రేషన్‌ బియ్యం స్వాధీనం | tamilnadu police catch the ration rice | Sakshi
Sakshi News home page

రేషన్‌ బియ్యం స్వాధీనం

Published Sun, Jun 11 2017 8:04 PM | Last Updated on Tue, Sep 5 2017 1:22 PM

tamilnadu police catch the ration rice

గుమ్మిడిపూండి: రైలులో ఆంధ్రాకు అక్రమంగా తరలించేందుకు సిద్ధం చేసిన రెండు టన్నుల రేషన్‌ బియ్యాన్ని తమిళనాడు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చెన్నై సెంట్రల్‌ నుంచి గుమ్మిడిపూండి మీదుగా తడ, సూళ్లూరుపేట, నెల్లూరుకు వెళ్లే యూనిట్‌ రైలులో కొందరు రేషన్‌ బియ్యాన్ని ఆక్రమంగా రవాణా చేస్తున్నారని గుమ్మిడిపూండి టీఎస్‌ఓ ఇళవరసికి సమాచారం అందింది.

దీంతో ఆమె రెండు రోజులుగా తన సిబ్బందితో గుమ్మిడిపూండి, కవరపేట, తదితర స్టేషన్లలో విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఆ సమయంలో ప్లాట్‌ఫాం పక్కన ముళ్లపొదల్లో దాచిన బియ్యం బస్తాలను గుర్తించి అధికారులు వాటిని స్వాధీనం చేస్తున్నారు. బియ్యం బస్తాలను పంజెట్టిలోని పౌరసరఫరాల శాఖ గోదాముకు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement