seized
-
37 కిలోలు, రూ.75 కోట్లు!
న్యూఢిల్లీ/బనశంకరి: కర్నాటక పోలీసులు 37 కిలోల ఎండీఎంఏ (మెథిలీన్ డయాక్సీ మెథాంఫెటమైన్) అనే సింథటిక్ డ్రగ్‌ను పట్టుకున్నారు. దీని విలువ రూ.75 కోట్లని మంగళూరు పోలీస్ కమిషనర్ అనుపమ్ అగర్వాల్ ఆదివారం మీడియాకు తెలిపారు. గత సెప్టెంబరులో మంగళూరులో హైదర్ అలీ అనే వ్యక్తిని అరెస్ట్ చేసి 15 గ్రాముల ఎండీఎంఏ స్వాదీనం చేసుకున్నారు. అతడిచ్చిన సమాచారంతో బెంగళూరులో ఓ నైజీరియా దేశస్తున్ని పట్టుకోగా రూ.6 కోట్ల విలువైన ఎండీఎంఏ దొరికింది.ఇది అంతర్జాతీయ డ్రగ్స్ దందా అని, ఢిల్లీ, బెంగళూరు విమానాశ్రయాల ద్వారా అక్రమ రవాణా జరుగుతోందని గుర్తించారు. మంగళూరు పోలీసులు బాంబా ఫాంట్ (31), అబిగైల్ అడోనిస్(30) అనే దక్షిణాఫ్రికన్లను అరెస్ట్ చేసి ట్రాలీ బ్యాగుల్లో దాచిన 37 కిలోల ఎండీఎంఏ స్వాధీనం చేసుకున్నారు. ఎండీఎంఏను మోల్లీ, ఎక్స్టసీ అని పలు పేర్లతో పిలుస్తారు. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) ఇంఫాల్, గౌహతి జోన్లలో రూ.88 కోట్ల విలువైన మెథాంఫెటమైన్ డ్రగ్ టాబ్లెట్లను పట్టుకున్నట్లు కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలిపారు.ఇందుకు సంబంధించి అంతర్జాతీయ డ్రగ్స్ ముఠా సభ్యులైన నలుగుర్ని అదుపులోకి తీసుకున్నారని ఆదివారం ‘ఎక్స్’లో వెల్లడించారు. ‘‘ఎన్సీబీ ఇంఫాల్ జోన్ అధికారులు ఈ నెల 13న లిలాంగ్ ప్రాంతంలో ఓ ట్రక్కులో సోదాలు జరిపి టూల్‌బాక్స్‌లో దాచిన 102.39 కిలోల మెథాంఫెటమైన్ ట్యాబ్లెట్లను పట్టుకుని ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. అసోం సరిహద్దుల్లో ఓ వాహనం స్పేర్ టైర్లో దాచిన 7.48 కిలోల మెథాంఫెటమైన్ టాబ్లెట్లను పట్టుకున్నారు’’ అని తెలిపారు. -
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు ఎదురుదెబ్బ
ఢాకా: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు ఎదురుదెబ్బ తగిలింది. షేక్ హసీనా ఆస్తుల సీజ్‌కు ఢాకా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం ఆమె భారత్‌లో ఆశ్రయం పొందుతున్న సంగతి తెలిసిందే. షేక్ హసీనాతో పాటు, ఆమె కుటుంబ సభ్యుల ఆస్తులను కూడా సీజ్ చేయాలని ఢాకా కోర్టు ఆదేశాలిచ్చింది. దీంతో బ్యాంక్ అకౌంట్లను అధికారులు సీజ్ చేయనున్నారు.గత ఏడాది ఆగస్ట్‌లో బంగ్లాదేశ్‌లో అల్లర్లు చెలరేగగా, భారీ హింస చోటుచేసుకుంది. దీంతో ప్రధాని పదవికి రాజీనామా చేసిన ఆమె.. భారత్‌లో తలదాచుకుంటున్నారు. ఈ క్రమంలో హసీనాను బంగ్లాదేశ్‌కు రప్పించేందుకు ఆ దేశం చాలా ప్రయత్నాలు చేసింది. ఆమె పాస్ పోర్టును కూడా రద్దు చేసింది. హసీనాను తమ దేశానికి పంపించాలని భారత ప్రభుత్వానికి బంగ్లాదేశ్ కూడా లేఖ రాసింది. అయితే, తాజాగా ఢాకా కోర్టు హసీనా, ఆమె బంధువుల ఆస్తులు, బ్యాంక్ ఖాతాలను సీజ్ చేయాలని ఆదేశించింది.కాగా, భారత్‌లో తలదాచుకుంటున్న షేక్ హసీనాను బంగ్లాదేశ్‌కు రప్పించడమే తమ తొలి ప్రాధాన్యత అని ఆ దేశ ప్రభుత్వం ఇటీవల ఉద్ఘాటించింది. హసీనాను విచారించేందుకు ప్రయత్నాలను కొనసాగిస్తామని దేశ తాత్కాలిక సారథి మహమ్మద్ యూనస్ ప్రెస్ కార్యదర్శి షఫీకుల్ ఆలం తెలిపిన సంగతి తెలిసిందే. ‘‘హసీనా పార్టీ అవామీ లీగ్ భవితవ్యంపై నీడలు కమ్ముకున్నాయి...ఆ పార్టీ దేశ రాజకీయ ముఖచిత్రంలో ఉండాలా, వద్దా అనేది ప్రజలతో పాటు ఇతర పార్టీలు నిర్ణయిస్తాయి. హత్యలు, అదృశ్యాలు, నేరాలకు పాల్పడిన వారికి శిక్ష పడాల్సిందే’’ అంటూ ఆయన నొక్కి చెప్పారు. హసీనా ప్రభుత్వం మానవాళిపై నేరాలకు పాల్పడుతోందంటూ ఐరాస మానవ హక్కుల హైకమిషనర్ కార్యాలయం ఇచ్చిన నివేదికను ఉదాహరించారు. ఈ నేపథ్యంలో హసీనాను అప్పగించే విషయమై భారత్‌పై ఒత్తిడి పెరిగిందన్నారు. -
హైదరాబాద్ తాజ్ బంజారా హోటల్ సీజ్
-
హైదరాబాద్ లో భారీగా డ్రగ్స్ పట్టివేత
-
HYD: మేడ్చల్‌లో భారీగా డ్రగ్స్ పట్టివేత
సాక్షి,మేడ్చల్‌జిల్లా: మేడ్చల్ పట్టణంలో డ్రగ్స్ కలకలం రేపాయి. మేడ్చల్ బస్సుడిపో వద్ద మంగళవారం(డిసెంబర్ 10) భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. ఓ వ్యక్తి బస్సులో ప్రయాణిస్తూ మేడ్చల్ బస్సు డిపో వద్ద దిగాడు.డ్రగ్స్‌తో దిగుతున్నాడని ముందే సమాచారం అందుకున్న నార్కొటిక్స్ బ్యూరో అధికారులు అతని వద్ద నుంచి 600 గ్రాముల డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ స్వాధీనం చేసుకొని ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వివరాలు అధికారికంగా తెలియాల్సి ఉంది.ఇదీ చదవండి: లోన్ యాప్ వేధింపులకు యువకుడు బలి -
కుప్పంలో సీజ్ ది థియేటర్
చిత్తూరు, సాక్షి: సీఎం చంద్రబాబు ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పంలో.. అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కి కోపమొచ్చింది. తమ అభిమాన నటుడి సినిమా ప్రదర్శించకుండా అధికారులు ఓ థియేటర్‌ను సీజ్ చేయడంపై రగిలిపోతున్నారు. స్థానికంగా ఓ నేతకు చెందిన రెండు థియేటర్లలో పుష్ప 2 చిత్రం ప్రదర్శిస్తున్నారు. అయితే.. ఎన్వోసీ సర్టిఫికెట్ లేకుండా సినిమా ప్రదర్శిస్తున్నారంటూ అధికారులు షోలను అర్ధాంతరంగా నిలిపివేయించి మరీ తాళాలు వేశారు. దీంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. లైసెన్సు రెన్యూవల్ చేసుకోకుండా థియేటర్ రన్ చేస్తున్నారని అధికారులు చెబుతుండగా.. ఇది కక్ష సాధింపు చర్యలో భాగమై ఉండొచ్చంటూ ఫ్యాన్స్ వాదిస్తున్నారు. మరోవైపు వారాంతం కావడంతో కొత్త సినిమా చూద్దామని థియేటర్‌కు వస్తున్న ప్రేక్షకులు.. గేటుకు తాళాలు చూసి నిరాశతో వెనుదిరుగుతున్నారు. ఇదీ చదవండి: టార్గెట్ అల్లు అర్జున్.. రాజకీయ సెగ! -
ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పక్కదారి పడుతున్న రేషన్ బియ్యం
-
గుంటూరు జిల్లాలో భారీగా ఎర్రచందనం పట్టివేత
-
గచ్చిబౌలిలో గంజాయి కలకలం
-
భారీగా నగదు, బంగారం, మద్యం పట్టివేత
దాదర్: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అక్రమ డబ్బు రవాణాపై వివిధ శాఖల అధికారులు ప్రత్యేకంగా దృష్టిసారించాయి. అందులో భాగంగా అక్టోబరు 20వ తేదీ నుంచి ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన తర్వాత ముంబై, ఉప నగరాలు సహా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో రాష్ట్ర పోలీసులు, ఎక్సైజ్ శాఖ, ఆదాయ పన్ను శాఖ, రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు సంయుక్తంగా తనిఖీలు, నాకా బందీలు నిర్వహించారు. ఇందులో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు అక్రమంగా తరలిస్తున్న భారీ నగదు, విదేశీ డాలర్లు, బంగారు, వెండి ఆభరణాలు, మద్యం పట్టుకున్నారు. అయితే ఈ సొత్తు ఎవరిది..? ఎవరికి అందజేయడానికి వెళుతున్నారనే సమాచారాన్ని పోలీసులు గోప్యంగా ఉంచారు. రూ.187 కోట్ల విలువైన నగదు స్వాధీనం ఎన్నికలు సమీపించడంతో వివిధ ప్రాంతాలు, రాష్ట్రాల నుంచి అక్రమంగా డబ్బు, మద్యం రవాణా కావడం పరిపాటిగా మారింది. నాకాబందీలు, తనిఖీలు నిర్వహించినప్పటికీ పోలీసుల కళ్లు గప్పి అక్రమంగా డబ్బు, మద్యం రవాణా అవుతూనే ఉంది. అయినప్పటికీ పోలీసులు, వివిధ శాఖల అధికారులు డేగ కళ్లతో కాపుకాస్తూ కోట్లలో అక్రమ డబ్బు, డ్రగ్స్, మద్యాన్ని పట్టుకుంటున్నారు. ఎన్నికల కోడ్ అమలులోకి వచి్చన తరువాత వివిధ శాఖల పోలీసులు, అధికారులు చేపట్టిన తనిఖీల్లో ఇప్పటి వరకు ఏకంగా రూ.187.88 కోట్లు విలువచేసే సొత్తు హస్తగతం చేసుకున్నారు. ఇందులో రాష్ట్ర పోలీసు శాఖ ద్వారా రూ.75 కోట్లు, ఎక్సైజ్ శాఖ ద్వారా రూ.60 కోట్లు, ఆదాయ పన్ను శాఖ ద్వారా రూ.11 కోట్లు, మిగతా ఎన్నికల అధికారుల ద్వారా పట్టుకున్న సొత్తు ఉంది. అలాగే అక్రమంగా మద్యం తరలిస్తున్న, విక్రయిస్తున్న వారిపై 2,637 కేసులు నమోదు చేశారు. అందుకు బాధ్యులైన 2,460 నిందితులపై చర్యలు తీసుకున్నారు.అలాగే రూ.9.61 కోట్లు విలువచేసే మద్యం నిల్వలను జప్తు చేశారు. జప్తు చేసిన మద్యంలో విదేశీ, దేశీ, నాటుసారా, తెల్లకల్లు ఉన్నాయి. ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేందుకు తాము ప్రయతిస్తున్నట్లు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ అప్పర్ కమిషనర్ ప్రసాద్ సుర్వే అన్నారు. ఎన్నికల సమయంలో పార్టీ కార్యకర్తలను, ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు భారీగా మద్యం వినియోగించే అవకాశాలుంటాయి. దీంతో అక్రమ మద్యాన్ని అరికట్టేందుకు దాడులు, తనఖీలు చేస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. రహస్య పార్టీలపై నిఘా.. ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని అన్ని పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు పరితపిస్తున్నారు. అందుకు ఎంతైనా ఖర్చు చేయడానికి వెనకాడటం లేదు. కార్యకర్తలు సహా ఓటర్లను సంతోష పెట్టేందుకు రహస్యంగా మద్యం పారీ్టలు ఇస్తున్నారు. అంతేగాకుండా ఇంటింటికి వెళ్లి మద్యం బాటిళ్లు, డబ్బులు, బిర్యానీ ప్యాకెట్లు పంచుతుంటారు. దీంతో రాష్ట్ర ఎక్సైజ్ శాఖ అధికారులు ఇలాంటి రహస్య పారీ్టలపై నిఘా వేస్తున్నారు. అందుకు 56 ఫ్లయింగ్ స్క్వాడ్లను నియమించారు. కోడ్ అమలులోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు అక్రమంగా మద్యం రవాణా చేస్తున్న 164 మంది కార్యకర్తలను అదపపులోకి తీసుకున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా మద్యం రవాణాకు చెక్ పేట్టేందుకు సరిహద్దు ప్రాంతాల్లో 25 పరి్మనెంట్ చెక్ పోస్టులు, 26 తాత్కాలిక చెక్ పోçస్టులను ఏర్పాటు చేశారు. టోల్ నాకాల వద్ద కూడా తనిఖీలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా అహిల్యనగర్–పుణే జాతీయ రహదారిపై పార్నెర్ తాలూకా హద్దులో ఎన్నికల అధికారులు, పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన తనిఖీలో ఓ వాహనంలో సుమారు రూ.25 కోట్లు విలువచేసే బంగారం పట్టుకున్నారు. అయితే కార్టన్ బాక్స్‌లో ప్యాకింగ్ చేసిన ఈ బంగారం ఎవరిచ్చారు..? ఎవరికిచ్చేందుకు తీసుకెళుతున్నారనే వివరాలు వెల్లడించేందుకు పోలీసులు నిరాకరించారు. వాహనంలో డ్రైవర్, మరో ఇద్దరు వ్యక్తులున్నారు. అనుమానం వచ్చి వాహనాన్ని మరోసారి క్షుణ్ణంగా తనిఖీ చేయగా 45 కేజీల వెండి కడ్డీలు లభించాయి. దర్యాప్తు పూర్తయితే తప్ప పూర్తి వివరాలు బయటపడవని పోలీసులు చెబుతున్నారు. రాష్ట్రంలో 160 చెరుకు క్రషింగ్ ఫ్యాక్టరీలు, 36 దేశీ మద్యం తయారీ ఫ్యాక్టరీలు, 45 బీరు తయారుచేసే ఫ్యాక్టరీలు, 65 వైనరీ, 48 విదేశీ మద్యం తయారీ ఫ్యాక్టరీలు అలాగే 216 నాటుసారా విక్రయించే షాపులు, 262 విదేశీ మద్యం విక్రయించే షాపులు, 1,734 వైన్ షాపులు, 4,155 దేశీ మద్యం విక్రయించే షాపులున్నాయి. దీంతో ఓటింగ్, కౌంటింగ్ తంతు పూర్తయ్యేంత వరకు హోల్‌సెల్, రిటైల్ మద్యం షాపులపై సీసీ టీవీ కెమరాల ద్వారా నిఘా వేయనున్నారు. ప్రభుత్వ వాహనాలనూ వదిలిపెట్టొద్దు.. ఎన్నికలకు ముందు విచ్చల విడిగా అక్రమంగా డబ్బు రవాణా జరుగుతుంది. అందుకు సొంత, అద్దె వాహనాలతోపాటు పోలీసు వ్యాన్లను కూడా వినియోగించే ప్రమాదం లేకపోలేదు. అధికార దురి్వనియోగానికి పాల్పడుతూ కొందరు నేతలు పోలీసు జీపులు, వ్యాన్లలో డబ్బు రవాణా చేసే ఆస్కారముంది. దీంతో రాష్ట్ర సరిహద్దుల్లో, నగరాలు, పట్టణాల్లో నాకాబందీలు, తనిఖీలు చేసే సమయంలో పోలీసు వాహనాలతోపాటు ప్రభుత్వ వాహనాలను కూడా తనిఖీ చేయకుండా వదిలిపెట్టవద్దని ఎన్నికల సంఘం ఆదేశించింది. -
MH: కారులో 24 కోట్ల ఖరీదైన వజ్రాలు, నగలు సీజ్
ముంబై: మహారాష్ట్రలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం అధికారులు, పోలీసులు రాష్ట్రం అంతా తనిఖీలు చేపట్టారు. అహల్యానగర్ జిల్లాలోని టోల్ ప్లాజా సమీపంలో ఎన్నికల సంఘానికి చెందిన స్టాటిక్ సర్వియలెన్స్ బృందం గురువారం ఓ కారులో సోదాలు చేపట్టింది. కారులో ఉన్న విలువైన ఆభరణాలు ఉన్నట్లు గుర్తించారు. కారులోని సుమారు 24 కోట్ల విలువైన వజ్రాలు, బంగారం, వెండి నగలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.కారులో ముగ్గురు ప్రయాణికులు ఉండగా.. వారు చూపించిన రసీదులకు బంగారు అభరణాలకు విలువ సరిపోకపోవడంతో వాటిని సీజ్ చేశారు. తదుపరి విచారణ కోస ఆదాయపు పన్నుశాఖకు బదిలీ చేశారు. కారులో వజ్రాలు, బంగారం, సిల్వర్ జ్యూవెలరీకి చెందిన కన్సైన్మెంట్ ఉన్నట్లు పోలీసులు చెప్పారు. దక్షిణ ముంబైలోని జావేరి బజార్ నుంచి ఆ వాహనం స్టార్ట్ అయినట్లు సుపా పోలీసు అధికారి అరుణ్ అవద్ తెలిపారు. ఆభరణాలకు చెందిన రశీదు చూపించాలని కోరగా, కొన్ని రశీదులను చూపించారని, కానీ ఆ రశీదుల్లో ఉన్న అమౌంట్లో తేడా ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. స్వాధీనం చేసుకున్న ఆభరణాల గురించి ఆదాయపన్ను శాఖకు ఎస్ఎస్టీ పోలీసులు సమాచారం చేరవేశారు. ఛత్రపతి సాంబాజినగర్, అహల్యనగర్, జల్గావ్ జిల్లాల్లో ఆ ఆభరణాలను డెలివరీ చేయాల్సి ఉందన్నారు.అయితే, విలువైన వస్తువుల రవాణాకు, ఎన్నికలకు ఎలాంటి సంబంధం లేదని మహారాష్ట్ర జ్యువెలర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఫతేచంద్ రాంకా తెలిపారు. పోలీసులు ఆభరణాలు డిపాజిట్ చేసే ముందు నగల వ్యాపారులను పిలిచి ఉండాలని పేర్కొన్నారు. -
చందానగర్ డ్రగ్స్ కేసులో ట్విస్ట్
సాక్షి, హైదరాబాద్: నగరంలో డ్రగ్స్ కలకలం సృష్టిస్తున్నాయి. తాజాగా పోలీసులు భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. ఓ ఇంట్లో డ్రగ్స్ పార్టీకి ప్లాన్ చేయగా, పక్కా సమాచారంతో చందానగర్ పోలీసులు దాడులు చేశారు. రూ.18 లక్షలు విలువ చేసే 150 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్‌ను సీజ్ చేశారు. రాజస్థాన్ నుంచి డ్రగ్స్ తెచ్చి విక్రయిస్తున్నట్లు గుర్తించారు.అయితే, ఈ డ్రగ్స్ కేసులో ట్విస్ట్ చోటుచేసుకుంది. డ్రగ్ పెడ్లర్ కృష్ణరామ్‌ను పోలీసులకు ఓ డాక్టర్ పట్టించారు. కృష్ణరామ్ ఆహ్వానించడంతో పార్టీకి వెళ్లిన వైద్యుడు.. కృష్ణరామ్ బ్యాగ్‌లో డ్రగ్స్ చూసి పోలీసులకు సమాచారం అందించారు. కృష్ణరామ్ అరెస్ట్ చేయగా, మరో ఐదుగురు పరారీలో ఉన్నట్లు సమాచారం.గత రెండు రోజుల క్రితం ఓ మహిళ తన ఇంట్లో డ్రగ్స్‌ను ఎలాంటి అనుమతులు లేకుండా దాచిపెట్టి నగరంలోని పలు ప్రాంతాలకు సరఫరా చేస్తున్న వ్యవహారాన్ని రాష్ట్ర డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్, ఎక్సైజ్ విభాగం బట్టబయలు చేసిన సంగతి తెలిసిందే. బుధవారం సికింద్రాబాద్‌లోని రెజిమెంటల్ బజార్లో ఉన్న జీవీ సలూజా హాస్పిటల్లో ఆకస్మిక తనిఖీలు చేశారు. తనిఖీల సందర్భంగా భారీ స్థాయిలో అక్రమంగా నిల్వ ఉంచిన నార్కోటిక్స్ డ్రగ్స్‌తో పాటు మత్తు కలిగించే మందులను గుర్తించారు.ఇటీవల వనస్థలిపురంలో పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో డ్రగ్స్ విక్రయిస్తూ పట్టుబడ్డా బీటెక్ విద్యార్థి జాన్ పట్టుబడ్డాడు. పోలీసుల తనిఖీల్లో నెల్లూరు జిల్లాకు చెందిన బీటెక్ విద్యార్థి జాన్ వద్ద ఏడు గ్రాముల ఎండీఎంఏ డ్రగ్‌ను గుర్తించారు. డ్రగ్ ఎండీఎఏను గ్రాము రూ. 2500కు కొనుగోలు చేసి రూ.5వేల చొప్పున అమ్ముతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఎండీఎంఏ డ్రగ్‌ను స్వాధీనం చేసుకున్నారు.ఇదీ చదవండి: మయోనైజ్‌పై నిషేధం -
డ్రగ్ గుట్టు రట్టు 95 కిలోలు స్వాధీనం
-
ప్లీజ్ సార్.. ఒక్క బాటిల్..!
-
రాజేంద్రనగర్‌లో డ్రగ్స్ కలకలం.. నైజీరియన్ కిలాడీ లేడీ అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: నగరంలో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది. రాజేంద్రనగర్‌లో భారీగా డ్రగ్స్‌ను పోలీసులు సీజ్ చేశారు. 50 గ్రాముల ఎండీఎంఏ, 25 గ్రాముల కొకైన్‌ను సీజ్ చేశారు. నైజీరియన్ కిలాడీ లేడీని అరెస్ట్ చేయగా, మరో నలుగురు పరారీలో ఉన్నారు. బెంగుళూరు నుంచి హైదరాబాద్‌కు డ్రగ్స్ సరఫరా చేసి విక్రయిస్తున్నారు.భార్య, భర్తతో పాటు మరో ముగ్గురు డ్రగ్స్ విక్రయిస్తున్నట్లు సమాచారం. గత కొంత కాలంగా డ్రగ్స్ దందా కొనసాగుతోంది. ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నారు. నైజీరియాకు చెందిన తంబా ఫిడెల్మాను జైల్‌కు తరలించారు. సన్ సిటీని అడ్డాగా చేసుకొని డ్రగ్స్ దందా సాగుతోంది. -
Hyderabad: రాయదుర్గంలో భారీగా డ్రగ్స్ పట్టివేత
హైదరాబాద్: హైదరాబాద్‌లోని రాయదుర్గం పోలీసు స్టేషన్ పరిధిలో భారీగా డ్రగ్స్ పట్టుబడింది. 650 గ్రాముల హెరాయిన్‌ను పోలీసులు సీజ్ చేశారు. ఎస్ఓటీ, రాయదుర్గం పోలీసులు చేపట్టిన జాయింట్ ఆపరేషన్‌లో ఏడుగురిని అరెస్ట్ చేశారు. పట్టుబడిన నిందితులు రాజస్థాన్‌కు వాసులుగా పోలీసులు గుర్తించారు. రాజస్థాన్ గ్యాంగ్‌లో ముగ్గురు పెడ్లర్స్, నలుగురు కంజూమర్స్గా పోలీసులు గుర్తించారు. -
శంషాబాద్ లో భారీగా గంజాయి పట్టివేత
-
13 ఐఏఎస్ కోచింగ్ సెంటర్లు సీజ్
-
శిశు విక్రయ ఘటన.. కలెక్టర్ సీరియస్.. ఆసుపత్రి సీజ్
సాక్షి, కామారెడ్డి జిల్లా: శిశు విక్రయ ఘటనలో సమన్విత ఆసుపత్రిపై కలెక్టర్ కొరడా ఝుళిపించారు. వైద్య శాఖ అధికారులు ఆసుప్రతిని సీజ్ చేశారు. అనుమతి లేకున్నా.. ఫెర్టిలిటీ పేరుతో లింగ నిర్ధారణ చేసే స్కానింగ్ యంత్రాలు ఏర్పాటు చేయడంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. భ్రూణ హత్యలు, లింగ నిర్ధారణ, స్త్రీ లింగం పై వివక్ష చట్టం కింద కేసులు నమోదు చేశారు. శిశు విక్రయ కేసులో ఆసుపత్రి ప్రభుత్వ వైద్యుడు సహా 8 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.కాగా, పుట్ట బోయేది ఆడో మగో తెలుసుకోవడానికి జనం ఆస్పత్రులు, స్కానింగ్ సెంటర్లకు పరుగులు తీస్తుండగా.. వారి ఆసక్తిని సొమ్ము చేసుకుంటూ వాటి నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. పుట్టేది అడబిడ్డ అని తెలియగానే కడుపులోనే చంపేయాల నుకుంటున్నవారి అవసరాన్ని సొమ్ము చేసుకుంటూ అబార్షన్లు చేస్తున్నారు. స్కానింగ్, అబార్షన్ల కోసం రెండు మూడు రాష్ట్రాల నుంచి కామారెడ్డిలోని సమన్విత ఆస్పత్రికి వచ్చేవారంటే.. ఆ ఆస్పత్రి ఎంత ఫేమస్ అయ్యిందో అర్థం చేసుకోవచ్చు. అలాంటి ఆస్పత్రులలో తనిఖీలు చేయకుండా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులూ ఈ పాపంలో భాగమయ్యారు.గర్భంలో ఉన్న బిడ్డ ఆరోగ్య పరిస్థితి బాగాలేనపు డు, బిడ్డ వల్ల తల్లికి ప్రమాదం జరిగే అవకాశం ఉన్నపుడు అబార్షన్ చేస్తారు. దీనికి మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్ అనుమతులు పొందాల్సి ఉంటుంది. సమన్విత ఆస్పత్రికి దీనికి సంబంధించి ఎలాంటి అనుమతులు లేవని వైద్యారోగ్య శాఖ అధికారుల విచారణలో వెల్లడైంది. కాగా సమన్విత ఆస్పత్రిలో వైద్య సేవలకు సంబంధించి ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో ఎంటీపీకి సంబంధించి చార్జీలు పొందుపరచడాన్ని చూసి వైద్య ఆరోగ్యశాఖ అధికారుల అవాక్కయ్యారు. మూడు నెలలలోపు గర్భవిచ్ఛిత్తి కోసం రూ. 5 వేలు, మూడు నెలలు దాటిన గర్భవిచ్ఛిత్తి కోసం రూ. 10 వేలు చార్జీగా అందులో పేర్కొనడం విశేషం. -
ప్రముఖ మార్ట్‌లో 450 లీటర్ల కల్తీ నెయ్యి
వినియోగదారులు ఎక్కువగా ఆదరించే డీమార్ట్ స్టోర్‌లో భారీగా కల్తీ నెయ్యిని ఫుడ్ సేఫ్టీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ప్రోవేదిక్ నెయ్యి నాణ్యతపై ఓ కస్టమర్ ఫిర్యాదు చేయడంతో జైపూర్ లోని డీమార్ట్ స్టోర్ లో 450 లీటర్ల కల్తీ నెయ్యిని రాజస్థాన్ ఫుడ్ సేఫ్టీ విభాగం స్వాధీనం చేసుకుంది.జైపూర్ లోని అన్ని దుకాణాలు, గోదాముల్లో ఉంచిన ప్రోవేదిక్ నెయ్యి, సరస్ నెయ్యి నిల్వలను నివేదించాలని, తదుపరి ఆదేశాలు వచ్చే వరకు వాటిని విక్రయించవద్దని డీమార్ట్ ఏరియా సేల్స్ మేనేజర్‌ను ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆదేశించినట్లు ఎన్డీటీవీ నివేదిక పేర్కొంది.ప్రాథమిక విచారణలో మాలవీయ నగర్ లోని సూపర్ మార్కెట్ లో నిల్వ ఉంచిన సుమారు 450 లీటర్ల నెయ్యి కల్తీ అని తేలింది. సరస్ నెయ్యి క్వాలిటీ కంట్రోల్ మేనేజర్, అనలిస్ట్ నుంచి కల్తీ నాణ్యతను నిర్ధారించిన అధికారులు సుమారు 40 లీటర్ల నకిలీ సరస్ నెయ్యిని స్వాధీనం చేసుకున్నారు. నకిలీ నెయ్యిలో ఒకే బ్యాచ్ నంబర్, సిరీస్ ఉన్నట్లు గుర్తించారు. విశ్వకర్మ ఇండస్ట్రియల్ ఏరియాలోని కంపెనీ డిస్ట్రిబ్యూటర్ వద్ద కూడా నకిలీ సరస్ నెయ్యి ప్యాకెట్లు లభ్యమయ్యాయి. -
అత్యంత ప్రమాదకరమైన అల్ఫాజోలం డ్రగ్ స్వాధీనం
-
మాదక ద్రవ్యాలపై తెలంగాణ పోలీసుల నిఘా
-
అల్లూరి సీతారామరాజు జిల్లాలో భారీ డంప్ స్వాధీనం
పాడేరు (అల్లూరి సీతారామరాజు జిల్లా): కూంబింగ్‌కు వచ్చిన పోలీస్ పార్టీలను హతమార్చాలనే లక్ష్యంతో మావోయిస్టులు ఏర్పాటు చేసిన భారీ డంప్‌ను పోలీసులు చాకచక్యంగా వెలికితీసి నిర్విర్యం చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ తుహిన్ సిన్హా వెల్లడించారు. జీకే వీధి మండలం సీలేరు పోలీస్ స్టేషన్ పరిధిలోని పనసలబంద పరిసర అటవీ ప్రాంతంలో ఈ నెల 24న పోలీస్ పార్టీలు కూంబింగ్‌కు వెళ్లాయి. వారిని హతమార్చాలనే లక్ష్యంతో మావోలు ఏర్పాటు చేసిన భారీ డంప్‌ను పోలీసులు గుర్తించి స్వా«దీనం చేసుకున్నారు.ఈ డంప్‌లో ఆరు స్టీల్ క్యారేజ్ మందు పాత్రలు, రెండు డైరెక్షనల్ మైన్స్, ఖేల్ కంపెనీకు చెందిన ఒక పేలుడు పదార్థం, 150 మీటర్ల ఎలక్ట్రికల్ వైరు, ఐదు కిలోల మేకులు, ఇనుప నట్లు, విప్లవ సాహిత్యం ఉన్నాయని ఆయన వివరించారు. జిల్లాలో మావోయిస్టులు దాచిపెట్టిన డంప్‌లన్నింటినీ స్వాధీనం చేసుకుంటామని చెప్పారు. మావోల కుట్రపూరిత ప్రణాళికలపై గిరిజనులంతా అప్రమత్తంగా ఉండాలని, వారి మాటలు నమ్మొద్దని సూచించారు.మావోలకు పేలుడు పదార్థాలు లభించడంపై లోతుగా దర్యాప్తు చేస్తున్నామని, పనసలబంద అటవీ ప్రాంతంలో అధారాల కోసం గాలింపు కొనసాగుతోందన్నారు. డంప్‌ను స్వా«దీనం చేసుకోవడంలో కీలకపాత్ర పోషించిన సీలేరు ఎస్ఐ రామకృష్ణ, ఆర్ఎస్ఐ జాన్‌రోహిత్, జి.మాడుగుల ఎస్ఐ శ్రీనివాసరావులను ఎస్పీ అభినందించారు. -
భారీగా పట్టుబడ్డ టీడీపీ, జనసేన డబ్బు..!
-
ఎన్నికల వేళ భారీగా పట్టుబడుతున్న నగదు
-
కదిరి టీడీపీ అభ్యర్థి.. కోటిన్నర నగదు పట్టివేత
-
ఎన్నికల ఎఫెక్ట్: గుట్టలుగా కరెన్సీ కట్టలు.. కిలోల్లో బంగారం, వెండి..
సాక్షి, బెంగళూరు: దేశంలో లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ భారీగా నగదును స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. కర్ణాటకకు చెందిన ఓ వ్యాపారి ఇంట్లో భారీగా నగదు, బంగారం, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకోవడం తీవ్ర కలకలం సృష్టించింది. వివరాల ప్రకారం.. కర్ణాటకలోని బళ్లారిలో హవాలా కార్యకలాపాలు జరుగుతున్నట్లు విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం రావడంతో బ్రూస్‌పేట్ పోలీసులు రంగంలోకి దిగారు. స్థానిక ఆభరణాల వ్యాపారి నరేశ్ సోనీ ఇంట్లో ఆకస్మిక సోదాలు చేపట్టారు. లెక్కల్లోకి రాని భారీ నగదు, ఆభరణాలను గుర్తించారు. రూ.5.6 కోట్ల కరెన్సీ, 103 కిలోల వెండి ఆభరణాలు, 68 వెండి కడ్డీలు, 3 కిలోల బంగారు నగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. #WATCH | Ballari, Karnataka: Police seized Rs 5.60 crore in cash, 3 kg of gold, and 103 kg of silver jewellery with 68 silver bars. One person has been taken into custody and is being interrogated. Further details awaited: Police pic.twitter.com/PcT4rYtxMm — ANI (@ANI) April 8, 2024 అయితే, వీటిని హవాలా మార్గంలో తీసుకువచ్చి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. వ్యాపారి నరేశ్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ వివరాలను ఆదాయపు పన్ను విభాగానికి అందజేస్తామని, అనంతరం ఐటీ అధికారులు దీనిపై తదుపరి దర్యాప్తు చేపడుతారని తెలిపారు. ఇక, కర్ణాటకలో 28 లోక్‌సభ స్థానాలకు గాను రెండు దశల్లో ఏప్రిల్ 26న, మే నాలుగో తేదీన పోలింగ్ జరుగనుంది. జూన్ నాలుగో తేదీన ఫలితాలు వెలువడనున్నాయి. -
బంగారం, మద్యం, నగదు.. ఈసీ ఇప్పటిదాకా పట్టుకున్నది ఎంతంటే..
కోల్‌కతా: ఈనెల లోక్‌సభ ఎన్నికల తేదీలను ప్రకటించినప్పటి నుంచి పశ్చిమ బెంగాల్లో దాదాపు రూ.140 కోట్ల విలువైన బంగారం, డ్రగ్స్, మద్యంతోపాటు వివిధ వస్తువులు, రూ. 7 కోట్లకు పైగా నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఎన్నికల అధికారి తెలిపారు. ఎన్నికల సంఘం విడుదల చేసిన వివరాల ప్రకారం.. శనివారం (మార్చి 30) వరకు స్వాధీనం చేసుకున్న నగదు మొత్తం రూ.7.87 కోట్లు. అలాగే రూ. 33.86 కోట్ల విలువైన 12.7 లక్షల లీటర్ల మద్యాన్ని కూడా స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. ఇక రూ. 18.28 కోట్ల విలువైన 3.5 కిలోల మాదక ద్రవ్యాలు, రూ. 27.32 కోట్ల విలువైన బంగారం పట్టుబడినట్లు పేర్కొన్నారు. అలాగే ఇప్పటివరకు సుమారు రూ.36 కోట్ల విలువైన ఇతర వస్తువులను కూడా స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. లెక్కలో చూపని నగదుతో సహా మొత్తం ఎలక్షన్ కమిషన్ స్వాధీనం చేసుకున్న బంగారం, మద్యం, ఇతర వస్తువుల విలువ రూ.147.19 కోట్లు ఉంటుందన్నారు. ఇదిలా ఉండగా, కోల్‌కతా పోలీసులు నగరంలోని జోరాబాగన్ ప్రాంతంలో చేపట్టిన తనిఖీలలో రూ.82 లక్షల విలువైన సుమారు 15 కిలోల బంగారు కడ్డీలను స్వాధీనం చేసుకున్నారు. వాహనంలో ప్రయాణిస్తున్న ఐదుగురిని అరెస్టు చేసినట్లు పోలీసు అధికారి తెలిపారు. ఈ బంగారు కడ్డీలు బంగ్లాదేశ్ సరిహద్దు గుండా స్మగ్లింగ్ చేసినట్లు తెలుస్తోంది. -
పార్టీ ఆఫీసులోకి వెళ్లనివ్వడం లేదు: ‘ఆప్’ నేతలు
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల వేళ తమ పార్టీ ఆఫీసును సీజ్ చేసి తమను లోపలికి వెళ్లకుండా చేశారని ఆమ్ఆద్మీపార్టీ(ఆప్) సీనియర్ నేత, ఢిల్లీ మంత్రి అతిషి మండిపడ్డారు. దీనిపై తాము ఎన్నికల కమిషన్(ఈసీ)కి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. ఈ మేరకు శనివారం ఎక్స్(ట్విటర్లో) ఆమె ఒక పోస్టు చేశారు. Aam Aadmi Party office has been sealed off from all sides. How can access to a national party office be stopped during the Lok Sabha election? This against the ‘level playing field’ promised in the Indian Constitution. We are seeking time with the Election Commission to… pic.twitter.com/wf9VdittvW — Atishi (@AtishiAAP) March 23, 2024 ఢిల్లీ నడిబొడ్డున్న ఉన్న తమ పార్టీ ఆఫీసులోకి వెళ్లకుండా కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటోందని విమర్శించారు. ఎన్నికల ముంగిట ప్రతిపక్షాలకు సమాన పోరాట వేదిక లేకుండా చేసే బీజేపీ కుట్రలో ఇది భాగమని ఫైర్ అయ్యారు. ఇది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధ చర్య అని పేర్కొన్నారు. లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత కేజ్రీవాల్‌ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఇదీ చదవండి.. కేజ్రీవాల్ అరెస్టు.. జర్మనీ ప్రకటనపై భారత్ నిరసన -
భారీగా డబ్బు సీజ్..హైదరాబాద్ లో లేడీ డాన్ అరెస్ట్
-
సాహితీ ఇన్ఫ్రాకు షాక్.. రూ.200 కోట్ల ఆస్తులు సీజ్
సాక్షి, హైదరాబాద్: సాహితీ ఇన్ఫ్రాకు సీసీఎస్ పోలీసులు షాక్ ఇచ్చారు. రూ. 200 కోట్ల ఆస్తులను సీజ్ చేశారు. సాహితీ పార్టనర్స్‌తో పాటు సంస్థ ఉద్యోగులను పోలీసులు విచారిస్తున్నారు. ఈ స్కాంతో సంబంధం ఉన్న, రాజకీయ నాయకులు, బడా వ్యాపారులకు ఉచ్చు బిగుస్తోంది. రెండు రాష్ట్రాల్లో కీలకంగా ఉన్న కొందరి నాయకులపై కేసులు నమోదు చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. కేసు విచారణ ముమ్మరం చేయడంతో లక్ష్మీనారాయణ కుటుంబం అజ్ఞాతవాసంలోకి వెళ్లింది. పరారీలో ఉన్న లక్ష్మీనారాయణ కోసం సీసీఎస్ పోలీసులు గాలిస్తున్నారు. ప్రీలాంచ్ పేరుతో సాహితీ ఇన్ఫ్రాటెక్ వెంచర్స్ ఇండియా (ఎస్ఐవీఐపీఎల్) ప్రజల నుంచి వందల కోట్లు వసూలు చేయడంపై హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. సాహితీ ఇన్ఫ్రా సుమారు 2,728 మంది బాధితుల నుంచి రూ.1,110 కోట్లు వసూలు చేసినట్లు తేలింది. టీఎస్–రెరా నిబంధనల ప్రకారం ఒక ప్రాజెక్టులో కస్టమర్ల నుంచి వసూలు చేసిన సొమ్మును ప్రత్యేకంగా ఎస్క్రో ఖాతా తెరిచి అందులో డిపాజిట్ చేయాలి. ఆ ప్రాజెక్టు నిర్మాణ పనులకు మాత్రమే వాటిని వినియోగించాలి. కానీ లక్ష్మీనారాయణ శార్వాణి ప్రాజెక్టులో ప్రీలాంచ్ విక్రయాల కింద జనాల నుంచి వసూలు చేసిన రూ.504 కోట్ల సొమ్మును ఇతర ప్రాజెక్టులకు మళ్లించాడు. ఈ ప్రాజెక్టుల నుంచి కూడా రూ.కోట్లలో డబ్బు వసూలు చేసిన నారాయణ.. ఒక్కటంటే ఒక్కప్రాజెక్టును కూడా పూర్తి చేయలేదు. శార్వాణి ఎలైట్ ప్రాజెక్టు కంటే ముందు సాహితీ సంస్థ మూడు ప్రాజెక్టులను ప్రారంభించింది. మాదాపూర్‌లోని గుట్టల బేగంపేటలో కార్తికేయ పనోరమ, మాదాపూర్‌లో కృతి బ్లోసమ్, మోకిలాలో సుధీక్ష ప్రాజెక్ట్‌లను పూర్తి చేసేందుకు ఎలైట్ ప్రాజెక్ట్ పేరుతో డిపాజిట్లను సేకరించాడు. -
అనంతపురం జిల్లా విడపనకల్లు వద్ద వాహనాల తనిఖీలు
-
ఒడిశా రహస్య గదుల్లో రూ.329 కోట్లు.. ఐటీ అధికారులు స్పష్టం
ఢిల్లీ: కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ సాహు నుంచి స్వాధీనం చేసుకున్న ఆస్తులపై ఆదాయపన్ను శాఖ స్పందించింది. ఒడిశాలో శిథిలావస్థలో ఉన్న రహస్య భవనాల నుంచి రూ.329 కోట్లను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. విలువైన పత్రాలు, డిజిటల్ సమాచారాన్ని స్థాధీనం చేసుకున్నట్లు స్పష్టం చేశారు. నేరాన్ని రుజువు చేయడానికి కావాల్సిన అన్ని అధారాలు లభ్యమైనట్లు వెల్లడించారు. ఒడిశా, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్లో కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ సాహుకు చెందిన ఆస్తులపై వరుస దాడులు చేసిన విషయం తెలిసిందే. డిసెంబర్ 6న ప్రారంభమైన ఈ సెర్చ్ ఆపరేషన్ వారానికి పైగా కొనసాగింది. దాదాపు మూడు రాష్ట్రాల్లో 10 జిల్లాల్లో 30కి పైగా ప్రదేశాల్లో దర్యాప్తు చేపట్టింది. ఈ దాడుల్లో 100 మందికి పైగా ఐటి అధికారులు పాల్గొన్నారు. స్వాధీనం చేసుకున్న నగదును లెక్కించడానికి 40కి పైగా యంత్రాలను మోహరించారు. ధీరజ్ సాహు జార్ఖండ్ నుంచి రాజ్యసభ ఎంపికైన కాంగ్రెస్ ఎంపీ. ఇదీ చదవండి: పార్లమెంట్ భద్రతపై కేంద్రం కీలక నిర్ణయం -
కారులో డబ్బుల సంచులు.. సీఐపై కాంగ్రెస్ నేత దాడి!
సాక్షి, చెంగిచెర్ల: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా కోట్ల రూపాయలను పోలీసులు స్వాధీనం చేసుకుంటున్నారు. పలు చోట్ల తనిఖీల్లో నోట్ల కట్టలు బయటపడుతున్నాయి. తాజాగా ఓ పోలీసు అధికారి కారులో డబ్బు తరలిస్తుండగా.. కాంగ్రెస్ నేతలు అడ్డుకుని దాడికి చేశారు. వివరాల ప్రకారం.. మేడ్చల్ జిల్లా చెంగిచర్ల దగ్గర కారులో డబ్బుల సంచుల కలకలం చోటుచేసుకుంది. ఈ క్రమంలో కారును అడ్డుకుని తనిఖీలు చేశారు. కారులో నగుదు ఉన్న సంచులను గుర్తించారు. అనంతరం, ఈసీకి ఫిర్యాదు చేయడంతో ఎన్నికల అధికారులు వచ్చి నగదు, కారును స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు.. కారులో ప్రయాణిస్తున్న వ్యక్తిని వరంగల్ అర్బన్ సీఐ అంజిత్ రావుగా కాంగ్రెస్ కార్యకర్తలు గుర్తించారు. బీఆర్ఎస్ నేతలు కారులో డబ్బులు తరలిస్తున్నారని కాంగ్రెస్ నేతల ఆరోపణ చేశారు. దీంతో, ఆవేశంలో ఓ కాంగ్రెస్ కార్యకర్త.. సీఐ అంజిత్ రావుపై దాడి చేశాడు. ఈ క్రమంలో అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది. అయితే, దొరికిన డబ్బును మంత్రి మల్లారెడ్డికి చెందినది అంటూ కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. బీఆర్ఎస్ నేతలకు పోలీసులు సహకరిస్తున్నారని తీవ్ర విమర్శలు చేశారు. -
ఎన్నికల వేళ కరెన్సీ కలకలం.. మరో ఐదు కోట్లు స్వాధీనం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు ఈనెల 30వ తేదీన పోలింగ్ జరుగనుంది. మరోవైపు.. ఎన్నికల నేపథ్యంలో పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. ఇక, తనిఖీలో భాగంగా భారీగా నగదు పట్టుబడుతున్నది. తాజాగా మరో ఐదు కోట్ల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో, ఇప్పటి వరకు పట్టుబడిన నగదు ఏకంగా రూ.650 కోట్లకు పైగానే చేరుకున్నట్టు సమాచారం. వివరాల ప్రకారం.. ఎన్నికల సందర్బంగా గచ్చిబౌలి పరిధిలో మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా భారీగా నగదును పట్టుకున్నారు. రెండు కార్లలో రూ.5కోట్ల సొత్తును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కొండాపూర్ బొటానికల్ రోడ్డు నుంచి చిరెక్ పబ్లిక్ స్కూల్ వైపుగా కారులో గుర్తు తెలియని వ్యక్తులు నగదును తరలిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలో కార్లలో రూ.5కోట్లను తరలిస్తున్నట్లు గుర్తించి.. నగదును సీజ్ చేశారు. అయితే, పట్టుబడిన నగదు ఓ వ్యాపారవేత్తదిగా సమాచారం. పోలీసులు పట్టుకున్న నగదును ఐటీశాఖకు అప్పగించారు. ఇది కూడా చదవండి: పవన్ కంటే బర్రెలక్క నూరుపాళ్లు నయం! -
Election Commission: రూ.1,760 కోట్లు.. ఐదు రాష్ట్రాల్లో పట్టుబడిన మొత్తం
న్యూఢిల్లీ: ఎన్నికలు జరుగుతున్న ఐదు రాష్ట్రాల్లో ఇప్పటివరకూ ఓటర్లను ప్రలోభపెట్టేందుకు ఉద్దేశించిన రూ. 1,760 కోట్ల విలువైన నగదు, మద్యం, డ్రగ్స్, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు ఎన్నికల సంఘం సోమవారం వెల్లడించింది. అక్టోబరు 9న ఎన్నికలు ప్రకటించినప్పటి నుంచి ఇప్పటివరకూ ఐదు రాష్ట్రాల్లో నగదు, మద్యం, డ్రగ్స్, ఇతర వస్తువుల రూపంలో ఈ మొత్తం పట్టుపడినట్లు ఎలక్షన్ కమిషన్ ప్రకటించింది. ఈ రాష్ట్రాల్లో 2018 ఎన్నికల్లో పట్టుబడిన మొత్తం కంటే ఈసారి పట్టుబడినది దాదాపు ఏడు రెట్లని పేర్కొంది. గత ఎన్నికల్లో ఈ రాష్ట్రాల్లో రూ. 239.15 కోట్ల విలువైన నగదు, మద్యం, ఇతర వస్తువులను ఈసీ జప్తు చేసింది. అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న ఐదు రాష్ట్రాల్లో ఇప్పటికే మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మిజోరంలలో ఎలక్షన్లు ముగియగా రాజస్థాన్‌లో నవంబర్ 25, తెలంగాణలో నవంబర్ 30 తేదీన పోలింగ్ జరగనుంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించినప్పుడే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్.. ప్రలోభ రహితంగా ఎన్నికలు జరిగేందుకు సహకరించాలని అభ్యర్థులకు, పార్టీలకు స్పష్టం చేసినట్లు ఈసీ పేర్కొంది. ఈసారి ఎన్నికల్లో ధన ప్రవాహం, ప్రలోభాలకు అడ్డుకట్ట వేయడానికి ఎలక్షన్ కమిషన్ ఎన్నికల వ్యయ పర్యవేక్షణ వ్యవస్థ (ESMS) ద్వారా పర్యవేక్షణ ప్రక్రియలో సాంకేతికతను కూడా పొందుపరిచినట్లు తెలిపింది. ఈసీ ప్రకటన ప్రకారం.. ఆసక్తికరంగా మిజోరాంలో నగదు, విలువైన వస్తువులేవీ పట్టుబడలేదు కానీ రూ. 29.82 కోట్ల విలువైన డ్రగ్స్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఎన్నికల్లో మొత్తం 228 మంది అధికారులను వ్యయ పరిశీలకులుగా ఎన్నికల సంఘం నియమించింది. ఐదు రాష్ట్రాల్లో కలిపి మొత్తం 194 అసెంబ్లీ నియోజకవర్గాలను అత్యధిక వ్యయం జరిగే స్థానాలుగా గుర్తించిన ఈసీ.. వీటిపై నిశిత పర్యవేక్షణ పెట్టింది. -
ఐటీ సోదాల్లో రూ. 5 కోట్ల నగదు పట్టివేత.. ఎన్నికల కోసమేనా?
నల్లగొండ: జిల్లాలోని పలు ప్రాంతాల్లో జరిగిన ఐటీ సోదాల్లో భారీగా నగదు పట్టుబడింది. జిల్లాకు చెందిన పలువురు రైస్ మిల్లర్ల ఇళ్లలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో రూ. 5 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. మహాశక్తి, వైదేహి, వజ్రతేజ, సుమాంజలి, కీర్తి, వెంకటసాయి రైస్ మిల్లర్ల వద్ద నుంచి డబ్బు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఎన్నికల కోసం ఈ డబ్బును సిద్ధం చేసినట్లుగా ఐటీ అధికారులు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలో నల్లగొండ, మిర్యాలగూడ, హాలియా, నిడమనూరు, త్రిపురారంలో తనిఖీలు ఇంకా కొనసాగుతున్నాయి. -
ఎలుకను అరెస్టు చేసిన పోలీసులు.. ఎందుకంటే..?
భోపాల్: తప్పు చేసిన వ్యక్తులను పోలీసులు అరెస్టు చేస్తారు. కానీ మధ్యప్రదేశ్‌లో పోలీసులు ఓ ఎలుకను అరెస్టు చేశారు. చిన్న బోనులో బందించి పోలీసు స్టేషన్లోనే ఓ మూలన ఉంచారు. పోలీసు గోదాంలో ఉన్న మద్యం బాటిళ్లను ఎలుకలు ఖాలీ చేసిన కారణంగా దానిని బందించినట్లు పోలీసులు చెబుతున్నారు. చింద్వారా, కోత్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. సీజ్ చేసిన బాటిళ్లకు సంబంధించిన ఆధారాలను న్యాయస్థానంలో సాక్షంగా చూపించాల్సి ఉంది. కానీ ఎలుకలు మద్యం బాటిళ్లను ఖాలీ చేశాయి. ఇక ఏం చేయాలో తెలియక ఎలుకలను అరెస్టు చేసే ప్రయత్నం చేశారు. చాలా ఎలుకల్లో ఒక్క ఎలుక మాత్రమే దొరికిందని తెలిపారు. మిగితావి పరారీలో ఉన్నాయని పోలీసులు పేర్కొన్నారు. కోత్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో అనేక ప్రభుత్వ కార్యాలయాల్లో ఎలుకలు ఎక్కువగా ఉన్నాయి. పలు ప్రభుత్వ పత్రాలను కూడా ధ్వంసం చేశాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగుల శరీరాన్ని కొరికి తిన్న ఘటనలు కూడా వెలుగుచూశాయి. ఇదీ చదవండి: జనాభా నియంత్రణపై వివాదాస్పద వ్యాఖ్యలు.. సీఎం నితీష్ కుమార్ క్షమాపణలు -
రూ.538 కోట్ల విలువైన జెట్‌ఎయిర్‌వేస్ ఆస్తులు సీజ్
ఢిల్లీ: మనీలాండరింగ్ కేసులో జెట్ ఎయిర్వేస్కు చెందిన రూ.538 కోట్లకు పైగా విలువ గల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) స్వాధీనం చేసుకుంది. జెట్ ఎయిర్వేస్ సంస్థ వ్యవస్థాపకుడు నరేష్ గోయల్, ఆయన భార్య, కుమారుడికి చెందిన లండన్, దుబాయ్ సహా భారత్‌లో వివిధ ప్రదేశాల్లో ఉన్న 17 కమర్షియల్ ఫ్లాట్లు, ఇతర ఆస్తులను ఈడీ ఈ మేరకు సీజ్ చేసింది. దాదాపు 26 సంవత్సరాలుగా పూర్తి వాణిజ్య సేవలు అందించిన జెట్ ఎయిర్వేస్ తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో పడింది. నగదు కొరత కారణంగా ఏప్రిల్ 2019లో కార్యకలాపాలను నిలిపివేసింది. 2019లో గోయల్ ఎయిర్‌లైన్ చైర్‌పర్సన్‌గా వైదొలిగిన తర్వాత జెట్ ఎయిర్వేస్.. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌లో దివాలా పిటిషన్‌ని దాఖలు చేసింది. కెనరా బ్యాంకులో రూ.538 కోట్ల మోసానికి సంబంధించిన కేసులో సెప్టెంబర్ ప్రారంభంలో ఈడీ నరేష్ గోయల్‌ను అరెస్టు చేసింది. బ్యాంకు నుంచి రుణంగా పొందిన ఆదాయంతో విదేశాలలో ఆస్తులు కొనుగోలు చేసినట్లు ఆరోపించింది. ఈ కేసులో నేరష్ గోయల్‌తో పాటు మరో ఐదుగురిపై ఈడీ మంగళవారం ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఈ కేసులో ఉన్న నిందితుల ఆస్తులపై ఈ ఏడాది జులైలోనే ఈడీ దాడులు జరిపింది. జెట్ ఎయిర్వేస్కు రూ.848.86 కోట్ల రుణాన్ని మంజూరు చేస్తే.. అందులో రూ.538.62 కోట్లు బకాయిలు ఉన్నాయని కెనరా బ్యాంకు ఫిర్యాదు ఆధారంగా సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. 2021 జూలై 29న ఈ కేసును మోసంగా ప్రకటించబడిందని కూడా సీబీఐ పేర్కొంది. ఇదీ చదవండి: Wine Capital of India: దేశంలో మద్యం రాజధాని ఏది? -
మాడిగి అంతర్ రాష్ట్ర చెక్ పోస్ట్ వద్ద భారీగా బంగారం సీజ్
-
ఎన్నికల సిత్రాలు: రెండు లారీల పట్టు చీరలు స్వాధీనం
సాక్షి,హైదరాబాద్: తెలంగాణాలో ఎన్నికల షెడ్యూల్ వచ్చింది మొదలు కోట్ల కొద్దీ నగలు, నగదు పట్టుబడుతోంది. తాజాగా కోట్ల విలువ చేసే పట్టుచీరలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ కోటికి పైమాటేనని అంచనా. కేసు నమోదు చేసిన అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ పరిధిలోని బాచుపల్లి(bachupally) ప్రగతినగర్ లో పోలీసులు తనిఖీల చేపట్టారు. పంచవటి అపార్ట్మెంట్ నిర్వహించిన దాడి నేపథ్యంలో పెద్ద ఎత్తున చీరలు పట్టుబడ్డాయి. ఏకంగా రెండు లారీల పట్టుచీరల లోడ్ అపార్ట్మెట్లో డంప్ చేస్తుండగా పోలీసులుకు చిక్కాయి. ఈ లారీలను సీజ్ చేసి పోలీసులు స్టేషన్ కి తరలించారు. వరంగల్ కాశంపుల్లయ్య, మాంగల్య షాపింగ్ మాల్స్ నుండి వీటిని కొనుగోలు చేసినట్టు సమాచారం. ఇప్పటికే హైదరాబాద్‌లోని మరికొన్ని చోట్ల జరిపిన తనిఖీల్లో పెద్ద ఎత్తున మిక్సీలు, రైస్ కుక్కర్లు, మియాపూర్‌లో వెండి, గోల్డ్ అభరణాలు భారీగా పట్టుబడిన సంగతి తెలిసిందే. -
హైదరాబాద్‌లో పోలీసులు తనిఖీలు.. భారీగా బంగారం పట్టివేత
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఎన్నికల సందర్భంగా చేపట్టిన తనిఖీల్లో భారీగా నగదు, మద్యం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తనిఖీల్లో ఇప్పటివరకు రూ.56 కోట్ల నగదు, రూ.2.60 కోట్ల మద్యం సీజ్ చేశారు. 72 కేజీల బంగారం, 429 కేజీల వెండి, 42 క్యారెట్ల వజ్రాలు సీజ్ చేశారు. 5,529 లైసెన్స్డ్ తుపాకులు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 17,128 మందిని పోలీసులు బైండోవర్ చేశారు. తాజాగా, చందానగర్‌లో భారీగా బంగారం, వెండి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిన్న రాత్రి వాహనాలను తనిఖీ చేస్తుండగా భారీగా బంగారం పట్టుబడింది. దాదాపు 29 కేజీల బంగారం, 26 కేజీల వెండి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గంగారంలో నిన్న రాత్రి వాహనాలను తనిఖీ చేస్తుండగా కారులో ఆభరణాలు లభించగా, చందానగర్ పరిధిలోని మలబార్, కళ్యాణ్, లలిత, రిలయన్స్ రిటైల్, విరాజ్ జ్యువెలర్స్ షాపులకు సంబంధించినదిగా పోలీసులు గుర్తించారు. చదవండి: ప్రవళిక ఆత్మహత్య కేసులో మరో ట్విస్ట్ -
తెలంగాణలో ఎన్నికలు..కర్ణాటకలో కోట్ల డబ్బు సీజ్..
-
ఎన్నికల కోడ్..బంగారం, వెండి, వజ్రాలు సీజ్..
-
బంజారాహిల్స్ లో 3.35 కోట్ల హవాలా నగదు పట్టివేత
-
హైదరాబాద్ లో భారీగా నగదు, బంగారం సీజ్
-
సైబరాబాద్ పరిధిలో రూ. 3 కోట్లు విలువ చేసే గంజాయి సీజ్
-
HYD: భారీగా గంజాయి స్వాధీనం.. బీటెక్ విద్యార్థులే టార్గెట్..
సాక్షి, రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లా నార్సింగ్ చౌరస్తాలో గంజాయి కలకలం రేగింది. 12 కిలోల గంజాయిని నార్సింగ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులే లక్ష్యంగా గంజాయి దందా సాగుతోంది. చిన్న చిన్న ప్యాకెట్లలో గంజాయి అమ్ముతుండగా పోలీసులు పట్టుకున్నారు. నలుగురిపై ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. చదవండి: Madhapur: డ్రగ్స్‌తో పాటు వ్యభిచారం కూడా! -
ఢిల్లీ మద్యం కుంభకోణం: మనీష్ సిసోడియా రూ.52 కోట్ల ఆస్తుల అటాచ్..
ఢిల్లీ: ఢిల్లీ మద్యం కుంభకోణంలో మనీ లాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆప్ నేత, ఢిల్లీ మాజీ డిఫ్యూటీ సీఎం మనీష్ సిసోడియా, ఆయన భార్య, ఇతరులకు చెందిన రూ.52 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. మనీష్ సిసోడియాను మార్చిలో ఈడీ అరెస్టు చేసింది. ప్రస్తుతం జ్యూడీషియల్ కస్డడీలో ఉన్నారు. అన్‌దీప్ సింగ్ ధాల్, రాజేశ్ జోషీ, గౌతమ్ మల్హోత్రాతో పాటు మరికొందరి ఆస్తులను ఈడీ సీజ్ చేసింది. మనీష్ సిసోడియాకు చెందిన బ్యాంకు అకౌంట్లలో రూ.11 లక్షలను కూడా ఈడీ స్వాధీనం చేసుకుంది. సిసోడియాకు సన్నిహితుడైన ప్రముఖ వ్యాపారవేత్త దినేష్ అరోరాను అరెస్టు చేసిన మరుసటి రోజే ఈడీ ఆస్తుల అటాచ్ చర్యలకు పూనుకుంది. దేశ రాజధానిలోని నూతనంగా తీసుకువచ్చిన మద్యం పాలసీలో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలు ఢిల్లీ మాజీ సీఎం మనీష్ సిసోడియాతో పాటు మరికొందరిపై ఆరోపణలు వచ్చాయి. దీంతో సీబీఐ దర్యాప్తు చేయాలని లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా గత ఏడాదే ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే పలువురి ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. మనీష్ సిసోడియా ఇమేజ్ను దెబ్బతీయడానికే కేంద్రం కట్టుకథలు అల్లుతోందని అన్నారు. ఈడీ సీజ్ చేసిన రెండు ఫ్లాట్లలో ఒకటి 2005లోనే కొనుగోలు చేయగా.. మరొకటి 2018లో కొన్నట్లు చెప్పారు. మద్యం పాలసీ కంటే ముందే ఆ ఆస్తులను కొన్నట్లు చెప్పారు. అవినీతిని కప్పిపుచ్చుకునేందుకు ఆప్ ప్రభుత్వం కొత్త మద్యం పాలసీని తీసుకువచ్చిందని కేంద్రం ఆరోపిస్తోంది. ఇదీ చదవండి: అవినీతే కాంగ్రెస్ ఊపిరి -
హైదరాబాద్ మైలార్ దేవ్ పల్లి పీఎస్ పరిధిలో భారీగా డ్రగ్స్ పట్టివేత
-
సైబరాబాద్ పీఎస్ పరిధిలో భారీగా డ్రగ్స్ పట్టివేత
-
కర్నాటక: ఎన్నికల సిత్రం.. మామిడిచెట్టులో కరెన్సీ కట్టల బ్యాగు
బెంగళూరు: అసెంబ్లీ ఎన్నికల వేళ కర్నాటకలో ప్రచారం జోరుగా సాగుతోంది. అధికార బీజేపీ సహా ప్రతిపక్ష పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. అటు, ఓటర్లను ఆకట్టుకునేందుకు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఎన్నికల మేనిఫెస్టోను కూడా రిలీజ్ చేశాయి. ఇదిలా ఉండగా.. ఎన్నికల వేళ భారీ మొత్తంలో నగదు పట్టుబడటం సంచలనంగా మారింది. వివరాల ప్రకారం.. ఎన్నికల సమయంలో ప్రధాన రాజకీయపార్టీలు ఓటర్లకు పంచడానికి పెద్ద ఎత్తున నగదును సమకూర్చాయన్న సమచారం మేరకు ఐటీ శాఖ అధికారులు ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సోదాల్లో భాగంగా కాంగ్రెస్ నేత ఇంట్లో భారీ మొత్తంలో నగదును స్వాధీనం చేసుకున్నారు. అయితే, మైసూర్‌లోని సుబ్రమణ్య రాయ్ ఇంట్లో ఆదాయపు పన్ను శాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ సమయంలో మామిడి చెట్టుపై బాక్సులు ఉండటం గమనించారు. వాటిని తీసి చూడగా నోట్ల కట్టలు కనిపించాయి. మొత్తం డబ్బును అధికారులు సీజ్ చేశారు. వాటి విలువ కోటి రూపాయలు ఉన్నట్టు తెలిపారు. మొత్తం డబ్బును అధికారులు సీజ్ చేసినట్టు స్పష్టం చేశారు. రాయ్ పుత్తూరు కాంగ్రెస్ అభ్యర్థి అశోక్ కుమార్ రాయ్ సోదరుడు కావడం విశేషం. ఇప్పటిదాకా రూ.300 కోట్లకు పైగా లెక్క చూపని డబ్బును ఈసీ సీజ్ చేసింది. ఇందులో ఒక్క బెంగళూరులోనే రూ.82 కోట్లను స్వాధీనం చేసుకుంది. అంతకుముందు ఏప్రిల్ 13న బెంగళూరు సిటీ మార్కెట్ ఏరియాలో రూ.కోటిని పోలీసులు జప్తు చేశారు. ఇద్దరు వ్యక్తులు ఆటోలో డబ్బు తీసుకెళ్తుండగా పట్టుకున్న పోలీసులు.. ఎలాంటి లెక్కలు చూపకపోవడంతో స్వాధీనం చేసుకున్నారు. ఇదిలా ఉండగా.. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కర్నాటకలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలులో ఉంది. దీంతో, సరైన పత్రాలు లేకుండా పెద్ద మొత్తంలో నగదు తరలించరాదు. ఇక, కర్నాటకలో ఈనెల 10వ తేదీన పోలింగ్ జరుగనుంది. 13వ తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడుతాయి. ఇది కూడా చదవండి: యువకుడిని చితకబాదిన మంత్రి, సిబ్బంది.. వీడియో వైరల్ -
జోయ్ అలుక్కాస్కు భారీ షాక్: కోట్ల ఆస్తులు స్వాధీనం
న్యూఢిల్లీ: ప్రముఖ ఆభరణాల సంస్థ జోయ్ అలుక్కాస్కు భారీ షాక్ తగిలింది. ఐదు రోజుల వరుస సోదాల తర్వాత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రూ.305.84 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసింది. విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టంలోని నిబంధనలను ఉల్లంఘించిందని ఈడీ శుక్రవారం ఆరోపించింది. (ఇదీ చదవండి: షాకింగ్: 8500 మందిని తొలగించనున్న టెలికాం దిగ్గజం) అటాచ్ చేసిన ఆస్తులలో రూ. 81.54 కోట్ల విలువైన 33 స్థిరాస్తులు ఉన్నాయి. 91.22 లక్షల విలువైన మూడు బ్యాంకు ఖాతాలు, రూ. 5.58 కోట్ల విలువైన మూడు ఫిక్స్డ్ డిపాజిట్లు, 217.81 కోట్ల విలువైన జోయల్లుకాస్ షేర్లను కూడా ఈడీ సీజ్ చేసింది. హవాలా మార్గాల ద్వారా భారతదేశం నుండి దుబాయ్‌కి భారీ మొత్తంలో నగదును బదిలీ చేసి, ఆ తర్వాత 100 శాతం జాయ్ అలుక్కాస్ వర్గీస్‌కు చెందిన జోయల్లుకాస్ జ్యువెలరీ LLC, దుబాయ్‌లో పెట్టుబడి పెట్టింది. రూ. 2,300 కోట్ల ఐపీవో ఉపసంహరించుకున్న మరునాడే వరుస సోదాలు చేపట్టిన అధికారులు భారీ మొత్తంలో ఆస్తులను సీజ్ చేయడం గమనార్హం. (StudentVisa అమెరికాలో చదువుకోవాలనుకునే విద్యార్థులకు అదిరిపోయే న్యూస్!) కాగా దేశంలోనే రెండవ అతిపెద్ద ఆభరణాల జోయ్ అలుక్కాస్కు దేశవ్యాప్తంగా 68 శాఖలున్నాయి. జ్యూయలరీ బిజినెస్‌లో దేశంలో, ముఖ్యంగా సౌత్ ఇండియాలో బాగా పాపులర్ అయింది. అయితే 25 ఎకరాల్లో నిర్మించబోయే ప్రాజెక్టు కోసం విదేశాలకు హవాలా రూపంలో రూ. 300 కోట్ల నిధులు మళ్లించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో జోయ్ అలుక్కాస్ అధినేత అధికార నివాసాలు, కార్పొరేట్ ఆఫీసులో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. -
హైదరాబాద్ వనస్థలిపురంలో భారీగా డ్రగ్స్ పట్టివేత
-
తెలంగాణాలో 3 కోట్ల విలువైన నకిలీ మద్యం సీజ్
-
మునుగోడు ఎన్నికలు టార్గెట్ గా నేతలకు వల
-
హైదరాబాద్ లో భారీగా హవాలా నగదు పట్టివేత
-
గాంధీనగర్ పీఎస్ పరిధిలో భారీగా హవాలా నగదు పట్టివేత
-
హైదరాబాద్ లో భారీగా హవాలా డబ్బు పట్టివేత
-
హైదరాబాద్ లో నకిలీ కాల్ సెంటర్ గుట్టురట్టు
-
ఇద్దరు దోస్తులు.. టెన్త్‌లో ఒకరు ఫెయిల్, ఒకరు పాస్.. 25 ఏళ్లుగా డాక్టర్ పని
వరంగల్ క్రైం: చదివింది పదో తరగతి.. అందులో ఒకరు ఫెయిల్.. మరొకరు పాస్. ఇద్దరు మిత్రులు.. డాక్టర్ల వద్ద పనిచేసిన అనుభవం.. పైసలపై ఆశ పెరగడంతో డాక్టర్ల అవతారమెత్తారు. అందుకు అవసరమయ్యే సర్టిఫికెట్లను కొనుగోలు చేశారు. ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా 25ఏళ్లుగా నగరంలో డాక్టర్లుగా చలామణి అవుతున్న ఇద్దరు నకిలీల బాగోతం ఎట్టకేలకు బయటపడింది. నిందితులను టాస్క్‌ఫోర్స్, ఇంతేజార్గంజ్ పోలీసులు అరెస్టు చేసినట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ డాక్టర్ తరుణ్ జోషి తెలిపారు. నకిలీ డాక్టర్ల నుంచి రూ.1.28 లక్షలు నగదు, ఆస్పత్రి పరికరాలు, మందులను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. మంగళవారం కమిషరేట్‌లో నిందితుల వివరాలు వెల్లడించారు. హంటర్‌రోడ్డు ప్రాంతానికి చెందిన ఇమ్మడి కుమార్ పదో తరగతి పూర్తి చేయగా, వరంగల్ చార్‌బౌళి ప్రాంతానికి చెందిన మహ్మమద్ రఫీ ఫెయిల్ అయ్యాడు. ఇద్దరు మిత్రులు కావడంతో 1997 సంవత్సరానికి ముందు ప్రముఖ డాక్టర్ల దగ్గర అసిస్టెంట్లుగా పనిచేశారు. డబ్బులు బాగా సంపాదించాలనే ఆలోచనతో బీహార్ రాష్ట్రంలోని దేవఘర్ విద్యాపీఠ్ విశ్వవిద్యాలయంనుంచి ఆయుర్వేద వైద్యంలో డిగ్రీ పూర్తి చేసినట్లుగా నకిలీ సర్టిఫికెట్లతోపాటు గుర్తింపు కార్డులు కొనుగోలు చేశారు. కుమార్ క్రాంతి క్లినిక్ పేరుతో కొత్తవాడలో దుకాణం తెరిచాడు. రఫీ సలీమా క్లినిక్ పేరుతో చార్‌బౌళి ప్రాంతంలో 25 ఏళ్లుగా ఆస్పత్రి నడిపిస్తున్నాడు. సాధారణ రోగాలతో వచ్చే వారి దగ్గర పెద్ద మొత్తంలో డబ్బులు గుంజేవారు. రోగం ముదిరేలోపే కార్పొరేట్ ఆస్పత్రులకు పంపేవారు. చివరికి నకిలీ డాక్టర్ల వ్యవహారం బయటకు తెలియడంతో టాస్క్‌ఫోర్స్ పోలీసులు స్థానిక మట్టెవాడ, ఇంతేజార్గంజ్ పోలీసులు.. వరంగల్ రీజినల్ ఆయుష్ విభాగం వైద్యుల ఆధ్వర్యంలో రెండు ఆస్పత్రులపై దాడి చేశారు. నిందితులను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించడంతో నేరం ఒప్పుకున్నారు. నకిలీ డాక్టర్లను అరెస్టు చేయడంలో ప్రతిభ చూపిన టాస్క్‌ఫోర్స్, పోలీసులను సీపీ డాక్టర్ తరుణ్ జోషి అభినందించారు. -
గాయత్రి ఇల్లు కబ్జాకు కుటుంబీకుల యత్నం
గచ్చిబౌలి: సివిల్స్ పరీక్షలకు సిద్ధమవుతున్న యువతిపట్ల అమానుషంగా ప్రవర్తించిన గాయత్రి ఇల్లును కబ్జా చేయడానికి ఆమె కుటుంబీకులు యత్నించారు. ఆమె భర్త శ్రీకాంత్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు గచ్చిబౌలి పోలీసులు తల్లి కృష్ణవేణి, సోదరి సౌజన్యసహా మరికొందరిపై ఆదివారం కేసు నమోదు చేశారు. వివిధ ప్రాంతాల్లో ఉన్న స్థిరాస్తులకు సంబంధించి గాయత్రికి, ఆమె తల్లి కృష్ణవేణి, సోదరి సౌజన్య మధ్య కొన్నేళ్లుగా వివాదాలు నడుస్తున్నాయి. వీటిలో కొన్ని ఆస్తులకు సంబంధించి రిజిస్ట్రేషన్ ఒకరి పేరిట ఉండగా, పొజిషన్లో వేరొకరు ఉన్నారు. యువతిపై లైంగిక దాడి ఘటనలో కేసు నమోదు చేసుకున్న పోలీసులు శనివారం గాయత్రిసహా ఆరుగురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీకాంత్ సైతం అజ్ఞాతంలోకి వెళ్లిపోయి ఉంటాడని భావించిన కుటుంబసభ్యులు ఆదివారం మధ్యాహ్నం తల్లి, సోదరి, సోదరుడు ప్రదీప్ రాజు, సమీప బంధువులు మల్లికార్జున్, అఖిల్ తదితరులు గాయత్రి ఇంటి వద్దకు వచ్చారు. ఆ సమయంలో వాచ్‌మన్ గేటుకు తాళం వేయగా అతడిపై దాడి చేసి తాళం పగులకొట్టారు. కృష్ణవేణి, సౌజన్య లోపలికి వెళ్లగా, మిగిలినవారు గేటు వద్దే ఉన్నారు. ఆ సమయంలో ఇంట్లోనే ఉన్న శ్రీకాంత్‌ను అక్కడి నుంచి వెళ్లిపోవాలని బెదిరించారు. దీంతో ఆయన ‘డయల్–100’కు ఫోన్‌కాల్ చేయడంతో గచ్చిబౌలి ఠాణాకు చెందిన మహిళా ఎస్సై, కానిస్టేబుళ్లు గాయత్రి ఇంటి వద్దకు చేరుకుని అక్కడ ఉన్నవారిని బయటకు పంపేశారు. అద్దెకున్నవారికి బెదిరింపులు గాయత్రి నుంచి ఇల్లు అద్దెకు తీసుకున్న హేమంత్ వద్దకు ఈ ఏడాది మార్చి 30న సౌజన్య వెళ్లారు. ఆ ఇల్లు తనదని వెంటనే ఖాళీ చేయాలని హేమంత్‌ను బెదిరించి కరెంట్ కనెక్షన్ తొలగించడంతో ఆమెపై కేసు నమోదైంది. గాయత్రి తన ఇంటికి సమీపంలో ఉన్న కొన్ని దుకాణాలను అద్దెకు ఇవ్వగా, వీటిల్లో వ్యాపారాలు చేసుకుంటున్న అమిత్‌సింగ్, జేమ్స్, పాండు, మధుసూదన్ల వద్దకు సౌజన్య వెళ్లి హంగామా చేసింది. వారి సామాన్లను పగులకొట్టడంతోపాటు సూసైడ్ నోట్లో వారి పేర్లు రాసి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరింపులకు దిగడంతో ఆమెపై మరో కేసు నమోదైంది. (చదవండి: సినిమా స్టోరీని తలపిస్తున్న గచ్చిబౌలి గాయత్రి కేసు.. ట్విస్టులే ట్విస్టులు) -
Tequila Pub: పబ్‌పై రైడ్స్.. పోలీసుల అదుపులో డ్యాన్సింగ్ గర్ల్స్, కస్టమర్లు
సాక్షి, హైదరాబాద్: నగరంలో పబ్ కల్చర్ పెరిగిపోయింది. దీంతో పబ్ నిర్వాహకులు నిబంధనలను ఉల్లఘించి ఇష్టారీతిలో పబ్‌లను రన్ చేస్తున్నారు. తాజాగా నగరంలోని రాంగోపాల్‌పేటలో ఉన్న తకీల పబ్‌పై శనివారం అర్ధరాత్రి టాస్క్ ఫోర్స్ పోలీసుల రైడ్స్ నిర్వహించారు. అనుమతి లేకుండా అర్ధరాత్రి వరకు పబ్ రన్ చేస్తుండటంతో పోలీసులు దాడులు చేశారు. ఈ దాడుల్లో సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు 18 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో 8 మంది గ్యాన్సింగ్ గర్ల్స్, 8 మంది కస్టమర్స్, డీజే ఆపరేటర్, ఆర్గనైజర్ ఉన్నట్టు పోలీసులు పేర్కొన్నారు. కాగా, పబ్‌కు అనుమతి లేకున్నా అమ్మాయితో నిర్వాహకుడు డ్యాన్స్ చేయిస్తున్నట్టు తెలిపారు. ఈ క్రమంలో సౌండ్ సిస్టమ్, పబ్‌ను సీజ్ చేసినట్టు పోలీసులు వెల్లడించారు. అనంతరం వారిని రాం గోపాల్పేట పోలీసులకు అప్పగించినట్టు చెప్పారు. ఇది కూడా చదవండి: ఆరు నెలలు కాకముందే భర్త అసలు క్యారెక్టర్ బట్టబయలు.. భార్య సూసైడ్ -
560 కేజీల గంజాయి స్వాధీనం
రావికమతం : గిరిజన గ్రామం రొచ్చుపణుకు నుంచి తరలించేందుకు బొలేరో వాహనంలో సరకు వేస్తుండగా కొత్తకోట పోలీసులు పక్కా సమాచారంతో దాడి చేసి రూ.17లక్షల విలువైన 560 కేజీల గంజాయిని ఆదివారం రాత్రి పట్టుకున్నారు. ఈ సంఘటనలో ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. మరొకరు పరారయ్యారు. కొత్తకోట సీఐ లక్ష్మణమూర్తి అందించిన వివరాలివి. రొచ్చుపణుకు గ్రామం నుంచి పెద్ద ఎత్తున గంజాయి తరలించేందుకు సిద్ధమైనట్టు తమకు సమాచారం అందడంతో ఎస్ఐ అప్పలనాయుడు, సిబ్బందితో ఆదివారం రాత్రి దాడి చేశామన్నారు. ఈ దాడిలో బొలేరో వాహనంలో నిల్వ చేసిన 24 బస్తాలు గల 560 కేజీల గంజాయి లభ్యమైందన్నారు. అక్కడ వ్యవహారం చేసిన ఇద్దరు వ్యక్తులు మాకవరపాలెం సీతన్న అగ్రహారానికి చెందిన చొప్పా రాజిబాబు,జి.కోడూరుకు చెందిన నమ్మి రాంబాబులను అదుపులోకి తీసుకున్నామని అన్నారు. మరొకరు పరారయ్యారన్నారు. అతని గురించి ఆరా తీస్తున్నామన్నారు. ఇద్దరు వ్యక్తుల నుంచి ఒక పల్సర్ బైక్ స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. (చదవండి: జనావాస పరిసరాల్లోకి గొరగేదెలు.. భయపడుతున్న జనం) -
9వేల బస్తాల ధాన్యం పట్టివేత
మక్తల్: ఎలాంటి అను మతి లేకుండా కర్ణాటక నుంచి తెలంగాణకు ఒకేసారి 16 లారీలలో తీసుకువ స్తున్న సుమారు తొమ్మిది వేల ధాన్యం బస్తాలను మక్తల్ పోలీసు లు పట్టుకున్నారు. వివరాలిలా ఉన్నాయి.. కర్ణాటక రాష్ట్రంలోని యాదగిరి సిర్పూర్, సిర్వార్, మాన్వే, రాయచూర్ నుంచి ధాన్యం లోడుతో ఈ లారీలు ఆదివారం తెల్లవారుజామున వస్తుండగా నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలో సీఐ సీతయ్య, ఎస్ఐ రాములు పట్టుకున్నారు. ఒక్కో లారీలో 500 నుంచి 800 వరకు ధాన్యం బస్తాలు ఉన్నట్టు గుర్తించారు. వీటి విలువ సుమారు రూ.రెండు కోట్లు ఉంటుందని అంచనా వేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. ఇదిలాఉండగా నల్లగొండ నుంచి కర్ణాటక రాష్ట్రానికి సిమెంట్ తీసుకుని వెళ్లామని.. తిరుగు ప్రయాణంలో కొందరు వ్యక్తులతో మాట్లాడుకుని ధాన్యం లోడ్ తీసుకువస్తున్నామని లారీ డ్రైవర్లు చెప్పడం గమనార్హం. సరిహద్దు చెక్‌పోస్టు ఎలా దాటారు! నారాయణపేట జిల్లా కృష్ణ మండలం వాసునగర్ వద్ద సరిహద్దు చెక్‌పోస్టు ఉన్నా ఈ లారీలను పట్టుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. తెలంగాణలో ధాన్యం రేటు ఎక్కువగా ఉండటంతో కర్ణాటకలో దళారుల నుంచి కొని.. కొందరు పెద్దల సహకారంతో ఇలా తరలిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. -
సారా ప్యాకింగ్ కేంద్రాలపై దాడులు
పార్వతీపురం టౌన్: కొమరాడ మండలం పరశురాంపురం గ్రామంలో ఎస్ఈబీ టాస్క్‌ఫోర్స్ సీఐ గోపాలకృష్ణ ఆధ్వర్యంలో సిబ్బంది గురువారం దాడులు చేసి 30లీటర్ల సారాను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ పార్వతీపురం పట్టణంలోని ఇందిరాకాలనీకి చెందిన సొండి రాజేష్ విక్రాంపురం గ్రామంలో సారా రవాణా చేస్తున్న సమయంలో స్వాధీనం చేసుకుని నిందితుడిపై కేసునమోదు చేసి రిమాండ్ నిమిత్తం పార్వతీపురం జుడీషియల్ మెజిస్ట్రేట్ వద్ద హాజరుపర్చామని తెలిపారు. మరో సంఘటనలో ఎస్ఈబీ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎల్. ఉపేంద్ర పార్వతీపురం మండలం కృష్ణపల్లి గ్రామ సమీపంలో నిర్వహించిన దాడుల్లో 160లీటర్ల సారా, 100 ప్యాకెట్లు సారా స్వాధీనం చేసుకున్నారు. పార్వతీపురం మున్సిపాల్టీ పాత రెల్లివీధికి చెందిన సొండి చంద్రపై కేసు నమోదు చేశారు. అలాగే పాత రెల్లివీధి సమీపంలో తుప్పల్లో దాచిపెట్టిన 60లీటర్లసారా, 50 ప్యాకెట్ల సారాను స్వాధీనం చేసుకున్నారు. 1,400 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం సాలూరు: మండలంలోని పెద్దవలస గ్రామ సమీపంలో బెల్లపు ఊటను ధ్వంసం చేసినట్లు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఇన్స్పెక్టర్ ఈశ్వరరావు తెలిపారు. ఈ మేరకు గురువారం ఆయన మాట్లాడుతూ, సిబ్బందితో కలిసి పెద్దవలస సమీపంలో సారా స్థావరాలపై దాడి చేసి సారా తయారికి సిద్ధం చేసిన 1,400 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేసి కేసు నమోదు చేశామని తెలిపారు. వేపాడ మండలంలో 1000 లీటర్లు.. వేపాడ: కృష్ణారాయుడుపేట గ్రామ సమీపంలో నిర్వహించిన దాడుల్లో సారా తయారీకి సిద్ధం చేసిన 1000 లీటర్లు బెల్లం ఊటను గుర్తించి ధ్వంసం చేసినట్లు స్పెషల్ ఎన్పోర్స్మెంట్ బ్యూరో సీఐ సీహెచ్ రాజేశ్వరి, ఎస్సై పి.నరేంద్ర తెలిపారు. అనంతరం కృష్ణారాయుడుపేటలో నిర్వహించిన పరివర్తన కార్యక్రమంలో సీఐ మాట్లాడుతూ సారా నిర్మూలనకు గ్రామస్తులు, çమహిళలు, సహకారం ఉండాలన్నారు. (చదవండి: -
420 లీటర్ల సారా స్వాధీనం
కంచిలి: మండలంలో నువాగడ పంచాయతీ డొలాసాయి గ్రామంలో 420 లీటర్ల నాటుసారా డంప్‌ను గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు సోంపేట ఎస్ఈబీ ఇన్స్పెక్టర్ టి.వెంకటప్పలనాయుడు శుక్రవారం తెలిపారు. చైతన్య భుయా అనే వ్యక్తికి చెందిన ఇంటి పెరడులో సారా బ్యాగులను గుర్తించామని చెప్పారు. ఒడిశా నుంచి తీసుకొచ్చి ఇక్కడ భద్రపరిచినట్లు తెలిసిందని, తనిఖీల కోసం సిబ్బంది రావడాన్ని పసిగట్టి భుయా పారిపోయాడని పోలీసులు తెలిపారు. ఈ దాడుల్లో సీఐతో పాటు ఎస్ఐలు జి.వి.రమణ, యు.వి.వి.నాగరాజు, హెచ్‌సీ డి.మోహనరావు, కానిస్టేబుళ్లు పాల్గొన్నారు. కాగా, డంప్‌ను గుర్తించినందుకు ఎస్ఈబీ జాయింట్ డైరెక్టర్ కంచె శ్రీనివాసరావు, అసిస్టెంట్ కమిషనర్ కె.పి.గోపాల్ సిబ్బందిని అభినందించారు. -
దుప్పట్లు అమ్ముతూనే.. మరోవైపు ఎవరికి తెలియకుండా..
కొరాపుట్(భువనేశ్వర్): జిల్లాలోని నందపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో దుప్పట్ల విక్రయం మాటున జరుగుతున్న గంజాయి కొనుగోళ్ల గుట్టురట్టయింది. కొమరగుడా జంక్షన్ వద్ద హర్యానా నుంచి వచ్చిన సుల్తాన్ సింగ్ ఓ గుడారం ఏర్పాటు చేసుకుని, సమీప గ్రామాల్లో దుప్పట్ల అమ్మకం ప్రారంభించాడు. అయితే అతడు దుప్పట్లు అమ్ముతూనే మరోవైపు ఎవరికి తెలియకుండా గంజాయి కొనుగోలు చేస్తుండేవాడు. శుక్రవారం ఉదయం అతడు సేకరించిన గంజాయిని తరలించేందుకు సిద్ధం చేస్తుండగా, సమాచారం అందుకున్న పోలీసులు అత డి నివాసానికి చేరుకుని, రూ.660 కిలోల గంజాయి ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అతడిని అరెస్ట్ చేసి, పోలీస్‌స్టేషన్‌కు తరలించినట్లు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ప్రమోద్‌కుమార్ బనువా తెలిపారు. -
హౌతీ రెబల్స్ చెరలో ఎమిరేట్స్ నౌక
దుబాయ్: తమకు మద్దతిచ్చిన ఇరాన్ సైనిక జనరల్ ఖాసిమ్ సులేమానీని అమెరికా హతమార్చినందుకు ఆగ్రహంగా ఉన్న యెమెన్ హౌతీ రెబల్స్ ఎర్ర సముద్రంలో కలకలం రేపారు. ఎర్ర సముద్రం మీదుగా వెళ్తున్న యూఏఈకి చెందిన వాణిజ్య నౌకను తమ అధీనంలోకి తెచ్చుకున్నారు. అంతర్జాతీయ వాణిజ్య, ఇంధన సరకు నౌకల రాకపోకలకు కీలకమైన మార్గంలో ‘వాబీ’ షిప్‌ను సోమవారం సీజ్ చేసి హౌతీ రెబల్స్ ఉద్రిక్తత పెంచారు. మరోవైపు, ఇజ్రాయెల్‌కు చెందిన వార్తా పత్రిక ‘జెరూసలేం పోస్ట్’కు చెందిన వెబ్సైట్ హ్యాకింగ్‌కు గురైంది. -
అందులో దాచి తరలిస్తుండగా.. కోట్ల విలువైన వజ్రాలు సీజ్
తిరువొత్తియూరు: చెన్నై నుంచి దుబాయ్‌కి టెలిస్కోప్‌లో దాచి తరలిస్తున్న రూ. 5.76 కోట్ల విలువవైన 1052 క్యారెట్ వజ్రాలు నగలను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు చెన్నైకి చెందిన యువకుడిని అధికారులు అరెస్టు చేశారు. గురువారం చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి దుబాయ్‌కి వెళ్లే ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ విమానం బయలుదేరడానికి సిద్ధంగా ఉంది. ప్రయాణికులను, వారి లగేజీని కస్టమ్స్ అధికారులు తనిఖీ చేశారు. ఆ సమయంలో చెన్నైకి చెందిన 30 ఏళ్ల యువకుడి సూట్‌కేసు, బ్యాగ్‌లను తనిఖీ చేయగా నాలుగు టెలిస్కోపులు ఉన్నాయి. వాటిని విప్పి చూడగా 22 చిన్న ప్లాస్టిక్ సంచుల్లో వజ్రాలు ఉన్నట్లు గుర్తించారు. వాటిని అధికారులు స్వాధీనం చేసుకుని యువకుడిని అరెస్టు చేశారు. -
గుజరాత్ తీరంలో రూ.400 కోట్ల డ్రగ్స్ స్వాధీనం
గాంధీనగర్: గుజరాత్ తీరంలో సోమవారం భారీగా మాదకద్రవ్యాలు పట్టుబడ్డాయి. 400 కోట్ల విలువైన 77 కిలోల హెరాయిన్‌తో వెళ్తున్న పాకిస్తాన్‌కు ఫిషింగ్ బోటును గుజరాత్ ఏటీఎస్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గుజరాత్ డిఫెన్స్ పిఆర్ఓ ప్రకారం.. ఇండియన్ కోస్ట్ గార్డ్, గుజరాత్ ఎటీఎస్‌తో సంయుక్తంగా జరిపిన ఆపరేషన్‌లో.. భారత జలాల్లోకి ప్రవేశించిన పాకిస్తాన్ పడవలో హెరాయిన్‌ను తరలిస్తున్నారని గుర్తించి అధికారులు వాటిని సీజ్ చేశారు. డ్రగ్స్‌ను తరలిస్తున్న ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. తదుపరి విచారణ కోసం పడవను గుజరాత్‌లోని కచ్ జిల్లాలోని జాఖౌ తీరానికి తీసుకువచ్చినట్లు పేర్కొన్నారు. చదవండి: 16 కిలోల బంగారు, అరకిలో వజ్రాలు చోరీ.. అనుమానాస్పద ప్రాంతంలో.. -
‘సెబ్’ శభాష్.. రూ. 30 కోట్ల పొరుగు మద్యం పట్టివేత!
కర్నూలు: అక్రమ మద్యంపై సెబ్ (స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో) పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. గతేడాది మే నెల నుంచి ఇప్పటి వరకు సారా, మద్యానికి సంబంధించి 16,346 కేసులు నమోదు చేశారు. సుమారు 1,100 మందిని అరెస్ట్ చేసి కటకటాలకు పంపారు. జిల్లాలో 14 సెబ్ స్టేషన్లు, 86 సివిల్ పోలీసుస్టేషన్లు ఉన్నాయి. ఇప్పటి వరకు సుమారు రూ.30 కోట్ల విలువ చేసే 1.70 లక్షల లీటర్ల పొరుగు రాష్ట్రాల మద్యం, 1147 లీటర్ల బీరు పట్టుబడింది. నిరంతర తనిఖీలు.. జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో 7 అంతర్రాష్ట్ర, 10 జిల్లా సరిహద్దు చెక్ పోస్టులున్నాయి. వీటిలో సెబ్ అధికారులు నిరంతర తనిఖీలు నిర్వహిస్తున్నారు. అయినప్పటికీ పండ్లు, కూరగాయలు, పాలు రవాణా మాటున పొరుగు రాష్ట్రాల నుంచి జిల్లాలోకి భారీగా మద్యం తరలివస్తోంది. కొందరు ఇదే వృత్తిగా మార్చుకుని తనిఖీ అధికారులకు సవాళ్లు విసురుతున్నారు. కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల నుంచి జిల్లాలోకి వచ్చేందుకు పలు అడ్డదారులున్నాయి. నిత్యం వందల సంఖ్యలో ద్విచక్ర వాహనాలపై, కాలినడకన నెత్తిన పెట్టుకుని పొరుగు మద్యాన్ని జిల్లాలోకి తీసుకొస్తున్నారు. సెబ్ పోలీసులు నిరంతరం నిఘా ఉంచడంతో భారీగా మద్యం పట్టుపడుతోంది. గుట్టలు గుట్టలుగా నిల్వలు పట్టుబడిన మద్యం ఎక్కువ రోజులు నిల్వ చేసేందుకు ప్రత్యేకంగా గదులు లేవు. దీంతో కర్నూలు సెబ్ స్టేషన్ ఆవరణలోని పాడుబడిన రెండు గోదాముల్లో ఉంచారు. సీఐ కార్యాలయంలో కూడా గుట్టలుగా నిల్వలు పేరుకుపోయాయి. గోడౌన్లలో నిల్వచేసిన మద్యం బాక్సులు వర్షానికి తడిసి సీసాలు పగిలిపోతున్నాయి. దీంతో వాటిని భద్రపరిచేందుకు అధికారులు ఇబ్బందులు పడుతున్నారు. దీనికి తోడు జిల్లా వ్యాప్తంగా 815 కిలోల గంజాయి, 38 లక్షల గుట్కా ప్యాకెట్లు, నల్లబెల్లం, కల్లు తదితర వాటిని కూడా సీజ్ చేసి స్టేషన్ గదుల్లోనే భద్రపరిచారు. పట్టుబడిన మద్యం బ్రాండ్లలో ఒక్కొక్క దాన్ని పరీక్షలు చేయించి కెమికల్ రిపోర్టు తెప్పించారు. ఇవి వర్షానికి తడుస్తుండడంతో ప్రమాదకర మద్యంగా మారిపోయే అవకాశం ఉందని అధికారులు అనుమానిస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురు చూపులు వాహన తనిఖీల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన మద్యం పట్టుబడితే డిపోలకు అప్పగించాలని ప్రభుత్వం స్పష్టమైన ఉత్తర్వులు ఇచ్చింది. అయితే పొరుగు రాష్ట్రాల మద్యం డిపోలకు అప్పగించాలా, లేక ధ్వంసం చేయాలా అన్న దానిపై ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు రాకపోవడంతో అధికారులు సందిగ్ధంలో ఉన్నారు. అక్రమ రవాణాపై జిల్లా వ్యాప్తంగా సెబ్, సివిల్ పోలీసుల సంయుక్త ఆధ్వర్యంలో తనిఖీలు కొనసాగుతున్నాయి. కర్నూలు సెబ్ స్టేషన్‌తో పాటు కర్నూలు అర్బన్ తాలూకా(సివిల్) పోలీసుస్టేషన్లో భారీగా మద్యంతో పాటు రవాణాకు ఉపయోగించిన సుమారు 2 వేలకు పైగా వాహనాలు పడి ఉన్నాయి. వీటిని వేలం వేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నప్పటికీ ప్రక్రియ ముందుకు సాగడం లేదు. యజమానులకు నోటీసులు జారీ చేయడంలో ఆలస్యం కావడంతో పాటు వారి నుంచి సమాధానం కోసం నెలల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి ఇందుకు కారణంగా తెలుస్తోంది. స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో తనిఖీల్లో పట్టుబడిన పొరుగు రాష్ట్రాల మద్యంతో సెబ్ స్టేషన్లు, కొన్ని సివిల్ పోలీసు స్టేషన్లు నిండిపోయాయి. ఇకపై పట్టుబడిన మద్యం, సారా నిల్వలను ఎక్కడ భద్రపరచాలో తెలియక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. సెబ్ ఏర్పడినప్పటి నుంచి పనితీరు ఇదీ.. ►మద్యం, సారా కేసులు : 16,346 ►పట్టుబడిన మద్యం : 1.70 లక్షల లీటర్లు ►పట్టుబడిన బీర్లు : 1147 లీటర్లు ►స్వాధీనం చేసుకున్న గంజాయి : 815 కిలోలు ►సీజ్ చేసిన గుట్కా ప్యాకెట్లు : 38 లక్షలు ఉత్తర్వులు రావాల్సి ఉంది తనిఖీల్లో ఏపీకి సంబంధించిన మద్యం పట్టుబడితే డిపోలకు అప్పగించాలని మాత్రమే ప్రభుత్వం ఆదేశించింది. అలాగే పట్టుబడిన సారా సబ్డివిజన్ల వారీగా ఇటీవలనే ధ్వంసం చేశాం. పొరుగు రాష్ట్రాలకు సంబంధించిన మద్యం డిపోలకు అప్పగించాలా..ధ్వంసం చేయాలా అన్న దానిపై ప్రభుత్వం స్పష్టమైన ఉత్తర్వులు ఇవ్వాల్సి ఉంది. – తుహీన్ సిన్హా, సెబ్ జేడీ చదవండి: సముద్రంపై తేలుతున్న ప్యాక్.. విప్పి చూస్తే 7 కోట్ల విలువైన..!! -
బూజుపట్టిన బాదం మిల్క్.. హెరిటేజ్ స్టోర్ మూసివేత
సాక్షి, రామాయంపేట(మెదక్): బూజుపట్టిన బాదం మిల్క్ బాటిల్‌ను విక్రయించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న రామాయంపేటలోని హెరిటేజ్ స్టోర్‌ను శుక్రవారం రాత్రి మున్సిపల్ అధికారులు మూసివేయించారు. వినియోగదారుడు స్టాల్లో బాదం మిల్క్ బాటిల్‌ను కొనుగోలు చేశాడు. ఇంటికి వెళ్లి బాటిల్ మూత ఓపెన్ చేయగా దుర్వాసన వచ్చింది. ఈ విషయాన్ని వినియోగదారుడు మున్సిపల్ అధికారుల దృష్టికి తెచ్చాడు. దీంతో అధికారులు బాటిల్‌ను స్వాధీనం చేసుకొని హెరిటేజ్ స్టాల్‌ను మూసివేయించారు. ఈ విషయంపై విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకుంటామని ఫుడ్ ఇన్స్పెక్టర్ ఉదయ్‌కిరణ్ తెలిపారు. చదవండి: తెలుగు అకాడమీ కేసులో కీలక మలుపు.. ఏసీబీకి బదిలీ -
గిటారులో డ్రగ్స్.. అంతా బాగానే కవర్ చేశాడు.. కానీ..
దొడ్డబళ్లాపురం( బెంగళూరు): కెంపేగౌడ ఎయిర్‌పోర్టులో డ్రగ్స్ దాచిన ఎలక్ట్రిక్ గిటార్‌ను డీఆర్ఐ అధికారులు పట్టుకున్నారు. చెన్నైకి చెందిన వ్యక్తి ఎలక్ట్రిక్ గిటార్లోపల స్యూడో ఎఫెడ్రిన్ అనే మత్తుమందును ప్యాక్ చేసి తమిళనాడు తిరుచ్చిలోని కొరియర్ ఏజెన్సీలో కొరియర్ చేశాడు. అది ఆస్ట్రేలియాకు వెళ్లాల్సి ఉంది. కెంపేగౌడ విమానాశ్రయంలో అధికారులు అనుమానంతో చెక్ చేయగా అందులో మత్తుమందు బయటపడింది. ఈ మత్తుమందు విలువ సుమారు రూ.50 లక్షలని అంచనా. మరో ఘటనలో... లారీ ఢీకొని బైకిస్టు మృతి తుమకూరు: లారీ ఢీ కొట్టడంతో బైకిస్టు మరణించాడు. ఈ ఘటన నగర శివార్లలో బుధవారం ఉదయం 10 గంటలకు జరిగింది. గుబ్బి నుంచి తుమకూరు వైపు వస్తున్న బైక్‌ను ఎదురుగా మితిమీరిన వేగంతో వెళ్లిన లారీ ఢీకొట్టింది. బైక్‌పై ఉన్న ఒక వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు. మరొకరు తీవ్రంగా గాయపడగా ఆస్పత్రికి తరలించారు. బాధితుల వివరాలు ఇంకా తెలియరాలేదు. చదవండి: స్నేహితురాలితో పెళ్లి.. 7 నెలలు గడిచిన తర్వాత.. -
సీటింగ్ 30.. ట్రావెలింగ్ 134
సాక్షి, జైనథ్(ఆదిలాబాద్): జైనథ్ మండలం భోరజ్ బస్‌స్టాండ్ సమీపంలో ఓవర్‌లోడ్‌తో వెళ్తున్న ఓ ట్రావెల్ బస్సును ఏఎంవీఐ స్రవంతి సీజ్ చేశారు. ఆర్టీసీ అధికారులతో కలిసి 44వ నంబర్ జాతీయ రహదారిపై మంగళవారం సాయంత్రం తనిఖీలు నిర్వహించారు. మధ్యప్రదేశ్‌కు చెందిన కూలీలతో హెదరాబాద్కు వెళ్తున్న బస్సు (పీవై05ఈ1433)ను తనిఖీ చేయగా అందులో 134 ప్రయాణికులు ఉన్నారు. 30 మంది ప్రయాణించే బస్సులో 134 మందిని తరలిస్తుండటంతో ఓవర్‌లోడ్ కారణంగా బస్సును సీజ్‌చేసి ప్రయాణికులతోసహా ఆదిలాబాద్ బస్‌స్టాండ్‌కు తరలించారు. దీంతో కూలీలు ఎటు వెళ్లాలో తెలియక ఇబ్బంది పడ్డారు. రాత్రి ఆదిలాబాద్ బస్టాండ్‌లోనే సేదతీరారు. విషయం తెలుసుకున్న డీసీసీ అధ్యక్షుడు సాజిద్‌ఖాన్ బస్‌స్టాండ్‌కు చేరుకుని కూలీలతో మాట్లాడా రు. వారి ఇబ్బందులు అడిగి తెలుసుకున్నారు. బస్సు ఓనర్‌కు ఫోన్ చేయగా లిఫ్ట్ చేయలేదు. -
తమిళనాడులో ఆంధ్రా ఆర్టీసీ బస్సు సీజ్
వేలూరు( చెన్నై): ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఆర్టీసీ బస్సును తమిళనాడు అధికారులు గురువారం సీజ్ చేశారు. వివరాలు.. తిరుపత్తూరు జిల్లా ఆంబూరుకు చెందిన సుబ్రమణ్యం నాయుడు(57). ఇతను తన రోజువారీ వ్యాపారాన్ని పూర్తి చేసుకొని 2010 డిసెంబర్ 17వ తేదీన గుడియాత్తం నుంచి ఆంబూరుకు ఆంధ్ర రాష్ట్రానికి చెందిన ఏపీఎస్ ఆర్టీసీ బస్సు ఎక్కాడు. గుడియాత్తం బస్టాండ్ సమీపంలోకి బస్సు వస్తుండగా డ్రైవర్ ఉన్న ఫలంగా బ్రేక్ వేయడంతో ముందు ఉన్న సీటు కమ్మీ తల తగిలి అతడు అక్కడిక్కడే మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించిన కేసులో 2019 ఆగస్టు 7న వానియంబాడి కోర్టు తీర్పు వెలువరించింది. ఇందులో న్యాయమూర్తి ఆంధ్ర రాష్ట్ర ఆర్టీసీ బస్సు యాజమాన్యం రూ. 15 లక్షలు బాధిత కుటుంబానికి పరిహారంగా చెల్లించాలని తీర్పు ఇచ్చింది. అయితే ఎటువంటి నష్ట పరిహారం చెల్లించక పోవడంతో సుబ్రమణ్యం నాయుడు కుమారుడు దనకుమార్ మరో పిటిషన్ దాఖలు చేశాడు. దీంతో సదరు ఆంధ్రా ఆర్టీసీ బస్సును జప్తు చేయాలని న్యాయమూర్తి తీర్పు ఇచ్చారు. దీంతో బుధవారం రాత్రి వానియంబాడికి వచ్చిన ఆంధ్ర ప్రభుత్వ బస్సును కోర్టు సిబ్బంది సీజ్ చేశారు. చదవండి: ఎంత కష్టం.. 40 ఏళ్లు వచ్చినా పిల్ల కరువాయే!.. పెళ్లి లేదాయే! ఛలో బీహార్, యూపీ -
ఖమ్మం జిల్లాలో భారీగా పట్టుబడిన గంజాయి
-
ఇంట్లోనే యథేచ్ఛగా గంజాయి పెంపకం
-
ఆసిఫాబాద్‌లో పులి చర్మం స్వాధీనం
సాక్షి, హైదరాబాద్: అక్రమంగా పులి చర్మాన్ని తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అటవీశాఖ అధికారులు కుమురం భీం జిల్లా ఆసిఫాబాద్‌లో అదుపులోకి తీసుకున్నారు. కొట్నాక దేవరావు, గొడుగు అవినాశ్ అనే వ్యక్తులు ఈ చర్మాన్ని ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం వడగామ్ గ్రామం నుంచి తీసుకొచ్చినట్టు ఆదివారం రాత్రి అటవీశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. వీరిద్దరిని విచారించిన అనంతరం ఈ కేసుకు సంబంధించి ఆదిలాబాద్ జిల్లా అటవీ అధికారి రాజశేఖర్ నేతృత్వంలో ఉట్నూరు, ఆసిఫాబాద్ ఎఫ్‌డీవోలు, కాగజ్‌నగర్ అటవీ సిబ్బంది వడగామ్ గ్రామానికి చెందిన మేస్రం మంకు, మేస్రం దీపక్, మేస్రం చంద్రకాంత్, మేస్రం ఈశ్వర్, మేస్రం లక్ష్మణ్‌లను విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకున్నట్టు అటవీ శాఖ తెలిపింది. గత ఏడాది ఇంద్రవెల్లి మండలం వాలుగొండ గ్రామంలో పెందూరు దేవరావు అనే వ్యక్తి పొలంలో అడవి పందుల కోసం అమర్చిన ఉచ్చులకు చిక్కి పులి మరణించినట్టు తెలుస్తోందని ఆ ప్రకటన పేర్కొంది. అదే గ్రామంలోని పెందూరు ముకంద్‌రావు ఇంట్లో సోదా చేయగా పులి కింది దవడ, ఇతర ఎముకలు దొరికినట్లు తెలిపింది. అదుపులోకి తీసుకున్న వారిని విచారణ అనంతరం, సిర్పూర్ కోర్టు మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచనున్నట్లు తెలిపింది. కాగా, పవిత్ర దండారీ ఉత్సవాలు జరుగుతున్న సమయంలో అటవీ శాఖ అధికారులు సోదాల పేరుతో తమ ఇళ్లలోకి బూటుకాళ్లతో ప్రవేశించి సంస్కృతి, సంప్రదాయాలకు భంగం కలిగించారంటూ ఇంద్రవెల్లిలోని అటవీ శాఖ కార్యాలయం ఎదుట ఆదివాసీలు రెండు గంటల పాటు ఆందోళన చేశారు. -
రూ.21 కోట్ల విలువైన గంజాయి పట్టివేత
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో భారీ మొత్తంలో గంజాయి పట్టుబడింది. నగర శివార్లలోని ఔటర్ రింగ్‌రోడ్డు టోల్‌ప్లాజా వద్ద రూ.21 కోట్లు విలువచేసే 3,400 కిలోల గంజాయిని తరలిస్తున్న ట్రక్కును నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారులు శుక్రవారం పట్టుకుని జప్తుచేశారు. 141 గన్నీ సంచుల్లో సరుకు నింపి, బయటకు కనిపించకుండా టార్పాలిన్ షీట్లతో కప్పేశారు. అనుమానం రాకుండా దానిపై నర్సరీ మొక్కలను లోడ్‌చేశారు. దీనిపై బెంగళూరు ఎన్సీబీ నుంచి అందిన సమాచారంతో ఎన్సీబీ హైదరాబాద్, బెంగళూరు బృందాలు సంయుక్తంగా దాడిచేసి ట్రక్కును పట్టుకున్నాయి. మహారాష్ట్ర రిజిస్ట్రేషన్ నంబర్ కలిగిన ట్రక్కులో ప్రయాణిస్తున్న మహారాష్ట్రలోని లాతూర్ జిల్లాకు చెందిన డి.షిండే, ఎంఆర్ కాంబ్లే, ఎన్.జోగ్‌దండ్‌ను అరెస్టుచేశారు. గతంలో నిర్వహించిన ఓ ఆపరేషన్‌లో 3,992 కిలోల గంజాయిని జప్తుచేసుకుని 16 మందిని ఎన్సీబీ అరెస్టు చేసింది. ఈ ఆపరేషన్‌లో లభించిన సమాచారం ఆధారంగా మరో మూడు స్మగ్లర్ల నెట్‌వర్క్‌లను ఎన్సీబీ ఛేదించింది. గత ఆపరేషన్ ద్వారా లభించిన సమాచారంతోనే తాజాగా మరోసారి పట్టుకున్నట్టు ఎన్సీబీ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపింది. మహారాష్ట్ర కేంద్రంగా దందా నడుపుతున్న ఓ కీలక వ్యక్తి తాజాగా పట్టుబడిన ముఠా వెనక ఉన్నట్టు ఎన్సీబీ గుర్తించింది. ముంబై, పూణె, థానెతో పాటు ఇతర రాష్ట్రాల్లోని డ్రగ్స్ సిండికేట్ల కోసం అతడు ఈ సరుకును తరలించేందుకు ఏర్పాట్లు చేశాడని తెలిపింది. ఆంధ్ర–ఒడిశా సరిహద్దు నుంచి గంజాయిని సిండికేట్ల ద్వారా కళాశాలల విద్యార్థులు, పార్టీలు, వ్యక్తులకు సరఫరా చేస్తున్నారని పేర్కొంది. -
ఖరీదైన దళారి.. రూ. 200 కోట్లు.. 20 లగ్జరీ కార్లు
సాక్షి, చెన్నై: కేంద్ర ప్రభుత్వ కాంట్రాక్టులు కావాలా, బదిలీలు చేయించాలా, సీబీఐ కేసుల నుంచి తప్పించాలా.. ఇలా ఒకటేమిటి దేశ రాజధానిలో అన్నిపనులు చక్కబెడుతానంటూ మభ్యపెట్టి రూ.200 కోట్ల లావాదేవీలు నెరపిన చెన్నైకి చెందిన ఖరీదైన దళారీ బండారం బట్టబయలైంది. ఢిల్లీ నుంచి వచ్చిన ఈడీ అధికారులు చెన్నైలోని సుకేష్ చంద్రశేఖర్ అనే దళారి ఇంటిపై సోమవారం చేసిన దాడులతో భారీ మోసాల కోణం వెలుగుచూసింది. వివరాలు.. చీఫ్ ఎలక్షన్ కమిషన్ కార్యాలయం నుంచి అన్నాడీఎంకే పార్టీ చిహ్నమైన రెండాకుల గుర్తును సాధించి పెడతానని రూ.2 కోట్లు లంచం పుచ్చుకున్న కేసులో అరెస్టయిన సుకేష్ చంద్రశేఖర్‌కు చెందిన చెన్నై కానత్తూరులోని ఇంటిలో ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ (ఈడీ) అధికారులు సోమవారం పెద్దఎత్తున దాడులు నిర్వహంచారు. చదవండి: 'నిన్ను మనసారా ప్రేమించా'.. సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆత్మహత్య నేపథ్యం ఇదీ.. అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మరణం తరువాత 2015లో ఆ పార్టీ రెండుగా చీలిపోయింది. ఒక వర్గానికి శశికళ, మరో వర్గానికి ఓ పన్నీర్‌సెల్వం సారథ్యం వహించారు. ఎమ్మెల్యేగా జయలలిత ప్రాతినిథ్యం వహించిన ఆర్కే నగర్ ఖాళీగా మారడంతో ఉప ఎన్నికలు వచ్చాయి. ఆ ఉప ఎన్నికల్లో శశికళ వర్గం అభ్యర్థిగా టీటీవీ దినకరన్, పన్నీర్‌సెల్వం అభ్యర్థిగా పార్టీ ప్రిసీడియం చైర్మన్ మధుసూదనన్ బరిలోకి దిగారు. రెండాకుల చిహ్నం కోసం ఈసీ వద్ద ఇద్దరూ పోటీపడ్డారు. దీంతో రెండాకుల చిహ్నంపై ఈసీ తాత్కాలిక నిషేధం విధించి ఎవ్వరికీ కేటాయించలేదు. దీంతో రెండాకుల చిహ్నాన్ని ఎలాగైనా దక్కించుకోవాలన్న పంతంతో టీటీవీ దినకరన్.. దళారి సుకేష్ చంద్రశేఖర్‌ను కలిసి రూ.50 కోట్లకు డీల్ కుదుర్చుకున్నట్లు సమాచారం. అడ్వాన్స్‌గా రూ.2 కోట్లు పుచ్చుకుంటున్న సమయంలో ఢిల్లీలో ఈడీ అధికారులు సుకేష్ చంద్రశేఖర్‌ను 2017లో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని అరెస్ట్ చేశారు. ఆనాటి నుంచి సుకేష్ చంద్రశేఖర్ తీహార్ జైల్లో ఉన్నాడు. ఇదిలా ఉండగా, ఢిల్లీకి చెందిన 16 మంది ఈడీ అధికారులు సోమవారం తెల్లవారుజామున చెన్నై కానత్తూరులోని సుకుష్ చంద్రశేఖర్ ఇంటిపై మెరుపుదాడులు చేసి తనిఖీలు ప్రారంభించారు. విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న రూ.70 కోట్ల విలువైన 20 లగ్జరీ కార్లు, కారవాన్, నిందితుడి ఇంటిలోని లాప్‌ట్యాప్, లెక్కల్లో చూపని రూ.60 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. లగ్జరీ కార్లన్నీ చట్ట విరుద్ధంగా విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. వాగ్మూలం ఆధారంగానే.. తీహార్ జైల్లో ఉన్న సుకేష్ చంద్రశేఖర్ వద్ద 10 రోజుల క్రితం ఈడీ అధికారులు విచారణ జరిపారు. ఈ సమయంలో కేంద్ర ప్రభుత్వ కాంట్రాక్టర్లు, ముఖ్యమైన పదవుల్లో ఉన్నవారు, సీబీఐ అధికారుల పేర్లు చెప్పి పనులు, బదిలీలు చేయిస్తానని పలువురు పారిశ్రామికవేత్తలు, ప్రభుత్వ అధికారులు, రాజకీయ నాయకుల నుంచి సుమారు రూ.200 కోట్లు, ఖరీదైన బహుమతులు పొందినట్లు బయటపడింది. అతనిచ్చిన వాంగ్మూలం ఆధారంగానే చెన్నైలోని ఇంట్లో సోదాలు చేపట్టారు. తనిఖీల అనంతరం ఈడీ అధికారులు ఢిల్లీకి వెళ్లిపోయారు. కాగా రెండాకుల గుర్తు కేటాయింపు కేసు విచారణలో భాగంగా సుకేష్ చంద్రశేఖర్‌ను త్వరలో తీహార్ జైలు ఉంచి చెన్నైకి తీసుకురానున్నట్లు తెలిసింది. చదవండి: వైరల్ వీడియో: కన్నకొడుకు కంటే ఈ కుక్కే నయం..! -
900 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
జహీరాబాద్: అక్రమంగా తరలిస్తున్న 900 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని అధికారులు పట్టుకున్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలంలోని సత్వార్ గ్రామ సమీపంలోని కోహినూర్ దాబా వద్ద బియ్యం లారీలు ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం మేరకు పౌరసరఫరాల అధికారులు.. పోలీసు, విజిలెన్స్ అధికారుల సహాయంతో తనిఖీ చేయగా మూడు లారీల్లో 900 క్వింటాళ్ల రేషన్ బియ్యం అక్రమంగా హైదరాబాద్ నుంచి గుజరాత్‌కు తరలిస్తున్నట్లు గుర్తించారు. వాహనాలను సీజ్ చేసి ఎస్‌డబ్ల్యూసీ గోదాముకు తరలించారు. ఎలాంటి అనుమతి లేకుండా అక్రమంగా బియ్యం లోడ్ చేసి ఉన్నందున ఓ లారీ డ్రైవర్ గుల్జార్, యజమాని ఇర్ఫాన్, మరో లారీ డ్రైవర్ అవేష్జీ, యజమాని ఇస్మాయిల్బాయ్, మరో లారీ డ్రైవర్ షకీల్ అహ్మద్, యజమాని ఇస్మాయిల్ మతకియాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. తనిఖీల్లో పౌరసరఫరాల శాఖ అధికారులు సురేశ్ కుమార్, ఎండీ షఫీ, శ్రీనివాస్, విజిలెన్స్ అధికారులు పాల్గొన్నారు. -
భారీగా బంగారం పట్టివేత
-
అలక్ష్యంతో వచ్చిపడ్డ అవమానం!
సరైన సమయంలో... సరైన నిర్ణయాలు తీసుకోకపోతే ఎప్పుడైనా పెద్ద చిక్కే. ఆ సంగతి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి తెలిసొచ్చింది. బ్రిటన్‌కు చెందిన చమురు అన్వేషణ, ఉత్పత్తి సంస్థ కెయిర్న్ ఎనర్జీతో కొన్నేళ్ళుగా సాగుతున్న పన్నుల వివాదంలో గురువారం భారత్‌కు గట్టి దెబ్బ తగిలింది. ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్‌లోని ఖరీదైన ప్రాంతంలో ఉన్న భారత ప్రభుత్వ ఆస్తులను స్వాధీనం చేసుకొనేందుకు ఆ సంస్థకు వీలు కల్పిస్తూ, న్యాయప్రక్రియ పూర్తయింది. ప్యారిస్‌లో ఆ సంస్థ స్వాధీనం చేసుకోవాలని చూస్తున్న భారత ప్రభుత్వ ఆస్తుల విలువ దాదాపు 2 కోట్ల యూరోలు. ఇదే కాదు... అంతర్జాతీయ మధ్యవర్తిత్వం ప్రకారం మన ప్రభుత్వం వెనక్కి కట్టాల్సిన 170 కోట్ల డాలర్ల సొమ్ము కోసం ఆ సంస్థ ఇప్పటికే వేర్వేరు దేశాల్లో కూడా కేసు వేసింది. అక్కడ కూడా స్వాధీనం చేసుకొనేందుకు భారత ప్రభుత్వ ఆస్తులను గుర్తిస్తోంది. దౌత్యవేత్తల నివాసాలే కాదు, చివరకు అక్కడి ఎయిర్ ఇండియా విమానం సహా భారత ప్రభుత్వ ఆస్తులను స్వాధీనం చేసుకొని, విక్రయి స్తామని కెయిర్న్ గతంలోనే బెదిరించింది. ఇప్పుడు ఆ పనే చేయడానికి సిద్ధమవుతోంది. దిగ్భ్రాంతి కరమైన ఈ వార్త ఒక రకంగా ప్రభుత్వానికి పరువు తక్కువగా మారింది. ఈ వివాదానికి మూలమైన భారత్‌లో కెయిర్న్ కథ చాలా ఏళ్ళ క్రితం మొదలైంది. 1994లోనే ఆ సంస్థ మన దేశంలో చమురు, సహజవాయు రంగంలో పెట్టుబడులు పెట్టింది. 2004 జనవరిలో రాజస్థాన్‌లోని బర్మేర్ దగ్గర చమురు బావులున్నట్టు ఆ సంస్థ అన్వేషణలో తేలింది. అక్కడ పని మొదలుపెట్టింది. సరిగ్గా మూడేళ్ళకు కెయిర్న్ ఇండియా సంస్థ మన స్టాక్ ఎక్స్ఛేంజ్లో లిస్ట్ అయింది. అటుపైన నాలుగేళ్ళకు షేర్లలో అధిక భాగాన్ని గనుల తవ్వక దిగ్గజమైన వేదాంత సంస్థకు అమ్మేసింది. ఇలా ఉండగా, 2012లో మన కేంద్ర ఆర్థిక శాఖ వెనుకటి తేదీ నుంచి వర్తిస్తూ పన్ను వేసేలా చట్టంలో సవరణ తెచ్చింది. దాని ప్రకారం కెయిర్న్‌పై వెనకటి తేదీ 2006 నుంచే వర్తించేలా పన్ను భారం పడింది. 2006–07లో ఆ సంస్థ అంతర్గత పునర్వ్యవస్థీకరణలో భాగంగా ‘కెయిర్న్ ఇండియా హోల్డింగ్స్’ షేర్లను ‘కెయిర్న్ ఇండియా’కు బదలాయించింది. తద్వారా ఆ బ్రిటన్ సంస్థకు క్యాపిటల్ గెయిన్స్ వచ్చినందువల్ల, దానిపై రూ. 24.5 వేల కోట్ల క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ కట్టాలని అధికారులు ఆదేశించారు. అది వివాదమైంది. విషయం కోర్టుల దాకా వెళ్ళింది. బ్రిటన్ – భారత్‌ల మధ్య ఉన్న ద్వైపాక్షిక పెట్టుబడుల ఒప్పందం కింద అది చెల్లదంటూ 2015 మార్చిలో కెయిర్న్ అంతర్జాతీయ మధ్యవర్తిత్వాన్ని ఆశ్రయించింది. ఇది పెట్టుబడులకు సంబంధిం చిన వివాదమే తప్ప, కేవలం పన్ను వ్యవహారం కాదంటూ హేగ్‌లోని అంతర్జాతీయ మధ్వవర్తిత్వ కోర్టు స్పష్టం చేసింది. అలా 2020 డిసెంబర్లో కెయిర్న్‌కు అనుకూలంగా ఉత్తర్వులిచ్చింది. వివాదం వల్ల భారత ప్రభుత్వం ఆపిన డబ్బులన్నీ లెక్క కట్టి, ప్రభుత్వమే ఆ సంస్థకు 120 కోట్ల డాలర్ల అసలు, 50 కోట్ల డాలర్ల వడ్డీ – మొత్తం 170 కోట్ల డాలర్లు చెల్లించాలని కోర్టు పేర్కొంది. దానితో అసంతృప్తికి లోనైన భారత ప్రభుత్వం దానిపై అప్పీలు చేసుకుంది. మరోపక్క కెయిర్న్ సంస్థ తమకు అనుకూలంగా వచ్చిన ఉత్తర్వుల అమలు కోసం అమెరికా, బ్రిటన్, నెదర్లాండ్స్, కెనడా, సింగపూర్, జపాన్ సహా పలుచోట్ల కేసు వేసింది. తద్వారా విమానాలు, నౌకలు, బ్యాంకు ఖాతాలతో సహా ఆ దేశాల్లో మన దేశానికి ఉన్న వాణిజ్యపరమైన ఆస్తులను గుర్తించి, వాటిని స్వాధీనం చేసుకొనే వీలు కలిగింది. ఈ పరిస్థితుల్లో తక్షణమే రంగంలోకి దిగి, సర్దుబాటు, దిద్దు బాటు చర్యలు చేపట్టాల్సిన మన సర్కారు ఆ పని చేయలేదు. ప్రభుత్వ వర్గాలు మొద్దునిద్ర పోవ డంతో ఇప్పుడు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది. ఇప్పటికీ ‘తగిన చర్యలన్నీ తీసుకుంటాం’, ‘న్యాయపోరాటానికి దిగుతాం’ లాంటి మాటలనే ప్రభుత్వ వర్గాలు వల్లె వేస్తున్నాయి. కానీ, వాద నకు వకీలుకు తగినంత సమాచారం ఇవ్వరంటూ సొంత అధికారుల నుంచి గతంలోనే ప్రభుత్వం విమర్శల పాలైంది. ఇప్పుడిక అంతర్జాతీయ ఉత్తర్వులు అమలుకు వీలున్న అనేక ప్రాంతాల్లో ఆస్తులు కాపాడుకొనేందుకు ప్రభుత్వం ఎంత సమర్థంగా పోరాటం చేయగలదన్నది ప్రశ్న. మరోపక్క కెయిర్న్ చూపిన ఈ బాట ఇప్పుడు పలు విదేశీ సంస్థలకు అవకాశం కానుంది. ఇప్పటికే మరో విదేశీ సంస్థ దేవాస్ మల్టీమీడియా కూడా న్యూయార్క్‌లోని ఎయిరిండియా ఆస్తులపై కన్నేసి, ఇదే దోవలో వెళ్ళేందుకు సిద్ధమవుతోంది. ఇస్రో అనుబంధ సంస్థ యాంత్రిక్స్ కార్పొ రేషన్‌కూ, దేవాస్కూ మధ్య కుదిరిన ఒప్పందాన్ని 2012లో ప్రభుత్వం రద్దు చేసింది. ఇప్పుడు దానికీ భారీగానే నష్టపరిహారం చెల్లించాల్సి ఉంది. ఒప్పందాలు కుదుర్చుకునే ముందే ఆలోచించాలి తప్ప, కుదుర్చుకున్నాక చటుక్కున బయటకు రావడం అంత సులభం కాదని ఆలస్యంగానైనా ప్రభుత్వానికి అర్థమై ఉంటుంది. ఇప్పటికైనా ప్రభుత్వం రాజీ మార్గం వెతకాలి. ట్రిబ్యునల్ ఉత్తర్వుల ద్వారా భారత్ నుంచి రావాల్సిన మొత్తాన్ని భారత్‌లోనే పెట్టుబడిగా పెడతామని ఆ మధ్య కెయిర్న్ చేసిన ప్రతిపాదననూ పరిశీలించవచ్చు. తక్షణమే సమస్యను సామరస్యంగా పరిష్కరించకపోతే, ఒకపక్క ఆస్తులతో పాటు అంతర్జాతీయంగా ప్రభుత్వం పరువూ పోతుంది. చట్టబద్ధమైన ఒప్పందాలను గౌరవించరనే అపఖ్యాతే మిగులుతుంది. అంతర్జాతీయ పెట్టుబడులు వెనుకపట్టు పట్టే ప్రమాదం ఉంది. గెలవని యుద్ధాలు చేయడం కన్నా... చేసిన తప్పు నుంచి తక్కువ మూల్యంతో బయట పడడమే ఒక్కోసారి విజ్ఞత. -
రూ.78 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం
-
రూ.78 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం
సాక్షి, హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అధికారులు ఆదివారం భారీగా డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఉగాండా, జాంబియా నుంచి వచ్చిన ఇద్దరు మహిళల నుంచి కస్టమ్స్ అధికారులు 12 కిలోల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ సుమారు రూ.78 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. ఉగాండా, జాంబియా నుంచి ఇద్దరు మహిళలు వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకున్న డీఆర్ఐ అధికారులు విచారిస్తున్నారు. చదవండి: రూ. 300 కోసం.. రూ.1.90 లక్షలు పోగొట్టుకున్న యువతి -
చెన్నైలో రూ.70 కోట్ల హెరాయిన్ స్వాధీనం
తిరువొత్తియూరు (చెన్నై): దక్షిణాఫ్రికా నుంచి చెన్నై విమానాశ్రయానికి తీసుకొచ్చిన రూ.70 కోట్ల విలువైన 9.8 కిలోల హెరాయిన్‌ను కస్టమ్స్ అధికారులు శుక్రవారం రాత్రి స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు మహిళలను అరెస్టు చేశారు. చెన్నై మీనంబాక్కం అంతర్జాతీయ విమానాశ్రయానికి దోహా నుంచి వస్తున్న ప్రత్యేక విమానంలో డ్రగ్స్ తీసుకొస్తున్నట్లు వచ్చిన సమాచారంతో కస్టమ్స్ కమిషనర్ రాజన్ చౌదరి నేతృత్వంలో అధికారులు నిఘా ఉంచారు. ప్రయాణికుల్లో ఓ మహిళ వీల్‌చైర్‌లో, ఆమెకు తోడుగా మరొక మహిళ వచ్చారు. ఢిల్లీలోని ఆస్పత్రిలో చికిత్స కోసం వచ్చినట్లు వారు తెలిపారు. సూట్‌కేస్‌లను తనిఖీ చేయగా నాలుగు పార్శిళ్లలో 9.8 కిలోల హెరాయిన్ బయటపడింది. -
విశాఖ జిల్లా అరకులో భారీగా గంజాయి స్వాధీనం
-
Hyderabad: సాబ్.. ఛోడ్‌దో సాబ్..
ఆదివారం ఉదయం 11.30.. హైదరాబాద్ కూకట్‌పల్లిలోని గోవింద్ హోటల్ చౌరస్తా.. పోలీసులు వాహనాల తనిఖీ చేస్తున్నారు. ద్విచక్ర వాహనంపై వస్తున్న ఓ యువకుడిని ఆపారు. అడిగినదానికి తడబడుతున్నాడు.. అనవసరంగా రోడ్డు మీదకు వచ్చాడని గ్రహించిన పోలీసులు.. వాహనాన్ని సీజ్ చేశారు. దీంతో ఆ యువకుడు భయపడి.. వాళ్లమ్మకు ఫోన్ చేశాడు.. వెంటనే పరుగులు పెడుతూ వచ్చిన వాళ్లమ్మ.. ‘సాబ్ ఛోడ్‌దో’ అంటూ ప్రాధేయపడింది. అప్పటికే బండిపై కేసు నమోదు చేశామని పోలీసులు చెప్పడంతో చేసేది ఏమీలేక వారిలా దిగాలుగా ఇంటిబాట పట్టారు.. చదవండి: ‘లైట్’ తీస్కోలేదు.. కూకట్‌పల్లిలో ఓ బైక్ కహానీ -
‘లైట్’ తీస్కోలేదు.. కూకట్‌పల్లిలో ఓ బైక్ కహానీ
ఉదయం 11.15.. కూకట్‌పల్లిలోని గోవింద్ హోటల్ చౌరస్తా.. సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్ లాక్‌డౌన్‌ను పర్యవేక్షిస్తున్నారు.. ఇంతలో సార్సార్ అంటూ కొందరు పోలీసులు వచ్చారు.. ఒక అతితెలివి వాహనదారుడిని ఆయన ముందు నిల్చోబెట్టారు. తను తన బైకు ముందు, వెనకాల ఎల్ఈడీ ఫోకస్ లైట్లను అమర్చాడు. ఈ లైట్ల వల్ల కెమెరాలో ఫొటో తీసినప్పుడు రిఫ్లెక్షన్ వచ్చి.. బండి నంబర్ ఫొటోలో సరిగా కనపడదు. కొన్నిసార్లు ఎదురుగా వచ్చే వాహనాలకు కూడా ఇబ్బంది ఏర్పడుతుంది.. దీన్ని స్వయంగా పరిశీలించిన కమిషనర్ ఆ లైట్లను తీసేయించి.. ఆ బండిని సీజ్ చేయమని ఆదేశించారు. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో పోలీసులు కట్టుదిట్టంగా లాక్డౌన్ అమలు చేస్తున్నారు. లాక్డౌన్ సమయంలో రోడ్లపైకి వచ్చిన వారిని క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. ఉల్లంఘనుల వాహనాలను స్వాధీనం చేసుకుని జరిమానాలు విధిస్తున్నారు. Lockdown: సజ్జనార్ వస్తున్నారు.. వెంటనే ఖాళీ చేయండి -
కర్నూల్ జిల్లా పంచలింగాల చెక్ పోస్ట్ లో భారీగా నగదు, బంగారం పట్టుకున్న సెబ్ అధికారులు
-
నకిలీ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్న అధికారులు
-
పాంచ్ పటాకా: రూ.331 కోట్ల సంపద సీజ్
న్యూఢిల్లీ: నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తాయిలాలుగా అందిస్తున్న డబ్బులు, ఆభరణాలు, సామగ్రి, పరికరాలు, బహుమతులు పెద్ద ఎత్తున పట్టుబడుతున్నాయి. ఈసారి ఎప్పుడు లేనంతగా ఏకంగా రూ.300 కోట్లకు పైగా సంపదను ఎన్నికల సంఘం స్వాధీనం చేసుకుంది. ఎన్నికలు జరుగుతున్న తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళ, అసోంతోపాటు కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిల్లో విచ్చలవిడిగా డబ్బుతో పాటు ఇతర తాయిలాలు తరలిస్తున్నారు. ఎన్నికల సంఘం పటిష్ట చర్యలు చేపట్టి విస్తృతంగా తనిఖీలు చేస్తుండడంతో భారీగా సంపద లభిస్తోంది. 2016తో పోలిస్తే ఇప్పటివరకు పట్టుబడిన సంపద రెట్టింపులో ఉందని ఎన్నికల సంఘం బుధవారం ప్రకటించింది. ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసినప్పటి నుంచి ఇప్పటివరకు పట్టుబడ్డ సంపద విలువ అక్షరాల రూ.331.47 కోట్లు. అయితే గతంలో 2016లో జరిగిన ఎన్నికల సందర్భంగా పట్టుబడ్డ సంపద రూ.225.17 కోట్లు. ఎన్నికల ప్రారంభంలోనే ఇంత నగదు పట్టుబడగా ఎన్నికలు ముగిసే నాటికి ఎంత డబ్బు పట్టుబడుతుందోనని అధికార వర్గాలతో పాటు ప్రజలు సందేహం వ్యక్తం చేస్తున్నారు. పట్టుబడ్డ సంపదను ఎన్నికల సంఘం రాష్ట్రాలవారీగా వర్గీకరించింది. తమిళనాడు రూ.127 కోట్లు పశ్చిమ బెంగాల్ రూ.112.59 కోట్లు అస్సాం రూ.63 కోట్లు కేరళ రూ.21.77 కోట్లు పుదుచ్చేరి రూ.5.72 కోట్లు ఈ పట్టుబడ్డ సంపదలో తమిళనాడు అగ్రస్థానంలో ఉండగా అసోం చివరి స్థానంలో ఉంది. ఈ ఎన్నికల సందర్భంగా ఎన్నికల సంఘం ప్రత్యేకంగా 295 మందిని వ్యయ పరిశీలకులను నియమించింది. ఎన్నికల్లో ధన ప్రవాహాన్ని కట్టడి చేసేందుకు ఈ పరిశీలకులు పని చేయనున్నారు. ఓటర్లకు ఎరగా డబ్బు, ఆభరణాలు, బహుమతులు పంపిణీ చేయడం చట్టరీత్యా నేరం. అందుకోసం ఎన్నికల సంఘం తాయిలాల పంపకాన్ని అడ్డుకుంటోంది. చదవండి: అధికారంలోకి వస్తే ‘అమ్మ మృతి’ మిస్టరీ చేధిస్తాం చదవండి: తాజా మాజీ ముఖ్యమంత్రికి అధిష్టానం షాక్ Record Seizures worth Rs. 331 crores made in Expenditure Monitoring Process in ongoing Assembly Elections, 2021 in States of Assam, West Bengal, Tamil Nadu, Kerala and Union Territory of Puducherry. (1/n) Further details follow in press release — Sheyphali Sharan (@SpokespersonECI) March 17, 2021 -
యశస్వి ఆత్మహత్య.. పాఠశాల సీజ్
నేరేడ్మెట్: పదో తరగతి విద్యార్థిని యశస్విని ఆత్మహత్య ఘటన నేపథ్యంలో అఖిలపక్ష నాయకులతోపాటు విద్యార్థి సంఘాల నేతలు శుక్రవారం నేరేడ్మెట్ ఠాణా పరిధిలోని రవీంద్రభారతి పాఠశాల ఎదుట బైఠాయించి ఆందోళన నిర్వహించారు. పాఠశాల వద్దకు మల్కాజిగిరి మండల విద్యాశాఖ అధికారి శశిధర్ రావడంతో ఉద్రికత్త నెలకొంది. పోలీసులు జోక్యం చేసుకోవడంతో పరిస్థితి సద్దుమణిగింది. విద్యార్థి ఆత్మహత్యకు కారణమైన పాఠశాల నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని నాయకులు డిమాండ్ చేశారు. ఫీజు చెల్లించాలని ఒత్తిడి వల్లనే విద్యార్థిని మనస్థాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడినట్టు తల్లిదండ్రులు చెప్పారని, ఈమేరకు జిల్లా విద్యాశాఖ అధికారి ఆదేశాలతో పాఠశాలను సీజ్ చేసి, సీలు వేసినట్టు ఎంఈఓ తెలిపారు. ప్రస్తుతం స్కూల్ నిర్వాహకులు విజయలక్ష్మిరెడ్డి అందుబాటులో లేరని, ఈ ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు చేస్తున్నామని ఎంఈఓ వివరించారు. విజయలక్ష్మిరెడ్డిపై కేసు నమోదు చేసినట్టు నేరేడ్మెట్ సీఐ నర్సింహ్మాస్వామి తెలిపారు. మల్కాజిగిరి తహసీల్ధార్ వినయలత స్కూల్‌ను పరిశీలించారు. అనంతరం విద్యార్థి తల్లిదండ్రులతో మాట్లాడారు. ప్రభుత్వ పరంగా ఆర్ధిక సహాయం అందేలా చూస్తానని చెప్పారు. విద్యార్థిని యశస్విని తల్లిదండ్రులతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే మైనంపల్లి విద్యార్థి కుటుంబానికి ఎమ్మెల్యే రూ.2లక్షల సాయం శుక్రవారం మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ఈస్ట్‌కాకతీయనగర్‌లోని విద్యార్థిని యశస్విని ఇంటికి వెళ్లి తల్లిదండ్రులను పరామర్శించారు. ఫీజు చెల్లించాలని స్కూల్ యజమాన్యం యశస్వినితో తనకు ఫోన్ చేయించారని, ఒత్తిడి చేయడంతో మనస్థాపం చెంది ఆత్మహత్య చేసుకున్నట్టు విద్యార్థిని తండ్రి హరిప్రసాద్ ఎమ్మెల్యేతో వాపోయారు. ఈ విషయంపై ఎమ్మెల్యే మంత్రి కేటీఆర్‌తో మాట్లాడి బాధిత కుటుంబానికి న్యాయంచేస్తామని హామీ ఇచ్చారు. నేతల రూ.3లక్షల సాయం బీజేపీ కార్పొరేటర్ రాజ్యలక్ష్మి, టీఆర్ఎస్,బీజేపీ నేతలు బద్ధం పరుశురామ్‌రెడ్డి,సతీష్‌కుమార్, ప్రసన్ననాయుడుతోపాటు పలువురు నాయకులు కలిపి రూ.3లక్షలను అందజేస్తామన్నారు. స్కూల్ యాజమాన్యం తరపున రూ.5లక్షల ఆర్థిక సహాయం అందేలా చూస్తానని ఎమ్మెల్యేకు స్కూల్ బిల్డింగ్ యజమాని చెప్పారు. చదవండి: ఫీజు వేధింపులకు విద్యార్థిని బలి -
మీర్పేట్లో వ్యభిచార గృహం సీజ్
సాక్షి, మీర్‌పేట: వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ ఇంటిని మీర్ పేట పోలీసులు బాలాపూర్ మండల రెవెన్యూ అధికారుల సమక్షంలో సీజ్ చేశారు. సీఐ మహేందర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... మీర్‌పేట ఆర్ఎన్రెడ్డినగర్ టీకేఆర్ కళాశాల సమీపంలోని ఓ ఇంట్లో వ్యభి చారం నిర్వహిస్తున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు ఈనెల 5వ తేదీన ఇంటిపై దాడి చేసి నిర్వాహకులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ మేరకు గురువారం రెవెన్యూ ఇన్స్పెక్టర్ సమక్షంలో సదరు ఇంటిలోని మొదటి అంతస్తును సీజ్ చేశారు. -
చిన్నమ్మకు గట్టి షాకిచ్చిన తమిళనాడు ప్రభుత్వం
చెన్నె: తమిళనాడు రాష్ట్రంలోకి అడుగుపెట్టి 24 గంటలు గడిచాయో లేదో అప్పుడే తమిళనాడు ప్రభుత్వం శశికళకు షాక్ ఇచ్చింది. మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత స్నేహితురాలు శశికళ అడుగుపెట్టిన వెంటనే ఆమెకు సంబంధించిన ఆస్తులను జప్తు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆమెకు సంబంధించిన ఆస్తులను తన ఆధీనంలోకి తీసుకుంటూ నిర్ణయం తీసుకుంది. నాలుగేళ్ల జైలు శిక్ష పూర్తి చేసుకుని సోమవారం చెన్నైకు చేరుకున్న శశికళకు అభిమానులు భారీ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జయలలితకు తానే వారుసురాలిని, అన్నాడీఎంకే తనదేనని, తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నట్లు సంచలన ప్రకటన చేశారు. దీంతో ప్రభుత్వం కక్షపూరిత చర్యలకు పూనుకుందని సమాచారం. ఈ క్రమంలోనే వందల కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో తూత్తుకుడి జిల్లాలో ఉన్న 800 ఎకరాల భూములను ప్రభుత్వం జప్తు చేసింది. దీంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల కోట్లు విలువ చేసే భూములను ప్రభుత్వం తన ఆధీనంలోకి తీసుకుంది. అయితే జప్తు చేసిన ఆస్తులన్నీ ఇలవరసి, సుధాకరన్ పేరుతో ఉన్నట్లు తెలుస్తోంది. శశికళ అక్రమాస్తుల కేసులో ఆస్తుల జప్తునకు సంబంధించి 2017లో సుప్రీంకోర్టు తీర్పునివ్వగా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసింది. -
అక్రమాలు చేసి.. ముఖం చాటేశారు..
సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: గండేపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం అవినీతి, అక్రమాలపై విచారణకు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ), జిల్లా సహకార అధికారులు కదిలారు. అక్రమాలకు సంబంధించిన రికార్డులు తారుమారు కాకుండా చూసేందుకు వాటిని స్వాధీనం చేసుకునేందుకు శుక్రవారం వారు ప్రయత్నించారు. సొసైటీ సిబ్బంది సహకరించకపోవడంతో చివరకు సొసైటీ భవనాన్ని, అందులో కీలకమైన రికార్డులు ఉన్న బీరువాలను సీజ్ చేశారు. బినామీ పేర్లు, నకిలీ డాక్యుమెంట్లతో గండేపల్లి సొసైటీలో కొంతమంది ప్రబుద్ధులు రూ.23 కోట్లు కొల్లగొట్టిన కుంభకోణంపై.. డీసీసీబీలోని ఇద్దరు డిప్యూటీ జనరల్ మేనేజర్లతో చైర్మన్ అనంత ఉదయ భాస్కర్ విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే. దీని నుంచి ఏదో ఒకలా బయట పడదామనుకుంటున్న సూత్రధారులు విచారణ ముందుకు సాగకుండా రకరకాల ఎత్తులు వేస్తున్నారు. ఈ కుంభకోణానికి సంబంధించిన రికార్డులను మాయం చేసే ప్రయత్నాలకు బుధవారమే తెర తీశారు. తొలిగా సొసైటీలో సిబ్బందిని అందుబాటులో లేకుండా చేశారు. గురువారం నుంచి శుక్రవారం ఉదయం వరకూ సొసైటీలో 156 మంది బినామీ పేర్లు, నకిలీ బాండ్లతో విడుదల చేసిన రుణాల రికార్డుల కోసం విచారణాధికారులు అనేక ప్రయత్నాలు చేశారు. విచారణ కోసం సొసైటీ కార్యాలయానికి వెళ్లేసరికి సిబ్బంది ముఖం చాటేయడంతో వారు అవాక్కయ్యారు. శుక్రవారం సొసైటీ వద్దకు వెళ్లగా రికార్డులు, కార్యాలయంలోని బీరువాల తాళాలు కూడా అందుబాటులో లేవనే సమాధానం వారికి ఎదురైంది. తద్వారా విచారణను అడ్డుకునేందుకు అక్రమార్కులు ఎత్తు వేశారు. సొసైటీలోని బీరువాల్లో ఉన్న రికార్డులను మార్చేసే ప్రయత్నం కూడా జరుగుతోందని స్థానికులు డీసీసీబీ అధికారులకు ఉప్పందించారు. ఈ పరిణామాలన్నింటినీ నిశితంగా గమనించిన డీసీసీబీ అధికారులు అక్రమార్కుల ఎత్తులకు పై ఎత్తులు వేశారు. విచారణ ముందుకు సాగాలంటే రికార్డులు తారుమారు కాకుండా చూడాలని, ప్రధాన ఆధారాలుగా భావిస్తున్న 156 మంది రైతుల పేర్లతో నమోదై ఉన్న డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో విచారణ ముగిసే వరకూ సొసైటీలోని రికార్డులను భద్రంగా ఉంచాల ని జిల్లా సహకార అధికారి పాండురంగారావును డీసీసీబీ చైర్మన్ అనంతబా బు కోరారు. జిల్లా సహకార అధికారి ఆదేశాల మేరకు పెద్దాపురం, ప్రత్తిపా డు సబ్ డివిజన్ల సహకార అధికారులు బీఎన్ శివకుమార్, శివకామేశ్వరరావు లు గండేపల్లి సొసైటీకి వెళ్లారు. సిబ్బందిని రికార్డుల గురించి అడగగా వారు ఇవ్వలేదు. అటెండర్‌కు కరోనా వచ్చినందు వల్ల తాళాలు లేవని చెప్పారు. వారి మాటలను విశ్వసించని అధికారు లు రికార్డులు ఉన్న మూడు బీరువాల తో పాటు, గండేపల్లి సొసైటీ కార్యాలయాన్ని కూడా సీజ్ చేశారు. డీసీసీబీ జారీ చేసిన నోటీసులను సొసైటీ ప్రధాన ద్వారం తలుపులపై అతికించారు. ఈ అక్రమాలపై రెండు మూడు రోజుల్లో పూర్తిస్థాయి విచారణ చేపడతామని డివిజనల్ సహకార ఆఫీసర్ రాధాకృష్ణ తెలిపారు. అక్రమార్కుల నుంచి ప్రతి పైసా తిరిగి రాబట్టే వరకూ విశ్రమించేది లేదన్నారు. బాధ్యులుగా తేలిన వారిపై సహకార చట్టం ప్ర కారం చర్యలు తప్పవన్నారు. విచారణ ను అడ్డుకునే ప్రయత్నాలు చేస్తే పోలీసుల సాయం కూడా తీసుకుంటామని హెచ్చరించారు. -
ఏలూరులో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి సీజ్
-
ఏలూరులో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్వాకం..
సాక్షి, పశ్చిమగోదావరి: అనధికారికంగా కోవిడ్ బాధితులకు వైద్యం చేస్తూ దోపిడీ పర్వానికి తెరలేపిన ఏలూరులోని ఓ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని వైద్యాధికారులు శనివారం సీజ్ చేశారు. బాధితులు నుంచి మురళీకృష్ణ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి లక్షలు దోచుకుంటున్నట్లు అధికారులు ధ్రువీకరించారు. ఆసుపత్రిపై డీఎంహెచ్‌వో, ఏలూరు రెవెన్యూ యంత్రాంగం దాడులు నిర్వహించారు. సుమారు 10 లక్షల విలువైన రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లను కూడా సీజ్ చేశారు. (కరోనా బూచి.. డబ్బు దోచి!) ఆసుపత్రికి చేరుకున్న జిల్లా వైద్యశాఖాధికారి డాక్టర్ సునంద, ఎమ్మార్వో చంద్రశేఖర్, ఆర్డీవోలు విచారణ చేపట్టారు. విచారణలో ఆస్పత్రి అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. కరోనా సోకిన వ్యక్తి కి రెండు లక్షల రుపాయలు గరిష్ఠంగా వసూళ్లు చేసినట్లు గుర్తించారు. రోజుకు లక్ష రుపాయలు వసూళ్లు చేసినట్లు ధ్రువీకరించారు. వెంటిలేషన్ సదుపాయం లేకుండానే రోగుల వద్ద నుంచి లక్షల రూపాయల్లో ఫీజులు వసూలు చేసినట్లు అధికారులు గుర్తించారు. కరోనా బాధితుడికి పీపీఈ కిట్ పేరుతో రోజుకు రూ.10వేలు వసూలు చేస్తున్నట్లు తేలింది. ఆసుపత్రి పై అధికారులు దాడి చేసిన సమయంలో 18 మంది కరోనా బాధితులకు చికిత్స అందిస్తున్నట్లు గుర్తించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులను మరొక ఆసుపత్రికి తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఆసుపత్రిలో విచారణ ఇంకా కొనసాగుతుంది. -
ఏపీలో భారీగా తెలంగాణ మద్యం పట్టివేత..
సాక్షి, విజయవాడ: లాక్డౌన్ నేపథ్యంలో మద్యం అమ్మకాలపై ప్రభుత్వం ఆంక్షలు విధించినప్పటికీ కొందరు అక్రమంగా రాష్ట్రాల సరిహద్దులు దాటి సరఫరా చేస్తున్నారు. తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు అక్రమంగా తరలిస్తున్న భారీ మద్యాన్ని మంగళవారం తెల్లవారుజామున కృష్ణా జిల్లా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నందిగామ మండలం జొన్నలగడ్డ చెక్ పోస్ట్ వద్ద టాస్క్‌ఫోర్స్ పోలీసుల తనిఖీల్లో సుమారు రెండు లక్షల రూపాయల విలువైన మద్యం పట్టుబడింది. మద్యాన్ని తరలిస్తున్న నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేయడంతో పాటు, మూడు బైక్ లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
విజేత సూపర్ మార్కెట్ సీజ్
సాక్షి, హైదరాబాద్: కరోనా వ్యాప్తి నేపథ్యంలో సామాజిక దూరం పాటించేలా జాగ్రత్త చర్యలు తీసుకోని సూపర్ మార్కెట్లను జీహెచ్ఎంసీ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలో చందానగర్‌కు చెందిన విజేత సూపర్ మార్కెట్‌ను శనివారం అధికారులు సీజ్ చేశారు. సూపర్ మార్కెట్లో భౌతిక దూరం పాటించకుండా ఒకేసారి ఎక్కుమందిని లోపలికి పంపడం, ఒకే దగ్గర అధిక సంఖ్యలో కస్టమర్స్ ఉండటంతో సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు. వాల్‌మార్ట్ ‘బెస్ట్ ప్రైస్’ సూపర్ మార్కెట్లో అధికారులు తనిఖీలు చేశారు. సీజ్ చేసినట్టు వచ్చిన వార్తలను వాల్‌మార్ట్ ఇండియా తోసిపుచ్చింది. అధికారులు తనిఖీలు మాత్రమే చేశారని వెల్లడించింది. లాక్డౌన్ నిబంధనలను కచ్చితంగా పాటిస్తున్నామని స్పష్టం చేసింది. అయితే అధికారుల తీరుపై సూపర్ మార్కెట్ యాజమాన్యాలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేగాక లాక్డౌన్ సమయంలో ప్రజలకు అనువుగా నిత్యవసర సరుకులను అందిస్తున్న తమపై ఇలాంటి చర్యలు తీసుకోవడం సరికాదని, దీనిపై ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కాగా, కరోనా కట్టడికి దేశవ్యాప్తంగా అమలు చేస్తున్న లాక్డౌన్ గడువును తెలంగాణ ప్రభుత్వం మే 7 వరకు పొడిగించిన సంగతి తెలిసిందే. కిరాణా వర్తకుడికి కరోనా పాజిటివ్ -
హైటెక్ మోసం
అమలాపురం టౌన్: అది ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని గోరక్‌పూర్ కేసీ జైన్ ట్రావెల్స్‌కు చెందిన ప్రైవేటు హైటెక్ బస్సు.. అయితే ఇదే బస్సు ఆంధ్రప్రదేశ్ రిజిస్ట్రేషన్‌తో నకిలీ నంబరుతో మన రాష్ట్రంలో పన్ను ఎగవేస్తూ అక్రమ ట్రాన్స్పోర్ట్ చేస్తోంది. ఎదుర్లంక–హైదరాబాద్ మధ్య ట్రావెల్స్ నిర్వహిస్తోంది. అమలాపురం కలశం సెంటరులో గురువారం రాత్రి 9 గంటలకు ఈ నకిలీ నంబరుతో ఉన్న హైటెక్ బస్సు రోడ్డుపై నిలిపి ప్రయాణికులను ఎక్కించుకుంటున్న సమయంలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కేవీ శివప్రసాద్ తన సిబ్బందితో ఆకస్మిక దాడి చేసి ఆ బస్సు రికార్డులను తనిఖీ చేశారు. బస్సు వాస్తవ రికార్డుల ప్రకారం ఉత్తరప్రదేశ్ రాష్ట్రం రిజి్రస్టేషన్ నంబర్ యూపీ 53 ఎఫ్టీ 3509గా ఆయన గుర్తించారు. అయితే ఇదే బస్సు ఆంధ్రప్రదేశ్ రిజిస్ట్రేషన్ నంబరు ఏపీ07 టీజీ 0222ను పెట్టుకుని అక్రమ సర్వీస్ చేస్తున్నట్లు గమనించారు. ఏపీ రిజిస్ట్రేషన్‌తో ఉన్న ఇదే నంబరు గల హైటెక్ బస్సు కాకినాడ నుంచి రిజిస్ట్రేషన్ అయినట్లు కూడా శివప్రసాద్ గుర్తించారు. అంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన బస్సు మన రాష్ట్రానికి చెందిన వేరే హైటెక్ బస్సు నంబర్‌ను పెట్టుకుని కోనసీమలోని ఎదుర్లంక నుంచి హైదరాబాద్‌కు సర్వీసు నడుపుతోంది. ఎంవీఐ శివప్రసాద్ అమలాపురంలో బస్సును తనిఖీ చేసేసరికి అందులో 20 మంది ప్రయాణికులు ఉన్నారు. వేరే నంబరుతో అక్రమ రవాణా చేస్తున్నట్లు ఆధారాలతో గుర్తించిన ఆయన బస్సును తక్షణమే సీజ్ చేశారు. అంతే గాకుండా ఆ బస్సుకు చెందిన ఇద్దరు డ్రైవర్లను బైండోవర్ చేశారు. రికార్డులను స్వాదీ నం చేసుకున్నారు. అయితే ఏపీ నంబర్‌తో తిరుగుతున్నప్పటికీ ఎక్కడా టాక్స్ చెల్లించిన దాఖలాలు లేకపోవడంతో గవర్నమెంట్ టాక్స్ ఎగవేతకు ఉద్ధేశపూర్వకంగానే అనుమ తి లేకుండా సర్వీసు నడుతున్నట్లు అంచనాకు వచ్చారు. సీజ్ చేసిన హైటెట్ బస్సును స్థానిక ఆర్టీసీ డిపోకు తరలించారు. బస్సు డ్రైవర్లు ఇచ్చిన సమాచారంతో ఆ బస్సు యాజమాని పై కూడా చర్యలు తీసుకుంటామన్నారు. -
భారీ సంఖ్యలో పట్టుబడిన కోడికత్తులు
సాక్షి, తూర్పుగోదావరి జిల్లా : సంక్రాంతి పండుగ రానున్న నేపథ్యంలో కోళ్ల పందాలలను నివారించే దిశగా పోలీసులు తగిన చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా కోడి కత్తుల తయారీ కేంద్రాలపై మంగళవారం పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో తాళ్లరేవు మండలం కోరంగి పరిధిలో సోమరాజు అనే వ్యక్తి వద్ద సుమారు రూ. 12 లక్షలు విలువ చేసే 3800 కత్తులను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా కోడి పందాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని డీఎస్పీ కరణం కుమార్ హెచ్చరించారు. -
భారీ స్థాయిలో పట్టుబడిన నకిలీ సిగరెట్లు
సాక్షి, విజయవాడ : బ్రాండెడ్ సిగరెట్ల పేరుతో నకిలీ సిగరెట్లు విక్రయిస్తున్న వ్యక్తిని పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. డీసీపీ విక్రాంత్ పాటిల్ తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని భవానీపురంలో సూరా వెంకటేశ్వరరావుకు చెందిన చిన్న గౌడౌన్లో నకిలీ సిగరెట్లు నిల్వ ఉంచి, అమ్ముతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు స్పందించి సోదాలు నిర్వహించగా, రూ. 15 లక్షలు విలువ చేసే 75,800 ప్యాకెట్లను గుర్తించారు. గోల్డ్ స్టెప్, గోల్డ్ విమల్ అనే పేర్లతో ప్యాకెట్లు ముద్రించి వాటిలో స్థానికంగా తయారయ్యే నాసిరకం సిగరెట్లను నింపి వినియోగదారులను మోసం చేశారని వెల్లడించారు. ఒరిజనల్ ప్యాకెట్ మూడు వందలు ఉంటే ఈ నకిలీ సిగరెట్లను సగం ధరకే విక్రయిస్తున్నారు. గత రెండు నెలలుగా గ్రామీణ ప్రాంతాలలో ఎక్కువగా విక్రయించిన ఈ సిగరెట్లను బీహార్ నుంచి తెచ్చినట్టు వెంకటేశ్వరరావు చెప్పారని పోలీసులు తెలిపారు. వెంకటేశ్వరరావుపై గతంలో గుంటూరులో గుట్కా రవాణా కేసు నమోదైందని, అనంతరం బెయిల్‌పై బయటికొచ్చి, నకిలీ సిగరెట్ల దందా ప్రారంభించాడని పోలీసులు వివరించారు. కేసు నమోదు చేసి విచారస్తున్నామని డీసీపీ పాటిల్ తెలిపారు. -
రూ 6 కోట్ల విలువైన బంగారం పట్టివేత
-
రూ 6 కోట్ల విలువైన బంగారం పట్టివేత
సాక్షి, హైదరాబాద్ : అధికారుల కళ్లుగప్పి బంగారాన్ని అక్రమంగా దేశాలు దాటిస్తున్న ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. శంషాబాద్ విమానాశ్రయంలో గురువారం భారీగా బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రూ 6 కోట్ల విలువైన బంగారాన్ని డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు పట్టుకున్నారు. దుబాయ్-హైదరాబాద్ విమానంలో ఈ బంగారాన్ని తరలిస్తూ నిందితులు పట్టుబడ్డారు. ఈ ఘటనలో ఇద్దరిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. -
చిన్నారుల ప్రాణాలతో చెలగాటం
సాక్షి, హైదరాబాద్/నాగోలు: షైన్ (ఎల్బీనగర్) ఆస్పత్రి యాజ మాన్య నిర్లక్ష్యం చికిత్స పొందుతున్న చిన్నారుల ప్రాణాల మీదకు తెచ్చింది. సోమవారం తెల్లవారు జామున (2.45 గంటలకు) ఆస్పత్రి భవనం నాలుగో అంతస్తులోని ఐసీయూలో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నిమోనియాతో బాధపడుతూ ఇంక్యుబేటర్‌పై చికిత్స పొందుతున్న మూడు నెలల శిశువు మృతి చెందగా, మంటల్లో చిక్కుకుని మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. మంటలకు తోడు దట్టమైన పొగలతో ఊపిరాడక చిన్నారులు ఉక్కిరిబిక్కిరయ్యారు. ప్రస్తు తం ఇద్దరి శిశువుల పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. పలు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న మరో 42 మందిని సమీప ఆస్పత్రులకు తరలించారు. ఎల్బీ నగర్ పోలీస్‌స్టేషన్ ఎదురుగా డాక్టర్ వి. సునీల్‌కుమార్‌రెడ్డి, డాక్టర్ సునీల్ పవార్ గత ఆరేళ్ల నుంచి షైన్ చిల్డ్రన్ ఆస్పత్రిని నిర్వహిస్తున్నారు. సునీల్‌కుమార్‌రెడ్డి మేనేజింగ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నాడు. 2014లో రంగారెడ్డి జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ నుంచి 20 పడకలకు అనుమతి తీసుకున్నారు. ప్రస్తుతం జనరల్ వార్డులో 50 పడకలు ఏర్పాటు చేశారు. నెలలు నిండక ముందు తక్కువ బరువుతో జన్మించిన శిశువులతో పాటు, నిమోనియా, కామెర్లు ఇతర సమస్యలతో బాధపడుతున్న శిశువులను ఐసీయూలోని ఇంక్యుబేటర్లపై ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఐసీయూలో మంటలు.. సోమవారం తెల్లవారుజామున 2.45 గంటలకు ఐసీయూలో ఒక్కసారిగా మం టలు ఎగిసిపడ్డాయి. అక్కడే ఉన్న ఇంక్యుబేటర్లు షార్ట్‌సర్క్యూట్‌కు గురై వాటి లైట్లు పేలిపోయాయి. ఈ ప్రమాదంలో సూర్యాపేట జిల్లా దూపాడ గ్రామానికి చెందిన డి.నరేష్, మానసల కుమారుడు (3 నెలలు) తీవ్రంగా గాయపడి మృతి చెందాడు. అలాగే నల్లగొండ జిల్లా శివన్నగూడెం గ్రామానికి చెందిన గిరి, మమతల కుమారుడు అవినాష్ (2 నెలలు)కి చాతి, కాళ్లు, చేతులపై గాయాలయ్యాయి. చిన్నారిని ఉప్పల్‌లోని శ్రీధ ఆస్పత్రికి తరలించారు. చంపాపేటకు చెందిన ముత్యాలు, సరితల 36 రోజుల శిశువును బంజారాహిల్స్‌లోని ఏవీఎస్ అంకుర ఆస్పత్రికి తరలించగా, పరిస్థితి విషమంగా ఉంది. నల్లగొండ జిల్లా ఉరుమడ్లకు చెందిన నాగరాజు, సుగుణల 13 నెలల శిశువును ఎల్బీ నగర్‌లోని దిశ ఆస్పత్రికి, అబ్దుల్లాపూర్‌మెట్‌కు చెందిన మరో శిశువును మలక్‌పేటలోని సేఫ్ ఆస్పత్రికి తరలించారు. ఓ చిన్నారిని మరో ఆస్పత్రికి తరలిస్తున్న కుటుంబ సభ్యులు ఊపిరాడక ఉక్కిరిబిక్కిరి... అగ్ని ప్రమాదంతో ఐసీయూ సహా సాధారణ వార్డుల్లోనూ దట్టమైన పొగ అలముకోవడంతో పిల్లలు ఊపిరాడక ఉక్కిరిబిక్కిరి అయ్యారు. పిల్లలకు సాయంగా వచ్చిన తల్లిదండ్రులు, బంధువులు, నర్సులు, ఇతర సిబ్బంది భయాందోళనలతో పరుగులు తీశారు. పిల్లల ఏడుపులు, సిబ్బంది ఉరుకులు పరుగులతో ఆస్పత్రిలో ఏం జరుగుతుందో అర్థం కాక తల్లిదండ్రులు ఆందోళన గురయ్యారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రధాన రహదారి వైపుగా ఉన్న అద్దాలను ధ్వంసం చేసి నిచ్చెన సాయంతో పిల్లలను సురక్షితంగా కిందికి దించారు. కాగా, ప్రమాదం జరిగిన సమయంలో ఆస్పత్రిలో 42 మంది చిన్నారులు చికిత్స పొందుతున్నారు. వీరందరినీ ఒకే ఆస్పత్రికి తరలిస్తే ఇబ్బందులు వస్తాయని భావించిన యాజమాన్యం పలు ఆస్పత్రులకు తరలించింది. మృతి చెందిన, ఆందోనకరంగా ఉన్న ఇద్దరు పిల్లల మినహా మిగతా చిన్నారులు క్షేమంగా ఉన్నట్లు సమాచారం. ఘటన సమయంలో పిల్లల వైద్య ఖర్చలన్నీ తామే భరిస్తామని చెప్పిన షైన్ యాజమాన్యం ఆ తర్వాత వారిని గాలికొదిలేయడంతో వారి తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మూడు రోజుల క్రితమే ప్రమాదం... మూడు రోజుల క్రితం ఆసుపత్రిలోని ఐసీయూలో స్వల్ప అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. దీనిపై రోగుల బంధువులు ఆస్పత్రి సిబ్బందికి ఫిర్యాదు చేశారు. నిర్వహకులు మాత్రం తాత్కాలిక మరమ్మతులు చేసి చేతులు దులుపుకున్నారు. పక్కా మరమ్మతులు చేసింటే ఈ పరిస్థితి ఉండేది కాదని పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు. అనుమతి ఎలా ఇచ్చారు.. 200 గజాల స్థలంలో సెల్లార్ సహా జీ+3 అంతస్థుల్లో ఆస్పత్రి భవనాన్ని నిర్మించారు. పార్కింగ్, సెట్‌బ్యాక్ లేకుండా నిర్మించిన ఈ భవనానికి జీహెచ్ఎంసీ ఎలాంటి అనుమతులివ్వలేదు. ఏదైనా విపత్తులు సంభవిస్తే బయటికి వచ్చేందుకు సరైన దారి కూడా లేదు. అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు మంటలను ఆర్పేందుకు ఆస్పత్రిలో ఫైర్ సేఫ్టీ పరికరాలు లేవు. పార్కింగ్ కూడా లేని ఈ భవనానికి రంగారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు స్పెషాలిటీ హాస్పిటల్, డయాగ్నోస్టిక్స్ నిర్వహణకు అనుమతి ఎలా ఇచ్చారన్నది ప్రశ్నార్థకం. సామర్థ్యానికి మించి పడకలు ఏర్పాటు చేసినా పట్టించుకున్న నాథుడే లేడు. పార్కింగ్, ఇతర సమస్యలపై స్థానికులు జీహెచ్ఎంసీలో ఫిర్యాదు చేసినా పట్టించుకున్న వారే లేరు. ఎండీపై కేసు నమోదు... ప్రమాద ఘటన తరువాత పోలీసులు ఆసుపత్రికి తాళాలు వేశారు. మృతి చెందిన చిన్నారి కుటుంబ సభ్యులు ఆసుపత్రి ముందు ధర్నా నిర్వహించారు. ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, ఎమ్మెల్సీ రాంచందర్‌రావు, మున్సిపల్, రెవెన్యూ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని బాధితులను పరామర్శించి, అండగా ఉంటామని హామీ ఇచ్చారు. షైన్ ఆసుపత్రి ఎండీ డాక్టర్ సునీల్‌రెడ్డిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నట్లు ఇన్స్పెక్టర్ అశోక్‌రెడ్డి తెలిపారు. -
టెంట్‌హౌస్‌లో అక్రమ మద్యం పట్టివేత
పీఎం పాలెం(భీమిలి): ప్రైవేటు మద్యం దుకాణాల గడువు ముగిసిన తరువాత కూడా మద్యాన్ని ప్రభుత్వానికి అప్పగించకుండా అక్రమంగా వ్యాపారం కొనసాగిస్తున్న వారి ఆటకట్టించారు ఎక్సైజ్, టాస్క్ఫోర్సు అధికారులు. పోతినమల్లయ్యపాలెం సమీపంలోని హౌసింగ్ బోర్డు కాలనీలోని ఓ టెంట్‌హౌస్ కేంద్రంగా జరుగుతున్న ఈ బాగోతాన్ని బట్టబయలు చేశారు. అక్రమంగా నిల్వ ఉంచిన రూ.3 లక్షల విలువైన మద్యాన్ని స్వాదీనం చేసుకుని ఆరుగురు నిందితులను అరెస్ట్ చేశారు. ఎక్సైజ్‌శాఖ అధికారులు వెల్లడించిన వివ రాలు ఇలా ఉన్నాయి. మదురవాడలో ఆర్కే నా యుడు వైన్స్, నర్సింగ్ వైన్స్, మిథులాపురి లే అవుట్‌లోని శ్రీసాయి వైన్స్ లైసన్స్లు ప్రభుత్వ నూతన మద్యం పాలసీ ప్రకారం సెప్టంబర్ 30తో ముగిశాయి. ఆయా దుకాణాల్లో ఉన్న లిక్కర్, బీ ర్లు ఏపీఎస్‌బీసీఎల్‌కు అప్పగించాల్సి ఉంది. అయితే సెప్టెంబర్ 30 నాటికి తమ వద్ద ఉన్న సరకు అంతా అమ్ముడుపోయిందని ఆయా దుకాణాల యజమానులు అధికారులకు తప్పుడు లెక్క లు చూపారు. అనంతరం మద్యాన్ని టెంట్‌హౌస్‌కు తరలించారు. ఆయా మద్యాన్ని మదురవాడ ప్రాంతంలోని బెల్ట్ దుకాణాలకు గుట్టుగా తరలించి అధిక ధరలకు అమ్మకాలు సాగిస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం ఓ వ్యక్తి మోటర్ సైకిల్‌పై రెండు కేసుల మద్యాన్ని తరలిస్తుండగా టెంట్‌హౌస్‌కు సమీపంలో మాటు వేసిన ఎక్సైజ్, టాస్క్‌ఫోర్స్ విభాగం సిబ్బంది తడ్ని అదుపులోకి తీసుకు ని విచారించారు. అతడు చెప్పిన సమాచారంతో టెంట్‌హౌస్‌కు వెళ్లి పరిశీలించగా అక్రమంగా నిల్వ ఉంచిన మద్యం బయటపడింది. 42 కేసుల బీర్లు, 19 కేసుల బ్రీజర్లు, వివిద రకాల బ్రాండ్ల లిక్కర్ 88 కేసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు బంకా నర్శింగరావు, వి.పుల్లాజీ, ప్రసాద్, రామకృష్ణ, మన్మధరావు, సోంపాత్రుడులను అరెస్ట్ చేశా రు. ఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్ ఎన్.అన్నపూర్ణ, సహాయ సూపరింటెండెంట్ ఆర్.ప్రసాద్ ఆధ్వర్యంలో సీఐ దొర, ఎస్ఐ బాబూరావు, సి బ్బంది దాడుల్లో పాల్గొన్నారు. అక్రమ మద్యం ప ట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన సీఐ, ఎస్ఐలను ఉన్నతాధికారులు ప్రత్యేకంగా అభినందించారు. -
జేసీ దివాకర్ రెడ్డికి షాక్
సాక్షి, అమరావతి: మాజీ ఎంపీ, టీడీపీ సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డికి రవాణా శాఖ అధికారులు గట్టి షాక్ ఇచ్చారు. దివాకర్ ట్రావెల్స్‌కు చెందిన 23 బస్సులను ఆర్టీఏ అధికారులు గురువారం సీజ్ చేశారు. నిబంధనలకు విరుద్దంగా నడస్తున్న దివాకర్ ట్రావెల్స్ బస్సులపై రవాణా శాఖ కమిషనర్ సీతారామాంజనేయులు, జాయింట్ కమిషనర్ ప్రసాద్ రావు ఆధ్వర్యంలోని అధికారులు పలు చోట్ల ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు. పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవడం, ఇష్టానుసారంగా టికెట్ ధరలు వసూలు చేస్తున్న 23 బస్సులను అధికారులు గుర్తించి సీజ్ చేశారు. అంతేకాకుండా దివాకర్ ట్రావెల్స్‌కు చెందిన 23 ఇంటర్ స్టేట్ క్యారియల్ బస్సుల పర్మిట్లను కూడా రద్దు చేశారు. అదేవిధంగా నిబంధనలను అతిక్రమించినందుకు పలు కేసులు నమోదు చేశారు. అయితే దివాకర్ ట్రావెల్స్‌పై అనేక ఫిర్యాదులు వచ్చాయని అందులో భాగంగానే తనిఖీలు చేశామని, దీనిపై పూర్తిస్థాయి విచారణ కొనసాగుతోందని జాయింట్ కమిషనర్ ప్రసాద్ రావు వెల్లడించారు. -
విశాఖలో భారీగా గంజాయి పట్టివేత
సాక్షి, విశాఖపట్నం: నగరంలో భారీగా గంజాయిపట్టుబడింది. డీఆర్ఐ ఇంటెలిజెన్స్ అధికారులు వెయ్యి కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. చెన్నై- శ్రీకాకుళం జాతీయ రహదారిపై ఆగి ఉన్న ట్రక్‌ని డీఆర్ఐ ఇంటెలిజన్స్ అధికారులు తనిఖీ చేయగా.. రూ.1.52 కోట్ల విలువ చేసే గంజాయి బయటపడింది. డ్రైవర్ కాబిన్లో పెట్టి గంజాయిను తరలిస్తున్నారని అధికారులు తెలిపారు. వాహనం డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. విశాఖ ఏజెన్సీ నుంచి మధ్యప్రదేశ్‌కు తరలిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. -
ప్లాస్టిక్ కుర్చీలను వదల్లేదు..
-
కోడెల.. ఇంత కక్కుర్తా?
శాసన సభ మాజీ స్పీకర్ కోడెల కుటుంబం నరసరావుపేట, సత్తెనపల్లి నియోజకవర్గాల్లో తోపుడుబండిపై ఆధారపడిన చిరువ్యాపారి నుంచి బడా కాంట్రాక్టర్ వరకు కే–ట్యాక్స్ వసూలు చేసి కోట్ల రూపాయలు వెనకేసుకుంది. పేదల ఆకలి తీర్చాల్సిన అన్న క్యాంటీన్ భోజనాలను కోడెల కుమార్తెకు చెందిన సేఫ్ కంపెనీ కార్మికులకు విక్రయించి సొమ్ముచేసుకుంది. చివరికి మూగజీవాల ఆకలి తీర్చాల్సిన గడ్డినీ వదల్లేదు. ఇప్పుడు అసెంబ్లీ ఫర్నిచర్‌ను అక్రమంగా తరలించి కుమారుడి షోరూమ్‌లో వాడుకున్నారు. రూ.లక్షల విలువచేసే డైనింగ్ టేబుల్ నుంచి నాలుగైదు వందల రూపాయల విలువ కూడా చేయని ప్లాస్టిక్ కుర్చీ వరకూ వదలకుండా అక్రమంగా తరలించుకున్నారు. అసెంబ్లీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశాక, ఫర్నిచర్ అప్పగిస్తానంటూ కోర్టును ఆశ్రయించిన కోడెల శివప్రసాద్ తీరును చూసి జిల్లా ప్రజలు విస్తుపోతున్నారు. సాక్షి, గుంటూరు: శాసన సభ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు, ఆయన కుటుంబ సభ్యుల కక్కుర్తిని చూసి ప్రజలు విస్తుపోతున్నారు. కోడెల కుటుంబం నరసరావుపేట, సత్తెనపల్లి నియోజకవర్గాల్లో పేదల నుంచి బడా కాంట్రాక్టర్ వరకూ ప్రతి ఒక్కరి నుంచి కే–ట్యాక్స్ రూపంలో రూ.కోట్లు దోచుకున్నారు. ల్యాండ్ కన్వర్షన్ల పేరుతో వసూళ్లకు పాల్పడ్డారు. కోడెల కుటుంబం అక్రమాలు సత్తెనపల్లి, నరసరావుపేట నియోజవకర్గాలను దాటి రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాయి. కోడెల శివప్రసాదరావు అసెంబ్లీ ఫర్నిచర్‌ను అక్రమంగా తన కుమారుడి షోరూమ్‌కు తరలించిన విషయం తీవ్ర దుమారం రేపింది. ఈ వ్యవహారంలో తుళ్లూరు పోలీసులు కోడెల శివప్రసారావుపై సెక్షన్ ఐపీసీ సెక్షన్ 409, ఆయన కుమారుడు శివరామకృష్ణ (శివరామ్)పై 414 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు గుంటూరు నగరంలోని శివరామ్‌కు చెందిన గౌతమ్ హీరో షోరూమ్‌లోని అసెంబ్లీ ఫర్నిచర్‌ను సీజ్ చేశారు. అసెంబ్లీ అధికారుల అనుమతి మేరకే పాత అసెంబ్లీలో ఫర్నిచర్‌కు భద్రత దృష్ట్యా తన కార్యాలయాలకు తరలించానని కోడెల బుకాయిస్తూ వచ్చారు. అయితే కోడెల కుమారుడి షోరూమ్‌లో ఉన్న అసెంబ్లీ ఫర్నిచర్ అనధికారికంగా తరలించారని అధికారులు నిగ్గు తేల్చారు. ప్లాస్టిక్ కుర్చీలను వదల్లేదు.. అప్పనంగా వస్తున్నాయనే ఉద్దేశంతో రూ.70 లక్షల ఖరీదైన డైనింగ్ టేబుల్ నుంచి వందల రూపాయల విలువసేజే ప్లాస్టిక్ కుర్చీలను కూడా వదలకుండా కుమారుడి షోరూమ్‌కు కోడెల తరలించారు. తన తండ్రి అక్రమంగా తెచ్చిపెట్టిన అసెంబ్లీ ఫర్నిచర్‌ను కోడెల శివరామ్ దర్జాగా షోరూమ్‌లో రెండేళ్లు వినియోగించుకున్నారు. ఆఖరికి అసెంబ్లీ నుంచి తెచ్చిన పెన్నూ పేపర్లు కూడా శివరామ్ షోరూమ్‌లో వినియోగించారని అక్కడ పనిచేసిన ఉద్యోగులే చెబుతున్నారు. ప్లాస్టిక్ కుర్చీలను వదలకుండా షోరూమ్‌లో తెచ్చిపెట్టుకున్న కోడెల కక్కుర్తిని తలుచుకుని వారి సిబ్బందే నవ్వుకుంటున్నారు. గతంలో కోడెల కుమార్తె విజయలక్ష్మి అన్నా క్యాంటీన్లో పేదల ఆకలి తీర్చాల్సిన భోజనాన్ని తన సేఫ్ కంపెనీకి తరలించి అక్కడ పనిచేసే కార్మికులకు విక్రయించి నవ్వులపాలైన విషయం తెలిసిందే. పశువులకు ప్రభుత్వం సబ్సిడీపై ఇచ్చే గడ్డిలోనూ ఆమె అక్రమాలకు పాల్పడ్డారు. ఈ వ్యవహారాలను మర్చిపోకముందే అసెంబ్లీలోని ప్లాస్టిక్ కుర్చీలను కూడా వదలకుండా తెచ్చుకున్నారన్న విషయం తెలిసి జిల్లా ప్రజలు విస్తుపోతున్నారు. రాబోయే రోజుల్లో కోడెల కుటుంబం కక్కుర్తి వ్యవహారాలు ఇంకెన్ని వెలుగు చూస్తాయోనని చర్చించుకుంటున్నారు. అధికారులు ఇంకా కోడెల కార్యాలయాలు, నివాసాల్లోని అసెంబ్లీ ఫర్నిచర్‌ను సీజ్ చేయలేదు. కొంత ఫర్నిచర్ గుంటూరులోని కోడెల కుమార్తె నివాసంలోనూ ఉందని వారి సన్నిహితులు చెప్పుకుంటున్నారు. -
శ్రీచైతన్య స్కూల్ సీజ్
సాక్షి, నెల్లూరు : నవాబుపేటలోని ఎన్సీ బాలయ్యనగర్‌లో నిర్వహిస్తున్న శ్రీచైతన్య ఇంగ్లిష్ మీడియం స్కూల్‌కు అనుమతుల్లేవంటూ జిల్లా విద్యా శాఖ అధికారులు శుక్రవారం సీజ్ చేశారు. భవన నిర్మాణం పూర్తి కాకుండానే స్కూల్ నిర్వహణపై సీజ్ చేశామని అధికారులు పేర్కొన్నారు. స్కూల్ తలుపునకు నోటీస్‌ను ఎంఈఓ జగదీశ్వర్ అంటించారు. స్కూల్ బస్సుల తనిఖీ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, రవాణా శాఖ అధికారులు సంయుక్తంగా జిల్లా వ్యాప్తంగా పలు విద్యాసంస్థలకు చెందిన బస్సులను శుక్రవారం తనిఖీ చేశారు. విద్యాసంస్థల ప్రారంభంసందర్భంగా విజిలెన్స్ ఎస్పీ శ్రీకంఠనాథ్‌రెడ్డి ఆదేశాల మేరకు తనిఖీలు చేపట్టారు. వివిధ విద్యాసంస్థలకు చెందిన ఆరు బస్సులను తనిఖీ చేసి.. ఎఫ్‌సీ, వాహన కండిషన్, తదితరాలను పరిశీలించారు. విజిలెన్స్ ఇన్స్పెక్టర్లు సుధాకర్‌రెడ్డి, నారాయణ, తదితరులు పాల్గొన్నారు. -
మల్టీప్లెక్స్ థియేటర్ సీజ్
తిరువొత్తియూరు: పన్ను చెల్లించకుండా, పలుమార్లు నోటీసులు పంపినా స్పందించకపోవడం వలన సేలంలో బుధవారం ఉదయం మల్టీ ప్లెక్సీ థియేటర్లను అధికారులు సీజ్ చేశారు. సేలం కొత్త బస్టాండ్ సమీపంలో ఎ.ఆర్.ఆర్.ఎస్ మల్టీప్లెక్స్ ఉంది. ఈ కాంప్లెక్స్‌లో ఐదు థియేటర్లు నడుస్తున్నాయి. ఈ థియేటర్ల నిర్వాహకులు కార్పొరేషన్‌కు రూ.30 లక్షలు పన్ను బకాయిపడ్డారు. దీనిపై కార్పొరేషన్ అధికారులు పలు దఫాలుగా నోటీసులు జారీ చేశారు. అయినా కూడా పన్ను చెల్లించక పోవడంతో బుధవారం ఉదయం కార్పొరేషన్ సహాయ కమిషనర్ రాజా, సూరమంగళం మండల సహాయ కమిషనర్ సుందరరాజన్‌ల నేతృత్వంలో రెవెన్యూ అధికారులు విచారణ చేపట్టి థియేటర్లకు సీలు పెట్టారు. -
నకిలీ@ ఇచ్చోడ
సాక్షి, ఇచ్చోడ(బోథ్): జిల్లాలో నకిలీ విత్తనాల దందాకు కెరాఫ్ అడ్రస్ ఇచ్చోడ అయింది. గుజరాత్లో తయారవుతున్న నిషేధిత బీజీ–3 విత్తనాలు అక్కడి నుంచి ఇచ్చోడకు వయా నిజామాబాద్ మీదుగా తరలించి రైతులకు అంటగడుతున్నట్లు తెలుస్తోంది. బీజీ–3 పత్తి విత్తనాలపై నిషేధం విధించడంతో ఇక్కడి వ్యాపారులకు కలిసొచ్చినట్లయింది. బీజీ–3 విత్తనాలు విత్తుకోవడం ద్వారా పెట్టుబడులు తగ్గడమే కాకుండా కలుపు నివారణకు ఉపయోగించే గ్లైఫోసెట్ మందుల వాడకంతో అధిక దిగుబడులు పొందవచ్చని రెండేళ్లుగా వ్యాపారులు భారీగా ప్రచారం చేశారు. ఇది నమ్మిన రైతులు విత్తనాలకోసం వ్యాపారులను ఆశ్రయించడం మొదలుపెట్టారు. ఇదే అదనుగా భావించిన వ్యాపారులు గుజరాత్ నుంచి నిషేధిత బీజీ–3 విత్తనాలు దిగుమతి చేసుకుని భారీగా సొమ్ముచేసుకున్నారు. రూ.5 కోట్ల వ్యాపారం ఈఏడాది ఖరీఫ్ సీజన్లో ఇచ్చోడ కేంద్రంగా రూ.5 కోట్ల నిషేధిత బీజీ–3 విత్తనాల వ్యాపారం కొనసాగినట్లు తెలుస్తోంది. ఇచ్చోడ కేంద్రంగా జిల్లాలోని నార్నూర్, ఇంద్రవెల్లి, జైనూర్, సిరికొండ, తలమడుగు, తాంసి, భీంపూర్, నేరడిగొండ, గుడిహత్నూర్, జైనాథ్, నిర్మల్ జిల్లాలోని పెంబి, మామడ, మహారాష్ట్రలోని చికిలి, మహోర్, కిన్వట్, బొదిడి ప్రాంతాల్లో భారీగా విక్రయించినట్లు తెలుస్తోంది. 450 గ్రాములున్న ఒక్క ప్యాకెట్ రూ.వెయ్యి నుంచి 12వందల వరకు డిమాండ్‌ను బట్టి విక్రయాలు జరిపినట్లు సమాచారం. రూ.40 లక్షల నకిలీ విత్తనాలు పట్టివేత ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జూన్ 16 వరకు ఇచ్చోడ, గుడిహత్నూర్, నేరడిగొండ ప్రాంతాల్లో రూ.40 లక్షల విలువైన నకిలీ విత్తనాలను సరఫరా చేస్తుండగా పట్టుకున్న సంఘటనలున్నాయి. నేరడిగొండ టోల్ ప్లాజా వద్ద ఇచ్చోడ మండల కేంద్రానికి చెందిన పత్తి విత్తనాల దుకాణం యజమాని ముర్కుటే అంగద్ నకిలీ విత్తనాలు నింపడానికి ఉపయోగించే రూ.5లక్షల విలువైన 5 వేల ఖాళీ ప్యాకెట్లు, కెమికల్‌ను కారులో తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. అతన్ని రిమాండ్‌కు తరలించి దుకాణం లైసెన్సు రద్దుచేశారు. ఈ నెల 2న ఇచ్చోడ మండల కేంద్రానికి చెందిన ప్రగతి ఏజెన్సీ యజమాని ముర్కుటే ముక్తిరాంకు చెందిన మ్యాక్స్ ఫికప్ వాహనంలో రూ.6 లక్షల విలువైన నకిలీ విత్తనాలు తరలిస్తుండగా ఇచ్చోడ వద్ద వ్యవసాయశాఖ అధికారులు పట్టుకుని పోలీసులు సమాచారం అందించారు. పోలీసులు వాహనంతో పాటు విత్తనాలను సీజ్‌చేసి ముక్తిరాంపై కేసు నమోదు చేశారు. కాగా పదిహేను రోజుల నుంచి ముక్తిరాం పరారీలో ఉన్నాడు. అతని షాపు లైసెన్సు రద్దు చేయడానికి వ్యవసాయశాఖ జిల్లా అధికారులకు సిఫార్సు చేశారు. ఐదురోజుల కిత్రం సాయికృప ట్రేడర్స్‌కు చెందిన అడవ్ గంగాధర్‌కు చెందిన రూ.25 లక్షల విలువైన నకిలీ విత్తనాలు తరలిస్తుండగా వ్యవసాయ శాఖ, విజిలెన్స్ ఎన్ఫోర్స్ మెంట్ అధికారులు సంయక్తంగా పట్టుకున్నారు. గంగాధర్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. నార్నూర్ మండల కేంద్రంలోని గంగాధర్‌కు చెందిన సాయినాథ్ ట్రేడర్స్ లైసెన్స్ రద్దుకు ఆధికారులు నివేదిక అందజేశారు. ఈ సంఘటనలో గంగాధర్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించగా అడవ్ రవికాంత్, అడవ్ సాయినాథ్, సుధాకర్ నాలుగు రోజుల నుంచి పరారీలో ఉన్నారు. గుడిహత్నూర్ మండలంలోని మాన్నూర్ వద్ద రెండురోజుల క్రితం రూ.2 లక్షల నకిలీ పత్తి విత్తనాలను తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. తీగా లాగితె డొంకంతా కదిలింది.. నకిలీ విత్తనాల దందాపై ‘సాక్షి’వరుస కథనలు ప్రచురించడంతో వ్యవసాయశాఖ, విజిలెన్స్ ఎన్ఫోర్స్ మెంట్ ఆధికారులు రంగంలోకి దిగారు. ఇచ్చోడ కేంద్రంగా సాగుతున్న నకిలీ పత్తి విత్తనాల దందాపై ఆరా తీశారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ ట్రాన్స్‌పోర్టులపై విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. శ్రీకాంత్ అండ్ కంపనీ పేరుతో మూడు నెలలుగా గుజరాత్ నుంచి పార్శిల్ వస్తున్నట్లు తెలుసుకున్నారు. దానిపై ఆరా తీశారు. ఇచ్చోడ మండల కేంద్రానికి చెందిన సాయికృప ట్రేడర్స్‌కు చెందిన కంపనీగా గుర్తించారు. ట్రాన్స్‌పోర్టుకు సంబంధించిన ఎల్లార్ను వెతికి పట్టుకున్న అధికారులు గుజరాత్ నుంచి నేరుగా నిజామాబాద్‌కు వచ్చే ట్రాన్స్‌పోర్టులో తనిఖీలు నిర్వహించారు. తనిఖీలు నిర్వహించిన రోజే శ్రీకాంత్ అండ్ కంపనీకి చెందిన 12 సంచులలో 1250 ప్యాకెట్ల నకిలీ విత్తనాలు ట్రాన్స్‌పోర్టులో దొరికాయి. ఇప్పటి వరకు గుజరాత్ నుంచి ఈ కంపనీ పేరుపై రూ.కోటి 12 లక్షల విలువ చేసే విత్తనాలు సరఫరా అయినట్లు అధికారులు గుర్తించారు. ఏజెంట్ల అరెస్టుకు రంగం సిద్ధం.. ఇచ్చోడ కేంద్రంగా భారీగా నకిలీ పత్తి విత్తనాల వ్యాపారులు గ్రామీణ ప్రాంతాల్లో సబ్‌డీలర్లను ఉపయోగించుకున్నారు. వారి ద్వారా రైతులకు అంటగట్టారు. నకిలీ విత్తనాల కేసుల్లో అరెస్టయిన వ్యాపారులు నుంచి పోలీసులు సమాచారం సేకరించినట్లు తెలుస్తోంది. ఈ సమాచారం ఆధారంగా ఏజెంట్ల అరెస్టుకు పోలీసులు సర్వం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. వరుసగా ఇచ్చోడకు చెందిన వ్యాపారులు నకిలీ విత్తనాల కేసులో పట్టుబడడంతో జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. -
రూ.కోటి హవాలా నగదు స్వాధీనం
సాక్షి, హైదరాబాద్ : నగరం నుంచి కడపకు తరలించడానికి ప్రయత్నించిన రూ.కోటి హవాలా డబ్బును మధ్య మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. నలుగురిని అదుపులోకి తీసుకున్నట్లు డీసీపీ పి.రాధాకిషన్‌రావు బుధవారం వెల్లడించారు. రాజస్థాన్‌కు చెందిన జితేంద్రనాథ్ నగరంలో డ్రైఫ్రూట్స్ కమీషన్ ఏజెంట్‌గా పని చేస్తున్నాడు. ఇతడి సోదరుడు కొన్నేళ్ళుగా ఢిల్లీ కేంద్రంగా హవాలా దందా చేస్తున్నాడు. ఈ వ్యాపారంలో లాభాలు ఎక్కువగా ఉంటాయని తెలుసుకున్న జితేందర్ తన స్నేహితుడైన కార్పెంటర్ సురేష్ శర్మ సాయంతో బేగంబజార్ కేంద్రంగా అదే దందా ఏర్పాటు చేశాడు. రూ.లక్షకు రూ.600 నుంచి రూ.800 వరకు కమీషన్ తీసుకుంటూ నగదు అక్రమ రవాణా, మార్పిడికి సహకరిస్తున్నాడు. కడపకు చెందిన సీఆర్ అసోసియేట్స్ యజమాని చరణ్‌తేజ్ నాయుడు కోరిన మీదట జితేందర్, సురేష్‌లు రూ.1,01,80,000 నగదు సమీకరించారు. దీన్ని వీరిద్దరితో పాటు సీఆర్ అసోసియేట్స్‌కు చెందిన లక్ష్మీనారాయణ, బాలకృష్ణ ద్విచక్ర వాహనాలపై బేగంబజార్ నుంచి తరలించడానికి ఉపక్రమించారు. సమాచారం అందుకున్న పోలీసులు నలుగురిని అదుపులోకి తీçసుకుని, తదుపరి చర్యల నిమిత్తం ఆదాయపుపన్ను శాఖ అధికారులకు అప్పగించింది. -
కిడ్ని రాకెట్ కేసులో శ్రద్ధ ఆస్పత్రి సీజ్
-
హెరిటేజ్ పాలవ్యాన్‌లో నగదు పట్టివేత
-
హెరిటేజ్ పాలవ్యాన్‌లో నగదు పట్టివేత
సాక్షి, అమరావతి: పోలింగ్ తేదీ సమీపిస్తున్న కొద్ది టీడీపీ నేతలు ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారు. ఇందుకోసం భారీగా డబ్బు పంచడంతో పాటు, మద్యం పంపిణీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఓటర్లకు డబ్బు, మద్యం చేర్చేందుకు పలు మార్గాలను ఎంచుకుంటున్నారు. అంతేకాకుండా ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తూ అక్రమ చర్యలకు పాల్పడుతున్నారు. డబ్బు తరలిస్తున్నట్టు ఎవరికి అనుమానం రాకూడదనీ కొన్ని చోట్ల చంద్రబాబు నాయుడుకు చెందిన హెరిటేజ్ సంస్థ పాల వ్యాన్లను వాడుకుంటున్నట్టుగా తెలుస్తోంది. అయితే రాష్ట్రంలో పలు చోట్ల టీడీపీ నేతలకు చెందిన నగదు, మద్యాన్ని ఎనిక్నల అధికారులు పట్టుకున్నారు. విశాఖ జిల్లా మాకవరపాలెంలో హెరిటేజ్ పాల వ్యాన్‌లో తరలిస్తున్న 3.95లక్షల రూపాయల నగదును పోలీసులు, ఎన్నికల అధికారులు పట్టుకున్నారు. విశాఖలో డబ్బులు పంచేందుకు టీడీపీ నేతలు ఈ డబ్బును తరలిస్తున్నట్టుగా అధికారులు అనుమానిస్తున్నారు. వ్యాన్ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గం పెంటపాడులో ఎన్నికల తనిఖీల్లో భాగంగా టీడీపీ నాయకుల నుంచి 59,300 రూపాయల నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 35 కవర్లలో వెయ్యి రూపాయల చొప్పున ప్యాక్ చేసి ఉండటంతో అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ మొత్తంతోపాటు, మారుతి బ్రీజా కారును స్వాధీనం చేసుకున్న అధికారులు.. టీడీపీకి చెందిన దాసరి అప్పన్న , మట్టా సత్యనారాయణలను అదుపులోకి తీసుకున్నారు. దాసరి అప్పన్న డీసీసీబీ డైరక్టర్‌గా,ముదునూర్ సొసైటీ ప్రెసిడెంట్‌గా పనిచేస్తుండగా.. మట్టా సత్యనారాయణ పెంటపాడు బీసీ సెల్ అధ్యక్షునిగా ఉన్నారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు కొనుగోలు చేయడం కోసమే ఈ నగదును తరలిస్తున్నట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. కృష్ణా జిల్లా ముసునూరు మండలం వెంకటాపురం వద్ద పోలీసులు భారీగా మద్యం పట్టుకున్నారు. మండల టీడీపీ నాయకుడికి చెందిన వాటర్ ట్యాంకర్ ద్వారా తరలిస్తున్న వెయ్యి మద్యం సీసాలను స్వాధీనం చేసకున్నారు. ఈ ఘటనతో సంబంధం ఉన్న ట్రాక్టర్ డ్రైవర్‌తో పాటు మరో ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. కాగా, టీడీపీ రాజమండ్రి ఎంపీ అభ్యర్థి రూప కోసం హైదరాబాద్ నుంచి డబ్బు తరలిస్తున్న జయభేరి ఉద్యోగులను అదుపులోకి తీసుకున్న అక్కడి పోలీసులు వారి వద్ద నుంచి 2 కోట్ల రూపాయలను స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. -
భారీగా మద్యం స్వాధీనం
జైపూర్ : సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రలోభాల పర్వానికి తెరలేచింది. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో మద్యం, నగదు పట్టుబడుతున్నాయి. రాజస్ధాన్‌లోని దౌసాకు సమీపంలోని బస్వాలో వాహన తనిఖీల్లో భాగంగా ఓ ట్రక్కులో మద్యం బాటిళ్లతో కూడిన 239 కార్టన్లను బుధవారం అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని విచారిస్తున్నారు. హర్యానా నుంచి దౌసాకు వెళుతున్న ట్రక్‌లో భారీగా మద్యం పట్టుబడటం కలకలం రేపింది. ఎన్నికల సందర్భంగా మద్యాన్ని తరలిస్తున్నారా అనే కోణంలో అదుపులోకి తీసుకున్న వ్యక్తులను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. కాగా ఏప్రిల్ 11 నుంచి లోక్‌సభ ఎన్నికల తొలివిడత పోలింగ్ ప్రారంభం కానుండటం, మరికొద్ది రోజుల్లో నామినేషన్ల ప్రక్రియ ఊపందుకునే క్రమంలో దేశంలోని పలుచోట్ల భారీగా మద్యం నిల్వలు, నగదు పట్టుబడుతుండటం ఆందోళన రేకెత్తిస్తోంది. -
హైదరాబాద్‌లో భారీగా హవాల డబ్బు సీజ్
-
తనిఖీల్లో పట్టుబడిన రూ.2కోట్ల నగదు
-
రేషన్ బియ్యం ‘పక్కదారి’
వర్గల్(గజ్వేల్): విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పంజా విసిరారు. డీసీఎం వాహనంలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. సుమారు రెండున్నర లక్షల రూపాయల విలువ చేసే 108.50 క్వింటాళ్ల బియ్యంతోపాటు వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదుచేసి స్థానిక రెవెన్యూ అధికారులకు అప్పగించారు. రామచంద్రాపురం విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఇన్స్పెక్టర్ వినాయక్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం వివరాలిలా ఉన్నాయి. గురువారం టీఎస్ 30 టీ 3023 నంబర్ గల డీసీఎమ్ వాహనంలో అక్రమంగా పీడీఎస్ రేషన్ బియ్యం గజ్వేల్ మీదుగా తూప్రాన్ వైపు తరలివెళ్తున్నట్లు విజిలెన్స్ అధికారి వినాయక్‌రెడ్డికి పక్కా సమాచారం అందింది. వెంటనే ఆయన తూప్రాన్–గజ్వేల్ రోడ్డుపై నిఘా వేశారు. అదేమార్గంలో పీడీఎస్ బియ్యంతో వస్తున్న సదరు డీసీఎం కన్పించింది. వెంటనే దానిని నిలువరించే ప్రయత్నం చేయగా, వర్గల్ మండల నాచారం పెట్రోల్ బంక్ వద్ద డ్రైవర్ వాహనాన్ని ఆపేసి పారిపోయాడు. డీసీఎమ్ వాహనంలో 217 బస్తాలలో రేషన్ బియ్యం ఉన్నట్లు గుర్తించామని, సుమారు 108.50 క్వింటాళ్ల బియ్యం విలువ రూ. రెండున్నర లక్షలు ఉంటుందని విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఇన్స్పెక్టర్ వినాయక్‌రెడ్డి తెలిపారు. వాహనంతో సహా బియ్యం స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు వివరించారు. అనంతరం వాటిని రెవెన్యూ అధికారులకు స్వాధీనం చేసినట్లు పేర్కొన్నారు. -
భారీగా మందుగుండు సామగ్రి స్వాధీనం
-
ముంబైలో వెయ్యి కోట్ల డ్రగ్స్ పట్టివేత
సాక్షి, ముంబై: ముంబై శాంతాక్రజ్‌లోని వాకోలా సమీపంలో పెద్ద మొత్తంలో మాదక ద్రవ్యాలను అధికారులు పట్టుకున్నారు. ఆజాద్‌మైదాన్ మాదక ద్రవ్య నిరోధక శాఖ అధికారులు వాకోలాలోని సుభాష్ నగర్లో ఓ కారులో ఉంచిన డ్రగ్స్‌ను గుర్తించారు. వీటి విలువ రూ.1000 కోట్లు ఉంటుందని అంచనా. ఇందుకు సంబంధించి వారిని అరెస్టు చేసి, వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. దేశంలోని వేర్వేరు చోట్ల కొత్త సంవత్సరాది ఉత్సవాలకు సరఫరా చేసేందుకే ఈ డ్రగ్స్‌ను సిద్ధం చేసినట్లుగా భావిస్తున్నారు. -
హీరో మహేష్‌కు ఝలక్: బ్యాంకు ఖాతాలు సీజ్
-
హీరో మహేష్‌కు ఝలక్: బ్యాంకు ఖాతాలు సీజ్
సాక్షి, హైదరాబాద్ : టాలీవుడ్ హీరో మహేష్ బాబుకు జీఎస్టీ షాక్ తగిలింది. పన్ను బకాయిలు చెల్లించాలంటూ మహేష్‌బాబుకు చెందిన పలు బ్యాంకు ఖాతాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వివిధ ప్రకటనలు, ప్రమోషన్, బ్రాండ్ అంబాసిడర్‌గా అందించిన సేవలకు గాను మహేష్‌కు లభించిన ఆదాయంపై పన్ను చెల్లించలేదని జీఎస్టీ ఆరోపించింది. సత్వరమే ఈ పన్ను బకాయిలు చెల్లించాలని కోరుతూ నోటీసులిచ్చింది. గత తొమ్మిదేళ్లుగా పన్ను ఎగవేస్తున్నారన్న ఆరోపణలపై అధికారులు ఆయన బ్యాంకు ఖాతాలను ఎటాచ్ చేశారు. ఈ మేరకు హైదరాబాద్ జీఎస్టీ కమిషనరేట్ ఒక ప్రకటన జారీ చేసింది. 2007-08 సంవత్పరానికి గాను సర్వీస్ టాక్స్ చెల్లించలేదని ఆరోపిస్తూ ఈ చర్య తీసుకుంది. ఈ కాలానికి మొత్తం 18.5 లక్షల రూపాయలు బకాయి ఉన్నట్టు తెలిపింది. ఈ నేపథ్యంలో మహేష్‌కు చెందిన యాక్సిస్, ఐసీఐసీఐ బ్యాంకు అకౌంట్లను సీజ్ చేసింది. పన్ను, జరిమానా, వడ్డీతోసహా మొత్తం 73.5 లక్షల రూపాయలు చెల్లించాలని ఆదేశించింది. -
హైకోర్టును ఆశ్రయించిన సినీనటుడు ప్రభాస్
-
బలవంతంగా ఖాళీ చేయించాలని చూస్తున్నారు: ప్రభాస్
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం రాయ్‌దుర్గ్ పన్మక్త గ్రామంలోని సర్వే నంబర్ 5/3లో తనకు చెందిన 2,083 చదరపు అడగుల స్థలం విషయంలో రెవెన్యూ అధికారులు జోక్యం చేసుకోవడాన్ని సవాల్ చేస్తూ సినీనటుడు ఉప్పలపాటి వెంకట సత్యనారాయణ ప్రభాస్ రాజు హైకోర్టును ఆశ్రయించారు. తన ఆస్తి విషయంలో జోక్యం చేసుకోకుండా రెవెన్యూ అధికారులను నియంత్రించాలని కోరుతూ ఆయన బుధవారం అత్యవసరంగా లంచ్‌మోషన్ రూపంలో పిటిషన్ దాఖలు చేశారు. ఈ స్థలాన్ని 2005లో బి.వైష్ణవీరెడ్డి, ఉషా, బొమ్మిరెడ్డి శశాంక్‌రెడ్డిల నుంచి తాను చట్టబద్ధంగా కొనుగోలు చేశానని, ఈ భూమిపై ఎటువంటి వివాదాలు లేవని ప్రభాస్ తన పిటిషన్లో పేర్కొన్నారు. క్రమం తప్పకుండా ఆస్తి పన్ను, విద్యుత్ బిల్లులు చెల్లిస్తున్నానని తెలిపారు. ఈ భూమిలో తాత్కాలిక నిర్మాణాలు కూడా ఉన్నాయని పేర్కొన్నారు. ఎటువంటి వివాదాలు లేకపోయినా ముందస్తు జాగ్రత్త చర్యగా క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తు చేసుకుని రూ. 1.05 కోట్ల ఫీజు కూడా చెల్లించామని, క్రమబద్ధీకరణ దరఖాస్తు ప్రభుత్వ పరిశీలనలో ఉందని తెలిపారు. అకస్మాత్తుగా రెవెన్యూ అధికారులు వచ్చి తన భూమిని ప్రభుత్వ భూమిగా చెబుతూ, ఆ భూమి నుంచి తను ఖాళీ చేయాలని కోరారని పేర్కొన్నారు. ఇందుకు సుప్రీంకోర్టు తీర్పును ఆధారంగా చూపారని ఆయన తెలిపారు. వాస్తవానికి సుప్రీంకోర్టు తీర్పులో తాను పార్టీ కాదని వివరించారు. అసలు ఆ సుప్రీంకోర్టు తీర్పు గురించి తమకు ఏమీ తెలియదన్నారు. ఈ తీర్పును బూచిగా చూపుతూ తనను తన స్థలం నుంచి బలవంతంగా ఖాళీ చేయించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారని ఆయన పిటిషన్లో పేర్కొన్నారు. అంతేకాక పిటిషనర్ తన వాదనలు వినడం గానీ, నోటీసు ఇవ్వడం గానీ చేయలేదన్నారు. అధికారులు సహజ న్యాయ సూత్రాలను అనుసరించలేదని తెలిపారు. అధికారుల చర్యలు తన హక్కులను హరించే విధంగా ఉన్నాయని, అందువల్ల వారిని నియంత్రించాలని ఆయన కోర్టును కోరారు. మరో ధర్మాసనం విచారణ జరుపుతోంది.. ఈ పిటిషన్‌పై బుధవారం న్యాయ మూర్తి జస్టిస్ సి.ప్రవీణ్‌కుమార్ విచారణ జరిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) ఎస్.శరత్‌కుమార్ స్పందిస్తూ.. ఈ మొత్తం వివాదం సివిల్ సూట్ (సీఎస్) 7, 14లకు సంబంధించిందని, దీనిపై మరో ధర్మాసనం విచారణ జరుపుతోందని వివరించారు. ఈ విషయా లతో తనకు సంబంధం లేదని, కావాలంటే కొద్దిసేపు విచారణను వాయిదా వేస్తానని, రిజిస్ట్రీ వద్దకు వెళ్లి విషయం తెలుసుకోవాలని న్యాయమూర్తి స్పష్టం చేశారు. తిరిగి ఈ కేసు విచారణకు రాగానే శరత్ స్పందిస్తూ.. సీఎస్ 7, 14లకు సం బంధించిన కేసులు మరో ధర్మాసనం ముందున్నాయని, ఈ విషయాన్ని రిజిస్ట్రీ సైతం నిర్ధారించిందని చెప్పారు. దీంతో న్యాయమూర్తి తన ముందున్న ప్రభాస్ పిటిషన్‌ను ధర్మాసనానికి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సమయంలో ప్రభాస్ తరఫు న్యాయవాది జోక్యం చేసుకుంటూ.. ఈ వ్యాజ్యంపై అత్యవసర విచారణ జరపాల్సిన అవసరం ఉందని, అందువల్ల ఈ వ్యాజ్యంపై విచారణ గురువారం జరిగేలా చూడాలని కోరారు. తాను అదే పని చేస్తున్నానంటూ న్యాయమూర్తి ఈ పిటిషన్‌ను ధర్మాసనానికి బదిలీ చేశారు. -
జాన్సన్ అండ్ జాన్సన్‌కు మరో ఎదురు దెబ్బ
సాక్షి, న్యూఢిల్లీ: జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. జాన్సన్ బేబీ పౌడర్‌లో ఆస్బెస్టాస్ ఆనవాళ్లున్నాయన్న సమాచారంతో దేశీయ ఔషధ నియంత్రణ అధికారులు స్పందించారు. హిమాచల్ ప్రదేశ్‌లో జాన్సన్ ఫ్యాక్టరీలో జాన్సన్ బేబీ పౌడర్ శాంపిళ్లను డ్రగ్ అధికారులు సీజ్ చేసినట్టు సమాచారం. హిమాచల్ ప్రదేశ్‌లోని బడ్డీ ప్లాంట్‌నుంచి ఈ నమూనాలు సేకరించినట్టు పేరు వెల్లడించడానికి అంగీకరించని సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్‌సీ) అధికారి ఒకరు మంగళవారం తెలిపారు. అలాగే వార్తా కథనాల ఆధారంగా శాంపిళ్లను సీజ్ చేయాల్సిందేగా ఆదేశించానని తెలంగాణాకు చెందిన రీజనల్ డ్రగ్ ఆఫీసర్ సురేంద్రనాథ్ సాయి ధృవీకరించారు. పరీక్షల అనంతరం తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. దీని ప్రభావానికి లక్షలాదిమంది పసిపిల్లలు గురి కానున్నారనే అంశం బాధిస్తోందన్నారు. అయితే తాజా పరిణామంపై జాన్సన్ అండ్ జాన్సన్ ఇంకా స్పందించలేదు. మరోవైపు ఈ వ్యవహరాన్ని పరిశీలించేందుకు సుమారు 100మంది డ్రగ్ ఇన్స్పెక్టర్లను నియమించినట్టు వార్తలొచ్చాయి. జాన్సన్ ఇండియాతో సంబంధమున్న వేర్వేరు ఉత్పాదక యూనిట్లు, హోల్‌సేలర్స్, పంపిణీదారులను పరిశీలించడానికి నియమించారు. దీనిపై సంప్రదించినప్పుడు ఆరోగ్య మంత్రిత్వశాఖ ప్రతినిధి వ్యాఖ్యానించడానికి నిరాకరించారని రాయిటర్స్ రిపోర్ట్ చేసింది. అయితే ఈ రిపోర్టులో నివేదించిన అంశాలు చాలా ఆందోళన కరమని మంత్రిత్వశాఖ సీనియర్ అధికారి ఒకరు వ్యాఖ్యానించినట్టు తెలిపింది. కాగా జాన్సన్ అండ్ జాన్సన్ బేబీ పౌడర్‌లో క్యాన్సర్కారకాలు ఉన్నాయన్న సంగతిని మూడు దశాబ్దాలుగా కంపెనీ దాచి పెట్టిందంటూ ఇటీవల రాయిటర్స్ ఒక కథనాన్ని ప్రచురించింది. అయితే ఈ ఆరోపణలను జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ ప్రతినిధులు తిరస్కరించిన సంగతి తెలిసిందే. -
హైకోర్టును ఆశ్రయించిన ప్రభాస్
సాక్షి, హైదరాబాద్: రాయదుర్గంలోని తన గెస్ట్‌హౌజ్‌ను రెవెన్యూ అధికారులు సీజ్ చేయడంపై సినీ నటుడు ప్రభాస్ హైకోర్టును ఆశ్రయించారు. రెవెన్యూ అధికారులు సీజ్ చేసిన భూమికి తామే హక్కు దారులమంటూ ఆయన పిటిషన్ దాఖలు చేశారు. ప్రభాస్ దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయస్థానం నేడు(బుధవారం) విచారణ చేపట్టనుంది. ఇటీవల రాయదుర్గం పాన్ మక్తా సర్వే నంబర్ 46లోని 84 ఎకరాల స్థలాన్ని ప్రభుత్వ భూమిగా పరిగణిస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఈ నేపథ్యంలో రెవెన్యూ అధికారులు సోమవారం చర్యలు చేపట్టారు. ఇందులో 2,200 గజాల్లో ప్రబాస్ గెస్ట్‌హౌస్ నిర్మించడంతో దాన్ని కూడా అధికారులు సీజ్ చేశారు. ప్రభాస్ గెస్ట్ హౌస్ వద్ద ఎవరూ అందుబాటులో లేకపోవడంతో గేటుకు నోటీసు అంటించారు. గతంలో ఈ భూమిని జీవో నంబర్ 59 కింద రెగ్యులరైజ్ చేయాలని కోరుతూ ప్రభాస్ దరఖాస్తు చేసుకున్నట్టుగా తెలిసింది. -
ప్రభాస్ గెస్ట్‌హౌస్ సీజ్
హైదరాబాద్: సినీహీరో ప్రభాస్ గెస్ట్‌హౌస్‌ను శేరిలింగంపల్లి రెవెన్యూ అధికారులు సోమవా రం సీజ్ చేశారు. ఇటీవల రాయదుర్గం పాయే గా సర్వే నంబర్ 46లోని స్థలం ప్రభుత్వ స్థలం గా సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఈ సర్వే నంబర్లో 84.30 ఎకరాల స్థలం ఉన్నట్లు తెలి సింది. ఇందులో 2,200 గజాల్లో ప్రభాస్ గెస్ట్‌హౌస్‌ను నిర్మించారు. దీన్ని జీవోనంబర్ 59 కింద రెగ్యులరైజ్ చేయాలని కోరుతూ దర ఖాస్తు చేసుకున్నట్లు తెలిసింది. ప్రస్తుతం ఈ స్థలమంతా ప్రభుత్వ స్థలంగా గుర్తించడంతో ఈ స్థలంలో నిర్మాణం చేసిన గెస్ట్‌హౌస్‌ను సీజ్ చేసినట్లు రెవెన్యూ అధికారులు తెలిపారు. -
ఎన్నికల ఎఫెక్ట్: భారీగా నగదు, మద్యం పట్టివేత
సాక్షి, హైదరాబాద్: పోలింగ్‌కు కొద్ది గంటల సమయం మాత్రమే ఉండటంతో అభ్యర్థులు ఓటర్లను ఆకర్షించడానికి చివరి ప్రయత్నం చేస్తున్నారు. వారిని వలలో వేసుకోవడానికి నగదు, మద్యం పంచుతున్నారు. దీంతో నిఘా పెంచిన పోలీసులు, ఎన్నికల అధికారలు దాడులు ముమ్మరం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా అధికారులు చేపట్టిన తనిఖీల్లో భారీగా నగదు, మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. పలు చోట్ల నగదును తరలిస్తూ పట్టుబడ్డ వారిని అరెస్టు చేసి విచారిస్తున్నారు. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో రూ.3.13 కోట్ల నగదు, రూ.60 లక్షల విలువైన బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇబ్రహీంపట్నంలో పోలీసులు తనిఖీల్లో ఇద్దరు వ్యక్తుల నుంచి రూ.5 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ నగదు బీఎస్పీ అభ్యర్థికి సంబంధించిందని పోలీసులు గుర్తించారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో పోలీసుల రాకను గుర్తించి రూ.4 లక్షల నగదును కొందరు గుర్తు తెలియని వ్యక్తులు వదిలేసి వెళ్లారు. ఆ నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఉప్పల్ చెక్ పోస్ట్ వద్ద పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. పోలీసుల తనిఖీల్లో పెద్ద ఎత్తున నగదును తరలిస్తున్న వ్యక్తిని అరెస్టు చేశారు. అతడి నుంచి రూ.19 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ఖమ్మం త్రీటౌన్ అభిరామ్ అపార్ట్మెంట్లో పోలీసులు భారీగా నగదును పట్టుకున్నారు. డోర్నకల్ కూటమికి చెందిన అభ్యర్థి అనుచరుల నుంచి రూ.26 లక్షలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బీబీనగర్‌లో ప్రత్యేక ఎన్నికల అధికారులు, పోలీసుల విస్తృత తనిఖీలు చేపట్టారు. అధికారలు సోదాల్లో రూ. 2,81,000 నగదు, పెద్ద ఎత్తున మద్యం బాటిళ్లు పట్టుబడ్డాయి. ఉప్పల్ రామంతాపూర్‌లో టీడీపీ కార్యాలయంపై ఫ్లయింగ్ స్క్వాడ్, పోలీసులు దాడులు జరిపారు. అధికారుల సోదాల్లో భారీగా నగదు, మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. -
ఆ రెస్టారెంట్లో కుళ్లిన మాంసంతో వంటకాలు!
ఇస్లామాబాద్ : కరాచీలోని ఓ ప్రముఖ రెస్టారెంట్లో భోజనం చేసిన తర్వాత ఇద్దరు మృతి చెందిన ఘటన పాకిస్తాన్లో కలకలం రేపింది. సదరు అరిజొనా గ్రిల్ రెస్టారెంట్‌పై అధికారులు జరిపిన దాడుల్లో కుళ్లిపోయిన మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు. 2015లోనే గడువుతీరిన ప్యాకేజ్డ్ మాంసాన్ని, పానీయాలను దాడుల్లో స్వాధీనం చేసుకున్నట్టు పాకిస్తాన్‌కు చెందిన డాన్ న్యూస్ వెల్లడించింది. కరాచీలోని డిఫెన్స్ హౌసింగ్ అథారిటీ ప్రాంతంలోని ఈ రెస్టారెంట్ తమ కస్టమర్లకు పాచిపోయిన మాంసాన్ని వడ్డించిందని, అధికారుల దాడుల్లో 80 కిలోల కుళ్లిపోయిన మాంసం బయటపడిందని సింధ్ ఫుడ్ అథారిటీ డైరెక్టర్ అబ్రార్ షేక్ తెలిపారు. హోటల్లో పరిశుభ్రతను మెరుగుపరచాలని ఇటీవల అధికారులు ఈ రెస్టారెంట్‌కు నోటీసులు జారీ చేసినట్టు డాన్ కథనం వెల్లడించింది. ఈ రెస్టారెంట్లో ఆహారం తీసుకున్న ఇద్దరు మైనర్ల మృతికి కారణం వెల్లడికాకున్నా ఫుడ్ పాయిజన్‌తోనే వీరు మృత్యువాత పడ్డారని అధికారులు భావిస్తున్నారు. ఈ ఘటన జరిగిన వెంటనే అధికారులు హోటల్‌ను సీజ్ చేసి దర్యాప్తు చేపట్టారు. -
ఎన్నికల హోరు లిక్కర్ జోరు
మంచిర్యాలక్రైం: జిల్లాలో నాన్ డ్యూటీ పెయిడ్ (ఎన్డీపీ) లిక్కర్ విక్రయాలకు చెక్ పెట్టేందుకు ఎక్సైజ్ శాఖ రంగంలోకి దిగింది. ఈ లిక్కర్‌తో సర్కారు ఖజానాకు భారీగా గండిపడే అవకాశం ఉండడంతో అక్రమ దందాపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. జిల్లాలోని దాదాపు అన్ని మద్యం షాపులు ఇప్పటికే ఏడు రెట్లు అధికంగా మద్యం విక్రయించాయి. అదనంగా విక్రయించే మద్యంపై చెల్లించే మార్జిన్‌ను ప్రభుత్వం గతంలో తగ్గించిం ది. ఏడు రెట్ల వరకు 15శాతం ఇచ్చే మార్జిన్‌ను ఆ తర్వాత ఐదు శాతానికి పరిమితం చేసింది. దీంతో అక్రమార్జనకు అలవాటుపడిన కొందరు మద్యం వ్యాపారులు ఎన్డీపీ మద్యాన్ని విక్రయించి పెద్ద మొత్తంలో సొమ్ము చేసుకునే పనిలో పడ్డారు. ఇప్పటికే జిల్లాలో వాడవాడల్లో బెల్టు షాపులు ఏర్పాటు చేయించి, ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు మద్యం విక్రయాలకు తెరలేపడం తెలిసిందే. ఇప్పుడు ఎన్డీపీ లిక్కర్ అమ్మకాల కోసం అడ్డదారులు తొక్కుతున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి మద్యం అమ్మకాలపై ఎక్సైజ్ శాఖ కన్నేసి ఉంచింది. గతంలో పట్టుబడిన ఎన్డీపీ లిక్కర్.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎన్డీపీ మద్యం విక్రయాలు జరుగుతున్న ఘటనలు ఉన్నాయి. గతంలో నిర్మల్, ఆదిలాబాద్ పట్టణాల్లో ఎన్డీపీ మద్యాన్ని ఎక్సైజ్‌శాఖ అధికారులు గుర్తించారు. బోధన్, ఆర్మూర్, ఎక్సైజ్ స్టేషన్ల పరిధిలో భారీ గానే ఎన్డీపీ మద్యం పట్టుబడిన దాఖాలాలు ఉన్నాయి. ఇటీవల నిర్మల్ జిల్లా కేంద్రంగా సరఫరా జరుగుతోందనే ఆరోపణలున్నాయి. జిల్లాలోని బడా మద్యం వ్యాపారులకు నిర్మల్‌కు చెందిన ఎన్డీపీ మద్యం సరఫరా చేసే ముఠాలతో సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు ఎౖMð్సజ్ శాఖ అధికారుల దృష్టికి వచ్చినట్లు తెలిసింది. దీనికితోడు ఎన్నికలు దగ్గర పడుతుండడం తదితర కారణాలతో జిల్లాలోకి ఈ నిల్వలు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నట్లు ఆ శాఖ భావిస్తోంది. భారీగా అక్రమార్జన.. పాండిచ్చేరి వంటి కేంద్రపాలిత ప్రాంతాలు, గోవా వంటి పర్యాటక ప్రాంతాల్లో మద్యంపై ప్రభుత్వం విధించే పన్నులు నామమాత్రంగా ఉంటాయి. రాష్ట్రంలో రూ.1000 విలువ చేసే మద్యం సీసా అక్కడ రూ.4వందలోపే ఉంటుంది. రాష్ట్రంలోని ధరల కంటే సగానికిపైగా తక్కువకు మద్యం లభిస్తుంది.దీంతో అక్కడినుంచి పెద్ద మొత్తంలో ఈ ఎన్డీపీ మద్యం నిల్వలను తీసుకొచ్చి గుట్టుచప్పుడు కాకుండా విక్రయాలు జరిపిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఆయారాష్ట్రాల పరిధిలోని చెక్‌పోస్టులు, తనిఖీ కేంద్రాల కళ్లుగప్పి రాష్ట్రంలో డంప్ చేసే ముఠాలున్నాయి. నిర్మల్ ప్రాంతానికి చెందిన బడా మద్యం వ్యాపారులకు ఈ ముఠాలతో సంబంధాలున్నట్లు ఎక్సైజ్ శాఖ అధికారుల అనుమానిస్తున్నారు. ఎన్నికల్లో పెద్దమొత్తంలో మద్యం ఏరులై పారుతోంది. దీంతో ఇప్పటినుంచే మద్యం నిల్వలపై నేతలు దృష్టి సారించారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్డీపీ లిక్కర్ జిల్లాకు చేరే అవకాశాలు ఉన్నాయని అధికారులు భావిస్తున్నారు. గత ఎన్నికల సమయంలో మాదిరిగానే ఈసారి కూడా ఎన్డీపీ మద్యం దిగుమతి అయ్యే ఆస్కారం ఉంటుందని, ఎన్నికలు దగ్గర పడుతుండడంతో నిఘా పటిష్టం చేశామని ఎక్సైజ్ శాఖలోని ఓ ఉన్నతాధికారి చెప్పడం గమనార్హం. -
నాలుగు కేజీల స్వర్ణాభరణాలు స్వాధీనం
అలంపూర్: జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్ చౌరస్తా సమీపంలోని జాతీయ రహదారిపై ఉన్న టోల్గేట్ వద్ద పోలీసులు మంగళవారం చేపట్టిన తనిఖీల్లో నాలుగు కిలోల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల నేపథ్యంలో అక్రమంగా నగదు, మద్యం రవాణాను నియంత్రించడానికి తెలంగాణ – ఏపీ రాష్ట్రాల కు సరిహద్దుగా ఉన్న పుల్లూరు గ్రామ శివారులో జాతీయ రహదారిపై ఉన్న టోల్‌ప్లాజా వద్ద చెక్ పోస్టు ఏర్పాటు చేశారు. ఈ మేరకు రాష్ట్రంలోకి ప్రవేశించే వాహనాలను అధికారులు తనిఖీ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్ఎస్–2 బృందం అధికారి పాండురంగరావు ఆధ్వర్యంలో మంగళవారం చేపట్టిన తనిఖీల్లో బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న నరసింహారావు, అమర్నాథ్ కారును పరిశీలించగా బంగారు ఆభరణా లు ఉన్నట్లు గుర్తించారు. అయితే, సరైన పత్రా లు లేకపోవడంతో 4 కిలోల బంగారు ఆభరణా లను స్థానిక పోలీస్ స్టేషన్లో అప్పగించారు. -
తెలుగు యువతకు చెందిన 60 లక్షలు పట్టివేత..!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఎన్నికల వేళ హైదరాబాద్‌లో గురువారం భారీ మొత్తంలో హవాలా సొమ్ము పట్టుబడింది. తెలుగు యువత వైస్ ప్రెసిడెంట్ వల్లభనేని అనిల్ కారు డ్రైవర్ మహేశ్ వద్ద నుంచి పోలీసులు 60 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. జగిత్యాలకు డబ్బులు తరలిస్తుండగా మహేశ్‌తోపాటు మరో ఐదుగురిని సెంట్రల్ జోన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనిల్ ఆదేశాలతోనే డబ్బు తరలిస్తున్నట్టు మహేశ్ పోలీసులకు తెలిపారు. భారీ మొత్తంలో హవాలా సొమ్ము పట్టుబడంతో పోలీసులు పలు కోణాల్లో విచారణ చేపట్టారు. ఇంత పెద్ద మొత్తంలో డబ్బు జగిత్యాలకు ఎందుకు తరలిస్తున్నారనే దానిపై దర్యాప్తు జరుపుతున్నారు. -
చౌడేశ్వరి అనాథ ఆశ్రమం సీజ్
ప్రొద్దుటూరు క్రైం : పసి పిల్లలతో భిక్షాటన చేయిస్తున్న అనాథ బాలల ఆశ్రమాన్ని సీడబ్ల్యూసీ అధికారులు సీజ్ చేశారు. నలుగురు ఆశ్రమ నిర్వాహకులను రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రొద్దుటూరు మండలంలోని అమృతానగర్‌లో ఉన్న శ్రీ చౌడేశ్వరి అనాథ ఆశ్రమంలోని పిల్లలు భిక్షాటన చేస్తున్నారని సమాచారం రావడంతో గురువారం సీడబ్ల్యూసీ అధికారులు ఆశ్రమ నిర్వాహకులపై రూరల్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. ఈ క్రమంలో జిల్లా జడ్జీ జి.శ్రీనివాస్ ఆదేశాల మేరకు శుక్రవారం రెండవ అదనపు జిల్లా జడ్జి జి.మనోహరరెడ్డి, సీడబ్ల్యూసీ చైర్పర్సన్ శివకామిని అమృతానగర్‌లోని ఆశ్రమాన్ని పరిశీలించారు. పాఠశాలకు పంపించడం లేదు.. పాఠశాలకు వెళ్తున్నారా అని జడ్జి పిల్లలను ప్రశ్నించగా ఇక్కడే చదువుకుంటున్నామని చెప్పారు. ఇద్దరు ఉపాధ్యాయులు ఇక్కడికే వచ్చి చదువు చెబుతారని పిల్లలు తెలిపారు. వారిలో ఇద్దరు మాత్రం అనిబిసెంట్ మున్సిపల్ హైస్కూల్‌కు వెళ్తున్నామన్నారు. ప్రభుత్వ నిబంధన ప్రకారం ఇక్కడి పిల్లలందరిని ఎయిడెడ్ పాఠశాలకు పంపించాలని సీడబ్ల్యూసీ చైర్ పర్సన్ తెలిపారు. స్థానికంగా ఉన్న పిల్లల తల్లిదండ్రులను పిలిపించి అధికారులు మాట్లాడారు. ఈ ఆశ్రమాన్ని సీజ్ చేస్తున్నామని, మరో ఆశ్రమంలో చేర్పించి మీ పిల్లలకు మెరుగైన విద్యను అందిస్తామన్నారు. వారిలో కొందరు తల్లిదండ్రులు తమ పిల్లలను ఆశ్రమానికి పంపించమని, ఇంటి వద్దనే పెట్టుకొని చదివించుకుంటామని చెప్పగా పిల్లలకు సంబంధించిన ఆధార్‌కార్డు, ఇతర పత్రాలను తీసుకొని కడపకు రావాలని చెప్పారు. నిర్ధారించుకున్న తర్వాత పిల్లలను అప్పగిస్తామని అధికారులు వారితో అన్నారు. పిల్లలకు విద్యను దూరం చేయడంతో పాటు వారి హక్కులను హరించడం నేరమని జడ్జి మనోహరరెడ్డి అన్నారు. భిక్షాటన చేయించడం తీవ్రమైన నేరంగా పరిగణిస్తామన్నారు. ఆశ్రమంలోని పిల్లలందరికీ మంచి విద్యను అందించడానికి చర్యలు తీసుకుంటామన్నారు. ఆశ్రమ నిర్వాహకులు అరెస్ట్ ఆశ్రమంలోని 8 మంది పిల్లలను సీడబ్ల్యూసీ చైర్పర్సన్ ఆధ్వర్యంలో అ«ధికారులు కడపకు తీసుకెళ్లారు. జడ్జి ఆదేశాల మేరకు ఆశ్రమాన్ని సీజ్ చేసి, రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. ఆశ్రమ నిర్వాహకులు పాపయ్య, స్వర్ణలత, నాగేశ్వరరెడ్డి, బాబును అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచినట్లు రూరల్ ఎస్ఐ చంద్రశేఖర్ తెలిపారు. బాలలతో మాట్లాడిన జిల్లా జడ్జి కడప అర్బన్: ప్రొద్దుటూరులోని చౌడేశ్వరి అనాథ ఆశ్రమంలో ఉంటున్న తొమ్మిది మంది పిల్లలను కడపలోని ప్రభుత్వ బాలుర గృహానికి సీడబ్ల్యూసీ వారు శుక్రవారం తీసుకొచ్చారు. వారిని చౌడేశ్వరీ ఫౌండేషన్ వారు పెట్టిన బాధల గురించి స్వయంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి గోకవరపు శ్రీనివాస్ అడిగి తెలుసుకున్నారు. సదరు చిన్నారులు తమను తల్లిదండ్రుల దగ్గరి నుంచి ఆశ్రయం కల్పిస్తామని తీసుకొచ్చి చందాల పేరుతో భిక్షాటన చేయిస్తున్నారని చెప్పారు. ఈ సంఘటనపై స్పందించిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి పిల్లలకు మొదట భోజన సదుపాయాలు కల్పించాలని చెబుతూనే తన సొంత ఖర్చుతో బిస్కెట్లను తెప్పించి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిర్వాహకులపై జువైనల్ జస్టిస్ యాక్టు , బెగ్గింగ్ అండ్ మేమింగ్ యాక్టు ప్రకారం కేసు నమోదైందని, తద్వారా నిందితులపై కఠిన చర్యలు ఉంటాయని చెప్పారు. కార్యక్రమంలో పర్మినెంట్ లోక్ అదాలత్ చైర్మన్ విష్ణుప్రసాద్‌రెడ్డి, సీనియర్ సివిల్ జడ్జి, డీఎల్ఎస్ఏ సెక్రటరీ సీఎన్ మూర్తి, నాల్గవ అదనపు జిల్లా న్యాయమూర్తి చక్రపాణి, డీపీఓ యల్లారెడ్డి, సీడబ్ల్యూసీ చైర్మన్ శివకామినితోపాటు ప్రభుత్వ బాలుర గృహం సూపరింటెండెంట్ అన్నాజీ, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
అనధికార ఆశ్రమాలపై కొరడా..
హయత్‌నగర్ మండలం సచివాలయనగర్‌లో లైసెన్స్ లేకుండా గ్రేసియస్ ప్యారడైజ్ చారిటబుల్ ఫౌండేషన్ పేరిట కొనసాగుతున్న బాలబాలికల అనాథ ఆశ్రమాన్ని గురువారం అధికారులు సీజ్ చేశారు. గతంలో ఒకే చోట బాలబాలికలకు వసతి కల్పించడం, సరైన సౌకర్యాలు లేకపోవడం, పిల్లలతో భిక్షాటన చేయిస్తుండడంతో జిల్లా బాలల పరిరక్షణ యూనిట్ (డీసీపీయూ) అధికారులు ఆ ఆశ్రమాన్ని మూసివేశారు. లైసెన్స్ తీసుకోకుండా మళ్లీ ఇటీవల నిర్వాహకులు దీన్ని తెరిచి అపరిశుభ్ర వాతావరణంలో కొనసాగిస్తుండడంతో.. రెవెన్యూ, పోలీసు అధికారుల సమక్షంలో సీజ్ చేశారు. ఇందులో ఉన్న పిల్లలను మరో ఆశ్రమానికి తరలించారు. సాక్షి, రంగారెడ్డి జిల్లా : అనధికారికంగా కొనసాగుతున్న బాలబాలికల అనాథ ఆశ్రమాలపై జిల్లా సంక్షేమ శాఖ కొరడా ఝళిపిస్తోంది. జువైనల్ జస్టిస్–2015 చట్టానికి లోబడి నడుచుకోని ఆశ్రమాలను సీజ్ చేస్తోంది. జిల్లా వ్యాప్తంగా 56 అనాథ బాలబాలికల ఆశ్రమాలు ఉండగా.. ఇవన్నీ జేజే యాక్ట్ ప్రకారం లైనెన్స్ పొందాలని గతేడాది చివరలో ఆశ్రమాలకు జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో డీసీపీయూ నోటీసులు జారీచేసింది. ఆరు నెలలలోపు యాక్ట్ ప్రకారం బాలబాలికలకు అన్ని సదుపాయాలు కల్పించాలని నోటీసుల్లో స్పష్టం చేశారు. ఆ ఆరునెలల కాలానికి చెల్లుబాటయ్యేలా తాత్కాలిక రిజిస్ట్రేషన్లు ఇచ్చారు. ప్రస్తుతం ఆ గడువు ముగిసింది. ఈ నేపథ్యంలో నోటీసులు అందుకున్న ఆశ్రమాలు ఏ మేరకు మెరుగుపడ్డాయని తెలుసుకునేందుకు ప్రత్యేకం టీం రంగంలోకి దిగింది. ఈ బృందంలోని డీసీపీయూ, సీడబ్ల్యూసీ, ఎన్జీఓల ప్రతినిధులు ప్రతి ఆశ్రమాన్ని చుట్టేసి అక్కడి సదుపాయలు, సౌకర్యాల తీరును నేరుగా తెలుసుకున్నారు. ఇందుకు సంబంధించిన నివేదికను సైతం రూపొందించింది. అయితే మొత్తం 56లో ఇప్పటికే పదింటికి లైసెన్స్‌లు ఇచ్చారు. మిగిలిన 46 ఆశ్రమాల్లో 25కిపైగా చెప్పుకోదగ్గ రీతిలో మార్పు కనిపించినట్లు బృందంలోని సభ్యులు గుర్తించారు. మిగిలిన వాటిలో ఎటువంటి పురోగతి కనిపించలేదని, పిల్లల బాగోగు చర్యలు తీవ్ర అసంతృప్తిగా ఉన్నాయని పరిశీలనలో తేలింది. వీటిపై ఒక్కొక్కటిగా కొరడా ఝళిపించేందుకు రంగంలోకి దిగారు. తొలుత మరోసారి నోటీసులు జారీ చేసి.. ఆ తర్వాత సీజ్ చేస్తున్నారు. ఇందులో భాగంగా గురువారం హయత్‌నగర్ మండలంలో ఒకదాన్ని జప్తు చేశారు. పాటించాల్సిన నిబంధనల్లో కొన్ని.. బాలబాలికల ఆశ్రమాలు వేర్వేరు ప్రాంగణాల్లో కొనసాగాలి. ఒకే భవనంలో వసతి కల్పించడానికి వీల్లేదు. వయసుల వారీగా చిన్నారులకు గదులు కేటాయించాలి. బాలికల ఆశ్రమాల్లో మహిళలే పనిచేయాలి. నేలపై చిన్నారులకు పడుకోనివ్వద్దు. కచ్చితంగా పరుపు, మంచం ఉండాలి. ప్రతి 25 మంది చిన్నారుల పడకకు వెయ్యి నుంచి రెండు వేల చదరపు అడుగుల వైశాల్యం ఉండాలి. ప్రతి 8 మందికి ఒక మూత్రశాల, ప్రతి ఐదుగురికి ఒక స్నానపు గది తప్పనిసరి. వైద్యుడు అందుబాటులో ఉండి నెలకోసారి వైద్య పరీక్షలు నిర్వహించి రికార్డుల్లో నమోదు చేయాలి. మెనూ ప్రకారం పౌష్టికాహారం, రక్షిత తాగునీరు సమకూర్చాలి. సిబ్బంది, నిర్వహణ, చిన్నారుల వ్యక్తిగత ప్రొఫైల్, వైద్య, ఆరోగ్య పరమైన వివరాల రికార్డులు నిర్వహించాలి. ప్రాంగణం చుట్టూ ప్రహరీతోపాటు రక్షణ వలయం, 24 గంటల పాటు భద్రత, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి. కౌన్సిలర్, టీచర్ నిత్యం విధుల్లో కొనసాగాలి. చదువుతోపాటు వృత్తిపరమైన శిక్షణ అందజేయాలి. పాఠశాలలకు పంపినా.. తోడుగా మరొకరిని ఉంచాలి. ఆరేళ్లలోపు చిన్నారులను ఆశ్రమాల్లో చేర్చుకోవద్దు. ఈ నిబంధనలన్నీ చట్టంలో స్పష్టంగా పేర్కొన్నా ఆశ్రమాల నిర్వాహకులకు పట్టడం లేదు. భద్రత గాలికి.. జిల్లా శివారులో ప్రాంతాల్లో అధిక సంఖ్యలో ఆశ్రమాలు కొనసాగుతున్నాయి. వీటిలో ఎంతమంది పిల్లలు ఉన్నారనే లెక్కలు లేవు. రాజకీయ నాయకుల అండదండలతో ఇష్టారాజ్యంగా నిర్వహిస్తున్నారు. వాస్తవంగా అనాథలను చేరదీయడం, అక్కడి నుంచి బయటకు పంపించడమూ చట్టబద్ధంగానే జరగాలి. అనాథల వివరాలను తొలుతు శిశు సంక్షేమ కమిటీ (సీడబ్ల్యూసీ) దృష్టికి తీసుకెళ్లాలి. ఆ కమిటీ సూచించిన ఆశ్రమాలే సదరు చిన్నారులకు ఆశ్రయం కల్పించి బాగోగులు చూడాలని జేజే చట్టం వెల్లడిస్తోంది. అయితే తమకు దొరికనవారిని దొరికినట్లుగా ఆశ్రమాల్లో చేర్చుకుని చిన్నారుల రక్షణ, సంరక్షణ విషయంలో ఎనలేని నిర్లక్ష్యాన్ని కనబర్చుతున్నారు. లైంగిక దాడులు.. ఆశ్రమాల్లోని బాలికలకు భద్రత లేకుండా పోయింది. వారిపై అత్యాచారాలు సైతం జరుగుతున్నాయి. తండ్రి స్థానంలో ఉండి కనురెప్పలా సంరక్షించాల్సిన నిర్వాహకులే కామాంధులుగా మారుతున్నారు. జిల్లాలో ఇటువంటి ఐదారు ఘటనలు వెలుగులోకి వస్తే తప్ప బయటి ప్రపంచానికి తెలియడం లేదు. వీటిపై నిర్వహణపై ఎటువంటి పర్యవేక్షణా లేకపోవడంతో నిర్వాహకులు ఆగడాలు మితిమీరిపోతున్నాయి. పిల్లలతో భిక్షాటన.. లాభార్జన నా అనే వారు లేని అభాగ్య చిన్నారులకు మానవతా దృక్పథంతో చేరదీసి రక్షణ, సంరక్షణ కల్పించడమే అనాథ ఆశ్రమాల ముఖ్య ఉద్దేశం. వీటినుంచి ఒక్క పైసా కూడా ఆశించకుండా సామాజిక సేవతో నిర్వహించాలి. ఇటువంటి ఆశ్రమాలకు దాతలు అందించే విరాళాలే ఆర్థిక వనరులు. ఈ నిధులను నిస్సంకోచంగా చిన్నారుల రక్షణ, సంరక్షణ కోసమే వెచ్చించాలి. కానీ, నిర్వాహకులు వచ్చిన దాంట్లో కొంతమేర చిన్నారుల కోసం ఖర్చు చేసి మిగిలినవి వెనకేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇవి చాలవన్నట్లు పిల్లలతో సైతం బిక్షాటన చేయిస్తున్న దారుణాలు నిత్యం కనిపిస్తున్నాయి. ఇంకొందరు చిన్నారులతో విరాళాలు సేకరిస్తున్నా రు. ముఖ్యంగా ఆశ్రమాలు రికార్డులు నిర్వహించడం లేదు. దాతల విరాళాలు, ఖర్చుల వివరాల న్నీ గు ట్టుగానే ఉంటున్నాయి. ఆడిట్ రిపోర్ట్లు తప్ప నిసరి. వాస్తవంగా విరాళాలు తీసుకోవాలంటే ఆదా య పన్ను శాఖ పరిధిలో సెక్షన్ 80(జి) కింద సద రు ట్రస్టీ/సొసైటీ ధ్రువపత్రం కలిగి ఉండాలి. కానీ ఈ తరహా గుర్తింపు పొందిన ఆశ్రమాలు ఐదారుకు మించి ఉండవని అధికారులు స్పష్టం చేస్తున్నారు. -
హోల్‌సేల్ మార్కెట్లో కల్తీ టీ పోడి
-
భారీగా పేలుడు పదార్థాల పట్టివేత
హసన్‌పర్తి: హసన్‌పర్తి పోలీస్ స్టేషన్ పరిధిలోని వేర్వేరు ప్రాంతాల్లో భారీ ఎత్తున పేలుడు పదార్థాలు లభ్యమయ్యాయి. అనుమతి లేకుండా నిల్వ చేసిన పేలుడు పదార్థాలను టాస్క్‌ఫోర్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మండలం లోని ఎర్రగట్టు గుట్ట వద్ద గల తెలంగాణ బాలికల గురుకుల పాఠశాలలో పేలుడు పదార్థాలు ఉన్నాయని టాస్క్‌ఫోర్స్ అధికారులకు సమాచారం అందింది. ఈ మేరకు టాస్క్‌ఫోర్స్ అధికారులు దాడులు నిర్వహించగా 207 డిటోనేటర్లు, 307 జిలెటì న్ స్టిక్స్, డ్రిల్లింగ్ జాక్‌లు లభ్యమయ్యాయి. అలాగే ఆరెపల్లి సమీపంలో ఓ పేలుడు పదార్థాల గోదాంపై టాస్క్‌ఫోర్స్ అధికారులు నిర్వహించిన దాడుల్లో 9,000 జిలెటిక్ స్టిక్స్, 8,950 ఎలక్ట్రికల్ డిటోనేటర్లు, 4,000 ఆర్డినరీ డిటోనేటర్లు, 23 నాన్ ఎలక్ట్రిక్ డిటోనేటర్లు, 50 కిలోల గన్ పౌడర్‌ను పట్టుకున్నారు. గన్‌పౌడర్‌ను తరలిస్తున్న ఆటోను సీజ్ చేశారు. ఈ సంఘటనలో భీమదేవరపల్లి మండలం కొప్పుర్‌కు(ప్రస్తుతం అమరావతినగర్, హన్మకొండ) చెందిన వేల్పుల స్వామి, చింతగట్టుకు చెందిన దాసరి రమేష్, మడిపల్లికి చెందిన ఆటో డ్రైవర్ వి.అజయ్, నల్లగొండ జిల్లా తుమ్మలగూడెం రామన్నపేటకు చెందిన వరికొప్పుల శ్రీశైలం, వరికొప్పుల దయాకర్‌తోపాటు నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీ సైట్ ఇంజనీర్ రవికుమార్ సింగ్‌పై కేసు నమోదు చేశారు. అలాగే ఆరెపల్లిలో జరిగిన దాడుల్లో వేల్పుల అజయ్‌పై కేసు నమోదైంది. పేలుడు పదార్థాలను హసన్‌పర్తి ఎస్సై సుధాకర్‌కు అప్పగించారు. దాడుల్లో టాస్క్‌ఫోర్స్ పోలీస్ ఇన్స్పెక్టర్ మహేందర్‌రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ శ్యాంసుందర్, శ్రీకాంత్‌రెడ్డి, మహేందర్, కానిస్టేబుళ్లు రజనీకుమార్, రాజేష్ పాల్గొన్నారు. అనుమతి పత్రాలు చూపకపోవడంతో.. ఆరెపల్లిలో కొంతకాలంగా పేలుడు పదార్థాల గోదాం నిర్వహిస్తున్నారు. అయితే గురువారం నిర్వహించిన దాడుల్లో నిర్వాహకులు ఎలాంటి అనుమతి పత్రాలు చూపలేదు. అక్కడ స్టాక్ రిజిష్టర్ నిర్వహణ సక్రమంగా లేనందున సీజ్ చేసినట్లు టాస్క్‌ఫోర్స్ అధికారులు తెలిపారు. -
దివాకర్ ట్రావెల్స్ బస్సులో 45 బస్తాల చిల్లర నాణేలు
-
మార్కెట్లో నకిలీ విత్తు!
సాక్షి, కామారెడ్డి : జిల్లాలో పత్తి సాధారణ సాగు విస్తీర్ణం 36 వేల ఎకరాలు. గతేడాది 49,873 ఎకరాల్లో పంట సాగైంది. ఈసారి కూడా సాధారణ సాగు విస్తీర్ణం కంటే ఎక్కువగా పత్తి సాగవుతుం దని భావిస్తున్నారు. విత్తనాల అవసరం ఎక్కు వగా ఉండడంతో నకిలీ విత్తనాల వ్యాపారులు జిల్లాపై కన్నేశారు. విత్తనం కొనుగోలు చేసిన రైతులకు విత్తనం అసలైనదో, నకిలీదో తెలుసుకోలేని పరిస్థితి ఉంటుంది. దీన్ని ఆసరాగా చేసుకుని దళారులు రైతులకు నకిలీ విత్తనాలను అంటగట్టి దోచుకుంటున్నారు. ఇటీవల 44వ జాతీయ రహదారి మీదుగా కారులో నకిలీ విత్తనాలను తరలిస్తుండగా భిక్కనూరు వద్ద పోలీసులు పట్టుకున్నారు. అందులో రూ. 2.20 లక్షల విలువైన 296 నకిలీ పత్తి విత్తన ప్యాకెట్లున్నాయి. హైదరాబాద్ నుంచి రవాణా చేస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. విత్తనాలకు సంబంధించి సరైన పత్రా లు లేకపోవడంతో అవి అనుమతి లేని కంపెనీలకు చెందిన విత్తనాలని, నకిలీవని గుర్తించారు. నకిలీ విత్తనాలను కారులో సరఫరా చేస్తున్న నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించిన అనంతరం రిమాండ్‌కు తరలించారు. ఇరు రాష్ట్రాల నుంచి... పత్తి విత్తన కంపెనీలు ఎక్కువగా ఉన్న గుంటూరు జిల్లా నుంచి పెద్ద ఎత్తున నకిలీ విత్తనాలు కామారెడ్డి జిల్లాకు వస్తున్నట్టు తెలుస్తోంది. అలాగే మహారాష్ట్ర నుంచి కూడా పెద్ద ఎత్తున నకిలీ విత్తనాలు సరఫరా అవుతున్నాయి. రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న మద్నూర్, బిచ్కుంద, జుక్కల్, పెద్దకొడప్ గల్, పిట్లం తదితర మండలాల్లో పత్తి పంట ఎక్కు వగా సాగవుతుంది. మహారాష్ట్రకు సరిహద్దుల్లో ఉన్న ఈ ప్రాంతానికి అక్కడి నుంచి పెద్ద ఎత్తున నకిలీ విత్తనాలు చేరుతున్నాయి. ఇప్పటికే వేలాది ఎకరాల్లో పత్తి విత్తనాలు వేశారు. పత్తి పూత దశకు వచ్చిన తరువాతే విత్తనం నాణ్యత తెలుస్తుంది. ఇప్పటికే విత్తనం వేసిన రైతులు మొలకలు రావడంతో పంటను సంరక్షించే పనిలో ఉన్నారు. మరికొందరు విత్తనం వేస్తున్నారు. కామారెడ్డి ప్రాంతంలోని గాంధారి, సదాశివనగర్, మాచారెడ్డి, రామారెడ్డి, తాడ్వాయి తదితర మండలాల్లో పత్తి సాగు ఎక్కువగా ఉంటుంది. ఇక్కడికి ఏపీ నుంచి ఎక్కువగా విత్తనాలు వస్తున్నాయి. ఇరు రాష్ట్రాల నుంచి వచ్చే నకిలీ విత్తనాలతో రైతులు తెలియకుండానే మోసపోతున్నారు. నామమాత్రపు తనిఖీలు.. నకిలీ విత్తనాలకు సంబంధించి వ్యవసాయ శాఖ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. టాస్క్‌ఫోర్స్ అధికారులు జిల్లాలోని ఆయా మండలాల్లో తిరుగుతూ దుకాణాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. అయితే నేరుగా దందా చేసేవారు దుకాణాల్లో నకిలీ విత్తనాలను ఎవరూ నిల్వ ఉంచుకోరు. కానీ అధికారులు మాత్రం దుకాణాలను తనిఖీ చేసి వెళుతున్నారు. మద్యం బెల్టు దుకాణాల్లాగే నకిలీ విత్తనాలకు సంబంధించి ఎలాంటి లైసెన్సులు లేకుండానే గ్రామాల్లో కొందరు దళారులు విక్రయాలు జరుపుతున్నారు. గ్రామాల్లో విత్తనాలు అమ్మేవారి ఇళ్లు, గోదాములపై దాడులు చేస్తే నకిలీ విత్తన గుట్టు రట్టయ్యేది. కాని అధికారులు అటువైపు వెళ్లడం లేదు. ఇప్పటి వరకు వ్యవసాయ శాఖ అధికారులు ఎక్కడా నకిలీ విత్తనాలను పట్టుకున్న దాఖలాలు లేవు. జాతీయ రహ దారి మీదుగా నకిలీ విత్తనాలను తీసుకెళుతున్న కారును పోలీసులు పట్టుకుని విచారిస్తేగాని నకిలీ విత్తనాలని తేలలేదు. -
మూడు వేల సిమ్‌కార్డులు స్వాధీనం?
సాక్షి,పెద్దపల్లి/ధర్మారం: నకిలీ వేలిముద్రల తయారీ నిందితుడు పాత సంతోష్‌కుమార్‌ను తన సొంతగ్రామమైన ధర్మారంలో పోలీసులు విచారించారు. పోలీసు కస్టడీలో ఉన్న సంతోష్‌ను శుక్రవారం హైదరాబాద్ నుంచి జిల్లాలోని ధర్మారానికి తీసుకువచ్చారు. ధర్మారంలోని తన నివాసం,దుకాణంలో సంతోష్ సమక్షంలో క్రైమ్ స్పెషల్ బ్రాంచీ పోలీసులు, క్లూస్‌టీమ్ సిబ్బంది తనిఖీలు నిర్వహించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు సంతోష్ ఇల్లు, దుకాణాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసిన పోలీసులు, వేలిముద్రల తయారీకి వినియోగించిన పరికరాలను స్వాధీనం చేసుకొన్నారు. సంతోష్‌ను తొలిసారిగా ధర్మారం తీసుకురావడంతో ఈ ప్రాంతంలో అలజడి నెలకొంది. ఎక్కడ చూసినా సంతోష్ చర్చ కొనసాగింది. ఆయనను చూసేందుకు ప్రజలు తరలివచ్చారు. ధర్మారంలో ఎనిమిదిన్నర గంటలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నకిలీవేలిముద్రల తయారీ నిందితుడు పాతసంతోష్ అరెస్ట్ తర్వాత తొలిసారిగా తన స్వగ్రామం ధర్మారం తీసుకువచ్చారు. హైదరాబాద్‌కు చెందిన ఎస్ఆర్ నగర్ ఎస్సై రాజేందర్‌గౌడ్, క్లూస్‌టీమ్ ఎస్సై బాల్‌రెడ్డిలు సంతోష్‌కుమార్‌తో పాటు సిబ్బంది ఉదయం 8.30 గంటలకే ధర్మారంలోని సంతోష్‌కుమార్ ఇంటికి చేరుకున్నారు. ఇంటి తలుపులు మూసి ఉంచి దాదాపు గంట సేపు సోదాలు నిర్వహించారు. అనంతరం స్థానిక ఎస్సై దేవయ్య సహకారంతో సోదాల సమయంలో రెవెన్యూ సిబ్బంది పిలిపించుకున్నారు. గ్రామ రెవెన్యూ అధికారులు రాంచంద్రం, భానుకుమార్‌ల సమక్షంలో తిరిగి తనిఖీలు కొనసాగించారు. మధ్యాహ్నం 12 గంట వరకు ఇంటిలో సోదాలు నిర్వహించిన అనంతరం, మరో ప్రాంతంలో ఉన్న ఆయన దుకాణానికి తీసుకెళ్లారు. అక్కడ గంట పాటు సోదాచేశాక,« దర్మారం పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లి పంచనామా రాశారు. అనంతరం సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్‌కు తిరిగి వెళ్లారు. మూడు వేల సిమ్‌కార్డులు లభ్యం? సోదాల సందర్భంగా సంతోష్ ఇంట్లో మూడు వేల సిమ్‌కార్డులు, సగం కాల్చివేసిన సిమ్‌కార్డులు దొరికినట్లు విశ్వసనీయంగా తెలిసింది. సంతోష్ ఇల్లు, దుకాణంలో సోదాలు నిర్వహించిన పోలీసులు నకిలీవేలిముద్రల తయారీకి ఉపయోగించిన వస్తువులను స్వాధీనం చేసుకొన్నారు. బీరువాలో దాచి ఉంచిన డాక్యుమెంట్లను, కంప్యూటర్ హార్డు డిస్కు, కనెక్టర్, ప్రింటర్, కెమికల్ ఇంక్‌ప్యాడ్‌లను స్వాదీనం చేసుకున్నారు. ముందుగా ప్రింటర్‌ను రిపేర్ కోసం మేడారంలో ఇచ్చానని, సంతోష్ చెప్పటంతో పోలీసులు ఆయనను మేడారం తీసుకెళ్లారు. అక్కడ రిపేరుచేసే వ్యక్తి అందుబాటులో లేడు. మళ్లీ తన దుకాణంలోనే ఉండవచ్చని సంతోష్ చెప్పటంతో, దుకాణంలో తిరిగి సోదా చేయగా ప్రింటర్ లభించింది. తరలివచ్చిన ప్రజానీకం సంతోష్ కుమార్‌ను పోలీసులు ధర్మారం తీసుకవచ్చారనే సమాచారంతో బంధువులు, మిత్రులు, స్థానిక ప్రజానీకం చూసేందుకు తరలివచ్చారు. సామాన్య వ్యాపారిగా ఉన్న వ్యక్తి దేశద్రోహస్థాయి నేరానికి పాల్పడినట్లు తేలడం జిల్లాలో సంచలనం సృష్టించింది. వేలిముద్రలే నకిలీవి తయారు చేసిన సంతోష్ ఇతనేనా అంటూ పరిశీలించి చూడడం కనిపించింది. ఆయనను కలిసేందుకు బంధువులు, మిత్రులు ప్రయత్నించినప్పటికి పోలీసులు అనుమతివ్వలేదు. అయినా గంటల తరబడి ఆయన ఇంటి ముందు వేచి ఉన్నారు. చివరకు సంతోష్‌ను కారులో తరలిస్తున్న సమయంలో ప్రజానీకం ఆసక్తిగా గమనించారు. రహస్య విచారణ తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపడంతో పాటు, దేశవ్యాప్తంగా నిఘా వర్గాలు దృష్టిపెట్టిన కేసు కావడంతో పోలీసులు రహస్యంగా విచారణ కొనసాగించారు. సంతోష్ ఇల్లు,దుకాణంలో సోదాలు నిర్వహిస్తున్న సమయంలో మీడియాతో పాటు ఎవరినీ లోనికి అనుమతించలేదు. సోదాల అనంతరం సంతోష్‌కుమార్‌ను తీసుకవెళ్ళుతుండగా, ఫోటోలు తీసేందుకు సైతం పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు. -
మూటల ముసుగులో వ్యాపారం..?
జలుమూరు: జిల్లాలోని టెక్కలి, తిలారు, శ్రీకాకుళం, పొందూరు తదితర రైల్వే స్టేషన్ల కేంద్రంగా అక్రమ వ్యాపారం జోరుగా సాగుతోంది. మూటల ముసుగులో గుట్కాలు, ఖైనీలు, బట్టలు, కంచు, ఇత్తడి పెద్ద ఎత్తున దిగుమతి అవుతోంది. గత నెలలో నరసన్నపేట మండలం జమ్ముకూడలిలో పోలీసులు సుమారు రూ.3 లక్షల విలువ చేసే గుట్కాలు పట్టుకున్నారు. అలాగే శ్రీకాకుళం(ఆముదాలవలస) స్టేషన్, టెక్కలి, రాజాం, టెక్కలి రైల్వే స్టేషన్, పొందూరు రైల్వేస్టేషన్ సమీపంలో సుమారు రూ.5 లక్షల విలువల చేసే గుట్కాలు పోలీసులు పట్టుకుని సీజ్ చేశారు. ఈ అక్రమ రవాణపై విజిలెన్స్ అధికారులు కూడా ఎప్పటికప్పడు తనిఖీలు నిర్వహిస్తున్నా.. పూర్తి స్థాయిలో అడ్డుకట్ట వేయలేక పోతున్నారు. టెక్కలి రైల్వేస్టేషన్ గుణుపూర్, ఒడిశా ప్రాంతాల నుంచి రవాణాకు అనుకూలంగా ఉండడంతో ఈ వ్యాపారం మూడుపువ్వులు ఆరుకాయలుగా వర్ధిల్లుతోంది. దీని వల్ల ప్రభుత్వ ఖజానాకు చెల్లించాల్సిన లక్షలాది రూపాయలను సుకాన్ని చెల్లించకుండా వ్యాపారులు యథేచ్ఛగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఎనెన్నో రాయితీలు పొందుతూ చెల్లించాల్సిన పన్నులు దిగమింగి లక్షలాది రూపాయలు ఆర్జిస్తున్నారు. వాస్తవానికి వీరు విలువ ఆధారిత ఎక్స్‌జ్ సుంకం(వ్యాట్), కేంద్ర అమ్మకం పన్ను(సీఎస్‌డీటీ), జీఎస్టీ తదితర పన్నులు, సుంకాలు చెల్లించాల్సి ఉంది. ఆయా రాష్ట్రాల నిబంధనలను అనుసరించి వీటిలో కొద్దిపాటి మార్పులు ఉంటాయి. పలాస, టెక్కలి రైల్వేస్టేషన్లలో ప్రయాణికులు, అధికారుల తాకిడి ఎక్కువగా ఉండడంతో గుట్కాల అక్రమ వ్యాపారదారులు తిలారు స్టేషన్ అనుకూలంగా మార్చుకున్నారు. దీంతో బుడితి, నరసన్నపేట, కోటబొమ్మాళి, టెక్కలి వ్యాపారులు సిండికేటుగా మారి దేశంలో వివిధ ప్రాంతాలు నుంచి ఈ అక్రమ దిగుమతి చేస్తున్నట్లు తెలుస్తోంది. తిలారు స్టేష్‌న్ నుంచి ఆగే రైలు నుంచి చడీచప్పుడు కాకుండా సరుకులు ఆయా ప్రాంతాలకు తరలించడం అక్రమ లావాదేవీలపై అనుమానాలకు బలం చేకూరుస్తుంది. ఎక్కడికైనా రవాణా! ఈ ఆక్రమ వ్యాపారం వెనుక భారీ నెట్ వర్క్ నడుస్తోంది. ఇతర రాష్ట్రాలైన తమిళనాడు, రాజస్థాన్, పశ్చిమబెంగాల్, కలకత్తా, ఒడిశాలో ఉన్న దళారులు నుంచి అక్రమంగా మన రాష్ట్రలోకి చేరుతుందని నరసన్నపేటకు చెందిన ఓ మాజీ వ్యాపారి తెలిపాడు. ఇలా తిలారుకు చేరిన కంచు, ఇత్తడి, గుట్కాలు, బట్టల మూటలు వేర్వేరు ప్రాంతాల్లో నిల్వ ఉంచుతారు. స్టాక్ పాయింట్లకు చేరిన సరుకులను ఇక్కడి వ్యాపారులు వారికి అనుకూలంగా ఉన్న వివిధ వాహనాలు ద్వారా గమ్య స్థానాలకు చేర్చుకుంటారు. దీనికి మాత్రం ఆయా వ్యాపారులు సరుకులు తెచ్చేందుకు పెట్టిన పెట్టుబడులు ప్రకారం తీసుక వెళ్తారు. ఇక తిలారు స్టేషన్లో రాత్రి సమయంలో 7 నుంచి 10 వరకూ ఆటోల వరకు వీటి తరలింపులకు సిద్ధంగా ఉంచుతారు. భారీ నెట్వర్క్ రైలు నుంచి సరుకులు ఆటోలో చేర్చేందుకు బుడితి, సారవకోట వెళ్లాలంటే జోనంకి, కృష్ణాపురం మీదుగా అడ్డదారిలో చేర వేస్తారు. అలాగే తిలారు స్టేషన్ వెనుక భాగం వైపుగా ఎఫ్‌సీ గొడౌన్ నుంచి రావిపాడు, ఏనేటి కొత్తూరు మీదుగా నరసన్నపేట తరలిస్తారు. ఇక టెక్కలి, కోటబొమ్మాళి ప్రాంతాలకు రావిపాడు, తుంబయ్యపేట, రామినాయడుపేట, నిమ్మాడ మీదుగా రవాణా చేస్తారు. దీనికి ముందుగా ద్విచక్ర వాహనాలపై వెళ్లి జన సంచారం, తనిఖీలు లేవని నిర్ధారించిన తరువాత మొబైల్ ద్వారా సమాచారం తెలుసుకున్న తరువాతే ఈ తతంగం పూర్తి చేస్తారు. ఈ విషయమై రైల్వే సిబ్బందిని ప్రశ్నించగా.. రైలు బండిని నుంచి వచ్చిన సరుకులకు ఉన్న రశీదులు మాత్రమే చూస్తామని, తరువాత వారికి పార్శిల్ అప్పచెబుతామని, ఈ అక్రమ రవాణా విషయం తమ పరిధిలోకి రాదని తేల్చి చెబుతున్నారు. దీనిపై నరసన్నపేట డిప్యూటీ సీటీఓ అనసూయ వివరణ కోరగా.. గుట్కాలు విక్రయాలు తమ పరిధిలోకి రావని తెలిపారు. అవి దొరికినా ఫుడ్ ఇన్స్పెక్టర్కు అప్పగిస్తామని స్పష్టంచేశారు. బట్టలు, ఇతర వ్యాపార సామగ్రిపై తినిఖీలు నిర్వహించి పట్టుబడితే అపరాధ రుసుం విధిస్తామని పేర్కొన్నారు. 2018–19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తనిఖీలు ఒకటి రెండు రోజుల్లో ప్రారంభిస్తామని ఆమె వెల్లడించారు. -
అబార్షన్ చేసేందుకు డాక్టర్ యత్నం
జిన్నారం(పటాన్చెరు) : ఓ యువతికి నిబంధనలకు విరుద్ధంగా అబార్షన్ చేసేందుకు యత్నించిన సంఘటన జిన్నారం మండలం బొల్లారం గ్రామంలో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో గురువారం అర్ధరాత్రి జరిగింది. స్థానికులు, కుటుంబసభ్యులు, వైద్య అధికారులు తెలిపిన వివరాల ప్రకారం కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ యువతి బొల్లారంలో నివాసం ఉంటుంది. తనకు గర్భం వచ్చిందని అబార్షన్ చేయించాలని గ్రామంలోని ఓ బ్రోకర్‌ను సంప్రదించింది. దీంతో అబార్షన్ చేయించేందుకు కొంత డబ్బును అందిస్తానని స్థానికంగా ఉన్న కార్తీకా క్లినిక్‌ను సంప్రదించారు. దీంతో వైద్యురాలు శ్రీవల్లి యువతికి అబార్షన్ చేసేందుకు ఒప్పుకుందని బాధితురాలి కుటుంబ సభ్యులు వివరించారు. అర్ధరాత్రి గుట్టుచప్పుడు కాకుండా యువతికి అబార్షన్ చేసేందుకు ఏర్పాటు చేసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు మీడియా సిబ్బందితో కలిసి ఆస్పత్రికి చేరుకున్నారు. వారిపై వైద్యురాలు శ్రీవల్లి విరుచుకుపడ్డారు. ఈ విషయాన్ని స్థానికులు జిల్లా వైద్యాధికారులకు సమాచారం అందించారు. దీంతో డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌ఓ ప్రవీణ్‌కుమార్ వైద్య సిబ్బందితో ఆసుపత్రికి చేరుకున్నారు. ఈ సందర్భంగా స్థానికులు అధికారులతో మాట్లాడారు. ఎలాంటి అనుమతులు లేకుండా ఆసుపత్రిలో అబార్షన్లను నిర్వహిస్తున్నారని, గతంలో కూడా ఇలాంటి సంఘటనలు ఈ ఆసుపత్రిలో చాలా జరిగాయని స్థానికులు పేర్కొన్నారు. ఆసుపత్రి సీజ్ ఆస్పత్రిలో ఉన్న బాధిత యువతిని హుటాహుటిన సంగారెడ్డిలోని ప్రభత్వాసుపత్రికి వైద్యాధికారులు తరలించారు. ఆసుపత్రిని రాత్రికి రాత్రే అధికారులు సీజ్ చేశారు. ఈ విషయమై ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ ఆసుపత్రి నిర్వహణకు ఎలాంటి అనుమతులు లేవన్నారు. ఆస్పత్రి సీజ్ చేశామన్నారు. ఆసుపత్రి ఏర్పాటుకు సంబంధించిన అన్ని పత్రాలను తమకు అందించాలని వైద్యురాలు శ్రీవల్లిని ఆదేశించామని పేర్కొన్నారు. ప్రస్తుతం యువతి సంగారెడ్డిలోని ఆసుపత్రిలో ఉందని తెలిపారు. ఈ విషయమై ఆస్పత్రి నిర్వహకులపై ఎన్టీపీ చట్టం ఆధారంగా కేసు నమోదు చేస్తామని తెలిపారు. దీనిపై డీఎంహెచ్‌వో మోజీరామ్రాథోడ్ ఆదేశాల మేరకు పోలీసులు కేసు నమదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఐస్‌క్రీమ్, కారా కేంద్రాలపై కొరడా
హుస్నాబాద్ : హుస్నాబాద్ పట్టణంలోని గీతా ఐస్‌క్రీమ్ తయారీ కంపెనీ, కార ఇతరాత్ర తినుబండారాలు తయారు చేస్తున్న రాణి కార కేంద్రంపై మంగళవారం ఫుడ్ సేఫ్టీ జిల్లా అధికారి రవీందర్రావు, ఏసీపీ మహేందర్, సీఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో మంగళవారం ఏక కాలంలో దాడులు నిర్వహించారు. ఈ తనీఖీల్లో ప్రజలకు హానీ కలిగించే ఐస్‌క్రీమ్‌లు తయారు చేస్తున్నట్లుగా తేటతెల్లం కాగా, ఎలాంటి అనుమతులు లేకుండా కంపెనీని నిర్వహిస్తున్నారని అధికారులు స్పష్టం చేశారు. ఐస్‌క్రీమ్‌లలో నాణ్యత ప్రమాణాలు పాటించకుండా తయారు చేస్తూ ప్రజలు, ముఖ్యంగా పిల్లలకు హాని కలిగించే విధంగా ఐస్‌క్రీంలు తయారు చేస్తున్నారు. ఐస్‌క్రీమ్‌లో వాటర్ శాతం తక్కువగా కలుపుతూ మోతాదుకు మించి వివిధ కెమికల్స్‌ను కలుపుతూ యథేచ్చగా ఐస్‌క్రీమ్ కంపెనీని నిర్వహిస్తున్నారని తెలిపారు. అలాగే పిల్లలను ఆకర్షించే విధంగా పెద్ద పెద్ద కంపెనీల పేర్లు గల లేబుల్స్ అతికిస్తున్నారని అన్నారు. ఏంత పెద్ద కంపెనీ ఐస్‌క్రీమ్ అయినా మూడు నెలల కంటే ఎక్కువగా నిలువ ఉంచవద్దని, అలాంటిది లేబుల్స్ పై ఏడాది కాలం ఎక్స్పైర్ తేదీని ముద్రించి అమ్ముతున్నారని స్పష్టం చేశారు. ఐస్‌క్రీమ్‌లను భద్రపరిచే ఫ్రిడ్జ్‌ల కండిషన్ బాగా లేవని, తయారీ కేంద్రమంతా అపరిశుభ్రతకు నిలయంగా మారిందన్నారు. ఐస్‌క్రీమ్ తయారీ కోసం వాడే నీటిలో ఫంగస్ వంటి క్రిములున్నాయని తెలిపారు. ఎక్స్పైర్ అయిన ఐస్‌క్రీం తినడం వల్ల పిల్లల నోటిలో పొక్కులు పొడవడం, దురద, మోషన్స్, క్యాన్సర్ వచ్చే అవకాశముంటుందని ఫుడ్ సేప్టీ అధికారి రవీందర్రావు తెలిపారు. నాసిరకం కెమికల్స్, పాలు, పాల పౌడర్ అంతా కలుషితమైన పదార్థాలతో ఐస్‌క్రీమ్‌లను తయారు చేస్తున్నట్లుగా నిర్ధారించారు. ఐస్ క్రీం తయారీ కంపెనీకి ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేవని అధికారులు నిర్ధారించారు. దీంతో ఐస్‌క్రీం కేంద్రాన్ని సీజ్ చేస్తున్నట్లు ఫుడ్ సేఫ్టీ జిల్లా అధికారి రవీందర్రావు తెలిపారు. కంపెనీలో తయారు చేసే వివిధ రకాల ఐస్‌క్రీమ్‌లను టెస్టింగ్ కోసం శాంపిల్ సేకరించామన్నారు. ల్యాబ్‌లో పరీక్షలు చేసిన అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటామని రవీందర్రావు తెలిపారు. అనుమతి లేని కారా కేంద్రం... హుస్నాబాద్ పట్టణంలోని ముదిరాజ్ కాలనీలోని కార, ఇతర తినుబండారాల తయారీ కేంద్రాన్ని అధికారులు పరిశీలించారు. ఇక్కడి నుంచే వివిధ మండలాలు, పట్టణంలో ఉన్న కిరాణ దుకాణాలకు కార, ఇతర పిండి పదార్ధాలు తయారు చేసి విక్రయిస్తారు. ఈ కేంద్రాన్ని పరిశీలించి, శనగపింగి, మైద పిండి, వంట నూనే ఇతరాత్ర వస్తువులను పరిశీలించారు. దాదాపు 30 మంది వరకు వర్కర్లు పని చేస్తున్నారు. కేంద్రం నిర్వాహణ కోసం తీసుకున్న ట్రేడ్ లైసెన్స్ 5 నెలల క్రితమే ల్యాప్స్ అయిపోయిందని, రెన్యువల్ చేసుకోకుండా ఈ కేంద్రాన్ని నడిపిస్తున్నారని అధికారులు తెలిపారు. అనుమతి లేకుండా నిర్వహిస్తున్న కేంద్రంపై జేసీకి నివేదికను అందించి, తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే నాసిరకం ఐస్‌క్రీమ్‌లను తయారు చేస్తున్న కంపెనీ నిర్వాహకుడిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ఏసీపీ మహేందర్, సీఐ శ్రీనివాస్‌జీ తెలిపారు. వీరి వెంట ఎస్ఐ సుధాకర్, సిబ్బంది పాల్గొన్నారు. -
డాబర్ డైరెక్టర్‌పై ఈడీ కొరడా: నష్టాల్లో షేరు
సాక్షి, న్యూఢిల్లీ: డాబర్ ఇండియా లిమిటెడ్ సంస్థకు ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ (ఈడీ) భారీ షాక్ ఇచ్చింది. సంస్థ డైరెక్టర్ ప్రదీప్ బర్మన్కు చెందిన సుమారు 21 కోట్ల రూపాయల ఆస్తులను ఈడీ సీజ్ చేసింది. అక్రమ ఆస్తుల కేసులో 20.87 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను ఈడీ స్వాధీనం చేసుకుంది. ఫారిన్ ఎక్స్చేంచ్ మేనేజ్మెంట్ (ఫెమా) చట్టంలోని 37ఏ ఉల్లంఘన కింద విదేశాల్లో ఆయనకు అక్రయ ఆస్తులు ఉన్నాయని ఈడీ ఆరోపిస్తోంది. డాబర్ సంస్థ డైరక్టర్ ప్రదీప్ విదేశాల్లో ఆయన పెట్టుబడులు ఉన్నట్లు గతంలో సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం సమర్పించిన నల్లకుబేరుల జాబితాలో ఉంది. విదేశీ బ్యాంకు అకౌంట్లు ఉన్నాయంటూ ఇప్పటికే ఐటీశాఖ కూడా కేసు నమోదు చేసింది. డాబర్ సంస్థకు చెందిన కుటుంబీకుల్లో ప్రదీప్ ఒకరు. ప్రస్తుతం డాబర్ మార్కెట్ విలువ సుమారు రూ.37వేల కోట్ల ఉంటుందని అంచనా. జెనీవాకు చెందిన హెచ్ఎస్బీసీ జాబితాలో ఆయన పేర్లు ఉన్నాయి. అయితే విదేశీ అకౌంట్లు కలిగి ఉన్న కేసును 2011 నుంచి విచారణ జరుగుతున్న ఆ కేసులో ప్రదీప్ 8 కోట్ల రూపాయల జరిమానా కూడా చెల్లించిన సంగతి తెలిసిందే. మరోవైపు ఈ వార్తల నేపథ్యంలో డాబర్ కౌంటర్లో అమ్మకాలకు తెరలేచింది. ఇన్వెస్టర్ల అమ్మకాలతో షేరు 3శాతానికి పై గా నష్టపోయింది. -
అప్‌లాంజ్ బార్ సీజ్
సాక్షి, హైదరాబాద్ : మద్యం మత్తులో నిండు ప్రాణం బలిగొన్న యువతుల ఘటనపై ఘట్కేసర్ అధికారులు స్పందించారు. 21 ఏళ్ల వయసు లోపు వారికి మద్యం అమ్మకూడదన్న నిబంధనను పట్టించుకోకుండా మద్యం అమ్మకాలు చేశారన్న కారణంతో మంగళవారం ఏఎస్రావు నగర్‌లోని అప్‌లాంజ్ (సమ్మక్క సారక్క) బార్‌ను ఎక్సైజ్ సూపరింటెండెంట్ ప్రదీప్‌రావు, ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ మల్లయ్య ఆధ్వర్యంలో దాడులు జరిపి సీజ్ చేశారు. నిర్వాహకుడు శ్రీధర్‌గౌడ్‌పై కేసు నమోదు చేశామని, ఉన్నతాధికారుల సూచన మేరకు జరిమానా విధించనున్నట్లు తెలిపారు. సమ్మక్క–సారక్క పేరుతో నాగారానికి చెందిన శ్రీధర్‌గౌడ్ పేరు మీద బార్‌కు లైసెన్స్ ఉంది. నిర్వహణ సక్రమంగా సాగకపోవడంతో నిర్వాహకుడు బార్‌ను మూసేశాడు. మూసేసిన బార్‌ను పై ఫ్లోర్లో ఉన్న అప్‌లాంజ్ రెస్టారెంట్ నిర్వాహకులు లీజ్‌కు తీసుకొని గత 6 నెలలుగా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో కనీస నిబంధనలను పాటించకుండా బార్ నిర్వహణ, మద్యం అమ్మకాలు సాగిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఆదివారం రాత్రి ఈ బార్లో తప్పతాగిన యువతులు డ్రైవింగ్ చేసి నిండు ప్రాణాన్ని బలిగొన్నారు. కాగా సదరు యువతులు 21 ఏళ్లు దాటినట్లు తప్పుడు ధృవపత్రాలు చూపించారని నిర్వాహకులు పేర్కొంటున్నారు. అతిగా మద్యం సేవించడంతో బారు సిబ్బంది వారిని కారు వరకు తీసుకెళ్లి వదిలినట్లు సీసీ కెమెరా రికార్డులు చెబుతున్నాయి. -
ఏడు కోట్ల రూపాయల ఫేక్ కరెన్సీ పట్టివేత
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో వచ్చే నెలలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో నకిలీ కరెన్సీ రాష్ట్రంలో ప్రకంపనలు పుట్టిస్తోంది. తాజాగా బుధవారం బెలగవిలో పోలీసుల తనిఖీల్లో భారీగా నకిలీ కరెన్సీ పట్టుబడింది. ఈ సందర్భంగా ఏడు కోట్ల రూపాయల విలువైన నకిలీ కరెన్సీని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఒకరిని అరెస్టు చేశారు. కాగా వచ్చేనెల 12న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు ఆయా పార్టీలు రంగంలోకి దిగినట్టు కనిపిస్తోంది. ఈ అంచనాలకు ఊతమిస్తూ మంగళవారం అక్రమంగా భారీగా నగదును తరలిస్తూ పలువురు పట్టుబడిన సంగతి తెలిసిందే. ఒక ప్రైవేటు బస్సులో వంద కోట్ల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.