ఇద్దరు దొంగలు అరెస్ట్ : వంద సవర్ల నగలు స్వాధీనం | Large amount of gold ornaments seized by Tamilnadu police | Sakshi
Sakshi News home page

ఇద్దరు దొంగలు అరెస్ట్ : వంద సవర్ల నగలు స్వాధీనం

Published Fri, Aug 8 2014 8:40 AM | Last Updated on Thu, Aug 2 2018 4:01 PM

ఇద్దరు దొంగలు అరెస్ట్ : వంద సవర్ల నగలు స్వాధీనం - Sakshi

ఇద్దరు దొంగలు అరెస్ట్ : వంద సవర్ల నగలు స్వాధీనం

తిరువొత్తియూరు: విలుపురం జిల్లాలో పలు ప్రాంతాల్లో చోరీకి పాల్పడిన ఇద్దరిని పోలీసు లు అరెస్ట్ చేశారు. వారి నుంచి 100 సవర్ల నగలు స్వాధీనం చేసుకున్నారు. విలుపురం జిల్లా చిన్నసేలం గాంధీనగర్‌కు చెందిన గిరిపురుషోత్తమకుమార్ తొట్టియు ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడు. కొన్ని రోజుల ముందు ఇతని ఇంటిలో రూ. 3లక్షల విలువ గల నగలు, చోరీ అయ్యూయి. పోలీసులు విచారణ చేపట్టారు.

చిన్నసేలం ముంగిల్ పాడి రోడ్డులో బుధవారం రాత్రి పోలీసులు గస్తీ నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా నిలబడి వున్న వ్యక్తిని పట్టుకుని పోలీసులు విచారణ చేశారు. విచారణలో అతను చిన్నసేలం, కాట్టుకోటైకు చెందిన చిన్నదురై (40) అని తెలిసింది. చిన్నదురై, అతని సహచరుడు వెంకటేశన్ (35) కలిసి పలు ప్రాంతాల్లో చోరీలు చేసినట్టు నేరాలను అంగీకరించారు.  నగలను నామక్కల్ లో విక్రయించినట్టు తెలిసింది. పోలీసులు ఇద్దరిని అరెస్టు చేసి దుకాణంలో విక్రయించిన 100 సవర్ల నగలను స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement