సిరిసిల్లఅర్బన్: పెళ్లంటే పందిళ్లు.. సందళ్లు తప్పెట్లు.. తాళాలు తలంబ్రాలూ మూడే ముళ్లు.. ఏడే అడుగులు ఇదీ అందరికీ తెలిసిందే.. కానీ ప్రస్తుతం వీటితో పాటు పెళ్లి వేడుకలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. పెళ్లి వేడుకలను చెదరని మధుర జ్ఞాపకంలా జీవితాంతం గుర్తుండి పోయేలా యువతీ యువకులు పెళ్లికి సిద్ధం అవుతున్నారు. ఇందులో భాగంగా ప్రీవెడ్డింగ్ షూట్‌లకు ప్రాధాన్యం ఇస్తున్నారు.
ఎంతలా అంటే సినిమాలకు ధీటుగా చిత్రీకరించేందుకు ఎంత ఖర్చుకైనా వెనకాడడం లేదు. దీనికోసం ప్రత్యేకంగా అనుభవజ్ఞులైన నిపుణులు, కెమెరామెన్‌లను సాంకేతిక బృందాలను ఆశ్రయిస్తున్నారు. పాటల చిత్రీకరణకు సిరిసిల్ల, సిద్దిపేట, కరీంనగర్, హైదరాబాద్, తదితర ప్రాంతాల్లోని పర్యాటక కేంద్రాలకు వెళ్తున్నారు. కొందరైతే సముద్ర తీర ప్రాంతాలకు, గోవాకు సైతం వెళ్లి ప్రీ వెడ్డింగ్ షూట్‌లో పాల్గొంటున్నారు.
(చదవండి: గ్రీన్‌ఫీల్డ్ హైవే భూసేకరణలో ఉద్రిక్తత)
లోకేషన్లను బట్టి చార్జీ
ప్రీ వెడ్డింగ్ షూట్ కోసం అందమైన ప్రదేశాలకు వెళ్తారు. ప్రీవెడ్డింగ్ ఫొటో, వీడియోగ్రాఫర్లు లొకేషన్లను బట్టి రూ.15 వేల నుంచి రూ.40వేల వరకు చార్జీ చేస్తుంటారు. వాహనఖర్చు, డ్రెస్సింగ్, తదితర ఖర్చులు వెడ్డింగ్ షూట్ చేసుకునేవారు చెల్లించాల్సి ఉంటుంది. సిరిసిల్ల, సిద్దిపేట, హైదరబాద్, ఇతర రాష్ట్రాలకు కూడా వెళ్లి ఫొటో షూట్ చేస్తుంటారు. ఒక్కో ఫొటో ప్రీ వెడ్డింగ్ షో చిత్రీకరించడానికి రెండు నుంచి నాలుగు రోజుల సమయం పడుతోంది.
సినిమా తరహాలో పాటల చిత్రీకరణ
విహహం నిశ్చయమైనప్పటి నుంచి పెళ్లి చేసుకునే జంటలు ప్రతీ క్షణాన్ని ప్రత్యేకంగా పదిల పర్చుకునేందుకు ప్రతీ క్షణాన్ని అందంగా మలుచుకునేందుకు ఆరాటపడుతుంటారు. ఇందుకోసం ప్రీ వెడ్డింగ్ షూట్ ఎంతగానో ఉపయోగపడుతుందని దీంతో పెళ్లికి ముందే ఒకరి భావాలు మరోకరు తెలసుకునే అవకాశం ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. ఇలా ప్రీ వెడ్డింగ్ షూట్‌లో కాబోయే జంటల నృత్యాలు సినిమాలను తలపించేలా చూడ ముచ్చటగా ఉంటున్నాయి. వీరు నటించిన నృత్యాలను, అందమైన ఫొటోలను పెళ్లి సమయంలో భారీ ఎల్‌ఈడీ స్క్రీన్‌లపై ప్రదర్శిస్తుండడంతో నూతన జంటలతో పాటు, పెళ్లికి వచ్చిన కుటుంబీకులు సైతం ఆనందపడుతున్నారు.
(చదవండి: తొలిసారిగా ఆ ఊర్లో నడిచిన గూడ్స్ రైలు!!)
ఆదరణ పెరిగింది
మారుతున్న కాలానీకి అణుగుణంగా పెళ్లి జంటలు ప్రీవెడ్డింగ్ ఫొటో షూట్ కు ఇష్టపడుతున్నా రు. వారు ఎంచుకున్న ప్రదేశాలకు వెళ్లి ప్రీ వెడ్డింగ్ షూట్‌చేస్తాం సినిమాలను తలపించేలా చిత్రీకరిస్తుండడంతో యువతీయువకుల్లో ఆసక్తి పెరుగుతోంది.
– రాము, ప్రీ వెడ్డింగ్ షూట్ ఫొటోగ్రాఫర్, సిరిసిల్ల
ఒకరినొకరు అర్థం చేసుకుంటారు
ప్రీ వెడ్డింగ్ షూట్‌తో పెళ్లి చేసుకునే జంటలు ఒకరినొకరు అర్థంచేసుకుంటారు. దీంతో బిడియం ఉండదు. సినిమా, జానపద పాటలపై నృత్యాలు చేయగా, వాటిని పెళ్లి సమయంలో ఎల్‌ఈడీ స్క్రీన్‌లపై ప్రదర్శిస్తుంటాం.
– అనగోని చందు, ఫొట్రోగాఫర్
పెళ్లి ఒక మధుర ఘట్టం
పెళ్ళి అనేది ఒక మధుర ఘట్టం లాంటిది. అలాంటి పెళ్లి వేడుకలను జీవితాంతం గుర్తిండి పోయేందుకు ప్రీ వెడ్డింగ్ ఫొటో షూట్ ఒక మంచి అనుభూతిని ఇస్తుంది. మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకునేందుకు దోహదపడుతుంది. దీంతో ఒకరి మనోభావాలు మరోకరికి తెలుసుకునే అవకాశం ఉంటుంది.
– కత్తి రఘు మౌనిక,
Comments
Please login to add a commentAdd a comment