
డిజిటల్ మాధ్యమంతో అన్నీ లాభాలే లేనప్పటికీ, దీని ద్వారా దేశంలో మూరుమూల ప్రాంతాలకు చెందిన అనేక మంది కళాకారులు వెలుగులోకి వస్తున్నారు. తమ అద్భుతమైన కళతో ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అవుతున్నారు. పెయింటింగ్, క్రాఫ్ట్, మేకప్, ఇలా అద్భుతమైన చేతిపనులతో తమ సామర్థ్యాన్ని నిరూపించుకుంటున్నారు. ఒక్కోసారి వారి నైపుణ్యం చూసి ఇంటర్నెట్ వినియోగదారులు అబ్బురపడిపోతూ ఉంటారు. ఇలాంటి కోవకు చెందిన వారే కొల్హాపూర్‌కు చెందిన మెహందీ/మేకప్ ఆర్టిస్ట్ సోనాలీ(Sonali) ఈమె చేసిన పనికి నెటిజనులు ఫిదా అవుతున్నారు. ఇంతకీ ఆమె చేసిన గొప్ప పనేంటి? పదండి తెలుసుకుందాం.
తన మెహిందీ, మేకప్ కళ ద్వారా సోషల్ మీడియాలో చాలా పాపులర్ సోనాలి. ఆమెకు లక్షల్లో ఫోలోయర్లు ఉన్నారు. ఆమె వేసే గోరింటాకు డిజైన్లు చాలా అద్భుతంగా ఉంటూ ఆకట్టుకుంటూ ఉంటాయి. తాజాగా ఆమె ఇన్‌స్టాలో షేర్ చేసిన ఒక వీడియో కోటికి పైగా వీక్షణలను పొందింది. సోనాలి నైపుణ్యాన్ని చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. (35 ఏళ్ల నాటి డ్రెస్‌తో రాధికా మర్చంట్ న్యూ లుక్...ఇదే తొలిసారి!)
అనంత్ అంబానీ రాధిక మర్చంట్ (AnantAmbani-RadhikaMerchant ప్రీ-వెడ్డింగ్ వేడుకల్లో సందడి చేసిన పాప్ స్టార్ రిహన్న (Rihanna) గుర్తుందా. సోనాలీ అచ్చం ఆమెలాగానే మేకప్ వేసుకుంది. రిహన్నాను పునఃసృష్టించిన సోనాలి అందమైన రూపాన్ని చూసి ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. ఈ వీడియోను పోస్ట్ చేసింది. ఈ వీడియోకు 12.7 మిలియన్ల వ్యూస్, 6.5 లక్షలకు పైగా లైక్స్ వచ్చాయి. నెటిజన్లు ఆమెపై ప్రేమను కురిపించారు. కొందరు ఆమె నైపుణ్యాలను ప్రశంసించగా, మరికొందరు ఆమె వేగవంతమైన బ్రష్ స్ట్రోక్స్ మరియు మేకప్ నైపుణ్యాలు , కంటెంట్, ఆమె భాషను మెచ్చుకున్నారు. అమేజింగ్ ఆర్ట్ అంటూ మరికొందరు కొనియాడారు.
కమాన్ గైస్.. ఇలాంటి టాలెంట్ వాళ్లను పాపులర్ చేద్దా అంటూ స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ వ్యాఖ్యానించింది. ఇంకా నటి క్రిషన్ ముఖర్జీ కూడా సోనాలి నైపుణ్యాలను చూసి ఆశ్చర్యపోయిందంటే ఆమె ఆర్ట్‌ను అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు సోనాలి సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో యాక్టివ్‌గా ఉండే సోనాలీ తన మేకప్ నైపుణ్యాల వీడియోను తరచూ షేర్ చేస్తూ ఉంటుంది. ఇవి లక్షల వ్యూస్, లైక్స్‌తో ఆదరణ పొందుతుంటాయి. ముగ్గురు పిల్లల తల్లిగా ఇంకేం పని చేస్తావని తనను ఎగతాళి చేశారనీ, కానీ తల్లిగా వర్క్ లైఫ్‌ను ఎలా బ్యాలెన్స్ చేస్తోందీ వివరిస్తూ చేసిన సోనాలి వీడియో కూడా 6.9 మిలియన్ల మిలియన్ల వీక్షణలను, ప్రేమపూర్వక కామెంట్లను సంపాదించడం విశేషం.
చదవండి: శోభిత ధూళిపాళ బ్యూటీ సీక్రెట్స్ తెలిస్తే షాకవుతారు!