతా క్యూలైన్లలో పడిగాపులు కాసే దుస్థితిని గత ప్రభుత్వం మార్చిందని మహిళలు గుర్తు చేసుకుంటున్నారు.సాక్షి, అమరావతి: పౌర సేవల్లో వైఎస్సార్ సీపీ తెచ్చిన విప్లవాత్మక సంస్కరణలకు రేషన్ సరుకుల డోర్ డెలివరీ తిరుగులేని నిదర్శనం. కలలో కూడా ఎవరూ ఊహించనివి సాకారమయ్యాయి. ప్రతి ఇంటికీ ప్రభుత్వ పథకాలను వివక్షకు తావులేకుండా పారదర్శకంగా చేరవేసిన మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అదే పంథాను కొనసాగించి పేదల ఇక్కట్లను తొలగిస్తూ ప్రజా పంపిణీ వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేశారు. పేదలు పనులు మానుకుని రోజంతా రేషన్ దుకాణాల వద్ద పడిగాపులు కాయాల్సిన దుస్థితిని తప్పించారు.రేషన్ బియ్యమంటే తినటానికి ఏమాత్రం పనికి రావనే గూడు కట్టుకుపోయిన అభిప్రాయాన్ని తొలగిస్తూ నాణ్యమైన సార్టెక్స్ బియ్యాన్ని కచ్చితమైన తూకంతో ప్యాకింగ్ చేసి మరీ పేదలకు ఇంటికే పంపించారు. దేశానికే ఆదర్శంగా నిలిచిన ఎండీయూ (ఇంటి వద్దకే రేషన్ పంపిణీ) వ్యవస్థకు ఇప్పుడు కూటమి ప్రభుత్వం తిలోదకాలిస్తోంది. పేదలను మళ్లీ గత కాలపు చేదు జ్ఞాపకాలు, అవమానాలకు గురి చేసే విధంగా సన్నద్ధమైంది. ముక్కిపోయిన బియ్యం.. సకాలంలో దొరకని తిండి గింజలు.. అసలు అడిగితే సమాధానం లేని పాత రేషన్ విధానం ప్రవేశపెట్టేందుకు తాపత్రయపడుతోంది. ఎండీయూ వ్యవస్థ నిలిచిపోతే రేషన్ సరుకుల కోసం చౌక ధరల దుకాణాల దగ్గర మళ్లీ క్యూలైన్ల్లో బారులు తీరాల్సిన దుస్థితి తలెత్తనుంది. చౌక బియ్యంతోనే పొట్టపోసుకునే వృద్ధులు, దివ్యాంగుల దురవస్థ ఊహకు కూడా అందడం లేదు. దాదాపు కోటిన్నర మందికి తిప్పలు.. ఇన్నాళ్లూ ఎండీయూ వాహనం ఇంటికి వచ్చే ముందు వలంటీర్ల ద్వారా నిరీ్ణత సమయం, తేదీతో సహా వినియోగదారులకు సందేశాలు వెళ్లేవి. ఇంట్లో యజమాని లేకున్నా కార్డుదారుల్లో ఏ ఒక్కరున్నా ఇబ్బంది లేకుండా బియ్యం తీసుకునేవారు. బియ్యం ఏ ఒక్కరూ పనులు మానుకుని ఎదురు చూసేవారు కాదు. ఎండీయూ వ్యవస్థ రద్దు అయితే రేషన్ కోసం కూలి పనులు మానుకుని ప్రత్యేకంగా ఒక రోజుకేటాయించాల్సిన దుస్థితి ఏర్పడనుంది. ఏపీలో 1.49 కోట్ల మంది కార్డుదారులుండగా వీరిలో రోజువారీ పనులు చేసుకుని జీవించేవారే అధికం. సగటున కోటి మంది రేషన్ తీసుకోవడానికి డిపోకు వెళితే ఆ రోజు పనికి దూరం కావాల్సిందే. వెళ్లిన రోజే రేషన్ అందుతుందనే నమ్మకం లేదని గత అనుభవాలే చెబుతున్నాయి. సచివాలయాల వద్ద కూడా.. రాష్ట్రంలో 1.49 కోట్ల మంది రేషన్ కార్డుదారులకు ఇప్పటిదాకా ఎండీయూ వ్యవస్థ ద్వారా నాణ్యమైన బియ్యం పంపిణీ సమర్థంగా జరుగుతోంది. ఒక్కో ఎండీయూ వాహనం రోజుకు సుమారు 90 కార్డులకు తగ్గకుండా నెలలో 17 రోజుల పాటు ఇంటి వద్దకే వెళ్లి రేషన్ సరుకులు చేరవేస్తోంది. బియ్యాన్ని ఇంటి ముంగిట్లో అందజేస్తోంది. వివిధ కారణాలతో ఇంటి దగ్గర ఎవరైనా రేషన్ తీసుకోకుంటే సాయంత్రం పూట గ్రామ, వార్డు సచివాలయం వద్ద ఇచ్చే వెసులుబాటు కల్పించారు.వైఎస్సార్సీపీ ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా సార్టెక్స్ బియ్యాన్ని సరఫరా చేసింది. ఎక్కడా రేషన్ డీలర్ల ఉపాధికి ఆటంకంకలగకుండా జాగ్రత్తలు తీసుకుంది. కూటమి ప్రభుత్వం మాత్రం ఆర్థిక భారం పేరుతో ఇంటి వద్దకే రేషన్ పంపిణీని నిలిపివేసి అక్రమాలకు తెర తీసే ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తోంది. వేల మంది ఉపాధి ప్రశ్నార్థకం.. రేషన్ పంపిణీలో వైఎస్ జగన్ ప్రభుత్వం దేశానికి ఆదర్శంగా నిలిచింది. 2021లో రూ.530 కోట్లకు పైగా వ్యయంతో ‘ఇంటి వద్దకే రేషన్’ వ్యవస్థను తీసుకొచ్చింది. తద్వారా 9,260 మంది బడుగు, బలహీన వర్గాల యువతకు ఎండీయూ ఆపరేటర్లుగా ప్రతి నెలా నిర్వహణ ఖర్చుల కింద జీతం చెల్లిస్తూ ఉపాధి సైతం కల్పించింది. ఒక్కో ఎండీయూ వాహనం విలువ రూ.5.81 లక్షలు కాగా గత ప్రభుత్వం రూ.3.48 లక్షలు రాయితీ ఇచ్చింది. లబ్దిదారుడు కేవలం రూ.58 వేలు చెల్లించగా మిగిలిన మొత్తాన్ని బ్యాంకు నుంచి రుణ సౌకర్యం కల్పించారు. 90 శాతం రాయితీతో రేషన్ వాహనాలను అందించారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా వాహనదారుడితో పాటు హెల్పర్ల కింద సుమారు 17 వేల మందికిపైగా ఉపాధి పొందుతున్నారు. ఎండీయూలకు ఆరి్థక ఊరట కల్పించేందుకు వాహన మిత్ర పథకంలో భాగంగా గత ప్రభుత్వం ఏడాదికి రూ.10 వేలు చొప్పున అందించింది. ఇప్పుడు వీరందరి భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. వాస్తవానికి ఎండీయూ వ్యవస్థ వచ్చిన తర్వాతే రేషన్ వినియోగం 90 శాతానికిపైగా పెరిగింది.దేశంలో దాదాపు 8 రాష్ట్రాలకు పైగా రేషన్ డోర్ డెలివరీపై ఆసక్తి కనబరిచాయి. కానీ సమర్థంగా నిర్వహించేందుకు గ్రామ, వార్డు సచివాలయాలు, వలంటీర్ వ్యవస్థలు లేకపోవడంతో ఆలోచనలో పడ్డాయి. కూటమి ప్రభుత్వం గ్రామ స్వరాజ్యానికి ప్రతీకగా నిలిచిన వ్యవస్థలను ఎత్తివేసే కుట్రలో భాగంగానే ఎండీయూ వ్యవస్థను రద్దు చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. రేషన్ డోర్ డెలివరీ రద్దు చేద్దాం2014లో రేషన్ షాపుల ద్వారా నిత్యావసరాలు ఇచ్చేవాళ్లం. బియ్యం డోర్ డెలివరీ పేరుతో చేపట్టిన ఎండీయూ విధానం లోపభూయిష్టంగా సాగింది. ఇదే వాహనాలను బియ్యం అక్రమ రవాణాకు వాడుకున్నారు. ఇంటింటికీ రేషన్ వ్యవస్థను రద్దు చేసి ఆ వాహనాలను ఎలా వాడుకోవాలో ప్రతిపాదనలతో రండి.ఈనెల 2న పౌరసరఫరాల శాఖపై సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు దశాబ్దాల దుస్థితిరేషన్ సరుకులు తీసుకోవాలంటే దశాబ్దాల పాటు ఓ ప్రహసనమే. పేదలు ఓ పూట పనులు మానుకుని సరుకుల కోసం వెళ్లినా షాపు తెరుస్తారో లేదో అనుమానమే. నిర్దేశించిన సమయంలో మాత్రమే వెళ్లి తీసుకోవాలి. వినియోగదారులు ముందే వెళ్లి కార్డులు వరుసగా లైన్లలో పెట్టాలి. సరుకులన్నీ కొలిచే ఇవ్వడం, తూకం వేసే వరకు ఆగాల్సిందే. ఇక రేషన్ డీలర్లు సొంత పనులపై ఎక్కడికైనా వెళితే వారు వచ్చేవరకు నిరీక్షించక తప్పదు. రోజువారీ కూలి పనులకు వెళ్లి పొట్టపోసుకునే వారికి ఇది ఎంత ప్రయాస అనేది వేరే చెప్పాల్సిన పనిలేదు. పక్కాగా పంపిణీ..రేషన్ డీలర్ లేకపోతే ఆ నెలలో రేషన్ కచ్చితంగా ఆలస్యం అవుతుంది. అదే ఎండీయూ ఆపరేటర్ సెలవులో ఉన్నా, అనివార్య కారణాలతో రాకున్నా వీఆర్వో ద్వారా లబ్దిదారుల ఇంటి వద్దనే సరుకులు పంపిణీ చేసేలా గత ప్రభుత్వంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. గిరిజన ప్రాంతాలు, కొండ ప్రాంతాల్లోకి కొన్ని చోట్ల ఎండీయూ వాహనాలు వెళ్లడం కష్టంతో కూడుకున్నది. అలాంటి చోట్ల అదనపు ఖర్చు చేసి ఇతర వాహనాల్లో లబ్దిదారుల ఇళ్లకు రేషన్ చేరవేసింది.రేషన్ డీలర్ బలవన్మరణం రేషన్‌షాపును టీడీపీ నేతలు వేరొకరికి కేటాయించిన ఫలితం ప్రొద్దుటూరు: టీడీపీ నేతలు తనకు జీవనా«ధారంగా ఉన్న రేషన్ షాపును తొలగించడంతో డీలర్ ఆత్మహత్య చేసుకున్న సంఘటన ప్రొద్దుటూరులో చోటుచేసుకుంది. డీలర్ రామకృష్ణ (50) అలియాస్ కిట్టు గత పదేళ్లకు పైగా మున్సిపాలిటీ పరిధిలోని ఎల్ఐసీ కార్యాలయం వద్ద రేషన్‌షాపు నిర్వహిస్తున్నారు. వార్డు టీడీపీ కౌన్సిలర్ మహ్మద్ గౌస్ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి ద్వారా ఇటీవల ఆ రేషన్‌షాపును తన బంధువులకు ఇప్పించుకున్నారు. ఈ విషయమై రామకృష్ణ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి, టీడీపీ నేత ఈవీ సుధాకర్‌రెడ్డి తదితరులను కలిసి ప్రాథేయపడినట్లు తెలిసింది. ఆయన అభ్యర్థనను ఎవరు పట్టించుకోకపోవడంతో మానసిక వేదనకు గురైన ఆయన బుధవారం రాత్రి విషం తాగాడు. పరిస్థితి గమనించిన కుటుంబ సభ్యులు స్థానిక జిల్లా ఆస్పత్రిలో చేర్పించగా పరిస్థితి విషమించడంతో కడప రిమ్స్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రామకృష్ణ గురువారం మృతిచెందాడు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రొద్దుటూరు నియోజకవర్గంలో సుమారు 70కిపైగా రేషన్ షాపులనుబెదిరించి, భయాందోళనలకు గురిచేసి స్వా«దీనం చేసుకున్నారు. 40 ఏళ్లుగానిర్వహిస్తున్న రేషన్ షాపులను అధికార పార్టీ నేతలు బలవంతంగా లాక్కున్నారు. అంగన్వాడీలు, హాస్టళ్లకు కష్టాలే.. నాణ్యమైన (సార్టెక్స్) బియ్యాన్ని లబ్దిదారుల ఇంటి ముంగిటికే వాహనాల ద్వారా (ఎండీయూ) డోర్ డెలివరీ చేయడంతో పాటు ఐసీడీఎస్(అంగన్వాడీలు), మధ్యాహ్న భోజన పథకం కింద పాఠశాలలకు, సంక్షేమ హాస్టళ్లకు కూడా ఫోర్టిఫైడ్ బియ్యాన్ని నేరుగా చేరవేస్తున్నారు. గతంలో అంగన్వాడీలు స్థానికంగా ఉన్న రేషన్ దుకాణం నుంచి, స్కూళ్లు, హాస్టళ్లు యాజమాన్యాలు ఎంఎల్ఎస్ పాయింట్ల నుంచి వ్యయ ప్రయాసల కోర్చి బియ్యాన్ని తెచ్చుకునేవి. ఒక రోజు ప్రత్యేకంగా దీని కోసం కేటాయించాల్సి వచ్చేది. రవాణా, లోడింగ్, అన్ లోడింగ్ విషయంలో ఇబ్బందులు ఎదురయ్యేవి. వీటన్నింటికీ పరిష్కారంగా గత ప్రభుత్వం రేషన్‌ను డోర్ డెలివరీ చేయాలని నిర్ణయించింది. తద్వారా ఎండీయూ ఆపరేటర్లకు అదనపు ఆదాయాన్ని కూడా సమకూరుస్తోంది. ఎండీయూ వ్యవస్థ రద్దు అయితే అంగన్ వాడీలు, హాస్టళ్లకు మళ్లీ కష్టాలు తప్పని పరిస్థితి నెలకొంది. అప్పట్లో తినేవారేరి? 2014–19 మధ్య చంద్రబాబు హయాంలో రేషన్ బియ్యం ఇంటికి తెచ్చుకోవడానికి,వండుకుని తినడానికి ప్రజలు నానా అవస్థలు పడేవారు. బియ్యం ముక్కిపోవటం... పురుగులు పట్టడం.. రాళ్లు, నూకలు ఎక్కువగా ఉండటంతోపాటు గింజలు రంగు మారికనిపించేవి. ఇదేంటని ప్రశి్నస్తే ఇంటికి తెచ్చుకున్న బియ్యాన్ని లబ్ధిదారులు శుభ్రం చేసుకోవడానికే సమయం పోయేది. ఈ దుస్థితిని గమనించి వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో నాణ్యమైన సార్టెక్స్ బియ్యం ఇచ్చేందుకు శ్రీకారం చుట్టారు. కరోనా సమయంలో ప్రభుత్వం ఇచ్చిన నాణ్యమైన రేషన్ బియ్యమే పేదల ఆకలి తీర్చింది. కార్డుదారుల సమక్షంలో ఇంటి వద్దే సంచులు తెరిచి కచ్చితమైన తూకంతో ఇస్తుండటంతో కొలతలపై ఫిర్యాదులు తగ్గిపోయాయి. ఈ–పోస్ యంత్రాలకు జీపీఎస్ ట్రాకింగ్ ఏర్పాటు చేయడంతో అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడింది. గ్రామ, మండల, జిల్లా స్థాయిల్లో విజిలెన్సు కమిటీలను ఏర్పాటుచేసి నిత్యం రేషన్ డోర్ డెలివరీని గత ప్రభుత్వం పర్యవేక్షించింది.కర్నూలు జిల్లా కోడుమూరు మండలం బైరందొడ్డిలోని 76 ఇళ్లలో 250 మంది నివాసం ఉంటున్నారు. 63 కుటుంబాలకు రేషన్ కార్డులున్నాయి. ఇది పులకుర్తి మజరా గ్రామం కావడంతో సంక్షేమ పథకాలు అందుకోవాలంటే అక్కడికి వెళ్లాల్సిందే. రేషన్ కూడా అక్కడికే వెళ్లి తెచ్చుకునేవారు. వైఎస్ జగన్ హయాంలో వారు ఎక్కడికీ వెళ్లకుండా గ్రామంలోనే పథకాలు అందాయి. ఎండీయూ వాహనాల ద్వారా రేషన్ డోర్ డెలివరీ చేశారు. చంద్రబాబు ప్రభుత్వం ఆ వాహనాలు రద్దు చేస్తే మళ్లీ బియ్యం, సరుకుల కోసం మోసుకుని తెచ్చుకోవాల్సిన దుస్థితి నెలకొంది.గిరిజన గ్రామాలకు మళ్లీ కష్టాలు.. మాది ఉత్తరాంధ్రలోనే అత్యంత ఎత్తయిన గిరి శిఖర గ్రామంచందనగిరి. గతంలో రేషన్ తీసుకోవడానికి ప్రతి నెల కుటుంబాలతో పనులు మానుకుని కాలినడకన పరశురాంపురం వెళ్లేవాళ్లం. అక్కడి నుంచి సరుకులు భుజాన మోసుకుని కొండపైకి వెళ్లేందుకు ఎన్నో అవస్థలు పడ్డాం. వైఎస్ జగన్ ప్రభుత్వంలో మా ఇళ్ల వద్దకే వచ్చి సరుకులు అందించారు. దయచేసి మా ఇళ్ల వద్దకు వచ్చి మాకు రేషన్ సరుకులు అందించాలి. – జన్ని సరోజిని, చందనగిరి గ్రామం, మెళియాపుట్టి మండలం, శ్రీకాకుళం జిల్లా నడిచేకి కూడా చేతకాదు..! నాకు, నా భార్యకు వయసుపైబడింది. నడవడానికి కూడా చేతకాదు. గతంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇంటి వద్దకే వచ్చి రేషన్ బియ్యం ఇచ్చేవారు. ఇప్పుడు స్టోర్ దగ్గరికే పోయి తీసుకోవాలని చెబుతున్నారు. మేం స్టోర్‌కు ఎప్పుడు పోవాలి? బియ్యం ఎలా వేయించుకోవాలి? నడిచేందుకు కూడా శరీరం సహకరించడంలేదు. ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకోవడం సరైంది కాదు. – తిమ్మప్ప, అండేపల్లి, కంబదూరు మండలం, అనంతపురం జిల్లా రేషన్ కోసం 6 కి.మీ. వెళ్లాలి మేం గతంలో మా ఊరు రాజాసాహెబ్‌పేట నుంచి 6 కిలోమీటర్ల దూరంలోని కంబాలదిన్నెకు వెళ్లి రేషన్ సరుకులు తెచ్చుకునేవాళ్లం. దీనికోసం ఒక పూట కూలిపనులు మానుకుని వెళ్లాల్సి వచ్చేది. జగన్ హయాంలో వాహనాల ద్వారా ఇంటింటికీ రేషన్ సరుకులు పంపారు. ఇకపై కూడా అలాగే ఇచ్చేలా చూడాలి. – పి.నరసింహారావు, రాజాసాహెబ్‌పేట, పామూరు మండలం, ప్రకాశం జిల్లా ఆరోగ్యం దృష్ట్యా కదిలే పరిస్థితి లేదు నా వయసు 70 ఏళ్లకు పైనే. ఆరోగ్యం దృష్ట్యా కదిలే పరిస్థితి లేదు. నా కుమారుడు దుర్గానరేష్ వికలాంగుడు. నా భార్య వరలక్ష్మి వయసు సైతం ఎక్కువే. గత ప్రభుత్వంలో మా ఇంటి వద్దకు వచ్చి మరీ రేషన్ ఇచ్చేవారు. ఇప్పుడు రేషన్ షాపు వద్దకు వెళ్లాలని చెబుతున్నారు. – కంచి నాగేశ్వరరావు, పెదపట్నంలంక, బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా జీవన భృతి పోగొట్టుకుని వేరే ఊరికి వెళ్లాలి గతంలో రేషన్ బియ్యం, సరుకులు తీసుకోవాలంటే రోజూవారి జీవన భృతి పోగొట్టుకొని వేరే ఊరికి ‡వెళ్లి క్యూలైన్లో నిలబడి సాయంత్రానికి వచ్చేవాళ్లం. పేదల సమస్యలు గుర్తించిన జగన్ ఇంటివద్దకే రేషన్ వాహనాలను ఏర్పాటు చేశారు. మళ్లీ పక్క ఊరికి ఆటోలో వెళ్లి పని, కూలీ పోగొట్టుకుని క్యూలో నిలబడే పరిస్థితి కల్పిస్తున్నారు. పేదలపై కోపంతోనే జగనన్న పథకాలు తీసేస్తున్నారు. – డమ్ము మహాలక్ష్మి, ఉర్లగడ్డపోడు, రైల్వేకోడూరుమండలం, అన్నమయ్య జిల్లా -
భలే మంచి 'చౌక' బేరం!
పేదల కడుపు నింపే రేషన్ బియ్యాన్ని నల్లబజారుకు తరలించే ముఠాకు అండగా నిలిచి కాలు కదపకుండా కోట్ల రూపాయలు కూడబెట్టుకోవాలని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ పథకం రచించారు. ఈ మేరకు రేషన్ బియ్యం తరలించే ముఠా సభ్యులతో బేరం కుదిర్చే పనిని తన మామకు అప్పగించారు. ఆయన రంగంలోకి దిగి అనంతపురం టౌన్లో బియ్యం కొనుగోలు చేసి వాటిని గోదాములకు చేర్చి, జిల్లా సరిహద్దులు దాటించి నల్లబజారులో అమ్ముకునేదాకా అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని ముఠా సభ్యులకు భరోసా ఇస్తున్నారు. తమను కాదంటే కేసులు పెట్టించి లోపలేయిస్తామని బెదిరిస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించి స్వయాన ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ మామ గంగారాం చౌక బియ్యాన్ని కార్డుదారులు, డీలర్ల నుంచి సేకరించి నల్లబజారుకు తరలించే ముఠాకు సహకరిస్తున్న ఓ మహిళతో ఫోన్లో మాట్లాడిన ఆడియో నెట్టింట వైరల్ అవుతోంది. – అనంతపురం క్రైంఈ ఆడియోలోని సంభాషణ ఇలా...ఎమ్మెల్యే మామ: ఏమ్మా మీరు ఒకసారి ఎమ్మెల్యే ఆఫీసుకు వచ్చి రేటు మాట్లాడుకుని వెళ్లండి. మీరు మొత్తం నలుగురు ఉన్నారు కదా? రేపు ఆఫీసుకు నలుగురు కలిసి రావాల్సి ఉంటుంది. మహిళ: అన్నా.. అప్పుడే(కౌంటింగ్ అయిన తర్వాత) పరిటాల సునీతమ్మక్క ఇంటి వద్దకు రమ్మంటే వెళ్లాము. సోమందేపల్లి వాళ్లు అక్కడే మాట్లాడుకున్నారు. సరుకు వాళ్లు కదా తీసుకెళ్లేది! మీరు వాళ్లతోనే మాట్లాడండి. మాతో ఎందుకు? ఎమ్మెల్యే మామ: అలా కాదు... అనంతపురం అర్బన్‌లోని రేషన్ షాపులు వారందరికీ మేం అప్పుడే అలర్టు చేసినాం. మా ఆ«దీనంలోనే ఉన్నాయి. ఇక్కడ మీరు సరుకు నిల్వ ఉంచుకుని పంపుతున్నారు. కావున మీరు మాతో మాట్లాడాలి. అలాకాదని పరిటాల సునీత, శ్రీరాము, బాలాజీ... అంటే ఎలా? పైగా నేను కూడా బాలాజీకి బావే. బాలాజీతో నేను మాట్లాడతాను. సోమందేపల్లి, పెనుకొండ మంత్రి సవితమ్మ ఎవరైనా కానీ.. మీ సరుకు వెళ్లాలంటే అనంతపురం నగరంలో మా అనుమతి తప్పనిసరి. నువ్వు, సుబ్బు, రామకృష్ణ, జయపాల్‌రెడ్డి, జగదీష్ కలసి సాయంత్రం మూడు గంటలకు ఆఫీసుకు రండి. మీరు చాలా కరెక్టు మనిషి అని మా పిల్లలు చెప్పారు. అందుకే మీకు ఫోన్ చేస్తున్నా. మహిళ: నేను ఒక్కదాన్నే రావాలా అన్నా? ఎమ్మెల్యే మామ: వద్దు.. మీరు నలుగురు కలిసి రండి. అప్పుడే మాట్లాడతాం. మీరు ఎట్టి పరిస్థితుల్లో మాకు చెప్పకుండా సరుకు పంపొద్దు. సోమందేపల్లి వాళ్లు, పెనుకొండ వాళ్లు వచ్చినా వారికి సరుకు ఇవ్వొద్దు. అలా ఇచ్చారంటే మీ ఇష్టం. చాలా సీరియస్ అవుతుంది. లేదు.. మేము చేసుకుంటామంటే మాత్రం అందరినీ లోపలేపిస్తాం. మహిళ: లేదులే అన్న మాకేముంది? లోకల్లో ఎవరొచ్చినా సరుకు ఎత్తిచ్చేవాళ్లము కదా? ఎమ్మెల్యే మామ: అలా కాదు... మీరు ఇంకా ఐదు సంవత్సరాలు ఈ వ్యాపారం బాగా చేసుకోవాలంటే నేను ఫుల్ ష్యూరిటీ ఇస్తున్నా. మీకెలాంటి ఇబ్బందీ రానివ్వను. చాలారోజులుగా మీ విషయం మాట్లాడుకుంటున్నాం. నిన్న ఎమ్మెల్యే దగ్గుపాటి వచ్చి ‘మామ ఇంక అదేందో నువ్వే వాళ్లని పిలిపించుకుని మాట్లాడు’ అంటే నేను బాధ్యత తీసుకున్నా. మీ అందరి గురించి తెలుసుకుని నంబర్లు తీసుకునేలోపు లేటయ్యింది. సాయంత్రం 3 నుంచి 3.30 గంటల మధ్య రండి. మహిళ: సరే సార్ వస్తాం. ఎమ్మెల్యే మామ: ఇదే కాదు... భవిష్యత్‌లో కూడా పరిటాల, సవితమ్మ, ఇంకా పార్టీ లీడర్లు... ఇలా ఎవరి నుంచి ఏ ఇబ్బందీ రాకుండా పూర్తి బాధ్యత మేమే తీసుకుంటున్నాం. రెండు రోజుల్లో మా కమ్మాస్ అతనే సీఐ సాయినాథ్ అని వస్తున్నాడు. కావాలనే మనం తీసుకుంటున్నాం. ఇంకా ఎస్ఐలు కూడా మా వాళ్లే వస్తారు. మీరు ఒకటి అర్థం చేసుకోండి. డీఎస్పీ నుంచి సీఐలు, ఎస్ఐలు అంతా మా వాళ్లే ఉండాలని తీసుకుంటున్నాం. రెండు రోజుల్లో వస్తారు. మీకు ఎలాంటి ఇబ్బందీ రానివ్వము. అనంతపురం టోటల్ జిల్లాలో మిమ్మల్ని మాట్లాడించే వారుండరు. అలా ఎవరైనా మాట్లాడితే నాతో ఫోన్లో మాట్లాడించండి. నేను చూసుకుంటాను. ఎంతటి వారినైనా వదిలిపెట్టం.మహిళ: ఇంతకుముందు మా నుంచి ఎవరూ తీసుకోలేదు అన్నా! ఎమ్మెల్యే మామ: మీరు ఇంకొకరి గురించి చెప్పొద్దు. అలా ఊరికే ఇడిసిపెట్టేది ఉండదు. వాళ్లు వదిలి పెట్టారని మేము ఎలా విడిచి పెడతాము? మీరేమో తప్పుడు పని చేస్తూ ఇంకొకరికి సరుకు ఇస్తున్నారు. మీ నుంచి మేము తీసుకోకూడదంటే ఎలా? వదిలే ప్రసక్తే లేదు. బయట ఎక్కడో మీరు మాట్లాడుకుని మమ్మల్ని ఎవరూ అడగలేదంటే ఎట్లా? ఆఫీసుకు రండి.. ఇక్కడే కూర్చుని మాట్లాడుకుందాం. -
రేషన్ బండి మా ఊళ్లోకొస్తే తగులబెడతాం
దర్శి: ‘ఇప్పుడున్న రేషన్ డీలర్‌ను తొలగించండి. మేం చెప్పినవారికి డీలర్షిప్ ఇవ్వండి. అప్పటి వరకు మా ఊరిలో రేషన్ ఇవ్వడానికి వీల్లేదు. మేం చెప్పినట్లు చేయకుండా గ్రామంలోకి రేషన్ బియ్యం తీసుకువస్తే ఆ బండిని తగలబెడతాం..’ అని ప్రకాశం జిల్లా దొనకొండ మండలం ఇండ్లచెరువు గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు హెచ్చరిస్తున్నారు. రెండుసార్లు రేషన్ బియ్యం తీసుకువెళ్లిన లారీని అడ్డుకున్నారు. వారి అడ్డగోలు చర్యల వల్ల గ్రామంలోని పేదలకు ఇప్పటి వరకు రేషన్ బియ్యం అందని పరిస్థితి నెలకొంది. ఇందుకు సంబంధించిన వివరాలు... ఇండ్లచెరువు గ్రామంలో బీసీ కులానికి చెందిన అద్దంకి వెంకటేశ్వర్లు 20 ఏళ్లుగా రేషన్ షాపు పరి్మనెంట్ డీలర్‌గా ఉన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ డీలర్‌ను తీసివేయాలని స్థానిక నాయకులు నిర్ణయించుకున్నారు. డీలర్ ఈ విషయం తెలుసుకుని టీడీపీ నేతలను కలసి ‘20 ఏళ్లుగా రేషన్ దుకాణం నిర్వహిస్తున్నాను. ఇదే నాజీవనాధారం. నా కడుపు కొట్టి నా కుటుంబాన్ని బజారున పడేయొద్దు’ అని వేడుకున్నాడు.అయినా కనికరించని వారు డీలర్‌ను తొలగించాలని రెవెన్యూ, ఎన్ఫోర్స్మెంట్ అధికారులపై ఒత్తిడి తెచ్చారు. ఆయన రాజీనామా చేస్తే తప్ప తీసివేయడానికి తమకు అధికారం లేదని అధికారులు చెప్పారు. దీంతో తమ గ్రామంలోకి రేషన్ బియ్యం ఎలా తెస్తారో చూస్తామని టీడీపీ నేతలు హెచ్చరికలు జారీచేశారు. ఈ క్రమంలో గత నెల 31వ తేదీన దొనకొండలోని పౌరసరఫరాల శాఖ గోదాము నుంచి 12 టన్నుల రేషన్ బియ్యాన్ని లారీలో ఇండ్లచెరువుకు పంపగా, టీడీపీ నాయకులు అడ్డుకున్నారు. తమను కాదని గ్రామంలోకి రేషన్ బియ్యం లారీ వస్తే తగులబెడతామని హెచ్చరించారు. దీంతో సిబ్బంది లారీని తీసుకుని వెనక్కి వెళ్లిపోయారు.పోలీసులనూ లెక్క చేయలేదు పోలీస్ బందోబస్తుతో శనివారం ఉదయం 11 గంటలకు మరోసారి రేషన్ బియ్యంతో లారీ ఇండ్లచెరువుకు బయలు దేరగా... టీడీపీ నాయకులు వచ్చి ఊరి బయటే అడ్డుకున్నారు. గ్రామంలోకి వస్తే తగులబెడతామని, వెనక్కి వెళ్లాల్సిందేనని హెచ్చరించారు. పోలీసులు సాయంత్రం వరకు బతిమిలాడినా టీడీపీ నాయకులు వినకపోవడంతో లారీని వెనక్కి పంపారు. టీడీపీ నాయకులు ఇంత బరితెగించి దౌర్జన్యం చేస్తున్నా పోలీసులు బతిమిలాడుకోవడం చూసిన ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. పోలీసు వ్యవస్థ ఇంత నిరీ్వర్యమైపోతే సామాన్యులకు ఏం న్యాయం చేస్తారని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. -
ప్రభుత్వ టీచర్‌పై టీడీపీ నేత బూతు పురాణం
సాక్షి, టాస్‌్కపోర్సు: అధికార దర్పంతో టీడీపీ నాయకులు, కార్యకర్తలు చెలరేగిపోతున్నారు. తమ ఆగడాలను అడ్డుకున్న వారిపై విరుచుకుప డుతున్నారు. తాజాగా పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పిస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడిని ఓ టీడీపీ నాయకుడు ఇష్టారీతిన బూతులు తిడుతూ బెదిరించాడు. ఈ ఘటన నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం కోర్నపల్లె గ్రామంలో జరిగింది. ఇటీవల రేషన్ డీలర్షిప్ దక్కించుకున్న టీడీపీ నాయకుడు విజయభాస్కర్‌రెడ్డి గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో రేషన్ బియ్యం బస్తాలు దించుతుండగా విద్యార్థులకు ఇబ్బంది అంటూ ఓ ఉపాధ్యాయుడు అడ్డు చెప్పారు. దీంతో టీడీపీ నేత బూతులతో చెలరేగిపోయాడు. ‘ఎవడు ఎంఈవో.. చెçప్పుతో కొడతా.. ఏం పీకుతావ్ రా ఎర్రి.. (బూతు)? లోఫర్ నా కొడకా.. మాకు ఎన్ని సీట్లు వచ్చాయో తెలుసా? 164 సీట్లొచ్చాయి. స్టోర్ బియ్యం బడిలో ఎలా దించుతావని మమ్మల్నే ప్రశ్నిస్తావా? ఇక్కడ ఉండలేకపోతే ... (బూతు)’ అంటూ విరుచుకుపడ్డాడు. దీంతో ఆ ఉపాధ్యాయుడు బిత్తరపోయాడు. సహ ఉపాధ్యాయులు, విద్యార్థుల ముందే ఇలా నోటికొచ్చినట్లు బూతులు తిట్టడంతో ఆ ఉపాధ్యాయుడు మిన్నకుండిపోయాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. టీడీపీ నాయకుడి తీరుపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇంత జరిగినా విద్యాశాఖ అధికారులు కానీ, ఉపాధ్యాయ సంఘాలు కానీ స్పందించక పోవడం విచారకరం. -
కోళ్ల దాణా.. బీర్ల తయారీ!
కరీంనగర్: రేషన్ బియ్యం దందా ఆగడం లేదు. రూపం.. దారులు మారాయే తప్ప అక్రమ వ్యాపారం ఆగడం లేదు. ఇటీవల రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి జిల్లాకు చెందిన ఓ బియ్యం డాన్ పేరును ప్రస్తావించడం చర్చనీయాంశమైంది. ఎలక్ట్రానిక్ పాయింట్ ఆఫ్ సేల్ (ఈ–పొస్) ద్వారా రేషన్ తీసుకోని కార్డుదారుల సరుకు నల్లబజారుకు తరలకుండా అడ్డుకట్టపడగా ప్రభుత్వ ఖజానాకు లాభం చేకూరింది.కార్డుదారులు తీసుకునే బియ్యం కోళ్లకు దాణాగా మారడం ఆందోళనకర పరిణామం. పేద ప్రజల కడుపు నింపాల్సిన రేషన్‌బియ్యం కోళ్లకు ఆహారంగా.. బీర్ల తయారీకి వినియోగించడం విడ్డూరం. పీడీ యాక్టు అమలులో తాత్సారం.. కఠినంగా వ్యవహరించకపోవడం అక్రమ దందాకు వరంగా మా రింది. రేషన్ బియ్యాన్ని పక్కదారి పట్టించే వారితో కొందరు అధికారుల ఉదాసీన వైఖరి, మామూళ్ల మాటున ప్రోత్సహించడం యథేచ్ఛగా దందా సాగడానికి ప్రధాన కారణం. పలువురు రేషన్ డీలర్లు కార్డుదారుల వేలిముద్ర తీసుకుని బియ్యం ఇచ్చినట్లు ఆన్లైన్ ప్రక్రియ చేపట్టడం, తీసుకున్న బియ్యాన్ని కార్డుదారులు దళారులకు విక్రయించడం అప్రతిహాతంగా సాగుతోంది.కిరాణా, రేషన్ దుకాణాలే అడ్డాలు..జిల్లాకేంద్రం నుంచి కుగ్రామం వరకు రేషన్ బియ్యం అక్రమ వ్యాపారం విరాజిల్లుతోంది. రేషన్ దుకాణాల్లో క్లోజింగ్ బ్యాలెన్స్(సీబీ) చూపించే వరకు బియ్యం నిల్వ చేసుకునే అవకాశముండగా సీబీలోపు పక్కదారి పట్టిస్తున్నారు. వేలిముద్ర వేసి వెళ్లినవారి బియ్యానికి ప్రత్యేక రిజిష్టర్ ఏర్పాటు చేసుకుని లెక్కలు వేసుకున్న అనంతరం దళారులు, మిల్లర్లకు అంటగడుతున్నారు. దళారులు కొనుగోలు చేసే బియ్యాన్ని రహస్య ప్రాంతాల్లో నిల్వ చేస్తుండగా పలువురు నేరుగా ఇతర ప్రాంతాలకు తరలించేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కిరాణ దుకాణ నిర్వాహకులు కూడ రేషన్ బియ్యాన్ని కొనుగోలు చేసి నిల్వ చేస్తుండగా అనుకూల సమయాల్లో దళారులకు విక్రయిస్తున్నారు.దళారులు పుట్టుకొస్తున్నారు..చోటామోటా బియ్యం డాన్లతో పాటు భారీ డాన్ల సంఖ్య పెరుగుతుందే తప్ప తగ్గకపోవడం సంబంధిత అధికారులు వ్యవహరిస్తున్న తీరు, వట్టి కేసులే కారణమనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. దందా చేసే అక్రమార్కులపై పదుల సంఖ్యలో కేసులున్నప్పటికి కఠినశిక్షలు లేకపోవడంతో మళ్లీ అదే దందా సాగిస్తున్నారు. పీడీయాక్టు అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా నిర్దేశించినా తదనుగుణ చర్యలకు నిబంధనలు ప్రతికూలమనే కుంటిసాకులతో 6ఏ కేసులతోనే సరిపుచ్చుతున్నారన్న ఆరోపణలు కోకొల్లలు. కాగా రేషన్ బియ్యం పక్కదారి పట్టించేవారెవరైనా వదిలేదిలేదని పౌరసరఫరాలశాఖ, విజిలెన్స్, టాస్క్‌ఫోర్స్ అధికారులు స్పష్టం చేస్తున్నారు.అక్రమ ఆదాయానికి అనేక మార్గాలు..సేకరించిన రేషన్ బియ్యాన్ని అక్రమార్కులు పలుదారుల్లో విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. వానాకాలం, యాసంగి సీజన్లలో సీఎంఆర్ విధానం కొనసాగడం పరిపాటి. ఇదే సమయంలో పలువురు మిల్లర్లు దళారులను ఏర్పా టు చేసుకుని బియ్యం కొనుగోలు చేసి సీఎంఆర్‌గా ప్రభుత్వానికి అప్పగిస్తున్నారు. ఎవరైనా తనిఖీలకు వస్తే తమకున్న సంబంధంతో బయటకు పొక్కకుండా చూస్తున్నారు.తినుబండారాల తయారీ కేంద్రాలకు బియ్యం తరలుతోంది. తక్కువ ధరకు లభ్యమవడంతో వీటికే మొగ్గు చూపుతున్నారు.కాలక్రమేణ టిఫిన్ సెంటర్లు ఇబ్బడిముబ్బడిగా వెలుస్తుండగా సదరు కేంద్రాలకు ఇవే బియ్యం సరఫరా చేస్తున్నారు. దోశ, ఇడ్లీ, వడ ఇతర వాటిలో వీటినే కలిపేస్తుండగా పలువురు నిర్వాహకులు తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం గడిస్తున్నారు.కోళ్ల ఫారాలకు తరలింపు ఎక్కువైంది. మక్కల ధరలు ఎక్కువగా ఉండటంతో చాలామంది యజమానులు తక్కువ ధరకు వస్తున్న బియ్యాన్ని కొనుగోలు చేస్తున్నారు.బీర్లు తయారీ చేసే పరిశ్రమలకు రేషన్ బియ్యాన్ని తరలిస్తున్నారు. గతంలో పట్టుబడిన కేసుల్లో 20కి పైగా ఇలాంటి రవాణానేనని పౌరసరఫరాలశాఖలోని ఓ అధికారి వివరించారు.సన్నరకాల దిగుబడి తక్కువగా ఉండటం సన్నబియ్యం ఆశించినస్థాయిలో లేకపోవడం రేషన్ బియ్యాన్నే ఫాలిష్ చేసి కలుపుతున్నారని సమాచారం. అనుకూల అధికారుల సహకారంతో బియ్యాన్ని మçహారాష్ట్రకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. అక్కడి ప్రజలు దొడ్డుబియ్యాన్ని అమితంగా ఇష్టపడుతారు. అక్కడ కిలో రూ.26–30 వరకు ధర పలుకుతుండటంతో భారీగా ఆదాయం గడిస్తున్నారు.ఇవి చదవండి: నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌మార్కెట్ సూచీలు -
మాఫీకి మార్గం చూడండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టు 15లోగా రైతు రుణమాఫీ చేసి తీరాల్సిందేనని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. అందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రస్తుత ఆర్థిక పరిస్థితి, ఆదాయ వ్యయాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల కోడ్ ముగిసేలోపు రుణమాఫీకి అవసరమైన నిధులను సమీకరించేందుకు ఉన్న మార్గాలపై చర్చించారు. రూ.2 లక్షల వరకు రుణమాఫీకి సంబంధించిన విధి విధానా లతో ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. బుధవారం సచివాలయంలో మంత్రులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, తన సలహాదారు వేం నరేందర్ రెడ్డితో కలిసి రైతు రుణమాఫీ, ధాన్యం కొనుగోళ్లపై సీఎం సమీక్షించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు.ఇతర రాష్ట్రాల్లో అధ్యయనం చేయండి‘రైతుల సంక్షేమానికి అవసరమైతే ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి రుణమాఫీకి సరిపడా నిధులను సర్దుబాటు చేయాలి. రైతులను రుణ విముక్తులను చేయాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నందున, నిర్ణీత గడువులోగా నిధులను సమీకరించే ప్రయత్నాలు పూర్తి చేయాలి. భారీ మొత్తంలో నిధులు ఇచ్చేందుకు ముందుకు వచ్చే బ్యాంకర్లతో సంప్రదింపులు జరపాలి. రైతు రుణమాఫీకి సంబంధించి మహారాష్ట్ర, రాజస్తాన్, ఇతర రాష్ట్రాల్లో అనుసరించిన విధానాలను అధ్యయనం చేయాలి..’ అని రేవంత్ ఆదేశించారు. ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచండి‘ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలి. దళారుల జోక్యం లేకుండా చూడాలి. రైతు నుంచి పంటను కొని మిల్లింగ్ చేసి రేషన్ షాపుల్లో సన్న బియ్యం అందించేలా చర్యలు తీసుకోవాలి. వర్షాకాలం ప్రారంభానికి ముందే ధాన్యం కొనుగోలు ప్రక్రియను పూర్తి చేయాలి. కల్లాల వద్ద రైతులు ఇబ్బంది పడకుండా త్వరగా ధాన్యం కొనాలి. తడిసిన ధాన్యం, తేమ విషయంలో రైతులకు ఇబ్బంది కలుగకుండా చూడాలి. అక్రమాలకు పాల్పడే రైస్ మిల్లర్లపై ఉక్కు పాదం మోపాలి..’ అని సీఎం ఆదేశించారు. -
పందికొక్కులు మీరు, మీ బాబే
సాక్షి, అమరావతి: పెరిగిన కార్డులను ఒప్పుకోరు. అత్యంత నాణ్యతతో ఇస్తున్న సరుకులను చూడరు. దాదాపుగా రెట్టింపైన సబ్సిడీ గానీ... ఇంటి ముంగిటకే వస్తున్న రేషన్ డెలివరీ గానీ... ఇవేవీ ‘నంగనాచి రామోజీ’కి పట్టవు! ఐదేళ్ల జగన్ ప్రభుత్వం 162.15 లక్షల టన్నుల బియ్యం, 3.28 లక్షల టన్నుల చక్కెర, 3.28 లక్షల టన్నుల కందిపప్పు పంపిణీకి రూ.28,491 కోట్లు ఖర్చు చేసినా సరే...రామోజీకి మాత్రం రేషన్ వ్యవస్థ గాడితప్పినట్టు కనిపిస్తోంది. చంద్రబాబు హ యాంలో కేవలం 117.45 లక్షల టన్నుల బియ్యం, 3.15 లక్షల టన్నుల చక్కెర, 0.93 లక్షల టన్నుల కందిపప్పు పంపిణీకి రూ.15,356 కోట్లు ఖర్చు చేస్తే అదేదో ఘనకార్యంగా ఈనాడు కీర్తిస్తోంది. భాషా విచక్షణ కోల్పోయిన రామోజీ పరమ నీచపు రాతలు రాస్తున్నారు. ‘గాదె కింద పందికొక్కు.. కోతవేసే పప్పూ..ఉప్పు!’ అంటూ మంగళవారం ఈనాడులో రేషన్ పంపిణీపై దగాకోరుభాషను వాడారు. అప్పట్లో.. రేషన్ కోసం ఫీట్లు..అగచాట్లు... చంద్రబాబు ప్రభుత్వం దిగిపోయే నాటికి 1.39 కోట్ల కార్డులు మిగిలాయి. సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వంలో అర్హతే ప్రామాణికంగా నిర్దేశించి, పార్టీల కతీతంగా కార్డులు ఇవ్వడంతో రాష్ట్రంలో 1.49 కోట్లకు కార్డుల సంఖ్య పెరిగింది. చంద్రబాబు హయాంలో ముక్కిపోయిన, పురుగుల పట్టిన, రాళ్లు, నూకలు ఎక్కువగా ఉన్న బియ్యాన్ని ఇస్తే తినలేక జనం బియ్యం జోలికే పోయేవారు కాదు. జగన్ ప్రభుత్వంలో ఇప్పుడిస్తున్నది నాణ్యమైన సార్టెక్స్ బియ్యం. అప్పట్లో నాసిరకం బియ్యాన్నే లబ్ధిదారుల నుంచి బాబు బినామీలు తమ దళారులతో పదీ పరక్కు కొనుగోలు చేసి అక్రమ రవాణా ద్వారా రూ.కోట్ల ప్రజాధనాన్ని మింగేసేవారు. వాస్తవానికి జాతీయ ఆహార భద్రత చట్టం కింద 2.68 కోట్ల మందికి 1.54 లక్షల టన్నులు మాత్రమే కేంద్రం బియ్యాన్ని పంపిణీ చేస్తుంటే.. మిగిలిన 1.68 కోట్ల మంది లబి్ధదారులకు సీఎం జగన్ ప్రభుత్వం సొంత ఖర్చుతో 0.81 లక్షల టన్నుల బియ్యాన్ని అందిస్తోంది. హెరిటేజ్ కోసమే పండగ కానుకలు.. చంద్రబాబు ప్రభుత్వం పండగల పేరుతో ప్రజా పంపిణీ వ్యవస్థను హెరిటేజ్‌కు దోచిపెట్టడానికి.. తమ అనుయాయులు స్వాహా చేయడానికే ఉపయోగించుకుంది. నిబంధనలకు విరుద్ధంగా.. టెండర్లు లేకుండా ఇష్టమొచ్చిన ధరలకు అప్పటి ప్రభుత్వానికి సరుకులు సరఫరా చేసిన బాబు అనుయాయులు ప్రజాధనాన్ని మింగేశారు. దీనిపై విజిలెన్స్ విచారణ జరుగుతోంది. 2013లో అప్పటి ప్రభుత్వం తెల్ల కార్డుదారులకు ఇచ్చే 9 రకాల నిత్యావసరాల్లో పామాయిల్ ఉండేది. బాబు ప్రభుత్వం దీన్ని తొలగించింది. కందిపప్పు పంపిణీ నాడు ఎన్నికల డ్రామా వాస్తవానికి టీడీపీ ప్రభుత్వం జూన్ 2014 సెపె్టంబర్ నుంచి 2015 జూలై వరకు అసలు కందిపప్పు గురించి పట్టించుకోలేదు. నవంబర్ 2016 నుంచి ఫిబ్రవరి 2018 వరకు గిరిజన ప్రాంతాల్లో మాత్రమే కిలో రూ.40 చొప్పున పంపిణీ చేసింది. 2017–18లో ఎక్కడా పంపిణీ చేయలేదు. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో మార్చి 2018 నుంచి రెండు కిలోల కందిపప్పు పేరిట పంచి మభ్యపెట్టే ప్రయత్నం చేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఓపెన్ మార్కెట్లో హెచ్చురేటు ఎంత ఉన్నా, సబ్సిడీ భారాన్ని భరిస్తూ రూ.67కే అందిస్తోంది. ఇదీ.. బాబు చిరుధాన్యాల గుట్టు టీడీపీ ప్రభుత్వం దిగిపోయే సమయంలో రాగులు, జొన్నలు, గోధుమ పిండి, ఉప్పు పంపిణీ ప్రారంభించింది. 1.39 కోట్ల కార్డుల్లో కేవలం 1 శాతానికే వీటినిచి్చనా... అబ్బో అంటున్నారు రామోజీ. ఎన్నికల భయంతో ప్రజలను మభ్యపెట్టేందుకు చివరి సంవత్సరంలో టీడీపీ పంపిణీ చేసిందీ చిరు ధాన్యాల్ని. జగన్ ప్రభుత్వం కరోనా తర్వాత వినియోగదారులకు పౌష్టికాహారం పంపిణీలో భాగంగా ఉత్తరాంధ్రలో రాగులు, రాయలసీమలో రాగులు, జొన్నల పంపిణీకి శ్రీకారం చుట్టింది. రేషన్‌లో కిలో బియ్యం బదులు కిలో రాగులు, జొన్నలు ఉచితంగా అందిస్తోంది. -
రేషన్ బియ్యం రీసైక్లింగ్ ఆగేనా?
సాక్షి, హైదరాబాద్: రేషన్ బియ్యం పక్కదారి పడుతున్న తీరుపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుతీరిన వెంటనే పౌరసరఫరాల సంస్థ తీరు పై సమీక్షించిన పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి... పీడీ ఎస్ బియ్యం సరఫరా తీరుతెన్నుల గురించి ప్రత్యేకంగా వా కబు చేశారు. అయితే ప్రతి నెలా పేదలకు పంపిణీ అవుతు న్న 1.80 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యంలో ఏకంగా 70 శా తం వరకు బియ్యం పక్కదారి పడుతోందని అధికారులు మంత్రికి వివరించినట్లు తెలిసింది. పీడీఎస్ బియ్యంలో నాణ్యత లోపించడం వల్లే ఇలా జరుగుతోందని తేల్చిన మంత్రి దీనికి ప్రధాన కారణం మిల్లర్లేనని సమావేశంలోనే చెప్పారు. హుజూర్నగర్ నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న ఉత్తమ్‌కు ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని కొందరు మిల్లర్ల చేతివాటం గురించి పూర్తి అవగాహన ఉండటంతో ఆయన ఈ అంశాన్ని తొలి ప్రాధాన్యతగా తీసుకున్న ట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే సోమవారం హుజూర్‌నగర్‌లోని చౌకధరల దుకాణాన్ని తనిఖీ చేసిన ఆయన... రేషన్ బియ్యం దురి్వనియోగంపై ఆందోళన వ్యక్తం చేశారు. నాణ్యమైన పీడీఎస్ రైస్ సరఫరా చేయడంతోపాటు బియ్యం పక్కదారి పట్టడాన్ని నిలువరించడంపై దృష్టి పెట్టారు. మిల్లర్ల కొనుగోళ్ల చక్రం! రాష్ట్రంలోని 90.14 లక్షల ఆహార భద్రతా కార్డులకుగాను 2.83 కోట్ల మంది లబ్ధిదారులున్నారు. వారికి ప్రతినెలా 6 కిలోల చొప్పున 1.80 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ చేస్తున్నారు. ఈ బియ్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏటా రూ. 3,580 కోట్లు రాయితీ కింద వెచ్చిస్తోంది. అంటే నెలకు రూ. 298 కోట్లు. మొత్తంగా కిలో బియ్యానికి సగటున రూ. 39 వెచ్చిస్తూ సరఫరా చేస్తున్న ఈ బియ్యాన్ని కార్డుదారులకు ఒక్కో యూనిట్ (ఒక్కొక్కరికి)కి నెలకు 6 కిలోల చొప్పున పంపిణీ చేస్తోంది. అయితే ఈ బియ్యాన్ని కార్డుదారుల్లో కొందరు తిరిగి రేషన్ దుకాణాల్లోనే విక్రయించే విచిత్ర పరిస్థితి కొనసాగుతోంది. కార్డుదారుల నుంచి కిలోకు రూ. 6–9 వరకు చెల్లించి కొందరు రేషన్ దుకాణదారులు కొంటుండగా వారి నుంచి కిలోకు రూ. 10–13 చెల్లించి దళారులు కొనుగోలు చేసి రైస్‌మిల్లులకు పంపుతున్నట్లు తెలుస్తోంది. పక్క రాష్ట్రాలకు సరిహద్దులుగా ఉన్న ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్ వంటి జిల్లాల్లో రేషన్ డీలర్లు బియ్యాన్ని దళారుల ద్వారా ఆయా రాష్ట్రాల్లో కిలో రూ. 20 చొప్పున అమ్ముకుంటున్నట్లు సమాచారం. ఈ తతంతంలో కొందరు అవినీతి అధికారుల పాత్ర కూడా ఉందని.. డీలర్లు, దళారుల నుంచి మామూళ్లు తీసుకొని బియ్యం అక్రమ రవాణాకు సహకరిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఐపీఎస్ అధికారి నియామకంతో... ఈ నేపథ్యంలోనే పౌరసరఫరాల శాఖ కమిషనర్‌గా ఐపీఎస్ అధికారి డీఎస్ చౌహాన్‌ను ప్రభుత్వం నియమించడంతో అక్రమాలకు అడ్డుకట్ట పడుతుందని భావిస్తున్నారు. సీఎం రేవంత్‌తోపాటు మంత్రి ఉత్తమ్ కూడా కమిషనర్‌కు ఈ మేరకు ఆదేశాలిచ్చినట్లు తెలిసింది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన చౌహాన్‌కు గతంలో ఎఫ్‌సీఐలో పనిచేసిన అనుభవం ఉంది. రీసైక్లింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు మంత్రి ఉత్తమ్ హెచ్చరిక హుజూర్‌నగర్‌లోని ఓ రేషన్ దుకాణం తనిఖీ హుజూర్నగర్: రేషన్ బియ్యం రీసైక్లింగ్ చేస్తే కఠిన చర్యలు తప్పవని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హెచ్చరించారు. ప్రభుత్వం కిలో బియ్యానికి రూ. 39 ఖర్చుపెట్టి కొనుగోలు చేసి పేదలకు ఉచితంగా ఇస్తోందని, ఆ బియ్యాన్ని మిల్లర్లుగానీ, ఇతరులెవరైనా రీసైక్లింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. సోమవారం ఆయన సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లోని 33వ నంబరు రేషన్ షాపును తనిఖీ చేశారు. రేషన్ బియ్యం నాణ్యతను పరిశీలించి డీలర్ల కష్టనష్టాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఉత్తమ్ మాట్లాడుతూ.. కొందరు రేషన్ బియ్యాన్ని కోళ్ల దాణాకు, బీర్ల తయారీకి అమ్ముతున్నారని చెప్పారు. కొన్ని జిల్లాల్లో కొందరు రేషన్ బియ్యాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేసి వాటిని పాలిష్ చేయించి తిరిగి వాటినే ప్రభుత్వ (ప్రొక్యూర్మెంట్) సేకరణకు ఇస్తున్న విషయం తన దృష్టికి వచ్చిందన్నారు. ఇది గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిందని, మాఫియాలా కొనసాగుతోందని మండిపడ్డారు. ఇక నుంచి రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందాకు అడ్డుకట్ట వేస్తామన్నారు. గత ప్రభుత్వ నిర్వాకం వల్లే నష్టాలు... గత బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్యం, నిర్వాకం వల్లే పౌరసరఫరాల సంస్థ రూ. 56 వేల కోట్ల అప్పుల్లో, రూ. 11 వేల కోట్ల నష్టాల్లో ఉందని మంత్రి ఉత్తమ్ ఆరోపించారు. అప్పులపై ఏటా రూ. 3 వేల కోట్ల వడ్డీ కట్టాల్సి వస్తోందని చెప్పారు. గత ప్రభుత్వం రైస్ మిల్లర్ల దగ్గర రూ. 22 వేల కోట్ల విలువైన ధాన్యం నిల్వలు పెట్టడంపై సమీక్షిస్తున్నామని... మిల్లర్ల దగ్గర ఉన్న ధాన్యం రికవరీకి తక్షణమే చర్యలు తీసుకుంటున్నామని ఉత్తమ్ తెలిపారు. ధాన్యం సేకరణ పద్ధతులను, రేషన్ వ్యవస్థను మెరుగుపరిచే ప్రయత్నం చేస్తున్నామన్నారు. మంత్రి వెంట ఐఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యరగాని నాగన్న తదితరులు ఉన్నారు. -
కేంద్రం కీలక నిర్ణయం.. రేషన్ కార్డుదారులకు శుభవార్త!
రేషన్ కార్డ్ లబ్ధిదారులకు కేంద్రం శుభవార్త చెప్పింది. ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన (పీఎంజీకేఏవై) పథకాన్ని పొడిగిస్తూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దీంతో ఈ పథకం కింద 81 కోట్ల మంది రేషన్ కార్డ్ దారులకు మరో ఐదేళ్లు రేషన్‌ను ఉచితంగా అందిచనుంది. ఇటీవల ఇటీవల ఛత్తీస్‌గఢ్ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ఈ ఏడాది డిసెంబర్ 31తో ముగియనున్న పీఎంజీకేఏవై పథకాన్ని మరో ఐదేళ్ల పాటు పొడిగిస్తామని స్వయంగా ప్రకటించారు. ఈ క్రమంలోనే తాజాగా కేంద్ర కేబినెట్ దీనికి ఆమోదం తెలిపింది. కేబినెట్ నిర్ణయాలపై మీడియా సమావేశంలో కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు. కోవిడ్-19 మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో కేంద్రం పేదలకు అండగా నిలుస్తూ పీఎంజీకేఏవై పథకాన్ని ఏప్రిల్ 2020లో ప్రారంభించింది. ఈ స్కీంలో జాతీయ ఆహార భద్రతా చట్టం పరిధిలోకి వచ్చే ప్రజలకు ఉచిత రేషన్‌ను మూడు నెలల పాటు అందించింది. ఆ తర్వాత పొడిగిస్తూ వచ్చింది. ఈ డిసెంబర్ 31తో ఈ పథకం వ్యవధి ముగియనుండగా.. తాజాగా దీన్ని పెంచుతూ నిర్ణయం తీసుకుంది. -
రేషన్ బియ్యం అక్రమ రవాణా ఆటకట్టు
సాక్షి, అమరావతి: పేదల బియ్యాన్ని బొక్కే అక్రమార్కులపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కఠిన చర్యలు చేపడుతోంది. పటిష్ట చర్యలతో బియ్యం అక్రమ రవాణాకు చెక్ పెడుతోంది. ప్రజా పంపిణీ వ్యవస్థను మరింత సమర్ధవంతంగా నిర్వహిస్తోంది. చౌక ధరల దుకాణాల ద్వారా పేదలకు పంపిణీ చేసే నిత్యావసరాలను దారిమళ్లించడం, దుర్వినియోగానికి పాల్పడిన వారిపై 6ఏ కేసులతో పాటు క్రిమినల్ కేసులు కూడా నమోదు చేస్తోంది. ఇప్పుడు దీర్ఘకాలికంగా బియ్యాన్ని బ్లాక్ మార్కెటింగ్ చేస్తూ, తరచూ పట్టుబడిన వ్యక్తులపై పీడీ యాక్టును ప్రయోగిస్తోంది. ప్రత్యేక కార్యాచరణతో సత్ఫలితాలు గతంలో రేషన్ బియ్యం విచ్చలవిడిగా అక్రమ రవాణా జరిగేది. వందల టన్నుల బియ్యం సరిహద్దులు దాటేసేది. మరోపక్క పేదలు తినే బియ్యంపై కొందరు అసత్య ప్రచారం చేసి, వాటిని తక్కువ రేటుకు కొని, తిరిగి పాలిష్ పట్టి మార్కెట్లోకి తెచ్చి అధిక ధరలకు అమ్మి సొమ్ము చేసుకునేవారు. లారీలతో లోడ్లు తరలిపోతున్నా కేసులే నమోదయ్యేవి కావు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇటువంటి అక్రమార్కుల ఆట కట్టిస్తోంది. రేషన్ బియ్యం రవాణాపై నిఘాను పటిష్టం చేసింది. అంతర్రాష్ట్ర సరిహద్దులు, మండల నిల్వ పాయింట్లు, చౌక దుకాణాలు, ఎండీయూ వాహనాలపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ నిరంతర నిఘా పెట్టడంతో చాలా వరకు అక్రమ రవాణా తగ్గింది. రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాది ఏప్రిల్ వరకు 743 మందిని అరెస్టు చేసింది. నిత్యావసర వస్తువుల చట్టం – 1955 సెక్షన్ 6ఏ ప్రకారం అక్రమ రవాణాలో పట్టుబడిన సరకులు, వాహనాలను స్వాధీనం చేసుకొని, కేసులు నమోదు చేస్తోంది. ఈ కేసులు సత్వరం పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకొని, అక్రమార్కులకు త్వరితగతిన శిక్షలు పడేలా చేస్తోంది. పట్టుబడిన బియ్యాన్ని వెంటనే తిరిగి పీడీఎస్, మార్కెట్లోకి తెస్తోంది. ఇందుకోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. జిల్లాల్లో బియ్యం అక్రమరవాణాలో పట్టుబడ్డ సరుకు నిల్వల విలువ రూ.50 లక్షల లోపు ఉంటే జేసీలు, అంతకు పైబడి ఉంటే కలెక్టర్లకు కేసుల పరిష్కార బాధ్యతలను అప్పగించింది. ఫలితంగా ఏళ్లు తరబడి సీజ్ చేసిన సరుకు ముక్కిపోయి, పురుగులు పట్టి పాడవకుండా బహిరంగ వేలం ద్వారా వెంటనే తిరిగి మార్కెట్లోకి తెస్తోంది. ఇలా గడిచిన నాలుగేళ్లలో 6ఏ కేసులు 8,696 నమోదు చేస్తే, వాటిల్లో 4,565 కేసులను పరిష్కరించింది. మొత్తం 4.70లక్షల క్వింటాళ్ల స్టాక్‌ను స్వాధీనం చేసుకోగా, 2.82 లక్షల క్వింటాళ్ల బియ్యాన్ని తిరిగి పీడీఎస్, మార్కెట్లోకి తీసుకొచ్చింది. రియల్ టైం మానిటరింగ్ 6ఏ కేసుల స్థితిగతులను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో పర్యవేక్షించేందుకు పౌర సరఫరాల శాఖ ప్రత్యేక యాప్‌ను అభివృద్ధి చేసింది. కేసు నమోదు చేసిన వెంటనే సీజ్ చేసిన స్టాక్ వివరాలను ఇందులో అప్లోడ్ చేస్తారు. జిల్లాలు, తేదీలు, నెలలవారీగా నమోదైన కేసులు, పరిష్కరించినవి, సీజ్ చేసిన స్టాకు, బయటకు విడుదల చేసిన స్టాక్ వివరాలను రియల్ టైమ్ మానిటరింగ్ చేసేలా ప్రత్యేక వ్యవస్థను రూపొందించారు. పీడీఎస్ బియ్యాన్ని దారి మళ్లించి, వాటిని రీసైక్లింగ్ చేసి కస్టమ్ మిల్లింగ్ రైస్ కింద చూపించడం, పాలిష్ పట్టి కొత్త ప్యాకింగ్‌లో మార్కెట్లో విక్రయించడాన్ని సంపూర్ణంగా నిరోధించే ప్రయత్నం చేస్తోంది. పటిష్ట నిఘాతో అక్రమ రవాణా కట్టడి ఇప్పటి వరకు అక్రమ రవాణా చేస్తూ పట్టుబడ్డ బియ్యాన్ని సీజ్ చేసి పక్కన పెట్టేవారు. వాటిని పట్టించుకోకపోవడంతో తినడానికి పనికిరాకుండా పాడయ్యేవి. ఈ క్రమంలోనే మేము 6ఏ కేసుల పరిష్కారంపై దృష్టి పెట్టాం. కేసులు వేగంగా పరిష్కారమయ్యేలా పర్యవేక్షిస్తున్నాం. దీనికి తోడు బ్లాక్ మార్కెట్ దందాకు పాల్పడే వారిని పీడీ యాక్టులో పెడుతున్నాం. పటిష్ట నిఘా ఉంది కాబట్టే కేసులు నమోదవుతున్నాయి. అంతేగానీ అక్రమ రవాణా జరిగిపోతున్నట్టు కాదు. – హెచ్.అరుణ్ కుమార్, కమిషనర్, పౌరసరఫరాల శాఖ -
ఈకేవైసీ తప్పనిసరి..
నాగర్‌కర్నూల్: రేషన్ బియ్యం పక్కదారి పట్టకుండా ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపడుతోంది. ఆహార భద్రతా కార్డుల్లో అనర్హుల పేర్లను తొలగించి నిజమైన పేదలకే రేషన్ సరుకులు అందేలా కృషిచేస్తోంది. దీనికోసం ఈకేవైసీ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువచ్చింది. ఈ నేపథ్యంలో కార్డులో పేరు ఉన్న కుటుంబీకులంతా రేషన్ దుకాణాలకు వెళ్లి ఈకేవైసీ చేయించుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. గత కొన్నేళ్లుగా రేషన్‌కార్డులకు సంబంధించి తనిఖీలు చేయకపోవడంతో కొన్నిచోట్ల అనర్హులకు, చనిపోయిన వారి పేరుపై కూడా రేషన్ సరుకులు అందుతున్నాయి. దీంతో రేషన్ కార్డులో ఉన్న ప్రతిఒక్కరూ ఈకేవైసీ నమోదు చేయించుకుంటే అర్హులు, చనిపోయిన వారి విషయంలో స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది. దీంతో జిల్లాలో రేషన్ డీలర్లు ఈ ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించారు. రేషన్ డీలర్ల వద్ద ఉన్న ఈ పాస్ మిషన్ల ద్వారా డీలర్లు ఈకేవైసీ చేస్తున్నారు. ఇలా చేసుకోవాలి.. రేషన్ కార్డులో పేరున్న కుటుంబీకులంతా చౌకధర దుకాణానికి వెళ్లి ఈ–పాస్ మిషన్‌లో వేలిముద్ర వేయాలి. వేలిముద్ర వేయగానే లబ్ధిదారుడి ఆధార్ నంబర్ వస్తుంది. మిషన్‌లో గ్రీన్‌లైన్ వస్తే ఈకేవైసీ ప్రక్రియ పూర్తయినట్లు.. రెడ్‌లైన్ వస్తే రేషన్ కార్డులో పేరున్న వ్యక్తి ఆధార్ మ్యాచ్ కాలేదని ఈకేవైసీ రిజక్ట్ అవుతుంది. అలాంటి వారి పేర్లను రేషన్ కార్డు నుంచి తొలగిస్తారు. ఇందుకోసం కార్డులో పేరున్న వ్యక్తులంతా రేషన్ దుకాణానికి వెళ్లి వేలి ముద్రలు ఇవ్వాల్సి ఉంటుంది. ఎవరు వెళ్లకున్నా వారిని రేషన్ కార్డు నుంచి తొలగిస్తారు. జిల్లా పరిధిలో ఇలా.. జిల్లాలో ప్రస్తుతం 2,38,052 రేషన్ కార్డులు ఉండగా.. ఇందులో 18,621 అంత్యోదయ కార్డులు, 40 అన్నపూర్ణ, సాధారణ రేషన్ కార్డులు 2,19,272 కార్డులు ఉన్నారు. అంత్యోదయ కార్డు ఉన్న వారికి కుటుంబానికి 35 కిలోలు, అన్నపూర్ణ కార్డు ఉన్నవారికి 10 కిలోలు ఉచితంగా ఇస్తున్నారు. జిల్లాలో ఉన్న రేషన్ కార్డు లబ్ధిదారుల కోసం నెలకు 4,861 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని జిల్లాకు కేటాయిస్తున్నారు. ఇప్పటికే ఈకేవైసీ ప్రక్రియ జిల్లాలో మందకొడిగా కొనసాగుతుంది. ఈ విషయమై పెద్దగా అవగాహన లేకపోవడంతో లబ్ధిదారులు ముందుకు రావడం లేదు. దీనిపై ప్రభుత్వంతోపాటు.. అధికారులు సైతం క్షేత్రస్థాయిలో లబ్ధిదారులకు అ వగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లబ్ధిదారులు 7,52,628 మొత్తం రేషన్ కార్డులు 2,38,052 ఇంకా చేయాల్సింది 6,27,089 ఈకేవైసీ పూర్తిచేసిన వారు : 1,25,539 అవగాహన కల్పిస్తాం.. కుటుంబ యజమానితోపాటు రేషన్ కార్డులో పేరున్న ప్రతిఒక్కరూ వేలిముద్రలు వేసి ఈకేవైసీ చేయించుకోవాలి. రేషన్ షాపుల్లోనే ఈ–పాస్ మిషన్ ద్వారా ఈ ప్రక్రియ పూర్తవుతుంది. అనర్హులను గుర్తించేందుకే ఈ ప్రక్రియ చేపట్టడం జరిగింది. ఈకేవైసీ చేయించుకోకుంటే రేషన్ కార్డు నుంచి పేర్లు తొలగిస్తాం. ఈ విషయమై ప్రజలకు అవగాహన కల్పించేలా చూస్తాం. – స్వామికుమార్, డీఎస్ఓ -
ఒక్క గింజా వదలం.. నయా పైసా పోనియ్యం
సాక్షి, హైదరాబాద్: కస్టమ్ మిల్లింగ్ కోసం మిల్లర్లకు కేటాయించిన ధాన్యంలో ఒక్క గింజను వదులుకోబోమని, ఒక్క రూపాయిని కూడా ఊరికే పోనివ్వ మని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. ధాన్యం అమ్ముకునే మిల్లర్లను, రేషన్ బియ్యం పక్కదారి పట్టడాన్ని గుర్తించి సమాచారం అందించిన పౌరులకు సైతం రివార్డులు అందజేయడంతోపాటు వారి వివరాల్ని గోప్యంగా ఉంచుతామన్నారు. శుక్రవారం పౌర సరఫరాల శాఖ, సంస్థల అధికారులతో హైదరాబాద్ లో సమీక్షా సమావేశం నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ సూర్యాపేట, నల్గగొండ, వనపర్తి, మెదక్, నిజామాబాద్, కామారెడ్డి, కరీంనగర్, సిరిసిల్ల, పెద్దపల్లి, జగిత్యాల జిల్లాల్లోనే అధికంగా మిల్లర్లు అక్రమాలకు పాల్పడుతున్నారని, సీఎంఆర్ అప్పగింతలో కూడా ఈ జిల్లాల్లో డిఫాల్టర్లు అధికంగా ఉన్నారని వెల్లడించారు. ఈ మేరకు ఆయా జిల్లాల్లో పటిష్టమైన టాస్క్‌ఫోర్స్‌ను తక్షణమే ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. మిగతా అన్ని జిల్లాల్లోనూ రిటైర్డ్ పోలీస్, రెవెన్యూ ఉన్నతాధికారులతో కట్టుదిట్టమైన టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఆరు రెట్లు ధాన్యం దిగుబడి.. రెండు రెట్లు మాత్రమే పెరిగిన మిల్లింగ్ కెపాసిటీ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ వ్యవసాయ అభివృద్ధికి చేసిన కృషితో 24 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి 141 లక్షల మెట్రిక్ టన్నులకు ధాన్యం సేకరణ పెరిగిందని మంత్రి కమలాకర్ తెలిపారు. ఆరింతలుగా పెరిగిన ఈ ధాన్యం సేకరణకు అనుగుణంగా మిల్లింగ్ కెపాసిటీ పెరగలేదని, కేవలం గతానికి ఇప్పటికి 2 రెట్లు మాత్రమే పెరిగిందన్నారు. అందువల్ల మిల్లర్లకు అదనంగా ధాన్యం కేటాయింపులు చేయడం జరుగుతుందని, ఇదే అదనుగా కొన్ని చోట్ల మిల్లర్లు ధాన్యాన్ని పక్కదారి పట్టిస్తున్న ట్టు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఇలాంటి వారిపై క్రిమినల్ కేసులతోపాటు రెవెన్యూ రికవరీ యాక్ట్ ను ప్రయోగించి 125 శాతం నగదు రికవరీ చేస్తా మని తెలిపారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా మిల్లర్ల నుంచి 90 శాతం రికవరీ చేశామని, మిగతా పది శాతం సైతం రికవరీ చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇటీవల పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌లో ఎంఎల్ఎస్ పాయింట్ నుంచి రెండు లారీ ల బియ్యం మిల్లుకు అక్రమంగా తరలిస్తుండగా, విజిలెన్స్ బృందాలు పసిగట్టి పట్టుకున్నాయని చెప్పారు. పెద్దపల్లితో పాటు సూర్యాపేట, ఇతర జిల్లాల్లో జరిగిన బియ్యం అక్రమాలపై కూడా కేసులు బుక్ చేయనున్నట్లు మంత్రి తెలిపారు. ధాన్యం నిల్వ కోసం ఇంటర్మీడియట్ గోదాంలు ఈ యాసంగిలో ఇంటరీ్మడియట్ గోదాములను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు మంత్రి గంగుల తెలిపారు. సరిహద్దు రాష్ట్రాలైన కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లలో ఖాళీగా ఉన్న మిల్లింగ్ కెపాసిటీని వాడుకునేలా ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. సీఎంఆర్ డిఫాల్టర్లకు, అక్రమ మిల్లర్లకు ఈసారి ఒక్క గింజను కూడా కేటాయించబోమని చెప్పారు. సమీక్షలో పౌరసరఫరాల శాఖ కమిషనర్ అనిల్ కుమార్‌తో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మంత్రి గంగులను కలిసిన గెల్లు శ్రీనివాస్ సాక్షి, హైదరాబాద్: పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్‌గా నియమితులైన హుజూరాబాద్ నియో జకవర్గం బీఆర్ఎస్ నేత గెల్లు శ్రీనివాస్ యాదవ్ శుక్రవారం రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ నెల 15న ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమానికి హాజరు కావలసిందిగా ఆయన్ను కోరారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌ను అభినంస్తూ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాల్ని అధిరోహించాలని, సీఎం కేసీఆర్ అప్పగించిన బాధ్యతల్ని విజయవంతంగా నిర్వహించి రాష్ట్రాభివృద్ధికి కృషి చేయాలని గంగుల సూచించారు. -
ఇడ్లీ.. దోశ.. రీసైక్లింగ్! రేషన్ బియ్యం దందా.. ఖర్చు రూ.33.. అమ్మకం 8 కే!
బియ్యం సరిగా ఉడకట్లేదు.. ఈ చిత్రంలో ముద్దగా మారిన అన్నాన్ని చూపిస్తున్న మహిళ పేరు సమ్మెట లక్ష్మి. ఆమెది అదిలాబాద్ జిల్లా తాంసి గ్రామం. గత నెలలో రేషన్ షాపు ద్వారా తీసుకున్న దొడ్డు బియ్యం సరిగ్గా ఉడకట్లేదని ఆమె తెలిపింది. ఇలాంటి అన్నాన్ని ఎలా తినాలి? అని ప్రశ్నిస్తోంది. సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉచిత బియ్యం పంపిణీ లక్ష్యం నెరవేరడం లేదు. చౌకధరల దుకాణాల ద్వారా పంపిణీ చేస్తున్న ‘ఉచిత బియ్యం’ తినేందుకు లబ్ధిదారులు ఆసక్తి చూపించక పోవడమే ఇందుకు కారణం. తమకు ప్రతినెలా కోటా కింద వస్తున్న బియ్యంలో ఐదారు కిలోలు ఇంట్లో ఇడ్లీ, దోశల పిండి కోసం ఉపయోగిస్తూ మిగతావి రేషన్ డీలర్లకో, చిరువ్యాపారులకో లబ్ధిదారులు అమ్మేస్తున్నారు. డీలర్లు, వ్యాపారులు తాము కొంత లాభం చూసుకుని సేకరించిన బియ్యాన్ని మిల్లర్లకు విక్రయిస్తున్నారు. మిల్లర్లు వాటిని రీసైక్లింగ్ చేసి కస్టమ్ మిల్లింగ్ రైస్ కింద తిరిగి ప్రభుత్వానికే అంటగడుతూ అక్రమార్జనకు పాల్పడుతున్నారు. కిలో బియ్యం పంపిణీ చేసేందుకు ప్రభుత్వం రూ.32.94 ఖర్చు చేస్తోంటే, లబ్ధిదారులు ఆ బియ్యాన్ని అత్యంత చౌకగా రూ.8కి విక్రయిస్తుండటం విస్మయం కలిగిస్తుండగా.. రేషన్ బియ్యం నాసిరకంగా ఉంటూ వండితే అన్నం ముద్దగా మారుతుండటమే దీనికి ప్రధాన కారణమని తెలుస్తోంది. రైస్ బదులు క్యాష్ ప్రస్తుతం రేషన్ షాపుల్లో ఉచిత బియ్యానికి నగదు (డ్రా అండ్ క్యాష్) తంతు యథేచ్ఛగా సాగుతోంది. ఈ–పాస్ (బయోమెట్రిక్) ద్వారా కోటా బియ్యం పొందేందుకు లబ్ధిదారుల బయోమెట్రిక్/ఐరిస్ తప్పనిసరి కావడంతో ఈ–పాస్ ద్వారా ఆమోదం లభించగానే లబ్ధిదారుల అంగీకారంతో కొందరు డీలర్లు బియ్యం బదులు నగదు ముట్టజెబుతున్నారు. కరోనా కన్నా ముందు ఈ తరహా దందా 10 శాతం వరకు ఉండగా ఇప్పుడది 40 శాతానికిపైగా చేరినట్లు తెలుస్తోంది. మరోవైపు కొన్ని ప్రాంతాల్లో రేషన్ షాపుల సమీపంలో చిరు వ్యాపారులు నిరీక్షిస్తూ లబ్ధిదారులు కోటా బియ్యం తెచ్చుకోగానే వారి నుంచి చౌకగా కొనేస్తున్నారు. కొన్నిచోట్ల చిరు వ్యాపారులు ఇళ్ల వద్దకే వెళ్లి కొనుగోలు చేస్తున్నారు. కార్డు రద్దు కాకుండా ఉండేందుకే.. వాస్తవానికి పీడీఎస్ బియ్యం అవసరం లేకు న్నా చాలామంది లబ్ధిదారులు కేవలం రేషన్ కార్డు రద్దు కాకుండా ఉండేందుకే నెలసరి కోటా ను డ్రా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే.. ఈ–పాస్ ద్వారా వరుసగా 3 నెలలు సరుకులు డ్రా చేయకుంటే కార్డు రద్దవుతోంది. రేషన్ కా ర్డు బహుళ ప్రయోజనకారి కావడంతో ప్రజలు దానిని వదులుకునేందుకు ఇష్టపడటం లేదు. ఆర్థిక భారం నెలకు రూ.506 కోట్లు రాష్ట్రంలో ఉచిత బియ్యం పంపిణీ వల్ల ప్రస్తుతం ప్రతినెలా ప్రభుత్వంపై రూ.506.05 కోట్లపైనే ఆర్థికభారం పడుతోంది. ప్రభుత్వం పీడీఎస్ కింద కిలో బియ్యం పంపిణీకి రూ.32.94 ఖర్చుచేస్తోంది. వాస్తవంగా కిలో బియ్యానికి రూ.31 చొప్పున ధర వర్తింపజేస్తున్నప్పటికీ రవాణా, నిర్వహణ కలిపి కిలోపై అదనంగా రూ.1.94 ఖర్చవుతోంది. అన్నం ముద్దగా అవుతోందని.. ఖమ్మంకు చెందిన ఆటోడ్రైవర్ వెంకటస్వామి కుటుంబానికి ఆహార భద్రత (రేషన్) కార్డు ఉంది. అతనితో పాటు భార్య, నలుగురు పిల్లలు కార్డులో సభ్యులుగా ఉన్నారు. కుటుంబంలోని ఆరుగురు సభ్యులకు ప్రస్తుతం ఐదు కిలోల చొప్పున 30 కిలోల బియ్యం అందుతున్నాయి. అయితే అవి వండితే అన్నం ముద్దగా అవుతోందని దోశలు, ఇడ్లీల కోసం ఓ ఐదు కిలోల బియ్యం ఉంచుకుని మిగతావి కిలోకు రూ.8 చొప్పున డీలర్‌కే ఇచ్చేస్తున్నారు. డబ్బులిస్తే బాగుంటుంది.. ఉచిత బియ్యం తినేందుకు పనికిరాకుండా ఉన్నాయి. నాసిరకం బియ్యం ఇచ్చే బదులు సరిపడా డబ్బులిస్తే బాగుంటుంది. మంచి బియ్యం కొనుక్కొని తింటాం. -కావేరి, హస్తినాపురం, రంగారెడ్డి జిల్లా ఇడ్లీలు, దోశలకే వాడతాం రేషన్ బియ్యాన్ని ఇడ్లీలు, దోశలు, పిండి వంటలకే వాడతాం. మిగిలిన బియ్యం నిల్వ ఉంచితే పురుగులు పడతాయి. అందువల్లే ఇంటి వద్దకు వచ్చే చిరు వ్యాపారులకు అమ్మేస్తున్నాం. -శైలజ, మిర్యాలగూడ రేషన్ బియ్యం తినలేక.. పీడీఎస్ బియ్యం చాలావరకు ముక్కిపోయి, పురుగులు పట్టి ఉంటుండడం, వండితే అన్నం ముద్దగా కావడం, ఒకవేళ తింటే జీర్ణం కాకపోవడం వంటి కారణాలతోనే లబ్ధిదారులు రేషన్ బియ్యాన్ని తినేందుకు ఇష్టపడటం లేదని తెలుస్తోంది. కొందరు కేవలం ఇడ్లీలు, దోశలు, పిండివంటలకు మాత్రం కొంత బియ్యాన్ని వినియోగిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కొందరు పశువులకు కుడితి కింద ఉపయోగిస్తున్నారు. మిగతా బియ్యాన్ని అయినకాడికి అమ్మేసుకుంటున్నారు. ఇలా లబ్ధిదారుల నుంచి బియ్యం సేకరిస్తున్న డీలర్లు, చిరు వ్యాపారులు వాటిని బియ్యం ముఠాలకు లేదా మిల్లరకు చేరవేస్తున్నారు. లబ్ధిదారుల వద్ద కిలో రూ.8 చొప్పున కొంటున్నవారు..ముఠాలకు రూ.10–రూ.12 చొప్పున విక్రయిస్తున్నారు. ఆయా ముఠాలు పెద్దమొత్తంలో బియ్యం సేకరించాక వాటిని వాహనాల్లో రైస్‌మిల్లులకు తరలించి కిలోకు రూ.14–16 వరకు విక్రయించి సొమ్ము చేసుకుంటుండగా మిల్లర్లు వాటిని కస్టమ్ మిల్లింగ్ పేరుతో తిరిగి సర్కారుకే అంటగడుతున్నారు. తద్వారా మిల్లర్లు కిలోకు రూ.10 నుంచి రూ.12 వరకు దండుకుంటున్నట్టు తెలుస్తోంది. -
కస్టమ్ మిల్లింగ్‌పై స్పెషల్ ఫోకస్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందాను పూర్తిగా అరికట్టేందుకు పౌర సరఫరాల శాఖ చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలోనే కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్)పై పటిష్ట నిఘాను ఏర్పాటు చేసింది. రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లులకు తరలించి వాటిని బియ్యంగా మార్చే ప్రక్రియలోకి పీడీఎస్ బియ్యం వచ్చి చేరకుండా జాగ్రత్త పడుతోంది. దేశంలోనే తొలిసారిగా ఏపీలో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా సీఎంఆర్ మిల్లుల విద్యుత్ వినియోగం, కస్టమ్ మిల్లింగ్ జరిగిన బియ్యం పరిమాణాన్ని ఎప్పటికప్పుడు బేరీజు వేస్తోంది. ఇందులో భాగంగానే 8 జిల్లాల్లో సుమారు 46 మిల్లుల్లో సీఎంఆర్ బియ్యం పరిమాణం కంటే విద్యుత్ వినియోగం చాలా తక్కువగా ఉండటాన్ని గుర్తించింది. తక్కువ విద్యుత్ వాడి ఎక్కువ మొత్తంలో మిల్లింగ్ చేయడం ఎలా సాధ్యమైందన్న అంశంపై ఆరా తీస్తోంది. ఇందులో భాగంగా ఆయా మిల్లులను వెంటనే తనిఖీ చేసి సమగ్ర నివేదిక ఇవ్వాలని సంబంధిత జిల్లాల జాయింట్ కలెక్టర్లను ఆదేశించింది. తగ్గిన అక్రమ రవాణా మరోవైపు విజిలెన్స్ బృందాలతో ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తుండటంతో చాలావరకు రేషన్ బియ్యం అక్రమ రవాణా తగ్గింది. దీనికి తోడు 6ఏ కేసులను త్వరగా విచారించి పట్టుబడ్డ బియ్యాన్ని తిరిగి బహిరంగ వేలం ద్వారా మార్కెట్లోకి తీసుకొస్తోంది. ఇందుకు ప్రత్యేకంగా ప్రతి జిల్లాలో జాయింట్ కలెక్టర్, డీసీఎస్వో, పౌర సరఫరాల శాఖ ఏఎం, మార్కెటింగ్ శాఖ ఏడీలతో ప్రత్యేక కమిటీలను నియమించింది. వీరు సంబంధిత తహసీల్దార్ ఆధ్వర్యంలో బియ్యం నాణ్యత, రకాన్ని బట్టి అప్సెట్ ధరను నిర్ణయించి బహిరంగ వేలానికి వెళ్తున్నారు. అక్రమ రవాణాలో దొరికిన బియ్యాన్ని ఎప్పటికప్పుడు బయటకు పంపించేలా ప్రతి నెలలో రెండు సార్లు బహిరంగ వేలం నిర్వహిస్తున్నారు. సాధారణంగా రేషన్ దుకాణంలో రికార్డులకు మించి స్టాక్ ఉంటే దానిని సీజ్ చేసి కేసు నమోదు చేస్తారు. ఇటువంటి నిల్వలకు మోక్షం కలి్పంచి పీడీఎస్ ధరకే ప్రజా పంపిణీలోకి తీసుకొస్తున్నారు. సరైన పత్రాలు లేకుండా ప్రైవేట్ గోడౌన్లు, దుకాణాలు, లారీల్లో స్వా«దీనం చేసుకున్న బియ్యాన్ని మాత్రం బహిరంగ వేలానికి పెడుతున్నారు. నిల్వలతో సమస్య అక్రమంగా తరలిస్తూ పట్టుబడ్డ బియ్యాన్ని స్వాధీనం చేసుకుంటున్న అధికారులు కేసులు నమోదు చేసి ఎక్కడికక్కడ ఎంఎల్ఎస్ పాయింట్లలో సరుకును నిల్వ చేస్తున్నారు. అయితే, కేసుల విచారణ జాప్యంతో నిల్వలు పేరుకుపోయి బియ్యం ముక్కిపోవడం, రంగు మారడం, పురుగులు పట్టి ప్రజా వినియోగానికి పనికిరావట్లేదు. వీటి ప్రభావం ఎంఎల్ఎస్ పాయింట్లలోని తాజా సరుకులపైనా పడుతోంది. ఒక్కోసారి ఈ నిల్వలు సాధారణ పీడీఎస్‌లో కలిసిపోతుండటంతో సరైన లెక్కలు ఉండట్లేదు. వీటిని అరికట్టేందుకు జిల్లాల్లో ఒకట్రెండు ఎంఎల్ఎస్ పాయింట్లను గుర్తించి వాటిలో మాత్రమే అక్రమంగా తరలిస్తూ పట్టుబడ్డ చౌక బియ్యాన్ని నిల్వ చేస్తున్నారు. రేషన్ బియ్యం అక్రమ రవాణా కేసుల్లో సరుకు విలువ రూ.50 లక్షలకు పైబడి ఉంటే కలెక్టర్, రూ.50 లక్షలు లోపు ఉంటే జాయింట్ కలెక్టర్ విచారించనున్నారు. కోర్టు పరిధిలో ఉన్న కేసులు మినహా మిగిలిన వాటిని జిల్లా స్థాయిలో వేగవంతంగా పరిష్కరించేలా చర్యలు చేపడుతున్నారు. సీఎంఆర్‌పై ప్రత్యేక దృష్టి పౌరసరఫరాల శాఖలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా మిల్లుల కరెంటు వాడకం, వారిచ్చిన కస్టమ్ మిల్లింగ్ బియ్యం పరిమాణాన్ని పోల్చి చూస్తున్నాం. కొన్ని మిల్లుల్లో సీఎంఆర్ చేసి ఇచ్చిన బియ్యానికి, వాడిన కరెంట్‌కు పొంతన లేదు. తక్కువ కరెంట్‌తో ఎక్కువ బియ్యం సీఎంఆర్ చేసినట్టు చూపిస్తున్నారు. దీనిపై ఆయా జిల్లాల జేసీలను తనిఖీ చేయాలని ఆదేశించాం. వారిచ్చిన నివేదిక ప్రకారం చర్యలు తీసుకుంటాం. – హెచ్.అరుణ్‌కుమార్, పౌరసఫరాల శాఖ కమిషనర్ వేగంగా కేసులను డిస్పోజ్ చేస్తున్నాం రాష్ట్రంలో పేదలకు నాణ్యమైన బియ్యం అందిస్తుండటంతో చాలా వరకు రేషన్ అక్రమ రవాణా తగ్గింది. దీనితో పాటు ఇప్పటివరకు నమోదైన 6ఏ కేసులను కూడా త్వరగా విచారించేలా ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేశాం. కొన్నేళ్లుగా విచారణకు నోచుకోని కేసులు, భారీగా పేరుకుపోయిన నిల్వలను క్లియర్ చేస్తున్నాం. సరైన పత్రాలు లేకుండా తరలిస్తూ పట్టబడ్డ బియ్యానికి బహిరంగ వేలం నిర్వహించి ప్రజా వినియోగంలోకి తీసుకొస్తున్నాం. – విజయ సునీత, పౌరసరఫరాల శాఖ డైరెక్టర్ -
రేషన్ బియ్యం ఇక పూర్తి ఉచితం
సాక్షి ప్రతినిధి, ఏలూరు: రేషన్ బియ్యాన్ని ఇక పూర్తి ఉచితంగా అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇంతవరకూ కిలోకి రూపాయి తీసుకునేవారు. ఇక నుంచి పూర్తి ఉచితంగా అందిస్తారు. ఇప్పటికే సంక్షేమ పథకాలతో భరోసా ఇస్తున్న సర్కారు నూతన సంవత్సరం నుంచి జిల్లాలో ఉచిత రేషన్ అమలు చేయనుంది. ప్రతి నెల 16,474 మెట్రిక్ టన్నులు ఉచితంగా పంపిణీ చేయనున్నారు. రేషన్ కార్డుదారులకు ఒక్కొక్కరికి 5 కేజీల చొప్పున రేషన్ బియ్యాన్ని అందిస్తూ కిలో ఒక్క రూపాయికే ప్రభుత్వం సరఫరా చేస్తుంది. ఇక నుంచి నూతన సంవత్సరంలో సంవత్సరం పాటు ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఉచితంగా రేషన్ బియ్యాన్ని అందించేందుకు చర్యలు తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రేషన్ వాహనాలు ద్వారా అందించే పంచదార, కందిపప్పుకు మాత్రమే డబ్బులు తీసుకోనున్నారు. కేజీ కందిపప్పుకు రూ.67, అరకిలో పంచదారకు రూ.17 తీసుకోవాలని, బియ్యం మాత్రం ఉచితంగానే అందించాలని ఆదేశించింది. ఈఏఏవై కార్డుదారులకు కేజీ పంచదార రూ.13.50కే అందించాలని ప్రభుత్వం ఆదేశించింది. నూతన సంవత్సర కానుకగా.. నూతన సంవత్సర కానుకగా అందించే ఈ బియ్యం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఏలూరు జిల్లాలో 6,42,526 కార్డులకు గాను 17,87,981 మందికి అందిస్తారు. అదే విధంగా పశ్చిమగోదావరి జిల్లాలో 5,36,423 కార్డులకు గాను 15,06,921 మంది ప్రజలకు ఒక్కొక్కరికి 5 కేజీల చొప్పున అందిస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 16,474 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ప్రతి నెల ఉచితంగా ఆయా కార్డుదారులకు అందిస్తున్నారు. ఏలూరు జిల్లాలో 1,164 రేషన్ దుకాణాల ద్వారా 408 రేషన్ వాహనాలు, అదే విధంగా పశ్చిమగోదావరి జిల్లాలో 1011 రేషన్ దుకాణాల ద్వారా 343 రేషన్ వాహనాలు కార్డుదారుల ఇంటి వద్దకే బియ్యాన్ని తీసుకువెళ్ళి ఉచితంగా అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. పేద ప్రజల్లో ఆనందం ప్రభుత్వం ఇంటింటికి వాహనాల ద్వారా రేషన్ సరఫరా చేయడంతో పాటు నూతనంగా అందించే రేషన్ బియ్యాన్ని ఉచితంగా అందించడం పట్ల పేదలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. తమపై భారం పడకుండా ప్రభుత్వం ఉచితంగా అందిస్తుందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గతంలో రేషన్ దుకాణాల చుట్టూ తిరుగుతూ వరుసలో నిలబడి రేషన్ డీలర్ ఇచ్చే బియ్యం కోసం ఎదురుచూడాల్సి వచ్చేదని, ప్రస్తుతం తమకు ఆ బాధలు తప్పాయంటున్నారు. ఇంటికి తీసుకువచ్చి అందించే బియ్యాన్ని సైతం ఉచితంగా ఇవ్వడం పట్ల కార్డుదారులు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇక నుంచి ఉచితంగా అందిస్తాం ప్రభుత్వ నిర్ణయంతో కార్డుదారులకు బియ్యం ఉచితంగా అందించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఇతర సరుకులకు సొమ్ములు చెల్లించాలి. ప్రభుత్వం నూతన సంవత్సర కానుకగా కార్డుదారులకు బియ్యం ఉచితంగా పంపిణీ చేయాలని నిర్ణయించింది. మిగిలిన సరుకులకు సొమ్ములు చెల్లించాల్సి ఉంది. – పీ.అరుణ్‌బాబు, జాయింట్ కలెక్టర్, ఏలూరు జిల్లా ఇప్పటికే వాహనాల ద్వారా సరఫరా ఇప్పటికే రేషన్ దుకాణాల నుంచి వాహనాల ద్వారా ప్రజల వద్దకే వెళ్ళి రేషన్ అందిస్తున్నాం. ఈ నేపధ్యంలో నూతనంగా ప్రభుత్వం ఉచితంగా బియ్యాన్ని అందించాలని ఆదేశాలు జారీ చేయడంతో ఆ మేరకు బియ్యం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. సంవత్సరం పాటు ఉచిత బియ్యం పంపిణీ ప్రక్రియ సాగుతుంది. – ఈ.మురళీ, జాయింట్ కలెక్టర్, పశ్చిమగోదావరి జిల్లా -
ఉచిత రేషన్‌కు సర్కారు గ్రీన్ సిగ్నల్
సాక్షి, హైదరాబాద్: ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజనలో భాగంగా కేంద్రం ప్రకటించిన సంవత్సర కాలం ఉచితరేషన్ అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేసింది. ఈ జనవరి నుంచి వచ్చే డిసెంబర్ వరకు దేశవ్యాప్తంగా 5 కిలోలు బియ్యం ఉచితంగా అందించాలని కేంద్రం నిర్ణయించిన విషయం తెలిసిందే. జాతీయ ఆహార భద్రతా చట్టం కార్డులు కలిగిన వారికి ఒక్కొక్కరికి 5కిలోల బియ్యం ఉచితంగా ఇవ్వనున్నారు. అంత్యోదయ కార్డులకు కుటుంబానికి 35 కిలోలు, అన్నపూర్ణ కార్డులకు 10 కిలోలు ఉచితంగా అందించనున్నారు. అదేవిధంగా కుమ్రంబీమ్, ఆసిఫా బాద్, భూపాలపల్లి, కొత్తగూడెం, ఆదిలాబాద్ జిల్లాలకు బియ్యానికి బదులుగా ఫోర్టిఫైడ్ రైస్ ఇవ్వనున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఆహార భద్రత కార్డులున్న వారి విషయంలో ఉచిత రేషన్ గురించి ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు. రాష్ట్రంలో 90 లక్షల ఆహార భద్రత కార్డులుండగా, అందులో 55 లక్షల కార్డులు కేంద్ర పరిధిలో ఉండగా, 35 లక్షల కార్డులు రాష్ట్ర పరిధిలో ఉన్నాయి. -
పేదల బియ్యంతో కోట్లకు పడగ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రేషన్ బియ్యం దందా ఓ మాఫియాగా తయారైంది. గ్రామాలు, పట్టణాల్లోని బస్తీల నుంచి సేకరించే బియ్యాన్ని రాష్ట్ర సరిహద్దులు దాటించాలన్నా, రైస్ మిల్లులకు చేరవేయాలన్నా.. జిల్లాల స్థాయిలో కొందరు వ్యక్తులు కీలక పాత్ర పోషిస్తున్నారని తెలుస్తోంది. రెండు దశాబ్దాల క్రితం పట్టణ స్థాయిలో రేషన్ బియ్యాన్ని కొనుగోలు చేసి, కమీషన్ మీద అమ్ముకునే చిరుదందా సాగించిన ఓ వ్యక్తి ఇప్పుడు ఉత్తర తెలంగాణలోని పలు జిల్లాలను శాసించే బియ్యం లీడర్‌గా మారితే, రైస్ మిల్లులో పార్టనర్‌గా చేరి, ఆ రైస్ మిల్లుతో పాటు పలు ఇతర మిల్లులకు రేషన్ బియ్యం రీసైక్లింగ్ కోసం తరలించే లీడర్‌గా మరో వ్యక్తి మారి దందా సాగిస్తున్నారు. హైదరాబాద్ పక్కనున్న ఓ పారిశ్రామిక జిల్లాలో రేషన్ డీలర్ స్థాయి నుంచి డీలర్ల సంఘానికే నాయకుడిగా ఎదిగిన మరో వ్యక్తి.. రేషన్ బియ్యాన్ని యథేచ్ఛగా కర్ణాటకకు తరలిస్తున్నాడు. ఇలా ప్రతి ఉమ్మడి జిల్లాలో కనీసం ఇద్దరు చొప్పున రేషన్ బియ్యం దందా సాగించే ‘లీడర్లు’రాష్ట్ర పౌరసరఫరాల శాఖ పంపిణీ చేస్తున్న పేదల బియ్యానికి సవాల్ విసురుతున్నారు. ప్రతి నెలా రూ. వందల కోట్ల విలువైన పీడీఎస్ బియ్యాన్ని నల్లబజారుకు తరలిస్తూ ఈ దళారులు కోట్లు కొల్లగొడుతున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి సహా పాత 10 జిల్లాల్లో కనీసంగా 20 మంది వ్యక్తులు ఈ బియ్యం దందాతో రూ. కోట్లు కూడబెట్టారని తెలుస్తోంది. లక్షల్లో మామూళ్లు .. రేషన్ బియ్యం పక్కదారి పట్టడంలో అన్ని ప్రధాన ప్రభుత్వ శాఖల అధికారుల పాత్ర ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. పీడీఎస్ బియ్యం పక్కదారి పట్టకుండా చూడాల్సిన పౌరసరఫరాల శాఖలోని జిల్లా స్థాయి అధికారుల నుంచి ఎన్ఫోర్స్మెంట్ విభాగంలోని వివిధ హోదాల్లో ఉన్న వారి వరకు బియ్యం దందా సాగించే వారికి సహకారం అందిస్తున్నట్లు భావిస్తున్నారు. కాగా, మామూళ్లు ఇవ్వలేని గ్రామ, మండల స్థాయిలోని ఆటో ట్రాలీలను అప్పుడప్పుడు సీజ్ చేసి అధికారులు కంటితుడుపు చర్యలు తీసుకుంటున్నారని విమర్శలు వస్తున్నాయి. రెవెన్యూ అధికారులతోపాటు బియ్యం వాహనాలు రాష్ట్ర సరిహద్దులు దాటే మార్గంలో ఉన్న అన్ని పోలీస్స్టేషన్లను ఈ వ్యాపారులు మేనేజ్ చేస్తున్నట్లు సమాచారం. కాగా, బియ్యం వ్యాపారులను బ్లాక్మెయిల్ చేసే మరికొందరికి కూడా ఏనెలకు ఆనెల ఠంచన్‌గా మామూళ్లు ముడతాయని తెలుస్తోంది. మంచిర్యాల, పెద్దపల్లి, ములుగు, భూపాలపల్లి మొదలైన జిల్లాల నుంచి సిరోంచకు బియ్యం రవాణా చేసే ఓ ‘వీరుడు’మామూళ్ల కిందనే నెలకు రూ.10 లక్షలకు పైగా ముట్ట చెపుతాడంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ఇతనిపై 12 కేసుల వరకు ఉన్నాయి. ఈ వ్యక్తి కాళేశ్వరం, కరీంనగర్, హైదరాబాద్‌లలో ఆస్తులు సంపాదించే స్థాయిలో బియ్యం దందా సాగిస్తున్నాడు. ఆసిఫాబాద్ రెబ్బెనకు చెందిన మరో ‘కిరణం’మీద 22 కేసులు ఉన్నప్పటికీ, బెల్లంపల్లి, ఆసిఫాబాద్, ఆదిలాబాద్ చుట్టుపక్కల మండలాల నుంచి బియ్యం సేకరించి బల్లార్షా ప్రాంతంలోని వీరూర్‌కు తరలిస్తున్నట్లు తెలుస్తోంది. కరీంనగర్‌కు చెందిన ఓ రైస్ మిల్లు భాగస్వాములు పీడీఎస్ బియ్యం దందాలో రాష్ట్రంలోనే కీలకంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. సంగారెడ్డి జిల్లా నుంచి కర్ణాటకకు.. సంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ రేషన్ దుకాణం యజమాని సంఘం నాయకుడిగా చలామణి అవుతూ పెద్ద ఎత్తున దందా సాగిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఇతను హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్ ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన దందా సాగిస్తూ ‘రాజు’గా వెలిగిపోతున్నాడు. ఈ నాయకుడు తను దందా చేయడమే గాక, బియ్యం దందా సాగించే కొందరు రేషన్ డీలర్లకు అండగా ఉంటున్నట్లు ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ జిల్లాల నుంచి సేకరించిన బియ్యాన్ని కర్ణాటక సరిహద్దులు దాటిస్తూ కోట్లకు పడగలెత్తినట్లు ఆరోపణలున్నాయి. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో రేషన్ బియ్యం దందాకు మిల్లర్లతో పాటు అధికార పార్టీ నాయకుల అండ ఉన్నట్లు చెపుతున్నారు. మహబూబ్‌నగర్, గద్వాల ప్రాంతంలోని నలుగురు ముఖ్యమైన వ్యక్తులు మక్తల్, నారాయణపేట మీదుగా కర్ణాటకకు బియ్యాన్ని తరలిస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో రీసైక్లింగ్‌కే ఎక్కువ నిజామాబాద్ జిల్లావ్యాప్తంగా రేషన్ బియ్యం దందా సాగించడంలో రైస్‌మిల్లర్లు కీలకంగా వ్యవహరిస్తున్నారు. గ్రామాల్లో రేషన్ డీలర్లతోపాటు కొంతమంది ఏజెంట్లు పేదల నుంచి బియ్యాన్ని కొనుగోలు చేసి మహారాష్ట్రకు కొంత మేర తరలిస్తుండగా భారీ ఎత్తున రైస్‌మిల్లులకు చేరవేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇందులో ఓ ఎమ్మెల్యేతోపాటు కీలకమైన ఓ రైస్‌మిల్లర్ హస్తముందనే విమర్శలు ఉన్నాయి. జిల్లాలో పండిస్తున్న సన్నరకాలను రైస్‌మిల్లర్లు ఏ గ్రేడ్ రకం కింద సేకరిస్తూ, బహిరంగ మార్కెట్లో విక్రయిస్తున్నారు. వాటి స్థానంలో ఏజెంట్లు, రేషన్‌డీలర్ల ద్వారా సేకరించిన ప్రజా పంపిణీ బియ్యాన్ని లెవీ కింద తిరిగి ఎఫ్‌సీఐకి అప్పగిస్తున్నారని తెలుస్తోంది. రైస్‌మిల్లుల ద్వారా ఎఫ్‌సీఐకి, అక్కడి నుంచి రేషన్‌షాపులకు, లబ్ధిదారులకు చేరుతుండగా, తిరిగి వారి నుంచి ఏజెంట్ల ద్వారా మళ్లీ రైస్‌మిల్లులకే చేరుతుండడం గమనార్హం. మహబూబాబాద్‌లో ప్రజా ప్రతినిధి అండతో.. మహబూబాబాద్ పట్టణంలోని ఇల్లందు క్రాస్ రోడ్ వద్ద ఉన్న మిల్లు, మరిపెడ మండలంలోని మరో రైస్ మిల్‌తో పాటు తొర్రూరు, కొత్తగూడ, కేసముద్రం కేంద్రాలుగా రేషన్ బియ్యం దందా సాగుతోందన్న ఆరోపణలున్నాయి. సివిల్ సప్లై శాఖలో దీర్ఘకాలంగా పనిచేస్తున్న ఓ అధికారి ఈ వ్యవహారాన్ని చక్కబెడుతూ వాటాలు నిర్ణయించి.. దందా సాఫీగా సాగేలా చూస్తున్నాడని తెలుస్తోంది. పీడీఎస్ డీలర్ల ద్వారా పేదల నుంచి కిలో ఐదు రూపాయల నుంచి పది రూపాయల వరకు కొనుగోలు చేసి మామిడి తోటలు, రైస్ మిల్లులు, గోదాముల్లో దాచిపెడుతూ ఆ బియ్యాన్ని సీఎంఆర్ రూపంలో ఎఫ్‌సీఐకి అప్పగిస్తున్నారని ఆరోపణలున్నాయి. మహబూబాబాద్ జిల్లాకు చెందిన ఓ ప్రజా ప్రతినిధి హస్తం ఈ దందాలో ఉన్నట్లు ఆరోపణలున్నాయి. -
Ration Rice: వేలి ముద్ర వెయ్యి.. పైసలు తీసుకో.. కిలో రూ.8 నుంచి 10
రేషన్ డీలర్ నుంచి మిల్లర్ వరకు అక్రమ దందా ప్రతి నెలా వందల కోట్లలో వ్యాపారం వరకు ఇచ్చి కొనుగోలు డీలర్ల వద్ద, గ్రామాల్లో మహిళల నుంచి రూ.10 వరకు ఇచ్చి కొంటున్న దళారులు దళారుల వద్ద కొని పొరుగు రాష్ట్రాల్లో రూ.20 వరకు విక్రయిస్తున్న పెద్ద వ్యాపారులు రేషన్ బియ్యాన్ని కొని రీసైక్లింగ్ చేసి.. కస్టమ్ మిల్లింగ్ రైస్ కింద ప్రభుత్వానికి అప్పగిస్తున్న కొందరు మిల్లర్లు మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని ఓ గ్రామం రేషన్ దుకాణానికి ఓ మహిళ వచ్చి డీలర్‌కు ఆహార భద్రతా కార్డు ఇచ్చింది. డీలర్: అమ్మా బియ్యం ఇయ్యాల్నా.. పైసలా.. మహిళ: ఒక్కలకు ఎన్ని కిలోల బియ్యం ఇత్తండ్రు డీలర్:10 కిలోలు మహిళ: మా కార్డుల ఐదుగురం ఉన్నం గద. పైసలే ఇయ్యి డీలర్: యేలి ముద్ర ఎయ్యమ్మా... కిలకు ఎనిమిది (రూ.8) లెక్కన నాలుగు వందలిస్త మహిళ: సరేనయ్య.. పైసలియ్యి వచ్చిన మహిళ వేలిముద్ర వేయగానే... సదరు డీలర్ 50 కిలోల బియ్యం తూకం వేసి, ఆ బియ్యాన్ని పక్కకు పెట్టి ఆమెకు రూ.400 ఇచ్చాడు. సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) ద్వారా పేదలకు అందాల్సిన బియ్యం 80 శాతం వరకు పక్కదారి పడుతోంది. రూపాయికి కిలో చొప్పున కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న ఈ బియ్యాన్ని రూ.8 నుంచి రూ.15 వరకు వెచ్చించి కొనుగోలు చేస్తున్న ముఠాలు ప్రతి నెలా వందల కోట్ల రూపాయల దందా సాగిస్తున్నాయి. హైదరాబాద్ మహానగరం మొదలుకొని పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా ఈ దందా యథేచ్ఛగా కొనసాగుతోంది. రేషన్ దుకాణం నుంచి మొదలయ్యే ఈ దందా మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్‌లలో ముగుస్తోంది. అక్రమ దందాలో చిన్న చిన్న దళారులు మొదలుకొని పెద్ద వ్యాపారులు, రైస్ మిల్లర్లు కూడా ఉండటం గమనార్హం. పీడీఎస్ బియ్యం జాతీయ రహదారులు, రైలు మార్గాల ద్వారా గమ్య స్థానాలకు నిరాటంకంగా చేరుతున్నా.. పట్టించుకునేవారే లేరు. బియ్యంతో పాటే పోలీస్, రైల్వే పోలీస్, పౌర సరఫరాల సంస్థ అధికారులను ‘కొనుగోలు’చేస్తున్న వ్యాపారులు ప్రభుత్వం కోట్లు వెచ్చించి పేదలకు పంచుతున్న బియ్యాన్ని సొమ్ము చేసుకుంటున్నారు. తెలంగాణలోని రూపాయి బియ్యం (కరోనా నాటి నుంచి దాదాపుగా ఉచితంగానే సరఫరా) ఇతర రాష్ట్రాల్లో రూ.20కు పైగా పలుకుతుండడం గమనార్హం. కరోనా నాటి నుంచి ఉచితంగానే.. ► సాధారణంగా ఆహార భద్రత కార్డులు ఉన్న కుటుంబాల్లోని ఒక్కొక్కరికి 6 కిలోలు.. కిలో రూపాయి చొప్పున ఇస్తారు. అయితే కరోనా మొదలైన 2020 నుంచి ఒకటి రెండు నెలలు మినహా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉచితంగానే బియ్యాన్ని సరఫరా చేస్తున్నాయి. ఈ క్రమంలో గత జనవరి నుంచి మే, జూన్ నెలలు మినహా ఒక్కొక్కరికి ప్రతినెల 10 కిలోల చొప్పున ఇస్తున్నారు. ఆగస్టు నెలలో ఏకంగా 15 కిలోల చొప్పున పౌరసరఫరాల సంస్థ బియ్యం పంపిణీ చేసింది. రేషన్ బియ్యంపై చులకన భావం! ► ఆహార భద్రతాకార్డు ఉన్న కుటుంబంలోని సభ్యులు బయోమెట్రిక్ విధానం ద్వారా వేలిముద్ర వేసి తమ కోటా బియ్యాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. అయితే గ్రామాల్లో పెరిగిన వరిసాగు, రైతు కుటుంబాలు సొంతంగా పండించిన బియ్యం తినే అలవాటు, రేషన్ బియ్యంపై ఉన్న చులకన భావం లాంటి కారణాల వల్ల చాలామంది ఈ బియ్యాన్ని ఆహారంగా వినియోగించడం లేదు. పట్టణాల్లోనూ చాలామంది రేషన్ బియ్యాన్ని ఇడ్లీ, దోశల పిండి, అటుకుల తయారీకి వాడుతున్నారు మినహా రోజువారీ భోజనానికి వినియోగించడం లేదు. అయితే రెండు నెలలకు పైబడి పీడీఎస్ బియ్యం తీసుకోకపోతే రేషన్‌కార్డు రద్దు అవుతుందన్న భయంతో అందరూ తప్పనిసరిగా బియ్యాన్ని తీసుకుంటున్నారు. అలా తీసుకుంటున్న బియ్యాన్ని కొందరు రేషన్ డీలర్లు తమ దుకాణాల్లోనే తిరిగి కొంటున్నారు. హైదరాబాద్ నగరంతో పాటు కరీంనగర్, వరంగల్, ఖమ్మం నగరాల్లో కిలో బియ్యానికి రూ. 6 నుంచి రూ. 8 వరకు చెల్లిస్తుండగా... గ్రామాలు, ఇతర పట్టణాల్లో కిలోకు రూ. 8 నుంచి రూ.10 వరకు చెల్లిస్తున్నారు. రేషన్ దుకాణాల్లోకి వచ్చే బియ్యంలో 60 శాతం అక్కడే డబ్బులకు రీసేల్ అవుతుండగా, 20 నుంచి 30 శాతం వరకు మాత్రమే పేదలు తీసుకుంటున్నారు. వీరిలో కొందరు దళారులకు విక్రయిస్తున్నారు. మిగతా 10 శాతం వరకు క్లోజింగ్ బ్యాలెన్స్ కింద డీలర్ల వద్ద నిల్వ ఉంటుంది. కాగా కొంటున్న బియ్యాన్ని డీలర్లు రూ.2 లాభం చూసుకొని ట్రాలీల్లో వచ్చే దళారులకు అమ్మేస్తున్నారు. ఇలా డీలర్ల నుంచి, గ్రామాల్లో మహిళల నుంచి కొనుగోలు చేసిన బియ్యాన్ని సదరు ట్రాలీ దళారులు లారీల్లో వ్యాపారం చేసే వారికి రూపాయి, ఆపైన లాభం చూసుకొని విక్రయిస్తున్నారు. వాటిని కొనుగోలు చేసే పెద్ద వ్యాపారులు పక్క రాష్ట్రాలకు పంపిస్తున్నారు. రెండు మూడు చేతులు మారిన తర్వాత రాష్ట్రాలు దాటే బియ్యం ధర రూ.20 వరకు పలుకుతోంది. తద్వారా కిలో బియ్యానికి కనిష్టంగా రూ.5 చొప్పున లాభం వేసుకొన్నా.. ఇలా టన్నుల్లో విక్రయించే బియ్యానికి కోట్లల్లో లాభం సమకూరుతుందని స్పష్టమవుతోంది. ఈ లాభంతోనే పోలీస్, రెవెన్యూ, విజిలెన్స్, పౌరసరఫరాల శాఖ అధికారులను వ్యాపారులు కొనేస్తున్నారని మంచిర్యాలకు చెందిన ఓ దళారి చెప్పాడు. కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు రవాణా ► ఉత్తర తెలంగాణ జిల్లాల్లోని ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, వరంగల్ జిల్లాలకు చెందిన పీడీఎస్ బియ్యం అధికంగా మహారాష్ట్రకు వెళుతోంది. రామగిరి ప్యాసింజర్ రైలు ద్వారా వరంగల్ నుంచి పెద్దపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల మీదుగా వీరూర్‌కు వెళ్తుంది. లారీల్లో కూడా కరీంనగర్, మంచిర్యాల, ఆసిఫాబాద్, పెద్దపల్లి జిల్లాల నుంచి ఆసిఫాబాద్ గుండా వీరూర్కే చేరుతుంది. కాగజ్‌నగర్ నుంచి, దహేగాం, బెజ్జూరుల నుంచి చింతలమానెపల్లి మీదుగా గడ్చిరోలి జిల్లా అహేరీకి వెళ్లే లారీలు కూడా ఉన్నాయి. భూపాలపల్లి, చెన్నూరు, కాటారం, ములుగు ప్రాంతాల నుంచి సిరోంచకు, ఖమ్మం, కొత్తగూడెం నుంచి ఛత్తీస్‌గఢ్, హైదరాబాద్, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, మెదక్ జిల్లాల నుంచి కర్ణాటకకు పీడీఎస్ బియ్యంతో కూడిన లారీలు వెళ్తున్నాయి. మిల్లర్లకూ వరం ► పీడీఎస్ బియ్యాన్ని రాష్ట్రంలోని కొందరు మిల్లర్లు రీసైక్లింగ్ చేసి సీఎంఆర్ కింద ప్రభుత్వానికి అప్పగిస్తున్నారనే ఆరోపణలున్నాయి. గ్రామాలు, పట్టణాల నుంచి లారీలు బియ్యం మిల్లులకు వెళుతూపలుచోట్ల పట్టు పడడం ఈ ఆరోపణలకు బలం చేకూరుస్తోంది. అలాగే ఆయా మిల్లులకు ప్రభుత్వం కేటాయించిన ధాన్యం నిల్వలు అక్కడ లేకపోవడాన్ని బట్టి కూడా.. మిల్లర్లు అసలు బియ్యాన్ని (మిల్లింగ్ చేసిన రైతుల ధాన్యం) అమ్ముకుంటూ, వాటి స్థానంలో పీడీఎస్ బియ్యాన్ని ఇస్తున్నట్టుగా స్పష్టమవుతోందని అంటున్నారు. -
19 నుంచి ఉచిత బియ్యం పంపిణీ
సాక్షి, అమరావతి: ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన (పీఎంజీకేఏవై) కింద మూడునెలల పాటు ఉచిత బియ్యాన్ని పంపిణీ చేస్తున్నట్లు పౌరసరఫరాల శాఖ కమిషనర్ హెచ్.అరుణ్‌కుమార్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జాతీయ ఆహార భద్రత కార్డుదారులు రేషన్ దుకాణాల వద్ద ప్రతినెల 19వ తేదీ నుంచి 28వ తేదీలోగా బియ్యాన్ని తీసుకోవాలని సూచించారు. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అవసరమైన నిల్వలను కేటాయించిందని, దీన్లో కొంత నాన్ సార్టెక్స్, మరికొంత నాన్ సార్టెక్స్ ఫోర్టిఫైడ్ బియ్యం ఉన్నాయని తెలిపారు. నవంబర్‌లో ఆయా జిల్లాల్లో అందుబాటులో ఉన్న నిల్వల ఆధారంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, మన్యం, డాక్టర్ అంబేడ్కర్ కోనసీమ, ఎన్టీఆర్, బాపట్ల, నెల్లూరు జిల్లాలకు నాన్ సార్టెక్స్, మిలిగిన 16 జిల్లాలకు నాన్ సార్టెక్స్ ఫోర్టిఫైడ్ బియ్యాన్ని సరఫరా చేస్తున్నట్లు వివరించారు. 2.68 కోట్ల మంది ఎన్ఎఫ్ఎస్ఏ లబ్ధిదారుల జాబితాను చౌకదుకాణాలు, సచివాలయాల్లో ప్రదర్శిస్తున్నట్టు తెలిపారు. ఒక్కో వ్యక్తికి ఐదుకిలోల వంతున బియ్యం ఇస్తామని పేర్కొన్నారు. రాష్ట్రంలో సంపూర్ణ పోషణ ధ్యేయంగా ఏడు జిల్లాల్లో ఫోర్టిఫైడ్ బియ్యాన్ని పంపిణీ చేస్తున్నామని, వచ్చే ఏప్రిల్ నాటికి అన్ని జిల్లాలకు విస్తరిస్తామని తెలిపారు. ఇందులో ఐరన్, ఫోలిక్ ఆమ్లం, విటమిన్ బీ12 సమృద్ధిగా ఉంటాయని, వీటివల్ల రక్తహీతన తగ్గి, గర్భస్థ శిశువుకు మేలు జరగడంతోపాటు నాడీవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుందని వివరించారు. ఫోర్టిఫైడ్ బియ్యం తేలికగా ఉండి నీటిలో తేలడంతో కొంతమంది ప్లాస్టిక్ బియ్యంగా అపోహపడుతున్నారని పేర్కొన్నారు. రేషన్ అక్రమ రవాణాకు ఆస్కారం లేదు రేషన్ బియ్యం అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రత్యేకంగా దృష్టి సారించినట్టు తెలిపారు. 9,260 ఎండీయూ వాహనాల ద్వారా లబ్ధిదారుల వేలిముద్రలతో ఇంటివద్దకే బియ్యాన్ని సరఫరా చేస్తుండటంతో బియ్యం బయట మార్కెట్‌కు తరలించే ఆస్కారం లేదని పేర్కొన్నారు. ఎల్లో మీడియా పనిగట్టుకుని విషప్రచారం చేయడం సరికాదని హితవుపలికారు. చౌకదుకాణాలు, ఎండీయూ వాహనాలను నిత్యం ఆకస్మికంగా తనిఖీ చేస్తున్నట్లు తెలిపారు. విజిలెన్సు కమిటీలను నియమించి ప్రజాపంపిణీలో లోపాలు, అక్రమాలు లేకుండా నిఘావ్యవస్థను ఏర్పాటు చేస్తామన్నారు. ఫిర్యాదుల కోసం 1902 టోల్ ఫ్రీ నంబర్‌ను ఎండీయూ వాహనంపై ముద్రించి అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ మూడేళ్లలో పక్కదారిపట్టిన 31,073 టన్నుల రేషన్ బియ్యాన్ని సీజ్‌చేసి సెక్షన్ 6ఏ ప్రకారం 6,979 కేసులతోపాటు 1,603 మందిపై క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు వివరించారు. రైస్‌మిల్లుల్లో రేషన్ బియ్యాన్ని రీసైక్లింగ్ చేస్తూ పట్టుబడితే ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లింగ్‌చేసే అనుమతిని రద్దుచేయడంతోపాటు కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండల స్టాక్ పాయింట్లో ఇటీవల కొన్ని అవకతవకలు చోటుచేసుకున్న నేపథ్యంలో ప్రాథమిక విచారణ అనంతరం స్టాక్ పాయింట్ ఇన్చార్జిని సస్పెండ్ చేయడంతో పాటు క్రిమినల్ చర్యలకు ఆదేశించినట్లు తెలిపారు. -
ఇంటి దొంగలు కాజేస్తున్నారు
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ ప్రతీ నెలా లబ్ధిదారులకు రేషన్ బియ్యం అందిస్తున్నాయి. అయితే పౌరసరఫరాల శాఖలో కొందరు ఇంటి దొంగలు ఆ బియ్యాన్ని పక్కదారి పట్టిస్తూ, రూ.కోట్ల సొమ్ము కాజేస్తున్నారు. రాష్ట్రంలో ప్రతినెలా రేషన్ లబ్ధిదారులకు ఉచిత బియ్యం పంపిణీ కోసం సీఎంఆర్ (కస్టం మిల్లింగ్ రైస్) కింద మిల్లర్లు ఇచ్చిన బియ్యాన్ని ఎఫ్‌సీఐ, పౌరసరఫరా శాఖ ప్రధాన గోదాముల్లో నిల్వ చేస్తారు. అక్కడి నుంచి మండల స్థాయి గోదాం (ఎంఎల్ఎస్) పాయింట్లు, అటు నుంచి రేషన్‌షాపులకు బియ్యం సరఫరా అవుతుంది. ఈ రెండు దశల్లో బియ్యం రవాణాకు కాంట్రాక్టర్లు ఉంటారు. చాలా చోట్ల ప్రభుత్వానికి సొంత గోదాములు లేక అద్దెకు తీసుకుంటోంది. కొన్ని చోట్ల ప్రైవేటు, సహకార శాఖ, గిడ్డంగుల సంస్థ, వ్యవసాయ మార్కెట్, జీసీసీ గోదాములను ఉపయోగిస్తున్నారు. రాష్ట్రంలో 170 ఎంఎల్ఎస్ పాయింట్లు ఉండగా, రేషన్ షాపులకు 2.95 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం సరఫరా చేయాల్సి ఉంది. మొదట ఒక్కో లబ్ధిదారుడికి ఆరు కిలోలు చొప్పున బియ్యం ఇవ్వగా, కరోనా తర్వాత లబ్ధిదారులకు పది కిలోల చొప్పున ఇవ్వడంతో ఆ కోటా పెరిగింది. ఈ నేపథ్యంలో స్టాక్ పెరగడం, ఉచిత బియ్యం కావడంతో క్షేత్రస్థాయిలో అక్రమాలు పెరిగాయి. ఆన్లైన్, తనిఖీలు ఉన్నా.. ప్రతీ ఎంఎల్ఎస్ పాయింట్లలో నెల నెలా బియ్యం నిల్వలపై ఆన్లైన్లో వివరాలు నమోదు చేయాలి. జిల్లాల్లో స్థానిక అదనపు కలెక్టర్ (రెవెన్యూ), పౌరసరఫరాల శాఖ అధికారులు, ఆర్డీవో, ఎమ్మార్వో లు ఈ పాయింట్లను తనిఖీలు చేయాలి. కానీ ఇది చాలా చోట్ల జరగడం లేదు. పౌరసరఫరాల శాఖ విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేస్తున్నప్పుడు మాత్రం తేడాలు బయటపడుతున్నాయి. చాలా చోట్ల ఎంఎల్ఎస్ పాయింట్ల ఇన్చార్జిలు నేరుగా కొంతమంది రేషన్ డీలర్లు, రైస్‌మిల్లర్లతో సంబంధాలు కొనసాగిస్తూ అక్కడి నుంచి బియ్యం పక్క దారి పట్టిస్తున్నారు. మిల్లులకు రీ సైక్లింగ్‌కు సహకరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఎంఎల్ఎస్ పాయింట్ల ఇన్చార్జిలు ఉన్నతాధికారుల అండదండలతోనే హమాలీ, రవాణా చార్జిలు, గన్నీ సంచుల్లోనూ అవకతకవలకు పాల్పడుతున్నారని తెలుస్తోంది. కొన్ని చోట్ల ఎంఎల్ఎస్ పాయింట్లలోనే బఫర్ స్టాక్ కేంద్రాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో రైస్ మిల్లు నుంచి బియ్యం రాకున్నా వచ్చినట్లు తప్పుడు రికార్డులు సృష్టించి ఆసిఫాబాద్‌లో రూ.3 కోట్ల అక్రమాలకు పాల్పడ్డారు. ఇందులో ఉన్నతాధికారుల నుంచి సైతం పరోక్షంగా సహాయ, సహకారాలు అందుతున్నట్లు అనుమానాలు ఉన్నాయి. మరోవైపు నెలా వారీ కోటా బియ్యంలో క్వింటా, అరక్వింటా తక్కువగా వస్తున్నాయని డీలర్లు వాపోతున్నారు. అయితే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసేందుకు మాత్రం సాహసం చేయడం లేదు. ఇలా అక్రమంగా దారిమళ్లించిన బియ్యాన్ని తమకు నమ్మకం ఉన్న డీలర్లకు కోటాకన్నా ఎక్కువగా పంపిస్తూ.. వారి ద్వారా బయట అమ్మే ప్రయత్నాలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల గుర్తించిన అక్రమాలు.. ►ఆసిఫాబాద్ ఎంఎల్ఎస్ పాయింట్ పరిధిలో 8,339 క్వింటాళ్ల బియ్యం పక్కదారి పట్టింది. గత కొంతకాలంగా గోదాంకు బియ్యం రాకున్నా వచ్చినట్లు నమోదు చేస్తూ భారీగా అవకతకలకు పాల్పడ్డారు. వీటి విలువ రూ.3 కోట్లు ఉంటుందని అంచనా. అక్కడి ఇన్చార్జి, డీఎస్వో సైతం సస్పెండ్ అయ్యారు. ఇంకా విచారణ జరుగుతోంది. ►మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ ఎంఎల్ఎస్ పాయింట్లో 218.25 క్వింటాళ్ల బియ్యం తక్కువగా వచ్చింది. గోదాం ఇన్చార్జిపై విచారణ జరుగుతోంది. ►మంచిర్యాల ఎంఎల్ఎస్ పాయింట్లో 650 క్వింటాళ్ల బియ్యం పక్కదారి పట్టింది. దీంతో ఇన్చార్జిని సస్పెండ్ చేసి, బియ్యాన్ని రికవరీ చేశారు. -
వెయ్యి క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
పెద్దపల్లి రూరల్: రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలి స్తున్న 4 లారీలను పెద్దపల్లి విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్, టాస్క్‌ఫోర్స్, పౌరసరఫరాల అధికారులు శనివారం పట్టు కున్నారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట, వీణవంక మండలాల నుంచి నాలుగు లారీల బియ్యాన్ని పెద్దపల్లికి అక్రమంగా తరలిస్తున్నారనే పక్కా సమాచారంతో అధికారులు తనిఖీలు చేశారు. ఒక్కో లారీలో 270 క్వింటాళ్ల చొప్పున మొత్తం నాలుగు లారీల్లో 1,080 క్వింటాళ్ల బియ్యాన్ని తరలిస్తున్నట్లు గుర్తించారు. నాలుగు లారీలను సీజ్ చేసి కేసు నమోదు చేసినట్లు జిల్లా పౌరసరఫరాల అధికారి వెంకటేశ్ తెలిపారు. పట్టుబడ్డ లారీలను పెద్దపల్లిలోని ఎంఎల్ఎస్ పాయింట్‌కు తరలించినట్లు అధికారులు తెలిపారు. తప్పించేందుకు యత్నం: పెద్దపల్లి మండలం రంగాపూర్ గోదాములకు ఎలాంటి వేబిల్లులు లేకుండా వచ్చిన బియ్యం లారీలను అధికారులు పట్టుకోగా.. కేసు నమోదు చేయకుండా తప్పించేందుకు ప్రయత్నాలు జరిగినట్లు తెలుస్తోంది. అధికారులపై ఒత్తిళ్లు రావడంతో బోగస్ వేబిల్లులను సృష్టించి వాటి ఆధారంగా లారీలను వదిలేసేందుకు రంగం సిద్ధం చేసినట్లు సమాచారం. ఈ విషయం తెలిసి అక్కడకు వెళ్లిన మీడియాకు.. బియ్యం అక్రమం కాదని కొందరు చెప్పడం ఇందుకు బలం చేకూర్చుతోంది. టాస్క్‌ఫోర్స్ అధికారుల ఎంట్రీతో..: టాస్క్‌ఫోర్స్, రాష్ట్ర విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల రాకతో కథ అడ్డం తిరిగింది. లారీలకు సంబంధించి బోగస్ వేబిల్లులను అధికారులకు చూపించగా.. లారీల వెంట లేని వేబిల్లులు ఇప్పుడెలా వచ్చాయన్న అధికారుల ప్రశ్నకు సమాధానం రాలేదు. దీంతోవారు లారీల డ్రైవర్ల గురించి ఆరా తీశారు. అప్పటివరకు అక్కడే ఉన్న డ్రైవర్లు, వాటి సంబంధిత వ్యక్తులు టాస్క్‌ఫోర్స్, ఎన్ఫోర్స్మెంట్ అధికారుల రాకతో కనిపించకుండా పోయారు. ఈ నేపథ్యంలో వేబిల్లులు బోగస్‌వని, లారీల్లో ఉన్నవి రేషన్ బియ్యమేనని తేలడంతో నాలుగు లారీలను సీజ్ చేశారు. -
ఆమె ప్రవర్తన భయపెట్టింది.. మంత్రి కేటీఆర్ ట్వీట్
సాక్షి, హైదరాబాద్: జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్‌కు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మంత్రి కేటీఆర్ బాసటగా నిలిచారు. శుక్రవారం కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, కామారెడ్డి కలెక్టర్‌కు మధ్య జరిగిన సంభాషణలో కేటీఆర్ కలెక్టర్‌కు మద్దతుగా నిలిచారు. కామారెడ్డి జిల్లా కలెక్టర్‌తో కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ ప్రవర్తన తనను భయపెట్టిందన్నారు. కష్టపడి పనిచేసే ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులను ఈ రాజకీయ నాయకులు నిరుత్సాహపరుస్తున్నారని ఆరోపించారు. కలెక్టర్ జితేష్ వి పాటిల్, గౌరవప్రదమైన ప్రవర్తనకు అభినందనలు తెలిపారు. ఈ మేరకు మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. I am appalled by the unruly conduct of FM @nsitharaman today with District Magistrate/Collector of Kamareddy These political histrionics on the street will only demoralise hardworking AIS officers My compliments to @Collector_KMR Jitesh V Patil, IAS on his dignified conduct 👏 — KTR (@KTRTRS) September 2, 2022 కాగా శుక్రవారం బీర్కూర్ మండల కేంద్రంలోని ఓ రేషన్ దుకాణం వద్ద లబ్ధిదా రులతో కేంద్ర మంత్రి మాట్లాడారు. ఎన్ని కిలోల బియ్యం ఇస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. రేషన్ బియ్యం పథకంలో కేంద్రం వాటా ఎంత? రాష్ట్రం వాటా ఎంత? లబ్ధిదారుల వాటా ఎంత? అంటూ.. కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రశ్నించారు. కేంద్రమంత్రి వరుసగా వేసిన ప్రశ్నలతో కలెక్టర్ కాస్త తడబడ్డారు. దీంతో మంత్రి అసహనం వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలు అమలు చేస్తున్న పథకాలపై జిల్లా పాలనాధికారికి స్పష్టత లేకపోతే ఎలా? అని ప్రశ్నించారు. చదవండి: స్టేట్.. సెంటర్.. సెప్టెంబర్ 17.. తెలంగాణలో హైవోల్టేజీ పాలిటిక్స్ -
రేషన్ కార్డుదారులకు శుభవార్త.. ఈనెలలో 15 కిలోలు ఉచితం
సాక్షి, నల్లగొండ: ఆగస్టు నెలకు సంబంధించి ఆహారభద్రత కార్డుదారులకు ఒక్కొక్కరికి ఉచితంగా 15 కేజీల బియ్యం పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయిచింది. అయితే జిల్లాలో మొత్తం 4,67,814 కార్డుదారులు ఉండగా ఇందుకు గాను ప్రభుత్వం 21,825.100 మెట్రిక్ టన్నుల బియ్యం కేటాయించింది. వీటిని ఆగస్టు 4 నుంచి పంపిణీ చేయించేలా జిల్లా అధికారులు సిద్ధమవుతున్నారు. ఏప్రిల్, మేలో రూపాయికి కిలో చొప్పున.. కరోనా నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్, మే మాసాల్లో కార్డుదారులందరికీ ఒక్కొక్కరికి 5 కేజీల చొప్పున బియ్యం ఉచితంగా ఇచ్చినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం వాటిని పంపిణీ చేయలేదు. ఇవి కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే మరో 5 కిలోలను కూడా ఉచితంగా ఇవ్వకండా రూపాయికి కిలో చొప్పున యూనిట్‌కు 6 కిలోలు పంపిణీ చేసింది. జూన్ మాసంలో కూడా మొదట రూపాయికి కిలో చొప్పున ఇచ్చింది. మరలా అదేనెల 23 నుంచి 5 కిలోల ఉచిత బియ్యం పంపిణీ చేసింది. అయితే ఏప్రిల్, మే నెలల్లో ఉచితంగా ఇవ్వనందున జూలైలో ఒకేసారి ఒక్కో యూనిట్‌కు పది కిలోల బియ్యం పంపిణీ చేయించింది. కాగా ఆగస్టు మాసానికి సంబంధించి కార్డుదారులకు ఒక్కొక్కరికి 15 కిలో బియ్యాన్ని ఉచితంగా ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 19 వరకు పంపిణీ చేయిస్తాం.. జిల్లావ్యాప్తంగా ఉన్న 991 రేషన్ షాపుల ద్వారా కార్డుదారులకు ఆగస్టు 4 నుంచి 19 వరకు పంపిణీ చేయిస్తాం. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు డీలర్ల వారీగా గోదామలు నుంచి రేషన్ షాపులకు బియ్యం సరఫరా చర్యలు తీసుకుంటున్నాం. కార్డుదారులంతా సద్వినియోగం చేసుకోవాలి. – వెంకటేశ్వర్లు, డీఎస్ఓ, నల్లగొండ చదవండి: పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా?.. ఆలస్యం వద్దు.. మంచి ముహూర్తాలు ఇవే -
AP: పరేశాన్ లేకుండా ఇళ్లకే రేషన్
► ఈ ఫొటోలోని అవ్వ పేరు.. తెర్లి మహాలక్ష్మి. వయసు 75 ఏళ్లకు పైమాటే. ఈమెది పార్వతీపురం మన్యం జిల్లాలోని గరుగుబిల్లి మండలం పెద్దూరు. 15 ఏళ్ల కిందట భర్త మరణించాడు. కుమార్తె పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్లిపోవడం, కొడుకు ఉపాధి వెతుక్కుంటూ కుటుంబంతో కలిసి విశాఖపట్నానికి వలస పోవడంతో ఒంటరిగా చిన్నగదిలో కాలం వెళ్లదీస్తోంది. ఒంటిలో పని చేసే సత్తువ లేని తరుణంలో ప్రభుత్వం సరఫరా చేస్తున్న నాణ్యమైన, ఫోర్టిఫైడ్ చౌక బియ్యమే అవ్వ ఆకలి తీరుస్తోంది. గతంలో ప్రభుత్వం ఇచ్చే బియ్యం దొడ్డుగా, రాళ్లు, నూకలు ఉండేవని.. ఇప్పుడు ప్రభుత్వం ఇస్తున్న బియ్యం బాగుంటున్నాయని అవ్వ చెబుతోంది. తనకు నెలకు 20 కిలోల బియ్యంతోపాటు వృద్ధాప్య పింఛన్ కూడా ఇస్తున్నారని ఆనందం వ్యక్తం చేసింది. ► ప్రజలందరూ రేషన్ పంపిణీ వాహనం చుట్టూ చేరి రేషన్ తీసుకుంటున్న ఈ చిత్రం.. విశాఖ ఏజెన్సీలోని జంగంపుట్టులోనిది. అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలు మండలంలోని గుల్లేలు పంచాయతీ 12 గ్రామాల్లోని ఓ పల్లె.. జంగంపుట్టు. గ్రామస్తులు ఒకప్పుడు రేషన్ తీసుకోవాలంటే 9 కిలోమీటర్ల దూరంలోని రాయిమామిడికి వెళ్లాల్సి వచ్చేది. రేషన్ బియ్యం కోసం రోజు కూలి పోగొట్టుకుని కాలినడకన బయలుదేరి గుర్రాలపై బియ్యం మూటలను వేసుకొచ్చేవారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం రోడ్డు వేయడంతో గుల్లేలు పంచాయతీలో రేషన్ డిపో వచ్చింది. ఇప్పుడు అన్ని గ్రామాలకు వాహనాల్లో రేషన్ సరుకులు వెళ్తున్నాయి. ప్రజలు వారి ఇంటి వద్దే నాణ్యమైన రేషన్ తీసుకుంటున్నారు. సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ విప్లవాత్మక నిర్ణయాలు ప్రజా సంక్షేమానికి చెరగని బాటలు వేస్తున్నాయి. చరిత్రలో తొలిసారిగా రాష్ట్రంలో చేపట్టిన రేషన్ సంస్కరణలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయి. ప్రభుత్వం చౌక డిపోల ద్వారా నాణ్యమైన రేషన్ బియ్యాన్ని.. అది కూడా లబ్ధిదారులకు ఇంటి వద్దే అందిస్తూ వారి ఆకలిని తీరుస్తోంది. దీనిపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. కరోనా సమయంలో ప్రభుత్వం ఇచ్చిన నాణ్యమైన రేషన్ బియ్యమే పేదల పాలిట పరమాన్నమైంది. వాస్తవానికి అధికారంలోకి వచ్చిన తొలి కేబినెట్ సమావేశంలోనే ప్రజలు ఏ రకం బియ్యం తింటున్నారో.. వాటినే రేషన్ దుకాణాల్లో అందించాలని సీఎం వైఎస్ జగన్ఆదేశించారు. దానికి అనుగుణంగా 2019 సెప్టెంబర్‌లో శ్రీకాకుళం జిల్లాలో పైలెట్ ప్రాజెక్టుగా నాణ్యమైన బియ్యం పంపిణీకి శ్రీకారం చుట్టారు. అనంతరం 2021 ఫిబ్రవరి నుంచి రాష్ట్రవ్యాప్తంగా నాణ్యమైన బియ్యం సరఫరా చేయడంతోపాటు రేషన్ డోర్ డెలివరీ విధానాన్ని కూడా ప్రారంభించారు. ఇప్పుడది దేశంలో వివిధ రాష్ట్రాలకు ఆదర్శనీయంగా మారింది. ఈ క్రమంలోనే ఇటీవల పంజాబ్‌లో కొలువుదీరిన ఆప్ ప్రభుత్వం ‘ఘర్ ఘర్ రేషన్ యోజన’ పేరుతో లబ్ధిదారుల ఇంటికే బియ్యాన్ని పంపిణీ చేస్తుందని ముఖ్యమంత్రి భగవంత్ మాన్సింగ్ ప్రకటించారు. మరో 8 రాష్ట్రాలు సైతం ఈ విధానంపై అధ్యయనం చేస్తుండటం విశేషం. రాష్ట్రంలో 1.45 కోట్ల రేషన్ కార్డుదారులు రాష్ట్రంలో 1.45 కోట్ల రేషన్ కార్డుదారులు ఉన్నారు. వీరికి పంపిణీ చేసేందుకు నెలకు 2.31 లక్షల టన్నుల బియ్యం అవసరం. అయితే కేంద్ర ప్రభుత్వం జాతీయ ఆహార భద్రత చట్టం కింద కేవలం 90 లక్షల కార్డులకు 1.54 లక్షల టన్నుల బియ్యాన్ని.. అది కూడా సాధారణ బియ్యాన్ని మాత్రమే అందిస్తోంది. మిగిలిన కార్డులకు అవసరమైన 77 లక్షల టన్నుల నాణ్యమైన బియ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వమే సొంత ఖర్చుతో కొనుగోలు చేసి పంపిణీ చేస్తోంది. ఇందుకు ప్రభుత్వంపై నెలకు రూ.344 కోట్ల భారం పడుతోంది. ఇందులో నాణ్యమైన బియ్యాన్ని (సార్టెక్స్ చేసి) ఇచ్చేందుకు రూ.23.08 కోట్లు అదనపు భారాన్ని మోస్తోంది. గత ప్రభుత్వం ఐదేళ్లలో బియ్యం సబ్సిడీపై చేసిన ఖర్చు రూ.12,377 కోట్లయితే.. వైఎస్ జగన్ ప్రభుత్వం కిలో రూపాయి చొప్పున నాణ్యమైన బియ్యమిస్తూ ఈ మూడేళ్లలోనే రూ.12,400 కోట్లు సబ్సిడీకి వెచ్చించింది. ఈ ఏడాది మరో రూ.4300 కోట్ల వరకు ఖర్చు చేయనుంది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం ఆహార భద్రత చట్టం కింద బియ్యం ఇస్తున్నప్పటికీ వాటి రవాణా, డీలర్ కమీషన్ తదితర ఖర్చుల కింద ఏడాదికి రూ.500 కోట్లకు పైనే రాష్ట్ర ప్రభుత్వం భరిస్తోంది. ప్రజలకు దగ్గరై.. కష్టాలను దూరం చేసి.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజాసంకల్ప యాత్ర ద్వారా ప్రజల కష్టాలను దగ్గర నుంచి చూసిన వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక లబ్ధిదారుల ఇంటి వద్దే నాణ్యమైన రేషన్ పంపిణీకి శ్రీకారం చుట్టారు. రేషన్ దుకాణాల్లో గంటల పాటు క్యూలో నిల్చుని రేషన్ సరుకులు తెచ్చుకునేందుకు ప్రజలు ఇబ్బందులు పడుతుండటంతో పాటు ఒక రోజు పనిని వదులుకుని, కూలి పోగొట్టుకోవాల్సి వచ్చేది. ఇటువంటి వారి కోసం రూ.530 కోట్లకు పైగా వ్యయంతో 2021 ఫిబ్రవరి 1న రాష్ట్రవ్యాప్తంగా 9,260 మొబైల్ వాహనాలతో రేషన్ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇందులోనూ అన్ని సామాజికవర్గాలకు ప్రాధాన్యం ఇస్తూ యువతకు ఉపాధిని కల్పించారు. రేషన్ డోర్ డెలివరీ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా వాహనదారుడితోపాటు హెల్పర్ల కింద సుమారు 17 వేల మందికిపైగా ఉపాధి పొందుతున్నారు. నెలలో 18 రోజులపాటు లబ్ధిదారుల ఇళ్ల వద్దే రేషన్ పంపిణీ చేస్తున్నారు. ఒక్కో వాహనం విలువ రూ.5.81 లక్షలు కాగా.. ప్రభుత్వం 90 శాతం రాయితీ ఇస్తోంది. ఈ వాహనాలను వాడుకున్నందుకు పౌరసరఫరాల శాఖ నెలకు ఆపరేటర్లకు సుమారు రూ.25 కోట్లు చెల్లిస్తోంది. కార్డుదారుల సమక్షంలో ఇంటి దగ్గరే సంచులు తెరచి, కచ్చితమైన తూకంతో రేషన్ సరుకులు ఇస్తున్నారు. దీంతో కొలతలపై ఫిర్యాదులు తగ్గడంతోపాటు వాహనాలకు జీపీఎస్ ట్రాకింగ్ ఏర్పాటు చేయడంతో అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడింది. కష్టాలు తీరాయి.. గతంలో రేషన్ బియ్యం కావాలంటే మా ఊరు నుంచి 5 కిలోమీటర్ల కాలినడకన మసిమండ పంచాయతీలోని ఎండభద్రకు వెళ్లి బియ్యం తెచ్చుకోవాల్సి వచ్చేది. పైగా అక్కడ రేషన్ డిపో దగ్గర గంటల కొద్దీ లైన్లో నిల్చునేవాళ్లం. మా ఊరు గిరిశిఖరం కావడంతో బియ్యం మూటతో నడవడానికి చాలా అవస్థలు పడేవాళ్లం. జగనన్న వచ్చాక ఇంటి ముందుకే రేషన్ బండిని తెచ్చి బియ్యం ఇస్తున్నారు. ఒకప్పుడు రాళ్లు, పురుగులు ఉండే బియ్యాన్ని తినడానికి చాలా ఇబ్బందిగా ఉండేది. ఇప్పుడు చక్కటి నాణ్యమైన బియ్యం ఇస్తున్నారు. – చోడి చింతమ్మ, కొమరాడ మండలం, లంజి గ్రామం, పార్వతీపురం మన్యం జిల్లా తొలిసారిగా ఏపీలోనే రైస్ ఏజ్ టెస్టు గత ప్రభుత్వంలో పంపిణీ చేసిన బియ్యం నాసిరకంగా ఉండటంతోపాటు ప్రజలు వాటిని వండుకోవడానికి, తినడానికి వీలుండేది కాదు. దీంతో చాలా మంది సబ్సిడీ బియ్యాన్ని మార్కెట్లో తక్కువ ధరకు విక్రయించేవారు. ఇవే బియ్యం రీసైక్లింగ్ ద్వారా భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ)కి వెళ్లి తిరిగి రేషన్ షాపులకు వచ్చే విధానం ఇన్నాళ్లూ కొనసాగింది. దీనికి అడ్డుకట్ట వేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దేశంలోనే తొలిసారిగా బియ్యం కాలనిర్ధారణ పరీక్ష (రైస్ ఏజ్ టెస్టింగ్)ను ప్రవేశపెట్టింది. అనంతరం కేంద్ర ప్రభుత్వం సైతం అన్ని ఎఫ్‌సీఐ గోదాముల వద్ద తప్పనిసరిగా రైస్ ఏజ్ టెస్ట్ నిర్వహించాలని ఆదేశించింది. -
Mahabubabad: ప్రభుత్వం రేషన్ దుకాణంలో ప్లాస్టిక్ బియ్యం?
బయ్యారం (మహబూబాబాద్): ప్రభుత్వ చౌకదుకాణం నుంచి సరఫరా అయిన బియ్యంలో ప్లాస్టిక్బియ్యం ఉండడం పలువురిని ఆందోళనకు గురిచేస్తోంది. వివరాలు.. బయ్యారంలోని పీహెచ్సీ ఏరియాలో నివాసం ఉండే నాసరబోయిన పద్మ తన అత్త రామక్క పేరున వచ్చే బియ్యం పది కేజీలు మార్చి నెలలో తీసుకొని ఇంటికి వచ్చింది. ఆ బియ్యాన్ని మంగళవారం వండేందుకు నానబెట్టిన సమయంలో ప్లాస్టిక్‌తో కూడిన బియ్యం నీళ్లలో పైకి తేలాయి. దీంతో ఆ బియ్యాన్ని పూర్తిగా గమనించగా ప్లాస్టిక్ బియ్యంగా కనపడటంతో పద్మ ఈ విషయాన్ని విలేకరులకు తెలిపింది. ప్రభుత్వం సరఫరా చేసిన బియ్యంలో ప్లాస్టిక్ బియ్యం ఎలా వచ్చాయి అనే ప్రశ్న పలువురిలో వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికైనా చౌకదుకాణాల ద్వారా సరఫరా అవుతున్న బియ్యం నాణ్యతపై అధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. (చదవండి: ఫోన్లో అతిగా మాట్లాడుతున్నావని మందలించినందుకు... ) -
రైస్ ఏజ్ టెస్టు.. రేషన్ బియ్యాన్ని పట్టిస్తుంది.. ఎలా పరీక్ష చేస్తారో తెలుసా?
సాక్షి, అమరావతి: రేషన్ బియ్యం రీసైక్లింగ్ మాఫియాకు అడ్డుకట్ట వేసేందుకు దేశంలో తొలిసారిగా సాంకేతిక పరిజ్ఞానాన్ని రాష్ట్ర ప్రభుత్వం విజయవంతంగా వినియోగిస్తోంది. బియ్యం కాల నిర్ధారణ పరీక్ష (రైస్ ఏజ్ టెస్టు) ద్వారా పౌరసరఫరాల శాఖ విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. గతేడాది రెండు సీజన్లలో దీన్ని ప్రయోగాత్మకంగా అమలు చేశారు. తాజాగా కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ, వినియోగదారుల వ్యవహారాల శాఖ దేశమంతా ఈ విధానం అనుసరించేందుకు ఆమోదం తెలిపింది. అన్ని రాష్ట్రాలు మిల్లర్లు ఇచ్చే బియ్యానికి తప్పనిసరిగా రైస్ ఏజ్ టెస్టు నిర్వహించాలని ఉత్తర్వులు జారీ చేసింది. దోపిడీకి అడ్డుకట్ట.. సబ్సిడీ రేషన్ బియ్యాన్ని కొన్నిచోట్ల దళారులు బ్లాక్ మార్కెట్‌కు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. కొందరు రైస్ మిల్లర్లు సబ్సిడీ బియ్యాన్ని కొనుగోలు చేసి పాలిష్ పట్టి సివిల్ సప్లయిస్, ఎఫ్‌సీఐ గోడౌన్లకు రీసైకిల్ చేస్తున్నారు. ఎక్కువ కాలం నిల్వ ఉండటం, మిల్లింగ్ బియ్యం పాతవి కావడంతో గోడౌన్లలో స్టాక్ పురుగులు పట్టి ముక్కిపోతోంది. దీన్ని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం గతేడాది రైస్ ఏజ్ టెస్టు విధానాన్ని తీసుకొచ్చింది. దీని ద్వారా తాజా మిల్లింగ్ బియ్యాన్ని కచ్చితంగా గుర్తిస్తుండటంతో రీసైకిల్ దందాకు తెరపడింది. మిల్లర్ల సమక్షంలో శాంపిళ్ల పరీక్ష రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని మిల్లర్ల వద్దకు తరలించి కస్టమ్ మిల్లింగ్ చేయిస్తారు. అనంతరం బియ్యాన్ని గోడౌన్లలో భద్రపరుస్తారు. అయితే అంతకు ముందే అధికారులు బియ్యం నాణ్యత పరీక్షలను గోడౌన్ ప్లాట్‌ఫామ్‌ల వద్దే చేస్తున్నారు. 580 బస్తాలను (29 టన్నులు) ఒక లాటుగా పరిగణించి మిల్లర్ల సమక్షంలో శాంపిళ్లను పరీక్షిస్తున్నారు. ఆకుపచ్చ, లేత ఆకుపచ్చ రంగు వస్తే తాజా మిల్లింగ్ బియ్యంగా పరిగణిస్తారు. లేదంటే లోడును మిల్లర్లకు తిప్పి పంపుతున్నారు. ఎలా చేస్తారు? మిథైల్ రెడ్, బ్రోయోథైమోల్ బ్లూ, ఇథైల్ ఆల్కహాల్, శుద్ధమైన నీటిని కలిపి ప్రత్యేక ద్రావణాన్ని తయారు చేస్తారు. టెస్ట్‌ట్యూబ్‌లో 10 ఎంఎల్ మిశ్రమాన్ని తీసుకుని ఐదు గ్రాముల నమూనా బియ్యాన్ని కలపాలి. నిముషం తర్వాత బియ్యం రంగు మారుతుంది. ఆకుపచ్చగా మారితే తాజా మిల్లింగ్ బియ్యం (నెలలోపు మిల్లింగ్ చేసినవి) అని పరిగణిస్తారు. లేత ఆకుపచ్చ రంగులో మారితే ఒకటి నుంచి రెండు నెలలు, పసుపు రంగులో మారితే మూడు నెలలు, నారింజ రంగులోకి మారితే నాలుగు నుంచి ఐదు నెలల క్రితం మిల్లింగ్ చేసినవిగా నిర్ధారిస్తారు. పాత ధాన్యాన్ని మర పట్టిస్తే ఇబ్బంది ఉండదు. పాత బియ్యాన్ని కొత్తగా మిల్లింగ్ చేస్తే మాత్రం తెలిసిపోతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో.. మిల్లింగ్ అనంతరం బియ్యంలో నూకలు, రంగు, తేమ శాతాన్ని గుర్తించేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని వినియోగిస్తున్నారు. ఈ యంత్రం విలువ సుమారు రూ.13 లక్షలు ఉంటుంది. సివిల్ సప్లయిస్ ప్రధాన కార్యాలయంతో పాటు విజయవాడ, ఏలూరు, కాకినాడ, విజయనగరం, శ్రీకాకుళం, నెల్లూరు జిల్లా కార్యాలయాల్లో అందుబాటులో ఉంచారు. దేశంలో తొలిసారిగా.. రేషన్ బియ్యం దోపిడీని అరికట్టేందుకు ‘రైస్ ఏజ్ టెస్టింగ్’ విధానాన్ని దేశంలో మొదటి సారిగా రాష్ట్రంలో ప్రవేశపెట్టాం. ప్రయోగాత్మక ఫలితాల అనంతరం దేశమంతా దీన్ని పాటించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ఇది రాష్ట్రానికి గర్వకారణం. బియ్యం కచ్చితంగా నిర్ధారణ అవుతుండటంతో బియ్యం రీసైక్లింగ్ దందాకు అడ్డుకట్ట పడుతుంది. చౌక బియ్యం బ్లాక్ మార్కెట్‌కు తరలకుండా అడ్డుకోవచ్చు. – వీరపాండియన్, రాష్ట్ర పౌరసరఫరాల కార్పొరేషన్ ఎండీ -
81 కోట్ల రేషన్ కార్డు దారులకు కేంద్రం శుభవార్త!
న్యూఢిల్లీ: రేషన్ కార్డుదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. కరోనా మహమ్మారి కారణంగా పెద ప్రజలకు ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద అందిస్తున్న ఉచిత రేషన్ కార్యక్రమాన్ని మార్చి 2022 వరకు పొడగిస్తున్నట్లు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. ఈ 'ఉచిత రేషన్ కార్యక్రమాన్ని 2022 మార్చి వరకు అందించడానికి 'ప్రధాని గరీబ్ కళ్యాణ్ అన్నా యోజనను పొడిగించాలని కేంద్రం కేబినెట్ నిర్ణయించినట్లు ఠాకూర్ తెలిపారు. గతేడాది కోవిడ్-19 వల్ల విధించిన లాక్డౌన్ దృష్ట్యా పెదప్రజలకు ఉచితంగా రేషన్ అందించడానికి ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన(పీఎంజీకెఏవై)ని మార్చి 2020లో ప్రకటించారు. 2020 ఏప్రిల్‌లో ఈ పథకం మొదలైంది. కరోనా సెకండ్ వేవ్కారణంగా ఈ ఏడాది జూన్ వరకు పొడగించారు. ఆ తర్వాత కరోనా పరిస్థితుల వల్ల పేదలు ఇబ్బంది పడకుండా.. జూన్‌లో మరో ఐదు నెలలు( 2021 నవంబర్ 30 వరకు) పొడిగించారు. ఇప్పుడు మళ్లీ మరో నాలుగు నెలలు పొడగించారు. దేశవ్యాప్తంగా జాతీయ ఆహార భద్రతా చట్టం (ఎన్ఎఫ్ఎస్ఎ) కింద గుర్తించిన 81 కోట్ల రేషన్ కార్డుదారులకు కేంద్ర ప్రభుత్వం 2020 ఏప్రిల్ నుంచి ఉచితంగా రేషన్ సరఫరా చేస్తుంది. ప్రతి నెల 5 కిలోల ఆహార ధాన్యాలను(గోధుమ/బియ్యం) ఉచితంగా పంపిణీ చేస్తుంది. Cabinet decides to extend additional free 5-kg foodgrains scheme by four months till March 2022: Union Minister Anurag Thakur — Press Trust of India (@PTI_News) November 24, 2021 (చదవండి: వర్క్‌ఫ్రమ్ హోం.. గూగుల్‌కు ఉద్యోగుల ఝలక్!) -
రేషన్ బియ్యం పేరుతో మహిళల ఫోన్ నంబర్లు.. అర్థరాత్రి ఫోన్ చేసి
పామిడి: అర్ధరాత్రి సమయంలో మహిళలకు ఫోన్ చేసి అసభ్యంగా మాట్లాడుతున్న ఆకతాయిని స్థానికులు గుర్తించి దేహశుద్ధి చేశారు. వివరాలు.. పామిడి మండలం పాళ్యం గ్రామానికి చెందిన యువకుడు అశోక్.. రేషన్ బియ్యం కొనుగోలు చేస్తానంటూ చాలా మంది మహిళల ఫోన్ నంబర్లు సేకరించుకున్నాడు. ఈ క్రమంలోనే వారికి అర్ధరాత్రి సమయంలో అపరిచిత నంబర్ల నుంచి ఫోన్ చేస్తూ వేధించేవాడు. ఇటీవల మండల కేంద్రంలోని పామిడమ్మ వీధికి చెందిన మహిళకు అర్ధరాత్రి ఫోన్ చేసి అనుచిత వ్యాఖ్యలు చేయడంతో కుటుంబసభ్యులు జోక్యం చేసుకుని మాట్లాడారు. మంగళవారం నెహ్రూ కాలనీలోని ఓ ప్రైవేట్ స్కూల్ వద్ద అశోక్‌ని గుర్తించి, నిలదీయడంతో వారితో వాగ్వాదానికి దిగాడు. సహనం కోల్పోయిన బాధితులు ఒక్కసారిగా అతనికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. విచారణలో వారం రోజుల క్రితం పామిడిలోని మదీనా కాలనీలో ఓ మహిళపై అతను దాడి చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. -
రేషన్ బియ్యంలో పురుగులు
సాక్షి, ఉప్పల్(హైదరాబాద్): ప్రభుత్వ చౌక ధరల దుకాణాల ద్వారా సరఫరా అవుతున్న బియ్యంలో పురుగులు, బూజు ఉంటుండటంతో వాటిని తీసుకొని మేమేం చేయాలని లబ్ధిదారులు వాపోతున్నారు. ఉచిత బియ్యం పనికిరానివిగా తయారయ్యాయి. దీంతో వండుకొని ఎలా తినాలని ప్రశ్నిస్తున్నారు. కరోనా కష్ట కాలంలో ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్న తమకు పురుగులు పట్టిన బియ్యం పంపిణీ చేస్తున్నారని మండిపడుతున్నారు. నవంబర్ కోటా కింద మెజారిటీ చౌకధరల దుకాణాలకు నాసిరకం బియ్యం పంపిణీ జరిగినట్లు తెలుస్తోంది. అధికంగా నాసిరకం బియ్యమే వచ్చాయని డీలర్లు పేర్కొంటున్నారు. గోదాముల్లో నిల్వ ఉన్న స్టాక్ పంపిస్తుండటంతో బియ్యం పురుగులు, తుట్టెల మయంగా మారింది. సంబందిత అదికారుల పర్యవేక్షణ లోపంతోనే నాసిరకం బియ్యం సరఫరా అవుతున్నట్లు డీలర్లు ఆరోపిస్తున్నారు. డీలర్లతో లబ్ధిదారుల గొడవ ఉచిత పంపిణీ ప్రక్రియతో సన్న బియ్యం కాస్త దొడ్డుగా మారినట్లు లబ్ధిదారులు వాపోతున్నారు. వాస్తవంగా పాఠశాలలకు సరఫరా చేసే బియ్యాన్ని స్టాకు ఉన్నంత వరకు రేన్ షాపులకు పంపిణీ చేయాలని ప్రభుత్వం ఆదేశించినా...అమలు మాత్రం మునాళ్ల ముచ్చటగా మారింది. ప్రస్తుతం దొడ్డుబియ్యం పంపిణీ చేస్తుండటంతో లబ్ధిదారులు డీలర్లతో వాగ్వివాదానికి దిగడం సర్వసాధారణమైంది. సన్నబియ్యం అమ్ముకుని తమకు నాసిరకమైన దొడ్డుబియ్యాన్ని అంటగడుతున్నారని వాదనకు దిగుతున్నారు. బియ్యం అంతా పురుగులు పట్టి తుట్టెలు కట్టి ఉండడంతో తమకు వద్దని, నాణ్యమైన బియ్యం అందించాలని మరికొందరు అక్కడే ఆందోళనకు దిగుతున్నారు. ప్రభుత్వం, అధికారులు చొరవ చూపి నాణ్యమైన బియ్యాన్ని అందించాలని డిమాండ్ చేస్తున్నారు. వసతి గృహాల్లో సైతం.. వసతిగృహాల విద్యార్థులకు పురుగుల అన్నమే దిక్కయింది. వేసవి సెలవులకు ముందొచ్చిన బియ్యాన్ని వసతిగృహాల్లో నిల్వ ఉంచగా పురుగులు పట్టాయి. వాటినే వండి పెడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. వసతిగృహాల్లో బియ్యం పురుగు పడుతున్నాయి. వసతిగృహ అధికారులకు ముందు చూపు లేకపోవడంతోనే ఈ పరిస్థితి నెలకొంది. కరోనా లాక్డౌన్ నేపథ్యంలో వసతి గృహాలు మూత పడి బియ్యం నిల్వ ఉండడంతో పురుగులు పడినట్లు తెలుస్తోంది. తాజాగా వసతి గృహాలు పునఃప్రారంభం కావడంతో విద్యార్థులకు నిల్వ బియ్యాన్నే వార్డెన్లు వండి పెడుతున్నారు. పురుగులు పట్టిన బియ్యాన్ని పౌర సరఫరాల గోదాముకు అప్పగించి వాటి స్థానంలో కొత్త బియ్యాన్ని తీసుకోవాల్సిన అధికారులు ఆ దిశగా చర్యలు చేపట్టకుండా ఉన్న నిల్వ బియ్యాన్నే వండి పెట్టడం విస్మయానికి గురిచేస్తోంది. -
జోగులాంబ గద్వాల జిల్లాలో అక్రమంగా రేషన్ బియ్యం తరలింపు
-
రేషన్ బియ్యం: బస్తాకు 4 నుంచి 11 కిలోల తక్కువ
కౌడిపల్లి (నర్సాపూర్): రేషన్ బియ్యం బస్తా సాధారణంగా 50 కిలోలు ఉంటుంది. కాగా ఎంఎల్ఎస్ పాయింట్ నుంచి సరఫరా చేసిన రేషన్ బియ్యం బస్తాల్లో మాత్రం ఒక్కో బస్తా ఒక్కోరకంగా ఉంటుంది. ఒక బస్తాలో 46 కిలోలు ఉండగా మరో బస్తా 40 కిలోలు మాత్రమే ఉంది. లెక్కమాత్రం 50 కిలోల చొప్పున ఇస్తున్నారు. దీంతో రేషన్‌డీలర్లు తీవ్రంగా నష్టపోతున్నారు. దీంతో నష్టాన్ని తిరిగి డీలర్లు ప్రజలపైనే రుద్దుతున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. కౌడిపల్లి మండలం వెల్మకన్న గ్రామానికి మే నెలకు సంబంధిం రేషన్ బియ్యం 70క్వింటాళ్ల 60 కిలోలు (140) బస్తాలు పంపించారు. ఇక్కడి డీలర్ పదవీ విరమణ చేయడంతో సమీపంలోని కొట్టల గ్రామ డీలర్ కిషన్ బియ్యం పంపిణీ చేస్తున్నారు. శుక్రవారం బియ్యం పంపిణీ చేయగా గ్రామ ఉపసర్పంచ్, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు కాజిపేట రాజేందర్ తదితరులు పరిశీలించారు. దీంతో ఎంఎల్ఎస్ పాయింట్ నుంచి వచి్చన ఒక్క బస్తాకూడ 50కిలోలు లేదు. ఒక్కో బస్తాలో 4 నుంచి 11కిలోల బియ్యం తక్కువగా వచ్చాయి. దీంతో 70క్వింటాళ్లు రావాల్సిన బియ్యం 60 క్వింటాళ్లు కూడా రాలేదు. చర్యలు తీసుకోవాలి.. ఎంఎల్ఎస్ పాయింట్ నుంచి ప్రతి రేషన్ షాపునకు బియ్యం వస్తున్నాయి. ఒక్క వెల్మకన్న డీలర్‌కు వచ్చిన బియ్యంలోనే పది క్వింటాళ్లు తక్కువగా వస్తే జిల్లా మొత్తంలో ఇలాగే జరుగుతుంది. దీంతో ఎంఎల్ఎస్ పాయింట్వద్ద పెద్దమొత్తంలో కుంభకోణం జరుగుతుంది. దీని వెనక ఉన్న అధికారులపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి. - కాజిపేట రాజేందర్, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు -
20 ఏళ్లుగా బియ్యం స్మగ్లింగ్.. కోట్లకు పడగలెత్తిన టీడీపీ నేత
సాక్షి, తిరుపతి : టీడీపీకి చెందిన మాజీ ఎంపీపీ భర్త పద్మనాభరాజు అక్రమంగా తమిళనాడుకు తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని స్పెషల్ బ్రాంచ్ పోలీసులు మంగళవారం పట్టుకున్నారు. పిచ్చాటూరు ఎస్ఐ వంశీధర్ కథనం మేరకు.. పద్మనాభరాజుకు చెందిన లారీల ద్వారా రేషన్ బియ్యం అక్రమ రవాణా జరుగుతోందని జిల్లా ఎస్పీ రిషాంత్ రెడ్డికి సమాచారం అందింది. దీంతో స్పెషల్ బ్రాంచ్ పోలీసులు రెండు బృందాలుగా దాడులకు దిగారు. ఒక బృందం పిచ్చాటూరులో, మరో బృందం నాగలాపురంలో రేషన్ బియ్యం అక్రమ రవాణాపై మఫ్టీలో కాపు కాచింది. మంగళవారం వేకువ జామున 3.30 గంటలకు కీళపూడిలోని పద్మనాభరాజు రైస్ మిల్లు నుంచి 10.50 టన్నుల రేషన్ బియ్యంతో లారీ చెన్నై వైపు బయలు దేరింది. మార్గ మధ్యంలో అడవి కొడియంబేడు వద్దకు లారీ చేరుకోగానే మాటు వేసిన స్పెషల్ బ్రాంచ్ పోలీసులు సినీ ఫక్కీలో లారీని అడ్డుకున్నారు. డ్రైవర్ దిగి పరారయ్యాడు. లారీని తనిఖీ చేయగా అందులో 10.50 టన్నుల రేషన్ బియ్యం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. బియ్యం సహా లారీని స్టేషన్‌కు తరలించి స్థానిక ఎస్ఐ వంశీధర్‌కు అప్పగించారు. బియ్యం అక్రమ రవాణాపై డ్రైవర్ తంగరాజ్, టీడీపీ నేత పద్మనాభరాజు సొంత తమ్ముడు కొడుకు వినయ్‌ను అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. బియ్యం సహా టర్బో లారీని స్థానిక సివిల్ సప్లయిస్ డీటీకి అప్పగించినట్లు ఆయన తెలిపారు. స్మగ్లర్ పద్మనాభరాజుపై ఎన్నో కేసులు పద్మనాభరాజు రేషన్ బియ్యం అక్రమంగా రవాణా చేస్తూ పలుమార్లు పట్టుబడ్డాడని, స్మగ్లర్‌గా పలు కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఇరవై ఏళ్లుగా బియ్యం స్మగ్లింగ్ వృత్తిగా రూ.కోట్లకు పడగలెత్తాడు. 2010లో బియ్యం అక్రమ రవాణా చేస్తూ పట్టుబడి చర్లపల్లిలో జైలు శిక్ష అనుభవించాడు. అప్పట్లో రాజకీయాల్లో లేకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందనుకున్నాడు. వెంటనే తన వృత్తికి అనుకూలంగా ఉన్న టీడీపీలో చేరాడు. ఆ తరువాత టీడీపీ ఎంపీపీ అభ్యర్థిగా తన భార్యను నిలబెట్టి బియ్యం స్మగ్లింగ్ డబ్బులతో గెలిపించుకున్నాడు. అప్పటి నుంచి బియ్యం అక్రమ రవాణాకు అడ్డు అదుపు లేకుండా పోయింది. అధికారులను తన చెప్పు చేతల్లో ఉంచుకుని సత్యవేడు, నగరి నియోజకవర్గాల్లో యథేచ్ఛగా దందాను సాగించాడు. 2018లో టీడీపీ నేతలే అక్రమ బియ్యం రవాణా సమాచారాన్ని పోలీసులకు తెలియజేసి పట్టివ్వడం గమనార్హం. రెండునెలల కిందట పిచ్చాటూరు లోని దుకాణంలో నిల్వ ఉంచిన రేషన్ బియ్యం బస్తాలను రెవెన్యూ అధికారులు సీజ్ చేశారు. -
లక్ష టన్నుల బియ్యం స్వాహా.. బయటపడ్డ భారీ అక్రమాలు!
ఆయన వనపర్తి జిల్లా పానగల్ మండల కేంద్రానికి చెందిన ఓ రైస్ మిల్లర్.. మరికొందరు మిల్లర్లను జతచేసుకుని ఎఫ్‌సీఐతో కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) ఒప్పందాలు చేసుకుంటున్నారు. రేషన్ బియ్యాన్ని అక్రమంగా సీఎంఆర్ కింద రీసైక్లింగ్ చేస్తు న్నారు. ఆయనకు ఉమ్మడి పాలమూరు జిల్లాలోనే బియ్యం డాన్‌గా పేరున్నట్టు ప్రచా రంలో ఉంది. ఆయనకు చెం దిన వాహనాలు రేషన్ బియ్యాన్ని అక్రమంగా తర లిస్తూ.. గతేడాది జూన్ 26 నుంచి నెల రోజుల వ్యవధిలోనే మూడు సార్లు పట్టుబడ్డాయి. అధికారిక దాడుల్లో 1,013 క్వింటాళ్ల బియ్యం దొరికింది. 2018లో అప్పటి జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి పానగల్‌లోని సంబంధిత మిల్లులో ఆకస్మికంగా తనిఖీలు చేశారు. లెక్కలకు మించిన ధాన్యం ఉన్నట్టు గుర్తించి సీఎంఆర్ ఒప్పందాలను రద్దు చేశారు. భవిష్యత్తులోనూ అనుమతులు ఇవ్వొద్దని ఆదేశించారు. కానీ సదరు ‘బియ్యం డాన్’.. తన కుమారుడి పేరుమీద జిల్లా కేంద్రంలో, కొత్తకోట మండలంలో కొన్ని రైస్ మిల్లులను లీజ్‌కు తీసుకుని సీఎంఆర్ ఒప్పం దాలు చేసుకున్నారు. ఎప్పట్లాగే తన సొంత గ్రామంలో నిర్మాణం లోని మిల్లు వద్ద, పానగల్లో సీజ్ చేసిన మిల్లు వద్ద రేషన్ బియ్యాన్ని పెద్ద మొత్తంలో రీసైకిల్ చేస్తూ పట్టుబడ్డారు. అయినా అధికారులు 6ఏ కేసులు మాత్రమే నమోదు చేసి చేతులు దులుపుకొన్నారు. ఇంత జరిగినా కొందరు అ«ధికారుల సహకారంతో బినామీ పేర్లతో సీఎంఆర్ ఒప్పందాలు చేసుకుని దందా కొనసాగిస్తున్నారు. హైదరాబాద్: రాష్ట్రంలో కస్టమ్ మిల్లింగ్ బియ్యం విషయంలో పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నాయి. రైతుల నుంచి కొన్న ధాన్యాన్ని బియ్యంగా మార్చి ఇవ్వాలంటూ ప్రభుత్వం మిల్లర్లకు అప్పగిస్తే.. మిల్లర్లు బియ్యం తిరిగివ్వకుండా, బయట అమ్ముకుని వ్యాపారం చేసుకుంటున్నారు. 2019–20 ఏడాది యాసంగికి సంబంధించి రూ.400 కోట్ల విలువైన 1.25 లక్షల టన్నుల బియ్యాన్ని ఇప్పటికీ తిరిగి అప్పగించకుండా దందా చేస్తున్నారు. గట్టిగా ఒత్తిడి తెస్తే.. పేదలకు పంపిణీ చేస్తున్న రేషన్ బియ్యాన్ని అక్రమ మార్గాల్లో సేకరించి, దాన్నే రీసైక్లింగ్ చేసి ప్రభుత్వానికి అంటగడుతున్నారు. ఇంత జరుగుతున్నా.. మిల్లర్లను బ్లాక్‌లిస్టులో పెట్టడంగానీ, రెవెన్యూ రికవరీ యాక్టు ప్రయోగించి వసూలు చేయడంగానీ చేయడం లేదు. కొందరు అధికారులు, మిల్లర్ల అసోసియేషన్ నేతల అండతోనే ఈ వ్యవహారం సాగుతోందన్న ఆరోపణలు ఉన్నాయి. గడువు పొడిగించినా చలనమేదీ? సర్కారు రైతుల నుంచి కొన్న ధాన్యాన్ని రైస్ మిల్లులకు పంపి, బియ్యంగా మార్పించి తిరిగి తీసుకుంటుంది. దీనిని కస్టమ్ మిల్లింగ్ అంటారు. మిల్లర్లు ఒక్కో క్వింటాల్ ధాన్యానికి.. ముడి బియ్యం అయితే 67 కిలోలు, బాయిల్డ్ రైస్ అయితే 68 కిలోలు ఇవ్వాల్సి ఉంటుంది. మిల్లింగ్ చేసినం దుకు ప్రభుత్వం క్వింటాల్‌కు ఇంత అని చార్జీలు చెల్లిస్తుంది. అయితే ప్రభుత్వం పంపిన ధాన్యాన్ని బియ్యంగా మార్చి తిరిగి అప్పగించడంతో రైస్ మిల్లర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఒక్కోసారి ధాన్యం తీసుకుని ఏడాది దాటుతున్నా బియ్యాన్ని తిరిగి పంపడం లేదు. ► 2019–20 యాసంగి సీజన్లో ప్రభుత్వం రైతుల నుంచి కొన్న 64.17 లక్షల టన్నుల ధాన్యాన్ని సీఎంఆర్ కోసం రైస్ మిల్లర్లకు పంపింది. ఈ మేరకు మిల్లర్లు 43.59 లక్షల టన్నుల బియ్యాన్ని అప్పగించాలి. కానీ 42.34 లక్షల టన్నులే తిరిగి చ్చారు. ఇంకా 1.25 లక్షల టన్నులు రాలేదు. ప్రధానంగా పెద్దపల్లిలో 28,168 టన్నులు, వరంగల్ ఆర్బన్ 19,122, వరంగల్ రూరల్ 12,165, సూర్యాపేట 16,679, మంచిర్యాల 3,386, నిర్మల్ 3,534, నిజామాబాద్ 2,549, మెదక్ 6,853, కరీంనగర్ 4,479, జగిత్యాల 8,184, మహబూబాబాద్ 4,655, జనగాం 2,975, ములుగు 5,969, యాదాద్రి 7,884, వనపర్తి 4,510 గద్వాల జిల్లా నుంచి 2,492 టన్నులు సీఎంఆర్ బియ్యం రావాల్సి ఉంది. ►నిజానికి ఈ బియ్యాన్ని గత ఏడాది అక్టోబర్ నాటికే అప్పగించాల్సి ఉన్నా మిల్లర్ల నుంచి స్పందన లేదు. ఈ విషయంగా గత ఏడాది నవంబర్లోనే సమీక్షించిన సీఎస్ సోమేశ్ కుమార్.. డిసెంబర్ నాటికే సీఎంఆర్ ఇవ్వాలని ఆదేశించారు. అయినా ఫలితం రాలేదు. ఇలా నాలుగు మార్లు గడువు పొడిగించినా 1.25 లక్షల టన్నుల బియ్యం పెండింగ్‌లోనే ఉంది. ఆ బియ్యం విలువ రూ.400 కోట్ల వరకు ఉంటుంది. ఉమ్మడి నల్లగొండ, నిజామాబాద్, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లోనే సీఎంఆర్ ఇవ్వని మిల్లులు ఎక్కువగా ఉన్నాయి. ప్రైవేటు బిజినెస్.. పీడీఎస్‌కు పాలిష్.. కేంద్ర మార్గదర్శకాల ప్రకారం.. సీఎంఆర్ ధాన్యాన్ని మిల్లింగ్ చేసి 45 రోజుల్లోగా బియ్యాన్ని తిరిగి అప్పగించాలి. కానీ రాష్ట్రంలో ఎన్నడూ ఈ గడువులోగా బియ్యం ఇచ్చిన దాఖలాలు లేవు. కనీసం పెంచిన గడువు వరకూ కూడా అంద జేయడం లేదు. దీనికి కారణం సీఎంఆర్ కింద ఇవ్వాల్సిన బియ్యంతో మిల్లర్లు ప్రైవేటు వ్యాపారం చేయడమే. కర్ణాటక, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లో ధాన్యం సాగు ఎక్కువగా లేకపోవడం, రెండేళ్లుగా దిగుబడి తగ్గడంతో వారంతా తెలంగాణపైనే ఆధారపడ్డారు. మరోవైపు మలేసియా, ఇండోనేషియా, నైజీరియా, శ్రీలంక దేశాలకు మన రాష్ట్రం నుంచే బియ్యం ఎగుమతి అవుతోంది. ఇలా డిమాండ్ ఉండటంతో.. మిల్లర్లు ప్రభుత్వానికి అప్పగించాల్సిన ధాన్యాన్ని బయట మార్కెట్లలో అమ్మేసుకుంటున్నారు. ప్రధానంగా బీపీటీ, హెచ్ఎంటీ, జైశ్రీరామ్, తెలంగాణ సోనా రకాలను ఎక్కువగా సాగు చేసే చోట ఈ దందా నడుస్తోంది. బియ్యం అప్పగించాలని ప్రభుత్వం ఒత్తిడి తెచ్చిన సందర్భాల్లో.. మిల్లర్లు పీడీఎస్ బియ్యాన్నే సేకరించి సీఎంఆర్ కింద అప్పగిస్తున్నారు. ముఖ్యంగా భూపాలపల్లి, పెద్దపల్లి, ఖమ్మం, ఆదిలాబాద్, నిర్మల్, మహబూబాబాద్, వనపర్తి, గద్వాల జిల్లాల్లో దళారుల ద్వారా రేషన్ బియ్యాన్ని రూ.8 నుంచి రూ.10 చొప్పున కొంటున్నారు. ఆ బియ్యాన్ని ప్రభుత్వానికి అప్పగిస్తున్నారు. గత ఏడాది విజిలె¯న్స్ దాడుల్లో చాలా చోట్ల ఈ అక్రమాలను గుర్తించారు. వనపర్తి జిల్లాలో రాజకీయ ఆశీస్సులున్న ఓ రైస్ మిల్లర్‌కు చెందిన మిల్లులో ఏటా రేషన్ బియ్యం పట్టుబడుతోంది. ఇటీవలే అదే రైస్‌మిల్లులో ఏకంగా 500 క్వింటాళ్ల రేషన్ బియ్యం స్వాధీనం చేసుకున్నారు. సదరు మిల్లర్ ప్రత్యేకంగా ఓ వ్యవస్థను ఏర్పాటు చేసుకొని మరీ.. వనపర్తితోపాటు పక్క జిల్లాల నుంచీ రేషన్ బియ్యం సేకరిస్తున్నట్టు గుర్తించారు. అయినా సదరు రైస్‌మిల్లుకు మళ్లీ సీఎంఆర్ కింద ధాన్యం కేటాయించడం గమనార్హం. ఇలాంటి మిల్లులు రాష్ట్రంలో 70 నుంచి 80 వరకు ఉన్నట్టు అంచనా. బ్లాక్ లిస్టులో పెట్టినా.. నల్లగొండ జిల్లా చిట్యాల మండల కేంద్రంలోని వరలక్ష్మి రైస్ మిల్లు గడువులోగా సీఎంఆర్ బియ్యం ఇవ్వలేదన్న కారణంగా పౌర సరఫరాల శాఖ దాన్ని బ్లాక్ లిస్టులో పెట్టింది. అయితే నల్లగొండకు చెందిన ఓ వ్యాపారి.. రాజకీయ పలుకుబడితో, పౌర సరఫరాల అధికారుల సాయంతో మిల్లు ఓనర్‌పై ఒత్తిడి తెచ్చి, దానిని కొనేశారు. సదరు మిల్లు ద్వారా అప్పగించాల్సిన సీఎంఆర్ బియ్యాన్ని ఆయనే ప్రభుత్వానికి అప్పగించారు. ఏదైనా మిల్లును బ్లాక్ లిస్టులో పెడితే.. తర్వాతి సీజన్లోనే, యాజమాన్యం మారితేనే సీఎంఆర్ ఇవ్వాలి. కానీ అధికారుల తోడ్పాటుతో.. బ్లాక్ లిస్టులో పెట్టిన సీజన్లోనే వరలక్ష్మి మిల్లు ద్వారా సీఎంఆర్ బియ్యం అప్పగించినట్టు లెక్కల్లో చూపారు. అంటే సీఎంఆర్ విషయంలో మిల్లర్లు, అధికారులు ఎలా కలిసిపోయారో అర్థం చేసుకోవచ్చు. అసోసియేషన్ నాయకుడి అండతోనే.. జగిత్యాల జిల్లాలో గతనెలలో దాదాపు 10 మిల్లులు సీఎంఆర్ ధాన్యాన్ని బ్లాక్ మార్కెట్‌కు తరలించినట్టు ఎఫ్‌సీఐ తనిఖీల్లో తేలింది. అయినా వాటిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మిల్లర్ల అసోసియేషన్ నాయకుడొకరు అధికార యంత్రాంగాన్ని శాసిస్తున్నాడని, మిల్లులపై చర్యలు తీసుకోకుండా అడ్డుపడుతున్నారని బహిరంగంగానే చర్చ జరుగుతున్నా అడిగే నాథుడు లేడు. సీఎంఆర్‌కు సంబంధించి ఇటీవల ఎఫ్‌సీఐ అధికారులు రంగంలోకి దిగి తనిఖీలు చేస్తున్నారు. దీంతో మిల్లర్లు ఏకంగా ఎఫ్‌సీఐ అధికారులు వేధిస్తున్నారంటూ రివర్సులో ఆరోపణలు చేస్తుండడం గమనార్హం. నాణ్యత లేని బియ్యాన్ని ఎఫ్‌సీఐకి తరలించినా ఎవరూ అడ్డుచెప్పకుండా, మిల్లర్ల వద్దకు అధికారులెవరూ రాకుండా ముందు జాగ్రత్తగా మిల్లర్లు ఇలా మైండ్‌గేమ్ ఆడుతున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. నో రికవరీ.. నో బ్లాక్‌లిస్ట్.. సీఎంఆర్ బియ్యం తిరిగివ్వడంలో జాప్యం చేస్తున్న మిల్లర్లపై చర్యలే లేకుండా పోయాయి. 2014 నుంచి 2016 వరకు 137 మంది మిల్లర్ల నుంచి 1.20 లక్షల టన్నుల బియ్యం రావాల్సి ఉన్నా.. ప్రభుత్వం పెద్దగా పట్టించుకోలేదు. ఆ బియ్యం విలువ సుమారు రూ.165 కోట్లు. అయితే అప్పటి పౌర సరఫరాల శాఖ కమిషనర్లు సీవీ ఆనంద్, అకున్ సబర్వాల్ గట్టిగా ఒత్తిడి తెచ్చి.. 30 మంది మిల్లర్ల నుంచి రూ.80 కోట్ల విలువైన బియ్యాన్ని రికవరీ చేశారు. ఇంకా రూ.85 కోట్ల బియ్యాన్ని రికవరీ చేయాల్సి ఉన్నా పట్టించుకున్నవారు లేరు. కేవలం 80 రైస్ మిల్లులను బ్లాక్‌లిస్టులో పెట్టి వదిలేశారు. 2016 తర్వాత సీఎంఆర్ బియ్యం తిరిగివ్వడంతో ఎంత జాప్యం చేస్తున్నా సదరు మిల్లర్ల నుంచి రెవెన్యూ రికవరీ గానీ, బ్లాక్‌లిస్టులో పెట్టడం గానీ జరగడం లేదు. మిల్లర్లు ఎప్పుడిస్తే అప్పుడే అన్నట్టు వ్యవహారం నడుస్తోంది. 2019–20కి సంబంధించి 1.25 లక్షల టన్నుల బియ్యం ఇవ్వని 70 వరకు మిల్లులను బ్లాక్‌లిస్టులో పెట్టే అవకాశమున్నా.. పౌర సరఫరాల శాఖ చర్యలు చేపట్టడం లేదు. ఎఫ్‌సీఐ వద్దు..రాష్ట్రమే ముద్దు మిల్లర్లు సీఎంఆర్ ధాన్యాన్ని మర పట్టించాక.. బియ్యాన్ని ఎఫ్‌సీఐకి డెలివరీ చేస్తారు. ఆ బియ్యానికి సంబంధించిన డబ్బును ఎఫ్‌సీఐ రాష్ట్ర పౌర సరఫరాల శాఖకు జమచేస్తుంది. తర్వాత ఎఫ్‌సీఐ రాష్ట్రంలో రేషన్ పంపిణీకోసం అవసరమైన బియ్యాన్ని సబ్సిడీ ధరపై పౌర సరఫరాల సంస్థకు ఇస్తుంది. అంటే ప్రభుత్వం కొన్న ధాన్యానికి సంబంధించిన బియ్యం ఎఫ్‌సీఐకి వెళ్లి.. తిరిగి సబ్సిడీ ధరతో పౌరసరఫరాల సంస్థకు వస్తుంది. అయితే ఎఫ్‌సీఐ సీఎంఆర్ బియ్యం నాణ్యత విషయంలో నిబంధనలను ఇటీవల కఠినంగా అమలు చేస్తోంది. నూకలు, రంగు మారడం వంటివి నిర్ణీత మొత్తానికి ఏమాత్రం ఎక్కువ ఉన్నా.. ఆ బియ్యాన్ని తీసుకోవడం లేదు. నూకలు 25 శాతానికి మించొద్దన్న నిబంధనను ఎఫ్‌సీఐ పక్కాగా అమలు చేస్తుంది. అదే పౌరసరఫరాల సంస్థకు ఇచ్చే బియ్యంలో నూకలు 40– 50 శాతం ఉంటున్నా.. రాళ్లు, మట్టిగడ్డలు, రంగు మారడం వంటివి ఉన్నా అధికారులు పట్టించుకోరు. ఎఫ్‌సీఐకి నాణ్యమైన బియ్యం ఇవ్వడంకంటే.. పౌర సరఫరాల శాఖకు నాణ్యత లేనివి అంటగడితే మిల్లర్లకు రూ.కోట్లలో కలిసొస్తుంది. ►నిజానికి రాష్ట్రంలో రేషన్, మధ్యాహ్న భోజనం అవసరాలకు ఏటా 20 లక్షల టన్నుల బియ్యం అవసరం. కానీ మిల్లర్ల ఒత్తిళ్లకు తలొగ్గి పౌర సరఫరాల సంస్థ అంతకుమించి సేకరిస్తోంది. 2018–19లో ఇలా అదనంగా ఏడెనిమిది లక్షల టన్నులు తీసుకున్నది. అవసరం లేకున్నా తీసుకున్న ఆ బియ్యాన్ని గోదాముల్లో నిల్వ చేయడం, బ్యాంకుల ద్వారా తీసుకున్న రుణాల చెల్లింపుల్లో జాప్యంతో సర్కారుకు రూ.75 కోట్ల అదనపు భారం పడింది. ►ఇప్పుడు కూడా సీఎంఆర్ బియ్యాన్ని ఎఫ్‌సీఐ గోదాములకు కాకుండా..నేరుగా పౌర సరఫరాల సంస్థ గోదాములకు పంపి, లెక్కల్లో సర్దుబాటు చేయించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ మేరకు పౌర సరఫరాల సంస్థ నుంచే లేఖ రాయించేందుకు మిల్లర్లు ఒత్తిడి తెస్తున్నట్టు తెలిసింది. -
ఇంటింటికి రేషన్.. వారి కళ్ళలో ఆనందం ఫోటోలు
-
ఎల్లుండి బియ్యం పంపిణీ వాహనాల ప్రారంభం
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): ఇంటింటికీ రేషన్ బియ్యం సరఫరా చేసే వాహనాలను ఈనెల 21వ తేదీన సీఎం వైఎస్ జగన్ ప్రారంభించనున్నారు. ఉదయం 9 గంటలకు విజయవాడలోని బెంజి సర్కిల్లో జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి జెండా ఊపి వాహనాలను లాంఛనంగా ప్రారంభిస్తారని కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ కె.మాధవీలత చెప్పారు. సోమవారం విజయవాడలో వాహనాల డ్రైవర్లు, వీఆర్వోలకు అవగాహనా సదస్సు నిర్వహించారు. మాధవీలత మాట్లాడుతూ.. కృష్ణా, పశ్చిమగోదావరి, గుంటూరు జిల్లాలకు చెందిన 2,503 డోర్ డెలివరీ వాహనాలను సీఎం ప్రారంభిస్తారని తెలిపారు. 20వ తేదీ రాత్రి 9 గంటలకు విజయవాడలోని బందర్ రోడ్డుపై ఒకొక్క వరుసలో 625 వాహనాల చొప్పున నాలుగు వరుసల్లో వాహనాలను నిలపాలని డ్రైవర్లకు సూచించారు. దీనికి అనుగుణంగా చర్యలు తీసుకోవాలని వీఆర్వోలను ఆదేశించారు. -
ఆ బియ్యమే తిన్నాం.. భయంగా ఉంది
మంచిర్యాల రూరల్ (హాజీపూర్): పేదలకు పంపిణీ చేసిన రేషన్ బియ్యంలో ప్లాస్టిక్ బియ్యం ఉందనే వార్త మంచిర్యాల జిల్లాలో కలకలం రేపింది. హాజీపూర్ మండలం వేంపల్లి గ్రామంలోని రేషన్ దుకాణంలో శనివారం బియ్యం పంపిణీ చేశారు. ఇంటికెళ్లి పరిశీలించగా ముత్యం వంటి పరిమాణంలో ప్లాస్టిక్ రాళ్లు కనిపించాయి. వీటిని గమనించిన లబ్ధిదారులు వెంటనే రేషన్ డీలర్‌కు చూపించి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయం తెలుసుకున్న సర్పంచ్ వోలపు శారద, ఎంపీటీసీ సభ్యుడు డేగ బాపు రేషన్ దుకాణాన్ని పరిశీలించి బియ్యం తీసుకున్న వారిని అప్రమత్తం చేశారు. వెంటనే దండోరా కూడా వేయించి ఆ బియ్యం తినొద్దని.. తిరిగి ఇచ్చేయమని చాటింపు వేయడంతో ఆ దుకాణంలో తీసుకున్న లబ్ధిదారులంతా ఆందోళన చెందారు. వారిలో పది మంది తీసుకున్న బియ్యంలో ప్లాస్టిక్ రాళ్లు ఉన్నాయి. శుక్రవారం పంపిణీ చేసిన వాటిలో కూడా కొందరికి ప్లాస్టిక్ రాళ్లు వచ్చాయని తేలింది. తహసీల్దార్ మహ్మద్ జమీర్ దుకాణాన్ని పరిశీలించారు. ప్లాస్టిక్ బియ్యం వంటి రాళ్లను కొంతమంది సమక్షంలో పంచనామా చేసి సీజ్ చేశామని తహసీల్దార్ తెలిపారు. అయితే మూడు రోజుల కిందట నంనూర్ పునరావాస కాలనీలోని రేషన్ దుకాణంలో కూడా బియ్యంలో ప్లాస్టిక్ వచ్చినట్లు ప్రచారం జరిగింది. వండుకుని తిన్నాం మొన్న శుక్రవారం రేషన్ బియ్యం తీసుకువెళ్లా. శనివారం ఉదయం ఇంట్లో ఈ బియ్యాన్నే వండుకుని తిన్నాం. ఇంతలో ప్లాస్టిక్ బియ్యం ఉన్నాయని దండోరా వేయించారు. అది విన్నప్పటి నుంచి భయంగా ఉంది. వెంటనే వండిన అన్నాన్ని పరిశీలిస్తే అందులో ప్లాస్టిక్ రాళ్లు కనిపించాయి. మేము అదే అన్నం తిన్నాం.. ఏం జరుగుతోందనని భయమవుతోంది. – మాదినేని రాజమ్మ, వేంపల్లి -
రేషన్ బియ్యం డోర్ డెలివరీకి ఏర్పాట్లు వేగవంతం
సాక్షి, అమరావతి: రేషన్ బియ్యం, ఇతర నిత్యావసర సరుకుల్ని లబ్ధిదారుల ఇళ్లకే తీసుకెళ్లి అందించేందుకు ప్రభుత్వం చకచకా ఏర్పాట్లు చేస్తోంది. బియ్యం, సరుకుల్ని ఇంటింటికీ తీసుకెళ్లేందుకు ఉపయోగించే మినీ ట్రక్కులను నిరుద్యోగుల ద్వారా కొనుగోలు చేయించి.. వారికి ఉపాధి కల్పించేందుకు నిర్ణయించిన ప్రభుత్వం వాటి లబ్ధిదారుల ఎంపికను పూర్తి చేసింది. ఈ నెల 4న అధికారులు జిల్లాల వారీగా ఇంటర్వ్యూలు నిర్వహించి మినీ ట్రక్కులు పొందేందుకు లబ్ధిదారుల జాబితాలను తయారు చేశారు. ఎంపిక చేసిన లబ్ధిదారుల జాబితాలపై జిల్లా కలెక్టర్లు ఆమోదముద్ర వేసి ఆయా జిల్లాల ఇన్చార్జ్ మంత్రులకు పంపించారు. ఇన్చార్జ్ మంత్రి అప్రూవల్ చేయగానే జాబితాలను రాష్ట్రస్థాయి అధికారులకు పంపిస్తారు. రాష్ట్ర కార్యాలయం ఆమోదించిన తరువాత ముఖ్య కార్యదర్శికి జాబితా పంపిస్తారు. వారి నుంచి అనుమతి రాగానే తిరిగి జిల్లాకు జాబితాలు వెళతాయి. ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం బీసీ, ఈబీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు మినీ ట్రక్కులను కేటాయించారు. వాటిని కొనుగోలు చేసేందుకు ఆయా కార్పొరేషన్ల ఈడీలు బ్యాంకర్లతో మాట్లాడి ఎంపికైన లబ్ధిదారులకు రుణాలు ఇప్పిస్తారు. లబ్ధిదారులతో ట్రక్కుల్ని కొనుగోలు చేయించిన వెంటనే వాటిని సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ద్వారా ఇంటింటికీ బియ్యం, ఇతర నిత్యావసర సరుకుల్ని రవాణా చేసేందుకు వినియోగిస్తారు. బ్యాంక్ రుణాల్ని లబ్ధిదారుల తరఫున 72 వాయిదాల్లో సివిల్ సప్లైస్ కార్పొరేషన్ నేరుగా బ్యాంకులకు చెల్లిస్తుంది. లబ్ధిదారులకు బ్యాంక్ రుణంతోపాటు అన్ని ఖర్చులు పోను రూ.10 వేల చొప్పున చెల్లిస్తారు. 72 నెలల అనంతరం సదరు వాహనం లబ్ధిదారు సొంతమవుతుంది. మొత్తం 9,260 మంది ఎంపిక వివిధ కార్పొరేషన్ల ద్వారా మొత్తం 9,260 మంది లబ్ధిదారులను అధికారులు ఎంపిక చేశారు. వీరిలో 3,800 మంది బీసీలు, 1,800 మంది ఈబీసీలు, 2,300 మంది ఎస్సీలు, 700 మంది ఎస్టీలు, 556 మంది ముస్లిం మైనార్టీలు, 104 మంది క్రిస్టియన్ మైనార్టీలు ఉన్నారు. -
భారీగా పెరిగిన ‘బియ్యం’ లబ్ధిదారులు
సాక్షి, అమరావతి: అర్హులందరికీ రేషన్ బియ్యం అందాలన్న సీఎం వైఎస్ జగన్ ఆదేశాలకు అనుగుణంగా అధికారులు చర్యలు చేపట్టడంతో రాష్ట్రంలో లబ్ధిదారుల సంఖ్య భారీగా పెరిగింది. బియ్యం కార్డుల్లో కుటుంబసభ్యుల సంఖ్య (యూనిట్లు) పెరిగింది. గతంతో పోలిస్తే 2.10 లక్షల మందికిపైగా బియ్యం కార్డుల్లో కొత్తగా నమోదయ్యారు. పేదలకు నాణ్యమైన బియ్యం పంపిణీ చేసేందుకు ప్రభుత్వం రేషన్ కార్డుల స్థానంలో బియ్యం కార్డులను అమల్లోకి తీసుకొచ్చింది. ఇన్నాళ్లూ పంపిణీ చేస్తున్న బియ్యం వండుకుని తినేందుకు వీలులేని పరిస్థితుల్లో ఎక్కువమంది వాటిని విక్రయిస్తున్నారు. తినగలిగే నాణ్యమైన బియ్యం పంపిణీ చేస్తే పేదలకు ఎంతో ప్రయోజనం ఉంటుందని భావించిన ప్రభుత్వం ఆ మేరకు చర్యలు తీసుకుంటోంది. వచ్చేనెల నుంచి లబ్ధిదారులకు వారి ఇళ్లవద్దే నాణ్యమైన బియ్యం పంపిణీ చేసేందుకు చురుగ్గా ఏర్పాట్లు చేస్తోంది. గతంలో మాదిరి బియ్యం కార్డులతో పెన్షన్, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్ వంటి పథకాలకు ముడిపెట్టలేదు. వైఎస్సార్ నవశకంతో అర్హుల గుర్తింపు ఇలా... వైఎస్సార్ నవశకం కార్యక్రమం ద్వారా ప్రభుత్వం పదినెలల కిందట బియ్యం కార్డుకు అర్హులను గుర్తించింది. ప్రతి 50 ఇళ్లకు ఉన్న గ్రామ, వార్డు వలంటీరు ఇంటింటికీ వెళ్లి అర్హులను గుర్తించారు. రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డులు 1,47,32,990 ఉంటే.. అందులో సుమారు 10 లక్షలమంది కార్డుదారులు అసలు బియ్యం తీసుకోవడంలేదని అప్పట్లో తేలింది. మరికొందరు అనర్హులుగా తేలారు. వలంటీరు ప్రతి ఇంటికీ వెళ్లి అర్హతల పత్రాన్ని వారికి ఇచ్చి, వారి నుంచి వివరాలు తీసుకున్నారు. ఈ మేరకు సిద్ధంచేసిన జాబితాను గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రదర్శించారు. అర్హులు, అనర్హుల జాబితాను ప్రజల ముందే ఉంచి సోషల్ ఆడిట్ నిర్వహించారు. ఒకవేళ అర్హత ఉండి పేరు లేకపోతే ఎవరికి దరఖాస్తు చేయాలనే వివరాలు కూడా సచివాలయాల్లో ప్రదర్శించారు. గత ప్రభుత్వంతో పోలిస్తే బియ్యం కార్డు పొందేందుకు అర్హతలను సడలించి మరింతమందికి ప్రయోజనం కలిగించేలా చర్యలు తీసుకున్నారు. అర్హత ఉంటే ఇంటికే బియ్యం కార్డు అర్హతే ప్రమాణంగా ప్రభుత్వం బియ్యం కార్డులు మంజూరు చేస్తోంది. అర్హత ఉన్నవారు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకుంటే పదిరోజుల్లోగా బియ్యం కార్డు వారి ఇంటికే వస్తోంది. అర్హులందరికీ కార్డులు ఇవ్వాల్సిందేనని సీఎం వైఎస్ జగన్ అధికారులకు పలుమార్లు స్పష్టం చేశారు. పెరిగిన యూనిట్లు నవశకం కార్యక్రమంలో భాగంగా సర్వే నిర్వహించినప్పుడు 1,47,32,990 రేషన్ కార్డులున్నాయి. వాటిలో 4,20,83,190 మంది కుటుంబసభ్యుల పేర్లు నమోదయ్యాయి. రాష్ట్రంలో ప్రస్తుతం 1,44,26,595 బియ్యం కార్డులుంటే వాటిలో 4,22,93,346 మంది కుటుంబసభ్యుల (యూనిట్లు) పేర్లు నమోదై ఉన్నాయి. ఈ లెక్కన కార్డుల సంఖ్య స్వల్పంగా తగ్గినా 2,10,156 మంది కుటుంబసభ్యుల సంఖ్య పెరిగింది. -
‘రేషన్ బియ్యం సబ్సిడీ బకాయిలను చెల్లించండి’
సాక్షి, న్యూఢిల్లీ : రేషన్ బియ్యం సబ్సిడీ కింద రాష్ట్రానికి చెల్లించాల్సిన 1,728 కోట్ల రూపాయల బకాయిలను వెంటనే విడుదల చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ నాయకుడు వి. విజయసాయి రెడ్డి కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖ మంత్రి పియూష్ గోయల్‌ను కోరారు. ఈ మేరకు ఆయన కేంద్ర మంత్రికి లేఖ రాశారు. ప్రజా పంపిణీకి వినియోగించే బియ్యం కొనుగోలు కోసం కేంద్ర ప్రభుత్వం కొంత సొమ్మును సబ్సిడీ కింద రాష్ట్ర పౌర సరఫరాల శాఖ (ఏపీ సివిల్ సప్లైస్ కార్పోరేషన్)కు చెల్లిస్తుంది. ఆ విధంగా చెల్లించాల్సిన మొత్తాల్లో ఇంకా 1,728 కోట్ల రూపాయల మేర బకాయి మిగిలి ఉంది. ఈ మొత్తాన్ని త్వరితగతిన విడుదల చేసి 2020-21 ఖరీఫ్ సీజన్లో రైతులకు కనీస మద్దతు ధర చెల్లింపుకు సహకరించాలని విజయసాయి రెడ్డి లేఖలో మంత్రికి విజ్ఞప్తి చేశారు. బియ్యం సబ్సిడీ కింద కేంద్ర ప్రభుత్వం ఏపీ పౌర సరఫరాల కార్పొరేషన్‌కు విడుదల చేయాల్సిన బకాయిలు 2.498 కోట్ల రూపాయలకు చేరడంతో గత ఫిబ్రవరి 21న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లేఖ ద్వారా ఈ బకాయిల విషయం ప్రధానమంత్రి దృష్టికి తీసుకువచ్చారు. చదవండి: 'ఎవరికీ కమిషన్లు, వాటాలు ఇవ్వనవసరం లేదు' ప్రధాని ఆదేశాలతో గత మార్చి 5న కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ కొంత మొత్తం విడుదల చేసినప్పటికీ ఇంకా 1,728 కోట్ల రూపాయల బకాయిలు మిగిలి ఉన్నాయి. కోవిడ్ మహమ్మారి కారణంగా రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈ బకాయిలను త్వరితగతిన విడుదల చేయవలసిందిగా కోరుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గత ఏప్రిల్ 1న మరోసారి ప్రధాన మంత్రికి లేఖ రాసిన విషయాన్ని విజయసాయి రెడ్డి మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. బియ్యం సబ్సిడీ బకాయిలు త్వరగా విడుదల చేయడం వలన రైతులకు సకాలంలో కనీస మద్దతు చెల్లింపులతోపాటు స్వయం సహాయ బృందాలు, సహకార సంఘాలను ఆర్థిక వత్తిళ్ళ నుంచి కాపాడవచ్చునని వివరించారు. అలాగే 2020-21 ఖరీఫ్ సీజన్‌కు తగిన ఏర్పాట్లు చేసుకోవడంలో రైతులకు సాయపడవచ్చునని విజయసాయి రెడ్డి తన లేఖలో మంత్రికి వివరిస్తూ సాధ్యమైనంత త్వరగా బియ్యం బకాయిల విడుదలకు చర్యలు తీసుకోవాలని మంత్రిని కోరారు. చదవండి: పనుల నాణ్యత విషయంలో రాజీపడొద్దు: సీఎం జగన్ -
చెన్నై పోర్టుకు తరలిస్తుండగా..
కావలి: అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని కావలి వద్ద విజిలెన్స్, పౌరసరఫరాల శాఖ అధికారులు సోమవారం పట్టుకున్నారు. మూడు లారీల్లో తమిళనాడులోని చెన్నై పోర్టుకు తరలిస్తున్న రేషన్ బియ్యం 70 టన్నుల వరకు ఉంటుందని చెబుతున్నారు. విజిలెన్స్ సీఐ పీవీ నారాయణ, పౌరసరఫరాల శాఖ కావలి అధికారి ఐ.పుల్లయ్య కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.. గుంటూరు జిల్లా పొన్నూరు, కర్లపాళెం నుంచి రెండు లారీలు 55 టన్నుల రేషన్ బియ్యంతో చెన్నైకు బయలుదేరాయి. అలాగే ప్రకాశం జిల్లా కందుకూరు నుంచి 15 టన్నులతో మరో లారీ చెన్నై దారి పట్టింది. తనిఖీలు చేస్తుండగా.. కావలి వద్ద చెన్నై – కోల్కత్తా జాతీయ రహదారిపై విజిలెన్స్, పౌరసరఫరాల శాఖ అధికారులు సోమవారం వాహనాలను తనిఖీలు చేస్తున్నారు. ఈక్రమంలో అనుమానాస్పదంగా వెళుతున్న 3 లారీలను వారు తనిఖీ చేసి అందులో రేషన్ బియ్యం ఉన్నట్లుగా గుర్తించారు. అధికారులను చూసిన కందుకూరుకు చెందిన లారీ డ్రైవర్ వాహనాన్ని వదిలి పరారయ్యాడు. గుంటూరు జిల్లాకు చెందిన రెండు లారీల డ్రైవర్లను అధికారులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. గుంటూరు జిల్లాకు చెందిన లారీలను కావలిలోని పౌరసరఫరాల శాఖ గోదాముకు చేర్చి, బియ్యం బస్తాలను దించారు. ఖాళీ లారీలను కావలి రూరల్ పోలీసులకు అప్పగించారు. కందుకూరుకు చెందిన లారీ వద్ద పోలీసులను ఉంచి దర్యాప్తు చేస్తున్నారు. బహిరంగ మార్కెట్లో రేషన్ బియ్యం విలువ సుమారు రూ. 50 లక్షలు ఉంటుందని చెబుతున్నారు. కాగా కందుకూరుకు చెందిన లారీలోని రేషన్ బియ్యాన్ని కూడా పౌరసరఫరాల శాఖ గోదాముకు తరలిస్తామని అధికారులు తెలిపారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. తనిఖీల్లో సివిల్ సప్లైస్ డిప్యూటీ తహసీల్దార్ కె.వెంకటరామిరెడ్డి, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ గోపాల్‌కృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
కొత్తగా 2.90 లక్షల బియ్యం కార్డులు
సాక్షి, అమరావతి: అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందాలన్నదే ప్రభుత్వ లక్ష్యం కాగా.. ఇందుకు అనుగుణంగా ఎలాంటి దళారులకు ప్రమేయం లేకుండా, పేదలు నేరుగా గ్రామ సచివాలయానికి వెళ్లి దరఖాస్తు చేసుకుంటే చాలు.. అర్హత ఆధారంగా సంక్షేమ పథకాల కోసం కార్డులను మంజూరు చేస్తున్నారు. ► దరఖాస్తులను పరిశీలించి.. గడిచిన 2 నెలల్లోనే అర్హత ఉన్న 2.90 లక్షల కుటుంబాలకు పైగా బియ్యం కార్డులను మంజూరు చేశారు. ► ప్రస్తుతం రాష్ట్రంలో బియ్యం కార్డుల సంఖ్య 1,50,15,765కి చేరింది. ► రాష్ట్రంలో ప్రస్తుతం తొమ్మిదవ విడత ఉచిత సరుకుల పంపిణీ కొనసాగుతుండగా.. ఆదివారం వరకు 97.24 లక్షల కుటుంబాలకుపైగా లబ్ధి పొందాయి. ► రెండు విడతలుగా పంపిణీ చేస్తున్నందున ప్రతి నెలా దాదాపు 5 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం అవసరం అవుతున్నాయి. ► ఇక కార్డు కోసం పేదలు తిరిగి గ్రామ సచివాలయానికి రాకుండా.. గ్రామ వలంటీర్ నేరుగా వారి ఇంటికి వెళ్లి కార్డులు ఇస్తుంటే పేదలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ► అర్హత ఉండి గత ప్రభుత్వ హయాంలో బియ్యం కార్డు కోసం అధికారులు, నాయకుల చుట్టూ తిరిగినా అదిగో ఇదిగో అంటూ తిప్పుకునేవారు తప్ప వారికి మాత్రం కార్డు మంజూరయ్యేది కాదు. -
రేషన్ బియ్యం మాఫియా డాన్ అరెస్ట్
కోవెలకుంట్ల: కొన్నేళ్ల నుంచి గుట్టు చప్పుడు గాకుండా రేషన్ బియ్యాన్ని బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్న మాఫియా డాన్‌ను ఎట్టకేలకు కోవెలకుంట్ల పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి వివరాలను మంగళవారం స్థానిక పోలీస్‌స్టేషన్ లో కోవెలకుంట్ల సీఐ సుబ్బరాయుడు విలేకరు లకు వెల్లడించారు.బనగానపల్లెకు చెందిన శ్రీనివాసులు అలియాస్ డాన్ శ్రీను రేషన్ బియ్యం అక్రమ వ్యాపారం నిర్వహిస్తున్నాడు. ఈక్రమంలో సోమవారం రాత్రి వివిధ ప్రాంతాల నుంచి సేకరించిన రేషన్‌బియ్యాన్ని పట్టణ శివారులోని ఐటీఐ కళాశాల సమీపంలో కోవెలకుంట్లకు చెందిన స్వామిరెడ్డి, బనగానపల్లెకు చెందిన ఉసేన్‌బాషా లారీలో నుంచి మరో లారీలోకి రేషన్ బియ్యాన్ని మార్పిడి చేస్తుండగా కోవెలకుంట్ల ఎస్ఐ చంద్రశేఖర్‌రెడ్డి తమ సిబ్బందితో కలిసి దాడి చేసి పట్టుకున్నారు. 250ప్యాకెట్ల(125 క్వింటాళ్లు) రేషన్ బియ్యం, రెండు లారీలను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన బియ్యానికి సంబంధించి వివరాలు ఆరా తీయగా బనగానపల్లెకు చెందిన శ్రీనివాసులు ఆదేశాల మేరకు బియ్యాన్ని తరలించేందుకు మార్పిడి చేస్తున్నట్లు నిందితులు అంగీకరించారు. వారిద్దరితోపాటు శ్రీనివాసులు, కొలిమిగుండ్ల మండలం బెలూంకు చెందిన చిన్న ప్రసాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. మరోనిందితుడు చిన్న ప్రసాదు పరారీలో ఉన్నాడని, త్వరలోనే అరెస్ట్ చేస్తామని చెప్పారు. మిగిలిన ముగ్గురిని కోవిడ్ పరీక్షల అనంతరం బనగానపల్లె మేజిస్ట్రేట్ ఎదుట హాజరు పరచనున్నట్లు సీఐ వివరించారు. -
ఏపీలో ఐదో విడత రేషన్ పంపిణీ ప్రారంభం
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఐదో విడత ఉచిత రేషన్ పంపిణీ ప్రారంభమైంది. బియ్యం కార్డుదారులకు మనిషికి 5 కిలోల చొప్పున బియ్యం, కేజీ కందిపప్పు పంపిణీ జరుగుతోంది. రాష్ట్ర్రంలోని 28,354 రేషన్ దుకాణాల ద్వారా సరుకులను పంపిణీ చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కార్డులు ఉన్న మొత్తం 1,48,05,879 కుటుంబాలు లబ్ధి పొందనున్నాయి. రేషన్ తీసుకునేందుకు దుకాణాల వారీగా టైం స్లాట్ కూపన్లు అందజేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన నిబంధనల ప్రకారం లబ్ధిదారులకు బయో మెట్రిక్ తప్పనిసరి చేశారు. (మరో విప్లవాత్మక మార్పునకు శ్రీకారం!) పోర్టబులిటీ ద్వారా లబ్ధిదారులు ఎక్కడ ఉంటే అక్కడే సరుకులు తీసుకునే విధంగా అధికారులు ఏర్పాట్లు చేశారు. రేషన్ షాప్ కౌంటర్ల వద్ద అందుబాటులో శానిటైజర్లు ఉంచారు. భౌతిక దూరం పాటించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటివరకు ఏపీ ప్రభుత్వం పేదలకు నాలుగు విడతలుగా ఉచితంగా సరుకులు పంపిణీ చేసింది. (బాలకృష్ణలో ఆ బాధ కనిపిస్తోంది) తూర్పుగోదావరి: జిల్యావ్యాప్తంగా ఐదో విడత రేషన్ పంపిణీ జరుగుతోంది.మరోసారి బియ్యం, కందిపప్పులను లబ్ధిదారులకు పంపిణీ చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 16.5 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. కర్నూలు: జిల్లాలో ఐదు విడత ఉచిత రేషన్ బియ్యం పంపిణీ ప్రారంభమైంది. జిల్లాలోని 2,436 రేషన్ షాపుల్లో 11.91 లక్షల కార్డుదారులకు బియ్యం పంపిణీ జరగనుంది. ఈ సారి వలస కార్మికులకు కూడా రేషన్ పంపిణీ చేస్తున్నారు. 2,486 మంది వలస కూలీలకు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. -
67.85 లక్షల మందికి బియ్యం పంపిణీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో 67.85 లక్షల మందికి రేషన్ పంపిణీ చేశామని పౌర సరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ లబ్ధిదారులకు 2 లక్షల 56 వేల మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ చేశామని పేర్కొన్నారు. రైతుల నుంచి 39 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని చెప్పారు. యాసంగిలో 58 శాతం ధాన్యం కొనుగోలు చేశామని.. మహబూబ్‌నగర్, నల్గొండలో 90 శాతం ధాన్యం కొనుగోలు చేశామని ఆయన తెలిపారు. మూడు రోజుల్లోపు ధాన్యం కొనుగోలు డబ్బులు రైతుల ఖాతాల్లో జమ చేస్తామని పేర్కొన్నారు. లాక్ డౌన్ లో కూడా 8 కోట్ల 14 లక్షల గన్నీ సంచులు సమకూర్చుకున్నామని తెలిపారు. -
సెప్టెంబర్ 1 నుంచి బియ్యం డోర్ డెలివరీ
సాక్షి, అమరావతి: ప్రజా పంపిణీ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సెప్టెంబరు 1 నుంచి నాణ్యమైన బియ్యాన్ని లబ్ధిదారుల ఇంటికే డోర్ డెలివరీ చేయాలని అధికారులను ఆదేశించారు. అదే రోజు నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఈ పథకాన్ని అమల్లోకి తీసుకు రావాలని స్పష్టం చేశారు. కోవిడ్ –19 నివారణా చర్యలపై సమీక్షల్లో భాగంగా పౌరసరఫరాల శాఖ అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. సీఎం ఆదేశాలతో నాణ్యమైన బియ్యం రాష్ట్రవ్యాప్తంగా డోర్ డెలివరీ చేయడానికి పౌరసరఫరాల శాఖ సిద్ధమవుతోంది. (రూ.30 కోట్లు ఎక్స్‌గ్రేషియా విడుదల) ప్రజాపంపిణీ వ్యవస్థపై ప్రత్యేక దృష్టి.. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాపంపిణీ వ్యవస్థపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించింది. రేషన్ పంపిణీలో ఉన్న లోటుపాట్లను సరిదిద్ది అవినీతిని రూపుమాపడంతో పాటు పారదర్శకత కోసం ప్రత్యేక చర్యలు చేపట్టింది. దీని కోసం ప్రత్యేకంగా బియ్యం కార్డులను తీసుకు వచ్చింది. గ్రామ, వార్డు సచివాలయాల్లో అర్హులైన వారందరికీ కార్డులు మంజూరుచేసే వ్యవస్థనూ మొదలుపెట్టింది. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ బియ్యం అందించడానికి సామాజిక తనిఖీలో భాగంగా సచివాలయాల్లో లబ్ధిదారుల జాబితాను ఉంచడమే కాకుండా, పేరులేని వారు ఎవరికి దరఖాస్తు చేయాలన్నదానిపై కూడా వివరాలు ఉంచింది. వాటి ఆధారంగా దరఖాస్తు చేసిన వారివి కూడా పరిశీలించి వారికి బియ్యం కార్డులను అధికారులు మంజూరు చేశారు. దీన్ని ఇంతటితో వదిలేయకుండా.. అర్హత ఉన్న వారికి బియ్యం కార్డులు మంజూరు అన్నది నిరంతర ప్రక్రియగా ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. (‘మనసున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్’) బియ్యం నాణ్యతపై.. అంతేకాకుండా బియ్యం నాణ్యతపైన కూడా ప్రత్యేక దృష్టిపెట్టింది. ప్రభుత్వం పంపిణీ చేస్తున్న రేషన్ బియ్యం తినలేని విధంగా ఉండడంతో ఆ బియ్యాన్ని దళారులకు అమ్ముకునేవారు. మళ్లీ ఆ బియ్యాన్ని రీసైక్లింగ్ చేసి మరలా మార్కెట్లోకి తీసుకు వచ్చేవారు. దీంతో పేదలకు నాణ్యమైన బియ్యం అందకపోవడంతోపాటు, అవినీతి చోటుచేసుకునేది. ఎన్నికల హామీల్లో భాగంగా నాణ్యమైన, తినగలిగే బియ్యాన్ని డోర్ డెలివరీ చేస్తామని సీఎం వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. దాంట్లో భాగంగానే తాజా ఆదేశాలు ఇచ్చారు. పకడ్బందీగా.. రాష్ట్రవ్యాప్తంగా నాణ్యమైన బియ్యాన్ని డోర్ డెలివరీ చేసే కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం ఇప్పటికే శ్రీకాకుళం జిల్లాలో దీన్ని పైలట్ ప్రాజెక్టుగా చేపట్టింది. నాణ్యమైన బియ్యాన్ని సేకరించడం, ఆ బియ్యాన్ని ప్యాక్ చేయడం, ఇంటికే డోర్ డెలివరీ చేయడాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేస్తోంది. నాణ్యమైన బియ్యాన్ని అందుకుంటున్న వారి నుంచి అభిప్రాయాలు కూడా స్వీకరించింది. ప్రజలు కూడా పెద్ద ఎత్తున సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం అమల్లో ఎదురవుతున్న సమస్యలు, వాటిని పరిష్కరించి మరింత మెరుగ్గా, పటిష్టంగా అమలు చేయడంపై ఎప్పటికప్పుడు అధికారులు సమీక్ష చేసుకుని ఇప్పుడు పకడ్బందీ విధానాన్ని రూపొందించుకున్నారు. ఎక్కడెక్కడ ధాన్యం సేకరించాలి, వాటిని శుద్ధిచేయడమెలా, అదేసమయంలో కల్తీ లేకుండా చూసుకునేలా ఈ విధానాన్ని తీర్చిదిద్దారు. ఇలా డోర్ డెలివరీ చేస్తాం.. నాణ్యమైన బియ్యం డోర్ డెలివరీని శ్రీకాకుళం జిల్లాలో ఇంటింటికీ మొదలుపెట్టామని సివిల్ సప్లైస్ కమిషనర్ కోన శశిధర్ తెలిపారు. గత ఏడాది సెప్టెంబరు 6 నుంచి ఆ జిల్లాలో ఇది అమలవుతోంది. పైలట్ ప్రాజెక్టులో మాకు ఎదురైన అనుభవాలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటికీ నాణ్యమైన బియ్యాన్ని డోర్‌డెలివరీ చేయబోతున్నాం. పర్యావరణ సంబంధిత అంశాలనూ పరిగణలోకి పరిగణలోకి తీసుకున్నాం. లబ్ధిదారులకు పారదర్శక పద్ధతిలో, అవినీతికి తావులేకుండా, నాణ్యమైన బియ్యాన్ని అందించడమే లక్ష్యంగా ఈ విధానాన్ని ఏర్పాటు చేసుకున్నాం. గోడౌన్ల నుంచి వచ్చే ప్రతి గన్నీ బ్యాగుపై కూడా స్ట్రిప్ సీల్ ఉంటుంది. అలాగే ప్రతి బ్యాగుపైనా బార్ కోడ్ ఉంటుందని తెలిపారు. కల్తీ లేకుండా, రవాణాలో అక్రమాలు జరగకుండా ఈ జాగ్రత్తలు తీసుకున్నాం. అన్ని గ్రామ సచివాలయాల్లో అందుబాటులో ఉండేలా 13,370 మొబైల్ యూనిట్లను పెడుతున్నాం. ఇందులోనే ఎలక్ట్రానిక్ వేయింగ్ మెషిన్ ఉంటుంది. ఈ మొబైల్ యూనిట్ల ద్వారా ప్రతి లబ్దిదారుని ఇంటికివెళ్లి బియ్యాన్ని డోర్ డెలివరీ చేస్తాం. లబ్ధిదారుల ముందే బియ్యం బస్తా సీల్‌ను ఓపెన్‌చేసి వారికి నిర్దేశించిన కోటా ప్రకారం బియ్యాన్ని అందిస్తాం. బియ్యాన్ని తీసుకోవడంకోసం లబ్ధిదారునికి నాణ్యమైన సంచులను ఉచితంగా అందిస్తున్నాం. ప్రతినెలా 2.3లక్షల మెట్రిక్ టన్నుల నాణ్యమైన బియ్యాన్ని డోర్‌డెలివరీ చేయడానికి నిర్ణయించామని కోన శశిధర్ తెలిపారు. -
రూ.1500 @ పరేషానీ!
సాక్షి, సిటీబ్యూరో: లాక్డౌన్ కష్టకాలంలో నిరుపేదలకు ‘పైసా’ పరేషాని పట్టుకుంది. కేవలం రూ.1500 ప్రాణాల కంటే ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీని కోసం ప్రాణాంతకమైన కరోనా వైరస్‌ను సైతం లెక్కచేయని పరిస్థితి నెలకొంది. బ్యాంకులు, పోస్టాఫీసుల ముందు భౌతిక దూరం పాటించకుండా...మండుటెండల్లో సైతం గంటల తరబడి బారులు తీరుతున్నారు. లాక్డౌన్ నేపథ్యంలో ఆహార భద్రత కార్డుదారులకు నిత్యావసర సరుకుల కోసం ప్రభుత్వం ఆయా అకౌంట్లలో రూ.1500 జమ చేసింది. వీటిని డ్రా చేసుకోవడం పేదలకు ఇప్పుడు సవాల్‌గా మారింది. ఇక పాతబస్తీలో పరిస్థితి బెంబేలెతిస్తోంది. నిత్యావసరాల కోసం.. లాక్డౌన్ కష్టకాలంలో ఆహార భద్రత (రేషన్) కార్డు లబ్ధిదారులకు ఉచిత రేషన్ బియ్యం పంపిణీ చేస్తున్న ప్రభుత్వం..నిత్యావసర సరుకుల కోసం రెండో విడత కూడా రూ.1500 చొప్పున లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేసింది. మరోవైపు బ్యాంక్ అకౌంట్ లేని వారిని గుర్తించి పోస్టాఫీసుల్లో జమ చేసింది. మూడు నెలలు సరుకులు డ్రా చేయని లబ్ధిదారులకు మాత్రం నగదు నిలిపివేసింది. బ్యాంక్ అకౌంట్ గల వారికి బ్యాంక్‌ల్లో విత్‌డ్రా ఫామ్‌ల ద్వారా, బ్యాంక్ అకౌంట్ లేని వారికి ఆహార భద్రత కార్డు నెంబర్ ఆధారంగా నగదు పంపిణీ చేస్తోంది. బ్యాంక్ అకౌంట్ కలిగి ఉండి ఏటీఎం కార్డు లేని నిరుపేదలు బ్యాంకుల ముందు నగదు కోసం పోటెత్తుతున్నారు. పోస్టాఫీసుల ద్వారా.. మహా నగరంలో ఆహార భద్రత కార్డులు కలిగి అకౌంట్‌లేని కుటుంబాలు సుమారు లక్షన్నరపైనే ఉన్నాయి. వారికి నగదు నగదు పోస్టాఫీసుల్లో జమ కావడంతో నగరంలోని సుమారు 24 పోస్టాఫీసుల ద్వారా చెల్లింపు కొనసాగుతోంది. బ్యాంక్ అకౌంట్ లేని ఆహార భద్రత కార్డుదారుల జాబితా ఆధారంగా పోస్టల్ శాఖ తాత్కాలిక ఆన్లైన్ అకౌంట్లను తెరిచి నగదు చెల్లింపులు చేపట్టింది. రేషన్ కార్డు నెంబర్ ద్వారా లబ్ధిదారుల బయోమెట్రిక్ ఆధార్ గుర్తింపుతో నగదు చెల్లింపులు చేస్తోంది. ఇప్పటికే మొదటి విడత ఏప్రిల్ నెల చెల్లింపు ఇంకా కొనసాగుతుండగా, రెండో విడుత మే నెల నగదు కూడా పోస్టాఫీసుల్లో జమ చేశారు. వీటి చెల్లింపులకు కూడా పోస్టల్‌శాఖ సిద్ధమైంది. అందని నగదు.. మహా నగర పరిధిలోని సుమారు 4.18 లక్షల పేద కుటుంబాలకు నగదు లబ్ధి నిలిచిపోయింది. సమచారం తెలియక నిరుపేద కుటుంబాలు బ్యాంకులు, పోస్టాఫీసుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నారు. గ్రేటర్ పరిధిలోని హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి పరిధిలో కలిపి ఆహార భద్రత కార్డులు కలిగిన 16 లక్షల 930 కుటుంబాలు ఉన్నాయి. అందులో సుమారు 25 శాతం వరకు వివిధ కారణాలతో వరుసగా సరుకులు డ్రా చేయకుండా అడపాదడపా డ్రా చేస్తుంటారు. అందులో అత్యధికంగా మేడ్చల్‌లో 1.54 లక్షలు, రంగారెడ్డిలో 1.38 లక్షలు, హైదరాబాద్‌లో 1.26 లక్షల పైచిలుకు ఉన్నట్లు అధికార గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. వరుసగా మూడు నెలలు సరుకులు డ్రా చేయని పేద కుటుంబాల్లో సగానికి పైగా గత నెల ఉచిత బియ్యం డ్రా చేసినా.. బ్యాంక్ ఖాతాలో నగదు జమ మాత్రం పౌరసరఫరాల శాఖ నిలిపివేసింది. ఈసారి రెండో విడత నగదు జమ కూడా నిలిపి వేసింది. నగదు జమ తెలుసుకోవడం ఇలా... ఆహార భద్రత కార్డు దారులకు నిత్యావసర సరుకుల కోసం ప్రభుత్వం అందించే నగదు బ్యాంక్, లేదా పోస్టాఫీసులో జమ అయిందా లేదా అనేది ఆన్లైన్ ద్వారా తెలుసుకునే వీలుంది. ఫుడ్ సెక్యూరిటీ కార్డు వెబ్సైట్ ఓపెన్ చేసి అందులోని ఈ–పోస్ పోర్టల్‌లోకి వెళ్లి ‘ఈఆఖీ ఖ్ఛటఞౌnట్ఛ ్ట్చ్టuటఖ్ఛఞౌట్ట‘ క్లిక్ చేయాలి. అందులో రేషన్ కార్డు నెంబర్ టైప్ చేస్తే నగదు ఏ బ్యాంక్, ఎవరి అకౌంట్లో లేదా పోస్టాఫీసులో జమ జరిగిందో స్టేటస్ తెలుస్తోంది. అదేవిధంగా పోస్టాఫీసుల్లో సైతం తన నగదు జమ జరిగిందా లేదా కూడా స్టేటస్ తెలుసుకోవచ్చు. పోస్టల్ శాఖకు చెందిన ఠీఠీఠీ.్ట్ఛ ్చnజ్చn్చఞౌట్ట్చ ఛిజీటఛి ్ఛ.జీn వెబ్సైట్లోకి వెళ్లి రేషన్ కార్డు నెంబర్ టైప్ చేస్తే స్టేటస్ తెలుస్తుంది. -
రెండో విడత రేషన్
ఆదిలాబాద్‌అర్బన్: కరోనా, లాక్డౌన్ నేపథ్యంలో తెల్లరేషన్ కార్డుదారులను ప్రభుత్వం అన్నివిధాలుగా ఆదుకుంటోంది. నెల రోజులకుపైగా ప్రజలు ఇళ్లకే పరిమితం కావడంతో వారికి ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అందులో భాగంగా ఏప్రిల్‌లో ఉచిత బియ్యం, రూ.1500 సాయం చేయగా, ఈ నెలలో రెండో విడత సాయానికి సిద్ధమైంది. రెండో విడత బియ్యం పంపిణీ ప్రక్రియ జిల్లాలో శుక్రవారం నుంచి ప్రారంభమైంది. అయితే బియ్యంతోపాటు కిలో కందిపప్పు కూడా పంపిణీ చేయనుంది. కార్డుదారులు చౌకధరల దుకాణాలకు వెళ్లి బియ్యం, ఇతర సరుకులు తీసుకుంటున్నారు. బయోమెట్రిక్ ద్వారా పంపిణీ జరుగుతున్నందున సరుకులు తీసుకునేందుకు వచ్చిన ప్రజలు భౌతికదూరం పాటించడంతోపాటు మాస్కు ధరించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. చేతులు శుభ్రం చేసుకొని వేలిముద్ర వేసి సరుకులు తీసుకెళ్తున్నారు. రెండో విడత బియ్యం పంపిణీ సామాన్య ప్రజలకు ఇబ్బంది కలగ కూడదనే ఉద్దే శంతో ప్రభుత్వం మే నెలలో కూడా ఉచితంగా బి య్యం పంపిణీ చేస్తామని ప్రకటించింది. రేషన్‌కార్డు కలిగిన కుటుంబంలో ప్రతిఒక్కరికి 12 కిలోల బి య్యం ఏప్రిల్‌లో పంపిణీ చేసింది. లాక్‌డౌన్‌తో గత నెల రోజులుగా ఇబ్బందులు పడిన ప్రజల కష్టాలు కొంతవరకు దూరమయ్యాయి. జిల్లాలోని 355 రేషన్ షాపులుండగా, 1,88,549 కార్డులు, వాటి ప రిధిలో 6 లక్షలపైగా మంది సభ్యు లు (యూనిట్లు) ఉన్నారు. వీరందరికీ బియ్యం పంపిణీ చేసేందుకు జిల్లాకు 8,032 మెట్రిక్ టన్నుల బియ్యం కావల్సి వచ్చింది. కొన్ని రోజులుగా ప్రజలెవరూ బయటకు వెళ్లడం లేదు. దీంతో పనులు లేక పొట్ట గడవడం ఇబ్బందిగా మారుతోంది. అయితే రెండు నెలల నుంచి ఉచిత బియ్యం అందజేస్తుండడంతో కొంత ఉపశమనం కలిగింది. ఇదిలా ఉండగా, కార్డుదారులకు పంపిణీ చేయాల్సిన కందిపప్పు ఇంకా జిల్లాకు చేరలేదు. కార్డుదారుడికి ఒక కిలో చొప్పున జిల్లాకు 1,885.49 క్వింటాళ్ల కందిపప్పు రావల్సి ఉంది. రేషన్ తీసుకోని వారు 16,615 మంది గత మూడు నెలల నుంచి రేషన్ బియ్యం తీసుకోకపోవడంతో వారికి నగదు జమకావడం లేదు. జిల్లాలో 18 మండలాల పరిధిలో 1,88,549 కార్డులు ఉండగా, 1,71,769 మందికి సాయం అందింది. మిగతా వారిలో 165 మంది బ్యాంకు ఖాతాలు తప్పుగా ఉండగా, 16,615 మంది కార్డుదారులు గత మూడు నెలలుగా బియ్యం తీ సుకోవడం లేదు. దీంతో వీరిని ప్రభుత్వం హోల్డ్‌లో పెట్టింది. అయితే వీరికి ఇంతవరకు నగదు జమ కాలేదు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు వస్తే తప్ప హోల్డ్‌లో పెట్టిన రేషన్‌కార్డులపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేమని అధికారులు పేర్కొంటున్నారు. రూ.1500 సాయం కోసం లాక్డౌన్ నేపథ్యంలో ఇతర సరుకులు కొనుగోళు చేసేందుకు ప్రభుత్వం రూ.1500 సాయం ప్రకటించింది. ఏప్రిల్‌లో కార్డు కలిగిన వారి పేరున బ్యాంకు ఖాతాలో డబ్బులు జమ చేసింది. మే నెలలో కూడా సాయం చేస్తామని ప్రకటించడంతో ఆ డబ్బుల కోసం కార్డుదారులు ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే జిల్లాలో గత ఏప్రిల్ నెలలో 1,59,956 కార్డుదారులు బ్యాంకుల నుంచి తీసుకుంటే, 11,813 మంది పోస్టాఫీసుల నుంచి నగదు తీసుకుంటున్నారు. -
ఉచిత బియ్యం హుళక్కి!
ఉచిత బియ్యం కోసం ఎదురుచూసిన నిరుపేదలకు అధికారులు రిక్తహస్తం చూపించారు. సుమారుమూడు లక్షల కుటుంబాలు అర్ధాకలితో అలమటించే పరిస్థితిలోకి నెట్టివేశారు. లాక్డౌన్ కష్టకాలంలో కొంతమంది పేదలకు ‘ఉచిత బియ్యం’ అందని ద్రాక్షగానే మారింది. ప్రభుత్వ చౌకధరల దుకాణాల ద్వారాఈ నెలాఖరు వరకు ఉచిత బియ్యం పంపిణీ చేస్తామని ప్రకటించిన అధికారులు.. తొమ్మిది రోజుల ముందే రేషన్ షాపులు మూసివేయడంతో ఆహార భద్రతకార్డు లబ్ధిదారులు లబోదిబోమంటున్నారు. సాక్షి,సిటీబ్యూరో: లాక్డౌన్ కష్టకాలంలో సుమారు మూడు లక్షలకు పైగా నిరుపేద కుటుంబాలకు ‘ఉచిత బియ్యం’ అందని దాక్షగా మారింది. పౌరసరఫరాల శాఖ అధికారుల తీరుతో ఉచిత బియ్యం అందుకోలేక పోయామన్న ఆవేదన పేద వర్గాల్లో వ్యక్తమవుతోంది. ప్రభుత్వ చౌకధరల దుకాణాల ద్వారా ఈ నెలాఖరు వరకు ఉచిత బియ్యం పంపిణీ చేస్తామని ప్రకటించిన అధికారులు.. తొమ్మిది రోజుల ముందే రేషన్ షాపులు మూయడం పలు విమర్శలకు తావిస్తోంది. ఆహార భద్రతకార్డు కలిగిన నిరుపేద కుంటుంబాలకు ఉచిత బియ్యంతో పాటు నిత్యావసర సరుకుల కోసం ప్రభుత్వం రూ.1,500 ఆర్థిక సాయం ప్రకటించింది. రేషన్ కార్డు కలిగిన ప్రతి కుటుంబంలోని సభ్యుడు (యూనిట్)కు 12 కిలోల ఉచిత బియ్యం ప్రకటించడంతో నిరుపేదలు పెద్ద ఎత్తున క్యూ కట్టారు. దీంతో ఉచిత బియ్యం పంపిణీ పాయింట్ల ముందు నిరుపేదలు పెద్ద ఎత్తున బారులు తీరారు. నిబంధనల ప్రకారం ప్రతి నెల 15 తారీఖున రేషన్ సరుకుల పంపిణీ గడువు ముగుస్తుంది. దీంతో తమకు ఎక్కడ బియ్యం దక్కవోనని కనీసం పేదలు పెద్ద ఎత్తున షాపుల ముందు బారులు తీరారు. బియ్యం పంపిణీ ప్రక్రియ ఈనెలాఖరు వరకు కొనసాగుతుందని, లబ్ధిదారులు ఆందోళన చెందవద్దని పౌరసరఫరాల శాఖ ప్రకటించింది. మరోవైపు పౌరసరఫరాలు శాఖ వెబ్సైట్లో అధికారికంగా ఈనెల 28న క్లోజింగ్ డేట్‌గా వెల్లడించింది. దీంతో పేదలు కొంత ఊపిరి పీల్చుకొని రద్దీ తగ్గిన తర్వాత ఉచిత బియ్యం అందుకుందామని భావించారు. కానీ ఈ నెల 21 గడువు ముగిసినట్లు పౌరసరఫరాల శాఖ ప్రకటించడంతో గడువు నెలాఖరు వరకు ఉందన్న ఆశతో ఇప్పటి వరకు బియ్యం అందుకోని నిరుపేదలకు నిరాశే మిగిలినట్లయింది. ఇదీ లేక్క.. గ్రేటర్ పరిధిలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో కలిపి మొత్తం 16,00,930 ఆహార భద్రతకార్డులున్నాయి. ఇందులో 15,13,317 కార్డుదారులు మాత్రమే ఉచిత బియ్యం అందుకున్నట్లు అధికారిక లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. అందులో సైతం స్థానికేతరులైన 2,18,747 కార్డుదారులకు స్టేట్ రేషన్ పోర్టబిలిటీ ద్వారా ఉచిత బియ్యం పంపిణీ జరిగింది. మొత్తం మీద గ్రేటర్ పరిధిలోని 12,94,570 కుటుంబాలు మాత్రమే ఉచిత బియ్యం అందుకున్నట్లు గణాంకాలు తేటతెల్లం చేస్తున్నాయి. దీంతో సుమారు 3,06,360 కుటుంబాలకు ఉచిత బియ్యం అందని ద్రాక్షగా మారినట్టు కనిపిస్తోంది. దీంతో పౌరసరఫరాల అధికారుల తీరుపై పేదలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. -
రెడ్‌జోన్ ప్రాంతాల్లో ఇంటికే రేషన్
-
మెట్టుగూడ.. గుంపులో గోవిందా..!
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో ప్రభుత్వ చౌకధరల దుకాణాల ద్వారా ఉచిత బియ్యం పంపిణీ గందరగోళానికి దారితీస్తోంది. కొన్ని చోట్ల సామాజిక దూరం పాటించకపోవడం ఆందోళనకు గురిచేస్తోంది. బుధవారం ప్రయోగాత్మకంగా పరిమిత రేషన్ షాపుల ద్వారా టోకెన్ విధానంపై బియ్యం పంపిణీకి శ్రీకారం చుట్టినప్పటికీ.. పౌర సరఫరాల శాఖ ఎంపిక చేసిన షాపులు, పంపిణీ పద్ధతులపై విస్తృత ప్రచారం చేయకపోవడంతో అవగాహన లేక ఆహార భద్రత కార్డుదారులు రేషన్‌షాపులకు భారీగా తరలివచ్చారు. టోకెన్ల కోసం ఎగబడటంతో కొంత గందరగోళం ఏర్పడింది. తెరవని దుకాణాల వద్ద బారులుతీరారు. దుకాణాలు తెరవక పోవడంతో నిరాశతో వెనక్కి తిరిగారు. వాస్తవంగా ఆహార భద్రత కార్డులోని ప్రతిలబ్ధిదారుడికీ 12 కిలోల చొప్పున ఉచితంగాఅందిస్తుండటంతో బియ్యం కోసం పేదలు ఉరుకులు పరుగులు తీశారు. ఉచిత బియ్యం పంపిణీలో షాపుల వద్ద కొన్ని ప్రాంతాల్లో సామాజిక దూరం పాటించకపోవడం ఆందోళనకు గురిచేస్తోంది. మరికొన్ని ప్రాంతాల్లో షాపుల ముందు డబ్బాలు గీసి లబ్ధిదారులు సామాజిక దూరం పాటించే విధంగాచర్యలు చేపట్టారు. నగరంలో కరోనా లాక్డౌన్ నేపథ్యంలో ఆహార భద్రత కార్డుదారులకు ప్రభుత్వ చౌకధరల దుకాణాల ద్వారా ప్రయోగాత్మకంగా ఉచిత బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ఖైరతాబాద్‌లోని రేషన్ షాపు నంబర్ 702లో రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. నగరంలోని ఒక్కో సర్కిల్ పరిధిలో ప్రయోగాత్మకంగా ఆరు నుంచి 8 రేషన్ షాపులు ఎంపిక చేసి మొదటి రోజు వంద టోకెన్లకు తగ్గకుండా ఇచ్చి బియ్యం పంపిణీ చేశారు. కొన్ని షాపులద్వారా 150పైగా లావాదేవీల జరిగాయి. మొత్తమ్మీద తొలిరోజు 67 షాపుల ద్వారా 7,584 కుటుంబాలకు బియ్యం పంపిణీ చేశారు. ♦ రెండో రోజు కూడా వందకు తగ్గకుండా టోకెన్లు మాత్రమే పంపిణీ చేయనున్నారు. మూడోరోజు మొత్తం 675 షాపులకు బియ్యం పంపిణి కార్యక్రమాన్ని విస్తరిస్తామని డీఎస్ఓ పద్మజా తెలిపారు. ప్రజాపంపిణీ వ్యవస్ధలో ఈ–పాస్ అమలవుతున్న కరోనా నేపధ్యంలో బయోమెట్రిక్ యంత్రంపై వెలిముద్ర లేకుండానే కేవలం రేషన్ కార్డు, కార్డు నంబర్ ఆధారంగా బియ్యం పంపిణీ చేస్తున్నారు. కార్డుదారులైన కుటుంబ సభ్యులు కాకుండా ఇతరులు కార్డు తెచ్చిన ఉచిత బియ్యం అందించారు. వరుసగా రెండు, మూడు నెలలు రేషన్ తీసుకోని కార్డుదారులకు మాత్రం బయో మెట్రిక్‌పై వేలిముద్ర ఆధారంగా పంపిణీ చేశారు. ♦ నగర శివారు ప్రాంతాల్లో సైతం రేషన్ పంపిణీ ప్రారంభమైంది. మేడ్చల్– మల్కాజిగిరిæ జిల్లాలో సుమారు 636 షాపులుండగా.. బుధవారం 121 షాపుల్లో ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. తొలి రోజు 9946 కుటుంబాలకు ఉచితంగా బియ్యం అందించారు. -
ఒక్కొక్కరికి ఉచితంగా 12 కిలోల బియ్యం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా బుధవారం నుంచి రేషన్ బియ్యం పంపిణీ మొదలుకానుంది. రాష్ట్రంలోని 2.81 కోట్ల లబ్ధిదారులకు ఒక్కొక్కరికి 12 కిలోల చొప్పున ఉచితంగా బియ్యం పంపిణీ చేసేలా పౌర సరఫరాల శాఖ ఏర్పాట్లు చేసింది. మొత్తంగా 3.36 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఇప్పటికే రేషన్ దుకాణాలకు సరఫరా చేసింది. పంపిణీ కోసం రేషన్ దుకాణాలు ఉదయం, సాయంత్రం అన్ని వేళలా పనిచేసేలా చర్యలు చేపట్టింది. ఇందుకు ప్రభుత్వం రూ.1,103 కోట్లు ఖర్చు చేయనుంది. బుధవారం నుంచి ప్రారంభమయ్యే పంపిణీ కార్యక్రమాన్ని కలెక్టర్లు పర్యవేక్షిం చాలని పౌరసరఫరాల కమిషనర్ సత్యనారాయణరెడ్డికి మంత్రి గంగుల కమలాకర్ ఆదేశించారు. ఎవరికీ ఇబ్బందుల్లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. లబ్ధి దారులు రేషన్ దుకాణాల వద్ద గుమికూడకుండా, విడతల వారీగా బియ్యం ఇచ్చే కూపన్లు అందజేస్తారు. కూపన్లు పట్టుకుని చెప్పిన సమయానికే లబ్ధిదారులు రేషన్ దుకాణాల వద్దకు వచ్చి తీసుకోవాల్సి ఉంటుంది. ప్రతి ఒక్కరూ రేషన్ తీసుకునే వరకు దుకాణాలు తెరిచే ఉంచుతామని మంత్రి స్పష్టం చేశారు. ప్రతినెలా క్రమం తప్పకుండా తీసుకునే కార్డుదారులకు బయోమెట్రిక్ అవసరం లేదని, గడిచిన 3 నెలలుగా తీసుకోని వారికి మాత్రమే బయోమెట్రిక్ పాటించాలని స్పష్టం చేశారు. ప్రతి చౌకధరల దుకాణం వద్ద శుభ్రత పాటించేందుకు శానిటైజర్లు, సబ్బు, నీటిని అందుబాటులో ఉంచుతున్నట్లు వెల్లడించారు. రేషన్ బియ్యం పంపిణీపై పౌర సరఫరా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పంపిణీని కలెక్టర్లు స్వయంగా పర్యవేక్షించాలని ఇందులో సూచిం చారు. ప్రజలు గుమికూడకుండా టైమ్ స్లాట్‌లో ఇచ్చిన సమయానికే లబ్ధిదారులు దుకాణాలకు వచ్చేలా చూడాలన్నారు. ప్రతి లబ్ధిదారుడు ఇతరులకు కనీసం 3 అడుగుల దూరం ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టంచేశారు. -
బియ్యంతో పాటే కందిపప్పు..
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలోని నిరుపేద కుటుంబాలకు రేషన్ బియ్యంతో పాటే కందిపప్పును సైతం పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఆహార భద్రతా చట్టం పరిధిలోకి వచ్చే వారికి కిలో కందిపప్పును కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో, దీనిపై అధికారిక అనుమతి వచ్చిన వెంటనే పంపిణీ చేసేందుకు సిద్ధమవుతోంది. ఏప్రిల్ ఒకటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా బియ్యం, కంది పప్పు సరఫరా చేసే అవకాశం ఉంది. రాష్ట్రంలో ఇప్పటికే 2.80 కోట్ల మందికి 3.36 లక్షల టన్నుల బియ్యాన్ని ఒక్కొక్కరికి 12 కిలోల చొప్పున సరఫరా చేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ పంపిణీని రెండ్రోజుల కిందట ఆరంభించినప్పటికీ కేంద్రం 5 కిలోల మేర పంపిణీ చేస్తామని చెప్పడంతో నిలిపివేసింది. కేంద్రం అందించే సుమారు 97 వేల మెట్రిక్ టన్నుల బియ్యంపై మార్గదర్శకాలు అందిన వెంటనే పంపిణీ చేయాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ భావిస్తోంది. కేంద్రం లెక్కల మేరకు 27 వేల టన్నుల కందిపప్పు రాష్ట్రానికి అందించాల్సి ఉంటుంది. దీన్ని కేంద్ర సంస్థ నాఫెడ్ ద్వారా తీసుకుని రాష్ట్రాలకు అందించాల్సి ఉంది. దీనిపై ఇంకా రాష్ట్రాలకు అధికారిక అనుమతులు రావాల్సి ఉంది. అవి అందిన వెంటనే రేషన్ బియ్యంతో పాటే కందిపప్పును లబ్ధిదారులకు అందించనున్నారు. రేషన్‌పై ప్రజల ఆరా... పౌర సరఫరాల శాఖ ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్‌కు రేషన్ బియ్యం ఎప్పుడు పంపిణీ చేస్తారనే విషయమై లబ్ధిదారులు ఎక్కువగా ఆరా తీస్తున్నారు. మూడ్రోజులుగా శాఖ హెల్ప్ లైన్‌నంబర్లకు 1,500 ఫోన్లు రాగా ఇందులో అధికంగా బియ్యం పంపిణీ, ప్రభుత్వం ఇస్తామన్న రూ.1,500లను ఎప్పటినుంచి వేస్తారనే విషయాన్ని అడుగుతున్నా రని అధికారులు వెల్లడించారు. కుటుంబాల బ్యాంకు ఖాతాల అంశం కొలిక్కి వచ్చిన వెంటనే నేరుగా ఖాతాల్లో డబ్బు పడుతుందని అధికారులు తెలిపారు. -
కేంద్రం వాటా తేలాకే బియ్యం పంపిణీ!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా నిలిచిపోయిన రేషన్ బియ్యం పంపిణీని తిరిగి ఒకట్రెండు రోజుల్లో ప్రభుత్వం ప్రారంభించే అవకాశం ఉంది. రాష్ట్రంలో కేంద్ర పరిధిలోని ఆహార భద్రతా కార్డుదారులందరికీ 5 కిలోల వంతున ఉచిత బియ్యం పంపిణీ చేస్తామని హామీ ఇచ్చిన నేపథ్యంలో దీనిపై స్పష్టత వచ్చాక 12 కిలోల ఉచిత పంపిణీని ప్రభుత్వం కొనసాగించనుంది. దీనిపై కేంద్రంతో రాష్ట్రం చర్చలు ఆరంభించగా, ఒకట్రెండు రోజుల్లో కోటా బియ్యం పై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. రాష్ట్రంపై తగ్గనున్న భారం.. రాష్ట్రంలో మొత్తంగా 87.59 లక్షల కుటుంబాలకు రేషన్ అందుతుండగా, ఇందులో కేంద్రం ఆహార భద్రతా చట్టం పరిధిలో 53.29లక్షల మందిని గుర్తించింది. కేంద్రం గుర్తించిన కార్డుల్లో లబ్ధిదారుల సంఖ్య 1.91 కోట్లు ఉండగా, రాష్ట్రం బియ్యం పంపిణీ చేస్తున్న లబ్ధిదారుల సంఖ్య 2.80కోట్ల వరకుఉంది. కేంద్రం కిలో రూ.4.40 వంతున ఒక్కో లబ్ధిదారునికి కేవలం 5 కిలోల బియ్యం సరఫరా చేస్తుండగా రాష్ట్రం ఒక్కొక్కరిరి 6 కిలోల వంతున కిలో రూపాయికే సరఫరా చేస్తోంది. ప్రస్తుతం లాక్డౌన్ నేపథ్యంలో ప్రభుత్వం రేషన్ కార్డుదారులు ఒక్కొక్కరికి 12 కిలోల ఉచిత బియ్యం సరఫరా చేయాలని నిర్ణయించింది. దీంతో ప్రభుత్వం రూ.1,103కోట్ల భారాన్ని మోసేందుకు సిద్ధమైంది. దీంతోపాటే నిత్యావసరాలకు రూ.1,500 వంతున సాయాన్ని ప్రకటించింది. ముందుగా రేషన్ బియ్యాన్ని సరఫరా చేయాలని నిర్ణయించినా, కేంద్రం ఉచిత 5 కిలోల ప్రకటన నేపథ్యంలో దాన్ని నిలిపివేసింది. కేంద్ర పరిధిలో ఉన్న 1.91కోట్ల మందికి 5 కిలోల వంతున బియ్యం పంపిణీ చేసినా రాష్ట్రంపై 95 వేల మెట్రిక్ టన్నుల మేర బియ్యం భారం తప్పుతుంది. దీని విలువ సుమారు రూ.305 కోట్ల వరకు ఉంటుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. కేంద్రం ప్రకటించిన బియ్యం ఎప్పటినుంచి సరఫరా చేస్తారన్న దానిపై మార్గదర్శకాలు రావాల్సి ఉంది. -
తెలంగాణలో రేషన్ బియ్యం నిలిపివేత
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో రేషన్ బియ్యం సరఫరా నిలిచిపోయింది. గురువారం ఉదయం హైదరాబాద్ మినహా ఇతర జిల్లాలో లబ్ధిదారులకు రేషన్ బియ్యం పంపిణీ ప్రక్రియ మొదలవగా, మధ్యాహ్నం మూడు గంటలకు రాష్ట్ర పౌరసరఫరాల కార్యాలయం నుంచి వచ్చిన అత్యవసర ఆదేశాల నేపథ్యంలో రేషన్ డీలర్లు బియ్యం పంపిణీ ప్రక్రియను నిలిపివేశారు. బియ్యం పంపిణీ నిలిపివేతకు గల కారణాలను అటు ప్రభుత్వం కానీ, పౌర సరఫరాల శాఖ కానీ వెల్లడించలేదు. మొత్తంగా 2.80 కోట్ల మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికి 12 కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేసేలా పౌర సరఫరాల శాఖ చర్యలు చేపట్టి గురువారం ఉదయం నుంచి పంపిణీ మొదలు పెట్టింది. కరీంనగర్లో ఆ శాఖ మంత్రి గంగుల కమలాకర్ పంపిణీని ఆరంభించగా, మిగతా చోట్ల నియోజకవర్గ ఎమ్మెల్యేలు బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ఆరంభించారు. ఈ పంపిణీలో లబ్ధిదారులు ఒకే దగ్గర గుమికూడకుండా వార్డుల వారీగా, టోకెన్ పద్ధతిన పంపిణీ మొదలు పెట్టారు. అయితే కొన్ని చోట్ల ఉచిత బియ్యం కావడంతో జనాలు ఎగబడ్డారు. 20మందికి మించి రావద్దని విన్నవించినా వందల సంఖ్యలో ఎగబడటంతో ఇబ్బందులు ఎదురయ్యాయి. ఇంకా చాలా చోట్ల ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుండానే పంపిణీ జరిగింది. ఇక మరోపక్క ఈ–పాస్, బయోమెట్రిక్ విధానం రద్దు చేసి కీ రిజిష్టర్ ఆధారంగా పంపిణీకి అవకాశం ఇవ్వాలని రేషన్ డీలర్ల సంఘం సైతం విన్నవించింది. ఇలా అయితేనే కరోనా కట్టడి సాధ్యమవుతుందని తెలిపింది. ఈ అన్ని అంశాలనూ పరిగణనలోకి తీసుకున్నాక మధ్యాహ్నం మూడు గంటలకు ఎక్కడికక్కడ బియ్యం సరఫరా నిలిపివేయాలని అత్యవసర ఆదేశాలు వెళ్లాయి. దీంతో పంపిణీ ప్రక్రియ నిలిచిపోయింది. దీనిపై పౌర సరఫరాల అధికారుల వివరణ కోరగా, స్పష్టమైన సమాధానం రాలేదు. చాలా జిల్లాల్లో ఇంకా పూర్తి స్థాయిలో బియ్యం రేషన్ దుకాణాలకు సరఫరా కాలేదని, ఈ దృష్ట్యా అందరికీ ఒకేసారి ఇవ్వాలన్న కారణంతోనే నిలిపివేసి ఉంటారని ఒక అధికారి తెలుపగా, కేంద్ర ప్రభుత్వం 5 కిలోలు ఉచితంగా బియ్యం ఇవ్వాలని నిర్ణయించిన నేపథ్యంలో దానిపై స్పష్టత వచ్చాక 12 కిలోల బియ్యం సరఫరా చేయాలని ప్రభుత్వం భావిస్తోందని మరో అధికారి స్పష్టం చేశారు. ఈ అంశంపై శుక్రవారం స్పష్టత వస్తుందని భావిస్తున్నారు. -
నేటి నుంచి తెలంగాణలో రేషన్ బియ్యం పంపిణి
-
నేటి నుంచి రేషన్ పంపిణీ
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలోని రేషన్‌కార్డుదారులందరికీ గురువారం నుంచి చౌక ధరల దుకాణాల ద్వారా బియ్యం పంపిణీ మొదలుకానుంది. ఇప్పటికే బియ్యం సరఫరా పూర్తయిన జిల్లాల్లో పంపిణీని ఆరంభించి, మిగతా చోట్ల శుక్రవారం నుంచి పూర్తి స్థాయిలో అందజేయనున్నారు. మొత్తంగా 2.80 కోట్ల మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికి 12 కిలోల వంతున బియ్యం పంపిణీ చేసేలా పౌర సరఫరాల శాఖ చర్యలు తీసుకుంది. ఇప్పటికే జిల్లా గోదాముల నుంచి 12 వేలకు పైగా ఉన్న రేషన్ దుకాణాలకు సరుకు రవాణా వాహనాల ద్వారా బియ్యం సరఫరా అవుతోంది. చాలా చోట్ల సరఫరా పూర్తికాగా, రెండు రోజుల్లో పూర్తి స్థాయిలో జరగనుంది. సరఫరాకు అనుగుణంగా గ్రామాలు, పట్టణాల్లో వార్డుల వారీగా ఈ–పాస్, బయోమెట్రిక్ విధానం ద్వారా పంపిణీ చేయనున్నారు. ప్రజలు గుమిగూడకుండా, ఒకేసారి ఎగబడకుండా చర్యలకు ఇప్పటికే ఆదేశాలిచ్చారు. ఆ మూడు జిల్లాలు కీలకం.. వన్‌కార్డు–వన్ రేషన్ విధానం ద్వారా లబ్ధిదారులు రేషన్ పోర్టబిలిటీ విధానంలో ఎక్కడైనా బియ్యం తీసుకునే అవకాశం ఉంది. చాలామంది గ్రామాల్లోని లబ్ధిదారులు, కూలీలు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోనే ఉన్నారు. కనీసంగా 30లక్షల మందికి పైగా ప్రతినెలా పోర్టబిలిటీ ద్వారా రేషన్ తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఈ జిల్లాల పరిధిలో బియ్యం కొరత రాకుండా పౌర సరఫరాల శాఖ చర్యలు తీసుకుంది. ఈ జిల్లాల్లో అదనపు బియ్యాన్ని అందుబాటులో ఉంచనుంది. ఆ బియ్యాన్ని స్థానికంగా ఉండే పాఠశాలల్లో లేదా కమ్యూనిటీ కేంద్రాల్లో నిల్వ చేయనుంది. ఇక రేషన్ వినియోగదారుల సమస్యలు, ఫిర్యాదుల స్వీకరణకు పౌర సరఫరాల శాఖ హెల్ప్‌లైన్ నంబర్లు ఏర్పాటు చేసింది. 1967, 180042500333 టోల్‌ఫ్రీ నంబర్‌తో పాటు 7330774444 వాట్సాప్ నంబర్‌ను అందుబాటులో ఉంచింది. దీంతో పాటే 040–23447770 ల్యాండ్‌లైన్ నంబర్‌కు ఏవైనా సమస్యలుంటే తీసుకురావచ్చని వెల్లడించింది. వాట్సాప్, ల్యాండ్‌లైన్ నంబర్లు 24 గంటలూ అందుబాటులో ఉండనుండగా, టోల్‌ఫ్రీ నంబర్లు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 వరకు అందుబాటులో ఉంటాయి. అధిక ధరలకు నిత్యావసరాలు విక్రయించారన్న ఫిర్యాదులను ఈ నంబర్లకు ఫోన్ చేసి ఫిర్యాదు చేసే అవకాశం కల్పించింది. ‘కీ–రిజిస్టర్‌తో పంపిణీ చేయాలి’ కరోనా భయంతో జమ్మూకాశ్మీర్, కేరళ, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో ఈ–పాస్ మిషన్, బయోమెట్రిక్ విధానం రద్దు చేసి తాత్కాలికంగా కీ–రిజిస్టర్‌పై రేషన్ సరుకులు పంపిణీ చేస్తున్నారని, అదే విధానం ద్వారా రాష్ట్రంలోనూ పంపిణీ చేయాలని రాష్ట్ర రేషన్ డీలర్ల సంఘం అధ్యక్షుడు నాయికోటి రాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో రోజురోజుకు కరోనా వైరస్ తీవ్రత పెరుగుతున్న దృష్ట్యా బయోమెట్రిక్ విధానంతో రద్దీ పెరిగి డీలర్లు, కార్డుదారులు అనారోగ్యం బారిన పడే అవకాశాలున్నాయని బుధవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ఈ దృష్ట్యా ఈ–పాస్ విధానాన్ని రద్దు చేయాలని కోరారు. ఇక ఉచిత బియ్యం సరఫరాకు హమాలీ చార్జీలను ప్రభుత్వమే భరించాలని, రేషన్ షాపుల ద్వారా శానిటైజర్లు, మాస్కులు ఉచితంగా పంపిణీ చేయాలని కోరారు. -
పేదలకు ప్రభుత్వ సాయం
సాక్షి,సిటీబ్యూరో: నగరంలో ఆహార భద్రతా కార్డు కలిగిన పేద కుటుంబాలకు ఉచితంగా బియ్యంతో పాటు నిత్యవసర సరుకుల కోసం రూ.1500 నగదు అందనుంది. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాను కట్టడి చేసేందుకు ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఈనెల 31 వరకు తెలంగాణలో లాక్డౌన్ ప్రకటించిన నేపథ్యంలో నిరుపేదలు నిత్యవసర వస్తువుల కోసం ఇబ్బంది పడకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రభుత్వ చౌకధరల దుకాణాల ద్వారా ఆహార భద్రత కార్డులు కలిగిన కుటుంబాలకు ఉచితంగా బియ్యంతో పాటు నగదు అందజేసేందుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 9.80 లక్షలపైకు పైగా కార్డులు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఆహార భద్రత కార్డు కలిగిన 9,80,257 కుటుంబాలున్నాయి. అందులో 40 లక్షలకు పైగా సభ్యులున్నారు. కార్డులోని ఒక్కో సభ్యుడికి 12 కిలోల చొప్పున కుటుంబంలో ఎంత మంది ఉంటే (కార్డులోని సభ్యులు) అన్ని కిలోలు ఉచితంగా బియ్యం అందజేయనున్నారు. ప్రతి కార్డు కలిగిన కుటుంబానికి నిత్యవసర వస్తువుల కోసం రూ.1,500ల చొప్పన నగదును అందిస్తారు. ఇందుకు రూ.147 కోట్ల పైచిలుకు ఖర్చవుతుంది. గ్రేటర్ పరిధిలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల అర్బన్ ప్రాంతాలు వస్తాయి. మొత్తం మీద 12 సర్కిళ్లున్నాయి. అర్బన్ వారీగా పరిశీలిస్తే హైదరాబాద్ జిల్లా పరిధిలో 5,80,808 ఆహార భద్రత కార్డులు, 21,77,934 యూనిట్లు రంగారెడ్డి జిల్లాలోని సరూర్‌నగర్ అర్బన్ పరిధిలో 1,87.969 కార్డులు 6,24,702 యూనిట్లు, మేడ్చల్ జిల్లాలోని బాలనగర్, ఉప్పల్ అర్బన్ పరిధిలో 3,65,241 కార్డులు, 12,24,830 యూనిట్లున్నాయి. వాస్తవంగా మార్చి నెల సరుకుల పంపిణీ గడువు 15వ తేదీతో ముగిసింది. ఇప్పటికే ఏప్రిల్ మాసం సరకుల కోటా కోసం డీలర్లు సిద్ధమవుతున్నారు. కాగా కరోనా కట్టడిలో భాగంగా ఆహార భద్రత కార్డుదారులకు బియ్యం ఉచితంగా పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటి వరకు కార్డుదారులకు రూ.1లకు కిలో చొప్పన యూనిట్‌కు ఆరు కిలోల అందిస్తోంది. తాజాగా యూనిట్‌కు 12 కిలోల చొప్పున ఉచితంగా అందజేసేందుకు సిద్ధమైంది. -
వలస కుటుంబాలకు ఊరట
సాక్షి, అమరావతి: రేషన్ బియ్యం కార్డులున్న పేదలు దేశంలోని ఏ ప్రాంతంలోనైనా సబ్సిడీపై ఇచ్చే సరుకులు తీసుకునే వెసులుబాటు లభించింది. ముఖ్యంగా వలస కార్మికులు దీని వల్ల బాగా లబ్దిపొందుతున్నారు. ఈ విధానాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పకడ్బందీగా అమలు చేస్తున్నాయి. ఎక్కడి నుంచైనా రేషన్ తీసుకునే విధానం (పోర్టబిలిటీ) ఇటీవలి వరకు కేవలం రాష్ట్ర పరిధిలో మాత్రమే ఎక్కడైనా తీసుకోవచ్చనే నిబంధన ఉండేది. అయితే వలస కూలీలను దృష్టిలో ఉంచుకొని ఏ రాష్ట్రంలోనైనా సరుకులు తీసుకోవచ్చనే విధానాన్ని కేంద్ర ప్రభుత్వం ఇటీవల అమల్లోకి తెచ్చింది. వ్యయప్రయాసలు తప్పాయి... రాష్ట్రం నుండి ఎక్కువగా కర్ణాటక, తమిళనాడు, కేరళ, మహారాష్ట్రలకు పనుల కోసం వలసలు వెళ్తుంటారు. ఇలాంటి కూలీలకు ఎంతో ప్రయోజనం కలగుతోంది. ఇప్పటి వరకూ ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లిన కూలీల కుటుంబాల్లో ఒకరు అనేక వ్యయప్రయాసలతో సొంత రాష్ట్రానికి వచ్చి సరుకులు తీసుకెళ్లేవారు. గత కొద్ది నెలలనుంచీ ఆయా రాష్ట్రాల్లో కూడా తీసుకునే వెసులుబాటు అందుబాటులోకి వచ్చింది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారు తెలంగాణలోనూ, తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారు ఆంధ్రప్రదేశ్‌లో పోర్టబిలిటీ విధానాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. ఇదే తరహాలో ఇతర రాష్ట్రాల్లో కూడా సరుకులు తీసుకోవచ్చని అధికారులు తెలిపారు. రాష్ట్రంలో 1.47 కోట్ల రేషన్ కార్డులు ఉంటే డిసెంబర్ నెలలో రాష్ట్రం పరిధిలోని వివిధ జిల్లాల్లో 31.48 లక్షల మంది పోర్టబిలిటీని వినియోగించుకున్నారు. రాష్ట్రంలో ఉన్న మొత్తం కార్డులు, ఇతర జిల్లాల్లో సరుకులు తీసుకున్న వారి వివరాలిలా ఉన్నాయి. -
రేషన్ బియ్యం దందా
సాక్షి, జమ్మికుంట: పేదల బియ్యం గద్దల పాలవుతున్నాయి. ప్రజా పంపిణీ వ్యవస్థ నుంచి లబ్ధిదారులకు చేరాల్సిన రూపాయికి కిలో బియ్యం దొడ్డిదారిన దళారులకు దక్కుతున్నాయి. దొడ్డు బియ్యాన్ని చౌకగా చేజిక్కించుకుంటున్న మాయగాళ్లు రాత్రికి రాత్రే హోటళ్లు, వ్యాపార సంస్థలు, పొరుగు రాష్ట్రాలకు తరలిస్తున్నారు. భారీగా చీకటి దందా సాగిస్తూ రూ.కోట్లు గడిస్తున్నారు. నిద్రావస్థలో జోగుతున్న సర్కారు నిఘాతో అక్రమార్కుల ఆగడాలకు అడ్డులేకుండా పోయింది. పేదలకు కడుపునిండా తిండి పెట్టాలనే లక్ష్యంతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి రూపాయికి కిలో బియ్యం పథకాన్ని అమల్లోకి తెచ్చారు. లబ్ధిదారుల కుటుంబాల్లో ఒక్కొక్కరికి నాలుగు కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ బియ్యం కోటా పెంచారు. 2014 నుంచి ఒక్కొక్కరికి ఆరు కిలోలు చొప్పున ఇస్తున్నారు. ప్రస్తుతం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నెలకు 16,800 టన్నుల బియ్యాన్ని కేటాయిస్తున్నారు. ఇందులో కరీంనగర్ జిల్లాకు 4,890 టన్నులు, జగిత్యాలకు 5,240, పెద్దపల్లికి 3,576, సిరిసిల్ల జిల్లాకు 3,093 టన్నులు తరలుతున్నాయి. వీటి విలువ రూ.50.40 కోట్లు ఉంటుంది. కిలోకు రూ.8 చొప్పున కొంటున్న దళారులు.. సరుకుల పంపిణీకి ప్రభుత్వం ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా పేదలకు దక్కాల్సిన బియ్యం పక్కదోవ పడుతూనే ఉన్నాయి. వివిధ మార్గాల్లో గుట్టుగా దళారులకు చేరుతున్నాయి. దీనికితోడు ఉమ్మడి జిల్లాలో అధికశాతం లబ్ధిదారులు రేషన్ బియ్యం తినడం లేదు. చౌకధరల దుకాణంలో రూపాయికి కిలో చొప్పున పొందుతున్న దొడ్డు బియ్యాన్ని చౌకగా అమ్ముకుంటున్నారు. దీన్ని అదునుగా తీసుకుంటున్న దళారులు కిలోకు రూ.8 నుంచి రూ.10 వరకు కొంటున్నారు. సేకరించిన బియ్యాన్ని హోటళ్లు, ఇతర వ్యాపార సంస్థలకు రూ.20 నుంచి రూ.22 వరకు విక్రయిస్తున్నారు. కొందరికి రైలుమార్గం అనువుగా ఉండడంతో బియ్యాన్ని ప్యాసింజర్ రైళ్లలో మహారాష్ట్రకు తరలిస్తున్నారు. ఏటా వేలాది క్వింటాళ్ల సరుకులను విరూర్, నాగపూర్ వ్యాపారులకు అక్రమంగా చెరవేస్తూ, కిలోకు రూ.28 నుంచి రూ.35 దాకా గిట్టుబాటు చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడలో దొడ్డు బియ్యానికి డిమాండ్ నెలకొనడంతో అక్కడికి పెద్దఎత్తున రవాణా అవుతున్నట్లు తెలుస్తోంది. తక్కువ పెట్టుబడితో లాభసాటి వ్యాపారం కావడం, సర్కారు పర్యవేక్షణ పెద్దగా లేకపోవడం.. వెరసి అక్రమార్జనతో దళారుల జేబులు నిండుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో ఈయేడు ఇప్పటి వరకు అడపా దడపా జరిగిన తనిఖీల్లో 4,583 క్వింటాళ్ల బియ్యం పట్టుబడ్డాయి. ఈ మేరకు రూ.1.37 కోట్ల విలువైన సరుకులను స్వాధీనం చేసుకున్న అధికారులు 183 కేసులు నమోదు చేశారు. దీన్ని బట్టి రేషన్ బియ్యంతో మాయగాళ్లు నడిపిస్తున్న చీకటి దందా ఏస్థాయిలో ఉందో అర్థమవుతోంది. కిలో బియ్యం తయారీకి రూ.30 ఖర్చు.. రేషన్ బియ్యం కోసం ప్రభుత్వం రైతుల నుంచి నేరుగా ధాన్యం కొంటోంది. వాటిని మిల్లుల్లో మర పట్టించి, ఛౌకధరల దుకాణాలకు పంపుతోంది. ఈమేరకు వివిధ చార్జీలు, పన్నులు కలుపుకొని కిలో బియ్యంపై రూ.30 వరకు ఖర్చు చేస్తోంది. కాగా.. చాలామంది లబ్ధిదారులు దొడ్డు బియ్యం తినేందుకు విముఖత చూపుతున్నారు. వాటిని కిలోకు రూ.8 నుంచి రూ.10 చొప్పున అమ్ముతూ, రూ.40 లకు లభిస్తున్న సన్నబియ్యం కొనుగోలు చేస్తున్నారు. ఫలితంగా రేషన్ బియ్యం కొంటున్న దళారులకు కిలోపై రూ.10 నుంచి రూ.25 దాకా లాభం చేకూరుతోంది. అంటే.. పేదల కోసం సర్కారు కల్పిస్తున్న రాయితీతో దళారులకే ప్రయోజనం కలుగుతోంది. -
పక్కదారి పడుతున్న రేషన్‌బియ్యం
-
పేదల బియ్యం బ్లాక్ మార్కెట్లో..
సాక్షి, కందుకూరు: అక్రమ బియ్యం వ్యాపారానికి కందుకూరు ప్రాంతం కేంద్రంగా మారుతుంది. కొన్నేళ్లుగా ఈ ప్రాంతంలో ఈ బ్లాక్ మార్కెట్ దందా విచ్చలవిడిగా సాగుతున్నా అడ్డుకోవడంలో అధికార యంత్రాంగం పూర్తిగా విఫలమవుతోంది. దీంతో అక్రమ బియ్యం వ్యాపారులు యథేచ్ఛగా వ్యాపారాన్ని సాగిస్తున్నారు. బియ్యం వ్యాపారులకు అధికారుల అండదండలు ఉన్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీంతో పేదల బియ్యం ప్రతి నెలా టన్నుల కొద్దీ బ్లాక్ మార్కెట్‌కు తరలిపోతోంది. ఈ వ్యవహారంలో రేషన్ డీలర్ల దగ్గర నుంచి అధికారుల వరకు అందరూ భాగస్వాములునే అనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. బహిరంగ రహస్యమే... కందుకూరు ప్రాంతంలో బియ్యం వ్యాపారం ఎవరు చేస్తున్నారు, ఎక్కడికి బియ్యం వెళ్తున్నాయనేది బహిరంగ రహస్యమే. ఏ డీలర్ ఎవరికి బియ్యం అమ్ముతాడు, ఆ బియ్యం ఏ రైస్ మిల్లులో రీసైక్లింగ్ అవుతాయనేది జరగమెరిగిన నగ్న సత్యం. కానీ ఈ కందుకూరు ప్రాంతంలో జరుగుతున్న బియ్యం అక్రమ వ్యాపారానికి అడ్డుకట్ట మాత్రం పడదు. దాడుల్లో పట్టుబడ్డ ఒక్క వ్యాపారిపై కూడా చర్యలు తీసుకోరు. నాలుగైదు సంవత్సరాలుగా ఇదంతా మామూలు విషయంగానే మారిపోయింది. కందుకూరు కేంద్రం ప్రతి నెలా టన్నుల కొద్ది బియ్యం బ్లాక్ మార్కెట్‌కు తరలుతుంది. ఇవి రేషన్ డీలర్ల నుంచి కొందరు వ్యాపారులు కొనుగోలు చేస్తుండగా, మరికొందరైతే ఏకంగా సివిల్ సప్లై గూడెం నుంచే బ్లాక్ మార్కెట్‌కు తరలించిన సంఘటనలున్నాయి. కందుకూరు చట్టుపక్కల ఉన్న రైస్ మిల్లులో రీస్లైకింగ్ చేసి విక్రయిస్తున్నారు. కందుకూరు పరిసర ప్రాంతంలోని ఓగూరు, లింగసముద్రం మండలం వీఆర్‌కోట, పెదపవని గ్రామాల్లోనే రైస్ మిల్లులు ఈ రీసైక్లింగ్‌కు కేంద్రాలుగా ఉన్నాయి. నాలుగు రోజుల వ్యవధిలో దాదాపు దాదాపు 500 బస్తాల బియ్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటిలో వీఆర్‌కోట గ్రామంలోని నరశింహారావు అనే బియ్యం వ్యాపారికి చెదిన రైస్ మిల్లులో 380 బస్తాలను అధికారులు గుర్తించారు. వీటిలో 140 బస్తాల బియ్యం ఏకంగా సివిల్ సప్లై కార్పొరేషన్ లోగోతో సహా పట్టుబడ్డాయి. అలాగే ఓగూరు మిల్లు వద్ద ఉన్న మిల్లును సాంబయ్య అనే వ్యాపారి నిర్వహిస్తున్నాడు. ఈ మిల్లులో 109 బస్తాల బియ్యం స్వాధీనం చేసుకున్నారు. గత రెండు సంవత్సరాల వ్యవధిలో ఇదే మిల్లులపై మూడుసార్లు అధికారులు దాడులు చేసి స్వయంగా రేషన్ బియ్యాన్ని టన్నుల కొద్ది స్వాధీనం చేసుకున్నారు. కానీ మిల్లు మాత్రం మూతపడదు. తూతూ మంత్రంగా కేసులు నమోదు చేసి వదిలేయడం పరిపాటిగా మారిపోయింది. దీంతో ఎన్నిసార్లు దాడుల్లో పట్టుబడినా తమకేమీ కాదనే ధైర్యంతో వీరు అక్రమ బియ్యం వ్యాపారాన్ని అలాగే కొనసాగిస్తున్నారు. ఇలా ఈ ప్రాంతంలోని రైస్ మిల్లులు ఈ అక్రమ బియ్యం వ్యాపారానికి కేంద్రంగా మారుతున్నాయి. ఇక్కడే రీ సైక్లింగ్ చేసి మార్కెట్లో విక్రయించడం లేదా, అదే బియ్యాన్ని సీఎంఎస్ పేరుతో తిరిగి సివిల్ సప్లై కార్పొరేషన్‌కే అంటగడుతున్నారు. విచ్చలవిడిగా వ్యాపారం... ఇటీవల కాలంలో ఈ బియ్యం అక్రమ వ్యాపారం మరీ విచ్చలవిడిగా మారిపోయింది. ఒక్క కందుకూరు ప్రాంతం నుంచే కాక పామూరు, కనిగిరి తదితర ప్రాంతాల నుంచి ఇటువైపు నుంచి జిల్లా సరిహద్దులు దాటిస్తున్నారు. ఇక్కడ మిల్లుల యజమానులు స్థానికంగా కొనుగోలు చేసి అదే బియ్యాన్ని రీస్లైకింగ్ చేసి జిల్లా సరిహద్దులు దాటిస్తారు. లేదంటే కొందరు వ్యాపారులు నేరుగా నెల్లూరు జిల్లాలోని పలువురు వ్యాపారులకు విక్రయిస్తున్నారు. ఒక్కొక్క వ్యాపారిని డీలర్లను కూడగట్టుకుని షాపులకు వచ్చే బియ్యాన్ని నేరుగా తీసుకెళ్తుంటారు. డీలర్‌కు కేజీకి రూ.12 నుంచి రూ.15ల వరకు ఇచ్చి కొనుగోలు చేస్తున్నారు. ఇలా ప్రతి నెలా టన్నుల కొద్ది బియ్యాన్ని బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్నారు. తూతూ మంత్రంగా తనిఖీలు ఇంత భారీ స్థాయిలో అక్రమ బియ్యం వ్యాపారం సాగుతున్నా, దాడుల్లో పలుమార్లు పట్టుబడ్డా అధికారులు మాత్రం చూసీచూడనట్లు వదిలేస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రధానంగా బియ్యం వ్యాపారులు టీడీపీ సానుభూతి పరులు కావడం, గత ప్రభుత్వం ఒత్తిడితో వారి వ్యాపారానికి అడ్డేలేకుండా పోయింది. రేషన్‌షాపుల్లో తనిఖీలు చేసి అక్రమాలను నిరోధించాల్సిన సివిల్ సప్లైశాఖ, రెవెన్యూ శాఖ అధికారులు అసలు పట్టించుకోరు. ఏ రేషన్‌షాపు నుంచి ఏ మిల్లుకు బియ్యం వెళ్తాయనేది తెలిసినా, దాడుల్లో సమాచారం దొరికినా ఒక్క డీలర్‌పై కూడా చర్యలు లేవు. మిల్లులు యధేచ్చగా తమ కార్యకలాపాలు కొనసాగిస్తుంటాయి. దీనంతటికీ ఏ శాఖకు అందాల్సిన మామూళ్లు ప్రతినెలా వ్యాపారులు ముట్టచెప్తున్నారనే విమర్శలు జోరుగా వ్యక్తమవుతున్నాయి. -
అర్ధరాత్రి పీడీయస్ బియ్యం అక్రమ రవాణా
సాక్షి, నల్లజర్ల: పశ్చిమగోదావరి జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న పిడియస్ బియ్యాన్ని విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నల్లజర్ల మండలం ఆవపాడు లిక్కర్ ఫ్యాక్టరీకి రేషన్ బియ్యం వస్తుందనే పక్కా ముందస్తు సమాచారంతో అర్ధరాత్రి విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. పదహారు లారీల్లో రేషన్ బియ్యం ఉన్నట్లు అధికారులు గుర్తించారు.వీటి విలువ సుమారు కోటి రూపాయలు ఉండవచ్చని అధికారులు అంచనా వేశారు. దీనిపై అధికారులు పూర్తిస్థాయిలో విచారణ ప్రారంభించారు. -
బియ్యం బొక్కుడు తూకం.. తకరారు
నిరుపేదల బియ్యాన్ని కొందరు అడ్డదారిలో బొక్కుతున్నారు. కొన్ని మండల లెవల్ స్టాక్ పాయింట్లలో (ఎంఎల్ఎస్) సిబ్బంది చేతివాటం చూపుతూ క్వింటాకు రెండు నుంచి నాలుగు కిలోలు దోచేస్తున్నారు. ఫలితంగా డీలర్లకు తక్కువ బియ్యం అందుతున్నాయి. దీంతో డీలర్లు కూడా తూకంలో తకరారు చేస్తూ కార్డుదారులకు తక్కువ బియ్యం ఇస్తున్నారు. ఇలా ఒక్క నెలలోనే దాదాపు 50 టన్నుల బియ్యాన్ని నొక్కేస్తూ నల్లబజారుకు తరలిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై ప్రశ్నిస్తే అధికారులు ఎక్కడ తమను ఇబ్బందులకు గురి చేస్తారోనని డీలర్లు నోరు మెదపడం లేదు. సాక్షి, అనంతపురం : జిల్లాలో 3,003 చౌక ధరల దుకాణాలుండగా.. వాటి పరిధిలో 12,21,772 తెల్లరేషన్ కార్డులు ఉన్నాయి. జిల్లావ్యాప్తంగా ఉన్న 24 ఎంఎల్ఎస్ పాయింట్ల నుంచి డీలర్ల ఇండెంట్ మేరకు చౌక దుకాణాలకు బియ్యాన్ని రవాణా చేస్తారు. కార్డుదారులకు ప్రతి నెలా 18,500 టన్నులు బియ్యం పంపిణీ చేస్తున్నారు. ఒక్కో ఎంఎల్ఎస్ పాయింట్ నుంచి సగటున 770 టన్నుల బియ్యం డీలర్లకు సరఫరా అవుతోంది. కొన్ని ఎంఎల్ఎస్ పాయింట్లలోని అధికారులు, సిబ్బంది బియ్యాన్ని నొక్కేస్తుండగా.. ఆ ప్రభావం కార్డుదారులపై పడుతున్నట్లు తెలుస్తోంది. నోరు మెదపలేని స్థితిలో డీలర్లు ఎంఎల్ఎస్ పాయింట్లలో క్వింటా మీద రెండు నుంచి నాలుగు కేజీల వరకు బియ్యం నొక్కేస్తున్నా.. డీలర్లు నోరు మెదపలేని పరిస్థితి నెలకొంది. ఇదేమని ప్రశ్నిస్తే సంబంధిత అధికారులు తమను ఇబ్బందులకు గురిచేస్తారని కొందరు డీలర్లు వాపోతున్నారు. 200 క్వింటాళ్ల మేర బియ్యం ఇవ్వాల్సి ఉన్నా డీలర్‌కు 196 క్వింటాళ్లు మాత్రమే ఇస్తున్నారు. నాలుగు క్వింటాళ్లు(400 కేజీలు) తక్కువగా ఇస్తున్నారని, వాటి కోసం అధికారులతో గొడవ పడి తలనొప్పులు తెచ్చుకోవడం ఎందుకనే ఉద్దేశంతో మిన్నకుండిపోతున్నామని పుట్టపర్తి నియోజకవర్గం పరిధిలోని ఒక డీలర్ చెబుతున్నాడు. ఇలా ఎంఎల్ఎస్ పాయింట్లో కోత పెట్టిన బియాన్ని కార్డుదారులకు పంపిణీ చేసే క్రమంలో సర్దుబాటు చేసుకుంటున్నామని సదరు డీలర్ చెబుతున్నాడు. ఇలా తాను ఒక్కడినే కాదని జిల్లాలో చాలా మంది డీలర్లు ఇదే పరిస్థితి ఎదుర్కొంటున్నారని ఆయన చెప్పుకొచ్చాడు. అధికారులది మరో వాదన ప్రస్తుతం టెయిర్ వెయిట్(సంచి తూకం) ఇవ్వడం లేదని అధికారులు చెబుతున్నారు. ఒక్కో క్వింటా బియ్యాన్ని రెండు బస్తాల్లో నింపుతున్నారనీ, ఒక్కో బస్తా సంచి బరువు కిలో 100 గ్రాములు ఉంటుందన్నారు. సరఫరా అయ్యే బియ్యమే క్వింటా స్థానంలో 998.9 కేజీలు ఉంటోందన్నారు. ఇక స్టేజ్–1 ద్వారా ఎంఎల్ఎస్ పాయింట్‌కు వచ్చే బియ్యంలోనే క్వింటా మీద రెండు నుంచి మూడు కేజీల వరకు తక్కువగా వస్తున్నాయని చెబుతున్నారు. ఈ తరుగు 120 టన్నుల మేర ఉంటోందంటున్నారు. ఎఫ్‌సీఐ, ఎస్‌డబ్ల్యూసీలో లోడింగ్, అన్‌లోడింగ్‌కు తరుగు ఇస్తున్నారని, అదే ఎంఎల్ఎస్ పాయింట్లో అన్లోడింగ్, లోడింగ్‌కు తరుగును ఇవ్వడం లేదంటున్నారు. దీన్ని భర్తీ చేసుకునేందుకు డీలర్లకు కొందరు తక్కువగా ఇవ్వాల్సి వస్తోందంటున్నారు. తరుగు అంశాన్ని గత ప్రభుత్వ హయాంలోనే కమిషనర్ దృష్టికి తీసుకెళ్లామన్నారు. కొన్ని చోట్ల జరుగుతుండొచ్చు బియ్యం తక్కువగా ఇవ్వడం లేదని చెప్పలేను. కానీ అన్నిచోట్ల కాదు. కొన్ని ఎంఎల్ఎస్ పాయింట్లలో ఇది జరుగుతుండొచ్చు. ముఖ్యంగా బియ్యం అన్లోడింగ్, లోడింగ్ క్రమంలో కొంత తరుగు వస్తున్న మాట వాస్తవమే. అలా అని డీలర్లకు బియ్యం తక్కువగా ఇవ్వకూడదు. పాయింట్లను ఆకస్మిక తనిఖీ చేస్తాం. స్టేజ్–1 నుంచి బియ్యం తీసుకొచ్చే లారీని తూకం వేయిస్తాం. అదే విధంగా స్టేజ్–2 ద్వారా డీలర్లకు బియ్యం రవాణా చేసే లారీలను తూకం వేయిస్తాం. – డి.శివశంకర్‌రెడ్డి, జిల్లా మేనేజర్, పౌర సరఫరాల సంస్థ -
ఇదో ఒప్పంద దందా!
సాక్షి,సిటీబ్యూరో: ప్రజా పంపిణీ వ్యవస్థకు కేటాయించిన పేదల బియ్యం పక్కదారి పడుతూనే ఉన్నాయి. దీన్ని అరికట్టేందుకు, పకడ్బందిగా రేషన్ సరుకులు పేదలకు చేరేందుకు ప్రభుత్వ చౌకధరల దుకాణల్లో ఈ–పాస్ (వేలిముద్ర) విధానం అమల్లోకి తెచ్చారు. సరుకులు డ్రా చేయకున్నా ‘రేషన్ కార్డు’ రద్దవదన్న వెసులు బాటుతో కొందరు లబ్ధిదారులు సరుకులకు దూరంగా ఉంటున్నారు. సరుకులు తీసుకోకుండే ఆ మేరకు స్టాక్ మిగిలినట్టు రికార్డు అవుతుంది. అయినప్పటికీ కొందరు దుకాణదారులు క్వింటాళ్ల కొద్దీ బియ్యం అక్రమంగా బయటికి తరలించేస్తున్నారు. బహిరంగ మార్కెట్లో కిలో బియ్యం రూ.50కి పైగా ఉండగా.. సబ్సిడీ బియ్యం రూ.1కే దొరుకుతున్నాయి. దీంతో డీలర్లే సరుకులు తీసుకోని లబ్ధిదారుకుల కొంత మొత్తం ఆశ చూపి వారి బియ్యాన్ని తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. మధ్య తరగతి దూరమే.. గ్రేటర్లో సగానికి పైగా మధ్య తరగతి కుటుంబాలు ఆహార భద్రత కార్డుదారులు ఉన్నా రేషన్ బియ్యం తీసుకునేందుకు పెద్దగా ఆశక్తి చూపడం లేదు. కార్డు బహుళ ప్రయోజనకారిగా మాత్రమే వినియోగిస్తున్నారు. అయితే, ప్రభుత్వం మాత్రం కుటుంబంలోని ఒక్కో సభ్యుడికి ఆరు కిలోల చొప్పున ఎంత మంది ఉంటే అన్ని కిలోల బియ్యం కేటాయిస్తోంది. అయితే, వీటిని లబ్ధిదారులు తీసుకోకపోవడంతో అవి డీలర్ల వద్దే ఉండిపోతున్నాయి. ఇలాంటివి మిగులుగా స్టాక్‌లో చూపించాలి. కానీ ఆహార భద్రత లబ్ధిదారుల్లో కొందరు బియ్యానికి బదులు నగదు తీసుకుంటున్నట్టు సమాచారం. డీలర్లు కిలో రూ. 10 చొప్పున లెక్క కట్టి లబ్ధిదారులకు ఇచ్చేస్తున్నారు. ప్రతినెలా రేషన్ షాపునకు వచ్చి ఈ–పాస్‌లో వేలిముద్ర ఇస్తే నగదు ఇచ్చేస్తామని లబ్ధిదారులకు ఆఫర్ ఇవ్వడం సర్వసాధారణమైంది. ఉదాహరణకు ఓ కుటుంబంలో భార్యాభర్తలు, ముగ్గురు పిల్లలు ఉంటే ఐదుగురికి ప్రతి నెలా 30 కిలోల బియ్యం కేటాయిస్తున్నారు. వాటిని డీలర్‌కు ఇచ్చేస్తే రూ.300 లబ్ధిదారులకు అందుతోంది. దాంతో రేషన్ బియ్యం తినని లబ్ధిదారులు ఇటువైపు మొగ్గుచూపుతున్నారు. దుకాణాలకు రాకుండానే.. ప్రభుత్వం ఎఫ్‌సీఐ ద్వారా లెవీ కింద రైస్ మిల్లర్ల నుంచి బియ్యం కొనుగోలు చేసి చౌక ధరల దుకాణాల ద్వారా పేదలకు పంపిణీ చేస్తోంది. ఎఫ్‌సీఐ నుంచి స్టేజ్–1 గుత్తేదారులు ద్వారా సివిల్ సప్లయిస్ గోదాములకు, అక్కడి నుంచి స్టేజ్–2 గుత్తేదారుల ద్వారా చౌకధరల దుకాణాలకు అందిస్తున్నారు. బియ్యం చేరవేసే క్రమంలో డీలర్లే రెగ్యులర్ ఒప్పంద లబ్ధిదారుల సంఖ్యను బట్టి ఆమేరకు బియ్యాన్ని దారి మళ్లిస్తున్నట్టు అధికారులు తేల్చారు. -
ఇక్కడ రేషన్..అక్కడ మిల్లులు
సాక్షి, వరంగల్ : దళారుల ద్వారా రేషన్ బియ్యాన్ని సేకరిస్తున్న రైస్ మిల్లుల వ్యాపారులు కొందరు మహారాష్ట్ర గొండియాలో బినామీల పేరిట మిల్లులు నడుపుతున్నారు. పాత వరంగల్, కరీంనగర్ జిల్లాల నుంచి సేకరించి బియ్యానికి ఆయా మిల్లుల్లో పాలిష్ పెట్టి రూ.లక్షలు గడిస్తున్నారు. ఇక్కడ క్వింటాల్‌కు రూ.1,500 నుంచి రూ.1,600 వరకు కొనుగోలు చేసి గొండియాకు రేషన్ బియ్యాన్ని తరలిస్తున్న వ్యాపారులు.. మహారాష్ట్ర ప్రభుత్వానికి రూ.2,100 చొప్పున ముందస్తు లెవీ చెల్లిస్తున్నారు. తద్వారా ఒక్కో క్వింటాల్‌పై రూ.500 నుంచి రూ.600 వరకు లబ్ధి పొందుతున్నారు. ఇలా రోజుకు ఒక్కో లారీ(200 క్వింటాళ్లు)పై రూ.లక్ష నుంచి రూ.1.20 లక్షల వరకు అక్రమంగా సంపాదిస్తున్నట్లు అంచనా. బియ్యంపై డబ్బు.. మళ్లీ ధాన్యం ఈ దందా దశల వారీగా సాగుతుంటుంది. తొలు త రేషన్ బియ్యం తీసుకునే లబ్ధిదారుల ద్వారా దళారులు సేకరిస్తారు. ఇక వారి నుంచి మిల్లర్లు సేకరించాక రేషన్ బియ్యాన్ని రైసుమిల్లులో దింపుకుని పాలిష్ పెట్టి మిల్లుల ద్వారా చెల్లించే ఒక ఏసీకే(270 క్వింటాళ్లు)ను బియ్యం కింద మహా రాష్ట్ర ప్రభుత్వం రైతుల నుంచి కొనుగోలు చేసిన 400 క్వింటాళ్ల ధాన్యాన్ని ఇస్తుంది. అంటే 270 క్వింటాళ్లపై అప్పటికే రూ.1,35,000 నుంచి రూ.1,62,000 వరకు సంపాదిస్తున్న వ్యాపారులు మళ్లీ 400 క్వింటాళ్ల ధాన్యం క్వింటాల్‌ను రూ.1800 కు విక్రయిస్తున్నారు. తద్వారా 270 క్వింటాళ్ల బియ్యానికి రూ.5,67,000 అవుతుండగా.. 400 క్వింటాళ్ల ధాన్యం విలువ రూ.7.20 లక్షలకు చేరుతోంది. ఇలా విక్రయించడం ద్వారా ఒక్క ఏసీకేపై రూ.1,53,000 వరకు అదనంగా సదరు వ్యాపారుల జేబుల్లోకి వెళ్తోంది. నెలలో కనీసం 15 నుంచి 20 ఏసీకేల టర్నోవర్ చేస్తున్న వ్యాపారులు రూ.22 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు అక్రమంగా సంపాదిస్తున్నారు. ఈ దందాకు కొందరు రెవెన్యూ, పౌరసరఫరా, పోలీసుశాఖ అధికారులు పరోక్షంగా సహకరిస్తున్నట్లు తెలుస్తుండగా.. కాళేశ్వరం వంతెన ద్వారా గొండియాకు యథేచ్ఛగా రవాణా సాగుతోందనే ఆరోపణలు ఉన్నాయి. ‘రూపాయి’పై రాబంధులు బహిరంగ మార్కెట్లో కిలో బియ్యం రూ.35 నుంచి రూ.48 పలుకుతుండటంతో రేషన్ బియ్యానికి గిరాకీ పెరుగుతోంది. సంచులు మార్చి.. పాలిష్ పెట్టి ఎల్లలు దాటిస్తూ రూ.లక్షలు గడించాలనే ఆశతో ఉన్న దళారులు, కొందరు రైస్‌మిల్లర్లకు ఇది వరంగా మారింది. మహారాష్ట్ర సరిహద్దులోని ఉమ్మడి వరంగల్, కరీంనగర్ జిల్లాల చివరి గ్రామా లే అడ్డాలుగా.. కాళేశ్వరం అంతర్రాష్ట్ర వంతెన ద్వారా మహారాష్ట్రలోని గొండియాకు తరలిస్తున్నారు. ఇలా తరలిస్తున్న రెండు లారీల(400 క్విం టాళ్లు) రేషన్ బియ్యాన్ని ఈనెల 12 పాత వరంగల్, కరీంనగర్ జిల్లాల పోలీసులు పట్టుకోవడంతో ఈ గుట్టు రట్టయ్యింది. వరంగల్ నుంచి మహారాష్ట్రకు లారీ(సీజీ 04 జేసీ 0996)లో 200 క్వింటాళ్ల బియ్యాన్ని తరలిస్తుండగా మహదేవపూర్ మండలం కుదురుపల్లి వద్ద పోలీసులు పట్టుకున్నారు. ఈక్రమంలో వ్యాపారి సాదుల నవీన్, అతని గుమస్తా సదానం దం, లారీ డ్రైవర్ బూపేంద్రకుమార్పై కేసులు నమోదయ్యాయి. వరంగల్, కరీంనగర్ జిల్లాల సరిహద్దులో మరో 50 క్వింటాళ్ల బియ్యాన్ని భూపాలపల్లి జిల్లా అధికారులు పట్టుకోగా, హుజూరాబాద్ నుంచి మహారాష్ట్రకు తరలిస్తున్న లారీ, 400 క్వింటా ళ్ల రేషన్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకోవడంతో దందా ఎంత యథేచ్ఛగా సాగుతోందని వెలుగు చూసింది. ఎన్నికల సమయంలో కాళేశ్వరం వంతెన వద్ద ఏర్పాటుచేసిన చెక్‌పోస్టులను పోలీసులు ఎన్నికల కోడ్ ముగియగానే ఎత్తివేశారు. ఆ మరుసటి రోజే రేషన్ బియ్యం పట్టుబడడం గమనార్హం. ఒకటి, రెండు లారీలు పట్టుబడినా ఆ తర్వాత నుంచి ఇప్పటికీ దందా నిత్యకృత్యంగా సాగుతుండటం చర్చనీయాంశంగా మారింది. -
రేషన్ బియ్యం... తినే భాగ్యం...
రేషన్ బియ్యమా?... మాకొద్దు... అనేవారంతా ఇక వాటికోసం అర్రులు చాచనున్నారు. పురుగులు పట్టి... దుడ్డుగా ఉన్న బియ్యం ఇక తినాల్సిన అవసరం లేదు. అందరికీ నాణ్యమైన... సన్నబియ్యం తినే భాగ్యం కలగనుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. గ్రామవలంటీర్ల ద్వారా లబ్ధిదారుని ఇంటికే నేరుగా ప్యాకెట్ల రూపంలో సరఫరా చేయాలని సంకల్పిస్తోంది. దీనివల్ల ఇప్పటివరకూ రేషన్ డిపోనుంచి తెచ్చి మారు వర్తకులకు అమ్ముకోవాల్సిన అవసరం లేకుండా... ఇచ్చిన బియ్యాన్ని సద్విని యోగం చేసుకునే అవకాశం కలగనుంది. సాక్షి, విజయనగరం: ప్రతి పేదవాడూ ఇక సన్నబియ్యం తినే అవకాశం కలగనుంది. ప్రస్తుతం రేషన్‌డిపోల్లో ఇస్తున్న బియ్యం నాసిరకంగా ఉండటంతో గతిలేక లబ్ధిదారులు తినాల్సి వస్తోంది. కొందరైతే విడిపించిన బియ్యాన్ని మారువర్తకులకు అమ్ముకుని కాలక్షేపం చేస్తున్నారు. దీనివల్ల రేషన్‌ద్వారా సరఫరా చేస్తున్నా ఫలితం ఉండట్లేదు. పైగా ప్రజాపంపిణీ వ్యవస్థ అక్రమాలకు నిలయంగా మారింది. ఈ విషయాన్ని గ్రహించిన రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఇకపై పేదలకు తినే బియ్యం ఇస్తే బాగుం టుందని భావించారు. సన్నబియ్యం సరఫరా చేసి వారికి ఉన్న ఇబ్బందులు తొలగించాలని నిర్ణయించారు. సెప్టెంబర్ నెల నుంచి నాణ్యమైన బియ్యాన్ని అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దుడ్డు బియ్యంతో ఇబ్బందులు ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా పేదల ఆకలి తీర్చేందుకు అనేక రకాలు సరకులు సరఫరా చేస్తున్న విషయం తెలిసిందే. గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఈ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైంది. రెండు, మూడురకాల సరకులకే పరిమితమైంది. అవి కూడా నాణ్యమైనవి కాకపోవడం విశేషం. రేషన్‌డిపోల ద్వారా ఇంతవరకు దుడ్డు బియ్యం సరఫరా చేసేవారు. వాటిని తినలేక వారు వ్యాపారులకు అమ్ముకునేవారు. ప్రస్తుతం జిల్లాలో 7,13,053 రేషన్‌కార్డులున్నాయి. ఇందులో 30శాతం లబ్ధిదారులు అత్యంత పేదలు. వీరికి కోటా బియ్యం తప్ప వేరే గతి లేదు. బయట కొనుగోలు చేసే శక్తి లేక వాటినే బలవంతంగా తింటున్నారు. మిగతా వారికి కాస్త కొనుగోలు చేసుకునే శక్తి ఉండడంతో ఈ బియ్యం తినకుండా బయట సన్న బియ్యం కొంటున్నారు. విడిపించిన బియ్యం డీలరుకు గానీ, వీధుల్లోకి వచ్చే వ్యాపారులకు విక్రయిస్తున్నారు. తద్వారా వచ్చిన డబ్బుకు కొంత కలిపి దుకాణాల్లో సన్నబియ్యం కొనుగోలు చేస్తున్నారు. జిల్లాలోని రేషన్ దుకాణాలు 1460 జిల్లాలో మొత్తం రేషన్‌కార్డులు 7,13,053 అన్నపూర్ణకార్డులు 846(లబ్ధిదారులు 1117) అంత్యోదయ కార్డులు 84,972(లబ్ధిదారులు 2,34,076) తెల్ల రేషన్ కార్డులు 6,27,235(లబ్ధిదారులు 18,25,778) మొత్తం నెలకు సరఫరా చేస్తున్న బియ్యం 1,20,784 క్వింటాళ్లు సన్నబియ్యంతో మంచి రోజులు ప్రజాసంకల్ప పాదయాత్రలో జగన్మోహన్రెడ్డి దృష్టికి ఈ అంశం రావడంతో అధికారంలోకి రాగానే పేదలకు సన్నబియ్యం సరఫరా చేయాలని నిర్ణయించారు. ఇందులోభాగంగా ప్రజాపంపిణీ వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేసేదిశగా అడుగులేస్తున్నారు. సెప్టెంబర్ నెల నుంచి ఇంటింటికి సరుకులు సరఫరా చేయాలని నిర్ణయించారు. అదే నెల నుంచి నాణ్యమైన సన్నబియ్యం సరఫరా చేయాలని భావిస్తున్నారు. 5, 10, 15 కిలోల ప్యాకెట్ల రూపంలో అందించాలని భావిస్తున్నారు. ఇందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. కసరత్తు చేస్తున్న అధికారులు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు అధికారులు కసరత్తు కూడా ప్రారంభించేశారు. కార్డుదారులు వారీగా అవసరమైన బియ్యం లెక్క తేలుస్తున్నారు. సరకులు ఏవిధంగా సరఫరా చేయాలన్న అంశంపై కూడా కార్యాచరణ ప్రణాళిక తయారు చేస్తున్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సన్నబియ్యం, కావాల్సిన మొత్తం బియ్యం తదితర వివరాలు తయారు చేస్తున్నారు. వీటన్నింటిని ముఖ్యమంత్రి దృష్టిలో పెట్టిన తర్వాత చాలకుంటే ఇతర ప్రాంతాల నుంచి సేకరించేందుకు అవసరమైన ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. దీనిపై 24వ తేదీన ఉండవల్లిలో జరిగే కలెక్టర్లు సదస్సులో చర్చించిన తర్వాత పూర్తి విధివిధానాలు ఖరారవుతాయని సమాచారం. గతంలో రైతు బజార్లలో... దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి పరిపాలనలో రైతు బజార్లలో తెల్ల రేషన్ కార్డు లబ్ధిదారులకు సూపర్ ఫైన్ బియ్యం విక్రయించేవారు. అప్పట్లో ఆ కార్యక్రమం విజయవంతం అయింది. క్రమేపీ రేషన్ షాపులకూ విస్తరిస్తామనుకున్న సమయంలో ఆయన స్వర్గస్తులయ్యారు. అప్పటితో ఆ ప్రక్రియ నిలిచిపోయింది. ఇప్పుడు ఆయన తనయుడు నవ్యాంధ్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సన్నబియ్యాన్ని అన్ని జిల్లాల్లోని రేషన్ షాపులకూ సరఫరా చేయాలని నిర్ణయించడంతో ప్రజల్లో ఆనందం వ్యక్తం అవుతోంది. ముఖ్యంగా మధ్య తరగతి ప్రజలు సంతోషం ప్రకటిస్తున్నారు. కలెక్టర్ల సదస్సులో నిర్ణయం తీసుకుంటారు సన్నబియ్యం సరఫరాపై సోమవారం జరిగే జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో నిర్ణయం తీసుకుంటారు. ఆ తరువాత ప్రభుత్వం విధి విధానాలను ప్రకటిస్తుంది. అప్పుడు జిల్లాల వారీగా ప్రతిపాదనలు, సరఫరాలపై నిర్ణయం తీసుకుంటాం. – ఎన్ సుబ్బరాజు, డీఎస్ఓ, విజయనగరం -
‘రేషన్’ దందాకు కేరాఫ్ కొత్తసొలస
గుంటూరు, యడ్లపాడు: అక్రమ రేషన్ బియ్యం నిల్వలకు, రవాణాకు యడ్లపాడు మండలం కేంద్ర బిందువుగా మారింది. మండలంలోని కొత్తసొలస గ్రామంలో జిల్లా పౌరసరఫరాల అధికారి టి.శివరామప్రసాద్ నేతృత్వంలో జిల్లాస్థాయి అధికారుల బృందం శనివారం అర్ధరాత్రి మెరుపుదాడి చేసింది. ముందుస్తు సమాచారంతో చేసిన ఈ దాడుల్లో 425 బస్తాల రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. నిల్వల్ని స్వాధీనం చేసుకుని నిందితులపై కేసు నమోదు చేశారు. గతంలోనూ ఇదే ఇంటిలో.. గతంలోనూ కొత్తసొలస గ్రామంలో ఇదే తరహాలో జిల్లా అధికారులు అక్రమంగా నిల్వలున్న రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. అప్పుడు ఎవరి ఇంట్లో రేషన్ బియ్యం నిల్వలు పట్టుబడ్డాయో..ఇప్పుడు వారి ఇంట్లోనే అంతేస్థాయిలో పట్టుకోవడం గమనార్హం. అప్పట్లో అర్ధరాత్రి హడావిడి చేసి బియ్యాన్ని స్వాధీనం చేసుకున్న అధికారులు వ్యాపారులపై క్రిమినల్ కేసుల్ని పెట్టకుండా వదిలేశారు. ఇప్పుడు కూడా 6–ఏ కేసు నమోదు చేయడం విశేషం. దీంతో అక్రమార్కులు పగలు వాహనాలను ఇళ్ల వద్ద ఉంచి రాత్రిళ్లు లోడు చేసి దర్జాగా తరలించడం ఇక్కడ నిత్యకృత్యంగా మారింది. చిలకలూరిపేట గోదాముకు బియ్యం తరలింపు మండలంలోని కొత్తసొలసలో అక్రమ రేషన్‌బియ్యం నిల్వలు ఉన్నాయని పక్కా సమాచారం అందుకున్న అధికారుల బృందం రాత్రి 11.30 గంటల సమయంలో కిలారు నాగేశ్వరరావు ఇంటిపై దాడి చేసింది. 425 యూరియా బస్తాల్లో 167 క్వింటాళ్లు పీడీఎస్ బియ్యం నిల్వలు లభించాయి. వీటిని స్వాధీనం చేసుకుని అక్కడి నుంచి నాలుగు వాహనాల్లో రాత్రికి రాత్రే చిలకలూరిపేట ఎంఎల్ఎస్ పాయింట్ గోదాముకు తరలించారు. దాడుల్లో డీఎస్ఓ టి. శివరామప్రసాద్, జిల్లా సహాయ పౌరసరఫరాల అధికారి శ్రీనివాసరావు, పౌరసరఫరాల డిప్యూటీ తహసీల్దార్ సాంబశివరావు, ఫణికుమార్, జియా, అశోక్ పాల్గొన్నారు. అక్రమార్కులు చెప్పిన వారే నిందితులు అధికారులు దాడులు నిర్వహించి పట్టుకున్న తరుణంలో అక్రమార్కులు ఎవరన్నది స్థానికులతో పాటు అధికారులకు తెలిసినా కేసుల నమోదులో మాత్రం కొత్తవారి పేర్లు వెలుగు చూడటం పరిపాటిగా మారింది. గతంలోనూ రేషన్ బియ్యం అక్రమ తరలింపు చేస్తున్న వ్యక్తి పేరు లేకుండా అసలు సంబంధం లేని వ్యక్తి పేరుపై నమోదు చేయడం స్థానికుల నుంచి విమర్శలు భారీగా వచ్చాయి. ప్రస్తుతం అదే తరహాలో అక్రమ రేషన్ బియ్యం వ్యాపారాల్లో పలు కేసుల్లో ఉన్న నిందితుడి తండ్రి ఇంట్లోనే నిల్వలు ఉండగా.. వాటిని గ్రామానికి చెందిన పి. రాంబాబు అనే వ్యక్తివిగా చెప్పడం పలు అనుమానాలకు దారి తీస్తోంది. టీడీపీ వర్గీయుల ఒత్తిడి కారణంగానే అసలు నిందితుల పేర్లు కేసు నమోదుల్లోకి రాకుండా పోయాయని తెలుస్తోంది. అధికారులు కూడా అక్రమార్కులకు సాయం అందిస్తున్నారంటూ పక్కా సమాచారాన్ని అందించిన ప్రజలే మండిపడుతున్నారు. ఇబ్బందులు లేకుండా కేసులు మండలంలో పలుమార్లు దాడులు చేసి అనేకచోట్ల రేషన్ బియ్యాన్ని పట్టుకున్నప్పటికీ అక్రమ వ్యాపారులకు మాత్రం బెరుకు లేకుండా పోయింది. అనేకమార్లు రెడ్‌హ్యాండ్‌గా పట్టుకుని స్వాధీనం చేసుకున్నా.. చౌక బియ్యం దందాను నిలుపుదల చేయడంలో విఫలం అయిపోతున్నారు. రేషన్ అక్రమ వ్యాపారులు టీడీపీకి చెందిన మంత్రి అనుచరులే కావడమే ఈ దందా యథేచ్ఛగా కొనసాగడానికి ప్రధాన కారణమని ప్రజల నుంచి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నాలుగున్నరేళ్లుగా అక్రమ దందా కొత్తసొలస గ్రామంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పీడీఎస్ అక్రమ బియ్యం దందా కొనసాగుతూనే ఉంది. మొదట రాత్రివేళ రహస్యంగా తరలించే ఈ వ్యవహారం గత మూడేళ్లుగా విచ్చల విడికి దారితీసింది. పట్టపగలే దర్జాగా లారీలకు ఎత్తేస్థాయికి వచ్చిందంటే పాలకులు, అధికారుల అండదండలు ఏస్థాయిలో ఉన్నాయో ఊహించుకోవచ్చు. రాత్రీపగలు తేడా లేకుండా పీడీఎస్ బియ్యం దిగుమతి, ఎగుమతులు చేయడంతో ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే కొత్తసొలస గ్రామం నిత్యం ఆటోలు, లారీల రాకతో రద్దీ ప్రాంతంగా మారింది. ప్రతినెలా 3వ తేదీ నుంచి 10వ తేదీలోపు రోజుకు రెండు చొప్పున, మిగిలిన రోజుల్లో ఒకలారీ చొప్పున లోడింగ్ చేస్తున్నట్లు సమాచారం. -
గాదె కింద పందికొక్కులు..!
పౌర సరఫరాల శాఖలో అవినీతికి అంతేలేకుండా పోయింది. తిలా పాపం తలా పిడికెడు అన్న చందంగా ఎవరికి వారు అందినకాడికి దండుకున్నారు. అక్రమాలను నియంత్రించాల్సిన అధికారులు చోద్యం చూశారు. నాలుగున్నర ఏళ్ల కాలంలో పేదల నోటికాడి ముద్ద తినేశారు. రూ. లక్షలు కాదు. దండుకుంది రూ.కోట్లలోనే. నెలనెలా రూ.20 కోట్ల వరకు సబ్సిడీ దుర్వినియోగం జరిగింది. రికార్డుల్లో అన్నీ లెక్కలు పక్కాగా చూపించినా క్షేత్ర స్థాయిలో బియ్యం దొంగలదే రాజ్యం. వీరు చేసిందంతా వీరభోజ్యం. సబ్సిడీ సరుకుల పంపిణీ పేరుతో పౌర సరఫరాలతో ప్రమేయం ఉన్న వారు తమ జేబులు దండిగా నింపుకున్నారు. అయినా ఇదేమి అన్యామని ప్రశ్నించిన నాథుడే లేరు. ఒంగోలు సిటీ: జిల్లాలో 2,142 చౌకధరల దుకాణాలు ఉన్నాయి. వీటి పరిధిలో 9,89,306 తెల్లకార్డులు ఉన్నాయి. నాలుగున్నర ఏళ్ల కాలంలో 7.41 లక్షల టన్నుల బియ్యం, 24 వేల టన్నుల చక్కెర, 36 వేల కిలో లీటర్ల కిరోసిన్, ఏడు వేల టన్నుల కందిపప్పు, మూడు వేల టన్నుల సజ్జలు, అయిదు వేల టన్నుల రాగులు పంపిణీ చేశారు. దీనికి గాను ప్రభుత్వం జిల్లాలో రూ.2,569 కోట్లు ఖర్చు చేసింది. నెలనెలా సబ్సిడీలో రూ.కోట్ల కొద్దీ దుర్వినియోగం జరిగింది. చంద్రన్న రంజాన్ కాను కింద 72,927 కార్డుదారులకు ఒక్కొరికి రూ.290 విలువ కలిగిన నాలుగు రకాల సరుకులను పంపిణీ చేశారు. రూ.6.34 కోట్లు ఉచితంగా పంపిణీ చేశారు. అలాగే చంద్రన్న క్రిస్మస్, సంక్రాంతి కానుకల ద్వారా 9,45,520 కార్డుదారులకు రూ.240 విలువ కలిగిన ఆరు రకాల సరుకులను పంపిణీ చేశారు. దీనికి గాను ప్రభుత్వం రూ.68.07 కోట్లు ఖర్చు పెట్టినట్లుగా చూపించారు. ఇంత పెద్ద వ్యవస్థను సబ్సిడీ దొంగలు పెద్ద పెద్ద మొత్తాల్లోనే దోచేశారు. నామమాత్రంగానే కేసులు.. జిల్లాలో పౌర సరఫరాల ద్వారా పెద్ద ఎత్తున సబ్సిడీ దుర్వినియోగం జరిగింది. సబ్సిడీ మొత్తాన్ని వివిధ స్థాయిల్లోని అధికారులు వాటాలు వేసుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. పౌర సరఫరాల్లో జరుగుతున్న అవినీతి తంతును నిరోధించే వారే కరవయ్యారు. పై స్ధాయి అధికారులకు అన్నీ తెలిసినా మిన్నకుండిపోయారన్న విమర్శలు ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా దాడులు నామమాత్రంగానే జరిగాయన్న ఆరోపణలు ఉన్నాయి. జిల్లా స్ధాయిలో అధికారులకు ఈ తతంగం అంతా తెలిసినా వారు పరోక్షంలో ప్రోత్సహించారన్న ఆరోపణలు ఉన్నాయి. రూ.10 లక్షల పైన బియ్యం పట్టుబడిన కేసులు కేవలం ఆరు మాత్రమే ఉండడం గమనార్హం. టీడీపీ నేతల సహకారంతోనే, వారి అధికారాన్ని ఉపయోగించుకొని ప్రజల సొమ్మును భారీగా కాజేశారన్న విమర్శలు ఉన్నాయి. ఇక కొన్నైనా కేసులు నమోదు చేయాలి కాబట్టి అందు కోసంగా 6–ఎ కేసులను మొక్కుబడిగా తెరిచారు. ఏడాదికి సుమారుగా 150కి మించి ఈ కేసులు కూడా లేకపోవడం గమనార్హం. మండల స్ధాయి గోదాముల్లో భారీగా బియ్యం నిల్వల్లో తేడాలు ఉన్నాయి. నిత్యావసర సరుకులు భారీగా తేడాలు ఉన్నాయి.అయినా వీటిపై నిఘా లేదు. ఏళ్ల తరబడి ఈ విభాగంలోనే పనిచేసిన ఒకరిద్దరు అధికారులు ఇటీవలే పదవీవిరమణ చేశారు. ఒకరిద్దరిపై దుర్వినియోగం కేసులున్నా వాటిని టీడీపీ నేతల సిఫార్సుతో మాఫీ చేయించుకోగలిగారు. ఇంత జరుగుతున్నా ఈ అక్రమాన్ని నిరోధించే వారే లేకపోవడం ధారుణం అని ముక్కున వేలేసుకుంటున్నారు. జనం సొమ్ము బొక్కేసిన బియ్యం దొంగలు జిల్లా వ్యాప్తంగా పౌరసరఫరాల్లో సబ్సిడీని భారీగా బొక్కేశారు. వేల టన్నుల బియ్యాన్ని పక్కదారి పట్టించారు. రూ. కోట్ల కొద్ది సబ్సిడి పక్కదారి పట్టింది. ఈ శాఖలో పని చేస్తున్న అధికారి ఒకరికి మిల్లర్లు, కొందరు అక్రమార్కులైన డీలర్లతో సంబంధాలు ఉన్నాయి. పొరబాటున రాత్రి వేళ బియ్యం అక్రమంగా ఎత్తుతున్నారన్న సమాచారాన్ని పౌరులు జిల్లా అధికారులకు ఇస్తే వారి నుంచి దిగువ స్ధాయికి వచ్చే ఆదేశాలను అనుసరించి ఆకస్మికంగా దాడులు చేయడానికన్నా దొంగలకే ముందుగా సమాచారాన్ని ఇవ్వడం. దొంగలను కాపాడడం వంటివి ఇక్కడ సర్వసాధారణమే. ఇలా జిల్లా వ్యాప్తంగా బియ్యం దొంగల కొమ్ము కాశారనే ఆరోపణలను కొందరు అధికారులు మూటగట్టుకున్నారు. కాకినాడ పోర్టుకు వేలాది టన్నుల బియ్యం తరలింది. ఇక్కడి నుంచి బియ్యం పాలిష్ పట్టి నెలనెలా వందలాది క్వింటాళ్ల బియ్యం తిరిగి మార్కెట్లోకి వచ్చింది. నెల నెలా మామూళ్లు.. ప్రజల సొమ్ముకు కాపలా ఉండాల్సిన అధికారులు, సిబ్బంది నెలనెలా ఇచ్చే మామూళ్లకు కక్కుర్తి పడుతున్నారు. ఆహార తనిఖీ అధికారులు నెలనెలా రూ.లక్షల్లో సంపాయిస్తున్నారు. లేదంటే వారు డీలర్లను కేసులు పెడతామని బెదిరించి దండిగా మామూళ్లు సంపాయించారు. జిల్లా అధికారులకు ఈ వ్యవహారాలు తెలిసినా వారు నియంత్రించే పరిస్థితి లేకుండా పోయింది. కిలోకి ఎంత లేదన్నా రూ.25 వరకు అక్రమంగా సంపాయిస్తున్నారు. డీలర్లను ఆకస్మికంగా తనిఖీలు చేయడం, వారిపై కేసులు పెడతామని బెదిరించడం వంటి చర్యలతో బెంబేలెత్తి నెల నెలా మామూళ్లు, నజనారాలను ఇస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జిల్లాకు సీఎం,మంత్రుల పర్యటనలు ఉంటే వారికి ప్రొటోకాల్ పేరుతో రూ.లక్షలు వసూలు చేస్తున్నారు. ఇవన్నీ డీలర్ల ముక్కు పిండి వసూలు చేస్తుండంతో ఇక వారు అక్రమాలకు తెరతీస్తున్నారు. బహిరంగంగానే ఈ వ్యవహారాన్ని నడిపిస్తున్నా ఎక్కడా నియంత్రణ ఉండడం లేదు. రూ. కోట్లలో సబ్సిడీ దుర్వినియోగం నెలనెలా రూ. కోట్ల కొద్ది సబ్సిడీ పక్కదారి పడుతోంది. ఇప్పటి వరకు రూ.2,596 కోట్ల సబ్సిడీని ప్రజలకు అందజేసినట్లుగా లెక్కలు ఉన్నాయి. వీటిలో ఎంతలేదన్నా రూ.వెయ్యి కోట్ల మేర అవినీతి జరిగి ఉంటుందన్న ఆరోపణలు ఉన్నాయి. ఇక చంద్రన్న కానుకల్లో 25 శాతం హీనపక్షం అవినీతి చోటు చేసుకున్నట్లుగా ఆరోపణలు ఉన్నాయి. ఒకటి రెండు సందర్భాల్లో సరుకులు బూజుపట్టి, బెల్లం దెబ్బతిని దిబ్బలో సరులను పారబోసిన పరిస్థితులు ప్రజలకే తారసపడ్డాయి. పౌరసరఫరాల్లో అవినీతి పాతుకు పోయిన నేపథ్యంలో ఈ వ్యవస్థను బాగు చేద్దామనుకున్న లక్ష్మీనరశింహం వంటి అధికారుల వల్ల కాలేదు. ఆయన శక్తి చాలలేదు. ఆయననే బియ్యం దొంగలు పక్కదారి పట్టించారని ఆ రంగంలోని వారే అంటున్నారు. పౌర సరఫరాల్లో నెలనెలా జరుగుతున్న అవినీతి వ్యవహారంపై సరైన విచారణలు లేవు. ఏదైనా విచారణకు అధికారులు ఆదేశిస్తే ఇక టీడీపీ నేతల నుంచి వారిపై వచ్చే ఒత్తిళ్లు అన్నీ ఇన్నీ కావు. దీంతో నిఘా వ్యవస్థ పక్కాగా ఉన్నా వారు నిద్ర నటించడం. వారు కూడా మామూళ్లకు అలవాటు పడే పరిస్థితికి వెళ్లారు. ఇతర శాఖల నుంచి అధికారులు, సిబ్బంది పౌరసరఫరాలకు వస్తున్నారంటే ఇక్కడ అవినీతి బహిరంగం కాబట్టే.. నాలుగు డబ్బులు సంపాయించుకోవచ్చన్న ఆశతో వస్తున్నారు. ఇక్కడ అవినీతిని నిరోధించడం వల్లకాదని అధికార వర్గంలోనే అభిప్రాయాలు నెలకొనడడం గమనార్హం. -
ఐరిస్‌తోనూ ‘రేషన్’
సాక్షి, సిటీబ్యూరో: ప్రజాపంపిణీ వ్యవస్థలో భాగంగా ప్రభుత్వ చౌకధరల దుకాణాల ద్వారా లబ్ధిదారులకు అందజేస్తున్న రేషన్ సరుకులను ఇక నుంచి బయోమెట్రిక్(వేలిముద్రలు)తో పాటు ఐరిస్(కళ్ల గుర్తింపు)తోనూ ఇవ్వనున్నారు. ఈ మేరకు పౌరసరఫరాల శాఖ కసరత్తు చేస్తోంది. తొలి విడతలో భాగంగా ఇప్పటికే పలు జిల్లాల్లో శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం గ్రేటర్ పరిధిలో ఈపోస్ (బయోమెట్రిక్) విధానం ద్వారా సరుకుల పంపిణీ కొనసాగుతోంది. అయితే ఈ విధానంలో కొంతమందికి సమస్యలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా వృద్ధులు, మహిళల వేలిముద్రలు చెరిగిపోవడంతో ఈపోస్ మెషిన్లు గుర్తించడం లేదు. దీంతో ప్రతినెల రేషన్ సరుకులు తీసుకునేందుకు లబ్ధిదారులకు తిప్పలు తప్పడం లేదు. తిరిగి వేలిముద్రలు సరిచేసుకునేందుకు ఆధార్ కేంద్రాలను ఆశ్రయించాల్సి వస్తోంది. అయినప్పటికీ గృహిణులు, ఇతరాత్ర పనులు చేసుకునేవారి వేలిముద్రలను ఈపోస్ గుర్తించడం సమస్యగా తయారైంది. దీనిపై పలు ఫిర్యాదులు రావడంతో లబ్ధిదారులు అసౌకర్యానికి గురికావద్దనే ఉద్దేశంతో వేలిముద్రలు సరిపోలని చోట ఆయా ప్రాంతాల్లోని పౌరసరఫరాల శాఖ ఇన్స్పెక్టర్లకు అథంటికేషన్ సౌకర్యం కల్పించారు. అయితే ఈ విధానం కొన్నిచోట్ల దుర్వినియోగమవుతున్న విషయం పౌరసరఫరాల అధికారుల పరిశీలనలో వెల్లడైంది. 11.09 లక్షల కుటుంబాలు.. గ్రేటర్ పరిధిలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లా అర్బన్ పరిధులు ఉన్నాయి. పౌరసరఫరాల శాఖకు మొత్తం 12 సర్కిళ్లకు గాను హైదరాబాద్ పరిధిలో 9 సర్కిల్స్, మేడ్చల్ జిల్లా అర్బన్ పరిధిలో 2, రంగారెడ్డి జిల్లా పరిధిలో ఒక సర్కిల్ ఉన్నాయి. మొత్తం మీద ఆహార భద్రత (రేషన్) కార్డు కలిగిన సుమారు 11.09 లక్షల కుటుంబాలు ఉండగా సుమారు 40లక్షల వరకు లబ్ధిదారులు ఉన్నారు. వీరిలో 12లక్షలకు పైగా వృద్ధులు, మహిళలు ఉన్నారు. ఇందులో 30శాతం వరకు లబ్ధిదారులకు బయోమెట్రిక్ సమస్య ఉంది. ఈ నేపథ్యంలో దీనికి పరిష్కారంగా పౌరసరఫరాల శాఖ ఐరిస్ విధానానికి శ్రీకారం చుడుతోంది. -
కొండను తవ్వి.. ఎలుకను పట్టి
ఉరవకొండ కేంద్రంగా బియ్యం అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. అధికార పార్టీ అండదండలతో నిరాటంకంగా సాగుతోంది. కళ్లముందే తరలిపోతున్నా అడ్డుకోవాల్సిన అధికారులు అధికార పార్టీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గి మిన్నకుండిపోతున్నారు. ఉరవకొండ: పేదలకందించే చౌక బియ్యం అక్రమ మార్గంలో కర్ణాటకకు తరలిపోతోంది. బియ్యం దందా భారీ స్థాయిలో జరుగుతుంటే విజిలెన్స్ అధికారులు తూతూమంత్రంగా 20 నుంచి 30 బస్తాలు పట్టుకుని మిన్నకుండిపోతున్నారు. ఉరవకొండకు చెందిన బియ్యం వ్యాపారులు తమ జోలికి రాకుండా ఏకంగా విజిలెన్స్ అధికారులకే మామూళ్లు ముట్టచెబుతున్నట్లు ఆరోపణలు విన్పిస్తున్నాయి. దీనికి తోడు నియోజకవర్గానికి చెందిన టీడీపీ నేత సూచించిన విధంగానే విజిలెన్స్ దాడుల సమాచారాన్ని అధికారులు ముందస్తుగా చేరవేస్తున్నారని తెలిసింది. అంతే నిమిషాల్లో వ్యాపారులు బియ్యం అక్రమ నిల్వలను మరోచోటుకు మార్చుకుంటున్నట్లు సమాచారం. బుధవారం విజిలెన్స్ అధికారులు మూడు చోట్ల రెండు బృందాలుగా దాడులు చేసినా 100 బస్తాలు మాత్రమే దొరికాయి. ముందస్తు సమాచారం ఉండటంతో వ్యాపారులు ముగ్గురూ 200 క్వింటాళ్ల బియ్యాన్ని మరో రహస్య ప్రదేశానికి తరలించినట్లు తెలిసింది. ఐదు బియ్యం అక్రమ నిల్వ కేంద్రాలు బియ్యం దందాను టీడీపీ నేత ఆదేశాలతో నియోజకవర్గానికి చెందిన ఇద్దరు వ్యక్తులు నిర్వహిస్తున్నారు. ఉరవకొండ పట్టణంలో గుంతకల్లు రోడ్డు వద్ద మల్లేశ్వర థియేటర్ వెనుక వైపు గోడౌన్, ఈశ్వరమ్మ ఆలయం వెనుక, చెంగల వీధిలో, బుసప్ప జిన్నా, కణేకల్లు క్రాస్ వద్ద గదుల్లో బియ్యాన్ని నిల్వచేసి రాత్రికి రాత్రే తరలిస్తున్నారు. రోజూ 200 క్వింటాళ్ల అక్రమ రవాణా ఉరవకొండ నుంచి రెండు లారీల లోడు బియ్యం కర్ణాటకకు తరలిస్తున్నారు. రోజుకు దాదాపు 200 క్వింటాళ్ల బియ్యాన్ని బళ్లారి, చెళ్లికెర మీదుగా చిక్బళ్లాపూర్కు తరలిస్తున్నారు. ఉరవకొండలో కిలో రూ.12 నుంచి రూ.13కు చౌక బియ్యాన్ని కొని కర్ణాటకలో రూ.20 నుంచి రూ.23 వరకు విక్రయిస్తున్నారు. ఉరవకొండలో బియ్యం అక్రమ దందా టీడీపీ నేత కనుసన్నల్లో కొనసాగుతుండటం వల్ల అధికారులు అడ్డుకోవడానికి సాహసం చేయడం లేదనేది బహిరంగ రహస్యం. విజిలెన్స్ అధికారుల దాడులు ఉరవకొండ: ఉరవకొండ పట్టణంలో బియ్యం అక్రమ నిల్వలపై విజిలెన్స్ అధికారులు బుధవారం దాడులు నిర్వహించారు. విజిలెన్స్ డీఎస్పీ మహబూబ్‌బాషా, సీఐలు రెడ్డప్ప, శ్రీనివాసరెడ్డి, విశ్వనాథ్‌చౌదరి, ఎస్ఐలు రామకృష్ణ, శంకర్, డీసీటీఓలు సుబ్బారెడ్డి, జిలాన్బాషాలు రెండు బృందాలుగా ఏర్పడి మూడు చోట్ల దాడులు చేపట్టారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో విజిలెన్స్ డీఎస్పీ మాట్లాడుతూ లత్తవరం రోడ్డులో 40 బస్తాలు, బుసప్ప జిన్నాలో ఒకచోట 33, మరోచోట 27 బస్తాల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. మొత్తం వంద బస్తాలను స్టాక్ పాయింట్‌కు తరలించినట్లు చెప్పారు. దీంతోపాటు దాడుల్లో పీడీఎస్ బియ్యం సరఫరా చేసే 56 సంచులు కూడా సీజ్ చేసినట్లు తెలిపారు. అక్రమంగా తరలిస్తే క్రిమినల్ కేసులు నమోదు ఉరవకొండ: ఉరవకొండ కేంద్రంగా బియ్యం అక్రమంగా తరలిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని విజిలెన్స్అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్పీ రామాంజినేయులు తెలిపారు. బుధవారం విజిలెన్స్ అధికారులు సీజ్ చేసిన బియ్యం అక్రమ నిల్వలను పరిశీలించేందుకు ఆయన ఉరవకొండకు వచ్చారు. ఈ సందర్భంగా విజిలెన్స్ ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ పేదల బియ్యాన్ని పక్కదారి పట్టించాలని చూసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఉరవకొండకు చెందిన రెవిన్యూ, పోలీసు శాఖ వారికి కూడా అక్రమ రవాణాపై గట్టి నిఘా ఉంచాలని సూచించినట్లు తెలిపారు. అక్రమంగా తరలించే వారు రెండుసార్లు పట్టుబడితే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ మహబూబ్‌బాషా, ఎస్ఐ, సీఐలు పాల్గొన్నారు. -
ఉచిత బియ్యంతో సోమరులవుతున్నారు!
చెన్నై: ధనిక, పేద తేడా లేకుండా అందరికీ ప్రభుత్వం రేషన్ బియ్యం ఇస్తుండటంతో ప్రజలు బద్దకస్తులుగా మారుతున్నారని మద్రాస్ హైకోర్టు వ్యాఖ్యానించింది. దారిద్య్రరేఖ దిగువన ఉన్న కుటుంబాలకే ఉచిత బియ్యం అందేలా నిబంధనలు సవరించాలని ప్రభుత్వానికి సూచించింది. ప్రజా పంపిణీ పథకం బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నాడంటూ పోలీసులు ఓ వ్యక్తిని గూండా చట్టం కింద నిర్బంధించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై శుక్రవారం కోర్టు విచారణ చేపట్టింది. ధనిక, పేద ఇలా అందరికీ ఉచిత బియ్యం ఇచ్చేందుకు రాష్ట్ర సర్కారు ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.2,110 కోట్లు ఖర్చుచేసింది. దీంతో ‘కనీస సౌకర్యాలు, బియ్యం, ఇతర నిత్యావసర సరుకులను నిరుపేదలకు అందివ్వడం ప్రభుత్వాల బాధ్యత. ప్రభుత్వాలు మాత్రం రాజకీయ లబ్ధి కోసం వీటిని అందరికీ ఇస్తున్నాయి. దీంతో ప్రజలు బద్దకస్తులుగా మారారు’ అని కోర్టు పేర్కొంది. -
రేషన్ బియ్యం పక్కదారి
సాక్షి, తిరుపతి: పేద, మధ్యతరగతి వారికి ఇస్తున్న రేషన్ బియ్యం మిల్లర్లకు భోజ్యం గా మారుతోంది. ఈ బియ్యాన్ని పక్కదారి పట్టిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ప్రజా పంపిణీ (పీడీఎఫ్) బియ్యంలో సుమారు 45 శాతం రీసైక్లింగ్ జరుగుతోంది. రేషన్ డీలర్ల నుంచి పెద్ద మొత్తంలో సేకరించి మిల్లుల్లో సన్నగా పట్టిస్తున్నారు. శివారు ప్రాంతాల్లో అనధికారికంగా గోదాములు ఏర్పాటు చేసుకుని రాత్రికి రాత్రే బ్రాండెడ్ సంచుల్లో నింపుతున్నారు. రిటైల్ మార్కెట్లలో విక్రయిస్తున్నారు. జిల్లాలో కార్డు దారుల కోసం ప్రతినెలా 18,708 టన్నుల బియ్యం దిగుమతి అవుతున్నాయి. ఇందులో 7.5 వేల టన్నులకుపైగా బియ్యం పక్కదారి పడుతున్నట్లు ఆరోపణలున్నాయి. జిల్లా సరిహద్దులో అటు తమిళనాడు... ఇటు కర్ణాటక రాష్ట్రాలు ఉండటంతో ఆ ప్రాంతంలో ఉన్న మిల్లర్లతో దళారులు ముందస్తు ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారని తెలుస్తోంది. 25 శాతం మంది బాగోలేవనే కారణంతో రేషన్ బియ్యం తీసుకోవడం లేదు. మరో ఏడుశాతం మంది రేషన్ తీసుకులేకపోతున్నారు. 5 శాతం రేషన్ కార్డులు కొందరు డీలర్ల వద్ద ఉన్నాయి. లబ్ధి్దదా రులు రాకపోయినా బియ్యం తీసుకున్నట్లు ఆన్లైన్లో నమోదవుతున్నాయి. అసలు లబ్ధిదారుడికి కార్డు ఉందనే విషయం తెలియని పరిస్థితి. లబ్ధిదారుల బియ్యం రేషన్ దుకాణదారుల వద్దే ఉండిపోతున్నాయి. మరికొందరు బియ్యం వచ్చిన సమయంలో బయోమెట్రిక్‌లో వేలిముద్ర వేసి వచ్చేస్తున్నారు. ఆ బియ్యాన్ని కొందరు డీలర్లు మిల్లర్లకు విక్రయిస్తున్నారు. మరికొందరు లబ్ధిదారులు తెలిసిన వారికి అదే ధరకు విక్రయిస్తున్నారు. మొత్తంగా 45శాతం బియ్యం మిల్లర్లకు చేరుతున్నాయని అంచనా. అధిక ధరలకు విక్రయం.. రెండు రూపాయల కిలో బియ్యాన్ని కొందరు డీలర్లు రూ.10 చొప్పున మిల్లర్లకు విక్రయిస్తున్నారు. ఆ బియ్యాన్ని శివారు ప్రాంతంలో అనధికారికంగా ఏర్పాటు చేసుకున్న గోదాముల్లో నిల్వ ఉంచుతున్నారు. తిరుపతి రైల్యే కాలనీ, ఆటోనగర్, అక్కారంపల్లి, పుత్తూరు, నగరి, కుప్పం, పలమనేరు, చిత్తూరు సమీపంలో అనధికారిక గోదా ములు ఉన్నట్లు సమాచారం. నిల్వచేసిన బియ్యాన్ని మిల్లుల్లో పాలిష్ పట్టి సన్నబియ్యంగా మార్చేస్తున్నారు. రాత్రికి రాత్రే బ్రాండెడ్ సంచుల్లో నింపి రిటైల్ మార్కెట్లకు తరలిస్తున్నారు. అక్కడ కిలో రూ.30, రూ.35 చొప్పున విక్రయించి సొమ్ముచేసుకుంటున్నారు. మరికొందరు తమిళనాడు, కర్ణాటకతో పాటు నెల్లూరుకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. తరలివెళ్తున్న బియ్యాన్ని అధికారులు దాడులు చేసి పట్టుకున్న ఘటనలూ ఉన్నాయి. తిరుపతిలో ఓ నివాసంలో నిల్వ ఉంచిన బియ్యాన్ని పట్టుకున్న సమయంలో రేషన్ బియ్యం బస్తాలు బయటపడినట్లు భోగట్టా. కొన్నిచోట్ల అధికారుల సహకారంతో రేషన్ బియ్యం పక్కదారి పడుతున్నట్లు తెలుస్తోంది. -
రేషన్ తీసుకోకున్నా కార్డు రద్దవదు: ఈటల
సాక్షి, హైదరాబాద్: రేషన్ బియ్యం తీసుకోకపోయినా రేషన్ కార్డు రద్దు కాదని మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. బయోమెట్రిక్ విధానం ద్వారా కార్డు ఉన్న ప్రతి పేదవానికి బియ్యం అందేలా చూస్తామని పేర్కొన్నారు. బుధవారం సచివాలయంలో మంత్రులు మహమూద్ అలీ, ఈటల రాజేందర్, నాయిని నర్సింహారెడ్డి రేషన్ డీలర్లకు చెక్కులు అందించారు. డీలర్లకు రావాల్సిన బకాయిలు అందజేయాలని ఆగస్టు 23న మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించిందని, కేజీకి 20 పైసల నుంచి 70 పైసలు కమీషన్ పెంచుతూ కేసీఆర్ అప్పుడే నిర్ణయం తీసుకున్నారన్నారు. ఈ మేరకు 2015 నుంచి ఉన్న రూ.132 కోట్ల బకాయిలను రేషన్ డీలర్లకు అందిస్తున్నామని పేర్కొన్నారు. హైదరాబాద్ జిల్లాలో 859 షాపుల డీలర్లకు రూ.9 కోట్ల 40 లక్షల బకాయిలు ఉండగా.. దీనిలో తొలి దఫాగా రూ.4.33 కోట్లు అందస్తున్నామన్నారు. మిగిలిన రూ.5.7 కోట్లు త్వరలో అందిస్తామన్నారు. ఈటల మాట్లాడుతూ కేసీఆర్‌కు మీ కష్టాల గురించి తెలిసే కమీషన్ పెంచారన్నారు. ఈ శాఖకు కమిషనర్లుగా పనిచేసిన అధికారుల కృషి వల్లే దేశంలో నంబర్ వన్ శాఖ గా నిలిచిందన్నారు. ఇందులో రేషన్ డీలర్ల భాగస్వామ్యం ఉందని అన్నారు. -
90 శాతం మందికే రూపాయి బియ్యం
శ్రీకాకుళం పాతబస్టాండ్ /గార : ప్రజా పంపిణీ వ్యవస్థను భ్రష్టుపట్టించేలా టీడీపీ ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ఇప్పటికే ఎనిమిది సరుకుల నుంచి రెండు సరుకులకు కుదించగా, తాజాగా శతశాతం రేషన్ పంపిణీ చేయాల్సి ఉండగా, 90 శాతమే డీడీలు కట్టాలని ఆదేశించింది. అంటే మిగిలిన 10 శాతం రేషన్ అందకుండా చేస్తుందన్నమాట. ఇలా మున్ముందు మొత్తం పేదలను ప్రజా పంపిణీ వ్యవస్థకు దూరం చేసేఎత్తుగడ చేస్తోంది. జిల్లాలో 8,27,468 రేషన్‌కార్డులు ఉన్నాయి. వీటిలో తెలుపురంగు 7,76,552, అంత్యోదయ 49,943, అన్నపూర్ణ కార్డులు 973 ఉన్నాయి. కార్డుదారుల్లో సంఖ్యను బట్టి ఒక్కొక్కరికి అయిదు కిలోల బియ్యాన్ని, కిలో బియ్యాన్ని అందిస్తున్నాయి. దీనికోసం కోట్లాది రూపాయల ప్రజాధనం కేటాయిస్తున్నారు. జిల్లా మొత్తంగా ఈ రేషన్ బియ్యాన్ని ప్రజలకు 98 శాతం మేర సక్రమంగా పంపిణీ అవుతుందని అధికారులు చెబుతున్నారు. దీనిపై ప్రజల్లో సంతృప్తి మాత్రం 75 శాతం మించడం లేదని సంబంధిత అధికారులపై, డిపో డీలర్లుపై ప్రభుత్వ వర్గాలు, సీఎం అసంతృప్తి వ్యక్తం చేయడం తెలిసిందే. 98 శాతం సక్రమంగా పంపిణీ అవుతున్నా ఎందుకు ప్రజలు అసంతృప్తిగా ఉన్నారో తెలుసుకునేందుకు ప్రభుత్వం విడ్డూరమైన నిర్ణయం తీసుకుంది. దీంతో ఈ నెల కేవలం 90 శాతం మేర డీడీలు కట్టాలని డీలర్లను ఆదేశించింది. ఈ లెక్కన జిల్లాలో 83,000 కార్డుదారులకు బియ్యం ఇవ్వబోమని చెప్పినట్టే. అయితే ఉండిపోయిన 10 శాతం మేర నిరుపేదలే కచ్చితంగా ఉంటారని అధికారులు అనధికారికంగానే చెబుతున్నారు. ఎందుకంటే ఇంతో అంతో ఉన్నవారే ప్రభుత్వ పథకాలకు ముందుంటారన్నది నానుడి. మిగిలిన 10 శాతం 1,200 మెట్రిక్ టన్నులు పేదలకు చేరడం లేదు. దీంతో పేద కార్డుదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ నిర్ణయం వెనక్కి తీసుకోకపోతే నిరుపేదలకు అన్యాయం చేసినట్టేనని, ప్రజాపంపిణీ వ్యవస్థ భ్రష్టుపట్టేలా టీడీపీ ప్రభుత్వం ఆలోచన చేస్తుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చివరకు బియ్యం, పంచదారే.. జిల్లాలోని ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా లక్షలాది మంది నిరుపేదలకు బియ్యం, పంచదార అందుతున్నాయి. గత ప్రభుత్వం ఎనిమిది సరుకులు సబ్సిడీల రూపంలో ధర తగ్గించి పేదలకు అందించేవి. దీని ద్వారా పేదలకు ఇంట్లోకి అవసరమైన ముఖ్య సరుకులు అందేవి. 2014లో టీడీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక ఒక్కో సరుకు తగ్గిస్తూ వచ్చింది. ఇందులో కేంద్రం కిరోసిన్ నిలిపేస్తే మిగిలిన సరుకులకు మాత్రం సీఎం చంద్రబాబు ప్రభుత్వం కత్తెర వేసింది. ఈ వ్యతిరేకతను తగ్గించేందుకు సంక్రాంతి, క్రిస్మస్, రంజాన్ పండగలకు మాత్రం చంద్రబాబు డిజిటల్ బొమ్మ, పసుపు రంగు సంచులు పెట్టి మరీ ఉచితంగా సరుకులు ఇవ్వడం అందరికీ తెలిసిందే. ఇలా ప్రజల్లో సంతృప్తి పెరిగితే చంద్రబాబుకు వచ్చే ఎన్నికల్లో బాగుంటందన్న సంగతి అధికారులకు తెలుసు. -
25కు 24 కిలోలే..!
భువనగిరి : జిల్లాలో బియ్యం కొనుగోలుదారుల నమ్మకాన్ని వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు. ఉండాల్సిన తూకం కంటే తక్కువ ఉన్న బియ్యం బస్తాలను విక్రయిస్తున్నారు. 25 కేజీల బియ్యం బ్యాగుల్లో అర కేజీ కొన్నిసార్లు 750 గ్రాముల వరకు తరుగుదల వస్తున్నాయి. ఈ లెక్కన వినియోగదారులు ప్రతి బ్యాగు మీద నెలకు రూ.18.40 పైసల చొప్పున నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. అధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తుండటంతో వివిధ బ్రాండ్ల పేర్లతోవ్యాపారులు తక్కువ తూకం ఉన్న బియ్యం బ్యాగులను మార్కెట్లోకి సరఫరా చేస్తున్నారు. బియ్యం తక్కువ ఉన్నప్పటికీ నిర్ణీత ధరకే విక్రయిస్తుడటంతో విక్రయదారులు లాభపడుతూ విని యోగదారులు నష్టపోతున్నారు. జిల్లా వ్యాప్తంగా 50నుంచి 60వరకు 25కేజీల బ్యాగులను విక్రయించే దుకాణాలు ఉన్నాయి.వీటిల్లో ప్రధానంగా భువనగిరి, చౌటుప్పల్, యాదగిరిగుట్ట, అలేరు, రామన్నపేట, మోత్కూర్, భూదాన్‌పోచంపల్లి, వలిగొండ ప్రాంతాల్లో వీటిని విక్రయిస్తున్నారు. జిల్లాలో బియ్యం అవసరాలు ఇలా.. జిల్లాలో 7,39,448 జనాభా ఉండగా మహిళలు 3,64,729, పురుషులు 3,74,719 ఉన్నారు. కుటుంబాలు 1,80,677 ఉన్నాయి. ప్రతి కుటుం బం సగటును ప్రతి నెలా 37కేజీల వరకు బియ్యం వినియోగిస్తున్నారు. ఈ ప్రకారంగా ప్రతి నెలా జిల్లాలో 66,750 క్వింటాళ్ల బియ్యాన్ని ఆహారంగా తీసుకుంటున్నారు. ఇందులో 45,169 కుటుం బాలు బియ్యాన్ని కొనుగోళ్లు చేస్తుండగా మిగతా వారు వ్యవసాయం ద్వారా వచ్చిన బియ్యాన్ని వినియోగిస్తున్నారు. కొనుగోలు చేసి ఆహారంగా తీసుకుంటున్న వారికి ప్రతి నెలా 16,712 క్వింటాళ్ల బియం అవసర పడుతుంది. ప్రతి నెలా రూ.23లక్షలు నష్టం సాధారణంగా మార్కెట్లో కొత్త బియ్యం 25 కిలోల బ్యాగుకు రూ.1,000కు, పాత వాటిని రూ.1,150కి అమ్ముతున్నారు. ఇందులో పాతవి కిలో రూ.46 వరకు, 100 గ్రాముల బియ్యానికి రూ.4.60 పైసలు ఉంటుంది. ప్రతి 25 కేజీల బ్యాగులో రూ.300 నుంచి రూ.500గ్రాముల వరకు బియ్యం తక్కువగా వస్తుండటం వల్ల ప్రతి నెలా ఒక్కో బ్యాగుపై రూ.18.40 వరకు వినియోగదారుడు నష్టపోతున్నాడు. కాగా బియ్యాన్ని కొ నుగోలు చేస్తున్న 45,169 కుటుంబాల్లో సుమారు 50శాతం అనగా వీరిలో 22,584 కుటుంబాలు తక్కువ బియ్యం వస్తున్న బ్యాగులను కొనుగోళ్లు చేస్తున్నారు. దీని ప్రకారం ఈ కుటుంబాలు ప్రతి నెలా రూ.4,15,554 నష్టపోతున్నారు. కొన్నిసార్లు కిలో వరకు తూకం తేడా ఉంటుంది. ఇలాంటి సమయంలో వినియోగదారులు ఎక్కువగా నష్టపోతున్నారు. లోకల్ బ్రాండ్లలో ఎక్కువగా.. సాధారణంగా జిల్లాలోని వ్యాపారులు బియ్యం బ్యాగులను హైదరాబాద్ నుంచి దిగుమతి చేసుకుంటారు. ఇందులో కొన్ని బ్యాగులు నాణ్యమైన బ్రాండ్ పేరుతో, మరికొన్ని లోకల్ బ్రాండ్ పేరుతో విక్రయిస్తున్నారు.ఎక్కువ శాతం లోకల్ బ్రాం డ్ పేరుతో వచ్చే 25 కేజీల బ్యాగుల్లో బియ్యం తక్కువగా వస్తున్నాయి. బ్యాగు పై 25 కేజీల బియ్యం ఉన్నట్లు ముద్ర ఉన్నప్పటికీ తూకం వేస్తే తక్కువగా ఉంటున్నాయి. జిల్లా జనాభా : 7,39,448 కుటుంబాల సంఖ్య : 1,80,677 ప్రతి నెలా ఒక్కో కుటుంబానికి అవసరంఅయ్యే బియ్యం : 37 కేజీల వరకు ప్రతి నెలా మొత్తం కుటుంబాలకు కావాల్సిన బియ్యం :66,850క్వింటాళ్లు మార్కెట్లో బియ్యం కొనుగోలు చేస్తున్న కుటుంబాలు : 45,169 వీరికి కావాల్సిన బియ్యం : 16,712 క్వింటాళ్లు బియ్యం తక్కువగా వస్తున్న బ్యాగులను కొనుగోలు చేస్తున్న కుటుంబాలు సగటున : 22,584 ప్రతి నెలా కుటుంబాలు నష్టపోతున్న ఆదాయం : రూ.23.22 లక్షలు 25 కిలోలు ఉండాల్సిందే.. నిబంధనల ప్రకారం 25 కేజీల బ్యాగులో 25 కిలోలు తప్పనిసరిగా ఉండాలి. తగ్గుదల ఉన్నట్లు మా దృష్టికి వస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. త్వరలోనే జిలా వ్యాప్తంగా బియ్యం విక్రయించే దుకాణాల్లో తనిఖీలు నిర్వహిస్తాం. తక్కువగా ఉన్నట్లు తేలినట్లయితే వెంటనే వారిపై కేసు నమోదు చేస్తాం. సరోజిని, తూనికల కొలతల శాఖ, జిల్లా అధికారి -
30 శాతం అనర్హులే!
సాక్షి, హైదరాబాద్: నగరంలో ఆహార భద్రత కార్డులు పక్కదారిపట్టాయి. దాదాపు 30 శాతం మంది అనర్హులకు ఈ కార్డులు అందాయి. వీరికి ప్రభుత్వం అందించే పీడీఎస్ బియ్యం అవసరం లేకున్నా కార్డులు తీసుకున్నారు. ఈ పాస్ విధానం అమలు కారణంగా అక్రమార్కుల చిట్టా బయటపడుతోంది. చాలా మందికి అవసరం లేకున్నా కేవలం కార్డు రద్దవుతుందనే భయంతో బలవంతంగా బియ్యం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. మరికొందరు బియ్యం కొనుగోలు చేసి షాపుల్లో, టిఫిన్ సెంటర్ల యజమానులకు అధిక ధరలకు విక్రయిస్తున్నారు. ఆహార భద్రత కార్డుదారుల్లో సగానికి పైగా మధ్యతరగతి కుటుంబాలున్నాయి. దీంతో రేషన్ బియ్యంపై ఆసక్తి తగ్గింది. ప్రస్తుతం కుటుంబంలోని సభ్యుడికి ఆరు కిలోల చొప్పున ఎంత మంది సభ్యులు ఉంటే అన్ని కిలోల బియ్యం పంపిణీ జరుగుతోంది. రేషన్ బియ్యం నాసిరకం, నాణ్యతా లోపం కారణంగా వాటిని వండుకొని తినేందుకు మధ్యతరగతి వారు పెద్దగా ఆసక్తి కనబర్చడం లేదు. రేషన్ షాపునకు వెళ్లి ప్రతి నెలా బియ్యం కోనుగోలు చేయకుంటే.. ఈ పాస్ పద్ధతి కారణంగా మూడు మాసాల తర్వాత కార్డు రద్దవుతుందనే నిబంధన ఉండేది. దీంతో చాలా మంది కార్డును రద్దు కాకుండా చూసుకునేందుకే బియ్యం తీసుకుంటున్నారు. ఇలాంటి వారి సంఖ్య 30 శాతం పైనే ఉందని తెలుస్తోంది. బహుళ ప్రయోజనకారి... తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం తెల్ల రేషన్‌కార్డులు రద్దు చేసి ఆహార భద్రత కార్డులు మంజూరు చేసింది. గతంలో తెల్లరేషన్ కార్డు బహుళ ప్రయోజన కారి కావడంతో నిరుపేదలతో పాటు మధ్య తరగతి, నాలుగ అంకెల జీతం కలిగిన ప్రయివేటు ఉద్యోగులు సైతం దరఖాస్తు చేసుకొని ఆహార భద్రత కార్డులు పొందారు. ప్రభుత్వం కార్డు దారుడి కుటుంబంలో సభ్యుడు (యూనిట్)కు ఆరు కిలోల చొప్పున బియ్యం కోటా కేటాయిస్తోంది. గత రెండేళ్ల క్రితం వరకు మ్యానువల్ పద్ధతిలో బియ్యం పంపిణీ కొనసాగేది. గత రెండేళ్ల క్రితం ఈ–పాస్ ద్వారా సరుకులు పంపిణీ ప్రారంభం కావడంతో డీలర్ల చేతివాటానికి అడ్డుకట్ట పడింది. దీంతో రేషన్ బియ్యం అత్యవసరం లేనివారు రెండు మూడు నెలల ఒకసారి బియ్యం కొనుగోలు చేసి కార్డు రద్దు కాకుండా కాపాడుకుంటూ వచ్చారు. తాజాగా బియ్యం తీసుకోకున్నా కార్డులు రద్దు కావని అధికారులు ప్రకటించడంతో వీరంతా ఉపశమనం పొందారు. ఇదీ పరిస్థితి గ్రేటర్ హైదరాబాద్‌లో పౌరసరఫరాల శాఖకు సంబంధించిన సర్కిల్స్ 12 ఉన్నాయి. మొత్తం 1545 ప్రభుత్వ చౌకధరల దుకాణాలు ఉండగా, వాటి పరిధిలో కార్డుల సంఖ్య 10.94 లక్షలపైనే. అందులో 41.42 లక్షల లబ్ధిదారులు (యూనిట్లు) ఉన్నారు. ఇందుకు గాను నెలసరి బియ్యం కేటాయింపులు 26 వేల మెట్రిక్ టన్నులు పైనే ఉంటాయి. ప్రతినెల ఈ పాస్ అమలుతో సగటున 30 నుంచి 40 శాతం సరుకులు డ్రా కావడం లేదు. తాజాగా సరుకులు తీసుకోకున్నా కార్డు రద్దు కాదన్న అధికారుల ప్రకటనతో సరుకులు డ్రా చేయని కార్డుదారుల సంఖ్య మరింత పెరుగనుంది. -
బియ్యం తీసుకోకుంటే రేషన్ కార్డు రద్దు..
ఆదిలాబాద్‌అర్బన్ : చౌకధరల దుకాణాల ద్వారా పంపిణీ చేస్తున్న రేషన్ బియ్యాన్ని క్రమం తప్పకుండా మూడు నెలల పాటు తీసుకోకుంటే అట్టి రేషన్ కార్డులను రద్దు చేయడం జరుగుతుందని జిల్లా సంయుక్త కలెక్టర్ సంధ్యారాణి, డీసీఎస్వో శ్రీకాంత్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. రేషన్ కార్డుపై వచ్చే బియ్యాన్ని కార్డుదారులు వాడుకోకుండా ఇతరులకు ఇచ్చినా, అమ్మినా, కొనుగోలు చేసిన ప్రజాపంపిణీ వ్యవస్థ ఉత్తర్వుల ప్రకారం నేరంగా పరిగణించనున్నట్లు పేర్కొన్నారు. -
పేదల బియ్యం.. పెద్దల భోజ్యం
అధికార పార్టీ నేతలు పేదలకు అందాల్సిన బియ్యంపై రాబందుల్లా వాలుతున్నారు. నాలుగేళ్లుగా రేషన్ బియ్యాన్ని అడ్డగోలుగా బొక్కేసి.. అభాగ్యుల ఎండిన డొక్కలపై పస్తుల రాత రాస్తున్నారు. పెద్దోళ్ల అండతో పేదోళ్ల నోటికాడ ముద్దను లాగేసుకుంటున్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని హద్దూఅదుపూ లేకుండా అక్రమాలకు తెగబడుతున్నారు. అధికారంలో ఉండి సంక్షేమాన్ని అందించాల్సిందిపోయి..అడ్డగోలు దోపిడీతో ప్రజలను నిత్యం క్షోభ పెడుతున్నారు. తాజాగా రేషన్ బియ్యం అక్రమ రవాణా కేసులో నరసరావుపేట టీడీపీ కౌన్సిలర్ బాబూరావును పోలీసులు అరెస్టు చేసి కోర్టుకీడ్చారు. నిందితుడ్ని భుజానికెత్తుకున్న టీడీపీ యువనేత.. ఆయనను వదిలేయాలంటూ ఒత్తిళ్లకు దిగారు. సాక్షి, గుంటూరు: రేషన్ బియ్యాన్ని అధికార పార్టీ నేతలు పందికొక్కుల్లా బొక్కేస్తున్నారు. నరసరావుపేటలో రేషన్ మాఫియా నడుపుతున్న టీడీపీ కౌన్సిలర్‌ను గురువారం పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడ్ని వదిలేయాలంటూ అధికార పార్టీ ముఖ్య నేతలు పోలీసులపై ఒత్తిడి పెంచారు. అందుకు పోలీసు ఉన్నతాధికారులు అంగీకరించకపోవడంతో అధికార పార్టీకి చెందిన రేషన్ డీలర్లు పోలీసుస్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. పోలీసులకు పట్టుబడ్డ టీడీపీ కౌన్సిలర్‌పై గతంలోనూ పలు కేసులు నమోదయ్యాయి. అయితే అప్పట్లో పోలీసు అధికారులు తూతూమంత్రంగా కేసులు కట్టి వదిలేశారు. అన్నింటా వాళ్లే.. టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రేషన్ బియ్యం నుంచి ఇసుక, మైనింగ్, చివరికి మట్టితో సహా అధికార పార్టీ ముఖ్యనేతలే అక్రమ రవాణాకు పాల్పడుతున్న వైనం అందరికి తెలిసిందే. నరసరావుపేట శివారు ప్రాంతంలో రేషన్ అక్రమ రవాణా చేస్తున్న కొందరిని అరెస్టు చేసిన పోలీసులు వారిని విచారించగా.. దీనికి ప్రధాన సూత్రధారి నరసరావుపేట మున్సిపల్ కౌన్సిలర్ శీలు బాబూరావు అని తేలింది. ఆయను అదుపులోకి తీసుకోవడంతో రంగంలోకి దిగిన అధికార పార్టీ ముఖ్య నేత తనయుడు పోలీసు అధికారులపై ఒత్తిడి తెచ్చారు. ఎస్పీ ఆదేశాల మేరకు అరెస్టు చేశామని, ఇందులో తామేమీ చేయలేమని స్థానిక పోలీసులు చేతులెత్తేశారు. విచారణలో వాస్తవాలు కక్కుతాడని.. బాబూరావును విచారిస్తే ఏ రేషన్ దుకాణాల నుంచి సరుకు వెళ్లిందో తేలుతుందనే భయంతో టీడీపీకి చెందిన కొందరు డీలర్లు నేరుగా పోలీసు స్టేషన్ వద్దకు వచ్చి ఆందోళన చేశారు. ఈ వ్యవహారంపై పోలీసు ఉన్నతాధికారులు సీరియస్‌గా ఉండటంతో బాబూరావుతో సహా నిందితులను కోర్టులో హాజరపరిచి రిమాండ్‌కు తరలించారు. బాబూరావు నరసరావుపేట, సత్తెనపల్లి నియోజకవర్గాల్లో రేషన్ మాఫియా నడుపుతున్నారనే విషయం పోలీసులకు పట్టుబడ్డ నిందితులు చెప్పినట్లు సమాచారం. ఈ రెండు నియోజకవర్గాల్లో అధికార పార్టీ ముఖ్య నేత తనయునితోపాటు కొందరు పోలీసు అధికారులకు సైతం భారీ మొత్తంలో మామూళ్లు అందుతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ కారణంగానే బాబూరావుపై గతంలో రేషన్ అక్రమ రవాణా కేసు నమోదయినప్పటికీ అరెస్టు చేయకుండా స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపినట్లు తెలిసింది. గతంలోనూ బాబూరావుపై కేసులు నరసరావుపేటలో కేబుల్ వైర్లు కట్ చేసి దొంగిలించిన కేసులో బాబూరావు ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. అప్పట్లో ఆయనపై కేసు నమోదు చేయకుండా పోలీసులు తాత్సారం చేయడంతో 2016లో నల్లపాటి రాము అనే వ్యక్తి హైకోర్టును ఆశ్రయించారు. వెంటనే బాబూరావు, శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాద్ కొడుకు శివరామ్‌పై కేసు నమోదు చేయాలని హైకోర్టు అదేశించింది. అయితే కేసు నమోదు చేసిన పోలీసులు రెండేళ్లు కావస్తున్నా విచారణ పేరుతో తాత్సారం చేస్తున్నారు. నరసరావుపేట నియోజకవర్గం రొంపిచర్లలో రేషన్ అక్రమాలు జరుగుతున్నాయంటూ పౌర సరఫరాల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాజశేఖర్ అధికారిక సమావేశంలోనే రెవెన్యూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం అందరికి తెలిసిందే. ఇంత జరిగినా నరసరావుపేట నియోజకవర్గంలో రేషన్ అక్రమ రవాణా ఆగడం లేదంటే అధికార పార్టీ ముఖ్యనేతల అండదండలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థః చేసుకోవచ్చు. రెండు, మూడు సార్లు రేషన్ అక్రమ రవాణా కేసుల్లో అరెస్టయిన టీడీపీ కౌన్సిలర్ శీలు బాబూరావుపై కఠిన చట్టాలు ప్రయోగించాలని పేదలు కోరుతున్నారు. -
టీడీపీ నేత అవినీతి గుట్టురట్టు
వినుకొండ టౌన్ / రూరల్ : అధికార పార్టీ నాయకుని రైస్ మిల్లులో రేషన్ బియ్యం రిసైక్లింగ్ జరుగుతుండగా కార్మికుడు మృతి చెందడంతో అవినీతి వెలుగులోకి వచ్చింది. తెలుగుదేశం పార్టీకి చెందిన మార్కెట్ యార్డు వైస్ చైర్మన్ సనిశెట్టి లక్మీనారాయణ మండలంలోని తిమ్మాయిపాలెం దళితవాడలో కొంత కాలంగా సాయి శరణ్య రైస్‌మిల్లు నడుపుతున్నాడు. ధాన్యం కొనుగోలు చేసి వాటిన రైస్‌గా తయారు చేసి విక్రయించాల్సిన ఆయన అక్రమాలకు పాల్పడ్డాడు. రేషన్ బియ్యాన్ని డీలర్ల నుంచి సేకరించి మిల్లులో పాలిష్ చేసి ఇతర ప్రదేశాలకు రవాణా చేస్తున్నాడు. బియ్యాన్ని రిసైక్లింగ్ చేస్తుండగా బడ్డీ ఒక్కసారిగా కూలిపోయి మిల్లు డ్రైవర్ షేక్‌హుస్సేన్(35) ప్రమాదవశాత్తు మృతి చెందడంతో రీసైక్లింగ్ వ్యవహారం బయటపడింది. అధికారుల కనుసన్నల్లో రేషన్ బియ్యం రవాణ అధికారుల కనుసన్నల్లో పేదల బియ్యం నల్లబజారుకు తరలుతున్నట్లు తెలుస్తోంది. ప్రమాదం ఉదయం 8 నుంచి 9గంటల మధ్య జరిగితే సాయంత్ర 4గంటల వరకు ఏఒక్క అధికారి కూడా సంఘటన స్థలాన్ని సందర్శించకపోవడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. వీఆర్వో సునీతకు ఉదయం 10గంటల సమయంలో వీఏవో కోటయ్య సమాచారం అందిచాడని చెబుతున్నారు. సమాచారాన్ని ఆమె తహసీల్దారు గౌస్బుడేసాహెబ్కు 12గంటల ప్రాంతలో చెప్పినట్లు విలేకర్లతో చెప్పారు. రైస్ మిల్లు డ్రైవర్ బడ్డి కింద ఇరుక్కు పోయి ఉంటే హుటాహుటిన అధికారులు వెళ్లకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. నేతల బెదిరిపులకు తలొగ్గిన అధికారులు వీఆర్వో సునీత మిల్లును సందర్శించి అక్కడకు అధికారులను రప్పించాల్సి ఉండగా, అక్కడ ఎందుకులేరన్న వాదనలు విన్పిస్తున్నాయి. కొందరు టీడీపీ నేతలు అధికారులకు ఫోన్లు చేసి బెదిరించినట్లు తెలుస్తోంది. దీనివల్ల మిల్లును ఏ అధికారి కూడా వెంటనే సందర్శించే ప్రయత్నం చేయలేదని ఆరోపణలు వస్తున్నాయి. దీంతో పాటు సంఘటన జరిగిన సమయంలో లారీలకు బియ్యం లోడుచేస్తున్నారన్న వాదనలు ఉన్నాయి. మిల్లులో దాదాపు 350 క్వింటాళ్ల బియ్యం ఉన్నాయని చెబుతున్నారు. ప్రతి నెలా గ్రామాల్లో బియ్యాని కొనుగోలు చేసి రీసైక్లింగ్ చేసి రవాణా చేయడం పరిపాటిగా మారింది. గత ఏడాది నెల్లూరు జిల్లా కృష్ణపట్నం పోర్టు రోడ్డులో అధికారుల పట్టుకున్న రేషన్ బియ్యం ఇక్కడ నుంచే రవాణా అవుతున్నట్లు తెలుస్తోంది. యాజమానికి కొమ్ముకాస్తున్న అధికారులు మిల్లు డ్రైవరు మృతిచెందిన విషయాన్ని యాజమాన్యం మధ్యాహ్నం వరకు గోప్యంగా ఉంచింది. మృతదేహన్ని వినుకొండకు తరలించిన తర్వాత మిల్లులో ఉన్న సుమారు మూడు లారీల బియ్యాన్ని మార్కెటు యార్డులోని కూలీలతో బయటకు తరలించినట్లు స్థానికులు చెబుతున్నారు. అక్రమ రేషన్ బియ్యానికి కాపలా కాచిన సీఎస్‌డీటీ మృతి చెందిన హుస్సేన్‌ను వినుకొండ ప్రభుత్వవైద్యశాలకు తరలించిన అనంతరం సీఎస్‌డీటీ జాన్‌సైదులు మిల్లు వద్దకు వచ్చారు. అదే సమయంలో కూలీలు బియ్యాన్ని సంచులకు ఎత్తుతున్నా అడ్డుకున్న దాఖలాలు లేవు. మిల్లు వద్ద ఆయనే నిలబడి బియ్యాన్ని బయటకు తరలించినట్లు స్థానికులు చెబుతున్నారు. కొంతసేపటికి వినుకొండ తహసీల్దార్ గౌస్ బుడేసాహెబ్, ఆర్ఐ మురళీ, వీఆర్వో సునీత మిల్లులో నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని చూసి అవాక్కయ్యారు. మిల్లును పరిశీలించిన పోలీసులు ప్రమాదం జరిగిన వైనాన్ని తెలుసుకొనేందుకు వినుకొండ టౌన్, రూరల్ సీఐలు టి.వి. శ్రీనివాసరావు, బి. కోటేశ్వరరావు మిల్లును పరిశీలించారు. కొంతకాలంగా రేషన్‌బియ్యం అక్రమ వ్యాపారం కొనసాగుతున్నట్లు స్థానికులు పోలీసుల దృష్టికి తెచ్చారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పేదలకు కడుపు నిండా అన్నం
సాక్షి, సిద్దిపేట: పేదలకు కడుపు నిండా అన్నం పెట్టి దళారీ వ్యవస్థకు అడ్డుకట్ట వేయడమే ప్రభుత్వ లక్ష్యమని భారీ నీటిపారుదల, మార్కెటింగ్‌శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. బుధవారం సిద్దిపేట జిల్లాలో పాస్‌పోర్టు సెం టర్ను ఆయన ప్రారంభించారు. అనంతరం పౌర సరఫరాల కమిషనర్ సీవీ ఆనంద్‌తో కలిసి సివిల్ సప్లై కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడారు. గతంలో పౌర సరఫరాల శాఖ నుంచి రైళ్లల్లో, ట్రక్కుల్లో బియ్యం అక్రమంగా తరలివెళ్లేవని, దీనిని అరికట్టేందుకు పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటెల రాజేందర్, కమిషనర్ సీవీ ఆనంద్ విప్లవాత్మక మార్పులు తెచ్చారని అభినందించారు. ఈ–పాస్ విధానం ద్వారా బినామీలు రేషన్ పొందకుండా చెక్ పెట్టామన్నారు. దీంతో ఏటా రూ.500 కోట్ల మేర ప్రభుత్వానికి ఆదా అవుతోందని చెప్పారు. ఈ నిధులు పేద విద్యార్థులకు మధ్యాహ్న భోజనం, సంక్షేమ హాస్టల్స్‌కు సన్న బియ్యం సరఫరాకు ఉపయోగపడుతున్నాయన్నారు. బియ్యం అక్రమ రవాణా అరికట్టడం కోసం కమాండ్ అండ్ కంట్రోల్ రూం ప్రారంభించామని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో ఈ విధానం మంచి ఫలితాలను ఇచ్చిందని, ఇప్పుడు సిద్దిపేటలో ప్రారంభించామని, తర్వాత రాష్ట్రవ్యాప్తంగా విస్తృతం చేస్తామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 171 ఎంఎల్ఎస్ పాయింట్ల వద్ద 17 వేల సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం, వాహనాలకు జీపీఎస్ అమర్చడంతో అక్రమాలను అడ్డుకట్ట వేస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు. డీలర్ల సమస్య సీఎం దృష్టికి.. రాష్ట్రంలో రేషన్ డీలర్లు ఎదుర్కొంటున్న సమస్యలు డీలర్ల సంఘం నాయకులు దృష్టికి తెచ్చారని, ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తామని మంత్రి హామీ ఇచ్చారు. డీలర్ల సమస్యను పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్, సీఎం సమక్షంలో చర్చించి పరిష్కరిస్తామన్నారు. అక్రమ రవాణాకు చెక్: ఆనంద్ రాష్ట్రం నుంచి రేషన్ బియ్యం కాకినాడ మీదుగా ఇతర దేశాలకు అక్రమ రవాణా అవుతోందంటూ వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో బియ్యం పక్కదారి పట్టకుండా కమాండ్ అండ్ కంట్రోల్ విధానం ప్రారంభించామని రాష్ట్ర సివిల్ సప్లయ్ కమిషనర్ సీవీ ఆనంద్ అన్నారు. జిల్లాలోని అన్ని మెయిన్ గోదాంలు, ఎంఎల్ఎస్ పాయింట్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. నిజమైన లబ్ధిదారులకే బియ్యం సరఫరా చేయాలనే ఆలోచనతో రాష్ట్రవ్యాప్తంగా 17 వేల రేషన్ షాపుల్లో ఈ పాస్ విధానం అమలు చేస్తున్నామన్నారు. వేలిముద్రలు పడనివారి కోసం త్వరలో ఐరిస్ విధానం తీసుకొస్తామన్నారు. -
రేషన్ బియ్యం అక్రమాలకు అడ్డుకట్ట
సాక్షి, హైదరాబాద్: నిత్యావసర సరుకులు ముఖ్యంగా రేషన్ బియ్యంలో అక్రమాలను అడ్డుకునేందుకు పౌరసరఫరాలశాఖ చేసిన ప్రయోగం విజయవంతమైందని పౌరసరఫరాలశాఖ కమిషనర్ సీవీ ఆనంద్ తెలి పారు. ఏడాది క్రితం ఎస్పీ ర్యాంకు రిటైర్డ్ పోలీసుల నేతృత్వంలో ఏర్పాటు చేసిన నిఘా వ్యవస్థతో పౌరసరఫరాల శాఖలో అక్రమాలకు, ముఖ్యంగా రేషన్ బియ్యం పక్కదారి పట్టకుండా అడ్డుకట్ట పడిందన్నారు. నిత్యావసర సరుకుల ప్రజాపంపిణీ వ్యవస్థలో అవినీతిని నిరోధించడానికి, అక్రమ కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయడానికి రిటైర్డ్ పోలీసుల అధికారులతో పాటు రెవెన్యూ, కమర్షియల్ ట్యాక్స్ తదితర విభాగాలకు సంబంధించిన 20 మందితో 5 బృందాలను ఏర్పాటు చేశామన్నా రు. ఈ బృందాలు రాష్ట్ర వ్యాప్తంగా 843 ప్రాంతా ల్లో ఆకస్మిక దాడులు, తనిఖీలు నిర్వహించి, రూ.3.60 కోట్ల విలువ చేసే 12,915 క్వింటాళ్ల రేషన్ బియ్యం, 2,619 క్వింటాళ్ల సీఎంఆర్ ధాన్యాన్ని, అక్రమంగా నిల్వ ఉంచిన రూ. 3.90 లక్షల చక్కెర, ఎల్పీజీ సిలిండర్లు, కిరోసిన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన చెప్పారు. 165 మందిపై 6ఏ కేసులు, 71 మందిపై క్రిమినల్ కేసులను నమోదు చేశామన్నారు. -
‘బియ్యం’ అక్రమ రవాణాకు చెక్
సాక్షి, హైదరాబాద్: రేషన్ బియ్యం అక్రమార్కులపై పౌరసరఫరాల శాఖ ఉక్కుపాదం మోపుతోంది. ఆ శాఖకు సంబంధించిన ఎన్ఫోర్స్మెంట్, టాస్క్‌ఫోర్స్ బృందాలు రేషన్ బియ్యం అక్రమ రవాణాపై నిఘా పెంచాయి. దీంతో వ్యాపారుల అక్రమ కార్యకలాపాలు వెలుగులోకి వచ్చాయి. ఇప్పటికే ఈ బృందాల దాడులతో ముగ్గురిపై పీడీ కేసులు నమోదు కాగా, పలువురు వ్యాపారులపై 6ఏ, క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. రేషన్ బియ్యాన్ని పక్కదారి పట్టించిన నల్లగొండ జిల్లా మిర్యాలగూడ శాంతినగర్‌కు చెందిన రావిరాల రామలింగంపై ఆదివారం ఆ జిల్లా కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ పీడీ కేసు నమోదు చేశారు. మిర్యాలగూడ కేంద్రంగా కొన్నేళ్లుగా పీడీఎస్ బియ్యాన్ని సేకరించి రామలింగం అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు. దీంతో ఆయనపై 2016, ఫిబ్రవరి 10న మొదటిసారి కేసు నమోదైంది. అప్పటి నుండి ఇప్పటి వరకు బియ్యం అక్రమ రవాణాకు సంబంధించి తొమ్మిది 6ఏ కేసులు ఆరు క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. అయినా రామలింగం రేషన్ బియ్యం అక్రమ రవాణాను కొనసాగిస్తూనే ఉన్నాడు. దీంతో పౌరసరఫరాల శాఖ కమిషనర్ సీవీ ఆనంద్ ఆదేశాల మేరకు ఎన్ఫోర్స్మెంట్, టాస్క్‌ఫోర్స్ బృందాలు రామలింగం కదలికలపై నిఘా పెట్టాయి. మరికొందరిపై పీడీ కేసులు: సీవీ ఆనంద్ రేషన్ కార్డుదారులు, డీలర్లు, ఇతర వ్యాపారస్తుల నుంచి కొందరు రేషన్ బియ్యాన్ని సేకరించి ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారు. దీనిపై సమాచారం అందడంతో పౌరసరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్, టాస్క్‌ఫోర్స్ బృందాలను అప్రమత్తం చేశాం. గత ఏడాదిలో ముగ్గురిపై పీడీ కేసులు నమోదు చేసి జైలుకు తరలించాం. తాజాగా ఆదివారం మిర్యాలగూడకు చెందిన రామలింగంపై ఆ జిల్లా కలెక్టర్ పీడీ కేసు నమోదు చేశారు. ముఖ్యంగా హైదరాబాద్, నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లో జరుగుతున్న రేషన్ బియ్యం అక్రమ వ్యాపారంపై నిఘా పెట్టాం. మరికొంత మందిపై పీడీ కేసులు నమోదు చేస్తాం. సూత్రధారులను త్వరలోనే అరెస్టు చేస్తాం. -
ఆధార్ సాక్షిగా మరో ఆకలి చావు
సాక్షి, న్యూఢిల్లీ : రేషన్ బియ్యానికి ఆధార్ కార్డు ముడిపెట్టడంతో జార్ఖండ్‌లో మరొకరు ఆకలి చావుకు గురయ్యారు. పకూర్ జిల్లా, ధావడంగల్ గ్రామంలో లుఖీ ముర్ము అనే 30 ఏళ్ల యువతికి ఆధార్ కార్డుతో అనుసంధానం చేయక పోవడం వల్ల రేషన్ కార్డుపై గత అక్టోబర్ నెల నుంచి బియ్యం, ఇతర సరకులు ఇవ్వడంలేదు. దాంతో పస్తులతో కాలం గడిపి ఆకలితో జనవరి 27వ తేదీన మరణించారు. ఈ విషయంపై దర్యాప్తు జరిపిన 'రైట్ టు ఫుడ్' సంస్థ కార్యకర్తలు శుక్రవారం సాయంత్రం తమ నివేదికను విడుదల చేశారు. లుఖీ ముర్ముకు తెలియకుండానే ఆమె రేషన్ కార్డును అంత్యోదయ క్యాటగిరీ నుంచి ప్రాధాన్యత క్యాటగిరీకి గత జూన్ నెలలో మార్చేశారు. దాంతో నెలకు 35 కిలోల బియ్యం వచ్చేది 20 కిలోలకు తగ్గిపోయింది. అక్టోబర్ నెల నుంచి ఆ బియ్యం ఇవ్వడానికి కూడా డీలర్ నిరాకరించడంతో దుర్భర దారిద్య్ర పరిస్థితుల్లో కడుపునింపుకోవడం కష్టమై ముర్ము కన్నుమూసింది. ఇదే జార్ఖండ్‌లో గత సెప్టెంబర్ నెలలో 11 ఏళ్ల సంతోషి కుమారి మరణించగా, ఇప్పటి వరకు ఏడుగురు మరణించారని 'రైట్ టు ఫుడ్' కార్యకర్తల నివేదిక వెల్లడిస్తోంది. గార్వా జిల్లాలో జనవరి రెండవ తేదీన ఎట్వారియా దేవీ అనే 67 ఏళ్ల వద్దురాలు కూడా ఆకలితోనే మరణించారు. అయితే లుఖీ ముర్ము ఆకలితో చావలేదని, అంతుచిక్కని వ్యాధితో బాధ పడుతూ చనిపోయిందని జిల్లా పౌర సరఫరాల అధికారి దిలీప్ కుమార్ తెలియజేస్తున్నారు. ఆమెకు రేషన్ బియ్యాన్ని నిరాకరించలేదని, అనారోగ్యం కారణంగానే ఆమె అక్టోబర్ నెల నుంచి రేషన్ బియ్యాన్ని తెచ్చుకోలేక పోయిందని ఆయన వివరణ ఇచ్చారు. ఆమె అనారోగ్యంతో మరణించిందని తనకు తెలుసునని, అయితే ఏ జబ్బుతో అనారోగ్యం పాలైందని తెలియదని తెలిపారు. లుఖీ ముర్ము తల్లిదండ్రులు పదేళ్ల క్రితమే చనిపోగా తన నలుగురు చెల్లెళ్లతో కలిసి ఉంటూ కూలినాలి చేస్తూ వారిని పోషిస్తూ వచ్చింది. వారిలో ముగ్గురు చెల్లెళ్లు పెళ్లిచేసుకొని అత్తారింటికి వెళ్లిపోగా 14 ఏళ్ల ఆఖరి చెల్లెలు ఫూలిని ముర్ముతో ముర్ము జీవిస్తూ వచ్చింది. ముర్ము కుటుంబంలో ఐదుగురు సభ్యులకుగాను రేషన్ కార్డులో నలుగురు చెల్లెళ్ల పేర్లు నమోదై ఉన్నాయి. ఆధార్ కార్డులో మాత్రం లుఖీ ముర్ము, ఫూలిని ముర్మ ఇద్దరి పేర్లు మాత్రమే ఉన్నాయి. ఆధార్ కార్డుతోని అనుసంధానించని రేషన్ కార్డులు ఏప్రిల్ 1వ తేదీ నుంచి చెల్లవంటూ జార్ఖండ్ ప్రధాన కార్యదర్శి రాజ్ బాల వర్మ మార్చి నెలలో ఆదేశాలు జారి చేశారు. ఆయన ఉత్తర్వుల కారణంగా ఆ తర్వాత రాష్ట్రంలో 11 లక్షల రేషన్ కార్డులు రద్దయ్యాయి. పర్యవసానంగా రేషన్ బియ్యం అందక 11 ఏళ్ల సంతోషి కుమారి ఆకలితో చనిపోవడం, ఆ వార్త దేశమంతా సంచలనం సష్టించడంతో ఆధార్ అనుసంధానం పేరిట రేషన్‌ను తిరస్కరించ వద్దంటూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దాంతో జార్ఖండ్ పౌర సరఫరాల మంత్రి అంతకుముందు ప్రధాన కార్యదర్శి జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేశారు. అయినప్పటికీ రద్దయిన రేషన్ కార్డులను పునరుద్ధరించ లేకపోవడం వల్ల ఆకలి మరణాలు ఆగడం లేదు. -
రేషన్ బియ్యం అక్రమ రవాణాపై క్రిమినల్ కేసులు
రావులపాలెం(కొత్తపేట): రేషన్ బియ్యాన్ని పక్కదారి పట్టించి రవాణా చేస్తున్న వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసినట్టు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ సీఐ టి.రామ్మోహనరెడ్డి తెలిపారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేట నుంచి కాకినాడ పోర్టుకు తరలిస్తున్న రేషన్ బియ్యం లారీని ఆదివారం రాత్రి రావులపాలెం మండలం రావులపాడు వద్ద విజిలెన్స్ అధికారులు పట్టుకున్న విషయం తెలిసిందే. సోమవారం తెల్లవారు జామున 3.30 గంటల వరకు దీనిపై అధికారులు విచారణ నిర్వహించారు. ఈ లారీలో మొక్కజొన్న తరలిస్తున్నట్టు బిల్లులు పెట్టుకుని రేషన్ బియ్యాన్ని తరలిస్తున్నట్టు నిర్ధారణ అయ్యింది. దీంతో డ్రైవర్ రమావత్తు శివనాయక్‌ను అరెస్టు చేసి లారీని సీజ్ చేశారు. ఎంఎస్ఓ టి.సుభాష్, వీఆర్వో రవిశంకర్ సమక్షంలో విచారణ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ రామ్మోహనరెడ్డి మాట్లాడుతూ సీజ్ చేసిన 17 టన్నుల బియ్యం విలువ రూ.12.50 లక్షలు ఉంటుందన్నారు. దీనిపై రావులపాలెం పోలీసులకు ఎంఎస్ఓ ద్వారా ఫిర్యాదు చేశామన్నారు. డ్రైవర్‌తోపాటు బియ్యం రవాణా చేయిస్తున్న వ్యక్తిగా డ్రైవర్ చెప్పిన యర్రంశెట్టి సాంబశివరావుపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు. దాడుల్లో విజిలెన్స్ తహసీల్దార్ జి.గోపాలరావు, ఎస్.రామకృష్ణ, రావులపాలెం ఎస్సై సీహెచ్ విద్యాసాగర్, ఏఎస్సై ఆర్‌వీరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
రేషన్ బియ్యానికి దళారి దయ్యం
నల్లగొండ జిల్లా తిప్పర్తి మేజర్ గ్రామ పంచాయతీకి చెందిన ఓ తెల్ల రేషన్ కార్డుదారుడికి నెలకు 24 కిలోల బియ్యం ఇస్తున్నారు. బియ్యం దొడ్డుగా ఉండటంతోపాటు పురుగులు, మెరిగలు ఎక్కువగా ఉంటుండటంతో వాటిని అదే గ్రామానికి చెందిన వ్యాపారికి కిలోకు రూ.8 చొప్పున అమ్ముతున్నాడు. ఆ వ్యాపారి అవే బియ్యాన్ని రైస్‌మిల్లుకు రూ.10 చొప్పున విక్రయిస్తున్నాడు. మిల్లులో పాలిష్ చేసి ఆ బియ్యాన్నే మార్కెట్లో కిలో రూ.35కు విక్రయిస్తున్నారు. .. రాష్ట్రంలో రేషన్ బియ్యం దందాలో ఇదో కోణం! అనేకచోట్ల రేషన్ షాపుల్లో కొన్న బియ్యాన్ని అదే డీలర్‌కు విక్రయిస్తున్నారు. అందుకు బదులుగా డబ్బులు లేదా చక్కెర, పప్పు, ఇతర సరుకులు తీసుకుంటున్నారు. సదరు డీలర్ ఆ బియ్యాన్ని గంపగుత్తగా మిల్లర్‌కు అప్పగించేస్తున్నాడు. .. ఇది మరో కోణం!! సాక్షి, నెట్వర్క్: ప్రభుత్వం పేదల కోసం అం దిస్తున్న సబ్సిడీ బియ్యం పక్కదారి పడుతున్నాయి. ఓవైపు డీలర్లు, అధికారులు కుమ్మక్కై అక్రమాలకు పాల్పడుతుంటే.. మరోవైపు దొడ్డుగా ఉన్నాయని, అన్నం బాగుండటం లేదంటూ చాలామంది లబ్ధిదారులు బియ్యాన్ని అమ్మేసుకుంటున్నారు. మరికొన్నిచోట్ల రూపాయి కిలో బియ్యాన్ని పాలిష్ చేసి బహిరంగ మార్కెట్లో ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారు. రాష్ట్రంలో ఉమ్మడి హైదరాబాద్ మినహా మిగతా 9 జిల్లాల్లో అంత్యోద య, అన్నపూర్ణ, ఆహార భద్రత కార్డులు 75,01,851 ఉన్నాయి. వీటికి ప్రతినెలా సుమారు 14,79,07,851 యూనిట్ల బియ్యం(యూనిట్‌కు 6 కేజీలు) కోటా కేటాయిస్తున్నారు. తెల్లరేషన్ కార్డుదారుడికి ఒక్కొ క్కరికి 6 కిలోలు, అంత్యోదయ కార్డుకు 35 కేజీలు, అన్నపూర్ణ కార్డుదారులకు ఉచితంగా 10 కేజీల బియ్యాన్ని అందజేస్తున్నారు. ఎంఎల్ఎస్(మండల్ లెవల్ స్టాక్) పాయింట్ల నుంచి రేషన్ దుకా ణాలకు బియ్యం సరఫరా సక్రమంగానే జరుగుతుండగా.. చాలాచోట్ల డీలర్లు, అధికారులు కుమ్మక్కై పక్కదారి పట్టిస్తున్నారు. కొన్నిచోట్ల రేషన్ బియ్యాన్ని వండుకొని తినేందుకు లబ్ధిదారులు ఆసక్తి చూపడం లేదు. ఇటీవల బియ్యం తీసుకెళ్లకుంటే కార్డులు రద్దు చేస్తారని కొందరు డీలర్లు ప్రచారం చేశారు. దీంతో చాలామంది బియ్యాన్ని తీసుకెళ్లినా అవి ఇళ్లలోనే మూలుగుతున్నాయి. ఇంకొందరు బియ్యాన్ని కోళ్లఫాంలకు, పశువులకు దాణాగా వాడుతున్నారు. కొందరు వ్యాపారులు రేషన్ బియ్యాన్ని బాగా పాలిష్ పట్టి విదేశాలకు కూడా ఎగుమతి చేస్తున్నారు. ఇలా పేదలకు అందాల్సిన రేషన్ బియ్యంలో దాదాపు 80 శాతం వివిధ మార్గాల ద్వారా పక్కదారి పడుతున్నట్టు ‘సాక్షి’ క్షేత్రస్థాయి పరిశీలనలో తేలింది. ఎక్కడెక్కడ ఏం చేస్తున్నారంటే.. సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్‌లో 8 వేల మంది లబ్ధిదారులుండగా.. అందులో 4 వేల మందికిపైగా రేషన్ బియ్యం తింటున్నారు. మిగతావారు రైస్‌డిపోలు లేదా గిరిజనులు, బాలసంతుల వారికి విక్రయిస్తున్నారు. కిలో బియ్యం రూ.10 చొప్పున విక్రయిస్తున్నారు. వ్యాపారులు రైస్ డిపోల్లో ఇతరులకు కిలో బియ్యం రూ.15కు విక్రయిస్తున్నారు. రైస్‌మిల్లుల్లో రేషన్ బియ్యాన్ని పాలిష్ చేసి స్టీమ్‌రైస్ పేరుతో మార్కెట్లో క్వింటాలుకు రూ.3,500 నుంచి రూ.4 వేల దాకా విక్రయిస్తున్నారు. పేదలకు ఈ బియ్యమే దిక్కు మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం క్యాతనపల్లి మేజర్ గ్రామపంచాయతీ పరిధిలో చాలామంది లబ్ధిదారులు రేషన్ బియ్యం తింటున్నారు. ఈ పంచాయతీ పరిధిలో మొత్తం 15 వేలకుపైగా కుటుంబాలు నివసిస్తున్నాయి. వీరిలో 5,500 మందికి తెల్లకార్డులు ఉన్నాయి. మొత్తం 12 రేషన్ షాపుల ద్వారా సుమారు 770 క్వింటాళ్ల బియ్యం నెలనెలా అందిస్తున్నారు. మేజర్ గ్రామపంచాయతీ పరిధిలోని పట్టణ ప్రాంతం(రామకృష్ణాపూర్) మినహా నిరుపేదవాడల్లో చాలామంది రేషన్ బియ్యమే తింటున్నారు. అక్కడ వినియోగం 10 శాతమే.. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలోని చెరువుమాధారం గ్రామ పంచాయతీలో 1,630 కుటుంబాలు ఉన్నాయి. 1,435 తెల్ల రేషన్‌కార్డులు ఉన్నాయి. ప్రతినెలా 250 క్వింటాళ్ల రేషన్ బియ్యం దుకాణాలకు వస్తాయి. వీరిలో 80 శాతం బియ్యాన్ని కార్డుదారులు తీసుకెళ్తున్నా... వారిలో కేవలం 10 శాతం మంది మాత్రమే వినియోగించుకుంటున్నారు. కొందరు పశువులకు దాణాగా వాడుతున్నారు. దళారులు ఇంటింటా తిరిగి కిలో రూ.6 నుంచి రూ.7 వరకు కొనుగోలు చేసి తీసుకెళ్తున్నారు. పసుపు కలిపేసి.. జనగామ జిల్లా నర్మెట మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలోని పలు గ్రామాల్లో 9,571 జనాభా ఉంది. మూడు రేషన్ దుకాణాలున్నాయి. 1,653 మందికి తెల్లరేషన్ కార్డులు ఉన్నాయి. రేషన్ దుకాణాలకు 290.22 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం కేటాయిస్తున్నారు. లబ్ధిదారుల నుంచి కొందరు వ్యాపారులు ఈ బియ్యాన్ని సేకరించి అధికారులకు అనుమానం రాకుండా అందులో పసుపు కలిపి దేవుడి బియ్యంగా రైస్‌మిల్లులకు తరలిస్తున్నట్లు తెలుస్తోంది. పాలమూరు బియ్యంపై డోన్ వ్యాపారుల కన్ను పాలమూరు రేషన్ బియ్యంపై రాయలసీమలోని డోన్ ప్రాంతానికి చెందిన వ్యాపారులు కన్నేశారు. వీరు ఇంటింటికి తిరిగి బియ్యాన్ని కొని దళారులకు చేరవేస్తున్నారు. ఆ బియ్యాన్ని కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాలకు తరలిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. బస్తాల్లో కలిపేస్తున్నారు.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలం సుదిమళ్ల గ్రామంలోని రేషన్ షాపు పరిధిలో ఆరు గ్రామాలు ఉన్నాయి. ఈ గ్రామాల్లో సుమారు వెయ్యి కుటుంబాలు నివసిస్తున్నాయి. 666 రేషన్ కార్డులు ఉండగా 631 తెల్ల రేషన్‌కార్డులు, 35 ఏఏవై (35 కిలోల బియ్యం లభించేవి) రేషన్‌కార్డులు ఉన్నాయి. రేషన్ బియ్యం సరఫరా చేయగానే దళారీలు ఆటోల ద్వారా పల్లెల్లోకి వచ్చి ఇంటింటికీ తిరిగి లబ్ధిదారుల నుంచి కిలో రూ.4, రూ.5 చొప్పున కొనుగోలు చేస్తున్నారు. వాటిని నేరుగా మహబూబాబాద్, కాకినాడ మిల్లులకు తరలిస్తున్నారు. అక్కడి మిల్లర్లు కిలో రూ.15కు కొనుగోలు చేస్తున్నారు. రీసైక్లింగ్ చేసి.. మార్కెట్లో లభిస్తున్న 25 కిలోల బ్యాగులో ఈ బియ్యాన్ని 5 నుంచి 10 కిలోల వరకు కలుపుతున్నట్లు తెలిసింది. బయట కూడా సన్నబియ్యం పేరుతో కిలో రూ.28 నుంచి రూ.30లకు అమ్ముతున్నారు. రీసైక్లింగ్ బియ్యాన్నే బియ్యం రవ్వగా మార్చి కిలో రూ.25కు, పిండి కొట్టి రూ.30లకు విక్రయిస్తున్నారు. 212 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం పట్టివేత నర్సింహులపేట(డోర్నకల్)/దామరచర్ల/కోదాడ: మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం కొమ్ములవంచలో పోలీసులు ముగ్గురి ఇళ్లలో సోదాలు చేసి 212 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని పట్టుకున్నారు. ఈ ముగ్గురితోపాటు మరో ఇద్దరు వ్యాపారులపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి మంగళవారం తెలిపారు. మరో 145 బస్తాల బియ్యం.. పోలీసులు దాడులు చేసి మొత్తం 145 బస్తాల పీడీఎస్ బియ్యం పట్టుకున్నారు. నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం కేశవాపురం గ్రామపంచాయతీ పరిధిలోని తెట్టెకుంటలో 72 బస్తాలు, సూర్యాపేట జిల్లా కోదాడ మండలం కొమరబండలో 73 బస్తాల పీడీఎస్ బియ్యాన్ని పట్టుకున్నారు. తినబుద్ధి అయితలె.. రేషన్ బియ్యం వండితే అన్నం ముద్ద అయితంది. ఉడుకు ఉన్నప్పుడే తినబుద్ధి అయితంది. చల్లారినంక తినబుద్ధి అయిత లేదు. సర్కారోళ్లు రూపాయి కిలో బియ్యం అని చెబుతుండ్రు కానీ ఉపయోగపడ్తలె. మాకు సన్నబియ్యం అందించాలె.. – అలుగు కొమురమ్మ, ముల్కనూర్, వరంగల్ అర్బన్ జిల్లా ధర ఎక్కువైనా సన్నబియ్యం ఇయ్యాలె.. రేషన్ బియ్యం ఎవ్వరూ కొనుగోలు చేయడం లేదు. ఇళ్లలోనే నిల్వలు పేరుకు పోతున్నాయి. పాడైపోయిన బియ్యాన్ని పందుల్ని సాదు కునేటోళ్లు కొనుక్కపోతున్నరు. కిలోకు రూ.10 అయినా సరే సన్నబియ్యం అందిస్తే మేలు. – కొన్నె తిరుపతి, నర్మెట -
ఈ–పాస్ కాంట్రాక్టర్ తీరుపై ఈటల ఆగ్రహం!
సాక్షి, హైదరాబాద్: దసరాకు కొన్ని జిల్లాల్లో రేషన్ బియ్యం అందించలేకపోవడంపై ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ –పాస్ మిషన్ల అక్రమాలను అరికట్టడానికే గానీ, లబ్ధిదారులను ఇబ్బందులు పెట్టడానికి కాదని పేర్కొన్నారు. ఈ–పాస్ మిషన్లు అందిస్తున్న సంస్థ అలసత్వం వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరొస్తోందని, మరోసారి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని ఆ కంపెనీని హెచ్చరించారు. పౌర సరఫరాల శాఖపై ఆయన శనివారం సమీక్షించారు. ఈ కంపెనీ అనుకున్న స్థాయిలో పని చేయట్లేదని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ–పాస్ మెషీన్లు సరిగా పని చేస్తున్నాయో లేదో చూసుకున్నాకే క్షేత్ర స్థాయిలో అమలు చేయాలని ఆదేశించారు. అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాలని, బియ్యం అందించలేకపోతుంటే ఏం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీపావళికి పునరావృతం కాకుండా చూసుకోవాలని కమిషనర్ సీవీ ఆనంద్‌కు సూచించారు. సమస్యల్లేకుండా ఈ–పాస్ మిషన్ల ద్వారా అర్హులయిన ప్రతి ఒక్కరికీ రేషన్ బియ్యం అందేలా చూడాలని కోరారు. ఈ ఏడాది సన్న బియ్యం 1.5 లక్షల టన్నులు అవసరం ఉంటుందని సీవీ ఆనంద్ మంత్రికి వివరించారు. 27 లక్షల టన్నుల ధాన్యం సేకరణకు సిద్ధమవుతున్నట్లు తెలిపారు. ధాన్యం సేకరణకు మొత్తం రూ.8,500 కోట్లు అవసరమవుతాయని అంచనా వేశారు. బియ్యం సేకరణ పూర్తి పారదర్శకంగా టెండర్ల ద్వారా జరగాలని మంత్రి ఆదేశించారు. సన్న బియ్యం నిల్వకు అన్ని వసతులు ఉన్న గోదాములను ఉపయోగించాలన్నారు. అడిగిన ప్రతి ఒక్కరికీ ఎల్పీజీ వంటగ్యాస్ కనెక్షన్లు అందేలా చూసుకోవాలని సూచించారు. చౌక ధరల దుకాణాల సంఖ్య పెంచాలని వస్తున్న దరఖాస్తులపై త్వరలో తగిన నిర్ణయం తీసుకుంటామన్నారు. ఈలోగా మారుమూల ఉన్న తండాలు, గూడేలల్లో నెలలో రెండు రోజులు డీలర్లు వెళ్లి బియ్యం అందించాలని చెప్పారు. ఇన్చార్జి డీలర్లతో నడుస్తున్న దుకాణాలకు డీలర్ల నియామకంపై కూడా త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు. డీలర్లకు కమిషన్ పెంచే విషయంపై సీఎంతో చర్చించాక నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. -
ఇంకెన్నాళ్లు..
♦ రేషన్ బియ్యం పంపిణీలో తీవ్ర జాప్యం ♦ ఎట్టకేలకు జిల్లాకు చేరుకున్న వేయింగ్ మిషన్లు ♦ తాజాగా ఈ పాస్ మిషన్లలో సాంకేతిక లోపం ♦ వారం గడిచినా.. ప్రారంభం కాని రేషన్ సరఫరా ♦ పండుగలు సమీపిస్తుండడంతో ప్రజల్లో ఆందోళన హన్మకొండ అర్బన్: జిల్లాలో రేషన్ బియ్యం అందక పేద, మధ్య తరగతి వర్గాలు అల్లాడుతున్నాయి. ప్రతి నెలా ఒకటి నుంచి 14వ తేదీ వరకు రేషన్ షాపుల ద్వారా నిత్యావసర సరుకులు పంపిణీ చేయాల్సి ఉండగా... ఇప్పటివరకూ మొదలుకాలేదు. పౌరసరఫరాల వ్యవస్థలో రేషన్‌షాపుల ద్వారా బియ్యం పంపిణీ కోసం చేపట్టిన ఈ పాస్ విధానం అమలులో అధికారుల నిర్లక్ష్యమే ఇందుకు కారణం. మరో పది రోజుల్లో బతుకమ్మ పండుగ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో బియ్యం పంపిణీ కాకపోవడం.. ఎప్పుడిస్తారో స్పష్టత లేకపోవడంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. మరో వైపు షాపుల చుట్టూ తిరుగుతున్న పేదలకు సమాధానం చెప్పలేక డీలర్లు తలపట్టుకుంటున్నారు. మిషన్లు వచ్చినా.. రేషన్‌డీలర్లకు ఈ పాస్ యంత్రాలు పంపిణీ చేసిన అధికారులు వేయింగ్ మిషన్లు లేక హిమాచల్ ప్రదేశ్ నుంచి వచ్చే వాటి కోసం ఎదురుచూశారు. ఎట్టకేలకు జిల్లాకు వేయింగ్ మిషన్లు చేరుకున్నా యి. అయితే ఈ పాస్ యంత్రాలను వేయింగ్ మిషన్‌కు అనుసంధా నం చేసే విషయంలో సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. శుక్రవారం హన్మకొండ మండలం పరిధిలోని డీలర్లను ఈ పాస్ మిషన్లతో కలెక్టరేట్‌కు రావాలని అధికారులు ఆదేశించారు. అయితే ఎంత సేపు ప్రయత్నించినా.. చాలా మిషన్ల అనుసంధానం ప్రక్రియ పూర్తి కాలేదు. దీంతో డీలర్లు వెనుదిరిగారు. జిల్లాలో 599 షాపుల్లో ఈ ప్ర క్రియ పూర్తి కావడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. ఈ నెల వరకు అవకాశమివ్వండి.. మిషన్లలో సాంకేతిక సమ్స్యలను దృష్టిలో పెట్టుకుని పండుగలు ఉన్నందున ఆగస్టు నెలలో మాదిరిగా పంపిణీ చేసేందుకు అవకాశం ఇవ్వాలని కోరుతూ రేషన్‌డీలర్ల సంఘం ప్రతినిధులు శుక్రవారం జేసీ దయానంద్‌కు వినతిపత్రం అందజేశారు. జేసీ నిర్ణయం మేరకు అధికారులు తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఆలస్యమైనా ఈ పాస్ ద్వారానే... ఈ నెల తప్పనిసరిగా ఈ పాస్ విధానం ద్వారానే బియ్యం పంపిణీ చేయాలని కమిషనర్‌నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. అందువల్ల కాస్త ఆలస్యమైనా ఈ పాస్ ద్వారానే పంపిణీ చేస్తాం. జిల్లాలో వేలేరుతోపాటు మరికొన్ని మండలాల్లో మిషన్ల అనుసంధానం పూర్తయింది. ఒకటి రెండు రోజుల్లో జిల్లా మొత్తం పూర్తి చేస్తారు. గతంలో మాదిరిగా ఒక్కనెల పంపిణీకి అనుమతి ఇవ్వాలని రేషన్‌డీలర్లు విజ్ఞప్తి చేశారు. ఈ విషయంలో జేసీకూడా ఈ పాస్ ద్వారానే పంపిణీ చేయమన్నారు.– విజయలక్ష్మి, డీసీఎస్ఓ -
భారీగా రేషన్ బియ్యం పట్టివేత
వరంగల్: వరంగల్ రూరల్ జిల్లా చెన్నారావుపేటలో ఆదివారం ఉదయం భారీ ఎత్తున రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. లారీలో భారీ మొత్తంలో రేషన్ బియ్యాన్ని తరలిస్తుండగా అనుమానం వచ్చిన పోలీసుల లారీని ఆపి తనిఖీ చేశారు. లారీలో ఉన్న బస్తాలన్నింటిలో రేషన్ బియ్యం ఉండటంతో వెంటనే వాటిని సీజ్ వాటిని సీజ్ చేసిన పోలీసులు అక్రమంగా బియ్యాన్ని తరలిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. -
పేదల ‘బువ్వ’కు ఎసరు
పక్కదారి పడుతున్న రేషన్ బియ్యం - 3.02 కోట్ల నుంచి 2.75 కోట్లకు రేషన్ లబ్ధిదారుల తగ్గింపు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రస్తుత జనాభా సరాసరి 4 కోట్ల మంది. రాష్ట్రం ఏర్పడ్డాక రేషన్ లబ్ధిదారులు ఏకంగా 3.02 కోట్లు. ఇంత మొత్తంలో కార్డులు ఉన్నాయంటే వీరంతా దారిద్య్రరేఖకు దిగువన ఉన్నవారన్న మాట. కొందరు రేషన్ డీలర్లు, మిల్లర్లు, అధికారులు, కొందరు నేతల వల్లే ఇంత పెద్ద సంఖ్యలో రేషన్ లబ్ధిదారుల సంఖ్య ఉందన్న విమర్శలున్నాయి. తద్వారా బియ్యం సరఫరా పేరుతో అక్రమ ఆదాయా న్ని పొందుతున్నారన్న ఆరోపణలున్నాయి. అధికారుల చర్యలతో వీటిని 2.75 కోట్లకు తగ్గించారు. అయితే ఇందులో కూడా ఇంకా దాదాపు 75 లక్షల మంది బోగస్ లబ్ధిదారులే ఉంటారని చెబుతున్నారు. వీరిని తొలగించడం ప్రభుత్వానికి తలనొప్పిగా మారుతుందన్న ఉద్దేశంతో చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారన్న అభిప్రాయమూ ఉంది. ప్రభుత్వ ఖర్చు ఇదీ.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 17,200 రేషన్ దుకాణాల ద్వా రా ప్రతి నెలా 1.75 లక్షల టన్నుల బియ్యాన్ని ప్రజా పంపిణీ విధానం ద్వారా పేదలకు ప్రభుత్వం అందిస్తోంది. 85 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. వీటికి ప్రభుత్వం ఏటా ఏకంగా 2,200 కోట్ల సబ్సిడీ భారాన్ని భరిస్తోంది. అనర్హులైన లబ్ధిదారుల పేరు ప్రతినెలా రూ.4.5 కోట్ల విలువైన బియ్యం ప్రభుత్వ గోదాముల నుంచి బహిరంగ మార్కెట్‌కు వెళుతున్నాయి. ఏటా ఈ మొత్తం ఏకంగా 50 కోట్ల దాకా ఉంది. ప్రతినెలా కనీసం 45 వేల టన్నుల బియ్యం రేషన్ మాఫియా చేతుల్లో పడుతోందని అంచనా. పక్కదారి పట్టేదిలా! రేషన్ బియ్యం లబ్ధిదారులే కిలో బియ్యాన్ని రూ.10 నుంచి రూ.12కు విక్రయిస్తున్నారు. ఈ బియ్యాన్ని వ్యాన్లు, లారీల్లో సరిహద్దులు దాటిస్తున్నారు. ఇటీవల రైల్వే ద్వారా మహారాష్ట్ర వంటి ప్రాంతాలకు తరలి స్తున్న బియ్యాన్ని పట్టుకున్నారు. పేదలకు దక్కాల్సిన రేషన్ బియ్యం వారి నోటికి అందకుండానే సరిహద్దులు దాటుతోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. బియ్యం అక్రమ రవాణాను అరికట్టేందుకు చర్యలు ► రేషన్ బియ్యాన్ని రాష్ట్ర సరిహద్దులు దాటిస్తున్న వ్యాపారులపై తొలిసారిగా పీడీ యాక్టు కింద కేసులు నమోదు చేశారు. ► ఎన్ఫోర్స్మెంట్ విభాగాన్ని పటిష్టం చేశారు. రిటైర్డ్ ఎస్పీల నేతృత్వంలో 24 మంది సిబ్బందితో 5 బృందాల ఏర్పాటు ► బియ్యం రవాణా చేసే 1,300 వాహనాలకు జీపీఎస్ పరికరాలు అమర్చడం ► జీహెచ్ఎంసీ పరిధిలోని 1,525 ఎంఎల్ఎస్ పాయింట్ల వద్ద సీసీ కెమెరాల ఏర్పాటు ► అక్రమ కార్డుల వినియోగాన్ని తగ్గించడం కోసం ఇప్పటి దాకా 6వేల రేషన్ దుకాణాల్లో ఈృపాస్ యంత్రాలను అమర్చారు. ► మొత్తం లావాదేవీలన్నీ కంప్యూటరీకరించడం, ఈ అంశాలన్నింటినీ పర్యవేక్షించేందుకు కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. సాంకేతికతతోనే అక్రమాలకు చెక్ ‘పౌర సరఫరాల శాఖలో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడం ద్వారా అక్రమాలకు చెక్ పెడుతున్నాం. ఎన్ఫోర్స్మెంట్ దాడులు, పీడీ యాక్టు కింద కేసులు తదితర చర్యల వల్ల కాకినాడ పోర్టుకు సరుకు వెళ్లడం ఆగిపోయింది. ఈృపాస్ యంత్రాలను ఇప్పటికే 6 వేల రేషన్ దుకాణాల్లో అమర్చాం. వచ్చే నెలాఖరుకు 10 వేల దుకాణాల్లో ఇవి అందుబాటులోకి వస్తాయి. అక్రమాల నియంత్రణకు కఠిన చర్యలు చేపట్టడం ద్వారా ఇప్పటికే శాఖకు రూ.1,100 కోట్లు ఆదా చేయగలిగాం’ - సీవీ ఆనంద్, పౌర సరఫరాల కమిషనర్ -
రేషన్ బియ్యం విక్రయిస్తోన్న వ్యక్తి అరెస్ట్
సుల్తాన్‌బజార్(హైదరాబాద్‌సిటీ) : అక్రమంగా రేషన్‌బియ్యం విక్రయిస్తున్న వ్యక్తిని గురువారం సుల్తాన్‌బజార్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఇన్స్పెక్టర్ శివశంకర్ తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్‌జిల్లా మసాన్పల్లికి చెందిన ఎం.కిషన్ (39) ఇసామియా బజార్‌లోని ఓ రేషన్‌దుకాణంలో హెల్పర్‌గా పనిచేస్తున్నాడు. ప్రజలకు చేరాల్సిన రేషన్ బియ్యాన్ని డీలర్ వద్ద రూ. 4ల చొప్పున కొనుగోలు చేసి రూ.15 నుంచి 20 రూపాయలకు కిలో చొప్పున విక్రయిస్తున్నాడు. ఈ సమాచారం తెలుసుకున్న టాస్క్‌పోర్స్ పోలీసులు కిషన్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని సుల్తాన్‌బజార్ పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని రిమాండ్‌కు తరలించారు. -
మిగిలేది బియ్యమే!
- ప్రజా పంపిణీలో ఒక్కో సరుకునూ వదిలించుకుంటున్న ప్రభుత్వం - సబ్సిడీల భారం భరించలేక చేతులెత్తేస్తున్న వైనం సాక్షి, హైదరాబాద్: పేదలకు సబ్సిడీ ధరలకు నిత్యావసరాలను సరఫరా చేయాల్సిన ‘ప్రజాపంపిణీ వ్యవస్థ (పీడీఎస్)’నామమాత్రంగా మారిపోతోంది. సబ్సిడీల భారాన్ని తగ్గించుకునేందుకు ప్రభుత్వం ఒక్కో నిత్యావసర సరుకును వదిలించుకుంటూ వస్తోంది. పప్పులు, ఉప్పులు వంటివన్నింటినీ పక్కనపెట్టేసిన ప్రభుత్వం.. ప్రస్తుతం సబ్సిడీ బియ్యం, కిరోసిన్‌లకు మాత్రమే పరిమితమైపోయింది. బియ్యం భారం తగ్గించుకునేందుకు.. 1983లో ఎన్టీఆర్ అధికారంలోకి వచ్చాక రేషన్ షాపుల ద్వారా రూ.2కిలో బియ్యం పథకం ప్రారంభించారు. అప్పటి మార్కెట్ రేటుతో పోల్చితే కిలోకు 46 పైసల సబ్సిడీ ఇచ్చారు. 1996లో నాటి సీఎం చంద్రబాబు మార్కెట్లో ధర పెరిగిందని రేషన్ బి య్యం ధరను రూ.5.25కు పెంచారు. అయితే వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో మార్కెట్ ధర పెరిగినా.. రేషన్ బియ్యం ధరను రూ.2 కు తగ్గించారు. అప్పటి మార్కెట్ ధరల లెక్కన కిలోపై రూ.10.50 సబ్సిడీ ఇచ్చారు. అనంతరం కిరణ్ సర్కారు రేషన్ బియ్యం ధరను రూపాయికి తగ్గించగా.. ఇప్పటికీ అదే ధర కొనసాగుతోంది. ప్రస్తుతం బియ్యం మార్కెట్ ధర రూ.26 లెక్కన చూస్తే ప్రభుత్వం కిలోకు రూ.25 సబ్సిడీగా భరిస్తున్నందున ఏటా రూ.2,200 కోట్ల భారం పడుతోంది. దీంతో ఇతర సరుకుల సరఫరా నుంచి ప్రభుత్వం పక్కకు తప్పుకుంది. కిరోసిన్‌కూ మంగళం! సబ్సిడీ కిరోసిన్ సరఫరాకూ మంగళం పాడాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. రేషన్ కిరోసిన్ ధరను కొద్ది నెలల కింద లీటర్‌కు రూ.15 నుంచి రూ.21కి పెంచారు. వంటగ్యాస్ వినియోగం బాగా పెరిగినందున సబ్సిడీ కిరోసిన్ సరఫరాను తగ్గించి, ఆనక నిలిపివేయాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. సరఫరా లేదు.. ఆధునీకరణ ఎందుకు? పౌర సరఫరాల శాఖను ఆధునీకరించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అవినీతిని నిరోధించేందుకూ ఈ–పాస్ విధానాన్ని తెచ్చింది. రవాణా లారీలకు జీపీఎస్ పరికరాలు అమర్చడం, గోదాములు, నిల్వ కేంద్రాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు, కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు వంటి చర్యలూ తీసుకున్నారు. అంతాచేసి ప్రస్తుతం పౌరసరఫరాల శాఖ రేషన్ దుకాణాలు బియ్యం పంపిణీకే పరిమితం కావడం గమనార్హం. ఒక్కో రేషన్ కార్డుపై అందించే చక్కెర.. 500 గ్రాములు రేషన్‌పై ఇచ్చే ధర.. 6.75 రూపాయలు ప్రస్తుత మార్కెట్ ధర 22.75 రూపాయలు సబ్సిడీ రూ.16 (కేంద్రం రూ. 9.25, రాష్ట్రం రూ. 6.75) ప్రస్తుతం చక్కెరపై సబ్సిడీని కేంద్రం ఎత్తివేసింది.దీంతో రేషన్ దుకాణాల్లో చక్కెర పంపిణీని రాష్ట్ర ప్రభుత్వం నిలిపివేసింది. మొదట్లో రేషన్‌పై అందజేసినవి: బియ్యం, గోధుమలు,చక్కెర, కిరోసిన్, కందిపప్పు, పామాయిల్ అమ్మహస్తంలో అందించినవి: కందిపప్పు, పామాయిల్, గోధుమపిండి, గోధుమలు, చక్కెర, ఉప్పు, కారం, చింతపండు, పసుపు మూడేళ్ల క్రితం వరకు: బియ్యం, చక్కెర, కిరోసిన్ రేషన్ దుకాణాలను మినీ కిరాణ దుకాణాలుగా మార్చే ఉద్దేశంతో మార్కెట్ ధరపై ఇతర సరుకుల విక్రయానికి కూడా మధ్యలో కొంతకాలం అనుమతించారు. దాంతో సబ్బులు, ఉప్పు, పప్పులు వంటి పలు సరుకులను రేషన్ డీలర్లు విక్రయించినా..అనంతరం అది నిలిచిపోయింది. ప్రస్తుతం అందుతున్న సరుకులు: బియ్యం, కిరోసిన్ -
నకిలీ ఎస్సై.. 84 కేసులు..
రూ.57లక్షలు, మూడు కార్లు, 10 బైక్‌లు చోరీ ఎర్రుపాలెం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లా కండిపాడు మండలం దామలూరుకి చెందిన అంతర్రాష్ట్ర దొంగ, నకిలీ ఎస్సై ఐతం రవిశేఖర్‌ను ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం పోలీసులు ఆదివారం అరెస్టు చేసి మధిర కోర్టుకు రిమాండ్ చేశారు. ఎర్రుపాలెం వైరా ఏసీపీ ఎం.శ్రీధర్‌రెడ్డి విలేకరులకు నిందితుడి వివరాలు వెల్లడించారు. నింది తుడు రవిశేఖర్ ఎస్సై, విజిలెన్స్ ఆఫీసర్నని చెప్పుకుంటూ ఏపీ, తెలంగాణ రాష్ట్రా ల్లోని దాదాపు 8 జిల్లాల్లో పలు నేరాలకు పాల్పడ్డాడు. ఇతడిపై రెండు తెలుగు రాష్ట్రా ల్లో 84 క్రిమినల్ కేసులున్నాయి. గత నెల 19న ఓ నేరంపై జగ్గయ్యపేట జైలులో ఉన్న డు రవిశేఖర్‌ను ఏపీ రాష్ట్రం కృష్ణా జిల్లా జగ్గయ్యపేట పోలీసులు తాడేపల్లి గూడెం కోర్టులో హాజరుపరిచి.. తిరిగి తీసుకొస్తున్న క్రమంలో వారి కస్టడీ నుంచి విజయవాడ కృష్ణలంక పీఎస్ పరిధిలో తప్పించుకుని తిరుగుతున్నాడు. ఈ ఘటనలో అక్కడి ఇద్దరు కానిస్టేబుళ్లు సస్పెన్షన్‌కు గురయ్యారు. కాగా.. రవిశేఖర్ ఈనెల 17న రాత్రి ఎర్రుపాలెం పోలీస్‌స్టేషన్ ఎదుట ఉన్న ఓ లారీ ఆఫీసుకు వచ్చా డు. లారీల్లో అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్నారని.. కేసులు లేకుండా చేయాలంటే రూ.20వేలు ఇవ్వాలని లారీ యజమాని మొగిలి అప్పారావును డిమాండ్ చేశాడు. అప్పటికప్పుడు బెదిరించి రూ.5 వేల నగదు తీసుకున్నాడు. ఈ విషయాన్ని అప్పారావు పోలీసులకు చేరవేయడంతో ఎస్సై ఆంజనేయులు, సిబ్బందితో వచ్చి నిందితుడు రవిశేఖర్‌ను అదుపులోకి తీసుకున్నారు. -
రేషన్ బియ్యం స్వాధీనం
గుమ్మిడిపూండి: రైలులో ఆంధ్రాకు అక్రమంగా తరలించేందుకు సిద్ధం చేసిన రెండు టన్నుల రేషన్ బియ్యాన్ని తమిళనాడు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చెన్నై సెంట్రల్ నుంచి గుమ్మిడిపూండి మీదుగా తడ, సూళ్లూరుపేట, నెల్లూరుకు వెళ్లే యూనిట్ రైలులో కొందరు రేషన్ బియ్యాన్ని ఆక్రమంగా రవాణా చేస్తున్నారని గుమ్మిడిపూండి టీఎస్ఓ ఇళవరసికి సమాచారం అందింది. దీంతో ఆమె రెండు రోజులుగా తన సిబ్బందితో గుమ్మిడిపూండి, కవరపేట, తదితర స్టేషన్లలో విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఆ సమయంలో ప్లాట్‌ఫాం పక్కన ముళ్లపొదల్లో దాచిన బియ్యం బస్తాలను గుర్తించి అధికారులు వాటిని స్వాధీనం చేస్తున్నారు. బియ్యం బస్తాలను పంజెట్టిలోని పౌరసరఫరాల శాఖ గోదాముకు తరలించారు. -
రేషన్ బియ్యం పట్టివేత
- కర్ణాటకకు తరలిస్తుండగా తనిఖీలు - 440 ప్యాకెట్లు స్వాధీనం ప్యాపిలి : డోన్ నుంచి కర్ణాటక రాష్ట్రానికి అక్రమంగా తరలిపోతున్న రేషన్ బియ్యాన్ని ప్యాపిలి ఎస్ఐ తిమ్మయ్య స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం స్థానిక పెద్దమ్మ డాబా వద్ద వాహనాల తనిఖీలో భాగంగా కర్ణాటక వైపు వెళ్తున్న లారీ(కేఏ40 ఏ 8384)ని నిలిపి చెక్ చేయగా విషయం బయటపడింది. లారీలో ఉన్న 22 టన్నుల రేషన్ బియ్యం (440 పాకెట్లు) స్వాధీనం చేసుకున్నారు. డ్రైవర్ వెంకటేశ్వర్లును (కొచ్చెర్వు) అదుపులోకి తీసుకుని, బియ్యాన్ని రెవెన్యూ అధికారులకు అప్పగించారు. -
188 బస్తాల రేషన్ బియ్యం పట్టివేత
► ఐదుమంది అరెస్ట్ కావలిరూరల్ : అక్రమంగా తరలిస్తున్న 188 బస్తాలు రేషన్ బియ్యాన్ని కావలి ఒకటో పట్టణ ఎస్సై గుంజి అంకమ్మరావు గురువారం తన సిబ్బందితో కలిసి పట్టుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. ప్రకాశం జిల్లా సింగరాయకొండ నుంచి గురువారం రేషన్ బియ్యంతో లారీ వస్తోందని తెలుసుకున్న సీఐ ఎం.రోశయ్య సిబ్బందిని అప్రమత్తం చేశారు. లారీ పట్టణంలోని లక్ష్మి మోడ్రన్ రైస్‌మిల్లులోకి ప్రవేశిస్తుండగా పోలీసులు అడ్డుకుని స్వాధీనం చేసుకున్నారు. లారీకి పైలెట్‌గా వ్యవహరిస్తున్న కారును సైతం స్వాధీనం చేసుకున్నారు. ఈ బియ్యం తరలింపులో భాగస్వామ్యం ఉన్న మధురెడ్డి, ఎస్కే షఫీ, పోలయ్య, సురేష్, కోటేశ్వరరావులను అదుపులోనికి తీసుకున్నారు. బియ్యంను పౌరసరఫరాలశాఖ అధికారులకు అప్పగించి లారీని, కారును ఒకటో పట్టణ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. సీఐ రోశయ్య కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
‘రేషన్’ దొంగల కొత్త మార్గాలు!
- క్వింటా బియ్యం మించకుండా రైళ్లలో మూటల తరలింపు - రైల్వేస్టేషన్లపై దాడులు చేస్తున్న ‘సివిల్ సప్లైస్’ - పటిష్టమైన చర్యలతో కాకినాడపోర్టుకు బందైన అక్రమ బియ్యం లారీలు సాక్షి, హైదరాబాద్: రేషన్ బియ్యం పక్కదారి పట్టించేం దుకు అక్రమార్కులు కొత్త మార్గాలు కనిపెట్టారు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ ఎన్ని చర్యలు తీసుకుంటున్నా రేషన్ దొంగలు తమ అక్రమాలను యథేచ్ఛగా సాగిస్తున్నారు. ఇటీవల వరసగా జరిగిన సంఘటనలు చౌకధరల బియ్యం అక్రమార్కుల వ్యూహాన్ని బయటపెట్టింది. ఏభై కేజీలు, క్వింటా పరిమాణంలో మూటలు కట్టి బియ్యాన్ని రైళ్లలో రాష్ట్రసరిహద్దులు దాటిస్తున్నారు. ఇన్నాళ్లూ రోడ్డు మార్గంలో లారీలు, వ్యాన్లు, ఆటోల్లో మాత్రమే బియ్యాన్ని అక్రమంగా తరలించేవారు. కేవలం నెల వ్యవధిలోనే నాంపల్లి స్టేషన్లో 8 క్వింటాళ్లు, కాచిగూడ స్టేషన్లో 22 క్వింటాళ్లు, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో 18.50 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని అధికారులు స్వాధీనం చేసకున్నారు. పట్టుబడిన ఈమొత్తం కలిసినా 48.50 క్వింటాళ్లే అయినా, ప్రతీ నిత్యం చిన్న, చిన్న మూటలుగా పెద్ద మొత్తంలోనే తరలిస్తున్నారన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. హైదరాబాద్ నుంచి మహారాష్ట్రలకు బియ్యాన్ని అక్రమం గా తరలిస్తున్నట్లు గుర్తించారు. దీంతో అన్ని రైల్వే స్టేషన్లపై దృష్టి పెట్టాలని పౌర సరఫరాల శాఖల అధికారులను ఉన్నతాధికారులు అప్రమత్తం చేశారు. దాడులు కూడా నిర్వహిస్తున్నారు. ఏటా రూ.25 వందల కోట్ల సబ్సిడీలు రాష్ట్రంలోని 2.70కోట్ల మంది లబ్ధిదారుల కోసం ప్రతీ నెలా 1.75 లక్షల టన్నుల బియ్యాన్ని ప్రభుత్వం సరఫరా చేస్తోంది. దీనికోసం ఏటా రూ.2 వేల నుంచి రూ.2500కోట్ల సబ్సిడీనీ ప్రభుత్వం భరిస్తోంది. ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకుని రేషన్ బియ్యం అక్రమ వ్యాపారాన్ని అరికట్టేందుకు సివిల్ సప్లైస్ కమిషనర్ సి.వి.ఆనంద్ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ప్రధాన కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని ఏర్పాటు చేసి అన్ని జిల్లా కార్యాలయాలను, బియ్యం గోదా ములను, బియ్యం రవాణా చేసే వాహనాలను ఈ కేంద్రం తో అనుసంధానించారు. సుమారు 13వందల రవాణా వాహనాలకు జీపీఎస్ అమర్చగా, మండల స్థాయి నిల్వ కేంద్రాల్లో సైతం సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. దీనికి తోడు ఇరవై మందితో ఎన్‌పోర్స్‌మెంటు విభాగాన్ని నెల కొల్పారు. దీంతో బియ్యం అక్రమార్కులకు చెక్ పెట్టిన ట్టయింది. ప్రధానంగా కాకినాడ పోర్టుకు రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలించే లారీలను కట్టడి చేశారు. రేషన్ బియ్యాన్ని ఆఫ్రికా దేశాలకు ఎగుమతి చేస్తున్న వ్యాపా రులను గుర్తించి ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో పీడీ యాక్టు కింద కేసులు నమోదు చేశారు. దీంతో కాకినాడ పోర్టుకు తరలిపోయే రేషన్ బియ్యం దాదాపు బందైనట్లు పేర్కొం టున్నారు. ఈ కారణంగానే బియ్యం వ్యాపారులు కొత్త మార్గాల అన్వేషణలో పడినట్లు తెలుస్తోంది. -
రేషన్ బియ్యం పట్టివేత
భద్రాద్రి: లబ్దిదారులకు అందాల్సిన రేషన్ బియ్యం అక్రమంగా నిల్వ ఉంచి బ్లాక్‌మార్కెట్‌కు తరలించేందుకు యత్నిస్తున్నారు. సమాచారం తెలుసుకుని రంగంలోకి దిగిన రెవెన్యూ, సివిల్ సప్లై అధికారులు పెద్ద ఎత్తున రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం అనిశెట్టిపల్లి రేషన్‌షాపులో డీలర్ సీహెచ్ శ్రీనివాసరావు అక్రమాలకు పాల్పడుతున్నాడనే ఆరోపణలు వచ్చాయి. మంగళవారం అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో అక్రమంగా నిల్వ ఉంచిన 400 బస్తాల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. -
3 కోట్ల మందికైనా బియ్యం ఇస్తాం
⇒ ఇప్పటికే దేశంలో ఎక్కడా లేనట్లు 2.75 కోట్ల మందికి బియ్యం ఇస్తున్నాం ⇒ శాసనసభలో మంత్రి ఈటల ⇒ రాష్ట్రం కన్నా కేంద్రమే బియ్యం సబ్సిడీకి ఎక్కువ నిధులిస్తోందన్న కిషన్‌రెడ్డి సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికి రూపాయికే కిలో బియ్యం సరఫరా చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని.. అవసరమైతే మూడు కోట్ల మందికైనా బియ్యం పంపిణీ చేస్తామని ఆర్థిక, పౌర సరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. ఇప్పటికే దేశంలో ఎక్కడా లేని విధంగా 2.75 కోట్ల మందికి ప్రభుత్వం బియ్యం పంపిణీ చేస్తోందని చెప్పారు. రూపాయికి కిలో బియ్యం పథకం అమలుపై సోమవారం శాసనసభ ప్రశ్నోత్తరాల్లో బీజేపీ పక్ష నేత కిషన్‌రెడ్డి, సభ్యులు లక్ష్మణ్, చింతల రామచంద్రారెడ్డి అడిగిన ప్రశ్నలకు ఈటల బదులిచ్చారు. బియ్యం సబ్సిడీ కింద కేంద్రం రూ.3,717 కోట్లు నిధులిస్తుండగా.. రాష్ట్ర ప్రభుత్వం రూ.2,665 కోట్లు అదనంగా ఖర్చు చేస్తోందని వెల్లడించారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రం కన్నా కేంద్రమే రూ.1,100 కోట్లు అధికంగా నిధులు ఇస్తోందని.. అయినా రాష్ట్ర ప్రభుత్వం అన్యాయంగా పేదల కార్డులు తొలగిస్తోందని మండిపడ్డారు. దీంతో ఈటల స్పందిస్తూ.. ఉద్దేశపూర్వకంగా కార్డులు తొలగించబోమని, డూప్లికేషన్లు ఉంటేనే తొలగిస్తున్నామన్నారు. ప్రశ్నల మాయంపై ఆగ్రహం ప్రశ్నోత్తరాల్లో తన ప్రశ్నల సంఖ్యను కుదించ డంపై కిషన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై స్పీకర్ స్పందిస్తూ.. మరో ప్రశ్న సైతం అలాంటిదే ఉండడంతో దానిలో సిగ్నేటరీగా పెట్టామన్నారు. దీనిని కిషన్‌రెడ్డి వ్యతిరేకిం చారు. తాను సంతకమే చేయకుండా సిగ్నేటరీ ఎలా అవుతానని ప్రశ్నించారు. దీనికి ప్రతిపక్ష నేత జానారెడ్డి మద్దతు తెలిపారు. దీంతో మరోసారి ఇలా జరగకుండా చూస్తామని స్పీక ర్ హామీ ఇవ్వడంతో కిషన్‌రెడ్డి శాంతించారు. పీహెచ్‌సీల బలోపేతం: లక్ష్మారెడ్డి రాష్ట్రంలో పీహెచ్‌సీల బలోపేతానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని మంత్రి లక్ష్మారెడ్డి తెలిపారు. టీఆర్ఎస్ సభ్యుడు శ్రీనివాస్‌గౌడ్ అడిగిన ప్రశ్నకు ఆయన బదులిచ్చారు. రాష్ట్రంలోని 698 పీహెచ్‌సీల్లో 15,196 పోస్టులకుగాను 3,606 పోస్టులు ఖాళీగా ఉన్నాయని.. ఇందులో 2,118 పోస్టుల భర్తీ కోసం అనుమతించామన్నారు. సభాసంఘం వేయండి: జీవన్‌రెడ్డి సాదా బైనామాల రిజిస్ట్రేషన్ల విషయంలో గ్రామాల్లో అనేక సమస్యలు ఉత్పన్నమవుతు న్నాయని, దీనికి పరిష్కారాలు కనుగొనేందు కు సభా సంఘం ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి కోరారు. దీనికి ఉప ముఖ్య మంత్రి మహమూద్ అలీ సమాధాన మిస్తూ.. గ్రామాల్లో పంచనామాల ఆధారంగా సాదా బైనామాల రిజిస్ట్రేషన్లు జరుగుతున్నా యన్నారు. భూచట్టంలో మార్పులు, కొత్త చట్టానికి సంబంధించి నల్సార్ వర్సిటీ అధ్యయనం చేస్తోందని చెప్పారు. పేద బ్రాహ్మణులకు అండగా ఉంటాం బ్రాహ్మణుల సంక్షేమ పరిషత్‌కు రూ.100 కోట్లు కేటాయించామని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. సభలో టీఆర్ఎస్ సభ్యుడు సతీశ్‌కుమార్ వేసిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. బ్రాహ్మణ సదనం ఏర్పాటు కోసం స్థల సేకరణ కూడా పూర్తి చేశామని.. పేద బ్రాహ్మణులకు సాయం అందించేందుకు కేవీ రమణాచారి నేతృత్వం లో కమిటీ వేశామని వెల్లడించారు. ఈటలకు సభలో జన్మదిన శుభాకాంక్షలు ఆర్థిక మంత్రి ఈటలకు శాసనసభ జన్మదిన శుభాకాంక్షలు తెలిపింది. సోమవారం సభలో ప్రశ్నోత్తరాలు ముగిసిన వెంటనే ఈటలకు స్పీకర్ మధుసూదనాచారి సభ తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాసేవలో ఆయన మరిన్ని జన్మదిన వేడుకలు జరుపుకోవాలని ఆకాంక్షిం చారు. దీనికి సభలోని సభ్యులంతా బల్లలు చరుస్తూ ఈటలకు శుభాకాంక్షలు తెలిపారు. -
ఎనిమిది పద్దులకు ఓకే
⇒ శాసనసభలో సుదీర్ఘ చర్చ అనంతరం ఏకగ్రీవం ⇒ త్వరలో సమగ్ర మార్కెటింగ్ చట్టం తెస్తాం: హరీశ్‌రావు ⇒ పన్నుల వసూళ్లకు పటిష్ట చర్యలు: కడియం ⇒ రేషన్ బియ్యం అక్రమ రవాణాను అరికడతాం: ఈటల సాక్షి, హైదరాబాద్: శాసనసభ సోమవారం 8 పద్దులను ఆమోదించింది. వ్యవసాయం, రెవెన్యూ, పశు సంవర్థక, రహదారులు– భవనాలు, హోం, వాణిజ్యపన్నులు, ఎక్సైజ్, మార్కెటింగ్, పౌర సరఫరాల శాఖలకు సంబంధించి సుదీర్ఘమైన చర్చ జరిగింది. ఆయా అంశాల్లో మంత్రుల సమాధానం అనంతరం సభ వాటిని ఏకగ్రీవంగా ఆమోదించినట్లు డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి ప్రకటించారు. మార్కెటింగ్ చట్టంపై తుది కసరత్తు.. రాష్ట్రంలో సమగ్ర మార్కెటింగ్ చట్టం ఏర్పాటు కసరత్తు తుది దశకు చేరుకుందని హరీశ్‌రావు తెలిపారు. పళ్లు, కూరగాయల పంటలను రైతులు ఎక్కడైనా విక్రయించుకునే వెసులు బాటు కల్పించబోతున్నామని ప్రకటించారు. మార్కెటింగ్ పద్దుపై చర్చ అనంతరం ఆయన మాట్లాడారు. ఈ చట్టానికి సంబంధించి నల్సార్ వర్సిటీ సహకారంతో ముసాయిదా ను సిద్ధం చేసినట్టు చెప్పారు. ఈ–నామ్ మార్కెటింగ్‌లో దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో ఉందని, దీన్ని మరింత విస్తరించనున్నామని వెల్లడించారు. వసూళ్లలో మనమే నంబర్‌వన్ ప్రభుత్వం తీసుకున్న ప్రత్యేక చర్యల వల్ల రెండేళ్లుగా వాణిజ్య పన్నుల వసూళ్లలో తెలం గాణ గణనీయ వృద్ధి సాధించిందని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి చెప్పారు. 2015 ఏప్రిల్ నుంచి మార్చి 2016 నాటికి 12.85 శాతం, ఏప్రిల్ 2016 నుంచి ఫిబ్రవరి 2017 నాటికి 15.35 శాతం వృద్ధి సాధించామన్నారు. వాణిజ్య పన్నుల పద్దుపై ఆయన సీఎం పక్షాన సమాధానమిచ్చారు. పౌర సరఫరాలను ప్రక్షాళన చేస్తున్నాం ఎంత ప్రయత్నించినా సబ్సిడీ బియ్యం అక్రమ రవాణాను అరికట్టలేకపోతున్నామని మంత్రి ఈటల పేర్కొన్నారు. కానీ పీడీ యాక్టు నమోదు వంటి కఠిన చర్యలతో దానిని చాలావరకు తగ్గించామని తెలిపారు. ఆ శాఖను పూర్తిగా ప్రక్షాళన చేసేందుకు చర్యలు ప్రారంభించామన్నారు. ఆహార భద్ర త కార్డులు తగ్గించుకుని భారం వదిలించు కునే యత్నమేదీ చేయటం లేదన్నారు. నీరా ప్రవేశపెట్టే ప్రతిపాదన ఉంది తాటి, ఈత నీరాను తిరిగి అందుబాటులోకి తెచ్చే ప్రతిపాదన ప్రభుత్వ పరిశీలనలో ఉందని మంత్రి పద్మారావు తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న మద్యం దుకాణాలు, బెల్టు షాపుల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నట్టు చెప్పారు. గతేడాది బెల్టు షాపులకు సంబంధించి 2,663 కేసులు నమోదు చేశామన్నారు. ఎన్నికల కోడ్ వల్లే.. ఆర్టీసీ అప్పు తెచ్చిన నిధులతో కొన్న దాదాపు 300 బస్సులను ప్రారంభించకపోవడంపై మంత్రి మహేందర్‌రెడ్డి వివరణ ఇచ్చారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉండటం వల్లే ఆ బస్సులను పార్కింగ్ యార్డుకు పరిమితం చేయాల్సి వచ్చిందన్నారు. ఇక ఆర్టీసీ స్థలాల్లో సినిమా థియేటర్లు, పెట్రోలు బంకులు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. నియోజకవర్గానికో ఫైర్‌స్టేషన్ రాష్ట్రంలో నియోజకవర్గానికో ఫైర్ స్టేషన్ ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి నాయిని వెల్లడించారు. ఇటీవల పలువురు ఎస్సైలు ఆత్మహత్య చేసుకోవటం కలవరపె డుతోందని, దానికి కారణాలను విశ్లేషించేం దుకు దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. కొత్తగా వెటర్నరీ అంబులెన్సులు రాష్ట్రంలో పెద్ద ఎత్తున గొర్రె పిల్లల పంపిణీ పథకం ప్రారంభిస్తుండటంతోపాటు ఉన్న పశువుల వైద్యం కోసం ప్రత్యేక చర్యలు చేపట్టామని మంత్రి తలసాని తెలిపారు. మే నెల నుంచి వంద వెటర్నరీ అంబులెన్సులు ప్రారంభించనున్నామని చెప్పారు. రైతే ధర నిర్ధారించే రోజు రావాలి ఏ వస్తువుకైనా ఉత్పత్తిదారుడే ధర నిర్ణయిస్తాడని, కానీ ఆరుగాలం కష్టించి పం డించిన పంటకు రైతు ధర నిర్ణయించలేక పోవటం దారుణమని మంత్రి పోచారం ఆవేదన వ్యక్తం చేశారు. పంటకు రైతే ధర నిర్ధారించే రోజు రావాలని, స్వామినాథన్ సిఫార్సులు అమల్లోకి రావాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. వ్యవసాయానికి తక్కువ నిధులు కేటాయించారన్న విమర్శ సరికాదని.. పర్ డ్రాప్ మోర్ క్రాప్‌లో భాగంగా నాబార్డు నుంచి తెచ్చిన రూ. వేయి కోట్లు వంటి నిధులను బడ్జెట్లో చూపలేదని చెప్పారు. -
భారీగా రేషన్ బియ్యం పట్టివేత
నూజివీడు: లబ్దిదారులకు అందాల్సిన రేషన్ బియ్యం పక్కదారి పడుతున్నయానే సమాచారంతో రంగంలోకి దిగిన విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో పెద్ద ఎత్తున రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. కృష్ణాజిల్లా నూజివీడు నుంచి లారీలో తరలిస్తున్న 7 టన్నుల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్న విజిలెన్స్ అధికారులు లారీ డ్రైవర్‌ను పోలీసులకు అప్పగించారు. -
విజిలెన్స్ అధికారుల దాడి
- 123.60 క్వింటాళ్ల రేషన్ బియ్యం స్వాధీనం - ప్రముఖ వ్యాపారి హస్తం ఉన్నట్లు సమాచారం కర్నూలు (అగ్రికల్చర్): డీలర్ల నుంచి అక్రమంగా కొనుగోలు చేసిన రేషన్ బియ్యాన్ని వ్యాపారి బ్లాక్ మార్కెట్‌కు తరలించేందుకు సిద్ధం చేస్తుండగా మంగళవారం విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడి చేసి స్వాధీనం చేసుకున్నారు. కర్నూలు నుంచి ప్రతినెల వందలాది క్వింటాళ్ల రేషన్ బియ్యం గుట్టుచప్పుడు కాకుండా జిల్లా సరిహద్దులు దాటిపోతున్నాయి. విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంటు అధికారి బాబురావు ఆదేశాల మేరకు కల్లూరు శ్రీనివాసనగర్‌లోని జంగాల కొట్టాల దగ్గర ఉన్న రేకుల షెడ్‌ను తనిఖీ చేశారు. అందులో బ్లాక్‌మార్కెట్‌కు తరలించేందుకు సిద్ధం చేసిన 300 బస్తాల బియ్యాన్ని ప్రత్యేక తహసీల్దారు రామకృష్ణారెడ్డి, విజిలెన్స్ ఎన్స్‌ఫోర్‌మెంట్ సీఐ శ్రీనివాసరెడ్డి, ఎస్ఐ సుబ్బరాయుడు, విజిలెన్స్ కానిస్టేబుళ్లు శేఖర్‌బాబు, ఈశ్వరరెడ్డి, మునిస్వామి స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన 123.60 క్వింటాళ్ల బియ్యం విలువ రూ.3 లక్షలు ఉంటుందని విజిలెన్స్ తహసీల్దారు తెలిపారు. ప్రజాపంపిణీలో జరుగుతున్న అక్రమాలను అదుపు చేసేందుకు ఈ–పాస్ యంత్రాలు ఉన్నా అక్రమాలకు అడ్డకట్ట పడటం లేదు. ప్రతి నెల డీలర్లు 10 నుంచి 25 క్వింటాళ్ల వరకు బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తునే ఉన్నట్లు విమర్శలు ఉన్నాయి. బియ్యం వ్యాపారీ చరణ్ సూత్రధారి: విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్న బియ్యం ప్రముఖ బియ్యం వ్యాపారి చరణ్‌కు చెందినవిగా విజిలెన్స్ అధికారులు భావిస్తున్నారు. విజిలెన్స్ అధికారులు దాడికి వెళ్లినపుడు షెడ్ వద్ద కాపలాగా ఎరుకలి వీరన్న అనే వ్యక్తి ఉన్నారు. బియ్యం గురించి వీరన్నను ప్రశ్నించగా చరణ్ అనే వ్యాపారికి చెందిన ఈ బియ్యానికి కాపలాగా ఉన్నట్లు తెలిపారు. చరణ్ చెప్పిన వారికి డబ్బులు చెల్లిసు్తంటానని పేర్కొన్నారు. డీలర్ల నుంచి చరణ్ బియ్యం కొనుగోలు చేసి స్థానికంగా ఉండే రైస్ మిల్లులకు తరలిస్తున్నట్లు అధికారుల విచారణలో తేలింది. అంతేగాక బళ్లారి, ఇతర ప్రాంతాలకు సరఫరా చేస్తుంటాడని సమాచారం. కర్నూలు నగరంలోనే డీలర్ల నుంచి ప్రతి నెల దాదాపు 2500 క్వింటాళ్ల బియ్యం కొనుగోలు చేస్తున్నట్లు సమాచారం. కర్నూలు డీలర్లతో పాటు గ్రామీణ ప్రాంత డీలర్ల నుంచి రేషన్ బియ్యం కొనుగోలు చేసి రైస్ మిల్లులకు, ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నట్లు తెలుస్తోంది. స్వాధీనం చేసుకున్న బియ్యంపై విజిలెన్స్ అధికారులు కల్లూరు తహసీల్దారు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లతో పంచానామా చేయించారు. అనంతరం ఒక లారీ ద్వారా ఏ క్యాంపులోని సివిల్ సప్లయ్ స్టాక్ పాయింట్‌కు తరలించారు. వ్యాపారి చరణ్, ఎరుకలి వీరన్నపై కేసు నమోదు చేసి జేసీ కోర్టుకు పంపుతున్నట్లుగా విజిలెన్స్ ప్రత్యేక తహసీల్దారు రామకృష్ణారెడ్డి తెలిపారు. -
వార్డెన్, హెచ్ఎంను సస్పెండ్ చేయాలి
ఇల్లెందు: గిరిజన ఆశ్రమ పాఠశాల హాస్టల్ వార్డెన్, పాఠశాల హెడ్మాస్టర్ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు రోడ్డుపై ఆందోళన చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలం రొంపేడ్ గిరిజన ఆశ్రమ పాఠశాల వసతి గృహానికి చెందిన 11 క్వింటాళ్ల బియ్యం అక్రమంగా తరలిపోయాయి. ఈ వ్యవహారంలో వార్డెన్‌ను, హెచ్ఎంను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో విద్యార్థులు రోడ్డుపై బైఠాయించారు. విషయం తెలుసుకున్న సహాయ గిరిజన సంక్షేమ అధికారి అక్కడికి వచ్చి వారికి హామీ ఇవ్వడంతో విద్యార్థులు ఆందోళన విరమించారు. -
కస్టమ్ మిల్లింగ్ బియ్యాన్ని త్వరగా అందించండి
మిల్లర్లను కోరిన మంత్రి ఈటల సాక్షి, హైదరాబాద్: కస్టమ్ మిల్లింగ్ రైస్‌ను సాధ్యమైనంత త్వరగా అందించాలని మిల్లర్లను రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్ కోరారు. 2016–17 సంవత్సరానికి 18.27 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు అంచనా వేయగా 15.28 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు, దీనిలో 15.13 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మిల్లింగ్‌కు ఇచ్చినట్లు తెలిపారు. సోమవారం రైస్ మిల్లర్స్ అసోసియేషన్‌తో మంత్రి ఈటల సమావేశమై చర్చించారు. హాస్టళ్లకి సరఫరా చేసే సన్నబియ్యంను రైతుల నుంచి 1.2 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మిల్లర్ల ద్వారా కొనుగోలు చేయించాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో మిల్లర్లు త్వరగా కొనుగోలు చేసి బియ్యం అందించాలని కోరారు. 10 జిల్లాలు యూనిట్‌గా అన్ని మిల్లులకు ధాన్యం కేటాయించాలని మిల్లర్లు మంత్రిని కోరగా, ఈ సారి ముందే సమావేశం ఏర్పాటు చేసి సమస్యలు రాకుండా చూస్తామని మంత్రి హామీనిచ్చారు. అయితే కొంతమంది దళారులు ఈ బియ్యాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని, దానిని అరికట్టేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందన్నారు. ఇందులో భాగంగా ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్ బృందాలను మరింత బలోపేతం చేయాలని కమిషనర్‌ను మంత్రి ఆదేశించారు. ఏడాదికి బియ్యంపై రూ.2,395 కోట్ల సబ్సిడీని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని కనుక ఈ బియ్యాన్ని అమ్ముకోవద్దని ప్రజలకు సూచించారు. ఒకవేళ ఎవరికైనా రేషన్ బియ్యం అవసరం లేకపోతే కార్డులు వెనక్కు ఇచ్చివేయాలని కోరారు. -
రేషన్ బియ్యం పట్టివేత
వెలుగోడు: పట్టణంలోని జగదాంబ రైస్ మిల్లులో రేషన్ బియ్యాన్ని విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. శుక్రవారం విజిలెన్స్ ఎస్ఐ సుబ్బరాయుడు ఆధ్వర్యంలో సోదాలు నిర్వహించారు. ఈ దాడుల్లో రైస్ మిల్లులో 495 ప్యాకెట్ల రేషన్ బియ్యం ఉన్నట్లు గుర్తించి, స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని బియ్యాన్ని స్టాక్ పాయింట్‌కు తరలించారు. దాడుల్లో విజిలెన్స్ సిబ్బంది నాగభూషణం, ఈశ్వర్‌రెడ్డి, మునిస్వామి తదితరులు పాల్గొన్నారు. -
220 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
నందిగామ: లబ్ది దారులకు అందాల్సిన రేషన్ బియ్యం బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్నారనే సమాచారంతో రంగంలోకి దిగిన సివిల్ సప్లై అధికారులు, పోలీసులు రేషన్ బియ్యం తరలిస్తున్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 220 క్వింటాళ్ల రేషన్ బియ్యంతో పాటు ఓ లారీని స్వాధీనం చేసుకున్నారు. కృష్ణాజిల్లా నందిగామ నుంచి రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తున్నారనే సమాచారంతో రంగంలోకి దిగిన అధికారులు సోమవారం ఈ దాడులు నిర్వహించారు. -
విజిలెన్స్ అధికారుల దాడులు
– 107 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత – శనగపప్పు లారీ స్వాధీనం వెల్దుర్తి రూరల్ : విజిలెన్స్ అధికారులు ఆకస్మిక దాడులతో హడలెత్తించారు. వెల్దురి, పట్టణ పరిసరాల్లో సోమవారం రాత్రి దాడులు చేసి అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యం, బిల్లులు లేకుండా సరుకు రవాణా చేస్తున్న వాహనాలను సీజ్ చేశారు. విజిలెన్స్ ఐఓపీ రామకృష్ణాచారి, ఎన్ఫోర్స్మెంట్ కార్యాలయం కర్నూలు రీజనల్ విజిలెన్స్ అధికారి బాబురావు విడివిడిగా దాడులు చేశారు. మంగళవారం విజిలెన్స్ తహసీల్దార్ రామకృష్ణ, వెల్దుర్తి ఆర్ఐ సహేరాబానులు పంచనామా నిర్వహించారు. అనంతరం వివరాలను మీడియాకు వివరించారు. పాతబస్టాండు నుంచి కర్నూలుకు వెళ్లేదారిలో ఇండేన్ గ్యాస్ ఆఫీస్ వెనుక నిర్మాణంలో ఉన్న ఇంటిలో బియ్యం మాఫియా నిల్వ చేసిన బియ్యం బస్తాలను గుర్తించారు. 221 సంచుల్లో 107క్వింటాళ్ల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ బియ్యాన్ని సేకరించిన మారెన్నపై కేసు నమోదు చేశారు. స్వాధీనం చేసుకున్న బియ్యాన్ని వెల్దుర్తి రెవెన్యూ విభాగానికి అప్పగించారు. పంచనామాలో హెడ్ కానిస్టేబుల్ నరేష్, సుబ్బరాయుడు, శేఖర్, వీఆర్ఓ సునీల్, వీఆర్ఏలు పాల్గొన్నారు. కర్నూలు రీజనల్ విజిలెన్స్ ఆఫీసర్ బాబూరావు జరిపిన దాడుల్లో బిల్లులు సరిగా లేని మూడు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. 20టన్నుల శనగపప్పులోడ్ లారీ, దుస్తులు తరలిస్తున్న ఆటో, నాపబండల లోడ్‌తో వెళు్తన్న ఐచర్ వాహనాన్ని తమకు అప్పగించినట్లు ఎస్ఐ తులసీనాగప్రసాద్ తెలిపారు. -
పేదల బియ్యం పట్టివేత
డోన్ టౌన్ : దారిమళ్లుతున్న పేదల బియ్యాన్ని విజిలెన్స్ అధికారులు..బుధవారం స్వాధీనం చేస్తున్నారు. పట్టణ శివారులోని కొత్తపల్లె పారిశ్రామిక ప్రాంతంలో ఏపీ21పీవై 9534 నెంబరు గల అప్పీ ఆటోలో 44 క్వింటాళ్ల 40 కేజీల తరలిస్తుండగా అధికారులు దాడులు చేశారు. బియ్యంతోపాటు ఆటోను సీజ్ చేశారు. ఈ దాడుల్లో విజిలెన్స్ ఎస్ఐ సుబ్బరాయుడు, తహసీల్దార్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. కృష్ణగిరి మండలానికి చెందిన ఒక అధికార పార్టీ నాయకుడి అండదండలతో రేషన్ బియ్యం అక్రమ తరలింపు యథేచ్ఛగా జరుగుతోందనే ఆరోపణలున్నాయి. ఒక చిన్న రేకుల షెడ్డును నిర్మించి రోజూ కొనుగోలు చేసిన బియ్యాన్ని, ఇక్కడి నుంచి లారీల్లో కర్ణాటక, మహారాష్ట్రకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నట్లు తెలిసింది. బుధవారం పట్టుబడిన బియ్యాన్ని స్థానిక రెవెన్యూ అధికారులు మధుసుధాకర్, ధర్మవరం కృష్ణమూర్తి ఆధ్వర్యంలో పంచనామా జరిపి మండల స్టాక్ పాయింట్లో భద్రపరిచారు. ఇదిలా ఉండగా..ఈ ఏడాది జిల్లా విజిలెన్స్, రెవెన్యూ అ«ధికారులు డోన్‌లో ఔదు సార్లు దాడులు జరిపి పెద్దమొత్తంలో బియ్యం స్వాధీనం చేసుకున్నారు. అయినా అక్రమ రేషన్ బియ్యం వ్యాపారం కొనసాగుతూనే ఉంది. -
లావణ్య మళ్లీ అరెస్టు
కర్నూలు: జిల్లా పౌర సరఫరాల శాఖ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేసిన లావణ్యను బియ్యం స్వాహా కేసులో రెండో సారి పోలీసులు అరెస్టు చేశారు. ప్రజాపంపిణీ ద్వారా పేదలకు అందించాల్సిన సబ్సిడీ సరుకులను డీలర్లు, కంప్యూటర్ ఆపరేటర్లు కుమ్మక్కై నల్ల బజారుకు తరలించి సొమ్ము చేసుకున్నారు. శ్రీశైలానికి చెందిన చౌక డిపో డీలర్ చెరుకూరి మల్లికార్జున లావణ్యతో కలసి ఈ స్కామ్‌కు తెర తీసిన సంగతి తెలిసిందే. నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అజయ్‌కుమార్ పాండేను కూడా పోలీసులు అరెస్టు చేసి కటకటాలకు పంపారు. కర్నూలు నగరంలోని అశోక్‌నగర్‌కు చెందిన లావణ్య ఎన్ఐసీ కార్యాలయంలో పనిచేస్తున్న స్వప్న డీలర్లతో కుమ్మక్కై స్కామ్ వ్యవహారాన్ని నడిపించారు. ఒక్కొక్క డీలర్ నుంచి రూ.10 వేలు అడ్వాన్స్, రూ.5 వేలు మామూళ్ల కింద ఒప్పందం కుదుర్చుకుని 2016 ఏప్రిల్ నుంచి జులై దాకా బోగస్ వ్యవహారాన్ని నడిపించారు. ఈ కేసును మొదట సీసీఎస్ పోలీసులు దర్యాప్తు చేసి అందుకు బాద్యులైన లావణ్య, అజయ్‌కుమార్ పాండేలను అరెస్టు చేశారు. బెయిల్‌పై నుంచి విడుదల కాగానే రెండో సారి అర్బన్ ఏఎస్ఓ ఫిర్యాదు మేరకు ఒకటవ పట్టణ సీఐ కృష్ణయ్య వారిని పాతబస్టాండ్ సమీపంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద అరెస్టు చేశారు. వారిపై ఐపీసీ 409, 420, ఐటీ ఆక్ట్ 66 కింద కేసు నమోదు చేసి కటకటాలకు పంపినట్లు తెలిపారు. -
రేషన్ బియ్యానికి కొత్తరంగు
–పేదలకు ఇచ్చే బియ్యానికే మరో ధర కిలో రూ.23.50 - తెల్లకార్డు లేనివారిపై ప్రభుత్వం చూపుతున్న ఉదారత – జిల్లాకు 6 వేల టన్నుల కోటా విడుదల అనంతపురం అర్బన్ : తెల్లకార్డు లేని వారికి ఆధార్ కార్డు ద్వారా కిలో బియ్యం రూ.23.50 పైసలకు ఇస్తామని ప్రభుత్వం ఎంతో ఉదారత చూపింది. ఈ ప్రకటన వినగానే ప్రజలు కూడా ఎంతగానో సంతోషించారు. మార్కెట్ ధర కంటే తక్కువగా వస్తాయని ఆశించారు. అయితే అసలు తిరకాసు ఇక్కడే ఉంది. ఆధార్ కార్డుకి ఇచ్చేది మసూరి బియ్యమో లేక బీపీటీ రకం కాదు.... అసలు సిసలైన రేషన్ బియ్యం. ప్రస్తుతం దారిధ్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు తెల్లరేషన్ కార్డుకు కిలో రూపాయి ఇస్తున్న బియ్యాన్ని కార్డు లేనివారికి రూ.23.50 పైసలకు ఇచ్చేందుకి సిద్ధపడింది. ఈ ధరతో విక్రయించేందుకు జిల్లాకు ఆరు వేల టన్నలు బియ్యం విడుదల చేసింది. కిలో రూ.23.50 ప్రకారం చూస్తే వీటి విలువ రూ.14.10 కోట్లు. ఇదో రకం ప్రభుత్వ వ్యాపారం రేషన్ బియ్యాన్ని కార్డులు లేని ప్రజలకు ఇచ్చేందుకు ప్రభుత్వం తన తరహాలో వ్యాపారానికి తెరలేపినట్లు స్పష్టమవుతోంది. రూపాయికి ఇస్తున్న బియ్యాన్ని అధిక ధరకు విక్రయించేందుకు సిద్ధపడినట్లు తెలుస్తోంది. వాస్తవంగా తెల్లకార్డులకు ఇస్తున్న బియ్యాన్ని ప్రభుత్వం కిలో రూ.27తో కొనుగోలు చేస్తుంది. రూ.26 సబ్సిడీతో రూపాయికి అందజేస్తోంది. ఈ లోటును పూడ్చుకునేందుకు తెల్లకార్డు లేనివారికి ఆధార్ కార్డు ద్వారా కిలో బియ్యం రూ.23.50 పైసలకు ఇవ్వాలనే నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా జిల్లాకు 6 వేల టన్నుల బియ్యం కోటాని విడుదల చేసింది. ఈ మేరకు జిల్లాలో రూ.14.10 కోట్ల వ్యాపారానికి శ్రీకారం చుట్టింది. కిలో బియ్యం రూ.23.50 ప్రకారం ఆరు వేల టన్నులు విక్రయిస్తే రూ.14.10 కోట్లు వస్తుంది. ఇలా సబ్సిడీ ద్వారా వచ్చే మొత్తంతో లోటును ప్రభుత్వం భర్తీచేయనుంది. -
పక్కా దగా..
ముఠాలుగా ఏర్పడి ధనార్జనే ధ్యేయంగా దందా నిలువరించని సాంకేతిక పరిజ్ఞానం పౌర సరఫరాల శాఖలో వేళ్లూనుకున్న అక్రమాలు తూతూమంత్రంగా తనిఖీలు పేదలకు పూర్తిస్థాయిలో అందని బియ్యం బినామీ పేర్లతో రేషన్ బియ్యం పక్కదారి పేదల బియ్యం పక్కదారిపడుతోంది. రూపాయికి కిలోబియ్యం పథకం కొందరికి కాసులు కురిపిస్తోంది. పక్కా ప్రణాళికతో సాగుతోన్న ఈ గోల్మాల్ దందాతో రూ.కోట్లు వెనకేసుకుంటున్నారు. జిల్లాలో డీలర్ల పేరుతో సాగుతున్న ఈ బినామీల దందా వెనుక పెద్దల హస్తాలున్నట్లు తెలుస్తోంది. సరుకులు దారి మళ్లిస్తున్న ఈ వ్యవహారంపై తనిఖీలు తూతూమంత్రంగా నిర్వహిస్తూ తమవంతు సహకరిస్తున్నారు కొందరు అధికారులు. పౌర సరఫరాల శాఖలో అక్రమాలను అరికట్టేందుకు ప్రభుత్వం అమలుచేస్తున్న జియో ఫెన్సింగ్ సాంకేతిక పరిజ్ఞానం కూడా ఈ దగాను ఏమాత్రం నిలువరించలేకపోతోంది. మహబూబ్‌నగర్ న్యూటౌన్ : వ్యవస్థలో ఉన్న లోటుపాట్లను కొందరు తమకు అనుకూలంగా మార్చుకొని పేదల బియ్యాన్ని నొక్కేసి సొమ్ము చేసుకుంటున్నారు. పౌర సరఫరాల శాఖ, రెవెన్యూ శాఖలతో పాటు జియోఫెన్సింగ్ యాప్ కూడా పనిచేస్తున్నప్పటికీ పరిస్థితిలో మాత్రం మార్పు రావడంలేదు. దొడ్డిదారిన బియ్యం తరలిపోతున్నా అక్రమాలను కట్టడి చేయడానికి అధికారులు సాహసించడం లేదు. ప్రజల అమాయకత్వాన్ని ఆసరా చేసుకున్న దళారులు రెచ్చిపోయి బియ్యాన్ని దారి మళ్లిస్తున్నారు. ప్రతినెల చౌకధర దుకాణాల ద్వారా పేదలకు చేరాల్సిన బియ్యాన్ని దళారులు ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నా అధికారులు పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. అక్రమాలను అరికట్టాల్సిన అధికారులు అవినీతి మత్తులో జోగుతున్నారనే ఆరోపణలున్నాయి. మహబూబ్‌నగర్ జిల్లాలో మొత్తం 3,66,813 రేషన్ కార్డులున్నాయి. అందులో 3,39,393 ఆహార భద్రత కార్డులు, 27,164 అంత్యోదయ కార్డులు, 256 అన్నపూర్ణ కార్డులున్నాయి. ఆహార భద్రత కింద కుటుంబంలో ఎంతమంది సభ్యులున్నా సీలింగ్ విధించకుండా ప్రభుత్వం ప్రతి ఒక్కరికీ 6కిలోల చొప్పున బియ్యం సరఫరా చేస్తుంది. ప్రతినెల 8222 మెట్రిక్ టన్నుల బియ్యం సరఫరా అవుతోంది. జిల్లాకేంద్రం మహబూబ్‌నగర్ పట్టణంలోనే మొత్తం 86 రేషన్ డీలర్ షాపులు ఉన్నాయి. ఒకరిద్దరి చేతుల్లోనే దాదాపు 37డీలర్ షాపులు నడుస్తున్నట్లు సమాచారం. గత నాలుగేళ్లుగా కొత్త డీలర్ల నియామకాలు లేకపోవడంతో కొంతమందికి ఇన్ చార్జ్ బాధ్యతలు అప్పగించారు. ఇన్ చార్జ్ లుగా వ్యవహరిస్తున్న కొందరు డీలర్లు ఇదే అదనుగా భావించి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ బియ్యం అక్రమాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలున్నాయి. జియో ఫెన్సింగ్యాప్ ఉఫ్... పౌర సరఫరాల శాఖలో బియ్యం సరఫరా, పంపిణీకి ప్రభుత్వం ప్రత్యేకంగా అమలు చేస్తున్న జియోఫెన్సింగ్ యాప్ ఆశించిన ఫలితాన్నివ్వడం లేదు. బియ్యాన్ని సరఫరా చేసే లారీలకు జియో మ్యాపింగ్ చేశారు. డీలర్లు, గోదాం అధికారులు, పౌర సరఫరాల అధికారుల ఫోన్ నెంబర్లకు ఈ జియో ఫెన్సింగ్ యాప్‌ను అనుసంధానించారు. గోదాం నుంచి బియ్యం లారీ బయలుదేరి స్టేజ్–2 అధికారి పర్యవేక్షణలో ఎంఎల్ఎస్ పాయింట్‌కు చేరుతుంది. లారీ బయలుదేరడం, ఎంఎల్ఎస్ పాయింట్‌కు చేరడం వంటి ప్రక్రియ జియోఫెన్సింగ్ యాప్‌లో నమోదవుతుంది. ఎంఎల్ఎస్ పాయింట్ నుంచి చౌకధర దుకాణాలకు చేరిన వెంటనే సంబందింత డీలర్ సంతకం చేసి బియ్యాన్ని స్టాక్ చేసుకుంటారు. ఈ ప్రక్రియ మొత్తం సంబందిత యాప్ సర్వర్‌లో నమోదు చేస్తారు. దీంతో స్టాక్ వచ్చినట్లు లబ్ధిదారులకు, అధికారులకు సమాచారం వెళ్తుంది. అలా లారీ బయలుదేనప్పటి నుంచి ఎక్కడెక్కడ వెళ్లిందనేది తెలుస్తుంది. ఇంతమంచి వ్యవస్థ ఉన్నా కేవలం యాప్‌ను సక్రమంగా వినియోగించకపోవడం వల్లే బియ్యం అక్రమాలు యథేచ్ఛగా సాగుతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. ధనార్జనే లక్ష్యంగా.. రూపాయికి కిలో బియ్యం అందజేసి పేదవారి కడుపు నింపాలనే ప్రభుత్వ ఆశయానికి అక్రమార్కులు తూట్లు పొడుస్తున్నారు. అక్రమార్జనకు అలవాటు పడిన కొందరు బినామీ డీలర్లు రూ.12నుంచి రూ.14ల వరకు బియ్యాన్ని దళారులకు విక్రయిస్తున్నారు. జిల్లాలో కొందరు వ్యక్తులు ఇదే పనిగా తిరుగుతున్నారు. కొనుగోలు చేసిన రేషన్ ను పక్కాప్లాన్ తో ప్యారా బాయిల్డ్ రైస్‌మిల్లులకు చేరుస్తున్నారు. రాత్రికిరాత్రే బియ్యాన్ని సన్నబియ్యంగా మార్చి బహిరంగ మార్కెట్‌కు తరలిస్తున్నారు. ప్రభుత్వానికే తిరిగి రూ.30 చొప్పున విక్రయిస్తున్నారని తెలుస్తోంది. ముఠాగా ఏర్పడి రూ.కోట్ల దందా.. పేదల బియ్యాన్ని మార్కెట్లోకి తెచ్చేందుకు జిల్లాలో పెద్ద ముఠానే పనిచేస్తోంది. దీనంతటికీ కల్వకుర్తిలోని ఓ బియ్యం మిల్లు వ్యాపారి ఏజెంటుగా వ్యవహరిస్తున్నారు. మహబూబ్‌నగర్, అలంపూర్, గద్వాల, జడ్చర్లలో కొందరు బడావ్యక్తుల ద్వారా ఈ అక్రమ వాపారాన్ని సాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారానికి అడ్డు చెప్పకుండా జిల్లాస్థాయిలో కొందరు అధికారులకు ప్రతినెలా కొంత మొత్తాన్ని ముట్టజెప్పి మేనేజ్ చేస్తున్నట్లు సమాచారం. కఠిన చర్యలు తీసుకుంటాం పేదలకు ఆహార భద్రత కింద అందజేస్తున్న బియ్యాన్ని అక్రమంగా దారి మళ్లిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. డీలర్ షాపులపై డిసెంబర్ నుంచి పర్యవేక్షణ పెంచుతాం. పౌర సరఫరాల శాఖ విభజన ఇంకా పూర్తికాలేదు. ఉమ్మడి జిల్లా కేటాయింపులే ఉన్నాయి. ఈనెలాఖరులోగా విభజన పూర్తవుతుంది. చిన్న జిల్లాలో మా టీంతో రేషన్ షాపులపై నిరంతర పర్యవేక్షణ పెంచుతాం. డీలర్లు అక్రమాలకు పాల్పడితే చర్యలు తీసుకుంటాం. బినామీ దందాను ఎట్టి పరిస్థితుల్లో సహించబోం. - శారదా ప్రియదర్శిని, డీఎస్ఓ -
17 టన్నుల రేషన్ బియ్యం స్వాధీనం
తిరువళ్లూరు: అక్రమంగా ఆంధ్రాకు తరలించడానికి సిద్ధంగా ఉంచిన 17 టన్నుల రేషన్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తిరువళ్లూరు జిల్లా ఆవడి సమీపంలోని సెట్టిమేడు ప్రాంతంలో రేషన్ బి య్యాన్ని లారీలో తరలించడానికి సిద్ధంగా ఉంచినట్టు డీఎస్పీ సదాశివంకు రహస్య సమాచారం అందింది. డీఎస్పీ సూచన మేరకు ఇన్స్పెక్టర్ పూ మారన్ నేతృత్వం లోని పోలీసులు ఆకస్మికంగా తనిఖీలు ని ర్వహించారు. తనిఖీల్లో అక్కడ అనుమానాస్పదంగా ఆగి ఉన్న లారీని పరిశీలించగా అందులో రేషన్ బియ్యం ఉన్నట్టు గుర్తించారు. విచారణలో బియ్యానికి సంబంధించిన వ్యక్తులు ఎవ్వరూ రాకపోవడంతో లారీ యజమాని సెల్వకుమార్‌ను అరెస్టు చేసిన పోలీసులు లారీని సీజ్ చేశారు. ఈ సంఘటనపై డీఎస్పీ సదాశివం మాట్లాడుతూ సరిహద్దు ప్రాంతాల్లో అక్రమంగా బియ్యాన్ని తరలించే వారిపై నిఘా ఉంచుతామని డీఎస్పీ స్పష్టం చేశారు. ప్రస్తుతం 17 టన్నుల రేషన్ బియ్యాన్ని పట్టుకున్నట్టు వివరిస్తూ అధికారుల ఆదేశం మేరకు వాటిని ఫుడ్‌సెల్ గోదాములో అప్పగించినట్టు డీఎస్పీ తెలిపారు. -
38 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
జంగారెడ్డిగూడెం : స్థానిక బుట్టాయగూడెం రోడ్డులోని ఒక షాపులో అక్రమంగా నిల్వచేసిన 38 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని ఎస్ఐ ఎం.కేశవరావు తమ సిబ్బందితో దాడిచేసి బుధవారం పట్టుకున్నారు. ఈ బియ్యాన్ని రెవెన్యూ అధికారులకు అప్పగించారు. సివిల్ సప్లయిస్ డీటీ డి.వి.సత్యనారాయణ, వీఆర్వోలు రవి, గఫూర్ , ఎస్కే వలి, కె.రవి బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసినట్టు డీటీ సత్యనారాయణ వెల్లడించారు. -
గుట్టు రట్టు
- 'రేషన్ బియ్యం’ పంపిణీలో అక్రమాలు – క్లోజింగ్ బ్యాలెన్స్‌లో మాయాజాలం – కంప్యూటర్ ఆపరేటర్ల చేతివాటం – ఈ–పాస్ యంత్రాన్ని బైపాస్ చేసి సరుకులు స్వాహా – ఈ స్కామ్ ముద్దుపేరు 'స్కీమ్' – ముగ్గురు డీలర్లు, ఎన్ఐసీ సాఫ్ట్వేర్ ఇంజనీర్, డేటా బేస్ అడ్మినిస్ట్రేటర్, డీఎస్ఓ కార్యాలయం మాజీ ఆపరేటర్ అరెస్ట్ కర్నూలు: చౌక ధరల దుకాణాల్లో అక్రమాల నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం అమలులోకి తెచ్చిన ఈ–పాస్ యంత్రాలను బైపాస్ చేసి సరుకులను స్వాహా చేసి సొమ్ము చేసుకున్న ముఠా గుట్టు రట్టయ్యింది. డీలర్లు, కంప్యూటర్ ఆపరేటర్లు కుమ్మక్కై ప్రజాపంపిణీ ద్వారా పేదలకు అందించాల్సిన సబ్సిడీ సరుకులను నల్లబజారుకు తరలించి సొమ్ము చేసుకున్నారు. శ్రీశైలంలో తీగ లాగితే కర్నూలులో డొంక కదిలింది. శ్రీశైలానికి చెందిన చౌక డిపో డీలర్ చెరుకూరి మల్లికార్జున డీఎస్ఓ కార్యాలయ ఆపరేటర్ లావణ్య మొదటగా ఈ స్కామ్‌కు తెర తీశారు. ఈ–పాస్ యంత్రాల ద్వారా సరుకు బోగస్ లావాదేవీల గురించి డీఎస్ఓ తిప్పేనాయక్ ప్రాథమిక విచారణ జరిపి ఈనెల 3వ తేదీన శ్రీశైలం రెండో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ కేసును సీసీఎస్ డీఎస్పీ హుసేన్‌పీరా నేతృత్వంలో దర్యాప్తు చేసి అందుకు బాధ్యులైన శ్రీశైలానికి చెందిన ముగ్గురు డీలర్లు సి.హెచ్.మల్లికార్జున, మిద్దె నాగమల్లయ్య, ఎర్ర చిన్నమల్లికార్జున, నేషనల్ ఇన్ఫర్మాటిక్ సెంటర్ (ఎన్ఐసీ, హైదరబాదు) సాఫ్ట్వేర్ ఇంజనీర్ అజయ్‌కుమార్ పాండే, డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ మువ్వ స్వప్న, డీఎస్ఓ కార్యాలయం మాజీ కంప్యూటర్ ఆపరేటర్(కర్నూలు అశోక్‌నగర్) ఎస్.లావణ్య తదితరులను అరెస్టు చేసి ఎస్పీ ఆకే రవికృష్ణ ఎదుట హాజరుపరిచారు. సోమవారం సాయంత్రం జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో సీసీఎస్ డీఎస్పీ హుసేన్ పీరాతో కలసి విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలను ఎస్పీ వెల్లడించారు. అక్రమాలు ఇలా.. హైదరాబాదులోని ఎన్ఐసీ కార్యాలయంలో పనిచేస్తున్న స్వప్న డీఎస్ఓ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్న లావణ్య డీలర్లతో కుమ్మక్కై ఈ స్కామ్ వ్యవహారం నడిపించారు. శ్రీశైలానికి చెందిన చెరుకూరి మల్లికార్జున ఇందుకు ప్రధాన సూత్రధారి. కర్నూలులో నలుగురు, తూర్పుగోదావరిలో ఒకరు, ప్రకాశం జిల్లాలో ఒకరు, వైజాగ్‌లో 12 మంది డీలర్లు ఈ స్కీమ్‌లో చేరి అక్రమాలకు పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో బయటపడింది. ఒక్కొక్క డీలర్ నుంచి రూ.10 వేల అడ్వాన్స్, నెలకు రూ.5 వేలు మామూళ్లు ఇచ్చే విధంగా ఒప్పందం కుదుర్చుకుని 2016 ఏప్రిల్ నుంచి జులై దాకా 'బోగస్' వ్యవహారాన్ని నడిపించారు. హైదరాబాదులోని ప్రధాన కార్యాలయం(ఎన్ఐసీ)లో పనిచేస్తున్న డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ స్వప్న ఆన్లైన్లో క్లోజింగ్ బ్యాలెన్స్‌ను తగ్గించి చూపించి సరుకు పంపిణీ అయినట్లుగా డేటాను సర్దుబాటు చేసి అందుకు భారీగా మామూళ్లు దండుకుంది. సర్దుబాటు చేసిన సరుకుల్లో 50 శాతం వాటా డబ్బులు ఇచ్చే విధంగా మాట్లాడుకుని డీలర్ మల్లికార్జున ఆపరేటర్ లావణ్య ద్వారా ఈ వ్యవహారాన్ని నడిపించారు. మొత్తం 18 దుకాణాల్లో ఈ–పాస్ మిషన్లు బైపాస్ చేసి సరుకులను పక్కదారి పట్టించినట్లు విచారణలో వెలుగు చూసింది. బయటపడింది ఇలా.. శ్రీశైలానికి చెందిన డీలర్ మల్లికార్జున ఈ స్కీమ్‌లో చేరిన మిగిలిన డీలర్లతో నెలనెలా వసూలు చేసిన డబ్బులను లావణ్య అకౌంట్‌కు జమ చేశారు. అందులోనుంచి ఎన్ఐసీ డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ స్వప్న సోదరుని అకౌంట్‌కు ఒకసారి రూ.3 లక్షలు, రెండవసారి రూ.3 లక్షలు నగదు రూపేణ జమ చేసినట్లు బయటపడింది. రెండు నెలల క్రితమే విషయం వెలుగులోకి రావడంతో లావణ్య ఉద్యోగానికి రాజీనామా చేసి ఎన్ఐసీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అజయ్‌కుమార్ పాండే (ఉత్తరప్రదేశ్ వాసి)తో పరిచయం పెంచుకుని తెర వెనుక ఉండి వ్యవహారాన్ని నడిపించింది. సంవత్సరానికి అడ్వాన్స్‌గా రూ.9,60,000 పాండే బ్యాంక్ అకౌంట్‌కు 'ఎన్ఈఎఫ్టీ' ద్వారా నగదు పంపినట్లు పోలీసు విచారణలో బయటపడింది. లావణ్య పంపిన డీలర్ల వివరాల మేరకు ఆన్లైన్లో వారి క్లోజింగ్ బ్యాలెన్స్‌ను సర్దుబాటు చేసి సరుకులను మిగిల్చి లాభం చేకూర్చారు. కర్నూలు, అనంతపురం, విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల్లో 'బోగస్' లావాదేవీల వ్యవహారం పెద్ద ఎత్తున జరిగినట్లు దర్యాప్తులో తేలింది. దర్యాప్తు కొనసాగుతోంది: ఎస్పీ ఈ–పాస్ యంత్రాన్ని బైపాస్ చేసి రేషన్ బియ్యాన్ని స్వాహా చేసిన ముఠా వ్యవహారంపై దర్యాప్తు కొనసాగుతోంది. కార్డుదారులకు పంపిణీ చేయగా మిగిలిన సరుకుల(క్లోజింగ్ బ్యాలెన్స్)ను ఆన్లైన్లో సర్దుబాటు చేసి డీలర్లు, కంప్యూటర్ ఆపరేటర్లు సగంసగం పంచుకున్నట్లు విచారణలో బయటపడింది. ఈ బోగస్ వ్యవహారం జిల్లాలో పెద్ద ఎత్తున జరిగినట్లు ప్రాథమికంగా సమాచారముంది. ఇప్పటివరకు ఈ వ్యవహారంలో రూ.20 లక్షలకు పైగా చేతులు మారాయి. ఇందుకు బాధ్యులైన ఆరుగురిపై ఐపీసీ 420, 409, ఐటీ యాక్ట్ 66 కింద కేసులు నమోదు చేసి కటకటాలకు పంపాం. ప్రజల సొమ్మును దోచుకుంటే ఎవరినీ వదిలేది లేదు. డీఎస్పీ స్థాయి అధికారి బోగస్ వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్నారు. ఈ ముఠా వెనుక ఎవరెవరు ఉన్నారనే విషయం త్వరలో బయటపడుతుంది. కర్నూలు జిల్లాలో సుమారుగా మూడు వందల మందికి పైగా డీలర్లు ఈ స్కామ్‌లో చేరినట్లు ప్రాథమికంగా సమాచారముంది. పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి ఈ స్కీమ్ వ్యవహారాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి బాధ్యులైన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. -
232 బస్తాల చౌక బియ్యం పట్టివేత
సత్తెనపల్లి: చౌక దుకాణాల నుంచి రేషన్ బియ్యం అక్రమంగా సేకరించి రీసైక్లింగ్ ద్వారా ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు సమాచారం అందడంతో సోమవారం దాడులు నిర్వహించారు. డీఎస్పీ వి.వి.రమణ కుమార్ నేతృత్వంలో సీఐ ఎన్.కిషోర్‌బాబు సత్తెనపల్లి మండలం కొమెరపూడిలోని విఘ్నేశ్వర ట్రేడర్స్ రైస్‌మిల్లులో ఈమేరకు తనిఖీలు చేపట్టారు. అప్పుడే లారీలో వచ్చిన బియ్యాన్ని దాడి చేసి పట్టుకున్నారు. మిల్లులో 202 తెల్లగోతాల్లో, 30 గన్ని బ్యాగులో రేషన్ బియ్యాన్ని గుర్తించారు. మొత్తం రూ. 3 లక్షలు విలువ చేసే 116 క్వింటాళ్ళ చౌక బియ్యన్ని పట్టుకున్నారు. ఇదే మిల్లులో గత జూన్‌లో కూడా దాడి చేసి బియ్యం పట్టుకుని కేసు నమోదు చేయడంతోపాటు, సీజ్ చేసినట్లు డీఎస్పీ రమణకుమార్ తెలిపారు. ఎక్కడైనా చౌక బియ్యం ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నట్లయితే విజిలెన్స్ ఎస్పీ 80082 03288, డీఎస్పీ 80082 03289, సీఐ 80082 03291 నెంబర్లకు తెలియజేయాలని కోరారు. దాడుల్లో విజిలెన్స్ ఏఓ కె.వెంకటరావు, కానిస్టేబుళ్ళు నాంచారయ్య, నాగేశ్వరరావు, రాము, రాంబాబు, రెవెన్యూ ఇన్స్పెక్టర్ దరియావలి, గ్రామ రెవెన్యూ అధికారులు తదితరులు ఉన్నారు. -
రేషన్ బియ్యం పట్టివేత
రేషన్ బియ్యాన్ని అక్రమంగా నల్లబజారుకు తరలిస్తున్నారనే సమాచారంతో దాడులు నిర్వహించిన విజిలెన్స్ అధికారులు 77 క్వింటాళ్ల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం మల్లారం గ్రామంలో సోమవారం ఉదయం చోటుచేసుకుంది. గ్రామం నుంచి 144 బస్తాల్లో రేషన్ బియ్యాన్ని తరలిస్తుండగా.. పోలీసుల సాయంతో దాడులు నిర్వహించిన విజిలెన్స్ అధికారులు బియ్యాన్ని స్వాధీనం చేసుకొని తరలిస్తున్న వ్యక్తిని పోలీసులకు అప్పగించారు. -
అక్రమంగా తరలిస్తున్న బియ్యం పట్టివేత
అక్రమంగా తరలిస్తున్న ఏడు క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పట్టుకున్నారు. శుక్రవారం ఉదయం మామునూర్లో వాహన తనిఖీలు చేపట్టిన అధికారులు ఆటోలో తరలిస్తున్న బియ్యాన్ని పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఇద్దరిపై కేసు నమోదు చేసి ఆటో సహా బియ్యాన్ని పోలీస్ స్టేషన్లో అప్పగించారు. -
13 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
ఖానాపూర్: రేషన్ బియ్యాన్ని అక్రమంగా నిల్వ ఉంచిన మూడు కిరాణం దుకాణాలపై దాడులు నిర్వహించిన అధికారులు 13 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్వాదీనం చేసుకున్నారు. అదిలాబాద్ జిల్లా ఖానాపూర్ మండల కేంద్రంలో పలు కిరాణ దుకాణాలలో రేషన్ బియ్యం విక్రయిస్తున్నారనే సమాచారంతో రంగంలోకి దిగిన విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు శుక్రవారం దాడులు నిర్వహించి మూడు దుకాణాలలో నిల్వ ఉంచిన 26 బస్తాల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకొని కేసులు నమోదు చేశారు. -
రేషన్ బియ్యం పట్టివేత
అక్రమ తరలింపును అడ్డుకున్న స్థానికులు ఆత్మకూరురూరల్ : పేద ప్రజలకు అందాల్సిన రేషన్ బియ్యాన్ని గోడౌన్ అధికారులు, డీలర్లు, ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్లు కుమ్మక్కై అక్రమంగా తరలిస్తుండగా, స్థానికులు అడ్డుకుని అధికారులకు పట్టించారు. ఈ సంఘటన బుధవారం ఆత్మకూరులో జరిగింది. బుధవారం ఉదయం 10 గంటలకు డీసీఎం మినీలారీలో 18వ నంబరు రేషన్ దుకాణానికి 105 బస్తాల బియ్యం సరఫరా చేస్తూ రసీదుతో సహా పంపారు. అయితే ఈ వాహనం 18వ నంబరు రేషన్ దుకాణం వరకు వచ్చినా, అక్కడ సరుకు దించకుండా సమీపంలోని రైస్‌మిల్లు వద్దకు వెళ్తుండగా పసిగట్టిన స్థానికులు అడ్డుకుని అధికారులకు సమాచారం అందించారు. దీంతో లారీడ్రైవర్ పరారయ్యాడు. స్థానిక ఇన్చార్జి తహసీల్దారు సారంగపాణి, వీఆర్ఓలు కేశవమూర్తి, మురళి తదితరులు సంఘటనా స్థలానికి చేరుకుని వాహనంతో సహా బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన 5,250 కేజీల బియ్యం (105 బస్తాలు) రేషన్ బియ్యమేనని అధికారులు ధ్రువీకరించారు. అయితే రసీదు మేరకు 18వ నంబరు రేషన్ డీలర్ దుకాణంలో లేరు. విచారించగా ఆయన చెన్నైకు వెళ్లారని అధికారులు తెలుసుకుని ఫోన్లో సంప్రదించారు. తనకు 45 బస్తాల బియ్యం రావాల్సి ఉందని, తాను ఊర్లో లేనందున మరో రోజు పంపాలని కోరినట్లు ఆయన వివరించారు. తహసీల్దారు సిబ్బందితో కలిసి రేషన్ దుకాణంలో స్టాక్‌ను పరిశీలించారు. పట్టుబడిన లారీ, బియ్యం సహా ఎంఎల్ఎస్ పాయింట్‌కు తరలించారు. అక్కడ గోదాముల్లో స్టాకును పరిశీలించారు. ఈ మేరకు 6ఏ కేసు నమోదు చేసినట్లు తహసీల్దారు సారంగపాణి తెలిపారు. -
రేషన్ బియ్యం పట్టివేత
విజయవాడ (భవానీపురం) : ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా సరఫరా చేసే రేషన్ బియ్యాన్ని అక్రమంగా రవాణా చేస్తుండగా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పట్టుకున్నారు. విజిలెన్స్ అధికారుల కథనం మేరకు.. కోదాడ నుంచి కాకినాడకు 170 క్వింటాళ్ల రేషన్ బియ్యం అక్రమంగా రవాణా జరుగుతోందన్న సమాచారాన్ని అందుకున్న అధికారులు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్పీ ఎం.రవీంద్రనాథ్‌బాబు ఆదేశాల మేరకు డీఎస్పీ ఆర్.విజయపాల్ నేతృత్వంలో సిబ్బంది భవానీపురం బైపాస్ రోడ్లో కాపు కాశారు. ఉదయం 11.30 గంటల సమయంలో బియ్యం లోడుతో వస్తున్న లారీని అడ్డుకున్నారు. అందులో తనిఖీ చేయగా 230 గన్నీ బ్యాగ్స్, 112 తెల్ల సంచుల్లో రేషన్ బియ్యం ఉన్నట్లు గుర్తించారు. లారీ లోడులో పైవరుసలో సాధారణ బియ్యం బస్తాలను పేర్చి అడుగున రేషన్ బియ్యం బస్తాలను ఉంచారు. లారీలోని రేషన్ బియ్యాన్ని గొల్లపూyì మార్కెట్ యార్డ్‌లోని ఎంఎల్ఎస్ పాయింట్లో దించి, ఇన్చార్జి నరసింహారావుకు అప్పగించారు. పట్టుబడిన బియ్యం విలువ రూ.5.50 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. అనంతరం లారీని, డ్రైవర్ నాగరాజును భవానీపురం పోలీసులకు అప్పగించారు. ఈ దాడిలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ సీఐలు ఎన్ఎస్ఎస్ అపర్ణ, ఎస్కే నభి, అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఎం.వెంకటేశ్వరరావు, ఎస్ఐ వైవీవీ సత్యనారాయణ, ఆర్ఐ ఎ.లత పాల్గొన్నారు. -
భారీగా రేషన్ బియ్యం పట్టివేత
నార్కట్‌పల్లి (నల్లగొండ) : నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లిలో పౌరసరఫరాల శాఖ విజిలెన్స్ అధికారులు.. అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. తిరుమలగిరికి చెందిన సంతోష్ రైస్ మిల్లు యజమాని అక్రమంగా కొనుగోలు చేసిన 350 బస్తాల్లో ఉన్న 17.50 టన్నుల బియ్యాన్ని లారీలో కర్ణాటకకు తరలించేందుకు యత్నించారు. ఈ మేరకు ముందస్తు సమాచారం అందుకున్న విజిలెన్స్ అధికారులు.. సోమవారం మధ్యాహ్నం లారీని నార్కట్‌పల్లి సమీపంలో అడ్డుకుని తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా అందులో ఉన్న రేషన్ బియ్యం బయటపడింది. ఇందుకు సంబంధించి ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేసి, బియ్యాన్ని సమీపంలోని పౌర సరఫరాల శాఖ గోదాముకు తరలించారు. లారీని సీజ్ చేశారు. -
40 బియ్యం బస్తాలు స్వాధీనం
ప్రొద్దుటూరు: చౌకదుకాణాలకు సంబంధించిన బియ్యాన్ని బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తుండగా పోలీసులు స్వాధీనం చేసుకుని స్థానిక తహసీల్దార్ భాస్కర్‌రెడ్డికి అప్పగించిన సంఘటన సోమవారం చోటు చేసుకుంది. అప్పే ఆటోలో 10 బస్తాల బియ్యాన్ని తీసుకుని కర్నూలు జిల్లా బనగానపల్లెకు వెళుతుండగా వన్‌టౌన్ పోలీసులు పట్టుకున్నారు. అలాగే మినీ వ్యాన్‌లో మరో 30 బస్తాలను తీసుకెళుతుండగా రూరల్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటిని సోమవారం రెవెన్యూ అధికారులకు అప్పగించారు. -
ఐదు క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
టేకులపల్లి మండలకేంద్రంలో ఐదు క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. బియ్యాన్ని రవాణా చేసేందుకు ఉపయోగించిన ట్రాలీని సీజ్ చేసి ఒకరిని అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
రేషన్ బియ్యం పట్టివేత
తడ : తడ పోలీస్‌స్టేషన్‌కు సమీపంలోని సెల్వకుప్పంలో శనివారం రెవెన్యూ, సివిల్ సప్లయీస్ అధికారులు పోలీసుల సాయంతో దాడులు నిర్వహించి ఐదు ఇళ్లల్లో అక్రమంగా దాచి ఉంచిన 175 బస్తాల తమిళ, ఆంధ్రా రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. కొంత కాలంగా పూడికుప్పం, సెల్వకుప్పం కేంద్రంగా ఈ వ్యాపారం సాగుతుంది. చిన్నచిన్న వ్యాపారుల వద్ద నుంచి తమిళ, ఆంధ్రా రేషన్ బియ్యం కొనుగోలు చేసి గ్రామంలోని ఇళ్లల్లో నిల్వ చేసి రాత్రి సమయాల్లో లారీల్లో తమకు అనుకూలమైన రైస్ మిల్లులకు తరలిస్తున్నారు. ఈ క్రమంలో స్మగ్లర్ల మధ్య వాటాల విషయంలో ఇటీవల విభేదాలు తలెత్తడంతో గుట్టుగా సాగుతున్న ఈ వ్యవహారం రచ్చకెక్కింది. ఇటీవల సెల్వకుప్పం నుంచి ఓ లారీలో తమిళ రేషన్‌బియ్యం తీసుకు వెళ్తుండగా ఓ వర్గం అడ్డుకుని పోలీసులు ఫిర్యాదు చేశాడు. తడలో తప్పించుకున్న ఆ లారీని సూళ్లూరుపేట ఎస్ఐ గంగాధరం టోల్‌ప్లాజా వద్ద పట్టుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం గ్రామంలో బియ్యం నిల్వ ఉన్నట్టు ప్రత్యర్థి వర్గం స్మగ్లర్లు జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్కే ఇంతియాజ్‌క్ ఫోన్లో సమాచారం అందించారు. ఆయన ఆదేశాలతో తడ తహసీల్దార్ ఏడుకొండలు, సూళ్లూరుపేట సివిల్ సప్లయీస్ డీటీ వెంకటేశ్వర్లు, ఎస్ఐ సురేష్‌బాబు సహకారంతో గ్రామంలో తనిఖీలు చేవారు. ఐదు ఇళ్లల్లో దాచి ఉంచిన 175 బస్తాల బియ్యాన్ని స్వాధీనం చేసుకుని కొండూరు వద్ద ఉన్న సివిల్ సప్లయీస్ గోదాముకు తరలించారు. అయితే బియ్యం ఉన్న ఇళ్లల్లో ఎవరూ కాపురం లేకపోగా, ఆ సరుకు తమదంటూ ఎవరూ ముందుకు రాకపోవడంతో ప్రస్తుతానికి ఎవరిపైనా కేసులు నమోదు చేయలేదని తహసీల్దార్ తెలిపారు. -
రేషన్ బియ్యం పట్టివేత
వెంకటాచలం : తమిళనాడు నుంచి నెల్లూరుకు అక్రమంగా తరలిస్తున్న రూ.4 లక్షల విలువైన 17 టన్నుల రేషన్ బియ్యాన్ని విజిలెన్స్ అధికారులు మంగళవారం పట్టుకున్నారు. తమిళనాడు నుంచి టీఎన్18ఏబీ 9291 నంబరు లారీలో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రేషన్ బియ్యంను నెల్లూరుకు రవాణా చేస్తున్నారనే సమాచారం విజిలెన్స్ అధికారులకు మంగళవారం తెల్లవారు జామున సమాచారం అందింది. దీంతో విజిలెన్స్ అధికారులు వెంకటాచలం టోల్‌ప్లాజా వద్ద నిఘా పెట్టి తనిఖీలు నిర్వహించారు. ఉదయం 6 గంటల సమయంలో ఏపీ 26 టీఏ7776 నంబరుతో ఉన్న లారీని విజిలñ న్స్ అధికారులు తనిఖీ చేయగా అందులో రేషన్ బియ్యం ఉన్నట్లు గుర్తించారు. లారీకు నకిలీ నంబర్ స్టిక్కరు అతికించి ఉండటాన్ని గమనించి సిక్కరును తొలగించారు. స్టిక్కరు కింద టీఎన్18ఏబీ 9291 నంబర్ ఉండటంతో సమాచారం వచ్చిన లారీ ఇదేనని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. విజిలెన్స్ డీఎస్పీ వెంకటనాథ్‌రెడ్డి చేరుకుని అక్రమ బియ్యం రవాణా చేస్తున్న లారీని పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ ఆంధ్రా, తమిళనాడుకు చెందిన రేషన్ బియ్యం అక్రమ రవాణా చేస్తున్నారనే సమాచారంతో తనిఖీ చేసి పట్టుకున్నామన్నారు. ఈ లారీలో 17 టన్నులు రూ.4 లక్షల విలువగలిగిన బియ్యం పట్టుకున్నామన్నారు. లారీ యజమాని దినేష్, దళారి మునుస్వామి, డ్రైవర్ మదన్‌కుమార్‌పై కేసు నమోదు చేస్తామని తెలిపారు. ఈ బియ్యం ఎక్కడకు తరలిస్తున్నారో విచారణలో తేలుస్తామన్నారు. ఆయన వెంట విజిలెన్స్ సీఐలు ఉప్పాల సత్యనారాయణ, శ్రీనివాసరావు, ఏఓ ధనుంజయరెడ్డి, ఏఎస్ఓ లక్ష్మీనారాయణరెడ్డి పాల్గొన్నారు. -
పేదల బియ్యం.. పెద్దల భోజ్యం
* సరిహద్దులు దాటించేస్తున్న అక్రమార్కులు * నరసరావుపేట, సత్తెనపల్లి కేంద్రంగా దందా * ముఖ్య నేత తనయుడి ఆధ్వర్యంలోనే నిర్వహణ! అక్రమార్కులు పేదల బియ్యాన్నీ వదలడం లేదు. వారి కడుపుకొట్టి.. తమ జేబులు నింపుకొంటున్నారు. కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారు. సేకరించిన బియ్యాన్ని గుట్టుచప్పుడు కాకుండా సరిహద్దులు దాటించేస్తున్నారు. నరసరావుపేట: పేదల బియ్యానికి భద్రత కొరవడింది. సరిహద్దులు దాటి మరీ విదేశాలకు తరలిపోతున్నా పట్టించుకునేవారే కరువయ్యారు. జిల్లాలోని నరసరావుపేట, సత్తెనపల్లి నియోజకవర్గాలు కేంద్రంగా ఈ వ్యవహారం యథేచ్ఛగా సాగుతోంది. అధికార పార్టీకి చెందిన ముఖ్య నేత తనయుడు పట్టణ ప్రజాప్రతినిధి ఒకరిని ఏజెంటుగా పెట్టుకొని బియ్యం మాఫియా నడుపుతున్నాడు. రేషన్ డీలర్లకు సరకు చేరగానే వారి నుంచి బియ్యాన్ని సేకరించి గోతాలు మార్చేస్తున్నారు. వరల్డ్ రైస్ పేరుతో కాకినాడ పోర్టుకు వాటిని తరలిస్తున్నారనే ఆరోరపణలు బలంగా వినిపిస్తున్నాయి. పలుమార్లు పట్టుబడినా.. గతేడాది సెప్టెంబర్ 10వ తేదీ రాత్రి ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి నరసరావుపేట నుంచి చిలకలూరిపేటకు వెళ్లే మార్గంలోని ఎస్ఆర్కేటీ జంక్షన్ వద్ద పాడుబడిన గోడౌన్లో తరలివెళ్లేందుకు సిద్ధంగా ఉన్న రేషన్ బియ్యం డంపును పట్టుకున్నారు. అందులో సుమారు రూ.30 లక్షల విలువైన రేషన్ బియ్యం బస్తాలను అధికారులు గుర్తించారు. ఇంత పెద్ద మొత్తంలో రేషన్ బియ్యం బస్తాలు ఒకేచోట పట్టుబడిన దాఖలాలు లేవని స్థానికులు చెబుతున్నారు. ఈ డంపులో వరల్డ్ రైస్ పేరుతో ఉన్న రేషన్ బియ్యం బస్తాలను గమనించిన అధికారులే విస్తుపోయారు. టీడీపీ నాయకులు, రేషన్ డీలర్ల ప్రమేయంతోనే ఈ వ్యవహారం జరుగుతుండటంతో అధికారులు కూడా చర్యలకు మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఈ సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించటంతో బియ్యం సేకరణ కేంద్రాన్ని సత్తెనపల్లి నియోజకవర్గంలోని నకరికల్లుకు మార్చారు. అక్కడ కొంతకాలంగా నిర్వహించిన అనంతరం ఇప్పుడు నరసరావుపేట మండలం పెట్లూరివారిపాలెం కేంద్రంగా బియ్యం సేకరణ నిర్వహిస్తున్నారు. ఈ నెల ఆరో తేదీ రాత్రి పెట్లూరివారిపాలెంలో పౌరసరఫరాల శాఖ అధికారులు దాడులు నిర్వహించి 44 బస్తాల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకోవటం గమనార్హం. జిల్లాలో బియ్యం మాఫియా కార్యకలాపాలు విస్తరిస్తుండటం ప్రమాదకర సంకేతాలనిస్తోంది. పిడుగురాళ్లలోనూ ఇలాంటి కార్యకలాపాలు జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. రకరకాలుగా బియ్యం సేకరణ.. జిల్లాలోని 57 మండలాల్లో 2731 రేషన్ షాపులు ఉండగా, వాటిలో అత్యధిక శాతం టీడీపీ కార్యకర్తల చేతిలోనే ఉన్నాయి. జిల్లాలో 13.39 లక్షల రేషన్ కార్డులు ఉండగా, వాటిలో రూ.10.26 లక్షల కార్డుదారులకు ప్రతినెలా 13,600 టన్నుల బియ్యం పంపిణీ చేయాల్సి ఉంది. లబ్ధిదారులకు వాటిలో సగం కూడా సక్రమంగా పంపిణీ కావటం లేదు. నరసరావుపేట, సత్తెనపల్లిలో టీడీపీ అధికారంలోకి రాగానే డీలర్లు నూతనంగా నియమించినవారు కావటంతో బియ్యం మాఫియాకు సహకరిస్తున్నారు. సహకరించకపోతే డీలర్‌షిప్‌లు రద్దు చేస్తామని, కేసులు పెడతామని బెదిరింపులకు దిగుతున్నారు. రేషన్ బియ్యం ఒక రూపాయికే కేజీ చొప్పున ఇళ్లకు తీసుకెళ్లినవారి నుంచి కేజీకి రూ.8 చొప్పున చెల్లించి మధ్య దళారులు సేకరిస్తున్నారు. తాజాగా మరో అడుగు ముందుకేసి సర్వర్ పనిచేయటం లేదనే సాకుతో డీలర్లు లబ్ధిదారులకు స్లిప్‌లు ఇచ్చి బియ్యం ఇవ్వకుండా పదేపదే షాపుల చుట్టూ తిప్పుకొంటున్నారు. చివరికి కేజీకి రూ.7 చొప్పున రేషన్ కార్డుదారుల చేతిలో డబ్బు పెట్టి పంపిస్తున్నారు. ఈ విధంగా మిగిలిన బియ్యాన్ని డీలర్లు కేజీ రూ.12కు అక్రమార్కులకు కట్టబెడుతున్నారు. వాటిని బియ్యం మాఫియా కేజీ రూ.25 చొప్పున ఎగుమతి చేస్తూ తమ జేబులు నింపుకొంటున్నారు. నిజాలు నిగ్గుతేలుతాయి : నల్లపాటి బియ్యం మాఫియాపై లోకాయుక్త నిర్వహించే దర్యాప్తుతోనైనా నిజాలు నిగ్గుతేలుతాయనే నమ్మకం తనకు ఉందని ఎన్సీవీ అధినేత నల్లపాటి రామచంద్రప్రసాద్ తెలిపారు. బియ్యం మాఫియాపై ఆయన లోకాయుక్తలో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. తెలుగుదేశం ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మాఫియాను అరికట్టాలని, పేదల బియ్యానికి భద్రత కల్పించాలని, లబ్ధిదారులకు సక్రమంగా చేరేలా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. -
మిల్లర్ల గిల్లుడు
* సర్కారుకు రూ.500 కోట్ల విలువైన బియ్యం బకాయి * ధాన్యం అట్టిపెట్టుకొని బయట అడ్డగోలు వ్యాపారం * రేషన్ బియ్యానికి ఏర్పడుతున్న కొరత * దాంతో మళ్లీ అదే మిల్లర్ల వద్దే కొంటున్న ప్రభుత్వం సాక్షి, హైదరాబాద్: రైస్ మిల్లర్ల మాయాజాలానికి ప్రభుత్వం చిత్తవుతోంది. అధికారులు, మిల్లర్ల కుమ్మక్కుతో పౌరసరఫరాల శాఖ కుదేలవుతోంది. చివరకు ప్రజా పంపిణీ (పీడీఎస్) ద్వారా అందించే రేషన్ బియ్యం కోసం అదనపు భారం మోయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కస్టమ్ మిల్లింగ్ ద్వారా మిల్లర్ల నుంచి రావాల్సిన బియ్యాన్ని రాబట్టుకోలేక చేతులెత్తేసిన పౌరసరఫరాల శాఖ.. రేషన్ బియ్యానికి కొరత ఏర్పడితే మళ్లీ మిల్లర్ల దగ్గరే కొనుగోలు చేస్తోంది. ఈ శాఖలోని అధికారుల పుణ్యమాని మిల్లర్లు ఆడింది ఆట, పాడింది పాటగా మారింది. కొందరు అధికారులు.. కేసులున్న మిల్లర్లకు, డిఫాల్టర్లకు సీఎంఆర్ (క స్టమ్ మిల్లింగ్ రైస్) అప్పజెప్పారు. అధికారుల పర్యవేక్షణ లోపం, నిర్లక్ష్యం వల్ల మిల్లర్లు కస్టమ్ మిల్లింగ్ బియ్యంతో బయట అడ్డగోలు వ్యాపారం చేసుకుంటున్నారు. ఇదీ కథ! 2015-16 సంవత్సరానికిగాను 23 లక్షల టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కస్టమ్ మిల్లింగ్ కోసం మిల్లర్లకు అప్పగించింది. ఖరీఫ్, రబీ సీజన్లు పూర్తై మరో ఖరీఫ్ సీజన్ ఆరంభమైనా ఇప్పటి దాకా మిల్లర్ల నుంచి ప్రభుత్వానికి 14 లక్షల టన్నుల బియ్యమే అందింది. ఇంకా 1.81 లక్షల టన్నుల బియ్యం మిల్లర్ల వద్దే పెండింగ్‌లో ఉంది. ఏళ్లకు ఏళ్లుగా శాఖలో పాతుకు పోయిన కొందరు అధికారులు, జిల్లా స్థాయిలో కొందరు డీఎస్వోలు, డీఎంలు మిల్లర్లకు సహకరిస్తున్నారన్న ఆరోపణ లు ఉన్నాయి. మొత్తంగా ప్రభుత్వానికి ఇంకా రూ.500 కోట్ల విలువైన బియ్యం మిల్లర్ల నుంచి అందాల్సి ఉంది. మిల్లర్ల వద్ద ఇంత పెద్దమొత్తంలో బియ్యం ఆగిపోవడంతో రేషన్ బియ్యానికి కొరత ఏర్పడుతోంది. దీంతో ప్రభుత్వం తిరిగి అదే మిల్లర్లకు డబ్బులు చెల్లించి బియ్యం కొనుగోలు చేస్తోంది. ఈ ఏడాది మార్చిలో ఇలా 16 వేల టన్నుల బియ్యం కొనుగోలు చేసింది. వాస్తవానికి కస్టమ్ మిల్లింగ్ ద్వారా సేకరించే బియ్యం పీడీఎస్ అవసరాలకు సరిపోవు. కచ్చితంగా బియ్యం కొనుగోలు చేయాలి. కాకపోతే ప్రభుత్వానికి రావాల్సిన 1.81 లక్షల టన్నుల బియ్యం రాక పోవడంతో కొనుగోలు తప్పలేదంటున్నారు. పరిస్థితిని మార్చేందుకు పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఈ నెల 14న అధికారులతో పూర్తిస్థాయిలో సమీక్ష జరపనున్నారు. బకాయిలే బకాయిలు.. హైదరాబాద్ మినహా మిగిలిన 9 జిల్లాల్లోని మిల్లర్లకు ప్రభుత్వం కస్టమ్ మిల్లింగ్ బాధ్యతను అప్పజెప్పింది. 2015-16 సంవత్సరానికి గాను ఖరీఫ్, రబీ సీజన్లలో వీరికి ధాన్యం అప్పజెప్పగా పెద్ద ఎత్తున ధాన్యం నిల్వలను తమ వద్దే అట్టిపెట్టుకున్నారు. అత్యధికంగా నల్లగొండ జిల్లాలో రైస్ మిల్లర్ల నుంచి రూ.159 కోట్ల విలువైన 60 వేల టన్నుల బియ్యం ప్రభుత్వానికి రావాల్సి ఉంది. కరీంనగర్ జిల్లాలో సుమారు రూ.110 కోట్లు విలువ చేసే 41 వేల టన్నులకుపైగా బియ్యం అందా ల్సి ఉంది. ఆదిలాబాద్ జిల్లాలో రూ.80.55 కోట్లు, మహబూబ్‌నగర్ జిల్లాలో రూ.50 కోట్లు, వరంగల్ జిల్లాలో రూ.38 కోట్లు, రంగారెడ్డి, మెదక్‌లో ఒక్కో జిల్లాలో రూ.23 కోట్లు, నిజామాబాద్‌లో రూ.13.50 కోట్లు, ఖమ్మం జిల్లాలో రూ.5.14 కోట్ల విలువైన కస్టమ్ మిల్లింగ్ బియ్యం ప్రభుత్వానికి అందాల్సి ఉంది. ఇవిగో అక్రమాలు అర్హతలేని, పలు కేసుల్లో సీజ్ అయిన మిల్లులకు, చివరకు విద్యుత్ కనెక్షన్ కూడా లేని మిల్లుల కస్టమ్ మిల్లింగ్ కోసం ధాన్యం అప్పజెప్పారు. పౌరసరఫరాల శాఖ కమిషనర్‌గా కొద్ది రోజుల కిందటే బాధ్యతలు చేపట్టిన సీనియర్ ఐపీఎస్ అధికారి సి.వి.ఆనంద్ సీఎంఆర్ బకాయిలపై దృష్టి పెట్టా రు. ఆయన నేతృత్వంలో ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఇటీవల మహబూబ్‌నగర్ జిల్లాలో చేసిన దాడులు అక్రమాలు బయటపడ్డాయి. ఈ మిల్లులన్నీ కస్టమ్ మిల్లింగ్ ధాన్యంతో బయట వ్యాపారం చేస్తున్నట్టు వెల్లడైంది. మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూరులోని వెంకటేశ్వర ఇండస్ట్రీస్ మిల్లులో రూ.3 కోట్ల విలువైన ధాన్యాన్ని సీజ్ చేశారు. శ్రీలక్ష్మీ ఇండస్ట్రీస్ మిల్లులో రూ.2.80 కోట్ల విలువైన ధాన్యాన్ని పట్టుకున్నారు. గతేడాది కడ్తాల్‌లోని వరలక్ష్మీ రైస్ మిల్లును సీజ్ చేశారు. అయినా ఆ మిల్లుకు అధికారులు ధాన్యం అప్పగించారు. దేవరకద్రలో మహాలక్ష్మి మిల్లులో సైతం రూ.74 లక్షల విలువైన ధాన్యం పట్టుకున్నారు. మరోవైపు ప్రభుత్వం సెప్టెంబర్ 30 వరకు తమకు గడువు ఇచ్చిందని, ఈ నెలాఖరులోగా పెండింగులో ఉన్న కస్టమ్ మిల్లింగ్ బియ్యాన్ని ప్రభుత్వానికి అందిస్తామని రైస్ మిల్లర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు గంపా నాగేందర్ ‘సాక్షి’కి చెప్పారు. -
రేషన్ బియ్యం లారీ పట్టివేత
దొరవారిసత్రం : అక్రమంగా లారీలో 329 బస్తాల రేషన్ బియ్యంతో నెల్లూరు వైపు వెళ్తున్న లారీని దొరవారిసత్రం పోలీసులు తల్లంపాడులోని స్వర్ణా టోల్‌ప్లాజా వద్ద శనివారం రాత్రి పట్టుకున్నారు. ఎస్సై మారుతీకృష్ణ కథనం మేరకు.. రేషన్ బియ్యంతో సూళ్లూరుపేట నుంచి నెల్లూరు వైపు లారీ వెళ్తున్న విషయం ఫోన్ ద్వారా సమాచారం రావడంతో తమ సిబ్బందితో ప్లాజా వద్ద తనిఖీలు నిర్వహించామన్నారు. రేషన్ బియ్యంతో వెళ్లే లారీని గుర్తించి స్వాధీనం చేసుకోవడంతో పాటు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామన్నారు. ఎస్సై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
రైల్వేస్టేషన్లో రేషన్ బియ్యం పట్టివేత
మండలంలోని రేచినిరోడ్ రైల్వేస్టేషన్లో తాండూర్ రెవెన్యూ, పోలీసులు అధికారులు బుధవారం సంయుక్తంగా దాడులు నిర్వహించి 49.80 క్వింటాళ్ల బియ్యం రేషన్ బియ్యం స్వాధీనం చేసుకున్నారు. నిత్యం రేషన్ బియ్యం మహారాష్ట్రకు తరలిస్తున్నారనే సమాచారం మేరకు దాడులు నిర్వహించారు. రామగిరి రైలు వచ్చి స్టేషన్లో ఆగిన వెంటనే దాడి చేశారు. అప్పటికే రేషన్ బియ్యం రైల్లో ఎక్కించడం, మరికొన్ని సంచులు ప్లాట్‌ఫాంపై ఉండడంతో సిబ్బంది రైల్లో ఉన్న బియ్యం సంచులను కిందికి దించారు. బియ్యాన్ని తరలించే వ్యక్తులు పారిపోయూరు. 164 సంచుల్లో 49.80 క్వింటాళ్ల బియ్యం పట్టుబడ్డాయి. వీటిని ఎంఎల్ఎస్ పాయింట్‌కు తరలించారు. దాడుల్లో తహశీల్దార్ రామచంద్రయ్య, తాండూర్ ఎస్సై అశోక్‌కుమార్, ఎన్ఫోర్స్మెంట్ డెప్యూటీ తహసీల్దార్లు మునీర్, రియాజ్, వీఆర్వోలు, వీఆర్ఏలు, సిబ్బంది పాల్గొన్నారు. -
రేషన్ దందా
యథేచ్ఛగా రేషన్ బియ్యం పక్కదారి రీ-సైక్లింగ్ లేదా కోళ్ల దాణాకు సరఫరా దండుకుంటున్న వ్యాపారులు దాడులు జరిగినా తగ్గని అక్రమాలు మెదక్/గజ్వేల్/జగదేవ్‌పూర్: ‘కంచే చేను మేసినట్టు’రేషన్ డీలర్ల అక్రమార్జన కొనసాగుతోంది. పేదలకు పంపిణీ చేయాల్సిన బియ్యాన్ని రైస్ మిల్లులకు తరలిస్తూ లక్షలు గడిస్తున్నారు. బియ్యాన్ని నూకలుగా మార్చుతూ కోళ్లదాణాగానూ అమ్మేసుకుంటున్నారు. చర్యలు అంతంతమాత్రంగా ఉండటంతో దందా కట్టడి కావడం లేదు. గజ్వేల్, మెదక్ ప్రాంతాల్లో సాగుతోన్న ఈ దందా పౌరసరఫరాల అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. అడ్డాగా గజ్వేల్, మెదక్.. రేషన్ బియ్యాన్ని అక్రమంగా సేకరిస్తున్న వ్యాపారులు రీ-సైక్లింగ్ లేదా కోళ్లదాణాకు సరఫరా చేస్తున్నారు. గజ్వేల్ నియోజకవర్గం ఈ దందాకు అడ్డాగా మారింది. ప్రధానంగా జగదేవ్‌పూర్, గజ్వేల్ మండలాల్లో రేషన్ బియ్యం దందా జోరుగా కొనసాగుతోంది. తాజాగా ఆదివారం 150 క్వింటాళ్ల రేషన్ బియ్యం జగదేవ్‌పూర్‌లో పట్టుబడటమే ఇందుకు నిదర్శనం. నల్లగొండ, రంగారెడ్డి, వరంగల్, మెదక్ జిల్లాల చిరు వ్యాపారులు రేషన్ బియ్యాన్ని కొనుగోలు చేసి జగదేవ్‌పూర్‌లో విక్రయిస్తున్నారు. గజ్వేల్‌కు సైతం వివిధ ప్రాంతాల నుంచి అక్రమంగా బియ్యం వస్తున్నాయి. అలాగే మెదక్ ప్రాంతంలో సైతం అక్రమంగా రేషన్ బియ్యం తరలింపు వ్యవహారం పెద్ద ఎత్తున సాగుతోంది. ఈ నియోజకవర్గంలోని దాదాపు అన్ని రేషన్ దుకాణాల నుంచి సరుకు నేరుగా రైస్ మిల్లులకు చేరుతోంది. కలిసివచ్చిన సరిహద్దు ప్రాంతం జగదేవ్‌పూర్ మండలం జిల్లా సరిహద్దు ప్రాంతం. అధికారుల పర్యవేక్షణ కూడా ఇక్కడ అంతంతే. దీంతో కొందరు వ్యాపారులు ‘రింగ్’గా ఏర్పడి రేషన్ బియ్యం దందా ప్రారంభించారు. చిరు వ్యాపారుల నుంచి రేషన్ బియ్యాన్ని కొనుగోలు చేస్తూ లక్షలు గడిస్తున్నారు. అధికారులు కన్నెత్తి చూడకపోవడంతో వారి దందా యథేచ్ఛగా కొనసాగుతోంది. గత ఏడాది నవంబర్‌లో అప్పటి జగదేవ్‌పూర్ తహసీల్దార్ పరమేశం స్థానికంగా రేషన్ బియ్యాన్ని కొనుగోలు చేస్తున్న బుద్ద సత్యం దుకాణంపై దాడి చేసి 15 టన్నుల సరుకు పట్టుకున్నారు. ఈ ఏడాది మార్చి 10న తహసీల్దార్ అనిల్.. డీసీఎంలో తరలిస్తున్న బియాన్ని పట్టుకున్నారు. అందులో 60 కిలోల బస్తాలు 120 ఉన్నాయి. ఇదిలాఉండగా గజ్వేల్‌లో గతేడాది జూన్‌లో ఓ ట్రాన్స్పోర్ట్ కార్యాలయంలో అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని అధికారులు సీజ్ చేశారు. నెల రోజుల క్రితం గజ్వేల్ నగర పంచాయతీ పరిధిలోని ప్రజ్ఞాపూర్‌లోని ఓ రైస్‌మిల్లులో రీ-సైక్లింగ్‌కు యత్నించిన 130 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని రెవెన్యూ అధికారులు సీజ్ చేశారు. బియ్యం సేకరణ ఇలా.. చిరు వ్యాపారులు ఊరురా తిరుగుతూ రేషన్ బియ్యాన్ని సేకరించి ఇంటి వద్ద నీళ్లలో నానబెట్టి నూకలుగా తయారుచేస్తున్నారు. అదేవిధంగా మరికొందరు పసుపు కలిపి అమ్ముతున్నారు. కిలోకు చిరు వ్యాపారులకు రూ.12 నుంచి రూ.14 వరకు ధర అందుతోంది. సేకరించిన సరుకును ప్రతి శనివారం జగదేవ్‌పూర్‌లో వ్యాపారులకు అమ్ముతున్నారు. నల్లగొండ జిల్లా రాజాపేట మండలంలోని కొన్ని ప్రాంతాల నుంచి రేషన్‌బియ్యం దందా జరుగుతోంది. మహిళలు సైతం రంగారెడ్డి జిల్లా మదాపూర్, చీకటిమామిడి, లక్షామపూర్, ముడిచింతలపల్లి తదితర గ్రామాల్లో పర్యటించి రేషన్‌బియ్యాన్ని రూ.10 కిలో చొప్పున కొనుగోలు చేస్తున్నారు. నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లోని వివిధ గ్రామాల బియ్యం ఇక్కడి వస్తున్నాయి. బియ్యాన్ని వ్యాపారులు ఓ గదిలో నిల్వ చేసి పైన నీళ్లు చల్లుతున్నారు. వాటినే రెండు రోజుల్లో నూకలుగా మార్చుతారు. వీటిని కోళ్ల దాణాగా విక్రయిస్తున్నట్టు సమాచారం. రైస్‌మిల్లులకు రేషన్ బియ్యం గతంలో వందల క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పాపన్నపేట మండలంలోని ఓ రైస్‌మిల్లులో విజిలెన్స్ అధికారులు పట్టుకొని సీజ్ చేసిన విషయం విదితమే. అదేవిధంగా మెదక్ మండల పరిధిలోని హవేళిఘణాపూర్‌లోని ఓ రైస్‌మిల్లుకు ఆటోలో తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని అధికారులు పట్టుకున్నారు. రెండేళ్ల క్రితం మెదక్ మండలం సర్ధన నుంచి టాటా ఏ ఆటోలో రేషన్ బియ్యం, కిరోసిన్ తరలిస్తుండగా అధికారులు పట్టుకొని కేసు నమోదు చేశారు. చిన్నశంకరంపేట మండలం జంగరాయి వాగులో చక్కెరకు సంబంధించిన ఖాళీ బస్తాలను పెద్ద మొత్తంలో పడేశారు. ఇటీవల మెదక్ పట్టణంలోని ఓ రైస్‌మిల్‌లోకి ఆటోలో అక్రమంగా రేషన్‌బియ్యం తరలించినట్లు సమాచారం. ఇలా నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో రేషన్ సరుకుల అక్రమ వ్యాపారం జోరుగా కొనసాగుతుంది. -
200 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
అక్రమంగా తరలించేందుకు సిద్ధంగా ఉంచిన 200 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం గోపవరం గ్రామంలో అక్రమంగా రేషన్ బియ్యాన్ని తరలిస్తున్నారనే సమాచారంతో రంగంలోకి దిగిన విజిలెన్స్ అధికారులు ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి 400 బస్తాల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. -
పదో తేదీ దాటినా పత్తాలేని బియ్యం
నిత్యావసర వస్తువుల సరఫరాలో జాప్యం బియ్యం కోసం నిరుపేదల ఎదురు చూపు వర్షాల కారణంగా ఆలస్యమైందన్న పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజరు లింగాలఘణపురం : ప్రభుత్వం చౌకధరల దుకాణాల నుంచి నిత్యావసర వస్తువుల సరఫరాలో జాప్యం జరుగుతోంది. ప్రతీ నెల 1వ తేదీ లోపు మండల లెవల్ స్టాక్ (ఎంఎల్ఎస్) పాయింట్ నుంచి గ్రామాల్లోని చౌకధరల డిపోలకు సరుకులు అందాల్సి ఉంటుంది. గత మూడు మాసాలుగా ఎంఎల్ఎస్ పాయింట్ నుంచి రావాల్సిన సరకులు సకాలంలో రావడం లేదు. దీంతో నిరుపేదలకు ప్రతీ నెల బియ్యం కోసం ఎదురు చూపులు తప్పడం లేదు. వచ్చిన బియ్యం డీలర్లు సకాలంలో పంపిణీ చేయడం లేదని ఇప్పటికే ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ఎంఎల్ఎస్ పాయింట్ నుంచి రావడం ఆలస్యం కావడంతో పేదలు మరిన్ని కష్టాలు ఎదుర్కొంటున్నారు. లింగాలఘణపురం మండలంలోని 17 గ్రామ పంచాయితీల పరిధిలో 26 చౌకధరల దుకాణాలు ఉండగా 1,962.30 కిలోల బియ్యం, 11,048 కిలోల చక్కెర సరఫరా చేయాల్సి ఉంటుంది. కాగా 10వ తేదీ వరకు కూడా సగం షాపులకు కూడా బియ్యం సరఫరా కాలేదు. 15 తేదీలోగా స్టాక్ వివరాలను తెలియజేస్తూ డీలర్లు డీడీలు తీయాల్సి ఉంటుంది. 10 తేదీ వరకు కూడా బియ్యం రాకపోవడంతో అయోమయ పరిస్థితిలో ఉన్నారు. చాలా మండలాల్లో ఇదే పరిస్థితి ఉంది. వర్షాల కారణంగా ఎంఎల్ఎస్ పాయింట్ల నుంచి బియ్యం సరఫరాలో ఆలస్యమైందని పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజరు విజయేందర్‌రెడ్డి చెప్పారు. జిల్లాలో 2115 చౌకధరల దుకాణాలు ఉండగా 384 షాపులకు సరుకులు చేరలేదని ఆయన చెప్పారు. -
5 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
నెక్కొండ మండలం గుండ్రపల్లిలోని రేషన్ షాపుపై విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. అక్రమంగా నిల్వ ఉంచిన సుమారు 5 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోన్నారు. -
150 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
జైపూర్ మండలం ఇందారం వద్ద 150 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పట్టుకున్నారు. కరీంనగర్ జిల్లా గోదావరిఖని నుంచి ఆదిలాబాద్ జిల్లా జైపూర్ మండలం ఇందారం సమీపంలోని వరలక్ష్మీ రైస్ మిల్లుకు తరలిస్తుండగా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బియ్యాన్ని తరలించడానికి ఉపయోగించిన వాహనాన్ని సీజ్ చేశారు. -
రేషన్ బియ్యం పట్టివేత
కాకినాడ: అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని గ్రామస్తులు పట్టుకున్న సంఘటన తూర్పు గోదావరి జిల్లాలోని తొండంగి మండలంలోని కె.కొత్తపల్లిలో బుధవారం జరిగింది. కొత్తపల్లిలో ని 29వ నంబరు రేషన్ దుకాణం నుంచి రెండు టన్నుల బియ్యాన్ని అక్రమంగా తరలిస్తుండగా గ్రామస్తులు అడ్డకున్నారు. అనంతరం అధికారులకు సమాచారం అందించారు. రేషన్ బియ్యాన్ని రెవిన్యూ అధికారులు -
రేషన్ కోసం..
♦ అధికారులు, ప్రజాప్రతినిధుల నిర్బంధం ♦ రంగంపేటలో లబ్ధిదారుల రాస్తారోకో కొల్చారం: రేషన్ బియ్యం ఇవ్వడంలేదని అధికారులను, ప్రజాప్రతినిధులను బంధించి నిరసన తెలిపిన ఘటన జిల్లాలో శనివారం చోటుచేసుకుంది. రెక్కాడితేకాని డొక్కాడని శ్రమ జీవుల రేషన్.. నాలుగు నెలల నుంచి‘కీ రిజిష్టర్’లో తొలగిస్తూ వస్తున్నారు. రూపాయికి కిలో బియ్యంతో పొట్టనింపుకుందామన్న వారి పరిస్థితి గట్టెక్కించేవారే కరువయ్యారు. దీంతో రేషన్ లబ్ధిదారుల్లో ఆవేశం కట్టలుతెగింది. శనివారం సాదా బైనామాల విషయంపై గ్రామసభకు వచ్చిన అధికారులతోపాటు స్థానిక ప్రజాప్రతినిధులను గ్రామ పంచాయతీలో బంధించిన లబ్ధిదారులు రాస్తారోకోకు దిగారు. కొల్చారం మండలం రంగంపేట గ్రామానికి చెందిన 1వ నెంబర్ రేషన్ దుకాణానికి నాలుగు నెలల నుంచి 240 మంది పేర్లు కీ రిజిష్టర్‌లో తొలగిస్తు వస్తున్నాయి. దీంతో దాదాపు 20 క్వింటాళ్ళ బియ్యం తక్కువ రావడంతో పేర్లు తొలగించిన వారికి రేషన్‌బియ్యం ఇవ్వడం లేదు. ఈ విషయమై లబ్ధిదారులు నాలుగు నెలలుగా వీఆర్ఓకు, రేషన్ డీలర్లకు, తహసీల్దార్ కార్యాలయం సిబ్బంది దృష్టికి తీసుకె ళ్లినా పట్టించుకునే వారే కరువయ్యారు. ఈ క్రమంలో సాదాబైనామాలపై అవగాహన సదస్సుకు స్థానిక వీఆర్ఓ చంద్రయ్య, డిప్యూటీ తహసీల్దార్ శ్రీనివాస్ వచ్చారు. దీంతో లబ్ధిదారులు గ్రామ పంచాయతీ వద్దకు పెద్దఎత్తున తరలివచ్చారు. తమకు బియ్యం ఇస్తారా.. లేదా? అని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో ఓ మహిళ తాడుతో ఉరివేసుకునేందుకు ప్రయత్నించడంతో అక్కడ ఉన్న వారు అడ్డుకున్నారు. కోపోద్రికులైన ప్రజలు వీఆర్ఓ, డిప్యూటీ తహసీల్దార్లతోపాటు అక్కడే ఉన్న రాష్ట్ర టెస్కో డెరైక్టర్ అరిగె రమేష్‌కుమార్‌ను గ్రామ పంచాయతీలో బంధించి తాళం వేశారు. అనంతరం ర్యాలీగా బయలుదేరి రహదారిపై రాస్తారోకోకు దిగారు. విషయం తెలుసుకున్న కొల్చారం ఏఎస్ఐ రాజు తన సిబ్బందితో గ్రామానికి చేరుకొని బంధించిన వారిని విడిపించారు.రాస్తారోకోకు దిగిన వారి వద్దకు చేరుకొని డిప్యూటీ తహసీల్దార్ ఫోన్ ద్వారా ఆర్డీవోతో మాట్లాడించారు. బుధవారంలోగా అందరి పేర్లు రేషన్ కీ రిజిష్టర్‌లో వచ్చేలా చూస్తామని హామీ ఇవ్వడంతో లబ్ధిదారులు ఆందోళన విరమించారు. -
రేషన్ బియ్యం పట్టివేత
మఠంపల్లి: నల్లగొండ జిల్లా మఠంపల్లి మండలం ఈతవాకిళ్లు గ్రామంలో అక్రమంగా నిల్వఉంచిన 30 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పోలీసులు బుధవారం ఉదయం స్వాధీనం చేసుకున్నారు. ఈతవాకిళ్లు గ్రామానికి చెందిన గ్రంథి జనార్దన్‌కు చెందిన ఇంటిలో నిల్వఉంచిన బియ్యాన్ని ముందస్తు సమాచారం మేరకు మఠంపల్లి ఎస్ఐ ఆకుల రమేష్.. సిబ్బందితో దాడి చేసి స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. -
రేషన్ బియ్యం పట్టివేత
చాపాడు: వైఎస్సార్ జిల్లా చాపాడు మండలం కుందూ సమీపంలో అక్రమంగా తరలిస్తున్న 24 బస్తాల రేషన్ బియ్యాన్ని ఎంఆర్ఓ జ్ఞానమూర్తి సోమవారం సాయంత్రం పట్టుకున్నారు. ప్రొద్దుటూరుకు చెందిన శ్రీరాములు అనే వ్యక్తి 24 బస్తాల రేషన్ బియ్యాన్ని బద్వేలుకు ఆటోలో తరలిస్తుండగా పక్కా సమాచారంతో దాడులు నిర్వహించారు. స్వాధీనం చేసుకున్న బియ్యం బస్తాలను పోలీసు స్టేషన్‌కు తరలించి శ్రీరాములుపై కేసు నమోదు చేశారు.