![Shocking Facts In Telugu Worlds Most Dangerous Food Items That Can Kill You - Sakshi](/styles/webp/s3/article_images/2021/11/20/Blood-clams.jpg.webp?itok=BBCZ61lR)
These 5 Delicious But Deadly Foods That Could Kill You: భోజన ప్రియులకు ఇది చేదు వార్తే! ఎందుకంటే వీటిని తినాలంటే ఒకటికి పదిసార్లు ఆలోచించాలి మరి. ఆలోచించి తినడమేంటి..? ఇదే కదా మీ అనుమానం. అవును.. అత్యంత విషపూరితమైన వంటకాలు గురించే మనం చర్చిస్తుంది. వీటిని తినడమంటే ప్రాణాలతో చెలగాటం ఆడటమే! అయినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా వీటికి ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు. ప్రాణాలను పణంగా పెట్టి మరీ ఇష్టంగా తింటారట. ఈ విశేషాలు మీ కోసం..
ఫూగు
పఫర్ ఫిష్‌తో తయారు చేసే ఫూగు వంటకం.. జపాన్‌లో ఫేమస్ స్ట్రీట్ ఫుడ్ ఇది. పఫర్ ఫిష్ అత్యంత విషపూరితమైనది. దీనితో వంటలు చేయడానికి జపాన్‌లో ప్రత్యేకంగా ట్రైనింగ్ కూడా ఇస్తారట. షెఫ్ (వంట చేసేవారు) ఏ మాత్రం ఏమరుపాటుగా వండినా దాన్ని తిన్నవారు ప్రాణాలు కోల్పోవటం ఖాయం!
బ్లడ్ క్లామ్ (నత్త గుల్లలు)
చైనాలో బ్లడ్ క్లామ్‌లను తరచుగా తింటారు. ఐతే వీటిని తగు జాగ్రత్తలతో తినకపోతే టైఫాయిడ్, హెపటైటిస్ బారీన పడే ప్రమాదం ఉంది.
చదవండి: హెచ్చరిక!! ఈ శతాబ్దం చివరి నాటికి భూమిపై ఘోర మారణహోమం..
పచ్చి కిడ్నీ బీన్స్
రెడ్ కలర్‌లో ఉండే పచ్చి కిడ్నీ బీన్స్‌లో భిన్న రకాలైన విష కారకాలు ఉంటాయి. వీటిని వండకుండా పచ్చిగానే తింటే ఆసుపత్రిలో అడ్మిషన్ తీసుకోక తప్పదు. అంతేకాకుండా పచ్చి కిడ్నీ బీన్స్ కంటే కూడా సరిగ్గా ఉడికించకుండా వీటిని తింటేనే అధికంగా హాని కలుగుతుందట.
ఫ్రై చేసిన మెదడుతో శాండ్‌విచ్ (ఫ్రైడ్ బ్రెయిన్ శాండ్‌విచ్)
ఆవు వంటి పశువుల మెదడుతో తయారు చేసిన శాండ్‌విచ్‌ల వల్ల అనేక సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్న కారణంగా వీటి తయారీని నిషేధించారు కూడా.
బర్డ్స్ నెస్ట్ సూప్
పక్షి గూడుతో తయారు చేసే ఈ సూప్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనదట. ఒక కప్పు బర్డ్స్ నెస్ట్ సూప్ సుమారు పది వేల డాలర్లు ఉంటుంది. పక్షుల లాలాజలంతో తయారు చేసే చైనీయుల పురాతన వంటకం ఇది. ఏది ఏమైనప్పటికీ దీనిని అధికంగా తీసుకుంటే ఆరోగ్యానికి తీవ్ర హాని కలుగుతుంది.
చదవండి: Amudham Oil Benefits In Telugu: ఆముదంతో చర్మం, జుట్టు సమస్యలకు చెక్ పెట్టొచ్చిలా!
Comments
Please login to add a commentAdd a comment