tamilnadu police
-
సార్.. నాకు చేపలు కొనిపెట్టరూ..!
సాక్షి, చెన్నై: లాక్డౌన్ సమయంలో ఓ వృద్ధురాలు అమాయకంగా అడిగిన కోరికను ఓ పోలీస్ అధికారి వెంటనే నెరవేర్చారు. ఈ ఘటన కన్యాకుమారి జిల్లా, కుళచ్చల్‌లో చోటుచేసుకుంది. కన్యాకుమారి జిల్లాలో లాక్డౌన్ కారణంగా తీర ప్రాంతంలో చేపల వేటపై నిషేధం ఉంది. కాగా కుళచ్చల్ ఏఎస్పీ విశ్వేష్‌శాస్త్రి కరోనా నివారణ విధుల్లో ఉన్నారు. అనాథలు, పేదలు, సామాన్య ప్రజలకు పోలీసుల తరఫున కూరగాయలు, బియ్యం అందజేసేందుకు ఏర్పాట్లు చేశారు. కుళచ్చల్ టీఎంసీ కాలనీ ప్రాంతంలో ఉన్న వృద్ధులు సహా పలువురికి కూరగాయలు, బియ్యం వంటివి అందజేస్తూ వచ్చారు. (చెన్నైలో భయం.. భయం) ఆయన శుక్రవారం ఆ ప్రాంతంలో మళ్లీ విధుల్లో నిమగ్నమయ్యారు. ఆ సమయంలో ఒక ఇంటి అరుగుపై దిగాలుగా కూర్చున్న వృద్ధురాలిని గమనించాడు. ఏమైనా సాయం కావాలా? అని ప్రశ్నించాడు. అందుకు వృద్ధురాలు అయ్యా! లాక్డౌన్ ఉంది కదా, అందుకే చేపలు తిని చాలా రోజులయ్యింది, కొంచెం చేపలు కొనివ్వండని అమాయకంగా అడగటంతో ఏఎస్పీ వెంటనే స్పందించారు. చేపలు కొనుక్కోని రావాలని ఆయన తన సిబ్బందిని ఆదేశించారు. కుళచ్చల్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రాధాకృష్ణన్, ఏఎస్ఐ అలెక్స్ హార్బర్‌కు వెళ్లి చేపలు కొనుగోలు చేసి వృద్ధురాలికివ్వడంతో స్థానికులు వారిని ప్రశంసలతో ముంచెత్తారు. (పోలీసులపై దాష్టీకాలా?) -
పోలీసు చర్యతో యువకుడికి తీవ్ర గాయాలు
-
సత్వర దర్యాప్తు..ఉరిశిక్ష పడేలా చార్జిషీట్
సాక్షి ప్రతినిధి, చెన్నై: దేశవ్యాప్తంగా కలకలం రేపిన చెన్నై దివ్యాంగ బాలికపై రేప్ కేసులో విచారణ ప్రక్రియను వేగవంతం చేయాలని తమిళనాడు పోలీసులు పట్టుదలగా ఉన్నారు. 3 నెలల్లోగా విచారణ ముగించి, నిందితులకు ఉరిశిక్ష పడేలా చేయాలని చూస్తున్నారు. చెన్నైలోని అయనవరం ప్రాంతంలోని ఒక అపార్ట్‌మెంట్‌కు చెందిన దివ్యాంగ బాలిక(11)పై ఏడునెలలుగా అత్యాచారానికి పాల్పడుతున్న 23 మందిలో 17 మందిని పోలీసులు అరెస్ట్ చేయడం తెల్సిందే. ‘అయనవరం రేప్ కేసు ఒక్కటేకాదు లైంగిక నేరాల కేసులన్నీ త్వరగా∙విచారణ పూర్తి చేయాలి, కోర్టులు ఇలాంటి ఉదంతాలపై విచారణను వేగంగా ముగించి నిందితులను శిక్షించాలి’ అని మద్రాసు హైకోర్టు సీజే ఇందిరా బెనర్జీ బుధవారం పోలీసులు ఆదేశించారు. నిందితుల్లో 17 మంది నుంచి వాంగ్మూలం తీసుకుని రిమాండ్‌కు పంపారు. మిగతా వారి గాలింపు కోసం 50 మంది పోలీసులతో 5 బృందాలు ఏర్పడ్డాయి. రెండేళ్ల క్రితం చెన్నైకి చెందిన హాసిని అనే ఏడేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసి హతమార్చిన దశ్వంత్ అనే యువ ఇంజనీరుకు కోర్టు ఉరిశిక్ష విధించింది. సుప్రీంకోర్టు ఉరిశిక్ష వేసింది. ఈ తరహాలో అయనవరం నిందితులకు ఉరిశిక్ష పడేలా పగడ్బందీగా చార్జిషీటు వేయాలని పోలీసులు పట్టుదలతో ఉన్నారు. నిందితులపై హత్యాయత్నం, ఫోక్సోచట్టం సెక్షన్ల కింద పోలీసులు కేసు పెట్టారు. ఈ సెక్షన్లపై కేసులు పెడితే ఉరిశిక్షకు అవకాశాలు ఎక్కువ. -
కుష్బూ తప్పక కోర్టుకు హాజరుకావాలి
తమిళసినిమా : నటి కుష్బూకు మేటూర్ కోర్టు ఈ నెల 12వ తేదీన తప్పక హాజరుకావాలని నోటీసులు జారీ చేసింది. వివరాల్లోకి వెళ్లితే 2005లో తమిళ మహిళల గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నటి కుష్బూపై రాష్ట్ర వ్యాప్తంగా మహిళా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఆ సంఘటన తీవ్ర దుమారాన్నే రేపింది. అంతే కాదు మురుగన్ అనే న్యాయవాది మెటూర్ మేజిస్ట్రేట్ నేర విభాగ కోర్టులో కుష్బూపై పిటిషన్ దాఖలు చేశారు. అప్పట్లో కేసు విచారణకు కుష్బూ కోర్టుకు హాజరు కాకపోవడంతో ఆమెపై అరెస్ట్ వారెంట్ కూడా జారీ అయ్యింది. తరువాత కుష్బూ విచారణకు హాజరుకావడంతో అరెస్ట్ వారెంట్‌ను కోర్టు రద్దు చేసింది. కుష్బు న్యాయస్థానంలో హాజరవుతున్న సమయంలో కొందరు ఆమె కారుపై టామాటలు, కోడిగుడ్లు విసిరారు. దీనిపై మేటూర్ తాహసీల్దారు పయాస్ అహ్మద్‌ఖాన్, డీఎంకేకు చెందిన అరివళగన్ తదితర 41 మందిపై పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ కేసులో కుష్బూ, అప్పటి పోలీస్‌ఇన్‌స్పెక్టర్ దినకరన్‌లను విచారించాలని కోరుతూ ప్రభుత్వ న్యాయవాది జగన్నాథన్ మేటూర్ మేజిస్ట్రేట్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసు న్యాయమూర్తి రాజా సమక్షంలో విచారణలో ఉంది. నిందితుల తరఫున న్యాయవాది మురుగన్ వాదిస్తున్నారు. ఈ కేసు తాజాగా సోమవారం తుది విచారణకు వచ్చింది. న్యాయమూర్తి రాజా ఈ కేసు వ్యవహారంలో నటి కుష్బూ, ఇన్స్పెక్టర్ దినకరన్‌లు ఈ నెల 12వ తేదీన కోర్టుకు హాజరుకావాలని ఆదేశాలు జారీ చేశారు. -
నెల్లూరు మేయర్‌పై చీటింగ్ కేసు
సాక్షి, నెల్లూరు : నెల్లూరు మేయర్ అబ్దుల్ అజీజ్‌కు షాక్ తగిలింది. స్టార్ ఆగ్రో పేరుతో మోసాలకు పాల్పడ్డారనే ఆరోపణలతో మేయర్ తో పాటు అతని సోదరుడు జలీల్, డైరెక్టర్ అనిల్ పై మద్రాస్ పోలీస్ కమిషనరేట్‌లో చీటింగ్ కేసు నమోదు అయింది. ప్రసాద్ జెంపెక్స్ అనే కంపెనీ.. స్టార్ ఆగ్రోలో వాటా కోసం ఇచ్చిన రూ.42కోట్లు తమ ఖాతాల్లోకి మళ్లించుకున్నారంటూ...గతేడాది డిసెంబర్లో ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదును పరిశీలించిన అనంతరం మద్రాస్ సీసీబీ (సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ ) అండర్ సెక్షన్ 406,420, 506, రెడ్ విత్ 120-బి కేసులు నమోదు చేసింది. మరోవైపు మేయర్ అజీజ్ సోదరులు ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించారు. కాగా అబ్దుల్ అజీజ్‌పై చీటింగ్ కేసు వ్యవహారంలో అధికార టీడీపీలో కలకలం రేపుతోంది. -
స్టేషన్లోనే కొట్టుకున్న సీఐ, ఎస్ఐ..!
సాక్షి, చెన్నై: ఇద్దరు పోలీసు అధికారులు పరస్పరం దూషించుకోవడమే కాకుండా ఒకరిమీద ఒకరు పడి కొట్టుకున్నారు. ఈ ఘటన తమిళనాడులోని కృష్ణగిరి జిల్లా పోచ్చంపల్లి సమీపంలోని మత్తూర్ పోలీస్ స్టేషన్లో బుధవారం చోటుచేసుకుంది. ఈ స్టేషన్లో సర్కిల్ ఇన్స్పెక్టర్గా రామ అండవర్, ఎస్ఐగా పార్తీబన్లు విధులు నిర్వహిస్తున్నారు. ఎస్ఐ పార్తీబన్ బుధవారం ఆలస్యంగా వచ్చాడని సీఐ రామ అండవర్ తప్పుగా మాట్లాడినట్లు సమాచారం. దీంతో ఇద్దరికి తగాదా ఏర్పడి కొట్టుకునేందుకు దారి తీసిందని స్టేషన్‌కు వచ్చిన స్థానికుల ద్వారా తెలిసింది. ఆవేశంతో ఇన్స్పెక్టర్ రామ ఆండవర్, పార్తీబన్ ముక్కుపై బలంగా కొట్టాడు. దీంతో ఆయన కింద పడిపోయాడు. ఆపై ఇద్దరు కిందపడి కొట్టుకున్నారు. అనంతరం గాయాలైన ఇద్దరినీ మత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై జిల్లా ఎస్పీ మహేశ్ కుమార్ విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని డీఎస్పీని ఆదేశించారు. -
పోలీసుల అదుపులో పాక్ జాతీయుడు!
చెన్నై: తమిళనాడు పోలీసులు ఆదివారం ఓ పాకిస్థాన్ జాతీయుడిని అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడ్డ వ్యక్తిని డ్రగ్స్ పెడ్లర్‌గా అనుమానిస్తున్నారు. డ్రగ్స్ మాఫియాతో అతడికి సంబంధాలు ఉన్నట్టు భావిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ త్వరలో తమిళనాడు పర్యటనకు రాబోతున్నారు. ఈ నేపథ్యంలో అనుమానాస్పదంగా పాక్ జాతీయుడు పట్టుబడటంతో రాష్ట్రంలో అలర్ట్ ప్రకటించారు. ప్రధాని పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. -
రేషన్ బియ్యం స్వాధీనం
గుమ్మిడిపూండి: రైలులో ఆంధ్రాకు అక్రమంగా తరలించేందుకు సిద్ధం చేసిన రెండు టన్నుల రేషన్ బియ్యాన్ని తమిళనాడు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చెన్నై సెంట్రల్ నుంచి గుమ్మిడిపూండి మీదుగా తడ, సూళ్లూరుపేట, నెల్లూరుకు వెళ్లే యూనిట్ రైలులో కొందరు రేషన్ బియ్యాన్ని ఆక్రమంగా రవాణా చేస్తున్నారని గుమ్మిడిపూండి టీఎస్ఓ ఇళవరసికి సమాచారం అందింది. దీంతో ఆమె రెండు రోజులుగా తన సిబ్బందితో గుమ్మిడిపూండి, కవరపేట, తదితర స్టేషన్లలో విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఆ సమయంలో ప్లాట్‌ఫాం పక్కన ముళ్లపొదల్లో దాచిన బియ్యం బస్తాలను గుర్తించి అధికారులు వాటిని స్వాధీనం చేస్తున్నారు. బియ్యం బస్తాలను పంజెట్టిలోని పౌరసరఫరాల శాఖ గోదాముకు తరలించారు. -
పోలీసులా.. మజాకా...!
– 74 ఏళ్ల వృద్ధుడిపై గంజాయి కేసు – కోర్టు ప్రశ్నలతో పోలీసుల ఉక్కిరి బిక్కిరి – సమగ్ర విచారణకు ఆదేశం చెన్నై: పోలీసులు తలచుకుంటే తప్పు చేయని వాడి మీద కూడా కేసుల మోతతో ఊచలు లెక్కించేలా చేస్తారన్న నానుడికి అద్దంపట్టే రీతిలో ఇటీవల ఓ వృద్ధుడి మీద కేసు నమోదైంది. 74 ఏళ్ల వృద్ధుడిపై గంజాయి కేసు పెట్టడం కోర్టును సైతం విస్మయంలో పడేసినట్టుంది. కోర్టు ప్రశ్నలతో చెన్నై పోలీసులు ఉక్కిరి బిక్కిరి కావాల్సిన పరిస్థితి. సమగ్ర విచారణకు ఆదేశిస్తూ, ఆ వృద్ధుడికి నిబంధనలతో కూడిన బెయిల్ మంజూరు అయింది. ఆర్కేనగర్ – మణలి రోడ్డులో ఉన్న ఎలిల్ నగర్‌కు చెందిన వేదక్కన్ నాడార్ (74)పై గత నెల పోలీసులు ఓ కేసు పెట్టారు. రెండు కేజీల వంద గ్రామాలు గంజాయిని తన ఇంటి బీరువాలో దాచి ఉంచిన అభియోగంపై ఆర్కేనగర్ పోలీసులు ఆయన్ను అరెస్టు చేశారు. ఆగమేఘాలపై కోర్టుకు హాజరు పరిచి కటకటాల్లోకి నెట్టారు. కోర్టు ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి : పిటిషనర్ తరపున న్యాయవాది ఆర్ రాజన్ హాజరై వాదన వినిపించారు. రూ 1000 కోట్ల విలువచేసే 250 ఎకరాల స్థలాన్ని కబ్జా చేయడానికి ప్రయత్నాలు సాగాయని, సాగుతున్నాయని, ఇందుకు అడ్డుగా ఉన్న వేదక్కన్ నాడార్‌ను గురిపెట్టి ఈ తప్పుడు కేసు బనాయించారని వాదించారు. పోలీసులు కాలయాపణ చేస్తూ రిట్ పిటిషన్ దాఖలు చేయడం లేదని బెంచ్ దృష్టికి తెచ్చారు. వాదనల అనంతరం న్యాయమూర్తి సంధించిన ప్రశ్నలకు పోలీసులు ఉక్కిరి బిక్కిరి కావాల్సిన పరిస్థితి. 74 వృద్ధుడి మీద ఈ కేసు నమోదు కావడం బట్టి చూస్తే, తప్పుడు కేసు బనాయించారా..? మరేదైనా కారణాలు ఉన్నాయా..? ఉంటే, సమగ్ర విచారణకు సాగించాల్సి ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ కేసును ప్రత్యేక అధికారి ద్వారా విచారించేందుకు తగ్గ చర్యలు చేపట్టాలని చెన్నై పోలీసు కమిషనర్‌కు ఆదేశాలు ఇచ్చారు. అలాగే, వేదక్కన్ నాడార్కు నిబంధనలతో కూడిన బెయిల్ మంజూరు చేశారు. -
రూ.45 కోట్ల పాత కరెన్సీ స్వాధీనం
చెన్నై: రద్దు అయిన పాత నోట్లను భారీ మొత్తంలో తమిళనాడు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సుమారు రూ. 45 కోట్ల పాత కరెన్సీని పోలీసులు గురువారం ఉదయం పట్టుకున్నారు. చెన్నైలోని కోడంబక్కంలో ఉన్న వస్త్ర దుకాణం రామలింగం అండ్ కో లో ఈ మొత్తం సొమ్మును స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు ఆ దుకాణంలో విస్తృత స్థాయిలో సోదాలు నిర్వహిస్తున్నారు. ఆ షాపు యజమాని దండపాణిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఓ జ్యూవెలరీ వ్యాపారికి సంబంధించిన సొమ్ము తన దగ్గర ఉన్నట్లు ఆయన చెబుతున్నారు. అయితే కానీ పోలీసులు మాత్రం పాత కరెన్సీపై ఆరా తీస్తున్నారు. అవినీతి, లంచాల వల్ల వచ్చిన సొమ్ము అయి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. -
జైలు ... కరెన్సీ ... విదేశాలకు పెళ్లాంతో పరారీ
చెన్నై : కరెన్సీని ఎరవేస్తే చాలు కటకటాల నుంచి విముక్తి పొందవచ్చని నిరూపించాడో యావజ్జీవ ఖైదీ. కాపలా పోలీసులకు రూ.40 లక్షలు లంచం ఇచ్చి భార్యతో సహా విదేశాలకు చెక్కేశాడు. కడలూరు జిల్లా బన్రుట్టీ తాలూకాకు చెందిన తవమణి (30) ఒక హత్య కేసు, పూణేలో మరో హత్య కేసులో నిందితుడిగా, గ్రూప్ 2 ప్రశ్నపత్రాల లీకు కేసులో ఖైదీగా అక్కడి జిల్లా జైలులో యావజ్జీవ శిక్షను అనుభవిస్తున్నాడు. కడలూరు జైలులో ఉన్నపుడు ఊచలు కోసి తప్పించుకునే ప్రయత్నంలో పట్టుబడ్డాడు. దీంతో అతన్ని తిరుచ్చి సెంట్రల్ జైలుకు మార్చారు. పూణే కేసు విషయమై అక్కడి కోర్టులో హాజరుపరిచేందుకు గత నెల 24న రైలులో తీసుకెళుతుండగా తవమణి తప్పించుకున్నాడు. దీంతో సాయుధదళానికి చెందిన ఎస్ఐ ఇళంగోవన్ తదితర ఐదుగురు పోలీసులు సస్పెండయ్యారు. తప్పించుకున్న తవమణి కోసం గాలింపు జరుపుతుండగా ప్రకాష్, మణికంఠన్ అనే పేరుమోసిన రౌడీలు పట్టుపడ్డారు. తవమణి తప్పించుకోలేదని, తిరుచ్చి పోలీసులు రూ.40లక్షలు లంచం తీసుకుని తాముగా విడిచిపెట్టారని ఆ రౌడీ షీటర్లు చెప్పారు. తవమణి వద్ద రూ.200 కోట్ల నగదు ఉందని, భార్యతో సహా విదేశాలకు వెళ్లిపోయాడని చెప్పారు. -
దొంగలు అరెస్ట్ ... భారీగా బంగారం స్వాధీనం
వేలూరు: వేలూరు, క్రిష్ణగిరి జిల్లాల్లో వేర్వేరు కేసులకు సంబంధించి 238 సవర్ల బంగారు నగలను స్వాధీనం చేసుకొని నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు నార్త్ జోన్ ఐజీ మంజునాథ తెలిపారు. ఆదివారం సాయంత్రం ఆయన వేలూరు ఎస్పీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. తిరుపత్తూరు రీజినల్‌లోని కందిలి పోలీస్ స్టేషన్ పరిధిలోని కాగంగరై వద్ద గత నెల 5న జరిగిన చైన్ స్నాచింగ్ కేసుకు సంబంధించి ఓమకుప్పం గ్రామానికి చెందిన గుణ, ఆలంగాయంకు చెందిన రామన్, చిత్తూరుకు చెందిన త్యాగు, ప్రతాప్‌ను అదుపులోకి తీసుకొని విచారణ జరిపారు. వేలూరు, కృష్ణగిరి జిల్లాల్లో 53 చోట్ల చోరీలు చేసి 238 సవర్ల బంగారం, నగదును చోరీ చేసినట్లు వాటిని అక్కడక్కడ విక్రయించినట్లు వారు విచారణలో తెలిపారు. వీటిలో వేలూరు జిల్లాకు 48 కేసులకు సంబంధించి 219 సవర్ల బంగారం, క్రిష్ణగిరి జిల్లాకు సంబంధించి 20 సవర్ల బంగారు నగలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ బంగారాన్ని విచారణ జరిపి యజమానులకు అప్పగిస్తామన్నారు. అదే విదంగా వేలూరు జిల్లాలోని వాలాజకు చెందిన పారిశ్రామిక వేత్త గోపిని కిడ్నాప్ చేసి రూ.50 లక్షలు డిమాండ్ చేసిన కేసులో ఒకే రోజులో నిందితులను సెల్‌ఫోన్ ఆదారంగా పట్టుకున్నట్లు తెలిపారు. శనివారం ఉదయం గోపిని కిడ్నాప్ చేసిన దుండగులు సెల్‌ఫోన్ ఆధారంగా నిందితులు ఆంధ్ర, చిత్తూరులోని గంగనపల్లిలోని ఒక ఇంటిలో దాచి ఉంచినట్లు కనుగొని ఆర్కాడుకు చెందిన రాజగోపాల్, గంగనపల్లికి చెందిన వినోద్‌ను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. అనుమానితులు కనిపిస్తే నంబర్‌కు 9488835716 ఫోన్‌గానీ, మెసేజ్ గానీ చేస్తే సంబంధిత పోలీసులు చేరుకుంటారన్నారు. ఎస్పీ విజయకుమార్ మాట్లాడుతూ 60 ఏళ్లు పైబడిన వారు వేరుగా ఒక ఇంటిలో ఉండరాదని అలా ఉంటే పోలీసుల నెంబర్‌ను పెట్టుకోవాలన్నారు. -
మలద్వారంలో 349 బంగారు బిస్కెట్లు
చెన్నై: శ్రీలంక నుంచి భారత్‌కు అక్రమంగా తరలిస్తున్న 14 కిలోల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు సినీపక్కీలో పట్టుకున్నారు. విమానాశ్రయాల్లో నిఘా పెరగడంతో స్మగ్లర్లు సముద్రమార్గాన్ని ఎంచుకున్నారు. నాగపట్నం జిల్లా నాగూరు నుంచి కారులలో భారీ ఎత్తున బంగారాన్ని తరలిస్తున్నట్లు అధికారులకు సమాచారం అందింది. దీంతో గురువారం అర్ధరాత్రి నుంచి నిఘాపెట్టారు. తెల్లవారుజామున వాంజూరు చెక్‌పోస్టు వద్ద వాహనాలను తనిఖీ చేస్తుండగా ఒక కారు నిలపకుండా వెళ్లిపోయింది. అధికారులు వెంటనే ఆ వాహనాన్ని వెంబడించారు. ఎట్టకేలకు కారైక్కాల్ సమీపం పట్టిన్నం అనే ప్రాంతంలో కారును పట్టుకోగలిగారు. కారు సీటు కింద ఉన్న పార్శిల్‌ను విప్పిచూడగా అందులో 14 కిలోల బంగారు బిస్కెట్లు లభ్యమయ్యాయి. కారులో ఉన్న నాగూర్‌కు చెందిన ఇద్దరు యువకులను అరెస్ట్ చేశారు. ఇదిలావుండగా మరో బంగారు అక్రమరవాణా కేసులో శ్రీలంక నుంచి తిరుచ్చీకి గురువారం సాయంత్రం శ్రీలంకన్ విమానం వచ్చింది. ప్రయాణికులను తనిఖీ చేస్తుండగా ఒక వ్యక్తి నడకతీరుపై అధికారులకు అనుమానం కలిగింది. అతన్ని ప్రత్యేక గదికి తీసుకెళ్లి తనిఖీ చేయగా, మలద్వారం వద్ద దాచిపెట్టి ఉన్న రూ.10 లక్షల విలువైన 349 బంగారు బిస్కెట్లు లభ్యమైనాయి. చెన్నై సాలిగ్రామానికి చెందిన మహమ్మద్ బషీర్ (59) అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. -
మోసం చేశాడు... పెళ్లి చేసుకున్నాడు
టీనగర్: ఊత్తుకోటలో యువతిని మోసగించిన యువకుడు పోలీసులకు చిక్కగానే వివాహం జరిపించారు. ఊత్తుకోట సమీపానగల కల్కాలవోడై గ్రామానికి చెందిన యువతి మణిమేగలై (21). శ్రీపెరంబుదూరులోగల ఒక ప్రైవేటు కంపెనీలో పనిచేస్తుంది. అదే గ్రామానికి చెందిన వెంకటేశన్ (28). టీచర్ ట్రైనింగ్ పూర్తి చేసి ఉద్యోగాన్వేషణలో ఉన్నారు. మణిమేగలై, వెంకటేశ్ రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. మణిమేగలై సంపాదనతో తరచూ బయటి ప్రదేశాలకు వెళ్లి ఆమెతో చనువుగా గడిపేవాడు. తనను వివాహం చేసుకోవాలని మణిమేగలై ఒత్తిడి తెస్తూ వచ్చింది. ఏడాది తర్వాత చేసుకుందామని ఆమెతో చెప్పాడు. ఈ క్రమంలో వెంకటేశ్ అదృశ్యమయ్యాడు. తాను మోసపోయినట్లు తెలుసుకున్న మణిమేగలై ఊత్తుకోట మహిళా పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు వెంకటేశన్‌ను అదుపులోకి తీసుకున్నారు. మణిమేగలైను వివాహం చేసుకోకుంటే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని తెలిపారు. దీంతో అతను వివాహానికి ఒప్పుకున్నాడు. ఊత్తుకోట రవాణా సంస్థ వర్కుషాప్ సమీపంలోగల అమ్మవారి ఆలయంలో మణిమేగలైను వెంకటేశన్ వివాహం చేసుకున్నాడు. దీంతో మణిమేగలై తన ఫిర్యాదును వాపసు తీసుకుంది. -
కాంగ్రెస్ నాయకుడి కారు నుంచి రూ.కోటి స్వాధీనం
తిరువొత్తియూరు: కోవైలో కాంగ్రెస్ నాయకుడి కారులో తీసుకెళ్తున్న రూ. కోటి నగదును ఇన్‌కంటాక్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కోవై కార్పొరేషన్ పోలీసు కంట్రోల్ రూంకు గురువారం సాయంత్రం ఓ ఫోన్‌కాల్ వచ్చింది. సాయిబాబా కాలనీ పోలీసుస్టేషన్ పరిధికి చెందిన చెక్‌పోస్టు మార్గంగా ఒక వ్యక్తి కారులో రూ. కోటి నగదును తీసుకెళ్తున్నట్టు ఫోన్లో మాట్లాడిన వ్యక్తి తెలిపాడు. దీంతో సాయిబాబా కాలనీ తనిఖీ కేంద్రం వద్ద పోలీసులు తీవ్ర నిఘా జరిపారు. వేలట్టుపాళయంలో గౌండమ్మ పాళయం వద్ద కారును పోలీసులు నిలిపి తనిఖీ చేశారు. కారు లోపల కోవై పీలమేడు ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు ఒకరు ఉన్నారు. అతని వద్ద ఉన్న పెట్టెను తనిఖీ చేయగా అందులో రూ. కోటి నగదు ఉన్నట్టు గుర్తించారు. నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విచారణలో అతని పేరు రాధాకృష్ణన్, పీలమేడు కొండసామి వీధికి చెందిన ఇంజినీర్ అని తెలిసింది. కాంగ్రెస్ శాసన సభ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉన్నాడు. ఆ నగదు గురించి విచారించగా తనకు స్థలాన్ని విక్రయించగా వచ్చిననగదును తీసుకొస్తున్నట్టు రాధాకృష్ణన్ తెలిపారు. కాని అందుకు తగిన ఆధారాలు చూపకపోవడంతో పోలీసులు నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
ఇద్దరు దొంగలు అరెస్ట్ : వంద సవర్ల నగలు స్వాధీనం
తిరువొత్తియూరు: విలుపురం జిల్లాలో పలు ప్రాంతాల్లో చోరీకి పాల్పడిన ఇద్దరిని పోలీసు లు అరెస్ట్ చేశారు. వారి నుంచి 100 సవర్ల నగలు స్వాధీనం చేసుకున్నారు. విలుపురం జిల్లా చిన్నసేలం గాంధీనగర్‌కు చెందిన గిరిపురుషోత్తమకుమార్ తొట్టియు ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడు. కొన్ని రోజుల ముందు ఇతని ఇంటిలో రూ. 3లక్షల విలువ గల నగలు, చోరీ అయ్యూయి. పోలీసులు విచారణ చేపట్టారు. చిన్నసేలం ముంగిల్ పాడి రోడ్డులో బుధవారం రాత్రి పోలీసులు గస్తీ నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా నిలబడి వున్న వ్యక్తిని పట్టుకుని పోలీసులు విచారణ చేశారు. విచారణలో అతను చిన్నసేలం, కాట్టుకోటైకు చెందిన చిన్నదురై (40) అని తెలిసింది. చిన్నదురై, అతని సహచరుడు వెంకటేశన్ (35) కలిసి పలు ప్రాంతాల్లో చోరీలు చేసినట్టు నేరాలను అంగీకరించారు. నగలను నామక్కల్ లో విక్రయించినట్టు తెలిసింది. పోలీసులు ఇద్దరిని అరెస్టు చేసి దుకాణంలో విక్రయించిన 100 సవర్ల నగలను స్వాధీనం చేసుకున్నారు. -
గంజాయి కేసులో సహాయ నటుడి అరెస్ట్
పాఠశాల, కళాశాల విద్యార్థులకు గంజాయి విక్రయిస్తున్న సినీ సహాయ నటుడిని స్నేహితునితోపాటు పోలీసులు అరెస్టు చేశారు. విద్యార్థులకు గంజాయి సరఫరా చేస్తున్నట్లు పోలీసులకు రహస్య సమాచారం అందింది. దీంతో సెంట్రల్ క్రైం బ్రాంచి డెప్యూటీ కమిషనర్ జయకుమార్ నేతృత్వంలో ఇన్స్పెక్టర్ శివరాంకుమార్, ఎస్ఐలు మునిరాజ్, ఆంతోని, ఏళుమలై ఆధ్వర్యంలో ప్రత్యేక దళం ఏర్పాటయింది. వీరు ఐస్ హౌస్ ప్రాంతంలో తనిఖీలు జరిపి, ట్రిప్లికేన్ శివరాజపురానికి చెందిన కృష్ణమూర్తి (29)ని, స్నేహితుడు యూసఫ్ (29) అదుపులోకి తీసుకున్నారు. వీరు పాఠశాల, కళాశాల విద్యార్థులకు గంజాయి విక్రయిస్తున్నట్లు అంగీ కరించారు. వీరిని పోలీసులు అరెస్టు చేసి పుళల్ జైలుకు తరలించారు. విచారణలో మూర్తి వడకరి అనే చిత్రం సహా పదికి పైగా చిత్రాల్లో నటించినట్లు తెలిసింది. -
కూతురిని బలిచ్చేందుకు ప్రయత్నం : తండ్రి అరెస్ట్
గుప్త నిధుల కోసం కన్న కూతురిని బలి ఇచ్చేందుకు ప్రయత్నించిన కేరళ మంత్ర వాదితో పాటు నలుగురిని పోలూరు పోలీసులు అరెస్ట్ చేశారు. తిరువణ్ణామలై జిల్లా పోలూరు తాలుకా పోలాసూర్ గ్రామానికి చెందిన రైతు లక్ష్మణన్. ఇతనికి సొంతమైన వ్యవసాయ భూమి విలాపాక్కం గ్రామంలో ఉంది. లక్ష్మణన్ కోటీశ్వరుడు కావాలని ఆశ పడ్డాడు. దీంతో అప్పడప్పుడు కేరళకు వెళ్లి అక్కడ మంత్రవాదితో మాట్లాడి వచ్చేవాడు. అప్పుడు లక్ష్మణన్ భూమిలో గుప్త నిధులు ఉన్నట్లు వాటిని తీసేందుకు కన్నెపిల్లను గుంతలో పెట్టి పూజలు చేయాలని మంత్రవాది తెలిపాడు. ఇందుకు లక్ష్మణన్ తన పెద్ద కుమార్తెను పెట్టి పూజలు చేసేందుకు అంగీకరించాడు. ఆది వారం రాత్రి 10 గంటలకు విలాపాక్కం లోని లక్ష్మణన్ భూమి వద్ద లక్ష్మణన్ పెద్ద కుమార్తె సుగంధి(16)ని చాపమీద పడుకోబెట్టి పూజలు చేశాడు. కుమార్తెను బలి ఇస్తే తప్పా గుప్త నిధులను తీసేందుకు కుదరదని మంత్రవాది తెలిపాడు. వీఏవో కవిత పోలీసులకు ఫిర్యాదు చేశారు. మంత్రవాది కేరళ మంత్రవాది రేగి, భూమి యజమాని లక్ష్మణన్, బంధువులు పేట్టూ గ్రామానికి చెందిన పద్మనాభన్, కణ్ణన్ వీధికి చెందిన మురుగన్‌లను పోలీసులు అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నారు.