అబిడ్స్: ఎగ్జిబిషన్ (నుమాయిష్) ఆదివారంతో ముగిసింది. 83వ అఖిలభారత పారిశ్రామిక ప్రదర్శనశాల జనవరి 1వ తేదీన ప్రారంభమై ఫిబ్రవరి 18వ తేదీ రాత్రి వరకు కొనసాగింది. ప్రతి సంవత్సరం 46 రోజులు కొనసాగే ఎగ్జిబిషన్ ఈసారి 49 రోజుల పాటు కొనసాగింది. ముగింపు రోజు ఆదివారం మధ్యాహ్నం నుంచే సందర్శకులు భారీగా తరలివచ్చారు.
సుమారు 70 వేల మంది వచి్చనట్లు బుకింగ్ కన్వీనర్ చంద్రశేఖర్ తెలిపారు. 49 రోజుల్లో మొత్తం 22 లక్షల మంది నుమాయి‹Ùకు వచ్చినట్లు అంచనా. 2,400 స్టాళ్లను ఏర్పాటు చేశామని, కనువిందు చేసేలా పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించామని సొసైటీ ఉపాధ్యక్షుడు వనం సత్యేందర్, కార్యదర్శి హన్మంతరావు, జాయింట్ సెక్రటరీ స్వర్ణజిత్ సింగ్, కోశాధికారి రాజేంద్రకుమార్‌లు తెలిపారు. గోషామహల్ ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ మహేష్ గౌడ్ ఆధ్వర్యంలో బందోబస్తు పర్యవేక్షించారు.
Comments
Please login to add a commentAdd a comment