trending story
-
మార్నింగ్ టాప్-10 న్యూస్
1. దేశవ్యాప్తంగా ఎన్ఐఏ సోదాలు ఉగ్రవాద కదలికలు, టెర్రర్ ఫండింగ్పై జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) ఉక్కుపాదం మోపుతోంది. ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే కారణంగా దేశవ్యాప్తంగా 13 రాష్ట్రల్లో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఐ) నేతలు, కార్యాలయాలపై సుమారు 100 ప్రాంతాల్లో దాడులు నిర్వహించింది. బుధవారం అర్ధరాత్రి నుంచి దాడులు నిర్వహిచంగా.. గురువారం ఉదయానికి 105 మందిని అరెస్ట్ చేసింది. 👉 పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 2. పుతిన్ ప్రకటనతో రష్యాలో అలజడి! రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటనతో ప్రపంచమంతా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత.. దాదాపు అంతటి స్థాయిలో మోహరింపు దిశగా పుతిన్ ఇవ్వడమే ఇందుకు కారణం. అయితే.. ఈ పిలుపుపై రష్యావ్యాప్తంగా భయాందోళనలు వ్యక్తం అవుతున్నాయి. 👉 పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 3. బిగ్ అప్డేట్.. పోస్టల్ బ్యాలెట్ రద్దుకు ఈసీ ప్రతిపాదన! ఎన్నికల విధుల్లో ఉండి సొంత నియోజకవర్గానికి వెళ్లలేని వారు పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అయితే, ఈ పోస్టల్ బ్యాలెట్ దుర్వినియోగానికి గురవుతోందనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ క్రమంలో కేంద్ర ఎన్నికల సంఘం కీలక ప్రతిపాదనలు చేసింది. దానిని రద్దు చేసే యోచనకు వచ్చింది. 👉 పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 4. బీసీలకు పదవులు రాకుండా అడ్డుకున్న వ్యక్తి చంద్రబాబు టీడీపీ అధినేత చంద్రబాబు జీవితంలో ఏనాడైన బీసీలకు న్యాయం చేశారా?. బీసీల తోకలు కట్ చేస్తానన్న వ్యక్తి చంద్రబాబు. బీసీ న్యాయమూర్తులకు పదవులు రాకుండా అడ్డుకున్న వ్యక్తి చంద్రబాబు. చంద్రబాబు ఎవరినైనా బీసీని రాజ్యసభకు పంపించావా అని పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ప్రశ్నించారు. 👉 పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 5. ఫెడ్ ఎఫెక్ట్.. రికార్డు కనిష్టానికి రూపాయి అమెరికా డాలరు మారకంలో దేశీయ కరెన్సీ రూపాయి భారీగా నష్టపోతోంది. ప్రస్తుతం 73 పైసలు కోల్పోయి 80.56 వద్ద ఆల్‌టైమ్ కనిష్ట స్థాయిని నమోదు చేసింది. గురువారం ఆరంభంలోనే డాలర్‌తో రూపాయి మారకం విలువ 42 పైసలు క్షీణించి 80.38కి చేరుకుంది. 👉 పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 6. కౌర్ తుపాన్.. 23 ఏళ్ల తర్వాత ఇంగ్లండ్ గడ్డపై కొత్త చరిత్ర ఇంగ్లండ్ గడ్డపై టీమిండియా మహిళలు సరికొత్త చరిత్ర సృష్టించారు. దాదాపు 23 ఏళ్ల తర్వాత బ్రిటీష్ గడ్డపై వన్డే సిరీస్‌ను కైవసం చేసుకున్నారు. హర్మన్‌ప్రీత్ కౌర్ తుఫాన్ ఇన్నింగ్స్‌తో ఇంగ్లండ్‌తో జరిగిన రెండో వన్డేలో భారత మహిళల జట్టు 88 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 👉 పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 7. అంతకు ముందులా లేను.. చందమామ కాజల్ ‘శారీరకంగా అంతకు ముందులా లేను... ఎనర్జీ లెవల్స్ కాస్త తగ్గినట్లుగా అనిపిస్తోంది. అయినా తగ్గను’ అని అంటోంది కాజల్ అగర్వాల్. శరీరం సహకరించకపోయినా అనుకున్నది సాధించే విషయంలో రాజీ పడేదే లేదు అంటున్నారామె. నాలుగు నెలల క్రితం ఆమె ఓ బాబుకి జన్మనిచ్చిన విషయం తెలిసిందే. 👉 పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 8.కోహ్లి, ధావన్‌ల తర్వాత.. స్మృతి మందాన టీమిండియా స్టార్ ఓపెనర్ స్మృతి మందాన వన్డే క్రికెట్లో సరికొత్త రికార్డు అందుకుంది. వన్డేల్లో వేగంగా 3,000 పరుగులు చేసిన తొలి భారత మహిళా క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కింది. ఓవరాల్‌గా ఈ ఘనత సాధించిన భారత క్రికెటర్లలో ఆమె మూడో బ్యాటర్‌గా నిలిచింది. 👉 పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 9. భారత్ ‘శాశ్వత సభ్యత్వ’ హోదాపై బైడెన్ ఏమన్నారంటే.. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారతదేశ సభ్యత్వానికి మద్దతు ప్రకటించారు. భారత్‌తో పాటు జర్మనీ, జపాన్‌లను కూడా సభ్యదేశాలుగా చేర్చాలనే ప్రతిపాదనకు బైడెన్ సానుకూలంగా ఉన్నారంటూ వైట్‌హౌజ్ ఒక ప్రకటన విడుదల చేసింది. మరోవైపు బైడెన్ సైతం ఈ విషయంపై పరోక్షంగా ప్రకటన చేశారు. 👉 పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 10. యూటీఎస్ యాప్ వాడుతున్నారా? అయితే.. మీకో గుడ్‌న్యూస్ రైళ్లలో జనరల్ కంపార్ట్మెంట్లు ఎప్పుడూ కిటకిటలాడుతుంటాయి. టికెట్ కోసం చాంతాడంత క్యూలు బెంబేలెత్తిస్తుంటాయి. ఇలాంటి తరుణంలో ప్రయాణికులకు వరంగా మారింది ‘యూటీఎస్’ యాప్. ఇప్పుడు ఆ యాప్ ద్వారా.. అన్ రిజర్వ్డ్ కోచ్‌లలో టికెట్ బుక్ చేసుకునే దూర పరిధిని పెంచుతూ దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించింది. 👉 పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి -
టుడే ట్రెండింగ్ & మార్నింగ్ టాప్ 10 న్యూస్
1. ఇంటర్ పరీక్షలు ప్రారంభం ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ నెల 24 వరకు జరిగే పరీక్షలకు ప్రభుత్వ ఆదేశాలతో ఇంటర్ బోర్డు పటిష్ట ఏర్పాట్లు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,456 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 10.01 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. నిర్దేశిత తేదీల్లో ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. ► పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 2. భళా తందనాన మూవీ రివ్యూ సినిమా ఫలితంతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తూ పోతున్నాడు నటుడు శ్రీవిష్ణు. లేటెస్ట్గా ‘బాణం’ఫేం చైతన్య దంతులూరి దర్శకత్వంలో భళా తందనానా చిత్రంతో ముందుకొచ్చాడు. మరి ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఏ మేర ఆకట్టుకోగలిగింది. ► పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 3. యూదుల రక్తం కామెంట్లు.. పుతిన్ సారీ ఉక్రెయిన్ అధ్యక్షుడిపై కామెంట్లు చేసే తరుణంలో.. హిట్లర్‌లోనూ యూదుల రక్తం ఉందంటూ రష్యా విదేశాంగ మంత్రి చేసిన వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పుతిన్, ఇజ్రాయెల్‌కు క్షమాపణలు తెలియజేసినట్లు సమాచారం. ► పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 4. ఐస్‌క్రీమ్ అమ్ముతున్న ఛాంపియన్ సచిన్ నేషనల్ చాంపియన్(పారా అథ్లెట్) సచిన్ సాహు.. జీవనోపాధి కోసం ఐస్‌క్రీమ్ బండి నడుపుకుంటున్నాడు. ప్రభుత్వం తనకు ఎలాంటి సాయం అందకపోవడంతో తాను ఇలా ఐస్‌క్రీమ్స్ అమ్ముకోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశాడు. ► పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 5.టాటా ఈవీ.. భలే బుకింగ్స్ టాటా ఎలక్ట్రిక్ వెహికల్,లాంచ్ చేసిందో లేదో.. హాట్ కేకుల్లా బుకింగ్స్ జరిగిపోతున్నాయి. ఒకసారి చార్జింగ్ చేస్తే 154 కిలోమీటర్లు ప్రయాణిస్తుందని కంపెనీ తెలిపింది. 39,000 యూనిట్ల ఏస్ ఎలక్ట్రిక్ వాహనాల సరఫరాకు ఇప్పటికే ఆర్డర్ దక్కించుకుంది. ► పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 6. ముంబై ఇండియన్స్ జట్టులోకి ట్రిస్టన్ స్టబ్స్ ముంబై ఇండియన్స్ పేసర్ టైమల్ మిల్స్ గాయం కారణంగా తప్పుకున్న సంగతి తెలిసిందే. కాగా ఈ సీజన్లో మిగితా మ్యాచ్‌లకు మిల్స్ స్థానంలో సౌతాఫ్రికా యువ ఆటగాడు ట్రిస్టన్ స్టబ్స్‌ను భర్తీ చేయనుంది. దేశీవాళీ క్రికెట్లో అదరగొడతున్న ట్రిస్టన్ స్టబ్స్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం. ► పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 7. ఉన్నత శిఖరాలపై ప్రియాంక.. రికార్డులు బ్రేక్ భారత ఖ్యాతిని మరోసారి ఓ యువతి ప్రపంచానికి మరోసారి చాటి చెప్పింది. తన పేరిటి సరికొత్త రికార్డును సృష్టించింది. మహారాష్ట్రలోని సతారాకు చెందిన ప్రియాంక మోహితే(30) ప్రపంచంలో మూడో ఎత్తైన శిఖరం కాంచనజంగను (8,586 మీటర్లు) గురువారం అధిరోహించారు. దీంతో ప్రపంచంలోని ఐదు.. 8,000 మీటర్ల కంటే ఎతైన శిఖరాలను అధిరోహించిన తొలి భారత మహిళగా ప్రియాంక ఘనత సాధించారు. ► పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 8. కోవిడ్ మరణాలు.. భారత్‌లో లెక్క పదిరెట్లు ఎక్కువే?! ప్రపంచవ్యాప్తంగా కరోనా కారణంగా ప్రత్యక్షంగా లేదంటే.. పరోక్షంగా 1.49 కోట్లమంది ప్రాణాలు కోల్పోయారని ప్రపంచ ఆరోగ్య సంస్థ గురువారం ప్రకటించింది. అందులో భారత్‌లో కరోనా మరణాలు 47 లక్షలని తెలిపింది. కానీ, భారత్ ఈ ప్రకటనను తీవ్రంగా ఖండిస్తోంది. ► పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 9. మమత, అమిత్ షా పరస్పర విమర్శలు బెంగాల్ పర్యటనలో ఉన్న కేంద్ర మంత్రి అమిత్‌షా, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మధ్య గురువారం మాటల యుద్ధం నడిచింది. కట్‌మనీ, రాజకీయ హింస, అవినీతితో బెంగాల్ ఉక్కిరిబిక్కిరవుతోందని అమిత్ విమర్శించగా, దేశంలో మతకల్లోలాలు, బీజేపీ రాష్ట్రాల్లో మహిళలపై దాడులనుంచి దృష్టి మరలించేందుకు బెంగాల్ గురించి మోదీ, షాలు అబద్ధాలు చెబుతున్నారని మమత ప్రతివిమర్శలు చేశారు. ► పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 10. మాస్కు మస్ట్...ఆలస్యమైన అనుమతించరు తెలంగాణలోనూ ఇంటర్ పరీక్షలు మొదలయ్యాయి. శుక్రవారం నుంచి మొదలైన పరీక్షలకు.. హాజరయ్యే విద్యార్థులకు మాస్కుధారణ తప్పనిసరి అని ఇంటర్మీడియట్ బోర్డు స్పష్టం చేసింది. కొవిడ్ నిబంధనలతో.. పరీక్ష కేంద్రాల్లో క్లీన్ అండ్ గ్రీన్‌తోపాటు శానిటైజేషన్ కార్యక్రమాలు పరీక్షలు పూర్తయ్యే వరకు కొనసాగే విధంగా చర్యలు చేపట్టింది. విద్యార్థుల మధ్య భౌతిక దూరం ఉండేలా సిట్టింగ్ ఏర్పాట్లు చేసింది. ► పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి -
ఇప్పుడిదే ట్రెండ్! ఫిక్సయిపోతున్న కొత్త జంటలు.. ఖర్చుకు తగ్గేదేలే!
సిరిసిల్లఅర్బన్: పెళ్లంటే పందిళ్లు.. సందళ్లు తప్పెట్లు.. తాళాలు తలంబ్రాలూ మూడే ముళ్లు.. ఏడే అడుగులు ఇదీ అందరికీ తెలిసిందే.. కానీ ప్రస్తుతం వీటితో పాటు పెళ్లి వేడుకలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. పెళ్లి వేడుకలను చెదరని మధుర జ్ఞాపకంలా జీవితాంతం గుర్తుండి పోయేలా యువతీ యువకులు పెళ్లికి సిద్ధం అవుతున్నారు. ఇందులో భాగంగా ప్రీవెడ్డింగ్ షూట్లకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఎంతలా అంటే సినిమాలకు ధీటుగా చిత్రీకరించేందుకు ఎంత ఖర్చుకైనా వెనకాడడం లేదు. దీనికోసం ప్రత్యేకంగా అనుభవజ్ఞులైన నిపుణులు, కెమెరామెన్లను సాంకేతిక బృందాలను ఆశ్రయిస్తున్నారు. పాటల చిత్రీకరణకు సిరిసిల్ల, సిద్దిపేట, కరీంనగర్, హైదరాబాద్, తదితర ప్రాంతాల్లోని పర్యాటక కేంద్రాలకు వెళ్తున్నారు. కొందరైతే సముద్ర తీర ప్రాంతాలకు, గోవాకు సైతం వెళ్లి ప్రీ వెడ్డింగ్ షూట్లో పాల్గొంటున్నారు. (చదవండి: గ్రీన్‌ఫీల్డ్ హైవే భూసేకరణలో ఉద్రిక్తత) లోకేషన్లను బట్టి చార్జీ ప్రీ వెడ్డింగ్ షూట్ కోసం అందమైన ప్రదేశాలకు వెళ్తారు. ప్రీవెడ్డింగ్ ఫొటో, వీడియోగ్రాఫర్లు లొకేషన్లను బట్టి రూ.15 వేల నుంచి రూ.40వేల వరకు చార్జీ చేస్తుంటారు. వాహనఖర్చు, డ్రెస్సింగ్, తదితర ఖర్చులు వెడ్డింగ్ షూట్ చేసుకునేవారు చెల్లించాల్సి ఉంటుంది. సిరిసిల్ల, సిద్దిపేట, హైదరబాద్, ఇతర రాష్ట్రాలకు కూడా వెళ్లి ఫొటో షూట్ చేస్తుంటారు. ఒక్కో ఫొటో ప్రీ వెడ్డింగ్ షో చిత్రీకరించడానికి రెండు నుంచి నాలుగు రోజుల సమయం పడుతోంది. సినిమా తరహాలో పాటల చిత్రీకరణ విహహం నిశ్చయమైనప్పటి నుంచి పెళ్లి చేసుకునే జంటలు ప్రతీ క్షణాన్ని ప్రత్యేకంగా పదిల పర్చుకునేందుకు ప్రతీ క్షణాన్ని అందంగా మలుచుకునేందుకు ఆరాటపడుతుంటారు. ఇందుకోసం ప్రీ వెడ్డింగ్ షూట్ ఎంతగానో ఉపయోగపడుతుందని దీంతో పెళ్లికి ముందే ఒకరి భావాలు మరోకరు తెలసుకునే అవకాశం ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. ఇలా ప్రీ వెడ్డింగ్ షూట్లో కాబోయే జంటల నృత్యాలు సినిమాలను తలపించేలా చూడ ముచ్చటగా ఉంటున్నాయి. వీరు నటించిన నృత్యాలను, అందమైన ఫొటోలను పెళ్లి సమయంలో భారీ ఎల్ఈడీ స్క్రీన్లపై ప్రదర్శిస్తుండడంతో నూతన జంటలతో పాటు, పెళ్లికి వచ్చిన కుటుంబీకులు సైతం ఆనందపడుతున్నారు. (చదవండి: తొలిసారిగా ఆ ఊర్లో నడిచిన గూడ్స్ రైలు!!) ఆదరణ పెరిగింది మారుతున్న కాలానీకి అణుగుణంగా పెళ్లి జంటలు ప్రీవెడ్డింగ్ ఫొటో షూట్ కు ఇష్టపడుతున్నా రు. వారు ఎంచుకున్న ప్రదేశాలకు వెళ్లి ప్రీ వెడ్డింగ్ షూట్చేస్తాం సినిమాలను తలపించేలా చిత్రీకరిస్తుండడంతో యువతీయువకుల్లో ఆసక్తి పెరుగుతోంది. – రాము, ప్రీ వెడ్డింగ్ షూట్ ఫొటోగ్రాఫర్, సిరిసిల్ల ఒకరినొకరు అర్థం చేసుకుంటారు ప్రీ వెడ్డింగ్ షూట్‌తో పెళ్లి చేసుకునే జంటలు ఒకరినొకరు అర్థంచేసుకుంటారు. దీంతో బిడియం ఉండదు. సినిమా, జానపద పాటలపై నృత్యాలు చేయగా, వాటిని పెళ్లి సమయంలో ఎల్ఈడీ స్క్రీన్లపై ప్రదర్శిస్తుంటాం. – అనగోని చందు, ఫొట్రోగాఫర్ పెళ్లి ఒక మధుర ఘట్టం పెళ్ళి అనేది ఒక మధుర ఘట్టం లాంటిది. అలాంటి పెళ్లి వేడుకలను జీవితాంతం గుర్తిండి పోయేందుకు ప్రీ వెడ్డింగ్ ఫొటో షూట్ ఒక మంచి అనుభూతిని ఇస్తుంది. మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకునేందుకు దోహదపడుతుంది. దీంతో ఒకరి మనోభావాలు మరోకరికి తెలుసుకునే అవకాశం ఉంటుంది. – కత్తి రఘు మౌనిక, -
మై నేమ్ ఈజ్ కోవిడ్ కపూర్
ప్రపంచాన్ని కోవిడ్ వణికిస్తున్న సమయంలో, తనలో గూడుకట్టుకున్న ఒత్తిడి, భయాన్ని తొలిగించుకోవడానికి హాస్యాన్ని ఆశ్రయించి, తన పేరును ‘కోవిడ్ కపూర్’గా మార్చుకున్నాడు బెంగళూరుకు చెందిన ఒక వ్యాపారి. ఇతను ఒక ట్రావెల్ సైట్‌ను నడుపుతున్నాడు. తొలిసారిగా ‘నా పేరు కోవిడ్. అయితే నేను వైరస్ కాదు’ అని ట్విట్ చేసినప్పుడు అనూహ్యమైన స్పందన వచ్చింది. ఇక కోవిడ్ మీద తేలికపాటి జోక్స్ మొదలయ్యాయి. తానొక జోక్ చెబితే ఫాలోవర్స్ మరికొన్ని జోక్స్ చెప్పేవాళ్లు. మొత్తానికైతే ఈ కోవిడ్ జోక్స్‌తో కపూర్ ‘మినీ సెలబ్’గా మారాడు. -
New Year 2022: న్యూ ఇయర్ రోజున ఇలా చేస్తే ఏడాదంతా మంచి జరుగుతుంది!
New Year's Traditions From Around the Globe 2020, 21 సంవత్సరాల్లో.. ఎందరో ఆర్ధికంగా కోలుకోలేని దెబ్బతిన్నారు. అప్పటివరకూ కళ్ల ముందున్న ఆత్మీయులు హఠాత్తుగా తిరిగిరానిలోకాలకు చేరారు. ఈ కరోనా మారణహోమం చాలదన్నట్టు ఎన్నడూ కనీవినీ ఎరుగని రీతిలో భారీ వర్షాలు యావత్తు ప్రపంచాన్ని అతలాకుతలం చేసేశాయి. దురదృష్టం తిష్టేసుకు కూర్చున్నట్లు ఉందీ పరిస్థతి చూడబోతే! మరి కొన్ని రోజుల్లో నూతన సంవత్సరం రాబోతుంది. శతకోటి ఆనందాలు ప్రతి ఒక్కరి జీవితాల్లో అడుగిడాలని వెయ్యి ఆశలతో ఎదురుచూస్తున్నారు ప్రతి ఒక్కరు. ఐతే న్యూ ఇయర్ రోజున ఈ విధంగా చేస్తే సంవత్సరమంతా మంచే జరుగుతుందని ప్రపంచంలోని వివిధ దేశాలు భిన్న ఆచారాలను, నమ్మకాలను పాటిస్తున్నాయి. ఆవూసులేంటో తెలుసుకుందాం.. స్పెయిన్ ఈ దేశంలో నూతన సంవత్సరంలోకి అడుగిడిన మొదటి రోజు 12 ద్రాక్ష పండ్లను తింటే ఏడాది పొడవునా సంతోషంగా ఉంటారని నమ్ముతారు. ఈ సంప్రదాయం 1909లో ప్రారంభమైంది. బ్రెజిల్ సముద్రం అలల్లో తెల్లటి పువ్వులు విసిరి బ్రెజిల్ దేశ ప్రజలు నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతారు. పూలతోపాటు చాలా మంది పర్ఫ్యూమ్స్, నగలు, దువ్వెనలు, లిప్‌స్టిక్‌లను కూడా సముద్రంలోకి విసిరేస్తారు. ఇలా కొత్త సంవత్సరం రోజున సముద్ర దేవత 'యెమాంజ'కి కానుకను సమర్పించడం ద్వారా తమ కోరికలు తీరుస్తుందని అక్కడి ప్రజల నమ్మకం. డెన్మార్క్ డిసెంబర్ 31 రాత్రి ఈ దేశ ప్రజలు పాత ప్లేట్లు, స్పూన్లు పొరుగిళ్ల మీదకు విసిరేస్తారట. జనవరి 1వ తేదీ ఉదయం ఇంటి తలుపు తియ్యగానే ఎన్ని ఎక్కువ విరిగిన పాత్రలుంటే ఆ సంవత్సరమంతా అంత అదృష్టం కలిసివస్తుందని నమ్ముతారు. ఇతర దేశాల్లో ఇలా.. ►థాయిలాండ్‌లో తుపాకులను గాలిలో పేల్చడం ద్వారా చెడు ఆత్మలను భయపెట్టడం ఆచారం. ►సౌత్ ఆఫ్రికాలోని ఈక్వెడార్‌కు చెందిన ప్రజలు ప్రసిద్ధ వ్యక్తుల దిష్టిబొమ్మలను తగలబెట్టడం ఆచారంగా కొనసాగుతోంది. తద్వారా గడచిన సంవత్సరం తాలూకు చెడును నాశనం చేసి, కొత్త సంవత్సరం తాజాగా ప్రారంభమౌతుందనేది వారి నమ్మకం. ►అనేక దేశాల్లో చర్చ్ లేదా గడియారం గంటలు వినడం ఆచారం. ►డచ్‌లో రింగ్ ఆకారంలో ఉండే ఏదైనా ఆహారాన్ని తింటారు. పూర్ణ వృత్తం వారి భవిష్యత్తును అదృష్టమయం చేస్తుందని నమ్ముతారు. ఇక మనదేశంలోనైతే న్యూ ఇయర్ రోజున కొత్తకొత్త నిర్ణయాలు తీసుకోవడం ఆచారంగా వస్తుంది. నమ్మకం ఏదైనా.. మనసావాచాఖర్మనా ఇతరులకు కీడు తలపెట్టకుండా, అందరి ఆనందాన్ని మన ఆనందంగా భావిస్తే సంవత్సరమేదైనా, ఎక్కడున్నా, ఎందరిలో ఉన్నా అదృష్టం మనవెంటే ఉంటుంది. ‘యద్భావం తద్భవతి' సూక్తి భావం కూడా ఇదే. పాటిద్దామా.. చదవండి: ‘నీపై నాకున్నప్రేమ క్రిస్మస్ చెట్టులోని లైట్ల కన్నా మరింతగా వెలుగుతోంది'! -
అత్యంత విషపూరితమైన వంటకాలు.. ప్రాణాలను పణంగా పెట్టి మరీ తింటారట!!
These 5 Delicious But Deadly Foods That Could Kill You: భోజన ప్రియులకు ఇది చేదు వార్తే! ఎందుకంటే వీటిని తినాలంటే ఒకటికి పదిసార్లు ఆలోచించాలి మరి. ఆలోచించి తినడమేంటి..? ఇదే కదా మీ అనుమానం. అవును.. అత్యంత విషపూరితమైన వంటకాలు గురించే మనం చర్చిస్తుంది. వీటిని తినడమంటే ప్రాణాలతో చెలగాటం ఆడటమే! అయినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా వీటికి ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు. ప్రాణాలను పణంగా పెట్టి మరీ ఇష్టంగా తింటారట. ఈ విశేషాలు మీ కోసం.. ఫూగు పఫర్ ఫిష్‌తో తయారు చేసే ఫూగు వంటకం.. జపాన్‌లో ఫేమస్ స్ట్రీట్ ఫుడ్ ఇది. పఫర్ ఫిష్ అత్యంత విషపూరితమైనది. దీనితో వంటలు చేయడానికి జపాన్‌లో ప్రత్యేకంగా ట్రైనింగ్ కూడా ఇస్తారట. షెఫ్ (వంట చేసేవారు) ఏ మాత్రం ఏమరుపాటుగా వండినా దాన్ని తిన్నవారు ప్రాణాలు కోల్పోవటం ఖాయం! బ్లడ్ క్లామ్ (నత్త గుల్లలు) చైనాలో బ్లడ్ క్లామ్‌లను తరచుగా తింటారు. ఐతే వీటిని తగు జాగ్రత్తలతో తినకపోతే టైఫాయిడ్, హెపటైటిస్ బారీన పడే ప్రమాదం ఉంది. చదవండి: హెచ్చరిక!! ఈ శతాబ్దం చివరి నాటికి భూమిపై ఘోర మారణహోమం.. పచ్చి కిడ్నీ బీన్స్ రెడ్ కలర్లో ఉండే పచ్చి కిడ్నీ బీన్స్‌లో భిన్న రకాలైన విష కారకాలు ఉంటాయి. వీటిని వండకుండా పచ్చిగానే తింటే ఆసుపత్రిలో అడ్మిషన్ తీసుకోక తప్పదు. అంతేకాకుండా పచ్చి కిడ్నీ బీన్స్ కంటే కూడా సరిగ్గా ఉడికించకుండా వీటిని తింటేనే అధికంగా హాని కలుగుతుందట. ఫ్రై చేసిన మెదడుతో శాండ్విచ్ (ఫ్రైడ్ బ్రెయిన్ శాండ్విచ్) ఆవు వంటి పశువుల మెదడుతో తయారు చేసిన శాండ్విచ్ల వల్ల అనేక సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్న కారణంగా వీటి తయారీని నిషేధించారు కూడా. బర్డ్స్ నెస్ట్ సూప్ పక్షి గూడుతో తయారు చేసే ఈ సూప్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనదట. ఒక కప్పు బర్డ్స్ నెస్ట్ సూప్ సుమారు పది వేల డాలర్లు ఉంటుంది. పక్షుల లాలాజలంతో తయారు చేసే చైనీయుల పురాతన వంటకం ఇది. ఏది ఏమైనప్పటికీ దీనిని అధికంగా తీసుకుంటే ఆరోగ్యానికి తీవ్ర హాని కలుగుతుంది. చదవండి: Amudham Oil Benefits In Telugu: ఆముదంతో చర్మం, జుట్టు సమస్యలకు చెక్ పెట్టొచ్చిలా! -
ప్రేయసి గురక భరించలేక ప్రియుడు..
గురక చాలా మందికి సాధారణ సమస్య. ఇది బాధితుడిని పెద్ద ఇబ్బంది పెట్టకపోయినా పక్కనున్న వారిని బాగా ఇబ్బంది పెట్టే సమస్యే. అలాంటిది మీ భాగస్వామే గురకతో మిమ్మల్ని ఇబ్బంది పెడితే.. ఆ సమస్య రోజూ ఎదురైతే పరిస్థితి ఏంటి..?. ఇలాంటి పరిస్థితే ఎదురైనా ఓ వ్యక్తి ఆ సమస్యకు ఓ గమ్మత్తయిన పరిష్కారాన్ని కనుగొన్నాడు. వివరాల్లోకెళ్తే.. 22 ఏళ్ల జాన్ అబ్రహం తన ప్రియురాలు షార్ని బ్రైట్‌తో సహజీవనం చేస్తున్నాడు. ఆమెకు నిద్రలో గురకపెట్టే సమస్య ఉంది. దీంతో జాసన్ అనేక నిద్రలేని రాత్రులు గడిపాడు. అయితే ప్రియురాలు గురక పెట్టకుండా.. ఆ సమయంలో తనను నిద్ర నుంచి లేపకుండా గురక తగ్గించడానికి అనేక ప్రయోగాలు చేసేవాడు. ఈ క్రమంలోనే ఒక ప్రయోగం సూపర్ సక్సెస్ అయ్యింది. అదేంటంటే.. ప్రియురాలు గురక పెట్టే సమయంలో జాసన్ ఆమె ముఖాన్ని నాకేవాడు. దీంతో ఆమె గురకపెట్టడం ఆపేది. వారం రోజులపాటు ఇదే పద్ధతిని కొనసాగించాడు. దీంతో క్రమంగా ఆమె గురక తగ్గిపోవడంతో ఈ ప్రేమజంట ఇప్పుడు ప్రశాంతంగా నిద్రపోతున్నారు. తర్వాత ఒక సందర్భంలో తన ప్రియురాలికి తను పడుతున్న కష్టాల్ని తెలియజేయగా.. షార్ని బ్రైట్ షాకైంది. అయితే వెంటనే షార్ని బ్రైట్ తన ప్రియుడ్ని ఈ ప్రయోగం మళ్లీ చేస్తావా అని అంటే జాసన్ నో కామెంట్ అంటూ సమాధానమిస్తున్నాడు. (హైవేపై డ్రాగర్ చూపుతూ యువతి హల్చల్) -
ధోని అధ్యాయం ఎన్నటికీ చెరిగిపోనిది
జులపాల జట్టుతో టీమిండియాలోకి వచ్చి దనాధన్ ఇన్నింగ్స్‌లతో ఆకట్టుకున్నాడు... అనతికాలంలోనే టీమిండియాకు కెప్టెన్ అయి 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే వరల్డ్ కప్, 2013 చాంపియన్స్ ట్రోపీ సాధించిపెట్టాడు.. అంతర్జాతీయ క్రికెట్లో అత్యుత్తమ కెప్టెన్లలో ఒకడిగా నిలిచాడు.. ఒక కెప్టెన్‌గా ఎంతోమంది యువకులను వెలుగులోకి తీసుకొచ్చాడు.. ఇది చదివితే... ఈ పాటికే మీకు అర్థమయి ఉంటుంది ఎవరనేది.. ఎంఎస్ ధోని ఆటకు వీడ్కోలు పలికి ఈ రోజుతో నాలుగో రోజు.. ఇప్పటికే అతని గురించి ఎన్నో వార్తలు వచ్చాయి.. అతని ప్రాముఖ్యత గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. తాజాగా ఎ ట్రిబ్యూట్ టూ ఎంఎస్ ధోని.. పేరుతో ఐసీసీ యూట్యూబ్‌లో ఒక వీడియోనూ విడుదల చేసింది. 3 నిమిషాల నిడివి ఉన్న వీడియోలో ధోనికి దిగ్గజ ఆటగాళ్లైనా.. సచిన్, కపిల్‌తో పాటు వర్తమాన క్రికెటర్లు ధోనితో తమకున్న అనుభవాలను పంచుకున్నారు. బ్యాక్‌డ్రాఫ్‌లో ధోని ఆడిన కొన్ని మొమొరబుల్ షాట్స్‌ను వీడియోలో ఉంచారు.ప్రస్తుతం ఈ వీడియో ట్రెండింగ్ లిస్టులో ఉంది. ఇప్పటికే ఈ వీడియోను 29లక్షల మంది వీక్షించారు. (చదవండి : 'పాక్‌లో క్రికెట్ ఆడేందుకు ఇష్టపడతా') -
ఈ భామ వేళ్లు ఎంత పొడవో..
ఓ తైవాన్ మహిళ పోస్ట్ చేసిన ఫోటో చూసి నెటిజన్లు గందరగోళంలో పడిపోయారట. చైనా సోషల్ మీడియాలో అందరీ దృష్టిని ఆకర్షించిన ఆ ఫోటో ఏంటంటే. అందరికంటే భిన్నంగా వున్న ఆమె కాలి వేళ్లు. అయితే అవి కాలివో.. చేతివో అర్థం కాక కొంచెం తికమక పడ్డారట. సుకుమారంగా, పొడవుగా ఉన్నాయో.. అంతే అసహజగా వున్న ఆమె వేళ్లు చేతివా....కాలివా అన్నంత ఆశ్చర్యకరంగా, ఆసక్తికరంగా మారాయి. ఈ వేళల్లో ఎక్కువగా పొడవుగా ఉన్న వేలు (బొటన వేలు పక్కన ఉన్) సైజ్..అక్షరాలా 5సెం.మీ. దీంతో అంత పొడవుగా, వింతగా ఉన్న ఆ ఫోటోను చేసి నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అవి కాలివేళ్లో.. చేతివేళ్లో అర్థంకాకుండా భలే వింతగా ఉన్నాయంటూ అబ్బురపడ్డారు పేరు వెల్లడికాని ఈ విశ్వవిద్యాలయం విద్యార్థిని తనపొడవు నాలుగు అడుగుల 11 ఇంచులనీ, కానీ తన టోస్ (కాలివేళ్లు) లో పెద్దగా వున్నాయంటూ ఫోటోలను తన బ్లాగ్ లోపోస్ట్ పెట్టింది. పాదంలో కాలి వేలి పొడవు అయిదు సెంటీ మీటర్లని పేర్కొంది. దీంతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాననీ, తన గ్రీక్ ఫీట్ ( పాదంలో రెండవ వేలు పొడవుగా వుండడం) కారణంగా తనను తాను సౌందర్య సామ్రాజ్ఞిగా అభివర్ణించుకుంది. అయితే ఆమె బ్లాగ్ లో పోస్ట్ చేసినప్పటికంటే ఫేస్ బుక్ పేజీలో మరింత ఆసక్తికరంగా మారాయి. లైకులు..కామెంట్లు.. ట్యాగ్స్.. షేర్ల వెల్లువ తో బాగా హల్ చల్ చేస్తున్నాయి.