pre wedding
-
జోరుగా.. హుషారుగా వసూళ్లు : ప్రీ వెడ్డింగా? ప్రీ వేస్టింగా!
పెళ్లంటే..పందిళ్లు, బాజాలు, భజంత్రీలు, బంధువుల, విందు భోజనాలు...ఇది ఒకప్పుడు ఇప్పుడు ట్రెండ్ మారింది. వివిధ రకాల ఫోటోషూట్లు వీటి స్థానాన్ని ఆక్రమించాయి. నేటి యువత పెళ్లి కంటే ప్రీ వెడ్డింగ్‌కే ఎక్కువగా ప్రాధాన్యమిస్తున్నారు. వీటితోపాటు పెళ్లి, రిసెప్షెన్ డ్రస్సులకు కూడా వేలు, ఒక్కోసారి లక్షల్లో కూడా ఖర్చు చేస్తున్నారు. ప్రీ వెడ్డింగ్ షూట్‌కు తమ చుట్టుపక్కల చూడదగిన రమణీయమైన ప్రాంతాలకు వెళ్లడం లేదా ప్రత్యేకంగా పర్యాటక ప్రాంతాలకు వెళ్లడం చేస్తున్నారు.కాబోయే జంటలను తీసుకెళ్లడానికి కార్లు, భోజనం మొదలుకుని బస చేయడానికి హోటళ్లు, గెస్ట్ హౌస్‌లలో గదుల బుకింగ్ పనులన్నిటినీ ఫొటోగ్రాఫర్లే చూసుకుంటారు. కొందరు ప్రీ వెడ్డింగ్‌కు రూ.25 వేల నుంచి 35 వేలు చార్జీలు తీసుకుంటుండగా మరికొందరు రూ.50–75 వేల వరకు వసూలు చేస్తున్నారు. కొంత హై ఫై సౌకర్యా లు కావాలంటే ఏకంగా రూ.90 వేల వరకు చార్జీలు కూడా వసూలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఫోటోగ్రాఫర్లు, ఈవెంట్మేనేజర్లకు డిమాండ్ పెరిగింది. (ప్రియురాలికి ఫ్లాట్, లగ్జరీ కారు, అడ్డంగా బుక్కైన ప్రియుడు!)ఎంతైనా తగ్గేదేలే... గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ముహూర్తాలు ఎక్కువగా ఉన్నాయి. వారానికి కనీసం మూడు, నాలుగు పెళ్లిళ్లు జరుగుతున్నాయి. ఎక్కడ చూసినా పెళ్లి బాజాలు వినిపిస్తున్నాయి. సాయంత్రమైందంటే చాలు భాజాభజంత్రీలు, బ్యాండ్ల మోతలతో బారాత్‌లు(పెళ్లి ఊరేగింపులు) తీస్తున్న దశ్యాలే దర్శనమిస్తున్నాయి. ఒకప్పుడు పెళ్లంటే ఇంటి గుమ్మం ముందు లేదా ఖాళీ స్థలాల్లో జరిగేవి. కాని కాలం మారడంతో వాటికి స్వస్తి పలికి ఏసీ, నాన్ ఏసీ పంక్షన్ హాళ్లలో చేస్తున్నారు. ఫలితంగా హాళ్లకు డిమాండ్ పెరిగింది.ఇందుకోసం ఫొటోగ్రాఫర్లకు ఎంత చార్జీలు చెల్లించేందుకైనా వెనకాడడం లేదు. అయితే ఇది తమ తల్లిదండ్రులకు అదనపు భారంగా పరిణమిస్తుందని వధూవరులు గ్రహించలేక పోతున్నారు. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కావడంతో ఫొటోగ్రాఫర్లు, మ్యూజిక్ బ్యాండ్లు, సంప్రదాయ సంగీత వాద్య బృందాలకు కూడా డిమాండ్ పెరిగింది. డిమాండ్‌కు తగ్గట్లుగా.... అమ్మాయిల కొరత కారణంగా గత రెండు, మూడేళ్లుగా పెళ్లిళ్లు ఎక్కువ శాతం జరగలేదు. దీనికి తోడు ముహూర్తాలు కూడా ఎక్కువగా లేకపోవడంవల్ల చాలా పెళ్లిళ్లు వాయిదా పడ్డాయి. కానీ ఈ ఏడాది ముహూర్తాలు ఎక్కువ ఉండడంవల్ల ఎక్కడ చూసిన పెళ్లి సందడి కనిపిస్తోంది. ఫంక్షన్ హాళ్లన్నీ ఇప్పటికే రిజర్వై పోయి ఉండటంతో అందుబాటులో ఉన్న స్కూళ్లు, కాలేజీ గ్రౌండ్లు, క్రీడా మైదానాలలో కూడా పెళ్లిళ్లు జరిపిస్తున్నారు. ఒకప్పుడు ముహూర్తాలు చూసుకుని ఫంక్షన్ హాళ్లు బుక్ చేసుకునేవారు. (చిట్టి లవంగం : గట్టి లాభాలు, బరువు కూడా తగ్గొచ్చు!)కానీ ఇప్పుడు డిమాండ్ పెరగడంతో ఏ రోజు హాలు ఖాళీ ఉందో ఆరోజు ముహూర్తం పెట్టుకోవల్సిన పరిస్ఠితి వచి్చంది. ముఖ్యంగా ఫంక్షన్ హాళ్లు, బాంక్వేట్ హాళ్లలో వేడుకలకు ఖర్చు తక్కువ కావడంతోపాటు బంధువులకు భద్రత, విలువైన వస్తువులకు రక్షణ ఎక్కువ. కానీ గ్రౌండ్లలో, ఖాళీ మైదానాలలో పెళ్లి చేయాలంటే చాలా ఖర్చు చేయాల్సిఉంటుంది. భారీ వేదిక, చుట్టుపక్కల, పైన టెంట్లు నిర్మించడం, గాలికి దుమ్ము, ధూళి లేవకుండా మైదానంలో కార్పెట్లు వేయడం, కళ్లు జిగేల్మనిపించే విద్యుత్ దీపాలు, సిరీస్ లైట్ల ఏర్పాటు, వాహనాల పార్కింగ్‌కు ప్రత్యేకంగా స్ధలం కేటాయించడం, విలువైన వస్తువులు దొంగతనానికి గురికాకుండా కాపాడుకునేందుకు, బిచ్చగాళ్లు, బయట వ్యక్తులు వచ్చి భోజనం చేయకుండా చూసేందుకు ప్రైవేటు సెక్యురిటీ గార్డులను నియమించడం... ఇదంతా పెద్ద ఖర్చుతో కూడుకున్న పని.మరోపక్క డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని లౌడ్‌స్పీకర్ల యజమానులు, బ్రాస్ బ్యాండ్ నిర్వాహకులు, బారాత్‌లకు అద్దెకిచ్చే ఓపెన్ టాప్ కార్లు, మెర్సిడీస్ బెంజ్ వాహనాలు, గుర్రపు బండ్ల యజమానులు అడ్డగోలుగా చార్జీలు పెంచేశారు. మేకప్‌కు కూడా లక్షల్లోనే... ఈ ఖర్చులన్నీ ఒక ఎత్తైతే వధూవరులు అనవసరంగా చేస్తున్న ప్రీ వెడ్డింగ్, మేకప్ ఖర్చులు హద్దులు దాటుతున్నాయి. వధూవరులతోపాటు బంధువుల మేకప్‌కు సైతం లక్షల్లో ఖర్చు చేస్తున్నారు. -
PV Sindhu Pre-wedding : పీవీ సింధు ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ (ఫోటోలు)
-
అనంత్-రాధిక హల్దీ.. వెలుగులోకి మరో వీడియో! వైరల్
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ నీతా అంబానీ చిన్న కుమారుడు అనంత్ రాధికల పెళ్లి ఎంతలా అంగరంగ వైభవంగా జరిగిందో తెలిసిందే. ఆ వేడుకకు సంబంధించిన ప్రతి ఫోటో, వీడియోలు నెట్టింట సందడి చేస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా అంబానీలు ధరించే కాస్ట్యూమ్స్, నగలు, తదితరాలు చాలా హాట్‌టాపిక్‌గా నిలిచాయి కూడా. అయితే ఆ వేడుకకు సంబంధించి ఓ వీడియోని మాత్రం అందరూ మిస్ అయ్యాం. సరదసరదాగా సాగే హల్దీ వేడుకకు సంబంధిచిన మరో వీడియో తాజగానెట్టింట తెగ వైరల్ అవుతోంది. అంబానీలకు సన్నిహితుడైన అకా ఓర్హాన్ అవత్రమణి షేర్ చేసిన ఈ లేటెస్ట్ వీడియోలో అంబానీలంతా ఖుషీగా గడిపినట్లు కనిపించింది. అతిధులంతా పసుపునీళ్లు ఒకరిపై ఒకరూ వేసుకుంటూ సందడి చేశారు. ఆ వీడియోలో నీతా అంబానీ పసుపు నీళ్లు పడకుండా తప్పించుకోవడంలో విఫల ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ వేడుకకు హోస్ట్‌గా ఉన్న నీతా అంబానీ సైతం అంరిలానే హల్దీ దాడిని ఎదుర్కోవడం ఫన్నీగా ఉంటుంది. ఇక అనంత్ అంబానీ బావమరిది ఆనంద్ పిరమల్ ఒకరిపై ఒకరు పసుపు నీళ్లు, పూలతో దాడి చేయడం, మరోపక్క అతిథులంతా నవ్వుతూ ఉన్నట్లు వీడియోలో కనిపించింది. ఈ హల్దీ ఫంక్షన్ ముంబైలోని అంబానీ కుటుంబానికి చెందిన ఆంటిలియాలో జరిగింది. ఈ వేడుకలో జాన్వీ కపూర్, అర్జున్ కపూర్, రణ్వీర్ సింగ్ తదితర తారలు పాల్గొన్నారు. అంతేగాదు ఈ లెటెస్ట్ ఓర్రీ వీడియోలో ధోల్ బీట్లు, డ్యాన్స్‌లతో ఇతర అతిథులు ఎంత సరదాగా గడిపారో కూడా కనిపిస్తోంది. కాగా, అనంత్ రాధిక మర్చంట్ల వివాహం ఈ ఏడాది జూలై 12న అత్యంత లగ్జరియస్‌గా జరిగింది. (చదవండి: అందమైన శరీరాకృతికి బీబీఎల్ సర్జరీ: అంటే ఏంటీ..? ఎదురయ్యే దుష్ర్పభావాలు..) -
గోవాలో కీర్తి సురేశ్ పెళ్లి వేడుక.. ఫోటో పంచుకున్న హీరోయిన్!
హీరోయిన్ కీర్తి సురేశ్ వివాహబంధంలోకి అడుగుపెట్టనుంది. ఈనెల 12న తన చిన్ననాటి స్నేహితుడు, ప్రియుడు ఆంటోనీ తటిల్‌ను పెళ్లాడనుంది. ఇప్పటికే కీర్తి సురేశ్ తన పెళ్లి విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. గోవాలో జరగనున్న వీరి పెళ్లి వేడుకకు సంబంధించి ప్రీ వెడ్డింగ్ వేడుకలు ప్రారంభమయ్యాయి. తాజాగా కీర్తి సురేశ్ తన ఇన్‌స్టా స్టోరీస్‌లో ఫోటోను షేర్ చేసింది. ఇప్పటికే ఇరువురి కుటుంబ సభ్యులంతా గోవాలో ల్యాండైనట్లు తెలుస్తోంది. కాగా.. 15 ఏళ్లుగా వీరిద్దరు రిలేషన్లో ఉన్నారు.రెండు సంప్రదాయాల్లో వివాహం..ఇరు కుటుంబాల సమ్మతితో రెండు మతాలను సంప్రదాయాలనూ గౌరవించే విధంగా ఆంటోనీ, కీర్తి సురేష్ వివాహం చేసుకోవడానికి సిద్ధమయ్యారు. ఈనెల 12వ తేదీ ఉదయం హిందూ మత సంప్రదాయ ప్రకారం, అదేరోజు సాయంత్రం చర్చిలో క్రిస్టియన్ మత సాంప్రదాయ ప్రకారం కీర్తి సురేష్, ఆంటోనీ పెళ్లి రెండు సార్లు జరగనుందని తెలిసింది. వీరి వివాహ వేడుకలో పలువురు సినీ ప్రముఖులు పాల్గొననున్నట్లు సమాచారం. కాగా.. కీర్తి సురేశ్ ప్రస్తుతం హిందీలో బేబీ జాన్ మూవీతో ఎంట్రీ ఇస్తోన్న సంగతి తెలిసిందే. -
జయరామ్ కుమారుడి ఇంట పెళ్లి సందడి.. కాబోయే కోడల్ని కూతురు అన్న నటుడు (ఫోటోలు)
-
పెళ్లి సందడి.. నాగ చైతన్య- శోభిత మంగళస్నానాలు (ఫోటోలు)
-
కీరవాణి ఇంట్లో పెళ్లి సందడి.. ప్రీ వెడ్డింగ్ ఫొటో వైరల్
టాలీవుడ్ ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి కొడుకు, హీరో శ్రీ సింహా పెళ్లికి సిద్ధమయ్యాడు. సీనియర్ నటుడు, రాజకీయ నాయకుడు మురళీమోహన్ మనవరాలు రాగ మాగంటితో కొత్త జీవితంలోకి అడుగుపెట్టబోతున్నాడు. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లోని గోల్కోండ రిసార్ట్స్ లో ఆదివారం రాత్రి ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ జరిగాయి. ఈ వేడుకకు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు.(ఇదీ చదవండి: ఆ విషయంలో నన్ను క్షమించండి.. అల్లు అర్జున్ రిక్వెస్ట్)మురళీ మోహన్‌కు కూతురు, కొడుకు ఉన్నారు. కూతురు విదేశాల్లో సెటిలైంది. కుమారుడు రామ్ మోహన్.. ఈయన వ్యాపారాలను చూసుకుంటున్నారు. రామ్ మోహన్- రూపల కుమార్తెనే 'రాగ'. విదేశాల్లో బిజినెస్‌లో మాస్టర్స్ పూర్తి చేసింది. ప్రస్తుతం రాగ కూడా తన కుటుంబానికి సంబంధించిన వ్యాపార వ్యవహారాలే చూసుకుంటోంది.శ్రీసింహ విషయానికి వస్తే 'యమదొంగ' సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా చేశాడు. 'మత్తు వదలరా' రెండు చిత్రాలతో హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. తెల్లవారితే గురువారం, దొంగలున్నారు జాగ్రత్త, ఉస్తాద్ తదితర సినిమాల్లోనూ హీరోగా నటించాడు. కీరవాణి పెద్దబ్బాయి కాలభైరవకు ఇంకా పెళ్లి కాలేదు. ఈలోపే చిన్నబ్బాయికి పెళ్లి జరగనుంది. దీంతో ఇదేమైనా ప్రేమ పెళ్లి అని మాట్లాడుకుంటున్నారు.(ఇదీ చదవండి: నాగచైతన్య-శోభిత పెళ్లి కార్డ్ ఇదే.. డేట్ ఫిక్స్) 👉: (ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
పెళ్లి కొడుకైన కిదాంబి శ్రీకాంత్.. సంగీత్‌లో స్పెషల్ అట్రాక్షన్‌గా రష్మిక మందన్న (ఫొటోలు)
-
నాగ చైతన్య- శోభితా ధూళిపాళ్ల పెళ్లి పనులు ప్రారంభం (ఫోటోలు)
-
కర్ణాటక తీరం.. ప్రీవెడ్డింగ్ షూట్ గమ్యం! (ఫొటోలు)
-
Kiran Abbavaram: గ్రాండ్‌గా హీరో కిరణ్ అబ్బవరం ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ షురూ ఫోటోలు వైరల్
-
అనంత్ ప్రేమంతా : అందమైన రాధిక వెడ్డింగ్ లెహెంగా పైనే
ఫ్యాషన్, ఫైన్ ఆర్ట్ అద్భుతమైన కలయికతో రూపుదిద్దుకున్న వెడ్డింగ్ లెహంగా డ్రెస్ ఇది. అనంత్ అంబానీతో రాధికా మర్చంట్ వివాహం కోసం ఆర్టిస్ట్ జయశ్రీ బర్మన్ డిజైనర్ ద్వయం అబు జానీ సందీప్ ఖోస్లాతో కలిసి ఈ చిత్రకళ లెహంగాను రూపొందించారు.రోజుకు 16 గంటలు, నెలరోజుల పాటు జయశ్రీ బర్మన్ ఢిల్లీలోని తన స్టూడియోలో ఒక నెల మొత్తం ఈ లెహంగా ఫ్యాబ్రిక్‌పై పెయింటింగ్ చేయడానికి వెచ్చించింది.‘అనంత్–రాధికల కలయికకు ప్రతీకగా ఖగోళ మానవ బొమ్మలు, జంతుజాలం, ముఖ్యంగా ఏనుగులపై అనంత్‌కు ఉన్న ప్రేమను చూపేలా ఈ సృజనాత్మక కళ రూపుదిద్దుకుంది’ అని వివరించే బర్మన్ రోజుకు 15–16 గంటల సమయాన్ని ఈ ఆర్ట్‌వర్క్‌కు కేటాయించినట్టుగా వివరించింది. కోల్‌కతాలో జన్మించిన జయశ్రీ బర్మన్ ఇండియన్ ఆర్టిస్ట్‌గా గుర్తింపు పొందారు. పెయింటింగ్‌లో మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీ,ప్యారిస్ లో ప్రింట్ మేకింగ్ కోర్సు చేసిన బర్మన్ తన పెయింటింగ్ ద్వారా పౌరాణిక కథలను కళ్లకు కడతారు. ఆర్టిస్ట్‌గానే కాదు, రచయిత్రిగానూ జాతీయ అవార్డులు అందుకున్న ఘనత బర్మన్‌ది. -
అంబానీ పెళ్లి వేడుక : టిక్ టాకర్ లగేజీ గాయబ్..చివరికి!
View this post on Instagram A post shared by jewelswithjules • julia hackman chafé (@juliachafe)అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ల వివాహ వేడుకలు సోషల్ మీడియాలో ట్రెండిగ్‌లో నిలుస్తున్నాయి. ఈ వేడుకలకు హాజరయ్యేందుకు దేశ విదేశాలకు చెందిన సెలబ్రిటీలు, కంటెంట్ క్రియేటర్లు, ఇన్ఫ్లూయెన్సర్లు ఉవ్విళ్లూరుతున్నారు. ఈ క్రమంలో అనంత్, రాధిక ప్రీవెడ్డింగ్ వేడులకు ఉత్సాహంగా పయనమైన యుఎస్ టిక్‌టాకర్, కంటెంట్ క్రియేటర్ జూలియా చాఫ్కు వింత అనుభవం ఎదురైంది. బిలియనీర్ అంబానీ కుటుంబంపై నెలల తరబడి వీడియోలు చేసిన ఆమెకు అంబానీ ఇంట పెళ్లి సందడికి హాజరవ్వాలనేది డ్రీమ్. కానీ ఊహించని పరిస్థితి ఎదురైంది.. స్టోరీ ఏంటంటే..అంబానీ ఫ్యామిలీనుంచి అందిన ఆహ్వానం నేపథ్యంలో జూలియా చాఫ్ ఉత్సాహంగా సోమవారం ఇండియాకు బయలుదేరింది. దీనికి సంబంధించిన వీడియోను కూడా ఇన్‌స్టాలో షేర్ చేసింది. ఇంతలో ఏజియన్ ఎయిర్‌లైన్స్ లో నాలుగు బ్యాగుల లగేజీ మొత్తాన్ని పోగొట్టుకుంది. ఏథెన్స్లో చిక్కుకుపోయింది. దీంతో సంబంధిత ఎయిర్‌లైన్ ట్యాగ్ చేస్తూ మరో పోస్ట్ పెట్టింది. మొత్తానికి లగేజీ తిరిగి దొరకడంతో తన కలను సాకారం చేసుకుంది. అంబానీ ఇంట జరిగిన వేడుకలకు హాజరైంది. ఈ వీడియోపై ఇంటర్నెట్ సంచలనం ఓరీ స్పందించాడు. View this post on Instagram A post shared by jewelswithjules • julia hackman chafé (@juliachafe) కాగా జూలియా చాఫ్తో జెమ్ డీలర్ కూడా. అంబానీ కుటుంబానికి చెందిన డైమండ్, లగ్జరీ ఆభరణాల గురించి ఈమెకు తెలిసినంతగా ఇండియన్ మీడియాకు కూడా తెలియదట. దీనికి సంబంధించిన కంటెంట్‌తోనే జూలియా బాగా పాపులర్ అయింది. -
హాట్‌స్టార్‌లో అనంత్-రాధికల వివాహ వేడుక స్ట్రీమింగ్
రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ల వివాహ వేడుకను ప్రసారం చేసేందుకు డిస్నీ హాట్‌స్టార్ స్ట్రీమింగ్ హక్కులను దక్కించుకుంది.అనంత్-రాధికల పెళ్లి జులై 12న జరగనుంది. దేశవ్యాప్తంగా అంబానీ అభిమానులు ఈ వేడుకను వీక్షించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అందులో భాగంగా డిస్నీ హాట్‌స్టార్ ఈ వేడుక లైవ్ స్ట్రీమింగ్ హక్కులను దక్కించుకుంది. జులై 12న ‘శుభ్ వివాహ్’తో వేడుక ప్రారంభం కానుంది. జులై 13న 'శుభ్ ఆశీర్వాద్', జులై 14న ‘మంగళ్ ఉత్సవ్’ కార్యక్రమాలతో ముగియనున్నాయి. ఈ సంబరాలను హాట్‌స్టార్‌లో వీక్షించవచ్చిన కంపెనీ తెలిపింది.అనంత్ అంబానీ-రాధికల జంట ఇప్పటికే రెండుసార్లు అంగరంగ వైభవంగా ప్రీవెడ్డింగ్ వేడుకలు నిర్వహించుకుంది. ఇటీవల ఇటలీ నుంచి ఫ్రాన్స్ వరకు దాదాపు 4500 కిలోమీటర్లు క్రూయిజ్‌లో ప్రయాణిస్తూ రెండో ప్రీవెడ్డింగ్ సెలబ్రేషన్స్ జరుపుకున్నారు. గతంలో ఈ జంట జామ్‌నగర్‌లో తమ మొదటి ప్రీవెడ్డింగ్ వేడుకలను జరుపుకున్నారు. ఇటీవల అంబానీ కుంటుంబం 50 పేద జంటలకు సామూహిక వివాహాలను కూడా జరిపించింది. అందుకు అవసరమైన పూర్తి ఖర్చులను భరించింది. వివాహాల అనంతరం కొత్త జంటలకు అవసరమయ్యే ఇంటి సామగ్రిని అందించింది. -
దటీజ్ నీతా అంబానీ : ఈ బెనారసీ చీర స్పెషాల్టీ ఏంటో తెలుసా?
సందర్భానికి తగినట్టు దుస్తులను, నగలను, అలంకరణను ఎంచుకోవడంలో రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్మన్ నీతా అంబానీది ఎపుడూ అందెవేసిన చేయి. పట్టు చీరలు, బెనారసీ, స్వదేశీ నేత చీరలు అంటే ఆమెకు ప్రాణం. తాజాగా తన చిన్నకుమారుడు అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో భాగంగా నిర్వహించిన సామూహిక వివాహాల కార్యక్రమంలో కూడా తన ప్రత్యేకతను చాటుకున్నారు. దీనికి గుట్టపూసల నెక్లెస్, స్టైలిష్ చెవిపోగులు, బన్, గజ్రా (మల్లె పూల దండ)తో ఇలా ప్రతీ విషయంలో తన ష్యాషన్ స్టయిల్‌ను చాటుకున్నారామె. తన సిగ్నేచర్ స్టైల్లో ఆమె లుక్, ముఖ్యంగా చీరలోని మరో ప్రత్యేకత విశేషంగా నిలిచింది. అనంత్-రాధిక వివాహ సన్నాహాకాలు జోరందుకున్న నేపథ్యంలో జూలై 12,మంగళవారం నిరుపేద కుటుంబాలకు చెందిన 50 జంటలకు సామూహిక వివాహాలను జరిపించారు. రిలయన్స్ కార్పొరేట్ పార్క్‌లో జరిగిన ఈ వేడుకలో నీతా అంబానీ ముదురు ఎరుపు రంగు బెనారసీ చీరలో మహారాణిలా కనిపించారు. ముఖ్యంగా చీర ఒక విషయంలో అందరినీ ఆకర్షించింది. పవిత్ర గాయత్రీ మంత్రాన్ని బంగారంతో ఎంబ్రాయిడరీ చేయించడమే దీనికి కారణం. దీంతో నెటిజన్లు ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు. బంగారు జరీ వర్క్, పక్షుల డిజైన్‌తో తీర్చి దిద్దిన అద్భుతమైన బెనారసి చీరకు తగ్గట్టుగా గుట్టపూసల నెక్లెస్‌ను ధరించారు. ఈ నెక్లెస్ ఆంధ్రప్రదేశ్‌కి చెందిన సాంప్రదాయ దక్షిణ భారత డిజైన్‌తో పోలి ఉందని నిపుణులు పేర్కొన్నారు. అలాగే చెవిపోగుల్లో శ్రీకృష్ణుని బొమ్మను కూడా గమనించవచ్చు.కాగా సామూహిక వివాహ వేడుకల్లో రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీతోపాటు పెద్ద కుమారుడు, ఆకాష్ అంబానీ భార్య శ్లోకా మెహతా, కుమార్తె ఇషా అంబానీ పిరమల్,, భర్త ఆనంద్ పిరమల్ పాల్గొన్నారు. శ్లోకా, నీతా ఇద్దరూ నూతన వధూవరులకు ఖరీదైన బహుమతులను అందించారు. దేశవిదేశాలకు అతిరథ మహారథులసమక్షంలో జూలై 12న అనంత్-రాధిక వివాహ బంధంతో ఒక్కటి కానున్నారు. -
వరలక్ష్మి శరత్ కుమార్ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్ (ఫొటోలు)
-
పెళ్లికి ముందు అంబానీ ఫ్యామిలీ మరో గ్రాండ్ ఈవెంట్
ముఖేష్ అంబానీ, నీతా అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ.. వీరేన్ మర్చంట్, శైలా మర్చంట్ కుమార్తె రాధికా మర్చంట్ అతి త్వరలో మూడు ముళ్లతో ఒక్కటవుతున్నారు. వీరి వివాహం జూలై 12న ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (బీకేసీ)లోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో అత్యంత ఘనంగా జరగనుంది. ఇప్పటికే రెండు ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ జరిగాయి. ఇప్పుడు పెళ్లికి ముందు మరో భారీ వేడుకను అంబానీ ఫ్యామిలీ నిర్వహించబోతోంది.మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో నిరుపేద యువతీయువకులకు సామూహిక వివాహాలను జరిపించబోతోంది. దీనికి సంబంధించిన ఆహ్వాన పత్రికను వార్తా సంస్థ ఏఎన్ఐ ప్రచురించింది. దీని ప్రకారం.. అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ లో భాగంగా జూలై 2న సాయంత్రం 4.30 గంటలకు పాల్ఘర్ లోని స్వామి వివేకానంద విద్యామందిర్ లో నిరుపేదల సామూహిక వివాహాన్ని ఏర్పాటు చేశారు.అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ల ప్రీ వెడ్డింగ్ సెలెబ్రేషన్స్ అత్యంత ఆడంబరంగా జరిగాయి. జామ్ నగర్ లో జరిగిన తొలి కార్యక్రమానికి ప్రపంచం నలుమూలల నుంచి ప్రముఖులు హాజరుకాగా, రిహన్నా వంటి గ్లోబల్ ఐకాన్ల ప్రదర్శనలు ఇచ్చారు. మధ్యధరా సముద్రంపై క్రూయిజ్‌లో విశిష్టంగా జరిగిన రెండో వేడుక అయితే ప్రపంచ దృష్టిని ఆకర్షించింది.As part of the pre-wedding celebrations of Anant Ambani and Radhika Merchant, a mass wedding of the underprivileged has been organised at 4:30 pm on 2nd July, at Swami Vivekanand Vidyamandir in Palghar. pic.twitter.com/tRu1h5Em6g— ANI (@ANI) June 29, 2024 -
భర్తతో హీరోయిన్ ఆలియా భట్ క్యూట్ (ఫొటోలు)
-
అంబానీ ప్రేయసి: ఈ ఒక్క లుక్ విలువ రూ. 1002కోట్లు! నమ్ముతారా?
అనంత్ అంబానీకి కాబోయే భార్య, రాధికా మర్చంట్ ఫ్యాషన్ ఔట్ఫిట్స్ ఫ్యాన్స్‌ని మంత్రముగ్దుల్ని చేస్తోంది. రిలయన్స్ వ్యాపార వారసుడు అనంత్ అంబానీ ప్రేయసిగా తన ఫ్యాషన్ స్టయిల్‌తో కాబోయే అత్తగారు నీతా అంబానీని మించి అభిమానులను ఆకట్టుకుంటోంది. తాజాగా అనంత్- రాధిక ఇటలీ - ఫ్రాన్స్ లగ్జరీ క్రూయిజ్ ప్రీ వెడ్డింగ్ వేడుక అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకలో అంబానీ కోడలిగా కాబోయే వదువు రాధిక మెస్మరైజ్ చేసింది. వేలకోట్ల రూపాయలతో నిశ్చితార్థ వేడుక, మొదటి ప్రీ వెడ్డింగ్ వేడుక ఘనంగా జరిగాయి. తాజాగా రెండో ప్రీ-వెడ్డింగ్ బాష్ థీమ్ 'లా వీటా ఇ అన్ వియాజియో' (జీవితం ఒక ప్రయాణం), ఫ్యాషన్ స్టేట్మెంట్లతో ప్రతీ ఈవెంట్, దుస్తులు స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచాయి. అంబానీ ఫ్యాన్ పేజీ అందించిన డ్రెస్ ధలు హాట్ టాపిక్‌గా నిలుస్తున్నాయి.వైట్ డ్రెస్ మహారాణిలా, ధర రూ.1002 కోట్లురాధికా మర్చంట్ తెల్లటి తమరా రాల్ఫ్ డ్రెస్, డైమండ్ ఆభరణాలతోరాయల్లుక్లో అందంగా మెరిసి పోయింది. స్ప్రింగ్-సమ్మర్ 2024 కలెక్షన్‌కు చెందిన శాటిన్ గౌనులో రాణిలా కనిపించింది. పట్టు , క్రిస్టల్‌తో చేసిన గులాబీలు మెడ, నడుముపైనా, తలకు కిరీటంగా అమిరాయి. ఈ మొత్తం లుక్ ధర రూ. 1002కోట్లుక్రూయిజ్ బాష్‌లో స్టార్రి నైట్ పార్టీ కోసం రాధిక ధరించిన డైమండ్ ఇయర్‌కఫ్‌లు, లావెండర్ డ్రెస్, మొత్తం లుక్ ఖర్చు రూ. 896 కోట్లు.రెండో రోజు, టోగా పార్టీకోసం ఏరోస్పేస్ టెక్నాలజీతో తయారు చేసిన డ్రెస్, బంగారు ఆభరణాలతో డైమండ్ నగలు, బ్యాంగిల్స్ , వాచ్‌తో సహా మొత్తం లుక్ రూ. 697 కోట్లు.అనంత్ ప్రేమను చుట్టుకున్న ఈ లుక్ ధరఅనంత్ తన ప్రేమంతా కురిపించిన లవ్‌లెటర్‌తో రాబర్ట్ వున్ డిజైన్ చేసిన గౌను ధరించింది. లేయర్డ్ డైమండ్ నెక్లెస్, మ్యాచింగ్ చెవిపోగులు ధరించింది. ఈమొత్తం లుక్ ఖర్చు రూ. 478 కోట్లు.పాతకాలపు డియోర్ డ్రెస్‌లో ఖరీదైన యాక్సెసరీస్‌తో రాధిక అందంగా కనిపించిన మరో డ్రెస్ విలువ రూ. 26 లక్షలు రాధిక మర్చంట్ చిక్ బాల్మైన్ గౌను రూ. 5.43 లక్షలు. ఇంకా చెప్పాలంటే ఈ లిస్ట్ చాలా పెద్దదే. -
నీలం బంగారు గౌనులో మెరిసిపోతున్న శ్లోకా మెహతా..! (ఫొటోలు)
-
అనంత్ అంబానీ - రాధిక ప్రీ వెడ్డింగ్ : అనంత్ లవ్ లెటర్‌ను గమనించారా?
రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ఇంట పెళ్లి అంటే ఆ సందడి మామూలుగా ఉండదు. ముఖేష్ అంబానీ, నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ, వ్యాపారవేత్త వీరేన్మర్చంట్, శైలా విరెన్ మర్చంట్ కుమార్తె రాధిక మర్చంట్ ముందస్తు పెళ్లి వేడుకలే ఇందుకు నిదర్శనం. అనంత్-రాధిక నిశ్చితార్థం వేడుక మొదలు ఇటీవల, ఇటలీలో నిర్వహించిన రెండో ప్రీ వెడ్డింగ్ వేడుకల దాకా ప్రతీదీ అత్యంత ఘనంగా నిర్వహించారు. లగ్జరీ క్రూయిజ్‌లో 800మందికి పైగా అతిథులతో నిర్వహించిన రెండో ప్రీ వెడ్డింగ్ వేడుకలకు సంబంధించిన విశేషాలు రోజుకొకటి నెట్టింట విశేషంగా మారు తున్నాయి. ముఖ్యంగా కాబోయే వధువు రాధిక మర్చంట్ దుస్తులు, నగలతో పాటు, అత్తగారి హోదాలో నీతా అంబానీ లుక్, ఖరీదైన నగలు చర్చనీయాంశంగా నిలిచాయి. తాజాగా సినీ నిర్మాత రియా కపూర్ రాధిక మర్చంట్ దుస్తులకు సంబంధించిన ప్రత్యేకతలను ఇన్‌స్టాలో షేర్ చేశారు. రాధిక ధరించిన గౌనుపై అనంత్ లవ్ లెటర్‌ను అందంగా పొందుపరచడం విశేషం. View this post on Instagram A post shared by Rhea Kapoor (@rheakapoor) అలాగే బంగారు పూతతో తయారు చేసిన మరో అద్భుతమైన డ్రెస్ వివరాలను కూడా రియా అందించారు. అంబానీ రాయల్ వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌లో భాగంగా టోగా పార్టీలో రాధిక ధరించిన గ్రేస్ లింగ్ ‘కోచర్’ని గురించి పరిచయం చేశారు. రాధిక బాడీకి అతికినట్టు సరిపోయింది అంటూ దీన్ని తయారు చేసిన టీంకు అభినందనలు తెలిపారు. అత్యాధునిక 3డీ టెక్నాలజీతో 30 మంది కళాకారులు దీన్ని తయారు చేశారట. -
ఖరీదైన నగలు, అదిరే స్టయిల్ : కోడల్ని మించి మెరిసిపోయిన నీతా అంబానీ
రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ, నీతా అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ రాధిక మర్చంట్ రెండో ప్రీ వెడ్డింగ్ వేడుక ఇటలీలో లగ్జరీ క్రూయిజ్‌లో ఘనంగా జరిగింది. ఈ వేడుకలో కాబోయే వధూవరులు అందంగా మెరిసిపోయారు. వీరితోపాటు అనంత్ తల్లి,ఫ్యాషన్ ఐకాన్ నీతా అంబానీ మరింత అందంగా స్పెషల్‌గా కనిపించారు. 60 ఏళ్ల వయసులో కూడా తన అందమైన రూపంతో అందర్నీ ఆకర్షించారు.ప్రముఖ పరోపకారి, ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ వ్యవస్థాపకురాలు, రిలయన్స్ పౌండేషన్ ఛైర్ పర్సన్ నీతా తన చిన్న కుమారుడి రెండో ప్రీ వెడ్డింగ్ వేడుకలో రెండో రోజు షియాపరెల్లి బ్రాండ్ వైట్ టోగాలో అద్భుతంగా కనిపించారు. దీనికి జతగా ఇదే బ్రాండ్‌కు చెందిన లక్షల విలువైన ప్రత్యేక ఆభరణాలతో స్టయలిష్ లుక్‌లో తన ప్రత్యేకతను చాటుకున్నారు. ఆమె మెడలో ధరించిన మ్యాచింగ్ నెక్లెస్, చెవులకు స్టడ్స్, అలాగే ఒకవైపు మౌత్ బీన్, మరోవైపు బ్రాండ్ సిగ్నేచర్ ‘ఎనామెల్ ఐ’తో రూపొందించిన డబుల్ బ్రూచ్ ప్రత్యేకంగా నిలిచాయి.ఇక నీతా ధరించిన బ్రూచ్ ధర 2 లక్షల రూపాయలకు పై మాటే. అలాగే ఆమెధరించిన ‘కొల్లియర్ రూబన్ స్పైరల్’ అనే ప్రత్యేకమైన నెక్లెస్ ధర రూ. 6.15 లక్షల దాకా ఉంటుందని అంచనా.మే 31 నీతా అంబానీ ఫుల్ స్లీవ్ పర్పుల్ కలర్ పూల ఎంబ్రాయిడరీ గౌనులో మరింత అందంగా ముస్తాబయ్యారు. 4-5 క్యారెట్ల ఎమరాల్డ్-కట్ డైమండ్ నెక్పీస్ని, చెవిపోగులు, వెరైటీ సన్ గ్లాసెస్‌తో రాధికా అత్తగారిగా తన ఫ్యాషన్ స్టయిల్‌ను మరో సారి చాటుకున్నారు -
ఆ బ్యూటిఫుల్ ఫొటోలు తీసింది ఈయనే.. చార్జ్ ఎంతో తెలుసా?
Anant-Radhika pre wedding: ముఖేష్ అంబానీ, నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ, వీరేన్ మర్చంట్, శైలా మర్చంట్ కుమార్తె రాధికా మర్చంట్ ఇటీవల యూరప్‌లోని విలాసవంతమైన క్రూయిజ్ షిప్లో రెండో ప్రీ వెడ్డింగ్ వేడుకలు జరుపుకొన్నారు. ఈ వేడుకలకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి.ఈ గ్రాండ్ ప్రీ వెడ్డింగ్ వేడుకలకు సంబంధించిన అప్డేట్లను అంబానీ కుటుంబం నేరుగా తెలియజేయకపోయినప్పటికీ ఫోటోగ్రాఫర్ జోసెఫ్ రాధిక్ తీసిన అద్బుతమైన ఫొటోలు ఆ ఈవెంట్ ఎంత గ్రాండ్‌గా జరిగిందో తెలియజేస్తున్నాయి. అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ పంచుకున్న మధుర క్షణాలను ఈ ఫొటోలు మరింత అద్భుతంగా చూపిస్తున్నాయి.జోసెఫ్ రాధిక్ సెలబ్రిటీ వెడ్డింగ్స్ కవరేజ్ చేయడంలో దిట్ట. అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ల రెండో ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌కు అంబానీ కుటుంబం ఏర్పాటు చేసుకున్న ఫొటో గ్రాఫర్ ఈయనే. ఇంత ఫేమస్ అయిన జోసెఫ్ రాధిక్ ఎప్పుడూ ఫోటోగ్రాఫర్ కావాలనుకోలేదు. ఇంజినీరింగ్, మేనేజ్మెంట్ చదివి మూడేళ్లు కార్పొరేట్ ప్రపంచంలో పనిచేసిన జోసెఫ్ రాధిక్ తనకు ఆనందాన్నిచ్చే ఏకైక విషయం అద్భుతమైన ఫొటోలు తీయడమేనని త్వరలోనే గ్రహించాడు. అందుకే 2010లో అధిక వేతనం వచ్చే ఉద్యోగాన్ని వదిలేసి పూర్తి స్థాయి వెడ్డింగ్ ఫొటోగ్రఫీలో కెరీర్‌ను ఎంచుకున్నాడు.సోషల్ మీడియాలో వైరల్ అయ్యే పలు సెలబ్రిటీల వెడ్డింగ్ ఫోటోల వెనుక జోసెఫ్ రాధిక్ ఉన్నాడు. కత్రినా కైఫ్-విక్కీ కౌశల్, విరాట్ కోహ్లీ-అనుష్క శర్మ, సిద్ధార్థ్ మల్హోత్రా-కియారా అద్వానీ, కేఎల్ రాహుల్-అతియా శెట్టి జంటలకు ఆయన వెడ్డింగ్ ఫొటోగ్రాఫర్. ఇంతకీ జోసెఫ్ రాధిక్ ఎంత చార్జ్ చేస్తాడో చెప్పలేదు కదా.. ఆయన ఒక రోజుకు రూ .1,25,000 - రూ .1,50,000 తీసుకుంటాడు. దీనికి పన్నులు, ట్రావెల్, బస ఖర్చులు అధికం. -
అనంత్, రాధిక ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్ - బ్యూటిఫుల్ ఫోటోలు
-
అనంత్-రాధిక క్రూయిజ్ పార్టీ : మెరిసిన రాధిక, ఫోటోలు వైరల్
రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ కుమారుడు, నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ తన ప్రేయసి రాధికా మర్చంట్‌ను జులైలో పెళ్లి చేసుకోనున్నారు. ఈ నేపథ్యంలోనే మార్చిలో అనంత్-రాధిక తొలి ప్రీవెడ్డింగ్ పార్టీని ఘనంగా నిర్వహించారు. ఆ తరువాత కనీవినీ ఎరుగని రీతిలో ఇటలీలో రెండొ ప్రీ-వెడ్డింగ్ వేడుకను గ్రాండ్ క్రూయిజ్ పార్టీలో నిర్వహించారు. మే 29న ప్రారంభమై జూన్ 1న ఫ్రాన్స్‌లో ముగిసిన ఈ వేడుకలో పలువురు రాజకీయ, సినీరంగ ప్రముఖులు సందడి చేసిన సంగతి తెలిసిందే.తాజాగా అనంత్ అంబానీ , రాధిక మర్చంట్ ఫోటోలు ఇంటర్నెట్లో సందడి చేస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం జూలై 12న ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో అనంత్ రాధికా వివాహం జరగనుంది. మూడు రోజుల పాటు జరిగే వివాహ వేడుకలో మూడు ఈవెంట్లు ఉండ బోతున్నాయి. తొలుత 'శుభ వివాహ' ఆ తర్వాత జూలై 13న 'శుభ్ ఆశీర్వాద్' , 'మంగళ ఉత్సవ్', జూలై 14న వివాహ రిసెప్షన్ ఉంటుంది. అనంత్ అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీస్, జియో ప్లాట్‌ఫారమ్‌లు, రిలయన్స్ రిటైల్ వెంచర్స్, రిలయన్స్ న్యూ ఎనర్జీ , రిలయన్స్ న్యూ సోలార్ ఎనర్జీ బోర్డులలో డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు