
అగ్రగామి ఆభరణాల బ్రాండ్స్, డిజైనర్స్ పాల్గొనే హైలైఫ్ జ్యూయల్స్ ఎక్స్‌పో నగరంలో జరగనుంది

బంజారాహిల్స్‌లో గురువారం ఏర్పాటు చేసిన ఓ సమావేశంలో నిర్వాహక సంస్థ ప్రతినిధులు ఈ విషయాన్ని తెలిపారు

దాదాపు 100కు పైగా ఆభరణాల బ్రాండ్స్ అందుబాటులో ఉండే ఈ ప్రదర్శన మాదాపూర్‌లోని హెచ్‌ఐసీసీలో ఉన్న నోవోటెల్ హోటల్ వేదికగా డిసెంబరు 6న ప్రారంభమై 3 రోజులు కొనసాగుతుందని వివరించారు

ఈ సందర్భంగా జరిగిన పోస్టర్ లాంచ్ కార్యక్రమంలో ఔత్సాహిక సినీతారలు నిత్యాశెట్టి, ప్రీతి సుందర్, శ్రీ ప్రియ తదితరులు పాల్గొన్నారు

ఈ సందర్భంగా పలువురు మోడల్స్ ఆభరణాలను ప్రదర్శించారు









