Numaish
-
Hyderabad: నుమాయిష్.. కల్చరల్..జోష్..
నగరంలో 84వ ఆల్ ఇండియా ఇండ్రస్టియల్ ఎగ్జిబిషన్ నుమాయిష్ జోరుగా సాగుతోంది. జనవరి 3న ప్రారంభమైన ఈ ఈవెంట్ ఫిబ్రవరి 18 వరకూ కొనసాగనుంది. ఎప్పటి నుంచో షాప్ హాలిక్స్కు ఫేవరెట్ స్పాట్‌గా ఉన్న ఈ వస్తూత్పత్తుల ఉత్సవం.. గత కొంత కాలంగా సాంస్కృతిక కార్యకలాపాల వేదికగానూ వరి్ధల్లుతోంది. కళలను అభిమానించేవారికి చిరునామాగా మారుతోంది. నుమాయిష్కి వెళ్లొచ్చాను అనగానే.. ఏం కొన్నావ్? ఏం తిన్నావ్? అనే ప్రశ్నలే ఎదురవుతాయి తప్ప ఎవరి పాటలు ఎంజాయ్ చేశావ్! ఎవరి నృత్యాభినయాన్ని ఆస్వాదించావ్? అనే ప్రశ్నలు అరుదే. ప్రధానంగా షాపింగ్ ప్రియుల కోసం ఏర్పాటైన ప్రదర్శన కావడం వల్ల నుమాయి‹Ùని ఒక కల్చరల్ ఈవెంట్స్‌కి కేరాఫ్‌గా పరిగణనలోకి తీసుకోరు. అయితే ఇప్పుడిప్పుడే ఆ పరిస్థితి మారుతోంది. మంచి సంగీతాన్ని, నృత్యాన్ని, హాస్య కార్యక్రమాన్ని ఆస్వాదించడానికి కూడా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో అవకాశం ఉంటుందనే ఆలోచన నగరవాసుల్లో వస్తోంది. రోజుకు 6 గంటలపైనే.. నుమాయిష్ షాపింగ్ ప్రధాన ఆకర్షణ అయితే, దానితో పాటే అంతకు మించిన అనుభవాన్ని, వినోదాత్మక కార్యక్రమాలను కూడా అందిస్తోంది. రోజూ సాయంత్రం 5గంటల నుంచి రాత్రి 11 గంటల వరకూ వీటిని నిర్వహిస్తున్నారు. దీని కోసం ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ప్రత్యేకంగా పండల్, లాన్స్‌లో 2 వేదికలు ఏర్పాటు చేశారు. నుమాయి‹Ùని సందర్శించాలని ప్లాన్ చేసే కళాభిమానులు తమకు నచ్చిన ఈవెంట్ ఉన్న రోజును ఎంచుకోవడానికి వీలుగా షాపింగ్‌తో పాటే పలు రకాల అద్భుతమైన ఈవెంట్ల జాబితా కూడా నిర్వాహకులు సిద్ధంగా ఉంచారు. మంత్రముగ్ధులను చేసే నృత్య ప్రదర్శనల నుంచి మనోహరమైన ముషైరా సెషన్స్ వరకు, ప్రతి ఒక్కరికీ నచ్చేలా వైవిధ్యభరిత ప్రదర్శనలను అందుబాటులోకి తెచ్చారు.కూచిపూడితో కూడి.. సంప్రదాయ సౌరభాలను ఆస్వాదించేవారికి నుమాయిష్ ఒక మంచి ఎంపికగా చెప్పొచ్చు. కూచిపూడి వంటి సంప్రదాయక నృత్యకళలకు ఇక్కడ ఎక్కువగా పట్టం గడుతున్నారు. అలాగే గజల్స్, సూఫీ సంగీతం వంటివి ప్రముఖ కళాకారులు అందిస్తున్నారు. ఆసక్తి కలిగిన వారు నుమాయిష్ అధికారిక వెబ్సైట్లో ఆయా ఈవెంట్లకు సంబంధించిన తేదీలు, వేదికలు, కళాకారుల వివరాలతో కూడిన ఈవెంట్ల జాబితాను పరిశీలించుకోవచ్చు. ప్రముఖ స్టార్స్ ఈవెంట్స్.. గత సంవత్సరం, బాలీవుడ్ స్టార్ సింగర్ జావేద్ అలీ అద్భుతమైన లైవ్ పెర్ఫార్మెన్స్తో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసిన విషయం చాలా మంది నగరవాసులకు మధురమైన జ్ఞాపకం. ఈ ఏడాది ఇప్పటి వరకూ అలాంటి సంచలనాత్మక ప్రకటన ఏమీ రానప్పటికీ.. రానున్న రోజుల్లో ఉండొచ్చని నిర్వాహకులు, సందర్శకులు అంటున్నారు. ఏదేమైనా ఈ కార్యక్రమాలు ఓ వైపు సందర్శకులను సేదతీరుస్తూనే, మరోవైపు స్థానిక ఔత్సాహిక కళాకారులకు అనువైన వేదికలను అందిస్తూ ప్రోత్సహిస్తున్నాయని చెప్పాలి. నేడు, రేపు..ఇలా.. ఈ వారాంతం వరకూ ఒకసారి పరిశీలిస్తే.. నేడు (మంగళవారం) కూచిపూడి నృత్యం (ఎం.భిక్షపతి) కామెడీ కార్యక్రమం (షాబుద్దీన్), బుధవారం సినిమా పాటలు (జాఫర్ ఉజ్ జమా), కూచిపూడి నృత్యం (రాజ్‌కుమార్), లయన్స్ క్లబ్ మ్యూజికల్ ప్రోగ్రామ్ అలాగే గురువారం భువనవిజయం ప్రదర్శన, శుక్రవారం విశ్వప్రభ కూచిపూడి నృత్యం, శ్రీకృష్ణ మ్యూజిక్ అండ్ డ్యాన్స్, గజల్ గీతాలు (అడ్నాన్ సలీమ్)జిందా దిలాన్ఏ హైదరాబాద్ (ముషాయిరీ).. ఇలా పలు వైవిధ్యభరితంగా సందర్శకులను అలరించే సాంస్కృతిక కార్యక్రమాలు జరుగనున్నాయి. -
నుమాయిష్‌లో సందడి చేసిన టాలీవుడ్ నటి అనసూయ.. (ఫోటోలు)
-
Numaish 2025: రెక్కలు తొడిగిన ఆశలు
వృద్ధులు చంటి పిల్లలతో సమానం అంటారు.. చంటి పిల్లలకు ఎలా అయితే అన్నీ చూడాలని ఆశ ఉంటుందో వయస్సు పెద్దపడిన వారికి కూడా ప్రతిదానిపై ఆసక్తి ఉంటుంది. సరిగ్గా ఇదే ఆలోచన చేసిన నగరానికి చెందిన దోబారా అనే ఎన్జీవో.. వారి కోసం అద్భుతమైన సేవా కార్యక్రమాన్ని నిర్వహించింది. నగరంలోని అపోలో హోంకేర్, గ్లెన్‌ఫీల్డ్ మల్లారెడ్డి తదితర ప్రైవేటు ఆస్పత్రులు, స్కూల్స్‌ను భాగం చేస్తూ నిరుపేద వృద్ధుల కోసం ప్రత్యేక నుమాయిష్ సందర్శనను ఏర్పాటు చేసింది. నాంపల్లి ఎగ్జిబిషన్ నిర్వాహకులు సైతం పూర్తి సహాయ సహకారాలు అందించడానికి సై అన్నారు. అయితే రోజువారీ వేళల్లో అయితే పెద్ద వయసు వారికి రద్దీలో, జనం మధ్యన ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉందని.. మంగళవారం మధ్యాహ్నం ప్రత్యేకంగా 2గంటల నుంచీ సాయంత్రం రద్దీ మొదలయ్యే లోగా దీనిని పూర్తి అయేలా కార్యక్రమాన్ని డిజైన్ చేశారు. అనాధాశ్రమాల నుంచి.. నగరవ్యాప్తంగా 89 మంది వీల్‌చైర్స్ ఉప్పల్, చిక్కడపల్లి.. ఇలా నగరంలోని 12 ఓల్డేజ్ హోమ్స్, సీనియర్ సిటీజన్ అసోసియేషన్లకు చెందిన సభ్యులను సైతం ఈ కార్యక్రమంలో భాగస్వాముల్ని చేశారు. పెద్దలు అందరినీ కార్లలో గౌరవంగా తోడ్కొని వచ్చారు. అక్కడ నుంచి నడవలేని వారి కోసం దాదాపుగా 80కిపైగా వీల్ఛైర్లను సిద్ధం చేశారు. అంతేకాకుండా నర్సింగ్ స్కూల్స్‌కు సంబంధించిన విద్యార్థులను కూడా ఉంచారు. వీరి కోసం ప్రత్యేకంగా ఉచిత ట్రైన్ రైడ్స్‌ను నుమాయిష్ నిర్వాహకులు ఏర్పాటు చేశారు. అదే విధంగా వాహనాల కోసం ఉచిత పార్కింగ్‌ను కూడా కలి్పంచారు. ఫుడ్ ప్యాక్స్.. పిస్తా హౌజ్, షాజ్ మహమ్మూద్ అనే వాలంటీర్ల సహకారంతో ఫుడ్ ప్యాక్స్ అందించారు. అలాగే కొందరు దాతలు ఇచి్చన సహకారంతో వృద్ధులకు ఉపయోగపడే టవల్స్ వంటివి కొనుగోలు చేసి అందించారు.పెద్దలకు ప్రత్యేకంగా.. ఏడాదికో సారి నుమాయిష్ లాంటి ప్రదర్శనను తిలకించాలని అందరూ అనుకున్నట్టే సీనియర్ సిటిజన్స్ కూడా ఆశిస్తారు. అయితే ఆశించినట్టుగా చాలా మందికి జరగకపోవచ్చు. కొందరికైనా దీన్ని సాకారం చేద్దామనే ఆలోచనతో ఈ ‘సీనియర్ సిటిజన్స్ ఎట్ నుమాయిషి కార్యక్రమాన్ని నిర్వహించాం. ఒక సీనియర్ సిటిజన్‌గా పెద్దలకు సంబంధించిన జెరంటాలజీ సబ్జెక్ట్‌లో మాస్టర్స్ చేసిన వ్యక్తిగా ఇలాంటి కార్యక్రమాలు పెద్దవాళ్ల మనసుకు ఎంత సంతోషాన్ని అందిస్తాయనేది నాకు తెలుసు. – మతీన్ అన్సారీ, వ్యవస్థాపకులు, దోబారా స్వచ్ఛంద సంస్థ -
నుమాయిష్.. సోషల్ జోష్..
కంటెంట్ క్రియేటర్లు, ఇన్ఫ్లుయెన్సర్లు పెద్ద ఎత్తున హైదరాబాద్‌లో సందడి చేస్తున్నారు. సాధారణంగా నగరంలో కొత్తగా ప్రారంభించిన కేఫ్ అయినా లేదా ఏదైనా ఆసక్తికరమైన ఈవెంట్ అయినా, ఇన్‌స్టా రీల్స్, యూట్యూబ్ వీడియోల్లో తక్షణమే ప్రత్యక్షమవుతుంది. అయితే వందల సంఖ్యలో వెరైటీ ఉత్పత్తులు, వేర్వేరు ప్రాంతాలకు చెందిన స్టాల్స్.. ఉండే నుమాయిష్ ఎగ్జిబిషన్ ఇన్ఫ్లుయెన్సర్లలో సోషల్ జోష్ నింపుతోంది.. దీంతో వీరికి చేతినిండా పని పెడుతోంది. ఈ క్రమంలో దీని గురించిన మరిన్ని విషయాలు.. హైదరాబాద్‌లోని నాంపల్లి మైదాన ప్రాంతం ఇప్పుడు కిక్కిరిసిన దుకాణాలతో, సందర్శకులతో కిటకిటలాడుతోంది. జనవరి 3న ప్రారంభమైన ఈ ఐకానిక్ ఈవెంట్ ఫిబ్రవరి 18, 2025 వరకూ సందర్శకులను అలరించనుంది. మరోవైపు ఈ 84వ ఆల్ ఇండియా ఇండ్రస్టియల్ ఎగ్జిబిషన్ ఈసారి సోషల్ మీడియా వేదికగా భారీ ప్రచారం అవుతోంది. విభిన్న రకాల కంటెంట్స్ చేసేందుకు వీలుండడంతో ఇది క్రియేటర్లకు గమ్యస్థానంగా మారింది. స్థానికులకు, సందర్శకులకు ఎల్లప్పుడూ ఇష్టమైన హైదరాబాద్ ఐకానిక్ వార్షిక ఫెయిర్ ఇన్‌స్టా ఇన్ఫ్లుయెన్సర్లు, యూట్యూబర్ల ప్రవాహానికి నిలయంగా మారింది.రోజుకొకటి.. అదే వెరైటీ.. కొంతమంది కంటెంట్ క్రియేటర్స్.. ఒక్కో రోజును ఎగ్జిబిషన్‌లోని ఒక్కో విభాగాలకు అంకితం చేస్తున్నారు. ఉదాహరణకు, ఒక రోజు రుచికరమైన స్ట్రీట్ ఫుడ్ గురించి, మరొక రోజు సంప్రదాయ చేనేత స్టాల్స్ గురించి.. తర్వాతి రోజు రైడ్లు.. ఎంటర్టైన్మెంట్ జోన్లను ఇలా విభజిìæంచి చూపిస్తున్నారు. ఈ సమాచారం వీక్షకులకు వినోదాన్ని మాత్రమే కాకుండా నుమాయిష్ సందర్శనను ప్లాన్ చేయడంలో కూడా ఉపకరిస్తోంది. వీరి కంటెంట్‌కు సోషల్ మీడియాలో భారీ స్పందన లభిస్తోంది. నగరంతో పాటు దేశవ్యాప్తంగానూ అనేక మందిని ప్రభావితం చేస్తోంది. రీల్స్ కేరాఫ్‌గా.. ఆహార ప్రియుల సాహసాల నుంచి షాపింగ్ స్ప్రీల వరకూ.. ఫీడ్‌లో స్క్రోల్ చేయడానికి ఎల్లప్పుడూ ఏదో ఒక ప్రత్యేకతతో నుమాయిష్ షాపింగ్, ఆహార ఉత్పత్తులను మాత్రమే కాకుండా సృజనాత్మక సోషల్ మీడియా కంటెంట్‌ను కూడా అందిస్తుంది. ఈ విషయాన్ని శరవేగంగా వ్యాపిస్తుండడంతో నుమాయిష్ రీల్స్, వీడియోలకు కేరాఫ్‌గా మారింది. దీంతో ఇన్ఫ్లుయెన్సర్లు, సోషల్ మీడియా నిర్వాహకులతో ఎగ్జిబిషన్ సందడిగా మారుతోంది.అడుగడుగునా కెమెరాలు.. నుమాయి‹Ùలోని కలర్‌ఫుల్ స్ట్రీట్స్ మీదుగా నడుస్తుంటే.. సందడిగా ఉన్న స్టాల్స్‌కు ముందు పలు కెమెరాలను అమర్చడాన్ని గమనించవచ్చు. ఇన్‌స్టా, లేదా యూట్యూబ్ ద్వారా ఈ గ్రాండ్ ఎగ్జిబిషన్‌లోని ప్రతి మూలనూ కవర్ చేస్తూ ప్రతిరోజూ వందల సంఖ్యలో కంటెంట్ అప్లోడ్ చేస్తున్నారు. లక్నో చికన్ కారీ స్టాల్స్ నుంచి కాశ్మీరీ షాపుల వరకూ నోరూరించే ఫుడ్ కోర్ట్ నుంచి వినోద ప్రదేశంలో థ్రిల్లింగ్ రైడ్ల వరకూ దేనికదే వెరైటీగా కినిపిస్తోంది. దీంతో మెటీరియల్‌కు కొరత లేకపోవడం వీరికి మరింత ఉత్తేజాన్ని అందిస్తోంది.క్రేజీగా..మెన్ ఎట్ నుమాయిష్?.. ఈ సంవత్సరం ‘మెన్ ఎట్ నుమాయిష్’ పేరుతో ఓ రీల్ ఇంటర్నెట్లో క్రేజీగా మారింది. మగవాళ్లు తమ కుటుంబాలతో కలిసి షాపింగ్ ట్రిప్‌లలో చురుకుగా పాల్గొంటున్నట్లు చూపే ఈ రీల్ వేగంగా వైరల్ అయ్యింది. ఈ రీల్‌కి ఇన్‌స్టాలో ఒక్క రోజులో 1.5 మిలియన్లకు పైగా వీక్షణలు, 75,000 పైగా లైక్‌లు రావడం విశేషం. షాపింగ్ బ్యాగ్‌లను మోసుకుంటూ భార్యల్ని అనుసరించే భర్తలు, పిల్లలను ఎత్తుకుని ఆడిస్తుంటే మహిళలు షాపింగ్‌లో మునిగిపోవడం.. రీల్‌ని సూపర్ హిట్ చేశాయి. -
13 రోజులు.. 5 లక్షల మంది సందర్శకులు
అబిడ్స్: ఎగ్జిబిషన్‌కు సందర్శకులు పోటెత్తారు. బుధవారం నుమాయిష్ కు దాదాపు 65 వేల మంది వచ్చినట్లు ఎగ్జిబిషన్ సొసైటీ ఉపాధ్యక్షుడు కె.నిరంజన్, కార్యదర్శి సురేందర్‌రెడ్డి తెలిపారు. ఈ నెల 3 నుంచి బుధవారం వరకు సుమారు 5 లక్షల మంది సందర్శించినట్లు వివరించారు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సందర్శకులందరినీ మెటల్ డిటెక్టర్లతో తనిఖీలు చేసి లోపలికి అనుమతిస్తున్నారు. సీసీ కెమెరాల ద్వారా నిఘా ముమ్మరం చేశారు. -
నుమాయిష్ ఎగ్జిబిషన్లో జోరుగా లేడీస్ డే వేడుకలు (ఫొటోలు)
-
నాంపల్లి : నుమాయిష్ ఎగ్జిబిషన్‌కు..పోటెత్తిన సందర్శకులు (ఫొటోలు)
-
Hyderabad: జనవరి 3 నుంచి నుమాయిష్..
అబిడ్స్: జనవరి 3 నుంచి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ప్రారంభం కానున్న అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన (నుమాయిష్) ప్రవేశ రుసుమును ఈసారి రూ.40 నుంచి రూ.50కి పెంచనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. 2 వేల స్టాళ్లతో ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. జనవరి 1న ప్రారంభమయ్యే ఎగ్జిబిషన్‌ను ఈ ఏడాది రెండు రోజులు వాయిదా వేశామని, 3వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు ఎగ్జిబిషన్ సొసైటీ ప్రతినిధులు వెల్లడించారు. ఆదివారం ఇక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సొసైటీ ఉపాధ్యక్షుడు కె.నిరంజన్, కార్యదర్శి ఆర్. సురేందర్‌రెడ్డి, కోశాధికారి డాక్టర్ ప్రభా శంకర్, సంయుక్త కార్యదర్శి డి.మోహన్, పబ్లిసిటీ కనీ్వనర్లు సురేష్‌కుమార్, సురేష్రాజ్లు మాట్లాడారు. జనవరి 1న ప్రారంభం కావాల్సిన ఎగ్జిబిషన్‌ను మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ సంతాప దినాల కారణంగా జనవరి 3న ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఎగ్జిబిషన్లో డబుల్ డెక్కర్ బస్సును మిని ట్రైన్‌తో పాటు అందుబాటులోకి తెస్తున్నామన్నారు. ఎగ్జిబిషన్ నలుమూలలా 160 సీసీ కెమెరాలు, 250 మంది వలంటీర్లు, ప్రైవేటు సెక్యూరిటీతో బందోబస్తు పర్యవేక్షిస్తామన్నారు. గోల్డెన్‌జూబ్లీ బ్లాక్ ఎదురుగా భారీ ఎల్ఈడీ స్క్రీన్లను తొలిసారిగా ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. సందర్శకులు, ఇతరులు ఎవరైనా శుభ కార్యక్రమాలు, ఇతర ప్రకటనలు ఇవ్వవచ్చన్నారు. ప్రతి రోజు మధాహ్నం నుంచి రాత్రి 10.30 గంటల వరకు, శని ఆదివారాల్లో రాత్రి 11.30 గంటల వరకు ఎగ్జిబిషన్ ఉంట్టుందన్నారు. మినీ ట్రైన్ టికెట్ రూ.30, డబుల్ డెక్కర్ టికెట్ రూ.40గా నిర్ణయించినట్లు పేర్కొన్నారు. కమాండ్ కంట్రోల్, వైఫై టవర్.. మొదటిసారిగా పలు శాఖల అధికారుల కోసం కమాండ్ కంట్రోల్ ఏర్పాటు చేస్తున్నట్లు ఎగ్జిబిషన్ ప్రతినిధులు వెల్లడించారు. ప్రతి సంవత్సరం సెల్ఫోన్ల నెట్వర్క్ సమస్య వస్తుండడంతో మొదటి సారిగా వైఫై టవర్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. నుమాయిష్‌లో సీనియర్ సిటిజన్ల కోసం వీల్ చైర్లను సమకూరుస్తున్నామన్నారు. జనవరి 7వ తేదీన లేడీస్ డే గా, జనవరి 31వ తేదీని చి్రల్డన్స్ డేగా ప్రకటించినట్లు తెలిపారు. గత సంవత్సరం యశోధ ఆసుపత్రి సహకారంతో ఉచితంగా వైద్య సేవలు అందించామన్నారు. గత ఏడాది నుమాయిష్ నిర్వహణ ద్వారా ప్రభుత్వానికి వివిధ రకాల పన్నుల రూపంలో రూ.66 కోట్ల ఆదాయం సమకూర్చినట్లు వారు వివరించారు. ఈసారి ఎగ్జిబిషన్లో ఆదాయం మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. సమావేశంలో ఎగ్జిబిషన్ ప్రతినిధులు డాక్టర్ గంగాధర్, హన్మంతరావు, అశ్వినిమార్గం, జీవీ రంగారెడ్డి, ఆదిత్య మార్గం తదితరులు పాల్గొన్నారు. -
Hyderabad: నుమాయిష్ వాయిదా… ఎప్పటి నుంచంటే!
సాక్షి, హైదరాబాద్: అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన(నుమాయిష్)కు సర్వం సిద్ధమవుతోంది. అయితే నుమాయిష్ ప్రారంభ తేదీ వాయిదా పడింది. మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ సంతాప దినాల కారణంగా జనవరి 1న ప్రారంభం కావాల్సిన నుమాయిష్ 3వ తేదీకి వాయిదా పడింది. రెండు రోజులు ఆలస్యంగా ఎగ్జిబిషన్ ప్రారంభమవుతుందని నిర్వాహకులు తెలిపారు. 3న సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ఎగ్జిబిషన్ ప్రారంభిస్తామని తెలిపారు. 46 రోజుల పాటు వరకు ఎగ్జిబిషన్ కొనసాగుతుంది. నిజాం కాలంలో 1938లో ప్రారంభమైన నుమాయిష్‌ను తిలకించేందుకు నగరవాసులే కాక తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున సందర్శకులు తరలి వస్తారు.2200 స్టాల్స్ ఏర్పాటుఎగ్జిబిషన్లో 2200 స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు జమ్మూకాశ్మీర్, పశ్చిమబెంగాల్, రాజస్థాన్, కర్ణాటక, తమిళనాడుతో పాటు పలు రాష్ట్రాలకు చెందిన వివిధ రకాల ఉత్పత్తులు ఈ స్టాళ్లల్లో కొలువుదీరనున్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన వైద్య, ఆరోగ్య, కార్మిక, సమాచార, ఆర్బీఐ, అటవీశాఖ, జైళ్ల శాఖలతో పాటు పలు ప్రభుత్వ శాఖలు స్టాళ్లను ఏర్పాటు చేసి సందర్శకులకు ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పిస్తాయి. జనవరి 3న ప్రారంభమయ్యే ఈ ఎగ్జిబిషన్లో రౌండ్ స్టాళ్లను తొలగించి స్క్వైయర్ స్టాళ్లను కూడా అందుబాటులో ఉంచారు.సీసీ కెమెరాలతో నిరంతర పర్యవేక్షణ ..ఎగ్జిబిషన్ నలుమూలలా 160 సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేస్తున్నారు. నాలుగు ప్రధాన గేట్ల వద్ద మెటల్ డిటెక్టర్లతో అందరినీ క్షుణ్ణంగా తనిఖీ చేసి లోపలికి అనుమతిస్తారు. సందర్శకులను మధ్యాహ్నం 3 గంట నుండి రాత్రి 10.30 గంటల వరకు అనుమతిస్తారు. ఈ ఏడాది ఎంట్రీ ఫీజును రూ.10 పెంచారు. గతంలో రూ.40గా ఉన్న ప్రవేశ రుసుమును రూ.50 గా నిర్ణయించారు. -
ముగిసిన నుమాయిష్
అబిడ్స్: ఎగ్జిబిషన్ (నుమాయిష్) ఆదివారంతో ముగిసింది. 83వ అఖిలభారత పారిశ్రామిక ప్రదర్శనశాల జనవరి 1వ తేదీన ప్రారంభమై ఫిబ్రవరి 18వ తేదీ రాత్రి వరకు కొనసాగింది. ప్రతి సంవత్సరం 46 రోజులు కొనసాగే ఎగ్జిబిషన్ ఈసారి 49 రోజుల పాటు కొనసాగింది. ముగింపు రోజు ఆదివారం మధ్యాహ్నం నుంచే సందర్శకులు భారీగా తరలివచ్చారు. సుమారు 70 వేల మంది వచి్చనట్లు బుకింగ్ కన్వీనర్ చంద్రశేఖర్ తెలిపారు. 49 రోజుల్లో మొత్తం 22 లక్షల మంది నుమాయి‹Ùకు వచ్చినట్లు అంచనా. 2,400 స్టాళ్లను ఏర్పాటు చేశామని, కనువిందు చేసేలా పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించామని సొసైటీ ఉపాధ్యక్షుడు వనం సత్యేందర్, కార్యదర్శి హన్మంతరావు, జాయింట్ సెక్రటరీ స్వర్ణజిత్ సింగ్, కోశాధికారి రాజేంద్రకుమార్‌లు తెలిపారు. గోషామహల్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ మహేష్ గౌడ్ ఆధ్వర్యంలో బందోబస్తు పర్యవేక్షించారు. -
అటు కిటకిట.. ఇటు తంటా!
అబిడ్స్: ఎగ్జిబిషన్ కిక్కిరిసిపోయింది. నుమాయిష్‌కు మంగళవారం ఒక్కరోజే దాదాపు 75 వేల మంది సందర్శకులు వచ్చారు. గత 16 రోజుల్లో సుమారు 6 లక్షల మంది సందర్శకులు వచ్చారని ఎగ్జిబిషన్ సొసైటీ ఉపాధ్యక్షుడు వనం సత్యేందర్, కార్యదర్శి హన్మంతరావు తెలిపారు. ఎగ్జిబిషన్ లోపల, బయట మాలకుంట, అజంతా, గాంధీభవన్ గేట్ల వద్ద ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని బేగంబజార్ పోలీస్ ఇన్స్పెక్టర్ శంకర్ తెలిపారు. ట్రాఫిక్ పోలీసుల అత్యుత్సాహంతో నుమాయిష్ సందర్శకులు నరకయాతనకు గురయ్యారు. బీజేపీ కార్యాలయం నుంచి ప్రధాన రహదారి దాటి అజంతా గేటు మీదుగా సందర్శకులు ఎగ్జిబిషన్ లోపలికి వెళ్లేవారు. మంగళవారం మధ్యాహ్నం నుంచి నగర ట్రాఫిక్ పోలీసులు అజంతా గేటు ఎదురుగా ఉన్న ముఖ ద్వారాన్ని మూసివేశారు. రోడ్డు అవతలి నుంచి వచ్చేవారు, బీజేపీ కార్యాలయం ప్రధాన రోడ్డుమీదుగా వచ్చేవారు మెట్రోస్టేషన్ ఎక్కి రోడ్డు ఇవతలి వైపు మెట్రో స్టేషన్ దిగి అజంతా గేటుకు వెళ్లాలని ట్రాఫిక్ పోలీసులు నిబంధనలను పెట్టారు. దీంతో వేలాది మంది సందర్శకులు మెట్రోష్టేషన్ ఎక్కాలంటే, దిగాలంటే నానా ఇక్కట్ల పాలయ్యారు. గతంలో మాదిరిగానే ప్రధాన రోడ్లపై వాహనాలను నిలిపి సందర్శకులను అజంతా గేటు లోపలికి అనుమతించాలని డిమాండ్ చేశారు. -
Numaish Exhibition Images 2024: నాంపల్లిలో నుమాయిష్ సందడి (ఫొటోలు)
-
నుమాయిష్ డ్రోన్ విజువల్స్
-
నుమాయిష్ 2024 ప్రారంభం.. మాస్క్ కంపల్సరీ!
హైదరాబాద్, సాక్షి: నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో నుమాయిష్ సోమవారం సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం అయ్యింది. ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్నం, శ్రీధర్‌బాబు(నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షుడు కూడా) పాల్గొన్నారు. ఈసారి కూడా దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఫిబ్రవరి 15వ తేదీ వరకు నుమాయిష్ 2024 జరగనుంది. నుమాయిష్ కోసం ఈసారి 2,400 స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఇక తెలంగాణలో కరోనా కేసులు కలవర పెడుతున్నాయి. నుమాయిష్‌కు పెద్ద ఎత్తున సందర్శకులు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో.. మాస్కులు కచ్చితంగా ధరించి రావాలంటూ సందర్శకులను కోరుతున్నారు నిర్వాహకులు. ఈసారి నుమాయిష్ నేపథ్యంలో నగరంలో 45 రోజుల పాటు ఆ రూట్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయనున్నారు. మరోవైపు సర్వీసులను ఎక్కువ సమయం నడిపేందుకు హైదరాబాద్ మెట్రో సిద్ధమైంది. ఇక మహాలక్ష్మి పథకం ఉచిత ప్రయాణాల నేపథ్యంలోనూ నాంపల్లి రూట్లో బస్సులకు ప్రయాణికుల తాకిడి పెరిగే అవకాశం కనిపిస్తోంది. నుమాయిష్‌కు టికెట్ ధరలు గతంలో మాదిరే ఉండనున్నాయి. గతేడాది 10 రూపాయలు పెంచి నుమాయిష్ టికెట్ ధర రూ.40గా నిర్ణయించారు. ఇప్పుడు కూడా టికెట్ ధర రూ.40 లుగా కొనసాగించనున్నారు. నుమాయిష్ సాధారణ రోజులలో సాయంత్రం 4 నుంచి రాత్రి 10.30 వరకు కొనసాగుతోంది. వీకెండ్స్,సెలవు దినాల్లో మాత్రం సాయంత్రం 4 నుండి రాత్రి 11 గంటల వరకు నుమాయిష్ ఎగ్జిబిషన్ కొనసాగుతుంది. ఈ సంవత్సరం నుమాయిష్ సందర్శన వేళలను నిర్వాహకులు పొడిగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నుమాయిష్ ను సందర్శించేందుకు మహిళలు, పిల్లలకు ప్రత్యేకంగా ఒక్కో రోజు కేటాయించనున్నారు. జనవరి 9న 'లేడీస్ డే' పేరుతో మహిళలను, 31న 'చిల్డ్రన్ స్పెషల్' పేరుతో పిల్లలను నుమాయిష్ ను సందర్శించేందుకు అవకాశం కల్పిస్తామని నిర్వహకులు తెలిపారు. నుమాయిష్ నిర్వహణ ద్వారా ప్రతీ ఏడాది సుమారు రెండు వేల మందికి ప్రత్యక్ష ఉపాధి కల్పించడంతోపాటు సుమారు 30 వేల మంది విద్యార్థులకు విద్యావకాశం కల్పిస్తోంది నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ. -
Hyderabad: 45 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు
హైరదాబాద్: నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో జనవరి 1వ తేదీ నుంచి ఫిబ్రవరి 15వ తేదీ వరకు 83వ అఖిలభారత పారిశ్రామిక పదర్శన (నుమాయిష్) సందర్భంగా ఆయా మార్గాలలో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని నగర సీపీ కె.శ్రీనివాస్‌రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. రాబోయే 45 రోజుల పాటు ఈ ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని, ఈ విషయాన్ని ప్రజలు గమనించి ట్రాఫిక్ ఆంక్షలకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ► ఎంజే మార్కెట్ నుంచి నాంపల్లి వైపు వెళ్లే ఆర్టీసీ, ప్రైవేటు బస్సులు, ప్రైవేటు వాహనాలను ఎంజే మార్కెట్ చౌరస్తా నుంచి అబిడ్స్ వైపు మళ్లిస్తారు. ► బషీర్‌బాగ్, పోలీస్ కంట్రోల్‌రూమ్ వైపు నుంచి వెళ్లే భారీ, ఆర్టీసీ బస్సులను ఎల్బీస్టేడియం మీదుగా బీజేఆర్ విగ్రహం నుంచి అబిడ్స్ వైపు మళ్లిస్తారు. ► బేగంబజార్ ఛత్రి, మాలకుంట ప్రాంతాల నుంచి నాంపల్లి వైపు వచ్చే భారీ, మధ్యతరహా వాహనాలను దారుసలాం జంక్షన్ నుంచి ఏక్‌మినార్ వైపు మళ్లిస్తారు. ► బహదూర్‌పురా పాతబస్తీ నుంచి వచ్చే వాహనాలను సిటీ కాలేజ్ మీదుగా నయాపూల్ వైపు మళ్లిస్తారు. -
జనవరి 1 నుంచి నుమాయిష్
హైదరాబాద్: అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన (నుమాయి)కు సమయం ఆసన్నమైంది. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో జనవరి 1న 83వ నుమాయిష్ ప్రారంభానికి ఎగ్జిబిషన్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు. దేశంలోని పలు రాష్ట్రాల ఉత్పత్తులతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన పలు ఉత్పత్తులు, ప్రభుత్వాల స్టాళ్లు ఏర్పాటు చేయనున్నారు. ఎగ్జిబిషన్ ఫిబ్రవరి 15వ తేదీ వరకు 46 రోజుల పాటు కొనసాగనుంది. ఎగ్జిబిషన్‌ను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడ సుమారు 2,400 స్టాళ్లు కొలువుదీరనున్నాయి. ఒకేచోట అన్ని వస్తువులు.. ఎగ్జిబిషన్లో అన్ని రకాల వస్తువులు ఒకేచోట లభ్యమవుతాయి. నగరంలో దొరకని పలు రాష్ట్రాలకు చెందిన ఉత్పత్తులు అందుబాటులో ఉంటాయి. దుస్తులు, బెడ్ïÙట్లు, కిచెన్వేర్ , మహిళల కోసం పలు విధాల వంట సామగ్రి, వివిధ రకాల దుప్పట్లు, బెడ్షీట్లు, కశీ్మరీ డ్రై ఫ్రూట్స్‌తో పాటు ఎలక్ట్రానిక్ వస్తువులు, వివిధ రకాల కొత్త తరహా ఫరి్నచర్స్, పలు విధాల ఉపయోగపడే పలు రకాల సామగ్రి అందుబాటులో ఉంటాయి. టికెట్ ధర రూ.40.. ఎగ్జిబిషన్‌ను సుమారు 22 లక్షల మంది సందర్శింనున్నట్లు అంచనా. ఎలాంటి అసౌకర్యాలు తలెత్తకుండా ఎగ్జిబిషన్ సొసైటీ సీసీ కెమెరాల ద్వారా నిఘా ఏర్పాటు చేస్తోంది. ఎగ్జిబిషన్‌కు వచ్చే గోషామహల్, అజంతా గేట్, గాంధీభవన్, గేట్ల వద్ద మెటల్ డిటెక్టర్లతో తనిఖీ చేసి సందర్శకులను లోపలికి అనుమతిస్తారు. టికెట్ ధర రూ.40. వినోదాత్మకమైన పలు విభాగాలు అందుబాటులో ఉంటాయి. సందర్శకులకు కనువిందు చేస్తాం.. ఎగ్జిబిషన్‌కు వచ్చే సందర్శకులకు ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈసారి కూడా పలు రకాల సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తాం. క్రీడా పోటీలు, వినోదాత్మక కార్యక్రమాలు చేపడతాం. సందర్శకుల కోసం ఆహ్లాదకర వాతావరణంలో ఏర్పాట్లు చేస్తాం. – ఏనుగుల రాజేందర్ కుమార్, ఎగ్జిబిషన్ సొసైటీ కోశాధికారి తెలంగాణ విద్యావ్యాప్తికి కృషి ఎగ్జిబిషన్ నిర్వహణ ద్వారా వచ్చే ఆదాయంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో విద్యారంగ వ్యాప్తికి కృషి చేస్తున్నాం. ముఖ్యంగా మహిళా కళాశాలలు, పాలిటెక్నిక్, ఫార్మసీ, ఇంజినీరింగ్, డిగ్రీ, ఐటీఐ కళాశాలలను స్థాపించి విద్యా వ్యాప్తికి నిరంతరం పాటుపడుతున్నాం. – బి.హన్మంతరావు, ఎగ్జిబిషన్ కార్యదర్శి 33 సబ్ కమిటీల ద్వారా ఏర్పాట్లు.. 33 సబ్ కమిటీల ద్వారా ఎగ్జిబిషన్‌ను విజయవంతంగా కొనసాగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. ఎగ్జిబిషన్ లోపల, బయట సందర్శకులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఎగ్జిబిషన్ సబ్ కమిటీల ప్రతినిధులు తగిన చర్యలు తీసుకుంటారు. – వనం సత్యేందర్, ఎగ్జిబిషన్ సొసైటీ ఉపాధ్యక్షుడు -
నాంపల్లి ఎగ్జిబిషన్ పార్కింగ్ దగ్గర అగ్నిప్రమాదం
సాక్షి, హైదరాబాద్: నాంపల్లి ఎగ్జిబిషన్ సమీప ప్రాంతంలో అగ్నిప్రమాదం సంభవించింది. ఎగ్జిబిషన్ ఎదురుగా ఉన్న పార్కింగ్ ఏరియాలో శనివారం సాయంత్రం ప్రమాదం చోటు చేసుకుంది. మంటలు ఎగసి పడడంతో.. ఐదు కార్లు దగ్ధం అయ్యాయి. పార్కింగ్‌లో ఉన్న ఓ ఎలక్ట్రిక్ కారు నుంచి ఒక్కసారిగా మంటలు ఎగసిపడడంతో ఈ ప్రమాదం సంభవించినట్లు అధికారులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ఘటనాస్థలానికి చేరుకున్న ఫైరింజన్లు మంటలు ఆర్పేందుకు యత్నిస్తున్నాయి. అయితే.. మంటలు పూర్తిగా అదుపు అయినట్లు తెలుస్తోంది. మరోవైపు వీకెండ్ కావడంతో నుమాయిష్‌కు సందర్శకుల రద్దీ ఎక్కువగా ఉంది. మరోవైపు నాంపల్లి పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఘటనపై అబిడ్స్ పోలీసులు పూర్తి వివరాలు వెల్లడించాల్సి ఉంది. -
ఫుల్ జోష్.. నుమాయిష్ హౌస్‌ఫుల్, ఇప్పటివరకు ఎంత మంది సందర్శించారంటే?
గన్‌ఫౌండ్రీ: నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో జరుగుతున్న 82వ అఖిలభారత పారిశ్రామిక ప్రదర్శన (నుమాయిస్) సందర్శకులతో కిటకిటలాడుతోంది. ప్రతి ఏడాది లానే ఈ సారి కూడా సందర్శకులను ఆకట్టుకుంటోంది, పైగా సంక్రాంతి పండుగ సెలవులు కావడంతో ఎగ్జిబిషన్‌ను రోజూ వేల సంఖ్యలో సందర్శకులు సందర్శించినట్లు బుకింగ్ కమిటీ ఛైర్మన్ హన్మంతు తెలిపారు. ఇప్పటి వరకు ఎగ్జిబిషన్‌ను 4 లక్షలకు పైగా సందర్శించినట్లు తెలిపారు. ఈ ఏడాది 23 లక్షల మంది సందర్శకులు వస్తారని అంచనా వేస్తున్నట్లు వెల్లడించారు. కాగా ఎగ్జిబిషన్‌కు సందర్శకులు పెద్ద ఎత్తున తరలి రావడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. దీంతో పలు వాహనాలను ట్రాఫిక్ పోలీసులు దారిమళ్లించారు. చదవండి: వందేభారత్‌లో త్వరలో స్లీపర్ బెర్తులు -
నాంపల్లి ఎగ్జిబిషన్లో హీరో,హీరోయిన్ల సందడి
హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్లో హీరో సాయిధరమ్ తేజ్, హీరోయిన్ కలర్స్ స్వాతి సందడి చేశారు. జనవరి26 గణతంత్ర దినోత్సవం సందర్భంగా.. ఓ సాంగ్ షూటింగ్ కోసం నాంపల్లి ఎగ్జిబిషన్‌కు వచ్చారు. ఈ నేపథ్యంలో హీరో, హీరోయిన్లతో ఫోటోలు దిగేందుకు అభిమానులు ఎగబడ్డారు. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. కాగా పెళ్లి తర్వాత ఈమధ్యే సినిమాల్లో రీఎంట్రీ ఇచ్చిన స్వాతి ఇటీవలె పంచతంత్రం సినిమాతో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఇక ఇదిలా ఉంటే.. ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా నాంపల్లి ఎగ్జిబిషన్ జరుగుతున్న సంగతి తెలిసిందే. జనవరి1న ప్రారంభమైన ఈ ప్రదర్శన ఫిబ్రవరి 15వరకు జరగనుంది. దేశంలోనే అతిపెద్ద పారిశ్రామిక ఎగ్జిబిషన్‌గా పేరొందిన నాంపల్లి నుమాయిష్ ఎగ్జిబిషన్‌కు భారీ సంఖ్యలో ప్రజలు విచ్చేస్తుంటారన్న సంగతి తెలిసిందే. -
HYD: ఆ రెండు లైన్లలో అర్ధరాత్రి వరకు మెట్రో రైళ్లు
సాక్షి, హైదరాబాద్: నగర వాసులకు కాస్త ఊరట కలిగించే వార్త అందించింది హైదరాబాద్ మెట్రో. అర్ధరాత్రి వరకు మెట్రో రైళ్లను నడపాలని నిర్ణయించుకుంది. అయితే అది కొన్నిరోజుల వరకు, రెండు రూట్లలో మాత్రమే!. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో నుమాయిష్ కొనసాగినన్ని రోజులు ఈ సౌకర్యం ఉంటుందని హైదరాబాద్ మెట్రో రైలు ప్రకటించింది. మియాపూర్-ఎల్బీనగర్, నాగోల్ –రాయదుర్గం కారిడార్లలో ఈ వెసులుబాటు కల్పించినట్లు అధికారులు తెలిపారు. ఎల్బీనగర్, మియాపూర్, నాగోల్, రాయదుర్గం స్టేషన్ల నుంచి ఆఖరి రైలు అర్ధరాత్రి 12 గంటలకు బయలుదేరి గమ్యస్థానాన్ని రాత్రి 1 గంటకు చేరుకుంటుందని హెచ్ఎంఆర్ ఎండీ ఎన్వీఎస్రెడ్డి తెలిపారు. నుమాయిష్ సందర్శకులు ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవాలని కోరారు ఆయన. అయితే.. జేబీఎస్–ఎంజీబీఎస్ రూట్లో చివరి రైలు మాత్రం రాత్రి 11 గంటలకు మాత్రమే బయలుదేరుతుందని ఆయన స్పష్టంచేశారు. ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో నుమాయిష్ ఎగ్జిబిషన్ వద్ద ఉన్న గాందీభవన్ స్టేషన్లో అదనపు టికెట్ కౌంటర్లు ఏర్పాటు చేశామన్నారు. నుమాయిష్ షెడ్యూల్ ప్రకారం.. ఫిబ్రవరి 15 వరకు మెట్రో సేవల పొడిగింపు కొనసాగనుంది. -
హైదరాబాద్‌లో ఎగ్జిబిషన్ సందడి.. నుమాయిష్ ప్రత్యేకతలివే!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో ఫతే మైదాన్, పరేడ్ గ్రౌండ్‌లాంటి చారిత్రకమైన మైదానాల జాబితాలోనిదే నాపంల్లిలోని 'ఎగ్జిబిషన్ గ్రౌండ్స్'. కొత్త సంవత్సరం వచ్చిందంటే భాగ్యనగరంలో 'హ్యాపీ న్యూ ఇయర్' కన్నా కూడా ఎక్కువగా వినబడే మాట 'నుమాయిష్'. అదే ప్రతి ఏటా జనవరి మొదటి తారీఖున ప్రారంభమై ఫిబ్రవరి 15 వరకు జరిగే ఆలిండియా ఇండస్ట్రీయల్ ఎగ్జిబిషన్ (నుమాయిష్). చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ చేతుల మీదుగా 6 ఏప్రిల్ 1938లో పబ్లిక్ గార్డెన్లో ఇది ప్రారంభమైంది. 'నుమాయిష్’గా పిలవబడే ఈ ఎగ్జిబిషన్ తొలి ఏడాదిలో 100 స్టాల్స్ నెలకొల్పగా.. కేవలం 10 రోజులు మాత్రమే నడిచింది. ►హైదరాబాద్ స్థానిక ఉత్పత్తులకు ప్రచారం కల్పించడానికి, వినియోగదారులను చైతన్యపరచడానికి ఇలాంటి ప్రదర్శన ఒకటి అవసరమన్న ఆలోచన మొదట చేసింది ఉస్మానియా యూనివర్సిటీ గ్రాడ్యుయేట్స్ గ్రూప్. ►అందులో ముఖ్యలు మీర్ అక్బర్ అలీ ఖాన్ (మాజీ ఉత్తర ప్రదేశ్ గవర్నర్ ), నవాబ్ అహ్మదలీ ఖాన్ (మాజీ హోమ్ మినిస్టర్ ), మెహెది నవాజ్ జంగ్ (మాజీ గుజరాత్ గవర్నర్)లాంటి వారు. ►హైదరాబాద్ చరిత్రలో చాలా కీలకమైన 1946-47 కాలంలో నిజాం రాజుకు దీవాన్‌గా (ప్రైమ్ మినిస్టర్) వ్యవహరించిన సర్ మీర్జా ముహమ్మద్ ఇస్మాయిల్ నుమాయిష్‌కు పబ్లిక్ గార్డెన్ సరిపోదని దాన్ని ముఖరంజాహి రోడ్డులోని దాదాపు 23 ఎకరాల విశాలమైన ప్రస్తుతమున్న ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌కు మార్పించారు. ►అయితే 1947-48లో ఇండియన్ యూనియన్‌లో హైదరాబాద్ సంస్థాన విలీనం నాటి అల్లకల్లోల పరిస్థితుల్లో ఎగ్జిబిషన్ నిర్వహించలేక పోయారట. తిరిగి దీన్ని 1949లో ఆనాటి రాష్ట్ర గవర్నర్ జనరల్ సి రాజగోపాలాచారి మళ్ళీ ప్రారంభించారు. ►కోవిడ్ విపత్తు వల్ల 81వ నుమాయిష్ 2022లో మొదలైనా కూడా కొనసాగించలేకపోవడం మనకు తెలిసిందే. ►ప్రస్తుత ఎగ్జిబిషన్ 2600కు పైగా దేశ విదేశాల స్టాల్స్‌తో చిత్ర విచిత్రమైన వస్తు వ్యాపారాలు, తినుభండారాలు, విజ్ఞాన వినోదాలు అన్ని వర్గాల వారికి అందిస్తూ ప్రతి రోజు దాదాపు 50 వేల మంది సందర్శకులను ఆకర్షిస్తుంది. ఇందులో జరిగే హైదరాబాద్ సంస్కృతిలో ప్రధానమైన 'ముషాయిరా 'ఉర్దూ కవుల సమ్మేళనం ప్రత్యేక ఆకర్షణ. ►'హైదరాబాద్ ఎగ్జిబిషన్ సొసైటీ' కంపెనీ యాక్ట్ కింద రిజిస్టర్ అయిన లాభాపేక్ష లేని సంస్థ. దీనికి ప్రతిసారి రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఒక మంత్రి లేదా స్పీకర్ అధ్యక్షుడుగా ఉంటారు. ప్రస్తుతం మంత్రి హరీశ్ రావు ఆ స్థానంలో ఉన్నారు. దీని ఆధ్వర్యంలో పలు విద్యా సంస్థలు నిర్వహించబడటం విశేషం. ►ఉమ్మడి రాష్ట్రంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్‌గా ఉన్న శంకర్ జీ.. ఫౌండర్ మెంబర్ హోదాలో చాలా కాలం ఈ సొసైటీకి సేవలు అందించారని ఇందులోని సమావేశ మందిరానికి 'శంకర్ జీ మెమోరియల్ హాల్ 'అని పేరు పెట్టారు. అయితే నాటి వ్యవస్థాపక సభ్యులను పూర్తిగా మరిచిపోవడం మాత్రం అన్యాయం. -వేముల ప్రభాకర్.. డల్లాస్, అమెరికా -
నుమాయిష్‌తో అపూర్వ అనుభూతి
సాక్షి, హైదరాబాద్: ‘‘పెరిగిన సాంకేతికతతో మొబైల్ ఫోన్లో ఆర్డర్స్ క్లిక్ చేస్తే వస్తువులు ఇంటి వద్దకు చేరవచ్చు. కానీ, నుమాయిష్‌లో వివిధ సంస్కృతులు, ఆహారపు అలవాట్లు, నచ్చిన, మెచ్చిన వస్తువులను చూసి కొనుగోలు చేయడం ద్వారా పొందే అనుభూతిని మాత్రం కోల్పోతామని రాష్ట్రమంత్రి,, ఎగ్జిబిషన్ సొసైటీ గౌరవ అధ్యక్షుడు హరీశ్‌రావు అన్నారు. ఆదివారం హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన (నుమాయిష్)–82ను ఆయన మంత్రులు మహమూద్ అలీ, శ్రీనివాస్ యాదవ్, వేముల ప్రశాంత్‌రెడ్డి తదితరులతో కలసి ప్రారంభించారు. అక్కడ ఏర్పాటు చేసిన సాళ్లను సందర్శించి వివిధ రాష్ట్రాల ఉత్పత్తులను పరిశీలించారు. అనంతరం వారు నుమాయిష్‌లోని టాయ్‌ట్రైన్‌లో ప్రయాణించారు. అంతకుముందు జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రజల జీవన శైలిలో ప్రతి కొత్త సంవత్సరం హైదరాబాద్ నుమాయిష్ భాగమైపోయిందన్నారు. సామాజిక అనుబంధాన్ని కోల్పోకుండా నుమాయిష్‌ను సందిర్శంచి లభించే గొప్ప అనుభూతిని ఆస్వాదించాలని కోరారు. కన్యాకుమారి నుంచి జమ్మూకశ్మీర్ వరకు వివిధ రాష్ట్రాల నుంచి వ్యాపారులు ఎగ్జిబిషన్‌కు వచ్చి స్టాళ్లు ఏర్పాటు చేస్తారని, వివిధ రకాల సంప్రదాయ ఉత్పత్తుల స్టాళ్లతో ఎగ్జిబిషన్ గ్రౌండ్ మినీభారత్‌ను తలపిస్తోందని పేర్కొన్నారు. ఎంతో చరిత్ర కలిగిన హైదరాబాద్ నుమాయిష్ ప్రపంచంలో జరిగే వ్యాపార సమ్మేళనాల్లో ఒకటిని పేర్కొన్నారు. మహిళాసాధికారతకు తోడ్పాటు ప్రతి ఏడాది ఎగ్జిబిషన్ ద్వారా లభించే ఆదాయంతో విద్యాభివృద్ధికి తోడ్పాటు అందిస్తున్నట్లు మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. సొసైటీ ఆధ్వర్యంలో 19 విద్యాసంస్థలకు నిధులు సమకూర్చి దాదాపు 30 వేలమందికి నాణ్యమైన విద్యను అందిస్తున్నట్లు తెలిపారు. ప్రత్యేకంగా మహిళా విద్యను ప్రోత్సహించేందుకు విద్యాసంస్థలు నడిపిస్తూ మహిళా సాధికారతకు తోడ్పాటునందిస్తున్నారు. హైదరాబాద్‌లోనే కాకుండా మారుమూల నిర్మల్ వంటి దూర ప్రాంతాల్లోనూ విద్యాసంస్థలు ప్రారంభించి, ఎంతోమందిని విద్యావంతులుగా తీర్చిదిద్దుతున్నట్లు గుర్తు చేశారు. సుమారు రెండు వేల టీచింగ్– నాన్ టీచింగ్ సిబ్బంది పనిచేస్తున్నారని, ప్రతి ఏడాది దాదాపు పదివేలమందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పించడం జరుగుతోందన్నారు. ఇక్కడ చదివిన విద్యార్ధులు దేశవిదేశాల్లో ఉన్నతమైన స్ధానాల్లో ఉన్నారని , వారు సొసైటీని బలోపేతం చేసేందుకు ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. హోం మంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా ఎగ్జిబిషన్ ద్వారా లభించే ఆదాయాన్ని విద్య కోసం వెచ్చిస్తుందని పేర్కొన్నారు. మిగతా జిల్లాలో కూడా ఎగ్జిబిషన్ ఏర్పాటు విస్తరించాలని నిర్ణయించడం అభినందనీయమన్నారు. మంత్రి ప్రశాంత్ రెడ్డి మట్లాడుతూ లాభాపేక్ష లేకుండా సొసైటీ సేవలు అభినందనీయమని, మళ్లీ పాత నుమాయిష్ రోజులు రావాలని ఆకాంక్షించారు. మంత్రి తలుసాని మాట్లాడుతూ స్వాతంత్య్రం రాకముందు నుంచి నుమాయిష్ నిర్వహిస్తూ వచ్చిన ఆదాయంతో పలు విద్యసంస్థలు నడపడం గొప్ప విషయమన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని, ఎగ్జిబిషన్ గ్రౌండ్ స్థలం విషయంలో చొరవ చూపినట్లు గుర్తు చేశారు. కార్యక్రమంలో హజ్ కమిటీ చైర్మన్ సలీం, ఎగ్జిబిషన్ సోసైటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. -
Hyderabad: నుమాయిష్‌కు అంతా రెడీ.. ఎంట్రీ ఫీజు ఎంతంటే!
సాక్షి, హైదరాబాద్: జనవరి 1వ తేదీ నుంచి నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో 83వ అఖిలభారత పారిశ్రామిక ప్రదర్శన (నుమాయి‹Ù) ప్రారంభమవుతుందని ఎగ్జిబిషన్ సొసైటీ ఉపాధ్యక్షులు అశ్విని మార్గం తెలిపారు. శుక్రవారం ఎగ్జిబిషన్ మైదానంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత రెండు సంవత్సరాలుగా కోవిడ్ నేపథ్యంలో నుమాయిష్లోలో వ్యాపారాలు సరిగా జరగలేదని పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితులు అన్ని అనుకూలంగా ఉన్న నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ నుమాయిష్ ప్రదర్శనకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. ఈ ఏడాది కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అన్నిరకాల ఉత్పత్తులతో కూడిన స్టాల్స్ అందుబాటులో ఉంటాయని తెలిపారు. విశాలమైన మైదానంలో స్టాల్స్‌కు మధ్య దూరం కల్పిస్తూ సుమారు 2400 స్టాళ్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎగ్జిబిషన్ ప్రదర్శనకు వచ్చే సందర్శకులకు ఉచిత పార్కింగ్, వైద్య శిబిరం ఏర్పాటు చేయడంతో పాటు కోవిడ్ భద్రతా ఏర్పాట్లను చేపట్టినట్లు తెలిపారు. ఈ నెల 1వ తేదీన రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ, మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, వేముల ప్రశాంత్‌రెడ్డిలు ముఖ్య అతిథిగా హాజరై ఎగ్జిబిషన్‌ను ప్రారంభిస్తారని వెల్లడించారు. ఈ ఏడాది ప్రవేశ రుసుము రూ.40 అని, అదేవిధంగా పిల్లలు, పెద్దల కోసం అద్భుతమైన అమ్యూజ్మెంట్ పార్కును సిద్ధం చేసినట్లు వెల్లడించారు. ఈ సమావేశంలో ఎగ్జిబిషన్ సొసైటీ కార్యదర్శి సాయినాథ్, దయాకర్ శాస్త్రి, జాయింట్ సెక్రెటరీ వనం సురేందర్, పబ్లిసిటీ చైర్మన్ హరినాథ్‌రెడ్డి, కనీ్వనర్ ఆదిత్య మార్గం తదితరులు పాల్గొన్నారు. -
నుమాయిష్ నయా లుక్..సిద్ధమవుతోన్న ఎగ్జిబిషన్
సాక్షి, హైదరాబాద్: నగరంలో ఆల్ ఇండియా ఇండ్రస్టియల్ ఎగ్జిబిషన్ (నుమాయిష్) ప్రారంభానికి ఇంకా కొద్ది రోజులే ఉంది. గత రెండేళ్లుగా కరోనాతో పూర్తిస్థాయి వైభవానికి దూరమైన ఈ భారీ ప్రదర్శన... ఈసారి రెట్టించిన ఉత్సాహంతో సందర్శకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. కొత్త కొత్త విశేషాలను జోడిస్తున్నామని, సందర్శకుల అనుభూతిని పెంచనున్నామని ఎగ్జిబిషన్ సొసైటీ ప్రతినిధులు చెబుతున్నారు. కోవిడ్ మహమ్మారి సమస్యల కారణంగా షెడ్యూల్ ప్రకారం నుమాయిష్ నిర్వహించలేకపోయారు. కరోనాకి ముందు 45 రోజుల వ్యవధిలో సుమారు 20 లక్షల మంది ప్రజలు నుమాయిష్‌ను సందర్శించేవారు. వారాంతాల్లో ఒక్క రోజులో హాజరు 40,000 ఉండేది. అయితే కరోనాతో భారీగా పడిపోయిన ఈ సంఖ్యల్ని మళ్లీ తీసుకురావాలని సొసైటీ కృతనిశ్చయంతో ఉంది. ఆరంభమే...సంపూర్ణంగా... సాధారణంగా నుమాయిష్ జనవరి 1న ప్రారంభమైనా, స్టాల్స్ మొత్తం ఏర్పాటవడం అంటే అది సంక్రాంతి పండుగ తర్వాతే జరుగుతుంది. అయితే ఈసారి అలా కాకుండా తొలి రోజు నుంచే పూర్తిగా లేదా కనీసం 80 శాతం స్టాల్ యజమానులు తమ వ్యాపార కార్యకలాపాలను ప్రారంభించేలా చూడాలని ఎగ్జిబిషన్ సొసైటీ తమ లక్ష్యంగా పెట్టుకుంది. ‘సందర్శకులకు, స్టాల్ యజమానులకు ఉభయకుశలోపరిగా ఉండేందుకు అధికారిక ప్రారంభోత్సవం నుంచే పూర్తిస్థాయిలో స్టాల్స్ ఏర్పాటయేలా ప్రయత్నిస్తున్నాం,’అని ఎగ్జిబిషన్ సొసైటీ వైస్ ప్రెసిడెంట్ అశి్వన్ మార్గం అన్నారు. ప్రారంభమైన స్టాల్స్ కేటాయింపు.. నుమాయిష్‌లో 10/12 విస్తీర్ణంలో స్టాల్స్ నిర్మాణం వేగంగా సాగుతోంది. భద్రతా కారణాలు, అగ్నిమాపక నిరోధక నిబంధనలను మరింత పటిష్టంగా అమలు చేస్తున్న కారణంగా అత్యవసర వాహనాలు వెళ్లేందుకు ఎక్కువ స్థలాన్ని అనుమతించడం వల్ల ఈ సారి స్టాళ్ల సంఖ్య కొంత తగ్గనుంది. గత సోమవారం నుంచి స్టాళ్ల యజమానులకు సొసైటీ కేటాయింపు లేఖలు అందజేయనుంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా 2,000 మంది వ్యాపారుల నుంచి దరఖాస్తులు రాగా, 1,200 స్టాల్స్‌ను కేటాయించనున్నారు. గత ఏడాది కొందరు జీఎస్టీ కట్టకుండా వెళ్లిపోయిన దృష్ట్యా ఈ దఫా స్టాల్స్‌కి జీఎస్టీతో కలిపి రూ.10 వేల చొప్పున అదనంగా కేటాయింపు పెంచారు. తెలంగాణ ఉత్పత్తులు పెడతామని రాష్ట్ర సూక్ష్మ మధ్య తరహా పరిశ్రమల(ఎంఎస్ఎమ్ఇ)ల నుంచి 50స్టాల్స్ కోసం వినతి రావడంతో వాళ్ల కోసం ప్రత్యేకంగా స్థలం కేటాయిస్తున్నామన్నారు. సందర్శన వేళలు పెంపు... వీకెండ్స్‌లో రద్దీ ఎక్కువగా ఉండే సమయంలో కనీసం రాత్రి 11.30 గంటల వరకు ఎగ్జిబిషన్‌ను అనుమతించాలని సొసైటీ సంబంధిత అధికారులను కోరనుంది. ‘నగరమంతటా అర్ధరాత్రి వరకు మార్కెట్లు తెరిచి ఉంటాయి. కాబట్టి ఎగ్జిబిషన్ కూడా రాత్రి 10.30 గంటల నుంచి మరో గంట సమయం అధికంగా సడలింపును కోరుతున్నాము, తద్వారా రద్దీ తగ్గి, సందర్శకులు ఇక్కడ షాపింగ్ చేయడానికి విశ్రాంతి తీసుకోవడానికి తగినంత వ్యవధి లభిస్తుంది’అని అశ్విన్ చెప్పారు. సందర్శకులకు ఉచిత ‘వైఫై’ సౌకర్యాన్ని అందించడానికి కూడా ప్లాన్ చేస్తున్నాం్ఙ అని అన్నారాయన. ఈ సారి స్ట్రీట్ లైట్స్ వగైరాలతో మరింత సుందరంగా తయారు చేస్తున్నాం. అలాగే ఎంత రష్ ఉన్నా ఫ్రీ మూమెంట్ ఉంటుంది. తోసుకోవడం వంటివి ఉండదు. ఒకప్పుడు కార్నర్ స్టాల్స్ వరకూ వెళ్లగలిగేవారు కాదు. ఇప్పుడలా కాదు..ప్రతీ స్టాల్ మెయిన్ స్టాల్ తరహాలో కనిపిస్తుంది. అదే విధంగా గతంతో పోలిస్తే పాత్ వే 15 అడుగుల వరకూ పెంచాం. ‘వీటన్నింటి దృష్ట్యా నాలుగేళ్ల తర్వాత నుమాయిష్ ప్రవేశ రుసుమును రూ. ఒక్కొక్కరికి 40కి పెంచుతున్నాం’ అని అశ్విన్ మార్గం చెప్పారు. (చదవండి: ఆకాశ వీధి నుంచి.. అందాల వీక్షణం ) -
జనంతో కిటకిటలాడుతున్న నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్.. (ఫొటోలు)