exhibition
-
విజయవాడ : హై లైఫ్ ఎగ్జిబిషన్లో మోడల్స్ సందడి (ఫొటోలు)
-
భారీస్థాయిలో సిద్ధేశ్వర అగ్రికల్చరల్ షో, క్యాట్ అండ్ డాగ్ షో కూడా
సోలాపూర్: పట్టణంలోని ఓం మైదానంలో డిసెంబర్ 21 నుంచి డిసెంబర్ 25 వరకూ వ్యవసాయ ప్రదర్శన నిర్వహించనున్నట్లు శ్రీ సిద్దేశ్వర దేవస్థానం ట్రస్ట్ చైర్మన్ ధర్మరాజు కాడాది తెలిపారు. స్మార్ట్ ఎక్స్ పో గ్రూప్ నేతృత్వంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ, ఆత్మా, జిల్లా పరిషత్ విభాగం సహకారంతో ఐదు రోజుల పాటు నిర్వహించనున్న ఈ వ్యవసాయ ప్రదర్శనలో భాగంగా 300 స్టాల్స్‌ను ఏర్పాటుచేయనున్నట్లు తెలిపారు. మంగళవారం నిర్వహించిన సమావేశంలో వ్యవసాయ ప్రదర్శనకు సంబంధించిన విశేషాలను గురించి వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... వ్యవసాయ పరిశోధన కేంద్రం, సోలాపూర్ దానిమ్మ పరిశోధన కేంద్రం, జొన్న పరిశోధన కేంద్రం, వ్యవసాయ విజ్ఞాన కేంద్రం సోలాపూర్ , మోహల్ డివిజన్, సిల్క్ ఖాదీ గ్రామద్యోగ్ పరిశ్రమలు, పశుసంవర్ధక, సామాజిక అటవీ, జాతీయ బ్యాంకులు, నాబార్డ్, చక్కెర కర్మాగారాల సహకారంతో ఈ ప్రదర్శనను నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. కొత్త వ్యవసాయ సాంకేతిక ఉత్పత్తులు, వ్యవసాయ యాంత్రికీకరణ, పాల ఉత్పత్తి, సెరికల్చర్, తేనెటీగల పెంపకం, అగ్రి బిజినెస్,వర్టికల్ ఫారి్మంగ్, ఆధునిక వ్యవసాయ పనిముట్లకు సంబంధించి వివరణాత్మక సమాచారాన్ని రైతులు సులభంగా పొందగలుగుతారని చెప్పారు. ఈ వ్యవసాయ ప్రదర్శనలో సోలాపూర్‌కు గర్వకారణమైన ఖిలార్ ఎద్దులు, ఆవులతోపాటు ప్రపంచంలోనే అరుదైన, అత్యంత పొట్టి రకమైన పుంగనూరు దేశీయ ఆవులను కూడా ప్రదర్శించనున్నట్లు ధర్మరాజు కాడాది పేర్కొన్నారు. సోలాపూర్, నాసిక్, పుణే రైతులు ఉత్పత్తి చేసిన దాదాపు 500 రకాల అరుదైన దేశవాళీ విత్తనాల ప్రదర్శన, విక్రయాలను చేపట్టనున్నట్లు తెలిపారు.క్యాట్, డాగ్ షో అలాగే డిసెంబర్ 22న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు క్యాట్, డాగ్ షో పోటీలు సాయంత్రం విజేతలకు బహుమతి ప్రదానం జరుగుతుందని, డిసెంబర్ 23న రాష్ట్రస్థాయి దేశవాళీ ఆవులు, ఎద్దుల ప్రదర్శన, పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేస్తామని వివరించారు. అదేరోజున పుష్ప ప్రదర్శన కూడా జరుగుతుందని ధర్మరాజు కాడాది వివరించారుప్రదర్శనకు సంబంధించిన ఇతర విశేషాలు.. 300 కు పైగా కంపెనీల హాజరు ప్రముఖ కంపెనీల ట్రాక్టర్లు, వ్యవసాయ పనిముట్లు, వాహనాల ప్రదర్శన. భయనా నుంచి ప్రత్యేకంగా తీసుకువస్తున్న ఆరు కిలోల కోడి ప్రపంచంలోనే అతి పొడవైన దేశీయ మిరపకాయల ప్రదర్శన ప్రత్యేక హాలులో ఆర్గానిక్ ఫార్మింగ్, యానిమల్, బర్డ్, ఫ్లవర్ ఎగ్జిబిషన్ రైస్ ఫెస్టివల్, వ్యవసాయ సాహిత్య ప్రదర్శన -
హైదరాబాద్ : జ్యూయల్స్ ఎక్స్పో నగరంలో మెరిసిన మోడల్స్ (ఫొటోలు)
-
ఫ్యాషన్ ఎగ్జిబిషన్ మెరిసిన సీరత్ కపూర్, సాన్వే మేఘనా (ఫొటోలు)
-
హైదరాబాద్ శిల్పారామంలో జానపద జాతర.. ప్రజలందరికీ ఉచిత ప్రవేశం
భారతీయ సాంస్కృతిక వారసత్వం ప్రతిబింబించేందుకు వేడుక సిద్ధమైంది. ‘లోక్ మంథన్’ పేరుతో నవంబర్ 21 నుంచి 24 వరకు మహోత్తరమైన ‘జానపద జాతర‘ హైదరాబాద్ శిల్పారామంలో కనుల విందు చేయనున్నది. ‘ప్రజ్ఞా ప్రవాహ్’ సంస్థ 2016 నుంచి ప్రతి రెండేళ్లకోసారి దేశంలోని ఒక్కో రాష్ట్రంలో లోక్ మంథన్ కార్యక్రమం నిర్వహిస్తోంది. విదేశాల నుంచి సైతం ఒక్కో తెగ, ఒక్కో జాతికి సంబంధించిన ఆచార వ్యవహారాలను ప్రతిబింబించే కళాకారులు దాదాపు 1500 మంది ఈ ‘జానపద జాతర’లో తమ కళలను ప్రదర్శిస్తారు. భిన్నత్వంలో ఏకత్వం చాటే ఈ మేళా ప్రారంభోత్సవానికి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు హాజరవుతారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అగ్ర నేత మోహన్ భాగవత్‌తో పాటూ అనేకమంది కేంద్రమంత్రులూ వస్తున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లోక్‌మంథన్ ఆహ్వాన కమిటీ గౌరవ అధ్యక్షులుగా కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నారు.భారతీయ జానపద కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనల ద్వారా ఈ దేశమంతా ఒకటేననే ఏకత్వాన్ని నిరూపించడమే లోక్ మంథన్ ప్రధాన లక్ష్యం. ‘జాతీయ గిరిజన గౌరవ దివస్’ పేరుతో భగవాన్ బిర్సా ముండా 150వ జయంతి పురస్కరించుకొని నిర్వహించే ఈ వేడుక మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. సదస్సులు, సమావేశాల ఆధారంగా ప్రపంచంలోని వనవాసి, గిరివాసి సమస్యలను చర్చించి, వాటి పరిష్కారానికి మార్గాన్ని కూడా అన్వేషిస్తారు. సంప్రదాయ సాంస్కృతిక వాయిద్యాలు, పనిముట్లు ప్రదర్శిస్తారు. ఈ జాతరలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయ సాంస్కృతిక వారసత్వానికి చెందినవారు కూడా వచ్చి ప్రదర్శనలిస్తారు.ఇండోనేషియా కళాకారులు రామాయణం ఆధారంగా ప్రదర్శించే ‘కేచక్’ నృత్య ప్రదర్శన ఆకట్టుకుంటుంది. ప్రపంచంలో అబ్రహామిక్ మతాలకు పూర్వమున్న మతాలు, సంస్కృతుల వారు సైతం లోక్‌మంథన్‌కు హాజరవుతున్నారు. వీరిలో సిరియాలోని రోమోలు, ఆర్మేనియాలోని యజిదీలు (సూర్యపుత్రులు), లిథువేనియా వాసులు సైతం ఉన్నారు. అబ్రహామిక్ మతాల రాకకు పూర్వం ఆయా దేశాలలో అచరించిన, నేటికీ ఆచరిస్తున్న సూర్యారాధన, యజ్ఞం (అగ్నిని పూజించడం) నిర్వహణ విధానాలను వీరు హైదరాబాద్ లోక్‌మంథన్‌లో చేసి చూపిస్తారు. చదవండి: మణిపుర్ ఘర్షణలకు ముగింపెప్పుడు?ఈ సందర్భంగా జరిగే ఎగ్జిబిషన్లో తెలంగాణ, త్రిపుర, ఛత్తీస్‌గఢ్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్‌తో సహా 10 రాష్ట్రాలకు చెందిన విభిన్న కళలు, సంప్రదాయ ఆహారం, సంప్రదాయ గ్రామీణ క్రీడలు, సాహిత్యం, ఇతర సాంస్కృతిక అంశాలౖపై చర్చలు ఉంటాయి. భారతీయ ప్రజలు ఏ ప్రాంతంలో నివసిస్తున్నా... వారి అందరి సాంస్కృతిక పునాదులు జానపదంలోనే ఉన్నాయి. మన మూలాలను ఒకసారి అందరికీ చాటిచెప్పే లక్ష్యంతో జరుగుతున్న ఈ జాతరకు అందరూ ఆహ్వానితులే. ఉత్సవాలు జరిగే నాలుగు రోజులూ శిల్పారామంలోకి ప్రజలందరికీ ఉచిత ప్రవేశం ఉంటుంది.– పగుడాకుల బాలస్వామి; ప్రచార ప్రసార ప్రముఖ్, వీహెచ్‌పీ, తెలంగాణ రాష్ట్రం(నేటి నుంచి ‘లోక్ మంథన్’ ప్రారంభం) -
ఫ్యాషన్ ఎగ్జిబిషన్లో మెరిసిన నటి దివి, దీక్షా పంత్ (ఫొటోలు)
-
1500 కళాకారులు.. 350 ఎగ్జిబిట్స్, 100 స్పీకర్స్, 12 దేశాలు
సాక్షి, హైదరాబాద్: రెండేళ్లకోసారి ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ‘లోక్ మంథన్’ వేడుకలకు సర్వం సిద్ధమైంది. భారతీయ జానపద సాంస్కృతిక ఉత్సవాలను ఈ నెల 21 నుంచి 24 వరకు నిర్వహించనున్నారు. కార్యక్రమానికి దేశం నలుమూలల నుంచి ప్రముఖులు, సుమారు 2 వేల మందికి పైగా జానపద కళాకారులు తరలి రానున్నారు. ఇప్పటికే ప్రీ లోక్ మంథన్ పేరిట అవగాహన సదస్సులను, ప్రచార కార్యక్రమాలను చేపట్టారు. దేశంలో విశిష్టమైన ప్రజాస్వామ్య వ్యవస్థ అమలులో ఉండేదని, విదేశీయుల దండయాత్రల కారణంగా గ్రామీణ ప్రజలకంటే పట్టణవాసులు ఉన్నతులుగా భావించే వివక్ష ఏర్పడిందని, ఈ నేపథ్యంలో గ్రామీణ విజ్ఞానం నిర్లక్ష్యానికి గురైందని లోక్ మంథన్ నిర్వాహకులు భావిస్తారు. అందుకే ప్రకృతి జానపదుల గొప్పతనాన్ని లోకానికి చాటిచెప్పే లక్ష్యంతోనే ‘లోక్ మంథన్’ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. జానపదుల విశ్వాసాలు, జీవన విధానం, దృక్పథం, వేల ఏళ్లుగా సమాజాన్ని ఏలిన వ్యవస్థల వివరాలను వెలికి తీసుకురావాలనేదే లోక్‌మంథన్ ఉద్దేశం. ప్రజ్ఞా భారతి ఆధ్వర్యంలో ఈ లోక్‌మంథన్ వేడుకలు ఇప్పటి వరకు రాంచీ, భోపాల్, గువాహటి, తదితర నగరాల్లో ఘనంగా జరిగాయి. భాగ్యనగరం వేదికగా.. ఈ బృహత్తర కార్యక్రమానికి హైదరాబాద్ నగరం వేదిక కానుంది. సంగీతం, నృత్యం, కళలు, క్రీడలు, ఆహారం, ఆరోగ్యం, ఆధ్యాత్మికత తదితర అంశాలపై సమాలోచనల సమాహారమే లోక్‌మంథన్. అర్మేనియా, లూథియానా వంటి దేశాల మూల సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే పలు కళా ప్రదర్శనలు, సమాలోచనలు చేసేందుకు వేలాది మంది తరలిరానున్నారు. బాలి నుంచి పద్మశ్రీ గ్రహీత వాయన్ దిబియా తన బృందంతో కలిసి రామాయణ ఇతిహాసం ప్రదర్శించనున్నారు.చదవండి: ఒత్తయిన జుట్టు.. ఒత్తిడితో ఫట్టునగరీకరణ కారణంగా అస్తిత్వాన్ని మరిచిపోతున్న నేటి తరానికి భారతీయ సామాజిక జీవిత మూలాలను తెలియజేసే ప్రయత్నమే లోక్ మంథన్. మన వ్యవస్థలో మొదటి నుంచి అడవి బిడ్డల సంస్కృతి, సంప్రదాయాలకు ప్రముఖ స్థానం ఉండేది. కానీ కాలక్రమేణా ఆ సంస్కృతి మరుగునపడింది. దీంతో అసలైన భారతీయతను నగర ప్రజలకు తెలియజేసేందుకు దేశంలోని వివిధ నగరాల్లో లోక్ మంథన్ నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌లో జరిగే ఈ లోక్‌మంథన్‌కు దేశ విదేశాలకు చెందిన వందలాది మంది కళాకారులు, మేధావులు, పరిశోధకులు హాజరుకానున్నారు.మనది అడవి బిడ్డల సంస్కృతి నగర ప్రజలు కెరీర్ వైపు, ఆధునికత వైపు విస్తారంగా పరుగులు తీస్తున్నారు. సమాజాన్ని ప్రభావితం చేస్తున్న ఈ సమూహానికి.. మన సమాజం మూలాలను గుర్తు చేసే ప్రయత్నమే లోకమంథన్. మన భారతీయల వ్యవస్థలో మొదటి నుంచీ అడవి బిడ్డల సంస్కృతి, సంప్రదాయాలకు ముఖ్యమైన స్థానం ఉండేది. కానీ కాలక్రమేణా అది మరుగున పడిపోయింది. అందుచేత అసలైన భారతీయతను నగర ప్రజలకు తెలియచెప్పేందుకు దేశంలోని వివిధ నగరాలలో లోక మంథన్ నిర్వహిస్తున్నాం. – నందకుమార్, ప్రజ్ఞా ప్రవాహ్ అఖిల భారతీయ కన్వీనర్ -
కళింగలో పట్టు ప్రదర్శన
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 కళింగ కల్చరల్ హాలు వేదికగా ప్రతిష్టాత్మక ‘జాతీయ పట్టు వస్త్ర ప్రదర్శన’ ఆదివారం ప్రారంభమైంది. ఈ ప్రదర్శణను రాష్ట్రీయ గౌరవ్ అవార్డ్స్ ఫౌండర్, ఆక్యుపేషనల్ హెల్త్ ఎన్విరాన్మెంటల్ సేఫ్టీ ఆఫీసర్ సాత్విక గుప్తా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కళింగ కల్చరల్ హాలులో కొలువుదీరిన చేనేత కారులు వస్త్రోత్పత్తులు మన సాంస్కృతిక వైభవానికి నిదర్శనంగా నిలుస్తున్నాయని తెలిపారు. భారతీయ సంస్కృతిలో పట్టు, హ్యాండ్లూ్యమ్స్ వ్రస్తోత్పత్తులకు ఎంతో ప్రత్యేకత ఉందని సాతి్వక గుప్తా అన్నారు. ఈ సందర్భంగా చేనేత కారులతో వాటి తయారీ విధానం, ప్రత్యేకత గురించి తెలుసుకున్నారు. అనంతరం జాతీయ పట్టు వస్త్ర ప్రదర్శన నిర్వాహకులు జయేష్ గుప్తా మాట్లాడుతూ.. ఈ నెల 17 వరకూ కొనసాగుతున్న ప్రదర్శనలో దేశంలోని 14 రాష్ట్రాలకు చెందిన చేనేత కారులు, చేతిపని బృందాలు తమ సిల్క్ హ్యండ్లూమ్ చీరలు, డ్రెస్ మెటీరియల్స్ వంటి 75 వేల రకాల ఉత్పత్తులను అందుబాటులో ఉంచారని వివరించారు. -
హైదరాబాద్‌లో ‘డిజైన్ డెమోక్రసీ’ ప్రారంభం
హైదరాబాద్: ఎంతగానో ఎదురుచూస్తున్న డిజైన్ ఫెస్టివల్ ‘డిజైన్ డెమోక్రసీ 2024’ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. నగరంలోని హైటెక్స్‌లో ప్రారంభమైన ఈ ప్రదర్శన అక్టోబర్ 4 నుండి 7వ తేదీ వరకు నాలుగు రోజులపాటు కొనసాగనుంది.తెలంగాణ ఐటీ, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్స్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్‌తో కలిసి బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్, ఫీక్కీ ఫ్లో మాజీ చైర్పర్సన్ పింకీ రెడ్డి, డిజైన్ డెమోక్రసీ వ్యవస్థాపకులు పల్లికా శ్రీవాస్తవ్, శైలజా పట్వారీ ప్రారంభించారు.తెలంగాణ మ్యూజియం బ్రాండ్ డైరెక్టర్ మాన్సీ నేగి, క్యూరేటర్ సుప్రజా రావుతో కలిసి డిజైన్ డెమెక్రసీ వ్యవస్థపాకులు పల్లికా శ్రీవాస్తవ్, శైలజా పట్వారీ, అర్జున్ రాఠీ నిర్వహిస్తున్న ఈ ఫెస్టివల్ అసాధారణ సృజనాత్మక ప్రతిభ, వినూత్న ప్రదర్శనల వేదికగా నిలిచింది. -
ఆధునికత, హస్తకళా నైపుణ్యం మేళవింపుతో గౌరాంగ్ హోం ‘నీల్’ కలెక్షన్ ఎగ్జిబిషన్
హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ టెక్స్టైల్ డిజైనర్ గౌరంగ్ సరికొత్త కలెక్షన్‌ను లాంచ్ చేశారు. జాతీయ అవార్డు ఫ్యాషన్ డిజైనర్ గౌరంగ్ షా, సాంప్రదాయ భారతీయ వస్త్రాలు , హస్తకళలు, జమ్దానీ కళను పునరుద్ధరించే ప్రక్రియలో భాగంగా "గౌరంగ్ హోమ్"లోని "నీల్" పేరుతో తొలి కలెక్షన్‌ను ప్రారంభించినట్లు ప్రకటించారు. ఇందులో ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఫర్నిచర్, ఫర్నీషింగ్లు , పింగాణీ వస్తువులు ప్రదర్శనకుంటాయి. నాణ్యత, టైమ్‌లెస్ డిజైన్‌కు ప్రాధాన్యతినిస్తూ, సాంప్రదాయ హస్తకళ లేటెస్ట్ ట్రెండ్ మిళితమై ఈ వస్తువులు కొలువు దీరతాయి."గౌరంగ్ హోమ్" ద్వారా ఇంటీరియర్ డిజైన్ సేవల్లోకి ప్రవేశిస్తూ, కాన్సెప్ట్-టు-ఫినిష్ స్టైల్లో ఇంటిని అందంగా తీర్చిదిద్దు కోవడంలో పాపులర్ డిజైన్ ఫిలాసఫీని ప్రతిబింబించేలా హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో “గౌరంగ్ హోమ్” కలెక్షన్ ఎగ్జిబిషన్ అక్టోబరు 4న ప్రారంభం కానుంది. ఉదయం 10:30 నుండి సాయంత్రం 6:00 వరకు అందుబాటులో ఉంటుంది.'నీల్' కలెక్షన్లోని ప్రతి భాగం ఆ కళ గురించి మాత్రమే కాకుండా, దానిని తయారు చేసిన శిల్పి నైపుణ్యాన్ని తెలిపుతూ,ఈ కలెక్షన్ మీ ఇంటిని నిజంగా ప్రత్యేకంగా చేస్తుంది అంటారు గౌరాంగ్. ఇండియన్ ఇంటీరియర్స్ కోసం ఇదొక కొత్త అధ్యాయమన్నారు. నీల్ కలెక్షన్స్‌లో ఫర్నిషింగ్స్, బెడ్‌స్ప్రెడ్‌లు, కంఫర్టర్లు, దిండు కవర్లు , టేబుల్ లినైన్స్ సిగ్నేచర్ స్టైల్లో ఉంటాయి. ఇందులో జమ్దానీ నేత, హ్యాండ్ ఎంబ్రాయిడరీ చికాన్, కసౌటి, సుజినీ కళాత్మకతతో ఇండిగో (నీలిరంగు)కలర్లో ఆకట్టుకుంటాయి.అందానికి, ఆరోగ్యానికి తగినట్టుగా శతాబ్దాల రాగి ,తగరంతో తయారు చేసిన శతాబ్దాల నాటి వస్తువలను సిరామిక్‌తో తయారు చేసిన క్రోకరి మరో ప్రత్యేక ఆకర్షణగా ఉండబోతున్నాయి. ఇందులో పురాతన కుండల వినియోగానికి ప్రతీకగా, చేతితో తయారు చేసిన డిన్నర్వేర్ ఉంటుంది. ప్రతీ వస్తువును ప్రపంచవ్యాప్తంగా లభించే మట్టితో తయారు చేయడం విశేషం.ఈ వెంచర్ ద్వారా, తన ప్రసిద్ధ డిజైన్ ఫిలాసఫీని జీవితానికి తీసుకురావాలనేదే గౌరంగ్ లక్ష్యం. భారతదేశ చేనేత సంప్రదాయాలను పరిరక్షించడం, పర్యావరణ అనుకూల పదార్థాలు, సహజ రంగులు, సాంప్రదాయ పద్ధతులు,కళాకారుల నైపుణ్యాన్ని మెచ్చుకునేలా పర్యావరణ స్పృహ ఉన్న ఔత్సాహిక గృహాలంకరణ వినియోగదారులను ఆకట్టుకోనుంది. -
హైలైఫ్ ఎగ్జిబిషన్లో సందడి చేసిన నటి సీరత్ కపూర్, మోడల్స్..(ఫొటోలు)
-
హెచ్ఐసిసి లో జరిగిన హైలైఫ్ ఎగ్జిబిషన్ లో ముద్దుగుమ్మల సందడి (ఫొటోలు)
-
హైదరాబాద్ హెచ్ఐసీసీలో.. హైలైఫ్ ఎగ్జిబిషన్!
మాదాపూర్: ప్రముఖ డిజైనర్లు రూపొందించిన వ్రస్తాభరణాలు సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. మాదాపూర్‌లోని హెచ్ఐసీసీలో మూడు రోజుల పాటు కొనసాగనున్న హైలైఫ్ ఎగ్జిబిషను నటి శ్రవంతి చొకరపు, మాలవిక శర్మ నిర్వాహకుడు డొమినిక్‌తో కలసి మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వివాహాది శుభకార్యాలకు ప్రత్యేక డిజైన్లతో కూడిన వ్రస్తాభరణాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. దేశంలోని 350 మంది డిజైనర్లు రూపొందించిన వ్రస్తాభరణాలు స్టాల్స్‌లో అందుబాటులో ఉన్నాయని నిర్వాహకులు తెలిపారు. గృహాలంకరణ ఉత్పత్తులు, వధువరులకు ఆకర్షణీయమైన ఉత్పత్తులు ఉన్నాయని నిర్వాహకులు తెలిపారు. నటి ప్రీతి సుందర్ తో పాటు పులవురు మోడల్స్, డిజైనర్లు పాల్గొన్నారు. -
25, 26న స్టైల్ పితార ఫ్యాషన్ ఎగ్జిబిషన్
8 ఏళ్లుగా క్రియేటీవ్ ఆర్ట్స్ ఆధ్వర్యంలో స్టైల్ పితార ఫ్యాషన్ లైఫ్ స్టైల్ ఎగ్జిబిషన్‌ను నిర్వహిస్తున్నట్లు ప్రతినిధులు రమారాటి, వైశాలి ఇనాని, మీనల్ శారద, వినిత బల్దువలు పేర్కొన్నారు. కోఠిలోని కార్యాలయంలో సోమవారం స్టైల్ పితార పోస్టర్‌ను ఆవిష్కరించారు. గృహిణులు వారి ప్రతిభతో తయారు చేసిన ఉత్పత్తులను వారే స్వయంగా స్టాళ్లలో ప్రదర్శించే అవకాశం ఉందన్నారు. సామాజికంగా, ఆధ్యాతి్మకంగా క్రియేటివ్ ఆర్ట్స్ చారిటీ సంస్థ ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తుందన్నారు. ఈ నెల 25, 26 తేదీల్లో రెండు రోజుల పాటు రామ్‌కోఠిలోని కచి్చభవన్లో ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. ఈ ఎగ్జిబిషన్‌ను ప్రముఖ సంఘ సేవకురాలు భగవతి మహేష్ బలద్వా, ప్రముఖ వైద్యురాలు డాక్టర్ శ్వేత అగర్వాల్ ప్రారంభిస్తారన్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన మహిళలు ప్యాషన్ డిజైనింగ్, పేపర్ స్టాల్స్, ఫుడ్‌స్టాల్స్, గేమ్స్, జువెలరీ, హ్యాండీ క్రాప్్ట, ఫుడ్ ఐటమ్స్ 100కుపైగా స్టాళ్లలో ఏర్పాటు చేయనున్నారు. -
హైదరాబాద్: హైలైఫ్ ఎగ్జిబిషన్లో సందడి చేసిన ముద్దుగుమ్మలు (ఫోటోలు)
-
Fish Prasadam 2024 : చేప ప్రసాదం కోసం పోటెత్తిన జనాలు (ఫొటోలు)
-
ఇండియా ఆర్ట్ ఫెస్టివల్ (ఫొటోలు)
-
ముత్యాల నగరంలో మత్స్యకన్యలు
సాక్షి, హైదరాబాద్: మత్స్యకన్యలు, సాగర కన్యల గురించి కథలుగా చెప్పుకోవడం, సినిమాల్లో చూడటం తప్ప నిజంగా వారిని చూసిన వారెవరూ లేరు. అయితే ఈ జల కన్యలు ఉన్నది వాస్తవమో కాదో కానీ... హైదరాబాద్ నగరానికి చేరుకున్న మత్స్య కన్యలు మాత్రం అందరినీ ఆశ్చర్యచకితులను చేస్తున్నారు. దేశంలో మొట్టమొదటిసారిగా కూకట్‌పల్లిలో ఏర్పాటు చేసిన అండర్ వాటర్ టన్నెల్ డబల్ డెక్కర్ ఎగ్జిబిషన్ మెర్మెయిడ్ షోలో మనం చూస్తుంది నిజమేనేమో అనిపించేలా మత్స్యకన్యలు ఆకట్టుకుంటున్నారు. ఫిలిప్పీన్ సాగర కన్యలు.. అమెజాన్ చేపలు.. అండర్ వాటర్ టన్నెల్ డబల్ డెక్కర్‌ను ఏర్పాటు చేసి, అందులో అరుదైన చేపల ప్రదర్శన, స్కూబా డైవింగ్ వంటి వినూత్న ప్రదర్శనలు ఏర్పాటు చేయడం నగరవాసులకు పరిచయమే. కానీ ఊహాజనిత కథలుగా చెప్పుకునే సాగరకన్యలు, హాలీవుడ్ సినిమాల్లో అందంగా కనిపించే మత్స్యకన్యల ప్రదర్శన మాత్రం దేశంలోనే ఇదే మొదటిసారి.దీని కోసం పసిఫిక్ మహాసముద్రంలో ప్రదర్శననిచ్చే ఫిలిప్పీన్‌కు చెందిన ఆరుగురు యువతులు నగరానికి చేరుకున్నారు. మర్మెయిడ్గా పిలుచుకునే వీరు జల కన్యల వస్త్రధారణతో 8 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అండర్ వాటర్ టన్నెల్లో ఆక్సిజన్ లేకుండా ప్రదర్శన చేయడం సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తుంది. ఈ మమెడ్ షోలు గతంలో దుబాయ్, థాయ్‌లాండ్, హాంకాంగ్ వంటి దేశాలకు మాత్రమే పరిమితం. ఈ అండర్ వాటర్‌లో సింగపూర్, మలేసియాతో పాటు అమెజాన్ నది నుంచి తీసుకువచి్చన 600 అరుదైన చేపలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. అంతేకాకుండా ఇక్కడి స్కూబా డైవింగ్ కూడా మంచి అనుభూతిని అందిస్తుంది. మరో 37 రోజుల వరకు ఈ ప్రదర్శన జరగనుందని నిర్వాహకులు తెలిపారు. విజ్ఞానం, వినోదమే లక్ష్యంగా.. విదేశాల్లో మాత్రమే చూడగలిగే మెర్మెయిడ్ షోను కోట్ల రూపాయల వ్యయంతో, ఎంతో వ్యయప్రయాసలకోర్చి నగరంలో ఏర్పాటు చేశాం. ఎగ్జిబిషన్ రంగంలో మాకు 39 ఏళ్ల అనుభవం ఉంది. ప్రజలకు అద్భుత అనుభూతిని అందించేందుకు ఫిలిప్పీన్స్ నుంచి జలకన్యలను తీసుకువచ్చాం. ఆక్సిజన్ లేకుండా నిమిషానికిపైగా నీటిలోనే ఉంటూ ప్రదర్శన ఇవ్వడం అరుదైన కళ. వీటితో పాటు 27కు పైగా అమ్యూజ్మెంట్ గేమ్స్ ఉన్నాయి. ముఖ్యంగా విద్యార్థులకు విజ్ఞానం, వినోదం అందిస్తున్నాం. ప్రతి రోజూ ఉదయం 11 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ప్రదర్శన కొనసాగుతుంది. షో మాత్రం మధ్యాహ్నం 3 గంటల నుంచి అందుబాటులో ఉంటుంది. – రాజారెడ్డి, నిర్వాహకుడు -
Hyderabad: సూత్ర ఎగ్జిబిషన్లో మెరిసిన మోడల్స్ (ఫొటోలు)
-
ముగిసిన నుమాయిష్
అబిడ్స్: ఎగ్జిబిషన్ (నుమాయిష్) ఆదివారంతో ముగిసింది. 83వ అఖిలభారత పారిశ్రామిక ప్రదర్శనశాల జనవరి 1వ తేదీన ప్రారంభమై ఫిబ్రవరి 18వ తేదీ రాత్రి వరకు కొనసాగింది. ప్రతి సంవత్సరం 46 రోజులు కొనసాగే ఎగ్జిబిషన్ ఈసారి 49 రోజుల పాటు కొనసాగింది. ముగింపు రోజు ఆదివారం మధ్యాహ్నం నుంచే సందర్శకులు భారీగా తరలివచ్చారు. సుమారు 70 వేల మంది వచి్చనట్లు బుకింగ్ కన్వీనర్ చంద్రశేఖర్ తెలిపారు. 49 రోజుల్లో మొత్తం 22 లక్షల మంది నుమాయి‹Ùకు వచ్చినట్లు అంచనా. 2,400 స్టాళ్లను ఏర్పాటు చేశామని, కనువిందు చేసేలా పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించామని సొసైటీ ఉపాధ్యక్షుడు వనం సత్యేందర్, కార్యదర్శి హన్మంతరావు, జాయింట్ సెక్రటరీ స్వర్ణజిత్ సింగ్, కోశాధికారి రాజేంద్రకుమార్‌లు తెలిపారు. గోషామహల్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ మహేష్ గౌడ్ ఆధ్వర్యంలో బందోబస్తు పర్యవేక్షించారు. -
ప్రియాంక గాంధీ కుమారుడు రైహాన్ వాద్రా సోలో ఫోటోగ్రఫీ ఎగ్జిబిషన్!
ఫోటోగ్రఫీ అనేది కేవలం ఒక ఛాయ చిత్రం కాదు. తీసిన ఫోటోలోని కళాత్మక దృష్టితో అర్థమయ్యేలా లేదా వివరించేలా ఉండాలి. నిజానికి అవి చూడగానే మనస్సులో ఏదో తెలియని అనుభూతి, ఆనందం కలుగుతుంది. ప్రకృతిలోని అద్భుతాలను చిన్న కెమెరాతో గొప్పగా భలే బంధించారే అనిపిస్తుంది. అందుకు ఆ వ్యక్తిలో మంచి సృజనాత్మకతో కూడిన నైపుణ్యం ఉండాల్సిందే. ఇక ఆయా ఫోటోలను సోలోగా లేదా గ్రూప్‌గా ప్రదర్శించడం అనేది కూడా ఓ ఆర్టే. ఎందుకంటే? ప్రేక్షకులను ఆక్టటుకునే థీమ్ తోపాటు వారు అటెన్షన్ పెట్టి చూసేలా సరైన క్యాచీ టైటిల్‌తో ఈవెంట్ నిర్వహించాలి. అప్పుడే ఆ ప్రదర్శన పూర్తి స్థాయిలో విజయవంతమవుతుంది. ఇప్పుడూ ఇదంతా ఎందుకు చెబుతున్నాననంటే ఇలాంటి ఫోటోగ్రఫిక్ ఎగ్జిబిషన్‌ని ప్రియాంక గాంధీ కుమారుడు రైహాన్ వాద్రా గత నెల జనవరి 28 నుంచి ఫిబ్రవరి 3 వరకు నిర్వహించారు. ఆ పోటోలు ఎంతగా అలరిస్తున్నాయంటే.. రైహన్ వాద్రా తన సోలో ఫోటో గ్యాలరీ ఎగ్జిబిషన్ బికనీర్ హౌస్‌లోని లివింగ్ ట్రేడిషన్స్ సెంటర్ వేదికగా నిర్వహించారు. అందులోకి అడుగు పెట్టగానే మేఘాలపై నడుస్తున్నట్లు అనిపిస్తుంది. ఆకాశమే నేలగా మారిందా! అన్నంత అద్భుతంగా ఉంటుంది. ఆయన ఈ ఎగ్జిబిషన్‌ని 'ఉపమాన'(పోలిక) అనే వైవిధ్య భరితమైన టైటిల్‌తో నిర్వహించారు. ఆ టైటిల్ తగ్గట్టుగానే ఆ ఫోటోలు ఒక దానికి మించి ఒకటి ఉండటం విశేషం. ఇదేమీ అతని తొలి సోలో ప్రదర్శన కాదు. రైహాన్ సోలో ఎగ్జిబిషన్ 'డార్క్ పర్సెప్షన్ యాన్ ఎక్స్పోజిషన్ ఆఫ్ లైట్, స్పెస్ అండ్ టైమ్' పేరుతో 2021లో నిర్వహించడం జరిగింది. రైహాన్ 8 ఏళ ప్రాయం నుంచి ఫోటోలు తీయడం ప్రారంభించారు. అతను విజువల్ అండ్ ఇన్స్టాలేషన్ ఆర్టిస్ట్ ఫోటోగ్రాఫర్ అని పిలిపించుకునేందుకే ఇష్టపడతాడు. ఆయన తన తాతయ్య రాజీవ్ గాంధీ వలే అందమైన వన్యప్రాణులను కెమెరాలో బంధించడం అంటే మక్కువ. ఇక వాద్రా నిర్వహించిన ఈ ఎగ్జిబిషన్లో ఒక గది మొత్తం రాజస్తాన్‌లోని అభయ అరణ్యాల్లో క్లిక్ చేసిని చిరుతపులి ఫోటో చూస్తే..చెట్లతో ఆవాసం ఏర్పరుచుకున్నట్లు కనిపిస్తుంది. ఇక ఇతర గదుల్లో లైఫ్ సైజ్ మిర్రర్లతో వ్యక్తుల వ్యక్తీకరణ ఫోటోగ్రాఫ్‌లు ఉన్నాయి. నిజానికి ఈ ఆర్ట్ చాలా శక్తిమంతమైన ట్రిక్. అన్ని వర్గాలప్రజల హవాభావాలను తనదైన శైలిలో కెమరాతో బంధించే కళ. ఇది గ్రహణ శక్తికి సంబంధించిన ఆర్ట్ అని చెప్పొచ్చు. ఈ ఎగ్జిబిషన్ రైహాన్ నిర్వహిస్తున్న ఐదు వరుస సోలో ప్రదర్శనల్లో ఒకటి. ఈ ప్రదర్శన తెలియని దానిని తెలిసిన వాటితో పోల్చగలిగే మహత్తర ఊహతీత జ్ఞానం గురించి చెబుతుంది. ఇక రైహాన్ కేవంలో సోలో ప్రదర్శనలే కాకుండా దేశంలోని వివిధ ప్రాంతాల్లో గ్రూప్ ప్రదర్శనల్లో కూడా పాల్గొన్నారు. (చదవండి: నరకం ఎలా ఉంటుందో చూడాలనుకుంటే ఈ పార్క్‌కి వెళ్లాల్సిందే!) -
భళా.. బాల మేధావులు
సాక్షి, అమరావతి: విజయవాడలో నిర్వహిస్తున్న ‘సదరన్ సైన్స్ ఎగ్జిబిషన్’ సందర్శకులను ఆకట్టుకుంటోంది. ప్రభుత్వ విద్యార్థుల్లో దాగివున్న శాస్త్ర, సాంకేతిక సామర్థ్యాలను ఎలుగెత్తి చాటుతోంది. ఏపీ పాఠశాల విద్యాశాఖ, విశ్వేశ్వరయ్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నలాజికల్ మ్యూజియం, కర్ణాటక సాంస్కృతిక మంత్రిత్వ శాఖ సంయుక్త ఆధ్వర్వంలో ఫిబ్రవరి 1వ తేదీ వరకు 6 రోజులపాటు ఎగ్జిబిషన్ కొనసాగనుంది. ఆంధ్రప్రదేశ్‌తోపాటు తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ, పాండిచ్చేరి రాష్ట్రాలకు చెందిన ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు రూపొందించిన 210 ప్రాజెక్ట్‌లను ఇక్కడ ప్రదర్శనకు ఉంచారు. అత్యుత్తమ ప్రదర్శనలను జాతీయ పోటీలకు ఎంపిక చేయనున్నారు. 2023–24 విద్యా సంవత్సరంలో 8 నుంచి 10 తరగతులు చదువుతున్న విద్యార్థులు రూపొందించిన సైన్స్ నమూనాలకు ఇక్కడ అవకాశం కల్పించారు. రాష్ట్రం నుంచి ప్రభుత్వ పాఠశాలలకు చెందిన విద్యార్థులు రూపొందించిన 30 నమూనాలు సైతం ప్రదర్శనలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సోమవారం సమీప జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఎగ్జిబిషన్‌కు తరలివచ్చారు. తమ వయసు విద్యార్థులు రూపొందించిన సైన్స్ నమూనాలను తిలకించి, ఆసక్తిగా వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు ప్రోత్సాహం అందించేందుకే.. సైన్స్ రంగంలో విద్యార్థులకు ప్రోత్సాహం అందించేందుకు సైన్స్ ఫెయిర్ ఎంతో ఉపయోగపడుతుందని ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ ప్రతాప్‌రెడ్డి తెలిపారు. సదరన్ సైన్స్ ఎగ్జిబిషన్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మేథమెటిక్స్, భూమి/అంతరిక పరిజ్ఞానం, పర్యావరణం, ఇంజినీరింగ్, అగ్రి, బయో సైన్స్, కంప్యూటర్ సైన్స్ విభాగాల్లో ప్రజా సమస్యలకు పరిష్కారం చూపే అంశాలకు చోటు కల్పించామన్నారు. న్యాయ నిర్ణేతలు ఉత్తమ ప్రదర్శనలను గుర్తించి జాతీయ పోటీలకు ఎంపిక చేస్తారని వివరించారు. తక్కువ ఖర్చు.. ఆదాయం హెచ్చు ఈ చిత్రంలో కనిపిస్తున్న కె.హేమమాధురి, పి.పావని చిత్తూరు జిల్లా పెదపంజానిలోని మహత్మా జ్యోతిబా పూలే బీసీ గురుకుల బాలికల పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నారు. ఇద్దరూ రైతుకు మేలు చేసే సమగ్ర వ్యవసాయ (ఇంటిగ్రేటెడ్ పారి్మంగ్) విధానాన్ని రూపొందించారు. తక్కువ ఖర్చుతో పంటలు పండిస్తూనే.. ఎరువుల ఖర్చు లేకుండా అదనపు ఆదాయంతో పాటు ఎక్కువ లాభాలు వచ్చే ప్రాజెక్ట్‌కు రూపకల్పన చేశారు. ఇందుకు సంబంధించిన అన్ని అంశాలను అనర్గళంగా వివరిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుకుని, ఇంగ్లిష్ ప్రావీణ్యం ప్రదర్శిస్తూ.. సదరన్ సైన్స్ ఫెయిర్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. ఆపదలో ఆదుకునే తుపాకీ సైనికులు, ఫారెస్ట్ సిబ్బంది, అగ్నిమాపకదళ సిబ్బంది విపత్కర పరిస్థితుల్లో పనిచేస్తుంటారు. ఒక్కోసారి దారి తప్పడమో, మంచులో కూరుకుపోవడమో జరుగుతుంది. అలాంటప్పుడు వారున్న చోటును తెలిసేలా అద్భుతమైన తుపాకిని రూపొందించాడు మంగుళూరుకు చెందిన విద్యార్థి పి.తేజస్. ఓ వైపు శత్రువులపై బుల్లెట్ల వర్షం కురిపించడంతోపాటు సైనికుడి ఉనికిని తన బృందానికి చేరవేసేలా సెన్సార్‌ను బిగించాడు. ఇది బయటి వారికి సిగ్నల్స్‌ను పంపించి ఆచూకీ చెబుతుంది. తేజస్ తయారు చేసిన తుపాకి ఒక్కసారి వినియోగానికి రూ.30 మాత్రమే ఖర్చవుతుంది. మంటల్లో కాలిపోతున్న ఎత్తయిన భవనాల్లోకి ఈ తుపాకి ద్వారా ఆక్సిజన్ బాల్స్‌ను ఫైర్ చేసి మంటలను సైతం ఆర్పేయవచ్చు. -
నుమాయిష్.. జోష్
అబిడ్స్: ఎగ్జిబిషన్ సందర్శకులతో కిక్కిరిసింది. 83వ అఖిలభారత పారిశ్రామిక ప్రదర్శనశాల (నుమాయిష్)ను ఆదివారం 80 వేల మంది సందర్శించారు. జనవరి 1వ తేదీన ప్రారంభమైన ఎగ్జిబిషన్ ఫిబ్రవరి 15న ముగియనుంది. ఆదివారం వరకు దాదాపు 8.50 లక్షల మంది ఎగ్జిబిషన్‌ను సందర్శించారని ఎగ్జిబిషన్ సొసైటీ ఉపాధ్యక్షులు వనం సత్తేందర్, కార్యదర్శి హనుమంతరావు, కోశాధికారి ఏనుగుల రాజేంద్రకుమార్‌లు తెలిపారు. సందర్శకుల సౌకర్యార్థం ఎగ్జిబిషన్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశామన్నారు. వలంటీర్లతో పాటు పోలీసులు ఆదివారం ఎగ్జిబిషన్ పరిసరాల్లో ఎగ్జిబిషన్ లోపల భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు బేగంబజార్ ఇన్స్పెక్టర్ ఎన్.శంకర్ తెలిపారు. సీసీ కెమెరాల ద్వారా ప్రత్యేక నిఘా ముమ్మరం చేశామన్నారు. మఫ్టిలో పోలీసులు ఉండి బందోబస్తు చేపడుతున్నారన్నారు. -
హైదరాబాద్ లో వెడ్డింగ్ జ్యూవెల్లరీ స్పెషల్ ఎగ్జిబిషన్ (ఫొటోలు)
-
హైదరాబాద్‌లో విమానాల ప్రదర్శన.. టికెట్ ఎలా బుక్ చేసుకోవాలంటే..
గడిచిన రెండేళ్లలో విమానాల్లో ప్రయాణించేవారి సంఖ్య 26 కోట్లకు పెరిగిందని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు. బేగంపేట విమానాశ్రయంలో ‘వింగ్స్ ఇండియా 2024’ వైమానిక ప్రదర్శనను మంత్రి ప్రారంభించారు. కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రి వీకే సింగ్, తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియా మాట్లాడుతూ పౌర విమానయాన రంగంలో ఎన్నో ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్లు చెప్పారు. 2047 నాటికి విమానయాన రంగం 20 ట్రిలియన్ డాలర్ల వృద్ధిని సాధించే దిశగా ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు. ముంబయి, దిల్లీలో గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టులు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు గుర్తిచేశారు. ఉడాన్ పథకం కింద జమ్మూకశ్మీర్‌లో హెలికాప్టర్ ప్రయాణాలు అమలు చేస్తున్నామని చెప్పారు. డ్రోన్లకు డిమాండ్ పెరగడంతో.. మహిళా పైలట్లను తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. కార్యక్రమంలో భాగంగా ఉడాన్ 5.3ను మంత్రి ప్రారంభించారు. సమావేశంలో పలు విమానయాన సంస్థల మధ్య ఒప్పందాలు జరిగాయి. తెలంగాణలో ఎన్నో అవకాశాలు -మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్‌లో వింగ్స్ ఇండియా ప్రదర్శన నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. తెలంగాణలో ఏవియేషన్ రంగానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయన్నారు. సులభతర వాణిజ్య విధానం ఇక్కడ అమలవుతోందని చెప్పారు. ఏరో స్పేస్ పెట్టుబడులకు హైదరాబాద్ ఎంతో అనుకూలం. డ్రోన్ పైలట్లకు ఎక్కువగా శిక్షణ ఇచ్చి.. వ్యవసాయం, అత్యవసర పరిస్థితులు, శాంతిభద్రతల్లో డ్రోన్లు వినియోగిస్తున్నట్లు వివరించారు. ఇదీ చదవండి: బుల్లెట్ రైలు ప్రాజెక్టు దక్కించుకున్న కంపెనీ ఇదే.. వింగ్స్ ఇండియా 2024 సందర్శకులకు 20, 21వ తేదీల్లో అనుమతిస్తారు. భారత వాయుసేనకు చెందిన సారంగ్ బృందం ఈ రోజు నుంచి 21వ తేదీ వరకు విన్యాసాలు నిర్వహించనుంది. 18న మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 2 వరకు, సాయంత్రం 4.15 నుంచి 5 వరకు విన్యాసాలుంటాయి. 19న ఉదయం 11 నుంచి 12 వరకు, మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 2 వరకు, సాయంత్రం 4.15-5 వరకు విన్యాసాలు ఉంటాయి. 20, 21వ తేదీల్లో సందర్శకులను అనుమతించనున్నారు. టికెట్ రూ.750గా నిర్ణయించారు. ‘బుక్‌మైషో’ యాప్ ద్వారా టికెట్లను కొనుగోలు చేయవచ్చు. మూడేళ్లలోపు పిల్లలకు ఉచితం. 30 అడుగుల దూరంలో బారికేడ్ల నుంచి మాత్రమే చూసే అవకాశం ఉంటుంది.