MH: కారులో 24 కోట్ల ఖ‌రీదైన వ‌జ్రాలు, న‌గ‌లు సీజ్‌ | Maharashtra Polls: Diamonds other jewellery worth 24 crore seized from car in Ahilyanagar | Sakshi
Sakshi News home page

మహారాష్ట్ర ఎన్నికలు.. కారులో 24 కోట్ల ఖ‌రీదైన వ‌జ్రాలు, న‌గ‌లు సీజ్‌

Published Sat, Nov 2 2024 3:43 PM | Last Updated on Sat, Nov 2 2024 4:45 PM

Maharashtra Polls: Diamonds other jewellery worth 24 crore seized from car in Ahilyanagar

ప్రతీకాత్మక చిత్రం

ముంబై: మ‌హారాష్ట్ర‌లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నిక‌ల సంఘం అధికారులు, పోలీసులు రాష్ట్రం అంతా తనిఖీలు చేపట్టారు.  అహ‌ల్యాన‌గ‌ర్ జిల్లాలోని టోల్‌ ప్లాజా సమీపంలో ఎన్నిక‌ల సంఘానికి చెందిన స్టాటిక్ స‌ర్వియ‌లెన్స్ బృందం గురువారం ఓ కారులో సోదాలు చేప‌ట్టింది. కారులో ఉన్న విలువైన ఆభ‌ర‌ణాలు ఉన్నట్లు గుర్తించారు. కారులోని సుమారు 24 కోట్ల విలువైన వ‌జ్రాలు, బంగారం, వెండి నగలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

​కారులో ముగ్గురు ప్రయాణికులు ఉండగా.. వారు చూపించిన రసీదులకు బంగారు అభరణాలకు విలువ సరిపోకపోవడంతో వాటిని సీజ్‌ చేశారు. తదుపరి విచారణ కోస ఆదాయపు పన్నుశాఖకు బదిలీ చేశారు. కారులో వ‌జ్రాలు, బంగారం, సిల్వ‌ర్ జ్యూవెలరీకి చెందిన కన్‌సైన్మెంట్ ఉన్న‌ట్లు పోలీసులు చెప్పారు. 

ద‌క్షిణ ముంబైలోని జావేరి బ‌జార్ నుంచి ఆ వాహ‌నం స్టార్ట్ అయిన‌ట్లు సుపా పోలీసు అధికారి అరుణ్ అవ‌ద్ తెలిపారు. ఆభ‌ర‌ణాల‌కు చెందిన ర‌శీదు చూపించాల‌ని కోర‌గా, కొన్ని ర‌శీదుల‌ను చూపించార‌ని, కానీ ఆ ర‌శీదుల్లో ఉన్న అమౌంట్‌లో తేడా ఉన్న‌ట్లు పోలీసులు వెల్ల‌డించారు. స్వాధీనం చేసుకున్న ఆభ‌ర‌ణాల గురించి ఆదాయ‌ప‌న్ను శాఖ‌కు ఎస్ఎస్టీ పోలీసులు స‌మాచారం చేర‌వేశారు. ఛ‌త్ర‌ప‌తి సాంబాజిన‌గ‌ర్‌, అహ‌ల్య‌న‌గ‌ర్‌, జ‌ల్గావ్ జిల్లాల్లో ఆ ఆభ‌ర‌ణాల‌ను డెలివ‌రీ చేయాల్సి ఉంద‌న్నారు.

అయితే, విలువైన వస్తువుల రవాణాకు, ఎన్నికలకు ఎలాంటి సంబంధం లేదని మహారాష్ట్ర జ్యువెలర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఫతేచంద్ రాంకా తెలిపారు. పోలీసులు ఆభరణాలు డిపాజిట్ చేసే ముందు నగల వ్యాపారులను పిలిచి ఉండాలని పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement