తరలివస్తున్న యూ ట్యూబర్స్, ఇన్‌ఫ్లుయెన్సర్లు
వైవిధ్యభరిత ఉత్పత్తులకు సామాజిక మాధ్యమాల్లో పట్టం
మెన్ @ నుమాయిష్ రీల్‌కి వేల సంఖ్యలో వ్యూస్, లైక్స్..
కంటెంట్ క్రియేటర్‌లు, ఇన్‌ఫ్లుయెన్సర్‌లు పెద్ద ఎత్తున హైదరాబాద్‌లో సందడి చేస్తున్నారు. సాధారణంగా నగరంలో కొత్తగా ప్రారంభించిన కేఫ్ అయినా లేదా ఏదైనా ఆసక్తికరమైన ఈవెంట్ అయినా, ఇన్‌స్టా రీల్స్, యూట్యూబ్ వీడియోల్లో తక్షణమే ప్రత్యక్షమవుతుంది. అయితే వందల సంఖ్యలో వెరైటీ ఉత్పత్తులు, వేర్వేరు ప్రాంతాలకు చెందిన స్టాల్స్.. ఉండే నుమాయిష్ ఎగ్జిబిషన్ ఇన్‌ఫ్లుయెన్సర్లలో సోషల్ జోష్ నింపుతోంది.. దీంతో వీరికి చేతినిండా పని పెడుతోంది. ఈ క్రమంలో దీని గురించిన మరిన్ని విషయాలు..
హైదరాబాద్‌లోని నాంపల్లి మైదాన ప్రాంతం ఇప్పుడు కిక్కిరిసిన దుకాణాలతో, సందర్శకులతో కిటకిటలాడుతోంది. జనవరి 3న ప్రారంభమైన ఈ ఐకానిక్ ఈవెంట్ ఫిబ్రవరి 18, 2025 వరకూ సందర్శకులను అలరించనుంది. మరోవైపు ఈ 84వ ఆల్ ఇండియా ఇండ్రస్టియల్ ఎగ్జిబిషన్ ఈసారి సోషల్ మీడియా వేదికగా భారీ ప్రచారం అవుతోంది. విభిన్న రకాల కంటెంట్స్ చేసేందుకు వీలుండడంతో ఇది క్రియేటర్‌లకు గమ్యస్థానంగా మారింది. స్థానికులకు, సందర్శకులకు ఎల్లప్పుడూ ఇష్టమైన హైదరాబాద్ ఐకానిక్ వార్షిక ఫెయిర్ ఇన్‌స్టా ఇన్‌ఫ్లుయెన్సర్‌లు, యూట్యూబర్ల ప్రవాహానికి నిలయంగా మారింది.
రోజుకొకటి.. అదే వెరైటీ..
కొంతమంది కంటెంట్ క్రియేటర్స్.. ఒక్కో రోజును ఎగ్జిబిషన్‌లోని ఒక్కో విభాగాలకు అంకితం చేస్తున్నారు. ఉదాహరణకు, ఒక రోజు రుచికరమైన స్ట్రీట్ ఫుడ్ గురించి, మరొక రోజు సంప్రదాయ చేనేత స్టాల్స్ గురించి.. తర్వాతి రోజు రైడ్‌లు.. ఎంటర్‌టైన్‌మెంట్ జోన్‌లను ఇలా విభజిìæంచి చూపిస్తున్నారు. ఈ సమాచారం వీక్షకులకు వినోదాన్ని మాత్రమే కాకుండా నుమాయిష్ సందర్శనను ప్లాన్ చేయడంలో కూడా ఉపకరిస్తోంది. వీరి కంటెంట్‌కు సోషల్ మీడియాలో భారీ స్పందన లభిస్తోంది. నగరంతో పాటు దేశవ్యాప్తంగానూ అనేక మందిని ప్రభావితం చేస్తోంది.
రీల్స్ కేరాఫ్‌గా..
ఆహార ప్రియుల సాహసాల నుంచి షాపింగ్ స్ప్రీల వరకూ.. ఫీడ్‌లో స్క్రోల్ చేయడానికి ఎల్లప్పుడూ ఏదో ఒక ప్రత్యేకతతో నుమాయిష్ షాపింగ్, ఆహార ఉత్పత్తులను మాత్రమే కాకుండా సృజనాత్మక సోషల్ మీడియా కంటెంట్‌ను కూడా అందిస్తుంది. ఈ విషయాన్ని శరవేగంగా వ్యాపిస్తుండడంతో నుమాయిష్ రీల్స్, వీడియోలకు కేరాఫ్‌గా మారింది. దీంతో ఇన్‌ఫ్లుయెన్సర్లు, సోషల్ మీడియా నిర్వాహకులతో ఎగ్జిబిషన్ సందడిగా మారుతోంది.
అడుగడుగునా కెమెరాలు..
నుమాయి‹Ùలోని కలర్‌ఫుల్ స్ట్రీట్స్ మీదుగా నడుస్తుంటే.. సందడిగా ఉన్న స్టాల్స్‌కు ముందు పలు కెమెరాలను అమర్చడాన్ని గమనించవచ్చు. ఇన్‌స్టా, లేదా యూట్యూబ్ ద్వారా ఈ గ్రాండ్ ఎగ్జిబిషన్‌లోని ప్రతి మూలనూ కవర్ చేస్తూ ప్రతిరోజూ వందల సంఖ్యలో కంటెంట్ అప్‌లోడ్ చేస్తున్నారు. లక్నో చికన్ కారీ స్టాల్స్ నుంచి కాశ్మీరీ షాపుల వరకూ నోరూరించే ఫుడ్ కోర్ట్ నుంచి వినోద ప్రదేశంలో థ్రిల్లింగ్ రైడ్‌ల వరకూ దేనికదే వెరైటీగా కినిపిస్తోంది. దీంతో మెటీరియల్‌కు కొరత లేకపోవడం వీరికి మరింత ఉత్తేజాన్ని అందిస్తోంది.
క్రేజీగా..మెన్ ఎట్ నుమాయిష్?..
ఈ సంవత్సరం ‘మెన్ ఎట్ నుమాయిష్’ పేరుతో ఓ రీల్ ఇంటర్నెట్‌లో క్రేజీగా మారింది. మగవాళ్లు తమ కుటుంబాలతో కలిసి షాపింగ్ ట్రిప్‌లలో చురుకుగా పాల్గొంటున్నట్లు చూపే ఈ రీల్ వేగంగా వైరల్ అయ్యింది. ఈ రీల్‌కి ఇన్‌స్టాలో ఒక్క రోజులో 1.5 మిలియన్లకు పైగా వీక్షణలు, 75,000 పైగా లైక్‌లు రావడం విశేషం. షాపింగ్ బ్యాగ్‌లను మోసుకుంటూ భార్యల్ని అనుసరించే భర్తలు, పిల్లలను ఎత్తుకుని ఆడిస్తుంటే మహిళలు షాపింగ్‌లో మునిగిపోవడం.. రీల్‌ని సూపర్ హిట్ చేశాయి.
Comments
Please login to add a commentAdd a comment