Jewellery
-
ఆభరణాల ఎగుమతులకు కొత్త ప్రమాణాలు
న్యూఢిల్లీ: బంగారం, వెండి, ప్లాటినం ఆభరణాల ఎగుమతులకు సంబంధించి సవరించిన వేస్టేజీ (తరుగు/వృధా) నిబంధనలను కేంద్రం శుక్రవారం విడుదల చేసింది. ఇవి జనవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ఆభరణాల తయారీ సమయంలో కొంత లోహం వృధా అవుతుందని తెలిసిందే. ఎగుమతి చేసే ఆభరణాలకు సంబంధించి ఈ వేస్టేజీ పరంగా పరిమితులు ఉన్నాయి. ఈ వేస్టేజీని తగ్గిస్తూ ఈ ఏడాది మే 27న కేంద్రం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. వీటిపట్ల పరిశ్రమ ఆందోళన వ్యక్తం చేయడంతో 2024 డిసెంబర్ చివరి వరకు అమలును వాయిదా వేసింది. కొంత వెసులుబాటుతో సవరించిన నిబంధనలను కేంద్రం తాజాగా విడుదల చేసింది. ‘‘ఎగుమతి చేసే ఆభరణాలకు సంబంధించి ప్రామాణిక ఇన్పుట్–అవుట్‌పుట్, అనుమతించిన వేస్టేజీ నిబంధనలను సవరించడమైనది’’అంటూ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారీన్ ట్రేడ్ ప్రకటించింది. ఆభరణాల తయారీ ప్రక్రియకు తగ్గట్టు వేస్టేజీని వాస్తవికంగా నిర్ణయించాలని ప్రరిశ్రమ కోరడం గమనార్హం. అలాగే, కొత్త నిబంధనల అమలుకు తగినంత సమయం ఇవ్వాలని కూడా కోరింది. సాధారణ బంగారం, ప్లాటినం ఆభరణాల తయారీలో వేస్టేజీని 2.5 శాతం నుంచి 0.5 శాతానికి, వెండి ఆభరణాలకు వేస్టేజీని 3.2 శాతం నుంచి 0.75 శాతానికి తగ్గిస్తూ మే నెలలో ప్రకటించిన నిబంధనల్లో కేంద్రం పేర్కొంది. అదే స్టడెడ్ జ్యుయలరీ విషయంలో బంగారం, వెండి, ప్లాటినం ఆభరణాల తయారీలో వేస్టేజీని 0.75 శాతానికి తగ్గించింది. అంతకుముందు ఇది 5 శాతంగా ఉండేది. కొంత వెసులుబాటు..: తాజాగా విడుదల చేసిన నిబంధనల ప్రకారం.. చేతితో తయారు చేసిన బంగారం, ప్లాటినం ఆభరణాలకు సంబంధించి గరిష్ట వేస్టేజీని 2.5% వరకు అనుమతించనున్నారు. చేతితో చేసిన వెండి ఆభరణాలకు 3.2 % వేస్టేజీ అమలు కానుంది. మెషిన్లపై చేసిన బంగారం ఆభరణాలకు 0.45% వేస్టేజీ, వెండికి 0.5% అమలు కానుంది. చేతితో చేసిన బంగారం, వెండి, ప్లాటినం స్టడెడ్ ఆభరణాలకు 4 శాతం, మెషిన్‌పై చేసిన స్టడెడ్ ఆభరణాలు అయితే 2.8% మేర వేస్టేజీని అనుమతించనున్నారు. ఆభరణాలతోపాటు విగ్రహాలు, కాయిన్లు, పతకాలు, ఇతర వస్తువులకు సైతం ఇవే వేస్టేజీ నిబంధనలు అమలవుతాయి. -
MH: కారులో 24 కోట్ల ఖరీదైన వజ్రాలు, నగలు సీజ్
ముంబై: మహారాష్ట్రలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం అధికారులు, పోలీసులు రాష్ట్రం అంతా తనిఖీలు చేపట్టారు. అహల్యానగర్ జిల్లాలోని టోల్ ప్లాజా సమీపంలో ఎన్నికల సంఘానికి చెందిన స్టాటిక్ సర్వియలెన్స్ బృందం గురువారం ఓ కారులో సోదాలు చేపట్టింది. కారులో ఉన్న విలువైన ఆభరణాలు ఉన్నట్లు గుర్తించారు. కారులోని సుమారు 24 కోట్ల విలువైన వజ్రాలు, బంగారం, వెండి నగలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.కారులో ముగ్గురు ప్రయాణికులు ఉండగా.. వారు చూపించిన రసీదులకు బంగారు అభరణాలకు విలువ సరిపోకపోవడంతో వాటిని సీజ్ చేశారు. తదుపరి విచారణ కోస ఆదాయపు పన్నుశాఖకు బదిలీ చేశారు. కారులో వజ్రాలు, బంగారం, సిల్వర్ జ్యూవెలరీకి చెందిన కన్సైన్మెంట్ ఉన్నట్లు పోలీసులు చెప్పారు. దక్షిణ ముంబైలోని జావేరి బజార్ నుంచి ఆ వాహనం స్టార్ట్ అయినట్లు సుపా పోలీసు అధికారి అరుణ్ అవద్ తెలిపారు. ఆభరణాలకు చెందిన రశీదు చూపించాలని కోరగా, కొన్ని రశీదులను చూపించారని, కానీ ఆ రశీదుల్లో ఉన్న అమౌంట్లో తేడా ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. స్వాధీనం చేసుకున్న ఆభరణాల గురించి ఆదాయపన్ను శాఖకు ఎస్ఎస్టీ పోలీసులు సమాచారం చేరవేశారు. ఛత్రపతి సాంబాజినగర్, అహల్యనగర్, జల్గావ్ జిల్లాల్లో ఆ ఆభరణాలను డెలివరీ చేయాల్సి ఉందన్నారు.అయితే, విలువైన వస్తువుల రవాణాకు, ఎన్నికలకు ఎలాంటి సంబంధం లేదని మహారాష్ట్ర జ్యువెలర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఫతేచంద్ రాంకా తెలిపారు. పోలీసులు ఆభరణాలు డిపాజిట్ చేసే ముందు నగల వ్యాపారులను పిలిచి ఉండాలని పేర్కొన్నారు. -
బంగారు ఆభరణాలే ఎక్కువ..
భారతీయులు బంగారు ప్రియులు. బంగారాన్ని వివిధ రకాల ఆభరణాల రూపంలో కూడా అత్యధికంగా వాడేది మనమే. అలాగని మనదగ్గరే ప్రపంచంలోకెల్లా ఎక్కువ బంగారు నిల్వలు ఉన్నాయనుకుంటే పొరపాటే.ఈ విషయంలో పెద్దన్న అమెరికాదే అగ్రస్థానం అక్కడ 8133 టన్నుల నిల్వలు ఉన్నాయి. ఆ తరవాతి స్థానాల్లో ఉన్న మూడు దేశాలు.. జర్మనీ, ఇటలీ ఫ్రాన్స్. ఈదేశాల్లోని మొత్తం నిల్వలతో సమానంగా అమెరికా దగ్గర ఉండటం విశేషం. ఈ విషయంలో మనది 8వ స్థానం. 2023 చివరినాటికి ప్రపంచంలో ఉన్న మొత్తం బంగారం ఏయే రూపాల్లో ఎక్కడ ఉందంటే.. -
రిలయన్స్ జ్యువెల్స్ 'వివాహం కలెక్షన్': భారీ తగ్గింపులు కూడా..
భారతదేశంలోని అత్యంత విశ్వసనీయ ఆభరణాల బ్రాండ్స్‌లో ఒకటైన 'రిలయన్స్ జ్యువెల్స్' రాబోయే పండగ సీజన్ కోసం ప్రత్యేక వివాహ కలెక్షన్స్ ఆవిష్కరించింది. ఆధునికత, సంప్రదాయం రెండూ కలబోసిన వినూత్న వివాహ ఆభరణాలు ఎన్నో ఇక్కడ కనిపిస్తాయి. అందంగా తీర్చిదిద్దిన చోకర్లు, గాజులు, చెవి రింగులు, నెక్లెసులు, హాత్ ఫూల్, మాంగ్ టికా, ముక్కు పుడకలు, వడ్డాణాల వంటివి ఈ సరికొత్త ఆవిష్కరణలో ఉన్నాయి.ఈ వివాహం కలెక్షన్లో.. బంగారం, వజ్రాలతో ఎంతో సునిశితంగా తీర్చిదిద్దిన ఎనిమిది అద్భుతమైన ఆభరణాలు ఉన్నాయి. ఇవన్నీ వధువును మరింత అందంగా కనిపించేలా చేస్తాయి. అంతే కాకుండా వివిధ ప్రాంతాల సాంప్రదాయాలను ప్రతిబింబించే అనేక ప్రాంతీయ ఆభరణాలు కూడా ఈ కలెక్షన్లో ఉన్నాయి.వివాహం కలెక్షన్ ఆవిష్కరణ సందర్భంగా రిలయన్స్ జువెల్స్ సీఈఓ సునీల్ నాయక్ మాట్లాడుతూ.. భారతదేశంలో వివాహాలు సంస్కృతికి నిదర్శనం. ఈ వేడుకల్లో వధువు ఆభరణాలకు ప్రత్యేక స్థానం ఉంటుంది. ఈ సంప్రదాయానికి ప్రతిరూపం మా వివాహం కలెక్షన్. ప్రాంతీయ వారసత్వం, ఆధునిక అభిరుచి కలబోతగా ఈ కలెక్షన్లోని ప్రతి సెట్ నిలుస్తూ.. నేటి వధువు వ్యక్తిత్వానికి, వ్యక్తిగత స్టైల్‌ను అందిపుచ్చుకుంటాయి. ఇవన్నీ కేవలం పెళ్లి రోజున ధరించేవి మాత్రమే కాదు, ఏళ్ల తరబడి ఈ ఆభరణాలు ఆనందాన్ని అందిస్తాయని ఆయన అన్నారు.రిలయన్స్ జువెల్స్ 2024 నవంబర్ 11 వరకు బంగారు ఆభరణాల మేకింగ్ ఛార్జీలపై 25% వరకు, డైమండ్ వ్యాల్యూ, మేకింగ్ ఛార్జీలపై 30% వరకు ఆకర్షణీయ డిస్కౌంట్స్ అందిస్తోంది. ఎంతో విలువైన అద్భుతమైన ఆభరణాలపై పెట్టుబడి పెట్టేందుకు వధువులకు ఇది చక్కని అవకాశం. ఆభరాలు దేశంలోని 185కు పైగా నగరాల్లోని రిలయన్స్ జువెల్స్ స్టోర్స్‌లో అందుబాటులో ఉన్నాయి. వీటిని ఆన్లైన్లో కొనుగోలు చేయవచ్చు. -
జ్యువెలరీ షోరూంలో రూ.6 కోట్లు నగలు చోరీ
-
నగలు ధరించాక పెర్ఫ్యూమ్లు వేసుకుంటున్నారా? అయితే ఈ టిప్స్ మీకోసమే!
అందమైన ఆభరణాలను ఎక్కవ డబ్బు పెట్టి కొనుక్కుంటాం. వాటిని ధరించి ఆనందిస్తాం. కానీ ఆభరణాలను కలకాలం అందంగా ఉంచుకోవడం కూడా తెలుసుకోవాలి. తగిన జాగ్రత్తలు తీసుకోక΄ోతే ఆభరణాలు కాంతిహీనమవుతాయి. ఫంక్షన్లకు వెళ్లేటప్పుడు ఆభరణాలు ధరించిన తర్వాత ఒంటికి లోషన్లు– సన్స్క్రీన్లు రాయడం, పెర్ఫ్యూమ్ స్ప్రే చేసుకోవడం మంచిది కాదు. ఇలా చేస్తే కాస్మటిక్స్లోని రసాయనాలు ఆభరణాల లోహాల మధ్య రసాయన చర్యకు కారణమవుతుంది. ఆభరణాలు మెరుపు తగ్గడం, రంగుమారడం వంటి పరిణామాలు సంభవిస్తాయి. కాబట్టి ఒంటికి క్రీములు, పెర్ఫ్యూమ్లు వేసుకోవడం పూర్తయిన తర్వాత మాత్రమే ఆభరణాలను ధరించాలి. ఆభరణాలను ధరించిన తర్వాత తీసి బీరువాలో దాచేటప్పుడు నేరుగా డబ్బాలో పెట్టడం మంచిది కాదు. ఒంటి మీద నుంచి తీసిన తరవాత కొంతసేపు గాలికి ఆరనివ్వాలి. ఆ తర్వాత నూలువస్త్రంతో తుడవాలి. శుభ్రమైన మెత్తని నూలు వస్త్రంలో చుట్టి డబ్బాలో పెట్టాలి.ఆభరణాలను శుభ్రం చేయడానికి రసాయనాలను వాడరాదు. ఇలా చేస్తే బంగారు ఆభరణాల మెరుపు పోవడంతోపాటు ఆభరణం రంగుమారుతుంది. ఆభరణం రంగు మారిన వెంటనే ఇది కచ్చితమైన బంగారేనా అనే అనుమానం వస్తుంది. ఆభరణం తయారీలో బంగారంలో కొన్ని ఇతర లోహాలను కలుపుతారు. అవి రసాయనాల కారణంగా రంగుమారుతాయి. ఆభరణాలను మెత్తని వస్త్రంతో మృదువుగా తుడవాలి.నిద్రపోయేటప్పుడు ఆభరణాలను ధరించరాదు. బంగారు మెత్తని లోహం. సున్నితమైన పనితనంతో లోహంలో రాళ్లు, వజ్రాలను పొదుగుతారు. నిద్రలో ఒత్తిడికి గురై రాళ్లు ఊడి΄ోయే ప్రమాదం ఉంది. రాలి పడిన రాళ్లను తిరిగిపొందగడం కష్టం. తిరిగి అమర్చినప్పటికీ అతుకు తెలిసి΄ోతుంది. ఆభరణానికి స్వతహాగా ఉండే అందం పోతుంది.రెండు వేర్వేరు లోహాలను ఒకచోట ఉంచరాదు. అంటే బంగారు, వెండి ఆభరణాలను ఒకే డబ్బాలో పెట్టకూడదు. విడిగా భద్రపరచాలి. అలాగే రెండు ఆభరణాలను కూడా ఒకే పెట్టెలో పెట్టరాదు. ఒకదానికొకటి రాసుకుని గీతలు పడతాయి, మెరుపు కూడా తగ్గుతుంది. – రీటా షాకన్సల్టెంట్ అండ్ జ్యూయలరీ డిజైనర్, హైదరాబాద్ -
కొంపముంచిన వడాపావ్.. వీడియో వైరల్
పుణె: పూణెలో జరిగిన పట్టపగలు దోపిడీలో వృద్ధ దంపతులు రూ. 5 లక్షల విలువైన నగలను పోగొట్టుకున్నారు. భార్యాభర్తలు బ్యాంకు నుంచి ద్విచక్ర వాహనంపై తిరిగి వస్తుండగా ఓ దుకాణంలో వడాపావ్ తినేందుకు ఆగారు. ఆ దంపతులు స్కూటర్‌ను రోడ్డు పక్కన నిలిపారు. ఆ వ్యక్తి ఫాస్ట్ ఫుడ్ కోసం షాపులోకి వెళ్లగా, ఆ మహిళ స్కూటర్ దగ్గర వేచి ఉంది. కాసేపటి తర్వాత, బైక్‌పై ముఖానికి మాస్క్‌తో ఒక వ్యక్తి స్కూటర్ దగ్గర ఆపాడు, రోడ్డుపై ఏదో పడిపోయినట్లుగా ఆ మహిళ దృష్టి మళ్లించి అక్కడ నుంచి వెళ్లిపోయాడుదానికోసం వంగి వెతుకుతుండగా.. స్కూటర్ ముందు భాగంలో ఉన్న బ్యాగ్‌ను తీసుకొని మరో వ్యక్తి పరారయ్యాడు. దీన్ని గమనించిన ఆ మహిళ కేకలు వేస్తూ దొంగతనానికి పాల్పడిన వ్యక్తి వెనకే పరుగులు తీసింది.ఈ ఘటన సమీపంలోని సీసీటీవీలో రికార్డయ్యింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ బ్యాగులో రూ. 5 లక్షల విలువైన ఆభరణాలు, సెల్ఫోన్లు కూడా అందులోనే ఉన్నట్లు బాధితులు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.In Pune, a couple’s gold jewellery valued at ₹4.95 lakh was stolen while they paused to buy vada pav after retrieving it from a bank. The theft occurred on Thursday outside Rohit Vadewale's shop in ShewalewadiReported by: Laxman MoreVideo Editor: Dhiraj Powar#PuneTheft… pic.twitter.com/JfXj1uuiU7— Pune Mirror (@ThePuneMirror) August 30, 2024 -
తారల తలుక్కు..మోడల్స్ ర్యాంప్ వాక్ (ఫొటోలు)
-
Hyderabad: క్రియాలో.. శ్రియ! కేపీహెచ్బీలో క్రియా జ్యువెల్లర్స్ ప్రారంభం!
సాక్షి, సిటీబ్యూరో: లక్షణమైన దక్షిణాది అమ్మాయిలా ముస్తాబు కావడం ఎంతో ఇష్టమని ప్రముఖ సినీతార శ్రియ శరన్ తెలిపారు. కేపీహెచ్‌బీ రోడ్ నంబర్–1లో నూతనంగా ఏర్పాటు చేసిన క్రియా జ్యువెల్స్‌ను బుధవారం ఆమె ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అందరు మగువల్లానే తనకూ బంగారు ఆభరణాలు ఎంతో ఇష్టమన్నారు. ఆభరణాలు మగువలకు మరింత సౌందర్యాన్ని పెంచుతాయని పేర్కొన్నారు. క్రియా ఆధ్వర్యంలోని లైట్ వెయిట్ ఆభరణాలు వినూత్నంగా ఉన్నాయని చెప్పారు. సినిమాల గురించి మాట్లాడుతూ.. తెలుగులో తేజా సజ్జా సినిమాలో, తమిళ్లో సూర్యతో మరో సినిమాలో నటిస్తున్నానని తెలిపారు. వారసత్వం, సంప్రదాయ ఆవిష్కరణలో భాగంగా క్రియా జ్యువెల్లరీని ప్రారంభించామని నిర్వాహకులు కొణిజేటి వెంకట మహేష్ గుప్తా అన్నారు. వజ్రాభరణాలతో పాటు ప్రత్యేకంగా విక్టోరియన్ కలెక్షన్ అందుబాటులో ఉన్నాయన్నారు. మరికొద్ది రోజుల్లో మరిన్ని స్టోర్లను ప్రారంభించను న్నామని ఆయన తెలిపారు. -
Gold Scam: క్యారెట్లలో కిరికిరి.. కొనేదంతా బంగారం కాదు!
హైదరాబాద్‌లోని శ్రీనగర్‌కాలనీకి చెందిన ఒక మహిళ తన బంగారు ఆభరణాన్ని కరిగించి మరో ఆభరణం తయారు చేయించుకునేందుకు స్వర్ణకారుడి వద్దకు వెళ్లింది. ఆభరణాన్ని పరిశీలించగా అందులో 70 శాతానికి మించి బంగారం లేదు. హాల్‌మార్క్ సెంటర్‌కు పంపి పరిశీలిస్తే ఆభరణంలో రాగి 16.47 శాతం, వెండి 15.23 శాతం ఉండగా బంగారం 68.12 శాతం మాత్రమే ఉన్నట్లు తేలింది. గతంలో ఆ ఆభరణాన్ని విక్రయించిన వ్యాపారి ఇచ్చిన రసీదు అందుబాటులో లేకపోవడంతో ప్రశ్నించే అవకాశం లేకుండాపోయింది.బంగారంపై మహిళలకుండే మక్కువ అంతా ఇంతా కాదు. బంగారంతో చేసిన ఆభరణాలపై ఉండే క్రేజే వేరు. ధనం లేకున్నా, తులం బంగారం అయినా ఒంటి మీద ఉండాలని సగటు మధ్య తరగతి మహిళలు భావిస్తుంటారు. పేద, ధనిక తేడా లేకుండా ప్రతిఒక్కరూ తమ స్థాయికి తగ్గట్టు వీలైనప్పుడల్లా బంగారు ఆభరణాలు కొనేందుకు ప్రయత్నిస్తుంటారు. ముఖ్యంగా పెళ్లిళ్ల సీజన్లో కొత్త బంగారు ఆభరణాలు కొనేవారి సంఖ్య, అన్‌సీజన్‌లో పాత బంగారంతో కొత్త ఆభరణాలు చేయించేకునే వారి సంఖ్య ఇటీవలి కాలంలో అధికంగా ఉంటోంది. గతంలో పెళ్లినాడు ఏ నగలైతే పెట్టుకునేవాళ్లో వాటినే భద్రంగా కాపాడుకుంటూ శుభకార్యాల్లో ధరించేవాళ్లు. ప్రస్తుతం ట్రెండ్ మారింది.పాత నగలను ఫ్యాషన్‌కు అనుగుణంగా మార్చుకుంటున్నారు. ఇంతవరకు బాగానే ఉంది. అయితే కొనేటప్పుడు ఆ ఆభరణాన్ని మొత్తం బంగారం కిందే లెక్కించి వ్యాపారి డబ్బులు వసూలు చేస్తాడు. అదే కొంత కాలం తర్వాత కొన్న బంగారాన్ని కరిగించి మరో ఆభరణం తయారీ కోసమో, ఆర్థిక అవసరాల కోసం అమ్మడానికో వెళితే అసలు రంగు బయటపడుతుంది. క్యారెట్ల మోసాలు వెలుగులోకి వస్తున్నాయి. నాణ్యత తక్కువుందనో, వేస్టేజీ ఎక్కువుందనో పేర్కొంటూ వీలైనంత తక్కువ చెల్లించడం సర్వసాధారణం. ఇక వజ్రా భరణాల్లో మేలిమి బంగారం నేతి బీరలో నెయ్యి చందంగానే మారింది. కళ్ల ముందే బంగారం స్వచ్ఛతలో మాయ చేస్తున్నా నాణ్యత గుర్తించలేక వినియోగదారులు నష్టపోతున్నారు. సాక్షి హైదరాబాద్మోసం ఇలా..ప్రముఖ జ్యువెలరీస్, షాపింగ్ మాల్స్ నుంచి చిన్నపాటి స్వర్ణకారుడి షాపు వరకు కూడా 24 క్యారెట్ల కంటే తక్కువ నాణ్యత కలిగిన బంగారాన్నే విక్రయిస్తుంటాయి. ఆభరణంలో పటుత్వం కోసం రాగి కలుపుతారు. సాధారణంగా ఆభరణాలన్నీ 22 క్యారెట్లు లేదా కొంచెం తక్కువ నాణ్యత కలిగి ఉంటాయి. వజ్రాల నగ కేవలం 18 క్యారెట్‌తోనే ఉంటుంది. అయితే వ్యాపారులు 18 క్యారెట్ల అభరణాన్ని చేతిలో పెట్టి 22 క్యారెట్ల బిల్లు వసూలు చేయడం సర్వసాధరణంగా మారిపోయింది. 22 క్యారెట్లు 18 క్యారెట్ల ఆభరణానికి మధ్య గ్రాముకు కనీసం రూ.500 నుంచి రూ.1,000 వరకు వ్యత్యాసం ఉంటుంది. ఈ లెక్కన 10 గ్రాముల బంగారానికి దాదాపు రూ.10 వేల వరకు వినియోగదారులు మోసపోతున్నారన్నమాట.హాల్‌మార్క్ ముద్ర తప్పనిసరివంద శాతం స్వచ్ఛతతో కూడిన మేలిమి బంగారం బిస్కెట్ రూపంలో ఉంటుంది. కాగా బంగారు ఆభరణాల్లో స్వచ్ఛతను హాల్ మార్క్ ముద్ర తెలియజేస్తుంది. భారతీయ ప్రమాణాల మండలి (బీఐఎస్) నిబంధన మేరకు బంగారం ఉంటేనే సదరు ఆభరణంపై హాల్ మార్క్ ముద్ర ఉంటుంది. 24 క్యారెట్ల బంగారంపై 999, 23 క్యారెట్లపై 958, 22 క్యారెట్లపై 916, 21 క్యారెట్లపై 875, 18 క్యారెట్లపై 750 అని ముద్ర ఉంటుంది. ఈ నంబర్ తర్వాత హాల్ మార్క్ వేసిన సెంటర్ మార్క్ ఉంటుంది. తయారైన సంవత్సరం ఇంగ్లిష్ అక్షరం కోడ్ రూపంలో ఉంటుంది. చివరిలో బీఐఎస్ ధ్రువీకరించిన ఆభరణాల తయారీదారుల గుర్తు ఉంటుంది. ఈ హాల్‌మార్క్ ముద్ర లేని ఆభరణాల కొనుగోలులోనే మోసాలకు అవకాశం ఉంటుంది.స్వచ్ఛత...క్యారెట్లలోబంగారం స్వచ్ఛతను క్యారెట్లలో కొలుస్తారు. ఇది 0 నుంచి 24 వరకు ఉంటుంది. క్యారెట్ విలువ ఎంత ఎక్కువగా ఉంటే బంగారం అంత స్వచ్ఛత లేదా నాణ్యత కలిగి ఉన్నట్టన్న మాట. ధర కూడా ఆ మేరకే ఉంటుంది. బంగారం ఎంతో సున్నితంగా పెళుసు స్వభావంతో కూడిన లోహం. కాబట్టే ఆభరణాల తయారీలో అది గట్టిగా ఉండేందుకు రాగి, నికెల్, వెండి, పల్లాడియం లాంటి లోహాలు కలుపుతారు. బంగారం, ఇతర లోహాలు ఏ నిష్పత్తిలో ఉన్నాయనేది క్యారెట్ ద్వారా తెలుస్తోంది. అయితే వాస్తవ నిష్పత్తి, క్యారెట్ల మధ్య తేడాలు.. వ్యాపారులు, ఎప్పుడూ బంగారం కొనుగోళ్లలో మునిగి తేలేవారికి, పెట్టుబడులు పెట్టేవారికి మాత్రమే తెలిసే అవకాశం ఉంటుంది.ఆభరణంలో బంగారమెంత?కొనుగోలు చేసే బంగారు ఆభరణాలలో ఎంత బంగారం ఉందో క్యారెట్ లెక్క ద్వారా తెలుసు కోవచ్చు. ఉదాహరణకు 14 క్యారెట్ల ఉంగరాన్ని కొనుగోలు చేశారనుకోండి.. బంగారం స్వచ్ఛతను 0 నుండి 24 స్కేల్లో కొలుస్తారు కాబట్టి, 14ని 24తో భాగించాలి. అప్పుడు 0.583 వస్తుంది. అంటే మీ 14 క్యారెట్ల బంగారు ఉంగరంలో 58.3% బంగారం ఉందన్న మాట. అదేవిధంగా బంగారం స్వచ్ఛతను ఫైన్నెస్, దాని రంగును బట్టి గుర్తించొచ్చు. 24 క్యారెట్ల బంగారం మెరుస్తూ ఉంటుంది. 22 క్యారెట్ల బంగారం మెరుపు కాస్త తక్కువగా ఉండి, 24 క్యారెట్లతో పోల్చుకుంటే కొంత ముదురు రంగులో ఉంటుంది. ఇలా ఇతర లోహాల పరిమాణం పెరిగేకొద్దీ రంగు తేలిపోతుంటుంది. బంగారం తెల్లగా ఉందంటే నికెల్ ఎక్కువగా ఉందన్నమాట. క్యారెట్లు..రకాలు24 క్యారెట్లు: పూర్తి స్థాయి స్వచ్ఛత/నాణ్యత కలిగిన బంగారం. ఇందులో ఇతర లోహాలేవీ ఉండవు. అందుకే 22 క్యారెట్లు, 18 క్యారెట్ల బంగారంతో పోలిస్తే ఖరీదు ఎక్కువ. ఖరీదెక్కువ, ఆభరణానికి పనికిరాదు.. మరెందుకు ఇది అంటే బంగారంలో పెట్టుబడులు పెట్టే వారికి ఇది ఎక్కువగా ఉపయోగ పడుతుంది. కొంతమంది 24 క్యారెట్ల బంగారం (బిస్కెట్) కొని ఆభరణాలు చేయించుకుంటుంటారు.22 క్యారెట్లు: ఇందులో 22 వంతులు బంగారం ఉంటే రెండొంతుల్లో రాగి, జింక్ లాంటి లోహాలు ఉంటాయి అంటే 91.6 శాతం బంగారం, 8.4 శాతం కలిపిన ఇతర లోహాలు ఉంటాయన్న మాట. ముందే చెప్పుకున్నట్లు 24 క్యారెట్ల బంగారం కంటే దీనికి మన్నిక ఎక్కువ. కాబట్టే ఆభరణాల తయారీకి ఇది అనువైనది. సాధారణంగా 22 క్యారెట్ల బంగారంతోనే ఆభరణాలు తయారు చేస్తారు. దీనినే 916 కేడీఎం గోల్డ్ లేదా 91.6 కేడీయం గోల్డ్ అని కూడా అంటారు. 18 క్యారెట్లు: ఇందులో 18 భాగాలు పసిడి ఉంటే.. ఆరు భాగాలు ఇతర మెటల్స్ ఉంటాయి. మొత్తం మీద 75 శాతం బంగారం , 25 శాతం జింక్, రాగి, నికెల్ లాంటి లోహాలు ఉంటాయి. 24, 22 క్యారెట్ల బంగారం కంటే ఇది మరింత మన్నికగా ఉంటుంది. తక్కువ ఖర్చు అవుతుందని చాలామంది ఈ ఆభరణాలు కొంటుంటారు.14 క్యారెట్లు: ఇందులో 58.3 శాతం గోల్డ్, 41.7 శాతం ఇతర మెటల్స్ ఉంటాయి. దీనికి మన్నిక ఎక్కువ కానీ ధర చాలా తక్కువ. ఇక 12 క్యారెట్లలో 50 శాతం, 10 క్యారెట్లలో 41.7 శాతానికి మించి బంగారం ఉండదు. టంచ్ మిషన్లతో ‘పంచ్’నగ నచ్చకనో, పాతబడిందనో, కొత్త మోడల్ మార్కెట్లోకి రావడంతో మార్చుకుందామనో జ్యువెలరీ దుకాణదారుని దగ్గరకు వెళతాం. అప్పుడు పాత నగను కరిగించడం ద్వారా దాంట్లో బంగారం శాతం ఎంత ఉందో తెలుసుకోవడానికి టంచ్ మిషన్‌లో పరిశీలిస్తారు. మిషన్‌లో ముందే సవరించిన రీడింగ్‌తో బంగారం శాతాన్ని నిర్ధారణ చేస్తారు. సాధారణంగా పాత నగలో ఉన్న బంగారం శాతం కంటే 5 నుంచి 10 శాతం తక్కువగా నిర్ధారణ చేస్తుంటారు. ఇది టంచ్ మిషన్లతో జరుగుతున్న మోసం. వాస్తవానికి బంగారం నాణ్యతను, పాత బంగారంలో బంగారం శాతాన్ని నిర్ణయించేందుకు బీఐఎస్ (బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్) సంస్థ ద్వారా అనుమతి పొందిన లైసెన్స్‌దారుడి దగ్గరే నిర్ధారణ చేయాలి. కానీ ఎలాంటి అనుమతులు లేకుండా ఎక్స్–రే ఫ్లోరోసెన్స్ మిషన్ (కంప్యూటర్ అనుసంధాన యంత్రాల టంచ్ మిష¯Œన్)తో బంగారం నాణ్యత ప్రమాణాలు నిర్ధారిస్తున్నారు. అధికారిక కాగితంపై కాకుండా సాధారణ పేపర్‌పైనే ప్యూరిటీ పర్సంటేజీలను వేస్తున్నారు.బంగారు పూతనే వన్ గ్రామ్వన్ గ్రామ్ గోల్డ్ పేరుతో ఆభరణాల విక్రయం ఎక్కువ జరగడం అందరికీ తెలిసిందే. ఎంతో వ్యయం చేసి ఆభరణాలు కొనేకన్నా.. పెళ్ళిళ్లు ఇతర వేడుకల్లో ఒరిజినల్ బంగారాన్ని తలదన్నేలా కన్పించే ఆకర్షణీయమైన డిజైన్లలో ఉండే వన్ గ్రామ్ గోల్డ్ ఆభరణాలకు ఇటీవలి కాలంలో గిరాకీ పెరిగింది. వెండి, రాగితో చేసిన ఆభరణాలకు బంగారం పూత పూసి వీటిని తయారు చేస్తారు. అందుకే వీటిని వ¯Œన్ గ్రామ్ గోల్డ్‌గా వ్యవహరిస్తుంటారు. ఇమిటేషన్ (నకిలీ)జ్యువెలరీ కంటే వ¯Œన్ గ్రామ్ గోల్డ్ ఆభరణాలు ఎక్కువ కాలం రంగు పోకుండా ఉంటాయి. అంతేకానీ ఈ ఆభరణాల్లో ఒక గ్రాము బంగారాన్ని వినియోగిస్తారని కాదు. బంగారం స్వచ్ఛత ఇలా..క్యారెట్ స్వచ్ఛత24 క్యారెట్ 99.923 క్యారెట్ 95.822 క్యారెట్ 91.621 క్యారెట్ 87.518 క్యారెట్ 75.014 క్యారెట్ 58.3బంగారం నాణ్యత పరిశీలన తప్పనిసరిబంగారం కొనుగోలు చేసేటప్పుడు నాణ్యతపై అవగాహన అవసరం. నాణ్యత పరిశీలన తప్పనిసరి. చాలవరకు జ్యువెలరీస్, షాపింగ్ మాల్స్ నాణ్యతను తెలియజేసే క్యారెక్టరైజేష¯Œన్ మిషన్ వినియోగించడం లేదు. ప్రభుత్వ పరంగా తనిఖీలు నిర్వహించే సంబంధిత అధికారుల వద్ద కూడా నాణ్యతను పరిశీలించే మిషన్లు లేవు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మిషన్లు సరఫరా చేస్తే తనిఖీలతో వ్యాపారుల మోసాలకు అడ్డుకట్ట పడటంతో పాటు వినియోగదారులు చెల్లించే సొమ్ముకు తగిన నాణ్యతతో కూడిన బంగారం లభించే అవకాశం ఉంటుంది.వినియోదారుడు కూడ బంగారం నాణ్యతను అడిగాలి. అనుమానం ఉంటే నాణ్యతను పరీక్షించుకోవాలి. హాల్‌మార్క్ గుర్తును చూసిన తర్వాత మాత్రమే ఆభరణం కొనుగోలు చేయాలి. హాల్‌మార్క్ అనేది బంగారంపై ప్రభుత్వ హామీ. ఒక్కో ఆభరణాన్ని పరీక్షించి, హాల్ మార్క్ ఇచ్చేందుకు అయ్యే ఖర్చు చాలా తక్కువ.– భాస్కర్ కూచన, రిటైర్డ్ అసిస్టెంట్ కంట్రోలర్, లీగల్ మెట్రాలజీ, హైదరాబాద్ -
మనీష్ మల్హోత్రా : కళ్లు చెదిరే అల్టిమేట్ జ్యుయల్లరీ! (ఫొటోలు)
-
యూఎస్ మహిళను బురిడి.. 300 విలువ చేసే నగలను రూ. 6 కోట్లకు అమ్మి
విదేశీ మహిళను ఓ నగల వ్యాపారి నిట్ట నిలువునా మోసం చేశాడు, నాణ్యమైన బంగారు నగలపేరుతో ఒకటి కాదు రెండు కాదు ఆరు కోట్ల రూపాయల దోపిడికి పాల్పడ్డాడు. ఈ ఘోరం రాజస్థాన్‌లో వెలుగుచూసింది. వివరాలు..అమెరికాకు చెందిన చెరిష్ అనే మహిళ జైపూర్‌లోని జోహ్రీ బజార్‌లోని బంగారు దుకాణం యజమాని నుంచి బంగారు పాలిష్‌తో కూడిన బెండి అభరణాలను కొనుగోలు చేసింది. అయితే వాటికి అక్షరాల రూ. 6 కోట్లు వెచ్చించింది. డాది ఏప్రిల్‌లో యూఎస్‌లో జరిగిన ఎగ్జిబిషన్లో ఆ ఆభరణాలను ప్రదర్శించింది. ఈ క్రమంలో అవి నకిలీవని తేలింది. వాటి విలువ కేవలం రూ. 300 మాత్రమేనని తెలిసి షాక్‌కు గురైంది. వెంటనే సదరు మహిళ జైపూర్‌కి వచ్చి షాప్ యజమాని గౌరవ్ సోనీని నిలదీసింది.అయితే దుకాణం యాజమాని ఆమె ఆరోపణలను కొట్టిపాడేశాడు. దీంతో చెరిష్ జైపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అలాగే యూఎస్ ఎంబసీ అధికారుల నుంచి కూడా సహాయం కోరింది. స్పందించిన అధికారులు ఈ విషయాన్ని పరిశీలించవలసిందిగా జైపూర్ పోలీసులను కోరారు.కాగా 2022లో ఇన్స్టాగ్రామ్ ద్వారా గౌరవ్ సోనీతో పరిచయం ఏర్పడిందని.. గత రెండేళ్లుగా ఆభరణాల కోసం ₹ 6 కోట్లు చెల్లించినట్లు ఆ మహిళ పోలీసులకు తెలిపింది. ప్రస్తుతం గౌరవ్, అతని తండ్రి రాజేంద్ర సోనీ పరారీలో ఉండగా.. వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇద్దరి ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
మెథడ్ డ్రెస్సింగ్ ట్రెండ్.. ఈ బ్యూటీ ఫ్యాషన్ టాలెంట్ అదుర్స్ (ఫోటోలు)